breaking news
tariff hikes
-
భారత్‌పై సుంకాలు అందుకే.. కరోలిన్ లీవిట్ సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్: భారత్‌పై సుంకాల విషయమై అమెరికా మరోసారి స్పందించింది. ఉక్రెయిన్, రష్యా యుద్దం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యూహంలో భాగంగానే భారత్‌పై సుంకాల విధించినట్టు వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ చెప్పుకొచ్చారు. రష్యాపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఇలా చేసినట్టు తెలిపారు.వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తాజాగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించాలని ట్రంప్ నిశ్చయించుకున్నారు. ఇందులో భాగంగానే ఆయా దేశాల నేతలతో ట్రంప్ చర్చల్లో ఉన్నారు. ఇదే సమయంలో ఉక్రెయిన్‌పై దాడులు నేపథ్యంలో రష్యాతో వాణిజ్యం కొనసాగించే దేశాలపై ట్రంప్ దృష్టి సారించారు. ఆ దేశాలను లక్ష్యంగా చేసుకొని ఒత్తిడి తీసుకురావాలని అనుకున్నారు. అది ట్రంప్ పరిపాలన వ్యూహం. ఇందులో భాగంగా భారత్‌పై 50 శాతం సుంకాలను విధించారని అన్నారు. ఇదే సమయంలో భారత్ ఎప్పుడు అమెరికాకు మిత్ర దేశమే అని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా భారత్- పాక్‌ల మధ్య యుద్ధాన్ని ట్రంప్ వాణిజ్యంతో ముగించారని పాత పాటే పాడారు.మరోవైపు.. ఉక్రెయిన్, రష్యా యుద్ధానికి సంబంధించి ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీల మధ్య సానుకూలంగా చర్చలు జరిగాయని తెలిపారు. నాటో సెక్రటరీ జనరల్‌తో సహా యూరోపియన్ నాయకులతో జరిగిన చర్చలే తొలి అడుగు అని పేర్కొన్నారు. త్వరలోనే రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి నెలకుంటుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు. Breaking:President Trump has put 'sanctions' on India to put 'this war (in Ukraine) to a close' & he 'wants to see this war end' says White House Spokesperson Karoline Leavitt pic.twitter.com/rLLq6aiznT— Sidhant Sibal (@sidhant) August 19, 2025 -
భారత్‌కు మరో షాకిచ్చిన అమెరికా.. ట్రంప్ ప్లాన్ అదేనా?
ఢిల్లీ: భారత్, అమెరికా మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. వాణిజ్య చర్చల కోసం భారత్‌కు రావాల్సిన అమెరికా బృందం ట్విస్ట్ ఇస్తూ.. తమ పర్యటనను రద్దు చేసుకుంది. ఈ మేరకు పలు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. దీంతో, వారి తదుపరి పర్యటనపై సస్పెన్స్ నెలకొంది.వివరాల ప్రకారం.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారనే కారణంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత్‌ను టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కారణంతో భారత్‌పై అమెరికా భారీగా సుంకాల భారాన్ని మోపింది. ట్రంప్ ఇటీవల భారత్‌పై 50శాతం సుంకాలు విధించారు. పాత 25శాతం సుంకాలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. అదనపు 25% టారిఫ్‌లు ఈ నెల 27ను అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో సుంకాలు అమలులోకి రాకముందే.. అమెరికాతో వాణిజ్య చర్చలు జరిపి మధ్యంతర ఒప్పందం చేసుకోవాలని ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.🚨 US trade team CALLS OFF Aug 25–29 Delhi visit for trade talks. pic.twitter.com/TOVBv10nwZ— Beats in Brief 🗞️ (@beatsinbrief) August 16, 2025ఈ క్రమంలో దీనికి సంబంధించి ఇప్పటికే ఇరు దేశాల ప్రతినిధుల మధ్య ఐదు దఫాలు చర్చలు జరిగాయి. ఆరో దఫా చర్చలకు అమెరికా ప్రతినిధులు ఈ నెల 25-29 మధ్య భారత్‌లో పర్యటించాల్సి ఉంది. ఈ దఫా చర్చల్లో భాగంగా.. వ్యవసాయం, పాడి పరిశ్రమ రంగాలకు సంబంధించిన చిక్కుముడులు వీడే అవకాశం ఉందని అందరూ భావించారు. అయితే, తాజాగా వారు ఆ పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది. మరోవైపు.. చర్చలకు సంబంధించిన తదుపరి తేదీలను కూడా వారు వెల్లడించలేదు. దీంతో, మరోసారి ఇరు దేశాల మధ్య చర్చలు ఉంటాయా? లేదా? అనే సందిగ్థత నెలకొంది. ఒకవేళ చర్చలు విఫలమైతే.. భారత్‌పై టారీఫ్‌ల భారం పడే అవకాశం ఉంది. కాగా, భారత్‌పై సుంకాలు విధించాలనే ఆలోచనతోనే ట్రంప్ ఇలా ప్లాన్ చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి.ఇదిలా ఉండగా, భారత్‌ను టార్గెట్ చేసి ట్రంప్ సుంకాలు విధిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ దేశ ప్రజలకు సూచనలు చేశారు. రైతుల ప్రయోజనాలపై ఎన్నటికీ రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఆయన మరోసారి అమెరికాలో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. ట్రంప్‌తో కూడా ఆయన భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల మధ్య చర్చలు సఫలం అవుతాయా? అని అందరూ ఆసక్తికంగా ఎదురుచూస్తున్నారు. -
టారిఫ్‌లు ఆర్నెల్లు మించి ఉండవు..
ముంబై: అమెరికా టారిఫ్‌లకు సంబంధించి సవాళ్లు వచ్చే ఒకటి రెండు త్రైమాసికాల్లో సమసిపోతాయని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) వి.అనంత నాగేశ్వరన్ అంచనా వేశారు. దేశం దీర్ఘకాలిక సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో ప్రైవేటు రంగం మరింత ప్రముఖ పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. 2023–24లో జీడీపీ వృద్ధి 9.2 శాతం నుంచి 2024–25లో 6.5 శాతానికి తగ్గిపోవడానికి కఠిన రుణ పరిస్థితులు, లిక్విడిటీ అంశాలను కారణాలుగా పేర్కొన్నారు. సరైన వ్యవసాయ విధానాలను అమలు చేస్తే నిజమైన జీడీపీ వృద్ధికి 25 శాతం అదనపు తోడ్పాటునిస్తాయన్నారు. రత్నాభరణాలు, రొయ్యలు, టెక్స్టైల్స్ రంగాలపై అమెరికా టారిఫ్‌ల ప్రభావం ఎక్కువగా ఉంటుందంటూ, వీటిని ఎదుర్కోవడం కష్టమన్నారు. ప్రభావిత రంగాలతో ప్రభుత్వం సంప్రదింపులు చేస్తున్నట్టు చెప్పారు. దీనిపై ప్రభుత్వం నుంచి చర్యలు ఉంటాయంటూ, కొంత ఓపిక పట్టాలని కోరారు. అమెరికా వాణిజ్య బృందం ఈ నెల చివర్లో భారత్‌కు చర్చలకు రానున్న నేపథ్యంలో.. అలాస్కాలో యూఎస్ అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య జరిగే సమావేశం ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంటుందన్నారు. టారిఫ్ సంబంధిత అంశాలపై దృష్టి పెడుతూ.. అదే సమయంలో ముఖ్యమైన సవాళ్లను విస్మరించరాదన్నారు. కృత్రిమ మేధ (ఏఐ) కారణంగా పడే ప్రభావం, కీలక ఖనిజాల కోసం ఒకే దేశంపై ఆధారపడడం వంటి సవాళ్లను ప్రస్తావించారు. రానున్న సంవత్సరాల్లో పెద్ద ఎత్తున వ్యూహాత్మక సవాళ్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితుల్లో, ప్రైవేటు రంగం సైతం దీర్ఘకాల దృష్టితోనే ఆలోచించాలని సూచించారు. విధానపరమైన మద్దతు పరిశోధనల కోసం ప్రభుత్వం నిధులు కేటాయించిందని, తమ వంతు పెట్టుబడులు పెంచాల్సిన బాధ్యత ప్రైవేటు రంగంపై ఉన్నట్టు సీఈఏ అనంత నాగేశ్వరన్ చెప్పారు. ప్రభుత్వం నుంచి విధానపరమైన మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. దేశీయంగా వినియోగం బలంగా ఉన్నట్టు చెప్పారు. చైనాతో 100 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటును ప్రస్తావిస్తూ.. దిగుమతులను మరిన్ని దేశాల మధ్య వైవిధ్యం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో ప్రైవేటు రంగం కీలక పాత్ర పోషించాలని కోరారు. -
టారిఫ్‌లు భారత్ వృద్ధిని ఆపలేవు
న్యూఢిల్లీ: అమెరికా టారిఫ్‌లు భారత వృద్ధిని అడ్డుకోలేవని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ అభిప్రాయపడింది. భారత్ ఎగుమతులపై ఆధారపడిన దేశం కాదని గుర్తు చేసింది. భారత సార్వభౌమ రేటింగ్ అంచనా సానుకూలంగానే కొనసాగుతుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ డైరెక్టర్ యీఫార్న్ ఫువా స్పష్టం చేశారు. భారత సార్వభౌమ రేటింగ్‌ను బీబీబీ మైనస్ నుంచి సానుకూలానికి అప్‌గ్రేడ్ చేస్తున్నట్టు ఎస్అండ్పీ గతేడాది మేలో ప్రకటించడం తెలిసిందే. బలమైన వృద్ధి అవకాశాలను ఇందుకు నేపథ్యంగా పేర్కొంది. అంతేకాదు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ 6.5 శాతం వృద్ధిని సాధిస్తుందని ఎస్అండ్పీ అంచనాగా ఉంది. భారత్‌పై ఈ నెల 6 నుంచి 25 శాతం టారిఫ్‌లను యూఎస్ అమలు చేస్తుండడం, ఆగస్ట్ 27 నుంచి మరో 25 శాతం మేర టారిఫ్‌లు అమలు కానున్న నేపథ్యంలో ఎస్అండ్పీ గ్లోబల్ తన విశ్లేషణను వెల్లడించింది. టారిఫ్‌ల విధింపు భారత సానుకూల ఔట్‌లుక్‌ను తగ్గించొచ్చా? అన్న సందేహంపై యీఫార్న్ స్పందించారు. అమెరికాతో వాణిజ్యం భారత జీడీపీలో 2 శాతంగానే ఉన్నట్టు గుర్తు చేశారు. ప్రధాన రంగాలైన ఫార్మాస్యూటికల్స్, కన్జ్యూమర్ ఎల్రక్టానిక్స్ ఎగుమతులకు టారిఫ్‌ల నుంచి మినహాయింపు ఉన్నట్టు చెప్పారు. దీర్ఘకాలంలో అధిక టారిఫ్‌లు భారత ఆర్థిక వ్యవస్థపై ఏమంత ప్రభావం చూపించబోవంటూ.. సానుకూల దృక్పథాన్ని కొనసాగిస్తున్నట్టు చెప్పారు. పెట్టుబడులపైనా ప్రభావం ఉండదు.. అమెరికా టారిఫ్‌లు భారత్‌లో పెట్టుబడులపై ప్రభావం చూపిస్తాయా? అన్న ప్రశ్నకు ఈఫార్న్ స్పందిస్తూ.. గత కొన్నేళ్లలో చైనా ప్లస్ వన్ విధానం ఫలితమిచ్చినట్టు చెప్పారు. భారత్‌లో వ్యాపారాన్ని ప్రారంభించిన కంపెనీలు దేశీ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకునే ఆ పనిచేస్తున్నట్టు చెప్పారు. ‘‘భారత్‌కు వచ్చే చాలా వరకు పెట్టుబడులు యూఎస్‌కు ఎగుమతుల కోసం ఉద్దేశించినవి కావు. దేశీయంగా భారీ డిమాండ్ ఉండడమే కారణం. మధ్యతరగతి వర్గం పెద్ద ఎత్తున విస్తరిస్తోంది.భారత్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టే కంపెనీలు, ఎగుమతులు చేయాలనుకునే వాటికి యూఎస్ మార్కెట్ ప్రధానంగా ఉండకపోవచ్చు’’ అని ఈఫార్న్ వివరించారు. 2021–25 మధ్య భారత్‌కు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉండడం గమానార్హం. దేశ మొత్తం ఎగుమతుల్లో 18 శాతం అమెరికాకే వెళ్లాయి. భారత్ దిగుమతుల్లో అమెరికా వాటా 6.22 శాతంగా ఉంది. 2024–25లో ద్వైపాక్షిక వాణిజ్యం 186 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రధానంగా భారత్ 35.32 బిలియన్ డాలర్ల వాణిజ్య మిగులు కలిగి ఉంది. -
ట్రంప్.. సంప్రదింపులా? అధికార ప్రయోగమా?
భారత్, బ్రెజిల్ దేశాలపై యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 50 శాతం సుంకాలు ఆచరణ సాధ్యం కాదని, రాజకీయంగా ప్రమాదకరమని ప్రముఖ ఆర్థికవేత్త రఘురామ్ రాజన్ అమెరికా వాణిజ్య విధానాన్ని తీవ్రంగా విమర్శించారు. బ్రెజిల్ ఫైనాన్షియల్ పబ్లికేషన్ వాలర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజన్ మాట్లాడారు. యూఎస్ అనుసరిస్తున్న ఈ చర్య దీర్ఘకాలిక దౌత్య, ఆర్థిక సంబంధాలను దెబ్బతీసేలా ఉందని చెప్పారు.అమెరికా వ్యతిరేకిగా ముద్రరష్యా నుంచి భారత్ చమురు దిగుమతులను కొనసాగిస్తున్నందుకు శిక్షగా పేర్కొంటూ ట్రంప్ ఇటీవల భారీ సుంకాలను ప్రకటించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరో బ్రిక్స్ సభ్యదేశమైన బ్రెజిల్‌పై ట్రంప్ ‘అమెరికా వ్యతిరేకి’గా ముద్ర వేసి ఇలాంటి సుంకాలు విధించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్, ప్రస్తుతం చికాగో విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న రఘురామ్ రాజన్ ఈ విధానాన్ని తీవ్రంగా విమర్శించారు.యూఎస్‌కు భారత్ భయపడితే..‘తలకు తుపాకీ గురిపెట్టి వాణిజ్య సంప్రదింపులు జరపడం కష్టం. ఇప్పుడు జరుగుతున్నది అదే. ఇవి వాణిజ్య సంప్రదింపులు కావు. అధికార ప్రయోగం. ఇండియా ఈ విషయంలో సుదీర్ఘ చర్చలు కోరుకుంది. అందుకు భిన్నంగా అకస్మాత్తుగా దాడి చేయడం సరికాదు. రష్యా నుంచి భారత్ చేసే చమురు కొనుగోళ్లపై ఒత్తిడి పెంచేందుకు అమెరికా ఇలా సుంకాలతో బయపెట్టాలనుకోవడం తగదు. ఈ తీరు రాజకీయ ప్రతిఘటనను సృష్టిస్తుంది. రష్యా నుంచి కొనుగోళ్లను నిలిపివేయాలని భారత్ నిర్ణయం తీసుకుంటే అమెరికా ఒత్తిడికి తలొగ్గినట్లు అవుతుంది. ఇది ప్రజాస్వామ్యంలో చెడు సంకేతాలకు దారితీస్తుంది’ అన్నారు.ఇదీ చదవండి: తగ్గి తగ్గనట్లు తగ్గిన బంగారం ధర!యూఎస్‌కు కూడా నష్టమే..‘అమెరికా అనుసరిస్తున్న దూకుడు సుంకాల వల్ల ఆర్థిక పతనం ఏకపక్షంగా ఉండదు. అమెరికాకు 80 బిలియన్ డాలర్ల వరకు భారత ఎగుమతులు లాభసాటిగా ఉండవు. ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానం కలిగిన యాపిల్ వంటి సంస్థల ఉత్పత్తులపై అమెరికా ప్రతీకార సుంకాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. 50 శాతం సుంకాలు భరించడం భారత్‌కు మాత్రమే కాదు, వ్యూహాత్మక భాగస్వామిగా ఉంటుందని భావిస్తున్న అమెరికాకు కూడా సాధ్యం కాదు. ఈ విషయాలను ప్రజలు చాలా కాలం గుర్తుంచుకుంటారు. యూఎస్ నేడు ఒక దేశంపై, రేపు మరో దేశంపై 50 శాతం సుంకాలు విధిస్తూపోతే అనిశ్చితి వాణిజ్యం, పెట్టుబడులకు విఘాతం కలుగుతుంది’ అని రాజన్ హెచ్చరించారు. -
టార్గెట్ 50
న్యూఢిల్లీ: భారత ఉత్పత్తులపై అమెరికా టారిఫ్‌లను గణనీయంగా పెంచేయడంతో ప్రత్యామ్నాయాలపై కేంద్ర సర్కారు దృష్టి పెట్టింది. ఇతర దేశాలకు ఎగుమతులను పెంచుకునే వ్యూహరచనకు తెరతీసింది. ముఖ్యంగా మధ్యప్రాచ్య దేశాలు, ఆఫ్రికా తదితర ప్రాంతంలో 50 దేశాలకు ఎగుమతులను ఇతోధికం చేసుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. భారత మొత్తం ఎగుమతుల్లో 90 శాతం ఈ 50 దేశాలకే వెళుతుండడం గమనార్హం. ఎగుమతులను వైవిధ్యం చేసుకోవడం, దిగుమతులకు ప్రత్యామ్నాయాలు, ఎగుమతుల పోటీతత్వం పెంచుకోవడంపై ప్రభుత్వం దృష్టి సారించినట్టు ఆ వర్గాలు తెలిపాయి. ఈ దిశగా లోతైన విశ్లేషణ కొనసాగుతోందని చెప్పాయి. వాణిజ్య శాఖ ఇప్పటికే 20 దేశాలపై ప్రత్యేక దృష్టి సారించగా, ఇప్పుడు మరో 30 దేశాలు ఈ జాబితాలోకి వచ్చి చేరినట్టు పేర్కొన్నాయి. కొత్త మార్కెట్లను అన్వేషించండి.. అధిక యూఎస్ టారిఫ్‌లను ధైర్యంగా ఎదుర్కోవాలని.. రొయ్యలు, ఇతర చేపల ఉత్పత్తుల ఎగుమతులకు ప్రత్యామ్నాయాలను అన్వేషించాలని ఎగుమతిదారులకు కేంద్రం సూచించింది. ఈయూ, జపాన్, దక్షిణ కొరియా, యూకే, రష్యా, ఆ్రస్టేలియా, పశి్చమాసియా, దక్షిణాసియా తదితర ఎన్నో ప్రాంతాలు అందుబాటులో ఉన్నట్టు కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పేర్కొన్నారు. ఇతర దేశాలను ఎగుమతులను పెంచుకునే ముందు విలువను పెంచుకోవడం, ప్యాకేజింగ్‌పై దృష్టి సారించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. ఇందుకు ఫిషరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్‌ను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. 55 శాతం ఎగుమతులపై ప్రభావం అమెరికాకు ఎగుమతి చేస్తున్న మొత్తం వస్తు ఎగుమతుల్లో 55 శాతం మేర 25 శాతం ప్రతీకార సుంకాలను ఎదుర్కోవాల్సి వస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభకు లిఖిత పూర్వకంగా వెల్లడించారు. రైతులు, వ్యాపారవేత్తలు, ఎగుమతిదారులు, ఎంఎస్ఎంఈల ప్రయోజనాల పరిరక్షణకు, ప్రోత్సాహానికి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ఉత్పత్తుల వైవిధ్యం, డిమాండ్, నాణ్యత, కాంట్రాక్టు ఒప్పందాలు భారత ఎగుమతులపై పడే ప్రభావాన్ని నిర్ణయిస్తాయని చెప్పారు. -
గణాంకాలపై మార్కెట్ల ఫోకస్
ప్రధానంగా ఆర్థిక గణాంకాలు, వాహన విక్రయాలు, యూఎస్ టారిఫ్‌లు ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లకు దిక్సూచి కానున్నాయి. అంతేకాకుండా ఇటీవల నిరవధికంగా అమ్మకాలకు పాల్పడుతున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) ధోరణి సైతం సెంటిమెంటుకు కీలకంగా నిలవనుంది. మరోపక్క ముగింపు దశకు చేరుకున్న క్యూ1 ఫలితాల సీజన్‌కూ ప్రాధాన్యత ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. వివరాలు చూద్దాం.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం(15న) సెలవుకావడంతో ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. అయితే ద్రవ్యోల్బణ గణాంకాలు, ఏప్రిల్–జూన్(క్యూ1) ఫలితాలు, యూఎస్‌తో వాణిజ్య సంబంధాలు, ఎఫ్‌పీఐల అమ్మకాలు ఈ వారం మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపే వీలున్నట్లు స్టాక్ విశ్లేషకులు చెబుతున్నారు. జూలై నెలకు వినియోగ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) గణాంకాలు మంగళవారం(12న) విడుదలకానున్నాయి. జూన్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం వరుసగా 8వ నెలలోనూ దిగివస్తూ 2.1 శాతానికి పరిమితమైంది. 2019 జనవరి తదుపరి ఇది కనిష్టంకాగా.. 2025 మే నెలలో 2.8 శాతంగా నమోదైంది. ఇక జూలై నెలకు టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణ(డబ్ల్యూపీఐ) వివరాలు గురువారం(14న) వెల్లడికానున్నాయి. జూన్‌లో డబ్ల్యూపీఐ అనూహ్యంగా 0.13 శాతం క్షీణించింది. దిగివచ్చింది. మే నెలలో 0.39 శాతం పెరుగుదల నమోదుకాగా.. 2023 అక్టోబర్ తర్వాత తొలిసారి వెనకడుగు వేసింది. క్యూ1 జాబితా ఈ వారం మరికొన్ని దిగ్గజాలు ప్రస్తుత ఏడాది(2025– 26) తొలి త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్నాయి. జాబితాలో పీఎస్‌యూ దిగ్గజాలు ఓఎన్జీసీ, భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్), ఇండియన్ ఆయిల్(ఐవోసీ)తోపాటు.. ఎస్‌జేవీఎన్, ఐఆర్సీటీసీ, ఆస్ట్రల్ పాలీ, హిందాల్కో, అపోలో హాస్పిటల్స్, పీఐ ఇండస్ట్రీస్, సంవర్ధన మదర్సన్, ముత్తూట్ ఫైనాన్స్, జూబిలెంట్ ఫుడ్, అశోక్ లేలాండ్, పతంజలి ఫుడ్స్ తదితరాలు చేరాయి. ఇవికాకుండా జూలైలో ప్రయాణికుల వాహన అమ్మకాల వివరాలను సియామ్ 15న విడుదల చేయనుంది. 2025 జూన్‌లో మొత్తం ప్రయాణికుల వాహన అమ్మకాలు 6 శాతం క్షీణించి 2,75,766 యూనిట్లకు పరిమితంకావడం గమనార్హం! విదేశీ అంశాలు భారత్ దిగుమతులపై టారిఫ్‌లను 50 శాతానికి పెంచుతున్నట్లు యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించడంతో ఎగుమతి సంబంధ రంగాలపై ప్రతికూల ప్రభావం కనిపించనున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఫార్మాపైనా వడ్డింపులు తప్పవన్న ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ఔషధ రంగంతోపాటు.. లెదర్, కెమికల్స్, ఫుట్‌వేర్, ఆక్వా, ఐటీ, టెక్స్టైల్స్ ప్రభావితంకానున్నట్లు పేర్కొన్నారు. కాగా.. జూలై నెలకు చైనా, యూఎస్ ద్రవ్యోల్బణం తదితర గణాంకాలు ఈ వారం విడుదలకానున్నాయి. ఈ అంశాలన్నీ మార్కెట్లో సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా, స్వస్తికా ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలియజేశారు. టారిఫ్‌లపై స్పష్టత వచ్చేవరకూ మార్కెట్లు కన్సాలిడేట్ కావచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా అభిప్రాయపడ్డారు. గత వారమిలా.. గతవారం(4–8) దేశీ స్టాక్ మార్కెట్లు వరుసగా ఆరో వారంలోనూ నష్టాలతోనే ముగిశాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 742 పాయింట్లు(0.9 శాతం) క్షీణించి 79,858 వద్ద నిలిచింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 202 పాయింట్లు(0.8 శాతం) నీరసించి 24,363 వద్ద ముగిసింది. ఈ బాటలో బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1.3 శాతం, స్మాల్ క్యాప్ 1.9 శాతం చొప్పున బలహీనపడ్డాయి.ఎఫ్‌పీఐల భారీ అమ్మకాలుకొద్ది రోజులుగా పెట్టుబడులు వెనక్కి ఇటీవల కొద్ది రోజులుగా దేశీ స్టాక్స్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) నిరవధిక అమ్మకాలు చేపడుతున్నారు. ఈ నెలలో ఇప్పటివరకూ దాదాపు రూ. 18,000 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. ఇక గత నెల(జూలై)లోనూ నికరంగా అమ్మకాలకే కట్టుబడ్డారు. దీంతో జూలైలో రూ. 17,741 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అంతకుముందు మూడు నెలల్లో(ఏప్రిల్ నుంచి జూన్) నికర కొనుగోలుదారులుగా నిలిచారు. వెరసి రూ. 38,673 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. కాగా.. ఈ కేలండర్ ఏడాది(2025)లో ఇప్పటివరకూ నికరంగా చూస్తే ఎఫ్‌పీఐలు రూ. 1.13 లక్షల కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం గమనార్హం! యూఎస్ టారిఫ్ ప్రకటనలు, క్యూ1 ఫలితాల నిరుత్సాహం తదితర అంశాల కారణంగా ఎఫ్‌పీఐలు ఇటీవల తిరిగి అమ్మకాల బాటలో సాగుతున్నట్లు ఏంజెల్ వన్ సీనియర్ ఫండమెంటల్ విశ్లేషకులు వకార్జావేద్ ఖాన్, మారి్నంగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా రీసెర్చ్ మేనేజర్ హిమాన్షు శ్రీవాస్తవ అభిప్రాయపడ్డారు. సాంకేతికంగా.. ఎఫ్‌పీఐల అమ్మకాలు, యూఎస్ టారిఫ్‌ల వడ్డింపు నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు క్షీణపథంలో కదులుతున్నాయి. ఇదే బాటలో ఈవారం సైతం మరింత నీరసించే వీలున్నట్లు సాంకేతిక నిపుణులు పేర్కొంటున్నారు. సాంకేతికంగా చూస్తే ఎన్ఎస్ఈ నిఫ్టీ వెనకడుగు వేస్తే తొలుత 24,200 పాయింట్ల వద్ద, తదుపరి 24,000 వద్ద మద్దతు లభించవచ్చని అంచనా వేశారు. ఒకవేళ బలపడితే 24,500 పాయింట్లవద్ద, 24,600 వద్ద రెసిస్టెన్స్ కనిపించవచ్చని అభిప్రాయపడ్డారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
‘భారత్ అభివృద్ధిని చూసి ట్రంప్ అసూయతో రగిలిపోతున్నారు’
సాక్షి,న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సెటైర్లు వేశారు. భారత్ ఎదుగుదలను చూసి ట్రంప్ అసూయతో రగిలిపోతున్నారని పరోక్షంగా వ్యాఖ్యానించారు. అందుకే టారిఫ్‌ల పేరుతో బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.భారత్ ‘సూపర్ పవర్’కానుంది. అన్ని రంగాల్లో విశ్వవిజేతగా నిలుస్తోంది. అలాంటి భారత్ ఎదుగుదలను ఎవరూ ఆపలేరు. భారత్ అభివృద్ధిపై జరుగుతున్న చర్చను చూసి కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. భారత్ ఎదుగుదల వాళ్లకు ఇష్టం లేదు.అందుకే ప్రపంచ దేశాల్లో మేడిన్ ఇండియా ఉత్పత్తుల కొనుగోళ్లు జరగకుండా కుట్ర చేస్తున్నారు. మేడిన్ ఇండియా ఉత్పత్తులు చాలా ఖరీదైనవనే ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారం వల్ల కొనుగోళ్లు ఆపొచ్చని అనుకుంటున్నారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. నేను మీకు మాటిస్తున్నా.. ప్రపంచంలోని ఏ శక్తి భారత్ సూపర్ పవర్ అవ్వకుండా ఆపలేదని స్పష్టం చేశారు.ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధానికి రష్యాకు భారత్ పరోక్షంగా సహకరిస్తోందని ట్రంప్ వరుస ఆరోపణలు గుప్పిస్తున్నారు. భారత్.. రష్యా నుంచి చమురు కొనుగోళ్ల విషయంలో భారత్ వెనక్కి తగ్గాలని హెచ్చరించారు. కాదంటే సుంకాల పెంపు ఉంటుందన్న ట్రంప్ పనిలోపనిగా.. భారత దిగుమతులపై 25 శాతం టారిఫ్ విధించారు. అదనంగా పెనాల్టీ విధించారు. అంతేకాదు,రష్యాతో తన ఒప్పందాలను భారత్ నిలిపివేయాలని బెదిరించారు. ఇరు దేశాల మధ్య వ్యాపార,వాణిజ్య ఒప్పందాలు ఇలాగే కొనసాగితే మరింత సుంకాల పెంపు ఉంటుందని అన్నారు. ఫలితంగా భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుందని అన్నారు. ఈ క్రమంలో ట్రంప్ చర్యలను ఉద్దేశిస్తూ రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. ట్రంప్ చర్యలకు ధీటుగా బదులిచ్చారు. -
చిన్న సంస్థలకు.. పెద్ద కష్టం!!
న్యూఢిల్లీ: భారత ఎగుమతులపై 50 శాతం టారిఫ్‌లు విధించాలన్న అమెరికా నిర్ణయం.. చిన్న, మధ్య తరహా సంస్థలను (ఎంఎస్ఎంఈ) కలవరపరుస్తోంది. దీని ప్రభావం తమపై చాలా తీవ్రంగా ఉంటుందని అవి ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అవి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. టారిఫ్‌ల పెంపు .. వార్షికంగా దాదాపు 30 బిలియన్ డాలర్ల మేర వ్యాపార నష్టానికి దారి తీస్తుందని స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ ఫోరం (ఎస్ఎంఈ ఫోరం) ప్రెసిడెంట్ వినోద్ కుమార్ వెల్లడించారు. దీనివల్ల అత్యధికంగా నష్టపోయేది చిన్న సంస్థలేనని ఆయన చెప్పారు. వాటి ఆర్థిక స్థోమత, సామర్థ్యాలు పరిమిత స్థాయిలోనే ఉండటమే ఇందుకు కారణమని వివరించారు. టారిఫ్ షాక్ అనేది ఎంఎస్ఎంఈ ట్రేడర్లను చాలా కఠినతరమైన పరిస్థితుల్లోకి నెట్టివేసిందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ సెక్రటరీ జనరల్ అనిల్ భరద్వాజ్ చెప్పారు. ‘గతంలో విధించిన 25 శాతానికి మరో 25 శాతం టారిఫ్‌లు తోడు కావడం వల్ల భారతీయ ఎగుమతిదారులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇతర దేశాల పోటీ సంస్థలతో పోలిస్తే మన ఎగుమతిదారుల వ్యయాలు 30–35 శాతం పెరిగిపోతాయి‘ అని తెలిపారు. దీని వల్ల, ఆగస్టు 27లోగా (అదనపు టారిఫ్‌లు అమల్లోకి వచ్చే తేదీ) తగిన పరిష్కారం కనుగొనకపోతే, అమెరికాకు ఎగుమతులు 40–50 శాతం పడిపోయే అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ఎగుమతుల్లో ఎంఎస్ఎంఈల వాటా దాదాపు 45 శాతంగా ఉంటుంది. పరిశ్రమకు మేల్కొలుపు.. టారిఫ్‌ల పెంపు అనేది ఇటు విధాన నిర్ణేతలు, అటు ఎగుమతిదారులకు ఓ మేల్కొలుపులాంటిదని కుమార్ చెప్పారు. దీన్ని ఒక అవాంతరంగా చూడకుండా అవకాశంగా మల్చుకోవడంపై దృష్టి పెట్టాలని ఆయన పేర్కొన్నారు. అంతగా ఎగుమతులు లేని, అధిక వృద్ధికి అవకాశాలున్న ప్రాంతాలకు కొత్తగా లింకేజీలను ఏర్పర్చుకోవడం, అంతర్జాతీయంగా కార్యకలాపాలను మరింతగా విస్తరించడం ద్వారా భారతీయ ఎంఎస్ఎంఈలు వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవడంపై ఫోకస్ చేయొచ్చని సూచించారు. ఆఫ్రికా, లాటిన్ అమెరికా, సెంట్రల్ ఏషియా, తూర్పు యూరప్, పసిఫిక్ ద్వీప దేశాలు, కరీబియన్ దీవులు మొదలైన మార్కెట్ల వైపు చూడొచ్చని చెప్పారు. ఈ మార్కెట్లకు 60 బిలియన్ డాలర్ల పైగా ఎగుమతులు చేసేందుకు అవకాశాలు ఉంటాయని కుమార్ చెప్పారు. భారతీయ ఎంఎస్ఎంఈలు ఇప్పటికే పటిష్టంగా ఉన్న రంగాల్లో నమ్మకమైన సరఫరాదారుల కోసం ఈ ప్రాంతాల్లోని సంస్థలు అన్వేíÙస్తున్నాయని తెలిపారు. ఫార్మా, వ్యవసాయ–వ్యవసాయేతర మెషినరీ, ప్రాసెస్డ్ ఫుడ్స్, దుస్తులు మొదలైన రంగాలు వీటిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభావిత ఎంఎస్ఎంఈలను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణమే ద్రవ్యపరమైన, ద్రవ్యయేతరమైన చర్యలు ప్రకటించాలని కుమార్ విజ్ఞప్తి చేశారు. అలాగే పరిశ్రమ ఇతరత్రా మార్కెట్ల వైపు కూడా మళ్లేందుకు ప్రోత్సహించడంపై దృష్టి పెట్టాలని కోరారు. ఈ దిశలో బ్రిటన్, ఆ్రస్టేలియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్లతో వాణిజ్య ఒప్పందాల పరిధిని మరింతగా విస్తరించేందుకు అవకాశాలు ఉన్నాయన్నారు. మనకు అనువైన మార్కెట్లను గుర్తించి, ఎగుమతి చేసే క్రమంలో కఠినతరమైన నాణ్యత, ప్యాకేజింగ్, నిబంధనల ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది కాబట్టి ఈ విషయాల్లో తగు గైడెన్స్ అవసరమవుతుందని కుమార్ పేర్కొన్నారు. ఇన్ని సవాళ్లను ఎదుర్కొంటున్న ఎంఎస్ఎంఈలను పటిష్టం చేసేందుకు ఇండియా ఎస్ఎంఈ ఫోరం, ప్రభుత్వంతో కలిసి పని చేస్తోంది. డిజిటల్ ట్రేడ్ ప్లాట్‌ఫాంలను అందుబాటులోకి తేవడం, సకాలంలో..తక్కువ వడ్డీపై ఎగుమతులకు ఫైనాన్సింగ్ అందించడం, రియల్ టైమ్‌లో మార్కెట్ వివరాలను అందించడం వంటి అంశాలపై కసరత్తు చేస్తోంది. -
ఈయూతో ఒప్పందంపై దూకుడు పెంచాలి
న్యూఢిల్లీ: అమెరికా టారిఫ్‌ల మోత నేపథ్యంలో యూరోపియన్ యూనియన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్‌టీఏ) కుదుర్చుకోవడంపై భారత్ దూకుడు పెంచాలని 16 ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అరవింద్ పనగారియా చెప్పారు. అదే సమయంలో అధిక వృద్ధి సాధించే దిశగా భూ, కార్మిక మార్కెట్ సంస్కరణలను వేగవంతం చేయడంతో పాటు నియంత్రణల భారాన్ని తగ్గించడంపై మరింతగా దృష్టి పెట్టాలని సూచించారు. ‘ఒక మార్కెట్ దాదాపు మూసుకుంటున్నప్పుడు మరో మార్కెట్ వైపు మళ్లాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈయూతో ఒప్పందం కుదుర్చుకోవడం చాలా, చాలా ముఖ్యం. అదే సమయంలో భూ, కారి్మక మార్కెట్‌కి సంబంధించి సంస్కరణలపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది‘ అని ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పనగారియా చెప్పారు. ‘మనపై టారిఫ్‌లు అమెరికా మార్కెట్లో ఎక్కువగా ఉండి యూరోపియన్ యూనియన్‌లో తక్కువగా ఉంటే.. మన ఎగుమతులను అమెరికా నుంచి ఈయూకి మళ్లించాలి. మార్కెట్లలో లాభాపేక్ష చాలా బలంగా ఉంటుంది. ఎంట్రప్రెన్యూర్లు చాలా స్మార్ట్‌గా వ్యవహరిస్తారు. చాలా వేగంగా సరఫరా వ్యవస్థల్లో మార్పులకు అనుగుణంగా సర్దుకుంటారు‘ అని చెప్పారు. ‘ప్రస్తుత పరిస్థితి ఒక రకంగా 1991 నాటి పరిస్థితులను తలపిస్తోంది. అమెరికా భారీ టారిఫ్‌ల వల్ల సంక్షోభ పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సమయంలో అప్పట్లో మనం ఏం చేశామనేది ఒకసారి గుర్తు చేసుకుని, ఏం చేయగలమనేది ఆలోచించాలి. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. సంస్కరణల అజెండాలో చాలా చేశాం. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి‘ అని సంపన్న దేశంగా ఎదగాలంటే భారత్ తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ స్థాయిలో మరిన్ని వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవాలని, ఎగుమతుల కోసం ఆసియా మార్కెట్లపై ఫోకస్ చేయాలని, అలాగే చైనాపై మన వైఖరిని కూడా పునఃసమీక్షించుకోవాలని పనగారియా సూచించారు.డెడ్ ఎకానమీ .. అత్యధిక వృద్ధి.. భారత ఆర్థిక వ్యవస్థ డెడ్ ఎకానమీ (నిరీ్వర్యంగా) అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై పనగారియా స్పందించారు. ’భారత ఎకానమీ నిజంగా నిరీ్వర్యమైపోతే.. 7 శాతం స్థాయిలో అత్యధిక వృద్ధి సాధించదు. డాలర్ల మారకంలో చూస్తే మన వృద్ధి బహుశా ఇంకా ఎక్కువే ఉంటుంది. డెడ్ ఎకానమీకి ఆయన నిర్వచనం ఏమిటో నాకు తెలియదు. బహుశా (ఆయన ఉద్దేశం ప్రకారం) మృత దేహాల్లోనూ కదలిక ఉంటుందేమో’ అని వ్యాఖ్యానించారు. -
ప్రపంచాన్ని వణికించిన '1929 మహా మాంద్యం': ప్రధాన కారణాలు ఇవే..
కోర్టు సుంకాలకు వ్యతిరేకంగా తీర్పు ఇస్తే '1929 నాటి మహా మాంద్యం' వస్తుందని అమెరికా అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' శుక్రవారం హెచ్చరించారు. ఇంతకీ ఈ మహా మాంద్యం ఏమిటి?, దీనికి ప్రధాన కారణాలు ఏంటి? ఇది ప్రజలపై ఎలాంటి ప్రభావాన్ని చూపించిందనే.. విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం.1929 నాటి మహా మాంద్యం1929 నాటి మహా మాంద్యం.. 20వ శతాబ్దంలోని అత్యంత తీవ్రమైన ఆర్థిక మాంద్యంగా చరిత్రలో నిలిచింది. ఇది 1929లో ప్రారంభమై సుమారు 1939 వరకు ప్రభావం చూపింది. ఈ మాంద్యం మొదట అమెరికాలో 1929 అక్టోబర్ 24 నాటి స్టాక్ మార్కెట్ పతనంతో ప్రారంభమైంది. ఇది కేవలం అమెరికాలో మాత్రమే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం చూపింది.1929 ఆర్థిక సంక్షోభానికి ప్రధాన కారణాలుస్టాక్ మార్కెట్ పతనంస్టాక్ ధరలు పెరుగుతుండటం, వాటిపై ఎక్కువ నమ్మకం పెట్టుకున్న ప్రజలు స్టాక్లను కొనుగోలు చేశారు. చాలామంది అప్పు తెచ్చుకున్న డబ్బుతో కూడా స్టాక్ కొనేశారు. ఇలా పెద్దఎత్తున స్టాక్‌లు అమ్ముడవడం వల్ల మార్కెట్ విలువ ఒక్కసారిగా కుప్పకూలింది.బ్యాంకులు మూతపడటంప్రజలు తమ డబ్బును బ్యాంకుల నుంచి తీసుకోవడం మొదలుపెట్టారు. ఇది బ్యాంకులు మూతపడటానికి కారణమైంది. వేలాది బ్యాంకులు క్లోజ్ అవ్వడంతో.. ప్రజల నమ్మకాన్ని కోల్పోయాయి. ప్రభుత్వ జోక్యం కూడా తగ్గిపోయింది. బ్యాంకింగ్ వ్యవస్థ బలహీనపడటం ఆర్థిక సంక్షోభానికి ప్రధాన కారణమైంది.అధిక ఉత్పత్తి, తక్కువ డిమాండ్రైతులు మార్కెట్ అవసరాల కంటే ఎక్కువ ఉత్పత్తి చేశారు. పారిశ్రామిక రంగం కూడా ఇదే బాటలో అడుగులు వేసింది. అయితే ఉత్పత్తికి తగిన డిమాండ్ లేకుండా పోయింది. ఇది ధరలు తగ్గడానికి మాత్రమే కాకుండా.. అప్పులు పెరగడానికి కూడా కారణమైంది. ఇది ఆర్ధిక వ్యవస్థను మరింత దిగజారేలా చేసింది.ప్రపంచ వాణిజ్య పతనంస్మూట్ హాలీ టారిఫ్ చట్టం (1930) వల్ల అమెరికా దిగుమతులపై అధిక పన్నులు విధించడం జరిగింది. ఇది ఇతర దేశాల నుంచి ప్రతీకార సుంకాలను సైతం పెంచింది. దీంతో అంతర్జాతీయ వాణిజ్యం క్షిణించింది. ప్రపంచ మాంద్యం తీవ్రతరం అయింది.ప్రజలపై ప్రభావం1929 నాటి మహా మాంద్యం కారణంగా అమెరికాలో నిరుద్యోగం రేటు 25% దాటింది. లక్షలాది ప్రజలు ఉద్యోగాలు కోల్పోయారు. కార్మికులు, రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఎంతోమంది ఇళ్లను కూడా వదిలి బయటకు వలసలు వెళ్లి, నిరాశ్రయులయ్యారు. -
అమెరికాతో రక్షణ ఒప్పందాలు యథాతథం
న్యూఢిల్లీ: భారత్ వస్తువులపై టారిఫ్‌లను 50 శాతానికి పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేసిన వేళ రక్షణ ఒప్పందాలను నిలిపి వేసినట్లు వస్తున్న వార్తలను కేంద్రం కొట్టివేసింది. రక్షణ ఒప్పందాలను రద్దు చేసుకునే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. రక్షణ సామాగ్రి కొనుగోలు ఒప్పందాలు యథాతథంగా అమలవుతాయని పేర్కొంది. అమెరికా నుంచి అందాల్సినవి ఒప్పందం ప్రకారం అందుతూనే ఉంటాయని, తదుపరి ఆర్డర్లపై చర్చలు కూడా కొనసాగుతాయని వివరించింది. అమెరికా నుంచి రక్షణ కొనుగోళ్లను భారత ప్రభుత్వం ఆపేసిందంటూ వస్తున్న వార్తలు అసత్యాలు, అభూత కల్పనలు అని రక్షణ శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు. టారిఫ్‌ల పెంపు నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ అమెరికా వెళ్లి, కొత్తగా ఒప్పందాలు కుదుర్చుకుంటారంటూ వస్తున్న వార్తలను కూడా ఆయన తోసిపుచ్చారు. అయితే, ఆ పర్యటనను ప్రభుత్వం రద్దు చేసిందని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. టారిఫ్‌ల పెంపు వేళ..రెండు వ్యూహాత్మక భాగస్వామ్య దేశాల మధ్య విశ్వాసం సడలిన మాట వాస్తవమేనని, అయితే దీని ప్రభావం రక్షణ సంబంధాలపై ప్రత్యక్షంగా పడబోదని ఐజీ డ్రోన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రిటైర్డ్ మేజర్ జనరల్ పధి విశ్లేషించారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య 20 వరకు రక్షణ ఒప్పందాలున్నాయన్నారు. అమెరికాకు చెందిన అపాచీ, చినూక్, పీ–81 విమానాలు, ఎంక్యూ–9 డ్రోన్లను భారత్ ఎక్కువగా కొనుగోలు చేస్తోందని, వీటిపై ట్రంప్ టారిఫ్‌ల ప్రభావం పడదని ఆయన పేర్కొన్నారు. -
జీడీపీపై టారిఫ్ ఎఫెక్ట్!!
న్యూఢిల్లీ: అమెరికా ఆగస్టు 27 నుంచి 50 శాతం టారిఫ్‌లను అమలు చేస్తే భారత జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి)పై ప్రభావం పడనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 30 బేసిస్ పాయింట్లు నెమ్మదించి 6 శాతానికి పరిమితం కావొచ్చని మూడీస్ రేటింగ్స్ అంచనా వేసింది. అయితే, దేశీయంగా డిమాండ్ మెరుగ్గా ఉండటం, సరీ్వసుల రంగం పటిష్టంగా ఉండటం వంటి అంశాలు భారత్‌పై ఒత్తిడిని తగ్గిస్తాయని పేర్కొంది. భారీ అమెరికా టారిఫ్‌లపై భారత్ స్పందించే తీరే అంతిమంగా వృద్ధి రేటు, ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతుందని వివరించింది. ‘భారత్ ఎగుమతులకు అమెరికా అతి పెద్ద గమ్యస్థానంగా ఉంటోంది. అలాంటప్పుడు అమెరికా 50 శాతం టారిఫ్‌లు విధిస్తామని హెచ్చరిస్తున్నా, రష్యా నుంచి చమురును కొనుగోలు చేయడాన్ని కొనసాగిస్తే 2025–26లో భారత జీడీపీ వృద్ధి రేటు ముందుగా అంచనా వేసిన 6.3 శాతంతో పోలిస్తే 30 బేసిస్ పాయింట్లు (0.3 శాతం) మేర నెమ్మదించవచ్చు‘ అని మూడీస్ పేర్కొంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు గాను భారత్‌పై అమెరికా టారిఫ్‌లను రెట్టింపు చేసి 50 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. ఈ కొత్త టారిఫ్‌లు ఆగస్టు 27 నుంచి అమల్లోకి వస్తాయి. ప్రస్తుతం 191 బిలియన్ డాలర్లుగా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 500 బిలియన్ డాలర్లకు పెంచుకునే లక్ష్యంతో ఇరు దేశాలు మార్చి నుంచి ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుపుతున్నాయి. ఆసియా–పసిఫిక్ దేశాలతో పోటీ.. అమెరికా విధానాల్లో మార్పుల వల్ల సరఫరా సిస్టంలు పునర్వ్యవస్థీకరణకు లోనవుతున్న నేపథ్యంలో వాణిజ్యం, పెట్టుబడుల్లో మరింత వాటా కోసం ఆసియా–పసిఫిక్ ప్రాంతంలోని పలు దేశాలు పోటీపడుతున్నాయని తెలిపింది.2025 తర్వాత మిగతా ఆసియా–పసిఫిక్ దేశాలతో పోలిస్తే టారిఫ్‌ల అంతరాలు భారీగా పెరిగిపోవడం వల్ల తయారీ రంగ హబ్‌గా ఎదగాలన్న భారత ఆకాంక్షలకు గండి పడొచ్చని మూడీస్ పేర్కొంది. అంతేగాకుండా ఇటీవలి కాలంలో పెట్టుబడుల రూపంలో ఒనగూరిన కొన్ని ప్రయోజనాలు కూడా వెనక్కి తరలిపోవచ్చని తెలిపింది. అయితే, అంతర్జాతీయ ఒడుదుడుకులను ఎదుర్కొనడానికి భారత్ వద్ద ప్రస్తుతం తగినంత విదేశీ మారక నిల్వలు ఉన్నాయని వివరించింది. -
‘ఎట్టిపరిస్థితుల్లోనూ తలొంచద్దు’.. ట్రంప్ సుంకాలపై భారత్‌కు చైనా మద్దతు
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కక్షగట్టిన రీతిలో భారతదేశంపై అత్యధికంగా 50 శాతం సుంకం విధించారు. అలాగే ఇతర దేశాలకూ సుంకాలు ప్రకటించారు. అయితే భారత్‌పై అత్యధిక సుంకాలు విధించడంపై చైనా మండిపడుతూ, భారత్‌కు మద్దతు ప్రకటించింది. ఎట్టిపరిస్థితుల్లోనూ ట్రంప్‌కు తలవంచవద్దంటూ భారత్‌కు చైనా సలహా ఇచ్చింది.భారతదేశంలోని చైనా రాయబారి జు ఫీహాంగ్ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిర్ణయాన్ని దుయ్యబట్టారు. ట్రంప్‌ను ‘బెదిరింపులకు గురి చేస్తున్న దొంగ’గా అభివర్ణించారు. ఆయన తన ‘ఎక్స్’ పోస్టులో ‘ఒక దొంగకు ఒక అంగుళం అవకాశం ఇస్తే.. అతను ఒక మైలు దూరం వరకూ వెళ్తాడు’ అని కామెంట్ చేశారు. చైనా రాయబారి తన పోస్టులో..‘ఇతర దేశాలను అణచివేయడానికి సుంకాన్ని ఆయుధంగా ఉపయోగించడం ఐక్యరాజ్యసమితి చార్టర్‌ను ఉల్లంఘించడమే అవుతుంది. ఇది ప్రపంచ వాణిజ్య సంస్థ నియమాలను బలహీనపరుస్తుంది. ఇది ప్రజాదరణ లేనిది, అస్థిరమైనది’ అని పేర్కొన్నారు. కాగా ట్రంప్ బృందంతో వ్యాపార ఒప్పందంపై సంతకం చేసిన మొదటి దేశాలలో ఒకటిగా ఉండాలని భారతదేశం ఆశించింది. అయితే రష్యన్ చమురు కొనుగోళ్ల కారణంగా అమెరికా-భారత్ వాణిజ్య చర్చలు ఐదు రౌండ్ల తర్వాత కూడా ముందుకు కదలలేదు. Give the bully an inch, he will take a mile. pic.twitter.com/IMdIM9u1nd— Xu Feihong (@China_Amb_India) August 7, 2025వైట్ హౌస్‌లో చైనాపై సుంకాలు విధించే ప్రణాళిక గురించి మీడియా ట్రంప్‌ను అడిగినప్పుడు ఆయన తాను ఇప్పుడే ఏమీ చెప్పలేదనని, భారతదేశానికి ఏదైతే చేశామో.. బహుశా మరికొన్ని దేశాలతో కూడా అలాగే చేస్తామని, వాటిలో చైనా ఒకటి కావచని’ ట్రంప్ వ్యాఖ్యానించారు. మరోవైపు శుక్రవారం నాటికి రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగియకపోతే, తాను ద్వితీయ సుంకాలను విధిస్తానని కూడా ట్రంప్ పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో చైనా- అమెరికాల మధ్య సుంకాల యుద్ధం ప్రారంభమైంది. అమెరికా తన సుంకాలను 145 శాతానికి పెంచగా, చైనా తన సుంకాలను 125 శాతానికి పరిమితం చేసింది. చైనాతో వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరిపేందుకు ఈ ఏడాది చివర్లో చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌ను కలవబోతున్నట్లు ట్రంప్ ప్రకటించారు. -
‘టారిఫ్’ రంగాలకు చేయూత!
న్యూఢిల్లీ: అమెరికా టారిఫ్‌ల ప్రభావం తీవ్రంగా ఉండే పరిశ్రమలకు ఊరటనివ్వడంపై కేంద్రం దృష్టి పెడుతోంది. ఎగుమతుల ప్రోత్సాహక మిషన్ కింద రసాయనాలు, టెక్స్‌టైల్స్‌లాంటి రంగాలకు చేయూతనిచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఈ రెండు రంగాల ఎగుమతిదార్లతో భేటీ అయిన సందర్భంగా టారిఫ్‌ల ప్రభావాలు, సహాయక చర్యలకు అవకాశాలు తదితర అంశాల గురించి వాణిజ్య శాఖ చర్చించినట్లు వివరించాయి.కేంద్ర బడ్జెట్లో రూ. 2,250 కోట్లతో ప్రతిపాదించిన ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ కింద టారిఫ్ ప్రభావిత రంగాలకు తోడ్పాటు అందించే విషయాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నాయి. ఈ మిషన్ కింద చిన్న–మధ్య తరహా సంస్థలు, ఈ–కామర్స్ ఎగుమతిదార్లకు సులభ రుణ పథకాలు, విదేశాల్లో వేర్‌హౌసింగ్ సదుపాయాల కల్పన, ఎగుమతి అవకాశాలను దక్కించుకునేందుకు గ్లోబల్ బ్రాండింగ్‌కి సహాయం అందించడం మొదలైనవి ఉంటాయని అంచనా. అమెరికాకు టెక్స్టైల్స్ ఎగుమతులు 11 బిలియన్ డాలర్లుగా, రసాయనాల ఎగుమతులు సుమారు 6 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వస్త్రాలు, రత్నాభరణాలు, రొయ్యలు, లెదర్.. ఫుట్‌వేర్, రసాయనాలు, ఎలక్ట్రికల్ పరికరాలు, మె కానికల్ పరికరాలు మొదలైన రంగాలపై 50% టారిఫ్‌ల ప్రభావం గణనీయంగా ఉండనుంది. సంస్కరణలకు జీజేఈపీసీ విజ్ఞప్తి.. సుంకాల భారం తగ్గేలా తక్షణం పాలసీపరమైన సంస్కరణలు చేపట్టాలని కేంద్రాన్ని రత్నాభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి జీజేఈపీసీ కోరింది. డ్యూటీ డ్రాబ్యాక్ స్కీము, మార్కెట్ డైవర్సిఫికేషన్ కోసం ఆర్థిక సహాయం అందించడంలాంటి చర్యలు పరిశీలించాలని విజ్ఞప్తి చేసింది. కట్, పాలిష్డ్ డైమండ్లలో సగం ఉత్పత్తులు అమెరికాకే ఎగుమతవుతున్నాయని, భారీ టారిఫ్‌ల వల్ల మొత్తం పరిశ్రమ స్తంభించిపోయే ముప్పు ఏర్పడిందని జీజేఈపీసీ చైర్మన్ కిరీట్ భన్సాలీ తెలిపారు. దీనివల్ల ఉపాధి అవకాశాలు కూడా దెబ్బతింటాయని వివరించారు. తక్కువ టారిఫ్‌లు ఉండే టర్కీ, వియత్నాలాంటి దేశాలతో అమెరికా మార్కెట్లో భారత్ పోటీపడటం కష్టతరమవుతుందని భన్సాలీ చెప్పారు. దీన్ని పరిష్కరించకపోతే, అమెరికాకు కీలక సరఫరాదారుగా భారత్‌కి ఉన్న హోదా పోతుందని వివరించారు. అయితే, టారిఫ్‌ల ఎఫెక్ట్‌ను పక్కన పెడితే దేశీయంగా ప్రస్తుతం 85 బిలియన్ డాలర్లుగా ఉన్న మార్కెట్, వచ్చే రెండేళ్లలో 130 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందుతుందనే అంచనాలు పరిశ్రమకు కాస్త ఊరటనిచ్చే విషయమని భన్సాలీ చెప్పారు. అమెరికాకు భారత్ నుంచి రత్నాభరణాల ఎగుమతులు దాదాపు 10 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్నాయి. -
ట్రంప్ టారిఫ్ దండయాత్ర ఆగదా?
వాషింగ్టన్/న్యూఢిల్లీ: రష్యాతో వాణిజ్య మైత్రి కొనసాగిస్తున్న దేశాలపై టారిఫ్ క్షిపణుల్ని ప్రయోగిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అమ్ముల పొదిని మరింతగా వాడబోతున్నారా?. గురువారం అధ్యక్షభవనం శ్వేతసౌధంలో మీడియా అడిగిన ప్రశ్నలకు ట్రంప్ ఇచ్చిన సమాధానాలను చూస్తే అమెరికా టారిఫ్‌ల మోత ఇప్పట్లో ఆగేలా లేదని స్పష్టమవుతోంది. మీడియా సమావేశంలో ప్రసంగిస్తున్న ట్రంప్‌ను విలేఖరులు భారత్ సంబంధిత ప్రశ్న సంధించారు. ‘‘ రష్యాతో ఎన్నో దేశాలు ముడిచమురు వాణిజ్యం చేస్తోంటే కేవలం భారత్‌ను మీరు లక్ష్యంగా చేసుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. 50 శాతం టారిఫ్ మోపారు. రష్యాతో చైనా సైతం ఇదే తరహా వాణిజ్యంచేస్తోంది. మరి చైనాపైనా టారిఫ్ మరోసారి పెంచుతారా?’’ అని ప్రశ్నించగా ట్రంప్ సంచలన విషయం చెప్పారు. ‘‘ భారత్‌పై రెండో దఫా టారిఫ్‌లు పెంచి కేవలం 8 గంటలే గడిచాయి. అప్పుడే ఏం అయిపోయింది? మున్ముందు ఏం జరగబోతోందో మీరే చూస్తారుగా. పరోక్ష ఆంక్షలపర్వంలో భాగంగా రెండో దఫాలో మరింతగా టారిఫ్‌ను పెంచబోతున్నాం’’ అంటూ చైనాకు టారి‹ఫ్ వేడి తప్పదని ట్రంప్ పరోక్షంగా చెప్పారు. గత కొన్నేళ్లుగా చైనాతో వైరం ముదరడంతో భారత్‌తో అమెరికా సత్సంబంధాలను పటిష్టంచేసుకోగా ఉక్రెయిన్ యుద్ధంలో ఈ మైత్రీబంధం కీలకమలుపు తీసుకుంది. రష్యాకు భారత్ వంటి దేశాలు కీలక వాణిజ్యభాగస్వాములుగా కొనసాగుతున్న తరుణంలో ఈ దేశాలపై సుంకాల కత్తి వేలాడదీసి రష్యాను ఉక్రెయిన్‌తో శాంతి ఒప్పందానికి బలవంతంగా ఒప్పించాలని అమెరికా యతి్నస్తోంది. ఇందులోభాగంగా భారత్‌పై మరో పాతిక శాతం టారిఫ్‌ను విధించడం తెల్సిందే. అమల్లోకి నూతన టారిఫ్ 60కిపైగా దేశాలపై ట్రంప్ మోపిన కొత్త టారిఫ్‌లు గురువారం అమల్లోకి వచ్చాయి. గరిష్టంగా బ్రెజిల్, భారత్‌పై ఏకంగా 50 శాతం సుంకాలు విధించారు. సిరియా(41 శాతం), లావోస్(40), మయన్మార్ (40), స్విట్జర్లాండ్(39), ఇరాక్(35), కెనడా(35), సెర్బియా(35), బోస్నియా హెర్జ్‌గోవినా(30), లిబియా(30), దక్షిణాఫ్రికా(30), మెక్సికో(25), బంగ్లాదేశ్(20), శ్రీలంక(20), తైవాన్(20), వియత్నాం(20), కాంబోడియా(19), పాకిస్తాన్(19శాతం)పై విధించిన అదనపు సుంకాలు గురువారం అమల్లోకి వచ్చాయి. తమకు మిత్రులుగా ఉన్న జపాన్, దక్షిణకొరియా, యూరోపియన్ యూనియన్ దేశాలపై కేవలం 15 శాతం సుంకాలు ట్రంప్ విధించారు. బ్రిటన్‌పై కేవలం 10 శాతం టారిఫ్‌లు విధించారు. -
మూడు దేశాలు ఒక్కటైతే..!
అగ్రరాజ్యమన్న దురహంకారం, ఆధిపత్యధోరణితో ట్రంప్ టారిఫ్‌ల బాంబులు విసిరితే బాధిత దేశాలు జట్టుకట్టి పోరుసల్పే ప్రయత్నాలు మొదలెట్టాయా? అంటే తాజా అంతర్జాతీయ పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. వినిమయ ప్రపంచంగా పేరొందిన అమెరికాకు అన్ని దేశాల వస్తూత్పత్తులు పోటెత్తుతాయి. చాలా దేశాల ఖజానా నిండటానికి అమెరికా కొనుగోళ్లే కారణం. దీనిని అలుసుగా తీసుకుని, ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని కారణంగా చూపి తమతో వాణిజ్యంచేసే దేశాలపై ట్రంప్ టారిఫ్‌ల గుదిబండలు పడేస్తుండటంతో ఆయా దేశాల్లో ఆగ్రహజ్వాలలు పెల్లుబికాయి. భారత్, చైనా వంటి దేశాలు అంతటితో ఆగకుండా రష్యాతో జట్టుకట్టి అగ్రరాజ్య దుందుడుకు చర్యలకు ముకుతాడు వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తాజా పరిణామాలు ఈ వాదనలకు బలం చేకూరుస్తున్నాయి. ఇప్పటికే భారత జాతీయ భద్రతా సలహదారు అజిత్ దోవల్ రష్యాలో పర్యటిస్తున్నారు. రష్యా జాతీయ భద్రతా మండలి కార్యదర్శి సెర్గీ షోయిగుతో గురువారం ఎన్ఎస్ఏ ధోవల్ సమావేశమయ్యారు. ఇంధన, రక్షణ రంగంలో ద్వైపాక్షిక సహకారంపై చర్చలు జరిపానని ధోవల్ చెబుతున్నప్పటికీ వాస్తవానికి ట్రంప్‌ను ఎలా నిలువరించాలనే దానిపైనే ప్రధానంగా చర్చ జరిగిందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ట్రంప్ దూకుడుకు ఎలా కళ్లెం వేయాలని అంశంపై చర్చించేందుకు త్వరలో భారతవిదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ సైతం రష్యాకు వెళ్లి పుతిన్ ప్రభుత్వ పెద్దలతో మాట్లాడనున్నారు. గల్వాన్ లోయలో ఇరుదేశాల జవాన్ల ముష్టిఘాతం, ఘర్షణలు, 20కిపైగా భారత జవాన్ల వీరమరణంతో ఎగసిపడిన కోపాన్ని సైతం కాసేపు పక్కనబెట్టి ప్రధాని మోదీ త్వరలో చైనాలో పర్యటించనున్నారు. చైనాకు బద్దశత్రువైన అమెరికాను ఆర్థికాంశాల్లో ఎలా ఎదుర్కోవాలనే దానిపై చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మోదీ చర్చించనున్నట్లు వార్తలొచ్చాయి. మారుతున్న భారత్ వ్యూహం చైనాతో మైత్రీ విషయంలో ఇన్నాళ్లూ సమదూరం పాటించిన భారత్ ఇకపై అమెరికా కారణంగా స్నేహబంధాన్ని బలపర్చుకునే అవకాశముంది. చైనా, భారత్, రష్యా కూటమిలో తానూ చేరతానని ఇప్పటికే బ్రెజిల్ సూచనప్రాయంగా తెలిపింది. వ్యవసాయం, డైయిరీ రంగంలో అమెరికన్ కంపెనీల రాకను భారత్ అడ్డుకుంటుండటంతో ఒక దెబ్బకు రెండు పిట్టలు తరహాలో అటు సుంకాలతో, ఇటు వాణిజ్య ఒప్పందంలో తనకు అనుకూల షరతులతో భారత్ మెడలు వంచాలని ట్రంప్ చూస్తున్నారు. ఇందుకు భారత్ ససేమిరా అనడంతో ఆగ్రహంతో ట్రంప్ మోపిన టారిఫ్ ఇప్పుడు భారత్‌ను చైనాకు దగ్గరచేస్తోందని తెలుస్తోంది. ఏడేళ్ల తర్వాత మోదీ చైనా పర్యటన ఖరారుకావడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనాను నిలువరించేందుకు ఇన్నాళ్లూ భారత్‌ను మచి్చకచేసుకునేందుకు గత అమెరికా ప్రభుత్వాలు చేసిన సఫలయత్నాలను ట్రంప్ ఒక్క టారిఫ్ దెబ్బతో నాశనంచేస్తున్నారు. 25 శాతం టారిఫ్ అమల్లోకి వచి్చనరోజు మాస్కోలో దోవల్ పర్యటించడం యాదృచి్ఛకం కాదని తెలుస్తోంది. ఉక్రెయిన్‌తో శాంతి ఒప్పందం చేసుకోవాలంటూ ట్రంప్ పంపిన దూత, అమెరికా ఉన్నతాధికారి స్టీవ్ విట్కాఫ్.. వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ అయిన కొద్దిగంటల తేడాతోనే ధోవల్ సైతం మాస్కోలో కీలక చర్చలు జరపడం గమనార్హం. షాంఘై శిఖరాగ్ర సదస్సు వేదికగా.. త్వరలో చైనాలో జరగబోయే షాంఘై సహకార సంఘం శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు మోదీ చైనాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను కలిసి ట్రంప్ ప్రభుత్వ వ్యతిరేక వ్యూహాలను రచించనున్నట్లు వార్తలొచ్చాయి. ఇటీవలికాలంలో చైనా, భారత్ మధ్య సారూప్యతలు కనిపిస్తున్నాయి. రష్యా ముడిచమురును చైనా, భారత్‌లు అత్యధికంగా కొనుగోలుచేస్తున్నాయి. ట్రంప్ బెదిరింపులను భారత్, చైనా రెండూ చవిచూశాయి. దేశ స్వప్రయోజనాలు, జాతీయ భద్రతకే తాము పెద్దపీట వేస్తామని చైనా, భారత్ ఒకే తరహాలో తమ వాణిని గట్టిగా వినిపించాయి. యురేనియం, ఎరువులు, ఇతర కీలక మిశ్రమ ధాతువులను రష్యా నుంచి కొంటూ మాకు సుద్దులు నేర్పుతావా? అని రెండు దేశాలు అమెరికాపై ఆగ్రహం వ్యక్తంచేశాయి. శత్రువుకు శత్రువు మిత్రువు అన్న సూత్రాన్ని భారత్, చైనాలు తూ.చ. తప్పకుండా పాటిస్తాయని తెలుస్తోంది. కలిసి నడుస్తానన్న బ్రెజిల్ తమపై ఏకంగా 50 శాతం టారిఫ్ విధించడంపై అమెరికాపై బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డసిల్వా గుర్రుగా ఉన్నారు. ‘‘ ఇంతటి భారం మోపిన ట్రంప్‌కు అస్సలు ఫోన్ చేయను. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, భారత ప్రధాని మోదీకి ఫోన్చేస్తా. ప్రపంచ వాణిజ్య సంస్థలో ఈ టారిఫ్‌లపై తేల్చుకుంటాం. ఈ దేశాలతో కలిసి నడుస్తా’’ అని డసిల్వా అన్నారు. రష్యా, ఇండియా, చైనా త్రయం మళ్లీ క్రియాశీలకం కావాల్సిన తరుణం వచి్చందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ అన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
యాపిల్‌కు ట్రంప్ వణుకు?
భారత్‌లో ఉత్పత్తిని పెంచాలని నిర్ణయించిన యాపిల్ కంపెనీ తాజాగా యూఎస్‌లోనూ 100 బిలియన్ డాలర్ల(సుమారు రూ.8.3 లక్షల కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. ఐఫోన్ ఉత్పత్తిని భారత్‌కు తరలించాలన్న కంపెనీ నిర్ణయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని వారాల కొందట బహిరంగంగానే తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దాంతో కంపెనీ ఈమేరకు చర్యలు తీసుకొని ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దేశీయ తయారీ, సరఫరా గొలుసు కార్యకలాపాలను విస్తరించేందుకు వచ్చే నాలుగేళ్లలో ఈమేరకు ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నట్లు కంపెనీ వివరణ ఇచ్చింది.యాపిల్ చేసిన ప్రకటనను ఉద్దేశించి శ్వేతసౌధం ప్రకటన విడుదల చేసింది. అందులో అమెరికా తయారీ రంగానికి ఈ చర్య పెద్ద విజయం అని తెలిపారు. ‘యాపిల్ ఈ రోజు చేసిన ప్రకటన మా తయారీ పరిశ్రమకు మరొక విజయం. ఇది అమెరికా ఆర్థిక, జాతీయ భద్రతను రక్షించడానికి కీలకమైన ఉత్పత్తిని ప్రారంభిస్తుంది’ అని వైట్ హౌస్ ప్రతినిధి టేలర్ రోజర్స్ ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో కంపెనీ యూఎస్‌లో 500 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించింది. తాజాగా మరో 100 బిలియన్ డాలర్లు ఇందుకు తోడయ్యే అవకాశం ఉంది.యాపిల్ నిర్ణయంతో చిన్న సమస్యభారత్లో ఉత్పత్తిని విస్తరించాలన్న యాపిల్ నిర్ణయంతో చిన్న సమస్య ఉందని ఈ ఏడాది ప్రారంభంలో ట్రంప్ చేసిన విమర్శల నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. ఖతార్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో యాపిల్ సీఈఓ టిమ్‌కుక్‌తో నేరుగా ‘మీరు భారత్‌లో యాపిల్ కార్యకలాపాలు ఏర్పాటు చేయడం నాకు ఇష్టం లేదు’ అని ట్రంప్ బహిరంగంగానే చెప్పారు.సుంకాలు పెంపు..రష్యా చమురు దిగుమతులను భారత్ కొనసాగిస్తున్న నేపథ్యంలో భారత వస్తువులపై ట్రంప్ 25 శాతం అదనపు సుంకం విధించిన రోజే యాపిల్ తన పంథాను మార్చుకుంది. కొత్త పన్నులు 21 రోజుల్లో అమల్లోకి రానుండడంతో భారత ఎగుమతులపై మొత్తం అమెరికా సుంకాలు 50 శాతానికి చేరుకుంటాయి. దాంతో యాపిల్ ఉత్పత్తులను భారత్‌లో తయారు చేసి తిరిగి అమెరికాకు ఎగుమతి చేసే క్రమంలో 50 శాతం సుంకాలు చెల్లించాల్సి ఉంటుంది. ఇది కంపెనీకి భారంగా మారనుంది.ఇదీ చదవండి: 365 రోజులు ఎంతసేపైనా మాట్లాడుకునేలా.. -
భారత్ ఆర్థిక వృద్ధి బలంగా ఉంది.. కానీ..: ట్రంప్ సుంకాలపై ఆర్బీఐ చీఫ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇండియాపై మరోసారి 25 శాతం సుంకాలను ప్రకటించారు. త్వరలోనే కొత్త టారిఫ్ అమల్లోకి రానుంది. ఈ తరుణంలో.. ఈసారి కూడా రెపో రేటును యథాతథంగా 5.5 శాతం వద్దే స్థిరంగా ఉంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ 'సంజయ్ మల్హోత్రా' చెప్పారు.అమెరికా సుంకాల ప్రభావం మన దేశం ఆర్ధిక వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపుతాయని చాలామంది భావిస్తున్నారు. అయితే భారత్ వృద్ధిపై వాటి ప్రభావాన్ని అంచనా వేయండం కొంత కష్టమని సంజయ్ మల్హోత్రా పేర్కొన్నారు. ఎందుకంటే దేశం వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ.. సుంకాల ప్రభావం వాణిజ్య సమస్యలను తీసుకువచ్చే అవకాశం ఉందన్నారు.భారతదేశ ఆర్ధిక వ్యవస్థ బలంగా ఉన్నప్పటియికీ.. భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచ అనిశ్చితులు వంటివన్నీ దేశాభివృద్ధికి కొంత ఆటంకం కలిగించే అవకాశం ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో.. భారత ఆర్థిక వ్యవస్థ తన సముచిత స్థానాన్ని సాధించడానికి ప్రయత్నిస్తోంది. దీనికి దేశంలోని అన్ని రంగాలు కీలకని ఆయన అన్నారు.ఇదీ చదవండి: భారత ఆర్థిక మూలాలు పటిష్టం: డెలాయిట్ ఇండియాడెడ్ ఎకానమీ కాదు..భారత ఆర్థిక వ్యవస్థను డెడ్ ఎకానమీ అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా తగిన బదులిచ్చారు. భారత ఆర్థిక వ్యవస్థ చక్కని పనితీరు చూపిస్తోంది. 2025లో ప్రపంచ ఆర్థిక వృద్ధి 3 శాతంగా ఉంటే, భారత ఆర్థిక వృద్ధి 6.5 శాతంగా ఉంటుందన్న ఐఎంఎఫ్ అంచనాలను ప్రస్తావించారు. అంతర్జాతీయ ఆర్థిక వృద్ధిలో అమెరికా వాటా 11 శాతంగా ఉంటే, భారత్ 18 శాతం సమకూరుస్తోంది. ఇదే పనితీరును ఇక ముందూ కొనసాగిస్తామని సంజయ్ మల్హోత్రా పేర్కొన్నారు. -
ఉల్టా చోర్..
‘రష్యా యుద్ధ యంత్రాంగం మొత్తానికీ ఆర్థిక ఇంధనాన్ని భారతే సరఫరా చేస్తోంది’ – తెంపరి ట్రంప్ ఇటీవల చేసిన తలతిక్క వ్యాఖ్యలివి. అంతేగాక, రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై టారిఫ్‌లను భారీగా పెంచేస్తానంటూ బాధ్యతారహిత వ్యాఖ్యలకు దిగిన అమెరికా అధ్యక్షుడు బుధవారం అన్నంత పనీ చేశారు. టారిఫ్‌ను 50 శాతానికి పెంచేస్తూ ఉత్తర్వులపై సంతకం చేశారు. కానీ వాస్తవాల ఆధారంగా ఒకసారి పరిశీలన చేస్తే ఇలాంటి విషయాల్లో వర్ధమాన దేశాలకు నిత్యం సుద్దులు చెప్పే పెద్ద దేశాలు తమవరకూ వచ్చేసరికి మాత్రం ఎంతటి కొద్ది బుద్ధులు ప్రదర్శిస్తాయో తెలుస్తుంది. ట్రంప్ అనే కాదు, ఇలాంటి విషయాల్లో సంపన్న దేశాల స్వార్థపూరిత వైఖరి ఇట్టే కళ్లకు కడుతుంది... ఉక్రెయిన్‌పై ఏళ్లుగా సాగిస్తున్న మతిలేని యుద్ధానికి రష్యాకు అవసరమైన ఆర్థిక సాయం మొత్తాన్నీ ఒకరకంగా భారతే సమకూరుస్తూ వస్తోందన్నది అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలన్నీ కొద్దికాలంగా పాడుతూ వస్తున్న పాట. రష్యా నుంచి నానాటికీ పెరిగిపోతున్న భారత చమురు దిగుమతులనే ఇందుకు తార్కాణంగా అవి చూపిస్తున్నాయి. కానీ నిజానికి రష్యా నుంచి స్వీయ చమురు కొనుగోళ్లను నేటికీ ఆపని తెంపరితనం ఆ దేశాలది! ఇందుకు సంబంధించిన అన్ని విషయాలనూ ఒకసారి అంశాలవారీగా విశ్లేషిస్తే... ఉల్టా చోర్ కొత్వాల్‌కు డాంటే (దొంగే... దొం దొంగ అన్నట్టు) నానుడి ఈ దేశాల వైఖరికి అతికినట్టుగా సరిపోతుంది. రష్యా చమురే ముద్దు! ఉక్రెయిన్‌పై పాశ్చాత్య రష్యా యుద్ధానికి దిగిన వెంటనే అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలన్నీ పొలోమంటూ దానిపై నానారకాల ఆర్థిక తదితర ఆంక్షలు విధించాయి. కానీ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే రష్యా చమురుపై మాత్రం అవి ఎలాంటి ఆంక్షలూ విధించలేదు. అంతేకాదు, స్వయంగా అమెరికాతోపాటు ఆ దేశాలన్నీ నేటికీ రష్యా చమురును చంకలు గుద్దుకుంటూ కొనుక్కుంటున్నాయి. స్వీయ అవసరాలు తీర్చుకుంటూ వస్తున్నాయి. భారత్ వంటి దేశాలకు మాత్రం రష్యా చమురు కొనొద్దంటూ సుద్దులు చెబుతున్నాయి. ‘అలా ఎలా కొంటుం’దంటూ సన్నాయినొక్కులూ నొక్కుతున్నాయి. తెంపరితనానికి మారుపేరుగా మారిన ట్రంప్ అయితే ఆంక్షల రంకెలు వేస్తున్నారు. ధరపై పరిమితి మాత్రమేఇరాన్, వెనెజువెలా చమురు మాదిరిగా రష్యా చమురుపై అంతర్జాతీయంగా నేటికీ పూర్తిస్థాయి నిషేధం లేదు. అలా చేస్తే పెద్ద దేశాల్లో ఒక్కదానికీ పూట గడవని పరిస్థితి! అందుకే తెలివిగా ప్రపంచంలోని ఏడు అతి సంపన్న, శక్తిమంతమైన దేశాల కూటమి అయిన జీ7, యూరోపియన్ రష్యా చమురుపై ‘ప్రైస్ క్యాప్’విధానంతో సరిపెట్టాయి. దాంతో రష్యా దర్జాగా తన చమురును అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించుకుంటూ వస్తోంది. భారత్ కూడా జీ7, ఈయూ విధించిన ‘ప్రైస్ క్యాప్’కు లోబడే, వాటి మాదిరిగానే రష్యా నుంచి చమురు కొనుగోళ్లు జరుపుతూ వస్తోంది. అది కూడా పూర్తి చట్టబద్ధంగా, అత్యంత పారదర్శకంగా! ఈ విషయంలో ఒక్క అంతర్జాతీయ నిబంధనను గానీ, చట్టాన్ని గానీ ఉల్లంఘించడం లేదు. మరి మనపై ఏడుపెందుకు? ఒక్కముక్కలో చెప్పాలంటే స్వీయ వంచన, పరవంచన! అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో నానాటికీ పెరిగిపోతున్న భారత ప్రాభవాన్ని చూసి ఓర్వలేనితనం!! స్వార్థ రాజకీయాలకు పరాకాష్ట. కేవలం ఆ ఒక్క కారణంగానే సంపన్న దేశాలన్నీ ఇలా ఏడ్పులు, పెడబొబ్బలు పెడుతున్నాయి. అదే సమయంలో తాము మాత్రం చడీచప్పుడూ లేకుండా అదే రష్యా నుంచి ‘ఓపెన్ మార్కెట్’ముసుగులో నిరి్నరోధంగా చమురు కొనుగోలు చేస్తూనే ఉన్నాయి. ట్రంప్ అయితే శాపనార్థాలతో పాటు బెదిరింపులకు కూడా దిగుతున్నారు.పాశ్చాత్య దేశాల ‘గ్యాస్’ రష్యా నుంచి భారత చమురు కొనుగోళ్లపై గుండెలు బాదుకుంటున్న పాశ్చాత్య దేశాలు నిజానికి సహజ వాయువు కొనుగోళ్లలో నంబర్‌వన్ స్థానంలో ఉన్నాయి! గత జూన్‌లో ఈయూ దేశాలన్నీ కలిసి రష్యా సహజ వాయువు కొనుగోళ్ల నిమిత్తం వెచ్చించింది ఏకంగా 120 కోట్ల డాలర్లంటే నమ్మక తప్పదు! ఈ జాబితాలో ఫ్రాన్స్, హంగరీ, నెదర్లాండ్స్, స్లొవేకియా వంటి యూరప్ దేశాలు అగ్రస్థానంలో ఉన్నాయి. అంతేకాదు, రష్యా నుంచి రిఫైన్డ్ పెట్రో ఉత్పత్తుల కొనుగోళ్లలో కూడా నాటో దేశాలదే అగ్ర స్థానం. స్వార్థానికి మారుపేరైన తుర్కియే అయితే రష్యా రిఫైన్డ్ పెట్రో ఎగుమతుల్లో ఏకంగా 26 శాతాన్ని సొంతం చేసుకుంటోంది! ఈ విషయంలో భారత్ వాటా అక్షరాలా సున్నా! వీటన్నింటినీ బేరీజు వేసుకుని చూస్తే నిజానికి రష్యా యుద్ధ తంత్రానికి పూర్తిస్థాయిలో ఆర్థిక సాయం చేస్తూ వస్తున్నది అమెరికా, పాశ్చాత్య దేశాలు మాత్రమేనన్నది అక్షరసత్యం. ఆ లెక్కన ఈ విషయంలో భారత్‌పై వాటి ఏడుపు దొంగే, ‘దొంగా’అంటూ దొంగ అరుపులు అరిచిన చందమన్నది అంతర్జాతీయ నిపుణుల మాట. చైనా కంటే తక్కువే భారత్ తన చమురు అవసరాల్లో ఏకంగా 38 శాతం రష్యా నుంచే కొనుగోలు చేస్తోంది. కానీ ఈ విషయంలో అగ్రతాంబూలం మాత్రం చైనాదే. అది ఏకంగా 47 శాతం చమురు కొంటోంది. పాశ్చాత్య దేశాలతో పాటు వాటి మిత్ర దేశాలు కూడా రష్యా చమురును నమ్ముకునే మనుగడ సాగిస్తున్నాయి.మనం తప్పుకుంటే..గగ్గోలు పుడుతుంది. అంతర్జాతీయంగా చమురు ధరలు ఆకాశాన్నంటుతాయి. బ్యారెల్ ఏకంగా 200 డాలర్లు దాటేస్తుంది. అది మొత్తం ప్రపంచ దేశాలన్నింటికీ కోలుకోలేని దెబ్బేనని అంతర్జాతీయ చమురు రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రేట్ల కోతకు బ్రేక్!
ముంబై: వరుసగా మూడు సమీక్షల్లో కీలక రేట్లను తగ్గిస్తూ వచ్చిన ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ఈ సారి ఆచితూచి వ్యవహరించింది. కీలకమైన రెపో రేటును (ఆర్బీఐ నుంచి బ్యాంకులు తీసుకునే నిధులపై వసూలు చేసే రేటు) 5.5 శాతం వద్దే కొనసాగించాలని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన గల ఎంపీసీ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. రివర్స్ రెపో రేటును (బ్యాంకుల నుంచి ఆర్బీఐ తీసుకునే నిధులపై రేటు) సైతం 3.35 శాతం వద్దే కొనసాగించింది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న అస్పష్ట వాణిజ్య విధానాలకు తోడు టారిఫ్‌ల పట్ల అనిశ్చితులు కొనసాగుతుండడాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఇప్పటికే పలు విడతలుగా రేట్లను తగ్గించగా ఇది పూర్తి స్థాయిలో బదిలీ కావాల్సి ఉండడం, ద్రవ్యోల్బణం రిస్క్‌ను దృష్టిలో పెట్టుకుని రేట్ల పరంగా యథాతథ స్థితిని కొనసాగించడమే ఉత్తమమని భావించింది. ద్రవ్య పరపతి విధానం పరంగా తటస్థ వైఖరినే (న్యూట్రల్) కొనసాగించాలని నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2025–26) ద్రవ్యోల్బణం మొత్తం మీద 3.7 శాతంగా ఉండొచ్చన్న గత అంచనాను 3.1 శాతానికి తగ్గించింది. అలాగే, జీడీపీ వృద్ధి రేటు 6.5 శాతం అంచనాలో ఎలాంటి మార్పు చేయలేదు. ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా నిలుస్తాం.. రుతుపవన ఆధారిత వర్షాలు అనుకున్న విధంగా కొనసాగుతుండడం, పండుగల సీజన్ సమీపిస్తుండడం ఆర్థిక వ్యవస్థకు జోష్‌నిస్తాయని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పేర్కొన్నారు. మారుతున్న ప్రపంచ క్రమంలో బలమైన మూలాలు, సౌకర్యవంతమైన ఫారెక్స్ మిగులు నిల్వలు కలిగి ఉన్న భారత ఆర్థిక వ్యవస్థకు మధ్యకాలానికి ఉజ్వల అవకాశాలున్నట్టు చెప్పారు. అన్ని రకాల డేటాను గమనిస్తూ అవసరమైతే రేట్లపై తగిన నిర్ణయంతో ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా నిలుస్తామని ప్రకటించారు. ‘‘అంతర్జాతీయంగా ఎన్నో సవాళ్లతో కూడిన వాతావరణంలో భారత ఆర్థిక వ్యవస్థ ధరల స్థిరత్వంతో, నిలకడైన వృద్ధి పథాన్ని కొనసాగించింది. ద్రవ్యోల్బణం నియంత్రణలోకి రావడంతో వృద్ధికి మద్దతుగా పరపతి విధానాన్ని చక్కగా వినియోగించుకున్నాం. ఫిబ్రవరి నుంచి జూన్ మధ్య నాలుగు నెలల్లోనే రెపో రేటును ఒక శాతం తగ్గించాం. వ్యవస్థలో రేట్ల బదలాయింపు ఇంకా కొనసాగుతోంది’’అని చెప్పారు. రేట్ల తగ్గింపు పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే అప్పుడు రుణ వితరణ పుంజుకోవచ్చన్నారు. గృహ రుణ విభాగం 14 శాతం వృద్ధితో మెరుగైన పనితీరు చూపిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతమున్న తీవ్ర అనిశ్చితుల్లో రూపాయి ఆల్‌టైమ్ కనిష్టానికి పడిపోవడం ఆశ్చర్యం కలిగించలేదన్నారు. ఏడాది చివర్లో ద్రవ్యోల్బణం పైపైకి.. ఏడాది చివర్లో ద్రవ్యోల్బణం కొంత పెరిగే అవకాశాలున్నట్టు మల్హోత్రా చెప్పారు. ‘‘రిటైల్ ద్రవ్యోల్బణం క్యూ4లో (2026 జనవరి–మార్చి) 4 శాతం పైకి చేరుకోవచ్చు. విధానపరమైన చర్యల మద్దతుతో (రేట్ల కోత) డిమాండ్ పెరగడం ఇందుకు దారితీయొచ్చు’’అని అభిప్రాయపడ్డారు.అకౌంట్, లాకర్ క్లెయిమ్ సులభతరం బ్యాంక్ ఖాతాలు, లాకర్ల క్లెయిమ్ ప్రక్రియను ప్రామాణీకరించనున్నట్టు ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా తెలిపారు. మరణించిన కస్టమర్ల తరఫున నామినీ సులభంగా క్లెయిమ్ చేసుకోవడం దీని లక్ష్యమని చెప్పారు. ట్రెజరీ బిల్లుల్లో రిటైల్ ఇన్వెస్టర్లు నేరుగా పెట్టుబడులు పెట్టుకునేందుకు వీలుగా ఆర్బీఐ రిటైల్–డైరెక్ట్ ప్లాట్‌ఫామ్ కార్యకలాపాలను విస్తరించే ప్రణాళికతో ఉన్నట్టు తెలిపారు.పాలసీ ముఖ్యాంశాలు.. → యథాతథ స్థితికి అనుకూలంగా ఎంపీసీలోని ఆరుగురు సభ్యులు ఓటు వేశారు. → రెపో రేటును ఐదేళ్ల విరామం తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో 25 బేసిస్ పాయింట్లు ( పావుశాతం) తగ్గించి 6.25 శాతం చేయగా, ఏప్రిల్‌లో మరో పావు శాతం కోతతో 6 శాతానికి దిగొచ్చింది. జూన్‌లో అర శాతం కోతతో 5.5 శాతానికి పరిమితమైంది. → రివర్స్ రెపో రేటు 3.35 శాతంలోనూ ఎలాంటి మార్పులేదు. → తదుపరి ఆర్బీఐ ఎంపీసీ సమీక్ష సెప్టెంబర్ 29– అక్టోబర్ 1 మధ్య నిర్వహించనున్నారు. డెడ్ ఎకానమీ కాదు.. సంజీవని భారత ఆర్థిక వ్యవస్థను డెడ్ ఎకానమీ (నిర్వీర్యమైన ఆర్థిక వ్యవస్థ) అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా తగిన బదులిచ్చారు. భారత ఆర్థిక వ్యవస్థ చక్కని పనితీరు చూపిస్తోందంటూ.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అమెరికా కంటే భారతే దన్నుగా నిలుస్తున్నట్టు చెప్పారు. 2025లో ప్రపంచ ఆర్థిక వృద్ధి 3 శాతంగా ఉంటే, భారత ఆర్థిక వృద్ధి 6.5 శాతంగా ఉంటుందన్న ఐఎంఎఫ్ అంచనాలను ప్రస్తావించారు. ‘‘అంతర్జాతీయ ఆర్థిక వృద్ధిలో అమెరికా వాటా 11 శాతంగా ఉంటే, భారత్ 18 శాతం సమకూరుస్తోంది. ఇదే పనితీరును ఇక ముందూ కొనసాగిస్తాం’’అని చెప్పారు. భారత వృద్ధి ఆకాంక్షలు 6.5 శాతం కంటే అధికంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. గతంలో ఏటా సగటున 7.8 శాతం వృద్ధిని నమోదు చేయడాన్ని గుర్తు చేశారు. -
ఇది అన్యాయం.. మా దేశంపైనే ఎందుకిలా?: ట్రంప్ 50 శాతం సుంకాలపై భారత్ రియాక్షన్
అమెరికా అదనపు సుంకాల నిర్ణయంపై భారత ప్రభుత్వం స్పందించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై అదనంగా 25% టారిఫ్ విధించడంతో.. మొత్తం సుంకాలు 50 శాతానికి చేరిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని భారత విదేశాంగ శాఖ తీవ్రంగా తప్పుబట్టింది. ఇది అన్యాయం, అసమంజసం, అసంబద్ధమైందంటూ బుధవారం రాత్రి భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. అలాగే.. జాతీయ ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు భారత్ తీసుకుంటుందంటూ అందులో స్పష్టం చేసింది. ‘‘భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు అమెరికా లక్ష్యంగా చేసుకుంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే స్పష్టమైన ప్రకటన చేశాం. .. మా దేశంలోని 140 కోట్ల ప్రజల ఎనర్జీ సెక్యూరిటీ కోసం తీసుకునే నిర్ణయాలను మార్కెట్ ఫ్యాక్టర్ల ఆధారంగా చేస్తామని ఇప్పటికే స్పష్టం చేశాం. ఇలా చాలా దేశాలు తమ ప్రయోజనాల కోసం చేస్తున్నదే. అయినప్పటికీ అమెరికా భారత్‌పై మాత్రమే టారిఫ్ విధించింది. ఇది దురదృష్టకరం. ఈ నిర్ణయం.. అన్యాయం, అసమంజసం, అసంబద్ధమైనవిగా భారత్ ఖండిస్తోంది. భారత్ తన జాతీయ ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుంది’’ అని ఆ ప్రకటనలో విదేశాంగ శాఖ తేల్చి చెప్పింది. ఇదిలా ఉంటే.. రష్యాతో ఇంకా చమురు వాణిజ్యం కొనసాగిస్తుందన్న కారణంగా ట్రంప్ ప్రభుత్వం తాజాగా మరో 25 శాతం సుంకాన్ని విధించింది. దీంతో గత టారిఫ్‌తో కలిపి సుంకాలు 50 శాతానికి చేరాయి. తాజా పెంపు ఆగస్టు 27వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పరిణామాలు ఇండో-అమెరికన్ సంబంధాలపై ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. -
24 గంటల్లో సుంకాల మోత
న్యూయార్క్/మాస్కో: ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యాను నిలువరించే సత్తాలేని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దిక్కుతోచని స్థితితో భారత్‌పై తన ఆగ్రహాన్ని టారిఫ్‌ల రూపంలో తీర్చుకుంటున్నారు. మరో 24 గంటల్లో భారత్‌పై మరోమారు దిగుమతి సుంకాలను భారీగా పెంచుతానని ట్రంప్ మంగళవారం ప్రకటించారు. సుసంపన్న దేశమైన రష్యాకు భారత చమురు కొనుగోళ్ల కారణంగా మాత్రమే అపార లాభాల పంట పండుతున్నట్లు ట్రంప్ చెప్పుకొచ్చారు. కేవలం ఈ ఒక్క కారణాన్నే చూపి భారత్‌పై తన అక్కసును వెళ్లదీస్తూ మరోసారి సుంకాల మోత మోగిస్తానని సీఎన్‌బీసీ స్క్వాక్ బాక్స్ ఇంటర్వ్యూలో ట్రంప్ ప్రకటించారు.భారత్ నుంచి ఆర్జిస్తున్న చమురు లాభాల కారణంగానే ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని రష్యా విజయవంతంగా నెలల తరబడి కొనసాగిస్తోందని ట్రంప్ మరోమారు నోరుపారేసుకున్నారు. తమతో కంటే రష్యాతోనే అధిక వాణిజ్యం చేస్తోందని, ఆ వాణిజ్యం పరోక్షంగా ఉక్రెయిన్ యుద్ధాగి్నకి ఆజ్యంపోస్తోందని ఆరోపించారు. ‘‘భారత్ ఇప్పటికీ మంచి వాణిజ్య భాగస్వామిగా ఎదగలేకపోయింది. భారత్ మాతో పెద్దస్థాయిలో వ్యాపారం చేస్తోందిగానీ మేం వాళ్లతో పెద్దగా వాణిజ్యం చేయట్లేదు.అందుకే ఇప్పటికే ఇటీవల 25 శాతం టారిఫ్‌ను విధించా. మరో 24 గంటల్లో మరోసారి దిగుమతి సుంకాలను పెంచుతా. దీనికి ప్రధాన కారణం వాళ్లు రష్యా ముడి చమురును కొనుగోలు చేయడమే. అక్కడ ఇంధనాన్ని కొంటూ రష్యాకు నగదు ఇంధనాన్ని సమకూర్చుతున్నారు. ఆ ఇంధనంతో రష్యా యుద్ధయంత్రంగా ఉగ్రరూపం దాల్చుతోంది. ఈ పద్దతి వాళ్లకు నచ్చుతుందేమోగానీ నేనైతే అస్సలు సంతోషంగా లేను’’అని అన్నారు.భారత్‌తో వాణిజ్య సంబంధాలపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘మా సరకులపై భారత్ అత్యంత ఎక్కువ టారిఫ్‌లను మోపుతోంది. మేం టారిఫ్‌లు పెంచడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణం’’అని చెప్పారు. ‘‘మా ఈ సుంకాల మోత తర్వాత భారత్ దిగిరావొచ్చు. మా సరకులపై సున్నా దిగుమతి సుంకాన్ని ఆఫర్చేయొచ్చు. కానీ ఇది మాకు ముఖ్యం కాదు. రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోళ్ల అంశమే మాకు ప్రధానం’’అని ట్రంప్ స్పష్టంచేశారు. -
భారత్‌కు ‘టారిఫ్’ షాక్.. మరో బాంబు పేల్చిన ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై మరోసారి బెదిరింపులకు దిగారు. మరో 24 గంటల్లో భారత్‌పై మరిన్ని టారిఫ్‌లు విధిస్తామని హెచ్చరించారు. భారత్‌తో వ్యాపారం చేయడం కష్టంగా ఉందని, అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. సీఎన్‌బీసీ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. భారత్ మంచి వాణిజ్య భాగస్వామి కాదు. ఎందుకంటే వారు మాతో చాలా వ్యాపారం చేస్తారు. కానీ మేము వారితో వ్యాపారం చేయం. రష్యా నుంచి భారత్ చమురును కొనుగోలు చేస్తోంది. ఆ చమరు కొనుగోళ్లను ఆపకపోతే మరో 24 గంటల్లో టారిఫ్‌ను భారీ ఎత్తున పెంచబోతున్నాను’అని అన్నారు. భారత కాలమాన ప్రకారం.. సోమవారం (ఆగస్టు 4)ట్రంప్.. భారత్‌కు హెచ్చరికలు పంపించారు. రాబోయే రోజుల్లో భారీ ఎత్తున సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. భారత్‌కు ముడి చమురును విక్రయించడం ద్వారా వచ్చిన నగదు ఆదాయాన్ని నేరుగా ఉక్రెయిన్ యుద్ధం కోసం మంచి నీళ్లలా ఖర్చు పెడుతోంది. దీంతో రష్యా దాడుల్లో ఉక్రెయిన్‌లో లెక్కలేనంత మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రష్యా ఒక యుద్ధ యంత్రంలా మారిపోయింది. భారత్‌కు ఇవేం పట్టవు. అందుకే భారత్‌పై మళ్లీ దిగుమతి సుంకాలను పెంచుతా’’అని ట్రంప్ ప్రకటించారు.మరోమారు దిగుమతి టారిఫ్‌ల మోత మోగిస్తానన్న ట్రంప్ వ్యాఖ్యలపై మోదీ సర్కార్ తీవ్రంగా స్పందించింది. ఏ దేశం నుంచి ఏమేం కొనాలి, ఎంత కొనాలి అని నిర్ణయించుకునే స్వేచ్ఛ... సార్వభౌమత్వ దేశమైన భారత్‌కు ఉందని కేంద్ర ప్రభుత్వం సోమవారం స్పష్టంచేసింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదలచేసింది. ‘‘ఉక్రెయిన్ యుద్ధానికీ భారత చమురు కొనుగోళ్లకు ఎలాంటి సంబంధం లేదు.అయినా సరే ఉక్రెయిన్ సమరం మొదలయ్యాక రష్యా నుంచి మేం చమురును దిగుమతి చేసుకుంటుంటే అమెరికా, యురోపియన్ యూనియన్లు ఉద్దేశపూర్వకంగా భారత్‌ను లక్ష్యంగా చేసుకున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక భారత్‌కు విదేశాల నుంచి దిగుమతి కావాల్సిన ముడి చమురు సరఫరాలో ఆటంకాలు తలెత్తాయి. దీంతో చమురు తక్షణ అవసరాల కోసం రష్యా నుంచి దిగుమతులను పెంచుకున్నాం.భారతీయ వినియోగదారుల ఇంధన అవసరాలు తీర్చేందుకు, అనువైన ధరలకు ఇంధనాలను అందించేందుకు రష్యాపై ఆధారపడాల్సి వచ్చింది. అంతర్జాతీయంగా చమురు సరఫరాలో అస్థిరత ఏర్పడిన సందర్భాల్లో దిగుమతి సంక్షోభం తలెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. అయినా రష్యాతో మా వాణిజ్యంపై ఇష్టారీతిగా మాట్లాడే ఇవే దేశాలు రష్యాతో వాణిజ్యంచేస్తున్నాయికదా. స్వయంగా అమెరికా సైతం రష్యాపై ఆధారపడుతోంది.అమెరికా తమ అణువిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల కోసం యురేనియం హెగ్జాఫ్లోరైడ్‌ను, విద్యుత్వాహనాలు, ఎరువుల పరిశ్రమల్లో వాడేందుకు పల్లాడియంను రష్యా నుంచి అమెరికా ఇప్పటికీ దిగుమతి చేసుకుంటోంది. 2024లో రష్యాతో యురోపియన్ యూనియన్ ఏకంగా 67.5 బిలియన్ యూరోల వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఇలాంటి దేశాలు కేవ లం భారత్‌ను మాత్రమే లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించడం సహేతుకం అనిపించుకోదు. ప్రపంచంలోని ప్రధానమైన ఆర్థికవ్యవస్థల్లో ఒకటైన భారత్ సైతం తన సొంత జాతీయ ప్రయోజనాలు, ఆర్థిక భద్రత కోసం స్వీయ నిర్ణయాలు గతంలో తీసుకుంది. ఇకమీదటా ఇదే ఒరవడి కొనసాగిస్తుంది’’అని భారత్ తెగేసి చెప్పింది. -
భారత్‌పై రెచ్చిపోయిన ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై రెచ్చిపోయారు. భారత్‌పై మరోసారి సుంకాన్ని భారీ మొత్తంలో విధిస్తామని హెచ్చరించారు.గత వారం ట్రంప్ భారత్ నుంచి ఎగుమతి అయ్యే వస్తువులపై 25శాతం సుంకంతో పాటు అదనంగా పెనాల్టీ విధించారు. తాజాగా, రానున్న రోజుల్లో భారత్‌పై మరింత సుంకాల్ని విధిస్తామని ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ‘రష్యా నుంచి భారత్ చమురును కొనుగోలు చేస్తోంది. చమురును కొనుగోలు చేయడమే కాదు.. దానిని బహిరంగ మార్కెట్లో అమ్ముకుని సొమ్ము చేసుకుంటుంది. రష్యా వార్ మెషిన్‌తో ఎంతమంది ఉక్రెయిన్లు ప్రాణాలు పోతున్నా పట్టించుకోవడం లేదు. అందుకే భారత్‌పై గణనీయంగా సుంకాలు విధిస్తామని’ పేర్కొన్నారు. రెండు రోజుల వ్యవధిలో మరోసారి టారిఫ్ విధిస్తామంటూ ట్రంప్ బెదిరింపులకు దిగడం వెనక భారత్ తీసుకున్న నిర్ణయమేనని తెలుస్తోంది. పలు జాతీయ,అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. భారత్‌పై 25శాతం ట్రంప్ సుంకం విధించారు. ట్రంప్ నిర్ణయం అనంతరం భారత్ సంస్థలు.. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపివేశాయని.. ఆ నిర్ణయంపై ట్రంప్ హర్షం వ్యక్తం చేశారనేది సదరు మీడియా కథనాల సారాశం. ఈ కథనలపై కేంద్రం స్పందించినట్లు సమాచారం. దేశ ఇంధన దిగుమతులు మార్కెట్ శక్తులు. జాతీయ ప్రయోజనాల కోసం కార్యకలాపాలు కొనసాగుతున్నాయని పునరుద్ఘటించింది. భారత చమురు సంస్థలు రష్యన్ చమురు దిగుమతులను నిలిపివేసినట్లు తమకు ఎటువంటి సమాచారం లేదని ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేసింది.ఉక్రెయిన్‌పై చేస్తున్న యుద్ధంలో రష్యా ఆదాయ మార్గాలను అరికట్టేందుకు అమెరికా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. భారత్-రష్యా స్థిరమైన భాగస్వామ్యాన్ని పంచుకుంటున్నాయని తెలిపింది. ప్రస్తుత ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ ద్వైపాక్షిక సంబంధాలు ముందుకు సాగుతాయని వెల్లడించింది. -
ట్రంప్ టారిఫ్ ఆందోళనలు.. త్వరలో మంత్రి భేటీ
భారత టెక్స్టైల్, అప్పారెల్ ఎగుమతులపై 25 శాతం సుంకం విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన ప్రకటన నేపథ్యంలో కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ వచ్చే వారం పరిశ్రమ ప్రముఖులతో సమావేశం కానున్నారు. ట్రంప్ నిర్ణయం వల్ల కలిగే పరిణామాలపై చర్చించేందుకు ఈ సమావేశం కీలకంగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారతదేశపు టెక్స్టైల్ ఎగుమతి మార్కెట్లో భవిష్యత్తులో రాబోయే మార్పులు, వాటిని ఎలా సమర్థంగా నిర్వహించాలో ఈమేరకు చర్చించనున్నారు.అమెరికా టారిఫ్ ముప్పుభారతదేశం మొత్తం వస్త్ర, దుస్తుల ఎగుమతుల్లో యునైటెడ్ స్టేట్స్ సుమారు 25% వాటాను కలిగి ఉంది. యూఎస్ ఈ రంగానికి అతిపెద్ద మార్కెట్‌గా నిలుస్తోంది. అమెరికాకు భారత్ చేసే ఎగుమతులపై 25 శాతం సుంకం ప్రకటించడం దేశీయ టెక్స్ టైల్ పరిశ్రమలో ఆందోళన రేకెత్తిస్తుంది. ఇది ధరల పోటీతత్వాన్ని, డిమాండ్‌ను తీవ్రంగా దెబ్బతీస్తుందని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ దశలో పరిశ్రమకు నిర్దిష్ట ప్రభుత్వ మద్దతు ఉండాలని కొన్ని కంపెనీల యాజమాన్యాలు కోరుతున్నాయి. ఈ పరిస్థితుల ప్రభావాన్ని అంచనా వేయడానికి, పరిశ్రమ వర్గాల నుంచి ఫీడ్ బ్యాక్ సేకరించడానికి పరిశ్రమ నాయకులతో జరిగే చర్చలు కొంత ప్రభావితం చేసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.యూకే-ఇండియా ఎఫ్‌టీఏ ఎఫెక్ట్ఇటీవల యూకే-ఇండియా ఫ్రీట్రేడ్ అగ్రిమెంట్(ఎఫ్‌టీఏ) కుదుర్చుకున్న నేపథ్యంలో రాబోయే సమావేశం ఎజెండా టారిఫ్ ఆందోళనలకే పరిమితం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎఫ్‌టీఏ ద్వారా అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంపై కూడా చర్చలు జరగనున్నాయి. తగ్గిన సుంకాలు, సరళీకృత వాణిజ్య విధానాల ద్వారా భారతీయ వస్త్రాలకు యూకే మార్కెట్‌ను మరింత పెంచాలని భావిస్తున్నారు.ఇదీ చదవండి: ఆస్తిపాస్తులు గోప్యంగా ఉంచితే అంతే..100 బిలియన్ డాలర్ల ఎగుమతి లక్ష్యంప్రభుత్వ మద్దతు, వ్యూహాత్మక వాణిజ్య ఒప్పందాలతో భారతీయ వస్త్ర, దుస్తుల పరిశ్రమ 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల ఎగుమతి లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఈ మైలురాయిని చేరుకోవడానికి కీలక మార్కెట్ల నుంచి అనుకూలమైన విధానాలు అవసరం. అభివృద్ధి చెందుతున్న సరఫరా గొలుసు ధోరణులతో సహా మారుతున్న ప్రపంచ వాణిజ్య డైనమిక్స్‌ను అందిపుచ్చుకోవాలని చూస్తున్నారు. -
‘ఎఫ్–35’ కొనుగోళ్లు బంద్!
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యలకు భారత ప్రభుత్వం ప్రతిచర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తమ ఉత్పత్తులపై ఏకంగా 25 శాతం సుంకాలు విధించడం, రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తే అదనపు జరిమానాలు విధిస్తామని హెచ్చరించడం భారత్‌ను పునరాలో చనలో పడేశాయి. ట్రంప్ దూకుడుకు విరుగుడుగా అమెరికా నుంచి రక్షణ పరికరాల కొనుగోలును విరమించుకోవాలని ఇండియా నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ప్రధానంగా ఎఫ్–35 యుద్ధ విమానాల కొనుగోలును పూర్తిగా నిలిపి వేయనున్నట్లు తెలిసింది. ట్రంప్ ఇటీవల భారత్‌పై కారాలు మిరియాలు నూరుతున్నారు. సోషల్ మీడి యాలో వరుసగా పోస్టులు చేస్తున్నారు. ముఖ్యంగా ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇండియాపై అమెరికా అధ్యక్షుడి మాటల దాడి మరింత తీవ్రమైంది. పాకిస్తాన్‌కు అనుకూలంగా వ్యవహ రిస్తున్నారు. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌ను వైట్‌హౌస్ ఆహ్వా నించి, విందు ఇచ్చారు. ఇండియా ఉత్పత్తులపై 25 శాతం టారిఫ్‌లు విధించనున్నట్లు తాజాగా ప్రకటించారు. ఒకవైపు భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగుతుండగానే ట్రంప్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. భారత్‌తో తమకు వాణిజ్య లోటు ఉందని, దీన్ని కచ్చితంగా తగ్గిస్తామని ట్రంప్ తేల్చిచెప్పారు. ఈ పరిణామా లన్నీ భారత్‌కు ఇబ్బందికరంగా మారాయి. అమెరికాతో చర్చలు జరుపలేదు రక్షణ రంగంలో భారత్–అమెరికా మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. అమెరికా రక్షణ పరికరాలు, ఆయుధాలు, సైనిక రవాణా విమానాలను భారత్ ఉపయోగిస్తోంది. మరోవైపు ఎఫ్–35 యుద్ధ విమానాలను భారత్‌కు విక్రయించాలని డొనాల్డ్ ట్రంప్ గట్టి పట్టుదలతో ఉన్నారు. తద్వారా వేల కోట్ల డాలర్లు ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఇరు దేశాలు చేసిన సంయుక్త ప్రకటనలో ఎఫ్–35 యుద్ధ విమానాల అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. అయితే, ట్రంప్ టారిఫ్‌ల నేపథ్యంలో ఈ యుద్ధ విమానాల కొనుగోలుపై భారత ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు బ్లూబర్గ్ సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. ట్రంప్ ఆఫర్‌ను తిరస్కరిస్తున్నట్లు తెలిపింది. సమీప భవిష్యత్తులోనూ వీటిని కొనే అవకాశం లేదని పేర్కొంది. మరోవైపు ఎఫ్–35 యుద్ధ విమానాల కోసం అమెరికా ప్రభుత్వంతో అధికారికంగా ఎలాంటి చర్చలు జరుపలేదని విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ తేల్చిచెప్పారు. ఇదిలా ఉండగా, వాణిజ్య లోటుపై ట్రంప్ అభ్యంతరాల నేపథ్యంలో అమెరికా నుంచి సహజ వాయువు, కమ్యూనికేషన్ పరికరాలు, బంగారం కొనుగోళ్లు పెంచాలని భారత ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతీకార చర్యల్లో భాగంగా అమెరికా ఉత్పత్తులపై భారీగా సుంకాలు పెంచే అవకాశం ఉన్నప్పటికీ ప్రస్తుతానికి అందుకు దూరంగా ఉండాలని భారత ప్రభుత్వం నిర్ణయానికొచ్చింది. అమెరికాతో నెలకొన్న సమస్యలు త్వరలో పరిష్కారమవుతాయని అంచనా వేస్తోంది. -
25 శాతం సుంకాలు ఇక అధికారికం
వాషింగ్టన్/న్యూఢిల్లీ: తంపులమారి ట్రంప్ అన్నంత పనీ చేశారు. భారత్‌పై తాజాగా ప్రకటించిన 25 శాతం సుంకాలపై అమెరికా అధ్యక్షుడు అధికారిక ముద్ర వేశారు. ఈ మేరకు ఉత్తర్వులపై గురువారం సంతకం చేశారు. అంతేగాక పదుల కొద్దీ దేశాలపై కూడా సుంకాల కొరడా ఝళిపించారు. తద్వారా అంతర్జాతీయంగా మరోసారి వాణిజ్య కల్లోలానికి తెర తీశారు. తాజా జాబితాలో లేని దేశాలకు 10 శాతం టారిఫ్ వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. అత్యధికంగా సిరియాపై 41 శాతం, పలు దేశాలపై అత్యల్పంగా 10 శాతం టారిఫ్‌లు వడ్డించారు. ఇవి ఆగస్టు 7 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే పాకిస్తాన్‌పై మాత్రం టారిఫ్‌లను 29 నుంచి 19 శాతానికి తగ్గించడం విశేషం. తాజాగా టారిఫ్‌లు విధించిన జాబితాలో 69 దేశాలున్నాయి. మరిన్ని దేశాలు తమతో చర్చలు జరుపుతున్నా, వాటి ప్రతిపాదనలు పరస్పర వర్తక లోటును పూడ్చేలా లేవంటూ ట్రంప్ పెదవి విరిచారు. ఈ నేపథ్యంలో త్వరలో మరిన్ని టారిఫ్ పెంపుదలలు ఉంటాయని వైట్‌హౌస్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. దీనిపై అధ్యక్షుడే ప్రకటన చేస్తారన్నారు. ఉత్తర అమెరికా వర్తక ఒప్పందం కింద అమెరికాలోకి ప్రవేశించే కెనడా, మెక్సికో ఉత్పత్తులకు సుంకాల బాదుడు నుంచి మినహాయింపు ఇచ్చారు. అయితే అమెరికాలోకి ఫెంటానిల్ భారీ అక్రమ రవాణాను అడ్డుకోవడంలో కెనడా విఫలమవుతోందని వైట్‌హౌస్ ఆక్షేపించింది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన ఉత్పత్తులపై టారిఫ్‌లను 25 నుంచి 35 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించింది. మెక్సికోకు మాత్రం పలు ఉత్పత్తులపై విధించిన 30 శాతం టారిఫ్‌లను సంప్రదింపులకు వీలుగా 90 రోజుల గడువిచ్చారు. అయితే ఆటోయేతర, లోహేతర వస్తువులకు మాత్రం గడువు ఇవ్వలేదు. మెక్సికో నుంచి ఉక్కు, అల్యుమినియం, రాగిపై 50 శాతం టారిఫ్‌లు, ఆటో ఉత్పత్తులపై 25 శాతం తప్పవని వైట్‌హౌస్ స్పష్టం చేసింది. ట్రంప్ కొద్ది నెలల క్రితం ప్రపంచ దేశాలపై ప్రకటించిన టారిఫ్‌లు ఆగస్టు 1 నుంచే అమల్లోకి రావడం తెలిసిందే. భారత ఆర్థిక వ్యవస్థ మృతప్రాయమైనది అంటూ బుధవారం ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. మన ఎగుమతులపై 25 శాతం టారిఫ్‌లు విధిస్తున్నట్టు తాజా ఉత్తర్వుల్లో ఆయన పునరుద్ఘాటించారు. రష్యా నుంచి భారీగా చమురు, ఆయుధాలు కొనుగోలు చేస్తున్నందుకు ప్రకటించిన పెనాల్టీ శాతాన్ని మాత్రం తాజా ఉత్తర్వుల్లో వెల్లడించలేదు. వ్యవసాయ రంగానికి సంబంధించిన పలు అంశాల్లో అమెరికా ప్రమేయాన్ని అంగీకరించేందుకు భారత్ ఇప్పటికే ససేమిరా అనడం తెలిసిందే. అమెరికాపై భారత్ సుంకాలు దారుణంగా ఉన్నాయంటూ ట్రంప్ ఇటీవలే విమర్శించడం, దేశ ప్రయోజనాలను అన్ని రకాలుగా కాపాడతామని కేంద్రం ప్రకటించడం తెలిసిందే. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాల నడుమ చర్చలు కొనసాగుతుండగానే బుధవారం ట్రంప్ 25 శాతం సుంకాలు బాదారు. ఇక అమెరికాకు ఎగుమతులపై 15 శాతం టారిఫ్‌లకు దక్షిణ కొరియా ఇప్పటికే అంగీకరించింది. వాటిపై 25 శాతం బాదుడు తప్పదంటూ ట్రంప్ తొలుత హెచ్చరించారు. దాంతో ఆయన నిర్ణయించే అమెరికా ప్రాజెక్టుల్లో 350 బిలియన్ల మేరకు పెట్టుబడికి ఒప్పుకుంది. ఇక అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన చైనాపై టారిఫ్‌లను ట్రంప్ ఏ మేరకు నిర్ణయిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఆగస్టు 12 నాటికి ఒప్పందం కుదుర్చుకోవాల్సిందిగా ఆ దేశానికి ఆయన ఇప్పటికే అలి్టమేటమివ్వడం తెలిసిందే. ఇరు దేశాల నడుమ పలు అంశాలపై వర్తక విభేదాలు కొనసాగుతున్నాయి. దేశ ప్రయోజనాలు కాపాడతాం: కేంద్రం ట్రంప్ వ్యాఖ్యలు, తాజా ఉత్తర్వులపై కేంద్రం ఆచితూచి స్పందించింది. ‘‘ద్వైపాక్షిక వాణిజ్య భాగస్వామ్యం అనేక ఆటుపోట్లను ఎదుర్కొని నిలిచింది. ఇరు దేశాలు విశ్వసించే ఎజెండాకు కట్టుబడి ఉన్నాం. ఈ బంధం సజావుగా సాగుతుందని విశ్వసిస్తున్నాం’’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లకు ప్రతీకారంగా జరిమానా విధిస్తామన్న ట్రంప్ ప్రకటనను మీడియా ప్రస్తావించగా ఈ విషయంలో జాతి ప్రయోజనాలకు అనుగుణంగా మాత్రమే నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
భారత వృద్ధి అంచనాలకు ఫిచ్ కోత
న్యూఢిల్లీ: ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ‘ఫిచ్’ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2025–26) భారత వృద్ధి అంచనాలను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. 6.4% వృద్ధి నమోదవుతుందన్న గత అంచనాలను సవరిస్తూ.. 6.3 శాతానికి పరిమితం అవు తుందని తాజాగా వెల్లడించింది. అమెరికా టారిఫ్‌ల ప్రభావం భారత కంపెనీలపై చూపించే ప్రత్య క్ష ప్రభావం తక్కువేనని అభిప్రాయపడింది. ‘‘మౌలిక సదుపాయాల కల్పనపై పెద్ద ఎత్తు్తన ఖర్చు చేస్తుండడం సిమెంట్, బిల్డింగ్ మెటీరియల్స్ (తయారీలో వినియోగించేవి), విద్యుత్, పెట్రో లి యం ఉత్పత్తులు, స్టీల్, ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీలకు సానుకూలిస్తుంది’’అంటూ ‘ఇండియా కార్పొరేట్స్ క్రెడిట్ ట్రెండ్స్’ నివేదికలో ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది. తాను రేటింగ్ ఇచ్చే భా రత కంపెనీల రుణ కొలమానాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మెరుగుపడతాయని, బలమైన ఎ బిటా మార్జిన్లు, అధిక మూలధన వ్యయాలను అధి గమించేందుకు అనుకూలిస్తాయని వివరించింది. టారిఫ్‌ల ప్రభావం అధిగమించొచ్చు.. భారత కంపెనీలపై అమెరికా టారిఫ్‌ల కారణంగా పడే ప్రభావం తక్కువేనన్నది ఫిచ్ రేటింగ్ విశ్లేషణగా ఉంది. అమెరికా మార్కెట్లో వీటి ఎక్స్పోజర్ (వ్యాపారం) తక్కువగా ఉండడాన్ని గుర్తు చేసింది. కాకపోతే అధిక సరఫరా పరమైన రిస్క్‌లు ఎదురుకావొచ్చని పేర్కొంది. భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందంపై తుది ఫలితం ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడింది. భారత కంపెనీలు తమ ఎగుమతులను వైవిధ్యం చేసుకోవడం ద్వారా (ఇతర మార్కెట్లకు పెంచుకోవడం) టారిఫ్‌ల ప్రభావాన్ని అధిగమించగలవని అంచనా వేసింది. భారత్‌పై 25 శాతం టారిఫ్‌లకు అదనంగా పెనాల్టిలను విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడం గుర్తుండే ఉంటుంది. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం ఇరు దేశాల మధ్య విస్తృత స్థాయి చర్చలు జరుగుతున్నప్పటికీ.. ఏకాభిప్రాయ సాధనకు సమయం తీసుకుంటోండడం గమనార్హం. దేశీ మార్కెట్‌పైనే ప్రధానంగా ఆధారపడే ఆయిల్ అండ్ గ్యాస్, సిమెంట్, బిల్డింగ్ మెటీరియల్స్, ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్, టెలికం, యుటిలిటీలపై టారిఫ్‌ల కారణంగా ప్రత్యక్ష ప్రభావం పెద్దగా ఉండబోదని పేర్కొంది. టారిఫ్‌ల అనిశ్చితులు కారణంగా యూఎస్, యూరప్‌కు ఐటీ, ఆటో ఎగుమతులు 2025–26లో పరిమితంగా ఉండొచ్చంటూ.. అమెరికా విధానంలో మార్పు చోటుచేసుకుంటే ఫార్మా కంపెనీలపైనా ప్రభావం పడొచ్చని అంచనా వేసింది. స్టీల్, కెమికల్స్ అధిక సరఫరాలు భారత మార్కెట్‌ను ముంచెత్తితే ఆయా రంగాల్లోని కంపెనీలు ధరలపరమైన ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందని, మెటల్స్, మైనింగ్ రంగాల్లో ధరల పరంగా అధిక అస్థిరతలు ఉండొచ్చని తెలిపింది. -
ట్రంప్ సుంకాల మోత.. అధికంగా 41 శాతం, పాకిస్తాన్‌పై ఎంతంటే?
వాష్టింగన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సుంకాలు బాంబు పేల్చాడు. దాదాపు 70 దేశాలపై తాజాగా సుంకాలను విధిస్తూ కొత్త కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. దీంతో, కొత్త టారిఫ్‌లు అమలులోకి రానున్నాయి. కొత్తగా విధించిన వాటిలో అత్యధికంగా సిరియాపై 41 శాతం టారిఫ్‌లను ట్రంప్ ప్రకటించారు. కెనడాపై 35 శాతానికి సుంకాలను పెంచారు. ఇక, భారత్‌పై 25 శాతం సుంకాలు విధించిన విషయం తెలిసిందే.వివరాల ప్రకారం.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కొత్తగా టారిఫ్‌లను విధించారు. డజన్ల కొద్దీ వాణిజ్య భాగస్వాములపై అధిక సుంకాలను విధించారు. సిరియాపై అత్యధికంగా 41 శాతం విధించగా.. కెనడాపై 25 శాతం నుంచి 35 శాతానికి సుంకాల పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 🇺🇸 NOW: President Trump signed an Executive Order to further modify reciprocal tariff rates. pic.twitter.com/e9rtOcf5Kq— Cointelegraph (@Cointelegraph) July 31, 2025అలాగే, లావోస్, మయన్మార్‌పై 40 శాతం, స్విట్జల్యాండ్‌పై 39 శాతం, ఇరాక్, సెర్బియాపై 35 శాతం పన్నులు విధించారు. భారత్‌పై 25 శాతం, పాకిస్తాన్‌పై 19 శాతం, బంగ్లాదేశ్‌పై 20శాతం, శ్రీలంకపై 20 శాతం టారిఫ్‌లు విధిస్తూ.. ఉత్తర్వులపై సంతకం చేశారు. ఇదిలా ఉండగా.. బ్రిక్స్ దేశాలపై సుంకాల మోత మోగిస్తానన్న ట్రంప్ అన్నంత పని చేశారు. భారత్‌పై 25శాతం సుంకాలను విధించిన ఆయన.. బ్రెజిల్‌పై సుంకాలను ఏకంగా 50శాతానికి పెంచారు. శుక్రవారం నుంచే ఇవి అమల్లోకి వస్తాయని ప్రకటించారు. మరోవైపు పొరుగుదేశం మెక్సికోపై కొంత కరుణ చూపారు. ఆ దేశంతో వాణిజ్య ఒప్పందం కోసం 90 రోజుల సమయమిచ్చారు. అయితే ఈ సమయంలో 25శాతం సుంకం అమల్లో ఉంటుందని గురువారం ప్రకటించారు.🚨 BREAKING: President Trump just signed an order RAISING his reciprocal tariff on Canada from 25% to 35%, effective at midnightThis comes after Canadian PM Carney tried playing games on tradeFAFO, Canada! pic.twitter.com/a0caM6EgxY— Nick Sortor (@nicksortor) July 31, 2025భారత్‌పై 25 శాతం సుంకాలు పెనాల్టీతో కలిపి ఆగస్టు 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నట్లు చెప్పారు. ‘భారత్ మిత్రదేశమే అయినా.. సుంకాలు ఎక్కువగా ఉన్నందున వారితో పరిమిత స్థాయిలోనే వ్యాపారాలు చేస్తున్నాం. ప్రపంచంలో అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో భారత్ ఒకటి. రష్యా నుంచి భారీ స్థాయిలో సైనిక ఉత్పత్తులు, చమురు కొనుగోలు చేస్తోంది. అందుకే 25 శాతం సుంకాలు, అదనంగా పెనాల్టీ కూడా విధిస్తున్నాం. ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి’ ప్రకటించారు.ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రకటనపై భారత్ స్పందించింది. తాజాగా కేంద్రం ఓ ప్రకటనలో..‘ద్వైపాక్షిక వాణిజ్యంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనను గమనించాం. సుంకాల ప్రభావంపై అధ్యయనం చేస్తున్నాం. రైతులు, వ్యాపారవేత్తలతోపాటు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. బ్రిటన్‌తో ఇటీవల కుదుర్చుకున్న ‘ఎఫ్‌టీఏ’ సహా ఇతరత్రా వాణిజ్య ఒప్పందాల మాదిరిగానే.. ఈ వ్యవహారంలోనూ జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం’ అని తెలిపింది. -
బఫూన్లకు బాస్ ట్రంప్
న్యూఢిల్లీ: రష్యాతో వాణిజ్యం చేస్తున్నదనేసాకు చూపుతూ భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌లు విధించడంపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా మండిపడ్డారు. భారత ప్రభుత్వాన్ని వేధిస్తున్న ట్రంప్‌ను ఆయన ‘బఫూన్ ఇన్ చీఫ్’గా అభివర్ణించారు. ‘వైట్ హౌస్‌లోని బఫూర్ ఇన్ చీఫ్ నా దేశ ప్రభుత్వాన్ని వేధిస్తుండటం విచారం కలిగిస్తోంది. ఇలాంటి బెదిరింపులకు లొంగటానికి సామంత రాజ్యం కాదు.. భారత్ సార్వభౌమత్వం కలిగిన దేశం అని స్పష్టం చేశారు. అత్యధిక టారిఫ్‌లతో మన ఆర్థిక వ్యవస్థకు తీరని నష్టం వాటిల్లుతుందని ఒవైసీ ఆందోళన వ్యక్తం చేశారు. ట్రంప్ టారిఫ్‌ల పెంపుపై ప్రధాని మోదీ మౌనంగా ఉండటాన్ని కూడా ఆయన తప్పుబట్టారు. మోదీ వైఖరి దారుణమన్నారు. -
దేశ ప్రయోజనాలను పరిరక్షిస్తాం
న్యూఢిల్లీ: అరడజను సార్లు అమెరికా, భారత ప్రతినిధులు భేటీ అయినా చర్చలు ఓ కొలిక్కిరాకపోవడంతో విసుగుచెందిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏకపక్షంగా, ఇష్టారీతిక విధించిన 25 శాతం దిగుమతి సుంకంపై భారతసర్కార్ పార్లమెంట్ సాక్షిగా స్పందించింది. భారతదేశ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తామని లోక్‌సభ, రాజ్యసభలో వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. నేటి నుంచి 25 శాతం టారిఫ్‌లతోపాటు పెనాల్టీలను భారత్‌పై మోపుతానని ట్రంప్ బుధవారం ప్రకటించిన నేపథ్యంలో గురువారం లోక్‌సభ, రాజ్యసభల్లో గోయల్ కీలక ప్రకటక చేశారు. ‘‘ హఠాత్తుగా ఏకపక్షంగా ట్రంప్ మనపై అదనపు టారిఫ్‌లను మోపారు. దీని దుష్ప్రభావాలపై విస్తృతస్తాయి అధ్యయనం చేస్తున్నాం. ఇందులోభాగంగా టారిఫ్‌ల భారం పడే రైతులు, ఎగుమతిదారులు, కార్మికులు, వ్యాపారులు, సూక్ష్మ,చిన్న,మధ్యతరహా పరిశ్రమలు, పలు పరిశ్రమల సమాఖ్యలు, సంఘాలతో మంతనాలు జరుపుతున్నాం. పెను ప్రభావం తాలూకు పరిణామాలపై విశ్లేషణ చేపడుతున్నాం. దేశ ప్రయోజనాలే పరమావధిగా పనిచేస్తున్నాం. పౌర ప్రయోజనాల పరిరక్షణకు పాటుపడతాం’’ అని గోయల్ అన్నారు. ‘‘ కేవలం దశాబ్దకాలంలోనే దుర్భల ఆర్థిక వ్యవస్థ నుంచి సుదృఢ ఆర్థికవ్యవస్థగా భారత్ అవతరించింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థగా భారత్ తయారైంది. 11వ అతిపెద్ద ఆర్థికవ్యవస్థ ర్యాంక్ నుంచి టాప్–5 ర్యాంక్‌లోకి భారత్ ఎగబాకింది. మన కర్షకులు, కార్మికులు, సూక్ష్మ,చిన్న, మధ్యతరహా పరిశ్రమల కృషి, మా ప్రభుత్వ పట్టుదల ఈ ప్రగతికి కారణం. భవిష్యత్తులో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం ఖాయం. ప్రపంచ తయారీరంగ హబ్‌గా భారత్‌ను తీర్చిదిద్దేందుకు గత దశాబ్దకాలంగా కృషిచేస్తున్నాం. మేక్ ఇన్ ఇండియా పథకం ద్వారా భారతీయ ఉత్పత్తుల గణనీయ పెరుగుదలకు పాటుపడ్డాం. నైపుణ్య మానవ వనరులు, యువత కారణంగానే భారతీయ పరిశ్రమల్లో పోటీతత్వం, నవకల్పనలు ఎక్కువయ్యాయి. గత 11 సంవత్సరాలుగా మన ఎగుమతులు పెరుగుతున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బ్రిటన్, ఆస్ట్రేలియాలతో భారత్ లాభదాయకమైన వాణిజ్య ఒప్పందాలు చేసుకుంది. రైతులు, భారత సాగు రంగం బాగు కోసం, ఆహార భద్రత కోసం ప్రభుత్వం పాటుపడుతోంది. ఇకమీదటా అదే పనిచేస్తాం. అమెరికా టారిఫ్‌ల అంశంలో భారత ప్రయోజనాలకు పణంగా పెట్టే ప్రసక్తే లేదు’’ అని గోయల్ వ్యాఖ్యానించారు.డెయిరీ విషయంలో మరింత అప్రమత్తంగా..డెయిరీ రంగానికి సంబంధించి ప్రభుత్వం ఇంతవరకూ ఏ దేశంతోనూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదర్చుకోలేదు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 70 కోట్ల జనాభా దేశ సాగురంగంపై ఆధారపడిన నేపథ్యంలో ఆహారభద్రత సంక్షోభంలో పడకుండా ప్రభుత్వం పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. అందులోభాగంగానే ఎలాంటి వాణిజ్య ఒప్పందం చేసుకున్నా సాగురంగంపై ప్రతికూల ప్రభావం పడకుండా ప్రభుత్వం ఓ కంట కనిపెడుతోంది. 2021–25 వాణిజ్యగణాంకాల ప్రకారం భారత్‌కు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. భారత్ నుంచి మొత్తం ఎగుమతుల్లో దాదాపు 18 శాతం ఎగుమతులు అమెరికాకే వెళ్తున్నాయి. -
25 శాతం సుంకాలు
ప్రభావాన్ని సమీక్షిస్తున్నాం: కేంద్రం భారత్‌పై 25 శాతం సుంకాల విధింపు, రష్యాతో వర్తకం చేస్తున్నందుకు జరిమానా ప్రకటన తాలూకు ప్రభావాన్ని మదింపు చేస్తున్నట్టు కేంద్రం పేర్కొంది. ఈ విషయంలో దేశ ప్రయోజనాలను కాపాడేందుకు అన్ని చర్యలూ తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘ఇరు దేశాలకూ ఆమోదనీయ, లాభదాయక రీతిలో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు కట్టుబడి ఉన్నాం. కొద్ది నెలలుగా ఆ దిశగాఅత్యున్నత స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి’’అని గుర్తు చేసింది. వీటిలో భాగంగా ఆరో రౌండ్ చర్చల నిమిత్తం అమెరికా బృందం ఆగస్టు 25న భారత్ రానుంది.వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై అనూహ్యంగా భారీ టారిఫ్ బాంబు విసిరారు. భారత దిగుమతులపై ఏకంగా 25 శాతం సుంకాలు బాదారు. అంతేగాక వీటికి అదనంగా రష్యాతో వర్తకం చేస్తున్నందుకు భారత్‌పై ప్రత్యేకంగా జరిమానా కూడా విధించనున్నట్టు పేర్కొన్నారు. ఆ మొత్తం ఎంత న్నది పేర్కొనలేదు. ఈ నిర్ణయాలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించారు. తన సోషల్ మీడియా హ్యాండిల్ ‘ట్రూత్ సోషల్’లో బుధవారం ఈ మేరకు ఆయన పలు పోస్టులు పెట్టారు. అమెరికాతో భారత వర్తక విధానాలు, నిబంధనలను అత్యంత దారుణమైనవిగా అభివర్ణించారు.‘‘భారత్ మా మిత్ర దేశమే. కానీ వర్తక, వాణిజ్య సంబంధాల విషయంలో ఆ దేశంతో అంతా సజావుగా లేదు. అమెరికాపై ప్రపంచంలోనే అత్యధిక టారిఫ్‌లు వసూలు చేస్తున్న దేశాల్లో భారత్ ఒకటి. అందుకే ఆ దేశంతో మేం భారీ స్థాయిలో వ్యాపారం చేయడం లేదు’’అని రాసుకొచ్చారు. భారత్‌తో అమెరికాకు భారీ వర్తక లోటు ఉందని గుర్తు చేశారు. రష్యా నుంచి భారీగా చమురు, ఆయుధాలు కొనుగోలు చేస్తున్నందుకే అదనంగా జరిమానా విధిస్తున్నట్టు స్పష్టం చేశారు. ‘‘ఉక్రెయిన్‌లో జనహననం ఆగాలని ప్రపంచమంతా ఆకాంక్షిస్తోంది. ఇలాంటి సమయంలో అందుకు పాల్పడుతున్న రష్యాతో భారత్ భారీ వాణిజ్య సంబంధాలు నెరుపుతోంది’’అంటూ ఆక్షేపించారు.అదే జరిగితే రష్యాతో వాణిజ్యం చేస్తున్నందుకు అమెరికా నుంచి జరిమానా ఎదుర్కోనున్న తొలి దేశం భారతే అవుతుంది. భారత్‌తో వర్తక ఒప్పందం నిమిత్తం అమెరికా బృందం ఆగస్టు 25 నుంచి భారత్‌లో పర్యటించనుందని కేంద్రం ప్రకటించిన మర్నాడే ట్రంప్ నుంచి అనూహ్యంగా సుంకాల పోటు నిర్ణయం వెలువడటం గమనార్హం. ఈ దెబ్బకు రూపాయి విలువ గత మూడేళ్లలో అత్యధికంగా బుధవారం ఏకంగా 89 పైసలు పతనమైంది. అమెరికా డిమాండ్లకు తలొగ్గేలా భారత్‌పై ఒత్తిడి పెంచడమే ట్రంప్ ప్రకటన ఉద్దేశమని భావిస్తున్నారు.ఇటీవలి కాలంలో జపాన్, బ్రిటన్, యూరోపియన్ యూనియన్‌పై కూడా ట్రంప్ ఇలాంటి ఒత్తిళ్లే తెచ్చి అమెరికాకు అనుకూలంగా ఒప్పందాలు కుదుర్చుకుందని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. గతంలో చైనాపై కూడా ఇలాగే ట్రంప్ అడ్డగోలుగా టారిఫ్‌లను ప్రకటించడం, చివరికి వెనక్కు తగ్గడం తెలిసిందే. భారత చమురు దిగుమతుల్లో కేవలం 0.2 శాతంగా ఉన్న రష్యా వాటా ఉక్రెయిన్‌తో ఆ దేశం యుద్ధానికి దిగిన అనంతరం ఏకంగా 35 నుంచి 40 శాతానికి పెరిగింది. అయితే ఇప్పటికీ రష్యా నుంచి అతి పెద్ద చమురు దిగుమతిదారుగా చైనాయే నిలుస్తోంది. ఆ దేశంపై మాత్రం ట్రంప్ ఎలాంటి జరిమానాలు విధించలేదు. ట్రంప్ సుంకాల నిర్ణయంపై భారత పరిశ్రమల రంగం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.ట్రంప్ ప్రకటించిన 25 శాతం సుంకాలు ఇప్పటికే అన్ని దేశాలతో పాటు భారత్‌పైనా అమల్లో ఉన్న 10 శాతం బేస్‌లైన్ టారిఫ్‌లకు అదనమా, కాదా అన్నదానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. అన్ని దేశాలపై 10 శాతం టారిఫ్ ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి వచి్చంది. దీనికి అదనంగా స్టీల్, అల్యుమినియం దిగుమతులపై 50 శాతం, ఆటో రంగంపై 25 శాతం అదనపు సుంకాలను కూడా ట్రంప్ విధించారు. ట్రంప్ ప్రకటన వెలువడ్డ కాసేపటికే కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్‌తో విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ భేటీ జరిపి పరిస్థితిని సమీక్షించారు. ఏప్రిల్‌లో 26 శాతం సుంకాలు భారత్‌తో వాణిజ్య ఒప్పందం ఖరారు కాలేదని మంగళవారమే ట్రంప్ మీడియాకు చెప్పడం తెలిసిందే. 25 శాతం టారిఫ్ విధించనున్నట్టు అప్పుడే ఆయన సంకేతాలిచ్చారు. 20 నుంచి 25 శాతం దాకా టారిఫ్‌లు విధిస్తారా అని మీడియా ప్రశ్నించగా, అలాగే భావిస్తున్నట్టు బదులిచ్చారు. గత ఏప్రిల్ 2న భారత్‌పై 26 శాతం టారిఫ్‌లను ట్రంప్ ప్రకటించారు. కొద్ది రోజులకే ఆ నిర్ణయం అమలును 90 రోజుల పాటు, అంటే జూలై 9 దాకా, అనంతరం ఆగస్టు 1 దాకా వాయిదా వేశారు. అమెరికా, భారత్ నడుమ వాణిజ్య ఒప్పందం నిమిత్తం అత్యున్నత స్థాయి బృందాల నడుమ ఇప్పటికే ఐదు రౌండ్ల పాటు చర్చలు జరిగాయి. అతి పెద్ద వాణిజ్య భాగస్వామి 2021–25 నడుమ భారత్‌కు అమెరికా అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలిచింది. భారత మొత్తం ఎగుమతుల్లో అమెరికా వాటా 18 శాతం. అమెరికాతో భారత్‌కు 2022–23లో 27.7 బిలియన్లు, 2023–24లో 35.32 బిలియన్లు, 2024–25లో 41 బిలియన్ డాలర్ల మేరకు వాణిజ్య మిగులు నమోదైంది. 2024–25లో భారత్, అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం 186 బిలియన్ డాలర్ల మేర నమోదైంది. వీటిలో భారత్ 86.5 బిలియన్ డాలర్ల మేర వస్తువులను ఎగుమతి చేయగా, 45.3 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను అమెరికా నుంచి దిగుమతి చేసుకుంది. సేవల రంగంలో అమెరికాకు 28.7 బిలియన్ డాలర్ల మేరకు ఎగుమతులు జరిపింది. 25.5 బిలియన్ డాలర్ల మేరకు దిగుమతులు చేసుకుంది.మొత్తమ్మీద అమెరికాతో వాణిజ్యంలో భారత్ 44.4 బిలియన్ డాలర్ల మిగులు నమోదు చేసింది. ఇది ట్రంప్‌కు కంటగింపుగా మారింది. అందుకే ఇలా పదేపదే టారిఫ్‌ల కత్తి దూస్తున్నారు. 2024లో అమెరికాకు భారత ఎగుమతుల్లో డ్రగ్ ఫార్మూలాలు–బయోలాజికల్స్ (8.1 బిలియన్లు), టెలికాం పరికరాలు (6.5 బిలియన్లు), అరుదైన రాళ్లు (5.3 బిలియన్లు) పెట్రోలియం ఉత్పత్తులు (4.1 బిలియన్లు), వాహనాలు–ఆటో పరికరాలు (2.8 బిలియన్లు), బంగారం–ఇతర లోహాలు (3.2 బిలియన్లు) రెడీమేడ్ దుస్తులు, కాటన్ తదితరాలు (2.8 బిలియన్లు) ఇనుము, స్టీల్ ఉత్పత్తులు (2.7 బిలియన్లు) ప్రధానమైనవి. అమెరికా నుంచి దిగుమతుల్లో ప్రధానంగా చమురు (4.5 బిలియన్లు), పెట్రో ఉత్పత్తులు (3.6 బిలియన్లు), బొగ్గు, కోక్ (3.4 బిలియన్లు), వజ్రాలు (2.6 బిలియన్లు), ఎలక్ట్రిక్ యంత్రాలు (1.4 బిలియన్లు), విమాన, రాకెట్ల విడిభాగాలు (1.3 బిలియన్లు), బంగారం (1.3 బిలియన్లు) ఉన్నాయి. మోదీతో ట్రంప్ స్నేహానికి ఇదీ ఫలం!: విపక్షాల ధ్వజం భారత్‌పై 25 శాతం టారిఫ్‌ల విధింపు మోదీ ప్రభుత్వ ఘోర వైఫల్యమేనంటూ విపక్షాలు దుయ్యబట్టాయి. మోదీతో స్నేహానికి ట్రంప్ ఏ మాత్రమూ విలువ ఇవ్వడం లేదనేందుకు ఇది తాజా నిదర్శనమని ఎద్దేవా చేశాయి. మోదీపై ట్రంప్ తారీఫ్ (పొగడ్తలు), హౌడీ మోడీ వంటి నినాదాలు ఎందుకూ కొరగానివని తేలిపోయిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఎక్స్‌లో పేర్కొన్నారు.భారత్–పాక్ యుద్ధాన్ని ఆపానని ట్రంప్ 30సార్లకు పైగా చెప్పుకున్నారు. పాక్ ఆర్మీ చీఫ్‌కు వైట్‌హౌస్‌లో ప్రత్యేక విందు ఇచ్చారు. ఐఎంఎఫ్ నుంచి భారీ ఆర్థిక సహాయ ప్యాకేజీ ఇప్పించారు. ఇన్ని చేస్తున్నా మౌనంగా భరిస్తే బహుశా ట్రంప్ నుంచి స్పెషల్ ట్రీట్మెంట్ లభిస్తుందని మోదీ ఆశపడ్డారు. కానీ అలా జరగలేదు’’అన్నారు. కాంగ్రెస్ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ నుంచి స్ఫూర్తి పొంది అమెరికా అధ్యక్షుని నిర్ణయాలను దీటుగా ఎదిరించాలని మోదీకి సూచించారు. టీఎంసీ, డీఎంకే, ఆర్జేడీ, వామపక్షాలు తదితరాలు కూడా మోదీ ప్రభుత్వానిది ఘోర వైఫల్యమంటూ నిందించాయి. ఇది భారత్‌కు తీవ్ర అవమానమని అభిప్రాయపడ్డాయి. -
భారత్‌పై అమెరికా సుంకాల మోత
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై సుంకాల మోత మోగించారు. భారత్‌పై 25శాతం సుంకాలే కాదు అదనంగా పెనాల్టీ విధించినట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై టారిఫ్ బాంబ్ పేల్చారు. అమెరికా కాలమాన ప్రకారం బుధవారం ఉదయం ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ఆట్వీట్‌లో భారత్‌పై టారిఫ్‌తో పాటు అదనంగా జరిమానా విధిస్తున్నట్లు తెలిపారు. ఈ సుంకం ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానుంది. భారత్ మాకు మిత్రుడే అయినప్పటికీ అత్యధిక దిగుమతి టారిఫ్‌లు, కఠినమైన ట్రేడ్ బారియర్లు ఉన్నాయని విమర్శించారు. భారత్.. రష్యా నుంచి భారీగా ఆయుధాలు, ఇంధనం కొనుగోలు చేస్తుంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో భారత్ నిర్ణయం హేయమైన చర్య’ అనే అభిప్రాయం వ్యక్తం చేశారు. భారత్ మా స్నేహ దేశమే. కానీ వారు ప్రపంచంలోనే అత్యధిక టారిఫ్‌లు విధిస్తున్న దేశాల్లో ఒకటి. రష్యా నుంచి ఆయుధాలు, ఇంధనం కొనుగోలు చేస్తున్నందుకు గాను 25శాతం టారిఫ్‌తో పాటు పెనాల్టీ కూడా చెల్లించాల్సిందేనని ట్రూత్ సోషల్ వేదికగా చేసిన ట్వీట్లో పేర్కొన్నారు. -
భారత్‌పై 25 శాతం సుంకాలు.. గడువుకు ముందే ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ సుంకాలపై ఆగస్టు ఒకటి వరకూ ఇచ్చిన గడువుకు ముందే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత్ తమకు మంచి మిత్రదేశమని, అయితే ఇదే భారత్ ఇతర దేశాల కంటే ఎక్కువ సుంకాలను వసూలు చేసిందని, కానీ తాము అలా చేయబోమని ట్రంప్ పేర్కొన్నారు. తన ఐదు రోజుల స్కాట్లాండ్ పర్యటన ముగించుకుని, వాషింగ్టన్కు తిరిగి వస్తూ, ఎయిర్ ఫోర్స్ వన్‌లో ట్రంప్ ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు.అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై తాము 20 శాతం నుండి 25 శాతం వరకూ సుంకం రేటు విధించే అవకాశాలున్నాయన్నారు. అయితే ఇందుకు ఆగస్టు ఒకటి వరకూ గడువు ఉందని, దీనికి ముందుగా ఇరు దేశాలు వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుపుతున్నందున తుది సుంకం ఇంకా ఖరారు కాలేదని ట్రంప్ పేర్కొన్నారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ దిగుమతులపై చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమయ్యింది. భారత్‌పై 20 నుంచి 25శాతం వరకు సుంకాలు విధించే యోచనలో ఉన్నట్టు ట్రంప్ సూచన ప్రాయంగా ప్రకటించారు. అమెరికా- భారత్ వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్న సమయంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. భారత్ దిగుమతులపై 25శాతం వరకు సుంకాలు విధిస్తారా? అని మీడియా అడిగినప్పుడు ఆయన ‘అలా అనుకుంటున్నాను’ అని సమాధానమిచ్చారు.రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ట్రంప్ అమెరికా ప్రయోజనాల కోసమంటూ ప్రపంచ దేశాలపై భారీ మొత్తంలో సుంకాలు విధించేందుకు ప్రయత్నిస్తున్నారు. తొలుత సుంకాల విధింపునకు 2025 ఏప్రిల్ 2 తుది గడువు పెట్టారు. ఆ సమయంలోపు తమతో ఒప్పందం కుదుర్చుకోవాలన్నారు. ఆ తరువాత ఈ గడువును జూలై 9కి మార్చారు. అనంతరం దానిని ఆగస్ట్ ఒకటి వరకూ పొడిగించారు. కాగా అమెరికా.. యూకే, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, యూరోపియన్ యూనియన్, జపాన్‌లతో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. భారత్‌తో ఇంకా ఎలాంటి ఒప్పందం నిర్ణయం కాలేదు. -
బీఎస్ఎన్ఎల్ టారిప్‌లపై కీలక ప్రకటన
ప్రభుత్వ రంగ టెలికాం ఆపరేటర్ బీఎస్ఎన్ఎల్ టారిఫ్‌లను పెంచే యోచన లేదని కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. భారతదేశం అంతటా 4జీ వినియోగదారుల సంఖ్యను పెంచుకోవడంపై దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. బీఎస్ఎన్ఎల్ త్వరలో టారిఫ్‌లను పెంచబోతుందనే వాదనలను తోసిపుచ్చుతూ మంత్రి ఈమేరకు స్పష్టత ఇచ్చారు. కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ చీఫ్ జనరల్ మేనేజర్లు (సీజీఎంలు) పాల్గొన్నారు.బీఎస్ఎన్ఎల్ ఎప్పటినుంచో 2జీ, 3జీ నెట్‌వర్క్‌ల్లో వాడుతున్న పాత చైనీస్ పరికరాలను స్వదేశీ 4జీ మౌలిక సదుపాయాలతో భర్తీ చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు మంత్రి పెమ్మసాని చెప్పారు. అయితే, ఎప్పటిలోపు దీన్ని పూర్తి చేస్తారో నిర్దిష్ట కాలపరిమితి తెలపలేదు. బీఎస్ఎన్ఎల్ 2జీ, 3జీ సేవలను దశలవారీగా నిలిపివేస్తున్నప్పటికీ, 5జీకి మారే ప్రణాళికలు మాత్రం ప్రస్తుతానికి లేవనే సంకేతాలు వెలువడుతున్నాయి.బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు ప్రస్తుతం 4జీ సరిపోతుందని మంత్రి అన్నారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా 4జీ నెట్‌వర్క్‌ను అందించడమే ప్రస్తుత ప్రాధాన్యమని పెమ్మసాని తెలిపారు. ఇతర టెల్కోల్లో 75 శాతం మంది వినియోగదారుల అవసరాలను 4జీ తీరుస్తుందన్నారు. స్వదేశీ 5జీ కోర్, అందుకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నాయని, ఆర్థికంగా లాభదాయకంగా ఉన్నప్పుడే ఈ విషయంలో ముందుకెళ్తామన్నారు.మొబైల్ కస్టమర్ గ్రోత్, ఏఆర్పీయూ, ఫిక్స్డ్ వైర్లెస్ వంటి విభాగాల్లో ప్రతి సర్కిల్‌కు లక్ష్యాలు కేటాయించినట్లు చెప్పారు. ఏటా 20-30 శాతం ఆదాయ వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. బీఎస్ఎన్ఎల్ 1,00,000 స్వదేశీ 4జీ టవర్లను ఏర్పాటు చేసిందని, వీటి ఇంటిగ్రేషన్ ప్రక్రియ సవాలుతో కూడుకున్నదని మంత్రి అన్నారు. నోకియా, ఎరిక్సన్ వంటి గ్లోబల్ కంపెనీలకు తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడానికి దశాబ్దాలు పట్టిందని, కానీ బీఎస్ఎన్ఎల్ కేవలం 2–3 ఏళ్లలోనే 90–95% సమస్యలను పరిష్కరించిందని తెలిపారు.ఇదీ చదవండి: క్లెయిమ్ చేయని డిపాజిట్లు రూ.67వేల కోట్లుమౌలిక సదుపాయాలను వేగవంతం చేయడం, పౌర కేంద్రీకృత సేవల పంపిణీని మెరుగుపరచడం, భారత టెలికాం రంగంలో బీఎస్ఎన్ఎల్ వ్యూహాత్మక పాత్రను బలోపేతం చేయడంపై ఈ సమావేశం దృష్టి సారించిందని కేంద్రమంత్రి సింథియా చెప్పారు. కంపెనీ పరివర్తనను ఆయన ప్రశంసించారు. కస్టమర్ అనుభవం, ఆదాయ సృష్టిలో గణనీయమైన మెరుగుదల అవసరాన్ని నొక్కి చెప్పారు. -
జపాన్, దక్షిణకొరియాపై 25 శాతం సుంకాలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి టారిఫ్ రగడకు తెర తీశారు. జపాన్, దక్షిణ కొరియా ఉత్పత్తులపై 25 శాతం సుంకాలు విధించనున్నట్టు ప్రకటించారు. ఈ నిర్ణయం ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తుందని ట్రూత్ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. అంతేగాక జపాన్ ప్రధాని షిగెరు ఇషిబా, దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్‌కు ఈ మేరకు స్వయంగా లేఖలు కూడా రాశారు. ప్రతీకార సుంకాలకు దిగితే ఆ దేశాలపై టారిఫ్‌లు ఆ మేరకు పెరుగుతాయని అందులో ట్రంప్ హెచ్చరించారు! ఆ లేఖల స్క్రీన్షాట్లను ట్రూత్ సోషల్‌లో షేర్ చేశారు. జపాన్, దక్షిణకొరియాపై 25 శాతం టారిఫ్ నిజానికి చాలా తక్కువేనంటూ వాపోయారు. ‘‘ఇవి తుది టారిఫ్‌లు కావు. మీ దేశంతో మా సంబంధాలను బట్టి అంతిమంగా పెరగవచ్చు, తగ్గనూ వచ్చు’’ అన్నారు. టారిఫ్ పెంపుపై భారత్‌తో పాటు పలు ఇతర దేశాలకు కూడా ట్రంప్ లేఖాస్త్రాలు సంధిస్తున్నట్టు సమాచారం. మస్క్ కొత్త పార్టీ ప్రకటనపై ట్రంప్ ఎద్దేవా న్యూయార్క్: ‘అమెరికన్ పార్టీ’ పేరిట కొత్త పార్టీ పెడతానన్న ఎలాన్ మస్క్ ప్రకటనను హాస్యాస్పదంగా ట్రంప్ సోమవారం అభివర్ణించారు. ‘‘అమెరికాలో ఎన్నో ఏళ్లుగా రెండు పారీ్టలతోనే రాజకీయ వ్యవస్థ నడుస్తోంది. ఇప్పుడు మూడో పార్టీని తీసుకురావడమంటే గందరగోళాన్ని సృష్టించడమే’’ అని అన్నారు. తర్వాత తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లోనూ మస్‌్కను విమర్శిస్తూ ట్రంప్ పోస్ట్‌లు పెట్టారు. ‘‘కొన్ని వారాల క్రితం మా స్నేహ రైలుబండ్లు ఢీకొన్నాయి. ఇప్పుడు మస్క్ పూర్తిగా పట్టాలు తప్పారు. అమెరికాలో మూడో పార్టీ ఏదీ అద్భుతాలు చేయలేదన్న చేదు నిజం తెల్సికూడా మస్క్ కొత్త పార్టీ పెడతానంటున్నాడు. సక్రమంగా ఉన్న రాజకీయ వ్యవస్థను చిన్నాభిన్నం చేయడానికి తప్ప మూడోపార్టీ ఎందుకూ పనికిరాదు’’ అని వ్యాఖ్యానించారు. -
బ్రిక్స్‌కు మద్దతిచ్చే దేశాలపై 10% అదనపు సుంకాలు: ట్రంప్
వాషింగ్టన్/బీజింగ్: బ్రిక్స్ కూటమివి అమెరికా వ్యతిరేక విధానాలని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. ఆ కూటమికి మద్దతిచ్చే ఏ దేశమైనా తమనుంచి 10 శాతం అదనపు సుంకాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని సోమవారం హెచ్చరించారు. ‘‘బ్రిక్స్ అమెరికా వ్యతిరేక విధానాలతో జతకట్టే ఏ దేశం మీదైనా అదనంగా 10% సుంకం విధిస్తాం. ఈ విషయంలో ఎలాంటి మినహాయింపులూ ఉండవు’’ అని ట్రూత్ సోషల్‌లో పేర్కొన్నారు. కొత్త టారిఫ్ నియమాలు, సవరించిన వాణిజ్య ఒప్పంద నిబంధనలను వివరిస్తూ ఆయా దేశాలకు తక్షణం అధికారిక లేఖలు పంపుతున్నట్టు ప్రత్యేక పోస్టులో తెలిపారు. ట్రంప్ ప్రకటనను చైనా తీవ్రంగా ఖండించింది. ఇతర దేశాలపై ఒత్తిడి తెచ్చేందుకు ఇలా సుంకాలను ఆయుధంగా వాడటం దారుణమని మండిపడింది. ఇది ఎవరికీ లాభం చేయబోదని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ అన్నారు. ‘‘అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య సహకారానికి బ్రిక్స్ ఒక వేదిక. అది ఏ దేశానికీ వ్యతిరేకంగానో, లక్ష్యంగానో లేదు’’ అని స్పష్టం చేశారు.ఖండించిన రియో డిక్లరేషన్బ్రెజిల్లోని రియోడి జనీరోలో జరిగిన బ్రిక్స్ తాజా శిఖరాగ్ర సమావేశం అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలకు కేంద్ర బిందువుగా మారింది. ట్రంప్ సుంకాల విధానాలను బ్రిక్స్ దేశాధినేతలు తీవ్రంగా విమర్శించారు. ‘రియో డి జనీరో డిక్లరేషన్’లో ఈ మేరకు స్పష్టంగా పేర్కొన్నారు. ‘‘సుంకాలను విచక్షణారహితంగా పెంచడం ప్రపంచ వాణిజ్యాన్ని దెబ్బతీసి మరింత తగ్గించే ప్రమాదముంది. ప్రపంచ సరఫరా గొలుసులను దెబ్బతీస్తుంది. అంతర్జాతీయ ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాల్లో అనిశ్చితికి కారణమవుతుంది’’ అని పేర్కొన్నారు. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) నియమాల ఆధారిత, బహిరంగ, పారదర్శక, న్యాయమైన, సమానమైన బహుపాక్షిక వాణిజ్య వ్యవస్థకు తమ మద్దతును పునరుద్ఘాటించారు. అనంతరం దీనిపై ట్రంప్ మరోసారి తీవ్రంగా ప్రతిస్పందించారు. అమెరికా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న దేశాలపై 10% అదనపు సుంకాలు తప్పవని పునరుద్ఘాటించారు. భారత్‌తో సహా అనేక దేశాల దిగుమతులపై అదనపు సుంకాలను ప్రకటించిన ట్రంప్ తర్వాత వాటి అమలును 90 రోజుల పాటు నిలిపేయడం తెలిసిందే. ఆ గడువు జూలై 9తో ముగుస్తుంది. తదనంతరం అమెరికా మార్కెట్లోకి ప్రవేశించే భారత వస్తువులపై అదనంగా 26 శాతం దిగుమతి సుంకం పడుతుంది. ప్రస్తుత సుంకాల బెదిరింపులతో ఆ భారాన్ని మరింత పెంచనుంది. -
అమెరికాకు ఎగుమతులు 35 శాతం పతనం: చైనా
బీజింగ్: అమెరికా–చైనా మధ్య వాణిజ్యంలో అనిశ్చితి నెలకొంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మే నెలలో అమెరికాకు ఎగుమతులు 35 శాతం పడిపోయినట్లు చైనా వెల్లడించింది. ఈ ఎగుమతుల విలువ 28.8 బిలియన్ డాలర్లు. గత ఏడాది మే నెలలో ఎగుమతుల విలువ 44 బిలియన్ డాలర్లుగా ఉంది. మరోవైపు అమెరికా–చైనా మధ్య వాణిజ్య చర్చలకు రంగం సిద్ధమవుతోంది. అతిత్వరలో లండన్‌లో ఈ చర్చలు జరుగనున్నట్లు తెలుస్తోంది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా అధికారంలోకి వచ్చిన తర్వాత చైనా ఉత్పత్తులపై భారీగా సుంకాలు పెంచిన సంగతి తెలిసిందే. -
అమెరికా రెట్టింపు సుంకాలతో భారత్‌పై తీవ్ర ప్రభావం: జీటీఆర్ఐ
న్యూఢిల్లీ: స్టీల్, అల్యూమినియంపై అమెరికా సుంకాలను రెట్టింపు చేయడంతో భారతీయ ఎగుమతులు ప్రభావితం అవుతాయని ఆర్థిక మేధోసంస్థ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్(జీటీఆర్ఐ) తెలిపింది. ముఖ్యంగా వాల్యూ యాడెడ్, ఫినిష్డ్ స్టీల్ ఉత్పత్తులు, ఆటో విడిభాగాల రంగాలపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. యూఎస్ స్టీల్ పరిశ్రమ మనుగడ దృష్ట్యా తమ దేశంలోకి దిగుమతి అవుతున్న స్టీల్, అల్యూమినియంపై ప్రస్తుతం ఉన్న 25% టారిఫ్‌ను 50 శాతానికి పెంచుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ మే 30న ప్రకటించారు. సుంకాల పెంపు జూన్ 4 నుంచి అమల్లోకి వస్తాయన్నారు ‘‘భారత్‌పై సుంకాల పెంపు పరిణామం ప్రత్యక్షంగా ఉంటుంది. ట్రంప్ నిర్ణయంపై భారత ప్రభుత్వం అమెరికా అధికారులతో ద్వైపాక్షిక చర్చలు జరపాలి. ఈ సుంకాలకు ప్రతిస్పందనగా అమెరికా ఎగుమతులపై భారత్ ప్రతీకార సుంకాలను విధిస్తుందో లేదో చూడాలి’’ అని జీఆర్‌టీఐ వ్యవస్థాపకులు అజయ్ శ్రీవాస్తవ తెలిపారు. గతంలో విధించిన ఉక్కు సుంకాలకు ప్రతిస్పందనగా అమెరికా ఎగుమతులపై ప్రతీకార సుంకాలను విధించే ఉద్దేశాన్ని సూచిస్తూ భారత్ ఇప్పటికే ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్యూటీఓ)లో అధికారిక నోటీసు జారీ చేసింది. భారత్ 2024–25లో 4.56 బిలియన్ డాలర్ల విలువైన ఇనుము, ఉక్కు మరియు అల్యూమినియం ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేసింది. వీటిలో 587.5 మిలియన్ డాలర్ల ఇనుము, ఉక్కు, 3.1 బిలియన్ డాలర్లు ఇనుము లేదా ఉక్కు ఉత్పత్తులు, 860 మిలియన్ డాలర్లు అల్యూమినియం సంబంధిత ఉత్పత్తులున్నాయి. ధరల పోటీతత్వం తగ్గుతుంది: ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ ఎస్సీ రల్హాన్ భారతీయ స్టీల్ ఎగుమతులైన స్టెయిన్లెస్ స్టీల్ పైపులు, స్ట్రక్చరల్ స్టీల్ విడిభాగాలు, ఆటోమోటివ్ స్టీల్ భాగాలైన సెమీ ఫినిష్డ్, ఫినిష్ట్ ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం చూపుందని భారత ఎగుమతి సంస్థల సమాఖ్య (ఎఫ్ఐఈవో) అధ్యక్షుడు ఎస్సీ రాల్హన్ తెలిపారు. అధిక పన్నులు అమెరికా మార్కెట్లో ధరల పోటీతత్వాన్ని తగ్గించడంతో పాటు ప్రపంచ వాణిజ్యం, తయారీ సప్లై చైన్‌ను నిరాశపరుస్తాయన్నారు. -
ఉక్కు, అల్యూమినియంపై 50% సుంకం
పెన్సిల్వేనియా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు. తమ దేశంలో ఉక్కు పరిశ్రమను కాపాడుకుంటామని, ఇందుకోసం విదేశీ ఉక్కుపై సుంకాన్ని రెండు రెట్లు చేస్తామని అన్నారు. ఆయన శుక్రవారం పిట్స్‌బర్గ్‌లో ఇర్వీన్ స్టీల్ ప్లాంట్ కార్మికులతో మాట్లాడారు. విదేశాల నుంచి దిగుమతి అయ్యే ఉక్కుపై 50% టారిఫ్ విధించనున్నట్లు చెప్పారు.జపాన్‌కు చెందిన నిప్పన్ స్టీల్ సంస్థ అమెరికా స్టీల్ కంపెనీలో పెట్టుబడులు పెట్టబోతోందని, దీనిపై ఒప్పందం కుదిరిందని చెప్పారు. విదేశీ అల్యూమినియంపైనా టారిఫ్‌ను 50 శాతానికి పెంచనున్నట్లు ట్రంప్ తేల్చిచెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. స్టీల్‌తోపాటు అల్యూమినియంపై పెరిగిన టారిఫ్‌లు బుధవారం నుంచే అమల్లోకి వస్తాయని వెల్లడించారు. ఇదిలా ఉండగా, టారిఫ్‌ల పెంపుల వల్ల అమెరికాలో స్టీల్, అల్యూమినియం ధరలు విపరీతంగా పెరిగిపోతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. గృహ నిర్మాణం మరింత భారం కానుంది. ట్రంప్ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ఉక్కు ధరలు ఇప్పటికే 16%పెరిగిపోయాయి. అమెరికా తనకు అవసరమైన స్టీల్, అల్యూమినియంను ఎక్కువగా విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటోంది. మరోవైపు భారత్–పాకిస్తాన్ ఘర్షణలపై ట్రంప్ తన నోటి దురుసు ఆపడం లేదు. రెండు దేశాల అణుయుద్ధం జరిగే పరిస్థితిని నివారించినందుకు గర్వపడుతున్నానని మరోసారి చెప్పారు. కాల్పుల విరమణ వెనుక ట్రంప్ ప్రమేయం లేదని భారత్ పదేపదే చెబుతున్నా ఆయన పట్టించుకోవడం లేదు. -
ట్రంప్ టారిఫ్‌లకు బ్రేక్
వాషింగ్టన్: సర్వంసహాధిపత్యం కోసం ప్రపంచదేశాలపై టారిఫ్‌ల కొరడాను ఝలిపిస్తున్న అగ్రరాజ్యాధినేత ట్రంప్‌కు అమెరికా ఫెడరల్ కోర్టు పగ్గాలువేసింది. యుద్ధంలాంటి అసాధారణ పరిస్థితులులేకపోయినా ఇష్టారీతిగా ప్రపంచదేశాలపై అధిక టారిఫ్‌ల భారం మోపడం చట్టప్రకారం కుదరని న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే మన్‌హాట్టన్ ‘యూఎస్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్’ స్పష్టం చేసింది. ట్రంప్ వివిధ దేశాలపై అధిక టారిఫ్‌లు విధిస్తూ తీసుకున్న నిర్ణయాలను నిలుపుదలచేస్తూ జడ్జీలు తిమోథీ రెయిఫ్, జేన్ రెస్తానీ, గ్యారీ కట్జ్మన్ల ధర్మాసనం బధవారం రాత్రి సంచలనాత్మక తీర్పును వెలువరించింది. విమోచనం దినం అంటూ దేశ చట్టాలను ట్రంప్ తన పరిధిదాటి ప్రయోగించారని న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. 10 రోజుల్లోపు తీర్పులోని అంశాలను సంపూర్ణంగా అమలుచేయాలని ట్రంప్ యంత్రాంగానికి న్యాయస్థానం సూచించింది. దీంతో చైనాపై 30 శాతం అదనపు టారిఫ్, మెక్సికో, కెనడాలపై 25 శాతం టారిఫ్ అమలు నిలిచిపోనుంది. అయితే వాణిజ్య విస్తరణ చట్టంలోని సెక్షన్ 232 ప్రకారం కార్లు, ఆటోరంగ విడిభాగాలు, స్టీల్, అల్యూమినియం తదితరాలపై విధించిన 25 శాతం టారిఫ్ మాత్రం కొనసాగనుంది. కోర్టు తీర్పులో ఏముంది?‘‘1977నాటి అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాల (ఐఈఈపీఏ) చట్టం ప్రకారం తనకు దఖలుపడిన అధికారాలను మించి మరీ అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచదేశాలపై అధిక టారిఫ్‌లను విధిస్తూ నిర్ణయాలు తీసుకున్నారు. జాతీయ భద్రతకు ముప్పు వంటి అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే అత్యయిక అధికారాలను ప్రయోగించాలి. వాస్తవానికి అత్యయిక అధికారాలను టారిఫ్‌ల కోసం ఉపయోగించకూడదు. వాణిజ్యలోటు అనేది ఏరకంగానూ అత్యయిక స్థితి అనిపించుకోదు. ప్రపంచదేశాల మాదిరిగానే అమెరికా సైతం గత 49 సంవత్సరాలుగా వరసగా వాణిజ్యలోటును చవిచూస్తోంది. హఠాత్తుగా వాణిజ్యలోటును సాకుగా చూపి అత్యయిక అధికారాలను ఇలా టారిఫ్‌ల విధింపు కోసం దుర్వినియోగం చేయకూడదు. అత్యయిక అధికారాలను అధ్యక్షుడు ఏకపక్షంగా తీసుకోకూడదు. అపరిమితంగా టారిఫ్‌ల విధింపు అధికారాన్ని ప్రదర్శించి అధ్యక్షుడు రాజ్యాంగంలోని ఇతర ప్రధానాంగాల అధికారాన్ని ఉద్దేశపూర్వకంగా లాక్కున్నారు. ఇది రాజ్యాంగవిరుద్దం. అధ్యక్షుడి ధోరణి మేం ఏమాత్రం అనుమతించబోం. ఆర్థిక సంక్షోభాలొచ్చినా అధ్యక్షుడు రాజ్యాంగానికి లోబడే నిర్ణయాలు తీసుకోవాలి. ఏప్రిల్ రెండో తేదీన అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలను నిలుపుదలచేస్తున్నాం’’ అని న్యాయమూర్తులు స్పష్టంచేశారు.ప్రభుత్వ వాదనలు బుట్టదాఖలువిదేశాలకు తరలిపోయిన ఫ్యాక్టరీలు, కంపెనీల్లో ఉద్యోగాలను తిరిగి అమెరికాకు రప్పించేందుకే టారిఫ్‌ల అస్త్రాన్ని వాడుకున్నట్లు పదేపదే ట్రంప్ యంత్రాంగం చేసిన వాదనను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. దేశ వాణిజ్యలోటు జాతీయ అత్యయిక స్థితిగా తయారవడంతో అమెరికాకు అనుకూలంగా వాణిజ్య నిర్ణయాలు తీసుకునేలా ఆయా దేశాలను భయపెట్టేందుకు, ఒప్పించేందుకు టారిఫ్‌ల ఆయుధాన్ని ఉపయోగించామని ప్రభుత్వంచేసిన వాదనను న్యాయస్థానం పట్టించుకోలేదు. 1971లోనూ నాటి అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ ఇలా టారిఫ్‌లపై అత్యయిక అధికారాలను ఉపయోగించారు. ఈ అధికారాలను సవాల్‌చేసే అధికారం కోర్టులకు లేదని, కేవలం పార్లమెంట్ మాత్రమే ప్రశ్నించగలదని ట్రంప్ సర్కార్ చేసిన వాదనను కోర్టు తిరస్కరించింది. తీర్పు తర్వాత వైట్‌హౌస్ అధికార ప్రతినిధి కుశ్ దేశాయ్ మాట్లాడారు. ‘‘ వాణిజ్యలోటు వంటి ఎమర్జెన్సీ పరిస్థితిని ఎలా చక్కబెట్టాలో నిర్ణయించాల్సింది ఇలాంటి జడ్జీలుకాదు. అదనపు పన్నులు విధించేందుకు ప్రభుత్వం తనకున్న ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోదు. ఎలాగైనా పన్నులు కొనసాగేలా చేసి దేశ వాణిజ్యలోటును తగ్గిస్తాం. మళ్లీ అమెరికాను గొప్పదానిలా మారుస్తాం’’ అని అన్నారు. అయితే కోర్టు తీర్పును గౌరవించి ట్రంప్ ప్రభుత్వం ఈ కొత్త టారిఫ్‌ల అమలును నిలుపుదల చేస్తుందా లేదా అనేది తేలాల్సి ఉంది. తీర్పును వెనువెంటనే ప్రభుత్వం వాషింగ్టన్ డీసీలోని ‘యూఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ ఫర్ ది ఫెడరల్ సర్క్యూట్’ కోర్టులో సవాల్‌చేసింది. బుధవారం తీర్పు చెప్పిన జడ్జీ తిమోధీని ట్రంప్, జడ్జీ రెస్తానీని నాటి అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్, జడ్జీ గ్యారీని నాటి అధ్యక్షుడు బరాక్ ఒబామా నియమించారు.ప్రభుత్వం ఇప్పుడేం చేయొచ్చు?తీర్పు అమలుకు కోర్టు 10 రోజుల గడువు ఇచ్చినందున ఈలోపు పైకోర్టు లో కేసు వాదనకు వచ్చేలాచేసి తీర్పు అమలుకాకుండా నిలుపుదల కోరొచ్చు. లేదంటే ఇప్పటికే అదనంగా వసూలుచేసిన టారిఫ్‌లను అమెరికా తిరిగి ఆయా దేశాలకు వడ్డీ కలిపిమరీ ఇచ్చేయాల్సి ఉంటుంది. తీర్పులో ట్రంప్ ప్రభుత్వానికి ఒక వెసులుబాటు ఇచ్చింది. నిజంగానే దేశం అత్యంత క్లిష్టమైన వాణిజ్యలోటును ఎదుర్కొంటుంటే 1974నాటి వాణిజ్యచట్టంలోని సెక్షన్ 122 ప్రకారం అధ్యక్షుడు తనకు దఖలు పడిన అసాధారణ అధికారాలతో విదేశాలపై 15 శాతం వరకు అదనపు టారిఫ్‌లు విధంచవచ్చు. అయితే అవి తాత్కాలికమే. గరిష్టంగా 150 రోజులపాటు మాత్రమే ఈ అదనపు టారిఫ్‌లు అమలవుతాయి. 1977నాటి అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాల చట్టం పాచిక పారని కారణంగా ఈసారి వాణిజ్య చట్టం,1974 సెక్షన్ కింద టారిఫ్‌లు విధించాలని ట్రంప్ కొత్త ఎత్తుగడ వేయనున్నట్లు తెలుస్తోంది. -
అమెరికా–చైనా టారిఫ్ డీల్...
న్యూఢిల్లీ: టారిఫ్‌ల పెంపును 90 రోజుల పాటు నిలిపివేయాలన్న అమెరికా, చైనా నిర్ణయంతో భారత్‌కు సవాళ్లు ఉన్నప్పటికీ, నిర్దిష్ట వ్యాపార అవకాశాలు కూడా ఉంటాయని ఎగుమతిదారులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గడమనేది అంతర్జాతీయంగా వాణిజ్య స్థిరత్వానికి సానుకూలాంశమని ఎగుమతి సంస్థల సమాఖ్య ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ ఎస్సీ రాల్హన్ తెలిపారు. టారిఫ్‌ల తగ్గింపు వల్ల, ఎల్రక్టానిక్స్, మెషినరీ, రసాయనాలు వంటి అధిక విలువ చేసే ఉత్పత్తులకు సంబంధించి అమెరి–చైనా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ఎగియవచ్చని ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ పరిణామంతో భారత ఎగుమతిదార్లకు సవాళ్లు ఎదురుకావచ్చన్నారు. అమెరికా–చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇటీవలి కాలంలో ఆగ్నేయాసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలాంటి మార్కెట్లో చొచ్చుకుపోయిన భారత ఎగుమతిదార్లకు పోటీ పెరగవచ్చని రాల్హన్ చెప్పారు. కానీ, ఆ రెండు దేశాల వాణిజ్య పరిధిలోకి రాని ఇతర రంగాలపై మరింతగా దృష్టి పెట్టేందుకు అవకాశం లభించగలదన్నారు. ఫార్మా ఏపీఐలు, ఐటీ ఆధారిత సరీ్వసులు, రత్నాభరణాలు, ఇంజినీరింగ్ ఉత్పత్తులు, ఆర్గానిక్ రసాయనాల్లాంటి ఎగుమతులను పటిష్టపర్చుకోవచ్చని రాల్హన్ చెప్పారు. విశ్వసనీయమైన ప్రత్యామ్నాయ సరఫరాదారుగా ఉంటుందనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ వాణిజ్యంలో మరింత ప్రాధాన్యం దక్కేలా అమెరికాతో భారత్ క్రియాశీలకంగా సంప్రదింపులు జరపడం శ్రేయస్కరమని ఆయన పేర్కొన్నారు. అలాగే టారిఫ్‌ల తగ్గింపనేది తాత్కాలికమే కావడం వల్ల భవిష్యత్తులో సమస్యలు ఎదురవకుండా హెడ్జింగ్ చేసుకునేందుకు కంపెనీలు పీఎల్ఐ (ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు) స్కీమ్, మేకిన్ ఇండియా కార్యక్రమం కింద భారత్‌లో ఉత్పత్తిని పెంచుకునేందుకు మొగ్గు చూపవచ్చని రాల్హన్ చెప్పారు. చైనా నుంచి భారత్‌లోకి దిగుమతులు వెల్లువలా వచి్చపడకుండా ప్రభుత్వం ఓ కన్నేసి ఉంచాలని మరో ఎగుమతిదారు చెప్పారు. వ్యయాలు తగ్గించుకోవాలి.. మన ఎగుమతులపై అమెరికాలో సుంకాల రేటు చైనాతో పోలిస్తే తక్కువే ఉన్నప్పటికీ.. వ్యత్యాసం గణనీయంగా తగ్గిపోతోందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ వ్యాఖ్యానించారు. కొద్ది రోజుల క్రితమే చైనా ఉత్పత్తులపై అమెరికా 145 శాతం టారిఫ్‌లు విధించినప్పుడు 10 శాతం శ్లాబ్‌లో ఉన్న భారత్ వైపు మొగ్గు ఎక్కువగా కనిపించిందని పేర్కొన్నారు. ప్రస్తుత 30 శాతంతో పోల్చినప్పుడు మనం ఇంకా మెరుగైన స్థితిలో ఉన్నప్పటికీ.. గతంలో ఉన్నంత ప్రయోజనం ఉండదని శ్రీవాస్తవ చెప్పారు. టారిఫ్‌లను ప్రతిపాదిత 26 శాతానికి పెంచకుండా, 10 శాతం స్థాయిలోనే కొనసాగించేలా అమెరికాతో సంప్రదింపుల ద్వారా భారత్ స్మార్ట్ డీల్ కుదుర్చుకునేందుకు ప్రయతి్నంచాలని ఆయన సూచించారు. వాణిజ్య విధానానికే పరిమితం కాకుండా భారత్ అత్యవసరంగా ఉత్పత్తి వ్యయాలను తగ్గించుకోవాలని, లాజిస్టిక్స్‌ను ప్రక్షాళన చేయాలని, నిబంధనలు అంచనాలకు అందే విధంగా ఉండేలా విధానాలను మెరుగుపర్చుకోవాలని పేర్కొన్నారు. వాణిజ్య వివాదాలను పరిష్కరించుకోవడంపై సంప్రదింపులు జరుగుతున్నందున 90 రోజుల పాటు చాలా మటుకు సుంకాలను గణనీయంగా తగ్గించుకునేందుకు అమెరికా, చైనా అంగీకారానికి వచ్చాయి.ఫార్మా రేట్ల కోతతో భారత్‌పై ఒత్తిడి: జీటీఆర్ఐప్రి్రస్కిప్షన్ ఔషధాల రేట్లను 30–80 శాతం వరకు తగ్గించాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రణాళికలతో అంతర్జాతీయంగా ఫార్మా రేట్లలో మార్పులు చోటు చేసుకుంటాయని జీటీఆర్ఐ తెలిపింది. అమెరికాలో వాటిల్లే నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు ఫార్మా సంస్థలు ఇతర దేశాల్లో తాము ధరలు పెంచుకునేందుకు ప్రయతి్నస్తాయని పేర్కొంది. ఇందుకోసం పేటెంట్ చట్టాలను మార్చే విధంగా భారత్‌లాంటి దేశాలపై ఒత్తిడి తేవొచ్చని జీటీఆర్ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ తెలిపారు. ప్రపంచానికి చౌకగా ఔషధాలను అందించేందుకు ఉపయోగపడుతున్న తన పేటెంట్ చట్టాల విషయంలో ఎలాంటి ఒత్తిళ్లకు లొంగరాదని సూచించారు. మన జనరిక్స్‌పై ప్రపంచం ఆధారపడి ఉన్న నేపథ్యంలో ఈ మోడల్‌ను పరిరక్షించడమనేది భారత్‌కి ప్రయోజనం చేకూర్చడమే కాకుండా, ప్రపంచానికి కూడా అవసరమని వివరించారు. -
ఆటో విడిభాగాలకు టారిఫ్‌ల సెగ
న్యూఢిల్లీ: టారిఫ్‌ల వల్ల ఎగుమతులు మందగించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరం ఆటో విడిభాగాల తయారీ సంస్థల ఆదాయాలు సుమారు రూ. 4,500 కోట్ల మేర క్షీణించవచ్చని రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. 2024 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ. 3 లక్షల కోట్లుగా పరిశ్రమ ఆదాయం నమోదైందని, ఒకవేళ టారిఫ్‌ల వివాదం వల్ల అమెరికాకు ఎగుమతులు మధ్యస్త–గరిష్ట సింగిల్ డిజిట్ స్థాయిలో క్షీణించిన పక్షంలో 2025–26లో ఆదాయ వృద్ధి 6–8 శాతానికి పరిమితం కావచ్చని పేర్కొంది. గతంలో ఇది 8–10 శాతంగా ఉండొచ్చని ఇక్రా అంచనా వేసింది. భారీ టారిఫ్‌ల వల్ల సరఫరా వ్యవస్థపై అదనంగా రూ. 9,000 కోట్ల భారం పడుతుందని, దీన్ని అమెరికా వినియోగదారులు, అక్కడి దిగుమతిదారులు, భారతీయ ఎగుమతిదారులు భరించాల్సి వస్తుందని వివరించింది. సరఫరాదారు ప్రాధాన్యత, పోటీ, సాంకేతిక ప్రాధాన్యత అంశాలను బట్టి వారు ఎంత మేర భారాన్ని బదలాయించగలరనేది ఆధారపడి ఉంటుందని ఇక్రా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ షంషేర్ దివాన్ తెలిపారు. ఒకవేళ అదనపు టారిఫ్ వ్యయాల్లో 30–50 శాతాన్ని భారతీయ ఆటో విడిభాగాల ఎగుమతిదారులు భరించే పక్షంలో సుమారు రూ. 2,700–4,500 కోట్ల భారం మోయాల్సి వస్తుందని వివరించారు. ఇది పరిశ్రమ నిర్వహణ లాభాల్లో 3–6 శాతమని, ఆటో విడిభాగాల ఎగుమతిదార్ల నిర్వహణ లాభాల్లో 10–15 శాతం అని పేర్కొన్నారు. 2024 ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ మొత్తం ఆదాయాల్లో అమెరికా వాటా సుమారు 8 శాతంగా నమోదైంది. 2020–24 మధ్య కాలంలో అమెరికాకు ఆటో విడిభాగాల ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన 15 శాతం స్థాయిలో పెరిగాయి. ఇంజిన్లు, ఎలక్ట్రికల్ కాంపొనెంట్లులాంటి కీలకమైన ఆటోమొబైల్ విడిభాగాలపై మే 3 నుంచి అమల్లోకి వచ్చేలా అమెరికా 25 శాతం టారిఫ్‌లు ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత్ ఎగుమతి చేసే విడిభాగాల్లో దాదాపు 65 శాతం కాంపొనెంట్లు 25 శాతం టారిఫ్‌ల కేటగిరీలోకి వస్తాయి. -
భారత షిప్పింగ్ మూలాలు పటిష్టం
న్యూఢిల్లీ: అమెరికా ప్రతీకార టారిఫ్‌ల వల్ల షిప్పింగ్ రంగంలో స్వల్పకాలికంగా కాస్త సమస్యలు తలెత్తినా, దీర్ఘకాలికంగా చూస్తే భారత మారిటైమ్ మూలాలు పటిష్టంగా ఉన్నాయని అంతర్జాతీయ షిప్ మేనేజ్మెంట్ కంపెనీ సినర్జీ మెరైన్ గ్రూప్ సీఈవో జెస్పర్ క్రిస్టెన్సన్ తెలిపారు. పోర్టు సామర్థ్యాలు .. ఎగుమతుల బేస్ పెరుగుతుండటం, సుశిక్షితులైన సిబ్బంది లభ్యత తదితర అంశాల దన్నుతో గ్లోబల్ షిప్పింగ్ పరిశ్రమలో పరిస్థితులకు అనుగుణంగా భారత్ తనను తాను మల్చుకోగలిగే స్థితిలో ఉందని వివరించారు. బహుళ నైపుణ్యాలున్న ప్రొఫెషనల్స్‌కి షిప్పింగ్ రంగంలో డిమాండ్ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదని చెప్పారు. డిజిటలైజేషన్, డీకార్బనైజేషన్, నిబంధనలు తదితర అంశాల ఆధారంగా షిప్పింగ్ రంగంలో నైపుణ్యాల ఆధారంగా నియామకాలు ఉంటున్నాయని వివరించారు. సినర్జీలో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 28,000 మంది సీఫేరర్స్ ఉండగా, వీరిలో 70 శాతం మంది భారతీయులేనని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఫ్లీట్ విస్తరణకు అనుగుణంగస్మరిన్ని నియామకాలు చేపట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. -
అమెరికాతో ఒప్పందంపై చురుగ్గా చర్చలు
శాన్ఫ్రాన్సిస్కో: ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై (బీటీఏ) అమెరికాతో చర్చలు చురుగ్గా సాగుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. సెప్టెంబర్–అక్టోబర్ నాటికి తొలి దశకు సంబంధించిన ఒప్పందంపై సంతకాలు చేసే అవకాశం ఉందని ప్రవాస భారతీయుల కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పేర్కొన్నారు. భారత్ సహా పలు దేశాలపై అమెరికా భారీగా ప్రతీకార టారిఫ్‌లు ప్రకటించిన నేపథ్యంలో ఇరు దేశాలు బీటీఏపై కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన చర్చలను రెండు దశల్లో పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాయి. మరోవైపు, సెమీకండక్టర్లు, రెన్యువబుల్ ఎనర్జీ, డిజిటల్ మౌలిక సదుపాయాలు, కృత్రిమ మేథ మొదలైన వాటిల్లో పురోగమిస్తున్న భారత్.. భవిష్యత్తులో ఆయా రంగాల్లో అగ్రగామిగా నిలుస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెడుతోందని ఆమె చెప్పారు. -
వాణిజ్య బంధం బలోపేతంపైనే దృష్టి
న్యూఢిల్లీ: అగ్రరాజ్యాధినేత ట్రంప్ ఆదేశాలతో అమెరికా ప్రభుత్వం భారత్‌పై సుంకాల సుత్తితో మోదుతున్న వేళ ట్రంప్‌కు కుడిభుజం, ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా హస్తనకు విచ్చేసిన వాన్స్ సోమవారం సాయంత్రం ప్రధాని మోదీని ఆయన నివాసంలో కలిశారు. సతీమణి ఉషా చిలుకూరి, పిల్లలు ఇవాన్, వివేక్, మీరాబెల్‌లతో కలిసి 7, లోక్‌కళ్యాణ్ మార్గ్‌లోని మోదీ అధికారిక నివాసానికి వాన్స్ విచ్చేశారు. అక్కడ వీళ్ల కుటుంబానికి మోదీ సాదర స్వాగతం పలికారు. స్వయంగా కారు దాకా వచ్చిన మోదీ.. వాన్స్ కారు దిగి దగ్గరకు రాగానే ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. వాన్స్ వెంట వచ్చిన కుమారులిద్దరినీ సరదాగా పలకరించారు. వారిని పరిచయం చేసుకున్నారు. కుమార్తె మీరాబెల్ను ఎత్తుకుని వచ్చిన ఉషా చిలుకూరితో మోదీ కరచాలనం చేసి కుశల ప్రశ్నలు వేశారు. తర్వాత చిన్నారులను చేయిపట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్లారు. తొలుత వాన్స్ కుటుంసభ్యులందరికీ ఇంటి గార్డెన్‌ను మోదీ స్వయంగా చూపించారు. నెమళ్లు స్వేచ్ఛగా విహరిస్తున్న పచ్చికబయళ్లలో కుటుంబంతో కలిసి మోదీ కలియతిరిగారు. తర్వాత ఇంట్లోకి తీసుకెళ్లి గ్రూప్ ఫొటో దిగారు. తర్వాత నెమలి ఈకలను ముగ్గురు చిన్నారులకు ఇచ్చి వారితో ముచ్చటించారు. మీద కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్పారు. వాన్స్ చిన్నకుమారుడు వివేక్ మోదీ తరహా డ్రెస్, పెద్దబ్బాయి ఇవాన్ సూట్ ధరించారు. ఒప్పందం పురోగతిపై సంతృప్తితర్వాత మోదీ, వాన్స్‌లు విడిగా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇరుదేశాలకు ప్రయోజనకారి అయిన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై విస్తృతస్థాయిలో చర్చలు జరిపారు. ఒప్పందం పురోగతిపై మోదీ, వాన్స్‌లు సంతృప్తి వ్యక్తంచేశారు. వీలైనంత త్వరగా ఒప్పందం ఓ కొలిక్కి వచ్చేలా చూడటంపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. దీంతోపాటు రక్షణ, ఇంధనం, వ్యూహాత్మక సాంకేతికత రంగాల్లో మరింత సహకారంపైనా చర్చలు జరిపారు. త్వరలో భారత్‌లో పర్యటించాలని భావిస్తున్నందుకు ట్రంప్‌కు తన తరఫున కృతజ్ఞతలు తెలపాలని వాన్స్‌తో మోదీ చెప్పారు. ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన పలు అంశాల్లో పురోగతి సాధించంపై ఇరు దేశాల నేతలు సమగ్ర స్థాయిలో చర్చలు జరిపారని భేటీ ముగిశాక సోమవారం రాత్రి భారత్ ఒక ప్రకటన విడుదలచేసింది. ‘‘ ఫిబ్రవరిలో ట్రంప్‌తో భేటీ, ఫలవంతమైన చర్చల వివరాలను వాన్స్ వద్ద మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. నాటి చర్చలు ఇరు దేశాల మధ్య సహకారానికి బాటలు వేశాయి. అటు మేక్ అమెరికా గ్రేట్ ఎగేన్‌కు, ఇటు వికసిత్ భారత్ 2047 సుసాధ్యానికి మార్గం సుగమం చేశాయి. ఇరు దేశాల ప్రజల సంక్షేమానికి దోహదపడే దైపాక్షిక వాణిజ్యం ఒప్పందం(బీటీఏ) పురోగతిపై నేతలిద్దరూ సంతృప్తి వ్యక్తంచేశారు. టారిఫ్‌లు, ఇరుదేశాల మార్కెట్లలోకి సులభంగా ప్రవేశించడం తదితర కీలకాంశాలు బీటీఏలు ఉండనున్నాయి. పరస్పర ప్రయోజనకర అంశాలతోపాటు అంతర్జాతీయ సమకాలీన అంశాలూ మోదీ, వాన్స్‌ల భేటీలో ప్రస్తావనకు వచ్చాయి. సమస్యాత్మక అంతర్జాతీయ అంశాల్లో దౌత్యం, సంప్రతింపులే పరిష్కార మార్గాలని నేతలు భావించారు. భారత్‌లో ఉన్నన్ని రోజులు వాన్స్, ఉషా, వాళ్ల చిన్నారులు ఎంతో ఆహ్లాదంతో గడపాలని మోదీ ఆకాంక్షించారు’’ అని ఆ ప్రకటన పేర్కొంది. చర్చల్లో భారత్ తరఫున విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, జాతయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ప్రధాని ముఖ్య కార్యదర్శి శక్తికాంతదాస్ పాల్గొన్నారు. 12 ఏళ్ల తర్వాత అమెరికా ఉపాధ్యక్షుడు ఒకరు భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. 2013లో నాటి ఉపాధ్యక్ష హోదాలో జోబైడెన్ ఢిల్లీకి వచ్చారు. -
భద్రతా కోణంలోనే.. రక్షణాత్మకం కాదు
న్యూఢిల్లీ: స్టీల్, అల్యూమినియం దిగుమతులపై తాము విధించిన సుంకాలు దేశ భద్రతా కోణంలోనే తప్పించి రక్షణాత్మక చర్యల కింద చూడరాదని అమెరికా కోరింది. అమెరికా జాతీయ భద్రతకు స్టీల్, అల్యూమినియం దిగుమతులు ముప్పుగా పరిణమించడంతో, దీన్ని సర్దుబాటు చేయడానికి సెక్షన్ 232 కింద అధ్యక్షుడు టారిఫ్‌లను ప్రకటించినట్టు వివరించింది. ఈ మేరకు ప్రపంచ వాణిజ్య సంస్థకు బదులిచ్చింది. డబ్ల్యూటీవో సేఫ్‌గార్డ్ అగ్రిమెంట్‌లోని ఆర్టికల్ 12.3 కింద అమెరికాతో సంప్రదింపులకు ఏప్రిల్ 11న భారత్ ప్రతిపాదన చేయడంతో ఈ సమాధానం వచ్చింది. ‘‘ఇవి ఎంత మాత్రం రక్షణాత్మక చర్యలు కావు. కనుక రక్షణాత్మక చర్యల కింద సంప్రదింపులకు ఎలాంటి ప్రాతిపదిక లేదు. అయినప్పటికీ ఈ అంశమే కాదు, ఏ అంశంపై అయినా భారత్‌తో చర్చలకు సుముఖంగా ఉన్నాం. కాకపోతే, చర్చలు ఏవైనా కానీ రక్షణాత్మక చర్యల ఒప్పందం కింద ఉండకూడదు’’అని అమెరికా స్పష్టం చేసింది. అయితే, అమెరికా వాదనను భారత్ అంగీకరించలేదు. భద్రతా కోణంలోనే అని అమెరికా చెప్పినప్పటికీ.. అవి రక్షణాత్మక చర్యలేనని వాదించింది. ఈ ఒప్పందం కింద చర్యలను డబ్ల్యూటీవో కమిటీకి తెలియజేయడంలో అమెరికా విఫలమైనట్టు పేర్కొంది. -
చైనాపై సుంకాలు 245%
వాషింగ్టన్/బీజింగ్: ప్రపంచంలో రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం నానాటికీ భీకరంగా మారుతోంది. బోయింగ్ విమానాల డెలివరీపై నిషేధం విధించినందుకు చైనాపై అమెరికా ప్రభుత్వం వెంటనే ప్రతీకార చర్యలకు దిగారు. చైనా ఉత్పత్తులపై టారిఫ్‌లను ఏకంగా 245 శాతానికి పెంచుతున్నట్లు వైట్‌హౌస్ ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం ఫ్యాక్టషీట్ విడుదల చేసింది. అరుదైన ఖనిజాలు, వాటి ఉత్పత్తుల కోసం విదేశాలపై విపరీతంగా ఆధారపడడం వల్లే తలెత్తే భద్రతాపరమైన ప్రమాదాలపై విచారణకు ఆదేశిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారని వెల్లడించింది. అమెరికా ఆర్థిక వ్యవస్థను మరోసారి అత్యున్నతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ‘అమెరికా ఫస్ట్ ట్రేడ్ పాలసీ’ని మొదటి రోజే ప్రారంభించారని గుర్తుచేసింది. నూతన వాణిజ్య ఒప్పందాలు, సుంకాలపై 75కు పైగా దేశాలు అమెరికాతో చర్చలకు ముందుకొచ్చాయని పేర్కొంది. అందుకే ఆయా దేశాలపై సుంకాలను వాయిదా వేసినట్లు వెల్లడించింది. చైనాపై మాత్రం ప్రతీకార సుంకాలు కొనసాగుతాయని తేల్చిచెప్పింది. చైనా ఉత్పత్తులను ఇకపై అమెరికాలో విక్రయించాలంటే 245 శాతం సుంకాలు చెల్లించాల్సి ఉంటుందని ఫ్యాక్ట్‌షీట్‌లో స్పష్టంచేసింది. చైనా–అమెరికా మధ్య కొంతకాలంగా టారిఫ్‌ల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. చైనా ఉత్ప త్తులపై అమెరికా ఇప్పటికే 145 శాతం టారిఫ్‌లు విధించింది. అమెరికా నుంచి బోయింగ్ విమానాల కొనుగోలుపై నిషేధం విధించిన మరుసటి రోజే టారిఫ్‌లను అదనంగా 100 శాతం పెంచడం గమనార్హం. బోయింగ్ విమానాలు కొనుగోలు చేయవద్దని చైనా నిర్ణయించడం పట్ల డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒప్పందం నుంచి మధ్యలో విరమించుకోవడం సరైంది కాదంటూ మంగళవారం సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రత్యర్థులతో జరుగుతున్న వాణిజ్య యుద్ధంలో అమెరికా ప్రయోజనాలు కచ్చితంగా కాపాడుకుంటామని ఉద్ఘాటించారు. టారిఫ్ వార్‌ను ముగించే విషయంలో చైనాతో ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు. ఆ అవసరం చైనాకు మాత్రమే ఉందన్నారు. ప్రస్తుతం బంతి చైనా కోర్టులోనే ఉందని వెల్లడించారు.చర్చల సంధానకర్తగా లీ చెంగాంగ్ నియామకం టారిఫ్ యుద్ధాన్ని విరమించే విషయంలో బంతి చైనా కోర్టులో ఉందని డొనాల్డ్ ట్రంప్ స్పష్టంచేసిన నేపథ్యంలో చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాతో చర్చలకు మొగ్గుచూపింది. చర్చల కోసం సంధానకర్తగా లీ చెంగాంగ్‌ను నియమించింది. వాంగ్ షౌవెన్ స్థానంలో లీ చెంగాంగ్‌ను నియమిస్తున్నట్ల చైనా వాణిజ్య శాఖ బుధవారం ప్రకటించింది. 2020లో అమెరికా, చైనా మధ్య జరిగిన వాణిజ్య చర్చల్లో చెంగాంగ్ పాల్గొన్నారు. ఆయన గతంలో ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ)లో చైనా రాయబారిగా సేవలందించారు. -
ట్రంప్ చర్యలతో అమెరికాకు అతి పెద్ద నష్టం ఇదే!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్యలవల్ల ఆ దేశానికి జరుగుతున్న అతి పెద్ద నష్టం ఏమిటి? స్టాక్ మార్కెట్ సూచీలు పడిపోవటమా? బాండ్స్ మార్కెట్ దెబ్బ తినటమా? డాలర్ విలువ తగ్గుతుండటమా? ఇవేవీ కావు. అన్నింటికన్న ముఖ్యమైనది విశ్వసనీయతకు కలుగుతున్న నష్టం. స్టాక్స్‌ను, బాండ్లను, కరెన్సీ విలువను దిద్దుబాటు చర్యలతో పునరుద్ధరించుకోవచ్చు. కానీ విశ్వసనీయత (credibility) మౌలికమైనది. అది ఒకసారి దెబ్బతినటం మొదలైతే కోలుకునేందుకు చాలా సమయం తీసుకుంటుంది. అమెరికాకు ఇది అన్నింటికి మించిన నష్టమవుతున్నది. మరొకవైపు బహుళ ధ్రువ ప్రపంచ బలోపేతానికి దోహదపడుతున్నది. ఇది అమెరికా (America) కోరుకోని ఫలితం.డాలర్ బాండ్ల సంక్షోభందీనంతటికీ ఆరంభం దిగుమతి సుంకాలను ఒకేసారి 184 దేశాలపై హెచ్చించటమన్నది తెలిసిందే. సుంకాల చెల్లింపులు గతంలోనూ ఉన్నవే. అమెరికాయే గాక ఇతరులూ అప్పుడప్పుడు చేస్తుండినవే. ట్రంప్ ఒక కొత్త పద్ధతిని అనుసరిస్తూ ఒకేసారి అందరిపై ఒకే విధంగా అన్ని సరకులపై 10 శాతం పెంచి, కొద్ది రోజుల తర్వాత ఆ యా దేశాలతో వాణిజ్య లోటు అనే మొత్తాలపై 50 శాతం పెంచారు. కానీ బాండ్ల మార్కెట్‌కు, డాలర్ విలువకు నష్టాలు మొదలు కావటం జరిగింది. ఆ మాట ఆయన బహిరంగంగానే అంగీకరిస్తూ, 50 శాతం సుంకాల హెచ్చింపును అమలుకు తెచ్చిన కొద్ది గంటలలోనే ఆ చర్యను 90 రోజులపాటు వాయిదా వేయవలసి వచ్చింది.ఇందులో బాండ్ల మార్కెట్ నష్టాలు అతి తీవ్ర మైనవి కావటం ఎందుకంటే, అమెరికన్ డాలర్ విలువ అతి సుస్థిరమైనదనీ, డాలర్ బాండ్లు కొన్న ట్లయితే తమ డబ్బుకు లభించే వడ్డీ ఆదాయం, దీర్ఘకాలిక భద్రత సురక్షితమనీ నమ్మేవారు ప్రపంచం అంతటి నుంచీ డాలర్ బాండ్లలో మదుపు చేస్తారు. ఆ విధంగా చైనా సైతం ఒక ట్రిలియన్ డాలర్లకుపైగా బాండ్లు ఖరీదు చేసిందంటే పరిస్థితిని ఊహించవచ్చు. ఎన్నడూ లేని విధంగా ఇపుడు ట్రంప్ ధోరణితో డాలర్ పట్ల, అమెరికా పట్ల విశ్వాసం దెబ్బతింటుండటంతో సామాన్య ప్రజల నుంచి ఆయా దేశాల వరకు ఆ బాండ్లను అమ్మడం మొదలైంది. అమెరికాకు అతి సన్నిహితమైన జపాన్ (Japan) ప్రభుత్వం సైతం వందలాది బిలియన్ల బాండ్లు సత్వరంగా విక్రయించిందంటే సమస్య తీవ్రతను గమనించవచ్చు. మరొకవైపు కొత్త బాండ్ల అమ్మకాలు ఆగిపోయాయి. ఈ ధోరణి కొనసాగితే, అమెరికా ఆర్థిక వ్యవస్థ అనేక తీవ్ర సమస్యలను ఎదుర్కొంటుంది. దీనికితోడు డాలర్ విలువ (Dollar Value) తగ్గుదల సరేసరి. ఈ పరిణామాల కారణంగానే సుంకాలను 90 రోజులు వాయిదా వేయక తప్పలేదు. అంత చేసినా విశ్వసనీయతకు నష్టం జరగనే జరిగింది.లొంగని చైనా సుంకాలకు బెదిరి అమెరికాతో చర్చలకు కొన్ని దేశాలు సిద్ధపడటం నిజమే అయినా – కెనడా, యూరప్, చైనా (China) వంటి బలమైన ఆర్థిక వ్యవస్థలు అందుకు నిరాకరిస్తూ ఎదురు సుంకాలు విధించటం, అమెరికాకు అవసరమైన కీలకమైన ముడిసరకుల రవాణాను నిలిపివేయటం మొదలుపెట్టాయి. ఇది కూడా అమెరికన్ స్టాక్స్‌ను, బాండ్ల మార్కెట్‌ను, డాలర్ విలువను, ప్రజల నిత్యావసర సరకుల ధరలను ప్రభావితం చేయటం మొదలైంది.తమకు అన్నివిధాలా సవాలుగా మారిన చైనాను ఆర్థికంగా, ఇతరత్రా కూడా కట్టడి చేసేందుకు రిపబ్లికన్, డెమోక్రటిక్ ప్రభుత్వాలు రెండూ ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నాయి. ఆ విధానాలు ఇప్పుడు ట్రంప్ రెండవ హయాంలో పరాకాష్ఠకు చేరుతున్నాయి. దీనంతటి నిజమైన ఉద్దేశం అమెరికా ఆర్థిక ప్రయోజనాల కన్నా తమను దీర్ఘకాలం పాటు దెబ్బతీయటమే అని భావిస్తున్న చైనా, ఎన్ని నష్టాలనైనా భరిస్తాముగానీ ఎటువంటి ఒత్తిడికైనా లొంగబోమని, చివరికంటా పోరాడుతామని ఒకటికి నాలుగు సార్లు స్పష్టం చేసింది.పేరు మోసిన ఆర్థిక నిపుణులంతా ట్రంప్ బృందానికి ఆర్థిక విషయాలపై అవగాహన లేదని వ్యాఖ్యానిస్తుండటం కూడా అమెరికా విశ్వసనీయతను దెబ్బతీస్తున్నాయి. ఈ పరిస్థితుల మధ్య ఆసక్తికరమైన దౌత్యనీతి ఛాయలు కనిపించటం మొదలైంది. అమెరికన్ మీడియా (American Media) వెల్లడించిన విషయాలు ఈ విధంగా ఉన్నాయి: ట్రంప్ అధికారులు చైనా అధికారులకు ఫోన్ చేసి, తాము పెంచిన సుంకాలకు పోటీగా చైనా ఇక పెంచవద్దనీ, అది చైనాకే నష్టదాయకమనీ కోరారు. కానీ చైనా ఆ మాటను లెక్కచేయక మరిన్ని సుంకాలు పెంచింది. ఆ వెనుక ట్రంప్ అధికారులు మరొకసారి చైనా అధికారులకు ఫోన్ చేసి, ఒకసారి జిన్‌పింగ్ (Xi Jinping) చేత ట్రంప్‌తో మాట్లాడించమని కోరారు. అందుకు చైనా అధ్యక్షుడు నిరాకరించారు. మరొకవైపు అమెరికా నష్టాలు కొనసాగటం, సుంకాలను 90 రోజులు వాయిదా వేసినా మార్కెట్లకు నమ్మకం ఏర్పడక ఒక రోజు విరామం తర్వాత తిరిగి పతనమవుతుండటం, బాండ్ల సమస్య, ఉత్పత్తులకు కొరతలు, ధరల పెరుగుదలలు కొనసాగటంతో పరిస్థితి అర్థమైంది. దానితో, సుంకాలు పెంచిన ఈ నెల 2వ తేదీ నుంచి సరిగా 10 రోజులు గడిచి 12వ తేదీ వచ్చేసరికి, చైనా నుంచిదిగుమతి అయ్యే సెల్ఫోన్లు, పలు ఎలక్ట్రానిక్, కంప్యూటర్ సామగ్రిపై సుంకాల పెరుగుదలను ట్రంప్ నిలిపి వేశారు.చదవండి: ట్రంప్ సుంకాల సంక్షోభం.. అనూహ్య పరిణామాలుఇదిట్లుండగా, తన కొత్త విధానాల వల్ల అమెరికన్, తదితర పరిశ్రమలు అమెరికాకు తరలి రాగలవనే ట్రంప్ ఆశాభావానికి ఎవరి నుంచీ సుముఖత కనిపించటం లేదు. చట్టబద్ధత లేని వలస కార్మికులను పారదోలటంతో వ్యవసాయం, హోటళ్ల వంటి రంగాలు దెబ్బ తింటుండటంతో, వారి కొనసాగుదలకు యజమానులు దరఖాస్తు చేసుకోవచ్చునన్నది ఇదే 12వ తేదీ నాటి మరో ఉత్తర్వు. పోతే, విద్యా వైద్య రంగాలలో కుదింపులు, విదేశీ సహాయాల (యూఎస్ ఎయిడ్ ద్వారా) రద్దు పేద దేశాలల్లో కలిగిస్తున్న హాని, ఆగని గాజా మారణకాండ వంటి ఇతర అనేక చర్యలు కూడా ట్రంప్ పట్ల, అమెరికా పట్ల విశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఇది వారికి ఆర్థికానికి మించిన దీర్ఘకాలిక నష్టం.- టంకశాల అశోక్ సీనియర్ సంపాదకుడు -
అమెరికా ఫస్ట్ నినాదం.. ట్రంప్, మస్క్‌ను ఇలా ఎప్పుడైనా చూశారా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌ల పేరుతో ప్రపంచదేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. అమెరికా ఫస్ట్ నినాదంతో పలు దేశాలను టార్గెట్ చేసి ఇష్టానుసారం భారీగా సుంకాలు వడ్డీస్తున్నారు. దీంతో, ఇక ప్రపంచీకరణ ముగిసినట్లేనని పలువురు దేశాధినేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక, ట్రంప్ మాత్రం.. అమెరికన్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలను కాపాడేందుకు ఇతర దేశాల దిగుమతులపై భారీ సుంకాలను విధిస్తున్నట్టు చెబుతున్నారు.ఇదిలా ఉండగా.. 1991లో సోవియట్ యూనియన్ పతనం తర్వాత ప్రారంభమైన గ్లోబలైజేషన్ ఇక ముగిసినట్టే బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ పేర్కొన్నారు. అలాగే, ట్రంప్ టారిఫ్‌ల నేపథ్యంలో దేశీయంగా ఉత్పత్తిని పెంచడంపై దేశాలు ఫోకస్ పెడుతున్నాయి. అటు, అమెరికా సైతం స్థానిక వనరులనే వాడుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఈ నేపథ్యంలో పలువురు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా.. ఫన్నీ వీడియోలు షేర్ చేస్తున్నారు.తాజా ఓ నెటిజన్ ట్రంప్, ఎలాన్ మస్క్‌కు చెందిన వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో ట్రంప్, మస్క్‌లు అమెరికా అభివృద్ధి కోసం ఇప్పుడే పనులు మొదలు పెడుతున్నట్టు ఉంది. ట్రంప్ పొలంలో నాట్లు వేస్తూ.. మస్క్ చీపురుతో ఊడుస్తున్నట్టుగా, జేడీ వాన్స్ షూ తయారు చేస్తున్నట్టుగా వీడియోలో ఉంది. ఇలా.. మెల్లగా పనులు చేస్తే ఎప్పటికి అమెరికా అభివృద్ధి చెందుతుంది అన్నట్టు ఫన్నీ కామెంట్స్ పెట్టారు.A couple new characters introduced in this one. pic.twitter.com/8lO3IaIiFA— MAGA Cult Slayer🦅🇺🇸 (@MAGACult2) April 13, 2025మరో నెటిజన్ ట్రంప్, జిన్‌పింగ్ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో చైనా టారిఫ్‌ల దెబ్బకు ట్రంప్ విలవిల్లాడిపోతున్నట్టుగా ఉంది.Trump opens a portal to the Upside Down and finds Xi waiting with a 125% tariff in this Stranger Things parody gone full trade war chaos 😱🌀📉💼🔥👔😂 #StrangerTariffs #UpsideDownEconomics #TrumpVsXi #TradeWarParody #StrangerThingsSpoof #MadeInChina #PoliticalParody… pic.twitter.com/zVmr8jchMB— Julius Dein (@JuliusDein) April 11, 2025 Who wore their tariff best? 💃📉🔥 Watch as world leaders strut their stuff in the most ridiculous outfits, proudly flexing their import taxes like it’s Paris Fashion Week for sanctions. 🇺🇸🇨🇳👠 #TariffFashionShow #GlobalDrip #Sanction #CustomsCouture #TradeWarLooks #china… pic.twitter.com/jpxmnmwl9w— Julius Dein (@JuliusDein) April 3, 2025 Trump’s MAGA hat says “Made in China 🇨🇳🧢 and Xi’s somewhere in Beijing cackling like he just won the trade war 😂🤡 #MakeAmericaManufactureAgain #TradeWar #MAGAhat #PoliticalSatire #XiLaughsLast #ManufacturingIrony #MadeInChina #USA🇺🇸 #GlobalLOL pic.twitter.com/3zOSPDR5ax— Julius Dein (@JuliusDein) April 11, 2025Trump and Elon Musk mocked in new AI video showing them as factory workers. pic.twitter.com/wAEXcmlYOK— Daily Mail Online (@MailOnline) April 10, 2025In 2025, AI surpasses all expectations, enabling thousands to become more creative, something that Trump certainly did not anticipate.😂 pic.twitter.com/NTbnGzp8LB— Johannes Maria (@luo_yuehan) April 12, 2025 -
చైనా స్మార్ట్ఫోన్లపై సుంకాలు
వాషింగ్టన్: ప్రతీకార సుంకాలు విధించినా, నేరుగా బెదిరించినా చైనా దారికి రాకపోవడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడుతున్నారు. ఆ దేశంపై మరింతగా కత్తులు నూరుతున్నారు. చైనా స్మార్ట్ ఫోన్లతో పాటు ఆ దేశ ఎలక్ట్రానిక్ వస్తువులపై సుంకాలు విధించనున్నట్టు ఆయన తాజాగా ప్రకటించారు. అవి ఎంత శాతమన్నది సోమవారం వెల్లడిస్తానని తెలిపారు. ‘‘ఎలక్ట్రానిక్ వస్తువులకు నేను ప్రకటించిన సుంకాల మినహాయింపు చైనాకు వర్తించబోదు. వాటిపై కేవలం సుంకాల శాతం మార్పుచేర్పులు చేయబోతున్నామంతే’’ అని ఆదివారం ట్రంప్ వెల్లడించారు. ‘‘చైనా ఎలక్ట్రానిక్ వస్తువులకు సెమీ కండక్టర్ టారిఫ్‌లు వర్తించవచ్చని వాణిజ్య మంత్రి హొవార్డ్ లెట్నిక్ చెప్పుకొచ్చారు. అమెరికాకు అవసరమైన ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్లు, ఔషధాలు.. ఇలా అన్ని వస్తువులూ దేశీయంగానే తయారు కావాలన్నది అధ్యక్షుని ఆలోచన అన్నారు. స్మార్ట్ఫోన్లతో పాటు చైనా నుంచి దిగుమతయ్యే అన్నిరకాల ఎలక్ట్రానిక్స్ వస్తువులనూ ఆ దేశంపై విధించిన 145 శాతం టారిఫ్ నుంచి మినహాయిస్తున్నట్టు అమెరికా కస్టమ్స్ విభాగం శనివారం నోటీసులో వెల్లడించడం తెలిసిందే. ఈ అంశంపై రెండు రోజుల్లోనే ట్రంప్ పిల్లమొగ్గ వేశారు. ఆ నోటీసు వాస్తవం కాదంటూ సొంత సోషల్ మీడియా హాండిల్ ట్రూత్‌సోషల్‌లో పోస్టు పెట్టారు. అమెరికాకు ఎలక్ట్రానిక్స్ వస్తువుల సరఫరాపై త్వరలో నేషనల్ సెక్యూరిటీ టారిఫ్స్ ఇన్వెస్టిగేషన్స్ భేటీలో కూలంకషంగా చర్చిస్తామని చెప్పుకొచ్చారు. -
కొత్త సుంకాల నుంచి ఎల్రక్టానిక్స్‌కు మినహాయింపు
వాషింగ్టన్: ప్రతీకార సుంకాల విషయంలో ట్రంప్ సర్కారు మరో యూ టర్న్ తీసుకుంది. 20 రకాల కీలక ఎలక్ట్రానిక్ వస్తువులను కొత్త సుంకాల జాబితా నుంచి మినహాయిస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది. అన్ని దేశాల ఉత్పత్తులపైనా అమెరికా విధించిన 10 శాతం బేస్‌లైన్ టారిఫ్ నుంచి కూడా వీటిని మినహాయించినట్టు యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ విభాగం పేర్కొంది. చైనా దిగుమతులపై విధించిన 145 శాతం సుంకాలు కూడా వీటికి వర్తించబోవు. టారిఫ్‌ల దెబ్బకు అమెరికా కంపెనీలు నష్టపోకుండా చూడటమే దీని వెనక ప్రధానోద్దేశంగా కన్పిస్తోంది. స్మార్ట్ఫోన్లు మొదలుకుని ల్యాప్‌లాప్‌లు, సెమీ కండక్టర్ చిప్‌ల దాకా ఈ జాబితాలో ఉన్నాయి. వీటిలో చాలా వస్తువులు అమెరికా బయట తయారయ్యేవే. హెచ్చు టారిఫ్‌ల దెబ్బకు వీటి ధరలు చుక్కలనంటుతాయంటూ అమెరికా టెక్ దిగ్గజాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడటం విశేషం. దీనితో యాపిల్, సామ్సంగ్ వంటి మొబైల్ దిగ్గజాలతో పాటు ఎన్విడియా వంటి చిప్ తయారీ కంపెనీలకు లబ్ధి చేకూరనుంది. అయితే ఇది తాత్కాలిక నిర్ణయమేనని అమెరికా ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. వాటిపై త్వరలో ఎంతోకొంత టారిఫ్ ప్రకటించవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యాపిల్ ఉత్పత్తుల్లో ఏకంగా 80 శాతానికి పైగా చైనాలో, మిగతా మొత్తం భారత్‌లో తయారవుతాయని అంచనా. మినహాయింపు జాబితాలో... స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, హార్డ్ డ్రైవ్‌లు, టెలికాం పరికరాలు, చిప్–సెమీ కండక్టర్ తయారీ యంత్రాలు, రికార్డింగ్ పరికరాలు, డేటా ప్రాసెసింగ్ యంత్రాలు, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు విడిభాగాలు, ఫ్లాట్ ప్యానల్ మానిటర్లు -
అమెరికా దెబ్బకు చైనా ఔట్?
అమెరికా, చైనాల మధ్య పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు, వరుస ప్రతీకార సుంకాలు ప్రపంచ వాణిజ్య ముఖచిత్రాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా చైనా వస్తువులపై అమెరికా 145 శాతం వరకు సుంకాలు విధించడంతో ఆ దేశ ఎగుమతి ఆధారిత ఆర్థిక వ్యవస్థ గణనీయమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ సుంకాలు చైనా ఎగుమతులను ఎలా ప్రభావితం చేస్తాయో, అక్కడి ఎగుమతిదారులు అనుసరిస్తున్న వ్యూహాలేమిటో తెలుసుకుందాం.145 శాతం వరకు సుంకాలుచైనా ఆర్థిక వ్యవస్థ చాలా కాలంగా ఎగుమతులపై ఆధారపడి ఉంది. చైనా అతిపెద్ద మార్కెట్ల్లో యూఎస్ కీలకం. 2024లో యూఎస్‌కు చైనా సుమారు 440 బిలియన్ డాలర్ల ఎగుమతులు చేసింది. ఇది ఆ దేశం మొత్తం ఎగుమతుల్లో 14%, జీడీపీలో సుమారు 3%గా ఉంది. చైనా దిగుమతులను కట్టడి చేయడమే లక్ష్యంగా ఇటీవల వివిధ వస్తువులపై 10 శాతం నుంచి 145 శాతానికి అమెరికా సుంకాలు పెంచింది. ప్రధానంగా ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్స్, మెషినరీ సహా పలు రకాల ఉత్పత్తులను లక్ష్యంగా చేసుకుంది.ఎగుమతులపై తీవ్ర ప్రభావంసుంకాల తక్షణ ప్రభావం కింద చైనా వస్తువులకు అమెరికాలో డిమాండ్ గణనీయంగా తగ్గింది. టారిఫ్‌ల పెంపు వల్ల వచ్చే రెండేళ్లలో అమెరికాకు చైనా ఎగుమతులు 80 శాతం వరకు పడిపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఉదాహరణకు, చైనా నుంచి యూఎస్ దిగుమతుల్లో 9% ఉన్న స్మార్ట్ఫోన్లు వంటి ఉత్పత్తులు తీవ్రమైన ధరల పెరుగుదలను ఎదుర్కొంటాయి. దాంతో వాటిని మార్కెట్ నుంచి బహిష్కరించే అవకాశం ఉంది. దాంతోపాటు మిలియన్ల మంది చైనా కార్మికుల జీవనోపాధికి ముప్పు కలిగిస్తుంది. చైనాలో సుమారు రెండు కోట్ల ఉద్యోగాలు యూఎస్ సంబంధిత ఎగుమతులపై ఆధారపడి ఉన్నాయి.ఆర్థిక పరిణామాలుఅమెరికా సుంకాలు చైనా ఎగుమతిదారులను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. లాభాల మార్జిన్లను గణనీయంగా తగ్గించాయి. కొన్ని సంస్థలు పూర్తిగా ఎగుమతులను నిలిపేశాయి. టెక్స్టైల్ కంపెనీలు యూఎస్‌కు ఎగుమతులను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తెలిపాయి. సుంకాల ప్రభావం వల్ల లాభాలు భారీగా క్షీణించాయని పేర్కొన్నాయి. మరోవైపు వియత్నాం వంటి దేశాలు ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. తగ్గిన ఎగుమతి ఆదాయాలు చైనా ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభమైన తయారీ రంగాన్ని బలహీనపరుస్తాయి. ఇప్పటికే ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతలతో కుదేలైన పారిశ్రామికోత్పత్తి మరింత ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ఆర్డర్లు తగ్గడంతో కొన్ని కర్మాగారాలు పరికరాలను విక్రయిస్తున్నాయి.తగ్గిన జీడీపీ అంచనాఅమెరికా సుంకాలు పెంపు, అంతర్జాతీయంగా డిమాండ్ మందగించడం వంటి కారణాలతో గోల్డ్ మన్ శాక్స్ 2025లో చైనా జీడీపీ వృద్ధి అంచనాను 4 శాతానికి సవరించింది. చైనా జీడీపీలో అమెరికాకు చేసే ఎగుమతుల వాటా తక్కువే అయినప్పటికీ, తగ్గిన పెట్టుబడులు, వినియోగదారుల సామర్థ్యం వల్ల మరింత ఆర్థిక ఒత్తిడి ఎందురవుతుంది.చైనా ప్రతిస్పందనచైనా యూఎస్ సుంకాల ప్రభావాన్ని తగ్గించడానికి చైనా బహుముఖ వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఆగ్నేయాసియా ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఎగుమతిదారులు అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించే ప్రయత్నాలను వేగవంతం చేస్తున్నారు. 2019 నుంచి ఆగ్నేయాసియా చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. తాజా సుంకాలతో ఈ వాణిజ్య పరిమాణాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఉదాహరణకు, టెక్స్టైల్ సంస్థలు తక్కువ వాణిజ్య అవరోధాలు ఉన్న మార్కెట్లకు తమ ఎగుమతులను మళ్లిస్తున్నాయి. అయినప్పటికీ ఈ మార్కెట్లు తరచుగా తక్కువ మార్జిన్లను అందిస్తాయి.ఇదీ చదవండి: థియేటర్ల పంట పండుతుందిలా..యూఎస్‌పై చైనా రివర్స్ సుంకాలుఅమెరికా వస్తువులపై చైనా సుంకాలను 125 శాతానికి పెంచుతున్నట్లు ఇటీవల ప్రకటించింది. ఇది సోయాబీన్స్, పంది మాంసం వంటి వాటితోపాటు ఇంధనాలు, యంత్రాలు లక్ష్యంగా చేసుకుంది. యూఎస్ ఉత్పత్తిదారులపై ఒత్తిడి తీసుకురావాలని ఉద్దేశంతో ఈమేరకు చైనా ప్రతీకార సుంకాలను విధించింది. -
టారిఫ్ పాజ్.. మార్కెట్ జోష్
ముంబై: భారత్‌తో సహా 75 దేశాలపై ట్రంప్ సుంకాలను మూడు నెలలు వాయిదా వేయడంతో దేశీయ స్టాక్ సూచీలు రెండు శాతం మేర ర్యాలీ చేశాయి. ద్రవ్యోల్బణ ఆందోళనలు పరిమితం చేస్తూ క్రూడాయిల్ ధరలు దిగిరావడం, అమెరికా కరెన్సీ డాలర్ క్షీణత అంశాలు ఇన్వెస్టర్లకు విశ్వాసాన్నిచ్చాయి. ఫలితంగా శుక్రవారం సెన్సెక్స్ 1,310 పాయింట్లు పెరిగి 75వేల స్థాయిపైన 75,157 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 429 పాయింట్లు బలపడి 22,829 వద్ద నిలిచింది. సూచీల లాభాల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సంపదగా భావించే, బీఎస్ఈలోని లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ శుక్రవారం ఒక్కరోజే రూ.7.85 లక్షల కోట్లు పెరిగి రూ.401.67 లక్షల కోట్లు(4.66 ట్రిలియన్ డాలర్లు)కు చేరింది.రోజంతా లాభాలుసెన్సెక్స్ 988 పాయింట్ల లాభంతో 74,835 వద్ద, నిఫ్టీ 296 పాయింట్లు పెరిగి 22,695 వద్ద మొదలయ్యాయి. అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు రోజంతా భారీ లాభాల్లోనే కదలాడాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,620 పాయింట్లు ఎగసి 75,467 వద్ద, నిఫ్టీ 525 పాయింట్లు బలపడి 22,924 వద్ద ఇంట్రాడే గరిష్టాలు తాకాయి.రంగాల వారీగా ఇండెక్సులుడాలర్ బలహీనతతో ఎగుమతులపై లాభాలు ఆర్జించే మెటల్, ఫార్మా షేర్లకు భారీ డిమాండ్ లభించింది. బీఎస్ఈలో మెటల్ ఇండెక్స్ 4.29%, కమోడిటీస్ 3.50%, కన్జూమర్ డ్యూరబుల్స్, యుటిలిటీస్ సూచీలు 3% ర్యాలీ చేశాయి. విద్యుత్, ఇంధన, ఇండ్రస్టియల్స్, కన్జూమర్ డి్రస్కేషనరీ, హెల్త్‌కేర్ సూచీలు రెండుశాతం పెరిగాయి. వొలటాలిటి ఇండెక్స్(వీఐఎక్స్) 6% క్షీణించి 20.11 స్థాయికి దిగివచి్చంది. బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 3%, మిడ్ క్యాప్ సూచీ రెండు శాతం లాభపడ్డాయి. రెండు షేర్లకే నష్టాలుసెన్సెక్స్లో 30 షేర్లలో ఏషియన్ పెయింట్స్ (0.64%), టీసీఎస్(0.43%) మాత్రమే నష్టపోయాయి. మిగిలిన 28 షేర్లు 5% వరకు ర్యాలీ చేశాయి. అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ 2.33%, రిలయన్స్ ఇండస్ట్రీస్ 3%, ఐసీఐసీఐ బ్యాంకు 1%, ఎయిర్టెల్ 2.50%, కోటక్ మహీంద్రా బ్యాంకు, ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్ 3% రాణించి ర్యాలీకి దన్నుగా నిలిచాయి. సెన్సెక్స్ ఆర్జించిన మొత్తం పాయింట్లలో ఈ షేర్ల వాటాయే 807 పాయింట్లు కావడం విశేషం.నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఐటీ దిగ్గజం టీసీఎస్ షేరు డీలాపడింది. బీఎస్ఈలో అరశాతం పతనమై రూ.3232 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 1% పైగా నష్టపోయి రూ.3205 వద్ద కనిష్టాన్ని తాకింది.ఇదీ చదవండి: పెట్రోల్ పంపులో ఉచిత సదుపాయాలివే..రూపాయి వరుస నష్టాలకు చెక్అమెరికా డాలర్ అనూహ్య క్షీణత, దేశీయ ఈక్విటీ మార్కెట్ బలమైన ర్యాలీతో డాలర్ మారకంలో రూపాయి విలువ 58 పైసలు బలపడి 86.10 వద్ద స్థిరపడింది. దీంతో దేశీయ కరెన్సీ నాలుగు రోజుల వరుస నష్టాలకు ముగింపు పడినట్లైంది. ఉదయం ఫారెక్స్ మార్కెట్లో 86 వద్ద మొదలైంది. రోజంతా లాభాల్లో ట్రేడై ఇంట్రాడే గరిష్టం వద్ద స్థిరపడింది. ‘‘ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్ ఇండెక్స్ 4 ఏళ్లలో తొలిసారి 100 స్థాయికి దిగిరావడంతో పాటు క్రూడాయిల్ ధర తగ్గడం కూడా కలిసొచ్చాయి. వచ్చే వారంలో దేశీయ కరెన్సీ 85.75–86.25 శ్రేణిలో ట్రేడవ్వొచ్చు’’ అని ఫిన్రెక్స్ ట్రైజరీ అడ్వైజర్స్ ఎండీ అనిల్ కుమార్ బన్సాలీ తెలిపారు. -
ఆగ్నేయాసియాపై చైనా దృష్టి
బీజింగ్: అమెరికా టారిఫ్‌ల పోరు నేపథ్యంలో ప్రాంతీయ బంధాలను బలోపేతం చేసుకోవడంపై చైనా దృష్టి పెట్టింది. అధ్యక్షుడు జిన్ పింగ్ వచ్చే వారం మూడు ఆగ్నేయాసియా దేశాల్లో పర్యటించనున్నారు. ఏప్రిల్ 14 నుంచి 15 వరకు వియత్నాంలో, 18 వరకు మలేసియా, కంబోడియాల్లో ఆయన పర్యటిస్తారని చైనా విదేశాంగ శాఖ శుక్రవారం ప్రకటించింది. సుంకాల బాదుడు నుంచి ఇతర దేశాలన్నింటికీ 90 రోజుల ఉపశమనం కలి్పంచిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై మాత్రం టారిఫ్‌లు ఎడాపెడా పెంచేసిన నేపథ్యంలో జిన్‌పింగ్ పర్యటనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అమెరికా వాణిజ్య యుద్ధాన్ని ఎదుర్కోవడంలో కలిసి రావాల్సిందిగా భారత్‌కు కూడా చైనా విజ్ఞప్తి చేసింది. -
చైనా.. తగ్గేదేలే!
బీజింగ్: అమెరికా, చైనా టారిఫ్ పోరు మరింత ముదిరింది. చైనాపై మొత్తం సుంకాలు 145 శాతానికి చేరినట్టు అమెరికా గురువారం ప్రకటించడం తెలిసిందే. ఆ మర్నాడే ఆ దేశంపై సుంకాలను 84 నుంచి 125 శాతానికి పెంచుతూ చైనా నిర్ణయం తీసుకుంది. చైనా కస్టమ్స్ టారిఫ్ కమిషన్ శుక్రవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఈ నిర్ణయం శనివారం నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించింది. అమెరికా దుందుడుకు చర్యలను దీటుగా ఎదుర్కొంటామే తప్ప వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని పునరుద్ఘాటించింది. అయితే, ‘‘మాపై అమెరికా ఇప్పటికే సుంకాలను అవాస్తవిక రీతిలో పెంచేసింది. ఇంకా పెంచితే ఇక అర్థముండదు. ప్రపంచ ఆర్థిక చరిత్రలోనే ఓ నవ్వులాట ఉదంతంగా నిలిచిపోతుంది. అమెరికా ప్రస్తుత టారిఫ్‌లను భరిస్తూ ఆ దేశ దిగుమతులను చైనా మార్కెట్లోకి అనుమతించడం ఇప్పటికే అసాధ్యంగా మారిపోయింది. కనుక మాపై అమెరికా టారిఫ్‌లను ఇంకా పెంచేసినా మేం మాత్రం ఆ దేశంపై అదనపు సుంకాలు విధించబోం’’ అని స్పష్టం చేసింది. ఈ మతిలేని దూకుడు ఎవరికీ మేలు చేయదని చైనా వాణిజ్య శాఖ పేర్కొంది. వాణిజ్య యుద్ధాల్లో విజేతలంటూ ఎవరూ ఉండరని అభిప్రాయపడింది. ‘‘అందుకే టారిఫ్‌ల విషయంలో అమెరికాతో చర్చలకు ఇప్పటికీ చైనా సిద్ధంగానే ఉంది. మావైపు నుంచి తలుపులు తెరిచే ఉన్నాయి. చర్చలు, సంప్రదింపుల ద్వారా విభేదాలను పరిష్కరించుకుంటామనే ఆశిస్తున్నాం’ అని స్పష్టం చేసింది. అయితే ఏ చర్చలైనా సమానత్వం, పరస్పర విశ్వాసాల ప్రాతిపదికన జరగాలని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ స్పష్టం చేశారు. ట్రంప్ టారిఫ్‌లను అమెరికా ప్రజలే విమర్శిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. భారత్ సహా ఇతర దేశాలపై ప్రకటించిన ప్రతీకార సుంకాలను 90 రోజుల పాటు ట్రంప్ తాత్కాలికంగా పక్కన పెట్టడం తెలిసిందే. చైనాపై మాత్రం సుంకాలను ఏకంగా 125 శాతానికి పెంచుతూ ఆయన నిర్ణయం తీసుకున్నారు. 20 శాతం ఫెంటానిల్ సుంకంతో కలిపి అది 145 శాతానికి చేరినట్టు వైట్‌హౌస్ గురువారం స్పష్టతనిచి్చంది.ఏకాకిగా మిగులుతారు అమెరికాపై జిన్‌పింగ్ ధ్వజం కలసికట్టుగా ఎదుర్కొందాం ఈయూ దేశాలకు పిలుపుఅమెరికా టారిఫ్‌లపై చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తొలిసారిగా స్పందించారు. అవి ఫక్తు ఏకపక్ష పోకడలంటూ మండిపడ్డారు. ‘‘టారిఫ్‌ల యుద్ధంలో ఎవరూ గెలిచేదుండదు. ఇలా ప్రపంచం మొత్తానికీ వ్యతిరేకంగా వెళ్తే ఏకాకులు కావడం మినహా ఒరిగేదేమీ ఉండదు’’ అంటూ హితవు పలికారు. స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్‌తో శుక్రవారం బీజింగ్‌లో జిన్‌పింగ్ భేటీ అయ్యారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దూకుడును అడ్డుకోవడంలో తమతో కలిసి రావాల్సిందిగా యూరోపియన్ యూనియన్‌కు ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ‘‘ఇది మన అంతర్జాతీయ బాధ్యత కూడా. మన సంయుక్త స్పందన ఇరుపక్షాలకు మాత్రమే గాక మొత్తం అంతర్జాతీయ సమాజానికీ మేలు చేస్తుంది. స్వేచ్ఛాయుత వాణిజ్య వాతావరణాన్ని కాపాడుతుంది’’ అని అభిప్రాయపడ్డారు. ‘‘చైనా ఏనాడూ ఇతరుల దయపై ఆధారపడలేదు. 70 ఏళ్లుగా స్వయంసమృద్ధినే, కష్టాన్నే నమ్ముకుంది’’ అని జిన్‌పింగ్ స్పష్టం చేశారు. -
ట్రంప్ పన్నులపై చైనా జిన్‌పింగ్ ఫస్ట్ రియాక్షన్.. ఏమన్నారంటే..
బీజింగ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 145 శాతం సుంకాలను ఏకపక్ష బెదిరింపు అని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అభివర్ణించారు. ట్రంప్ బెదిరింపులను ప్రతిఘటించడానికి యూరోపియన్ యూనియన్ తమతో కలిసి రావాలని జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. అలాగే, అమెరికా ఉత్పత్తులపై సుంకాలను చైనా 125 శాతానికి పెంచినట్టు చెప్పుకొచ్చారు. చైనాపై అమెరికా భారీగా పన్నులను పెంచిన నేపథ్యలో అధ్యక్షుడు జిన్‌పింగ్ స్పందించారు. ఈ సందర్బంగా జిన్‌పింగ్ మాట్లాడుతూ..‘ట్రంప్ విధించిన 145 శాతం సుంకాలు బెదిరింపులతో కూడినవి. ఏకపక్షంగా అమెరికా నిర్ణయాలు తీసుకుంది. ఇది సమంజసం కాదు. ట్రంప్ పన్నులను ప్రతిఘటించడానికి యూరోపియన్ యూనియన్ మాతో కలిసి రావాలని కోరుతున్నాను. యూరప్ తమ అంతర్జాతీయ బాధ్యతలను నెరవేర్చాల్సి ఉంది. అందరూ కలిసి ఐకమత్యంగా అమెరికాపై పోరాటం చేయాల్సి ఉంది’ అని చెప్పుకొచ్చారు.మరోవైపు.. చైనాపై అమెరికా 145 శాతం సుంకాలు విధించిన నేపథ్యంలో జిన్‌పింగ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మూడు ఆగ్నేయాసియా దేశాల పర్యటనకు అధ్యక్షుడు జిన్‌పింగ్ బయలుదేరి వెళ్లారు. ఏప్రిల్ 14 నుంచి వియత్నాం, మలేసియా, కంబోడియాలో జిన్‌పింగ్ పర్యటించనున్నారు. ఇక, డొనాల్డ్ ట్రంప్.. వియత్నాం, కంబోడియా దేశాలపై కూడా భారీగానే పన్నులు విధించారు. వియత్నాంపై 46 శాతం, కంబోడియాపై 49 శాతం సుంకాలు విధించారు. ఈ నేపథ్యంలో ఆయా దేశాలతో జిన్‌పింగ్ చర్చలు జరపనున్నారు.Latest UY | WorldXi Jinping’s Southeast Asia Tour: A Move Amidst U.S. Trade Storm?Chinese President Xi Jinping embarks on a pivotal journey to Vietnam, Malaysia, and Cambodia starting April 14, aiming to fortify bonds with key allies as U.S. tariffs tighten their grip. With… pic.twitter.com/IfsHmtQ4c1— UnreadWhy (@TheUnreadWhy) April 11, 2025జిన్‌పింగ్ చాలా స్మార్ట్: ట్రంప్అంతకుముందు.. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘జిన్‌పింగ్‌కు ఎప్పుడు ఏం చేయాలో బాగా తెలుసు. దేశం అంటే ఆయనకు ఎంతో ప్రేమ. ఆ విషయం నాకు బాగా తెలుసు. జిన్‌పింగ్ గురించీ తెలుసు. ఆయన సుంకాలపై ఒక ఒప్పందం కుదుర్చుకుంటారని నేను అనుకుంటున్నా. త్వరలోనే దీనిపై చర్చించేందుకు అక్కడి (చైనా) నుంచి మాకు ఫోన్ కాల్ వస్తోందని భావిస్తున్నా. దానికి మేం సిద్ధంగా ఉన్నాం’ అని పేర్కొన్నారు. -
అమెరికాపై ప్రతీకార సుంకాలు 90 రోజులు వాయిదా
బ్రస్సెల్స్: అమెరికా ఉత్పత్తులపై ప్రతీకార సుంకాల అమలును 90 రోజులపాటు నిలిపివేస్తున్నట్లు యూరోపియన్ యూనియన్(ఈయూ) ఎగ్జిక్యూటివ్ కమిషన్ గురువారం వెల్లడించింది. తమ ఉత్పత్తులపై విధించిన టారిఫ్‌లను 90 రోజులు నిలిపివేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తాము సైతం ఆయన బాటలో నడవనున్నట్లు ప్రకటించింది. టారిఫ్‌ల విషయంలో అమెరికాతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్ గురువారం ఒక ప్రకటనలో స్పష్టంచేశారు. 23.25 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా ఉత్పత్తులపై సుంకాలు విధిస్తూ ఇప్పటికే తీసుకున్న నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని చెప్పారు. అమెరికాలో చర్చలకు ఒక అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉద్ఘాటించారు. చర్చలు సంతృప్తికరంగా సాగకపోతే అమెరికాపై ప్రతీకార సుంకాలు కచ్చితంగా అమల్లోకి వస్తాయని స్పష్టంచేశారు. ఈయూ నుంచి దిగుమతి అయ్యే స్టీల్, అల్యూమినియంపై ట్రంప్ తొలుత 25 శాతం టారిఫ్ విధించిన సంగతి తెలిసిందే. దీన్ని 90 రోజులపాటు ఆయన నిలిపివేశారు. -
మా తలుపులు తెరిచే ఉన్నాయి
బీజింగ్/వాషింగ్టన్: టారిఫ్‌ల విషయంలో అమెరికాతో చర్చలకు తమ తలుపులు తెరిచే ఉన్నాయని చైనా వాణిజ్య శాఖ ప్రతినిధి హీ యోంగ్కియాన్ గురువారం చెప్పారు. తాము ఘర్షణ కోరుకోవడం లేదని అన్నారు. చైనా వైఖరి స్పష్టంగా, స్థిరంగా ఉందన్నారు. ఎవరూ కవ్వింపు చర్యలకు పాల్పడొద్దని సూచించారు. అమెరికాతో చర్చలు పరస్పర గౌరవం, సమానత్వం ప్రాతిపదికన జరగాలని ఆకాంక్షించారు. కానీ, ఒత్తిళ్లకు, బెదిరింపులకు గురిచేయడం, బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడడం వంటి చర్యలకు దిగితే సహించబోమని హెచ్చరించారు. చైనాతో డీల్ చేసే విధానం అది కాదని అన్నారు. ఒకవేళ వాణిజ్య యుద్ధాన్ని అమెరికా మరింత ముందుకు తీసుకెళ్తే తాము చివరి వరకూ పోరాడుతామని తేల్చిచెప్పారు. జిన్‌పింగ్ తెలివైన నాయకుడు: ట్రంప్ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ చాలా తెలివైన నాయకుడని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు. ఎప్పుడేం చేయాలో జిన్‌పింగ్‌కు బాగా తెలుసని అన్నారు. టారిఫ్‌ల విషయంలో చైనా పాలకులు అమెరికాతో ఒప్పందం కుదుర్చుకుంటారని భావిస్తున్నట్లు తెలిపారు. దీనిపై చర్చించడానికి జిన్‌పింగ్ నుంచి త్వరలోనే తనకు ఫోన్‌కాల్ వస్తుందని భావిస్తున్నానని చెప్పారు. చైనాలో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని ట్రంప్ స్పష్టంచేశారు. చైనాపై 145 శాతం బాదుడు చైనా ఉత్పత్తులపై 125 శాతం సుంకాలు విధిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించగా, మరో 20 శాతం సుంకాలను కూడా దీనికి జతచేసినట్లు శ్వేతసౌధం తాజాగా స్పష్టంచేసింది. చైనా నుంచి ఫెంటనిల్ అక్రమ రవాణాకు సంబంధించి గతంలో విధించిన 20 శాతం సుంకాలకు ఈ 125 శాతం సుంకాలు అదనమని తెలియజేసింది. చైనాపై మొత్తం సుంకాలు 145 శాతానికి చేరుకున్నట్లు నిర్ధారించింది. మరోవైపు అమెరికా ఉత్పత్తులపై చైనాలో సుంకాలు 84 శాతానికి చేరిన సంగతి తెలిసిందే.ఇండియాపై 26 శాతం అదనపు టారిఫ్ జూలై 9 దాకా రద్దు ఇండియాపై విధించిన 26 శాతం అదనపు టారిఫ్‌ను 90 రోజులపాటు రద్దు చేస్తున్నట్లు వైట్‌హౌస్ ప్రకటించింది. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేసింది. ఈ ఏడాది జూలై 9 దాకా ఈ అదనపు సుంకాలు అమల్లో ఉండవని పేర్కొంది. -
టార్గెట్ చైనా ఎందుకంటే..!
కాళ్లబేరానికి వచ్చిన కారణంగా డజన్ల కొద్దీ ప్రపంచదేశాలపై ఆంక్షల కత్తిని దింపకుండా 90 రోజులు ఆగుతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ప్రకటించారు. వాస్తవానికి బుధవారం నుంచే అన్ని దేశాలపై పెరిగిన టారిఫ్‌లు అమల్లోకి రావాల్సి ఉండగా ఆఖరి నిమిషంలో ట్రంప్ తన నిర్ణయాన్ని అనూహ్యంగా వాయిదా వేశారు. అయితే ఇందులో అనూహ్యమేమీ లేదని, ట్రంప్ అసలు లక్ష్యం ఈ దేశాలు కాదని, చైనాయే అసలు లక్ష్యమని కొందరు అంతర్జాతీయ వాణిజ్యరంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. వాళ్లు చెప్పినట్లు నిజంగానే ట్రంప్ కేవలం చైనా ఉత్పత్తులు, ఎగుమతి మార్కెట్‌పై కత్తిగట్టారా? అనే చర్చ ఇప్పుడు వాణిజ్యవర్గాల్లో మొదలైంది. దీనికి కొన్నేళ్ల క్రితమే బీజాలు పడ్డాయని తెలుస్తోంది. తొలి దఫా పగ్గాలు చేపట్టినప్పుడేదాదాపు 13 ఏళ్ల క్రితంనాటి సంగతి. చైనా వాణిజ్య రాజధాని షాంఘైలో హఠాత్తుగా అంతర్జాతీయ వాణిజ్య సంబంధాల బలోపేతంపై విస్తృతస్థాయి సమావేశాలు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వస్తూత్పత్తుల వినిమయ అవకాశం ఉన్న దేశాలతో చైనా వాణిజ్య సంబంధాలను బలపర్చుకుంది. అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు, కంపెనీలు, దేశాల ప్రభుత్వాలతో చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం చర్చలు జరిపింది. చవగ్గా సరుకుల సరఫరాపై ఒప్పందాలు కుదిరాయి. విదేశీ సంస్థల ప్రతినిధులు, చైనా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఉన్నతాధికారులు, ప్రముఖ ఆర్థికవేత్తల మధ్య సఖ్యత కుదిరింది. దీంతో చైనా నుంచి అన్ని రకాల ఉత్పత్తుల ఎగుమతి అనూహ్యంగా ఊపందుకుంది. చైనాకు నిరాయుధ సైన్యంగా పేరొందిన కార్మికుల కష్టంతో పురుడుపోసుకున్న లక్షల కోట్ల రూపాయల వస్తువులు ప్రపంచదేశాలకు ఎగుమతి అయ్యాయి. ఆ పరంపర అప్రతిహతంగా కొనసాగి అమెరికాను తోసిరాజని చైనా ప్రపంచ ఎగుమతి కేంద్రంగా మారింది. మారిన ఈ పరిణామాలను ట్రంప్ అస్సలు జీర్ణించుకోలేకపోయారు. తక్కువ ధరకే వస్తువులు లభిస్తుండటంతో ప్రపంచదేశాల కీలక వ్యాపారసంస్థలన్నీ చైనాకే క్యూకట్టాయి. అక్కడ ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పాయి. రోల్స్ రాయిస్, జనరల్ మోటార్స్, ఫోక్స్‌వ్యాగన్ సంస్థల ఉత్పత్తులూ చైనాలో తయారవడం మొదలైంది. దీంతో దశాబ్దాల చరిత్ర కల్గిన అమెరికాలోని కొన్ని కంపెనీల నుంచి ఉత్పత్తి తగ్గింది. దీంతో అమెరికా పరిశ్రమల్లో కార్మికుల జీవితాల్లో వెలుగులు తగ్గిపోయాయి. అమెరికాకు పరిశ్రమల నుంచి రెవెన్యూ పడిపోయింది. అమెరికా పారిశ్రామికరంగానికి పూర్వవైభవం తెస్తానని తొలిసారి ఎన్నికల్లో పోటీచేసినప్పుడే ట్రంప్ ఓటర్లకు మాటిచ్చారు. గెలిచి అధికారం చేపట్టారు. కానీ ఆ నాలుగేళ్లలో అనుకున్న వ్యూహాలను అమలుచేయలేకపోయారు. దీనికి ఇతరత్రా కారణాలున్నాయి. ఇప్పుడు రెండోదఫా అధికారంలోకి రాగానే పాత ప్రణాళికలకు పదునుపెట్టి ప్రయోగిస్తున్నారు. దాని ఫలితమే ఈ టారిఫ్‌ల పరంపర. ఎగుమతులు పెరిగాక చైనాలో ఏం జరిగింది? ఎగుమతులతో చైనా ఆర్థికాభివృద్ది సాధించాక అక్కడ పౌరులు పాలనలో సంస్కరణలు కోరుకున్నారు. కానీ ఏక పార్టీ, నియంతృత్వపాలనలో ఆ కల నెరవేరలేదు. కొనుగోలు శక్తి పెరిగాక వినిమయ సమాజంగా అభివృద్ధి చెందాలని జనం భావించినా అదీ నెరవేరలేదు. ప్రభుత్వం కేవలం ఎగుమతులపైనా దృష్టిసారించింది. 2015లో బహిర్గతమైన ‘‘మేడిన్ చైనా 2025’ బ్లూప్రింట్ సైతం ఇదే విషయాన్ని ఉద్ఘాటించింది. గుండుసూది నుంచి గగనతల రక్షణ వ్యవస్థలదాకా, విద్యుత్వాహనాలు మొదలు అధునాతన యుద్ధవిహంగాల దాకా ప్రతిరంగంలో అగ్రగామిగా వెలుగొందడమే లక్ష్యంగా ముందుకుసాగి ఆ పనిలో సఫలీకృతమైంది. ఇదే సమయంలో అమెరికాలో ట్రంప్ రాజకీయ రంగప్రవేశంచేసి చైనా ఎగుమతి మార్కెట్ ఎదుగుదలకు అడ్డుకట్టవేయాలని కంకణం కట్టుకున్నారు. ఎన్నికల హామీల్లోనే అదే చెప్పారు. చైనా ఇప్పటికే ప్రపంచంలోని మొత్తం విద్యుత్ వాహనాల తయారీలో 60 శాతం వాటాను ఒడిసిపట్టింది. ఈ 60 శాతంలోకూడా అధిక బ్రాండ్లు స్వదేశానివే కావడం విశేషం. ఇక బ్యాటరీల్లోనూ 80 శాతం అక్కడే తయారవుతున్నాయి. వీటిని దెబ్బకొట్టేందుకే ట్రంప్ టారిఫ్‌ల కొరడాను ఝుళిపిస్తున్నారు. చైనా పరిశ్రమలను దెబ్బకొడితే అమెరికా పరిశ్రమలకు పునరుజ్జీవం సాధ్యమని ట్రంప్ బలంగా నమ్ముతున్నారు. ట్రంప్ నిర్ణయం యావత్ ప్రపంచ వాణిజ్యవ్యవస్థనే కుదుపునకు గురయ్యేలా చేస్తోంది. ఇప్పుడేం జరగొచ్చు? అతి టారిఫ్‌ల భారాన్ని అమెరికా తమపై మోపిన నేపథ్యంలో చైనా ముంగిట ఇప్పుడు రెండు మార్గాలున్నాయి. సంప్రదింపుల ప్రక్రియ ద్వారా టారిఫ్‌లను చైనా తగ్గించుకోవచ్చు. ఇందుకోసం చైనా తన ఎగుమతి ఆధారిత ఆర్థికవ్యవస్థ విధానాలను అమెరికాకు అనుగుణంగా మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే చైనా గత చరిత్రను చూస్తే ఇది జరగకపోవచ్చని అర్థమవుతుంది. అగ్రగామి ప్రపంచ ఆర్థిక శక్తిగా మారేందుకు ఎన్నాళ్లనుంచో చైనా కలలుకంటోంది. అందుకోసమే ప్రభుత్వ వ్యతిరేకతను ఉక్కుపాదంతో అణిచివేస్తూ దాదాపు ప్రజలందర్నీ ఓ మోస్తరు వృత్తినిపుణులుగా మార్చేసింది. ఆట»ొమ్మలు మొదలు ఫోన్లదాకా అన్ని వస్తువులు కుటీరపరిశ్రమల్లా ఇళ్లలోనే తయారవుతాయి. చైనాలో ఏం జరుగుతోందనే వివరాలు బయటకు పొక్కకుండా మీడియాపైనా కఠిన ఆంక్షలు కొనసాగుతున్నాయి. సొంత టెక్నాలజీనే నమ్ముకున్న ప్రభుత్వం దేశీయ సంస్థలు మినహా చైనా గడ్డపై ఎవరినీ ఎదగనీయదు. ఈ నేపథ్యంలో అమెరికా టెక్నాలజీ కంపెనీలకు చైనా గడ్డపై ఎదిగేందుకు ఒప్పుకోకపోవచ్చు. టారిఫ్‌ల భయాలతో విదేశీ కంపెనీలు చైనాలో పెట్టుబడులను తగ్గించుకుని అమెరికాలో పెట్టుబడులను పెంచుకుంటాయని ట్రంప్ భావిస్తున్నారు. చైనాకు ఆర్డర్లు ఇవ్వడం మానేసి అమెరికన్ కంపెనీలు మళ్లీ దేశీయంగా కర్మాగారాలను తెరుస్తాయని ట్రంప్ ఆశిస్తున్నారు. అదే నిజమైతే మళ్లీ అమెరికాలో కొత్త పారిశ్రామిక విప్లవం రావొచ్చు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చైనాకు ట్రంప్ మరో షాక్.. డ్రాగన్‌పై మరోసారి టారిఫ్ విధింపు
వాషింగ్టన్: అమెరికా,చైనా దేశాల మధ్య టారిఫ్‌ల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా చైనాపై డొనాల్డ్ ట్రంప్ మరోసారి సుంకం విధించారు. దీంతో చైనా వస్తువులపై అమెరికా విధించిన టారిఫ్ మొత్తం 145 శాతానికి చేరుకుందని వైట్‌హౌస్ అధికారి అమెరికన్ మీడియా సంస్థ సీఎన్బీసీకి ధృవీకరించారు. అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం ముదురుతోంది. డ్రాగన్ దిగుమతులపై ఉన్న 20 శాతం సుంకాలకు అదనంగా 34 శాతం విధిస్తున్నట్లు ఇటీవల ట్రంప్ ప్రకటించారు. దీనిపై చైనా దీటుగా స్పందిస్తూ అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 34 శాతం అదనపు సుంకం విధించింది. ఇదే విషయంలో ట్రంప్ డ్రాగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనాకు డెడ్‌లైన్ పెట్టి.. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేదంటే 104 శాతం టారిఫ్‌లు విధిస్తానని హెచ్చరించారు. తామేం తక్కువ కాదన్నట్లుగా అమెరికా ఉత్పత్తులపై 84 శాతం సుంకం విధించింది. JUST IN: 🇺🇸🇨🇳 White House says total US tariffs on China are now 145% pic.twitter.com/67oyICPVNb— Mastering Crypto 🇺🇲 (@MasteringCrypt) April 10, 2025పట్టు వీడి దిగి రావాల్సింది పోయి అర్థం లేని దూకుడుగా వ్యవహరిస్తుందంటూ చైనాపై మరో 50 శాతం కలిపి మొత్తంగా 125 శాతం టారిఫ్‌ను విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ తరుణంలో తాజాగా మరో 20 శాతం టారిఫ్ పెంచారు. దీంతో చైనా దిగుమతులపై అమెరికా విధించిన సుంకం 145శాతానికి చేరినట్లైంది. ఇదే విషయాన్ని వైట్ హౌస్ వర్గాలు అధికారికంగా ప్రకటించారు. -
ఇక ఫార్మా వంతు!
వాషింగ్టన్: ఎడాపెడా టా రిఫ్లతో వీరంగం వేస్తున్న అమెరికా అధ్యక్షుని దృష్టి ఇప్పుడు ఫార్మా రంగంపై కూడా పడింది. ఇప్పటిదా కా విధించిన టారిఫ్‌ల నుంచి వాటిని మినహాయించడం తెలిసిందే. కానీ వాటిపైనా అదనపు సుంకాలు వేయనున్నట్టు ట్రంప్ తాజాగా మరో బాంబు పేల్చారు. ‘‘ఫార్మాస్యూటికల్స్ మీద కూడా భారీగా టారిఫ్‌లు వేయనున్నాం. అవి ఎంతన్నది అతి త్వరలో ప్రకటిస్తాం’’ అని మంగళవారం రాత్రి రిపబ్లికన్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన వెల్లడించారు. ‘‘ఆ తర్వాత ఫార్మా కంపెనీలన్నీ చైనాను వీడతాయి. మరెన్నో ఇతర దేశాలను కూడా ఉన్నపళంగా వదిలేస్తాయి. రెక్కలు కట్టుకుని మరీ అమెరికాలో వచ్చి వాలతాయి. ఎందుకంటే వాటి ఉత్పత్తులను అమ్ముకోవాలి కదా! వాటికి అతి పెద్ద మార్కెట్ అమెరికాయే. అవన్నీ అమెరికాలోనే ప్లాంటు తెరవాలి. ఇక్కడే ఉత్పత్తి చేపట్టాలి. చైనాలోనో, మరో దేశంలోనో కాదు’’ అని చెప్పుకొచ్చారు. -
టారిఫ్‌లకు ట్రంప్ బ్రేక్
ప్రపంచవ్యాప్త ఆర్థిక ప్రకంపనల నేపథ్యంలో ట్రంప్ వెనక్కు తగ్గారు. భారత్‌తో పాటు 75 పై చిలుకు దేశాలపై విధించిన ప్రతీకార సుంకాలను తాత్కాలికంగా పక్కన పెట్టారు. వాటి అమలును 90 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. దాంతో అదనపు సుంకాలు అమల్లోకి వచ్చిన ఒక్క రోజులోనే అటకెక్కాయి. కానీ చైనాతో మాత్రం అమెరికా టారిఫ్‌ల పోరు బుధవారం మరింత తీవ్రరూపు దాల్చింది. ఈ దిశగా రోజంతా శరవేగంగా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. 50 శాతం అదనపు సుంకాలు విధిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించిన గంటల వ్యవధిలోనే అమెరికాపైనా చైనా అంతే మొత్తం బాదింది. అమెరికా ఉత్పత్తులపై 84 శాతం సుంకాలు గురువారం నుంచే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. దీనిపై ట్రంప్ తీవ్రంగా కన్నెర్రజేశారు. చైనా ఉత్పత్తులపై ఇప్పటికే 104 శాతానికి చేరిన సుంకాలను ఏకంగా 125 శాతానికి పెంచేశారు. అవి తక్షణం అమల్లోకి వస్తాయని కుండబద్దలు కొట్టారు. మరోవైపు యూరోపియన్ యూనియన్ కూడా అమెరికాపై మళ్లీ సుంకాల కత్తి ఝుళిపించింది. 23 బిలియన్ల విలువైన యూఎస్ ఉత్పత్తులపై దశలవారీగా అదనపు టారిఫ్‌లు విధిస్తున్నట్టు ప్రకటించింది. కెనడా కూడా అమెరికా ఆటో ఉత్పత్తులపై 25 శాతం అదనపు సుంకాలు విధిస్తున్నట్టు పేర్కొంది. బీజింగ్/వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నట్టుండి వెనక్కు తగ్గారు. తన ఎడాపెడా టారిఫ్‌ల దెబ్బకు ప్రపంచ మార్కెట్లు కుదేలవడమే గాక ఆర్థిక మాంద్య పరిస్థితులు తలెత్తడంతో పునరాలోచనలో పడ్డారు. చైనా మినహా 75 పై చిలుకు దేశాలపై విధించిన ప్రతీకార సుంకాల అమలును 90 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్టు బుధవారం ప్రకటించారు. ‘‘ఆ దేశాలు చైనా మాదిరిగా మాపై తిరిగి ప్రతీకార చర్యలకు పాల్పడలేదు. పైగా టారిఫ్‌లపై మాతో చర్చలకు ముందుకొస్తున్నాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా’’ అని సొంత సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. దాంతో భారత్ సహా ఆయా దేశాలకు తాత్కాలికంగా ఊరట లభించింది. భారత్‌పై ట్రంప్ 26 శాతం అదనపు సుంకాలు విధించడం తెలిసిందే. లెసొతో (50 శాతం), మడగాస్కర్ (47), వియత్నాం (46), తైవాన్ (32), దక్షిణ కొరియా (25), జపాన్, ఈయూ (20) తదితర దేశాలపైనా భారీగా వడ్డించారు. బుధవారం అమల్లోకి వచ్చిన ఈ సుంకాలు 24 గంటలు కూడా గడవకముందే వాయిదా పడ్డాయి. అయితే ఆ దేశాలన్నింటిపైనా 10 శాతం బేస్‌లైన్ టారిఫ్ మాత్రం కొనసాగుతుందని ట్రంప్ స్పష్టం చేశారు. చైనాపై మాత్రం ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘మాపట్ల, ప్రపంచ మార్కెట్ల పట్ల చైనా ఏమాత్రమూ గౌరవం చూపలేదు. పట్టు వీడి దిగి రావాల్సింది పోయి అర్థం లేని దూకుడుకు పోయింది’’ అంటూ తీవ్రంగా ఆక్షేపించారు. చైనాపై ఇప్పటికే విధించిన 104 శాతం సుంకాలను ఏకంగా 125 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించారు. అవి తక్షణం అమల్లోకి వచ్చాయని ట్రంప్ స్పష్టం చేశారు. ఒక దేశంపై అమెరికా విధించిన అత్యధిక సుంకాలు ఇవే కావడం విశేషం! ట్రంప్ దూకుడుపై తామేమీ చేతులు ముడుచుకు కూచోబోమన్న డ్రాగన్ దేశం అన్నంత పనీ చేసింది. అమెరికాపై మరో 50 శాతం ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించింది. ‘‘ఇప్పటికే ప్రకటించిన 34 శాతంతో కలిపి గురువారం నుంచి అమెరికా ఉత్పత్తులన్నింటి మీదా 84 శాతం సుంకాలు వసూలు చేస్తాం. అవి గురువారం నుంచే అమల్లోకి వస్తాయి’’ అని పేర్కొంది. దాంతో పెద్దన్నల పోట్లాట కాస్తా ముదురు పాకాన పడింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో దాదాపు సగం మేరకు వాటా ఉండే అమెరికా, చైనా టారిఫ్‌ల యుద్ధం తారస్థాయికి చేరింది. మరోవైపు అమెరికా దిగుమతి చేసుకునే అన్నిరకాల ఆటో ఉత్పత్తులపైనా గత గురువారం నుంచే 25 శాతం టారిఫ్ అమల్లోకి వచి్చంది. ఇది ప్రస్తుతానికి కార్లపై మాత్రమే వసూలవుతున్నా మే 3 నుంచి ఆటో విడిభాగాలకూ వర్తించనుంది. దీనికి ప్రతీకారంగా అమెరికా ఆటో ఉత్పత్తులపై బుధవారం నుంచే 25 శాతం సుంకాలు విధిస్తున్నట్టు కెనడా కూడా ప్రకటించింది. తగ్గే ప్రసక్తే లేదు: చైనా అమెరికా దుందుడుకు చర్యలను దీటుగా ఎదుర్కొంటామని, ఈ విషయంలో తగ్గే ప్రసక్తే లేదని చైనా కుండబద్దలు కొట్టింది. ఆ దేశంపై సుంకాలను 84 శాతానికి పెంచుతున్నట్టు చైనా కస్టమ్స్ టారిఫ్ కమిషన్‌ను ఉటంకిస్తూ అధికార వార్తా సంస్థ జిన్హువా వెల్లడించింది. అంతేకాదు, ‘‘ఇప్పటికే ప్రకటించినట్టు మరో 12 యూఎస్ కంపెనీలను ఎగుమతి నియంత్రణ జాబితాలో చేరుస్తున్నాం. వీటితో పాటు మా అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ తైవాన్‌కు ఆయుధాల విక్రయం వంటి చర్యలకు దిగిన ఆరు అమెరికా సంస్థలను అనుమానాస్పద జాబితాలో చేరుస్తున్నాం’’ అని కమిషన్ ప్రకటించింది. అమెరికాది ఫక్తు ఏకపక్ష పోకడ అని దుయ్యబడుతూ చైనా శ్వేతపత్రం కూడా విడుదల చేసింది. ఇరుదేశాల కీలక ప్రయోజనాలను పరస్పరం గౌరవించుకుంటూ సాగాల్సింది పోయి మతిలేని నిర్ణయాలు తీసుకుంటోందంటూ తూర్పారబట్టింది. అమెరికా టారిఫ్‌లను తీవ్ర తప్పిదంగా అభివరి్ణంచింది. అవి చైనా హక్కులను, ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బ తీస్తున్నాయంటూ దుయ్యబట్టింది. దీనిపై ప్రపంచ వాణిజ్య సంస్థలో బుధవారం అదనపు దావా కూడా వేసింది.హాలీవుడ్ సినిమాలపై నిషేధం అమెరికాపై మరిన్ని ప్రతీకార చర్యలకు చైనా సన్నద్ధమవుతోంది. అందులో భాగంగా హాలీవుడ్ సినిమాలపై కూడా నిషేధం విధించాలని యోచిస్తున్నట్టు సమాచారం. అదే జరిగితే వందలాది కోట్ల డాలర్ల విలువైన చైనా మార్కెట్ హాలీవుడ్‌కు దూరమవుతుంది. ఆ పరిశ్రమకు ఇది పెద్ద దెబ్బే’’ అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అమెరికా తర్వాత ప్రపంచంలో రెండో అతి పెద్ద సినీ మార్కెట్ చైనాయే. దీనితోపాటు అమెరికాపై చైనా పరిశీలనలో ఉన్న ఇతర ప్రతీకార చర్యలు... → చైనాతో వ్యాపారం చేస్తున్న అమెరికా సేవా రంగ సంస్థలపై ఆంక్షలు, నిషేధాలు → సోయాబీన్ తదితర అమెరికా వ్యవసాయోత్పత్తులపై భారీ సుంకాలు → చైనాలో ఉన్న అమెరికా కంపెనీలపై అనుచిత మేధో సంపత్తి లబ్ధి అభియోగాలపై విచారణ ఈయూ అదనపు టారిఫ్‌లు బ్రసెల్స్: అమెరికాకు యూరోపియన్ యూనియన్ కూడా మరో సుంకాల షాకిచ్చింది. ఈయూ స్టీల్, అల్యుమినియం దిగుమతులపై ట్రంప్ విధించిన 25 సుంకాలకు ప్రతీకార చర్యలు ప్రకటించింది. ఏకంగా 2,300 కోట్ల డాలర్ల విలువైన అమెరికా ఉత్పత్తులపై అదనపు సుంకాలు విధిస్తున్నట్టు బుధవారం పేర్కొంది. ఇవి దశలవారీగా అమల్లోకి వస్తాయి. ఉత్పత్తుల పేర్లు చెప్పకపోయినా, కొన్నింటిపై ఏప్రిల్ 15 నుంచి, మరికొన్నింటిపై మే 15, ఇంకొన్నింటిపై డిసెంబర్ 1న సుంకాల వసూలు మొదలవుతుందని వివరించింది. ‘‘ఈయూపై అమెరికా సుంకాలు అన్యాయం ఇరుపక్షాలకే గాక ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే హానికరం కూడా’’ అంటూ ఈయూ ఎగ్జిక్యూటివ్ కమిషన్ దుయ్యబట్టింది. అమెరికా, ఈయూ వార్షిక వర్తక విలువ ఏకంగా 1.8 లక్షల కోట్ల డాలర్లు కావడం విశేషం! ఈ నేపథ్యంలో ట్రంప్‌కు హెచ్చరికగా మాత్రమే తాజా సుంకాలను ప్రకటించినట్టు భావిస్తున్నారు. ఈయూ ఉత్పత్తులన్నింటిపైనా ట్రంప్ 20 శాతం సుంకాలు విధించడం తెలిసిందే.దేశాలన్నీ కాళ్ల బేరానికి: ట్రంప్ తన టారిఫ్‌ల దెబ్బకు ప్రపంచ దేశాలు విలవిల్లాడుతున్నాయని ట్రంప్ చెప్పుకున్నారు. ‘‘టారిఫ్‌లను తప్పించుకునేందుకు ఏం చేయడానికైనా సిద్ధమంటున్నాయి. దయచేసి ఒప్పందం చేసుకుందామంటూ కాళ్లబేరానికి వస్తున్నాయి’’ అంటూ గొప్పలు పోయారు. ఆ క్రమంలో ఓ బూతు పదాన్నీ అధ్యక్షుడు ఉపయోగించారు! -
అమెరికాకు షాకిచ్చిన చైనా
బీజింగ్: అమెరికా- చైనాల మధ్య ప్రతీకార సుంకాల వార్ కొనసాగుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald trump) మొదలు పెట్టిన సుంకాల యుద్ధాన్ని చైనా కూడా అదే స్థాయిలో తిప్పికొడుతోంది. ఇందులో భాగంగా బుధవారం అమెరికా వస్తువులపై ప్రస్తుతం ఉన్న 34 శాతం టారిఫ్‌ను 84శాతానికి పెంచుతూ చైనా (China Raises Tariffs On US Goods) నిర్ణయం తీసుకుంది. అంతకుముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై మరో 50 శాతం అదనపు సుంకాలు విధించారు. అమెరికాపై చైనా 34 శాతం ప్రతీకార సుంకాలపై సోమవారం ఆయన మండిపడటం, మంగళవారం మధ్యాహ్నం లోపు వాటిని వెనక్కు తీసుకోవాలని అల్టీమేటం జారీ చేయడం తెలిసిందే. ఆ హెచ్చరికలను డ్రాగన్ దేశం బేఖాతరు చేసింది. బెదిరింపులకు జడిసేది లేదని కుండబద్దలు కొట్టింది. ‘‘మా విషయంలో అమెరికా తప్పులపై తప్పులు చేస్తోంది. ఈ బ్లాక్‌మెయిలింగ్‌కు లొంగే ప్రసక్తే లేదు. చివరిదాకా పోరాడి తీరతాం.#BREAKING 🇨🇳#CHINA to lift additional tariffs to 84% on ALL imported🇺🇸, effective from April 10th.As I said, don't underestimate China's determination to safeguard its legitimate rights and interesting when facing the U.S. global #tariffs bully. pic.twitter.com/BxlKxCGzXw— Shen Shiwei 沈诗伟 (@shen_shiwei) April 9, 2025 మా ప్రయోజనాల పరిరక్షణకు ఎందాకైనా వెళ్తాం. 50 శాతం టారిఫ్‌లు విధిస్తే మావైపు నుంచీ అంతకంతా ప్రతీకార చర్యలుంటాయి’’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ మంగళవారం ప్రకటించారు. వాణిజ్య, టారిఫ్ యుద్ధాల్లో విజేతలంటూ ఎవరూ ఉండరని హితవు పలికారు. అయినా చైనా ఈ విషయమై తమతో చర్చలకు వస్తుందని ఎదురు చూస్తున్నట్టు ట్రంప్ చెప్పుకొచ్చారు. ‘‘వాళ్లూ ఏదో ఒక ఒప్పందానికి రావాలనే ఆశ పడుతున్నారు. కానీ ఎక్కణ్నుంచి మొదలు పెట్టాలా అని సతమతమవుతున్నారు’’ అన్నారు.కానీ మంగళవారం డెడ్‌లైన్ ముగిసినా చైనా నుంచి అలాంటి సూచనలేవీ రాకపోవడంతో వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలిన్ లెవిట్ మీడియా ముందుకొచ్చారు.‘చైనాపై 50 శాతం అదనపు సుంకాలు విధిస్తున్నాం. ఈ నిర్ణయం బుధవారం నుంచే అమల్లోకి వస్తుంది’ అని ప్రకటించారు! దాంతో అగ్ర రాజ్యాల టారిఫ్ పోరు ముదురు పాకాన పడింది.చైనాపై మార్చిలోనే అమెరికా 20 శాతం సుంకాలు విధించడం, గత వారమే ట్రంప్ మరో 34 శాతం బాదడం తెలిసిందే. తాజా 50 శాతంతో కలిపి చైనాపై అమెరికా మొత్తం సుంకాలు ఏకంగా 104 (Trump's 104%) శాతానికి చేరాయి! టారిఫ్‌లపై చైనాతో చర్చలకు చాన్సే లేదని సోమవారమే ట్రంప్ బెదిరించిన నేపథ్యంలో రెండు దేశాల మధ్య పూర్తిస్థాయి వాణిజ్య యుద్ధం తప్పేలా లేదు. -
ట్రంప్ పన్నుల బాదుడు.. చైనా అదిరిపోయే కౌంటర్
బీజింగ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ చర్యల కారణంగా పలు దేశాల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా చైనా, అమెరికా మధ్య టారిఫ్‌ల యుద్ధమే నడుస్తోంది. అమెరికా హెచ్చరికలను బేఖాతరు చేసిన బీజింగ్‌పై ట్రంప్ ఏకంగా 104శాతం టారిఫ్‌లు విధించారు. దీంతో, ట్రంప్ చర్యలపై చైనా ఘాటుగా స్పందించింది.ఈ క్రమంలో అమెరికా విధిస్తున్న పన్నులపై చైనా ప్రీమియర్ లీ కియాంగ్ తాజాగా స్పందించారు. తాజాగా లీ కియాంగ్ మాట్లాడుతూ..‘అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పన్నుల పేరుతో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నారు. ట్రంప్ తీసుకుంటున్న ఇలాంటి నిర్ణయాలు.. అమెరికా ఏకపక్షవాదం, రక్షణవాదం, ఆర్థికపరంగా బలవంతపు చర్యలకు అద్దం పడుతున్నాయి. దీనిపై మేం చివరివరకు పోరాడతాం. సొంత ప్రయోజనాల కోసమే కాకుండా.. అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలను కాపాడేందుకు ప్రయత్నిస్తాం. దీనికి మేం తప్పకుండా ప్రతిస్పందిస్తాం. ఎలాంటి అనిశ్చితులనైనా తట్టుకునేలా మా ఆర్థిక విధానాలను రూపొందించాం. వాణిజ్య భాగస్వాములందరిపైనా ఇలాంటి చర్యలు తీసుకోవడం అమానుషం. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని, తగినవిధంగా బదులిచ్చేందుకు విధానపరంగా అన్ని ఆయుధాలు మా వద్ద ఉన్నాయి’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.ఇదిలా ఉండగా.. ట్రంప్ అన్నంత పనీ చేశారు. చైనాపై మరో 50 శాతం అదనపు సుంకాలు విధించారు. అమెరికాపై చైనా 34 శాతం ప్రతీకార సుంకాలపై సోమవారం ఆయన మండిపడటం, మంగళవారం మధ్యాహ్నం లోపు వాటిని వెనక్కు తీసుకోవాలని అల్టీమేటం జారీ చేయడం తెలిసిందే. కానీ మంగళవారం డెడ్‌లైన్ ముగిసినా చైనా నుంచి అలాంటి సూచనలేవీ రాకపోవడంతో వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలిన్ లెవిట్ మీడియా ముందుకొచ్చారు. ‘‘చైనాపై 50 శాతం అదనపు సుంకాలు విధిస్తున్నాం. ఈ నిర్ణయం బుధవారం నుంచే అమల్లోకి వస్తుంది’’ అని ప్రకటించారు! దాంతో అగ్ర రాజ్యాల టారిఫ్ పోరు ముదురు పాకాన పడింది. చైనాపై మార్చిలోనే అమెరికా 20 శాతం సుంకాలు విధించడం, గత వారమే ట్రంప్ మరో 34 శాతం బాదడం తెలిసిందే. తాజా 50 శాతంతో కలిపి చైనాపై అమెరికా మొత్తం సుంకాలు ఏకంగా 104 శాతానికి చేరాయి! టారిఫ్‌లపై చైనాతో చర్చలకు చాన్సే లేదని సోమవారమే ట్రంప్ బెదిరించిన నేపథ్యంలో రెండు దేశాల మధ్య పూర్తిస్థాయి వాణిజ్య యుద్ధం తప్పేలా లేదు. -
మరో 50 శాతం వేస్తాం
వాషింగ్టన్: చైనాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి విరుచుకుపడ్డారు. అమెరికాపై 34 శాతం ప్రతీకార సుంకాలు విధించడంపై తీవ్రంగా మండిపడ్డారు. ఆ నిర్ణయాన్ని మంగళవారంలోగా వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే బుధవారం నుంచి చైనాపై ఏకంగా మరో 50 శాతం అదనపు సుంకాలు విధిస్తానని సోమవారం హెచ్చరించారు. అంతేకాదు, ‘‘చైనా విజ్ఞప్తి మేరకు పలు అంశాలపై ఆ దేశంతో పురోగతిలో ఉన్న అన్నిరకాల చర్చలనూ ఉన్నపళాన నిలిపేస్తాం. బదులుగా ఇతర దేశాలపై దృష్టి సారిస్తాం. ఆయా రంగాల్లో వాటితో బంధాలను పటిష్టం చేసుకుంటాం’’ అని కుండబద్దలు కొట్టారు. చైనాపై ట్రంప్ ఇటీవలే 34 శాతం సుంకాలు విధించడం, బదులుగా అమెరికాపైనా అంతే శాతం సుంకాలు విధిస్తున్నట్టు చైనా ప్రకటించడం తెలిసిందే. అంతేగాక తమనుంచి అమెరికా దిగుమతి చేసుకుంటున్న పలు కీలక ఖనిజాలపై ఆంక్షలు కూడా విధించింది. దీనిపై ట్రంప్ తీవ్రంగా మండిపడుతూ తన సోషల్ మీడియా హాండిల్ ట్రూత్‌లో పలు పోస్టులు పెట్టారు. ‘‘అమెరికా ఉత్పత్తులపై చైనా ఏళ్లుగా రికార్డు స్థాయిలో భారీ టారిఫ్‌లు వసూలు చేస్తోంది. అవి చాలవన్నట్టు నిన్న మరో 34 శాతం ప్రతీకార సుంకాలు విధించింది. ఇవిగాక చైనా కంపెనీలు అనైతిక సబ్సిడీలు, భారీ ద్రవ్య అవకతవకల వంటివాటికి పాల్పడుతూ వస్తున్నాయి! నేను విధించిన సుంకాలపై ఏ దేశమైనా ప్రతీకార చర్యలకు దిగితే సహించబోమని స్పష్టంగా హెచ్చరించా. వాటిపై అదనపు బాదుడు తప్పదని అప్పుడే స్పష్టం చేశా. చైనా ఇప్పుడు వాటిని రుచిచూడబోతోంది’’ అని ప్రకటించారు. అమెరికాలో ద్రవ్యోల్బణం లేదు తన సుంకాల దెబ్బకు ప్రపంచ మార్కెట్లన్నీ పతనమవుతున్నా ట్రంప్ మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. అమెరికా ద్రవ్యోల్బణం కోరల్లో చిక్కుతోందని ఆర్థిక నిపుణులంతా గగ్గోలు పెడుతున్నా అదేమీ లేదని చెప్పుకొచ్చారు. ఎవరేమన్నా సుంకాలపై తగ్గే ప్రసక్తే లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ప్రపంచం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలంటికీ అమెరికా గత పాలకులు, తమను ఇంతకాలంగా దోచేసిన చైనా వంటి దేశాలే కారణమని నిందించారు. ‘‘ఒక్కోసారి చేదుగా ఉన్నా చికిత్స తప్పదు. నా చర్యల ఫలితాలు ఇప్పటికే కని్పస్తున్నాయి. చమురు ధరలు దిగొచ్చాయి. వడ్డీ రేట్లూ తగ్గుముఖం పడుతున్నాయి. ఆహార పదార్థాల ధరలూ తగ్గుతున్నాయి. ఇక ద్రవ్యోల్బణం ఎక్కడున్నట్టు? పలు దేశాలు అమెరికాను ఇంతకాలం పీల్చి పిప్పి చేశాయి. ముఖ్యంగా చైనా! ఇప్పుడు చూడండి, నా టారిఫ్‌ల దెబ్బకు చైనా మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ఇకపై అమెరికాకు ప్రతి వారం ఏకంగా బిలియన్ల కొద్దీ డాలర్లు వచి్చపడతాయి. చూసుకోండి’’ అంటూ స్పష్టం చేశారు.ఇక భారత్‌లోనే ఉత్పత్తి! యాపిల్, సామ్సంగ్ యోచన మొబైళ్ల తయారీ దిగ్గజాలు యాపిల్, సామ్సంగ్ ట్రంప్ టారిఫ్‌ల ప్రభావాన్ని తప్పించుకునే మార్గాల అన్వేషణలో పడ్డాయి. తమ అంతర్జాతీయ ఉత్పత్తి కేంద్రాలను లాభదాయక ప్రాంతాలకు తరలించాలని యోచిస్తున్నాయి. వియత్నాంపై 46 శాతం చైనాపై 34 శాతం చొప్పున సుంకాలు విధించిన ట్రంప్ భారత్‌పై 26 శాతంతో సరిపెట్టడం తెలిసిందే. దాంతో భారత్‌లో ఉత్పత్తిని వీలైనంతగా పెంచడంతో పాటు అంతర్జాతీయ ఉత్పత్తి వ్యవస్థలను వీలైనంత వరకూ ఇక్కడికి తరలించాలని యాపిల్, సామ్సంగ్ యోచిస్తున్నట్టు సమాచారం. యాపిల్ చాలాకాలంగా భారత్‌లో ఐఫోన్లు తయారు చేస్తోంది. ‘‘చైనాలో ఉత్పత్తిని వీలైనంతగా తగ్గించుకోవాలని కంపెనీ నిర్ణయానికి వచి్చంది. ఇకమీదట అమెరికాకు కేవలం భారత్‌లో తయారైన ఐఫోన్లనే పంపనుంది. ప్రస్తుతానికి చైనాలో తయారు చేసిన ఫోన్లను యూరప్, లాటిన్ అమెరికా, ఆసియా దేశాలకు పంపిస్తుంది’’ అని కంపెనీ వర్గాలను ఉటంకిస్తూ వార్తలొస్తున్నాయి. అంతేగాక ట్రంప్ టారిఫ్‌ల దెబ్బకు అమెరికాలో ఐఫోన్ల ధరలు 40 శాతం దాకా పెరగవచ్చంటున్నారు. -
టారిఫ్‌లను తప్పించుకునేందుకు 50 దేశాలు యత్నించాయి
వాషింగ్టన్: ప్రపంచదేశాలపై టారిఫ్‌ల కొరడా ఝళిపించిన ట్రంప్ సర్కార్‌ను ఎలాగోలా ఒప్పించి టారిఫ్ వాతల నుంచి తప్పించుకోవాలని దాదాపు 50కిపైగా దేశాలు ప్రయత్నంచేశాయని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. కొన్నేళ్లుగా పలు దేశాల టారిఫ్‌ల భారాన్ని మోస్తున్న తామూ ఇకపై పరస్పర టారిఫ్‌లను విధిస్తామని ఇటీవల ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాటిని అమల్లోకి తెచ్చిన విషయం తెల్సిందే. అయితే ఇవి అమల్లోకిరాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరిగాయని, సంప్రదింపుల ద్వారా టారిఫ్‌ల భారాన్ని కొంతైనా తగ్గించుకునేందుకు దేశాలు ప్రయత్నించాయని వైట్‌హౌస్‌లో జాతీయ ఆర్థిక మండలి డైరెక్టర్ కెవిన్ హసెట్ చెప్పారు. 50కిపైగా దేశాలు అమెరికాతో టారిఫ్ సంబంధ మంతనాలు జరిపేందుకు ఆసక్తిచూపాయని కెవిన్ ఓవైపు చెబుతుంటే ఇండోనేసియా, తైవాన్ మాత్రం తాము అమెరికాపై ప్రతీకార టారిఫ్‌లు విధించబోమని ప్రకటించడం విశేషం. అయితే తమపై పడే పన్నుల భారాన్ని కాస్తయినా తగ్గించుకునే లక్ష్యంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ వాషింగ్టన్ డీసీలో ట్రంప్‌తో చర్చలకు బయల్దేరారు. సోమవారం ట్రంప్‌తో ఆయన చర్చలు జరిపే అవకాశం ఉంది. అమెరికాలోకి దిగుమతి అయ్యే అత్యధిక దిగుమతులపై సాధారణంగా కనీసం 10 శాతం అదనపు టారిఫ్‌ను శనివారం ట్రంప్ అమల్లోకి తెచి్చన నేపథ్యంలో పలు దేశాలు సంప్రదింపుల పర్వానికి తెరలేపాయి. కనీసం 45 రోజులపాటు పెంపు నిర్ణయాన్ని వాయిదావేసుకోవాలని వియత్నాం నేత టో లామ్ కోరారు. పెంపును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బ్రిటన్ ప్రభుత్వం తమ దేశ ఆర్థికవ్యవస్థ పరిరక్షణే తొలి ప్రాధాన్యతనిస్తామని ప్రకటించింది. దిగుమతులపై టారిఫ్‌ల కారణంగా ఆయా ఉత్పత్తుల ధరలకు అమెరికా రెక్కలు రానున్నాయి. పెరిగే ధరలతో అమెరికన్ వినియోగదారుల జేబుకు చిల్లుపడనుంది. అయితే తొలినాళ్లలో జనం ఇబ్బందులుపడ్డాసరే కొంతకాలానికి ఆయా వస్తువుల ఉత్పత్తి స్థానికంగా మొదలై ధరలు దిగొస్తాయని ట్రంప్ నమ్మబలుకుతున్నారు. ద్రవ్యోల్బణం తప్పదు: ‘‘వస్తువులకు డిమాండ్ పెరగడంతో ద్రవ్యోల్బణం సమస్య ఎదురవుతుంది. దీనిని నివారించలేం. ఇలా టారిఫ్‌లతో సొంతంగా అమెరికా అతిపెద్ద ఆర్థికగాయాలు చేసుకోవడం చరిత్రలో ఇదే తొలిసారి’’ అని అమెరికా మాజీ ఆర్థిక మంత్రి ల్యారీ సమ్మర్స్ ఆందోళన వ్యక్తంచేశా రు. ‘‘టారిఫ్ భయాలతో స్టాక్‌మార్కెట్ మదుపరులు అనాలోచిత నిర్ణయాలు తీసుకోకండి. మార్కె ట్లు చరిత్రాత్మక కనిష్టస్థాయిలకు ఒకవేళ పడినా మళ్లీ ఊహించనంత పెరుగుతాయి’’ అని ట్రంప్ వాణిజ్యసలహాదారు పీటర్ నవరో భరోసా ఇచ్చారు.పెంగ్విన్లు, సీల్స్కూ టారిఫ్ సెగ అంటార్కిటికా ఖండంలో చివర్లో ఉన్న రెండు మారుమూల బుల్లి ద్వీపాలపైనా టారిఫ్ ఎందుకు విధించారని మీడియా ప్రశ్నించగా లుట్నిక్ అసలు విషయం బయటపెట్టారు. ‘‘ ఏ దేశంపై ఎంత టారిఫ్ వేయాలనేది అధికారులు పూర్తిగా నిర్ణయించలేదు. ఈ పనిని చాలావరకు కృత్రిమ మేథ(ఏఐ) చేసింది. అందుకే బుల్లి ద్వీపాలపైనా టారిఫ్ బాంబు పడింది’’ అని అన్నారు. వాస్తవానికి ఈ హెర్డ్ అండ్ మెక్‌డొనాల్డ్ ద్వీపాల్లో జనం కంటే పెంగ్విన్లు, సీల్స్ ఎక్కువగా ఉంటాయి. శివారు ద్వీపాలపైనా టారిఫ్ వేయడం చూస్తుంటే ఈ విధానం హేతుబద్ధంగా జరగలేదని, గంపగుత్తగా టారిఫ్ వేశారని కొందరు వాణిజ్యవేత్తలు విమర్శించారు. -
ట్రంప్‌కు హ్యాండ్సాఫ్ సెగ
వాషింగ్టన్: మేక్ అమెరికా గ్రేట్ ఎగేన్ నినాదంతో అధ్యక్ష పీఠంపై ఆసీనులైన డొనాల్డ్ ట్రంప్ వెనువెంటనే తీసుకున్న అనూహ్య, విపరీత నిర్ణయాలతో అమెరికన్లు విసిగిపోయారు. విదేశాలపై టారిఫ్‌ల బాంబు విసిరితే అది ప్రతీకార టారిఫ్‌ల రూపంలో తిరిగొచ్చి అధిక ధరలు, ద్రవ్యోల్బణానికి బాటలు వేస్తోందన్న ఆగ్రహంతో ప్రజలు నిరసన బాటపట్టారు. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయ్యాక దేశవ్యాప్తంగా ఎన్నడూలేనిస్థాయిలో లక్షలాది మంది స్థానిక అమెరికన్లు ముక్తకంఠంతో నినదిస్తూ ఆందోళనకు దిగిన ‘హ్యాండ్సాఫ్’ ఉద్యమం శనివారం భారీస్థాయిలో కొనసాగుతోంది. అమెరికాలోని మెజారిటీ రాష్ట్రాల్లో ట్రంప్‌కు వ్యతిరేకంగా శనివారం ఉద్యమం మొదలైంది. రాష్ట్రాల అసెంబ్లీలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, సామాజిక భద్రత విభాగ ఆఫీస్‌లు, పార్కులు, సిటీ హాళ్ల వద్ద ప్రధానంగా పెద్దస్థాయిలో ర్యాలీలు జరిగాయి. అత్యంత సంపన్నుల చేతుల్లోకి వెళ్లిన పాలనాపగ్గాలను విడిపిస్తామని నినదించారు. ‘‘ మావి ప్రధానంగా మూడు డిమాండ్లు. ప్రభుత్వంపై సంపన్నుల అజమాయిషీ నశించాలి. ప్రభుత్వంలో అవినీతి అంతంకావాలి. మెడికేర్, సోషల్‌సెక్యూరిటీ నిధుల్లో కోత పెట్టొద్దు. వలసదారులు, లింగమార్పిడి వర్గాలు, ఇతరులపై నిర్బంధాల చట్రాలను తొలగించాలి’’ అని ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న సంఘాల్లో ఒకటైన ఇండివిజిబుల్ ప్రకటించింది. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫెడరల్ ఎంప్లాయీస్ సహా చాలా కార్మిక సంఘాల సభ్యులు పలు రాష్ట్రాల్లో నిరసన ర్యాలీల్లో పాల్గొన్నారు.50 రాష్ట్రాల్లో 1,400 చోట్ల..50 రాష్ట్రాల్లో పౌర హక్కుల సంస్థలు, కార్మిక సంఘాలు, ఎల్జీబీటీక్యూ+ మద్దతుదారులు, మాజీ ఫెడరల్ ఉద్యోగులు, మహిళా హక్కుల కార్యకర్తలు, ఎన్నికల సంస్కరణల కార్యకర్తలు, సాధారణ ప్రజానీకం ఈ ఆందోళనలో భాగస్వాములై ట్రంప్ వ్యతిరేక నినాదాలు చేశారు. ప్రధానంగా 1,400 ప్రాంతాల్లో భారీ స్థాయిలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. అయితే చాలా వరకు ర్యాలీలు శాంతియుతంగానే కొనసాగాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, అరెస్ట్‌లు జరగలేదు. మ్యాన్‌హాట్టన్ మిడ్‌టౌన్ మొదలు అలాస్కాలోని యాంకరేజ్దాకా ప్రతి ప్రధాన నగరం, పట్టణంలో జనం వీధుల్లోకి వచ్చి హ్యాండ్సాఫ్ అని రాసి ఉన్న బ్యానర్లు, ప్లకార్డులు పట్టుకుని ఆందోళనల్లో పాల్గొన్నారు. వ్యయ నియంత్రణ చర్యలు, సమూల సంస్కరణల పేరుచెప్పి హఠాత్తుగా వేల సంఖ్యలో ఫెడరల్ ఉద్యోగులను విధుల నుంచి తప్పించడం, జీడీపీ తగ్గిపోయేలా ఆర్థికవ్యవస్థను అస్తవ్యస్థం చేయడం, వలసలపై ఉక్కుపాదం మోపడం, మానవ హక్కులను కాలరాయడం వంటి చర్యలతో ట్రంప్, ఎలాన్ మస్క్‌పై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు నెలకొన్నాయి. అమెరికాలోనేకాదు బ్రిటన్‌లోని లండన్, ఫ్రాన్స్‌లోని పారిస్, జర్మనీలోని బెర్లిన్ నగరాల్లోనూ అమెరికా ప్రభుత్వ వ్యతిరేక ర్యాలీలు జరిగాయి. ‘‘అమెరికాకు ఏమైంది?. ప్రజలను టారిఫ్‌లను ఇబ్బందులు పెట్టడం ఇకనైనా ఆపండి. ట్రంప్ పెద్ద ఇడియట్’’ అని రాసి ఉన్న ప్లకార్డులను లండన్‌లో ప్రదర్శించారు. నిరసనలపై స్పందించిన శ్వేతసౌధంట్రంప్ వ్యతిరేక ర్యాలీలపై అధ్యక్ష భవనం స్పందించింది. ‘‘ ఇన్నాళ్లూ డెమొక్రాట్ల ప్రభుత్వంలో అక్రమంగా అమెరికాలో చొరబడిన విదేశీయులు, వలసదారులు ప్రభుత్వం నుంచి ఎన్నో పథకాలు, ప్రయోజనాలను అక్రమంగా పొందారు. దాంతో ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లింది. వీళ్ల వల్ల వాస్తవిక లబ్ధిదారులైన సీనియర్ అమెరికన్లు ఎంతో లబ్దిని కోల్పోయారు. ఆ సంస్కృతికి చరమగీతం పాడి నిజమైన అమెరికన్లకే ప్రభుత్వం నుంచి సామాజిక భద్రత, వైద్యసాయం, వైద్యసదుపాయాలు అందిస్తున్నాం’’ అని వైట్‌హౌస్ ఒక ప్రకటనలో పేర్కొంది. -
ట్రంప్ టారిఫ్ దడ.. షాపింగ్ మాల్స్ ముందు లాక్డౌన్ దృశ్యాలు
వాషింగ్టన్: అమెరికాలోని సూపర్ మార్కెట్లన్నీ వినియోగదారుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. ఇక్కడికి వచ్చిన జనమంతా తమకు అందిన వస్తువులన్నింటినీ కొనుగోలు చేసి, తమ ట్రాలీలలో నింపేసుకుని, బయటకు వస్తూ కనిపిస్తున్నారు. దీనిని చూసినవారికి త్వరలో లాక్డౌన్(Lockdown) వస్తుందనే విధంగా అక్కడి దృశ్యాలు కనిపిస్తున్నాయి. అమెరికాలో ప్రస్తుతం ‘ఇప్పుడే షాపింగ్ చేయండి.. లేదంటే పశ్చాత్తాప పడతారు’ అనే ట్రెండ్ నడుస్తోంది.అమెరికాలోని వినియోగదారులు షాపింగ్ మాల్స్‌కు పరుగులు తీయడం వెనుక ప్రధాన కారణం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త టారిఫ్ పాలసీ(Donald Trump's new tariff policy). ఏప్రిల్ 2న డోనాల్డ్ ట్రంప్ భారత్, చైనాతో సహా పలు దేశాల నుండి దిగుమతి చేసుకునే వస్తువులపై భారీ సుంకాలను విధించారు. దీనిపై అమెరికన్లు కలత చెందుతున్నారు. రాబోయే రోజుల్లో పలు వస్తువులు చాలా ఖరీదైనవిగా మారుతాయని ఆందోళన చెందుతున్నారు. ఈ భయంతోనే వారంతా ఉప్పు మొదలుకొని టీవీలు, ఫ్రిజ్‌లు.. ఇలా అన్నింటికీ కొనుగోలు చేస్తున్నారు.నిపుణుల అభిప్రాయం ప్రకారం ట్రంప్ ప్రభుత్వ సుంకాల విధానం దిగుమతులపై(imports) ప్రత్యక్ష ప్రభావాన్ని చూపనుంది. ఇది కంపెనీల ఖర్చును పెంచుతుంది. ఫలితంగా ఆ భారం కస్టమర్‌పై పడుతుంది. అయితే డోనాల్డ్ ట్రంప్ అమెరికాకు ఈ సుంకాలు మేలు చేస్తాయని చెబుతున్నారు. అమెరికన్లు ప్రస్తుతం చేస్తున్న షాపింగ్ తీరు చూస్తుంటే.. వారెవరికీ ట్రంప్ హామీలపై పెద్దగా నమ్మకం లేదని అనిపిస్తుంది. ప్రస్తుతం అమెరికాలో ల్యాప్‌టాప్‌లు, మొబైల్‌లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు మైక్రోవేవ్‌లు అత్యధిక సంఖ్యలో అమ్ముడవుతున్నాయి.అమెరికాకు ఎలక్ట్రానిక్స్ వస్తువులు, విడిభాగాలు చైనా తదితర దేశాల నుండి దిగుమతి అవుతాయి. సుంకాల పెరుగుదల కారణంగా భవిష్యత్తులో అవి మరింత ఖరీదైనవిగా మారే అవకాశం ఉంది. సుంకాలు విధించాక ధరలలో 15-20శాతం మేరకు పెరుగుదల తప్పకుండా ఉంటుందని డీలర్లు స్పష్టంగా చెబుతున్నారు. అందుకే అమెరికన్లు వివిధ రకాల షోరూంలకు క్యూ కడుతున్నారు. రాబోయే రోజుల్లో ధరలు పెరిగే అవకాశం ఉన్నందున జీన్స్, స్పోర్ట్స్ వేర్, వర్క్ వేర్, క్యాజువల్ షూలను కూడా ముందుగానే కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో కాఫీ, స్నాక్స్, సాస్‌లు, అంతర్జాతీయ కిరాణా వస్తువులు కూడా జోరుగా విక్రయమవుతున్నాయి. బ్లెండర్లు, ఎయిర్ ఫ్రైయర్లు, మసాజ్ కుర్చీలు, ట్రెడ్మిల్స్ కూడా విరివిగా అమ్ముడవుతున్నాయి. ఇది కూడా చదవండి: Sri Rama Navami: బెంగాల్ నుంచి ముంబై వరకూ.. హై అలర్ట్ -
నిపుణులతో చర్చిస్తున్నాం: భారత్
న్యూఢిల్లీ: అమెరికా తాజా విధించిన టారిఫ్‌లపై ఏ స్థాయిలో స్పందించాలనే విషయమై నిపుణులతో చర్చిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఎగుమతులకు రక్షణ కల్పించడం, వాణిజ్యంపై ప్రభావం పడకుండా చూసుకోవడం సహా అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలనూ పరిశీలిస్తున్నామని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ద్వైపాక్షిక వాణిజ్యం ఒప్పందంలో భాగంగా పన్నుల తగ్గింపు వంటి వాటిని త్వరలోనే ఖరారు చేయనున్నామని ప్రభుత్వ వర్గాలు వివరించాయి. అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వంతో నేరుగా వ్యవహారాలను నడుపుతున్నందున ఇతర దేశాలతో పోలిస్తే టారిఫ్‌ల విషయంలో భారత్ పరిస్థితి మెరుగ్గానే ఉందని పరిశీలకులు అంటున్నారు. ట్రంప్ నిర్ణయాల నేపథ్యంలో ఇతర దేశాలతో కొత్తగా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకునేందుకు భారత ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. -
టారిఫ్‌లు సబబే: ట్రంప్
వాషింగ్టన్: ప్రపంచ దేశాలపై విధించిన టారిఫ్‌లను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థించుకున్నారు. వాటి ఫలితాలు చరిత్రాత్మకంగా ఉంటాయని చెప్పుకున్నారు. అమెరికాపై చైనా ప్రతీకార సుంకాల నేపథ్యంలో శనివారం ఆయన ఈ ప్రకటన చేశారు. అమెరికా ఇక ఎంతమాత్రమూ మౌనంగా, నిస్సహాయంగా ఉండబోదని కుండబద్దలు కొట్టారు. ‘‘అమెరికాను చైనా సుంకాలతో గట్టిగా దెబ్బ కొట్టింది. నిజానికి మాపై చైనా సుంకాలతో పోలిస్తే ఆ దేశంపై నేను విధించిన టారిఫ్ ఏ మూలకూ కాదు. చాలా దేశాలు అమెరికా పట్ల ఇంతకాలం ఇలాగే వ్యవహరించాయి. ఇది ఇకపై సాగదు. మునుపెన్నడూ లేని విధంగా ఉద్యోగాలు, వ్యాపారాలను అమెరికాకు తిరిగి తీసుకొస్తున్నాం. ఇప్పటికే ఐదు లక్షల డాలర్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. అవి మరింత వేగంగా పెరుగుతున్నాయి. ఈ ఆర్థిక విప్లవంలో మనం గెలుస్తాం. అయితే ఈ ప్రక్రియ అంత సులువు కాదు. ఈ పునరుద్ధరణకు అమెరికన్లు సహకరించాలి. సమస్యలను తట్టుకొని నిలబడగలగాలి. అమెరికాను మళ్లీ గొప్పగా తీర్చిదిద్దుతాం’’అని తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్‌లో ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ తాజా వ్యాఖ్యలపై చైనా ఘాటుగా స్పందించింది. తమ సార్వభౌమాధికారం, భద్రత, అభివృద్ధి, ప్రయోజనాల పరిరక్షణకు చర్యలు కొనసాగిస్తామని స్పష్టం చేసింది. -
ఇప్పటికే రూ. 600 కోట్లు నష్టం!
సాక్షి, అమరావతి: అమెరికా దిగుమతి సుంకం రాష్ట్ర మత్స్య ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నెల 9వ తేదీ నుంచి భారం ప్రత్యక్షంగా పడనుంది. ఏప్రిల్ మొదటి వారంలో భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యేందుకు మత్స్య ఉత్పత్తులతో 2 వేల షిప్మెంట్లు సిద్ధంగా ఉన్నాయి. మరో 2,500 షిప్మెంట్లకు సరిపడా సరుకు కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉంది. వీటిలో మొత్తంగా దాదాపు 3,500 షిప్మెంట్లు ఏపీకి చెందినవేనని ఎగుమతిదారులు చెబుతున్నారు. కొత్తగా విధించిన దిగుమతి సుంకం ప్రకారం లెక్కిస్తే వీటిపై భారం రూ.600 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఈ మేరకు నష్టపోవడమే తప్ప ఈ భారాన్ని తిరిగి కొనుగోలుదారులపై వెయ్యలేని పరిస్థితి ఉందని ఎగుమతిదారులు చెబుతున్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో భారత్–అమెరికాల మధ్య జరిగిన వ్యాపార లావాదేవీల విలువ 6.6 బిలియన్ డాలర్లు. వీటిలో ఎగుమతుల విలువ 5 బిలియన్ డాలర్లు, దిగుమతుల విలువ 1.6 బిలియన్ డాలర్లు. ఎగుమతుల్లో మత్స్య ఉత్పత్తుల విలువ 2.55 బిలియన్ డాలర్లపైమాటే. అమెరికాకు ఆహార, మత్స్య ఉత్పత్తులను ఎగుమతి చేసే దేశాల్లో 42.3 శాతంతో భారత్ మొదటి స్థానంలో నిలవగా, 26.9 శాతంతో ఈక్విడార్ రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత వరుసగా ఇండోనేషియా (15.4%), వియత్నాం (7.2 %), థాయిలాండ్ (2.4%), అర్జంటేనియా (2.1%) దేశాలు ఉన్నాయి.భారత్‌ను అధిగమించనున్న ఈక్విడార్ భారత్‌పై 27 శాతం దిగుమతి సుంకం విధించిన అమెరికా.. ఈక్విడార్ నుంచి దిగుమతి చేసుకునే ఆహార ఉత్పత్తులపై కేవలం 10 శాతం మాత్రమే సుంకం విధించింది. ఈ కారణంగా ఈక్విడార్ నుంచి పోటీని తట్టుకోవడం కష్టమేనని, భారత్‌కు వచ్చే ఆర్డర్స్ అన్నీ ఇక ఈక్విడార్‌కు వెళ్లే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. ఇప్పటికే ఏటా 11–12 లక్షల టన్నుల రొయ్యల ఉత్పత్తితో ఈక్విడార్ మన దేశాన్ని రెండవ స్థానానికి నెట్టేసింది. కాగా, రాష్ట్రంలో నిన్నటి వరకు కిలోకు రూ.20–40 మేర కోత పెట్టి కొనుగోలు చేయగా, శనివారం ఏకంగా రూ.30–90 వరకు తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. మొన్నటి వరకు 30 కౌంట్ (కిలోకు వచ్చే రొయ్యల సంఖ్య) కిలో రూ.470 పలుకగా, శనివారం రూ.380తో.. 50 కౌంట్ అయితే రూ.360– రూ.300కు తగ్గించేశారు. దీంతో కంపెనీల నుంచి స్పష్టత వచ్చే వరకు పట్టుబడులు పట్టకూడదని ఆక్వా రైతు సంఘాలు నిర్ణయించాయి. కనీసం 10–15 రోజుల వరకు పట్టుబడులు పట్టకూడదని రైతులకు సూచిస్తున్నారు.ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి ట్రంప్ టాక్స్ సాకుతో ధరలు తగ్గించడం సరికాదు. పెరిగిన పెట్టుబడుల నేపథ్యంలో ఇప్పుడు లభిస్తున్న ధరలే గిట్టుబాటు కావడం లేదు. ఈ ధరలను కూడా మరింత తగ్గిస్తే సమీప భవిష్యత్‌లో పూర్తిగా ఆక్వా సాగుకు దూరమయ్యే పరిస్థితులు ఏర్పడతాయి. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలి. రైతుల తరఫున ఉద్యమించేందుకు ఫెడరేషన్ సిద్ధంగా ఉంది.– గాదిరాజు వెంకట సుబ్బరాజు (జీకేఎఫ్), ప్రధాన కార్యదర్శి, ఏపీ రొయ్య రైతుల సమాఖ్య -
ఆర్థిక మాంద్యం భయాల వేళ ట్రంప్ ఏమన్నారంటే..
వాషింగ్టన్: ప్రపంచ దేశాలపై అమెరికా పరస్పర సుంకాలతో.. పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కకావికలం అవుతున్నాయి. ఆర్థిక మాంధ్యం భయాలు నెలకొని.. అమెరికా మార్కెట్లు సైతం భారీ నష్టాలతో కుదేలు అవుతోంది. వరుసగా రెండో రోజూ వాల్‌స్ట్రీట్‌లో బ్లడ్‌బాత్‌తో పలు కంపెనీల షేర్లు దారుణంగా పడిపోయాయి. అయినప్పటికీ.. మరేం ఫర్వాలేదని ఆ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. మార్కెట్ క్రాష్ భయాలను తోసిపుచ్చిన ఆయన.. తన టారిఫ్‌ల నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, అందులో ఎలాంటి మార్పులు ఉండబోవని కుండబద్ధలు కొట్టారు. టారిఫ్ నిర్ణయం వల్ల అమెరికాలోకి పెట్టుబడి పెట్టడానికి చాలా మంది వస్తున్నారని, మున్నుపెన్నడూ లేని స్థాయిలో ధనవంతులు కావడానికి ఇదే మంచి సమయమని ట్రూత్‌లో ఓ పోస్టు చేశారు. పైగా తన నిర్ణయం అమెరికా ఆర్థిక వ్యవస్థకు సూపర్ ఛార్జ్‌గా పనికొస్తుందని.. టారిఫ్‌ల వల్ల బడా వ్యాపారాలకు వచ్చిన నష్టమేమీ లేదని అంటున్నారాయన. తాను విధించిన పరస్పర సుంకాలతో దిగుమతికి బదులు.. కంపెనీలు అమెరికా గడ్డపై ఉత్పత్తిని ప్రారంభిస్తాయని ట్రంప్ బలంగా నమ్ముతున్నారు. తద్వారా ఉద్యోగాల కల్పన, అటుపై అమెరికా ఆర్థిక వ్యవస్థను మార్చివేసే అవకాశం ఉందని భావిస్తున్నారాయన. -
చర్చనీయాంశంగా సుంకాల హేతుబద్ధత
న్యూఢిల్లీ: వివిధ దేశాలపై అమెరికా వడ్డించిన భారీ టారిఫ్‌ల వెనుక హేతుబద్ధత ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అసలు ఏ ప్రాతిపదికన ఈ టారిఫ్‌లను నిర్ణయించారనే అంశంపై చర్చలు జరుగుతున్నాయి. మిగతా దేశాలు తమపై ఎంత టారిఫ్‌లు విధిస్తున్నాయో అదే స్థాయిలో తామూ సుంకాలు విధించామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబుతున్నప్పటికీ వాస్తవానికి లెక్కలు వేరేగా ఉన్నాయి. మిగతా దేశాలతో వాణిజ్య లోటును భర్తీ చేసుకునే విధంగా టారిఫ్‌లను నిర్ణయించినట్లుగా పరిశీలకులు చెబుతున్నారు. సాధారణంగా పైకి కనిపించే టారిఫ్‌లే కాకుండా తమ ఉత్పత్తులకు నియంత్రణ సంస్థలపరమైన అడ్డంకులు, సాంకేతిక అవరోధాలు, కరెన్సీ హెచ్చుతగ్గులు తదితర టారిఫ్యేతర అంశాలు కూడా వాణిజ్య లోటుకు కారణమవుతున్నాయని అగ్రరాజ్యం భావిస్తోంది. కాబట్టి వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ప్రస్తుత రేటును నిర్ణయించింది. ఉదాహరణకు భారత్‌తో అమెరికాకు 46 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు ఉందంటే.. దాన్ని సున్నా స్థాయికి తీసుకొచ్చేలా సుంకాలను నిర్ణయించినట్లు పరిశీలకులు పేర్కొన్నారు. అంటే ప్రస్తుతం భారత్‌పై విధించిన 26% రేటు ద్వారా మన దేశంతో ఉన్న వాణిజ్య లోటును పూర్తిగా భర్తీ చేసుకోవచ్చని అమెరికా భావిస్తోంది. ఈ సుంకాల వల్ల భారతీయ ఉత్పత్తుల ధరలు పెరిగి, అమెరికన్లు మన దగ్గర నుంచి దిగుమతులు తగ్గించుకుంటారని, తద్వారా వాణిజ్య లోటు తగ్గుతుందని అమెరికా అభిప్రాయం. లోపభూయిష్టమైన విధానం.. అయితే, ఇది తప్పుల తడక విధానమని విమర్శలు వస్తున్నాయి. వాణిజ్య లోటుకు లేదా మిగులుకు టారిఫ్‌లు, టారిఫ్యేతర అడ్డంకులు, కరెన్సీ హెచ్చుతగ్గుల్లాంటివి కారణమే అయినప్పటికీ.. కేవలం సుంకాల విధింపు ద్వారా దీన్ని పరిష్కరించుకోవడం సాధ్యపడదని విశ్లేషకులు చెబుతున్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్య లోటుకు కారణాలు అనేకం ఉంటాయని తెలిపారు. ఉదాహరణకు బియ్యం ప్రధాన ఆహారంగా ఉండే దేశానికి .. గోధుమలను భారీగా పండించి, ఎగుమతి చేసే మరో దేశం నుంచి ఎక్కువగా దిగుమతులు ఉండకపోవచ్చు. కానీ తాము దేశీయంగా ఉత్పత్తి చేసుకోలేని పరికరాలు, కంప్యూటర్లను ఎగుమతి చేసే ఇంకో దేశంతో వాణిజ్య లోటు ఉండొచ్చు. అలాగని ఈ వాణిజ్య లోటేమీ అవాంఛనీయమైన లేదా అనుచితమైనదేమీ కాదు. ప్రస్తుతం అమెరికా పాటిస్తున్న విధానాన్ని బట్టి చూస్తే ఏప్రిల్ 2 నాటి టారిఫ్‌లే అంతిమం కాదని భావించాలి. రేప్పొద్దున్న డాలరు మారకం విలువ పెరిగి, అమెరికాలో మన ఉత్పత్తుల ధరలు పెరగకపోయి, అక్కడి వారు దిగుమతులు చేసుకోవడం కొనసాగిస్తే.. వాణిజ్య లోటు యథాప్రకారం కొనసాగుతుంది. అప్పుడు మళ్లీ వాణిజ్య లోటును భర్తీ చేసుకోవడానికి మళ్లీ టారిఫ్‌లు పెంచాల్సి వస్తుంది. ఆ విధంగా సుంకాల వడ్డింపు నిరంతర ప్రక్రియగా కొనసాగే అవకాశం ఉంది. -
టారిఫ్‌లతో ద్రవ్యోల్బణం ముప్పు..
ఆర్లింగ్టన్ (అమెరికా): అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎడాపెడా టారిఫ్‌లను విధించడం దేశీయంగా ద్రవ్యోల్బణాన్ని ఎగదోస్తుందని ఫెడరల్ రిజర్వ్ చీఫ్ జెరోమ్ పావెల్ హెచ్చరించారు. దీనితో ఆర్థిక వృద్ధి కూడా నెమ్మదించే ముప్పు ఉందన్నారు. ఎకానమీ, ద్రవ్యోల్బణంపై టారిఫ్‌ల ప్రభావాలు ఊహించిన దానికంటే గణనీయంగా ఎక్కువగానే ఉండబోతున్నాయని ఆయన స్పష్టం చేశారు. భారీ దిగుమతి సుంకాలు తాత్కాలికంగా ధరల పెరుగుదలకు దారి తీయొచ్చని, దాని ప్రభావాలు దీర్ఘకాలికంగా కొనసాగే అవకాశం ఉందని పావెల్ చెప్పారు. ఒక దఫా ధరల పెరుగుదల అనేది దీర్ఘకాలికంగా ద్రవ్యోల్బణ సమస్యగా మారకుండా చూడటం తన బాధ్యతని వ్యాఖ్యానించారు. ద్రవ్యోల్బణంపై ఆయన వ్యాఖ్యలను బట్టి చూస్తే.. రాబోయే రోజుల్లో కీలక వడ్డీ రేట్లు యథాతథంగా 4.3 శాతం స్థాయిలోనే కొనసాగించవచ్చని భావిస్తున్నారు. ఫెడ్ రిజర్వ్ ఈ ఏడాది వడ్డీ రేట్లను అయిదు విడతల్లో తగ్గిస్తుందని ఆశిస్తున్న ఇన్వెస్టర్లను ఇది నిరాశపర్చే అవకాశం ఉంది. పావెల్ వ్యాఖ్యలు బట్టి చూస్తే ఆయన ద్రవ్యోల్బణంపైనే దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. -
పోటీ దేశాలపై టారిఫ్‌లు.. మనకు మరిన్ని అవకాశాలు
న్యూఢిల్లీ: అమెరికా టారిఫ్‌లతో భారత ఎగుమతులకు సవాళ్లు ఉన్నప్పటికీ, పోటీ దేశాలపై మరింత అధిక స్థాయిలో సుంకాలు విధించడం వల్ల, మన వ్యాపారాన్ని పెంచుకునేందుకు గణనీయంగా అవకాశాలు ఉన్నాయని ఎలక్ట్రానిక్స్, ఐటీ హార్డ్‌వేర్ సంస్థల సమాఖ్య ఎంఏఐటీ తెలిపింది. భారత్‌తో పోలిస్తే చైనా, వియత్నాంలపై భారీగా సుంకాలు విధించడమనేది మన ఎగుమతులకు సానుకూలాంశమని వివరించింది. ‘భౌగోళిక, రాజకీయ రిస్కులను అధిగమించేందుకు గ్లోబల్ కంపెనీలు తమ తయారీ కార్యకలాపాలను భారత్‌కు మళ్లించే అవకాశం ఉంది. దీంతో మన ఎగుమతులు మరింత పెరగవచ్చు. పోటీ దేశాలతో వ్యాపారం భారీ వ్యయాలతో కూడుకున్నది కావడంతో అంతర్జాతీయంగా కొనుగోలుదారులు భారత ఎగుమతులవైపు మొగ్గు చూపవచ్చు. గ్లోబల్ బ్రాండ్లు తమ తయారీ కేంద్రాలను ఇతర దేశాలకు మళ్లించడంపై దృష్టి పెడతాయి కనుక సరఫరా వ్యవస్థకు సంబంధించి భారత్‌కు మరిన్ని అవకాశాలు లభించవచ్చు‘ అని ఎంఏఐటీ పేర్కొంది. భారత్‌పై 27 శాతం సుంకాలు ప్రకటించిన అమెరికా, మనకు పోటీ దేశాలైన చైనాపై 54 శాతం, వియత్నాంపై 46 శాతం, థాయ్‌లాండ్‌పై 36 శాతం విధించింది. దీనితో ఎల్రక్టానిక్స్, టెలికాం పరికరాలు, ఐటీ హార్డ్‌వేర్ విషయంలో ఆయా దేశాలు మనతో పోటీపడే పరిస్థితి తగ్గుతుందని, మన ఎగుమతులకు డిమాండ్ మెరుగుపడవచ్చని ఎంఏఐటీ తెలిపింది. అమెరికాకు భారత్ సుమారు 7 బిలియన్ డాలర్ల స్మార్ట్ఫోన్లను ఎగుమతి చేస్తోంది. టారిఫ్‌ల వల్ల వీటిపై ప్రభావం పడనుంది. స్థిరమైన పాలసీలు కావాలి.. పోటీ దేశాలపై టారిఫ్‌లను మనకు అనుకూలంగా మల్చుకోవాలంటే వ్యాపారాల నిర్వహణ సులభతరం చేయడానికి మరింత ప్రాధాన్యతనివ్వాల్సి ఉంటుందని ఎంఏఐటీ తెలిపింది. అలాగే పాలసీలపరంగా స్థిరత్వం ఉండేలా చూడాలని, లాజిస్టిక్స్.. ఇన్ఫ్రాపై భారీగా పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుందని పేర్కొంది. ఇవన్నీ చేయగలిగితే రాబోయే రోజుల్లో ప్రపంచానికి తయారీ, ఎగుమతుల హబ్‌గా భారత్ ఎదగవచ్చని వివరించింది. 2021–22 నుంచి 2023–24 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో భారత్‌కు అమెరికా అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా నిల్చింది. మొత్తం భారత్ ఎగుమతుల్లో అమెరికా వాటా సుమారు 18 శాతం, దిగుమతుల్లో 6.22 శాతం, ద్వైపాక్షిక వాణిజ్యంలో 10.73 శాతంగా ఉంది. అమెరికాతో మనకు వాణిజ్య మిగులు 2019–20లో 17.26 బిలియన్ డాలర్లుగా ఉండగా, 2023–24లో ఇది 35.32 బిలియన్ డాలర్లకు చేరింది. ఎలక్ట్రానిక్స్ విషయానికొస్తే 2024 ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు భారత్ ఎగుమతులు 10 బిలియన్ డాలర్లుగా, దిగుమతులు 3.17 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. -
టారిఫ్‌ల భారంపై బేరసారాలు
న్యూఢిల్లీ: భారీ టారిఫ్‌ల విధింపుతో ఎగుమతులు, ఉద్యోగాల కల్పనపై ప్రభావం పడనున్న నేపథ్యంలో అమెరికా సంస్థలతో భారతీయ ఎగుమతిదారులు సంప్రదింపులు ప్రారంభించారు. ఈ అసాధారణ పరిస్థితిని ఎదుర్కొనే మార్గాలపై వారితో చర్చలు జరుపుతున్నట్లు ఎగుమతిదారుల సంస్థల సమాఖ్య ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ ఎస్సీ రాల్హన్ తెలిపారు. దేశీయంగా ఉక్కు రేట్లు ఇప్పటికే భారీగా ఉన్న తరుణంలో అధిక సుంకాల భారాన్ని ఇంజినీరింగ్ ఉత్పత్తుల పరిశ్రమ భరించే పరిస్థితి లేదని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, టారిఫ్‌లతో అమెరికాలో మన లెదర్ ఉత్పత్తులకు డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం పడుతుందని ఫుట్‌వేర్ ఎగుమతి సంస్థ ఫరీదా గ్రూప్ చైర్మన్ రఫీక్ అహ్మద్ చెప్పారు. అమెరికాలోని లెదర్ ఉత్పత్తుల దిగుమతిదారులు, టారిఫ్లపరమైన నష్టాల్లో కొంత భరించాలని తమను కోరుతున్నారని తెలిపారు. కొన్నాళ్ల పాటు ఉత్పత్తిని నిలిపివేయాలని కూడా వారు అడిగినట్లు వివరించారు. ఇదే పరిస్థితి కొనసాగితే దీర్ఘకాలంలో మన ఎగుమతులకు అమెరికాలో మార్కెట్ గణనీయంగా కుదించుకుపోవచ్చని పేర్కొన్నారు. ఇక, అమెరికా అతి పెద్ద వ్యాపార భాగస్వామిగా ఉన్నందున అక్కడి నుంచి కొన్ని దిగుమతులపై సుంకాలను తగ్గించడం మనకు కూడా శ్రేయస్కరమని ఎఫ్ఐఈవో వైస్ ప్రెసిడెంట్ రవికాంత్ కపూర్ తెలిపారు. కార్పెట్లు, హోమ్ ఫరి్న షింగ్ ఉత్పత్తులపై అధిక టారిఫ్‌ల వల్ల పరిశ్రమలో గణనీయంగా ఉద్యోగాలు పోయే ముప్పు ఉందని వివరించారు. బియ్యంపై ప్రభావం తాత్కాలికమే.. దీర్ఘకాలికంగా చూస్తే బియ్యం ఎగుమతులపై సుంకాల ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. తాత్కాలికంగా ధరలు పెరిగినా, రెండు–మూడు నెలల్లో అంతా సర్దుకోగలదని ఇండియన్ రైస్ ఎక్స్‌పోర్టర్స్ ఫెడరేషన్ (ఐఆర్ఈఎఫ్) జాతీయ అధ్యక్షుడు ప్రేమ్ గర్గ్ తెలిపారు. వ్యూహాత్మక ప్రణాళికలతో మన పరిశ్రమలను కాపాడుకోవడంతో పాటు అమెరికాలో కార్యకలాపాలను కూడా విస్తరించవచ్చని ఆయన చెప్పారు. టారిఫ్‌లు పెంచినప్పటికీ మిగతా పోటీ దేశాలతో పోలిస్తే ఇప్పటికీ భారత్ వైపే మొగ్గు ఉంటుందని వివరించారు. మరోవైపు, ప్రస్తుత కాంట్రాక్టులను సమీక్షించుకోవాల్సి రావచ్చని, అమెరికా దిగుమతిదారులు మరింత ఎక్కువ కాలం క్రెడిట్ ఇవ్వాలని కోరవచ్చని వ్యాపారవర్గాలు చెప్పాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో భారత్ 52.4 లక్షల టన్నుల బాస్మతి బియ్యం ఎగుమతి చేయగా అందులో 2.34 లక్షల టన్నులను అమెరికాకు పంపింది. 2024 ఏప్రిల్–నవంబర్ మధ్య కాలంలో 42 లక్షల టన్నుల బాస్మతి బియ్యం ఎగుమతుల్లో అమెరికా వాటా 2.04 లక్షల టన్నులుగా ఉంది. బియ్యం ఎగుమతులకు పశి్చమాసియా ప్రధాన గమ్యస్థానంగా ఉంటోంది.టారిఫ్‌ల ఎఫెక్ట్ స్వల్పమే నితి ఆయోగ్ సభ్యులు విర్మాణీ న్యూఢిల్లీ: యూఎస్ విధించిన ప్రతీకార టారిఫ్‌ల ప్రభావం భారత్‌పై స్వల్పమేనని నితి ఆయోగ్ సభ్యులు అరవింద్ విర్మాణీ పేర్కొన్నారు. దేశీ ఆర్థిక వ్యవస్థ విదేశీ వాణిజ్యంపై అతితక్కువగా ఆధారపడుతుండటమే దీనికి కారణమని తెలియజేశారు. మధ్యకాలానికి టారిఫ్‌లతో తలెత్తనున్న ప్రతికూలతలు ప్రతిపాదిత యూఎస్ భారత్ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం(బీటీఏ) తొలి దశ అమలుతో తొలగిపోనున్నట్లు అభిప్రాయపడ్డారు. ఇక దీర్ఘకాలంలో చూస్తే తుది బీటీఏ కారణంగా రానున్న 5–10ఏళ్లలో లబ్ది పొందేందుకు వీలున్నట్లు తెలియజేశారు. అమెరికా వస్తువులపై అధిక సుంకాలు విధిస్తున్నట్లు పేర్కొంటూ భారత్‌పై యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ తాజాగా 26 శాతం ప్రతీకార టారిఫ్‌లకు తెరతీసిన విషయం విదితమే. అయితే ఆయా దేశాల వాణిజ్య లోటుతోపాటు.. దిగుమతులను పరిగణించి చేసిన మదింపు ద్వారా టారిఫ్‌లు అమలుకానున్నట్లు వివరించారు. -
టారిఫ్‌లతో పడిపోయిన ట్రంప్ గ్రాఫ్
వాషింగ్టన్: ప్రపంచ దేశాలపై ఎడాపెడా టారిఫ్‌లు వడ్డించిన అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రాఫ్ బాగా పడిపోయింది. ఆయనను అధ్యక్షుడిగా అంగీకరించే అమెరికన్ల సంఖ్య 43 శాతానికి పడిపోయింది. బుధవారంతో ముగిసిన మూడు రోజుల సర్వేలో ఈ మేరకు వెల్లడైంది. మూడు నెలల కింద అధికారం చేపట్టిన నాటి నుంచి ఆయనకు మద్దతు ఇంత తగ్గడం ఇదే తొలిసారి. జనవరిలో పదవీ బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకు ట్రంప్‌కు 47 శాతం మద్దతు లభించింది. ట్రంప్ సుంకాలు, నిర్వహణపై అమెరికన్లు బాగా అసంతృప్తితో ఉన్నారు. ఆయన విదేశాంగ విధానాన్ని సైతం వ్యతిరేకిస్తున్నారు. వలసదారులను తిప్పి పంపుతున్న అంశంపై మాత్రమే ట్రంప్ విధానాలకు ఆమోదం తెలిపారు. ట్రంప్ పాపులారిటీ తగ్గడానికి ప్రధాన కారణం ఆర్థిక వ్యవస్థను నిర్వహిస్తున్న తీరే. ఈ విషయంలో ఆయన పనితీరును కేవలం 37 శాతం మంది మాత్రమే ఆమోదించారు. ఆటోమొబైల్స్, ఆటోమోటివ్ విడిభాగాల వంటి వస్తువులపై ట్రంప్ విధించిన భారీ సుంకాలతో చాలామంది అమెరికన్లు ఆందోళన చెందుతున్నారు. కొత్త టారిఫ్‌లు తమకు, తమ కుటుంబాలకు చేటు చేస్తాయని భావిస్తున్నట్లు సర్వేలో దాదాపు సగం మంది పేర్కొన్నారు. ట్రంప్ సుంకాల పెంపు స్టాక్ మార్కెట్లో కూడా అనిశ్చితికి దారితీయడం తెలిసిందే. ఆయన దుందుడుకు విధానాలు దీర్ఘకాలిక దౌత్య నిబంధనలకు విఘాతం కలిగించడమే గాక ప్రపంచంతో అమెరికా వ్యవహరించే విధానంలో మార్పుకు కారణమయ్యాయి. ట్రంప్ సైనిక నిర్వహణ పట్ల కూడా అమెరికన్లు బాగా ఆందోళన చెందుతున్నట్టు సర్వే తేల్చింది. యెమెన్‌లో హౌతీ ఉగ్రవాదులపై సైనిక దాడి ప్రణాళిక సిగ్నల్ యాప్ ద్వారా లీకవడంపై వారు ఆగ్రహంగా ఉన్నారు. ఇది తవ్ర బాధ్యతారాహిత్యమని ఏకంగా 74 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇక ట్రంప్ విదేశాంగ విధానానికి జనామోదం కూడా జనవరిలో 34 శాతానికి పడిపోయింది. జనవరిలో ఇది 37 శాతంగా ఉంది. ట్రంప్ వలస విధానాలకు 48 శాతం ఆమోదం లభించింది. -
టారిఫ్‌పై మళ్లీ తూచ్
న్యూఢిల్లీ: 26 శాతం. కాదు 27. కాదు, కాదు... 26 శాతమే! భారత్‌పై విధించిన ప్రతీకార సుంకాల టారిఫ్ విషయంలో అమెరికా వరుస పిల్లిమొగ్గలివి. జనమే ఉండని అంటార్కిటికాతో పాటు ప్రపంచ దేశాలన్నింటినీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ఎడాపెడా టారిఫ్‌లతో బాదేయడం తెలిసిందే. వైట్‌హౌస్ రూపొందించిన టారిఫ్‌ల చార్టును చేతిలో పట్టుకుని మరీ ఒక్కో దేశంపై టారిఫ్‌లను ప్రకటించారాయన. అమెరికాలోకి ప్రవేశించే ప్రతి ఉత్పత్తిపైనా 10 శాతం సుంకాలు విధిస్తున్నట్టు పేర్కొన్నారు. భారత్‌పై 26 శాతం సుంకాలు విధిస్తున్నట్టు ఆ సందర్భంగా ట్రంప్ వెల్లడించారు. ‘‘భారత్ మాపై ఏకంగా 52 శాతం సుంకాలు విధిస్తోంది. అందులో సగం మాత్రమే మేం వసూలు చేయబోతున్నాం. ఆ లెక్కన చూస్తే మేమిప్పటికీ ఉదారంగానే వ్యవహరిస్తున్నట్టే’’ అని చెప్పుకున్నారు. కానీ మ ర్నాటికల్లా వాటిని 27 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. భారత్‌తో పా టు మొత్తం 14 దేశాలపై ట్రంప్ ప్రకటించిన టారిఫ్‌లను వైట్‌హౌస్ గురువారం సవరించింది. ఆ మేరకు అనుబంధ ప్రకటన విడుదల చేసింది. అయితే శుక్రవారానికల్లా మళ్లీ కథ మొదటికి వచ్చింది. భారత్‌పై టారిఫ్‌ను అమెరికా తిరిగి 26 శాతానికి తగ్గించేసింది. తాజాగా విడుదల చేసిన ప్రకటనలో వైట్‌హౌస్ ఈ మేరకు పేర్కొంది. ఈ సుంకాలు ఏప్రిల్ 9 నుంచి అమల్లోకి రానున్నాయి. భారత్ విషయంలో ఈ ‘ఒక్క శాతం’ తడబాటుపై ఆర్థిక నిపుణులు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. టారిఫ్‌ల విధింపు విషయంలో బహుశా ట్రంప్, ఆయన యంత్రాంగంలో నెలకొన్న తీవ్ర అయోమయానికి ఇది నిదర్శనమని వారంటున్నారు. ఈ దుందుడుకు టారిఫ్‌లు అంతిమంగా అమెరికా పుట్టినే ముంచుతాయని ఇంటా బయటా జోరుగా విశ్లేషణలు వెల్లువెత్తుతుండటం తెలిసిందే. బయటికి బెదిరింపు స్వరం వినిపిస్తున్నా, ఆ విశ్లేషణల ప్రభావం ట్రంప్ టీమ్‌పై బాగానే పడుతున్నట్టు కనిపిస్తోంది. -
టారిఫ్‌ల పెంపు అమెరికా సెల్ఫ్‌గోల్
న్యూఢిల్లీ: అమెరికా 60 దేశాలపై ప్రతీకార సుంకాలు మోపడం అన్నది తనకు తాను నష్టం చేసుకోవడమేనని (సెల్ఫ్ గోల్) ప్రముఖ ఆర్థికవేత్త, ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు. వీటి కారణంగా భారత్‌పై స్వల్ప ప్రభావమే ఉంటుందన్నారు. ‘‘స్వల్పకాలంలో అమెరికా ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం పడనుంది. ఫుట్‌బాల్ ఆటగాళ్లు చెప్పినట్టు ఇదొక సెల్ఫ్ గోల్ (తన చర్యతో ప్రత్యర్థి టీమ్‌కు పాయింట్ వచ్చేలా చేసేవాడు). భారత ఎగుమతులపై అమెరికా ప్రత్యక్ష టారిఫ్‌లు ప్రభావం చూపిస్తే అది యూఎస్‌లో ధరల పెరుగుదలకు దారితీస్తుంది. దాంతో డిమాండ్ తగ్గుతుంది. అప్పుడు భారత వృద్ధిపైనా ప్రభావం పడుతుంది. అయితే ఇతర దేశాలపైనా అమెరికా టారిఫ్‌లు మోపింది. కనుక ఆయా దేశాల ఉత్పత్తిదారులతో భారత్ పోటీపడుతుంది. కేవలం భారత్‌కు మాత్రమే విధించే టారిఫ్‌లతో పోల్చి చూస్తే ప్రస్తుత నిర్ణయం కారణంగా పడే ప్రభావం తక్కువే’’అని రఘురామ్ రాజన్ వివరించారు. యూనివర్సిటీ ఆఫ్ చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో రాజన్ ప్రస్తుతం ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. అమెరికా ఉత్పత్తిని పెంచాలన్నది ట్రంప్ దీర్ఘకాల ఉద్దేశ్యమని, దీని ఫలితం ఏదైనా దీర్ఘకాలంలోనే కనిపిస్తుందన్నారు. దేశీ వినియోగంతో పోల్చితే ఎగుమతులు తక్కువగానే ఉన్నందున.. అమెరికా ప్రతి సుంకాలు భారత్‌లో ప్రతిద్రవ్యోల్బణాన్ని కలిగించొచ్చన్నారు. అమెరికా మార్కెట్‌కు దారులు మూసుకుపోవడంతో భారత మార్కెట్‌కు ఎగుమతులకు చైనా ప్రయతి్నంచొచ్చని రాజన్ అంచనా వేశారు. ప్రపంచం మరింత రక్షణాత్మకంగా మారుతుండడంతో వాణిజ్యం విషయంలో తెలివిగా వ్యవహరించాలని సూచించారు. చైనాతో మరింత తటస్థ సంబంధాలకు ప్రాధాన్యం ఇవ్వాలని.. సార్క్, పొరుగు దేశాలతోనూ బలమైన సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. -
కొన్నింటికి మోదం.. కొన్నింటికి ఖేదం
న్యూఢిల్లీ/ముంబై: భారత ఎగుమతులపై అమెరికా విధించిన ప్రతీకార సుంకాలు కొన్ని రంగాలపై ప్రతికూల ప్రభావం చూపించనుండగా.. అదే సమయంలో కొన్ని రంగాలకు ఎగుమతి అవకాశాలను విస్తృతం చేయనుంది. ముఖ్యంగా భారత ఫార్మాస్యూటికల్స్, సెమీకండక్టర్లు, ఇంధన ఉత్పత్తులు, అమెరికాలో లభించని కొన్ని రకాల అరుదైన ఖనిజాలకు ట్రంప్ సర్కారు టారిఫ్‌ల నుంచి మినహాయింపు కల్పించింది. మిగిలిన అన్ని ఉత్పత్తులపైనా 27 శాతం అదనపు సుంకాన్ని మోపింది. దీంతో ఆటోమొబైల్ వాహనాలు, వాటి విడిభాగాలు, వైద్య పరికరాలు, రత్నాభరణాల ఎగుమతులపై ఎక్కువ ప్రభావం పడుతుందన్న అంచనాలు నెలకొన్నాయి.రత్నాభరణాల ఎగుమతులకు ఎదురుదెబ్బ: జీజేఈపీసీ అమెరికా విధించిన 27 శాతం ప్రతీకార సుంకాలు భారత జెమ్స్ అండ్ జ్యుయలరీ (రత్నాలు, ఆభరణాలు) ఎగుమతులకు పెద్ద ఎదురుదెబ్బగా జెమ్స్ అండ్ జ్యుయలరీ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) పేర్కొంది. అమెరికాకు భారత్ నుంచి ఏటా 10 బిలియన్ డాలర్ల రత్నాభరణాల ఎగుమతులు జరుగుతుండగా, వీటికి సవాళ్లు ఎదురుకానున్నట్టు పేర్కొంది. ‘‘భారత్–అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం దిశగా పురోగతికి కృషి చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. టారిఫ్‌లను అధిగమించేందుకు ఇది కీలకం’’అని జీజేఈపీసీ పేర్కొంది. భారత్ నుంచి అమెరికా ఏటా 11.58 బిలియన్ డాలర్ల మేర జెమ్స్, జ్యుయలరీని దిగుమతి చేసుకుంటుంటే.. అదే సమయంలో భారత్‌కు అమెరికా 5.31 బిలియన్ డాలర్ల రత్నాభరణాలను ఎగుమతి చేస్తోంది. వైద్య పరికరాలకు ప్రతికూలం.. ప్రతీకార టారిఫ్‌లతో మెడికల్ డివైజ్‌ల ఎగుమతులపై ప్రభావం పడనుందని, పరిశ్రమ వృద్ధికి సవాలుగా మారుతుందని ఇండియన్ మెడికల్ డివైజ్ ఇండస్ట్రీ అసోసియేషన్ (ఏఐఎంఈడీ) ఫోరం కోఆర్డినేటర్ రాజీవ్ నాథ్ తెలిపారు. 2023–24లో భారత్ నుంచి అమెరికాకు 714.38 మిలియన్ డా లర్ల విలువైన పరికరాలు ఎగుమతయ్యాయి.ఫార్మాకు ఊరట చౌకగా ఔషధాలు అందిస్తున్న భారత ఫార్మాకి ప్రతీకార టారిఫ్‌ల నుంచి ట్రంప్ సర్కార్ మినహాయింపునిచ్చింది. అమెరికాకు భారత ఫార్మా ఎగుమతులు 9 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్నాయి. 2022లో అక్కడి ప్రతి పది ప్రి్రస్కిప్షన్లలో నాలుగు ప్రిస్క్రిప్షన్లకు సంబంధించిన ఔషధాలు మన కంపెనీలు సరఫరా చేసినవే.జీడీపీ వృద్ధికి నష్టం ట్రంప్ ప్రతీకార సుంకాలతో భారత జీడీపీ వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అర శాతం తగ్గిపోయి 6%కి పరిమితం కావొచ్చని ఈవై చీఫ్ పాలసీ అడ్వైజర్ డీకే శ్రీవాస్తవ తెలిపారు. అదనపు సుంకాలు విధించడం వల్ల భారత జీడీపీపై గరిష్టంగా 35–40 బేసిస్ పాయింట్ల మేర ప్రభావం పడుతుందని స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ ఇండియా హెడ్ అనుభూతి సహాయ్ అభిప్రాయపడ్డారు. టెక్స్టైల్స్ ఎగుమతులకు సానుకూలం అమెరికా సుంకాల మోత భారత టెక్స్టైల్స్ ఎగుమతులకు సానుకూలమేనని పరిశ్రమ అభిప్రాయపడుతోంది. అమెరికాకు టెక్స్‌టైల్స్‌ను పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తున్న పోటీ దేశాలు చైనాపై 34%, వియత్నాంపై 46%, బంగ్లాదేశ్‌పై 37% సుంకాల విధింపు భారత్ కంటే అధికంగా ఉండడాన్ని ప్రస్తావించింది. ‘మా వద్ద మిగిలి ఉన్న ఖాళీ సామర్థ్యం గురించి ఇప్పటికే అమెరికా కస్టమర్ల నుంచి విచారణలు మొదలయ్యాయి’అని రేమండ్ గ్రూప్ సీఎఫ్‌వో అమిత్ అగర్వాల్ తెలిపారు. భారత్ నుంచి అమెరికా ఏటా 36 బిలియన్ డాలర్ల (రూ.3 లక్షల కోట్లు) టెక్స్‌టైల్స్‌ను దిగుమతి చేసుకుంటోంది. ఐటీ సేవలపై పరోక్ష ప్రభావం ఎగుమతి ఆధారిత దేశీ ఐటీ సేవల రంగంపై టారిఫ్‌ల ప్రభావం ప్రత్యక్షంగా పడకపోయినా, తదనంతర పరిమాణాల వల్ల పరోక్ష ప్రభావం ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అమెరికాలో మందగమనం వస్తే తయారీ, లాజిస్టిక్స్, రిటైల్ తదితర రంగాల్లో డిమాండ్ పడిపోవచ్చని ఆందోళన నెలకొంది. దీంతో ఆ రంగాల్లోని సంస్థలకు సరీ్వసులు అందించే భారత ఐటీ కంపెనీలకు ఇబ్బందులు ఎదురుకావొచ్చని విశ్లేషకులు చెప్పారు. 2024 ఆర్థిక సంవత్సరంలో భారతీయ ఐటీ సేవల కంపెనీలు ఆర్జించిన 193 బిలియన్ డాలర్ల ఆదాయాల్లో అమెరికా వాటా 57 శాతంగా నమోదైంది.వాహనాలపై ప్రభావం కొంతే.. ట్రంప్ టారిఫ్‌ల ప్రభావం వాహన రంగంపై పెద్దగా ఉండకపోవచ్చని ఆటోమొబైల్ సంస్థల సమాఖ్య సియామ్ తెలిపింది. మార్చి 26 నాటి ఆదేశాల ప్రకారం ఇప్పటికే 25 శాతం సుంకాలు అమలవుతుండడాన్ని ప్రస్తావించింది. అమెరికా మార్కెట్లో చెప్పుకోతగ్గ విక్రయాలు కలిగిన టాటా మోటర్స్ అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్‌రోవర్, రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థలకు మాత్రం.. ఎగుమతుల వృద్ధి నెమ్మదించే అవకాశం ఉంది. 2024 ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు భారత్ నుంచి ఆటో విడిభాగాల ఎగుమతులు 6.79 బిలియన్ డాలర్లుగా ఉండగా, అక్కడినుంచి దిగుమతులు 1.4 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. -
ట్రంప్ సుంకాల జోరు.. దేశాలన్నీ బేజారు
న్యూఢిల్లీ: అమెరికాకు ‘విముక్తి దినం’గా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబుతూ వచ్చిన ఏప్రిల్ 2 మిగతా ప్రపంచం పాలిట దుర్దినంగా మిగిలిపోయింది. భారత్‌తో పాటు ఏకంగా 60 పై చిలుకు దేశాలపై ఆయన వాణిజ్య కొరడా ఝళిపించడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పెను కుదుపుకు లోనైంది. వాళ్లూ, వీళ్లూ అని తేడా చూపకుండా అన్ని దేశాల మీదా 10 నుంచి 50 శాతం దాకా సుంకాలు బాదడం ద్వారా ప్రపంచ వాణిజ్య యుద్ధానికి ట్రంప్ తెర తీశారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై బుధవారం సంతకం చేశారు. భారత్‌ను తప్పుడు వాణిజ్య విధానాలు అనుసరిస్తున్న ‘దారుణ దేశం’గా ఈ సందర్భంగా అభివర్ణించారు! అన్నిరకాల భారత ఉత్పత్తుల మీదా 26 శాతం ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించగా, అనంతరం దాన్ని 27 శాతంగా సవరించారు. అమెరికాకు అత్యవసరమైన ఫార్మాస్యూటికల్స్, సెమీ కండక్టర్లు, పలు ఖనిజాలు తదితరాలను మాత్రం సుంకాల బాదుడు నుంచి మినహాయించారు. అమెరికాలోకి ప్రవేశించే అన్ని వస్తూత్పత్తుల మీదా 10 శాతం బేసిక్ టారిఫ్ విధించారు. ఇది ఏప్రిల్ 5 నుంచి అమల్లోకి వస్తుంది. అమెరికా ఉత్పత్తులపై అధిక సుంకాలు వసూలు చేస్తున్న భారత్ తదితర దేశాలను వాణిజ్యపరంగా ‘ధూర్త దేశాలు’గా ట్రంప్ ఆక్షేపిస్తుండటం తెలిసిందే. వాటిపై అదనపు సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించారు. అవి ఏప్రిల్ 9 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆ లెక్కన భారత ఉత్పత్తులపై 10 శాతం బేస్‌లైన్ టారిఫ్ ఏప్రిల్ 5 నుంచి, 27 శాతం అదనపు సుంకాల వసూలు ఏప్రిల్ 9 నుంచి మొదలవుతాయి. చైనాపై ఇటీవలే 20 శాతం సుంకాలు విధించగా మరో 34 శాతం అదనపు సుంకాలు విధిస్తున్నట్టు ట్రంప్ తాజాగా ప్రకటించారు! ట్రంప్ నిర్ణయంతో అమెరికా వార్షిక పన్ను వసూళ్లు ఏటా 60 వేల కోట్ల డాలర్ల మేరకు పెరుగుతాయని వైట్‌హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో అంచనా వేశారు. ట్రంప్ ప్రకటనను దేశాలన్నీ దుయ్యబట్టాయి. అమెరికాపై ప్రతీకార సుంకాలు తప్పవని యూరోపియన్ యూనియన్, చైనా హెచ్చరించాయి. ట్రంప్ పునరాలోచించాలని పలు దేశాలు విజ్ఞప్తి చేశాయి. దీనిపై భారత్ ఆచితూచి స్పందించింది. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. ‘‘ట్రంప్‌కు అమెరికా ఫస్ట్ అయితే మోదీకి భారతే ఫస్ట్. దీనిపై ఎలా ముందుకెళ్లాలో ఆలోచిస్తాం’’ అన్నారు. ట్రంప్ వలలో మోదీ: కాంగ్రెస్ భారత్‌పై అమెరికా తాజా సుంకాల మోతను మోదీ ప్రభుత్వ వైఫల్యంగా కాంగ్రెస్ అభివర్ణించింది. ‘‘మోదీ తన మిత్రుడంటూ ట్రంప్ ఆప్యాయత కనబరుస్తారు. బహిరంగంగా కౌగిలించుకున్నారు. కానీ తాను పక్కా వ్యాపారినని నిరూపించుకుంటూ మోదీపై చాకచక్యంగా వల విసిరారు. మనవాడు అందులో ఇరుక్కుపోయాడు’’ అని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే దుయ్యబట్టారు. తాజా సుంకా లు భారత ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేస్తా యని లోక్‌సభలో వి పక్ష నేత రాహుల్‌గాంధీ ఆందోళన వెలిబుచ్చా రు. వీటిని ఎలా ఎదుర్కోనున్నదీ కేంద్రం తక్షణం వివరించాలని డిమాండ్ చేశారు.మెరుగ్గా, బలంగా, దృఢంగా: ట్రంప్ప్రపంచ దేశాలపై తాను విధించిన తాజా సుంకాల మీద ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆపరేషన్ ముగిసింది. రోగి బతికాడు. భేషుగ్గా ఉన్నాడు. చక్కగా కోలుకుంటున్నాడు. మునపటి కంటే పెద్దగా, మెరుగ్గా, బలంగా, ఎన్నడూ లేనంత దృఢంగా తయారవుతాడని తేలింది’’ అని ట్రూత్‌సోషల్‌లో కామెంట్ చేశారు.ఇండియాపై ఇరవై ఆరా, ఇరవై ఏడా? ట్రంప్ ప్రకటన నేపథ్యంలో భారత్‌తో పాటు పలు దేశాలపై అమెరికా విధించనున్న తాజా టారిఫ్‌లు ఎంతన్న దానిపై సందిగ్ధత నెలకొంది. భారత్‌తో పాటు 14 దేశాలపై ట్రంప్ ప్రకటించిన సుంకాలకు, అనంతరం వైట్‌హౌస్ విడుదల చేసిన వివరాలకు మధ్య తేడా ఉండటమే ఇందుకు కారణం. ట్రంప్ ప్రకటన అనంతరం ఆయా దేశాలపై టారిఫ్‌లను అమెరికా సవరించడమే ఇందుకు కారణమని బ్లూంబర్గ్ వివరించింది. ఆ మేరకు భారత్‌పైనా సుంకం ఒక శాతం పెరిగింది. దాన్ని 26 శాతంగా ట్రంప్ పేర్కొనగా తర్వాత దాన్ని 27 శాతంగా సవరించారు. గురువారం అనుబంధ ప్రకటనలో వైట్‌హౌస్ ఈ మేరకు పేర్కొంది. భారత్‌తో పాటు దక్షిణకొరియ సహా మొత్తం 14 దేశాలపై సుంకాలను సవరించారు. కెనడా ప్రతీకార సుంకాలు అమెరికా చర్యలకు ప్రతీకారం తప్పదని ఇప్పటికే ప్రకటించిన కెనడా అన్నంత పనీ చేసింది. అమెరికాకు చెందిన ఆటో ఉత్పత్తులపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్టు గురువారం ప్రకటించింది. దీని ప్రభా వం అమె రికా ఆటో రంగంపై తీవ్రంగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.కెనడా, మెక్సికోలకు మినహాయింపుఐఈఈపీఏ స్టాండింగ్ ఆర్డరే కారణంఆ దేశాలపై ఇప్పటికే 25 శాతం బాదుడుడొనాల్డ్ ట్రంప్ వడ్డించిన తాజా సుంకాల నుంచి కెనడా, మెక్సికోలకు మినహాయింపు లభించింది. కైనడా, మెక్సికోలపై భారీ సుంకాలు తప్పవని పదేపదే చెబుతూ వచ్చినా తాజా టారిఫ్‌ల జాబితాలో వాటిని చేర్చలేదు. ఫెంటానిల్, వలసలకు సంబంధించిన ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ (ఐఈఈపీఏ) కింద స్టాండింగ్ ఆర్డర్ల కారణంగా కెనడా, మెక్సికోలకు కొత్త టారిఫ్‌లు వర్తించవని వైట్‌హౌస్ స్పష్టం చేసింది. అమెరికా–మెక్సికో–కెనడా ఒప్పందం (యూఎస్ఎంసీఏ) కింద అమెరికాలోకి ప్రవేశించే వస్తువులకు కూడా కొత్త సుంకాల నుంచి మినహాయింపు ఉంటుంది. అయితే చైనాతో పాటుగా కెనడా, మెక్సికోలపై ట్రంప్ ఇటీవలే 25 శాతం సుంకాలు విధించడం తెలిసిందే. కనుక తాజా మినహాయింపు వాటికి పెద్దగా ఉపశమనం కలిగించబోదు. -
ప్రతీకారం తప్పదు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన తాజా టారిఫ్‌లపై ప్రపంచ దేశాలన్నీ మండిపడుతున్నాయి. ప్రపంచ వాణిజ్య యుద్ధానికి తెర తీశారంటూ దుయ్యబడుతున్నాయి. ప్రతీకారం తప్పదని ఆయా దేశాల అధినేతలు స్పష్టం చేశారు. వాణిజ్య యుద్ధాలు ఇరు పక్షాలను దెబ్బతీస్తాయని జర్మనీ హెచ్చరించింది. తమపై ట్రంప్ విధించిన 10 శాతం సుంకాన్ని ఎదుర్కోవడానికి లాటిన్ అమెరికాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన బ్రెజిల్ బుధవారం ఒక చట్టాన్ని ఆమోదించింది. దెబ్బకు దెబ్బ: ఈయూ యూరోపియన్ యూనియన్‌పై 20 శాతం సుంకాలను యూరప్ దేశాలన్నీ తీవ్రంగా ఖండించాయి. ఇది పూర్తిగా అన్యాయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ‘‘అమెరికా వస్తువులకు ఈయూ అతి పెద్ద మార్కెటని ట్రంప్ మర్చిపోయినట్టున్నారు. యూఎస్‌పై ప్రతీకార సుంకాలు విధిస్తాం’’అని హెచ్చరించాయి. ‘‘ఈయూ ఉక్కుపై అమెరికా సుంకాలకు ప్రతిస్పందనగా ప్రతీకార ప్యాకేజీని ఖరారు చేస్తున్నట్టు ఈయూ అధ్యక్షురాలు ఉర్సులా వాండడెర్ లెయన్ ప్రకటించారు. చర్చలు విఫలమైతే తమ ప్రయోజనాలను, వ్యాపారాలను రక్షించుకోవడానికి మరిన్ని ప్రతీకార సుంకాలు తప్పవని స్పష్టం చేశారు. అయితే ఈ సుంకాల యుద్ధంతో అంతిమంగా నష్టపోయేది ప్రపంచ ఆర్థిక వ్యవస్థేనంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ...సమరమే: కెనడా ప్రపంచ వాణిజ్య వ్యవస్థనే అతలాకుతలం చేసే ట్రంప్ సుంకాలపై పోరాడతామని కెనడా ప్రధాని మార్క్ కార్నీ ప్రతిజ్ఞ చేశారు. ఇతర దేశాలతో పోలిస్తే కెనడాపై తాజా టారిఫ్‌ల ప్రభావం పరిమితమే. అయినా ఉక్కు, అల్యూమినియం, ఆటోమొబైల్స్‌పై అమెరికా సుంకాలు లక్షలాది కెనడియన్లను నేరుగా ప్రభావితం చేస్తాయని కార్నీ ఆక్షేపించారు. ఈ సుంకాలను ప్రతిదాడులతో ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. మంచిది కాదు: బ్రిటన్ వాణిజ్య యుద్ధం ఎవరికీ మంచిది కాదని బ్రిటన్ ప్రధాని కియిర్ స్టార్మర్ వ్యాఖ్యానించారు. ‘‘అన్ని పరిస్థితులకూ మేం సిద్ధంగా ఉన్నాం. ప్రతిస్పందనగా మావైపు నుంచి ఏ చర్యలనూ తోసిపుచ్చలేం’’అని పార్లమెంటుకు చెప్పారు. విచారకరం: జపాన్ ఈ దిగుమతి సుంకాలు చాలా విచారకరమని జపాన్ వ్యాఖ్యానించింది. అవి ప్రపంచ వాణిజ్య సంస్థ, యూఎస్–జపాన్ ఒప్పందాలను ఉల్లంఘించడమేనని పేర్కొంది. అమెరికా తమపై విధించిన 36 శాతం సుంకంపై చర్చలు జరుపుతామని అయితే థాయిలాండ్ తెలిపింది. సుంకాల ప్రకటనకు ఒక రోజు ముందే.. అమెరికా దిగుమతులపై ఇజ్రాయెల్ అన్ని సుంకాలను రద్దు చేసినా.. ఫలితం లేకపోయింది. ఇజ్రాయెల్ వస్తువులపై ట్రంప్ 17 శాతం సుంకాలను విధించడంపై ఆ దేశం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. భారీ మూల్యం తప్పదు: ఆ్రస్టేలియా ఆ్రస్టేలియా గొడ్డు మాంసంపై ట్రంప్ కఠిన ఆంక్షలు దారుణమని ప్రధాని ఆంటోనీ అల్బనీస్ విమర్శించారు. ఇందుకు అమెరికా ప్రజలు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. అయితే, ‘‘మేం పరస్పర సుంకాలకు దిగబోం. అధిక ధరలకు, ఆర్థిక మందగమనానికి దారితీసే రేసులో చేరబోం’’అని స్పష్టం చేశారు. కంపెనీలను కాపాడుకుంటాం: స్పెయిన్ దేశీయ కంపెనీలను, పరిశ్రమలను, మొత్తంగా ఆర్థిక రంగాన్ని ఈ సుంకాల ప్రభావం బారినుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుకుని తీరతామని స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ ప్రకటించారు. స్వేచ్ఛా వాణిజ్య ప్రపంచమే తమ లక్ష్యమన్నారు. గొడవలొద్దు: స్వీడన్ వాణిజ్య అడ్డంకులను కోరుకోవడం లేదని స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టెర్సన్ అన్నారు. ‘‘మాకు వాణిజ్య యుద్ధం వద్దు. అమెరికాతో కలిసి వాణిజ్యం, సహకార మార్గంలో పయనించాలని, తద్వారా ఇరు దేశాల ప్రజలు మెరుగైన జీవితాన్ని ఆస్వాదించాలని కోరుకుంటున్నాం’’అని చెప్పారు. హానికరమైన సుంకాలు: ఇటలీ ట్రంప్ సుంకాలను ఆయన మిత్రురాలు, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఘాటుగా విమర్శించారు. ఈ సుంకాలు హానికరమని హెచ్చరించారు, ‘‘వాణిజ్య యుద్ధాన్ని నివారించాలి. అది తీవ్రతరం కాకముందే పరిష్కారం కోసం అమెరికా ప్రయతి్నంచాలి’’అని సూచించారు. ఆర్థిక సంక్షోభం: ఫ్రాన్స్ ట్రంప్ సుంకాలు అతి పెద్ద ఆర్థిక సంక్షోభానికి దారి తీస్తాయని ఫ్రాన్స్ ఆందోళన వెలిబుచి్చంది. ఫ్రెంచ్ వైన్, స్పిరిట్స్ ఎగుమతులపై ఇవి గణనీయ ప్రభావం చూపుతాయని ప్రభుత్వ ప్రతినిధి సోఫీ ప్రైమాస్ వ్యాఖ్యానించారు. తక్షణం రద్దు చేయాలి: చైనా ఏకపక్ష టారిఫ్‌లను అమెరికా తక్షణం రద్దు చేయాలని చైనా డిమాండ్ చేసింది. ప్రపంచ ఆర్థికాభివృద్ధికి ఇవి గొడ్డలి పెట్టని అభిప్రాయపడింది. అమెరికా ప్రయోజనాలతో పాటు అంతర్జాతీయ సరఫరా గొలు సులను కూడా దెబ్బతీస్తాయని హెచ్చరించింది. విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని అమెరికాకు సూచించింది.చర్చలే మార్గం: దక్షణ కొరియా ఈ సమస్యకు చర్చలే మార్గమని ద క్షణ కొరియా అభిప్రాయపడింది. ప్రపంచ వాణిజ్య యుద్ధం వాస్తవ రూపం దాల్చిందని తాత్కాలిక అధ్యక్షుడు హాన్ డక్ సూ అన్నారు. ఆర్థిక మంత్రి, ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష జరిపారు. ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి శక్తి సామ ర్థ్యాలన్నింటినీ ధారపోద్దామని చెప్పారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ట్రంప్ మార్క్ ప్రతీకారం.. భారత్‌కు స్వల్ప ఊరట
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను చెప్పినట్టుగానే ప్రపంచ దేశాలకు షాకిచ్చారు. ట్రంప్ టారిఫ్‌ల బాంబు పేల్చారు. విదేశీ ఉత్పత్తులపై భారీగా సుంకాలు వడ్డించారు. భారతదేశ ఉత్పత్తులపై 26 శాతం టారిఫ్ వసూలు చేయనున్నట్లు ప్రకటించారు. అన్ని దేశాల నుంచి దిగుమతి అయ్యే అటోమొబైల్స్‌పై 25 శాతం సుంకం విధిస్తున్నట్లు తేల్చిచెప్పారు. ప్రతీకార సుంకాలు ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. ఇదే సమయంలో భారత ప్రధాని మోదీ గురించి ట్రంప్ ప్రస్తావించారు. తనకు మోదీ గొప్ప స్నేహితుడని చెబుతూనే భారత్ అమెరికాతో సరైనవిధంగా వ్యవహరించడం లేదన్నారు. 52 శాతం సుంకాలను విధిస్తోందని ట్రంప్ అన్నారు. అయితే, పలు దేశాలపై ప్రతీకార సుంకాలను విధించిన ట్రంప్.. రష్యా, ఉత్తర కొరియాకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. ఈ రెండు దేశాలపై ఎలాంటి సుంకాలు విధించలేదు. ఏప్రిల్ 2వ తేదీని అమెరికా ‘విముక్తి దినం’గా ప్రకటించిన ట్రంప్ బుధవారం వాషింగ్టన్లో మీడియాతో మాట్లాడారు. వైట్‌హౌస్‌లోని రోజ్ గార్డెన్లో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ట్రంప్ మాట్లాడుతూ..‘ఈ రోజు కోసం అమెరికా ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తోంది. అమెరికా వ్యాపారం ఈరోజు పునర్జన్మించినట్లు అయింది. అమెరికా మళ్లీ సుసంపన్నమైన దేశంగా అవతరించిన రోజుగా గుర్తుండబోతుంది. సుంకాల పేరుతో అమెరికాను చాలా ఏళ్లుగా మోసగాళ్లు ఉపయోగించుకున్నారు. ఇక అది జరగదు. మాపై సుంకాలు విధించే దేశాలపై తప్పకుండా సుంకాలు విధిస్తాం. అమెరికాకు ఈ రోజు నిజమైన ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చింది.🚨 It’s official. Donald Trump has signed 25% tariffs on our closest trade partners and allies. Friendly reminder that tariffs were a contributing factor for the Great Depression. pic.twitter.com/hlBNCcwyMu— CALL TO ACTIVISM (@CalltoActivism) April 2, 2025ఇప్పుడు అమెరికా మరింత ఎదగడానికి అవకాశం వచ్చింది. సుంకాల ప్రకటనతో అమెరికాలో మళ్లీ పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయి. కంపెనీలు తిరిగి వెనక్కి వస్తాయి. విదేశీ మార్కెట్లకు ద్వారాలు తెరుస్తాం. అమెరికాలో పోటీతత్వం పెరిగి సరసమైన ధరల్లో వస్తువులు లభిస్తాయి. దీంతో అమెరికా స్వర్ణయుగమవుతుంది. దశాబ్దాలుగా వాణిజ్య అడ్డంకులను అమెరికా తొలగిస్తూ వచ్చింది. కానీ పలు దేశాలు అమెరికా ఉత్పత్తులపై భారీ సుంకాలను విధిస్తూ వచ్చాయి. పలు దేశాలు అన్యాయమైన నియమాలను అవలంభించాయి.US President Donald Trump announced 26% import duty on India… India 26%National interest first, friendship....#TrumpTariffs pic.twitter.com/ySlvRkIYzs— Equilibrium (@abatiyaashii) April 3, 2025అమెరికాలో దిగుమతి అవుతున్న మోటారు సైకిళ్లపై కేవలం 2.4 శాతమే పన్నులు విధిస్తున్నారు. అదే థాయిలాండ్, ఇతర దేశాలు అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న ద్విచక్రవాహనాలపై 60 శాతం, భారత్ 70 శాతం, వియత్నాం 75 శాతం సుంకాలు విధిస్తున్నాయి. వాణిజ్య విషయానికి వచ్చినప్పుడు కొన్నిసార్లు స్నేహితుడు సైతం శత్రువు కంటే ప్రమాదకరం. అందుకే అన్ని విదేశీ తయారీ ఆటోమొబైల్స్‌పై 25 శాతం సుంకాలు ఈ అర్ధరాత్రి నుంచి విధించనున్నాం. అమెరికాలో ఉత్పత్తులు తయారుచేసే కంపెనీలపై ఎలాంటి పన్నులు వసూలు చేయం.అమెరికా ప్రతీకార సుంకాలు ఇలా..భారత్: 26 శాతంయూకే: 10 శాతంఆస్ట్రేలియా: 10 శాతంకొలంబియా: 10 శాతంచిలి: 10 శాతంబ్రెజిల్: 10 శాతంసింగపూర్: 10 శాతంటర్కీ: 10 శాతంఇజ్రాయెల్: 17 శాతంపిలిఫ్ఫీన్స్: 17 శాతంఈయూ: 20 శాతంమలేషియా: 24 శాతంజపాన్: 24 శాతం దక్షిణ కొరియా: 25 శాతంపాకిస్థాన్: 29 శాతం దక్షిణాఫ్రికా: 30 శాతంస్విట్జర్లాండ్: 31 శాతంఇండోనేషియా: 32 శాతంతైవాన్: 32 శాతంచైనా: 34 శాతంథాయిలాండ్: 36 శాతంబంగ్లాదేశ్ 37 శాతంశ్రీలంక: 44 శాతంకంబోడియా: 49 శాతంఈ కార్యక్రమానికి కేబినెట్ సభ్యులతో పాటు స్టీల్, ఆటోమొబైల్ కార్మికులను ట్రంప్ ఆహ్వానించారు. అమెరికా భవిష్యత్తు అమెరికన్ల చేతుల్లోనే ఉందన్నారు. ఇతర దేశాలు తమపై విధిస్తున్న సుంకాల్లో తాము సగమే విధిస్తున్నట్లు తెలిపారు. ఆయా దేశాలపై జాలితోనే ఇలా సగం సుంకాలు ప్రకటించినట్లు తెలిపారు. వీటిని రాయితీ టారిఫ్‌లుగా ట్రంప్ పేర్కొన్నారు.México , México ,México Aquí buscándolo en la lista de aranceles de Donald Trump pic.twitter.com/nouS1sMg7j— Carlos Suárez E (@Caloshhh) April 2, 2025 -
అమెరికా పర్యటనా?... వద్దు బ్రో!
లీడ్స్ (యూకే): ప్రపంచంలో అత్యుత్తమ పర్యాటక దేశాల జాబితాలో అమెరికా టాప్–3లో ఉండడం పరిపాటి. శాన్ ఫ్రాన్సిస్కో, న్యూయార్క్, షికాగో వంటి నగరాలు, అక్కడున్న జాతీయ పార్కులు, వినోద కేంద్రాలు అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్శిస్తుంటాయి. 2023లో 66.5 మిలియన్ల మంది అమెరికాను సందర్శించినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. 2024లో ఈ సంఖ్య మరింత ఎక్కువేనని అంచనా వేస్తున్నారు. అయితే, ఈ ఏడాది పరిస్థితి మారిపోయింది. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఇతర దేశాలతో సంబంధాలు దెబ్బతింటున్నాయి. విదేశీ ఉత్పత్తులపై ట్రంప్ సుంకాల మోత మోగిస్తున్నారు. అక్రమ వలసదార్ల పేరిట వేలాది మందిని బలవంతంగా బయటకు తరిమేస్తున్నారు. ఈ పరిణామాలన్నీ కలిసి పర్యాటక రంగంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. అమెరికాలో పర్యటించాలని నిర్ణయించుకున్నవారు సైతం పునరాలోచన చేస్తున్నారు. అమెరికా పట్ల ప్రపంచ దేశాల దృక్పథంలో మార్పు కనిపిస్తోంది. → అమెరికా పర్యాటక రంగం ఈ ఏడాది కనీసం 5.5 శాతం పతనమయ్యే అవకాశం ఉన్నట్లు పరిశోధక సంస్థ ‘టూరిజం ఎకనామిక్స్’ అంచనా వేసింది. ఈ మేరకు ఇటీవల ఒక నివేదిక విడుదల చేసింది. పర్యాటక రంగం ఈ ఏడాది 9 శాతం వృద్ధి చెందనున్నట్లు ఇదే సంస్థ గతంలో అంచనా వేయడం గమనార్హం. → ప్రధానంగా డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించిన టారిఫ్‌లు, వాణిజ్య యుద్ధంతో పర్యాటకానికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం కనిపిస్తోంది. ఈ ఏడాది టూరిజంపై జనం చేసే ఖర్చు 18 బిలియన్ డాలర్లు తగ్గనున్నట్లు అంచనా. → అమెరికా పర్యాటకానికి కెనడా ప్రజలే అతిపెద్ద వనరు. కెనడా ఉత్పత్తులపై 25 శాతం సుంకాలను ట్రంప్ విధించడం కెనడా పర్యాటకులకు నచ్చడం లేదు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి కెనడా నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్యలో భారీగా తగ్గుదల నమోదవుతోంది. కొన్నిసార్లు ఇది 45 శాతంగా ఉంటోంది. → అమెరికా ప్రయాణాలకు డిమాండ్ తగ్గడంతో విమానాల సంఖ్యను తగ్గించాల్సి వచ్చిందని ఎయిర్ కెనడా ప్రకటించింది. అమెరికాకు వెళ్లడానికి జనం ఆసక్తి చూపడం లేదని వెల్లడించింది. → అమెరికాకు ఇప్పటికే ట్రిప్పులు ప్లాన్ చేసుకున్నవారిలో 36 శాతం మంది వాటిని రద్దు చేసుకున్నారని కెనడియన్ మార్కెట్ రీసెర్చర్ ‘లెగర్’ తెలియజేసింది. → గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కెనడా నుంచి అమెరికాకు ప్యాసింజర్ బుకింగ్‌లు 70 శాతం పడిపోయాయని ఏవియేషన్ అనలిటిక్స్ కంపెనీ ‘ఓఏజీ’ ప్రకటించింది. → పర్యాటకుల రాక తగ్గుతుండడం పట్ల యూఎస్ ట్రావెల్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తంచేసింది. కెనడా నుంచి పర్యాటకుల సంఖ్య 10 శాతం తగ్గినా 2.1 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతుందని స్పష్టంచేసింది. 1.40 లక్షలు ఉద్యోగాలు ఊడిపోయే ప్రమాదం ఉందని పేర్కొంది. → అమెరికాలో ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ వాతావరణం మారిపోయిందని, పర్యాటకులకు అది అనువుగా లేదని విదేశీయులు అభిప్రాయపడుతున్నారు. విదేశీయులు, వలసదార్లతోపాటు స్వలింగ వివాహాల పట్ల ట్రంప్ ప్రభుత్వం కఠినంగానే వ్యవహరిస్తోంది. అందుకే ఇప్పుడు అక్కడికి వెళ్లడం క్షేమకరం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. → పశ్చిమ యూరప్ ప్రజల్లో ట్రంప్ ప్రభుత్వంపై స్పష్టమైన వ్యతిరేకత కనిపిస్తోంది. ఇటీవల ఒక సర్వేలో బ్రిటన్‌లో 53 శాతం, జర్మనీలో 56 శాతం, స్వీడన్లో 63 శాతం, డెన్మార్క్‌లో 74 శాతం మంది ట్రంప్ సర్కారుపై ప్రతికూల అభిప్రాయం వ్యక్తం చేశారు. అమెరికాపై ఈ స్థాయిలో వ్యతిరేకత కనిపించడం 2016 తర్వాత ఇదే మొదటిసారి. → అమెరికాకు పొరుగు దేశం మెక్సికో నుంచి కూడా అధికంగా టూరిస్టులు వస్తుంటారు. ట్రంప్ తొలి హయాంలో మెక్సికో టూరిస్టుల సంఖ్య బాగా తగ్గడం గమనార్హం. అప్పుడు మెక్సికో నుంచి విమాన ప్రయాణాలు 3 శాతం తగ్గాయి. 2025లో కూడా 2024తో పోలిస్తే ఇప్పటికే 6 శాతం తగ్గాయి. → అమెరికాకు వెళ్తే అరెస్టయ్యే, నిర్బంధానికి గురయ్యే ప్రమాదముందని చాలా దేశాలు తమ పౌరులను అప్రమత్తం చేస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాయి. → అమెరికాలో పర్యటన కష్టంగా మారుతోందనే ఉద్దేశంతో అంతర్జాతీయ టూరిస్టులు ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారిస్తున్నారు. బెర్ముడా హోటళ్లలో బుకింగ్‌ల కోసం ఆరా తీస్తున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. అమెరికా పర్యటనలు రద్దు చేసుకుంటున్నవారు యూరప్ దేశాలను డెస్టినేషన్‌గా ఎంచుకున్నారు. → 2026లో ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్ కప్ అమెరికా, కెనడా, మెక్సికోల్లో జరుగనుంది. 2028 ఒలింపిక్స్ అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో విదేశీ పర్యాటకుల్లో భయాందోళనను తొలగించడానికి అమెరికా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. -
Donald Trump: మరో టారిఫ్ బాంబు
వాషింగ్టన్/టొరంటో/ఫ్రాంక్ఫర్ట్/టోక్యో: ప్రపంచ దేశాలతో టారిఫ్‌ల యుద్ధాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తారస్థాయికి తీసుకెళ్తున్నారు. తమ దేశంలోకి దిగుమతయ్యే అన్నిరకాల కార్లపైనా సుంకాలను ఎకాయెకి 25 శాతానికి పెంచేస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఇది కార్ల విడిభాగాలతో పాటు తేలికపాటి ట్రక్కులకు కూడా వర్తించనుంది. ‘‘కొత్త టారిఫ్‌లు ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి వస్తాయి. ఇది శాశ్వత నిర్ణయం. దీనిపై వెనక్కు తగ్గేదే లేదు’’ అని ట్రంప్ బుధవారం ప్రకటించారు. ‘‘సుంకాలు వద్దనుకునే తయారీ కంపెనీలు అమెరికాలోనే కార్లను తయారు చేసుకుంటే సరి! పైసా కూడా పన్ను కట్టాల్సిన పనుండదు!’’ అంటూ హితవు పలికారు! భారత్‌తో పాటు పలు దేశాలపై ప్రకటించిన పరస్పర సుంకాలు కూడా ఏప్రిల్ 2 నుంచే అమల్లోకి వస్తాయని ట్రంప్ ఇప్పటికే ప్రకటించడం తెలిసిందే. దాన్ని ‘విముక్తి దినం’గా అభివరి్ణంచారు. ఒకట్రెండు రోజుల్లో మరిన్ని కఠిన వాణిజ్య నిర్ణయాలు కూడా ప్రకటించనున్నారు. కార్లపై సుంకాల పెంపుపై ప్రపంచ దేశాలు భగ్గుమన్నాయి. కెనడా, మెక్సికో, చైనా, బ్రెజిల్, జపాన్‌తో పాటు పలు యూరప్ దేశాలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించాయి. దీన్ని తక్షణం వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. లేదంటే తగిన ప్రతి చర్య తప్పదని హెచ్చరించాయి. ట్రంప్ నిర్ణయం ప్రభావం భారత్‌పైనా పడనుంది. టాటా మోటార్స్, ఐషర్ మోటార్స్ వంటి ఆటో దిగ్గజాలు తీవ్రంగా ప్రభావితం కానున్నాయి. త్వరలో ప్రతీకార చర్యలు: కెనడా ట్రంప్ ప్రకటించిన కార్ల సుంకాలను కెనడాపై ప్రత్యక్ష దాడిగా ప్రధాని మార్క్ కార్నీ అభివరి్ణంచారు. దీనిబారి నుంచి తమ దేశాన్ని, కార్ల పరిశ్రమను, కంపెనీలను, కార్మికులను ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుకుని తీరతామని ప్రకటించారు. దీనికి తప్పకుండా ప్రతీకార చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. వాటిపై నిర్ణయం తీసుకునేందుకు ‘అమెరికాతో సంబంధాలపై కేబినెట్ కమిటీ’తో కార్నీ గురువారం అవ్యతసరంగా సమావేశం కానున్నారు. ఇందుకోసం ఎన్నికల ప్రచారం నుంచి ఆయన ఉన్నపళాన ఒట్టావా చేరుకున్నారు. ట్రంప్ టారిఫ్‌ల బారినుంచి దేశీయ ఆటో పరిశ్రమను కాపాడేందుకు కెనడా ఇప్పటికే 140 కోట్ల డాలర్ల నిధిని ఏర్పాటు చేసింది. అమెరికాకు కెనడా ఎగుమతుల్లో ఆటో ఉత్పత్తులది రెండో స్థానం. యూరప్ ఆందోళన ఆర్థిక మందగమనంతో ఇప్పటికే సతమతమవుతున్న యూరప్ కార్ల పరిశ్రమపై ట్రంప్ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపనుంది. బీఎండబ్ల్యూ, ఫోక్స్‌వాగన్, మెర్సిడెజ్–బెంజ్, వోల్వో, స్టెలాంటిస్ వంటి యూరప్ తయారీ కార్ల ధరలు అమెరికాలో భారీగా పెరగనున్నాయి. ట్రంప్ చర్యను అక్కడి కార్ల దిగ్గజాలన్నీ తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇది అమెరికాపైనా ప్రతికూల ప్రభావం చూపుతుందని యూరప్ ఆటోమొబైల్ తయారీదారుల సంఘం హెచ్చరించింది. అందుకు తగ్గట్టుగానే ట్రంప్ ప్రకటన తర్వాత ఫోర్డ్, జనరల్ మోటార్స్ వంటి అమెరికా కార్ల తయారీ దిగ్గజాల షేర్ల ధరలు పతనమయ్యాయి. యూరప్ ఆటో పరిశ్రమకు అమెరికాయే అతి పెద్ద దిగుమతిదారు. 2023లో అక్కడినుంచి అమెరికాకు 560 కోట్ల యూరోల విలువైన వాహనాలు, విడిభాగాలు ఎగుమతయ్యాయి. ఇటలీ, జర్మనీ కార్ల ఎగుమతుల్లో 30 శాతం వాటా అమెరికాదే. అమెరికా కార్ల ఎగుమతుల్లో యూరప్ వాటా కేవలం 2 శాతమే. జపాన్ కార్లకు అమెరికాయే అతి పెద్ద దిగుమతిదారు. దాంతో ట్రంప్ నిర్ణయం గురువారం జపాన్ పార్లమెంటును కుదిపేసింది. ప్రధాని షిగెరు ఇషిబా దీనిపై సభలో ప్రకటన చేశారు. తాజా నిర్ణయం నుంచి తమను మినహాయించాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రతీకార చర్యలు తప్పవని హెచ్చరించారు. బ్రెజిల్ అధ్యక్షుడు లులా డసిల్వా కూడా ట్రంప్ నిర్ణయంపై మండిపడ్డారు. స్వేచ్ఛా వాణిజ్య విలువలకు ఇష్టానికి తూట్లు పొడవడం ద్వరా ట్రంప్ సర్కారు దారుణంగా ప్రవర్తిస్తోందంటూ తూర్పారబట్టారు. ‘‘ట్రంప్ తాను ప్రపంచానికే అధ్యక్షుడినని భావిస్తున్నారు. ఈ మతిలేని నిర్ణయాలు అంతిమంగా అమెరికాతో పాటు ఎవరికీ మంచి చేయవు’’ అని హెచ్చరించారు. అమెరికా టారిఫ్‌లపై ప్రపంచ వాణిజ్య సంస్థకు ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు.అమెరికాపైనా ప్రభావం ట్రంప్ కార్ల టారిఫ్ నిర్ణయం ప్రభావం అమెరికాపైనా గట్టిగానే పడనుంది. ముఖ్యంగా డెట్రాయిట్ వంటి కార్ల పరిశ్రమ కేంద్రాలకు ఇది కోలుకోలేని దెబ్బే కానుంది. అక్కడి నుంచి ఒక్క కెనడాకే 40 శాతం కార్లు ఎగుమతి అవుతాయి. ఇతర దేశాలన్నీ అమెరికాపై విధించబోయే ప్రతీకార సుంకాలు దేశీయ కార్ల పరిశ్రమ నడ్డి విరవడం ఖాయమని ఆ రంగ నిపుణులు చెబుతున్నారు. ‘‘కార్ల కంపెనీలు తయారీ యూనిట్లు అమెరికా బయటికి తరలి వేలాది మంది ఉపాధి కోల్పోవచ్చు. సరిహద్దులకు రెండు వైపులా చాలా కార్ల కంపెనీలు మూతబడటం ఖాయం. ఏప్రిల్ 2 అమెరికాకు విముక్తి దినమని ట్రంప్ అనుకుంటున్నారు. కానీ నిజానికి అది ఆ దేశం పాలిట వినాశ దినం కాబోతోంది’’ అని కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్ గవర్నర్ డౌగ్ ఫోర్డ్ చెప్పారు.2024లో అమెరికా దిగుమతి చేసుకున్న కార్లు, ట్రక్కులు దాదాపు 80 లక్షలు వాటి విలువ24,000 కోట్ల డాలర్లు -
‘ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్’కు సుంకాలతో ముప్పు
భారత్‌కు ‘ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్’ అనే బిరుదును తెచ్చిపెట్టిన ఇండియా ఫార్మా రంగానికి అమెరికా పరస్పర సుంకాల ముప్పు పొంచి ఉందని హెటిరో గ్రూప్ వ్యవస్థాపకులు, రాజ్యసభ సభ్యుడు బి.పార్థసారధిరెడ్డి పార్లమెంటులో ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఔషధాలపై భారత్ ప్రస్తుతం 10 శాతం దిగుమతి సుంకం విధిస్తుండగా, అమెరికాలోకి దిగుమతి అయ్యే భారతీయ ఔషధాలపై ఎలాంటి సుంకాలు విధించడం లేదు. యూఎస్ ప్రభుత్వం ఈ అంతరాన్ని పూడ్చేందుకు సుంకాలు విధిస్తే భారత్‌కు నష్టం కలుగుతుందన్నారు.2023-24లో భారత మొత్తం ఫార్మా ఎగుమతుల్లో అమెరికా 31 శాతం లేదా 9 బిలియన్ డాలర్లు (రూ.74,000 కోట్లు) వాటాను కలిగి ఉందని పార్థసారధిరెడ్డి తెలిపారు. అమెరికా ఏవైనా పరస్పర సుంకాలు భారతీయ ఫార్మా ఉత్పత్తులపై విధిస్తే పోటీతత్వాన్ని తగ్గించడంతోపాటు అభివృద్ధి చెందుతున్న ఈ పరిశ్రమకు నష్టం చేకూరుతుందన్నారు. దీని వల్ల ధరలు పెరిగే అవకాశం ఉందన్నారు. ధరల పెరుగుదల భారత ఫార్మా కంపెనీలకు, ముఖ్యంగా తక్కువ ధరలకు లభించే జనరిక్ మందుల మార్కెట్ వాటాను కోల్పోవడానికి దారితీస్తుందని చెప్పారు. దీనివల్ల లాభాల మార్జిన్లు తగ్గుతాయని, అనేక పెట్టుబడులు లాభసాటిగా ఉండవన్నారు.సామరస్య పరిష్కారానికి చర్యలు‘భారత ఫార్మా రంగం విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు గణనీయంగా దోహదం చేస్తోంది. ఫార్మా ఉత్పత్తుల ఎగుమతులకు అంతరాయం ఏర్పడితే విదేశీ ఇన్వెస్టర్ల ఆదాయాలు తగ్గుతాయి. ఫార్మా పరిశ్రమతో ముడిపడి ఉన్న తయారీ, పరిశోధన, పంపిణీ, ఇతర రంగాల్లో చాలామంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు దౌత్యపరమైన చర్యలు తీసుకోవాలి. అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కుదుర్చుకోవాలి. ప్రపంచ పోటీతత్వాన్ని కొనసాగించడానికి, ప్రపంచవ్యాప్తంగా సరసమైన మందులను సరఫరా చేయడంలో భారతదేశం కీలక పాత్ర పోషిస్తోంది. ఫార్మా కంపెనీలకు సబ్సిడీలు, పన్ను మినహాయింపుల ద్వారా భారత ప్రభుత్వం ఆర్థిక మద్దతును అందించాలి’ అని తెలిపారు.ఇదీ చదవండి: భారత్‌పై యూఎస్ దూకుడుగా వ్యవహరిస్తుందా..?బడ్జెట్లోనే కీలక నిర్ణయంఅమెరికా నుంచి ఏటా ఫార్మా దిగుమతులు ప్రస్తుతం 800 మిలియన్ డాలర్లు మాత్రమే ఉన్నందున అమెరికా ఫార్మా ఉత్పత్తుల దిగుమతులపై సుంకాలను సున్నాకు తగ్గించాలని ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయెన్స్ (ఐపీఏ) ఇప్పటికే ప్రతిపాదించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవలి బడ్జెట్లో ఇప్పటికే అనేక కీలక ఔషధాలపై దిగుమతి సుంకాన్ని తొలగించారు. -
భారత్‌పై యూఎస్ దూకుడుగా వ్యవహరిస్తుందా..?
ప్రతిపాదిత అమెరికా సుంకాల నుంచి భారత్‌కు కొంతమేర ఉపశమనం లభించవచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం చైనా, మెక్సికో, కెనడా వంటి దేశాలపై యూఎస్ విధిస్తున్న సుంకాల మాదిరిగా కాకుండా కొంత వెసులుబాటు ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అమెరికా-ఇండియా మధ్య వాణిజ్య చర్చలు సజావుగా సాగుతున్నాయని, ప్రతిష్టంభన ఏర్పడే సూచనలు కనిపించడం లేదన్నారు.కొత్త వాణిజ్య చర్యలను దశలవారీగా అమలు చేయడానికి వీలుగా అనువైన విధానాన్ని అధికారులు అన్వేషిస్తున్నారని ప్రభుత్వ వర్గాలు ధృవీకరించాయి. ఈ ఒప్పందంలో భాగంగా గణనీయమైన వాణిజ్య పరిమాణాలు కలిగిన అధిక డిమాండ్ ఉన్న వస్తువులపై ఒక మోస్తరు సుంకం పెరుగుదలనే చూడవచ్చని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. దీంతో అమెరికాకు భారత ఎగుమతులపై సుంకాల ప్రభావం తగ్గుతుందని చెబుతున్నారు.మరిన్ని రాయితీలు కావాలని ఒత్తిడిఅమెరికాకు అధిక పరిమాణంలో ఎగుమతి చేసే కొన్ని కీలక రంగాలపై సుంకాలను తగ్గించాలని భారత వాణిజ్య అధికారులు యూఎస్‌పై ఒత్తిడి తెస్తున్నట్లు చెబుతున్నారు. మరో మూడు రోజుల్లో కొత్త వాణిజ్య ఒప్పంద వివరాలను ఖరారు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. యూఎస్‌తో చర్చలు సానుకూలంగా ఉన్నప్పటికీ అమెరికా భారత్ నుంచి మరిన్ని రాయితీలు కావాలని ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.616 కోట్లు ఎగనామంఇతర దేశాల మాదిరి కాదు..ప్రపంచ వాణిజ్య పునర్వ్యవస్థీకరణల మధ్య అమెరికా తన టారిఫ్ వ్యూహాన్ని సమీక్షిస్తున్న విషయం తెలిసిందే. చైనా, మెక్సికో, కెనడాల మాదిరిగా కాకుండా భారత్‌ను ప్రత్యేకంగా చూస్తూ కొంతమేర సుంకాల్లో వెసులుబాటు ఇచ్చే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇది అమెరికాతో భారత్‌కు ఉన్న ప్రత్యేక వాణిజ్య సంబంధాలను హైలైట్ చేస్తుంది. దీంతో భారీగా టారిఫ్ పెంపుపై ఆందోళన చెందుతున్న భారత ఎగుమతిదారులకు ఉపశమనం లభించనుందనే వాదనలున్నాయి. -
భస్మాసుర హస్తంగా... ట్రంప్!
సమస్యలను పరిష్కరించగలిగే అధికారం కలిగినవారే కొత్త సమస్యలను, సవాళ్లను కొనితెస్తే ఎలా ఉంటుంది? అచ్చు డోనాల్డ్ ట్రంప్ వ్యవహారంలా ఉండదూ! ‘అమెరికా ఫస్ట్’ నినాదంతో ఎన్నికలలో మళ్లీ గెలిచి 47వ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన ట్రంప్ పట్ట పగ్గాలు లేనివిధంగా తీసుకుంటున్న నిర్ణయాలతో అంతర్జాతీయ సమాజం ఆర్థికంగా అల్లకల్లోలంగా మారుతున్నది. ట్రంప్ దేశాధ్యక్షుడు అయిన వెంటనే అమెరికాకు సంబంధించి పలు రక్షణాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. అమెరికా పౌరసత్వంపై ఆంక్షలు, విదేశాలకు అందించే సహాయ నిధులలో కోత, అక్రమ వలసదారులపై వేటు, అమెరికన్ ప్రభుత్వ ఉద్యోగుల కుదింపునకు, దుబారా నివారణకు ఎలాన్ మస్క్ నేతృత్వంలో ‘డోజ్’ ఏర్పాటు తదితర నిర్ణయాలకు చాలావరకు సానుకూల స్పందన వచ్చింది. కానీ వివిధ దేశాలతో జరిపే ఎగుమతులు, దిగుమతులలో సమాన స్థాయిలో సుంకాలు విధిస్తామనీ, టారిఫ్‌ల విషయంలో ఎవ్వరికీ మినహాయింపులు ఉండవనీ తెగేసి చెప్పడంతో అంతర్జాతీయ వాణి జ్యంలో అనిశ్చితి ఏర్పడింది. ‘తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే’ అనే ఓ ముతక సామెతను గుర్తు తెచ్చే విధంగా ట్రంప్ ఒకవైపు భారత ప్రధాని నరేంద్ర మోదీ, భారత దేశ ప్రజల పట్ల తనకు ఎంతో గౌరవం, అభిమానం ఉన్నాయని చెబుతూనే భారత్ నుంచి దిగుమ తయ్యే సరుకులపై అధిక సుంకాలు వేస్తామని తేల్చేశారు.పరస్పర సుంకాల విధానం అంటే, ఏదైనా ఒక దేశం అమెరికా నుంచి వచ్చే ఉత్పత్తులపై ఎంత మొత్తాన్నైతే దిగుమతి సుంకంగా విధిస్తుందో, అమెరికా కూడా సదరు దేశ ఉత్పత్తులపై అంతే సుంకం విధిస్తుందంటూ ట్రంప్ ఏకపక్షంగా ప్రకటించేశారు. కెనడా, మెక్సికోల నుంచి దిగుమతి చేసుకొనే ఉత్పత్తులపై 25%; చైనా ఉత్పత్తులపై 10% సుంకం విధిస్తూ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. అలాగే, భారత్ వద్ద చాలా సంపద ఉందనీ, అమె రికా నుంచి దిగుమతి చేసుకునే కార్లపై భారత్ 100 శాతం సుంకాలు విధిస్తోంది కనుక... ఆ మేరకు మేమూ సిద్ధమేనంటూ ట్రంప్ సాక్షాత్తూ మోదీ సమక్షంలోనే కుండబద్దలు కొట్టారు.సుంకాలకు శ్రీకారం చుట్టింది అమెరికాయే!ప్రపంచం మొత్తం ఓ అంతర్జాతీయ గ్రామంగా మారాలనీ, స్వేచ్ఛా ప్రపంచ వాణిజ్యం వల్ల అన్ని దేశాలూ లాభపడతాయంటూ తొలుత విదేశాల నుంచి దిగుమతయ్యే వస్తువులపై 1929 నుంచి ఆంక్షలు విధించడం మొదలుపెట్టింది అమెరికాయే. దాంతో, అంత ర్జాతీయ వాణిజ్యంలో క్రమంగా అన్ని దేశాలూ పాల్గొనడం మొదలైంది. వాణిజ్య సుంకాలకు సంబంధించి అంతర్జాతీయ నిబంధనలు ఏర్పరచడం తప్పనిసరి అని అన్ని దేశాలూ అంగీకారానికొచ్చిన నేపథ్యంలోనే 1948లో ‘గాట్’ (జనరల్ అగ్రిమెంట్ ఫర్ ట్రేడ్ అండ్ టారిఫ్) ఒప్పందం మొదలైంది. దాంతో ‘అంతర్జాతీయ స్వేచ్ఛా వాణిజ్య సమాజం’ ఆవిర్భవించింది. 1994లో 117 దేశాలు గాట్ ఒప్పందంపై సంతకాలు చేశాయి. అందులో భారత్ కూడా ఉంది. ‘వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్’ (ప్రపంచ వాణిజ్య సంస్థ)లోని సభ్య దేశాల నడుమ వాణిజ్య ఒప్పందాలు జరగడం; సుంకాల విధింపునకు సంబంధించి పలు దఫాలు చర్చలు జరిగి ఆయా దేశాలపై విధించిన ఆంక్షల విషయంలో సడలింపులు చోటు చేసుకొన్నాయి. భారతీయ జౌళి ఉత్పత్తుల దిగు మతులపై అప్పటివరకు ఉన్న ఆంక్షల్ని చాలా దేశాలు ఎత్తి వేశాయి. ఇదంతా చరిత్ర!ఎవరికి నష్టం?‘అమెరికన్లను రక్షించేందుకు ఈ సుంకాలు అవసరం’ అనిట్రంప్ తన నిర్ణయాలను సమర్థించుకొంటున్నారు. పైగా, దీనికోసం అమెరికా అధ్యక్షుడిగా తనకున్న అసాధారణ అధికారాలను ఉపయో గించుకొని ‘అంతర్జాతీయ ఆత్యయిక ఆర్థిక అధికారాల చట్టం’ (ఐఈ ఈపీఏ)ను ఉపయోగించుకొంటున్నారు. దీనివల్ల అమెరికా న్యాయ స్థానాలు జోక్యం చేసుకోవడానికీ, ట్రంప్ నిర్ణయాలను సమీక్షించ డానికీ అవకాశం లేకుండా పోయింది. ప్రజల స్పందన ఎలా ఉన్నా, అమెరికా దేశీయ స్టాక్ మార్కెట్లు మాత్రం తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. రోజుల వ్యవధిలోనే లక్షల డాలర్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. చమురు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. చౌకగా లభించే శ్రామిక శక్తి దూరమైంది. ఈ విపరిమా ణాలతో అమెరికా ద్రవ్యోల్బణ రేటు ప్రస్తుతం ఉన్న 2.9 శాతం నుంచి 3.3 శాతానికి చేరుకొంటుందని అక్కడి ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే.. అమెరికాలోని భారతీ యులు కూడా ఆ మేరకు నష్టపోతారు.ట్రంప్ దూకుడును నియంత్రించే శక్తి ఎవరికి ఉంది? రష్యా– ఉక్రెయిన్ యుద్ధంపై బైడెన్ అనుసరించిన వైఖరికి భిన్నంగా ట్రంప్ రష్యాకు అనుకూలంగా మారిపోవడంతో రష్యా అధ్యక్షుడు పుతిన్ అనివార్యంగా ట్రంప్‌ను సమర్థిస్తున్నారు. బ్రెజిల్, రష్యా, ఇండియా సభ్య దేశాలుగా ఉన్న ‘బ్రిక్స్’ కూటమి అమెరికా ఆధిపత్యాన్ని తగ్గించడానికి ఒక దశలో డాలరు చెల్లింపుల వ్యవçస్థ నుంచి వైదొలగాలని భావించినప్పటికీ మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆ ప్రతిపాదనను విరమించుకొనే అవకాశం ఉంది.‘అమెరికా హితం ప్రపంచ హితం, అమెరికా శోకం ప్రపంచ విషాదం’ అనే ఓ వ్యంగ్య నానుడి ఉంది. అంటే అమెరికా ఏది చేసినా ప్రపంచానికి మంచి చేస్తుంది కనుక అన్ని దేశాలూ గొర్రెల్లా తలలు ఊపాల్సిందే. కానీ ట్రంప్ తీసుకొంటున్న సమాన టారిఫ్ నిర్ణయాలు ప్రపంచ వాణిజ్యాన్ని చావుదెబ్బ తీసే పరిస్థితులు కనిపిస్తున్న నేప థ్యంలో మిగతా దేశాలు ఏ విధంగా స్పందిస్తాయన్నది ఆసక్తికరం.భారత రైతాంగానికి రక్షణ అవసరంనిజానికి, అభివృద్ధిలో వెనుకబడిన దేశాలు తమ దేశీయ ఉత్పత్తులను రక్షించుకోవడానికి అధిక సుంకాలు విధించడం సహజం. ఉదాహరణకు మన దేశంలోకి ఇబ్బడిముబ్బడిగా వచ్చిపడే వ్యవసాయ ఉత్పత్తులపై అధిక సుంకాలు విధించనట్లయితే... దేశ రైతాంగానికి పండించే పంటలకు కనీస మద్దతు ధరలు లభించక వారి మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. ఒకవేళ భారత ప్రభుత్వం కనుక ట్రంప్ హెచ్చరికలకు తలొగ్గి, అమెరికా వ్యవసాయ దిగుమతులపై ప్రస్తుతం విధిస్తున్న సుంకాలను తగ్గించినట్లయితే... భారతీయ మార్కెట్లను అమెరికన్ వ్యవసాయ ఉత్పత్తులు ముంచెత్తుతాయి. ఫలితంగా భారతీయ రైతాంగం మరింతగా కష్టాల ఊబిలోకి కూరుకుపోతుంది.కాగా, అమెరికాకు భారత్ చేస్తున్న ఎగుమతులలో వస్త్రాలు, ఔషధాలు, ఐటీ ఆధారిత సేవలు, అల్యూమినియం, ఉక్కు, ఇంకా కొన్ని రకాల వ్యవసాయ ఉత్పతులు ప్రధానంగా ఉన్నాయి. వీటిపై అమెరికా అధిక సుంకాలు వేస్తే మన దేశంలోని పరిశ్రమలు నష్ట పోతాయి. నష్టాన్ని నివారించాలంటే కొత్త మార్కెట్లను అన్వేషించాలి. అది ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే పని కాదు. అందువల్ల... దేశ పారిశ్రామిక రంగాన్ని ‘ట్రంప్’ సవాళ్ల నుంచి రక్షించుకోవడం కేంద్ర ప్రభుత్వానికి తలకు మించిన భారమే. ట్రంప్ ఏకపక్షంగా పెంచిన సుంకాలపై ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటీవో)కు ఫిర్యాదు చేసింది. భారత్ కూడా అమెరికా మీద ఒత్తిడి తేవడానికీ, తన ప్రయోజనాలను కాపాడుకోవడానికీ దృఢంగా వ్యవహరించాలి.డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు,కేంద్ర మాజీ మంత్రి -
అమెరికా ఉత్పత్తులపై ఈయూ ప్రతీకార సుంకాలు
బ్రస్సెల్స్: అమెరికా, యూరోపియన్ యూనియన్(ఈయూ) మధ్య టారిఫ్‌ల యుద్ధం జరుగుతోంది. ఈయూకు సంబంధించిన స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం పెంచిన 25 శాతం టారిఫ్‌లు బుధవారం నుంచే అమల్లోకి వచ్చాయి. అందుకు ప్రతీకారంగా ఈయూ సైతం గంటల వ్యవధిలోనే అమెరికా ఉత్పత్తులపై టారిఫ్‌లు ప్రకటించింది. అమెరికా నుంచి వచ్చే పారిశ్రామిక, పాడి ఉత్పత్తులపై కొత్త సుంకాలు వసూలు చేయనున్నట్లు బుధవారం ఈయూ తేల్చిచెప్పింది. 28 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా ఉత్పత్తులపై సుంకాలు అతిత్వరలో అందుబాటులోకి రాబోతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఒత్తిడి పెంచడంలో భాగంగానే ఈయూ సైతం టారిఫ్‌లు విధిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ట్రంప్ వెనక్కి తగ్గితే ఈయూ దేశాలు సైతం వెనక్కి తగ్గే అవకాశం ఉంది. టారిఫ్‌ల విషయంలో అమెరికాతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని ఈయూ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌డెర్ లెవెన్ చెప్పారు. ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఆర్థికవ్యవస్థలపై టారిఫ్‌ల పేరిట పెనుభారం మోపడం తమకు ఇష్టం లేదన్నారు. అయితే, అమెరికా చర్యలకు ప్రతిచర్యగా తాము సైతం టారిఫ్‌లు విధించాలని నిర్ణయించినట్లు తేల్చిచెప్పారు. -
అమెరికా ఉత్పత్తులపై 15% టారిఫ్‌లు ప్రకటించిన చైనా
వాషింగ్టన్: చైనా ఉత్పత్తులపై 20 శాతం టారిఫ్‌లు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 4న చేసిన ప్రకటనకు చైనా బదులు తీర్చుకుంది. అమెరికా వ్యవసాయోత్పత్తులు ముఖ్యంగా సోయా, బీఫ్, పోర్క్, చికెన్ ఉత్పత్తులపై అదనంగా 15 శాతం టారిఫ్‌లు విధిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఇప్పటికే మార్గమధ్యంలో ఉన్న ఉత్పత్తులపై ఈ నెల 12వ తేదీ వరకు టారిఫ్‌లను మినహాయించనున్నట్లు చైనా వాణిజ్య శాఖ తెలిపింది. ఈ ప్రకటనతో అమెరి కా పెట్టుబడిదారుల్లో భయాలు మొదలయ్యాయి. గతవారం మెక్సికో, కెనడాల దిగుమతులపై ట్రంప్ టారిఫ్‌లను విధించడం ఆయా దేశాలు అమెరికా ఉత్పత్తులపై తిరిగి టారిఫ్‌లను విధించాయి. -
Mark Carney: అమెరికాలో కెనడా విలీనం.. ఏనాటికీ కాబోదు
ఆర్థిక మేధావి, కెనడాకు కాబోయే ప్రధాని మార్క్ కార్నీ.. బాధ్యతలు చేపట్టకముందే అమెరికాతో కవ్వింపు చర్యలకు దిగుతున్నారా?!. రాబోయే రోజుల్లోనూ డొనాల్డ్ ట్రంప్‌తో ఢీ అంటే ఢీ అనేందుకు ఆయన సిద్ధమవుతున్నారా?. తాజా విక్టరీ స్పీచ్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలే ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి. కెనడాను అమెరికాలో కలిపేసుకుంటామంటున్న అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump)నకు.. మార్క్ కార్నీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.అధికార లిబరల్ పార్టీ ఆదివారం మార్క్ కార్నీ(Mark Carney)ని తమ నూతన అధ్యక్షుడిగా ఎన్నుకుంది. సుమారు 86 శాతం సభ్యుల ఓట్లతో.. భారీ మెజార్టీతో ఆయనకు విజయం కట్టబెట్టింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విక్టరీ స్పీచ్‌లో కార్నీ ఏమన్నారంటే.. అమెరికా కెనడా కాదు. కెనడా ఏనాటికీ.. ఏ రూపంలోనూ అమెరికాలో భాగం కాబోదు. ఇతర దేశాలతో మేం(కెనడా) ఏ రకమైనా పోరాటం కోరుకోవడం లేదు. కానీ, .. అవతలివాళ్లు స్నేహ హస్తం వదులుకోవాలనుకుంటే మాత్రం.. మేమూ అందుకు సిద్ధంగానే ఉన్నాం. కాబట్టి.. అమెరికన్లు ఎలాంటి తప్పు చేయకూడదనే నేను కోరుకుంటున్నా. అది వాణిజ్యంలో అయినా.. హకీలో అయినా.. కెనడాదే పైచేయి అనే విషయం మరిచిపోకూడదు’’ అని అన్నారాయన.ఇదీ చదవండి: కెనడా కొత్త ప్రధాని.. మామూలోడు కాదండోయ్!ఈ క్రమంలో అమెరికాపై కెనడా ప్రతీకార సుంకాల(US Canada Tariff Hikes) విధింపు కొనసాగుతుందని ప్రకటించారాయన. ‘‘అమెరికన్లు మమ్మల్ని కాస్త గౌరవించాలి. వాణిజ్య ఒప్పందాలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా అమలు చేయాలి’’ అని కోరారు. అలాగే.. తన విజయ ప్రసంగంలో దేశ ఆర్థిక స్థితిగతుల గురించి మాట్లాడిన ఆయన.. కెనడాను ఎనర్జీ సూపర్ పవర్‌గా తీర్చిదిద్దుతానని, అందుకోసం ఎలాంటి కఠిన నిర్ణయాలకైనా సిద్ధమని ప్రతిజ్ఞ చేశారు.ఇదిలా ఉంటే కార్నీ తాజా వ్యాఖ్యలపై రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాతో కయ్యానికి కాలు దువ్వడం ఏమాత్రం మంచిది కాదని సూచిస్తున్నారు. ఏమాత్రం రాజకీయ, పాలనానుభవం లేని మార్క్ కార్నీ దూకుడుగా కాకుండా ఆచితూచీ అడుగులేయాలని సూచిస్తున్నారు. లేకుంటే.. పరిస్థితులు చేజారిపోయే అవకాశం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. -
గ్లోబల్ ట్రెండ్, గణాంకాలపై దృష్టి
ముంబై: ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లు ప్రపంచ పరిస్థితులు, స్థూల ఆర్థిక గణాంకాలపై దృష్టి పెట్టనున్నాయి. వీటికితోడు యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ టారిఫ్‌ల విధింపు చర్యలకూ ప్రాధాన్యత ఉన్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. టారిఫ్‌ల కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ నీరసించవచ్చన్న అంచనాలు తెరమీదకు వస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో గత వారం యూఎస్ టెక్నాలజీ దిగ్గజాలు డీలాపడటంతో నాస్డాక్ ఇండెక్స్ పతనమైన సంగతి తెలిసిందే. దీంతో గ్లోబల్ ట్రెండ్ సైతం దేశీయంగా సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. కాగా.. ఈ వారం మార్కెట్లు నాలుగు రోజులే పనిచేయనున్నాయి. వారాంతాన(14న) హోలీ పండుగ సందర్భంగా మార్కెట్లకు సెలవు. ఐఐపీ, సీపీఐ జనవరి నెలకు పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ) గణాంకాలు బుధవారం(12న) విడుదలకానున్నాయి. 3.7 శాతం వృద్ధి నమోదుకాగలదని అంచనా. 2024 జనవరిలో 4.2 శాతం పురోగమించగా.. డిసెంబర్లో 3.2 శాతం వృద్ధి చూపింది. ఇక ఫిబ్రవరి నెలకు రిటైల్ ధరల ద్రవ్యోల్బణ(సీపీఐ) గణాంకాలు సైతం విడుదలకానున్నాయి. 2025 జనవరిలో సీపీఐ 3.2 శాతంగా నమోదైంది. 2024 డిసెంబర్లో నమోదైన 3 శాతంతో పోలిస్తే స్వల్పంగా పెరిగింది. ఇతర అంశాలూ కీలకమే దేశీయంగా విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) ఇటీవల నిరంతరంగా అమ్మకాలు చేపడుతున్నారు. దీంతో ఎఫ్‌పీఐల తీరు మార్కెట్లలో కీలకంగా నిలుస్తున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. కాగా.. మరోవైపు యూఎస్ డాలరుతోపాటు ట్రెజరీ ఈల్డ్స్ బలపడటం అటు మార్కెట్లను, ఇటు రూపాయినీ దెబ్బతీస్తున్నాయి. వీటితోపాటు రాజకీయ భౌగోళిక అనిశి్చతులు, ముడిచమురు ధరలు సైతం ఇన్వెస్టర్లను ఆందోళనకు లోను చేస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు. గత వారమిలాగత వారం(3–7) దేశీ స్టాక్ మార్కెట్లు భారీ అమ్మకాల నుంచి బయటపడ్డాయి. ఇండెక్సులు బౌన్స్‌బ్యాక్ అయ్యాయి. సెన్సెక్స్ నికరంగా 1,134 పాయింట్లు(1.6 శాతం) ఎగసి 74,333 వద్ద నిలిచింది. నిఫ్టీ మరింత అధికంగా 428 పాయింట్లు(2 శాతం) జంప్‌చేసి 22,553 వద్ద స్థిరపడింది. యూఎస్ టారిఫ్‌ల విధింపు ఆలస్యంకానున్న అంచనాలు, వీటిపై చర్చలకు ఆస్కారమున్నట్లు వెలువడిన అంచనాలు మార్కెట్లు బలపడేందుకు దోహదం చేసినట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్విసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ తెలియజేశారు.అమ్మకాలువీడని ఎఫ్పీఐలుమార్చి తొలివారంలో రూ. 24,753 కోట్లు దేశీ స్టాక్స్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) అమ్మకాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఈ నెలలో ఇప్పటి(7)వరకూ రూ. 24,753 కోట్ల(2.8 బిలియన్ డాలర్లు) పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఫిబ్రవరిలో రూ. 34,574 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా.. జనవరిలోనూ రూ. 78,027 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. వెరసి ఈ కేలండర్ ఏడాది(2025)లో ఇప్పటిరకూ రూ. 1.37 లక్షల విలువైన స్టాక్స్ విక్రయించారు. ప్రపంచ వాణిజ్య ఆందోళనలు, దేశీ కార్పొరేట్ ఫలితాల నిరాశ వంటి అంశాలు ప్రభావం చూపుతున్నాయి. 2024 డిసెంబర్ 13 నుంచి చూస్తే ఎఫ్‌పీఐలు దేశీ స్టాక్ మార్కెట్ల నుంచి నికరంగా 17.1 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఉపసంహరించారు. -
భారత్‌తో చాలా కష్టం.. వదిలిపెట్టే ప్రసక్తే లేదు: ట్రంప్ హెచ్చరిక
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌ను టార్గెట్ చేసి సంచలన ఆరోపణలు చేశారు. అమెరికాకు చెందిన వస్తువులపై భారత్ భారీ సుంకాలు విధిస్తోందని తెలిపారు. అందుకే తాము కూడా భారత్‌కు ప్రతీకార సుంకాలు విధిస్తామని ట్రంప్ వెల్లడించారు. వచ్చే నెల రెండో తేదీ నుంచి ప్రతీకార సుంకాల విధింపు ఉంటుందని స్పష్టం చేశారు.తాజాగా అధ్యక్షుడు ట్రంప్ వైట్‌హాస్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘పన్నులను తగ్గించడానికి భారత్ అంగీకరించింది. భారత్ అధిక సుంకాలు విధించే దేశం. అమెరికా వస్తువులపై భారత్ భారీగా సుంకాలు విధిస్తోంది. భారత్ వసూలు చేస్తోన్న టారిఫ్ ఇలాగే కొనసాగితే ఏ ఒక్క వస్తువును కూడా అక్కడ విక్రయించలేం. అధిక పన్నుల వల్ల భారత్‌కు ఏదైనా ఓ వస్తువును విక్రయించడం దాదాపు అసాధ్యంగా మారింది.#WATCH | Washington, DC: US President Donald Trump says, "...India charges us massive tariffs. Massive. You can't even sell anything in India...They have agreed, by the way; they want to cut their tariffs way down now because somebody is finally exposing them for what they have… pic.twitter.com/XwytKPli48— ANI (@ANI) March 7, 2025అమెరికా నుండి 100 శాతం కంటే ఎక్కువ ఆటో సుంకాలను వసూలు చేస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా ఇదే కొనసాగుతోంది. అందుకే మేము కూడా సుంకాలు విధించాలనే నిర్ణయానికి వచ్చాం. ఏప్రిల్ రెండో తేదీ నుంచి ప్రతీకార సుంకాలు ప్రారంభం అవుతాయి. ఫలితంగా తమ దేశంపై విధించిన టారిఫ్‌ను తగ్గించడానికి భారత్ అంగీకరించింది. నేను ఎవరికి నిందించడం లేదు. వ్యాపారం చేయడానికి ఇది వేరొక మార్గం మాత్రమే’ అని చెప్పుకొచ్చారు.అలాగే, యూరోపియన్ యూనియన్, చైనా, బ్రెజిల్, మెక్సికో, కెనడా వంటి దేశాలు కూడా అమెరికా వస్తువుల విషయంలో భారీగా సుంకాలు విధిస్తున్నాయి. ఇది చాలా అన్యాయం. మా దేశ ప్రయోజనాలను ఉపయోగించుకోవడాన్ని అమెరికా ఇకపై ఎంతమాత్రం కూడా సహించదు. ఇప్పుడు మా వంతు వచ్చింది. సుంకాల విధింపు విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం. ఏప్రిల్ 2న విధించే సుంకాలు.. అమెరికా దశను మార్చనున్నాయని వ్యాఖ్యానించారు.ఇదిలా ఉండగా.. అమెరికా ప్రతీకార సుంకాలపై భారత్ ఆచితూచి స్పందించింది. సుంకాలు, సుంకాలేతర అడ్డంకులను అధిగమించడానికి బహుళ రంగ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ) కింద అమెరికాతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటామని పేర్కొంది. ఇక, ట్రంప్ సుంకాల ప్రకటన స్టాక్ మార్కెట్లను కుదిపేసింది. -
మళ్లీ అదే మాట !
న్యూయార్క్: అమెరికా ఉత్పత్తులపై విదేశాలు వసూలు చేస్తున్న టారిఫ్‌ల విషయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అసహనం వెళ్లగక్కారు. భారతదేశంలో అధికంగా టారిఫ్‌లు విధిస్తున్నారని మళ్లీ అసంతృప్తి వ్యక్తంచేశారు. నిజంగా అధిక సుంకాలు విధిస్తున్న దేశం భారత్ అని పేర్కొన్నారు. ఇది న్యాయబద్ధం కాదని చెప్పారు. తమకు న్యాయం జరగాలంటే అదే రీతిలో ప్రతిస్పందించక తప్పదని స్పష్టంచేశారు. ప్రతీకార సుంకాలు విధించబోతున్నామని, వచ్చే నెల 2వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని తేలి్చచెప్పారు. తమ ఉత్పత్తులపై విచ్చలవిడిగా టారిఫ్‌లు వసూలు చేస్తున్న దేశాల ఉత్పత్తులపైనా అదే స్థాయిలో టారిఫ్‌లు విధించబోతున్నామని ఉద్ఘాటించారు. ఇండియా, చైనాతోపాటు ఏ దేశమైనా సరే తమ ఉత్పత్తులు వాడుకుంటే భారీగా సుంకాలు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఎవరినీ విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఇన్నాళ్లూ అమెరికాను దోచుకున్నారని, ఇకపై అది సాగనివ్వబోమని హెచ్చరించారు. ఆయన గతంలో కూడా ఇండియాను ‘టారిఫ్ కింగ్’, ‘బిగ్ అబ్యూసర్’ అని నిందించారు. ఇండియాతో అమెరికా వాణిజ్య లోటు 100 బిలియన్ డాలర్లుగా(రూ.8.70 లక్షల కోట్లు) ఉందని ట్రంప్ చెబుతున్నారు. దీన్ని తగ్గించాల్సిందేనని పట్టుబడుతున్నారు. అమెరికాకు గేమ్ ఛేంజర్ వైట్‌హౌస్ ఓవల్ ఆఫీసులో గురువారం కొన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై డొనాల్డ్ ట్రంప్ సంతకాలు చేశారు. అమెరికా పాల ఉత్పత్తులతోపాటు ఇతర వస్తువులపై కెనడాలో 250 శాతం టారిఫ్‌లు విధిస్తున్నారని ఆక్షేపించారు. కెనడా ఉత్పత్తులు ఇకపై తమకు అవసరం లేదని, ఒకవేళ దిగుమతి చేసుకున్నా భారీగా సుంకాలు విధిస్తామని స్పష్టంచేశారు. విదేశీ ఉత్పత్తులపై ఇప్పుడు విధిస్తున్న టారిఫ్‌లు తాత్కాలికమేనని, అసలైన మోత ఏప్రిల్ 2 నుంచి మోగబోతోందని, అందుకు సిద్ధంగా ఉండాలని వ్యాఖ్యానించారు. అమెరికాకు ఇదొక గేమ్ ఛేంజర్ కాబోతోందని వివరించారు. -
ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ట్రూడో కంటతడి
ఒట్టావా: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో(Justin Trudeau) తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ప్రధాని హోదాలో చివరి ప్రసంగంలో తాను తెచ్చిన పాలసీతోపాటు అమెరికాతో నెలకొన్న ‘సుంకాల ఉద్రిక్తత’లపైన మాట్లాడారు. ఈ క్రమంలో ఒక్కసారిగా కంటతడి పెడుతూ ప్రసంగించారు. తొమ్మిదేళ్లపాటు.. ప్రత్యేకించి కష్టకాలంలోనూ దేశ ప్రయోజనాలే ప్రాధాన్యంగా తాను పని చేశానంటూ ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు.ప్రజా వ్యతిరేకత పెరిగిపోవడంతో ట్రూడో ఈ జనవరిలో కెనడా ప్రధాని పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే పార్టీ కొత్త నేతను ఎన్నుకునే దాకా ఆయన ఆ పదవిలో కొనసాగుతానని ప్రకటించారు. అయితే ఈ మధ్యలోనే డొనాల్డ్ ట్రంప్(Donald Trump) అమెరికా అధ్యక్షుడిగా పదవి చేపట్టారు. కెనడాతో పాటు పలు దేశాలపై సుంకాలు విధించి వాణిజ్య యుద్ధానికి తెర తీశారు.ట్రంప్ చర్యలకు ప్రతిగా.. కెనడా కూడా అమెరికా ఉత్పత్తులపై సుంకాలు విధించింది. ప్రతీకార సుంకాల పరిణామాలపై ఇద్దరు నేతలు సుమారు గంటపాటు ఫోన్లో చర్చించారు. అనంతరం ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మళ్లీ ప్రధాని పదవిలో కొనసాగేందుకే ట్రూడో వాణిజ్య యుద్ధానికి కాలు దువ్వుతున్నారని అన్నారు. టారిఫ్ సంక్షోభాన్ని తన రాజకీయం కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు.అక్కడితో ఆగకుండా.. 51వ అమెరికా రాష్ట్రానికి గవర్నర్‌గా కొనసాగేందుకు ట్రూడో తహతహలాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు (కెనడాను అమెరికాలో విలీనం చేసి 51 రాష్ట్రంగా చేస్తామంటూ చేసిన ప్రకటనకు కొనసాగింపుగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు..). అయితే ట్రంప్ ఆరోపణలను తన చివరి ప్రసంగంలో ట్రూడో తోసిపుచ్చారు. కెనడా ప్రయోజనాల కోసం.. దేశ ఆర్థిక వ్యవస్థను రక్షించేందుకే ప్రతీకార సుంకాలను విధించినట్లు తెలిపారాయన. ఇలాంటి ఆరోపణలు తనను కుంగదీయలేవని.. కడదాకా కెనడియన్ల కోసం కష్టపడతానని పేర్కొంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఇదిలా ఉంటే.. మార్చి 9వ తేదీన లిబరల్ పార్టీ కొత్త నేతను ఎన్నుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. "We got you, even in the very last days of this government": In a rare display, Canadian PM Justin Trudeau gets emotional in press conference while talking about his policies amid Trump tariff war #Canada #CanadaPM #JustinTrudeau #Trudeau #tariffs #tariffwar pic.twitter.com/XRneiCENNN— News18 (@CNNnews18) March 7, 2025 VIDEO CREDITS: News18 -
Mr Trump: టారిఫ్ వార్‌లో వెనక్కి తగ్గినట్లే తగ్గి..
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) టారిఫ్ వార్‌లో కాస్త వెనక్కి తగ్గారు. మెక్సికోతో పాటు కెనడాపై విధించిన దిగుమతి సుంకాలను ఏప్రిల్ 2వ తేదీ దాకా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే కొన్ని ఉత్పత్తులపై మాత్రం ఈ నిర్ణయం యధావిధిగా కొనసాగుతుందని, ప్రతీకార సుంకాలు విధించే ప్రణాళికలో ఎటువంటి మార్పు లేదని అన్నారాయన.కెనడా, మెక్సికోతోపాటు చైనాపై డొనాల్డ్ ట్రంప్ సుంకాలు విధించడం ఆయా దేశాలతో వాణిజ్య యుద్ధానికి కారణమైంది. ఈ ప్రభావం.. అమెరికా ఆర్థిక వ్యవస్థ, ద్రవ్యోల్బణంపైనా ప్రతికూల ప్రభావం చూపెట్టవచ్చనే హెచ్చరికలు జారీ అయ్యాయి. అయితే తన నిర్ణయంపై మార్కెట్ కుదేలు ప్రభావమేమీ లేదని ఆయన అంటున్నారు. కేవలం అమెరికా కార్ల తయారీదారుల కోసమేనని చెప్పారాయన. అయితే ఒకవైపు కెనడా వాణిజ్య ప్రతినిధులతో చర్చలు.. మరోవైపు మెక్సికో ప్రెసిడెంట్‌తో మాట్లాడిన తర్వాతే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.ఉత్తర అమెరికా వాణిజ్య ఒప్పందాల్లో భాగంగా.. అమెరికా-మెక్సికో-కెనడా మధ్య ఒప్పందం(USMCA) అమలులో ఉంది. తాజా నిర్ణయంతో ప్రస్తుతానికి ఆ రెండు దేశాల ఆటోమేకర్స్‌కు ట్రంప్ ఊరట ఇచ్చారు. మరోవైపు కెనడా నుంచి దిగుమతి అయ్యే 62 శాతం ఉత్పత్తులు కొత్త సుంకాలను ఎదుర్కొనాల్సిందేనని వైట్‌హౌజ్ ప్రతినిధి ఒకరు చెప్పారు. అయితే ఎనర్జీ ప్రొడక్ట్స్‌కు మాత్రం 10 శాతమే వర్తిస్తుందని తెలిపారు.కెనడా కూడా అమెరికాపై విధించిన సుంకాల విషయంలో వెనక్కి తగ్గింది. సుమారు 125 బిలియన్ డాలర్ల అమెరికా ఉత్పత్తులపై విధించిన రెండో దశ సుంకాల అమలును ఏప్రిల్ 2వ తేదీ దాకా వాయిదా ేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే.. అన్ని టారిఫ్‌లను ఎత్తేసే దిశగా ప్రయత్నాలుకొనసాగిస్తామని తెలిపింది.రాజకీయ దుమారంఅధికారంలోకి వచ్చిన వెంటనే.. ట్రంప్ పలు దేశాలపై భారీ స్థాయిలో సుంకాలు విధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పొరుగు దేశాలతో ట్రేడ్వార్కు బీజం వేశారు. అయితే ఇది క్రమంగా రాజకీయ మలుపు తిరిగింది. ట్రంప్‌తో చర్చలు నిర్మాణాత్మకంగా జరిగినప్పటికీ.. కెనడా-అమెరికాలు భవిష్యత్తులో వాణిజ్య యుద్ధంలో ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాన్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ట్రూడోకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కౌంటర్ ఇచ్చారు.అధికారంలో కొనసాగడానికి సుంకాల వివాదాన్ని ట్రూడో వినియోగించుకుంటున్నారని ఆరోపించారు. కెనడా ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్న విషయాన్ని తెలుసుకోవాలని తాను ప్రయత్నించినప్పటికీ.. అక్కడ నుంచి ఎటువంటి సమాధానం రాలేదన్నారు. అయితే ఈ క్రమంలో ఆయన వ్యాఖ్యలు మళ్లీ దుమారం రేపాయి. 51వ రాష్ట్ర గవర్నర్‌గా కొనసాగేందుకు ట్రూడో తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని అన్నారాయన. దీంతో కెనడా మండిపడింది. కెనడా ఏనాటికీ అమెరికాలో కలవబోదని కౌంటర్ ఇచ్చింది. కెనడాను అమెరికాలో విలీనం చేసి.. 51వ అమెరికా రాష్ట్రంగా మార్చకుంటామని.. అవసరమైతే ఆర్థిక-సైనిక శక్తులను ఉపయోగిస్తామని ట్రంప్ గతకొంతకాలంగా చెబుతున్న సంగతి తెలిసిందే. -
ఈ అనిశ్చితి పోయేదెలా?
జనవరి 20న గద్దెనెక్కినప్పటినుంచీ అధిక టారిఫ్‌లపై హెచ్చరిస్తూ వచ్చిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్... చివరికి అందుకు తుది గడువు ఖరారు చేశారు. తమ ఉత్పత్తులపై అధిక టారిఫ్‌లు వసూలు చేస్తున్న దేశాలన్నీ వచ్చే నెల 2 నుంచి తమ దెబ్బ కాచుకోవాలని హెచ్చరిక జారీచేశారు. దాదాపు వంద నిమిషాలపాటు అమెరికన్ కాంగ్రెస్‌నుద్దేశించి బుధవారం ఆయన చేసిన ప్రసంగం నిండా ఇలాంటి హెచ్చరికలున్నాయి. ఇప్పటికే చాలా సాధించినట్టు స్వోత్కర్షలున్నాయి. అమెరికా ప్రజల పాలిట తాను ఆపద్బాంధవుడినన్న భ్రమ కూడా ఆయనకు పుష్కలంగా ఉంది. ‘నేను విధించబోయే సుంకాలు కేవలం ప్రజానీకం ఉద్యోగాలు కాపాడటానికి మాత్రమే కాదు... ఈ చర్య మన దేశ ఆత్మను కాపాడటానికి కూడా’ అని ఆయన చెప్పుకొచ్చారు. సహజంగానే ప్రపంచమంతా ఏప్రిల్ గురించి బెంగపడుతోంది. ముంచుకొచ్చే ద్రవ్యపరమైన అసమతౌల్యతను అధిగమించడమెలాగో తెలియక అయోమయంలో కూరుకుపోతోంది. ఇప్పటికే ట్రంప్ చైనాపై అదనంగా 10 శాతం, మెక్సికో, కెనడాలపై మరో 25 శాతం సుంకాలు ప్రకటించటం వల్ల ఈ ఉపద్రవం ఖాయమని అన్ని దేశాలూ ఆందోళనతో ఉన్నాయి. సుంకాలను ట్రంప్ ‘సర్వరోగ నివారిణి’గా భావిస్తున్నారు. మెక్సికో మాదకద్రవ్య ముఠాల నుంచి పెద్ద యెత్తున వచ్చిపడే ఫెంటానిల్ అమెరికాకు పెద్ద సమస్యగా మారింది. అక్రమ వలసలు దీనికి అదనం. వలసలను అరికట్టి, మాదకద్రవ్య ముఠా నాయకుల్ని పట్టి అప్పగించకపోతే 25 శాతం సుంకాలు తప్పవని గత నెల 4న ట్రంప్ హెచ్చరించటంతో కెనడా, మెక్సికోలు ఒక నెల వ్యవధి కోరాయి. మెక్సికో అధ్యక్షురాలు షీన్బామ్ వెనువెంటనే అమెరికా–మెక్సికో సరిహద్దుల్లోకి అదనంగా 10,000 మంది సైనికులను తరలించి తనిఖీలు పెంచి వలసలను నియంత్రించారు. దేశంలో ఫెంటానిల్ నిల్వలను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేయటంతోపాటు భారీయెత్తున అరెస్టులు చేయించారు. 29 మంది డ్రగ్స్ ముఠా నాయకుల్ని అమెరికాకు అప్పగించారు. కెనడా అధ్యక్షుడు ట్రూడో ఫెంటానిల్ సరిహద్దులు దాటకుండా తనిఖీ వ్యవస్థను ముమ్మరం చేశారు. అయినా ట్రంప్ మనసు మారలేదు. ఆ రెండు దేశాలపై 25 శాతం అదనపు సుంకాలుంటాయని తన ప్రసంగంలో ప్రకటించారు. త్వరలో జరగబోయే ఎన్ని కల్లో పార్టీ ఓటమి ఖాయమన్న అంచనాలుండటంతో దీన్ని తనకు అనుకూలంగా మలుచుకోవ టానికి ట్రూడో సిద్ధపడ్డారు. అందుకే ‘సై అంటే సై’ అంటున్నారు. అమెరికాపై ప్రతీకార సుంకాలు విధించ బోతున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే 2,100 కోట్ల డాలర్ల విలువైన సరుకుపై సుంకాలు వడ్డించారు. వివాదం సద్దుమణగకపోతే మరో 8,700 కోట్ల డాలర్ల సరుకుపై ఇది తప్పదని హెచ్చరించారు. షీన్బామ్ ఈమధ్యే అధికారంలోకొచ్చారు గనుక ఆమెకు కావలసినంత వ్యవధి వుంది. అందుకే ఎంతో సంయమనం పాటిస్తున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్ని తలకిందులు చేసే ఈ మాదిరి బ్లాక్‌మెయిలింగ్ కొత్తగా ట్రంప్‌కు పుట్టిన బుద్ధికాదు. అమెరికాలో ఎవరున్నా ఇలాంటి బెదిరింపులతోనే ప్రపంచ దేశాలను దారికి తెచ్చుకున్నారు. 1986–89 మధ్య సుంకాలు, వాణిజ్యాలపై సాధారణ ఒడంబడిక (గాట్)కు సంబంధించిన ఉరుగ్వే రౌండ్ చర్చల్లోనైనా, ఆ తర్వాత ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)పై జరిగిన దోహా రౌండ్ చర్చల్లోనైనా అమెరికా వ్యూహం ఇదే. బ్రెజిల్ నుంచి వచ్చిన 4 కోట్ల డాలర్ల దిగుమతులపై వంద శాతం సుంకాలు విధించింది. మన నుంచి వెళ్లిన వస్త్ర దిగుమతులపైనా ఇలాంటి చర్యే తీసుకోబోతున్నట్టు హెచ్చరించింది. దాంతో మేధా సంపత్తి హక్కుల(ఐపీఆర్)పై అమెరికా తీసుకొచ్చిన అన్యాయమైన నిబంధనలకు తలొగ్గక తప్పలేదు. ఆఫ్రికా దేశాలనూ ఇలాగే దారికి తెచ్చుకుంది. అమెరికా అతి పెద్ద మార్కెట్ కావటం వల్ల అత్యధిక దేశాలు దానికెళ్లే ఎగుమతులపై ఆధారపడి వుంటాయి. మన దేశం నుంచి అమెరికాకు వెళ్లే ఎగుమతులు 18 శాతమైతే థాయ్‌లాండ్ నుంచి 17 శాతం, దక్షిణ కొరియానుంచి 16 శాతం ఎగుమతులుంటాయి. అమెరికాకు మెక్సికో ఎగుమతులు ఏకంగా 78 శాతం. తమ సంపద పెంచుకోవటానికి సంపన్న రాజ్యాలు నిరంతరం ప్రయత్నిస్తుంటాయి. భారత్‌తో సహా అనేక దేశాలు సుదీర్ఘకాలం పరాయి పాలనలో మగ్గిపోవటానికి ఏకైక కారణం ఇదే. ఉత్పత్తికి అవసరమైన ముడిసరుకు లభ్యతకూ, తయారైన సరుకు అమ్ముకోవటానికీ సరిహద్దులు దాటి వెళ్తూ సమయానుకూలంగా విధానాలు మార్చుకోవడం సంపన్న రాజ్యాల నైజం. గతంలో తన మార్కెట్‌ను విస్తరించుకోవటానికి డబ్ల్యూటీవో తీసుకొచ్చిన అమెరికాయే ఇప్పుడు వేరే మార్గానికి మళ్లింది. అయితే ట్రంప్ చర్యల వల్ల అమెరికాలో ద్రవ్యోల్బణం అధికమవుతుంది. సగటు పౌరుల జీవన వ్యయం పెరిగి పోతుంది. వ్యాపారం దెబ్బతిని నిరుద్యోగం ప్రబలుతుంది. ఆర్థిక వ్యవస్థ మందగిస్తుంది. తరతమ స్థాయిల్లో అన్ని దేశాలూ ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనక తప్పదు. 80 ఏళ్లుగా ప్రపంచ మార్కెట్లను శాసిస్తూ అతిగా సంపద పోగేసిన దేశమే ‘నన్ను అందరూ దోచుకుతింటున్నార’ంటూ పెడబొబ్బలు పెట్టడం ఒక వైచిత్రి. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలోని బృందం అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం ఎదురుచూస్తోంది. ఇప్పుడు ఒక్కొక్క దేశం అమెరికాపై ప్రతీకార సుంకాలకు రెడీ అవుతోంది. మున్ముందు కొత్త మార్కెట్ల వెదుకులాట కూడా మొదలవుతుంది. ఇలాకాక దేశాలన్నీ సమష్టిగా వ్యవహరిస్తేనే ఏదో మేర ప్రయోజనం ఉంటుంది. అమెరికాపై ఒత్తిడి పెరిగి సహేతుకమైన పరిష్కారం వీలవుతుంది. -
‘అమెరికాతో ఎలాంటి యద్ధానికైనా మేం సిద్ధం’ : చైనా
బీజింగ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేసిన దిగుమతి సుంకాల ప్రకటనపై చైనా (china) ధీటుగా బదులిచ్చింది. అమెరికాతో ఎలాంటి యుద్ధానికైనా మేం సిద్ధమని స్పష్టం చేసింది. అదే సమయంలో అమెరికా నుంచి చైనాలో దిగుమతయ్యే ఉత్పత్తులపై సుంకం విధిస్తున్నట్లు తెలిపింది. ట్రంప్ నిర్ణయంపై చైనా విదేశీ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ (Lin Jian) ఘాటు వ్యాఖ్యలే చేశారు. ట్రంప్ దిగుమతి సుంకం ప్రకటనపై అమెరికా మీడియా సంస్థ ది న్యూయార్క్ టైమ్స్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన మాట్లాడారు.‘అమెరికా ఎలాంటి యుద్ధాన్ని కోరుకున్నా చైనా చివరి వరకు పోరాడేందుకు సిద్ధంగా ఉంది. మరి అమెరికా ఎలాంటి యుద్ధాన్ని కోరుకుంటుంది. అది టారిఫ్, ట్రేడ్ వార్ ఇతర యుద్ధమైనా మేం చివరి వరకు పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై అమెరికాలోని చైనా రాయభార కార్యాలయం అధికారిక ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది.If war is what the U.S. wants, be it a tariff war, a trade war or any other type of war, we’re ready to fight till the end. https://t.co/crPhO02fFE— Chinese Embassy in US (@ChineseEmbinUS) March 5, 2025ట్రంప్ చైనా ఉత్పుత్తులపై అదనంగా 10 శాతం సుంకాలు విధించనున్నట్లు ప్రకటించారు. మంగళవారం నుంచి ఇది అమల్లోకి వస్తుందని చెప్పారు. ట్రంప్ నిర్ణయాన్ని ఖండిస్తూ పైవిధంగా వ్యాఖ్యానించింది. అమెరికా పార్లమెంట్లో ట్రంప్ అమెరికన్ కాంగ్రెస్ (పార్లమెంట్) జాయింట్ సెషన్లో డొనాల్డ్ ట్రంప్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. ప్రపంచంలోని పలు దేశాలు దశాబ్ధాలుగా అమెరికాలోని సుంకాలు వ్యతిరేకంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించాయి.ఇది సరైన పద్దతి కాదుసగటున యురోపియన్ యూనియన్,చైనా,బ్రెజిల్, ఇండియా, మెక్సికో, కెనడాలు మనం విధించే దిగుమతి సుంకాలకంటే ఆ దేశాలు మన దేశ ఉత్పతులపై విధించే దిగుమతి సుంకాలు ఎన్నో రెట్లు ఎక్కువ. ఇది సరైన పద్దతి కాదు. అమెరికా ఆటో మొబైల్ ఉత్పత్తులపై 100శాతం కంటే ఎక్కువ సుంకాల్ని విధిస్తోంది. చైనా కూడా అంతే మనం విధించే దిగుమతి సుంకాల కంటే రెండు రెట్లు ఎక్కువగా వసూలు చేస్తోంది. సౌత్ కొరియా నాలుగు రెట్లు వసూలు చేస్తున్నాయి. మనం ఎంత చెల్లిస్తున్నామో.. వాళ్లుకూడా అంతే చెల్లించాలి మనతో సన్నిహితంగా ఉంటున్న వారితో పాటు మనల్ని వ్యతిరేకిస్తున్న దేశాలు కూడా మన ఉత్పత్తుల మీద పన్నులు విధిస్తున్నాయి. ఇది అన్యాయం కాదా. ఇప్పుడు మన వంతు వచ్చింది. వారు మన ఉత్పత్తులపై ఎంత ట్యాక్స్ వేస్తారో. మనం కూడా అంతే వారి ఉత్పత్తులపై అంతే ట్యాక్స్ వేస్తున్నాం. అందుకే తక్షణమే అమెరికాకు దిగుమతి అయ్యే ఇతర దేశాల ఉత్పత్తులపై దిగుమతి సుంకం (ప్రతిగా విధించే పన్నులు) విధిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఏ దేశం ఉత్పత్తులపై ఎంత దిగుమతి సుంకం విధిస్తున్నారో సంబంధిత వివరాల్ని వెల్లడించారు.అమెరికా ఉత్పత్తులపై చైనా సుంకంఅమెరికా సుంకం విధించే దేశాల్లో చైనా ఉత్పతులున్నాయి. చైనా నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే ప్రతి ఉత్పత్తి 10 శాతం నుంచి 20 శాతం దిగుమతి సుంకం తప్పని సరిగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రతిగా చైనా సైతం అమెరికా ఉత్పతుత్తులపై దిగుమతి సుంకం విధిస్తున్నట్లు ప్రకటించింది. 10శాతం, 15శాతం దిగుమంది సుంకాన్ని విధిస్తున్నట్లు చైనా స్టేట్ కౌన్సిల్ టారిఫ్ కమిషన్ వెల్లడించింది. -
ట్రంప్ నిర్ణయం.. చైనా ప్రతీకారం
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. చైనాపై విధించే సుంకాలను 10 నుంచి 20 శాతానికి పెంచుతూ ప్రకటించారు. అమెరికా సుంకాలకు చైనా కూడా వేగంగా ప్రతీకారం తీర్చుకుంది. యూఎస్ దిగుమతి సుంకాలను 10 నుంచి 15 శాతానికి పెంచుతూ ప్రకటన జారీ చేసింది.చైనా తీసుకున్న నిర్ణయం సుమారు 25 సంస్థలపై ప్రభావాన్ని చూపనుంది. వ్యవసాయం, ఆహార ఉత్పత్తులకు సంబంధించిన వస్తువులపై చైనా సుంకాలను పెంచింది. మార్చి 10 నుంచి ఈ సుంకాలు వర్తించనున్నట్లు తెలుస్తోంది.అమెరికా నుంచి దిగుమతి అయ్యే చికెన్, గోధుమ, మొక్కజొన్న మరియు పత్తిపై అదనంగా 15 శాతం సుంకాన్ని.. సోయాబీన్స్, జొన్న, పంది మాంసం, గొడ్డు మాంసం, జల ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు, పాల దిగుమతులపై అదనంగా 10 శాతం సుంకాన్ని విధించనున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడిస్తూ.. చైనా తన చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాలను దృఢంగా కాపాడుకుంటుందని స్పష్టం చేసింది.చైనాపై ట్రంప్ సుంకాలుచైనా ఉత్పత్తులపైన ఇప్పటికే ఉన్న 10 శాతం సుంకాన్ని, 20 శాతానికి పెంచుతూ.. దీనికి సంబంధించిన సంబంధించిన ఉత్తర్వులపై సంతకం కూడా చేశారు. అక్రమ వలసలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాను ఆపడంలో వారు విఫలమయ్యారని ఆరోపిస్తూ, ఇలాంటి వాటిని నిర్మూలించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.అమెరికా విధించిన సుంకాలు.. స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, వీడియోగేమ్ కన్సోల్లు, స్మార్ట్‌వాచ్‌లు, స్పీకర్లు, బ్లూటూత్ పరికరాల వంటి ఎలక్ట్రానిక్స్‌పై వర్తిస్తాయి. చైనా కూడా అమెరికా దిగుమతులపై సుంకాలు ప్రకటించడంతో.. ట్రంప్ వెనుకడుగు వేస్తారా?.. సుంకాల విషయంలో తగ్గేదేలే అన్నట్లు ముందుకు సాగుతారా? అనే విషయం తెలియాల్సి ఉంది. -
చైనా నెత్తిన ట్రంప్ పిడుగు.. సుంకాల విషయంలో తగ్గేదేలే!
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత 'డొనాల్డ్ ట్రంప్' (Donald Trump) తీసుకుంటున్న ఒక్కో నిర్ణయం.. ప్రపంచంలోని చాలా దేశాలను వణికిస్తున్నాయి. సుంకాల విషయంలో తగ్గేదేలే అంటూ ముందుకు దూసుకెళ్తున్న ట్రంప్.. చైనాకు మరో షాకిచ్చారు.20 శాతంచైనా ఉత్పత్తులపైన ఇప్పటికే ఉన్న 10 శాతం సుంకాన్ని, 20 శాతానికి పెంచుతూ.. దీనికి సంబంధించిన సంబంధించిన ఉత్తర్వులపై సంతకం కూడా చేశారు. అక్రమ వలసలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాను ఆపడంలో వారు విఫలమయ్యారని ఆరోపిస్తూ, ఇలాంటి వాటిని నిర్మూలించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.ఎలాంటి మార్పు లేదుమెక్సికో, కెనడా దిగుమతులపై విదించనున్న 25 శాతం సుంకాల విషయంలో ఎలాంటి మార్పు లేదని ట్రంప్ స్పష్టం చేశారు. ఇవి మార్చి న్ నుంచి అమలులోకి వస్తాయి. కెనడా, మెక్సికోపై సుంకాలు మోపడం వల్ల ఆటోమొబైల్స్, నిర్మాణ సామగ్రి వంటి కీలక రంగాలకు సరఫరా గొలుసులు దెబ్బతింటాయి. దీంతో గృహాలకు వెచ్చించాల్సిన ఖర్చు భారీగా పెరిగిపోతుందని నిపుణులు చెబుతున్నారు.నిజానికి.. మెక్సికో, కెనడాపై 25 శాతం సుంకాలను ఫిబ్రవరి 4నుంచి విధించనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. కానీ ఆ దేశాధ్యక్షులు చర్చలు జరిపిన తరువాత.. సుంకాలను నెల రోజుల పాటు వాయిదా వేశారు. ఇచ్చిన గడువు ముగియడంతో.. అనుకున్న విధంగా సుంకాలు చెల్లించాల్సిందే, అని ట్రంప్ పేర్కొన్నారు.ట్రంప్ ఆదేశాలు.. దేశ ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయని కెనడా విదేశాంగ మంత్రి 'మెలనీ జోలీ' పేర్కొన్నారు. ట్రంప్ చర్యకు.. ప్రతిచర్యగా అమెరికా వస్తువులపై కూడా సుంకాలు విధిస్తున్నట్లు చెప్పారు. ఇదే బాటలో మెక్సికన్ అధ్యక్షురాలు 'క్లాడియా షీన్బామ్' కూడా నడుస్తున్నారు. కాబట్టి అమెరికా నుంచి దిగుమతి చేసుకునే.. పండ్లు, ఆల్కహాల్ వంటి వాటిపై 25 శాతం సుంకం విధిస్తున్నట్లు పేర్కొన్నారు. -
అమెరికా టారిఫ్‌లు..ప్రపంచ పరిణామాలే దిక్సూచి!
న్యూఢిల్లీ: భారీ పతన బాటలో కొనసాగుతున్న దేశీ మార్కెట్లలో ఒడిదుడుకులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్‌ల మోతకు తోడు కొనసాగుతున్న విదేశీ ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) అమ్మకాల పరంపర... ఇన్వెస్టర్లలో బలహీన సెంటి‘మంట’కు ఆజ్యం పోస్తోంది. ఈ వారంలో కూడా యూఎస్ టారిఫ్ సంబంధిత పరిణామాలు, ప్రపంచ మార్కెట్ల ట్రెండ్, ఎఫ్‌పీఐల ట్రేడింగ్ కార్యకలాపాలే మార్కెట్ల గమనాన్ని నిర్దేశిస్తాయని విశ్లేషకులు పేర్కొన్నారు. బలహీనంగానే... ‘ట్రంప్ టారిఫ్ పాలసీతో పాటు గత వారంలో విడుదలైన నిరుద్యోగ గణాంకాలు (అయిదు నెలల గరిష్టం) మార్కెట్ గమనంపై ప్రభావం చూపుతాయి. సమీప కాలంలో మార్కెట్లో బలహీన ధోరణి కొనసాగవచ్చు. ప్రపంచ వాణిజ్య విధానాల్లో అస్థిరతలు సద్దుమణిగి, వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కంపెనీల లాభాల్లో రికవరీ కనిపిస్తేనే మార్కెట్ మళ్లీ గాడిలో పడతాయి’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా బలహీన సెంటిమెంట్‌కు తోడు దేశీయంగా కీలక అంశాలు (ట్రిగ్గర్లు) ఏవీ లేనందున మన మార్కెట్లలో నష్టాలు కొనసాగే అవకాశం ఉందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ (వెల్త్ మేనేజ్మెంట్) సిద్ధార్థ ఖేమ్కా పేర్కొన్నారు. వాణిజ్య యుద్ధ భయాలతో మార్కెట్లు వణుకుతున్నాయని, ఎఫ్‌పీల అమ్మకాల జోరు దీనికి మరింత ఆజ్యం పోస్తోందని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా అభిప్రాయపడ్డారు. గణాంకాల ఎఫెక్ట్... గత వారాంతంలో విడుదలైన జీడీపీ గణాంకాల ప్రభావం సోమవారం మార్కెట్‌పై కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (క్యూ3)లో జీడీపీ వృద్ధి రేటు 6.2 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. గతేడాది క్యూ3తో పోలిస్తే భారీగా తగ్గినప్పటికీ.. క్యూ2తో పోలిస్తే (5.6 శాతం) సీక్వెన్షియల్‌గా కాస్త పుంజుకోవడం విశేషం. అమెరికా టారిఫ్ వార్ ఆందోళనల నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ రానున్న రోజుల్లో మరింత గడ్డు పరిస్థితులను ఎదుర్కోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఫిబ్రవరి జీఎస్టీ వసూళ్లు 9.1 శాతం ఎగబాకి రూ.1.84 లక్షల కోట్లకు చేరడం ఆర్థిక వ్యవస్థ రికవరీపై ఆశలు రేకెత్తిస్తోంది. ఈ వారంలో విడుదల కానున్న హెచ్ఎస్బీసీ తయారీ, సేవల రంగ పీఎంఐ డేటాపై కూడా ఇన్వెస్టర్లు నిశితంగా గమనించనున్నారు.ఫిబ్ర‘వర్రీ’...గత కొన్ని నెలలుగా నేల చూపులు చూస్తున్న మన మార్కెట్లకు ఫిబ్రవరిలో మరింత షాక్ తగిలింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 1,384 పాయింట్లు (5.88 శాతం) పతనం కాగా, బీఎస్ఈ సెన్సెక్స్ 4,302 (5.55%) పాయింట్లు కోల్పోయింది. సెపె్టంబర్ 27న సెన్సెక్స్ రికార్డ్ గరిష్టాన్ని (85,978) తాకి, అక్కడి నుంచి రివర్స్ గేర్‌లోనే వెళ్తోంది. ఇప్పటిదాకా 12,780 పాయింట్లు (14.86 శాతం) కుప్పకూలింది. ఇక నిఫ్టీ కూడా అప్పటి గరిష్టం (26,277) నుంచి 4,153 పాయింట్లు (15.8 శాతం) దిగజారింది. కాగా, ఒక్క గత వారంలోనే సెన్సెక్స్ 2.8 శాతం, నిఫ్టీ 2.94 శాతం క్షీణించడం గమనార్హం.రూ. 34,574 కోట్లు వెనక్కి...విదేశీ ఇన్వెస్టర్ల తిరోగమనం మరింత జోరందుకుంది. ఫిబ్రవరి నెలలో దేశీ ఈక్విటీ మార్కెట్ల నుంచి ఎఫ్‌పీఐలు రూ.34,574 కోట్లు వెనక్కి తీసుకున్నారు. దీంతో ఈ ఏడాది తొలి రెండు నెలల్లో మొత్తం అమ్మకాలు రూ.1.12 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ప్రధానంగా ట్రేడ్ వార్ ఆందోళనలతో పాటు కంపెనీల లాభాలపై ఆందోళనలు దీనికి కారణంగా నిలుస్తున్నాయి. ‘భారత్ మార్కెట్లో ఈక్విటీ వేల్యుయేషన్లు చాలా అధికంగా ఉండటం, కార్పొరేట్ల ఆర్థిక ఫలితాలపై ఆందోళనల ప్రభావంతో ఎఫ్‌పీఐల తిరోగమనం కొనసాగుతోంది’ అని వాటర్‌ఫీల్డ్ అడ్వయిజర్స్ సీనియర్ డైరెక్టర్ విపుల్ భోవర్ పేర్కొన్నారు.టాప్–10 కంపెనీల్లో రూ.3 లక్షల కోట్లు హుష్గత వారంలో ప్రధాన సూచీలు దాదాపు 3 శాతం కుప్పకూలడంతో దేశీ స్టాక్ మార్కెట్లో టాప్–10 కంపెనీల మార్కెట్ విలువ రూ.3,09,245 కోట్లు ఆవిరైంది. టీసీఎస్ మార్కెట్ క్యాప్ అత్యధికంగా రూ.1,09,211 కోట్లు క్షీణించి రూ.12,60,505 కోట్లకు పడిపోయింది. దీంతో టాప్–10లో 2వ స్థానం నుంచి మూడో స్థానానికి దిగజారింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రెండో ర్యాంకును అందుకుంది. దీని మార్కెట్ క్యాప్ రూ.30,258 కోట్లు జంప్ చేసి, 13,24,411 కోట్లకు ఎగబాకింది. ఇక ఇన్ఫోసిస్ మార్కెట్ విలువ రూ.52,697 కోట్లు తగ్గి, రూ.7,01,002 కోట్లకు చేరింది. భారతీ ఎయిర్టెల్ మార్కెట్ క్యాప్ కూడా 39,230 కోట్లు నష్టపోయి రూ.8,94,993 కోట్లకు దిగొచ్చింది. -
ఈ కారణాలతోనే.. భారీగా పెరుగుతున్న బంగారం ధరలు
బంగారం ధరలు రోజు రోజుకి పెరుగుదల దిశగా.. పరుగులు పెడుతూనే ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్.. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తరువాత ఈ ధోరణి ఏర్పడింది. ట్రంప్ రక్షణాత్మక విధానం, యుఎస్ డాలర్ హెచ్చు & తగ్గుల కారణంగా ఏర్పడిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత, వాణిజ్య యుద్ధ భయం మరియు ఆర్థిక అనిశ్చితి పసిడి ధరలు పెరగడానికి హేతువులవుతున్నాయి.శుక్రవారం మార్కెట్ సెషన్ ముగిసిన తర్వాత.. బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో వరుసగా ఎనిమిదవ వారం లాభాన్ని & దేశీయ మార్కెట్లో వరుసగా ఏడవ వారం లాభాన్ని నమోదు చేశాయి. ఈ ఏడు వారాల్లో, 10 గ్రాముల బంగారం రేటు రూ. 76,544 నుంచి రూ. 86,020లకు చేరింది. దీన్ని బట్టి చూస్తే.. 10 గ్రాముల గోల్డ్ రేటు ఏడు వారాల్లో సుమారు రూ. 9,500 కంటే ఎక్కువ పెరిగింది.2025 జనవరి ప్రారంభం నుంచి బంగారం ధరలు నిరంతరం పెరగడానికి అనేక కీలక అంశాలు కారణమయ్యాయి. ఇందులో ట్రంప్ ప్రారంభించిన సుంకాలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, పెరిగిన ఈటీఎఫ్ ఇన్‌ఫ్లోలు, ప్రధాన కేంద్ర బ్యాంకుల రేటు కోతలు ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులకు, ముఖ్యంగా USకి బంగారం వెళ్లడం కూడా ధరల పెరుగుదలకు కారణమని నిపుణులు చెబుతున్నారు.యూరోపియన్ దేశాల నుంచి USకి ఎగుమతి చేసే బంగారంపై డొనాల్డ్ ట్రంప్ సుంకాలు విధించిన నేపథ్యంలో.. అమెరికాలో బంగారానికి డిమాండ్ పెరిగింది. దీని ఫలితంగా యూరప్ కంటే అమెరికాలో బంగారం ధరలు పెరిగాయి. కాబట్టి కేంద్ర బ్యాంకులు లండన్ వాల్ట్‌ల నుంచి బంగారాన్ని తరలిస్తున్నాయి. గత ఎనిమిది వారాల్లో NY COMEX వాల్ట్‌లలో బంగారం నిల్వలు సుమారు 20 మిలియన్లు పెరిగాయి, ఇది లండన్ క్యాష్ గోల్డ్ కాంట్రాక్ట్ డిఫాల్ట్ బజ్‌ను ప్రేరేపించింది.స్టాక్ మార్కెట్లలో బంగారం ధరలు నిరంతరం పెరగడానికి కారణాలను గురించి, ఎస్ఎస్ వెల్త్‌స్ట్రీట్ వ్యవస్థాపకురాలు 'సుగంధ సచ్‌దేవా' మాట్లాడుతూ.. అమెరికా & యూరప్ మధ్య సుంకాల వివాదం ప్రపంచ వాణిజ్యంలో అనిశ్చితులను సృష్టించింది. ఇది బంగారం ధరలను ప్రభావితం చేసిందని అన్నారు. అల్యూమినియం, ఉక్కుపై ఇటీవల 25 శాతం దిగుమతి సుంకాలు విధించిన తర్వాత ట్రంప్ పరిపాలన బంగారంపై సుంకాలు విధించవచ్చనే ఆందోళనలు ఉన్నాయి. ఈ అంచనా అమెరికాలో డిమాండ్‌ను పెంచింది, బంగారం ధరలను పెంచిందని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: భారత్‌లో బంగారం ధరలు ఎవరు నిర్ధారిస్తారు.. గోల్డ్ రేటు ఎందుకు పెరుగుతోంది?హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్‌కు చెందిన 'అనుజ్ గుప్తా' మాట్లాడుతూ.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అమెరికన్ బ్యాంకుల కంటే వెనుకబడి లేదు. భారత సెంట్రల్ బ్యాంక్ 2024 మే, అక్టోబర్లలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఖజానాల నుంచి 100, 102 టన్నుల బంగారాన్ని రవాణా చేసిందని ఆయన అన్నారు. దీనితో ఆర్బీఐ మొత్తం బంగారు నిల్వలు 855 టన్నులకు చేరుకున్నాయి, వీటిలో 510.5 టన్నులు భారతదేశంలో నిల్వ ఉన్నాయని అన్నారు.మొత్తం మీద.. బంగారం ధరలు నిరంతరం పెరగడానికి ట్రంప్ సుంకాల విధానం మాత్రమే కారణం కాదు. భౌగోళిక రాజకీయ ఆందోళనలు, ద్రవ్యోల్బణం మళ్లీ పెరిగే ముప్పు, తక్కువ ఆర్థిక వృద్ధి గురించి ఆందోళనలు కూడా. భారతదేశంలో కొనుగోలుదారుల సంఖ్య, లేదా బంగారం మీద పెట్టుబడి పెట్టే వారి సంఖ్య విపరీతంగా పెరగడం కూడా ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. -
ట్రంప్ బెదిరిస్తే భయపడలా?: మెక్సికో అధ్యక్షురాలు
పరస్పర సుంకాలు, వలసదారుల బహిష్కరణపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేస్తున్న బెదిరింపులపై మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్‌బామ్ (Claudia Sheinbaum) తీవ్రంగా స్పందించారు. ట్రంప్ హెచ్చరికలకు భయపడుతున్నారా? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు.. అలాంటి వాటికి భయపడేది లేదని స్పష్టంచేశారామె. ‘‘ట్రంప్ చేసే డ్రగ్స్ ముఠాల కట్టడికి మిలిటరీ జోక్యం, వలసదారుల బహిష్కరణ, పరస్పర సుంకాల బెదిరింపులకు నేను భయపడను. నేను ప్రజల మనిషిని. మెక్సికన్ ప్రజల మద్దతు ఉంది. మెక్సికో (Mexico) సార్వభౌమత్వానికి భంగం కలిగించే ప్రయత్నాన్ని ఎలాగైనా అడ్డుకుంటా’’ అని అన్నారామె. వైట్‌హౌజ్‌లోకి అడుగుపెట్టగానే.. అగ్రరాజ్యంలోకి ఫెంటానిల్ డ్రగ్ అక్రమ రవాణా, వలసదారుల చొరబాట్లను అడ్డుకోవడంలో కెనడా, మెక్సికోలు విఫలమయ్యాయని ట్రంప్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఆయా దేశాలపై 25 శాతం సుంకం విధిస్తానంటూ హెచ్చరించారు కూడా. అలాగే.. అధికారం చేపట్టిన కొన్ని రోజుల్లోనే సుంకాలు విధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. అయితే.. మెక్సికోపై ట్రంప్ విధించిన 25 శాతం సుంకాలను నెలరోజుల పాటు నిలిపివేసిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై చర్చలు జరిపేందుకు ఇరుదేశాల అధికారులు ఈ వారం వాషింగ్టన్లో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. -
భారత్‌పై అమెరికా సుంకాల ప్రభావం ఎంతంటే..
అమెరికా ప్రతీకార సుంకాల ప్రభావం భారత్‌పై పెద్దగా ఉండబోదని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ స్పష్టం చేసింది. భారత ఆర్థిక వ్యవస్థ అధిక శాతం దేశీ డిమాండ్ (వినియోగం)పై ఆధారపడి ఉన్న విషయాన్ని తన తాజా నివేదికలో గుర్తు చేసింది. దీనికితోడు అమెరికాకు భారత్ చేసే ఎగుమతుల్లో ఎక్కువ భాగం సేవల రూపంలో ఉన్నందున, ట్రంప్ పాలనా యంత్రాంగం వీటిని లక్ష్యంగా చేసుకోకపోవచ్చని తెలిపింది. భారత్ సహా తమ ఉత్పత్తులపై అధిక సుంకాలు వేస్తున్న దేశాలన్నింటి నుంచి వచ్చే దిగుమతులపై అదే మోతాదులో తాము కూడా సుంకాల మోత మోగిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ప్రధాని మోదీ సమక్షంలోనే స్పష్టం చేయడం గమనార్హం. అమెరికా ప్రతీకార సుంకాలు ఎక్కువగా వియత్నాం, దక్షిణ కొరియా, తైవాన్‌పై ప్రభావం చూపిస్తాయని, ఆ దేశాలు అమెరికాతో అధిక వాణిజ్య మిగులు కలిగి ఉన్నట్టు ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ ఆసియా–పసిఫిక్ ఆర్థికవేత్త విశృత్ రాణా తెలిపారు. అమెరికాతో ఎక్కువగా సేవల వాణిజ్యం నడుపుతున్న జపాన్‌పైనా సంకాలు ఏమంత ప్రభావం చూపించబోవన్నారు. ధరల ఆజ్యంతో అధిక వడ్డీ రేట్లుఅమెరికా విధించే ప్రతీకార సుంకాలు ధరలకు ఆజ్యం పోస్తాయని, దీంతో ప్రపంచవ్యాప్తంగా అధిక వడ్డీ రేట్లకు దారితీయొచ్చని రాణా అభిప్రాయపడ్డారు. ‘భారత్ వృద్ధి కోసం ఎగుమతులపై అంతగా ఆధారపడి లేదు. కాబట్టి అమెరికా టారిఫ్‌ల ప్రభావం చాలా పరిమితంగానే ఉంటుంది’ అని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ డైరెక్టర్ ఈఫార్న్ ఫువా తెలిపారు. జ్యుయలరీ, ఫార్మాస్యూటికల్, టెక్స్టైల్స్, కెమికల్స్‌పై టారిఫ్‌ల ప్రభావం ఎక్కువగా ఉండొచ్చన్నారు. అయితే, భారత్ నుంచి వచ్చే ఫార్మాస్యూటికల్స్‌పై అమెరికా అధిక సుంకాలు విధించకపోవచ్చని, అలా చేయడం అమెరికాలో ఆరోగ్య వ్యయాలను పెంచుతుందన్నారు. అదే సమయంలో టెక్స్టైల్స్, కెమికల్స్ అధిక టారిఫ్‌ల రిస్క్ ఎదుర్కోవాల్సిరావచ్చన్నారు. ట్రంప్ మొదటి విడత పాలనను గుర్తు చేసుకుని చూస్తే మొత్తం మీద భారత్‌పై పడే ప్రభావం పరిమితంగానే ఉండొచ్చని ఫువా విశ్లేషించారు.ప్రభావం ఏ మేరకు..?ట్రంప్ టారిఫ్‌లతో భారత జీడీపీపై 0.1–0.6 శాతం మేర ప్రభావం పడొచ్చని గోల్డ్‌మన్ శాక్స్ అంచనా వేసింది. అమెరికా దిగుమతి చేసుకునే అన్నింటిపైనా సగటు వ్యత్యాసం మేర టారిఫ్‌లు మోపితే, అలాంటి పరిస్థితుల్లో భారత్ చేసే ఎగుమతులపై అమెరికా నికర టారిఫ్ రేట్లు 6.5 శాతం మేర పెరగొచ్చని పేర్కొంది. అలా కాకుండా, విడిగా ప్రతీ ఉత్పత్తిపై రెండు దేశాల మధ్య ఉన్న వ్యత్యాసం మేర అదనంగా టారిఫ్ పెంచేస్తే అప్పుడు భారత ఎగుమతులపై పెరిగే సుంకాల భారం 6.5–11.5 శాతం మధ్య ఉంటుందని వివరించింది.2024–25లో వృద్ధి 6.3 శాతమే: ఎస్బీఐ రీసెర్చ్దేశ జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024–25) 6.2–6.3 శాతమే వృద్ధి చెందొచ్చని ఎస్బీఐ రీసెర్చ్ విభాగం అంచనా వేసింది. జాతీయ శాంపిల్ కార్యాలయం (ఎన్ఎస్వో) జూన్, సెపె్టంబర్ త్రైమాసికాల అంచనాలను పెద్దగా సవరించకపోవచ్చని పేర్కొంది. 6.4 శాతం వృద్ధి నమోదు కావొచ్చని ఎన్ఎస్వో లోగడ అంచనా వేయడం గమనార్హం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉండడం స్థిరత్వాన్ని తీసుకొస్తుందని, ఇతర రంగాల్లో వృద్ధికి ఊతంగా నిలుస్తుందని ఎస్బీఐ రీసెర్చ్ పేర్కొంది. ద్రవ్యోల్బణం తగ్గడం విచక్షణారహిత వినియోగాన్ని పెంచుతుందని, అది వినియోగ ఆధారిత వృద్ధికి దారితీస్తుందని అంచనా వేసింది. భారత్ 2024–25, 2025–2026 ఆర్థిక సంవత్సరాల్లో 6.5 శాతం వృద్ధి నమోదు చేస్తుందన్నది ఐఎంఎఫ్ అంచనాగా ఉంది. మరోవైప ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ సైతం వచ్చే రెండేళ్ల పాటు భారత్ జీడీపీ 6.7–6.8 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని తాజాగా వెల్లడించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరాలతో పోల్చి చూసినప్పుడు తక్కువే అయినప్పటికీ, అదే ఆదాయ స్థాయి కలిగిన దేశాల కంటే ఎగువనే ఉంటుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ డైరెక్టర్ ఈఫార్న్ ఫువా తెలిపారు. పన్ను రేట్లను తగ్గించినప్పటికీ ఆదాయ వృద్ధికి మద్దతుగా నిలుస్తుందన్నారు. ఇదీ చదవండి: ‘గ్రోక్ 3’ను ఆవిష్కరించిన మస్క్ఫార్మాపై టారిఫ్‌లతో అమెరికన్లపైనే ప్రభావం..-ఫార్మెక్సిల్ డైరెక్టర్ జనరల్ రాజా భాను భారత ఫార్మా ఎగుమతులపై ప్రతీకార టారిఫ్‌లు విధించేలా అమెరికా నిర్ణయం తీసుకుంటే, అమెరికన్ వినియోగదారులపైనే ప్రధానంగా ప్రభావం పడుతుందని ఫార్మా ఎగుమతుల ప్రోత్సాహక మండలి ఫార్మెక్సిల్ డైరెక్టర్ జనరల్ రాజా భాను వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి దేశీయ పరిశ్రమ వేచి, చూసే ధోరణితో వ్యవహరిస్తోందని తెలిపారు. అమెరికాకు భారత్ ఏటా 8 బిలియన్ డాలర్ల విలువ చేసే ఉత్పత్తులు ఎగుమతులు చేస్తోందని చెప్పారు. అమెరికన్ అధ్యయన నివేదికలను ఉటంకిస్తూ.. భారత ఔషధ ఎగుమతులతో అమెరికాలోని హెల్త్‌కేర్ వ్యవస్థకు 2013–2022 మధ్య 1.3 లక్షల కోట్ల డాలర్లు ఆదా అయినట్లు భాను తెలిపారు. వచ్చే అయిదేళ్లలో మరో 1.3 బిలియన్ డాలర్లు ఆదా అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ‘ఇలాంటి పరిస్థితుల్లో (మన ఔషధాలతో వాళ్లకు ఇంత ఆదా అవుతున్నప్పుడు) మనపై టారిఫ్‌లు విధిస్తామంటే ఏమనగలం‘ అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం భారత్ నుంచి ఫార్మా దిగుమతులపై అమెరికాలో ఎటువంటి సుంకాలు లేవు. ఈ ఆరి్థక సంవత్సరం మొత్తం ఫార్మా ఎగుమతులు 29 బిలియన్ డాలర్లుగా ఉంటాయని అంచనా వేస్తున్నట్లు భాను తెలిపారు. -
డాలర్‌తో గేమ్స్ ఆడితే 100% సుంకాలు!
వాషింగ్టన్: భారత్‌తో పాటు బ్రిక్స్ కూటమిలోని ఇతర సభ్య దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఘాటు హెచ్చరికలు చేశారు. డాలర్‌తో ఆటలాడాలని చూస్తే వాటిపై వంద శాతం టారిఫ్ విధిస్తామని పునరుద్ఘాటించారు. డాలర్‌ను వేరే కరెన్సీతో భర్తీ చేయాలని చూస్తే బ్రిక్స్ దేశాలతో అమెరికా ఇకపై ఎలాంటి వర్తక లావాదేవీలూ జరపబోదని స్పష్టం చేశారు. గురువారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీకి రెండు గంటల ముందే ట్రంప్ ఈ మేరకు సంచలన ప్రకటన చేశారు. తాను తొలిసారి 100 శాతం టారిఫ్‌ల హెచ్చరికలు చేసినప్పుడే బ్రిక్స్ మృతప్రాయ కూటమిగా మిగిలిపోయిందని చెప్పుకొచ్చారు! దాని ఏర్పాటులోనే దురుద్దేశం దాగుందని ట్రంప్ ఆరోపించారు. ‘‘బ్రిక్స్ కూటమి కొనసాగాలని దాని సభ్య దేశాలే కోరుకోవడం లేదు. బ్రిక్స్ గురించి మాట్లాడేందుకు కూడా భయపడుతున్నాయి’’అని చెప్పుకొచ్చారు. ఎందుకంటే, ‘‘డాలర్‌తో గేమ్స్ ఆడొద్దు. అలా చేస్తే మీపై 100 శాతం టారిఫ్‌లు తప్పవు. అప్పుడు మీరే అలా చేయొద్దంటూ వేడుకుంటారు’’అని హెచ్చరించానన్నారు. బ్రిక్స్ కూటమిని రూపుమాపాలనుకుంటున్నారా, లేక అందులో భాగం కావాలని భావిస్తున్నారా అన్న విలేకరుల ప్రశ్నకు బదులుగా ట్రంప్ ఈ మేరకు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దాని విషయంలో గత అధ్యక్షులు జో బైడెన్, బరాక్ ఒబామా ఇలా కఠినంగా వ్యవహరించలేకపోయారని ఆక్షేపించారు. బ్రిక్స్ కూటమిలో భారత్‌తో పాటు రష్యా, చైనా, బ్రెజిల్, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండొనేసియా, ఇరాన్ సభ్య దేశాలు. బ్రిక్స్‌పై 100 శాతం టారిఫ్‌లు తప్పవని ట్రంప్ రెండోసారి అధికారంలోకి రాకముందు నుంచీ హెచ్చరిస్తూ వస్తున్నారు. బ్రిక్స్ దేశాలు డాలర్‌కు బదులుగా తమ సొంత కరెన్సీల్లోనే లావాదేవీలు నెరపాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2023లో బ్రిక్స్ శిఖరాగ్రంలో ప్రతిపాదించారు. మరుసటేడాది బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రుల భేటీ కూడా ఇదే అభిప్రాయం వెలిబుచ్చింది. -
అమెరికా సుంకాలకు కారణాలు.. భారత్‌పై ప్రభావం
అమెరికా ‘కంట్రీఫస్ట్’ విధానంతో ముందుకెళ్తోంది. అందులో భాగంగా కెనడా, మెక్సికో, చైనా దిగుమతులపై సుంకాలు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. అమెరికా విధించిన సుంకాలను భారత్ కూడా ఎదుర్కొనే అవకాశం ఉందని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. ఈ వాణిజ్య సంఘర్షణ భారతీయ విధానకర్తలు, వ్యాపారుల్లో ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే అమెరికా కెనడా, మెక్సికో దేశాలపై 25 శాతం, చైనాపై 10 శాతం సుంకాలు విధించింది. ఈ సెగ భారత్‌కు సైతం తాకనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.అమెరికా, భారతదేశం చాలా సంవత్సరాలుగా సంక్లిష్టమైన వాణిజ్య సంబంధాన్ని కలిగి ఉన్నాయి. ఇరు దేశాల మధ్య కొన్ని అంశాలపై సహకారం ఉన్నా, కొన్నింటిపై వివాదాలున్నాయి. ఇటీవల ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO)లో ఇరు దేశాలు ఆరు దీర్ఘకాలిక వివాదాలను పరిష్కరించుకున్నాయి. ఇది ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి సానుకూల చర్యగా ఇరు వర్గాలు అభివర్ణించాయి. ఏదేమైనా, కొత్త సుంకాల భయం ప్రస్తుతం కీలకంగా మారుతుంది.టారిఫ్ భయాలకు కారణాలుముఖ్యంగా ఫార్మాస్యూటికల్స్, టెక్స్టైల్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి రంగాల్లో భారత్‌తో వాణిజ్య లోటుపై అమెరికా గళమెత్తింది. ఈ అసమతుల్యతలను పరిష్కరించడానికి, దేశీయ పరిశ్రమలను రక్షించడానికి సుంకాలను ఒక మార్గంగా చూస్తుంది. సుంకాలు విధించాలన్న అమెరికా నిర్ణయంలో ముఖ్యంగా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. భారత విదేశాంగ విధానాన్ని ప్రభావితం చేసే విస్తృత వ్యూహంలో భాగంగా అమెరికా ఆర్థిక ఒత్తిడి తీసుకురావాలని చూస్తోంది. విదేశీ పోటీ నుంచి దేశీయ పరిశ్రమలను రక్షించడానికి సుంకాలు అనుకూలమైన సాధనంగా అమెరికా పరిగణిస్తుంది. యూఎస్ ఆర్థిక ప్రయోజనాలకు ముప్పు పొంచి ఉందని భావిస్తే టారిఫ్‌ల విధానం భారత్‌కు విస్తరించే అవకాశం ఉంది.యూఎస్ సుంకాల వల్ల భారత్‌పై ప్రభావంఎగుమతుల క్షీణత: భారత ఎగుమతిదారులు, ముఖ్యంగా సుంకాల ద్వారా లక్ష్యంగా చేసుకున్న రంగాల్లో మార్కెట్ అవకాశాలు తగ్గడం, ఆదాయాలు క్షీణించడం వంటి ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఇది ఆ రంగాల్లో ఉపాధి, ఆర్థిక వృద్ధిపై ప్రభావం చూపుతుంది.ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు: దిగుమతి చేసుకున్న వస్తువులపై అధిక సుంకాలు భారతీయ వినియోగదారులకు ఖర్చులు పెరగడానికి దారితీస్తాయి. ఇది దేశంలో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లకు దోహదం చేస్తుంది.వాణిజ్య సంబంధాలు: టారిఫ్‌ల విధింపు ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను దెబ్బతీస్తుంది. ఇది ప్రతీకార చర్యలకు దారితీస్తుంది. రెండు ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీసే వాణిజ్య యుద్ధానికి తెరతీసే అవకాశం ఉంది.ఇదీ చదవండి: ఓపెన్ ఏఐ ‘డీప్ రీసెర్చ్’ ఆవిష్కరణఇప్పుడేం చేయాలంటే..సుంకాల ప్రభావాన్ని తగ్గించడానికి, దానివల్ల ఏర్పడే సమస్యలను పరిష్కరించడానికి భారత్, అమెరికా పరస్పర ప్రయోజనకరమైన విధానాలు అన్వేషించాలి. అందుకు ఇరు దేశాల మధ్య దౌత్య చర్చలు జరగాలని నిపుణులు సూచిస్తున్నారు. భారత్ ఇతర దేశాలతో వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకోవడం, ఎగుమతి మార్కెట్లను వైవిధ్యపరచడం కూడా అమెరికా మార్కెట్‌పై ఆధారపడటాన్ని తగ్గించేందుకు తోడ్పడుతుంది. -
అమెరికా Vs కెనడా.. ట్రంప్‌కు ప్రధాని ట్రూడో కౌంటర్!
అట్టావా: టారిఫ్‌ల విషయంలో కెనడా, అమెరికా మధ్య రాజకీయం వేడెక్కింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కెనడా, మెక్సికోలపై ప్రకటించిన 25 శాతం టారిఫ్‌లపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందించారు. బలవంతంగా టారిఫ్‌లు అమలు చేయాలనుకుంటే రెండు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతింటాయి. ట్రంప్‌ను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు కామెంట్స్ చేశారు.కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. కెనడాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్‌లు అమలు చేయాలనుకుంటే అది వారి ఇష్టం. అమెరికాపై ప్రతిస్పందనకు మేము సిద్ధంగా ఉన్నాం. మాపై ఉద్దేశపూర్వకంగా టారిఫ్‌లు విధిస్తున్నారు. దీన్ని వల్ల కెనడా ఆర్థిక వ్యవస్థతో పాటు అమెరికా ఆర్థిక వ్యవస్థను కూడా దెబ్బతిస్తాయి. రెండు దేశాల సమిష్టి భద్రతను దెబ్బతిస్తాయి. కెనడాతో వాణిజ్యం అమెరికా దీర్ఘకాలిక శ్రేయస్సు, భద్రతకు ఎంతో ముఖ్యమైనంది. కెనడా ఉక్కు మరియు అల్యూమినియం, కీలకమైన ఖనిజాలు అమెరికాకు ఎంతో అవసరం. వీటిపై మేము వెనక్కి తగ్గేది లేదు అంటూ కామెంట్స్ చేశారు.ఇదిలా ఉండగా.. పొరుగుదేశాలైన కెనడా, మెక్సికోలపై ప్రకటించిన 25 శాతం టారిఫ్ పెంపు నేటి నుంచే అమలవుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ప్రకటించారు. వైట్‌హౌస్‌లోని ఓవల్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. టారిఫ్‌లు విధించే కెనడా, మెక్సికో వస్తువుల జాబితాలో చమురును చేర్చాలా వద్దా అనేది కూడా త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ఈ రెండు దేశాల నుంచి దిగుమతయ్యే ఆయిల్ ధర సరిగ్గా ఉందని భావిస్తే టారిఫ్ ఉండదని చెప్పారు.కెనడా, మెక్సికోలపై టారిఫ్ విధింపునకు ఎన్నో కారణాలు ఉన్నాయన్నారు. ఈ రెండు దేశాల నుంచి అక్రమ వలసలు, డ్రగ్స్ స్మగ్లింగ్ ఎక్కువన్నారు. ఈ రెండు దేశాలతో అమెరికా వాణిజ్యం భారీ లోటు ఉందని చెప్పారు. వాణిజ్యం విషయంలో ఈ రెండూ అమెరికాతో చాలా అన్యాయంగా వ్యవహరించాయన్నారు. ఇవి ఎగుమతి చేసే వస్తువులు ఆయిల్, కలప వంటి వాటి అవసరం తమకు లేదన్నారు. ప్రస్తుతం ఏడాదికి కెనడాకు 175 బిలియన్ డాలర్లు, మెక్సికోకు 300 బిలియన్ డాలర్ల వరకు అమెరికా సబ్సిడీల రూపంలో అందిస్తోందని ట్రంప్ వివరించారు.Prime Minister Justin Trudeau on Donald Trump's looming 25% tariffs on Canada tomorrow:"If the president does choose to implement any tariffs against Canada, we're ready with a response. A purposeful, forceful but reasonable, immediate response." pic.twitter.com/fUmmqj6sSr— Art Candee 🍿🥤 (@ArtCandee) January 31, 2025 -
కెనడా, మెక్సికోలపై టారిఫ్‌లు నేటి నుంచే
వాషింగ్టన్: పొరుగుదేశాలైన కెనడా, మెక్సికోలపై ప్రకటించిన 25 శాతం టారిఫ్ పెంపు శనివారం నుంచే అమలవుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ప్రకటించారు. వైట్‌హౌస్‌లోని ఓవల్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. టారిఫ్‌లు విధించే కెనడా, మెక్సికో వస్తువుల జాబితాలో చమురును చేర్చాలా వద్దా అనేది కూడా త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ఈ రెండు దేశాల నుంచి దిగుమతయ్యే ఆయిల్ ధర సరిగ్గా ఉందని భావిస్తే టారిఫ్ ఉండదని చెప్పారు. కెనడా, మెక్సికోలపై టారిఫ్ విధింపునకు ఎన్నో కారణాలు ఉన్నాయన్నారు. ఈ రెండు దేశాల నుంచి అక్రమ వలసలు, డ్రగ్స్ స్మగ్లింగ్ ఎక్కువన్నారు. ఈ రెండు దేశాలతో అమెరికా వాణిజ్యం భారీ లోటు ఉందని చెప్పారు. వాణిజ్యం విషయంలో ఈ రెండూ అమెరికాతో చాలా అన్యాయంగా వ్యవహరించాయన్నారు. ఇవి ఎగుమతి చేసే వస్తువులు ఆయిల్, కలప వంటి వాటి అవసరం తమకు లేదన్నారు. ప్రస్తుతం ఏడాదికి కెనడాకు 175 బిలియన్ డాలర్లు, మెక్సికోకు 300 బిలియన్ డాలర్ల వరకు అమెరికా సబ్సిడీల రూపంలో అందిస్తోందని ట్రంప్ వివరించారు. చైనా పైనా టారిఫ్ఫెంటానిల్ వంటి ప్రమాదకరమైన డ్రగ్‌ను తమ దేశంలోకి దొంగచాటుగా పంపుతున్న చైనా వస్తువులపైనా టారిఫ్‌లు విధించే విషయాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు. ‘ఫెంటానిల్ కారణంగా వేలాదిగా అమెరికన్లు చనిపోతున్నారు. ఇందుకు బదులుగా చైనా టారిఫ్‌తో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంది. ఈ విషయంలో స్పష్టతతో ఉన్నాం’అని ఆయన అన్నారు.బ్రిక్స్‌కు ట్రంప్ మళ్లీ వార్నింగ్అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్‌కు బదులుగా ప్రత్యామ్నాయం తీసుకురావాలనుకుంటే తీవ్ర చర్యలు తప్పవని బ్రిక్స్ దేశాలకు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. అలాంటి పరిస్థితే వస్తే సభ్యదేశాలపై వంద శాతం టారిఫ్ తప్పదన్నారు. అమెరికాకు బదులు మరో దేశాన్ని చూసుకోవాలని సలహా ఇచ్చారు. ‘ఇప్పటి వరకు చూస్తూ ఊరుకున్నాం, ఇకపై సహించేది లేద’అంటూ సొంత సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్‌లో పేర్కొన్నారు. ‘కొత్తగా బ్రిక్స్ కరెన్సీని తేవడం లేదా డాలర్‌కు ప్రత్యామ్నాయంగా మరో కరెన్సీకి మద్దతివ్వడం వంటివి మానుకోవాలి. అలా చేస్తే 100 శాతం టారిఫ్‌లు తప్పవు. అమెరికాలో ఉత్పత్తుల విక్రయానికి గుడ్ బై చెప్పుకోవాల్సిందే’అన్నారు. గత డిసెంబర్‌లోనూ బ్రిక్స్‌కు ట్రంప్ ఇటువంటి హెచ్చరికే చేశారు. అయితే, డాలర్ రహిత బ్రిక్స్ దేశాల వాణిజ్యానికి సంబంధించి ఎలాంటి ప్రతిపాదనా లేదని విదేశాంగ మంత్రి జై శంకర్ స్పష్టం చేశారు. బ్రిక్స్‌లో రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్టు, ఇథియోపియా, ఇండోనేసియా, ఇరాన్ దేశాలకు సభ్యత్వముంది. -
కాల్స్ కోసమే ప్రత్యేక ప్యాక్.. వాట్సప్‌కు ఊరట
న్యూఢిల్లీ: కాల్స్, ఎస్ఎంఎస్ల కోసం ప్రత్యేక ప్రీపెయిడ్ ప్యాక్స్‌ను టెలికాం కంపెనీలు రిలయన్స్ జియో(Jio), భారతీ ఎయిర్టెల్(Airtel) పరిచయం చేశాయి. 84 రోజుల కాల పరిమితితో రూ.499 ధరలో కొత్త ప్లాన్‌ను ఎయిర్టెల్ అందుబాటులోకి తెచ్చింది. అపరిమిత కాల్స్, 900 ఎస్ఎంఎస్లు ఆఫర్ చేస్తారు. అలాగే రూ.1,959 ధరలో 365 రోజుల వ్యాలిడిటీ గల ప్యాక్ కింద అపరిమిత కాల్స్, 3,600 ఎస్ఎంఎస్లు అందుకోవచ్చు.రిలయన్స్ జియో రూ.458 ధరలో 84 రోజుల కాల పరిమితితో అపరిమిత వాయిస్‌కాల్స్, 1,000 ఎస్ఎంఎస్లను అందిస్తోంది. ఏడాది కాల పరిమితితో రూ.1,958 ధరలో అపరిమిత కాల్స్, 3,600 ఎస్ఎంఎస్లను పొందవచ్చు. డేటా అవసరం లేకపోయినా బండిల్ ప్యాక్స్ వల్ల కస్టమర్లకు చార్జీల భారం పడుతోందన్న ఫిర్యాదుల పెద్ద ఎత్తున రావడంతో టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ గత నెలలో టారిఫ్ నిబంధనలను సవరించింది. దీనికి అనుగుణంగా డేటా అవసరం లేని కస్టమర్ల కోసం వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ల కోసం టెలికం కంపెనీలు ప్రత్యేక ప్లాన్స్‌ను ప్రవేశపెట్టాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: త్రైమాసిక ఫలితాల్లో కంపెనీలకు లాభాలుఎన్సీఎల్ఏటీలో వాట్సాప్‌కి ఊరటన్యూఢిల్లీ: నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్‌లో (NCLAT) వాట్సాప్‌కు ఊరట లభించింది. మాతృ సంస్థ మెటాతో వాట్సాప్ అయిదేళ్ల పాటు యూజర్ల డేటాను షేర్ చేసుకోరాదంటూ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) నిషేధంపై ఎన్సీఎల్ఏటీ స్టే విధించింది. తదుపరి విచారణను మార్చి 17కు వాయిదా వేసింది. ప్రకటనల అవసరాలరీత్యా యూజర్ల డేటాను మెటాతో పాటు గ్రూప్ కంపెనీలకు అందించేలా 2021లో వాట్సాప్ గోప్యతా పాలసీని అప్డేట్ చేసింది. అయితే, ఇలాంటివి అనుచిత వ్యాపార విధానాల కిందికి వస్తాయంటూ నవంబర్‌లో సీసీఐ అయిదేళ్ల నిషేధంతో పాటు మెటాపై రూ.213 కోట్ల జరిమానా విధించింది. దీన్ని సవాలు చేస్తూ మెటా, వాట్సాప్ సంస్థలు ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించాయి. -
మొబైల్ రీఛార్జ్ మరింత భారం కానుందా..?
రిలయన్స్ జియో(Jio), భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా సహా భారతదేశంలోని టెలికాం ఆపరేటర్లు ఈ ఏడాది టారిఫ్(Tariff)లను 10 శాతం పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో 2024 జులైలో 25 శాతం వరకు టారిఫ్ పెంచిన విషయం తెలిసిందే. ఆపరేటర్లు మార్జిన్లపై దృష్టి పెడుతున్నారని, త్వరలో 5జీ నిర్దిష్ట ధరలను ప్రవేశపెట్టవచ్చని జెఫరీస్ నివేదిక తెలిపింది.2025లో జియో లిస్టింగ్‌కు వెళ్లే అవకాశం ఉండడంతో కంపెనీ తన వృద్ధిని పెంచడానికి అధిక టారిఫ్‌లకు అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. భారతీ ఎయిర్టెల్ తన రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిమెంట్ (ROCE)ను మెరుగుపరచడానికి టారిఫ్‌లను పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. వొడాఫోన్ ఐడియాలో ప్రభుత్వం అతిపెద్ద వాటాదారుగా ఉన్నందున టారిఫ్ పెంపునకు అనుకూలంగా ఉండవచ్చనే అభిప్రాయాలున్నాయి.ఇదీ చదవండి: రూపాయి క్షీణత మంచిదేటారిఫ్ పెంపు వల్ల సగటు వినియోగదారుడి నుంచి వచ్చే ఆదాయం (ఏఆర్పీయూ) కనీసం 25% పెరుగుతుందని, ఇది మెరుగైన మార్జిన్ విస్తరణ, నగదు ప్రవాహ ఉత్పత్తికి దారితీస్తుందని భావిస్తున్నారు. భారతీ ఎయిర్ టెల్, జియోలకు మార్జిన్లు 170-200 బేసిస్ పాయింట్లు పెరగడంతో టెలికాం రంగం ఆదాయ వృద్ధి ఏడాదికి 15 శాతం పెరుగుతుందని జెఫరీస్ అంచనా వేసింది. -
మళ్లీ మొబైల్ టారిఫ్‌లు పెంపు..?
దేశంలోని టెలికం ఆపరేటర్లు డిజిటల్ మౌలిక వసతుల్లో చేసిన భారీ పెట్టుబడుల ప్రయోజనాన్ని పొందాలంటే పన్నుల తగ్గింపు, టారిఫ్‌ల పెంపు అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తదుపరి తరం 5జీ సేవల కవరేజీని విస్తరించేందుకు ప్రైవేట్ ఆపరేటర్లు టెలికం మౌలిక సదుపాయాలు, రేడియోవేవ్స్ కోసం 2024లో సుమారు రూ.70,000 కోట్లు పెట్టుబడి పెట్టారు. అయితే 18 కోట్ల 2జీ కస్టమర్లను కనెక్ట్ చేయడం, సమ్మిళిత వృద్ధి కోసం 4జీకి మళ్లేలా వారిని ప్రోత్సహించడం సవాలుగా మారింది.‘టెలికం రంగంలో పన్నులను హేతుబద్ధీకరించాలి. భారత్‌లోనే పన్నులు ఎక్కువగా ఉన్నాయి. అలాగే టారిఫ్‌లు అత్యల్పంగా ఉన్నాయి. అధిక వినియోగ కస్టమర్లు ఎక్కువ చెల్లించడం, ఎంట్రీ లెవల్ డేటా వినియోగదారులు తక్కువ చెల్లించేలా మార్పులు రావొచ్చు. టెలికం సంస్థలు చేసిన పెట్టుబడులు డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్నాయి. దీని ద్వారా స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ మొత్తం లాభపడింది. పన్నుల హేతుబద్ధీకరణ, టారిఫ్‌ల పెంపు ద్వారా పెట్టుబడులపై రాబడిని పొందే సమయం ఆసన్నమైంది’ అని ఈవై ఇండియా మార్కెట్స్, టెలికం లీడర్ ప్రశాంత్ సింఘాల్ అన్నారు. ఏఆర్పీయూ రూ.300 స్థాయికి..భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు ఒక్కో వినియోగదారు నుంచి సగటు ఆదాయాన్ని (ఏఆర్పీయూ) రూ.300 స్థాయికి పెంచాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పాయి. గతేడాది జులైలో మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల పెంపు తర్వాత వొడాఫోన్ ఐడియా ఏఆర్పీయూ ఏప్రిల్–జూన్‌లో రూ.154 నుంచి సెప్టెంబర్ త్రైమాసికంలో 7.8 శాతం పెరిగి రూ.166కి చేరుకుంది. భారతీ ఎయిర్టెల్ రూ.211 నుంచి 10.4 శాతం వృద్ధితో రూ.233కి, రిలయన్స్ జియో రూ.181.7 నుంచి రూ.195.1కి దూసుకెళ్లింది. అయితే టారిఫ్‌ల పెంపు ఈ సంస్థలకు షాక్ తగిలింది. దాదాపు 2 కోట్ల మంది సబ్స్క్రైబర్లు తమ కనెక్షన్లను వదులుకున్నారు. 10–26 శాతం ధరల పెంపు కారణంగా రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా సంయుక్తంగా 2.6 కోట్ల మంది వినియోగదారులను కోల్పోయాయి.మౌలికంలో పెట్టుబడులు..మోర్గాన్ స్టాన్లీ నివేదిక ప్రకారం భారతీ ఎయిర్టెల్ అక్టోబర్‌లో పట్టణ ప్రాంతాల్లో సబ్‌స్క్రైబర్స్‌ను కోల్పోగా, గ్రామీణ ప్రాంతాల్లో నికరంగా భారీ స్థాయిలో జోడించింది. రిలయన్స్ జియో మెట్రోలు, ప్రధాన సర్కిల్స్‌లో చందాదారులను పొందింది. చిన్న సర్కిల్స్‌లో కస్టమర్లను కోల్పోయింది. వొడాఫోన్ ఐడియా నుంచి అక్టోబర్‌లో భారీగా వినియోగదార్లు దూరమయ్యారు. 5జీ పర్యావరణ వ్యవస్థకు మద్దతుగా టెలికం ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం 2022–2027 మధ్య రూ.92,100 కోట్ల నుంచి రూ.1.41 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు చేయనున్నట్టు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్స్ అసోసియేషన్ (డీఐపీఏ) డైరెక్టర్ జనరల్ మనోజ్ కుమార్ సింగ్ తెలిపారు. భారతీ ఎయిర్టెల్ రెండో త్రైమాసిక పనితీరుపై జేఎం ఫైనాన్షియల్ రిపోర్ట్ ప్రకారం టారిఫ్ పెంపులు మరింత తరచుగా జరిగే అవకాశం ఉంది. 5జీలో భారీ పెట్టుబడులు, ఐపీవోకు వచ్చే అవకాశం ఉన్నందున జియోకు అధిక ఏఆర్పీయూ అవసరం.ఇదీ చదవండి: గూగుల్ పే, ఫోన్‌పేకి ఎన్పీసీఐ ఊరటబీఎస్ఎన్ఎల్కు మార్పుధరల పెంపుదలకు దూరంగా ఉన్న ప్రభుత్వరంగ సంస్థ బీఎస్ఎన్ఎల్కు దాదాపు 68 లక్షల మంది కస్టమర్లు కొత్తగా వచ్చి చేరారు. నష్టాల్లో ఉన్న ఈ సంస్థ ఇప్పటికీ పాత తరం 3జీ సేవలను అందిస్తోంది. దేశవ్యాప్తంగా 4జీ సేవలను పరిచయం చేసేందుకు కసరత్తు చేస్తోంది. భారతీ ఎయిర్టెల్ నెట్‌వర్క్‌లో సబ్‌స్క్రైబర్ వృద్ధి ఈ రంగానికి కొంత ఆశను కలిగించింది. సేవలను అందించడంలో బీఎస్ఎన్ఎల్ అసమర్థత ఈ వృద్ధికి కారణంగా కొంతమంది విశ్లేషకులు పేర్కొన్నారు. భారతీ ఎయిర్టెల్ అక్టోబర్‌లో వైర్లెస్ విభాగంలో 19.28 లక్షల మంది వినియోగదారులను జోడించింది. క్రియాశీల చందాదారులు దా దాపు 27.23 లక్షలు అధికం అయ్యారు. వొడాఫోన్ ఐడియా 19.77 లక్షల వైర్లెస్ సబ్స్క్రైబర్లను కోల్పోయింది. యాక్టివ్ సబ్స్రైబర్ బేస్ దాదాపు 7.23 లక్షలు తగ్గింది. రిలయన్స్ జియో వైర్లెస్ కస్టమర్ల సంఖ్య అక్టోబర్‌లో మొత్తం 46 కోట్లకు వచ్చి చేరింది. సెప్టెంబర్‌లో ఈ సంఖ్య 46.37 కోట్లు నమోదైంది. క్రియాశీల వినియోగదారుల సంఖ్య బలపడింది. -
బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు తీపికబురు
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) తన కస్టమర్లకు శుభవార్త అందించింది. సమీప భవిష్యత్తులో టారిఫ్ రేట్లను పెంచబోమని బీఎస్ఎన్ఎల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రాబర్ట్ రవి స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలో బీఎస్ఎన్ఎల్కు కస్టమర్లు పెరుగుతున్న నేపథ్యంలో స్పామ్ బ్లాకర్స్, ఆటోమేటెడ్ సిమ్ కియోస్క్‌లు, డైరెక్ట్-టు-డివైస్ సేవలు వంటి కొత్త ఆఫర్లను తీసుకురాబోతున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఉన్న వినియోగదారులను నిలుపుకోవడంతోపాటు కొత్తవారిని ఆకర్షించడానికి ఈ కార్యక్రమాలు ఉపయోగపడుతాయని చెప్పారు.సెప్టెంబర్ 2024లో బీఎస్ఎన్ఎల్ ఊహించని విధంగా 8.5 లక్షల మంది సబ్స్క్రైబర్లను పొందింది. ప్రైవేట్ రంగ టెలికాం కంపెనీలకు ఈమేరకు కస్టమర్లు తగ్గుతున్నారు. జులైలో ప్రైవేట్ టెలికాం సంస్థలు 10 శాతం నుంచి 27 శాతం వరకు టారిఫ్ రేట్లను పెంచడంతో వినియోగదారులు బీఎస్ఎన్ఎల్కు మళ్లుతున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) డేటా ప్రకారం రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా ఇటీవల కాలంతో దాదాపు కోటి మంది చందాదారులను కోల్పోయాయి. జియో ఒక్కటే 79.69 లక్షల మంది సబ్స్క్రైబర్లను నష్టపోయింది.ఇదీ చదవండి: రిపేర్ బిల్లు చూసి చిర్రెత్తిన కస్టమర్!మెరుగైన సేవలందిస్తే మేలు..ప్రస్తుతం జియో 46.37 కోట్లు, ఎయిర్టెల్ 38.34 కోట్లు, బీఎస్ఎన్ఎల్ 9.18 కోట్ల మంది సబ్స్క్రైబర్లను కలిగి ఉంది. బీఎన్ఎన్ఎల్కు సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ ప్రైవేట్ పోటీదారులతో పోల్చితే 4జీ, 5జీ సేవలందించడంతో చాలా వెనకబడి ఉంది. వినియోగదారుల పెంపును ఆసరాగా చేసుకుని విభిన్న విభాగాల్లో మెరుగైన సేవలందిస్తే మరింత మంది సబ్స్రైబర్లు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. -
రీఛార్జ్ ప్లాన్స్ ఎఫెక్ట్.. ఇప్పుడు అందరి చూపు దానివైపే..
ఇటీవల జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా వంటి టెలికాం దిగ్గజాలు రీఛార్జ్ ప్లాన్స్ ధరలను భారీగా పెంచాయి. పెరిగిన రీఛార్జ్ ప్లాన్స్ అన్నీ కూడా యూజర్లను ఒక్కసారిగా ఆందోళనకు గురి చేసింది. ఈ తరుణంలో యూజర్ల చూపు గవర్నమెంట్ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) వైపు పడింది.రీఛార్జ్ ప్లాన్స్ ధరలు పెరగడంతో బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌కు మారుతున్న యూజర్ల సంఖ్య భారీగా పెరుగుతున్నట్లు సమాచారం. దీనికి కారణం ఇతర టెలికాం సంస్థలతో పోలిస్తే బీఎస్ఎన్ఎల్ చార్జీలు తక్కువగా ఉండటమే. డేటా కోసం కాకుండా.. కేవలం కాల్స్ కోసం మాత్రమే ఉపయోగించేవారు బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.2024 జులై 3, 4 తేదీల నుంచి జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాల టారిఫ్ ధరలు 15 శాతం నుంచి 20 శాతం పెరిగాయి. ధరలు పెరిగిన వారం రోజుల్లో సుమారు 2.5 లక్షల మంది బీఎస్ఎన్ఎల్కు మొబైల్ నంబర్ పోర్టబిలిటీ ద్వారా మారినట్లు తెలుస్తోంది. మరో 25 లక్షల మంది కొత్త బీఎస్ఎన్ఎల్ కనెక్షన్లు తీసుకున్నట్లు సమాచారం. -
అదిరిపోయే ప్లాన్లతో వినియోగదారునికి ఊరట..
-
టారిఫ్‌ల పెంపుతో ఏఆర్పీయూ జూమ్
ముంబై: టారిఫ్‌ల పెంపు టెలికం కంపెనీలకు మరింత ఆదాయన్ని తెచి్చపెట్టనుంది. ప్రతి యూజర్ నుంచి వచ్చే సగటు ఆదాయం (ఏఆర్పీయూ) 2025–26లో దశాబ్ద గరిష్ట స్థాయి రూ.225–230కు చేరుకుంటుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేసింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఏఆర్పీయూ రూ.182తో పోల్చి చూస్తే 25 శాతం వృద్ధి చెందుతుందని తెలిపింది. అధిక లాభాలు, తక్కువ మూలధన వ్యయాలతో టెలికం కంపెనీల పరపతి సైతం మెరుగుపడుతుందని పేర్కొంది. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా టెలికం చార్జీలను 20 శాతం మేర పెంచడం తెలిసిందే. ఈ రేట్లు ఈ నెల 3 నుంచి అమల్లోకి వచ్చినట్టు క్రిసిల్ తన నివేదికలో గుర్తు చేసింది. అయితే, తదుపరి రీచార్జ్‌ల నుంచే పెంచిన చార్జీలు చెల్లించాల్సి వస్తుంది కనుక, దీని అసలు ప్రతిఫలం వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే కనిపిస్తుందని వివరించింది. 5జీ సేవలతో డేటా వినియోగం పెరుగుతుందని, ఇది కూడా ఏఆర్పీయూ పెరిగేందుకు మద్దతుగా నిలుస్తుందని క్రిసిల్ రేటింగ్స్ చీఫ్ రేటింగ్ ఆఫీసర్ మనీష్ గుప్తా తెలిపారు. వీడియో స్ట్రీమింగ్ సేవల కోసం కస్టమర్లు అధిక డేటా ప్లాన్లకు మారుతున్నట్టు క్రిసిల్ తన నివేదికలో తెలిపింది. మూలధన వ్యయ భారం తగ్గుతుంది.. తాజా చార్జీల పెంపుతో టెలికం పరిశ్రమ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ (ఆర్‌వోసీఈ) 2023–24లో ఉన్న 7.5 శాతం నుంచి 2025–26లో 11 శాతానికి పెరుగుతుందని క్రిసిల్ అంచనా వేసింది. ఆదాయంలో మూలధన వ్యయాల (పెట్టుబడులు) శాతం 2023–24లో 28 శాతంగా ఉంటే, 2025–26లో 19 శాతానికి దిగొస్తుందని తెలిపింది. చాలా వరకు టెలికం సంస్థలు 5జీ సేవలను అమల్లోకి తెచ్చాయని.. అలాగే, స్పెక్ట్రమ్‌పై అధిక వ్యయాలు 2022–23లోనే చేసినట్టు గుర్తు చేసింది. దీంతో కంపెనీల రుణ భారం 6.4 లక్షల కోట్ల నుంచి రూ.5.6 లక్షల కోట్లకు దిగొస్తుందని వివరించింది. కంపెనీలు మరో విడత రేట్లను పెంచితే, తమ తాజా అంచనాలకు ఇంకా మెరుగుపడతాయని తెలిపింది. -
దేశంలోనే అతిపెద్ద ఐపీఓకు రిలయన్స్ సిద్ధం..?
రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశంలోనే అతిపెద్ద ఐపీఓకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. టెలికాం విభాగంలో సేవలందిస్తున్న జియోను పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)కు తెచ్చే ప్రతిపాదనలున్నట్లు కొన్ని మీడియా సంస్థల కథనాల ద్వారా తెలిసింది. మార్కెట్ అనుకునేలా జియో ఐపీఓకు వస్తే దేశంలో మునుపెన్నడూ లేనివిధంగా రూ.55,000 కోట్ల నిధులు సమీకరించే అవకాశం ఉందని తెలుస్తోంది. అది దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా రికార్డు నెలకొల్పనుంది.రిలయన్స్ జియో ఇటీవల మొబైల్ టారిఫ్‌లను పెంచింది. దాంతో టెలికాం రంగంలో సేవలందిస్తున్న ఎయిర్టెల్, వొడాఫోన్ఐడియా వంటి ఇతర కంపెనీలు జియో పంథానే ఎంచుకున్నాయి. అవి కూడా టారిఫ్‌లను పెంచాయి. దాంతో వినియోగదారుల నుంచి కొంత విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో ఇలా ఐపీఓ వార్తలు రావడం గమనార్హం. వచ్చే ఏడాది ప్రారంభంలో జియో ఐపీఓ రావొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటివరకు జియో 4జీ టారిఫ్‌లతోనే 5జీ సేవలు అందిస్తుండగా, ఇకపై 5జీకి ప్రత్యేక టారిఫ్ నిర్ణయించే అవకాశం ఉందని చెబుతున్నాయి.జులై నెలలో మొదటి త్రైమాసిక ఫలితాలు వెలువడే అవకాశం ఉండడంతో ఆగస్టులో రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) వార్షిక సాధారణ సమావేశాన్ని (ఏజీఎమ్) నిర్వహిస్తుంది. ఇందులో జియో ఐపీఓకు సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్ ఊహిస్తున్న విధంగా జియో ఐపీఓ ద్వారా రూ.55 వేలకోట్లు సమీకరించానుకుంటే దేశంలో అతిపెద్ద ఐపీఓగా నిలువనుంది. ఇప్పటివరకు రూ.21 వేలకోట్లు సమీకరించి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఐపీఓనే అతిపెద్దదిగా ఉంది. జియో మొత్తం విలువ దాదాపు రూ.11 లక్షల కోట్లుగా అంచనా. పెద్ద కంపెనీ ఐపీఓకు వస్తే అందులో సుమారు 5 శాతం విక్రయించాల్సి ఉంటుంది. కాబట్టి దాని విలువ రూ.55 వేలకోట్లుగా లెక్కిస్తున్నారు.ఇదీ చదవండి: గ్యాస్ సిలిండర్లకు క్యూఆర్ కోడ్.. మంత్రి ప్రకటనఇటీవల పెంచిన టారిఫ్‌లతో కంపెనీ సగటు వినియోగదారు ఆదాయం (ఆర్పు) పెరుగుతుందని మార్కెట్ అంచనా వేస్తుంది. 5జీకు ప్రత్యేకంగా టారిఫ్‌లు తీసుకురావడంతో మరింత ఆదాయం సమకూరుతుంది. దాంతో కంపెనీ రెవెన్యూలో పెరుగుదల ఉంటుందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. ఫలితంగా కంపెనీ షేర్లను కొనుగోలు చేస్తున్నారు. కేవలం గడిచిన నెల రోజుల్లో స్టాక్ ధర ఏకంగా 11.4 శాతం పెరిగింది. -
టారిఫ్‌ల పెంపుతో టెల్కోలకు అధిక లాభాలు
న్యూఢిల్లీ: టారిఫ్‌ల పెంపుతో దేశీయంగా టాప్ మూడు టెలికం కంపెనీలకు ప్రతి యూజరుపై సగటున వచ్చే ఆదాయం (ఏఆర్పీయూ) 15 శాతం పెరగవచ్చని రేటింగ్ ఏజెన్సీ కేర్ రేటింగ్స్ ఒక నివేదికలో తెలిపింది. దీంతో ఆపరేటర్ల నిర్వహణ లాభాలు 2025 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 20–22 శాతం మేర పెరుగుతాయని పేర్కొంది. స్పెక్ట్రం కొనుగోలు, 5జీ సేవలపై భారీగా ఇన్వెస్ట్ చేసిన కంపెనీలు, ఆ పెట్టుబడులపై రాబడి పొందడానికి తంటాలు పడుతున్న నేపథ్యంలో ఇది సానుకూలంగా పరిణమించగలదని కేర్ రేటింగ్స్ తెలిపింది. 2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 191గా ఉన్న ఏఆర్పీయూ ఈ ఆర్థిక సంవత్సరం 15 శాతం వృద్ధితో రూ. 220కి చేరవచ్చని విశ్లేషించింది. ప్రతి రూ. 1 ఏఆర్పీయూ పెరుగుదలతో పరిశ్రమ నిర్వహణ లాభాలు రూ. 1,000 కోట్ల స్థాయిలో పెరుగుతాయని తెలిపింది. ఏఆర్పీయూ, లాభాల పెరుగుదలతో టెక్నాలజీలను అప్‌గ్రేడ్ చేసుకునేందుకు, నెట్‌వర్క్‌ను విస్తరించుకునేందుకు టెల్కోలకు వెసులుబాటు లభించగలదని వివరించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ రుణ భారం కొంత దిగి వస్తుందని నివేదిక తెలిపింది. ఇటీవల జూన్‌లో ముగిసిన స్పెక్ట్రం వేలంలో టెల్కోలు పెద్దగా పాల్గొనకపోవడంతో .. రాబోయే రోజుల్లో రుణ భారం క్రమంగా మరింత తగ్గగలదని పేర్కొంది. -
గడువు పొడిగించేది లేదు
సాక్షి, హైదరాబాద్: ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు పొడిగించేది లేదంటూ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) ఝలక్ ఇచ్చింది. 2024–25 ఆర్థిక సంవత్స రానికి సంబంధించి డిస్కంల వార్షిక ఆదాయ అవసరాలు(ఏఆర్ఆర్), టారిఫ్ ప్రతి పాదన లు సమర్పించేందుకు జనవరి 31తో గడువు ముగిసింది. మరో మూడు నెలలు పొడిగించాలని డిస్కంలు చేసిన విజ్ఞప్తిని ఈఆర్సీ తోసిపుచ్చింది. మల్టీ ఈయర్ టారిఫ్(ఎంవైటీ) రెగ్యులేషన్స్ ప్రకారం సత్వరమే ఏఆర్ఆర్, టారిఫ్ ప్రతిపాదనలు సమర్పించాలని డిస్కంలకు ఆదేశించింది. ఏఆర్ఆర్, టారిఫ్ ప్రతిపాదనలు గడువులోగా సమర్పించడంలో విఫలమైతే డిస్కంలపై రోజుకు రూ.5000 చొప్పున జరిమానా విధించాలని ఎంవైటీ రెగ్యులేషన్స్ స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే రెండుసార్లు పొడిగింపు ప్రతి ఏటా నవంబర్ 31లోగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఏఆర్ఆర్, టారిఫ్ ప్రతిపాదనలు ఈఆర్సీకి డిస్కంలు సమర్పించాలి. దాని ఆధారంగా వినియోగదారులకు ఎన్ని మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేయాలి? దానికి ఎంత అవుతుంది ? ప్రస్తుత విద్యుత్ టారిఫ్‌తోనే వినియోగదారుల నుంచి బిల్లులు వసూలు చేస్తే వచ్చే ఆదాయం ఎంత? అవసరమైన ఆదాయం, వచ్చే ఆదాయం మధ్య ఉండే వ్యత్యాసం(ఆదాయ లోటు) ఎంత? రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే విద్యుత్ సబ్సిడీలు పోగా, మిగిలే ఆదాయలోటు భర్తీ చేసేందుకు ఏ మేరకు విద్యుత్ చార్జీలు పెంచాలి ? వంటి అంశాలు ఏఆర్ఆర్, టారిఫ్ ప్రతిపాదనల్లో ఉంటాయి. ఈ ప్రతిపాదనలపై ఈఆర్సీ రాత పూర్వకంగా అభ్యంతరాలు స్వీకరించడంతో పాటు హైదరాబాద్, వరంగల్‌లో బహిరంగ విచారణ నిర్వహించి ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతుంది. అనంతరం కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందు ఆ సంవత్సరంలో వసూలు చేయాల్సిన విద్యుత్ టారి ఫ్ ఉత్తర్వులు జారీ చేస్తుంది. వినియోగదారుల కేటగిరీల వారీగా పెరిగిన/తగ్గిన విద్యుత్ చార్జీల పట్టిక ఇందులో ఉంటుంది. గతేడాది నవంబర్ 31లోగా ఏఆర్ఆర్, టారిఫ్ ప్రతిపాదనలు సమర్పించాల్సి ఉండగా, రాష్ట్ర శాసనసభ ఎన్నికల పేరుతో అప్పట్లో డిస్కంలు డిసెంబర్ 2 వరకు గడువు పొడిగింపు పొందాయి. విద్యుత్ టారీఫ్ ఖరారుకు సంబంధించిన కీలకమైన మార్గదర్శకాలతో మల్టీ ఈయర్ టారిఫ్ రెగ్యులేషన్స్‌ను ఆ తర్వాత కాలంలో ఈఆర్సీ ప్రకటించింది. ఈ కొత్త మార్గదర్శ కాలపై అధ్యయనం జరిపి ఏఆర్ఆర్, టారిఫ్ ప్రతిపాదనలు సమర్పించడానికి జనవరి 31వరకు రెండోసారి గడువు పొడిగించింది. డిస్కంల యాజమాన్యాలు తర్జనభర్జన రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారింలోకి వచ్చిన తర్వాత ఐఏఎస్ అధికారులను సీఎండీలుగా నియమించింది. మరో రెండు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి తోడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచడానికి అనుమతించినట్టు తప్పుడు సంకేతాలు పోతాయని ప్రభుత్వవర్గాల్లో ఆందోళన నెలకొని ఉంది. డిస్కంల ఆర్థిక నష్టాలు రూ.50,275 కోట్లకు, అప్పులు రూ.59,132 కోట్లకు పెరిగినట్టు ఇటీవల రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రంలో ప్రభుత్వం వెల్లడించింది. ఈ నేపథ్యంలో విద్యుత్ చార్జీల పెంపు అనివార్యంగా మారిందని అధికారులు అంటున్నారు. మరోవైపు కొత్త ప్రభుత్వం నుంచి అనుమతి పొంది ప్రతిపాదనలు సమర్పించే విషయంలో అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. -
కీలక టారిఫ్‌లను తొలగించనున్న జియో, ఎయిర్టెల్?
ఖర్చులను తట్టుకోవడానికి టెలికం రంగ సంస్థలు టారిఫ్‌లను పెంచడానికి రెడీ అవుతున్నాయి. రిలయన్స్ జియో, ఎయిర్టెల్ ప్రీమియం కస్టమర్లకు ప్రస్తుతం అందించే తమ అన్లిమిటెడ్ 5జీ డేటా ప్లాన్లను ఆపేసే అవకాశం ఉంది. ఆదాయం పెంపునకు 2024 జూన్ నుంచి 4జీతో పోలిస్తే 5జీ సేవలకు కనీసం 5-10శాతం ఎక్కువ ఛార్జీ విధించవచ్చని టెలికం రంగ నిపుణులు చెబుతున్నారు. టెలికం కంపెనీలు 5జీ సేవల కోసం భారీగా ఇన్వెస్ట్ చేశాయి. ఈ ఖర్చును రాబట్టుకోవడానికి 2024 సెప్టెంబర్ క్వార్టర్లో రెండు టెలికాం ఆపరేటర్లు మొబైల్ టారిఫ్‌లను కనీసం 10శాతం పెంచాలని భావిస్తున్నట్టు సమాచారం. కస్టమర్లను 5జీకి అలవాటు చేయడానికి, ఇప్పటికే ఉన్న వినియోగదారులను ఆకర్షించడానికి ఈ రెండు కంపెనీలు 5జీ అన్లిమిటెడ్ డేటా ఆఫర్లతో పాటు 4జీ ధరలకే 5జీ సేవలను అందిస్తున్నాయి. జనం 5జీకి అలవాటు పడటం మొదలైనందున కంపెనీలు మానిటైజేషన్‌పై దృష్టిసారించినట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ రెండు సంస్థలు కొన్ని నెలల్లో 5జీ- కోసం ప్లాన్లను ప్రకటించవచ్చని జెఫ్రీస్ ఒక రీసెర్చ్ నోట్లో తెలిపింది. ఎయిర్టెల్, జియో 5జీ రేట్లు 4జీ కంటే 5-10శాతం ఎక్కువగా ఉండొచ్చని పేర్కొంది. ఇటువంటి ప్లాన్లకు 30-40శాతం అదనపు డేటాను జోడించి మార్కెట్ షేరును పెంచుకొని, లాభాలు పొందవచ్చని తెలిసింది. ఇదీ చదవండి: రోజూ రూ.3 కోట్లు మాయం! ఎలా మోసం చేస్తున్నారంటే.. తగిన సమయంలో ఛార్జీలు పెంచడానికి వెనకాడబోమని గతంలో ఎయిర్టెల్ మేనేజింగ్ డైరెక్టర్ గోపాల్ విట్టల్ అన్నారు. ప్రతి కస్టమర్ నుంచి వచ్చే నెలవారీ సగటు ఆదాయాన్ని (ఏఆర్పీయూ) ప్రస్తుతం ఉన్న రూ.200 నుంచి దాదాపు రూ.250కి పెంచుకుంటామని ప్రకటించారు. జియో, ఎయిర్‌టెల్‌కు కలిపి ఇప్పటికే 12.5 కోట్ల మంది 5జీ యూజర్లు ఉన్నారు. దేశం మొత్తం 5జీ యూజర్ బేస్ 2024 చివరి నాటికి 20 కోట్ల వరకు ఉంటుందని అంచనా. -
జియో గుడ్‌న్యూస్.. ఆ కస్టమర్లే టార్గెట్!
దేశంలో అతిపెద్ద టెలికం సంస్థ రిలయన్స్ జియో (Reliance Jio).. కోట్లాది మంది టెలికం కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. 5జీ ప్లాన్లు విస్తరిస్తున్నప్పటికీ టారిఫ్‌లు మాత్రం పెంచబోమని హామీ ఇచ్చింది. దేశంలోని మిగతా అన్ని టెలికమ సంస్థల కంటే తమ రీచార్చ్ ప్లాన్లు చవగ్గానే ఉంటాయని వెల్లడించింది. అసలు టార్గెట్ వారే.. టెలికం పరిశ్రమలో రిలయన్స్ జియో దూకుడును మరింత పెంచింది. రానున్న రోజుల్లో 5జీ ప్లాన్లపైన కూడా టారిఫ్‌లను పెంచబోమని ప్రకటించింది. అయితే దీని వెనుక అసలు టార్గెట్ వేరే ఉన్నట్లు తెలుస్తోంది. దేశంలో ఇప్పటికీ 2జీ నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తున్న 24 కోట్ల మందికిపైగా ఎయిర్టెల్, వొడాఫోన్ఐడియా, బీఎస్ఎన్ఎల్/ఎమ్టీఎన్ఎల్ కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని ఈ "సరసమైన టారిఫ్‌లు" ప్రకటన చేసినట్లు అర్థమవుతోంది. అంబానీల దృష్టి కూడా అదే.. జియో ప్రెసిడెంట్ మాథ్యూ ఊమెన్ మాట్లాడుతూ.. కంపెనీ టారిఫ్‌లను నాటకీయంగా పెంచాలని భావించడం లేదని, యూజర్లు ఇంటర్నెట్-హెవీ, డేటా ప్లాన్లకు మారుతున్న నేపథ్యంలో కస్టమర్లను మరింత పెంచుకోవడంపై దృష్టి సారిస్తుందని చెప్పారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ, జియో ఛైర్మన్ ఆకాష్ అంబానీల దృష్టి కూడా అదేనని ఆయన వివరించారు. ఇదీ చదవండి: 70 hours work: ఆయనైతే 90 గంటలు పనిచేసేవారు.. భర్తకు అండగా సుధామూర్తి -
వొడాఫోన్‌కు 2023 కీలక సంవత్సరం కానుంది!
న్యూఢిల్లీ: టెలికం రంగానికి 2023 చాలా కీలక సంవత్సరంగా ఉండనుందని బ్రోకరేజి సంస్థ సీఎల్ఎస్ఏ పేర్కొంది. పరిశ్రమలో లాభసాటైన మూడో సంస్థగా కొనసాగగలదా లేదా అనే కోణంలో వొడాఫోన్ ఐడియాకు (వీఐఎల్) ఇది నిర్ణయాత్మకమైన ఏడాదిగా ఉండనుందని తెలిపింది. అలాగే డేటా వినియోగం, టారిఫ్‌ల పెంపు ఆధారిత ఆదాయ వృద్ధి .. పరిశ్రమకు కీలకంగా ఉంటుందని ఒక నివేదికలో సీఎల్ఎస్ఏ వివరించింది. దీని ప్రకారం 2023లో దేశీ మొబైల్ మార్కెట్లో 5జీ సేవల విస్తరణ, టారిఫ్‌ల పెంపు, రిలయన్స్ జియో పబ్లిక్ ఇష్యూ మొదలైనవి ప్రధానాంశాలుగా ఉండబోతున్నాయి. ప్రైవేట్ నెట్‌వర్క్‌లను అనుమతించిన పక్షంలో వ్యాపార సంస్థలకు ఇచ్చే 5జీ సర్వీసుల ద్వారా టెల్కోలకు వచ్చే ఆదాయాలకు కొంత గండి పడే అవకాశం ఉంది. 2022లో 14 శాతం పెరిగిన దేశీ మొబైల్ రంగం ఆదాయం 2023లో కూడా దాదాపు అదే స్థాయిలో వృద్ధి చెందవచ్చు. టారిఫ్‌ల పెంపు, డేటా వినియోగం పెరుగుదల ఇందుకు తోడ్పడనున్నాయి. టారిఫ్‌లను పెంచే విషయంలో భారతి ఎయిర్టెల్ అన్నింటికన్నా ముందు ఉండవచ్చని.. వీఐఎల్, రిలయన్స్ జియో దాన్ని అనుసరించవచ్చని సీఎల్ఎస్ఏ నివేదిక పేర్కొంది. నిధుల సమీకరణలోను, బకాయిలకు బదులు కేంద్రానికి వాటాలు ఇచ్చే ప్రతిపాదనల అమల్లో జాప్యాల కారణంగా వీఐఎల్ ఆర్థిక సంక్షోభం అవకాశాలు పూర్తిగా సమసిపోలేదని తెలిపింది. వీఐఎల్ మార్కెట్ వాటా తగ్గుతూ జియో, ఎయిర్టెల్ మార్కెట్ పెరగడం కొనసాగవచ్చని సీఎల్ఎస్ఏ వివరించింది. మొత్తం మీద యూజర్లపై వచ్చే సగటు ఆదాయం, డేటా వినియోగం పెరగడం ద్వారా టెలికం పరిశ్రమ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 14 శాతం వృద్ధితో 2025 ఆర్థిక సంవత్సరం కల్లా రూ. 2,84,600 కోట్లకు చేరవచ్చని తెలిపింది. చదవండి: భళా బామ్మ! సాఫ్ట్‌వేర్‌ను మించిన ఆదాయం, 15 రోజులకే 7 లక్షలు! -
ఎయిర్టెల్ లాభం హైజంప్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో మొబైల్ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్ (క్యూ1)లో నికర లాభం దాదాపు ఆరు రెట్లు ఎగసి రూ. 1,607 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 283 కోట్లు ఆర్జించింది. టారిఫ్‌ల పెంపు ప్రధానంగా ప్రభావం చూపింది. మొత్తం ఆదాయం సైతం 22 శాతం వృద్ధితో రూ. 32,085 కోట్లకు చేరింది. గతేడాది క్యూ1లో రూ. 26,854 కోట్ల టర్నోవర్ ప్రకటించింది. దేశీ ఆదాయం 24 శాతం బలపడి రూ. 23,319 కోట్లకు చేరగా.. మొబైల్ సర్వీసుల నుంచి 27 శాతం అధికంగా రూ. 18,220 కోట్లు లభించింది. హోమ్ సర్వీసుల(ఫిక్స్డ్ బ్రాడ్‌బ్యాండ్) ఆదాయం 42 శాతం పురోగమించి రూ. 927 కోట్లకు చేరగా.. బిజినెస్ విభాగం నుంచి రూ. 4,366 కోట్లు సమకూరింది. ఇది 15% అధికం. ఆఫ్రికా ఆదాయం 15% ఎగసి 127 కోట్ల డాలర్ల(రూ. 10,098 కోట్లు)కు చేరింది. 4జీ స్పీడ్: ప్రస్తుత సమీక్షా కాలంలో ఎయిర్టెల్ మొత్తం కస్టమర్ల సంఖ్య 4.7 శాతం పుంజుకుని 49.69 కోట్లను తాకింది. దేశీయంగా ఈ సంఖ్య 36.24 కోట్లు. ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) పరిశ్రమలోనే మెరుగ్గా రూ. 183కు చేరింది. గత క్యూ1లో నమోదైన రూ. 146తో పోలిస్తే ఇది 25 శాతంపైగా వృద్ధి. ఫలితాల నేపథ్యంలో ఎయిర్టెల్ షేరు నామమాత్ర లాభంతో రూ. 705 వద్ద ముగిసింది. -
జియో లాభం జూమ్
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఈ ఏడాది క్యూ1లో రూ. 4,335 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2021–22) ఏప్రిల్–జూన్(రూ. 3,501 కోట్లు)తో పోలిస్తే ఇది 24 శాతం వృద్ధికాగా.. మొత్తం ఆదాయం 21 శాతంపైగా ఎగసి రూ. 21,873 కోట్లను తాకింది. టారిఫ్‌ల పెంపు మెరుగైన పనితీరుకు సహకరించింది. నికరంగా 9.7 మిలియన్ యూజర్లు జత కలిశారు. దీంతో మొత్తం యూజర్ల సంఖ్య 41.99 కోట్లకు చేరింది. ఒక్కో వినియోగదారుడిపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) త్రైమాసికంగా 5 శాతం బలపడి రూ. 175.7కు చేరింది. అత్యంత వేగవంత సర్వీసులందించగల 5జీ స్పెక్ట్రమ్‌కు వేలం ప్రారంభంకానున్న నేపథ్యంలో జియో వెల్లడించిన ఫలితాలకు ప్రాధాన్యత ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. టెలికం, డిజిటల్ బిజినెస్‌లతో కూడిన జియో ప్లాట్‌ఫామ్స్ కన్సాలిడేటెడ్ నికర లాభం 24% పుంజుకుని రూ. 4,530 కోట్లయ్యింది. ఆదాయం 24% వృద్ధితో రూ. 27,527 కోట్లకు చేరింది. -
ఎయిర్టెల్ యూజర్లకు భారీషాక్!
ఎయిర్టెల్ యూజర్లకు భారీ షాక్ తగలనుంది. ఇప్పటికే గతేడాది టారిఫ్ రేట్లను పెంచిన ఎయిర్టెల్ సంస్థ ఈ ఏడాది మరోసారి టారిఫ్ రేట్లను పెంచనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో..ఈ ఏడాది తదుపరి విడత టారిఫ్‌ల పెంపుతో తమ ఏఆర్పీయూ (యూజరుపై వచ్చే సగటు ఆదాయం) రూ.200 మార్కును దాటగలదని టెలికం సంస్థ భారతి ఎయిర్టెల్ ఇండియా, దక్షిణాసియా ఎండీ గోపాల్ విఠల్ తెలిపారు. అయిదేళ్లలో దీన్ని రూ.300కు పెంచుకునే అవకాశం ఉందని ఇన్వెస్టర్లతో కాన్ఫరెన్స్ కాల్లో ఆయన చెప్పారు. గతేడాది మార్చి త్రైమాసికంలో నమోదైన రూ.145తో పోలిస్తే ఈ మార్చి క్వార్టర్లో ఎయిర్టెల్ ఏఆర్పీయూ రూ.178కి పెరిగింది. టెలికం సంస్థలు గత రెండేళ్లుగా మొబైల్ కాల్స్, డేటాల ధరలను పెంచుతున్నాయి. ప్రైవేట్ రంగంలోని మూడు సంస్థలు గతేడాది నవంబర్–డిసెంబర్లో మొబైల్ ప్లాన్ల రేట్లను 18–25 శాతం మేర పెంచాయి. మరోవైపు, చిప్‌ల కొరతతో స్మార్ట్ఫోన్ల రేట్లు పెరిగి విక్రయాలపై ప్రభావం పడిందని విఠల్ చెప్పారు. ఇది తాత్కాలిక ధోరణే కాగలదని ఎండీ గోపాల్ విఠల్ పేర్కొన్నారు. చదవండి👉ఎయిర్టెల్, జియో యూజర్లకు బంపరాఫర్! -
బిగ్ షాక్: సామాన్యుడి నెత్తిన మరో పిడుగు!
ఉప్పు నుంచి పప్పుదాకా..పెట్రోల్ నుంచి వంట నూనె దాకా. ఇలా పెరుగుతున్న నిత్యవసర ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇవి చాలవన్నట్లు మొబైల్ రీచార్జ్ టారిఫ్‌ల రూపంలో సామాన్యుడిపై ధరల భారం పడనుంది. పలు టెలికాం కంపెనీలు రీచార్జ్ టారిఫ్‌ల రేట్లను పెంచనున్నట్లు తెలుస్తోంది. దేశంలో ప్రముఖ టెలికాం దిగ్గజాలన్నీ గతేడాది నవంబర్ నెలలో 20, 25 శాతం (కంపెనీని బట్టి) టారిఫ్ ధరల్ని పెంచాయి. ఇప్పుడు మరోసారి యూజర్లపై ధరల భారం మోపేందు సిద్ధమైనట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. టారిఫ్ ధరల్ని పెంచడం ద్వారా... ఎవరతై తక్కువ ప్లాన్ టారిఫ్ ప్లాన్లను వినియోగించడం, ఇన్ యాక్టీవ్‌గా ఉన్న యూజర్ల బేస్‌ను తగ్గించాలని చూస్తున్నాయి. అదే జరిగితే యావరేజ్ పర్ రెవెన్యూ యూజర్(ఏఆర్పీయూ) అంటే యూజర్ల నుంచి వచ్చే సగటు తలసరి ఆదాయం పెరుగుతుందని భావిస్తున్నాయి. యూజర్లు తగ్గడం లేదు గతేడాది నవంబర్ నెల నుంచి ఆయా టెలికాం సంస్థలు టారిఫ్ ధరల్ని పెంచాయి. అయినా సరే గత కొన్ని నెలలుగా యాక్టీవ్ యూజర్ల సంఖ్య పెరగడం, గతంలో పెంచిన టారిఫ్ ధరల గురించి యూజర్లు ఎలాంటి ఆందోళన వ్యక్తం చేయడం లేదనే భావనలో టెలికాం సంస్థలున్నాయంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. జియో, ఎయిర్టెల్ రిలయన్స్ జియో నెట్ వర్క్ నుంచి ఇన్ యాక్టీవ్ నెంబర్లు తగ్గారు. దీంతో యాక్టీవ్‌గా ఉన్న యూజర్ల సంఖ్య పెరిగింది. 94శాతంతో ఇది ఫిబ్రవరి చివరి నాటికి ఆల్ టైమ్ గరిష్ట స్థాయికు చేరుకుంది. మరోవైపు ఎయిర్టెల్ సైతం తన ఏఆర్‌పీయూని పెంచడంపై దృష్టి సారించింది. గత డిసెంబర్ నెల సమాయానికి ఎయిర్టెల్ ఏఆర్పీయూ రూ.163 ఉండగా..టారిఫ్ ధరల్ని పెంచడం ద్వారా ఈ ఏడాది ఏఆర్‌పీయూని రూ.200 ఏఆర్‌పీయూకి పెంచుకోవాలని చూస్తుంది. అదేవిధంగా వొడాఫోన్ ఐడియా సైతం ఏఆర్‌పీయూని పెంచేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. కానీ ఆ సంఖ్య ఎంతనే స్పష్టం చేయలేదు. మార్కెట్ నిపుణులు ఏం చెబుతున్నారు ఈ సందర్భంగా టెలికాం నిపుణులు..గతంలో పెంచిన టారిఫ్ ధరలతో కంపెనీలపై ఎలాంటి ప్రభావం చూపలేదన్నారు. అయితే మరికొన్ని నెలల్లో స్పెక్ట్రమ్ వేలం తర్వాత టెలికాం ఆపరేటర్లు లాభాల్ని మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది. అందుకే దాన్ని అధిగమించేందుకు ముందస్తుగా మనదేశ టెలికాం సంస్థలు టారిఫ్ ధరల్ని అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. అంతేకాదు 'దేశంలో 5జీ నెట్ వర్క్ విజయవంతం కావాలంటే ఏఆర్పీయూ మరింత వృద్ధి సాధించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి👉ఎగబడి మరీ కొంటున్నారు, మార్కెట్లో ఎక్కువగా అమ్ముడవుతున్న టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే! -
ఎయిర్టెల్ యూజర్లకు షాకింగ్ న్యూస్...!
గతేడాది చివర్లో దేశీయ దిగ్గజ టెలికాం సంస్థలు టారిఫ్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. సుమారు 20 శాతం మేర టారిఫ్ ధరలను దిగ్గజ టెలికాం కంపెనీలు పెంచాయి. కాగా ఈ ఏడాదిలో ఎయిర్ టెల్ టారిఫ్ ధరలను మరోమారు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కలిసొచ్చిన టారిఫ్ ధరల పెంపు..! మొబైల్ టారిఫ్ ధరల పెంపుతో భారతీ ఎయిర్‌టెల్‌కు మూడో త్రైమాసికంలో కాస్త కలిసొచ్చింది. వీటితో పాటు కంపెనీలో గూగుల్ పెట్టుబడులు ఉపశమనం కల్గించాయని కంపెనీ పేర్కొంది. ఎయిర్టెల్ డిసెంబర్ త్రైమాసికంలో నికర లాభం రూ. 854 కోట్ల నుంచి రూ. 830 కోట్లకు 3 శాతం పడిపోయిందని నివేదించింది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం సంవత్సరానికి 13 శాతం పెరిగింది. ఈ త్రైమాసికంలో ఏఆర్పీయూ రూ.163కు మెరుగుపడింది. అయితే మరో మూడు లేదా నాలుగు నెలల్లో కాకపోయినా, ప్రస్తుత క్యాలెండర్ సంవత్సరంలోనే మరో మారు టారిఫ్ పెంపు ఉండవచ్చునని ఎయిర్టెల్ టాప్ మేనేజ్మెంట్ అభిప్రాయపడ్డారు. 2022లో నెలకు ARPU (ఒక వినియోగదారుడి సగటు రాబడి)ని రూ. 200 తీసుకోవాలని కంపెనీ భావిస్తోందని మేనేజ్మెంట్ పేర్కొంది. దీంతో టారిఫ్ పెంపు మరోమారు ఉండే అవకాశం ఉన్నట్లు కన్పిస్తోంది. బోర్డు ఆమోదం..! డెట్ సెక్యూరిటీలు, బాండ్లు మొదలైన వాటి జారీ ద్వారా రుణ సాధనాల్లో రూ. 7,500 కోట్ల వరకు సేకరించేందుకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. కంపెనీ పోస్ట్ ఎర్నింగ్స్ కాల్ సందర్భంగా, ఎయిర్టెల్ టారిఫ్ పెంపు ప్రారంభ సంకేతాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయని , కొత్త ఉత్పత్తులను వేగవంతం చేయడంపై కంపెనీ తన దృష్టిని కొనసాగిస్తుందని బోర్డు మీటింగ్‌లో తెలిపింది. చదవండి: కిలోమీటర్‌కు కేవలం 14 పైసల ఖర్చు..! తక్కువ ధరలో మరో ఎలక్ట్రిక్ బైక్..! -
జియో యూజర్లకు భారీ షాక్..!
ప్రముఖ టెలికాం దిగ్గజ సంస్థలు ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా టారిఫ్ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వారి బాటలోనే టారిఫ్ రేట్లను పెంచుతూ జియో నిర్ణయం తీసుకుంది. సుమారు 20 శాతం మేర ప్లాన్ ధరలను జియో పెంచింది. పెరిగిన టారిఫ్ ప్లాన్ల రేట్లు డిసెంబర్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. జియోఫోన్ ప్లాన్ రూ. 75 నుంచి రూ. 91కి పెరిగింది. ఆయా ప్లాన్లను బట్టి సుమారు రూ. 24 నుంచి రూ. 480 మేర ధరలు పెరిగాయి. టెలికాం సర్వీసులను మరింత బలోపేతం చేయాలనే నిబద్ధతకు అనుగుణంగా కొత్త అపరిమిత ప్లాన్ రేట్లను పెంచుతున్నట్లు జియో ఒక ప్రకటనలో పేర్కొంది. టెలికాం పరిశ్రమలో ఈ కొత్త టారిఫ్ ప్లాన్స్ అత్యుత్తమ ప్లాన్స్‌గా నిలుస్తాయని జియో వెల్లడించింది. జియో కొత్త ప్లాన్స్ ఇలా ఉన్నాయి..! -
మొబైల్ రీచార్జ్ టారిఫ్‌ల పెంపు తప్పనిసరి కానుందా..!
న్యూఢిల్లీ: టెలికం రంగం కోలుకోవాలంటే టారిఫ్‌ల పెంపు, కనీస ధరల విధానం అమల్లోకి రావడం కీలకమని వొడాఫోన్ ఐడియా (వీఐఎల్) సీఈవో రవీందర్ టక్కర్ తెలిపారు. కంపెనీకి అవసరమైన తోడ్పాటునిచ్చేందుకు వొడాఫోన్ గ్రూప్, ఆదిత్య బిర్లా గ్రూప్ కట్టుబడి ఉన్నాయని ఆయన వివరించారు. పెట్టుబడులు పెట్టగలిగే అవకాశాలు ఉన్న ఇన్వెస్టర్లతో చర్చలు కొనసాగిస్తుంటామని తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా టక్కర్ పేర్కొన్నారు. ఇటీవల ఎంట్రీ స్థాయి కార్పొరేట్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లు, ఇతర పథకాల టారిఫ్‌లను పెంచడం సరైన దిశలో తీసుకున్న నిర్ణయమని ఆయన వివరించారు. దీని వల్ల సగటున ప్రతి యూజరుపై ఆదాయం (ఏఆర్పీయూ) మెరుగుపడగలదన్నారు. అయితే టెలికం రంగం వ్యవస్థాగతంగా కోలుకోవాలంటే ఇది సరిపోదని టక్కర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మొత్తం పరిశ్రమ మెరుగుపడటానికి కీలకమైన కనీస ధర అంశంపై నియంత్రణ సంస్థతో చర్చలు జరపడం కొనసాగిస్తామని ఆయన వివరించారు. (చదవండి: భారత్‌లోకి ‘ప్లే బాయ్’ వచ్చేస్తున్నాడు..!) ఉన్నతమైన సేవలకు కట్టుబడి ఉన్నాం అత్యుత్తమ సేవలను అందించాలన్న తమ అంకిత భావం కొనసాగుతుందని టక్కర్ వినియోగదారులకు భరోసానిచ్చారు. వీఐగా పేరు మార్చుకుని ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా టక్కర్ మాట్లాడారు. కంపెనీకి మద్దతుగా నిలిచినవారికి ధన్యవాదములు తెలిపారు. నెట్వర్క్ అనుసంధానత పెంపుపై గడిచిన ఏడాది కాలంలో దృష్టిసారించినట్టు చెప్పారు. ‘‘డిజిటల్ భారత్ కోసం మెరుగైన రేపటిరోజు, అత్యుత్తమ టెక్నాలజీ, సేవలు, పరిష్కారాలు అందిస్తామంటూ వీఐ హామీ ఇచ్చింది. ఈ హామీ మేరకు సేవలు అందించేందుకు ఇకముందూ మా కృషి కొనసాగుతుంది’’ అని టక్కర్ తెలిపారు. వొడాఫోన్ ఐడియా నిధుల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. సుమారు రూ.1.6 లక్షల కోట్లను చెల్లించాల్సిన (ప్రభుత్వానికి, బ్యాంకులకు) పరిస్థితుల్లో ప్రభు త్వం నుంచి సాయం లభించకపోతే వొడా ఫోన్ ఐడియా కోలుకోవడం కష్టమంటూ సంస్థ చైర్మన్ హోదాలో కుమార మంగళం బిర్లా ఇటీవలే కేంద్రానికి ఓ లేఖ రాయడం గమనార్హం. ఈ క్రమంలో వినియోగదారులకు వొడాఫోన్ ఐడియా సీఈవో భరోసానివ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. (చదవండి:ఈ మొబైల్ రీఛార్జ్‌తో ఏడాదిపాటు నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్, డిస్నీ హట్‌స్టార్ ఉచితం..!) -
సామాన్యుడి నెత్తిన మరో పిడుగు...!
దేశ వ్యాప్తంగా ఇంధన ధరలు, నిత్యావసర వస్తువుల ధరలతో సతమతమవుతున్న సామాన్యుడి నెత్తిమీద మరో పిడుగు పడనుంది. ఈ సారి మొబైల్ రీచార్జ్ టారిఫ్‌ల రూపంలో రానుంది. పలు టెలికాం కంపెనీలు రీచార్జ్ టారిఫ్‌ల రేట్లను పెంచనున్నట్లు తెలుస్తోంది. టారిఫ్‌ల పెంపులతో సామాన్యుడికి మరింత భారం కానుంది. తాజాగా భారతి ఎయిర్టెల్ తన యూజర్ల కోసం బేసిక్ స్మార్ట్ ప్రీ పెయిడ్ ప్లాన్ ధరను రూ. 49 నుంచి ఏకంగా రూ. 79 పెంచేసింది. ఈ బేసిక్ ప్లాన్‌పై సుమారు 55 మిలియన్ల యూజర్లు ఆధారపడి ఉన్నారు. ఎయిర్టెల్ ఈ ప్లాన్‌లో భాగంగా అవుట్ గోయింగ్ కాల్స్‌కు సంబంధించి నాలుగు రెట్లు అధికంగా టాక్‌టైంను అందించింది. దాంతోపాటుగా డబుల్ మొబైల్ డేటాను చేసింది. తాజాగా ఎయిర్టెల్ బాటలో వోడాఫోన్-ఐడియా కూడా టారిఫ్‌లను పెంచే దారిలో పయనిస్తున్నట్లు తెలుస్తోంది. వోడాఫోన్-ఐడియా ఇప్పటికే రూ. 49 ప్లాన్‌ను విరమించుకుంది. ఈ ప్లాన్‌కు బదులుగా కొత్తగా 28 రోజుల వ్యాలిడిటీతో రూ. 79 ప్లాన్‌ను తీసుకువచ్చింది. ఎయిర్టెల్, వోడాఫోన్-ఐడియా బాటలోనే పలు టెలికాం కంపెనీలు ప్రయాణించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే 6 నెలల్లో రీచార్జ్ టారిఫ్ ప్లాన్ల ధరలను 30 శాతం మేర పెంచాలని టెలికాం కంపెనీలు భావిస్తున్నాయి. టారిఫ్‌లను పెంచడంతో యూజర్ల నుంచి వచ్చే సగటు తలసరి ఆదాయాన్ని (ఏఆర్పీయూ) పెంచుకోవాలని టెలికాం కంపెనీలు యోచిస్తున్నాయి. గోల్డ్‌మన్ సాచ్ ప్రకారం.. టెలికం కంపెనీలు 2021 ఆర్థిక సంవత్సరంలో ప్రీ పెయిడ్ కస్టమర్ల నుంచి 50-80 శాతం వరకు రెవెన్యూను జనరేట్ చేసుకున్నాయని పేర్కొంది. టెలికాం కంపెనీల్లో ఫ్రీ క్యాష్ ఫ్లో (ఎఫ్‌సీఎఫ్) మెరుగుపడాలంటే..కచ్చితంగా ప్రీపెయిడ్ ప్లాన్ల టారిఫ్‌ల పెంపు అనివార్యమని తెలిపింది. కాగా జియో నుంచి టారిఫ్‌ల పెంపు తక్కువగా ఉండే అవకాశం ఉందని గోల్డ్‌మన్ సాచ్ పేర్కొంది. -
ఎవరెడీ- వొడాఫోన్ ఐడియా జోరు
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో బ్యాటరీల కంపెనీ ఎవరెడీ ఇండస్ట్రీస్ ఇండియా కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. మరోపక్క ఈ ఏడాది చివరికల్లా టారిఫ్‌లను పెంచనున్నట్లు వెలువడిన వార్తలతో మొబైల్ టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. చదవండి: (వ్యాక్సిన్ ఆశలు- యూఎస్ కొత్త రికార్డ్స్) ఎవరెడీ ఇండస్ట్రీస్ ఇండియా ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై- సెప్టెంబర్)లో ఎవరెడీ ఇండస్ట్రీస్ నికర లాభం మూడు రెట్లు ఎగసి రూ. 57 కోట్లను అధిగమించింది. మొత్తం ఆదాయం సైతం 7 శాతం పెరిగి రూ. 373 కోట్లకు చేరింది. ఈ కాలంలో మొత్తం వ్యయాలు 7 శాతం క్షీణించి రూ. 318 కోట్లను తాకాయి. స్టాండెలోన్ ప్రాతిపదికన నిర్వహణ లాభ మార్జిన్లు 9 శాతం నుంచి 20 శాతానికి ఎగశాయి. ఫలితాల నేపథ్యంలో ఎవరెడీ ఇండస్ట్రీస్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 10 శాతం దూసుకెళ్లి రూ. 172ను తాకింది. ఇది 52 వారాల గరిష్టంకావడం విశేషం! వొడాఫోన్ ఐడియా నష్టాలను తగ్గించుకోవడం, ఆర్థికంగా పటిష్టంకావడంపై దృష్టిపెట్టిన వొడాఫోన్ ఐడియా టారిఫ్‌లను 15-20 శాతంమేర పెంచనున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. డిసెంబర్లో పెంపును చేపట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. టెలికం నియంత్రణ సంస్థ ఫ్లోర్ ధరలను నిర్ణయించనుందని, అయితే వొడాఫోన్ ఐడియా వచ్చే నెల మొదట్లోనే 25 శాతం వరకూ టారిఫ్‌లను పెంచే ప్రణాళికలు వేసినట్లు సంబంధితవర్గాలు చెబుతున్నాయి. 2016లో రిలయన్స్ జియో రంగ ప్రవేశం చేశాక టెలికం దిగ్గజాలు ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా 2019లో తొలిసారి రేట్లను పెంచినట్లు తెలియజేశాయి. ఈ నేపథ్యంలో తొలుత ఎన్ఎస్ఈలో వొడాఫోన్ ఐడియా షేరు 10 శాతం లాభపడి రూ. 10ను తాకింది. ప్రస్తుతం 6 శాతం ఎగసి రూ. 9.65 వద్ద ట్రేడవుతోంది. -
ఇప్పటికీ భారత్‌లోనే ఇంటర్నెట్ చౌక..
న్యూఢిల్లీ: ప్రపంచం మొత్తం మీద భారత్‌లోనే మొబైల్ డేటా రేట్లు అత్యంత తక్కువని కేంద్ర టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. బ్రిటన్‌కు చెందిన కేబుల్.కో.యూకే అధ్యయనంలో ఇది వెల్లడైందని మైక్రోబ్లాగింగ్ సైటు ట్విట్టర్లో ఆయన పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన చార్టును పోస్ట్ చేశారు. దీని ప్రకారం.. ఒక గిగాబైట్ (జీబీ) డేటా సగటు ధర భారత్‌లో 0.26 డాలర్లుగా ఉండగా.. బ్రిటన్‌లో 6.66 డాలర్లు, అమెరికాలో 12.37 డాలర్లుగా ఉంది. ప్రపంచ సగటు 8.53 డాలర్లుగా ఉంది. దేశీ టెల్కోలు భారతి ఎయిర్టెల్, వొడాఫోన్–ఐడియా, రిలయన్స్ జియో .. ఏకంగా 50%దాకా టారిఫ్‌లను పెంచు తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో మంత్రి స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది. ‘ఈ మొబైల్ చార్జీల సమస్యంతా.. కుంభకోణాలతో అప్రతిష్ట పాలైన యూపీఏ ప్రభుత్వ ఘనతే. దాన్ని మేం సరిచేశాం. అధిక మొబైల్ ఇంటర్నెట్ చార్జీలు.. యూపీఏ ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చాయి. ట్రాయ్ గణాంకాల ప్రకారం 2014లో ఒక్క జీబీకి చార్జీ రూ. 268.97గా ఉండేది. ప్రస్తుతం ఇది రూ. 11.78కి తగ్గింది. ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్/ఎంటీఎన్ఎల్ను కూడా ప్రొఫెషనల్‌గా, లాభసాటిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది’ అని మంత్రి పేర్కొన్నారు. -
టెల్కోల వీరబాదుడు..!
న్యూఢిల్లీ: చౌక మొబైల్ కాల్, డేటా సేవలకిక కాలం చెల్లింది. సుమారు నాలుగేళ్ల తర్వాత.. టెలికం సంస్థలు పోటాపోటీగా రేట్ల పెంపుతో ప్రీ–పెయిడ్ వినియోగదారులను బాదేందుకు సిద్ధమయ్యాయి. వొడాఫోన్–ఐడియా, ఎయిర్టెల్, రిలయన్స్ జియో సంస్థలు టారిఫ్‌లను పెంచుతున్నట్లు ఆదివారం ప్రకటించాయి. వొడా–ఐడియా, ఎయిర్టెల్ టారిఫ్‌ల పెంపు ఏకంగా 50 దాకాను, జియో టారిఫ్‌ల పెంపు 40 శాతం దాకాను ఉండనుంది. వొడా–ఐడియా, ఎయిర్టెల్ కొత్త రేట్లు డిసెంబర్ 3 నుంచి, జియో రేట్లు డిసెంబర్ 6 నుంచి అమల్లోకి రానున్నాయి. తాజా పరిణామంతో.. భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా కస్టమర్లు నెలరోజుల పాటు కనెక్షన్ కలిగి ఉండాలంటే కనీసం రూ. 49 కట్టాల్సి రానున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. ‘టీ ఖర్చుకన్నా తక్కువే’..! వొడాఫోన్–ఐడియా ... 28 రోజులు, 84 రోజులు, 365 రోజుల వ్యాలిడిటీ గల అన్లిమిటెడ్ ప్లాన్స్‌ను సవరిస్తూ కొత్త ప్లాన్స్ ప్రవేశపెట్టింది. మార్కెట్ స్పందనను బట్టి వీటిల్లో మార్పులు, చేర్పులు చేయడమో లేదా మరిన్ని కొత్త ప్లాన్స్ ప్రవేశపెట్టడమో జరుగుతుందని పేర్కొన్నాయి. మరోవైపు, ‘టారిఫ్ పెంపు రోజుకు కేవలం 50 పైసల నుంచి రూ. 2.85 దాకానే ఉండనుంది. మెరుగైన డేటా, కాలింగ్ ప్రయోజనాలు ఉంటాయి‘ అని ఎయిర్టెల్ ఒక ప్రకటనలో పేర్కొంది. బడ్డీ కొట్టులో టీ తాగేందుకు ఓ వారం ఖర్చు చేసేంత కూడా టారిఫ్‌ల పెంపు ఉండదని కంపెనీ వర్గాలు వ్యాఖ్యానించాయి. ఇక, జియో విషయానికొస్తే.. ‘అన్లిమిటెడ్ వాయిస్, డేటాతో సరికొత్త ఆల్–ఇన్–వన్ ప్లాన్స్‌ను ప్రవేశపెట్టబోతున్నాం. ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్ విషయంలో సముచిత వినియోగ విధానం ఉంటుంది. 300 శాతం దాకా అదనపు ప్రయోజనాలు అందించే కొత్త ప్లాన్లు డిసెంబర్ 6 నుంచి అమల్లోకి వస్తాయి‘ అని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. టెలికం టారిఫ్‌లను సవరించే విషయంలో ప్రభుత్వంతో సంప్రదింపులు కొనసాగిస్తామని పేర్కొంది. అపరిమితంలో.. పరిమితులు... అన్లిమిటెడ్ ప్లాన్స్ అయినప్పటికీ.. ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్ విషయంలో వొడా–ఐడియా, ఎయిర్టెల్ ప్లాన్స్‌లో పరిమితులు ఉన్నాయి. 28 రోజుల వ్యాలిడిటీ ప్లాన్స్‌లో 1,000 నిమిషాలు, 84 రోజుల పథకాల్లో 3,000 నిమిషాలు, 365 వ్యాలిడిటీ ప్లాన్‌లో 12,000 నిమిషాల పరిమితి ఉంటుంది. దీన్ని దాటితే ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌పై నిమిషానికి 6 పైసల చార్జీ ఉంటుంది. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్)ను లెక్కించే విషయంలో కేంద్రానికి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో టెల్కోలు కేంద్రానికి లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల బకాయిల కింద ఏకంగా రూ. 1.4 లక్షల కోట్లు కట్టాల్సి రానుంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో వీటికి కేటాయింపులు జరపాల్సి రావడంతో వొడాఫోన్ ఐడియా ఏకంగా రూ. 50,921 కోట్లు, ఎయిర్టెల్ రూ. 23,045 కోట్ల మేర నష్టాలు ప్రకటించాయి. వీటన్నింటిని భర్తీ చేసుకోవడం కోసం, నెట్‌వర్క్‌పై మరింతగా ఇన్వెస్ట్ చేయడం కోసం టెలికం సంస్థలు తాజాగా చార్జీల పెంపు బాట పట్టాయి. -
వొడాఫోన్ ఐడియా బాటలో జియో..
సాక్షి, న్యూఢిల్లీ : మొబైల్ ఛార్జీలను మోతెక్కిస్తున్న టెలికాం కంపెనీలు వినియోగదారుల్లో గుబులు పుట్టిస్తున్నాయి. కాల్, డేటా చార్జీలను డిసెంబర్ మూడు నుంచి 42 శాతం పెంచుతున్నట్టు వొడాఫోన్ ఐడియా ఇప్పటికే ప్రకటించగా రిలయన్స్ జియో 40 శాతం టారిఫ్ పెంపుతో న్యూ ఆల్ ఇన్ వన్ ప్లాన్లను ప్రకటించింది. డిసెంబర్ 6 నుంచి నూతన ప్లాన్లు అమల్లోకి వస్తాయని జియో పేర్కొంది. మొబైల్ చార్జీలను 40 శాతం పెంచినా వినియోగదారులకు 300 శాతం ప్రయోజనాలను వర్తింపచేస్తామని తెలిపింది. డేటా వినియోగ వృద్ధి, డిజిటల్ వ్యాప్తిపై ఎలాంటి ప్రతికూల ప్రభావం లేకుండా టారిఫ్‌ల పెంపును చేపట్టామని వెల్లడించింది. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించే ఉద్దేశ్యంతోనే నూతన ప్లాన్లను ఆఫర్ చేస్తున్నామని తెలిపింది. టెలికాం టారిఫ్‌ల సవరణకు చేపట్టిన సంప్రదింపుల ప్రక్రియలో ప్రభుత్వంతో జియో కలిసి పనిచేస్తుందని పేర్కొంది. కాగా, మొబైల్ కాల్స్, డేటా చార్జీలను మంగళవారం నుంచి పెంచనున్నట్టు టెలికాం ఆపరేటర్ వొడాఫోన్-ఐడియా ప్రకటించింది. ప్రీపెయిడ్ విభాగంలో రెండు రోజులు, 28, 84, 368 రోజుల వాలిడిటీతో కూడిన ప్లాన్లపై చార్జీలను పెంచనున్నట్టు కంపెనీ వెల్లడించింది. గత ప్లాన్లతో పోలిస్తే తాజా ప్లాన్లు దాదాపు 42 శాతం మేరకు భారమవుతాయని భావిస్తున్నారు. -
భారత టారిఫ్‌లను ఆమోదించేది లేదు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి భారత్ విధిస్తున్న టారిఫ్‌లపై మండిపడ్డారు. భారత్ ఎంతో కాలంగా అమెరికన్ ఉత్పత్తులపై టారిఫ్‌లను మోపుతోందని, వీటిని ఇంకెంత కాలం ఆమోదించేది లేదంటూ మంగళవారం ట్వీట్ చేశారు. గత నెల 28న జీ–20 దేశాల సమావేశం సందర్భంగా ట్రంప్, మన దేశ ప్రధానితో సమావేశం అవడం, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య వివాదాస్పద అంశాలపై సత్వర చర్చకు అంగీకారానికి వచ్చిన విషయం తెలిసిందే. ఇది జరిగిన కొన్ని రోజులకే ట్రంప్ భారత్ పట్ల తన కఠిన వైఖరిని మరోసారి తన మాటల ద్వారా ప్రదర్శించుకున్నారు. అమెరికా వాణిజ్య మంత్రి విల్బర్రాస్, ఇంధన మంత్రి రిక్‌పెర్రీ ఈ వారం చివర్లో వాషింగ్టన్లో భారత్‌కు సంబంధించి జరిగే ఓ సదస్సును ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ సందర్భంలో ట్రంప్ వ్యూహాత్మకంగా భారత్ టారిఫ్‌లపై మరోసారి మాట్లాడడం గమనార్హం. గత నెలలో అమెరికాకు చెందిన బాదం, యాపిల్ సహా 28 ఉత్పత్తులపై భారత్ టారిఫ్‌లు పెంచుతూ నిర్ణయాన్ని అమలు చేసింది. గతేడాది మన దేశ అల్యూమినియం, స్టీల్ దిగుమతులపై అమెరికా విధించిన దిగుమతి సుంకాలకు ప్రతీకారంగానే ఈ నిర్ణయాన్ని ఆలస్యంగా అమలు చేసింది. ఇది తమకు ఆమోదం కాదని, భారత్ అమెరికాకు వ్యతిరేకంగా ఎక్కువ టారిఫ్‌లను అమలు చేస్తోందని, ఈ విషయమై ప్రధాని మోదీతో మాట్లాడాలనుకుంటున్నట్టు జీ20 దేశాల సమావేశానికి ముందు ట్రంప్ ట్వీట్ చేయడం తెలిసిందే. హార్లే డేవిడ్సన్ బైకులపై భారత్ భారీ టారిఫ్‌లు విధిస్తోందని అంతకుముందు పలు సందర్భాల్లోనూ ట్రంప్ అభ్యంతరం వ్యక్తం చేశారు. -
భారీ సుంకాలను ఒప్పుకోం
వాషింగ్టన్/ఒసాకా: అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై మరోసారి తన అక్కసును వెళ్లగక్కారు. అమెరికా ఉత్పత్తులపై ఇండియా భారీగా దిగుమతి సుంకాలను విధిస్తోందని మండిపడ్డారు. ఇటీవల అమెరికా నుంచి దిగుమతయ్యే 28 ఉత్పత్తులపై భారత్ సుంకాలు వడ్డించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఇలాంటి చర్యలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కావని తేల్చి చెప్పారు. నేటి నుంచి రెండ్రోజుల పాటు సాగే జీ20 సదస్సులో పాల్గొనేందుకు జపాన్‌లోని ఒసాకాకు ట్రంప్ చేరుకున్నారు. ఈ సదస్సు సందర్భంగా ప్రధాని మోదీతో ట్రంప్ ప్రత్యేకంగా భేటీ కావాల్సిఉంది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ స్పందిస్తూ..‘భారత ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకునేందుకు నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. నిజానికి చాలా ఏళ్ల నుంచి భారత్ అమెరికా ఉత్పత్తులపై చాలా భారీస్థాయిలో దిగుమతి సుంకాలను విధిస్తోంది. తాజాగా దాన్ని ఇంకా పెంచింది. దీన్ని ఎంతమాత్రం అంగీకరించబోం. భారత్ ఈ సుంకాలను వెంటనే తగ్గించాలి’ అని డిమాండ్ చేశారు. ఇటీవల భారత్‌లో పర్యటించిన అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఇరుదేశాల మధ్య సుంకాల విషయంలో ఏకాభిప్రాయం సాధ్యమేనని చెప్పిన మరుసటిరోజే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ట్రంప్ ఆరోపణలు సరికాదు: భారత్ భారత్ భారీగా పన్నులు విధిస్తోందన్న ట్రంప్ ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. అభివృద్ధి చెందుతున్న ఇతర దేశాలతో పోల్చుకుంటే భారత్ విధిస్తున్న సుంకాలు అంత ఎక్కువగా లేవని స్పష్టం చేసింది. ‘అమెరికా ఉత్పత్తులపై మేం విధిస్తున్న సుంకాల కంటే కొన్ని భారతీయ ఉత్పత్తులపై అగ్రరాజ్యం విధిస్తున్న సుంకాలు భారీగా ఉంటున్నాయి’ అని పేర్కొంది. అసలు గొడవేంటి? అమెరికాలోని హార్లే–డేవిడ్సన్ సంస్థకు చెందిన బైక్‌లపై భారత్ 100 శాతం పన్ను విధించడాన్ని గతంలో ట్రంప్ బాహాటంగానే తప్పుపట్టారు. ఈ నేపథ్యంలో హార్లేడేవిడ్సన్ బైక్‌లపై విధిస్తున్న దిగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం 50 శాతానికి తగ్గించింది. అయినా శాంతించని ట్రంప్.. భారత్‌ను ‘సుంకాల రారాజు’గా అభివర్ణించారు. గతేడాది మార్చిలో భారత్ నుంచి దిగుమతి అయ్యే స్టీల్‌పై 25 శాతం, అల్యూమినియంపై 10 శాతం టారిఫ్ విధించారు. అక్కడితో ఆగకుండా ఇండియాకు గతంలో ఇచ్చిన ప్రాధాన్యత వాణిజ్య హోదా(జీఎస్పీ)ని రద్దుచేశారు. దీంతో ఈ చర్యను తీవ్రంగా పరిగణించిన భారత్.. అమెరికా నుంచి దిగుమతయ్యే బాదం, పప్పుధాన్యాలు, వాల్నట్ సహా 28 ఉత్పత్తు్తలపై సుంకాలను గణనీయంగా పెంచింది. తాజాగా ఈ వ్యవహారంపైనే ట్రంప్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. -
వాణిజ్య యుద్ధ భయాలు
అమెరికా– చైనా మధ్య వాణిజ్య యుద్ధం జరుగుతుండగానే అమెరికా– భారత్ మధ్య సుంకాల పోరుకు తెరలేవడంతో సోమవారం మన స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయింది. భారత్‌కు వాణిజ్యపరంగా ఉన్న కొన్ని ప్రాధాన్యతలను అమెరికా తొలగించడం, దీనికి ప్రతిగా అమెరికా నుంచి దిగుమతయ్యే వస్తువులపై భారత్ సుంకాలు విధించడంతో అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 39,000 పాయింట్లు, నిఫ్టీ 11,700 పాయింట్ల దిగువకు పడిపోయాయి. సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా నాలుగో రోజూ నష్టాల్లోనే ముగిశాయి. నైరుతి రుతు పవనాల విస్తరణపై ఆందోళన నెలకొనడం, పశ్చిమాసియా ప్రాంతంలో భౌగోళికంగా ఉద్రిక్తతలు నెలకొనడం, ఫలితంగా ముడి చమురు ధరలు భగ్గుమంటుండటం, డాలర్‌తో రూపాయి మారకం విలువ 10 పైసలు క్షీణించడం, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు మందగించడం... ఈ అంశాలన్నీ ప్రతికూల ప్రభావం చూపించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 491 పాయింట్లు పతనమై 38,961 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 151 పాయింట్లు పతనమై 11,672 పాయింట్ల వద్ద ముగిశాయి. ఈ రెండు సూచీలు నెల కనిష్ట స్థాయికి పడిపోయాయి. లోహ షేర్లు విలవిలలాడాయి. ఇంధన షేర్లు కూడా బాగా నష్టపోయాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 541 పాయింట్లు, నిఫ్టీ 165 పాయింట్ల మేర పతనమయ్యాయి. గత నాలుగు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 796 పాయింట్లు క్షీణించింది. మంగళవారం నుంచి మొదలై రెండు రోజుల పాటు జరిగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక సమావేశం నేపథ్యంలో అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లలో అప్రమత్తత నెలకొంది. ఇక మన దగ్గర సుంకాల పోరు కూడా జత కావడం ప్రతికూల ప్రభావం చూపించింది. అంతర్జాతీయ వాణిజ్య యుద్ధం మరింత ముదరడం, పశ్చిమాసియాలో అకస్మాత్తుగా రేగిన ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధరలు భగ్గుమనడంతో మన మార్కెట్ భారీగా నష్టపోయిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ విశ్లేషకుడు వినోద్ నాయర్ వ్యాఖ్యానించారు. ఈ వారంలో వెలువడే అమెరికా ఫెడరల్ రిజర్వ్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఆఫ్ జపాన్ల నిర్ణయాల కోసం ఇన్వెస్టర్లు ఎదురు చూస్తున్నారని, ఈ నిర్ణయాల ప్రభావం మార్కెట్‌పై ఉండనున్నదని విశ్లేషకులంటున్నారు. ఆసియా, యూరప్ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. మరిన్ని విశేషాలు... ♦ టాటా స్టీల్ 5 శాతం పతనమై రూ.473 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ♦ సెన్సెక్స్‌లో 3 షేర్లు– యస్ బ్యాంక్, కోల్ ఇండియా, ఇన్ఫీ మాత్రమే లాభపడ్డాయి. మిగిలిన 28 షేర్లు నష్టపోయాయి. ♦ ఇక్రా రేటింగ్ సవరణ కారణంగా ఆస్టర్ డీఎమ్ హెల్త్‌కేర్ షేర్ 5 శాతం లాభపడింది. ♦ ఆర్‌నామ్‌లో వాటాను విక్రయించినప్పటికీ, రిలయన్స్ క్యాపిటల్ షేర్ 6.7% నష్టపోయి రూ.71.4 వద్దకు చేరింది. ♦ శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ కంపెనీలో పూర్తి వాటాను పిరమల్ ఎంటర్ప్రైజెస్ విక్రయించింది. ఈ నేపథ్యంలో శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ షేర్ 6 శాతం క్షీణించి రూ.1,018 వద్ద, పిరమల్ ఎంటర్ప్రైజెస్ 3 శాతం నష్టంతో రూ. 2,004 వద్ద ముగిశాయి. ♦ రిలయన్స్ ఇన్ఫ్రా కంపెనీకి సంబంధించిన వివిధ అంశాలపై ఆడిటర్లు సందేహాలు లెవనెత్తడంతో రిలయన్స్ ఇన్ఫ్రా షేర్ ఇంట్రాడేలో 28 ఏళ్ల కనిష్ట స్థాయి, రూ.52.70కి పడిపోయింది. చివరకు 4.7 శాతం నష్టంతో రూ.56.5 వద్ద ముగిసింది. ♦ జెట్ ఎయిర్వేస్ వరుసగా పదకొండో రోజూ పతనమైంది. ఇంట్రాడేలో 16 శాతం క్షీణించి జీవిత కాల కనిష్ట స్థాయి, రూ.66ను తాకిన ఈ షేర్ చివరకు 16.7 శాతం నష్టంతో రూ. 68.3 వద్ద ముగిసింది. ఒక్క జూన్ నెలలోనే ఈ షేర్ 53 శాతం నష్టపోయింది. ♦ దాదాపు వందకు పైగా షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. బాష్, డీహెచ్ఎఫ్ఎల్, సైయంట్, భారత్ ఫోర్జ్, బేయర్ క్రాప్‌సైన్స్, జేకే టైర్, రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ ఇన్ఫ్రా ఈ జాబితాలో ఉన్నాయి. రూ.2 లక్షల కోట్ల సంపద ఆవిరి స్టాక్ మార్కెట్ భారీ పతనం కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.2 లక్షల కోట్లు హరించుకుపోయింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,00,259 కోట్లు తగ్గి రూ.1,50,09,329 కోట్లకు తగ్గిపోయింది. పతనానికి ప్రధాన కారణాలివీ... ♦ అమెరికాపై భారత్ సుంకాలు.. భారత్‌కు వాణిజ్యపరంగా ఉన్న కొన్ని ప్రాధాన్యతలను అమెరికా తొలగించింది. అంతే కాకుండా భారత ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు విధించింది. దీనికి ప్రతిగా భారత్ కూడా అమెరికా నుంచి దిగుమతయ్యే బాదం, ధాన్యాలు, వాల్నట్ తదితర 28 రకాల వస్తువులపై సుంకాలు విధించింది. ఇప్పటికే చైనాతో సుంకాల పోరు సాగుతుండగా, తాజాగా భారత్‌తో కూడా వాణిజ్య యుద్ధం ఆరంభం కావడం, ఇది అంతర్జాతీయంగా ఇంకెంత దూరం పోతుందోనన్న ఆందోళన నెలకొనడంతో అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. భారత్ విధించిన సుంకాల కారణంగా మనకు 21 కోట్ల డాలర్ల అదనపు రాబడి రావచ్చన్న అంచనాలున్నప్పటికీ, ఇది ఇంతటితో ఆగదని, ఇరు దేశాల మధ్య మరింత సుంకాల పోరుకు, ఇతర ద్వైపాక్షిక సంబంధాలపై కూడా ప్రభావం ఉంటుందని ఆందోళన నెలకొంది. ♦ రుతుపవనాల విస్తరణపై ఆందోళన వ్యవసాయం ప్రధానమైన మన దేశానికి నైరుతి రుతు పవనాలు కీలకం. ఈ నైరుతి రుతుపవనాలు ఇప్పటిదాకా జాడ లేకపోవడం, అరకొర వర్షాలే పడటం, ఇప్పటికే లోటు వర్షపాతం నమోదైందన్న భయాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ♦ పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తత.. ఒమన్ సింధుశాఖలో రెండు ఆయిల్ ట్యాంకర్లపై దాడి నేపథ్యంలో పశ్చిమాసియా ప్రాంతంలో భౌగోళిక, రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు తీవ్రమవుతున్నాయి. చమురు ఉత్పత్తికి కీలకమైన ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు నెలకొంటే, ముడి చమురు ధరలు భగ్గుమనే అవకాశాలు అధికంగా ఉంటాయి. ముడి చమురు ధరలు పెరిగితే మన ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావమే పడుతుంది. దీంతో స్టాక్ మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. ♦ రూపాయి పతనం... భారత్–అమెరికాల మధ్య సుంకాల పోరు ప్రారంభం కావడం, ముడి చమురు ధరలు పెరుగుతుండటంతో డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోయింది. రూపాయి పతనం మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపించింది. ♦ తగ్గిన విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల జోరు ఎన్నికల ఫలితాల అనంతరం విదేశీ ఇన్వెస్టర్లు మన స్టాక్ మార్కెట్లో జోరుగా పెట్టుబడులు పెట్టారు. ఆ తర్వాత ఈ జోరు తగ్గింది. జూన్‌లో ఇప్పటివరకూ చూస్తే, (సోమవారం లావాదేవీలను కూడా పరిగణనలోకి తీసుకుంటే) విదేశీ ఇన్వెస్టర్లు రూ.411 కోట్ల నికర అమ్మకం దారులుగా నిలిచారు. విదేశీ ఇన్వెస్టర్ల జోరు తగ్గితే, స్వల్ప కాలంలో మార్కెట్ పరిమిత శ్రేణిలోనే కదలాడుతుందని నిపుణులంటున్నారు. -
టారిఫ్‌లపై దూకుడు వద్దు!!
వాషింగ్టన్: చైనా ఉత్పత్తులన్నింటిపైనా టారిఫ్‌లను 25 శాతానికి పెంచేస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇప్పటికే హెచ్చరించగా... ఈ విషయంలో ఒక్క అడుగు ముందుకు వేసినా పరోక్షంగా అమెరికా కంపెనీలు, వినియోగదారులు కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అక్కడి కంపెనీలు దేశాధ్యక్షుడిని హెచ్చరించాయి. చైనా నుంచి దిగుమతయ్యే 250 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులపై అమెరికా ఇప్పటికే టారిఫ్‌లను పెంచేసింది. ఓ ఒప్పందానికి రాకపోతే మిగిలిన 300 బిలియన్ డాలర్ల విలువైన చైనా దిగుమతులపై కూడా టారిఫ్‌లను 25 శాతానికి పెంచేస్తామన్నది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిక. ఇలా చేస్తే బాణసంచా ధరలు పెంచాల్సి వస్తుందని, తద్వారా వ్యాపారాన్ని కోల్పోవాల్సి వస్తుందని న్యూ హాంప్‌షైర్ ఫైర్వర్క్స్ అనే కంపెనీ ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాదు, దీనివల్ల అమెరికాలోని చిన్న పట్టణాల్లో జూలై 4 నాటి స్వాతంత్య దినోత్సవ సందర్భంగా బాణసంచా సంబరాలను రద్దు చేసుకోవాల్సి వస్తుందని ఈ కంపెనీ హెచ్చరించింది. ఇక మిన్నెసోటాకు చెందిన ఓ మోటార్‌సైకిల్ కంపెనీ కూడా... చైనా విడిభాగాలపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేని ప్రత్యర్థి కంపెనీలు తమ వ్యాపారాన్ని ఎత్తుకుపోతాయని ఆందోళన వ్యక్తం చేసింది. లాస్ ఏంజెలిస్‌కు చెందిన గృహోపకరణాల డిజైనర్, పంపిణీ కంపెనీ అయితే, ఉద్యోగ నియామకాలను నిలిపేయాల్సి వస్తుందని, అలాగే, గిడ్డంగుల భారీ విస్తరణ ప్రణాళికలు కూడా ఆలస్యం అవుతాయని పేర్కొంది. పోటీలో నిలవలేం... చైనా నుంచి అమెరికాకు వచ్చే ప్రతి ఉత్పత్తిపైనా 25 శాతం టారిఫ్‌లు విధించే ప్రతిపాదనపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అభిప్రాయాలను కోరగా... టారిఫ్‌లను పెంచే విషయంలో ముందుకు వెళ్లకపోవటమే మంచిదన్న సూచనలు ఎక్కువగా వస్తున్నాయి. సోమవారం నుంచి ఏడు రోజుల పాటు వివిధ వర్గాల అభిప్రాయాలను అక్కడి ప్రభుత్వ యంత్రాంగం స్వీకరించనుంది. ఇప్పటికే వందలాది కంపెనీలు, వాణిజ్య బృందాలు, వ్యక్తులు అక్కడి ప్రభుత్వానికి లేఖల రూపంలో సూచనలు చేస్తూ... అదనపు టారిఫ్‌ల వల్ల వినియోగదారులపై ధరల భారం పడుతుందని స్పష్టంచేశారు. లాభాలను కోల్పోవడంతో పాటు అమెరికన్ కంపెనీలు, చైనా నుంచి కీలక విడిభాగాలను కొనుగోలు చేసే ప్రత్యర్థి కంపెనీలతో పోటీ పడలేక, వ్యాపార అవకాశాలను కోల్పోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. -
టాటా మోటార్స్‌కు ట్రంప్ షాక్
సాక్షి, ముంబై: వివిధ దేశాల మధ్య ముదుతున్న ట్రేడ్ వార్ నేపథ్యంలో వాహన దిగ్గజం టాటా మోటార్స్‌కు ట్రంప్ షాక్ తగిలింది. ఈయూకార్లపై దిగుమతిసుంకం విధింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ఇవాల్టి మార్కెట్లో టాటా మోటార్స్ టాప్ లూజర్‌గా నిలిచింది. 5.94 శాతం నష్టంతో ముగిసింది. ఐరోపాతో వాణిజ్య యుద్ధంలో భాగంగా యూరోపియన్ యూనియన్ ఉత్పత్తి చేసే కార్లపై 20శాతం దిగుమతి సుంకం విధించనున్నట్టు ట్రంప్ తాజాగా హెచ్చరించారు. ట్రంప్ ఆటో టారిఫ్‌లను పెంచినట్లయితే అమెరికాకు ఎక్కువగా ఎగుమతి చేసే జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జెఎల్ఆర్) వాహనాలపై భారీ ప్రభావం పడనుందని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా ట్యాక్స్‌ల విషయంలో దుందుడుకుగా వ్యవహరిస్తున్న డొనాల్డ్ ట్రంప్ ఉక్కు దిగుమతులపై 25శాతం, అల్యూమినియం దిగుమతులపై 10శాతం ట్యాక్స్ పెంచి ట్రేడ్ వార్‌కు తెరలేపారు. ఈ నేపథ్యంలోనే భారత్, ఈయూ దేశాలు అమెరికా ఉత్పత్తుల దిగుమతులపై దిగుమతి సుంకాన్నిపెంచుతూ నిర్ణయాన్ని ప్రకటించాయి. భారత్ 29 ఉత్పత్తులపై ఇంపోర్ట్ ట్యాక్స్ పెంచగా, యూరోపియన్ యూనియన్ అమెరికా ఉత్పత్తులపై దిగుమతి సుంకం 25శాతం సుంకం పెంచిన సంగతి తెలిసిందే. -
జియో రేట్ల పెంపు పరిశ్రమకు మంచిదే..
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో టారిఫ్ రేట్ల పెరుగుదల టెలికం పరిశ్రమకు మంచిదని ఫిలిప్ క్యాపిటల్ నివేదిక పేర్కొంది. టారిఫ్‌ల పెంపు వల్ల జియోకి ఒక యూజర్‌పై వచ్చే సగటు ఆదాయం (ఏఆర్పీయూ) 20 శాతం వరకు పెరుగుతుందని అంచనా వేసింది. ఇది టెలికం రంగానికి శుభపరిణామమని పేర్కొంది. ‘జియో రూ.399 ప్లాన్ వాలిడిటీని 84 రోజుల నుంచి 70 రోజులకు తగ్గించింది. దీంతో ఏఆర్పీయూ 20 శాతంమేర పెరగొచ్చు. ఇక 84 రోజుల వాలిడిటీతో కూడిన ఇదివరకటి రూ.399 ప్లాన్ ఇప్పుడు రూ.459 అయ్యింది. ఇక్కడ ఏఆర్పీయూ 15 శాతంమేర పెరుగుతుంది. అంటే జియో సబ్స్క్రైబర్లపై ఏఆర్పీయూ 15–20 శాతంమేర పెరుగుతుంది’ అని వివరించింది. ఇక ఇంటర్కనెక్షన్ యూసేజ్ చార్జీల తగ్గుదల కూడా జియోకి కలిసొచ్చే అంశమని తెలిపింది. కాగా మరొకవైపు జియో టారిఫ్ ధరలు ఇప్పటికీ తక్కువగానే ఉన్నట్లు క్రెడిట్ సూసీ అభిప్రాయపడింది. -
బంగారం దిగుమతుల టారిఫ్ పెంపు
న్యూఢిల్లీ: పసిడి దిగుమతుల టారిఫ్‌ను ప్రభుత్వం సోమవారం పెంచింది. 10 గ్రాములకు ప్రస్తుత టారిఫ్ 410 డాలర్ల నుంచి 414 డాలర్లకు పెరిగింది. ఇక వెండి టారిఫ్‌ను సైతం కేజీకి 576 డాలర్ల నుంచి 577 డాలర్లకు ఎగసింది. ధరలో ఎటువంటి అవకతవకలూ లేకుండా కస్టమ్స్ సుంకం విధించడానికి బేస్ ధరగా టారిఫ్ రేటు ఉంటుంది. పసిడిపై విధించే దిగుమతి సుంకానికి బేస్‌గా ఇప్పటివరకూ 410 డాలర్లను తీసుకొంటుండగా, వచ్చే 15 రోజులకూ 414 డాలర్ల బేస్‌తో సుంకాన్ని విధిస్తారు. అంతర్జాతీయ ధరకు అనుగుణంగా సాధారణంగా పక్షం రోజులకు ఒకసారి ఈ ధర నిర్ణయం ఉంటుంది.