అమెరికాకు ఎగుమతులు  35 శాతం పతనం: చైనా | China Exports to US Suffer Biggest Decline Since 2020 | Sakshi
Sakshi News home page
breaking news

అమెరికాకు ఎగుమతులు  35 శాతం పతనం: చైనా

Jun 10 2025 6:02 AM | Updated on Jun 10 2025 6:02 AM

China Exports to US Suffer Biggest Decline Since 2020

బీజింగ్‌: అమెరికా–చైనా మధ్య వాణిజ్యంలో అనిశ్చితి నెలకొంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మే నెలలో అమెరికాకు ఎగుమతులు 35 శాతం పడిపోయినట్లు చైనా వెల్లడించింది. ఈ ఎగుమతుల విలువ 28.8 బిలియన్‌ డాలర్లు. గత ఏడాది మే నెలలో ఎగుమతుల విలువ 44 బిలియన్‌ డాలర్లుగా ఉంది. 

మరోవైపు అమెరికా–చైనా మధ్య వాణిజ్య చర్చలకు రంగం సిద్ధమవుతోంది. అతిత్వరలో లండన్‌లో ఈ చర్చలు జరుగనున్నట్లు తెలుస్తోంది. డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా అధికారంలోకి వచ్చిన తర్వాత చైనా ఉత్పత్తులపై భారీగా సుంకాలు పెంచిన సంగతి తెలిసిందే.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement