యూజర్లకు షాక్.. వొడాఫోన్ ఐడియా కీలక నిర్ణయం! | Vodafone Idea Follows Airtel, Announces Mobile Tariff Hike With Minor Price Changes For Users, Check Out More Details | Sakshi
Sakshi News home page

Vodafone Idea Tariff Hike: యూజర్లకు షాక్.. వొడాఫోన్ ఐడియా కీలక నిర్ణయం!

Apr 24 2026 8:33 PM | Updated on Apr 25 2026 12:53 PM

Vodafone Idea CEO Says Ongoing Minor Tariff Corrections

భారతీ ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌ను సుమారు 4-5 శాతం పెంచినట్లు ఇప్పటికే ప్రకటించింది. అయితే తాజాగా వొడాఫోన్ ఐడియా కూడా ఇదే బాటలో అడుగులు వేస్తూ.. యూజర్లకు షాకిచ్చింది. మొబైల్ టారిఫ్‌లను పెంచుతున్నట్లు ప్రకటించింది.

వొడాఫోన్ ఐడియా మొబైల్ టారిఫ్‌లను పెంచుతున్నట్లు ప్రకటించినప్పటికీ.. అన్ని ప్లాన్‌లకూ ఒకేసారి ధరలను పెంచే ప్రణాళిక ప్రస్తుతానికి లేదని స్పష్టం చేసింది. అయితే ఎంత పెంచనుంది?, యూజర్లు రీఛార్జ్ చేసుకోవడానికి అదనంగా ఎంత వెచ్చించాల్సి ఉంటుందనే విషయాలను సంస్థ వెల్లడించలేదు.

ప్రస్తుతం చిన్నపాటి సవరణలు మాత్రమే ఉంటాయి. భారీ పెంపు ఉండదు. మార్కెట్ పరిస్థితుల కారణంగా ఈ మార్పులు చేస్తున్నట్లు వొడాఫోన్ ఐడియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అభిజిత్ కిషోర్ పేర్కొన్నారు. ఒక ముఖ్యమైన వాటాదారుగా ప్రభుత్వం కంపెనీపై విశ్వాసం ఉంచిందని, కంపెనీ పనితీరును మెరుగుపరచడంపై దృష్టి సారిస్తోందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.

ఇదీ చదవండి: దశాబ్దాల చరిత్ర.. రూ.221 కోట్లకు అమ్ముడైన బంగ్లా!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement