అమెరికా సంచలన ప్రకటన : ఆ నేతను పట్టిస్తే రూ.94 కోట్లు | US Offers 10 Million USD Reward For Intel On Abu Waala al Waeli | Sakshi
Sakshi News home page

అమెరికా సంచలన ప్రకటన : ఆ నేతను పట్టిస్తే రూ.94 కోట్లు

Apr 24 2026 12:45 PM | Updated on Apr 24 2026 1:11 PM

US Offers 10 Million USD Reward For Intel On Abu Waala al Waeli

వాషింగ్టన్‌: అమెరికా ప్రభుత్వం ఇరాన్‌ మద్దతు ఉన్న మిలిషియాపై తన ఒత్తిడిని మరింత పెంచుతోంది. తాజాగా 'ఖతైబ్ సయ్యిద్ అల్ శుహదా' (KSS) ఉగ్రవాద సంస్థ అధినేత హషీమ్ ఫిన్యాన్ రహీమ్ అల్-సరాజీ (అలియాస్ అబూ వాలా అల్ వేలీ) గురించి సమాచారం అందించిన వారికి 10 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 94 కోట్లు పైమాటే) బహుమతిని ప్రకటించింది. మిలీషియాలను అదుపులోకి తీసుకురావడానికి మరింతగా కృషి చేసే అవకాశం ఉన్న కొత్త ప్రధానమంత్రిని నియమించేలా బాగ్దాద్‌ను ప్రోత్సహించేందుకు, ఇరాక్‌లోని ఇరాన్ మద్దతుగల మిలీషియాలపై అమెరికా ఒత్తిడిని పెంచుతున్న తరుణంలో ఈ ప్రకటన వెలువడింది.సమాచారం అందించిన వారికి నగదు బహుమతితో పాటు, అవసరమైతే వేరే ప్రాంతానికి పునరావాసం (Relocation) కల్పించే అవకాశం కూడా ఉంటుందని అమెరికా  విదేశాంగ శాఖ తెలిపింది.

అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ తన 'రివార్డ్స్ ఫర్ జస్టిస్' ప్రోగ్రామ్ కింద ఈ ప్రకటన చేసింది. ముఖ్యంగా ఇరాక్, సిరియాలోని అమెరికా దౌత్య కార్యాలయాలు, సైనిక బలగాలపై దాడులు చేయడం, ఇరాక్ పౌరుల మరణాలకు ఈ గ్రూపు బాధ్యత వహించిన  నేపథ్యంలో ఆ  ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఇరాన్ నిర్దేశించిన విధంగా ఇరాక్, సిరియా మరియు సౌదీ అరేబియాపై కూడా దాడులకు పాల్పడటం. యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులకు అబూ వాలా అల్ వేలీ బహిరంగంగా మద్దతు ప్రకటించడం గమనార్హం.

గత దశాబ్ద కాలంగా, ఈ మిలీషియాలు ఇరాక్‌లోని అమెరికా బలగాలపైనా, దౌత్యవేత్తలపైనా దాడులు చేశాయి. ఇరాన్‌లో కొనసాగుతున్న యుద్ధ సమయంలో, ఈ మిలీషియాలు తమ దాడులను తీవ్రతరం చేశాయి. సౌదీ అరేబియాపై కూడా దాదాపు 1,000 దాడులు నిర్వహించాయి.

ఎవరీ అబూ వాలా అల్ వేలీ?
అబూ వాలా అల్ వేలీ ఇరాక్ కేంద్రంగా పనిచేస్తున్న కేఎస్‌ఎస్‌ సాయుధ గ్రూపుకు సెక్రటరీ జనరల్‌గా ఉన్నాడు. ఈ సంస్థ ఇరాన్ యొక్క 'ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్' (IRGC) కు అత్యంత విధేయంగా ఉంటూ, వారి ప్రయోజనాల కోసం పనిచేస్తుంటుంది. గతంలో ఇతను అమెరికా వ్యతిరేక సంస్థ అయిన 'ఖతైబ్ హెజ్బుల్లా' (KH)లో సభ్యుడిగా ఉండేవాడు. ఉగ్రవాద కార్యకలాపాల కారణంగా అమెరికా ఇతడిని అరెస్టు చేసి జైలులో ఉంచింది. అయితే, 2010లో ఇతను విడుదలయ్యాడు. 2010వ దశకం ఆరంభంలో సిరియా అంతర్యుద్ధం సమయంలో, ఖతైబ్ హెజ్బుల్లా నుంచి విడిపోయిన మిలీషియాలోని అబు హుస్సేన్ , అబు ఫదక్ విభాగాలకు చెందిన KH సభ్యులతో కలిసి దీన్ని ఏర్పాటు చేశాడు.  2023, నవంబరులో  వేలీని 'ప్రత్యేకంగా గుర్తించిన ప్రపంచ ఉగ్రవాది' (SDGT)గా  అమెరికా ప్రకటించింది. 

ఇదీ చదవండి: అదరగొట్టిన ఇన్ఫీ : 20 వేల కొత్త ఉద్యోగాలు

Advertisement
 
Advertisement
Advertisement