అదరగొట్టిన ఇన్ఫీ : 20 వేల కొత్త ఉద్యోగాలు | Infosys plans to hire 20k freshers in FY27 headcount declines by 8440 | Sakshi
Sakshi News home page

అదరగొట్టిన ఇన్ఫీ : 20 వేల కొత్త ఉద్యోగాలు

Apr 23 2026 7:04 PM | Updated on Apr 23 2026 7:23 PM

Infosys plans to hire 20k freshers in FY27 headcount declines by 8440

సాక్షి, ముంబై :  బెంగళూరుకు చెందిన ప్రముఖ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ గుడ్‌  న్యూస్‌ చెప్పింది.  2026 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో తన ఉద్యోగుల సంఖ్య 8,440 మేర తగ్గినట్లు తెలిపింది. వరుసగా ఆరు త్రైమాసికాల పాటు కంపెనీలో ఉద్యోగుల సంఖ్య అధికంగా ఉన్న తర్వాత ఈ భారీ తగ్గుదల చోటుచేసుకుంది.అయితే ఈ ఏడాది మరో 20వేల మంది ఫ్రెషర్స్‌ను నియమించుకోనున్నట్టు  వెల్లడించింది.

ఇన్ఫోసిస్‌ ఫలితాల ప్రకటన సందర్భంగా ఇన్ఫోసిస్ సీఎఫ్‌ఓ జయేష్ సంఘరాజ్కా మాట్లాడుతూ, వరుసగా తమ ఉద్యోగుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ, గత ఏడాదితో పోలిస్తే ఇది 5,000 మంది పెరిగిందన్నారు. త్రైమాసికంలో ఎప్పుడూ కొంత కాలానుగుణత ఉంటుంది. ఈ త్రైమాసికంలో వాల్యూమ్‌లు తక్కువగా ఉన్నాయి, దానికి తోడు సిస్టమ్‌లోకి వచ్చిన కొత్తవారిని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు.జనవరి-మార్చి కాలం ముగిసే నాటికి కంపెనీ ఉద్యోగుల సంఖ్య 3,28,594గా ఉంది, గత పన్నెండు నెలల ప్రాతిపదికన చూస్తే, ఈ త్రైమాసికంలో ఉద్యోగుల వలస రేటు (అట్రిషన్) మునుపటి త్రైమాసికంలోని 12.3 శాతం నుండి 12.6 శాతానికి పెరిగిందని తెలిపారు.

భారతదేశపు రెండవ అతిపెద్ద ఐటీ సేవల ఎగుమతిదారు ఇప్పటికే 18,000 మంది కళాశాల గ్రాడ్యుయేట్లను నియమించుకుంది. కాగా, గత త్రైమాసికంలో (Q3FY26) దాని నికర ఉద్యోగుల సంఖ్య 5,000 మందికి పైగా పెరిగింది.  అలాగే 2026 చివరి నాటికి, 20,000 మంది కళాశాల గ్రాడ్యుయేట్లను నియమించుకోవాలని ఇది అంచనా వేస్తోంది.WEF దావోస్ సదస్సు సందర్భంగా ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్, జనవరి 2026లో FY27లో తమ కంపెనీ 20 వేల మంది కళాశాల గ్రాడ్యుయేట్లను నియమించుకుంటుందని మీడియాకు తెలిపారు. 

ఇదీ చదవండి: ఆ పగతోనే ఢిల్లీలో దారుణ హత్యాచారం, షాకింగ్‌ విషయాలు

అంచనాలను ఇన్ఫోసిస్‌ ఫలితాలు
28 శాతం లాభాలతో  ఇన్ఫోసిస్‌ మార్కెట్‌ అంచనాలను అధిగమించింది.  క్యూ4లో ఇన్ఫోసిస్‌  నికర లాభం 27.8 శాతం పెరిగి రూ. 8,501 కోట్లకు చేరిం. ఆదాయం త్రైమాసికం ప్రాతిపదికన (QoQ) 2 శాతం పెరిగి రూ. 46,402 కోట్లకు చేరింది  2026-27ఆర్థిక సంవత్సరాకి గాను తన ఆదాయ వృద్ధి అంచనా (guidance) 1.5 శాతం నుండి 3.5 శాతం పరిధిలో ఉంటుందని తెలిపింది. కాగా  2026కి ఈ అంచనా 3 నుండి 3.5 శాతంగా ఉంది.

ఇదీ చదవండి: ఎంత పనిచేశాడు.. అందరికీ చెమటలు పట్టించాడుగా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement