ఎంత పనిచేశాడు.. అందరికీ చెమటలు పట్టించాడుగా! | A child in Kerala got stuck inside an aluminium cooking pot | Sakshi
Sakshi News home page

ఎంత పనిచేశాడు.. అందరికీ చెమటలు పట్టించాడుగా!

Apr 23 2026 5:29 PM | Updated on Apr 23 2026 6:58 PM

A child in Kerala got stuck inside an aluminium cooking pot

కేరళంలో ఒక బుడ్డోడు చేసిన పని  తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరుగెట్టించింది. అటు  పోలీసులకు  కూడా ముచ్చెమటలు పట్టించింది. చివరికి కథ సుఖాంతం కావడంతో అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. అలా ఎలా చేశావురా బుడ్డోడా అంటూ అందరూ నవ్వులు పువ్వులయ్యారు. ఇంతకీ అసలేమైంది అంటే..

ఇంట్లో ఆడుకుంటూ, ఆడుకుంటూ ఒక  బాలుడు  అల్యూమినియం వంట పాత్రలో ఇరుక్కుపోయాడు.  ఇక ఆ పాత్రలోంచి బయటికి రాలేక నానా కష్టాలు పడ్డాడు.  తల్లిదండ్రుల ప్రయత్నాలు కూడా విఫలం కావడంతో పోలీసులను ఆశ్రయించారు.  ఎట్టకేలకు   అగ్నిమాపక మరియు రెస్క్యూ సర్వీసెస్ బృందం ఆ బాలుడిని విజయవంతంగా రక్షించింది. చాలా అప్రమత్తంగా, కట్టర్‌ ద్వారా  ఆ పాత్రను కట్‌ చేసి బాలుడికి విముక్తి ప్రసాదించారు. ఈ తతంగం జరుగుతున్నంత సేపు ఆ బాలుడు ఏడ్చి గోల చేయకుండా, ప్రశాంతంగా పోలీసులకు సహకరించడం విశేషం. 

దీంతో నెటిజన్లు జాగ్రత్తలను గుర్తు చేస్తూనే  ఫన్నీగా స్పందించారు.   ఇట్లాంటి అల్లరి పిడుగులు చాలామంది ఉన్నారు.  వీరి పట్ల చాలా  జాగ్రత్తగా ఉండాలి అంటూ కమెంట్స్‌ చేశారు. తల్లిదండ్రులారా, దయచేసి ఇంట్లోని వస్తువుల విషయంలో మీ పిల్లల పట్ల మరింత జాగ్రత్తగా ఉండండి. వారిపై ఒక కన్నేసి ఉంచండి! అంటూ ఈ వీడియోను పోస్ట్‌ చేయడంతో  ఇది నెట్టింట  వైరల్‌గా మారింది. 

Advertisement
 
Advertisement
Advertisement