చాయ్‌-ఇడ్లీ కలిపి తినకూడదా..? కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌ ఏమన్నారంటే.. | Shashi Tharoor Shares Why Chai And Idli Don't Belong Together Goes Viral | Sakshi
Sakshi News home page

చాయ్‌-ఇడ్లీ కలిపి తినకూడదా..? కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌ ఏమన్నారంటే..

Jun 8 2026 8:44 AM | Updated on Jun 8 2026 10:59 AM

Shashi Tharoor Shares Why Chai And Idli Don't Belong Together Goes Viral

దక్షిణ భారతదేశంలో చాలామందికి చాయ్‌ తోపాటు ఏదో ఒకటి ముంచుకునే తినే అలవాటు ఉంది. అలాంటి వాటిలో ఈ చాయ్‌ ఇడ్లీ కలిపి తినడం అనేది కూడా ఒకటి. అయితే ఇలా తినొచ్చా అంటే..

ఇటీవల సోషల్‌ మీడియాలో చాయ్‌ ఇడ్లీ కాంబినేషన్‌ సూపర్‌ అంటూ పెట్టిన పోస్ట్‌ నెట్టింట హాట్‌టాపిక్‌గా మారి చర్చలకు తెరతీసింది. ఆ పోస్ట్‌పై సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌ స్పందిస్తూ..ఆయన ఆ పోస్ట్‌లో షేర్‌ చేసిన ఫోటోలో.. చాయ్‌ ఇడ్లీ కనిపించిన విధం గురించి మాట్లాడారు. ఆ చిత్రంలో ఇడ్లీ పసుపు వర్ణంలో చాలా గట్టిగా ఉన్నట్లుగా కనిపిస్తుందన్నారు. 

"బహుశా అందుకే ఇలా చాయ్‌ ఇడ్లీ కాంబినేషన్‌ సూపర్‌ అంటున్నారేమె. మాములుగా ఆ ఇడ్లీని తినడం కష్టం..ఇలా గట్టిదైతే వేడివేడి చాయ్‌లో ముంచుకుంటే సులభంగా నోటిలో కరిగిపోతుంది. అందుకు ఇలా అభిప్రాయ పడి ఉండొచ్చు. కానీ ఇడ్లీ అనేది మల్లెపువ్వుతా స్పాంజ్‌లా ఉండాలి. అలాంటి ఇడ్డీని కచ్చితంగా చాయ్‌లో ముంచి తినడం అంత ఈజీ కాదు. ఆయన చివరికి చెప్పేందేంటంటే..ఆ రెండింటిని వేర్వేరుగా ఆస్వాదించడమే మంచిదన్నారు." 

ఇడ్లీని చాయ్‌లో ముంచడం కంటే ఇడ్లీ తినేశాక చాయ్‌ తీసుకుంటే బెటర్‌ అని అన్నారు. తాను బ్రేక్‌ఫాస్ట్‌ లేదా భోజనం చేశాకే టీ తాగడానికి  ప్రాధాన్యత ఇస్తానని అన్నారు. అలాగే తనకు చాయ్‌ అంటే మహా ఇష్టమని, ఇక అల్పాహారంలో ఇడ్లీ అంటే చాలా ఇష్టంగా తింటానని అన్నారు. 

నిపుణులు ఏం అంటున్నారంటే..
టీ తాగేటప్పుడు తినే కొన్ని రకాల స్నాక్స్, ఆహారాల కాంబినేషన్‌ మంచిదికాదంటున్నారు. ముఖ్యంగా ఇడ్లీలు, బిస్కెట్ల కాంబినేషన్‌తో చాయ్‌ తాగడం అస్సలు మంచిది కాదనే చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇలా టీ కాంబినేషన్‌తో తింటే అరుగుదల,జీర్ణాశయం సంబంధిత సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అంతేగాదు కడుపు ఉబ్బరం, ఇన్‌ఫ్లమేషన్ వంటి సమస్యలు వస్తాయని అంటున్నారు. 

పైగా మెటబాలిజం కూడా నెమ్మదించి అజీర్తి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఇవే కాదు మరే ఇతర పోషకమైన వాటిని కూడా చాయ్‌ కాంబినేషన్‌తో వద్దనే అంటున్నారు. దానివల్ల ఆయా పోషకాలు శరీరానికి సరిగా అందవని అంటున్నారు. అందువల్ల కాస్త విరామం ఇచ్చి వేర్వేరుగా తీసుకోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

 

(చదవండి: 145 కేజీల నుంచి 90 కేజీలకు..! ఆ ఏడు ఆహారాలు..)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement