మహిళల భద్రతతోపాటు వారి స్వయం ఉపాధిని ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్ర మహిళా భద్రత విభాగం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఒంటరి మహిళలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు మహిళలే డ్రైవర్లుగా ఉన్న బైక్, ఆటోలతో కూడిన క్యాబ్ సర్విసులను స్త్రీ రైడ్ పేరిట అందుబాటులోకి తెచ్చింది. మహిళా డ్రైవర్ల వాహనాలను డీజీపీ సీవీ ఆనంద్ ఇతర అధికారులతో కలిసి శనివారం హైదరాబాద్‌లో జెండా ఊపి ప్రారంభించారు.


