నర్సింగ్‌ దుస్తులపై బీజేపీ ఎంపీ కంగనా సంచలన వ్యాఖ్యలు | Kangana Ranaut Sensational Comments On Existing Nursing Uniform Sparks Social Media Debate, Calls For Indianised Redesign | Sakshi
Sakshi News home page

నర్సింగ్‌ దుస్తులపై బీజేపీ ఎంపీ కంగనా సంచలన వ్యాఖ్యలు

Jun 8 2026 11:48 AM | Updated on Jun 8 2026 11:57 AM

Kangana Ranautsensational comments on nursing uniform is very British

బాలీవుడ్‌ నటి, బీజేపీ ఎంపీ  కంగనా రనౌత్ భారతీయ నర్సింగ్‌ దుస్తులపై సంచలన  వ్యాఖ్యలు చేసింది.  నర్సుల యూనిఫాం ఇప్పటికీ బలమైన వలసవాద ప్రభావాన్ని ప్రతిబింబిస్తోందని అభిప్రాయపడింది.తన రాబోయే చిత్రం 'భారత్ భాగ్య విధాత' (దర్శకుడు మనోజ్ తపాడియా) ట్రైలర్‌ను విడుదల చేశారు.  ఈ సందర్బంగా  ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.

బ్రిటిష్ న‌ర్సుల డ్రెస్ కోడ్ ఇప్ప‌టికీ వాడుక‌లో ఉంద‌ని, దీని భారతీయ శైలిలోకి మార్చాలని భావిస్తున్నాన‌ని వ్యాఖ్యానించారు. నర్సుల యూనిఫాం విషయంలో ఇప్పటికీ వలస పాలన నాటి ఛాయలు (colonial hangover) ఉండటమే వారిని లైంగిక కోణంలో చూడటానికి ఒక కారణమని కంగనా భావిస్తున్నారు. "నర్సుల డ్రెస్ కోడ్ బ్రిటిష్ కాలం నాటిది. డాక్టర్లు ఎలాంటి దుస్తులైనా ధరించవచ్చు, వాటి పైన ఒక కోట్ వేసుకుంటే సరిపోతుంది. కానీ మన నర్సులు మాత్రం ఎండైనా, చలి అయినా ఆ నిర్దిష్టమైన యూనిఫామ్‌నే ధరించాలి. అవి విదేశీ స్టయిల్‌లా అనిపిస్తుందని   పేర్కొన్నారు.

అందుకే ఈ యూనిఫాంలో మార్పులు రావాలని, అది "భారతీయ శైలిలో"(Indianized) ఉండాలని కంగనా అభిప్రాయపడ్డారు. అలాగే, రోజువారీ విధుల్లో ఎలాంటి యూనిఫాం ధరించడానికి ఇష్టపడతారనే విషయంపై నర్సుల అభిప్రాయాలను కూడా తీసుకోవాలని ఆమె సూచించారు.యూనిఫాంపై పిన్ను, టోపీ లేదా బెల్టు పెట్టుకోవ‌డం అమెరికా నేవీలో ఉంటుంద‌ని అన్నారు. మొద‌టి, రెండవ ప్ర‌పంచ య‌ద్దాల్లో వాళ్లు అలానే క‌నిపిస్తార‌ని వ్యాఖ్యానించారు. తన సినిమా ఆ దిశగా కొంత మార్పును తీసుకువస్తుందని, భవిష్యత్తులో ప్రేక్షకులు నర్సులను చూసే దృక్పథాన్ని మారుస్తుందని ఆమె ఆశిస్తున్నారు. అలాగే ఇది అంత సులభమైనవృత్తి కాదని, వేతన విధానం నుండి యూనిఫాం వరకు అనేక సంస్కరణలు అవసరమని అభిప్రాయపడ్డారు.

కాగా  2008 నాటి 26/11 ముంబై ఉగ్రవాద దాడుల సమయంలో లక్ష్యంగా మారిన ప్రదేశాలలో ఒకటైన 'కామా హాస్పిటల్' నేపథ్యంలో సాగే పీరియడ్ క్రైమ్ థ్రిల్లర్  'నర్సెస్ ఆఫ్ కామా' (Nurses of Cama) లో కంగనా నర్సు పాత్ర పోషిస్తోంది. ఉగ్రవాద దాడి జరిగినప్పటికీ, ఆసుపత్రిని నడుపుతూ రోగులను సురక్షితంగా ఉంచడంలో నర్సుల కృషి ఎంత కీలకమో ఈ చిత్రం చూపిస్తుంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement