న్యూఢిల్లీ: ప్రతిపక్షాల నిరసనలపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా జరుగుతున్న పరిణామాలపై ఆమె స్పందిస్తూ.. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు సరైనవి కాదని హితవు పలికారు. నీట్-యూజీ 2026 వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాలు చేపట్టిన ఆందోళనలను ఆమె తప్పుబట్టారు.
#WATCH | Monsoon session of Parliament | Delhi: On issues being raised by the Opposition, BJP MP Kangana Ranaut says, "Parliament sessions are convened so that we can discuss all issues in detail. Government is answerable for everything and so the session is held. We want the… pic.twitter.com/Fy213UfHA2
— ANI (@ANI) July 20, 2026
సమస్యలపై చర్చించడానికి, ప్రభుత్వాన్ని నిలదీయడానికి పార్లమెంటే సరైన వేదిక అని కంగనా స్పష్టం చేశారు. సభను అడ్డుకోవడం, గందరగోళం సృష్టించడం సరికాదన్నారు. మంత్రులను తొలగించాలంటూ ప్రభుత్వాన్ని బ్లాక్‌మెయిల్ చేయలేరని, ఎవరిని ఉంచాలి, ఎవరిని తొలగించాలనే నిర్ణయాధికారం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వానికే ఉంటుందని తేల్చిచెప్పారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు మరింత పట్టుదలగా ఉంటే నేరుగా ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చాటాలని ఆమె సవాల్ విసిరారు. వర్షాకాల సమావేశాల తొలిరోజు నీట్ వివాదం, అయోధ్య ట్రస్ట్ విరాళాల ఆరోపణలపై విపక్షాలు సభలో నినాదాలు చేశాయి. సభ్యులు సహకరించాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా విజ్ఞప్తి చేసినప్పటికీ, గందరగోళం చెలరేగడంతో సభ మధ్యాహ్నానికి వాయిదా పడింది.
ఇది కూడా చదవండి: ‘నీట్’ ఆందోళనలపై హేమామాలిని వివాదాస్పద వ్యాఖ్యలు


