విజయవాడ: ఉమ్మడి కృష్ణా జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఉరుములు, పిడుగులతో వాతావరణం దద్దరిల్లింది. విజయవాడతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది.
బుధవారం రాత్రి, గురువారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపిలేని వర్షం కారణంగా రోడ్లపై భారీగా వర్షం నీరు నిలిచిపోయింది.
పలుచోట్ల రోడ్లు చెరువులను తలపించాయి. విజయవాడ నగరంతో పాటు రూరల్ పరిధిలో పలు ప్రాంతాలు, రహదారులు జలమయం అయ్యాయి. దీంతో, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


