మైసూరు: ప్రపంచ ప్రఖ్యాత మైసూరు దసరా మహోత్సవం సమీపిస్తుండడంతో జంబూసవారీ ఏర్పాట్లు ముగింపు దశకు చేరుకున్నాయి.
ఇప్పటికే అన్ని దశల సాధనలను దసరా గజబృందం పూర్తి చేసుకుంది. ఆదివారం గజ బృందం తుది దఫా తాలీమును సాగించాయి.
అక్టోబర్ 21న విజయదశమి రోజున సాగే జంబూసవారీకి తగినట్లు శిక్షణ నిర్వహించారు.
అంబా విలాస్ ప్యాలెస్ ఆవరణలో వేదికపై ఉండే అతిథులకు గజరాజులు నమస్కారాలు పెడుతూ ముందుకు సాగాయి. కెప్టెన్ ప్రశాంత్ నేతృత్వంలో ఏనుగులు పాల్గొన్నాయి.


