మైసూరు: కళాకారుల కమనీయ ప్రదర్శనలు, వేద మంత్రాల ఘోష, మంగళ వాయిద్యాలు, పోలీసు బ్యాండు దర్పం, జనసంద్రాన్ని తలపిస్తున్న భక్తుల ఘోష, చేతులు జోడించి ఉన్న లబ్ధ ప్రతిష్టలు.. ఇంతలోనే జగమంతా ఎదురుచూస్తున్న మైసూరు దసరా జంబూసవారీ ఊరేగింపు నేత్రపర్వంగా ఆరంభమైంది.
ఫిరంగుల గర్జనలు, జయహో చాముండేశ్వరి అని భక్తజనం నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. సుందరంగా అలంకరించిన ఏనుగుల దండు ముందుకు సాగగా దసరా ఉత్సవాల వైభవం అంబరమంటింది.
ముఖ్యమంత్రి డీకే శివకుమార్ దంపతులు మధ్యాహ్నం 1:56 గంటలలోపు మధ్య మకర లగ్నం వద్ద నంది ధ్వజానికి పూజలు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేరళ సీఎం సతీశన్, వివిధ రంగాల ప్రముఖులు, 11 దేశాల నుంచి విశేష అతిథులు తరలివచ్చారు.


