కర్నూలు జిల్లా : మాళ మల్లేశ్వరుని జైత్రయాత్రలో కర్రలు కరాళ నృత్యం చేశాయి.విజయదశమిని పురస్కరించుకుని నిర్వహించిన బన్ని ఉత్సవం గురువారం తెల్లవారుజామున వరకు సాగింది. దేవరగట్టు పరిసరాల్లోని దాదాపు 15 గ్రామాల భక్తులు పాల్గొని మొగలాయి ఆడారు. ప్రతి ఏడాది మాదిరిగానే పలువురు భక్తులకు గాయాలయ్యాయి.


