Devaragattu festival
-
దేవరగట్టు బన్నీ ఉత్సవంలో అపశృతి.. ఇద్దరు మృతి
సాక్షి, కర్నూలు: కర్నూలు(Kurnool) జిల్లాలో విషాదం నెలకొంది. హొళగుంద మండలం దేవరగట్టు(devaragattu) మాళ మల్లేశ్వరస్వామి బన్నీ(bunny festival) ఉత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. బన్నీ ఉత్సవాల ప్రారంభంలోనే రెండు వర్గాలు కర్రలతో తలపడటంతో ఇద్దరు భక్తులు మృతి చెందారు. దాదాపు వంద మంది తీవ్రంగా గాయపడ్డారు.వివరాల ప్రకారం.. దేవరగట్టులో గురువారం అర్ధరాత్రి స్వామి, అమ్మవారి వివాహం అనంతరం ఊరేగింపు జరిగింది. దేవతామూర్తులను తీసుకెళ్లేందుకు రెండు వర్గాలు పోటీ పడ్డాయి. ఈ క్రమంలో ఇరు వర్గాల వారు కర్రలతో దాడులు చేసుకోగా.. ఇద్దరు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 100 మంది గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆదోని ఆస్పత్రికి తరలించారు. మరోవైపు.. దేవరగట్టులో ఉత్సవాలు కొనసాగుతున్నాయి. -
కర్నూలు జిల్లా : అర్ధరాత్రి రణరంగం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం (ఫొటోలు)
-
బన్నీ ఉత్సవంలో అపశృతి ముగ్గురు మృతి
-
బన్ని ఉత్సవాల్లో కర్రల సమరం
-
కర్నూలు జిల్లా దేవరగట్టులో బన్నీ ఉత్సవం (ఫొటోలు)
-
సమరానికి సిద్ధం ... కర్నూల్ జిల్లా దేవరగట్టులో బన్నీ ఉత్సవం
-
దేవరగట్టులో కర్రల సమరం
-
దేవరగట్టు జాతరలో బాలుడి మృతి
-
దేవరగట్టు జాతరలో బాలుడి మృతి
కర్నూలు జిల్లా దేవరగట్టు కర్రల యుద్ధం రక్తసిక్తమైంది. మాల మల్లేశ్వర స్వామి మూలవిరాట్టును దక్కించుకోడానికి కర్రలతో చేసుకున్న ఈ యుద్ధంలో పదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇంకా చాలామందికి తలలు పగిలాయి. మొత్తం 37 మంది భక్తులు తీవ్రంగా గాయపడినట్లు ఆదోని డీఎస్పీ శివరాంరెడ్డి చెప్పారు. మహేశ్ అనే పదేళ్ల బాలుడు ఈ ఘర్షణలో మరణించాడు. వాస్తవానికి ఉత్సవం చూడటానికి వచ్చిన మహేశ్.. అక్కడ జరిగిన తొక్కిసలాటలో నలిగిపోయి మరణించినట్లు పోలీసులు చెప్పారు. హొలగుండ మండలం దేవరగట్టులో ప్రతియేటా ఈ జాతర జరుగుతుంటుంది. దీనికి లక్షలాది మంది భక్తులు వస్తారు. ఈసారి కూడా ఈ ఉత్సవంలో ఊహించినట్టుగానే చాలామంది గాయపడ్డారు. ప్రసిద్ధ మాల మల్లేశ్వరస్వామి సమక్షాన ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి మూలవిరాట్‌ను దక్కించుకోవడానికి పోటీ పడ్డారు. మేమేంటే మేమంటూ ఒకరిపై మరొకరు కర్రలతో కలబడ్డారు. భారీగా పోలీసుల్ని మోహరించినా.. వాళ్లు ప్రేక్షతపాత్రకే పరిమితం కావల్సి వచ్చింది. శనివారం తెల్లవారేవరకూ ఈ కర్రల యుద్ధం కొనసాగింది. పది గ్రామాల ప్రజలు బన్నీ ఉత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారి మూలవిరాట్ కోసం ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నారు. దాంతో పోలీసులు లాఠీఛార్జ్‌తో పాటు బాష్పవాయువు ఉపయోగించారు. -
భక్తి పేరుతో రక్తం కళ్ల చూశారు...
కర్నూలు : కర్నూలు జిల్లా దేవరగట్టు కర్రల సమరం పదేళ్ల బాలుడిని బలి తీసుకుంది. ఈ ఏడాది పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. దేవరగట్టులో ఉద్రిక్తత ఆగలేదు. సమయానికి గ్రామస్థుల చేతుల్లోకి మాత్రం కర్రలు వచ్చేశాయి. దాంతో పాటే వారిలో ఊపు వచ్చింది. పూనకం వచ్చినట్లు ఊగిపోతూ.. కర్రలు పట్టుకుని కొందరు.. కాగడాలతో మరికొందరు పరుగులు పెట్టారు. అంతా గందరగోళం. ఏం జరుగుతుందో అయోమయం. కర్రలు దూసుకున్నారు.. తలలు పగిలాయి. ఈ ఘటనలో ఓ బాలుడు మృతి చెందగా, 60మందికిపైగా గాయపడ్డారు. అధికారులు మాత్రం నలభై మంది గాయపడినట్లు చెబుతున్నారు. కాగా బాలుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు ఆ ప్రాంత ప్రజలు మాత్రం ఏం జరిగినా వందల ఏళ్ల నుంచి వచ్చే సాంప్రదాయాలు కొనసాగిస్తామని చెబుతున్నారు. -
రక్తచరిత్ర మరోసారి పునరావృతం
-
రక్తచరిత్ర మరోసారి పునరావృతం
కర్నూలు : కర్నూలు జిల్లా దేవరగట్టు కర్రల యుద్ధం రక్తసిక్తమైంది. ఊహించినట్టుగానే చాలా మంది గాయపడ్డారు. కొంతమంది తలలు పగిలాయి. ప్రసిద్ధ మాల మల్లేశ్వరస్వామి సమక్షాన ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి మూలవిరాట్‌ను దక్కించుకోవడానికి పోటీ పడ్డారు. మేమేంటే మేమంటూ ఒకరిపై మరొకరు కర్రలతో కలబడ్డారు. భారీగా పోలీసుల్ని మోహరించినా.. ప్రేక్షతపాత్రకే పరిమితం కావల్సి వచ్చింది. శనివారం తెల్లవారే వరకూ ఈ కర్రల యుద్ధం కొనసాగింది. పది గ్రామాల ప్రజలు బన్నీ ఉత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారి మూలవిరాట్ కోసం ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నారు. దాంతో పోలీసులు లాఠీఛార్జ్‌తో పాటు భాష్పవాయువు ఉపయోగించారు. కర్నూలు జిల్లా హొలగుంద మండలం దేవరగట్టు కొండల్లో వెలసిన మాలమల్లేశ్వర స్వామి వేడుకలు 'బన్సీ ఉత్సవాల' పేరుతో ఏటా విజయదశమిశి నాడు అంగరంగ వైభవంగా జరుగుతాయి. మాలమల్లేశ్వర స్వామి విగ్రహాన్ని సొంత చేసుకునేందుకు పది గ్రామాల ప్రజలు పోటీపడతారు. స్వామి ఎక్కడుంటే అక్కడ పాడిపంటలతో ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారనే అక్కడి భక్తుల విశ్వాసం. అందుకే స్వామిని సొంతం చేసుకునేందుకు అర్థరాత్రి సమయంలో 10 గ్రామాల ప్రజలు ఒకరినొకరు కర్రలతో కొట్టుకుంటారు.


