3 అపార్ట్‌మెంట్లు, రూ. 38 కోట్లు : వార్తల్లో షారుఖ్‌ మేనేజర్‌ | Shah Rukh Khans Manager Buys 3 Apartments In Bandra for rs 38 Crore | Sakshi
Sakshi News home page

3 అపార్ట్‌మెంట్లు, రూ. 38 కోట్లు : వార్తల్లో షారుఖ్‌ మేనేజర్‌

Apr 24 2026 1:14 PM | Updated on Apr 24 2026 1:33 PM

Shah Rukh Khans Manager Buys 3 Apartments In Bandra for rs 38 Crore

సాక్షి, ముంబై:  బాలీవుడ్‌ టాప్‌ స్టార్‌  షారుఖ్ ఖాన్  ఆస్తులు, విలావంతమైన కార్లు ఇళ్లు గురించి ప్రత్యేకంగా  చెప్పుకోవాల్సిన పనేలేదు. కానీ  ఆయన దగ్గర దీర్ఘకాలం మేనేజర్‌గా  ఉన్న పూజా దద్లానీ-గుర్నానీ (Pooja Dadlani) మాత్రం  వార్తల్లో నిలుస్తారు.  ముంబైలో ఒక భారీ రియల్ ఎస్టేట్ పెట్టుబడి పెట్టి నెట్టింట తెగ సందడి చేస్తున్నారు. విషయం ఏమిటంటే.

టాప్‌ సెలబ్రిటీ మేనేజర్స్‌లో ఒకరు, షారుఖ్ ఖాన్ మేనేజర్ అ పూజా దద్లానీ, తన కుటుంబంతో కలిసి ముంబైలోని బాంద్రాలో మూడు అపార్ట్‌మెంట్లను కొనుగోలు చేశారు.  వీటి విలువ రూ.38.21 కోట్లు. CRE మ్యాట్రిక్స్‌కు లభించిన ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం,  ఈ లావాదేవీలొ ఆమె ఒక ఫ్లాట్‌ను కొనుగోలు చేయగా, ఆమె భర్త హితేష్ గుర్నానీ మ, ఆమె తండ్రి మోహన్ దద్లానీ ఒక్కొక్కటి కొనుగోలు చేశారు. ఈ అపార్ట్‌మెంట్లు కార్టర్ రోడ్‌లోని 'వరుణ్' అనే భవనంలో ఉన్నాయి. ఈ భవనాన్ని లోటస్ డెవలపర్స్ సంస్థలో భాగమైన ట్రైక్షా రియల్ ఎస్టేట్ పునరాభివృద్ధి చేస్తోంది. ఇది 2028 డిసెంబర్  నాటికి పూర్తి అవుతుందని అంచనా.

ప్రతి అపార్ట్‌మెంట్‌కు 1,511 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాతో పాటు అదనంగా ఒక బాల్కనీ కూడా ఉందని తెలుస్తోంది. దీంతో ఈ మూడు యూనిట్ల మొత్తం వైశాల్యం సుమారు 4,776 చదరపు అడుగులు ఉంటుందని సమాచారం. ఈ ఒప్పందంలో ఆరు పార్కింగ్ స్థలాలు కూడా ఉన్నాయి. ఈ లావాదేవీలు ఏప్రిల్ 21, 2026న, రూ.2.16 కోట్ల స్టాంప్ డ్యూటీ రూ.90,000 రిజిస్ట్రేషన్ ఫీజు కూడా చెల్లించడం విశేషం.

 పూజా దద్లానీ నికర ఆదాయం
2024  నాటి లెక్కల ప్రకారం పూజా దద్లానీ నికర విలువ సుమారు రూ. 45 నుండి 50 కోట్ల మధ్య ఉంటుందని అంచనా. ఆమె వార్షిక ఆదాయం రూ. 7 నుండి 9 కోట్లు.పూజా దద్లానీ, 'లిస్టా జ్యువెల్స్' (Lista Jewels) డైరెక్టర్ అయిన హితేష్ గుర్నానీని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు 'రేనా' అనే కుమార్తె ఉంది. ఈ జంట ముంబైలోని అత్యంత సంపన్న ప్రాంతమైన బాంద్రాలో, కోట్లాది రూపాయల విలువైన ఒక అద్భుతమైన నివాసంలో నివసిస్తున్నారు. ఫిబ్రవరి 2023లో, తన కొత్త ఇంటిని గౌరీ ఖాన్ రూపొందించారని పూజా దద్లానీ వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement