FIFA World Cup 2026: ఆతిథ్య మెక్సికో ఘన విజయం | FIFA World Cup 2026 Mexico Defeat South Africa | Sakshi
Sakshi News home page

FIFA World Cup 2026: ఆతిథ్య మెక్సికో ఘన విజయం

Jun 12 2026 7:52 AM | Updated on Jun 12 2026 10:00 AM

FIFA World Cup 2026 Mexico Defeat South Africa

ప్రపంచవ్యాప్తంగా అభిమానులను అలరించేందుకు ‘ఫిఫా’ ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌–2026 అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. మెక్సికో సిటీ స్టేడియంలో జరిగిన ప్రపంచకప్‌ మొదటి మ్యాచ్‌లోనే ఆతిథ్య మెక్సికో జట్టు ఘన విజయాన్ని అందుకుంది. గ్రూప్‌-A సౌతాఫ్రికా-మెక్సికో మధ్య జరిగిన మ్యాచ్‌లో మెక్సికో 2-0 తేడాతో విజయం సాధించింది.

మ్యాచ్‌ ప్రారంభం నుంచి దూకుడుగా ఆడిన మెక్సికో జట్టు.. తొమ్మిదో నిమిషానికే గోల్‌ సాధించింది. మెక్సికో ప్లేయర్‌ జులియన్‌ క్వినోన్స్‌ తొలిగోల్‌ చేసి టీమ్‌కు ముందుకు నడిపాడు. ఇక రెండో అర్ధభాగంలో రావుల్‌ జిమినెజ్‌ మరో గోల్‌ కొట్టి మెక్సికోను మరింత ఆధిక్యంలో తీసుకెళ్లాడు. దీంతో, మెక్సికో విజయం అక్కడే దాదాపు ఖాయమైంది. ఇక, 2010 ప్రపంచకప్‌ మాదిరిగానే మెక్సికో–దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్‌తోనే 2026 వరల్డ్‌కప్‌ ప్రారంభమైంది.  మెక్సికో, కెనడా, అమెరికా సంయుక్తంగా ఈ టోర్నీ నిర్వహిస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement