మరోసారి పాక్‌ చిత్తు.. సిరీస్‌ శ్రీలంక వశం | Sri Lanka women beat Pakistan Women by 8 Wickets in 3rd ODI, Clinches Series too | Sakshi
Sakshi News home page

మరోసారి పాక్‌ చిత్తు.. సిరీస్‌ శ్రీలంక వశం

Jul 28 2026 4:17 PM | Updated on Jul 28 2026 4:18 PM

Sri Lanka women beat Pakistan Women by 8 Wickets in 3rd ODI, Clinches Series too

source: X

శ్రీలంక మహిళల జట్టుతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను పర్యాటక పాకిస్తాన్‌ జట్టు 1-2 తేడాతో కోల్పోయింది. హంబన్‌తోట వేదికగా ఇవాళ (జులై 28) జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో ఆతిథ్య జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, సిరీస్‌ను కైవసం చేసుకుంది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ 40 ఓవర్లలో 187 పరుగులకే చాపచుట్టేయగా.. శ్రీలంక 37.2 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ సిరీస్‌ తొలి మ్యాచ్‌ పాక్‌ గెలవగా.. రెండు, మూడు మ్యాచ్‌లను గెలిచిన శ్రీలంక సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఇరు జట్ల మధ్య జులై 31, ఆగస్ట్‌ 2, 4 తేదీల్లో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ జరుగనుంది.

చెలరేగిన లంక బౌలర్లు
టాస్‌ ఓడి తొలుత బౌలింగ్‌ చేసిన శ్రీలంక పాక్‌ను స్వల్ప స్కోర్‌కే మట్టికరిపించింది. చేతన విముక్తి (3-36), కెప్టెన్‌ చమారీ (3-27), కవిష దిల్హరి (3-27) చెలరేగి బౌలింగ్‌ చేశారు. పాక ఇన్నింగ్స్‌లో 41 పరుగులు చేసిన ఫాతిమా సనా టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. మిగతా ప్లేయర్లలో గుల్‌ ఫెరోజా (40), మునీబా అలీ (34), నజిహా అల్వి (30) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.

అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో లంక బ్యాటర్లు కూడా సత్తా చాటారు. చమారీ ఆటపట్టు (52), హాసిని పెరీరా (50 నాటౌట్‌), హర్షిత సమరవిక్రమ (71 నాటౌట్‌) అర్ద సెంచరీలతో రాణించి, తమ జట్టును విజయతీరాలకు చేర్చారు. వీరి ఇన్నింగ్స్‌లో విష్మి గౌతమ్‌ (12) మాత్రమే తక్కువ స్కోర్‌కు ఔటైంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement