ఇస్లామాబాద్: పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో జరిగిన మెుదటి విడత ఎన్నికలు రక్తసిక్తంగా మారాయి. ఎన్నికల వేళ ఆందోళనకారులపై జరిపిన పాక్ ఆర్మీ జరిపిన కాల్పుల్లో 19 మంది మృతిచెందారు. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. పీవోకేలో గత కొద్ది రోజులుగా నిరసనలు జరుగుతున్నాయి. అయినప్పటికీ అక్కడి ప్రభుత్వం శాసనసభకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మెుదటి దశ ఎన్నికల్లో మారణహోమం జరిగింది.
పీవోకేలో గత కొంతకాలంగా నిరసనలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. పీవోకే శాసనసభలో పాకిస్థాన్‌లో నివసించే శరణార్థుల కోసం కేటాయించిన 12 రిజర్వ్‌డ్ సీట్లను రద్దుతో పాటు భారీగా పెరిగిన విద్యుత్ ధరలు, ద్రవ్యోల్బణంతో పాటు అక్కడి ఆర్మీ అరాచకాలగకు విసిగిపోయిన ప్రజలు పెద్దఎత్తున నిరసనలు చేపడుతున్నారు.దశాబ్దాలుగా పాకిస్థాన్ తమ ప్రాంతాన్ని అభివృద్ధి విషయంలో పూర్తిగా విస్మరిస్తోందని, స్థానిక వనరులను దోచుకుంటూ ప్రాథమిక హక్కులను కాలరాస్తోందని ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే జాయింట్ ఆవామీ యాక్షన్ కమిటీ (JAAC) ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. అయితే ఈ ఆందోళనలను ఏమాత్రం పట్టించుకోని అక్కడి ప్రభుత్వం అక్కడి అసెంబ్లీ స్థానాలకు ముడు దశలలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తొలిదశ ఎన్నికలు తీవ్ర హింసాత్మకంగా మారాయి. ఎన్నికలు వద్దంటూ నిరసన చేస్తున్న ఆందోళనకారులపై పాకిస్తాన్ రేంజర్లు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 19 మంది మరణించారు. అలాగే పదుల సంఖ్యలో జనాలు గాయపడ్డారు. అయితే గాయపడ్డవారిలో 30 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
కాగా నిరనలు తారాస్థాయికి చేరినప్పటికీ పోలింగ్ సిబ్బందిని బంధీలుగా ఉంచి... ఆయుధాల బెదిరింపులతో బోగస్ ఓటింగ్, రిగ్గింగ్‌కు పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడి సమాహ్ని ప్రాంతంలో ఒక పోలింగ్ బూత్ నుండి సాయుధ వ్యక్తులు బ్యాలెట్ బాక్సులను ఎత్తుకెళ్తున్న వీడియో కూడా బయటకు వచ్చింది.
జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JKJAAC) పిలుపు మేరకు ముజఫరాబాద్‌కు ర్యాలీ నిర్వహిస్తుండగా... రావాలాకోట్‌లో నిరసనకారులపై పాకిస్థాన్ బలగాలు కాల్పులు జరిపినట్లు వార్తలు వచ్చాయి. ముజఫరాబాద్ వైపు ర్యాలీగా వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో నిరసనకారులు సిద్ధమవుతుండగా, రావాలాకోట్‌లో భద్రతా దళాలు విచక్షణారహితంగా కాల్పులు జరిపాయని స్థానికులు ఆరోపించారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అకీల్ భాయ్ ఈ ఘటనకు సంబంధించిన వివరాలను, అక్కడి పరిస్థితులు, జరిగిన పరిణామాలను వివరించారు.
#PoJK This is a military-dominated state where civilian governance is merely a facade and real power lies with the army. Calling this system “constitutional” is misleading.
An entire establishment, intoxicated by power, has trampled upon law, constitution, and ethics… pic.twitter.com/R4LhZyZnq6— KashmirFact (@Kashmir_Fact) July 28, 2026


