బాబర్‌ ఆజం వరల్డ్‌ రికార్డు | Babar Azam Sets All Time High Record On Test Captaincy Return For Pakistan | Sakshi
Sakshi News home page

బాబర్‌ ఆజం వరల్డ్‌ రికార్డు

Jul 28 2026 2:44 PM | Updated on Jul 28 2026 2:51 PM

Babar Azam Sets All Time High Record On Test Captaincy Return For Pakistan

source: X

పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం టెస్ట్ కెప్టెన్‌గా తిరిగి బాధ్యతలు చేపట్టిన తొలి మ్యాచ్‌లోనే ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 23 పరుగులు చేసిన అతడు.. అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలోనూ 4500కిపైగా పరుగులు చేసిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ ఘనతను ఇప్పటివరకు ప్రపంచ క్రికెట్‌లో మరే ఆటగాడు సాధించలేదు.

బాబర్ మూడు ఫార్మాట్లలో పరుగులు
* టెస్టులు: 4504 పరుగులు
* వన్డేలు: 6626 పరుగులు
* టీ20 అంతర్జాతీయాలు: 4596 పరుగులు

అంతర్జాతీయ కెరీర్ గణాంకాలు
2015లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన బాబర్, అప్పటి నుంచి అన్ని ఫార్మాట్లలో కలిపి 15726 పరుగులు చేశాడు. ఈ కాలంలో అతని కంటే ఎక్కువ పరుగులు చేసిన వారు కేవలం ఇద్దరే.

* జో రూట్: 18575 పరుగులు
* విరాట్ కోహ్లీ: 18303 పరుగులు
* బాబర్ ఆజం: 15726 పరుగులు

ఇటీవలి ఫామ్ ఆందోళనకరం
వ్యక్తిగత రికార్డు సాధించినప్పటికీ, బాబర్ ఇటీవలి కాలంలో టెస్టుల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు.

2023 ప్రారంభం నుంచి టెస్టుల్లో:
 * 32 ఇన్నింగ్స్
 * 859 పరుగులు
 * సగటు: 26.84
 * ఒక్క సెంచరీ కూడా లేదు.

వన్డేలు, టీ20ల్లో కూడా పరుగులు చేసినప్పటికీ, అతని స్ట్రైక్‌రేట్‌పై విమర్శలు వస్తున్నాయి.

విండీస్‌-పాక్‌ తొలి టెస్ట్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌ హోరాహోరీగా సాగుతోంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగులు చేయగా.. జస్టిన్‌ గ్రీవ్స్‌ (11-6-27-5) దెబ్బ​కు పాక్‌ తొలి ఇన్నింగ్స్‌లో 282 పరుగులకే చాపచుట్టేసింది. తాజా మాజీ కెప్టెన్‌ షాన్‌ మసూద్‌ (109) సెంచరీ చేయడంతో పాక్‌ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.

స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన విండీస్‌, పాక్‌ బౌలర్లు మూకుమ్మడిగా చెలరేగడంతో 126 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 155 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం​ పాక్‌ జట్టు విండీస్‌లో పర్యటిస్తుంది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement