జెమీమా విధ్వంసం.. ప‌రుగు తేడాతో థ్రిల్లింగ్‌ విజ‌యం | Jemimah Rodrigues-32 Runs-Southern Brave-Women Hat-trick Win-Hundred | Sakshi
Sakshi News home page

జెమీమా విధ్వంసం.. ప‌రుగు తేడాతో థ్రిల్లింగ్‌ విజ‌యం

Jul 28 2026 12:55 PM | Updated on Jul 28 2026 12:59 PM

Jemimah Rodrigues-32 Runs-Southern Brave-Women Hat-trick Win-Hundred

Photo Credit: Hundred Twitter

హండ్రెడ్ వుమెన్స్ కాంపిటీషన్ 2026లో స‌ద‌ర‌న్ బ్రేవ్ వుమెన్ జ‌ట్టు హ్యాట్రిక్ విజ‌యాల‌ను న‌మోదు చేసింది. భార‌త బ్యాట‌ర్ జెమీమా రోడ్రిగ్స్ విధ్వంసం సృష్టించ‌గా, స‌ద‌ర‌న్ బ్రేవ్స్‌ ప‌రుగు తేడాతో ఎంఐ లండ‌న్ జ‌ట్టుపై థ్రిల్లింగ్ విజ‌యాన్ని అందుకుంది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన స‌ద‌ర‌న్ బ్రేవ్ వుమెన్ 100 బంతుల్లో 7 వికెట్ల న‌ష్టానికి 126 ప‌రుగులు చేసింది. 

జెమీమా రోడ్రిగ్స్ (22 బంతుల్లో 32, 3 ఫోర్లు), లారా వోల్వ‌ర్ట్ (30 బంతుల్లో 35, 4 ఫోర్లు) కీల‌క ఇన్నింగ్స్ ఆడ‌గా, ఓపెన‌ర్ మయియా బౌచ‌ర్ (33 బంతుల్లో 31) రాణించింది. ఎంఐ లండ‌న్ బౌల‌ర్ల‌లో హేలీ మాథ్యూస్ 4 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా, తారా నొర్రిస్‌, అమేలియా కెర్‌, నికోలా కేరీ త‌లా ఒక వికెట్ తీశారు. అనంత‌రం ఛేద‌నలో ఎంఐ లండ‌న్ వుమెన్ జ‌ట్టు 100 బంతుల్లో 3 వికెట్ల న‌ష్టానికి 125 ప‌రుగులు చేసి విజ‌యానికి ఒక్క ప‌రుగు దూరంలో నిలిచిపోయింది. 


Photo Credit: Hundred Twitter

ఓపెన‌ర్ డానీ వాట్‌హెడ్జ్ (42 బంతుల్లో 52 నాటౌట్‌) అజేయంగా నిలిచిన‌ప్ప‌టికీ జ‌ట్టును గెలిపించ‌లేక‌పోయింది. మ‌రో ఓపెన‌ర్‌హేలీ మాథ్యూస్ (28 బంతుల్లో 32) ప‌ర్వాలేద‌నిపించింది. స‌ద‌ర‌న్ బౌల‌ర్ల‌లో సోఫీ మోలినెక్స్‌, ఇస్సీ వాంగ్‌, సారా గ్లెన్ త‌లా ఒక వికెట్ తీశారు. కీల‌క ఇన్నింగ్స్‌తో జ‌ట్టు విజ‌యంలో ప్ర‌ధాన పాత్ర పోషించిన జెమీమా రోడ్రిగ్స్ ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకుంది.


Photo Credit: Hundred Twitter

హ్యాట్రిక్ ప‌రాజ‌యం
ఇక పురుషుల హండ్రెడ్ టోర్నీలో మాత్రం స‌ద‌ర‌న్ బ్రేవ్ జ‌ట్టు హ్యాట్రిక్ ప‌రాజ‌యాన్ని మూటగ‌ట్టుకుంది. స‌ద‌ర‌న్ బ్రేవ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఎంఐ లండ‌న్ 3 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన స‌ద‌ర‌న్ బ్రేవ్ 100 బంతుల్లో 9 వికెట్ల న‌ష్టానికి 129 ప‌రుగులు చేసింది. 

ఓపెన‌ర్ జేక్ స్మిత్ (26 బంతుల్లో 49) ప‌రుగు తేడాతో అర్ధ‌సెంచ‌రీ మిస్ చేసుకోగా, ట్రిస్ట‌న్ స్ట‌బ్స్ (31 బంతుల్లో 38) రాణించాడు. బౌల్ట్‌, టామ్ క‌ర‌న్‌, రిచ‌ర్డ్ గ్లెస‌న్‌, సామ్ క‌ర‌న్‌లు త‌లా రెండు వికెట్లు తీశారు. అనంత‌రం ఎంఐ లండ‌న్ 100 బంతుల్లో 7 వికెట్లు కోల్పోయి 130 ప‌రుగులు చేసి విజ‌యాన్ని అందుకుంది. ఓపెన‌ర్ విల్ జాక్స్ (41 బంతుల్లో 54) కీల‌క ఇన్నింగ్స్ ఆడి విజ‌యంలో ప్ర‌ధాన పాత్ర పోషించాడు. సామ్ కర‌న్ (30), రూథ‌ర్‌ఫోర్డ్ (21) ఆఖ‌ర్లో ధాటిగా ఆడారు. మార్క‌స్ స్టోయినిస్ 3 వికెట్లు తీయ‌గా, ఆదిల్ ర‌షీద్‌, నికిల్ చౌద‌రీ చెరొక వికెట్ ప‌డ‌గొట్టారు.


విల్ జాక్స్ (Photo Credit: Hundred Twitter)

 

Read: సుందర్‌ స్థానంలో జట్టులోకి.. ఎవరీ సారాన్ష్‌ జైన్‌?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement