రంజీ ట్రోఫీతో సారాన్ష్ జైన్ (PC: BCCI)
టీమిండియా తరఫున సారాన్ష్ జైన్ రూపంలో దేశవాళీ సీనియర్ క్రికెటర్ అంతర్జాతీయంగా అరంగేట్రం చేయనున్నాడు. శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు గాయపడిన వాషింగ్టన్ సుందర్ స్థానంలో మధ్యప్రదేశ్ ఆల్‌రౌండర్ సారాన్ష్ జైన్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ బౌలర్ అయిన సారాన్ష్ జైన్ లోయర్ ఆర్డర్‌లో బ్యాటర్‌గా పరుగులు సాధించడంలో సమర్థుడు.
దీంతో లంకతో సిరీస్‌లో సారాన్ష్ ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వయసు కూడా దీనికి మరో ప్రధాన కారణం. 33 ఏళ్ల వయసులో జాతీయ జట్టుకు ఎంపికైన సారాన్ష్ 2014లో మధ్యప్రదేశ్ తరఫున ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి మధ్యప్రదేశ్‌కు ప్రధాన ఆటగాడిగా మారిపోయిన సారాన్ష్ ఆ తర్వాత సెంట్రల్ జోన్‌తో పాటు రెస్టాఫ్ ఇండియాకు కూడా ప్రాతినిధ్యం వహించాడు.
తండ్రి కూడా క్రికెటరే..
స్పిన్ బౌలర్ అయిన సారాన్ష్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 181 వికెట్లతో పాటు 2,223 పరుగులు సాధించాడు. సారాన్ష్ జైన్ తండ్రి సుబోధ్ జైన్ కూడా క్రికెటరే. మధ్యప్రదేశ్ తరఫున రంజీ ట్రోఫీలో ఆడారు. రైట్ ఆర్మ్ ఆఫ్‌బ్రేక్ బౌలర్ అయిన సుబోధ్ జైన్ తొమ్మిది మ్యాచ్‌ల్లో మధ్యప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించారు.
ఇక సారాన్ష్ జైన్ దేశవాళీ సీనియర్ కోచ్ చంద్రకాంత్ పండిట్ వద్ద శిక్షణ పొంది ఆటలో మరింత రాటుదేలాడు. 2022లో తొలిసారి రంజీ ట్రోఫీ గెలిచిన మధ్యప్రదేశ్ జట్టులో సారాన్ష్ జైన్ సభ్యుడిగా ఉన్నాడు. చెన్నై వేదికగా ముంబైతో జరిగిన రంజీ ఫైనల్లో తొలి ఇన్నింగ్స్‌లో కీలక హాఫ్ సెంచరీ చేయడంతో పాటు రెండు వికెట్లు తీసి విజయంలో కీలకపాత్ర పోషించాడు.
లంక-ఏపై రాణించి సెలెక్టర్ల దృష్టిలో..
ఇటీవలే శ్రీలంక-ఏతో జరిగిన రెండో అనధికారిక టెస్టులో సారాన్ష్ జైన్ రాణించాడు. బ్యాట్‌తో 70 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో ఆరు వికెట్లు తీసి జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతోనే సెలెక్టర్ల దృష్టిలో పడిన సారాన్ష్ జైన్ తాజాగా సుందర్ స్థానంలో లంకతో సిరీస్‌కు ఎంపికయ్యాడు.
వేలంలో అన్‌సోల్డ్
ఇక ఐపీఎల్ 2024 నుంచి 2026 వరకు సారాన్ష్ జైన్ తన పేరును రిజిస్టర్ చేసుకున్నప్పటికీ వేలంలో అతడిని ఎవరు కొనుగోలు చేయకపోవడంతో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. ఈ మధ్యకాలంలో ఐపీఎల్ ద్వారా కాకుండా దేశవాలీ క్రికెట్‌లో రాణించి జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న అరుదైన క్రికెటర్ల జాబితాలో సారాన్ష్ జైన్ పేరును లిఖించుకున్నాడు.
Saransh Jain has earned his maiden Test call-up 👏
Take a look at the new off-spinner, who set the stage on fire with his stunning 5/49 in the Duleep Trophy final. 👌 pic.twitter.com/VIlTxFDhAy— BCCI Domestic (@BCCIdomestic) July 28, 2026
Read: కోచ్ మార్పుకు డిమాండ్.. గంభీర్, లక్ష్మణ్ మధ్య తేడా అదే!


