breaking news
Team Squad
-
భారత్‌లో మల్టీ ఫార్మాట్ సిరీస్.. ఆసీస్ జట్టు ప్రకటన
ఆస్ట్రేలియా సీనియర్ జట్టు ప్రస్తుతం పాకిస్తాన్ టూర్ వెళ్లేందుకు సిద్ధమవుతుంటే, తాజాగా వచ్చే నెలలో భారత్‌లో జరగనున్న అండర్-19 మల్టీ ఫార్మాట్ సిరీస్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా 16 మందితో కూడిన అండర్-19 జట్టును ప్రకటించింది. సెప్టెంబర్, అక్టోబర్ మధ్యలో జరగనున్న ఈ మల్టీ ఫార్మాట్ సిరీస్‌లో ఆస్ట్రేలియా అండర్-19 జట్టు మూడు యూత్ వన్డేలతో పాటు రెండు యూత్ టెస్టులు (నాలుగు రోజులు) ఆడనుంది. ఈ నేపథ్యంలోనే క్రికెట్ ఆస్ట్రేలియా సోమవారం 16 మందితో జట్టును ప్రకటించింది. కేసీ బార్టన్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, విల్ బైరోమ్ అతడికి డిప్యుటీగా ఉండనున్నాడు. 16 మందిలో కేసీ బార్టన్, విల్ బైరోమ్ మాత్రమే జింబాబ్వే వేదికగా జరిగిన అండర్-19 ప్రపంచకప్‌లో ఆడారు. ఇక ఇదే జట్టులో భారత సంతతి కుర్రాడు, గుజరాత్‌కు చెందిన నీల్ పటేల్ చోటు దక్కించుకున్నాడు.ఇక జట్టులో క్వీన్స్లాండ్ నుంచి ఐదుగురు ఆటగాళ్లు ఉండగా, విక్టోరియా, న్యూ సౌత్‌వేల్స్ నుంచి ముగ్గురేసి, తస్మానియా, సౌత్ ఆస్ట్రేలియా, వెస్ట్రన్ ఆస్ట్రేలియా నుంచి మిగిలిన ఆటగాళ్లు ఉన్నారు. ఇక మ్యాచ్‌లన్నీ రాజ్‌కోట్, అహ్మదాబాద్ వేదికగా జరగనున్నాయి.భారత్‌లో ఆసీస్ సిరీస్ షెడ్యూల్👉తొలి యూత్ వన్డే – శుక్రవారం, సెప్టెంబర్ 18👉రెండో యూత్ వన్డే – సోమవారం, సెప్టెంబర్ 21👉మూడో యూత్ వన్డే – బుధవారం, సెప్టెంబర్ 23👉మొదటి యూత్ టెస్ట్ – ఆదివారం, సెప్టెంబర్ 27-30 వరకు👉రెండో యూత్ టెస్ట్ – సోమవారం, అక్టోబర్ 5-8 వరకుభారత్లో సిరీస్ నిర్వహణ ఎందుకంటే?ఇండియా అండర్-19 జట్టుతో మల్టీ ఫార్మాట్లో సిరీస్ నిర్వహణ ఎందుకు అనే దానిపై క్రికెట్ ఆస్ట్రేలియా హెడ్ ఆఫ్ నేషనల్ డెవలప్మెంట్ అధికారిణి సొన్యా థాంప్సన్ వివరణ ఇచ్చారు. "మా పాత్‌వేస్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఆస్ట్రేలియాలోని కొంతమంది అత్యుత్తమ యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలను కల్పించి వారిని ప్రోత్సహించడం మాకు చాలా సంతోషంగా ఉంది. కఠిన పరిస్థితుల్లో భారత్‌ను ఎదుర్కోవడం ఆటగాళ్లకు సాంకేతికంగా, మానసికంగా ఎదగడానికి సహాయపడుతుంది. భారత్‌లో పర్యటించడం, సవాలుతో కూడిన పరిస్థితుల్లో అత్యున్నత స్థాయి ప్రత్యర్థులతో తలపడడం ద్వారా అనుభవంతో కూడిన పాఠాలు నేర్చుకుంటారు. ఇది అన్ని ఫార్మాట్లలో ఆటగాళ్లను సాంకేతికంగా, మానసికంగా పరీక్షిస్తుంది," అని థాంప్సన్ తెలిపారు. మరోవైపు ఆసీస్‌తో మల్టీ ఫార్మాట్ సిరీస్‌కు భారత అండర్-19 జట్టును బీసీసీఐ త్వరలోనే ప్రకటించనుంది.ఆస్ట్రేలియా అండర్-19 జట్టు:కేసీ బార్టన్ (కెప్టెన్), హేడెన్ బార్బులోవిక్, ఎలీ బ్రెయిన్, విల్ బైరోమ్ (వైస్ కెప్టెన్), బ్లేక్ క్యాటిల్, జాక్ జోస్నెక్, స్పెన్సర్ గ్రీన్, కానర్ గ్రెగొరీ, చార్లీ హెండర్సన్, జెడ్ హోలిక్, మాథ్యూ లాఫ్, నీల్ పటేల్, జాకబ్ పీట్జ్, పాట్రిక్ సుల్లివన్, థియో సింగోస్, థామస్ వాసియో.Introducing our Australian Men's Under 19 squad to tour India next month 👋 pic.twitter.com/1z8Vf6erj7— Cricket Australia (@CricketAus) August 2, 2026చదవండి: విండీస్‌కు ఆపద్బాంధవుడిలా.. మొన్న బంతితో, ఇవాళ బ్యాట్‌తో! -
సుందర్ స్థానంలో జట్టులోకి.. ఎవరీ సారాన్ష్ జైన్?
టీమిండియా తరఫున సారాన్ష్ జైన్ రూపంలో దేశవాళీ సీనియర్ క్రికెటర్ అంతర్జాతీయంగా అరంగేట్రం చేయనున్నాడు. శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు గాయపడిన వాషింగ్టన్ సుందర్ స్థానంలో మధ్యప్రదేశ్ ఆల్‌రౌండర్ సారాన్ష్ జైన్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ బౌలర్ అయిన సారాన్ష్ జైన్ లోయర్ ఆర్డర్లో బ్యాటర్‌గా పరుగులు సాధించడంలో సమర్థుడు. దీంతో లంకతో సిరీస్‌లో సారాన్ష్ ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వయసు కూడా దీనికి మరో ప్రధాన కారణం. 33 ఏళ్ల వయసులో జాతీయ జట్టుకు ఎంపికైన సారాన్ష్ 2014లో మధ్యప్రదేశ్ తరఫున ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి మధ్యప్రదేశ్‌కు ప్రధాన ఆటగాడిగా మారిపోయిన సారాన్ష్ ఆ తర్వాత సెంట్రల్ జోన్‌తో పాటు రెస్టాఫ్ ఇండియాకు కూడా ప్రాతినిధ్యం వహించాడు. తండ్రి కూడా క్రికెటరే.. స్పిన్ బౌలర్ అయిన సారాన్ష్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 181 వికెట్లతో పాటు 2,223 పరుగులు సాధించాడు. సారాన్ష్ జైన్ తండ్రి సుబోధ్ జైన్ కూడా క్రికెటరే. మధ్యప్రదేశ్ తరఫున రంజీ ట్రోఫీలో ఆడారు. రైట్ ఆర్మ్ ఆఫ్‌బ్రేక్ బౌలర్ అయిన సుబోధ్ జైన్ తొమ్మిది మ్యాచ్‌ల్లో మధ్యప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించారు. ఇక సారాన్ష్ జైన్ దేశవాళీ సీనియర్ కోచ్ చంద్రకాంత్ పండిట్ వద్ద శిక్షణ పొంది ఆటలో మరింత రాటుదేలాడు. 2022లో తొలిసారి రంజీ ట్రోఫీ గెలిచిన మధ్యప్రదేశ్ జట్టులో సారాన్ష్ జైన్ సభ్యుడిగా ఉన్నాడు. చెన్నై వేదికగా ముంబైతో జరిగిన రంజీ ఫైనల్లో తొలి ఇన్నింగ్స్‌లో కీలక హాఫ్ సెంచరీ చేయడంతో పాటు రెండు వికెట్లు తీసి విజయంలో కీలకపాత్ర పోషించాడు. లంక-ఏపై రాణించి సెలెక్టర్ల దృష్టిలో..ఇటీవలే శ్రీలంక-ఏతో జరిగిన రెండో అనధికారిక టెస్టులో సారాన్ష్ జైన్ రాణించాడు. బ్యాట్‌తో 70 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో ఆరు వికెట్లు తీసి జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతోనే సెలెక్టర్ల దృష్టిలో పడిన సారాన్ష్ జైన్ తాజాగా సుందర్ స్థానంలో లంకతో సిరీస్‌కు ఎంపికయ్యాడు. వేలంలో అన్సోల్డ్ఇక ఐపీఎల్ 2024 నుంచి 2026 వరకు సారాన్ష్ జైన్ తన పేరును రిజిస్టర్ చేసుకున్నప్పటికీ వేలంలో అతడిని ఎవరు కొనుగోలు చేయకపోవడంతో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. ఈ మధ్యకాలంలో ఐపీఎల్ ద్వారా కాకుండా దేశవాలీ క్రికెట్లో రాణించి జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న అరుదైన క్రికెటర్ల జాబితాలో సారాన్ష్ జైన్ పేరును లిఖించుకున్నాడు.Saransh Jain has earned his maiden Test call-up 👏Take a look at the new off-spinner, who set the stage on fire with his stunning 5/49 in the Duleep Trophy final. 👌 pic.twitter.com/VIlTxFDhAy— BCCI Domestic (@BCCIdomestic) July 28, 2026Read: కోచ్ మార్పుకు డిమాండ్.. గంభీర్, లక్ష్మణ్ మధ్య తేడా అదే! -
మెస్సీ ఆడడంపై క్లారిటీ.. అర్జెంటీనా జట్టు ప్రకటన
జూన్ 11 నుంచి మొదలుకానున్న ఫిఫా వరల్డ్‌కప్ ఫుట్‌బాల్ టోర్నీ కోసం అర్జెంటీనా శుక్రవారం తమ జట్టును ప్రకటించింది. 2022లో ఫిఫా చాంపియన్‌గా నిలిచిన అర్జెంటీనాను మళ్లీ మెస్సీనే నడిపించనున్నాడు. 26 మంది సభ్యులతో కూడిన బృందాన్ని అర్జెంటీనా జట్టు కోచ్ లియోనిల్ స్కలోని ప్రకటించారు. ఇటీవలే ఇంటర్ మియామి క్లబ్ తరఫున మ్యాచ్ ఆడుతూ మెస్సీ గాయపడిన సంగతి తెలిసిందే. గాయం కారణంగా అతడు ఫిఫా వరల్డ్‌కప్‌కు దూరమవనున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ వార్తలకు తెరదించుతూ మెస్సీ ఫిఫా వరల్డ్‌కప్‌లో ఆడనున్నట్లు, జట్టుకు సారథిగా అతనే వ్యవహరించనున్నట్లు స్కలోని వెల్లడించాడు. ఈ నేపథ్యంలో మెస్సీ రికార్డు స్థాయిలో ఆరోసారి ఫిఫా ప్రపంచకప్ ఆడనున్నాడు. ఎనిమిది సార్లు బాలన్ డీ ఓర్ అవార్డు గెలిచిన మెస్సీకే సారధ్య బాధ్యతలను అప్పగించారు. ఖతార్‌లో నాలుగేళ్ల క్రితం జరిగిన వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా టైటిల్‌ను గెలిచిన విషయం తెలిసిందే. అయితే అర్జెంటీనా జట్టులో రియల్ మాడ్రిడ్ ప్లేయర్ ఫ్రాంకో మస్తానటునో పేరు మాత్రం జట్టులో కనిపించలేదు. జూన్ 11న మొదలుకానున్న ఫిఫా ప్రపంచకప్‌కు అమెరికా, మెక్సికో, కెనడాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. గ్రూప్ జెలో ఉన్న అర్జెంటీనా తమ తొలి మ్యాచ్‌ను కన్సాస్ సిటీ వేదికగా జూన్ 17న అల్జీరియాతో ఆడనుంది. అర్జెంటీనాతో పాటు అల్జీరియా, ఆస్ట్రియా, జోర్డాన్లు గ్రూప్-జెలో ఉన్నాయి. అర్జెంటీనా జట్టు:గోల్‌కీపర్స్: ఎమిలియానో మార్టినేజ్, జిరోనిమా రుల్లి, జువాన్ ముసోడిఫెండర్స్: గొంజాలో మాంటిల్, నాహుల్ మోలినా, లిసాండ్రో మార్టినేట్, నికోలస్ ఒటమెండి, లియోనార్డో బార్లేడి, క్రిస్టియానా రొమారియో, ఫకుండా మెదీనా, నికోలస్ తగ్లియాఫికోమిడ్ఫీల్డర్లు: లియాండ్రో పరేడ్స్, రోడ్రిగో డీ పాల్, ఎక్స్కుయల్ పాలేసియస్, ఎంజో ఫెర్నాండేజ్, అలెక్సిస్ మాక్ అలిస్టర్, జియోవాని లో సెల్సో, వాలెంటినా బార్కోస్ట్రైకర్లు: లియోనిల్ మెస్సి (కెప్టెన్) , నికోలస్ పాజ్, థియాగో అల్మడా, నికోలస్ గొంజాలెజ్, జులియన్ అల్వరేజ్, గులియానో సిమోని, లౌతారో మార్టినేజ్, జోస్ మాన్యువెల్ లోపేజ్చదవండి: ‘అఫ్రిదితో పోలిక.. ఇది అవమానించడమే!’ -
షోయబ్ మాలిక్, సర్ఫరాజ్‌లకు నో చాన్స్; పాక్ టీ20 జట్టు ఇదే
Pakistan T20 World Cup Squad 2021.. అక్టోబర్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు 15 మందితో కూడిన జట్టును పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) సోమవారం ప్రకటించింది. బాబర్ అజమ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్న ఈ జట్టులో ఐదుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్, ఇద్దరు వికెట్ కీపర్స్, నలుగురు ఆల్‌రౌండర్స్, నలుగురు ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. కాగా ఫఖర్ జమన్, ఉస్మాన్ ఖాదీర్, షాహనవాజ్ దహానిలను రిజర్వ్ ఆటగాళ్లుగా ప్రకటించారు. ఊహించనట్టుగానే యువ ఆటగాడు అజమ్ ఖాన్ తుది జట్టులో చోటు దక్కించుకోగా.. ఆసిఫ్ అలీ, కుష్దిల్ షాలాంటి కొత్త మొహాలు జట్టులో ఉన్నారు. ఇక పాక్ సీనియర్ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్, మరో సీనియర్ బ్యాట్స్‌మన్ సర్ఫరాజ్ అహ్మద్‌లకు చోటు దక్కకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఇక ఆల్‌రౌండర్ షార్జీల్ ఖాన్‌కు కూడా ప్రాబబుల్స్‌లో చోటు దక్కలేదు. చదవండి: CPL 2021: వార్నీ.. కోపాన్నంత హెల్మెట్‌పై చూపించాడు ఇక టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్, భారత్ ఒకే గ్రూఫ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. గ్రూఫ్ 2లో భాగంగా భారత్,పాకిస్తాన్,న్యూజిలాండ్,అఫ్గానిస్తాన్,బి1 క్వాలిఫయర్, ఏ2 క్వాలిఫయర్ జట్లు ఉన్నాయి. కాగా పాకిస్తాన్ టీమిండియాతో అక్టోబర్ 24న తొలి మ్యాచ్ ఆడనుంది. 15 మందితో పాక్ టీ20 ప్రాబబుల్స్: బాబర్ అజమ్ (కెప్టెన్), షాదాబ్ ఖాన్(వైస్ కెప్టెన్), మహ్మద్ హఫీజ్, ఆసిఫ్ అలీ, అజమ్ ఖాన్, హారిస్ రౌఫ్, హసన్ అలీ, ఇమాద్ వసీం, ఖుష్దీల్ షా, మొహమ్మద్ హస్నైన్, మహ్మద్ నవాజ్, మహమ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), మొహమ్మద్ వసీం, షాహిన్ అఫ్రిది, సోహైబ్ మక్సూద్ చదవండి: 'రహానేను పక్కన పెట్టాల్సిన సమయం వచ్చేసింది' Asif and Khushdil return for ICC Men's T20 World Cup 2021 More details ➡️ https://t.co/vStLml8yKw#PAKvNZ | #PAKvENG | #T20WorldCup pic.twitter.com/9samGbJgDJ — PCB Media (@TheRealPCBMedia) September 6, 2021 -
విండీస్‌తో టీమిండియా జట్టు ఇదే; భూవీకి పిలుపు
కోల్‌కతా : స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగే వన్డే, టీ 20 సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలో సెలక్షన్ కమిటీ కోల్‌కతాలో సమావేశమై జట్టును ప్రకటించింది. బంగ్లాతో జరిగిన టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్న టీమిండియా కెప్టెన్ విరాట్‌కోహ్లి విండీస్‌తో జరిగే సిరీస్‌లో ఆడనున్నాడు. అయితే బంగ్లాతో టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన రోహిత్‌శర్మకు ఈ సిరీస్‌కు విశ్రాంతినిస్తారని భావించినా వన్డే, టీ20 జట్లకు ఎంపిక చేశారు. ఇక ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న మరో ఓపెనర్ శిఖర్ ధవన్ మాత్రం తన స్థానాన్ని నిలుపుకున్నాడు. ఇక స్వింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ తిరిగి వన్డే, టీ20ల్లోకి పునారగమనం చేశాడు. తాజాగా ప్రకటించిన వన్డే, టీ20 జట్టు వివరాలు.. టీమిండియా వన్డే జట్టు : విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధవన్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, కేదార్ జాదవ్, మనీష్ పాండే, శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్ టీమిండియా టీ20 జట్టు : విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధవన్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, కేదార్ జాదవ్, మనీష్ పాండే, శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్, వాషింగ్టన్ సుందర్ -
ఇంటర్ పరీక్షలు ప్రారంభం
జనరల్ విభాగంలో 2,975 మంది విద్యార్థుల గైర్హాజరు విద్యారణ్యపురి : ఇంటర్ వార్షిక పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాలకు అనుమతి లేదనే నిబంధన విధించడంతో విద్యార్థులు ఉదయం 8.30 గంటల కల్లా చేరుకున్నారు. కొందరు విద్యార్థులు ఉరుకులు పరుగుల మీద పరీక్షా కేంద్రాలకు చేరుకొన్నారు. ప్రథమ సంవత్సరం జనరల్ విభాగంలో 44,766 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండ గా 41,791 మంది హాజరయ్యూరని, 2,975 మంది పరీక్షకు రాలేదని ఇంటర్ విద్య ఆర్ఐవో షేక్ అహ్మద్ వెల్లడించారు. ఒకేషనల్ కోర్సుల ప్రథమ సంవత్సరంలో 5,382 మంది విద్యార్థులకు 4,6452 మంది హాజరుకాగా.. 730 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారన్నారు. పలు చోట్ల హైస్కూళ్లలో కూడా పరీక్షా కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. ఉదహరణకు మహబూబాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రంలో ఎక్కువ మంది విద్యార్థులుండటంతో పక్కనే ఉన్న ప్రభుత్వ హైస్కూల్లోను పరీక్షా కేంద్రంగా ఏర్పాటు చేశారు. పాలకుర్తి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల పరీక్షాకేంద్రంలో కొంత మంది విద్యార్థులను నేలమీద కూర్చోబెట్టి పరీక్ష రాయిస్తుండగా అక్కడికి వెళ్లి స్క్వాడ్ బృందం ఆర్ఐవో దృష్టికి తీసుకెళ్లింది. వెంటనే ఆ కళాశాల ప్రిన్సిపాల్‌తో మాట్లాడి ఫర్నీచర్ సౌకర్యం కల్పించినట్లు ఆర్ఐవో వెల్లడించారు. కాగా, నేడు ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నారుు.


