విండీస్‌తో టీమిండియా జట్టు ఇదే; భూవీకి పిలుపు | ODI And T20 India Squad For West Indies Series In Kolkata | Sakshi
Sakshi News home page

విండీస్‌తో టీమిండియా జట్టు ఇదే; భూవీకి పిలుపు

Nov 21 2019 9:45 PM | Updated on Nov 21 2019 9:49 PM

ODI And T20 India Squad For West Indies Series In Kolkata - Sakshi

కోల్‌కతా : స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగే వన్డే, టీ 20 సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలో సెలక్షన్‌ కమిటీ కోల్‌కతాలో సమావేశమై  జట్టును ప్రకటించింది. బంగ్లాతో జరిగిన టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్న టీమిండియా కెప్టెన్‌ విరాట్‌కోహ్లి విండీస్‌తో జరిగే సిరీస్‌లో ఆడనున్నాడు. అయితే బంగ్లాతో టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన రోహిత్‌శర్మకు ఈ సిరీస్‌కు విశ్రాంతినిస్తారని భావించినా వన్డే, టీ20 జట్లకు ఎంపిక చేశారు. ఇక  ఫామ్‌ కోల్పోయి తంటాలు పడుతున్న మరో ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌ మాత్రం తన స్థానాన్ని నిలుపుకున్నాడు. ఇక స్వింగ్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ తిరిగి వన్డే, టీ20ల్లోకి పునారగమనం చేశాడు. తాజాగా ప్రకటించిన వన్డే, టీ20 జట్టు వివరాలు..

టీమిండియా వన్డే జట్టు : విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధవన్‌, కేఎల్‌ రాహుల్‌, రిషబ్‌ పంత్‌, కేదార్‌ జాదవ్‌, మనీష్‌ పాండే, శ్రేయాస్ అయ్యర్‌, రవీంద్ర జడేజా, శివమ్‌ దూబే, యజువేంద్ర చాహల్‌, కుల్దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ షమీ, దీపక్‌ చాహర్‌, భువనేశ్వర్‌ కుమార్‌

టీమిండియా టీ20 జట్టు : విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధవన్‌, కేఎల్‌ రాహుల్‌, రిషబ్‌ పంత్‌, కేదార్‌ జాదవ్‌, మనీష్‌ పాండే, శ్రేయాస్ అయ్యర్‌, రవీంద్ర జడేజా, శివమ్‌ దూబే, యజువేంద్ర చాహల్‌, కుల్దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ షమీ, దీపక్‌ చాహర్‌, భువనేశ్వర్‌ కుమార్‌, వాషింగ్టన్‌ సుందర్‌

Advertisement
 
Advertisement
Advertisement