అరుదైన మైలురాయిని తాకిన రో-కో | ROHIT SHARMA, VIRAT KOHLI PAIR COMPLETED 8000 RUNS IN INTERNATIONAL CRICKET | Sakshi
Sakshi News home page

అరుదైన మైలురాయిని తాకిన రో-కో

Jul 16 2026 7:45 PM | Updated on Jul 16 2026 7:59 PM

ROHIT SHARMA, VIRAT KOHLI PAIR COMPLETED 8000 RUNS IN INTERNATIONAL CRICKET

టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి కలిసికట్టుగా మరో ఘనత సాధించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ ఇ‍ద్దరు 8000 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేశారు. తద్వారా ఈ ఘనత సాధించిన మూడో భారత జోడీగా, ఓవరాల్‌గా తొమ్మిదో జోడీగా రికార్డుల్లోకెక్కారు.

వీరికి ముందు భారత్‌ తరఫున గంగూలీ-టెండూల్కర్‌ (12400), ద్రవిడ్‌-టెండూల్కర్‌(11037) ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ రికార్డు శ్రీలంక స్టార్‌ ద్వయం మహేళ జయవర్దనే-కుమార సంగక్కర (13368) పేరిట ఉంది.

కార్డిఫ్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో రో-కో జోడీ ఈ ఘనత సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న భారత్‌ 30 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. 

గిల్‌ (31), రోహిత్‌ (26), ఇషాన్‌ కిషన్‌ (1) ఔట్‌ కాగా.. విరాట్‌ (65), శ్రేయస్‌ (33) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో సామ్‌ కర్రన్‌, అట్కిన్సన్‌, జాక్స్‌ తలో వికెట్‌ తీశారు. కాగా, 3 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్‌ తొలి వన్డే గెలిచి 1-0 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement