ఏకంగా 10 అడుగుల కోబ్రా : చున్నీలా మెడలో చుట్టేసుకుంది | 10 feet cobra was wrapped around the neck like a scarf in Bihar | Sakshi
Sakshi News home page

ఏకంగా 10 అడుగుల కోబ్రా : చున్నీలా మెడలో చుట్టేసుకుంది

Jul 16 2026 3:21 PM | Updated on Jul 16 2026 3:51 PM

10 feet cobra was wrapped around the neck like a scarf in Bihar

బిహార్‌లో వర్షాలతో నదుల నీటిమట్టం పెరగడం సర్వసాధారణం. ప్రస్తుతం పశ్చిమ చంపారన్ జిల్లాలో గండక్ నది నీటిమట్టం పెరుగుతుండటంతో, వన్యప్రాణులు జనావాసాల్లోకి రావడం మొదలుపెట్టాయి. ఈ క్రమంలోనే ఏకంగా 10అడుగుల పొడవైన విషపూరితమైన కోబ్రా ఒకరి ఇంట్లోకి వచ్చింది. దీంతో ఒక్కసారిగా అక్కడంతా ఆందోళన నెలకొంది. కానీ తక్షణమే 'స్నేక్ లేడీ'  రంగంలో దూకడంతో అంతా సద్దు మణిగింది.దీనికి సంబంధించిన వీడియో నెట్టింగ తెగ చక్కర్లు కొడుతోంది. 

పశ్చిమ చంపారన్‌లోని వాల్మీకినగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగుచూసింది. గ్రామానికి చెందిన మున్నీ లాల్ అనే వ్యక్తి ఇంట్లోకి దాదాపు 10 అడుగుల పొడవైన భారీ విషసర్పం దూరింది. ఇంట్లో అంత పెద్ద పాము బుసలు కొట్టడం చూసి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా భయంతో కేకలు వేశారు. ఆ శబ్దాలు విని చుట్టుపక్కల గ్రామస్తులు కూడా అక్కడికి చేరుకోవడంతో ఆ ప్రాంతంలో కాసేపు తీవ్ర భయాందోళనలు, గందరగోళం నెలకొన్నాయి.

 

ఇదీ చదవండి: మూడో పెళ్లి : ఫత్వా, లవ్ జిహాద్ ఆరోపణలపై స్పందించిన ఆమీర్‌

మహిళా స్నేక్ క్యాచర్ 'జానకి దేవి'
ఇంట్లో పాము ఉన్న సమాచారం అందుకున్న స్థానిక మహిళా సర్ప మిత్ర (స్నేక్ క్యాచర్), స్నేక్‌ లేడీ  తక్షణమే అక్కడికి చేరుకున్నారు. ఆమె ఏమాత్రం భయపడకుండా, చాలా చాకచక్యంగా ఆ భారీ కోబ్రాను పట్టుకున్నారు. పాము పొడవు చాలా ఎక్కువగా ఉండటంతో, ఆమె దాని తల భాగాన్ని చేత్తో పట్టుకుని, మిగిలిన శరీరాన్ని తన మెడలో దుపట్టా లాగా వేసుకుని అడవి వైపు బయలుదేరారు. ఈ దృశ్యం చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. అనంతరం ఆ పామును సురక్షితంగా వాల్మీకినగర్ అటవీ ప్రాంతంలో వదిలేశారు. దీంతో అటు మనుషులకు, ఇటు ఆ వన్యప్రాణికి ఎలాంటి హాని జరగకుండా కథ సుఖాంతమైంది.

ఇదీ చదవండి: రూ. 150 కోట్ల ఆస్తి, తండ్రిని కాల్చి చంపిన పెద్ద కొడుకు

అటవీ శాఖ అధికారుల విజ్ఞప్తి
నేపాల్ నుండి వచ్చే వరద నీరు, అడవుల్లో నీరు చేరడం వల్ల పాములు, ఇతర వన్యప్రాణులు సురక్షిత ప్రాంతాల కోసం జనావాసాల్లోకి వస్తున్నాయని అటవీశాఖ తెలిపింది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్ల చుట్టుపక్కల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పాములు కనిపిస్తే వాటిని చంపకుండా, వెంటనే అటవీ శాఖకు లేదా శిక్షణ పొందిన స్నేక్ క్యాచర్లకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. 

ఇదీ చదవండి: ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు : వాంగ్‌చుక్‌ భావోద్వేగ సందేశం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement