ప్రేమ కోసం సైకిల్‌పై భారత్‌ నుంచి స్వీడన్‌కు..! ట్విస్ట్‌ ఏంటంటే.. | Pradyumna Kumar Mahanandia cycled from India to Sweden for love in 1970 | Sakshi
Sakshi News home page

ప్రేమ కోసం సైకిల్‌పై భారత్‌ నుంచి స్వీడన్‌కు..! ట్విస్ట్‌ ఏంటంటే..

Jul 16 2026 3:26 PM | Updated on Jul 16 2026 3:57 PM

Pradyumna Kumar Mahanandia cycled from India to Sweden for love in 1970

ఇప్పుడు చెప్పుకోబోయే ప్రేమ కథ ఏ సినీ దర్శకుడు కలం నుంచి జాలువారక ముందే జరిగిన అద్భుత ప్రేమకథ. సినిమాని మించిన బ్యూటిఫుల్‌ లవ్‌ స్టోరీ. భయంకర నిరీక్షణ..అలాగే అసలు ఆ జంట ఒక్కటయ్యే ఛాన్స్‌లేని స్టోరీ. ఎందుకంటే కేవలం ఇరువురి మధ్య అంతస్తుల తేడానే కాదు..ఇద్దరు కలుసుకోవాలంటే దేశాలు కాదు..ఖండాలు దాటి చేరుకుంటేనే గానీ సఫలం కానీ లవ్‌ స్టోరీ ఇది.  పోనీ వీసా అతడికి సాధ్యమా అంటే అంత డబ్బు, వ్యవధి లేదు. కానీ అతడు ఆమెను ఎలా చేరుకున్నాడనేది తెలిస్తే..క్షణం క్షణం ఉత్కంఠ, కన్నీళ్లు వచ్చేస్తుంటాయ్‌. ఒక కళాకారుడు, విదేశీ యాత్రికురాలు మధ్య విచిత్రంగా చోటుచేసుకున్న ఆ అందమైన ప్రేమ కథ గురించి తెలుసుకుందామా..!.

డాక్టర్‌ ప్రద్యుమ్న కుమార్‌(పీకే) మహానండియా, షార్లెట్‌ వాన్‌ పెడ్విన్‌ల స్టోరీ ఇది. అత్యంత అరుదైన ప్రేమ కథగా చెప్పొచ్చు. పీకేగా పిలిచే ప్రద్యుమ్న కుమార్‌ 1949లో ఒడిశాలో జన్మించారు. ఒడిశాలలో మారుమూల గ్రామంలో పెరిగిన  దళితుడు కావడంతో కులవివక్షను తీవ్రంగా ఎదుర్కొన్నాడు. అయితే అతడి తల్లి ఒక వింత కథ చెబుతూ ఊరడిస్తూ ఉండేది. అయితే పీకే స్కూల్‌ విద్య అనంతరం కాలేజ్‌ చదువు కోసం అని ఢిల్లీకి వెళ్లాడు. 

పీకే పేదవాడే అయిన చిత్రలేఖనంలో ఉన్న అపారమైన ప్రతిభ కారణంగా కళాకారుడుగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఎవ్వరి చిత్రపటమైన జస్ట్‌ 10 నిమిషాల్లో వేసి అబ్బురపరిచేవాడు. అలా 1975లో ఓ చలికాలపు సాయంత్రం షార్లెట్ వాన్ షెడ్విన్ అనే ఒక యువ స్వీడిష్ మహిళ పీకే ప్రతిభను చూసి తనని ముఖాన్ని కూడా చిత్రించమని కోరుతుంది. అయితే పీకే అందరివి క్షణాల్లో వేస్తే..ఆమెది మాత్రం సరిగ్గా గీయలేక ఇబ్బందిపడతాడు. దాంతో ఆమె మరోరోజు వచ్చి తన చిత్రపటాన్ని గీయమని అంటుంది. అయితే ఆ తర్వాత రోజు కూడా పరిస్థితి అలానే ఉంటుంది. తన మనసు లగ్నం చేయలేకపోతున్నట్లు ఆ విదేశీ యువతికి చెబుతాడు. 

అచ్చం సినిమాలలో ఆమెను చూడగానే తన భాగస్వామిలా అనిపించడం మొదలవ్వడంతో ఏకాగ్రతతో ఆమె చిత్రాని గీయలేకపోతుంటాడు పీకే. అంతేగాదు ఆమెను చూస్తున్న తీరున కూడా తప్పుగా భావించి పోలీసులకు ఫిర్యాదు చేస్తుందేమోనని టెన్షన్‌ పడేవాడు. ఇక ధైర్యం చేసి ఆమెను టీకి ఆహ్వానించి మాటలు కలుపుతాడు. 

అంతేగాదు ఆమె ఎవరో తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో ఆమె వివరాలను అగుడగగా..అందుకు షార్లెట్‌ తను ఉన్నత స్వీడన్‌ కుటుంబానికి చెందిన మహిళనని, తన స్నేహితులతో కలసి, ప్రసిద్ధ హిప్పీ ట్రైల్ మార్గంలో, యూరప్, టర్కీ, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్‌లను దాటుకుంటూ భారతదేశానికి కారులో వచ్చినట్లు వెల్లడించింది. అంతేగాదు ఆమె అతడి అమాయకత్వం, నిజాయితీ ఎంతగానో నచ్చుతాయి. అలా ఇద్దరు మంచి స్నేహితులవుతారు. పైగా పీకే తన సొంత రాష్ట్రమైన ఒరిస్సాను కూడా చూపిస్తాడు. అక్కడ కోణార్క్‌ దేశాలయానికి తీసుకువెళ్తాడు. 

అది చూడగానే లండన్‌లో విద్యార్థిగా ఉన్నప్పుడూ..గదిలో ఫ్రేమ్ కట్టించుకున్న ఒక చిత్రపటంలో ఉన్న ఆలయం ఠక్కున గుర్తుకొస్తుంది. ఆ ఆలయం వద్దే తాను నిలబడి ఉన్నానా అని తెలుసుకుని ఆశ్చర్యపోతుంది. అంతేగాదు ఆమె చీర కట్టుకుని మరి అతడి కుటుంబాన్ని కలుసుకుంటుంది. అంతేగాదు అక్కడి  గిరిజన సంప్రదాయంలోనే ఇద్దరు పెళ్లి కూడా చేసుకుంటారు. ఇక్కడ అసలు ట్విస్ట్‌ మొదలవుతుంది. 

షార్లెట్‌ చివరికి ఢిల్లీకి తిరిగి వెళ్లి..అక్కడ నుంచి ఆ తర్వాత స్వీడన్‌లోని తాను నివసించే బోరాస్ అనే పట్టణానికి పయనమవ్వాల్సి వస్తుంది. అదీగాక పీకా ఇంకా చదువు పూర్తి చేయాల్సి ఉంది. దాంతో ఇద్దరు ఒక వాగ్దానం చేసుకుని మరి విడిపోతారు. సాధ్యమైనంత త్వరలోనే స్వీడన్‌కు వస్తానని ఆమెకు మాట కూడా ఇస్తాడు. అలా ఏళ్ల తరబడి ఉత్తారులు రాసుకుంటూ తమ బంధాన్ని సజీవంగా ఉంచుకుంటారు. 

అంతేగాదు ఆమెకు ఇచ్చిన మాట మీదే నిలబడాలని అనుకుంటాడు. కానీ వాస్తవం చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే..యూరప్‌కు టికెట్‌ కొనడానికి అతని వద్ద అంత డబ్బు లేదు. కాబట్టి చాలమంది తమ ప్రేమను వదులుకునేందుకే ప్రయత్నిస్తారు. కానీ ఇక్కడ పీకే మరో మార్గం ఎంచుకున్నాడు. 1977 జనవరిలో, అతను తనకున్నదంతా అమ్మేసి, ఒక పాత సైకిల్ కొని, షార్లెట్‌ను కలవడానికి బయలుదేరాడు. 

సరిగ్గా జనవరి 22, 1977న తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. రోజుకు సుమారు 70 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ..పాకిస్తాన్‌, అఫ్ఘనిస్తాన్‌, ఇరాన్‌, టర్కీల గుండా ప్రయాణించి ఆపై యూరప్‌కు వెళ్లాడు. ఆ క్రమంలో చాలాసార్లు సైకిల్‌ పాడైంది, తినడానికి తిండి లేదు, నిద్రలేని రాత్రులు ఇలా ఎన్నో బాధలు ఎదుర్కొన్నాడు. అయితే కేవలం షార్టెట్‌ని కలుసుకోవాలన్న ఆరాటం ఆ సమస్యలన్నింటిని అధిగమించే శక్తిని అందించిందని అంటాడు పీకే. అయితే ఆ క్రమంలో అతడికి తన కళే పాస్‌పోర్ట్‌గానూ, జీవనాధార సాధనంగానూ ఉపయోగపడింది. ఎందుకంటే అపరిచితుల చిత్రపటాలు గీస్తూ వాళ్తో కమ్యూనికేషన్‌ సాగించేవాడు. 

ఆ క్రమంలో కొందరు డబ్బు, ఆహారం, చోటు తదితరాలు అందించేవారని చెప్పుకొచ్చాడు. అంతేగాదు ప్రేమ అనేది సార్వత్రిక భాష అని ఏ దేశ ప్రజలైనా సులభంగా అర్తం చేసుకుంటారని అంటున్నాడు. అలా మే 28న, నెలల తరబడి ప్రయాణం తర్వాత, అతను ఇస్తాంబుల్, వియన్నా మీదుగా ఐరోపా చేరుకుని రైలులో గోథెన్‌బర్గ్‌కు చేరుకుని అక్కడ నుంచి బోరాస్‌కు చేరుకున్నాడు. అక్కడితో పీకే కథ ముగిసిపోలేదు. ఎందుకంటే అక్కడ సంస్కృతితో, షార్టెట్‌ పేరెంట్స్‌తో కలసిపోవడం దగ్గర నుంచి వాళ్లు తమ ప్రేమను గుర్తించేంత వరకు ప్రతిదీ తనను తాను నిరూపించుకోవాల్సి వచ్చిందని అన్నాడు. 

అయతే షార్టెల్‌ ఆ విషయంలో అడుగడుగున తోడుగా నిలిచిందని తెలిపాడు. అలా చివరికి స్వీడన్‌లో అధికారికంగా తమ వివాహం జరిగిందని చెప్పుకొచ్చాడు. ఆ దపంతులకు ఇద్దరు పిల్లలు, ఇప్పుడు ఇరువురు 70వ దశకంలో ఉన్నారు. ఇప్పటికీ తమ మధ్య అంతే ప్రేమ ఉందని అంటున్నారు. అయితే చాలామంది తమ ప్రేమ కథ విని ఎందుకు విస్తుపోతుంటారో అర్థం కాదని అంటున్నాడు పీకే. తాను కేవలం తన ప్రియురాలు షార్లెట్‌ని కలుసుకోవాలన్న ఒకే ఒక్క లక్ష్యంలో ఇదంతా చేశానని అంటున్నాడు. అంతేగాదు సైక్లింగ్‌పై ప్రేమ లేదు కానీ ప్రేమ కోసం సైక్లింగ్‌ చేశా అని చమత్కరిస్తున్నాడు పీకే. ఈ స్టోరీ నిజమైన ప్రేమ ఎన్ని అడ్డంకులనైనా జయించగలదని నిరూపిస్తోంది కదూ..!.

(చదవండి: అక్కడ చిన్నారులకు..చిన్నప్పటి నుంచే ఆ జీవన నైపుణ్యాలు..!)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement