ప్రేమ పేరుతో నాలుగేళ్లు నా వెంటపడ్డాడు | Actress Anjali Reveals Her Childhood Love Story | Sakshi
Sakshi News home page

Actress Anjali: అలా షాకిచ్చా.. విసిరేసి వెళ్లిపోయాడు

Jul 9 2026 8:28 AM | Updated on Jul 9 2026 8:47 AM

Actress Anjali Reveals Her Childhood Love Story

ప్రతి మనిషి జీవితంలోనూ ఏదో ఒక దశలో ప్రేమ ఉంటుంది. కొందరు దాన్ని బయటకు చెప్పుకొంటారు. కొందరు మనసులోనే రహస్యంగా ఉంచుకుంటారు. సినిమా వాళ్లు దీనికి అతీతం కాదు. చాలామంది హీరోయిన్లు తన చిన్నప్పటి ప్రేమ సంగతుల్ని ఎప్పటికప్పుడు గుర్తుచేసుకుంటూనే ఉంటారు. హీరోయిన్ అంజలికి అలాంటి చిన్న లవ్‌ స్టొరీ ఉందట.

(ఇదీ చదవండి: మళ్లీ పెళ్లి చేసుకున్న హీరోయిన్ 'కలర్స్' స్వాతి)

2006లో 'కట్రదు తమిళ్‌' సినిమాతో కథానాయికిగా తమిళంలోకి ఎంట్రీ ఇచ్చిన అంజలి.. తర్వాత వరుసగా అవకాశాలు అందుకుని స్టార్ హీరోయిన్ అయింది. ఎంగేయుమ్‌ ఎప్పోదుమ్‌, కలగలప్పు లాంటి సక్సెస్‌‌ఫుల్‌ చిత్రాలు ఈమె ఖాతాలో ఉన్నాయి. తెలుగులోనూ పలు మూవీస్ చేసి హిట్స్ అందుకుంది. చిన్న గ్యాప్‌ తరువాత కోలీవుడ్‌లో' మకుటం'లో నటించింది. విశాల్‌ హీరోగా నటించి తొలి సారిగా దర్శకత్వం వహించిన చిత్రమిది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అంజలి.. టీనేజీలో తన జీవితంలో జరిగిన ప్రేమ సంఘటన గురించి చెప్పింది. నా క్లాస్ మేట్ ఒకరు 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. దానికి ఫుల్‌స్టాప్‌ పెట్టాలని భావించి, నువ్వు అంటే ప్రేమ లేదని చెప్పా. దాంతో అతను నీకు ధైర్యం ఉంటే నాకు రాఖీ కట్టు అని అన్నాడు. వెంటనే నేను రాఖీ కట్టేసరికి షాక్‌ అయినా అతడు.. వెంటనే దాన్ని తీసిపారేసి వెళ్లిపోయాడు. తర్వాత మేం ఎప్పటికీ కలుసుకోలేదు అని చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: అక్కినేని హీరోకి అగ్నిపరీక్ష.. 11 ఏళ్లుగా వెయిటింగ్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement