అక్కడ చిన్నారులకు..చిన్నప్పటి నుంచే ఆ జీవన నైపుణ్యాలు..! | Indian Woman Shares 5 Parenting Tips From European Parents | Sakshi
Sakshi News home page

అక్కడ చిన్నారులకు..చిన్నప్పటి నుంచే ఆ జీవన నైపుణ్యాలు..!

Jul 16 2026 12:32 PM | Updated on Jul 16 2026 12:45 PM

Indian Woman Shares 5 Parenting Tips From European Parents

విదేశీయలు మన భారతీయ పెంపకాన్ని మెచ్చుకుంటూ.. ఇక్కడ సంస్కృతికి అనుగుణంగా తమ పిల్లలను పెంచుకుంటామని చెప్పడం గురించి విన్నాం. కొందరు ఏకంగా ఇక్కడే తమ పిల్లల పెంపకం కోసం స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు కూడా. తాజాగా నెట్టింట వైరల్‌ అవుతున్న పోస్ట్‌ అందుకు పూర్తి విభిన్నం. ఆ పోస్ట్‌లో ఒక భారతీయ మహిళ విదేశీయుల నుంచి ఈ పేరెంటింగ్‌ టిప్స్‌ నేర్చుకున్నా అంటూ తన యూరప్‌ పర్యటన గురించి పంచుకుంది. ఇంతకీ ఏంటా పేరెంటింగ్‌ చిట్కాలంటే..

తరుచుగా తల్లుల ఆరోగ్యం గురించి మాట్లాడే డాక్టర్ సుఖ్మణి గుంబర్ నెలరోజుల యూరప్‌ పర్యటనలో నేర్చుకున్న విలువైన పెంపకపు చిట్కాలివే అంటూ ఓ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఆ వీడియోలో ఆమె యూరోపియన్‌  పెంపకపు శైలులు, ఆధునిక పోకడలకు ఎలా భిన్నంగా ఉంటాయో సోషల్‌ మీడియా వేదికగా పేర్కొంది. పిల్లల పెంపకం అంటే తరుచుగా రోజువారీ పనులను మరింత సులభతరం చేసుకోవడమేనని అంటోందామె. అంతేగాదు తను అక్కడ గమనించి తెలుసుకున్న ఆ ఐదు పేరెంటింగ్‌ టిప్స్‌ పిల్లల పెంపకంలో అద్భుతంగా పనిచేస్తాయని చెబుతోంది. 

ఆ ఐదు ఇవే..

పిల్లలను మన రోజువారీ పనుల్లో భాగం చేసుకోవాలని సూచిస్తోంది. కేఫ్‌లలో భోజనం చేయడం దగ్గర నుంచి రోజువారీ జర్నీలో ఇలా ప్రతి కార్యకలాపంలో వారిని భాగస్వామ్యులను చేయాలని అంటోందామె. తద్వారా సర్దుకుపోవడం, ఓపికతో ఉండటం నేర్చుకుంటారట.

నిరంత స్క్రీన్‌ సమయాలు, క్రమబద్ధమైన ఆటలే కాకుండా బోరుగా ఫీలయ్యేలా చేయడం కూడా మంచిదేనట పిల్లకు. అది విసుగుని పరిచయం చేసి, సహనంతో వ్యవహరించే జీవిత నైపుణ్యాన్ని అందిస్తుందట.

బహింరంగ ప్రదేశాల్లో అంటే రెస్టారెంట్‌లు లేదా ఫంక్షన్స్‌లలో వాళ్లతో కలిసి భోజనం చేయాలి. దాంతో బయటకొచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలి, ఎలా మర్యాదగా నడుచుకోవాలో నేర్చుకుంటారని చెబుతోంది.

అలాగే పిల్లలు తినే విషయంలో పెద్దలను అనుకరిస్తారు. ఒక్కోసారి మీరు తినేవే తింటానని పట్టుబట్టే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటప్పడు మొదట మీరే తినకుండా.. ఆయా ఆహారాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తే ఆటోమేటిగ్గా వాళ్లు కూడా తమను తాము నియంత్రించడానికి ప్రయత్నిస్తారట.

భారతీయ తల్లిదండ్రులు పిల్లలు బహిరంగ ప్రదేశాల్లో గనుక మారాం చేస్తూ.. ఏడుస్తుంటే గాబరపడుతుంటారు. అదే యూరోపియన్‌ పేరెంట్స్‌ ఎలాంటి ఆందోళన లేకుండా కూల్‌గా వ్యవహరిస్తూ..ప్రశాంతంగా పిల్లలతో మాట్లాడతారని అంటోంది. 

మన రోజువారి కార్యపాలలో వారిని భాగం చేస్తూ..సర్దుకుపోవడం, మర్యాదగా నడుచుకోవడం, ఓపికతో వ్యవహరించడం నేర్పిస్తే ..స్వతంత్ర వ్యక్తులుగా పెరగడానికి అవకాశం దొరకుతుందని డాక్టర్‌ గంబర్‌ చెబుతోంది. నెటిజన్లు కూడా ఆమె పోస్ట్‌కి మద్దతిస్తూ..సరిగ్గా చెప్పారంటూ పోస్టులు పెట్టారు.

 

(చదవండి: మామ్‌ వెయిట్‌లాస్‌ స్టోరీ..! 103 కిలోలు నుంచి 71 కిలోలకు..)

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement