కోల్‌కతా: టీఎంసీ అధినేత్రి,మాజీ సీఎం మమతా బెనర్జీకి బిగ్‌షాక్ తగిలింది. ప్రముఖ నటి, టీఎంసీ రాజ్యసభ ఎంపీ కోయల్ మల్లిక్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమెను పార్టీ తరఫున రాజ్యసభకు నామినేట్ చేయగా, కేవలం కొన్ని నెలల్లోనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆమె ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్‌ను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత టీఎంసీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. కోయల్ మల్లిక్ కంటే ముందే పార్టీకి చెందిన మరో ముగ్గురు కీలక రాజ్యసభ ఎంపీలు సుఖేందు శేఖర్ రాయ్, సుస్మితా దేవ్, ప్రకాష్ చిక్ బారైక్ తమ పదవులకు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. వరుస రాజీనామాలతో రాజ్యసభలో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ బలం గణనీయంగా పడిపోయింది.


