breaking news
India vs England
-
IND vs ENG: టాస్ గెలిచిన ఇంగ్లండ్
టీమిండియాతో తొలి వన్డేలో ఇంగ్లండ్ టాస్ గెలిచి.. తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో తొలి వన్డే జరుగుతోంది. ఇక ఈ సిరీస్ సందర్భంగా భారత బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ చాలాకాలం తర్వాత తిరిగి మైదానంలో అడుగుపెడుతున్నారు. ఈ ఇద్దరు చివరగా సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జనవరిలో జరిగిన వన్డే సిరీస్‌లో పాల్గొన్నారు. ఇదిలా ఉంటే.. ముందుగా టీ20 సిరీస్ జరగగా ఆతిథ్య ఇంగ్లండ్ టీమిండియాను 4-0తో వైట్‌వాష్ చేసింది. తుదిజట్లుఇంగ్లండ్జాకబ్ బెథెల్, బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), సామ్ కర్రన్, విల్ జాక్స్, జోఫ్రా ఆర్చర్, లియామ్ డాసన్, జోష్ టంగ్, ఆదిల్ రషీద్ఇండియారోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, గుర్నూర్ బ్రార్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ. -
వరల్డ్‌కప్ ప్రణాళికలు వేరు.. కోహ్లితో ఏం మాట్లాడానంటే?: గిల్
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో క్లీన్‌స్వీప్‌నకు గురైన టీమిండియా వన్డే సిరీస్‌కు సన్నద్ధమైంది. ఇరుజట్ల మధ్య బర్మింగ్‌హామ్ వేదికగా తొలి వన్డేకు రంగం సిద్ధమైంది. ఈ సిరీస్‌తో భారత బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ తిరిగి మైదానంలో అడుగుపెడుతున్నారు.ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదుఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడుతూ.. శిక్షణ సందర్భంగా కోహ్లితో జరిగిన సంభాషణ గురించి వివరించాడు. ‘‘అత్యుత్తమ కాంబినేషన్‌తో ముందుకు వెళ్లడమే మా ప్రధాన ప్రణాళిక. దీని గురించే మేము మాట్లాడుకున్నాము.కొంతమంది ప్రస్తుతం జట్టులో లేకపోవచ్చు. వీరిలో పేస్ బౌలర్లు, ఆల్‌రౌండర్లు, స్పిన్నర్లు.. ఇలా ఎవరైనా సరే ఆయా విభాగం నుంచి భవిష్యత్తులో సేవలు అందించేందుకు జట్టులోకి రావొచ్చు. ఇక విరాట్ భాయ్, రోహిత్ భాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు.గత దశాబ్ద కాలంగా వారిద్దరు టీమిండియా బ్యాటింగ్ లైనప్ వెన్నెముకగా ఉన్నారు. వారు జట్టులో అంతర్భాగం. వారి అనుభవం, నైపుణ్యం మా జట్టు విలువను పెంచుతాయి. అయితే, వన్డే ప్రపంచకప్ ప్రణాళికలు కాస్త భిన్నంగా ఉంటాయి.ఇక్కడి వికెట్ల మాదిరే వీలైనన్ని వైవిధ్యమైన కాంబినేషన్లు ప్రయత్నించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. వరల్డ్‌కప్ వేదికైన సౌతాఫ్రికాలోని పిచ్‌లు.. ఇక్కడి (ఇంగ్లండ్) వికెట్ల మాదిరే ఉంటాయి. కాబట్టి మా బలాన్ని పరీక్షించుకునే క్రమంలో ఇది అత్యంత కీలకమైన సిరీస్‌గా మారింది. కొత్త వాళ్లకు అవకాశం నిజానికి మా తుదిజట్టులో ఎప్పుడూ పెద్దగా మార్పులు జరగలేదు. అయితే, కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చే క్రమంలో స్వల్ప మార్పులు చోటుచేసుకోవచ్చు. యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం ద్వారా.. ఒత్తిడిలో వారు ఏమేరకు రాణించగలరో తెలుసుకోవచ్చు. తద్వారా ప్రపంచకప్ టోర్నీకి ముందే జట్టు కూర్పు గురించి మాకు ఒక అవగాహన వస్తుంది’’ అని శుబ్‌మన్ గిల్ తెలిపాడు.ఇక టీ20 సిరీస్‌లో ఇంగ్లండ్ చేతిలో 4-0తో వైట్‌వాష్ కావడం తమపై ఎలాంటి ప్రభావం చూపబోదని గిల్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. ‘‘ఈ రెండూ వేర్వేరు ఫార్మాట్లు. వేర్వేరు జట్లు. వేర్వేరు లక్ష్యాలు. కాబట్టి ఈ సిరీస్‌పై గత టీ20 సిరీస్ ప్రభావం ఉంటుందని నేను అనుకోవడం లేదు’’ అని గిల్ అన్నాడు.చదవండి: టీమిండియాలోకి సూర్యకుమార్ యాదవ్! -
తొలి వన్డే.. కోహ్లిని ఆకాశానికి ఎత్తిన ఇంగ్లండ్ కోచ్
ఇంగ్లండ్, టీమిండియా మధ్య ఎడ్జ్‌బాస్టన్ వేదికగా మరికొన్ని గంటల్లో తొలి వన్డే మొదలుకానుంది. జనవరిలో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ తర్వాత వన్డేలు ఆడని రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు జట్టులోకి తిరిగొచ్చారు. రో-కో ద్వయం తిరిగి రావడంతో పాటు గిల్, కేఎల్ రాహుల్ కూడా జాయిన్ కావడంతో టీమిండియా సరికొత్తగా కనిపిస్తుంది. అయితే ఇంగ్లండ్‌తో తొలి వన్డే నేపథ్యంలో ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల క్రికెట్ కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ కోహ్లిని ఆకాశానికి ఎత్తాడు. 'క్రీడా ప్రపంచంలో కోహ్లి ఒక నిజమైన చాంపియన్. తన దూకుడైన ఆటతో క్రీడకు సరికొత్త నిర్వచనం చెప్పి ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచాడు. కోహ్లి కేవలం క్రికెట్ ప్రపంచంలోనో లేక భారతదేశంలోనో మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా వివిధ క్రీడల రంగాలకు కూడా సుపరిచితుడిగా మారిపోయాడు. ప్రజలు క్రికెట్‌ను ప్రేమించేలా చేయడంలో కోహ్లి స్ఫూర్తినిచ్చాడు. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత కోహ్లి వారసత్వం చిరస్థాయిగా నిలిచిపోతుంది. అతడు నిజమైన ఛాంపియన్.' అని పొగడ్తల వర్షం కురిపించాడు.ఇటీవలే ఇంగ్లండ్ వరుస టెస్టు సిరీస్ పరాజయాలు చవిచూడడంతో టెస్టు కోచ్ పదవికి బ్రెండన్ మెక్కల్లమ్ గుడ్‌బై చెప్పాడు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్ (వన్డే, టీ20 ఫార్మాట్)లో మాత్రం హెడ్‌కోచ్‌గా కొనసాగనున్నట్లు స్పష్టం చేశాడు. తాజాగా టెస్టు కోచ్ పదవి నుంచి తప్పుకోవడంపై స్పందించిన మెక్కల్లమ్ ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుకు క్షమాపణ తెలిపాడు. టెస్టు కోచ్ పదవి నుంచి తప్పుకోవాలనే నిర్ణయం బాధించినప్పటికీ పరిస్థితుల ప్రభావంతోనే అలా చేయాల్సి వచ్చిందన్నాడు. అయితే తన నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని మెక్కల్లమ్ పేర్కొన్నాడు. తన నిర్ణయం పట్ల ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుకు క్షమాపణ కోరుతున్నట్లు తెలిపాడు. టెస్టు కోచ్‌గా తన పాత్రను సమర్థంగా పోషించలేకపోయానని, అందుకే తప్పుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడించాడు. మెక్కల్లమ్ టెస్టు కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి రోజుల్లో బెన్‌స్టోక్ కెప్టెన్సీలో 'బజ్‌బాల్' ఆటతో ఇంగ్లండ్ 11 టెస్టుల్లో 10 విజయాలు సాధించి కొత్త శకానికి నాంది పలికింది. కానీ రానురాను బజ్‌బాల్ ఆట ఇంగ్లండ్ కొంపముంచింది. ఈ మధ్య కాలంలో ఇంగ్లండ్ ఆడిన 9 టెస్టుల్లో ఏడింటిలో పరాజయం చవిచూసి డబ్ల్యూటీసీ టైటిల్ రేసులో చాలా వెనుకబడిపోయింది. ఆ తర్వాత స్టోక్స్ ఉదంతం అతడిని కెప్టెన్సీ నుంచి తొలగించేలా చేసింది. ఆ వెంటనే మెక్కల్లమ్ టెస్టు కోచ్ పదవి నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించాడు. Brendon McCullum has apologised to England fans for the poor string of Test results that led to his dismissal 💬 pic.twitter.com/zxNyHAvC7y— Sky Sports Cricket (@SkyCricket) July 13, 2026Read: ఫిఫా చరిత్రలో తొలిసారి.. సెంటిమెంట్‌తో బరిలోకి అర్జెంటీనా! -
జై షాకు శుభ్‌మన్ గిల్ ప్రత్యేక విజ్ఞప్తి
భారత టెస్ట్, వన్డే జట్ల కెప్టెన్ శుభ్‌మన్ గిల్, ఐసీసీ ఛైర్మన్ జై షాకు ప్రత్యేక విజ్ఞప్తి చేశాడు. వన్డే క్రికెట్‌కు మళ్లీ పూర్వవైభవం తీసుకురావాలంటే ముక్కోణపు సిరీస్‌లు, నాలుగు దేశాల టోర్నీలను పునరుద్ధరించాలని కోరాడు.ఇంగ్లండ్‌తో తొలి వన్డేకు ముందు మీడియాతో మాట్లాడిన గిల్, ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్‌ల ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో 50 ఓవర్ల క్రికెట్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు."ముక్కోణపు సిరీస్‌లు, నాలుగు దేశాల టోర్నీలను మళ్లీ ప్రారంభించాలి. జట్లు కొత్త పరిస్థితుల్లో ఆడే అవకాశం లభిస్తుంది. నేను చిన్నప్పటి నుంచి 50 ఓవర్ల క్రికెట్ చూస్తూ పెరిగాను. వన్డేలను 40 ఓవర్లకు కుదించాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం" అని అన్నాడు.ఒకప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో ట్రై-సిరీస్‌లు, నాలుగు దేశాల టోర్నీలు ఎంతో ఆదరణ పొందేవి. ముఖ్యంగా ఆస్ట్రేలియా ప్రతి ఏడాది నిర్వహించే ట్రై-సిరీస్ ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. అయితే టీ20 క్రికెట్ విస్తరణతో అలాంటి టోర్నీలు క్రమంగా అంతరించిపోయాయి.కాగా, ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా తొలి వన్డే జరుగనుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానుంది.తాజాగా భారత్ ఇంగ్లండ్, ఐర్లాండ్ చేతిలో టీ20 సిరీస్‌లు కోల్పోవడంతో ఈ సిరీస్‌ను ప్రాధాన్యత మరింత పెరిగింది. శుభ్‌మన్ గిల్ అయినా టీమిండియాను తిరిగి విజయాల బాట పట్టించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ తుది జట్టును ప్రకటించగా.. భారత జట్టును ఇంకా ప్రకటించాల్సి ఉంది. -
వారిని చూసి నేర్చుకోండి.. టీమిండియాపై భారీ ట్రోలింగ్
చారిత్రక లార్డ్స్ మైదానంలో భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత్, ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక టెస్టులో 270 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా లార్డ్స్‌లో నిర్వహించిన తొలి మహిళల టెస్టులో విజేతగా నిలిచిన తొలి జట్టుగా భారత్ చరిత్ర పుటల్లోకెక్కింది.ఈ విజయానంతరం సోషల్ మీడియాలో భారత మహిళల జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. జట్టు సమిష్టి ప్రదర్శనను అభిమానులు కొనియాడుతున్నారు. ముఖ్యంగా హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వాన్ని, యస్తిక భాటియా, క్రాంతి గౌడ్, స్మృతి మంధాన, స్నేహ్ రాణా ప్రదర్శనలను ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నారు.కొందరు అభిమానులు ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో టీ20 సిరీస్‌ను 0-4తో కోల్పోయిన భారత పురుషుల జట్టును ప్రస్తావిస్తూ, "మహిళల జట్టును చూసి నేర్చుకోండి" అంటూ చురకలంటిస్తున్నారు.కాగా, ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో క్రాంతి గౌడ్ 5 వికెట్లతో.. రెండో ఇన్నింగ్స్‌లో యస్తిక భాటియా సూపర్ శతకంతో.. స్మృతి మంధాన రెండు ఇన్నింగ్స్‌ల్లో రెండు అర్ధశతకాలతో.. రెండో ఇన్నింగ్స్‌లో స్నేహ్ రాణా నాలుగు వికెట్ల ప్రదర్శనలతో అదరగొట్టి టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 285 పరుగులు చేసింది. స్మృతి మంధాన 83 పరుగులతో రాణించగా, హర్మన్‌ప్రీత్ కౌర్, దీప్తి శర్మ అర్ధశతకాలతో జట్టును బలమైన స్థితిలో నిలబెట్టారు.తర్వాత బౌలింగ్‌లో యువ పేసర్ క్రాంతి గౌడ్ అద్భుత ప్రదర్శనతో 5 వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను 170 పరుగులకే ఆలౌట్ చేసింది. మహిళల టెస్టుల్లో లార్డ్స్‌లో తొలి ఐదు వికెట్ల ఘనత సాధించిన బౌలర్‌గా ఆమె రికార్డు సృష్టించింది.రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 341/7 వద్ద డిక్లేర్ చేసింది. యస్తిక భాటియా 113 పరుగుల శతకం సాధించి లార్డ్స్‌లో మహిళల టెస్టులో సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా చరిత్ర సృష్టించగా, స్మృతి మంధాన మరో అర్ధశతకంతో ఆకట్టుకుంది. దీంతో భారత్ ఇంగ్లండ్ ముందు 457 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.చివరి ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు మరోసారి చెలరేగారు. స్నేహ్ రాణా నాలుగు వికెట్లతో ఇంగ్లండ్ బ్యాటింగ్‌ను ఘోరంగా దెబ్బకొట్టింది. దీంతో ఆతిథ్య జట్టు 186 పరుగులకే ఆలౌటై, 270 పరుగుల భారీ తేడాతో పరాజయంపాలైంది.ఈ విజయంతో భారత మహిళల జట్టు ఇంగ్లండ్ గడ్డపై 12 సంవత్సరాల తర్వాత టెస్టు విజయం సాధించింది. -
చారిత్రక మ్యాచ్‌లో టీమిండియా సంచలన విజయం
‘క్రికెట్ మక్కా’ లార్డ్స్‌లో భారత్ చారిత్రక విజయం సాధించింది. ఈ మైదానంలో మహిళల టెస్టు ఫార్మాట్లో జరిగిన తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను మట్టికరిపించింది. ఆతిథ్య జట్టును ఏకంగా 270 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. తద్వారా లార్డ్స్‌లో టెస్టు మ్యాచ్ గెలిచిన తొలి మహిళా జట్టుగా హర్మన్ సేన చరిత్రకెక్కింది.స్మృతి మంధాన అర్ధ శతకంలండన్లోని లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్- భారత్ మహిళా జట్ల మధ్య శుక్రవారం ఏకైక టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. తొలి ఇన్నింగ్స్‌లో 285 పరుగులు చేసి ఆలౌట్ అయింది.ఓపెనర్లలో షఫాలీ వర్మ డకౌట్ కాగా.. స్మృతి మంధాన అర్ధ శతకం (83)తో మెరిసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (58), దీప్తి శర్మ (57) కూడా హాఫ్ సెంచరీలతో రాణించారు. మిగిలిన వారిలో జెమీమా రోడ్రిగ్స్ (35) చెప్పుకోదగ్గ స్కోరు చేసింది. అనంతరం ఇంగ్లండ్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే కుప్పకూలింది. వికెట్ కీపర్ బ్యాటర్ అమీ జోన్స్ అర్ధ శతకం (52)తో రాణించడంతో ఈ మాత్రం స్కోరు సాధ్యమైంది.క్రాంతికి ఐదు వికెట్లుఇక భారత బౌలర్లలో పేసర్ క్రాంతి గౌడ్ ఐదు వికెట్లతో చెలరేగి ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించింది. తద్వారా లార్డ్స్‌లో తొలి ఐదు వికెట్ల హాల్ నమోదు చేసిన మహిళా బౌలర్‌గా చరిత్ర సృష్టించింది. మిగిలిన వారిలో సయాలీ సత్ఘరే, స్నేహ్ రాణా చెరో రెండు వికెట్లు పడగొట్టారు.యస్తికా సెంచరీఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం (115 పరుగులు) కలుపుకొని రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్.. ఏడు వికెట్ల నష్టానికి 341 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. వికెట్ కీపర్ బ్యాటర్ యస్తికా భాటియా సెంచరీ (113)తో సత్తా చాటింది.ఇంగ్లండ్ లక్ష్యం 457ఫలితంగా టీమిండియా ఇంగ్లండ్ ముందు 457 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచగలిగింది. ఈ క్రమంలో ఆదివారం నాటి నాలుగో రోజు ముగిసేసరికి ఆరు వికెట్ల నష్టానికి ఇంగ్లండ్ కేవలం 130 పరుగులు చేసింది. ఈ క్రమంలో 130/6 ఓవర్‌నైట్ స్కోరుతో సోమవారం నాటి చివరి రోజు ఆట మొదలుపెట్టిన ఇంగ్లండ్.. మరో 56 పరుగులు జతచేసి ఆలౌట్ అయింది.ఆఖరి రోజు ఆట సందర్భంగా ఇంగ్లండ్ స్టార్ సోఫీ ఎక్లిస్టోన్ టెస్టుల్లో తొలి అర్ధ శతకం పూర్తి చేసుకుంది. యాభై పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆమె పదో వికెట్‌గా వెనుదిరగడంతో ఇంగ్లండ్ కథ ముగిసింది. భారత్ 270 పరుగుల భారీ తేడాతో జయభేరి మోగించింది. భారత బౌలర్లలో స్నేహ్ రాణా నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. సయాలీ సత్ఘరే, క్రాంతి గౌడ్, దీప్తి శర్మ తలా రెండు వికెట్లు కూల్చారు.సంక్షిప్త స్కోర్లుభారత్ : 285 &3 41/7 డిక్లేర్డ్ఇంగ్లండ్ : 170 & 186ఫలితం : ఇంగ్లండ్‌పై 270 పరుగుల భారీ తేడాతో భారత్ గెలుపు.చదవండి: టీమిండియాలోకి సూర్య! -
టీమిండియాలోకి సూర్యకుమార్ యాదవ్!
టీ20 ప్రపంచకప్-2026లో టీమిండియాను చాంపియన్‌గా నిలిపిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. కానీ ఈ మెగా టోర్నీ తర్వాత జట్టు ఆడిన తొలి సిరీస్‌లోనే ఈ మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్‌పై వేటు పడింది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ.. కెప్టెన్‌గా తప్పించడమే కాకుండా.. జట్టులోనే అతడికి స్థానం లేకుండా చేసింది.గత ఏడాదిన్నర కారణంగా బ్యాటర్‌గా సూర్యకుమార్ వ్యక్తిగత వైఫల్యలే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో సూర్య స్థానంలో శ్రేయస్ అయ్యర్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించిన యాజమాన్యం.. చిచ్చర పిడుగు, పదిహేనేళ్ల వైభవ్ సూర్యవంశీని జాతీయ జట్టుకు ఎంపిక చేసింది.ఘోర పరాభవం!అయితే, అయ్యర్ కెప్టెన్సీలో తొలి సిరీస్‌లోనే భారత్‌కు ఘోర పరాభవం ఎదురైంది. పసికూన ఐర్లాండ్ చేతిలో టీ20 సిరీస్‌లో 2-0తో టీమిండియా వైట్‌వాష్‌కు గురైంది. ఇక ఇంగ్లండ్ చేతిలోనూ 4-0తో క్లీన్‌స్వీప్ అయింది. దీంతో తాజా యూకే టూర్ భారత క్రికెట్ చరిత్రలోనే మాయని మచ్చగా మిగిలిపోయింది.ఈ నేపథ్యంలో సూర్యను గుర్తు చేసుకుంటూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. అతడిని కొనసాగించి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదేమోనని అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి తరుణంలో టైమ్స్ ఆఫ్ ఇండియా జర్నలిస్టు కరిష్మా సింగ్ సోషల్ మీడియా వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.బీసీసీఐ గ్రీన్ సిగ్నల్!.. కానీ ఓ కండిషన్!సూర్యకు టీమిండియా తలుపులు శాశ్వతంగా ఏమీ మూసుకుపోలేదన్నారు. అతడు త్వరలోనే తిరిగి భారత టీ20 జట్టులోకి వచ్చే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు. అయితే, అందుకోసం సూర్య దేశవాళీ క్రికెట్లో ముంబై తరఫున.. అదే విధంగా ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫునా కచ్చితంగా రాణించాల్సి ఉంటుందని కరిష్మా చెప్పుకొచ్చారు.అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ.. సూర్యకు మరో అవకాశం ఇచ్చేందుకు సిద్ధంగానే ఉందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నట్లు కరిష్మా తెలిపారు. బంతి ఇప్పుడు సూర్య కోర్టులోనే ఉందన్నారు. దేశీ క్రికెట్లో రాణిస్తే తప్పక అతడు తిరిగి టీమిండియాలో అడుగుపెడతారని జోస్యం చెప్పారు. కాగా మాజీ ఆటగాళ్లు యువరాజ్ సింగ్, దినేశ్ కార్తిక్ తదితరులు కొన్నాళ్లపాటు జాతీయ జట్టుకు దూరమైనా.. దేశీ క్రికెట్లో సత్తా చాటి తిరిగి జట్టులో స్థానం సంపాదించిన సంగతి తెలిసిందే.చదవండి: ఇంగ్లండ్‌తో తొలి వన్డేకు భారత జట్టు ఇదే! -
‘అందుకే వైభవ్‌ను తప్పించి.. సంజూను ఆడించాము’
టీమిండియాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐర్లాండ్, ఇంగ్లండ్‌లతో టీ20 సిరీస్‌లలో క్లీన్‌స్వీప్ కావడమే ఇందుకు కారణం. తొలుత ఐర్లాండ్ చేతిలో 2-0తో వైట్‌వాష్ గురైన శ్రేయస్ అయ్యర్ సేన.. ఆ తర్వాత ఇంగ్లండ్ సిరీస్‌నూ విజయమన్నదే లేకుండా ముగించింది. ఇంగ్లిష్ జట్టు చేతిలో 4-0తో క్లీన్‌స్వీప్ అయింది.ఈ నేపథ్యంలో టీమిండియా యాజమాన్యంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ కోసం వరల్డ్‌కప్ హీరో సంజూ శాంసన్‌ను పక్కనపెట్టడాన్ని పలువురు మాజీ క్రికెటర్లు ప్రశ్నిస్తున్నారు. కాగా సంజూ ఐర్లాండ్‌తో రెండు టీ20లు (5, 0).. అదే విధంగా ఇంగ్లండ్‌తో తొలి టీ20 (1)లో విఫలమయ్యాడు.ఈ క్రమంలోనే సంజూను తప్పించి.. అతడి స్థానంలో ఓపెనర్‌గా వైభవ్ సూర్యవంశీ రెండో టీ20తో అరంగేట్రం చేశాడు. అయితే, వరుసగా మూడు మ్యాచ్‌లు ఆడిన వైభవ్.. 13, 14, 15 పరుగులు చేశాడు. అంతేగాక వైభవ్ రాకతో టాపార్డర్‌లో ముగ్గురూ (ఓపెనర్లు అభిషేక్ శర్మ, వైభవ్.. వన్‌డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్) లెఫ్టాండర్లే అయ్యారు.ఈ నేపథ్యంలో నామమాత్రపు ఐదో టీ20లో మాత్రం వైభవ్ సూర్యవంశీని తప్పించి.. సంజూ శాంసన్‌ను తిరిగి తీసుకువచ్చారు. ఈ విషయంపై ఓటమి అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వివరణ ఇచ్చాడు. మీడియాతో మాట్లాడుతూ..‘‘సౌతాంప్టన్ పిచ్ పరిస్థితికి తగ్గట్లు మేము అత్యుత్తమ ఓపెనింగ్ కాంబినేషన్‌తో ముందుకు వెళ్లాలని అనుకున్నాము. అభిషేక్ శర్మతో కలిసి కుడిచేతి వాటం బ్యాటర్‌తో ఓపెనింగ్ చేయించాలని ఫిక్స్ అయ్యాము. అందుకే వైభవ్‌ను తప్పించాము. ఈ మ్యాచ్‌కు ఇలా చేయడమే సరైన నిర్ణయం. సంజూ గన్ బ్యాటర్. గతంలో ఒంటిచేత్తో ఎన్నో సిరీస్‌లు గెలిపించాడు’’ అని శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నాడు. కాగా ఐదో టీ20లో సంజూ 27 పరుగులు చేయగా.. అభిషేక్ 3 రన్స్ చేసి వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ మూడు వికెట్ల నష్టానికి 257 పరుగులు చేయగా.. టీమిండియా 201 పరుగులకే కుప్పకూలింది. -
తిరిగొచ్చిన రో-కో ద్వయం.. తొలి వన్డేకు భారత జట్టు ఇదే!
ఇంగ్లండ్ గడ్డపై టీ20 సిరీస్‌లో దారుణ పరాజయం తర్వాత శుబ్‌మన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా వన్డే సిరీస్ ఆడేందుకు సమాయత్తమవుతోంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా మంగళవారం (జూలై 14న) ఇరుజట్లు తొలి వన్డే మ్యాచ్ ఆడనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే టెస్టులు, టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వన్డే జట్టుతో కలిశారు. ఇక తొలి వన్డేకు తుది జట్టు అంచనా ఒకసారి పరిశీలించి చూద్దాం.వీరితో పాటు సీనియర్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా జాయిన్ కావడంతో టీమిండియా బలం పెరిగింది. 20 ఓవర్ల ఫార్మాట్ నుంచి 50 ఓవర్ల ఫార్మాట్‌కు ఆట మారడానికి తోడు, సీనియర్లు అంతా జట్టులోకి రావడంతో టీమిండియా ఇప్పుడు పేపర్‌పై దుర్భేద్యంగా కనిపిస్తోంది. 39 ఏళ్ల రోహిత్, 38 ఏళ్ల కోహ్లికి 2027 వన్డే ప్రపంచకప్ ఆఖరిది కానుండడంతో వీరిద్దరు రాణించాలని ఉవ్విళ్లూరుతున్నారు. టీ20 సిరీస్‌లో జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్‌లు తమ బౌలింగ్‌తో టీమిండియా బ్యాటర్లను బెంబెలెత్తించారు. కానీ వన్డే ఫార్మాట్లో కోహ్లి, రోహిత్ వంటి అనుభవజ్ఞులు రావడంతో ఈ ఇద్దరు బౌలర్ల ఆటలు సాగకపోవచ్చని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బ్యాటింగ్‌లో గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్‌తో పాటు కేఎల్ రాహుల్ కీలకంగా మారనున్నారు.ఆల్‌రౌండ్ విభాగంలో అక్షర్‌పటేల్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్‌లు ఉన్నప్పటికీ వీరిలో ఇద్దరికి మాత్రమే అవకాశం రానుంది. ఇక బౌలింగ్ విభాగాన్ని జస్ప్రీత్ బుమ్రా నడిపించనుండగా.. టీ20 సిరీస్‌లో విఫలమైనప్పటికీ అర్ష్‌దీప్‌కు మరో చాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరో స్పిన్నర్ అవసరమనుకుంటే కుల్దీప్ యాదవ్ తుదిజట్టులో చోటు దక్కించుకుంటాడు. లేదంటే ప్రసిధ్ క్రిష్ణ, గుర్నూర్ బ్రార్‌లలో ఒకరికి అవకాశం కల్పించవచ్చు. మొత్తానికి టీ20 సిరీస్‌లో ఓటమి పాలైనప్పటికీ వన్డే సిరీస్‌కు మాత్రం సీనియర్ల రాకతో టీమిండియా కొత్తగా కనిపిస్తోంది. మ్యాచ్ సమయం: భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ప్రారంభం కానుంది.తుదిజట్టు అంచనా: శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, ప్రసిధ్ క్రిష్ణ/ గుర్నూర్ బ్రార్ -
ఇంగ్లాండ్ తో ఓటమికి వైభవే కారణం
-
శ్రేయస్ అయ్యర్‌ను తొలగించండి.. ఈజీ ఆప్షన్ అదే!
సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్-2026 విజేతగా నిలిచిన టీమిండియాకు.. విదేశీ గడ్డ మీద ఘోర పరాభవం ఎదురైంది. మెగా టోర్నీలో విజేతగా నిలిచిన తర్వాత తొలి ప్రయత్నంగా ఐర్లాండ్‌తో తలపడ్డ భారత్ ఊహించని రీతిలో.. ఆతిథ్య జట్టు చేతిలో 2-0తో క్లీన్‌స్వీప్‌నకు గురైంది.శ్రేయస్ అయ్యర్‌కు చేదు అనుభవంఆ తర్వాత ఇంగ్లండ్ చేతిలో 4-0తో వైట్‌వాష్ అయింది. దీంతో టీమిండియా టీ20 కెప్టెన్‌గా ప్రయాణం మొదలుపెట్టిన శ్రేయస్ అయ్యర్‌కు తొలి ప్రయత్నంలోనే అత్యంత చేదు అనుభవం మిగిలింది. ఈ రెండు టీ20 సిరీస్‌లలో భారత్ క్లీన్‌స్వీప్ కావడంతో అతడి కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈజీ ఆప్షన్ అదే!అదే సమయంలో హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌పైనా మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఈ రెండు సిరీస్‌లలో టీమిండియా ఘోర ఓటమి నేపథ్యంలో గౌతం గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను తొలగించడమనేది అత్యంత సులువైన ఆప్షన్.అయితే, ఆ విషయం పక్కనపెట్టి భారత జట్టు ఓటమికి అసలు కారణాలు ఏమిటో ముందు విశ్లేషించండి. నిజానికి ఐర్లాండ్, ఇంగ్లండ్.. అంటే విదేశీ గడ్డ మీద ఈ మ్యాచ్‌లు జరగడమే భారత్ ఓటమికి ప్రధాన కారణం.వికెట్ ఇలా ఉంది కాబట్టే మన బ్యాటర్లు విదేశీ పిచ్‌ల మీద ఆడేందుకు ఏమాత్రం సన్నద్ధం కాలేదు. ఎందుకంటే.. మన సెలక్టర్లు కేవలం ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా వీరిని విదేశీ టూర్‌కు ఎంపిక చేశారు. ఐపీఎల్ మన బ్యాటర్లకు ఓ కవచం వంటిది. ఇక్కడ రాణిస్తే చాలు జాతీయ జట్టులోకి వచ్చేస్తామనే నమ్మకం కుదిరింది.అయితే, ఐపీఎల్ రూపొందించినటువంటి ఫ్లాట్ పిచ్‌లను నేను జీవితంలో ఇంత వరకు చూడనేలేదు. వికెట్ ఇలా ఉంది కాబట్టే మన బ్యాటర్లు.. ముఖ్యంగా టాపార్డర్‌లో వచ్చిన వాళ్లు మంచినీళ్ల ప్రాయంగా పరుగులు రాబడుతున్నారు.మరి విదేశాల్లో వికెట్లు ఇలా ఉండవు కదా. అక్కడ మార్బుల్ షీట్‌పై బ్యాటింగ్ చేయడం కుదరదు. ఇలాంటపుడే సెలక్టర్లు మరింత తెలివిగా ఆలోచించాల్సింది. ఐర్లాండ్, ఇంగ్లండ్ గడ్డ మీద రాణించిన శుబ్‌మన్ గిల్ వంటి ఆటగాళ్లను సెలక్ట్ చేయాల్సింది.దిక్కుమాలిన ఐడియా ఇచ్చిన వారిపైనే వేటుఈ పరాజయాల నేపథ్యంలో లోతుగా విచారణ, విశ్లేషణ జరపాలి. బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌లు రూపొందించమని బీసీసీఐకి సలహా ఇచ్చిన వారిని ముందుగా తొలగించాలి. ఐపీఎల్‌ను మరింత పాపులర్ చేయాలని.. వాణిజ్యపరంగా లాభాలు పొందాలని చూస్తే పరిస్థితులు ఇలాగే దిగజారిపోతాయి’’ అని సంజయ్ మంజ్రేకర్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాగా వరుస సిరీస్‌లలో వైట్‌వాష్ నేపథ్యంలో టీమిండియా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని ఇంగ్లండ్‌కు కోల్పోయింది.చదవండి: ఇంగ్లండ్ టెస్టు జట్టు హెడ్‌కోచ్‌గా ద్రవిడ్? -
‘వైభవ్ కోసం అతడిని బలిపశువును చేశారు’
టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ వైభవ్ సూర్యవంశీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అతడికి వచ్చిన హైప్‌ను దృష్టిలో పెట్టుకొని సీనియర్ జట్టుకు ఎంపిక చేయడాన్ని తప్పుబట్టాడు. వైభవ్ చేత అంత త్వరగా అంతర్జాతీయ అరంగేట్రం చేయించాల్సింది కాదని అభిప్రాయపడ్డాడు. కేవలం మీడియా సృష్టించిన హైప్, ప్రజల్లోని ఎమోషన్స్ చూసి సెలెక్టర్లు తొందరపడ్డారని పేర్కొన్నాడు.ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు అవకాశం లభించని వైభవ్‌కు ఇంగ్లండ్ పర్యటనలో రెండో టీ20లో అవకాశం దక్కింది. మొదటి మ్యాచ్ ఆడిన సంజు శాంసన్‌ను రెండో మ్యాచ్‌లో పక్కన పెట్టి అతడి స్థానంలో వైభవ్‌కు అవకాశం ఇచ్చారు. అయితే వరుసగా మూడు మ్యాచ్‌ల్లో వైభవ్ కేవలం 14, 13, 15 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. దీంతో ఐదో టీ20 మ్యాచ్‌లో అతన్ని పక్కన పెట్టి మళ్లీ శాంసన్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఈ ప్రయోగాలపై స్పందించిన వసీం జాఫర్.. అసలు శాంసన్ ఫామ్‌లో లేడనే బలమైన నమ్మకం ఉంటే తప్ప ఇలాంటి మార్పులు చేయకూడదని హితవు పలికాడు. సంజు శాంసన్ లాంటి మ్యాచ్ విన్నర్‌కు జట్టులో క్రమబద్ధమైన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. వైభవ్ సూర్యవంశీ ఇంకా చాలా చిన్న వయస్కుడని, అతనికి ఇంకా చాలా సమయం ఉందని జాఫర్ గుర్తుచేశాడు. అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడే ముందే కేవలం టీమ్‌తో ప్రయాణిస్తూ, వెలుపల నుండి ఆటను గమనిస్తూ అతను ఎంతో నేర్చుకోవచ్చని సూచించాడు. 2026 టీ20 ప్రపంచకప్‌ను టీమిండియా గెలవడంలో కీలకపాత్ర పోషించిన శాంసన్‌ను కేవలం వైభవ్ కోసం పక్కనబెట్టి అతడిని బలిపశువును చేయడం సరైన చర్య కాదన్నాడు.కేవలం మీడియాలో వస్తున్న వార్తల ప్రభావంతో కంగారుగా జట్టులోకి తెచ్చి ఒత్తిడి పెంచడం పద్ధతి కాదన్నాడు. తదుపరి జింబాబ్వే టూర్ కోసం వైభవ్‌ను ఎంపిక చేసి, కేవలం ఒకే ఫార్మాట్ ఆడే సంజు శాంసన్‌ను పక్కన పెట్టడం తనను ఎంతగానో ఆశ్చర్యపరిచిందని వసీం జాఫర్ తెలిపాడు.చదవండి: సెమీస్ సమరం.. ఎవరి బలమెంత? -
లార్డ్స్‌లో శతకం.. 11వ ప్లేయర్‌గా యస్తిక భాటియా రికార్డు
ప్రతిష్టాత్మక లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్ మహిళలతో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో హర్మన్ సేన విజయానికి చేరువలో ఉంది. 457 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ జట్టు ప్రస్తుతం 130 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనిస్తోంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప భారత జట్టు గెలుపు లాంఛనమే కానుంది. ఈ నేపథ్యంలో భారత వికెట్ కీపర్ యస్తిక భాటియా లార్డ్స్ స్టేడియంలో అరుదైన రికార్డు సాధించింది. మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో (113; 14 ఫోర్లు) సూపర్ సెంచరీ సాధించిన యస్తిక భాటియా లార్డ్స్ మైదానంలో సెంచరీ చేసిన తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డులకెక్కింది. సెంచరీతో లార్డ్స్ స్టేడియంలోని బ్యాటింగ్ హానర్స్ బోర్డులో యస్తిక తన పేరును లిఖించుకుంది. లార్డ్స్ స్టేడియంలో మహిళల క్రికెట్లో ఇదే తొలి టెస్టు కావడంతో ఇప్పటివరకు భారత క్రికెటర్ స్మృతి మంధాన సాధించిన 83 పరుగులే అత్యుత్తమంగా ఉండేది. తాజాగా యస్తికా ఆ రికార్డును సవరించింది. ఇక ఓవరాల్‌గా భారత క్రికెట్లో (పురుషులు, మహిళలు) కలిపి లార్డ్స్ మైదానంలో టెస్టుల్లో ఇప్పటివరకు 11 మంది ప్లేయర్లు శతకాలు సాధించారు.లార్డ్స్ మైదానంలో సెంచరీ చేసిన భారత క్రికెటర్ల జాబితా👉వినూ మన్కడ్ (184 పరుగులు, 1952)👉గుండప్ప విశ్వనాథ్ (113 పరుగులు, 1979)👉దిలీప్ వెంగ్‌సర్కార్ (103 పరుగులు 1979లో; 157 పరుగులు 1982లో; 126 నాటౌట్ 1986లో)👉రవిశాస్త్రి (100 నాటౌట్, 1990)👉మహ్మద్ అజారుద్దీన్ (121, 1990)👉సౌరవ్ గంగూలీ (131, 1996)👉అజిత్ అగార్కర్ (109 నాటౌట్, 2002)👉రాహుల్ ద్రవిడ్ (103 నాటౌట్, 2011)👉అజింక్య రహానే (103, 2014)👉కేఎల్ రాహుల్ (129, 2025)👉యస్తిక భాటియా (105, 2026) A maiden Test hundred for Yastika Bhatia at the Home of Cricket.👏🏻👏🏻Watch #ENGWvINDW LIVE on #SonyLIV & #SonySportsNetwork 📺🔥 pic.twitter.com/PaKcZzu6rn— Sony LIV (@SonyLIV) July 12, 2026 History at the Home of Cricket. Yastika Bhatia becomes the first woman ever to score a Test century at Lord’s.The first woman. Ever.And with that, her name goes straight onto the Lord’s Honours Board.What a place to score your maiden Test hundred. 👏 pic.twitter.com/wBA7mOsjRd— CofCricket (@CofCricket) July 12, 2026చదవండి: ఇంగ్లండ్ టెస్టు హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్! -
ఇంగ్లండ్ ముందు కొండంత లక్ష్యాన్ని ఉంచిన టీమిండియా
చరిత్రాత్మక లార్డ్స్ టెస్ట్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు ఇంగ్లండ్ ముందు కొండంత లక్ష్మాన్ని ఉంచింది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 341-7 స్కోర్ వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి ఇంగ్లండ్‌కు 457 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. యస్తిక భాటియా (113) సూపర్ సెంచరీతో, ఆఖర్లో రిచా ఘోష్ (50 నాటౌట్) మెరుపు అర్ద శతకంతో చెలరేగారు. స్మృతి మంధాన (70) అర్ద సెంచరీతో సత్తా చాటింది. ఇంగ్లండ్ బౌలర్లలో సోఫీ ఎక్లెస్టోన్ 5 వికెట్లతో రాణించింది.అంతకుముందు క్రాంతి గౌడ్ (17-7-37-5) ధాటికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే ఆలౌటైంది. క్రాంతికి జతగా సయాలి సత్ఘరే (2-40), స్నేహ్ రాణా (2-41), దీప్తి శర్మ (1-10) కూడా రాణించారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో యామీ జోన్స్ (52) ఒక్కరే అర్ద సెంచరీతో రాణించగా.. కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ (44) ఓ మోస్తరు స్కోర్ చేసింది.దీనికి ముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 285 పరుగులు చేసింది. స్మృతి మంధాన (83), హర్మన్‌ప్రీత్ కౌర్ (58), దీప్తి శర్మ (57) అర్ద సెంచరీలతో రాణించారు.కాగా, భారత్-ఇంగ్లండ్ మధ్య లార్డ్స్‌లో జరుగతున్న తొలి మహిళల టెస్ట్ మ్యాచ్ ఇదే. ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్ల ఘనత, సెంచరీ చేసి క్రాంతి గౌడ్, యస్తిక భాటియా ప్రతిష్ఠాత్మక లార్డ్స్ ఆనర్స్ బోర్డులో తమ పేర్లను చిరస్థాయిగా లిఖించుకున్నారు. లార్డ్స్‌లో తొలి ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన బౌలర్‌గా క్రాంతి.. తొలి సెంచరీ చేసిన బ్యాటర్ యస్తిక రికార్డు సృష్టించారు. -
భారత్‌పై గెలుపు తర్వాత ఇంగ్లండ్ ఆటగాళ్లకు 'ఆ పార్టీకి' అనుమతి
భారత్‌పై చరిత్రాత్మక టీ20 సిరీస్ విజయాన్ని అందుకున్న ఇంగ్లండ్ జట్టుకు హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ ప్రత్యేక బహుమతి ఇచ్చాడు. ఇటీవల ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) మద్యపానంపై కఠిన నిబంధనలు అమలు చేసినప్పటికీ, భారత్‌పై 4-0తో సిరీస్ గెలిచిన సందర్భంగా ఆటగాళ్లు విజయోత్సవాలు జరుపుకునేందుకు తాత్కాలికంగా ఆంక్షలను సడలించాడు.ఇటీవల హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, గస్ అట్కిన్సన్‌లకు సంబంధించిన వివాదాల నేపథ్యంలో ఈసీబీ ఆటగాళ్లపై కఠిన మార్గదర్శకాలు అమలు చేసింది. అర్ధరాత్రి కర్ఫ్యూ, టెస్టు మ్యాచ్‌ల మధ్య లేదా మ్యాచ్ ముగిసిన మరుసటి రోజు మద్యం సేవించకూడదనే నిబంధనలను తీసుకొచ్చింది. అలాగే మద్యం మత్తులో బహిరంగ ప్రదేశాల్లో కనిపించవద్దని కూడా హెచ్చరించింది.అయితే భారత్‌పై అద్భుత విజయంతో ఆటగాళ్ల కృషిని గుర్తించిన మెకల్లమ్, విజయానందాన్ని ఆస్వాదించేందుకు వారికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించాడు. "ఆటగాళ్లపై నాకు పూర్తి నమ్మకం ఉంది. విజయం సాధించిన తర్వాత ఆ ఆనందాన్ని ఆస్వాదించే హక్కు వారికి ఉంది. ఎవరికైనా బీర్ తాగాలనిపిస్తే ఈ రోజు అందుకు సరైన సందర్భమే. అయితే అది పరిమితంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అతిగా ప్రవర్తించకూడదు. ముఖ్యంగా రేపటి పత్రికల మొదటి పేజీలో తప్పు కారణాలతో కనిపించకూడదు" అని మెకల్లమ్ వ్యాఖ్యానించాడు.భారత్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ పూర్తి ఆధిపత్యం చెలాయించి 4-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయంతో ఐసీసీ పురుషుల టీ20 జట్టు ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ అగ్రస్థానానికి చేరుకుంది. -
చరిత్ర సృష్టించిన టీమిండియా బ్యాటర్
చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో భారత మహిళల క్రికెట్ జట్టు వికెట్‌కీపర్-బ్యాటర్ యస్తిక భాటియా చరిత్ర సృష్టించింది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మూడో రోజు ఆటలో అద్భుత సెంచరీ సాధించింది. తద్వారా లార్డ్స్‌లో తొలి టెస్ట్ శతకం నమోదు చేసిన మహిళా బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పింది. ఈ ఘనతతో ప్రతిష్ఠాత్మక లార్డ్స్ ఆనర్స్ బోర్డులో తన పేరును చిరస్థాయిగా లిఖించుకుంది.మూడో రోజు స్మృతి మంధానతో కలిసి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన యస్తిక, ఇంగ్లండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంది. మంధానా 70 పరుగుల వద్ద ఔటైన తర్వాత ఇన్నింగ్స్‌ను చక్కగా నిర్మిస్తూ భారత్ ఆధిక్యాన్ని 350 పరుగులు దాటించడంలో కీలక పాత్ర పోషించింది.భోజన విరామ సమయానికి 99 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన యస్తిక, విరామం అనంతరం కేవలం ఆరు బంతుల్లోనే శతకాన్ని పూర్తి చేసింది. ఇస్సీ వాంగ్ వేసిన 68వ ఓవర్ చివరి బంతిని కవర్స్ వైపు సింగిల్ తీసి 145 బంతుల్లో తన తొలి టెస్టు సెంచరీని అందుకుంది.ఈ సెంచరీతో యస్తిక మరో అరుదైన రికార్డును కూడా నెలకొల్పింది. లార్డ్స్‌లో టెస్టు సెంచరీ చేసిన రెండో భారత ఎడమచేతి బ్యాటర్‌గా (పురుషులు, మహిళలు) నిలిచింది. 1996లో తన అరంగేట్రం టెస్టులో సౌరవ్ గంగూలీ చేసిన 131 పరుగుల తర్వాత ఈ ఘనత సాధించిన తొలి భారత ఎడమచేతి బ్యాటర్ యస్తికనే.ఇదే మ్యాచ్‌లో భారత యువ పేసర్ క్రాంతి గౌడ్ కూడా ఆనర్స్ బోర్డులో తన పేరు లిఖించుకుంది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌తో ఆమె ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసి ఈ ఘనత సాధించింది.మ్యాచ్ విషయానికొస్తే.. మూడో రోజు రెండో సెషన్ సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసి 402 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. యస్తిక సెంచరీ (113) అనంతరం ఔటైంది. రిచా ఘోష్ (15), స్నేహ్ రాణా (0) క్రీజ్‌లో ఉన్నారు. కాగా, భారత్-ఇంగ్లండ్ మధ్య లార్డ్స్ మైదానంలో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ ఇదే. -
ఇషాన్ కిషన్ గొప్ప మనసు
భారత వికెట్‌కీపర్-బ్యాటర్ ఇషాన్ కిషన్ తన మానవత్వాన్ని చాటుతూ పాకిస్థాన్‌కు చెందిన ప్రత్యేక అవసరాలున్న (శారీరక వైకల్యం) ఓ అభిమానికి మరపురాని అనుభూతిని అందించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో, చివరి టీ20 మ్యాచ్‌కు ముందు చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.VIDEO OF THE DAY.....!!!! ❤️ - Ishan Kishan specially came over to meet a Pakistan fan. A lovely gesture. 👏 pic.twitter.com/xwjPxiX3dz— Sheri. (@CallMeSheri1_) July 12, 2026మ్యాచ్‌కు ముందు వార్మప్‌కు వెళ్లే క్రమంలో స్టేడియంలో ఉన్న సదరు అభిమానిని గమనించిన ఇషాన్ కిషన్ స్వయంగా అతడి వద్దకు వెళ్లాడు. అతడితో చేతులు కలిపి, చిరునవ్వుతో పలకరిస్తూ కొద్దిసేపు ఆప్యాయంగా మాట్లాడాడు. ఈ అనూహ్యమైన ఆత్మీయతతో ఆ అభిమాని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ వీడియోకు సోషల్ మీడియాలో విశేష స్పందన లభిస్తోంది. నెటిజన్లు ఇషాన్ మంచి మనసుకు ఫిదా అవుతున్నారు. దేశాల మధ్య విభేదాలను పక్కకు పెట్టి మంచి మనసు చాటుకున్నాడని అంటున్నారు.ఇదిలా ఉంటే, ఐదో టీ20లోనూ టీమిండియాకు ఇంగ్లండ్ చేతిలో భంగపాటే ఎదురైంది. ఈ ఓటమితో భారత జట్టు 0-4 తేడాతో సిరీస్‌ను కోల్పోయింది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేయగా.. భారత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులకే పరిమితమై, 56 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఇంగ్లండ్ తరఫున జోస్ బట్లర్ (64 బంతుల్లో 131; 12 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడగా.. కెప్టెన్ హ్యారీ బ్రూక్ (45 బంతుల్లో 95 నాటౌట్; 4 ఫోర్లు, 8 సిక్సర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. భారత ఇన్నింగ్స్‌లో ఇషాన్ కిషన్ (56), తిలక్ వర్మ (53) అర్ద సెంచరీలతో రాణించారు. -
టీ20 సిరీస్ ఓటమి.. నంబర్‌వన్ ర్యాంక్ గోవిందా
నాలుగు నెలల కిందట జరిగిన టీ20 ప్రపంచకప్‌ను మూడోసారి కైవసం చేసుకొని నంబర్‌వన్ స్థానాన్ని అధిరోహించిన టీమిండియా తాజాగా ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ ఓటమితో ఆ స్థానాన్ని కోల్పోయింది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 0-4తో ఇంగ్లండ్‌కు అప్పగించి దారుణ పరాజయం మూటగట్టుకున్న భారత జట్టు సిరీస్‌తో పాటు నంబర్‌వన్ స్థానాన్ని కూడా ఇంగ్లండ్‌కు అప్పగించేసింది. 1605 రోజుల తర్వాత టీమిండియా టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ స్థానాన్ని కోల్పోవడం గమనార్హం.పాయింట్ల పరంగా మార్పు లేనప్పటికీ మ్యాచ్‌ల పరంగా తేడా ఉండడంతో ఇంగ్లండ్ తొలి స్థానాన్ని ఆక్రమించింది. రెండో స్థానంలో భారత్ (268 పాయింట్లు), మూడో స్థానంలో ఆస్ట్రేలియా (260 పాయింట్లు) కొనసాగుతున్నాయి. గత నాలుగేళ్లలో నంబర్‌వన్ ర్యాంకు కోల్పోవడంతో పాటు రెండు వరుస టీ20 సిరీస్‌లు ఓడడం కూడా టీమిండియాకు ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ ఓటమి ద్వారా పలు చెత్త రికార్డులను కూడా భారత్ తన పేరిట లిఖించుకుంది.👉టీమిండియాకు పరుగుల పరంగా (56 పరుగులు) ఇది నాలుగో అతిపెద్ద ఓటమి. గతంలో 2026లో ఇంగ్లండ్ చేతిలోనే 125 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 2091లో న్యూజిలాండ్ చేతిలో 80 పరుగులు, 2026లో సౌతాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది.👉ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో టీమిండియా నాలుగు మ్యాచ్‌లు ఓడడం ద్వారా ఒక సిరీస్‌లో అత్యధిక ఓటములు చవిచూసినట్లయింది. గతంలో 2009 మహిళల ప్రపంచకప్‌లో మూడు ఓటములు, 2010 మహిళల ప్రపంచకప్‌లో మూడు ఓటములు, 2023 వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో మూడు ఓటములు చవిచూసింది.👉కెప్టెన్‌గా తొలి ఏడు టీ20 మ్యాచ్‌ల్లో గెలుపు లేని ఆటగాళ్ల జాబితాలో శ్రేయస్ అయ్యర్ చోటు సంపాదించాడు. గతంలో బ్రెండన్ టేలర్ (జింబాబ్వే), ఎల్టన్ చిగుంబరా (జింబాబ్వే), తిసారా పెరీరా (శ్రీలంక) ఈ ఫీట్ సాధించారు. ఇక భారత కెప్టెన్లలో రెండు వరుస టీ20 సిరీస్‌లతో పాటు ఏడు మ్యాచ్‌ల్లో గెలుపు రుచి చూడని తొలి కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డు నమోదు చేశాడు.👉 భారత క్రికెటర్ ప్రిన్స్ యాదవ్ ఒక చెత్త రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. అంబటి రాయుడు తర్వాత తాను ఆడిన మొదటి నాలుగు మ్యాచ్‌ల్లోనూ ప్రిన్స్ యాదవ్ ఓటమి చవిచూడడం గమనార్హం. 🚨 INDIA’S REIGN AS THE NO.1 RANKED T20I TEAM IS OVER AFTER 1,605 DAYS. 🚨 pic.twitter.com/LOr51llcdt— Mufaddal Vohra (@mufaddal_vohra) July 11, 2026చదవండి: 'ఇది మాకు గుణపాఠం.. ఓటమికి కారణం అదే' -
'ఇది మాకు గుణపాఠం.. ఓటమికి కారణం అదే'
ఐర్లాండ్ టూర్లో 0-2తో క్లీన్‌స్వీప్ అయిన టీమిండియా ఇంగ్లండ్ టూర్లోనూ అదే కంటిన్యూ చేసింది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 0-4తో ఇంగ్లండ్‌కు అప్పజెప్పి దారుణ ఓటమిని మూటగట్టుకుంది. శనివారం రాత్రి జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ 56 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. సూర్యకుమార్ యాదవ్ స్థానంలో టీమిండియా టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్‌కు ఇది వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో ఆరో ఓటమి (ఒక మ్యాచ్ వర్షంతో రద్దు) కావడం గమనార్హం. ఏడు మ్యాచ్‌లుగా గెలుపు మొహం చూడని శ్రేయస్ అయ్యర్ టీమిండియా తరఫున అత్యంత చెత్త కెప్టెన్‌గా రికార్డులకెక్కాడు. మ్యాచ్ ఓటమి అనంతరం మాట్లాడిన శ్రేయస్ అయ్యర్.. ఇంగ్లండ్‌తో సిరీస్ ఓటమి తమకు ఒక గుణపాఠం లాంటిదని పేర్కొన్నాడు. బ్యాటింగ్‌లో రాణించినప్పటికీ పేలవ ఫీల్డింగ్‌తో పాటు నాణ్యత లేని బౌలింగ్ జట్టు ఓటమికి ప్రధాన కారణాలుగా నిలిచాయని తెలిపాడు. అయ్యర్ మాట్లాడుతూ.. 'నిజాయితీగా చెప్పాలంటే ఇంకా మేము నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇంగ్లండ్ పరిస్థితులకు ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నాం. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో మేము ఆడిన ప్రతి మైదానంతో పోలిస్తే మేము ఆడిన వికెట్లలో ఇదే బహుశా అత్యుత్తమమైనది కావొచ్చు. మ్యాచ్ మ్యాచ్‌కు పరిస్థితులు మారిపోతున్నాయి. తొలుత ఇంగ్లండ్ గడ్డపై బ్యాటింగ్ చేయడానికే చాలా కష్టపడ్డాం. కానీ ఇవాళ్టి మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో చాలా మెరుగయ్యామనిపించింది. ప్రొఫెషనల్ ఆటలో ఓటములు సహజమే. కానీ ఈ సిరీస్ ఓటమి మాకు గుణపాఠం లాంటిది. మ్యాచ్‌లు గెలవడంలో ఫీల్డింగ్ కూడా కీలకపాత్ర పోషిస్తుంది. నేటి మ్యాచ్‌లో మూడు క్యాచ్‌లు జారవిడవడంతో పాటు పేలవంగా ఫీల్డింగ్ చేశాము. 200-210 పరుగుల టార్గెట్‌ను ఈ గ్రౌండ్లో ఈజీగా ఛేదించవచ్చు. 200 నుంచి 225 పరుగులు చేయాల్సిన ఇంగ్లండ్ మా తప్పిదాల వల్ల మరో 25 నుంచి 30 పరుగులు అదనంగా రాబట్టింది. పేలవ ఫీల్డింగ్‌తో మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇక బ్యాటింగ్ సమయంలో పవర్ ప్లేలో వెనువెంటనే వికెట్లు కోల్పోవడం కూడా విజయాన్ని దూరం చేసినట్లయింది. మంచి భాగస్వామ్యాలు నమోదు చేయడంలో విఫలమయ్యాం. బౌలింగ్ కూడా మెరుగుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బుమ్రా, పాండ్యా వంటి అనుభవజ్ఞలైన బౌలర్లు లేని లోటు స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఇంగ్లండ్ మ్యాచ్ విజయానికి అర్హులు. మొదట బట్లర్.. ఆ తర్వాత కెప్టెన్ హ్యారీ బ్రూక్ వేగంగా ఆడి మ్యాచ్ గమనాన్ని మార్చేశాడు. ఏది ఏమైనా ఈ సిరీస్ ఓటమి మాకు గుణపాఠం లాంటిది. ఇంగ్లండ్ గడ్డపై మరోసారి టీ20 సిరీస్ ఆడేందుకు వచ్చినప్పుడు మా కుర్రాళ్లు జాగ్రత్తగా ఆడతారని నేను అనుకుంటున్నా. కెప్టెన్‌గా సిరీస్ ఓటమి నాకు బాధ కలిగించింది. కానీ కెప్టెన్‌గా మాత్రం చాలా విషయాలు నేర్చుకున్నా.' అని ముగించాడు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. జోస్ బట్లర్ (64 బంతుల్లో 131; 12 ఫోర్లు, 8 సిక్స్‌లు) టీ20ల్లో రెండో సెంచరీతో చెలరేగగా...కెప్టెన్ హ్యారీ బ్రూక్ (45 బంతుల్లో 95 నాటౌట్; 4 ఫోర్లు, 8 సిక్స్‌లు) త్రుటిలో ఆ అవకాశాన్ని కోల్పోయాడు. అనంతరం భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 201 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (35 బంతుల్లో 56; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), తిలక్ వర్మ (25 బంతుల్లో 53; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేశారు. శ్రేయస్ అయ్యర్ (16 బంతుల్లో 28; 4 ఫోర్లు), సంజు సామ్సన్ (14 బంతుల్లో 27; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. ఇప్పటి వరకు ఐసీసీ టి20 టీమ్ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా ఉన్న భారత్‌ను వెనక్కి నెట్టి తాజా ఫలితంతో ఇంగ్లండ్ అగ్రస్థానానికి చేరుకుంది. ఇరుజట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జూలై 14న ప్రారంభం కానుంది.చదవండి: ఫిఫా ప్రపంచ కప్: ఇంగ్లండ్ సెమీస్‌కి.. నార్వే ఇంటికి.. -
మంధాన మరోసారి.. భారీ ఆధిక్యం దిశగా టీమిండియా
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు భారీ ఆధిక్యం దిశగా వెళ్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 154 పరుగులు చేసి, మొత్తంగా 269 పరుగుల ఆధిక్యంలో (117 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది) కొనసాగుతోంది. షఫాలీ వర్మ (33) ఔట్ కాగా.. స్మృతి మంధాన (69), యస్తికా భాటియా (39) క్రీజ్‌లో ఉన్నారు.అంతకుముందు క్రాంతి గౌడ్ (17-7-37-5) ధాటికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే ఆలౌటైంది. క్రాంతికి జతగా సయాలి సత్ఘరే (2-40), స్నేహ్ రాణా (2-41), దీప్తి శర్మ (1-10) కూడా రాణించారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో యామీ జోన్స్ (52) ఒక్కరే అర్ద సెంచరీతో రాణించగా.. కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ (44) ఓ మోస్తరు స్కోర్ చేసింది.వీరితో పాటు మయా బౌచియర్ (23), మ్యాడీ విల్లియర్స్ (10), సోఫీ ఎక్లెస్టోన్ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 285 పరుగులు చేసింది. స్మృతి మంధాన (83), హర్మన్‌ప్రీత్ కౌర్ (58), దీప్తి శర్మ (57) అర్ద సెంచరీలతో రాణించారు.దీనికి ముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 285 పరుగులకు ఆలౌటైంది.స్మృతి మంధాన (83), హర్మన్‌ప్రీత్ కౌర్ (58), దీప్తి శర్మ (57) అర్ద సెంచరీలతో రాణించారు. లార్డ్స్ మైదానంలో భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి మహిళల టెస్ట్ మ్యాచ్ ఇదే. -
బట్లర్ సుడిగాలి శతకం.. ఐదో మ్యాచ్‌లోనూ టీమిండియా ఓటమి
ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ గెలుపు లేకుండానే ముగించింది. సౌతాంప్టన్ వేదికగా ఇవాళ (జులై 11) జరిగిన నామమాత్రపు ఐదో మ్యాచ్‌లోనూ టీమిండియా ఓటమిపాలైంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. ఆతర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఇంగ్లండే గెలుపొందింది. తద్వారా 4-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది.నేటి మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. జోస్ బట్లర్ (64 బంతుల్లో 131; 12 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. కెప్టెన్ హ్యారీ బ్రూక్ (45 బంతుల్లో 95 నాటౌట్; 4 ఫోర్లు, 8 సిక్సర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. భారత బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ (4-0-60-0), అక్షర్ పటేల్ (4-0-63-0), సూర్యాంశ్ షేడ్గే (3-0-39-0) భారీగా పరుగులు సమర్పించుకున్నారు. శివమ్ దూబే ఒకే ఓవర్లో ఏకంగా 22 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే అదే ఓవర్లో 2 వికెట్లు తీశాడు. మిగతా బౌలర్లలో అర్షదీప్ సింగ్ (4-0-33-0), ప్రసిద్ద్ కృష్ణ (4-0-38-1) పొదుపుగా బౌలింగ్ చేశారు.అనంతరం కష్టసాధ్యమైన లక్ష్య ఛేదనకు దిగిన భారత్ చేయాల్సిన ప్రయత్నమంతా చేసినప్పటికీ.. ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. లక్ష్యం మరీ పెద్దది కావడంతో టీమిండియా చేతులెత్తేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులకే పరిమితమైంది. తద్వారా 56 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. భారత ఇన్నింగ్స్‌లో ఇషాన్ కిషన్ (56), తిలక్ వర్మ (53) అర్ద సెంచరీలతో రాణించారు. మిగతా ఆటగాళ్లలో సంజూ శాంసన్ (27), శ్రేయస్ అయ్యర్ (28), శివమ్ దూబే (14) రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతా వాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో సామ్ కర్రన్ 3, ఆదిల్ రషీద్ 2, ఆర్చర్, టంగ్, డాసన్ తలో వికెట్ తీశారు. -
170 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లండ్.. చరిత్ర సృష్టించిన భారత పేసర్
భారత మహిళల క్రికెట్ జట్టు యువ పేసర్ క్రాంతి గౌడ్ చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో అరుదైన ఘనత సాధించింది. ఈ మైదానంలో ఐదు వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టిస్తూ ప్రతిష్ఠాత్మక లార్డ్స్ ఆనర్స్ బోర్డులో తన పేరు లిఖించుకుంది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఆమె ఈ ఘనత సాధించింది. ఈ మ్యాచ్‌లో క్రాంతి 17 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 37 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు కీలక వికెట్లు పడగొట్టింది. ఫలితంగా భారత్ ఇంగ్లండ్‌ను 170 పరుగులకే కుప్పకూల్చి, 117 పరుగుల కీలక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించింది.ఈ ప్రదర్శనతో క్రాంతి మరో ఘనత కూడా సాధించింది. టెస్టు క్రికెట్లో ఐదు వికెట్లు సాధించిన అత్యంత పిన్న వయస్కురాలైన భారత మహిళా ఫాస్ట్ బౌలర్‌గా రికార్డు నెలకొల్పింది.లార్డ్స్ ఆనర్స్ బోర్డులో పేరు నమోదు కావడం ఏ క్రికెటర్‌కైనా ఓ కల. అలాంటి అరుదైన గౌరవాన్ని తన కెరీర్ ప్రారంభ దశలోనే అందుకున్న క్రాంతి గౌడ్ భారత మహిళల క్రికెట్లో మరో చారిత్రాత్మక అధ్యాయాన్ని లిఖించింది.మ్యాచ్ విషయానికొస్తే.. క్రాంతి గౌడ్ ధాటికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే ఆలౌటైంది. క్రాంతికి జతగా సయాలి సత్ఘరే (2-40), స్నేహ్ రాణా (2-41), దీప్తి శర్మ (1-10) కూడా రాణించారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో యామీ జోన్స్ (52) ఒక్కరే అర్ద సెంచరీతో రాణించగా.. కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ (44) ఓ మోస్తరు స్కోర్ చేసింది. వీరితో పాటు మయా బౌచియర్ (23), మ్యాడీ విల్లియర్స్ (10), సోఫీ ఎక్లెస్టోన్ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 285 పరుగులు చేసింది. స్మృతి మంధాన (83), హర్మన్‌ప్రీత్ కౌర్ (58), దీప్తి శర్మ (57) అర్ద సెంచరీలతో రాణించారు. లార్డ్స్ మైదానంలో భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి మహిళల టెస్ట్ మ్యాచ్ ఇదే. -
కోహ్లి రికార్డు బద్దలు కొట్టిన శ్రేయస్
భారత టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ అరుదైన రికార్డు సాధించాడు. భారత్ తరఫున పొట్టి ఫార్మాట్లో అత్యధిక సార్లు (వరుసగా) టాస్ గెలిచిన కెప్టెన్‌గా ధోని రికార్డు సమం చేశాడు. శ్రేయస్, ధోని వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో టాస్ గెలిచారు. ఈ జాబితాలో శ్రేయస్, ధోని తర్వాతి స్థానాల్లో విరాట్ కోహ్లి (6), రోహిత్ శర్మ (5) ఉన్నారు.ఇంగ్లండ్‌తో ఇవాళ (జులై 11) జరుగుతున్న ఐదో టీ20లో టాస్ గెలవడం ద్వారా శ్రేయస్ కోహ్లి రికార్డును అధిగమించి, ధోని రికార్డును సమం చేశాడు.భారత టీ20 కెప్టెన్‌గా అత్యధిక వరుస టాస్ విజయాలు..శ్రేయస్ అయ్యర్ – 7* (2026)ఎంఎస్ ధోని – 7 (2010-12)విరాట్ కోహ్లీ – 6 (2019)ఎంఎస్ ధోని – 5 (2007)రోహిత్ శర్మ – 5 (2020-22)మళ్లీ టాస్ గెలిచిన శ్రేయస్.. ఆసారైనా మ్యాచ్ గెలిచేనా..?భారత టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ వరుసగా ఏడో మ్యాచ్‌లో టాస్ గెలిచాడు. అయితే ఈ ఏడు మ్యాచ్‌ల్లో అతడు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయాడు. ఐర్లాండ్ సిరీస్‌తో టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన శ్రేయస్ ఆ సిరీస్‌లోని రెండు మ్యాచ్‌ల్లో టాస్ గెలిచి, సిరీస్‌ను మాత్రం 0-2తో కోల్పోయాడు. ఆతర్వాత ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌లోనూ టాస్ గెలవగా.. ఆ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఆ తర్వాత మూడు మ్యాచ్‌ల్లోనూ శ్రేయస్ టాస్ గెలిచినా, ఒక్క మ్యాచ్‌లోనూ టీమిండియాను గెలిపించలేకపోయాడు.దీంతో ఈసారైనా మ్యాచ్ గెలవాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రేయస్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం భారత్ రెండు మార్పులు చేసింది. వైభవ్ సూర్యవంశీ స్థానంలో సంజూ శాంసన్.. వాషింగ్టన్ సుందర్ స్థానంలో సూర్యాంశ్ షేడ్గే జట్టులోకి వచ్చారు.భారత్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్(w), శ్రేయాస్ అయ్యర్(c), తిలక్ వర్మ, శివమ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(w), హ్యారీ బ్రూక్(c), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కర్రాన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, జోష్ టంగ్‌ల -
టీమిండియా ఓటమి
ఐదో మ్యాచ్‌లోనూ టీమిండియా ఓటమిఐదో టీ20లోనూ టీమిండియా ఓటమిపాలైంది. తద్వారా సిరీస్‌ను 0-4తో కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది.జోస్ బట్లర్ (64 బంతుల్లో 131; 12 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. కెప్టెన్ హ్యారీ బ్రూక్ (45 బంతుల్లో 95 నాటౌట్; 4 ఫోర్లు, 8 సిక్సర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు.అనంతరం కష్టసాధ్యమైన లక్ష్య ఛేదనకు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులకే పరిమితమై, 56 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.ఇషాన్ కిషన్ (56) ఔట్12.4వ ఓవర్- ఇషాన్ కిషన్ (35 బంతుల్లో 56; 7 ఫోర్లు, 2 సిక్సర్లు). స్కోర్ 131-4. మూడో వికెట్ కోల్పోయిన భారత్10.1వ ఓవర్- శ్రేయస్ అయ్యర్ (28) ఔట్సంజూ శాంసన్ ఔట్5.1వ ఓవర్- 55 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ కోల్పోయింది. సామ్ కర్రన్ బౌలింగ్‌లో జేకబ్ బేతెల్‌కు క్యాచ్ ఇచ్చి సంజూ శాంసన్ (27) ఔటయ్యాడు. తొలి వికెట్ కోల్పోయిన భారత్2.3వ ఓవర్- 25 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి అభిషేక్ శర్మ (3) ఔటయ్యాడు. బట్లర్ సెంచరీ.. ఇంగ్లండ్ భారీ స్కోర్సౌతాంప్టన్ వేదికగా భారత్‌తో జరుగుతున్న ఐదో టీ20లో ఇంగ్లండ్ అతి భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. జోస్ బట్లర్ (64 బంతుల్లో 131; 12 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. కెప్టెన్ హ్యారీ బ్రూక్ (45 బంతుల్లో 95 నాటౌట్; 4 ఫోర్లు, 8 సిక్సర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. భారత బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ (4-0-60-0), అక్షర్ పటేల్ (4-0-63-0) భారీగా పరుగులు సమర్పించుకున్నారు. శివమ్ దూబే ఒకే ఓవర్లో ఏకంగా 22 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే అదే ఓవర్లో 2 వికెట్లు తీశాడు. భారత బౌలర్లను చీల్చిచెండాతున్న బ్రూక్బ్రూక్ 32 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 78 నాటౌట్బట్లర్ 44 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 72 నాటౌట్14 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 168-1అర్ద సెంచరీలు పూర్తి చేసుకున్న బ్రూక్, బట్లర్హ్యారీ బ్రూక్ (56), జోస్ బట్లర్ (72) ధాటిగా ఆడుతున్నారు. 13 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 146-1గా ఉంది.ధాటిగా ఆడుతున్న బ్రూక్వన్డౌన్లో వచ్చిన హ్యారీ బ్రూక్ ధాటిగా ఆడుతున్నాడు. 11 బంతుల్లో 3 సిక్సర్ల సాయంతో 25 పరుగులు చేశాడు. జోస్ బట్లర్ 28 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు సాయంతో 40 పరుగులతో అజేయంగా ఉన్నాడు. 8 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 73-1గా ఉంది. తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్1.4వ ఓవర్- ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో సూర్యాంశ్ షేడ్గేకు క్యాచ్ ఇచ్చి ఫిల్ సాల్ట్ (6) ఔటయ్యాడు.మళ్లీ టాస్ గెలిచిన శ్రేయస్.. ఈసారైనా మ్యాచ్ గెలిచేనా..?శ్రేయస్ అయ్యర్ వరుసగా ఏడో మ్యాచ్‌లో టాస్ గెలిచాడు. ఈసారైనా మ్యాచ్ గెలవాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. టాస్ గెలిచిన శ్రేయస్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం భారత్ రెండు మార్పులు చేసింది. వైభవ్ సూర్యవంశీ స్థానంలో సంజూ శాంసన్.. వాషింగ్టన్ సుందర్ స్థానంలో సూర్యాంశ్ షేడ్గే జట్టులోకి వచ్చారు.భారత్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్(w), శ్రేయాస్ అయ్యర్(c), తిలక్ వర్మ, శివమ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(w), హ్యారీ బ్రూక్(c), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కర్రాన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, జోష్ టంగ్7:15 గంటలకు టాస్భారత జట్టు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవడంతో టాస్ 45 నిమిషాలు ఆలస్యమైంది. భారతకాలమానం ప్రకారం 7:15 గంటలకు టాస్ పడుతుంది. టాస్ ఆలస్యం.. కారణమిదే..!భారత్, ఇంగ్లండ్ మధ్య సౌతాంప్టన్ వేదికగా ఇవాళ (జులై 11) ఐదో టీ20 జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్ టాస్ ఆలస్యమైంది. భారత జట్టు ట్రాఫిక్‌లో ఇరుక్కోవడం చేత ఆలస్యమైనట్లు తెలుస్తోంది. అయితే కొద్ది క్షణాల క్రితం టీమిండియా స్టేడియంకు చేరుకున్నట్లు అప్డేట్. మరికొద్ది నిమిషాల్లో టాస్ పడే అవకాశం ఉంది.కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ టీ20 సిరీస్‌ను భారత్ ఇప్పటికే 0-3 తేడాతో కోల్పోయింది. తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా.. తర్వాత మూడు మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ గెలుపొందింది. ఇవాళ నామమాత్రపు చివరి మ్యాచ్ జరుగనుంది. -
టీమిండియాను అవమానించిన పోర్చుగల్ క్రికెట్
టీమిండియా వరుస వైఫల్యాల నేపథ్యంలో ఓ భారత అభిమానికి పోర్చుగల్ క్రికెట్ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల టీమిండియా ఐర్లాండ్ చేతిలో ఓడిన విషయాన్ని ప్రస్తావిస్తూ పోర్చుగల్ క్రికెట్ చేసిన కామెంట్ క్రికెట్ అభిమానుల మధ్య చర్చనీయాంశంగా మారింది.పోర్చుగల్ క్రికెట్ జట్టు తమ చివరి 18 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో కేవలం రెండు పరాజయాలు మాత్రమే చవిచూసిందంటూ క్రికెట్ పోర్చుగల్ సోషల్‌మీడియాలో ఓ పోస్టు షేర్ చేసింది. దీనిపై స్పందించిన ఓ భారత అభిమాని, "ఈ పోర్చుగల్ అకౌంట్ ఐర్లాండ్ నుంచి నడుస్తున్నట్టుంది" అంటూ కామెంట్ చేశాడు.దీనిపై పోర్చుగల్ క్రికెట్ స్పందిస్తూ, "ఐర్లాండ్ గురించి నిజంగానే మాట్లాడాలనుకుంటున్నావా..?" అంటూ ఒక్క వాక్యంతోనే కౌంటర్ ఇచ్చాడు. ఈ వ్యాఖ్య భారత జట్టు ఇటీవల ఐర్లాండ్ చేతిలో ఎదుర్కొన్న టీ20 సిరీస్ పరాజయాన్ని ఉద్దేశించిందని అభిమానులు భావిస్తున్నారు. ఆ సమాధానం సోషల్ మీడియాలో విపరీతంగా వైరలవుతుంది.టీ20 ప్రపంచకప్ విజయం తర్వాత యూరప్ పర్యటనకు వెళ్లిన భారత జట్టు, డబ్లిన్‌లో జరిగిన రెండు టీ20ల్లో ఐర్లాండ్ చేతిలో ఓడి చరిత్రలో తొలిసారి ఆ జట్టు చేతిలో టీ20 సిరీస్ కోల్పోయింది. అనంతరం ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, ఆతర్వాతి మూడు మ్యాచ్‌ల్లో భారత్ వరుసగా పరాజయాలు చవిచూసి, ఇప్పటికే 0-3తో సిరీస్ కోల్పోయింది. ఈ సిరీస్‌లో నామమాత్రను చివరి టీ20 ఇవాళ జరుగునుంది.శ్రేయస్ అయ్యర్ టీ20 జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాక టీమిండియా ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ గెలవలేదు. ఈ నేపథ్యంలో శ్రేయస్ భారీ ప్రెషర్‌ను ఎదుర్కొంటున్నాడు. ఇలాంటి తరుణంలో క్రికెట్లో ఇప్పుడిప్పుడే ఓనమాలు దిద్దుకుంటున్న పోర్చుగల్ లాంటి దేశం టీమిండియాకు కౌంటరివ్వడం గమనార్హం. -
నిషేధం ఎత్తివేసినా!.. ఐపీఎల్ ఆడే ప్రసక్తే లేదు!
ఇంగ్లండ్ టీ20 జట్టు కెప్టెన్ హ్యారీ బ్రూక్ జోష్‌లో ఉన్నాడు. స్వదేశంలో అతడి సారథ్యంలో.. ఇంగ్లండ్ తొలిసారి టీమిండియాపై టీ20 సిరీస్‌ను 3-0తో గెలిచింది. ఇటు సారథిగా.. అటు బ్యాటర్‌గా ఈ విజయంలో బ్రూక్‌ది కీలక పాత్ర.ఈ క్రమంలో ఇంగ్లండ్- టీమిండియా మధ్య శనివారం నాటి నామమాత్రపు ఐదో టీ20లోనూ గెలిచి క్లీన్‌స్వీప్ చేయాలని బ్రూక్ పట్టుదలగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో సౌతాంప్టన్ మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.గొప్ప అనుభవం.. కానీ ఆడలేను‘‘ఐపీఎల్లో ఆడటం నిజంగా గొప్ప అనుభవం. ఐపీఎల్ ఆడటాన్ని పూర్తిగా ఆస్వాదించాను. అయితే, దురదృష్టవశాత్తూ నేనిప్పుడు అక్కడ ఆడేందుకు సమయం కేటాయించే పరిస్థితిలో లేను.నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం.. ప్రస్తుతం నేను మూడు ఫార్మాట్లు ఆడుతూ.. రెండు ఫార్మాట్ల (వన్డే, టీ20)కు కెప్టెన్‌గా ఉంటూ.. ఐపీఎల్ కూడా ఆడటం అంటే కష్టమే. ప్రస్తుతం నా షెడ్యూల్ కిక్కిరిసి పోయి ఉంది. మహా అయితే ఓ మూడు నెలల విరామం దొరుకుతుంది.అప్పుడు నేను ఆ సమయాన్ని ఐపీఎల్ కోసం పెట్టలేను. కాస్త విరామం తీసుకుని.. ఆ తర్వాత ఫిట్నెస్, ఆటపై దృష్టి పెడతాను. ఇంగ్లిష్ క్రికెట్ కోసం నేను చేయగలిగిందంతా చేస్తాను’’ అని స్వదేశీ, జాతీయ క్రికెట్ పట్ల తనకు ఉన్న అంకితభావాన్ని హ్యారీ బ్రూక్ వివరించాడు.నిషేధం ఎత్తివేసినా సరే కుదరదుకాగా 2023లో హ్యారీ బ్రూక్ ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున మొత్తంగా 11 మ్యాచ్‌లలో కలిపి 190 పరుగులు చేశాడు. ఈ క్రమంలో సన్‌రైజర్స్ అతడిని వదిలివేయగా.. ఢిల్లీ క్యాపిటల్స్ కొనుక్కుంది.అయితే, 27 ఏళ్ల హ్యారీ బ్రూక్ 2024, 2025 సీజన్లలో ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే ఫ్రాంఛైజీకి హ్యాండిచ్చాడు. ఈ నేపథ్యంలో నిబంధనల ప్రకారం.. అతడిపై 2028 వరకు ఐపీఎల్ నిర్వాహకులు నిషేధం విధించారు. అయితే, బ్రూక్ తాజా వ్యాఖ్యలను బట్టి.. ఒకవేళ గడువు తీరి నిషేధం ఎత్తివేసినా సరే తాను ఇప్పట్లో ఐపీఎల్ ఆడే ప్రసక్తే లేదని చెప్పకనే చెప్పినట్లయింది. ఇక ప్రస్తుతం ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా ఉన్న బ్రూక్.. త్వరలోనే టెస్టు సారథిగానూ పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది.చదవండి: వెస్టిండీస్ క్రికెటర్ రిటైర్మెంట్ -
వాళ్లిద్దరినీ తొలగించారు.. గంభీర్‌పైనా వేటు వేయండి!
టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత రాహుల్ ద్రవిడ్ హెడ్‌కోచ్ బాధ్యతల నుంచి వైదొలిగాడు. ఈ క్రమంలో బీసీసీఐ అతడి స్థానాన్ని గౌతం గంభీర్‌తో భర్తీ చేసింది. అయితే, గంభీర్ మార్గదర్శనంలో తొలుత శ్రీలంక పర్యటనలో టీ20 సిరీస్‌ను గెలిచిన భారత్.. రెండున్నర దశాబ్దాల తర్వాత తొలిసారి వన్డే సిరీస్‌ను లంకకు కోల్పోయింది.ఇక ఆ తర్వాత కూడా గంభీర్ మార్గదర్శనంలో మిశ్రమ ఫలితాలే వచ్చాయి. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ చాంపియన్‌గా నిలిచినప్పటికీ.. అందుకు ద్రవిడ్‌కే క్రెడిట్ ఇవ్వాల్సి ఉంటుందని.. నాటి కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు.ఆ రెండూ మినహా...ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2026లోనూ టీమిండియా విజేతగా నిలిచినప్పటికీ.. స్వదేశంలో సిరీస్ జరగడం సానకూలంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ రెండు మెగా టోర్నీలు గెలిచినప్పటికీ.. గంభీర్ మార్గదర్శనంలో టీమిండియా అత్యంత ఘోర పరాభవాలు చవిచూసింది.సొంతగడ్డపై న్యూజిలాండ్, సౌతాఫ్రికా చేతుల్లో టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్ కావడం.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరకపోవడం ఇందులో ప్రధానమైనవి. అంతేకాదు స్వదేశంలో తొలిసారి న్యూజిలాండ్‌కు వన్డే సిరీస్‌ను కూడా భారత్ కోల్పోయింది.వ్యంగ్యాస్త్రాలు తాజాగా టీ20 ప్రపంచకప్-2026 చాంపియన్ హోదాలో ఐర్లాండ్‌లో అడుగుపెట్టి.. పసికూన చేతిలో ఏకంగా 2-0తో వైట్‌వాష్ అయింది. అనంతరం ఇంగ్లండ్‌కు కూడా 0-3తో టీ20 సిరీస్‌ను కోల్పోయింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ గంభీర్, జట్టు యాజమాన్యంపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.‘‘అయినా అతడి (గంభీర్)ని ప్రశ్నించేందుకు ఎవరైనా ఉన్నారా?.. అతడిని తప్పుకోమని చెప్పగల ధైర్యం ఉందా?.. ఈరోజు ఇంతజరిగినా ఎవరూ ఏమీ అనరు. ఎందుకంటే కొన్ని నెలల క్రితమే అతడు ప్రపంచకప్ గెలిచాడని చెబుతారు.వాళ్లిద్దరినీ తొలగించారు.. అతడిపైనా వేటు వేయండి!మరి సూర్యకుమార్ యాదవ్ కూడా కెప్టెన్‌గా కప్పు గెలిచాడు. అయినా సరే అతడిపై నిర్దాక్షిణ్యంగా వేటు వేశారు. జట్టు చాంపియన్‌గా నిలవడంలో సంజూ శాంసన్‌ది కీలక పాత్ర. అయినా కూడా అతడిని తుదిజట్టు నుంచి తప్పించారు.మరి వాళ్లిద్దరిలాగే గంభీర్‌పై వేటు వేయలేరా?.. మీ ఆలోచనా విధానం ఒక్కొక్కరి విషయంలో ఒక్కోలా ఉంటుందా?’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ యాజమాన్యం తీరును తూర్పారబట్టాడు. అదే విధంగా.. ఇంగ్లండ్ చేతిలో సిరీస్ ఓడిపోయినప్పటికీ గంభీర్ ముఖంలో కాస్తైనా బాధ కనిపించలేదని చిక్కా మండిపడ్డాడు.కొంచెం కూడా బాధ లేదు‘‘తననూ ఎవరు టచ్ చేయలేరని అతడికి తెలుసు. అందుకే డగౌట్లో కూర్చుని నవ్వులు చిందిస్తున్నాడు. అసలు జట్టు ఓడిపోతోందన్న బాధ అతడిలో కొంచెం కూడా కనిపించలేదు. ఎన్నో సిరీస్‌లలో వైట్‌వాష్‌లు, ఘోర పరాభవాలు.అయినా సరే అతడిని కదిలించేవారే లేరు. తనను ఎవరూ ఏమీ చేయలేరన్న నమ్మకంతోనే అతడు ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. వాటి గురించి నిర్భయంగా మాట్లాడుతున్నాడు’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.చదవండి: IND vs ENG 5th T20I: భారత తుదిజట్టు ఇదే! -
IND vs ENG: భారత తుదిజట్టు ఇదే!.. వైభవ్‌పై వేటు!
టీ20 ప్రపంచకప్ చాంపియన్ టీమిండియాకు ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పసికూన ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో 2-0తో క్లీన్‌స్వీప్‌నకు గురైన భారత జట్టు.. ఇంగ్లండ్‌కూ సిరీస్‌ను 0-3తో కోల్పోయింది. ఇక సౌతాంప్టన్ వేదికగా శనివారం నాటి ఆఖరిదైన ఐదో టీ20లో గెలిస్తేనే మరో వైట్‌వాష్ నుంచి టీమిండియా బయటపడుతుంది.పరువు దక్కాలంటేఈ నేపథ్యంలో కనీస పరువు దక్కాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత తుదిజట్టు కూర్పు ఎలా ఉండబోతుందన్న చర్చ మొదలైంది. ఈ క్రమంలో వరుసగా మూడు మ్యాచ్‌లలో విఫలమైన యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీపై వేటు తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కాగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ నాకౌట్ మ్యాచ్‌లలో వరుసగా 97*, 89, 89 పరుగులతో రాణించి.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు సంజూ శాంసన్. అయితే, ఐర్లాండ్‌తో రెండు టీ20లలో 5, 0 పరుగులు చేసిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. ఇంగ్లండ్‌తో తొలి టీ20లో కేవలం ఒకే ఒక్క పరుగు చేసి నిష్క్రమించాడు.సంజూ శాంసన్‌పై వేటు వేసిఈ నేపథ్యంలో సంజూ శాంసన్‌పై వేటు వేసిన యాజమాన్యం.. అతడి స్థానంలో వైభవ్ సూర్యవంశీతో అరంగేట్రం చేయించింది. అయితే, పదిహేనేళ్ల ఈ లెఫ్టాండర్ బ్యాటర్ ఇంగ్లండ్‌తో వరుసగా మూడు మ్యాచ్‌లలో 13, 14, 15 పరుగులు చేసి నిరాశపరిచాడు. ఇందుకు తోడు జట్టు సైతం వరుస పరాజయాలతో సిరీస్ కోల్పోయింది.తిరిగి తుదిజట్టులోకి ఇక వైభవ్‌తో పాటు వైస్ కెప్టెన్ తిలక్ వర్మ, వన్‌డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ సైతం విఫలమవుతున్నారు. ఇలాంటి తరుణంలో హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో ఐదో టీ20 సందర్భంగా సంజూ శాంసన్‌ను తిరిగి తుదిజట్టులోకి తీసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.టాపార్డర్‌లో ముగ్గురూ లెఫ్టాండర్లే (అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్) ఉండటం కూడా సమస్యగా మారిందని.. ఈసారి సంజూను చేర్చి లెఫ్ట్- రైట్ కాంబినేషన్‌తో ముందుకు వెళ్లనున్నట్లు సమాచారం. లేదంటే వైభవ్‌ను కొనసాగించి.. తిలక్ వర్మ లేదంటే ఇషాన్ కిషన్‌ను తప్పిస్తే ఎలా ఉంటుందన్న చర్చ జరుగుతోంది.అయితే, తిలక్ ప్రస్తుతం వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. కాబట్టి అతడిని తుదిజట్టు నుంచి తీసేయడం కష్టం. మరోవైపు.. ఇషాన్ వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్‌గా ఉన్నప్పటికీ.. వన్‌డౌన్‌లో సంజూ ఆడగలడు కాబట్టి అతడు ఇషాన్‌ను రీప్లేస్ చేసే అవకాశం ఉంది. ఇక అక్షర్ పటేల్, ప్రసిద్ కృష్ణ స్థానంలో రవి బిష్ణోయి, సూర్యాంశ్ షెడ్గే రానున్నట్లు సమాచారం.ఇంగ్లండ్‌తో ఐదో టీ20కి భారత తుదిజట్టు (అంచనా)అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్, శివం దూబే, సూర్యాంశ్ షెడ్గే, ప్రిన్స్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయి. -
భారత టీ20 జట్టులోకి ఊహించని ప్లేయర్!
ఇంగ్లండ్ చేతిలో క్లీన్‌స్వీప్ గండం నుంచి తప్పించుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. సౌతాంప్టన్ వేదికగా ఆతిథ్య జట్టుతో ఆఖరి టీ20 మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని భావిస్తోంది. కాగా విదేశీ గడ్డ మీద టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే.తొలుత పసికూన చేతిలోటీ20 ప్రపంచకప్-2026 చాంపియన్‌గా ఐర్లాండ్‌లో అడుగుపెట్టిన భారత జట్టు.. అనూహ్య రీతిలో పసికూన చేతిలో 2-0తో వైట్‌వాష్ అయింది. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షం వల్ల రద్దు కాగా.. ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌లలో భారత్ ఓటమిపాలైంది.ఫలితంగా ఇంగ్లండ్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీ20 సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శనివారం మూడో టీ20 జరుగనున్న నేపథ్యంలో టీమిండియా యాజమాన్యం తీరుపై భారత మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.అనుచిత నిర్ణయాల వల్లే సెలక్షన్ విషయంలో అనుచిత నిర్ణయాల వల్లే టీమిండియాకు ఈ గతి పట్టిందని చిక్కా మండిపడ్డాడు. ఈ క్రమంలో టెస్టు జట్టులో రెగ్యులర్ సభ్యుడైన కేఎల్ రాహుల్‌ను తిరిగి టీ20 జట్టులోకి తీసుకోవాలని యాజమాన్యానికి సూచించాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ..గిల్‌కు ఛాన్స్ ఇచ్చారు..‘‘ప్రస్తుత పరిస్థితుల్లో కేఎల్ రాహుల్‌ను భారత టీ20 జట్టులోకి తిరిగి తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. నిజానికి శుబ్‌మన్ గిల్‌కు ఓ అవకాశం దక్కింది. వన్డే, టెస్టు కెప్టెన్ అయిన అతడిని నేరుగా టీ20 జట్టు వైస్ కెప్టెన్‌గా నియమించారు.అతడిని టీ20 ఫార్మాట్లోనూ ఆడించండికానీ అతడు తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. కాబట్టి ఆ తర్వాత గిల్‌ను పక్కనపెట్టేశారు. అయితే, కేఎల్ రాహుల్‌కు కనీసం అలాంటి ఒక్క అవకాశం కూడూ దక్కలేదు. రాహుల్‌ను కేవలం టెస్టు, వన్డేలకే పరిమితం చేయాలని యాజమాన్యం భావిస్తోంది.ఫ్లాట్ పిచ్‌ల మీదే మనోళ్ల ప్రతాపంనిజానికి అతడి టీ20 రికార్డు అద్భుతంగా ఉంది. ఎలాంటి పిచ్ మీద అయినా రాహుల్ ఆడగలడు. ప్రస్తుత టీమిండియా బ్యాటింగ్ లైనప్ కేవలం ఫ్లాట్ పిచ్‌ల మీద మాత్రమే పరుగుల వరద పారిస్తోంది. సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్ టోర్నీలో సౌతాఫ్రికా భయపెట్టగానే.. వెంటనే పిచ్‌లు మార్చమని మనోళ్లు అడిగారు. ఇక ఐపీఎల్లో లక్నో పిచ్ మీద భారత బ్యాటర్లు పరుగులు రాబట్టేందుకు ఇబ్బంది పడ్డారు. మన బ్యాటర్లు తడి టెన్నిస్ బాల్‌తో ప్రాక్టీస్ చేస్తూ పేస్, బౌన్సీ కండిషన్లకు మరింతగా అలవాటు పడాల్సిన ఆవశ్యకత ఉంది’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా పొట్టి ఫార్మాట్లో కేఎల్ రాహుల్ చివరగా 2022 టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్ సందర్భంగా టీమిండియాకు ఆడాడు. ఇప్పటికి మొత్తంగా 72 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 2265 పరుగులు సాధించాడు. సగటు 37.7 కాగా స్ట్రైక్‌రేటు 139.13. రాహుల్ ఖాతాలో 22 టీ20 అర్ధ శతకాలు, రెండు సెంచరీలు ఉన్నాయి.చదవండి: అతడు భయపడుతున్నాడు.. జట్టు నుంచి తీసేయండి -
కోహ్లి రహస్య సంభాషణ బట్టబయలు!
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి కండరాల గాయంతో అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. తాజాగా గాయం నుంచి కోలుకున్న కోహ్లి ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ప్రాక్టీస్ ఆరంభించిన కోహ్లి తొలి వన్డేలో రాణించాలనే పట్టుదలతో ఉన్నాడు. తాజాగా కోహ్లికి సంబంధించి ఒక సీక్రెట్ సంభాషణను ఇంగ్లండ్ క్రికెటర్ జోర్డాన్ కాక్స్ లీక్ చేయడం వైరల్‌గా మారింది. కొన్ని రోజుల క్రితం ఇంగ్లండ్ బ్యాటర్ జోర్డాన్ కాక్స్ కోహ్లితో జరిపిన పర్సనల్ సంభాషణకు సంబంధించిన ఫొటోలు తాజాగా బయటికి వచ్చాయి. దీనిపై జోర్డాన్ కాక్స్ స్పందించాడు. 'గత నెలలో కోహ్లిని లండన్‌లో కలిశాను. అయితే కోహ్లితో సమావేశాన్ని గోప్యంగా ఉంచాలని భావించాను. కానీ మేమిద్దరం మాట్లాడుకుంటున్న ఫొటోలు ఎవరో రహస్యంగా చిత్రీకరించారు. తాజాగా ఆ ఫొటోలు బయటికి లీకయ్యాయి. మేమిద్దరం మాట్లాడుకుంటున్న సమయంలో కొందరు మా పక్క నుంచి మాట్లాడుకుంటూ వెళ్లారు. నాకు తెలిసి వాళ్లలోనే ఎవరో ఒకరు మా ఫొటోలు తీసి సోషల్ మీడియలో షేర్ చేశారనిపించింది. నిజానికి కోహ్లి లండన్‌లో ఒక ప్రశాంతమైన జీవితం గడపాలని అనుకున్నాడంట. కానీ ఇక్కడ కూడా తనకు పాపులారిటీ రావడంతో ఇకపై లండన్‌లో స్వేచ్ఛగా తిరిగే హక్కు కోల్పోతానేమో అని కోహ్లి నాతో చెప్పాడు. ఇక ఐపీఎల్ సమయంలో కోహ్లి నాకు అండగా నిలబడ్డాడు. కొంతమంది ఆటగాళ్లు తమ ఆటపై మాత్రమే దృష్టి పెడుతుంటారు. కానీ కోహ్లి మాత్రం తనతో పాటు ఉండే సహచరులకు సంబంధించి అన్ని విషయాలపై దృష్టి పెట్టడమే గాక అవసరమైతే సలహాలు కూడా ఇస్తుంటాడు. ఇదే అతడిని ప్రత్యేకంగా నిలిపింది' అని జోర్డాన్ కాక్స్ చెప్పుకొచ్చాడు. 2024 టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత పొట్టి ఫార్మాట్‌కు, ఆ తర్వాత టెస్టులకు వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లి ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నాడు. 2027 వన్డే ప్రపంచకప్ తర్వాత కోహ్లి అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికే అవకాశం కూడా ఉంది. కోహ్లితో పాటు రోహిత్ శర్మ కూడా తన రిటైర్మెంట్పై ఒక నిర్ణయానికి వచ్చే చాన్స్ ఉంది. ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని టీమిండియా.. ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతోంది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఇంగ్లండ్ 3-0తో సిరీస్ గెలుచుకుంది. సిరీస్‌లో చివరి మ్యాచ్ నేడు సౌతాంప్టన్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి వైట్‌వాష్ గండం నుంచి తప్పించుకోవాలని టీమిండియా భావిస్తోంది.ఇక జూలై 14 నుంచి 19 మధ్య ఇంగ్లండ్, భారత్ మధ్య మూడు వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. వన్డేల్లో కోహ్లి ఇప్పటివరకు 311 వన్డేల్లో 14,797 పరుగులు సాధించాడు. ఇందులో 54 సెంచరీలు, 77 అర్ధసెంచరీలు ఉన్నాయి.చదవండి: ఇంగ్లండ్‌తో సిరీస్ ఓటమి.. తొలి దెబ్బ అతడికేనా? -
హాఫ్ సెంచరీతో మంధాన ప్రపంచ రికార్డు
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత మహిళల జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన హాఫ్ సెంచరీతో మెరిసింది. లార్డ్స్ వేదికగా మహిళల క్రికెట్లో ఇదే తొలి టెస్టు కావడంతో మంధాన అరుదైన ఫీట్ సాధించింది. లార్డ్స్ వేదికలో అర్ధసెంచరీ సాధించిన తొలి క్రికెటర్‌గా మంధాన రికార్డులకెక్కింది. 50 బంతుల్లో ఫిఫ్టీ సాధించిందిన మంధాన ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. అంతేకాదు మంధాన తన ఫిఫ్టీతో మరో రికార్డు కూడా అందుకుంది. టెస్టు క్రికెట్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన మహిళా క్రికెటర్ల జాబితాలో మంధాన చోటు దక్కించుకుంది. గతంలో 2021లో ఆస్ట్రేలియాతో టెస్టులో 51 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ సాధించిన మంధాన ఇంగ్లండ్‌తో టెస్టులో 50 బంతుల్లో ఆ మార్క్‌ను చేరుకుంది. భారత క్రికెటర్లలో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన మూడో క్రికెటర్‌గా నిలిచింది. మంధాన కంటే ముందు సంగీతా డాబిర్ (1995లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో 42 బంతులు), శుభా సతీశ్ (2023లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో 49 బంతుల్లో) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఓవరాల్‌గా చూసుకుంటే మంధాన ఐదో స్థానంలో ఉంది. తొలి స్థానంలో సంగీతా డాబిర్ ఉండగా, ఇంగ్లండ్‌కు చెందిన నట్ సివర్ బ్రంట్ (46 బంతులు, 48 బంతులు) రెండుసార్లు ఈ ఫీట్ అందుకోగా, శుభా సతీశ్ నాలుగో స్థానంలో ఉంది. మ్యాచ్ విషయానికొస్తే టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు 25 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. మంధాన (56), హర్మన్‌ప్రీత్ (15) పరుగులతో క్రీజులో ఉన్నారు. First Test FIFTY in women's cricket at Lord's 🏟️And it's none other than #TeamIndia vice-captain Smriti Mandhana 👏👏Updates ▶️ https://t.co/O1rEau8j8n#ENGvIND pic.twitter.com/Z2oaM5vqsz— BCCI Women (@BCCIWomen) July 10, 2026చదవండి: చెప్పి మరీ ఔట్ చేశాడు.. వైభవ్‌కు ఆర్చర్ స్ట్రోక్! -
చెప్పి మరీ ఔట్ చేశాడు.. వైభవ్‌కు ఆర్చర్ స్ట్రోక్!
ఐపీఎల్ 2026 సీజన్లో తన బ్యాటింగ్‌తో అలరించిన వైభవ్ సూర్యవంశీ రాజస్తాన్ రాయల్స్ తరఫున ఆడి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. ఇదే జట్టులో సహచరుడిగా ఉన్న జోఫ్రా ఆర్చర్ ఐపీఎల్ సమయంలో వైభవ్‌ను ఔట్ చేయడానికి మీ దగ్గర ఎలాంటి అస్త్రాలున్నాయని అడిగినప్పుడు, అదేంటనేది ఐపీఎల్ ముగిసిన తర్వాత మీకే తెలుస్తోందని పరోక్షంగా చెప్పుకొచ్చాడు. తాజాగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీని జోఫ్రా ఆర్చర్ రెండుసార్లు ఔట్ చేయడం గమనార్హం. షార్ట్ పిచ్ బంతులు ఆడడంలో తన బలహీనతను బయటపెట్టుకున్న వైభవ్ ఆర్చర్‌కు దొరికిపోయాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ ఆర్చర్ షార్ట్ పిచ్ బంతులు ఆడలేక వికెట్ ఇచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆర్చర్ చెప్పి మరీ వైభవ్‌కు స్ట్రోక్ ఇచ్చారంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.ఐపీఎల్లో ఇరగదీసిన వైభవ్ సూర్యవంశీ ఇంగ్లండ్ గడ్డపై ఇబ్బంది పడడం వెనుక ప్రధాన కారణం ఇంగ్లండ్, ఇండియాలోని పిచ్‌ల మధ్య ఉన్న తేడానే. ఈ సిరీస్ లో ఇప్పటివరకు వైభవ్ సూర్యవంశీ ఆర్చర్ బౌలింగ్‌లో రెండు సార్లు ఔటయ్యాడు. ఈ రెండు సార్లు కూడా వైభవ్ బంతి ఎక్కువగా బౌన్స్ అవ్వడం వల్ల ఇబ్బంది పడ్డాడు. మూడో టీ20లో వైభవ్ సూర్యవంశీ ఓ షార్ట్ బాల్‌కు తన బ్యాట్ తగిలి వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత నాలుగో టీ20లో బంతి మంచి లెంగ్త్‌లో రాగా.. వైభవ్ సూర్యవంశీ ఓ భారీ షాట్ కొట్టడానికి ప్రయత్నించి.. బ్యాట్ పైభాగానికి తగిలి 30 గజాల సర్కిల్ లోపల క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. Jofra Archer was asked about how to bowl against Vaibhav Suryavanshi & he said, I will tell you after the IPL as he knew India & England will play after IPL.& here, he got Vaibhav out in 2 consecutive games🔥🔥pic.twitter.com/O3aiDalTQh— Rajiv (@Rajiv1841) July 9, 2026 Does Jofra Archer really have the secret to stop Vaibhav Sooryavanshi? 🤔😅Scorecard ▶️ https://t.co/OBIYYIuhbt #TATAIPL | #Eliminator | #TheFinalLeap | #SRHvRR pic.twitter.com/MN65hq2gH9— IndianPremierLeague (@IPL) May 27, 2026Read: ఒళ్లు మండిన గాఫ్.. బదులు తీర్చుకుంటానని హెచ్చరిక! -
BCCI సంచలన నిర్ణయం? అప్పుడు గిల్.. ఇప్పుడు తిలక్
-
ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టు.. శ్రీ చరణి అరంగేట్రం
మహిళల టీ20 ప్రపంచకప్‌లో సెమీస్ చేరకుండానే హర్మన్ సేన ఇంటిదారి పట్టిన సంగతి తెలిసిందే. తాజాగా భారత మహిళల జట్టు ఇంగ్లండ్ గడ్డపై లార్డ్స్ వేదికగా ఏకైక టెస్టు మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.ఈ మ్యాచ్ ద్వారా ఇరుజట్ల తరఫున ముగ్గురు ఆటగాళ్లు టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేశారు. భారత్ తరఫున తెలుగుతేజం శ్రీ చరణి టెస్టు క్రికెట్లో డెబ్యూ చేసినట్లు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ తెలిపింది. ఇక శ్రీ చరణితో పాటు యస్తిక బాటియా కూడా తుది జట్టులోకి తిరిగివచ్చినట్లు పేర్కొంది. ఇంగ్లండ్ తరఫున ఎలీస్ కాప్సీ, మాడీ డివిలియర్స్ అరంగేట్రం చేశారు.పురుషుల క్రికెట్ మాదిరి కాకుండా మహిళల టెస్టు మ్యాచ్ నాలుగురోజులు మాత్రమే జరుగుతుంది. ఇప్పటివరకు ఇరుజట్ల మధ్య 15 టెస్టు మ్యాచ్‌లు జరిగితే.. ఇందులో భారత్ మూడు గెలవగా, ఇంగ్లండ్ ఒక మ్యాచ్ గెలిచింది. మిగిలిన 11 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.భారత్: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, యస్తిక భాటియా, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్(వికెట్ కీపర్), దీప్తి శర్మ, స్నేహ్ రానా, సయాలీ సత్ఘరే, శ్రీ చరణీ, క్రాంతి గౌడ్ఇంగ్లండ్: టామీ బ్యూమాంట్, మైయా బౌచియర్, హెదర్ నైట్, నాట్ సైవర్-బ్రంట్(కెప్టెన్), ఆలిస్ క్యాప్సీ, అమీ జోన్స్(వికెట్ కీపర్), మాడీ విలియర్స్, సోఫీ ఎక్లెస్టోన్, ఇస్సీ వాంగ్, లారెన్ బెల్, లారెన్ ఫైలర్ -
తీవ్ర అసంతృప్తిలో బీసీసీఐ!.. గంభీర్‌కు గండం!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో చాంపియన్‌గా నిలిచిన టీమిండియా.. మెగా ఈవెంట్ తర్వాత దారుణ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటోంది. ఈ ఐసీసీ టోర్నీ ముగిసిన తర్వాత భారత జట్టు తొలిసారిగా టీ20 సిరీస్ ఆడేందుకు ఐర్లాండ్ పర్యటనకు వెళ్లింది.అత్యంత చేదు అనుభవంవరల్డ్కప్లో జట్టును విజేతగా నిలిపిన సూర్యకుమార్ యాదవ్‌పై అనూహ్యంగా వేటు వేసిన యాజమాన్యం.. అతడి స్థానంలో ఈ టూర్ నుంచి శ్రేయస్ అయ్యర్‌కు పగ్గాలు అప్పగించింది. అయితే, శ్రేయస్‌కు సారథిగా తొలి ప్రయత్నంలోనే అత్యంత చేదు అనుభవం ఎదురైంది.ఇంగ్లండ్ పర్యటనలోనూఐర్లాండ్ చేతిలో టీమిండియా 2-0తో క్లీన్‌స్వీప్ అయింది. ఐరిష్ జట్టు చేతిలో ఓటమి చెందడం.. సిరీస్‌ను భారత్ చేజార్చుకోవడం ఇదే తొలిసారి. ఇక ఇంగ్లండ్ పర్యటనలోనూ ఇదే తరహా ఫలితం పునరావృతమైంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టీ20 వర్షం వల్ల రద్దు కాగా.. ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌లలో టీమిండియా ఓటమి పాలైంది.తీవ్ర స్థాయిలో విమర్శలుఈ క్రమంలో ఇంగ్లండ్ 3-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌తో పాటు హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌పైనా తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తుదిజట్టు ఎంపికలో గంభీర్‌దే అంతిమ నిర్ణయం అని.. తరచూ మార్పులు చేస్తూ కెప్టెన్‌ను సైతం గందరగోళానికి గురిచేస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.నిజానికి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ కావడం గంభీర్‌కు ఇష్టం లేదని.. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఒత్తిడితోనే అతడు ఇందుకు అంగీకరించాడనే ఆరోపణలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కనీవినీ ఎరుగని రీతిలో టీమిండియా వరుసగా రెండు టీ20 సిరీస్‌లు కోల్పోవడం సందేహాలకు తావిస్తోంది.తీవ్ర అసంతృప్తిలో బీసీసీఐ!ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సైతం వరుస ఓటములపై తీవ్ర అసహనంతో ఉన్నట్లు సమాచారం. శ్రేయస్ అయ్యర్ సేనతో పాటు.. గంభీర్ టీమ్‌పైనా బోర్డు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.వేటు పడుతుందా?ఈ విషయాల గురించి బీసీసీఐ సన్నిహిత వర్గాలు ANIతో మాట్లాడుతూ.. ‘‘టీమిండియా స్వదేశానికి తిరిగి రాగానే వరుస ఓటములపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. గంభీర్‌పై కూడా స్క్రుటినీ ఉంటుంది’’ అని తెలిపాయి. కాగా గంభీర్ నేతృత్వంలోని కోచింగ్ సిబ్బందిలో ప్రస్తుతం బ్యాటింగ్ కోచ్‌గా సితాన్షు కొటక్, బౌలింగ్ కోచ్‌గా మోర్నీ మోర్కెల్, అసిస్టెంట్ కోచ్‌గా ర్యాన్ టెన్ డష్కాటే, ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ ఉన్నారు.ఇక తాజా సిరీస్‌లలో టీమిండియా అన్ని విభాగాల్లోనూ విఫలం కావడంతో ఎవరిపైనైనా వేటు పడుతుందా? లేదంటే గంభీర్ చెప్పినట్లు సంధి దశ కాబట్టి పదవీకాలం పూర్తయ్యేంత వరకు వీరిని కొనసాగిస్తారా అనేది తెలియాల్సి ఉంది. కాగా గంభీర్ కాంట్రాక్టు 2027 వరకు ఉన్న సంగతి తెలిసిందే.గంభీర్ మార్గదర్శనంలో టీమిండియా డిజాస్టర్లు ఇవే👉స్వదేశంలో తొలిసారి న్యూజిలాండ్ చేతిలో టెస్టు సిరీస్‌లో 3-0తో వైట్‌వాష్👉పదేళ్ల తర్వాత తొలిసారి బోర్డర్- గావస్కర్ ట్రోఫీ (ఆస్ట్రేలియాతో)ని చేజార్చుకున్న భారత్👉పాతికేళ్ల తర్వాత తొలిసారి సొంతగడ్డపై సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో 2-0తో వైట్‌వాష్ 👉అరంగేట్రం నుంచి మూడు సీజన్లలో డబ్ల్యూటీసీ ప్రపంచకప్ ఫైనల్‌కు చేరకపోవడం ఇదే తొలిసారి (2023-25)👉సొంతగడ్డపై న్యూజిలాండ్‌కు తొలిసారి వన్డే సిరీస్‌ను కోల్పోయిన భారత్👉ఐర్లాండ్‌కు తొలిసారి టీ20 సిరీస్ కోల్పోయిన భారత్👉ఇంగ్లండ్‌కు తొలిసారి టీ20 సిరీస్ కోల్పోయిన టీమిండియా👉అంతర్జాతీయ టీ20లలో పరుగుల పరంగా టీమిండియాకు అతిపెద్ద ఓటమి (ఇంగ్లండ్‌తో రెండో టీ20లో 125 పరుగుల తేడాతో చిత్తు) etc.చదవండి: చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్ -
‘శ్రేయస్‌ను నిందించొద్దు.. అదే అసలు సమస్య’
ఐర్లాండ్ గడ్డపై సిరీస్ ఓటమితో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న టీమిండియా ఇంగ్లండ్ గడ్డపై అదే దారుణ ఆటతీరును ప్రదర్శిస్తూ వస్తోంది. తొలి టీ20 వర్షార్పణం కాగా, ఆ తర్వాత జరిగిన మూడు టీ20ల్లోనూ పరాజయం చవిచూసిన టీమిండియా 0-3తో ఇంగ్లండ్‌కు సిరీస్‌ను కోల్పోయింది. కనీసం చివరి టీ20లోనైనా విజయం సాధించి గౌరవప్రదంగా సిరీస్‌ను ముగించాలని టీమిండియా భావిస్తోంది. ఇక కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్‌కు ఏదీ కలిసిరావడం లేదు. బ్యాటర్‌గా రాణిస్తున్నప్పటికీ కెప్టెన్‌గా వరుస ఓటములు అతడిని ఒత్తిడిలోకి నెట్టేస్తోంది. అతడి కెప్టెన్సీలో టీమిండియా ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదింట ఓటమి (ఒక మ్యాచ్ రద్దు) పాలయ్యింది. దీంతో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా టీ20ల్లో ఇప్పటిదాకా గెలుపు రుచి చూడలేదు. అటు టీమిండియా కూడా ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఒక్క టీ20 మ్యాచ్ కూడా గెలవకపోవడం గమనార్హం. దీంతో అయ్యర్ కెప్టెన్సీపై అప్పుడే నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఈసారి అయ్యర్‌తో పాటు కోచ్ గంభీర్‌పై కూడా కత్తి వేలాడుతోందనే వార్తలు వస్తున్నాయి. అదీగాక జింబాబ్వే టూర్‌తో పాటు ఆసియా గేమ్స్‌కు హెడ్‌కోచ్ గంభీర్‌కు విశ్రాంతినిచ్చి అతడి స్థానంలో మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్‌ను టీమిండియా వెంట పంపించాలని బీసీసీఐ చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా అసిస్టెంట్ కోచ్ రెయాన్ టెన్డెస్కటే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ భవితవ్యంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. బ్రిస్టల్ వేదికగా నాలుగో టీ20లో టీమిండియా ఓటమి పాలైన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్‌లో టెన్ డస్కటే మాట్లాడాడు. 'టీమిండియా టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ ఇప్పుడే బాధ్యతలు చేపట్టాడు. అతడి కెప్టెన్సీలో టీమిండియాకు వెంటనే విజయాలు రావాలంటే ఎలా? కాస్త ఓపిక పట్టాల్సిన అవసరం ఉంటుంది. మ్యాచ్ ఓటములకు శ్రేయస్‌ను నిందించడం ఆపండి. అతడు కెప్టెన్‌గా నిలుదొక్కుకోవడానికి కాస్త సమయం పడుతుంది. ఇప్పుడు వచ్చే ఓటములే తర్వాత గెలుపుకు బాటలు వేస్తాయి. నిజానికి శ్రేయస్ తన నాయకత్వాన్ని బాధ్యతగా నిర్వహిస్తున్నాడు. బ్యాటింగ్‌లో అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. కేవలం కొన్ని మ్యాచ్‌లకే అతడు కెప్టెన్‌గా వైఫల్యం చెందాడని పేర్కొనడం సరికాదు. అంతకముందు సూర్యకుమార్ కూడా ఆరంభంలో ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొన్నాడు. కానీ ఆ తర్వాత సూర్య కెప్టెన్సీలో టీమిండియా ఎలాంటి విజయాలు సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇంతకాలం ఒక కెప్టెన్సీలో ఆడి ఇప్పుడు మరో కొత్త కెప్టెన్‌తో ఆడుతుండడంతో జట్టులో సమతుల్యం లోపించింది. రాబోయే రోజుల్లో అది చక్కబడి మళ్లీ అంతా సవ్యంగా సాగుతుంది. ఇక జట్టులో పాండ్యా, బుమ్రా లోటు కూడా స్పష్టంగా తెలుస్తోంది. ఇక బ్యాటర్‌గా శ్రేయస్ అయ్యర్ బాగా రాణిస్తున్నాడు. నాలుగు ఇన్నింగ్స్‌లు కలిపి 190 పరుగులు సాధించడమే గాక కోహ్లీ రికార్డును కూడా సమం చేశాడు. టీమిండియా మ్యాచ్‌లు ఓడుతున్నప్పటికీ అయ్యర్ మాత్రం బ్యాటర్‌గా విఫలం కాలేదు' అని చెప్పుకొచ్చాడు. ఇక ఇంగ్లండ్, టీమిండియా మధ్య చివరి టీ20 మ్యాచ్ సౌతాంప్టన్ వేదికగా ఆడనున్నాయి. 🔴 STOP BLAMING SHREYAS IYER – COACH SAYS HE NEEDS TIME 🤯🎙️: Ryan ten Doeschate backed Shreyas, saying he deserves time as captain. He praised Iyer's leadership, accountability, and batting, urging everyone not to judge him after just a few matches.pic.twitter.com/tqNDEQAXEm— Sam (@cricsam02) July 10, 2026Read: అరుదైన ఫీట్‌తో ఫిఫా చరిత్రను తిరగరాసిన ఎంబాపె -
చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్.. ప్రపంచ రికార్డు
ఇంగ్లండ్ గడ్డపై గత రెండు టీ20 సిరీస్‌లను సొంతం చేసుకున్న టీమిండియా ఈసారి మాత్రం తేలిపోయింది. బ్రిస్టల్ వేదికగా గురువారం ఇంగ్లండ్ జట్టుతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత్ ఇంగ్లండ్ చేతిలో ఏకంగా 9 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత జట్టు 0–3తో కోల్పోయింది. సిరీస్‌లోని తొలి మ్యాచ్ వర్షం వల్ల రద్దు కాగా... తర్వాతి మూడు మ్యాచ్‌ల్లో భారత జట్టుకు ఓటమి ఎదురైంది. దీంతో కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్‌కు తీవ్ర నిరాశే మిగిలింది.అయితే, ఇంగ్లండ్‌తో నాలుగో టీ20లో వ్యక్తిగతంగా మాత్రం శ్రేయస్ అయ్యర్ మంచి ప్రదర్శన కనబరిచాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 49 బంతులు ఎదుర్కొని నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 80 పరుగులతో అజేయంగా నిలిచాడు.డివిలియర్స్ ప్రపంచ రికార్డు బద్దలుఈ క్రమంలోనే శ్రేయస్ అయ్యర్.. సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. ఇంగ్లండ్ గడ్డ మీద కెప్టెన్ హోదాలో ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు.కాగా ఇంగ్లండ్‌తో సిరీస్‌లో భాగంగా తొలి టీ20లో శ్రేయస్ అయ్యర్ 47 బంతుల్లో 68 పరుగులు సాధించాడు. ఇక రెండో టీ20లో 37 పరుగులు చేసిన కెప్టెన్ సాబ్.. మూడో టీ20లో మాత్రం ఐదు పరుగులకే అవుటయ్యాడు. తాజాగా నాలుగో టీ20లో 80 పరుగులతో సత్తా చాటి.. ఇప్పటికి మొత్తంగా 190 పరుగులు పూర్తి చేసుకున్నాడు.ఇంగ్లండ్ గడ్డపై ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో కెప్టెన్ హోదాలో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్లు👉శ్రేయస్ అయ్యర్ (ఇండియా)- 2026లో నాలుగు మ్యాచ్‌లలో కలిపి 190 పరుగులు (రెండు అర్ధ శతకాలు)👉ఏబీ డివిలియర్స్ (సౌతాఫ్రికా)- 2017లో మూడు మ్యాచ్‌లలో కలిపి 146 పరుగులు (ఒక అర్ధ శతకం)👉ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా)- 2020లో మూడు మ్యాచ్‌లలో కలిపి 125 పరుగులు👉జోస్ బట్లర్ (ఇంగ్లండ్)- 2024లో రెండు మ్యాచ్‌లలో కలిపి 123 పరుగులు (రెండు అర్థ శతకాలు)👉బాబర్ ఆజం (పాకిస్తాన్)- 2021లో మూడు మ్యాచ్‌లలో కలిపి 118 పరుగులు (ఒక అర్ధ శతకం)కోహ్లి రికార్డు సమంఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ గడ్డ మీద టీ20 సిరీస్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు సాధించిన భారత కెప్టెన్‌గానూ శ్రేయస్ అయ్యర్ నిలిచాడు. అదే విధంగా ఇంగ్లండ్ జట్టుపై అత్యధిక వ్యక్తిగత టీ20 స్కోరు నమోదు చేసిన కెప్టెన్‌గా విరాట్ కోహ్లి (80 నాటౌట్) రికార్డును కూడా శ్రేయస్ సమం చేశాడు. కాగా ఐర్లాండ్ పర్యటనతో టీమిండియా టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్‌కు తొలి ప్రయత్నంలోనే చేదు అనుభవం మిగిలింది. కనీవినీ ఎరుగని రీతిలో ఐరిష్ జట్టు చేతిలో టీమిండియా 2-0తో వైట్‌వాష్ అయింది. తాజాగా ఇంగ్లండ్‌కు సిరీస్‌ను చేజార్చుకుంది.చదవండి: ఆఖరి బంతికి సింగిల్... భారత్‌కు షాకిచ్చిన శ్రీలంక -
నేను బాగానే ఆడాను.. కానీ ఏం లాభం?: శ్రేయస్ అయ్యర్
టీమిండియా వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. ఇంగ్లండ్‌తో నాలుగో టీ20లోనూ భారత జట్టు పరాజయం పాలైంది. ఆతిథ్య జట్టు చేతిలో తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఇంగ్లండ్ 3-0తో సిరీస్ సొంతం చేసుకోగా.. టీమిండియా వరుసగా రెండో టీ20 సిరీస్‌ను చేజార్చుకుంది.ఓటమికి కారణం అదేఈ నేపథ్యంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టీమిండియా ఓటమిపై స్పందించాడు. ‘‘మరోసారి మాకు నిరాశే మిగిలింది. ఈ పిచ్‌పై 158 అనేది కచ్చితంగా కాపాడుకోగలిగే స్కోరైతే కాదు. అందుకు తగ్గట్లుగానే ఇంగ్లండ్ వేగంగానే ఈ లక్ష్యాన్ని ఛేదించింది.మిడిల్ స్టంప్, లెగ్ స్టంప్ మీదకు బంతులు వేయమని మా బౌలర్లకు చెప్పాను. అలా అయితే బ్యాటర్లు బౌండరీలు రాబట్టడం కష్టతరమవుతుంది. అయితే, మా ప్రణాళికలను అమలు చేయడంలో విఫలమయ్యాము. ఎప్పుడైతే మా వ్యూహాన్ని కొద్దిగా మార్చామో ఆ సమయంలో వాళ్లు పరుగులు పిండుకున్నారు.నేను బాగానే ఆడాను.. కానీ ఏం లాభం?అయితే, నా వ్యక్తిగత ప్రదర్శన పట్ల మాత్రం నేను సంతోషంగానే ఉన్నాను. కానీ గెలుపునకు నా ఇన్నింగ్స్ ఉపయోగపడలేదంటే దానికి ఎటువంటి అర్థం ఉండదు. నిజానికి నేను బాగా ఆడిన దాదాపు ప్రతిసారీ జట్టు గెలిచేది. కానీ దురదృష్టవశాత్తూ ఈసారి అలా జరగలేదు. తదుపరి మ్యాచ్‌లోనైనా ఆటంకాలు అధిగమించి అనుకున్న ఫలితం రాబట్టగలమనే అనుకుంటున్నాం.When the chips were down, the skipper stood tallest. 💙A magnificent innings from Shreyas Iyer. 🙌 Watch #ENGvIND LIVE NOW on Sony Sports Network TV channels.#SonySportsNetwork #MamlaPersonalHai #ExtraaaInnings pic.twitter.com/E5Lx13kGYs— Sony Sports Network (@SonySportsNetwk) July 9, 2026పొరపాట్లు సహజమేప్రస్తుతం జట్టు సంధి దశలో ఉంది. మా వల్ల చాలా పొరపాట్లు జరుగుతున్నాయి. యువ క్రికెటర్లలో చాలా మంది తొలిసారి ఇలాంటి పిచ్‌లపై ఆడుతున్నారు. కాబట్టి తప్పులు సహజమే. అయితే, వీటి నుంచి ఎంత తొందరగా పాఠాలు నేర్చుకుంటామనేదే ముఖ్యం.బలంగా తిరిగి వస్తాముమా జట్టులో క్విక్ లెర్నర్స్ ఉన్నారు. కచ్చితంగా విదేశీ గడ్డ మీది పరిస్థితులను అర్థం చేసుకుని.. వికెట్‌ను సరిగ్గా అంచనా వేసి మరింత బలంగా తిరిగి వస్తారని నమ్ముతున్నా’’ అని శ్రేయస్ అయ్యర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా బ్రిస్టల్ వేదికగా గురువారం రాత్రి మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.శ్రేయస్ మెరిసినా..నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయిన టీమిండియా 158 పరుగులకే పరిమితమైంది. శ్రేయస్ అయ్యర్ 49 బంతుల్లో 80 పరుగులతో అజేయంగా నిలిచాడు. మిగిలిన వారిలో శివం దూబే (22) మాత్రమే ఇరవై పరుగులు దాటాడు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్ 13.5 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ కోల్పోయి పని పూర్తి చేసింది.ఓపెనర్ ఫిల్ సాల్ట్ అజేయ అర్ధ శతకం (59*)తో రాణించగా.. హ్యారీ బ్రూక్ కెప్టెన్ ఇన్నింగ్స్ (35 బంతుల్లో 79 నాటౌట్)తో మెరిశాడు. ఇక ఇంగ్లండ్- భారత్ మధ్య తొలి టీ20 వర్షం వల్ల రద్దు కాగా.. రెండు, మూడు.. తాజాగా నాలుగో టీ20లో గెలిచి ఆతిథ్య జట్టు 3-0తో సిరీస్ గెలుచుకుంది. కాగా అంతకుముందు టీమిండియా ఐర్లాండ్ చేతిలో 2-0తో వైట్‌వాష్‌కు గురైన సంగతి తెలిసిందే.చదవండి: వైభవ్ సూర్యవంశీ అట్టర్ఫ్లాఫ్ -
జట్టులో దండగ.. అతడినే టీమిండియా కెప్టెన్‌ని చేస్తారేమో!
విదేశీ పర్యటనలో టీమిండియా టీ20 వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. తొలుత ఐర్లాండ్ చేతిలో 2-0తో క్లీన్‌స్వీప్ అయిన భారత జట్టు.. ఇంగ్లండ్‌తో తొలి టీ20 వర్షం వల్ల రద్దు కావడంతో ఊపిరి పీల్చుకుంది. ఇక రెండు, మూడు మ్యాచ్‌లలో ఆతిథ్య ఇంగ్లండ్ గెలిచి 2-0తో ఆధిక్యంలో నిలిచింది.వైస్ కెప్టెన్‌గా తిలక్ వర్మఈ నేపథ్యంలో బ్రిస్టల్ వేదికగా గురువారం జరిగే నాలుగో టీ20లో టీమిండియా చావోరేవో తేల్చుకోవాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. ఐర్లాండ్ టూర్‌తో భారత టీ20 జట్టు కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ పగ్గాలు చేపట్టగా.. తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు.అయితే, ఈ ఇద్దరూ తమ పాత్రలకు న్యాయం చేయడం లేదు. శ్రేయస్ బ్యాటర్‌గా ఫర్వాలేదనిపిస్తున్నా.. సారథిగా వరుస పరాజయాలతో చెత్త రికార్డులు మూటగట్టుకుంటున్నాడు. మరోవైపు.. తిలక్ వర్మ ఆటగాడిగా ఫెయిల్ అవుతూ ఒక రకంగా జట్టుకు భారమయ్యాడని పలువురు టీమిండియా మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.ముఖ్యంగా ఇంగ్లండ్‌తో మూడో టీ20లో తిలక్ రెగ్యులర్‌గా వచ్చే ఐదో స్థానంలో కాకుండా.. ఆరో నంబర్లో బ్యాటింగ్‌కు చేయడం ఇందుకు ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ తిలక్ వర్మపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాడు. సంజూ శాంసన్ పేరును ప్రస్తావిస్తూ తిలక్ వర్మ స్థానాన్ని ప్రశ్నించాడు.అతడిని కెప్టెన్‌ను కూడా చేస్తారేమోఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘తిలక్ ఇప్పటికే వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. పరిస్థితి చూస్తుంటే త్వరలోనే అతడిని కెప్టెన్‌ను కూడా చేస్తారేమో అనిపిస్తోంది. కాబట్టి జట్టులో తన స్థానానికి వచ్చిన ఢోకా ఏమీ లేదని అతడు భావిస్తున్నాడేమో!..ఏదేమైనా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో అతడు పేస్, బౌన్స్‌ను ఎదుర్కొనే ధైర్యం లేక కాస్త ఆలస్యంగా బ్యాటింగ్‌కు వెళ్లినట్లు అనిపిస్తోంది. క్రీజులోకి వెళ్లాక కూడా.. దూకుడుగా ఆడలేక అతడు బిక్కమొఖం వేశాడు.బలహీనత మీకు తెలుసుతిలక్ వర్మ ప్రధాన బ్యాటర్‌గా భావించే అతడిని వైస్ కెప్టెన్‌ని చేశారు కదా!.. అయినా సరే ఫాస్ట్ బౌలింగ్‌ను ఎదుర్కోకుండా మీరే (యాజమాన్యం) అతడిని కాపాడుతున్నారు. అతడి బలహీనత మీకు తెలుసు కాబట్టే ఇలా చేస్తున్నారు.అందుకే తిలక్‌కు బదులు అక్షర్‌ను ముందుగా పంపి బలిచేశారు. షార్ట్ పిచ్ బంతులను తిలక్ ఎదుర్కోలేడని మీకు ముందుగానే తెలుసు. అందుకే అతడి బలహీనతను కప్పిపుచ్చేందుకు అక్షర్‌ను ముందుకు తోశారు. ఆడలేక ఇబ్బంది పడుతున్నపుడు అతడిని జట్టు నుంచి తప్పించాలి. నేను పదే పదే ఈ మాట చెబుతున్నాను. తిలక్ వర్మకు బదులు సంజూ శాంసన్‌ను ఆడిస్తే బాగుంటుంది. కానీ యాజమాన్యం మాత్రం తిలక్‌ను తప్పించడం లేదు’’ అని క్రిస్ శ్రీకాంత్ చురకలు అంటించాడు. కాగా ఇంగ్లండ్‌తో తొలి టీ20లో 13 పరుగులు చేసిన తిలక్ వర్మ.. రెండో మ్యాచ్‌లో 24*, మూడో టీ20లో 3 పరుగులు చేసి నిష్క్రమించాడు.చదవండి: తుదిజట్టులోకి సంజూ.. కానీ ఓ కండిషన్! -
IND vs ENG: తుదిజట్టులోకి సంజూ.. కానీ ఓ కండిషన్!
ఇంగ్లండ్‌తో నాలుగో టీ20 రూపంలో టీమిండియా కఠిన సవాలు ముంగిట నిలిచింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే శ్రేయస్ అయ్యర్ సేన పోటీలో ఉంటుంది. ఒకవేళ ఓడిపోతే మాత్రం.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆతిథ్య ఇంగ్లండ్ 3-0తో సొంతం చేసుకుంటుంది.లెఫ్టాండర్లు ఎక్కువయ్యారుఈ నేపథ్యంలో భారత తుదిజట్టు కూర్పు గురించి మరోసారి చర్చ మొదలైంది. సంజూ శాంసన్ తిరిగి ఆడించాలని పలువురు మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. జట్టులో ఎడమచేతి వాటం బ్యాటర్ల సంఖ్య ఎక్కువైందని.. ఇది కూడా ఓ సమస్యగా పరిణమించిందని అభిప్రాయపడుతున్నారు.సంజూను కాదని వైభవ్‌కు అవకాశంకాగా ఐర్లాండ్‌తో రెండు టీ20లు, ఇంగ్లండ్‌తో తొలి మ్యాచ్‌లో సంజూ విఫలమైన సంగతి తెలిసిందే. ఈ మూడు మ్యాచ్‌లలో అతడు చేసిన పరుగులు వరుసగా 5, 0, 1. ఈ నేపథ్యంలో సంజూను తప్పించి.. అతడి స్థానంలో చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీని ఓపెనర్‌గా బరిలోకి దించింది యాజమాన్యం.రెండు మ్యాచ్‌లలోనూ విఫలంఇంగ్లండ్తో రెండో టీ20 సందర్భంగా అరంగేట్రం చేసిన వైభవ్.. ఇప్పటికి రెండు మ్యాచ్‌లలో వరుసగా 14, 13 పరుగులు చేశాడు. ఇక వైభవ్ రాకతో టాపార్డర్ మొత్తం లెఫ్లాండర్లతో నిండిపోయింది. ఈ పదిహేనేళ్ల పిల్లాడితో పాటు అభిషేక్ శర్మ, వన్‌డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కూడా లెఫ్లాండరే.అదే విధంగా.. తిలక్ వర్మ, అక్షర్ పటేల్, శివం దూబే, అర్ష్‌దీప్ సింగ్ కూడా ఎడమచేతి వాటం గల ఆటగాళ్లే. ఈ నేపథ్యంలో కుడిచేతి వాటం గల సంజూ అవసరం ఎంతగానో ఉందంటూ పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.సంజూను ఆడించాల్సిందేఓపెనర్గా కాకపోయినా.. మిడిల్ ఆర్డర్‌లోనైనా సంజూను ఆడించాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కోచ్ అభిషేక్ నాయర్ మాత్రం భిన్నంగా స్పందించాడు. టాపార్డర్‌లో ఆడిస్తే మాత్రమే సంజూకు తిరిగి తుదిజట్టులో చోటు ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు.అలా అయితేనే తుదిజట్టులోకి తీసుకోండి‘‘ఒకవేళ నిజంగా సంజూను తిరిగి తుదిజట్టులోకి తీసుకోవాలనే ఆలోచన ఉంటే.. అతడు ఏ స్థానంలోనైతే సక్సెస్ అయ్యాడో ఆ స్థానంలోనే ఆడించాలి. అంతేగానీ సంజూను మళ్లీ తీసుకువచ్చి.. నాలుగు, ఐదు లేదంటే ఆరో స్థానంలో ఆడిస్తామంటే ఫలితం ఉండదు.లేదంటే ఆడించకపోవడమే మంచిదిఅతడు మళ్లీ ఇబ్బంది పడతాడు. నిజానికి సంజూ టాప్-3లో మాత్రమే విజయవంతంగా బ్యాటింగ్ చేయగలడు. ఒకవేళ అతడి పట్ల నిజంగానే మీకు నమ్మకం ఉంటే.. టాపార్డర్‌లో ఆడించండి. లేదంటే అసలు ఆడించకపోవడమే మంచిది’’ అని అభిషేక్ నాయర్ కుండబద్దలు కొట్టినట్లుగా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.ఓపెనర్‌గా ఇలా..కాగా సంజూ ఇప్పటికి టీమిండియా టాప్-3 బ్యాటర్‌గా 36 ఇన్నింగ్స్ ఆడి ఏకంగా 1023 పరుగులు సాధించాడు. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో ఓపెనర్‌గా నాకౌట్ మ్యాచ్‌లలో ఏకంగా 97*, 89, 89 పరుగులు సాధించి.. జట్టు చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక మొత్తంగా టాప్-3లో 36 ఇన్నింగ్స్‌లో ఆడి ఏకంగా 171కి పైగా స్ట్రైక్‌రేటుతో సంజూ పరుగులు రాబట్టడం విశేషం.మిడిలార్డర్లో అలామరోవైపు.. టాప్-3 బ్యాటర్‌గా కాకుండా మిడిలార్డర్లో వచ్చి సంజూ 21 ఇన్నింగ్స్‌లో కేవలం 382 పరుగులే చేశాడు. స్ట్రైక్‌రేటు 124. ఈ నేపథ్యంలోనే అభిషేక్ నాయర్ సంజూను ఓపెనర్‌గా మాత్రమే పంపాలని నొక్కివక్కాణించడం గమనార్హం. కాగా టీ20 సిరీస్‌లో ఐర్లాండ్ చేతిలో 2-0 వైట్‌వాష్ అయింది టీమిండియా. అనంతరం ఇంగ్లండ్‌తో తొలి టీ20 వర్షం వల్ల రద్దు కాగా.. రెండు, మూడు మ్యాచ్‌లలో ఆతిథ్య జట్టు గెలిచింది. తద్వారా 2-0తో ఇంగ్లండ్ ఆధిక్యంలో ఉండగా.. బ్రిస్టల్ వేదికగా నాలుగో టీ20లో తప్పక గెలవాల్సిన స్థితిలో టీమిండియా నిలిచింది. చదవండి: అందుకే వైభవ్‌ను ఆడిస్తున్నాం: గంభీర్ -
ఇంగ్లండ్‌తో మ్యాచ్.. గాయంతో కీలక ప్లేయర్ దూరం!
ఇప్పటికే ఇంగ్లండ్ గడ్డపై టీ20 సిరీస్‌లో టీమిండియా పురుషుల జట్టు 0-2తో వెనుకబడి ఒత్తిడిలో ఉంది. ఈ వారం చివర్లో భారత మహిళల జట్టు ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టు మ్యాచ్ ఆడనుంది. అయితే మ్యాచ్‌కు ముందే భారత జట్టుకు షాక్ తగిలింది. లండన్ వేదికగా జరగనున్న టెస్టు మ్యాచ్‌కు భారత ప్లేయర్ ప్రతీకా రావల్ గాయంతో దూరమైంది. ఆమె స్థానంలో టాపార్డర్ బ్యాటర్ ప్రియా పూనియాకు అవకాశం కల్పిస్తున్నట్లు బీసీసీఐ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. అయితే టీ20 ప్రపంచకప్ ముందు ఆస్ట్రేలియా పర్యటనలో ప్రతీకా రావల్ పెర్త్ వేదికగా జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో 81 పరుగులతో రాణించింది. ఆ తర్వాత ఇండియా-ఏ వుమెన్ టీం తరఫున హోవ్, టాంటన్లతో జరిగిన అనధికారిక మ్యాచ్‌ల్లోనూ ఆడింది. అయితే ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టు మ్యాచ్‌కు ముందు ప్రతీకా రావల్‌కు గాయమైంది. దీంతో ఈ మ్యాచ్‌కు దూరమైనట్లు భారత మహిళల జట్టు కోచ్ అమోల్ మజుందార్ తెలిపాడు. ఆమె స్థానంలో టాపార్డర్ బ్యాటర్ ప్రియా పూనియాను జట్టులోకి తీసుకున్నట్లు పేర్కొన్నాడు.ఎవరీ ప్రియా పూనియా?2019లో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్ ద్వారా ప్రియా పూనియా భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసింది. గతేడాది వడోదర వేదికగా జరిగిన వన్డేలోనూ ఆడిన ప్రియా పూనియా మొత్తంగా భారత్ తరఫున 12 వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడింది. ఇక టీ20 ప్రపంచకప్‌లో లీగ్ దశలోనే ఇంటిబాట పట్టిన టీమిండియా వుమెన్స్ ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టు ఆడనుంది. టీ20 ప్రపంచకప్‌కు ముందే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను హర్మన్ సేన 1-2తో ఇంగ్లండ్‌కు కోల్పోయింది. లండన్‌లోని లార్డ్స్ వేదికగా జరగనున్న మొట్టమొదటి మహిళల టెస్టు మ్యాచ్ ఇదే కావడం గమనార్హం.ఇంగ్లండ్‌తో టెస్టుకు భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), యాస్తిక భాటియా (వికెట్ కీపర్), శ్రీ చరణి, హర్లీన్ డియోల్, క్రాంతి గౌడ్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), స్నేహ్ రాణా, ప్రియా పునియా, జెమిమా రోడ్రిగ్స్, సయాలీ సత్ఘరే, దీప్తి శర్మ, నందాని శర్మ, రేణుకా సింగ్, షఫాలీ వర్మ Shifting gears to red-ball cricket 🔄Preps underway as #TeamIndia get ready for a historic #ENGvIND Test 🤍 pic.twitter.com/wdzv7O5tn2— BCCI Women (@BCCIWomen) July 6, 2026pic.twitter.com/z1Fjap9Z4e— BCCI Women (@BCCIWomen) July 6, 2026 -
ఒకే ఒక్క ఓటమితో చెత్త రికార్డు లిస్టులో టీమిండియా
-
మేం చెప్పాల్సిన పని లేదు ఎలా ఆడాలో వైభవ్ కు తెలుసు
-
ముందుగా రాకుండా దాక్కున్నాడు: మొయిన్ అలీ ఫైర్
టీమిండియా ఆట తీరుపై ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. ఓపెనర్లను తప్పుపట్టాల్సిన పని లేదని.. సమస్యంతా లోయర్ ఆర్డర్‌లోనే ఉందన్నాడు. ముఖ్యంగా ఇంగ్లండ్‌తో మూడో టీ20లో శివం దూబే ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు రావడం వారి వ్యూహాత్మక తప్పిదాలకు నిదర్శనమని విమర్శించాడు.కాగా భారత్- ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా... తొలి టీ20 వర్షార్పణమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మాంచెస్టర్ వేదికగా రెండో మ్యాచ్‌లో ఓడిపోయిన టీమిండియా.. తాజాగా మూడో టీ20లోనూ పరాజయం పాలైంది. నాటింగ్‌హామ్‌లో మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు చేతిలో భారత్ ఏకంగా 125 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడింది.ఇంగ్లండ్ బౌలర్ల దెబ్బకు భారత బ్యాటర్లు పెవిలియన్‌కు వరుస కట్టారు. ఓపెనర్లు అభిషేక్ శర్మ (10), వైభవ్ సూర్యవంశీ (13), వన్‌డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (13) పూర్తిగా తేలిపోయారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (5) కూడా తీవ్రంగా నిరాశపరిచాడు.ఇక ఐదో స్థానంలో రావాల్సిన తిలక్ వర్మ (3) ఆరో స్థానంలో రాగా.. అక్షర్ పటేల్ (10) ఐదో నంబర్లో బ్యాటింగ్ చేశాడు. మరోవైపు.. హర్షిత్ రాణా (9) ఏడో స్థానానికి ప్రమోట్ అయి విఫలం కాగా.. ఎనిమిదో స్థానంలో వచ్చి శివం దూబే (2) ఫెయిల్ అయ్యాడు.ఫలితంగా 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 11.4 ఓవర్లలోనే కేవలం 76 పరుగులే చేసి ఆలౌట్ అయింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మొయిన్ అలీ టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు.‘‘భారత బ్యాటింగ్ ఆర్డర్‌లోనే సమస్య ఉంది. అక్షర్ పటేల్ మరీ ముందుగా వచ్చాడు. తిలక్ వర్మ లేటయ్యాడు. ఇక శివం.. అతడు కేవలం స్పిన్నర్ల బౌలింగ్‌లోనే ఆడతాడు. అందుకే ముందుగా బ్యాటింగ్‌కు రాకుండా దాక్కుండిపోయాడు.నిజానికి జట్టు కోసం అతడు అన్నీ చేయాలి. కానీ స్పిన్నర్ల బౌలింగ్‌లో మాత్రమే ఆడితే ఎలా?.. టీమిండియా ఓపెనర్లను తప్పుపట్టాల్సిన పనిలేదు. నిజానికి వాళ్లిద్దరు ఆడతున్న తీరు నాకు ముచ్చటగొలుపుతుంది.ఒకవేళ అభిషేక్ ఆరు ఓవర్లు ఆడాడంటే.. అతడు అర్ధ శతకానికి చేరువకావడం ఖాయం. ఇక వైభవ్ సూర్యవంశీ గురించి మనకు తెలిసిందే. అతడు ఫిఫ్టీ పూర్తి చేసుకున్నా ఆశ్చర్యం లేదు’’ అని మొయిన్ అలీ చెప్పుకొచ్చాడు. ఏదేమైనా వైభవ్ సూర్యవంశీకి మరిన్ని అవకాశాలు వస్తాయని.. అప్పుడు కూడా విఫలమైతే మాత్రం పరిస్థితి చేజారిపోతుందని అభిప్రాయపడ్డాడు. -
టీమిండియాకు ఆర్చర్ చురకలు.. ‘వైభవ్‌కు ఇదే నా సవాల్’
ఇంగ్లండ్ గడ్డపై తేలిపోతున్న టీమిండియాకు స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ చురకలు అంటించాడు. ఇంగ్లండ్ గడ్డపై ఆడడమంటే ఐపీఎల్లో ఆడినంత తేలిక కాదని, ఇక్కడి పిచ్‌లు బౌలర్లకు అనుకూలంగా ఉంటాయని, గుడ్‌లెంగ్త్‌తో బంతులు విసిరితేనే ప్రయోజనం ఉంటుందని పేర్కొన్నాడు. టీమిండియాకు చురకలు అంటించడంతో పాటు వైభవ్ సూర్యవంశీకి కూడా ఓపెన్ చాలెంజ్ విసిరడం ఆసక్తిగా మారింది. మూడో టీ20లో ఇంగ్లండ్ విజయంలో కీలకపాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన ఆర్చర్ మాట్లాడుతూ.. ‘ఇంగ్లండ్ గడ్డపై పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఐపీఎల్లో బౌలర్లకు కఠినంగా ఉంటుంది. బ్యాటర్లకు అనుకూలంగా అక్కడి మైదానాల్లోని బౌండరీలను తక్కువ దూరంలోనే ఉంటాయి. కానీ ఇంగ్లండ్‌లో పరిస్థితులు అలా ఉండవు. గుడ్ లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులు విసిరితేనే ఇక్కడ వికెట్లు లభిస్తాయి. ఇక్కడి మైదానాల్లో బౌండరీల దూరం తక్కువ ఉన్నప్పటికీ బంతి వికెట్ల మీదకు వస్తుంది కాబట్టే ఆడడం కాస్త కష్టతరంగా ఉంటుంది. ఐపీఎల్లో 200 స్కోరు చేసినా కూడా ఓడిన సందర్భాలే ఎక్కువగా ఉంటాయి. కానీ ఇంగ్లీష్ పిచ్‌లపై 200 స్కోరు అంటే ఆషామాషీ కాదు. జాగ్రత్తగా ఆడకపోతే ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయి.’ అని చెప్పుకొచ్చాడు. అయితే వైభవ్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఆర్చర్ బౌలింగ్‌లో సిక్సర్లు కొట్టడంపై ఆర్చర్‌ను ప్రశ్నించగా.. ‘రాబోయే మ్యాచ్‌ల్లో అతడిని ఎదుర్కొనే సమయంలో స్పష్టమైన ప్రణాళిక వేసుకున్నా. వైభవ్‌కు ఇదే నా సవాల్ (నవ్వుతూ)* అని ఆర్చర్ తెలిపాడు. మ్యాచ్ విషయానికొస్తే.. మంగళవారం జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ 125 పరుగుల తేడాతో టీమిండియాపై భారీ విజయాన్ని సాధించింది. 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి పూర్తి ఓవర్లు ఆడకుండానే 11.4 ఓవర్లలో 76 పరుగులకే కుప్పకూలింది. ఆర్చర్ 29 పరుగులిచ్చి మూడు వికెట్లు తీయగా, జోష్ టంగ్ 28 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అంతకముందు ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్ (70), సామ్ కరన్ (44 నాటౌట్) రాణించారు. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇంగ్లండ్ 2-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరుజట్ల మధ్య నాలుగో టీ20 గురువారం రాత్రి 10 గంటలకు బ్రిస్టల్ వేదికగా జరగనుంది.Read: IND vs ENG: సూర్యకుమార్ గుర్తొస్తున్నాడు -
IND vs ENG: హర్షిత్ రాణాపై ప్రశంసలు
టీమిండియా యువ ఆటగాడు హర్షిత్ రాణాపై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ప్రశంసలు కురిపించాడు. అవకాశం వచ్చిన ప్రతిసారీ అతడు గొప్పగా ఆడుతున్నాడని కొనియాడాడు. ఈ సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్.. ఇటు బంతితోనూ.. అటు బ్యాట్‌తోనూ రాణిస్తున్నాడని ప్రశంసించాడు.గంభీర్‌కు ప్రియశిష్యుడిగా పేరుఅయినప్పటికీ హర్షిత్ రాణాపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోందని ఆకాశ్ చోప్రా ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌కు ప్రియశిష్యుడిగా హర్షిత్ రాణాకు పేరు. గంభీర్ అండతోనే అతడు అరంగేట్రం చేయగలిగాడని.. అర్హులను కాదని మరీ హర్షిత్‌కు పెద్దపీట వేస్తున్నారనే విమర్శలు చాన్నాళ్లుగా కొనసాగుతున్నాయి.ఇక తాజాగా ఇంగ్లండ్‌తో మూడో టీ20 సందర్భంగా బ్యాటింగ్ ఆర్డర్లో ఏడో స్థానంలో శివం దూబేను కాదని.. హర్షిత్‌ను పంపించారు. అతడు 13 బంతుల్లో 9 పరుగులు చేసి నిష్క్రమించాడు. మరోవైపు.. దూబే 2 పరుగులకే అవుటయ్యాడు. ఈ నేపథ్యంలో హర్షిత్‌ను ముందుగా ఎందుకు పంపించారనే ప్రశ్నలు వచ్చాయి.అవకాశం వచ్చిన ప్రతిసారీఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా స్పందించాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘హర్షిత్ రాణా గురించి తప్పకుండా మాట్లాడుకోవాలి. అతడిని మనందరం చాలాసార్లు చాలా రకాలుగా ట్రోల్ చేశాము. కానీ అతడు మాత్రం అవకాశం వచ్చిన ప్రతిసారీ జట్టు కోసం ఎంతగానో కృషి చేస్తున్నాడు.క్లిష్ట పరిస్థితుల్లో బంతిని అతడి చేతికిచ్చినా మెరుగ్గానే రాణిస్తున్నాడు. బ్యాట్‌తోనూ అదరగొడుతున్నాడు. అయితే, కొన్నిసార్లు విఫలం కావడం సహజం. ఏదేమైనా నిందలు, తిట్లకు హర్షిత్ అర్హుడు కాదు.నిజానికి ఐర్లాండ్‌తో రెండో టీ20లో దాదాపు అతడు జట్టును గెలిపించినంత పని చేశాడు. పది బంతుల్లో 21 పరుగులు చేశాడు (ఈ మ్యాచ్‌లో టీమిండియా ఒకే ఒక్క పరుగుతో ఓడి వైట్‌వాష్ అయింది). హర్షిత్ రాణా కొత్త, పాత బంతితో అద్భుతంగా బౌలింగ్ చేయగలడు. లోయర్ ఆర్డర్ నుంచి కాస్త టాప్‌నకు ప్రమోట్ చేసినా బ్యాట్‌తో రాణించగలడు.సెలక్షన్లో అతడి తప్పేమీ లేదే!తుదిజట్టుకు ఎంపిక కావడం అతడి తప్పేమీ కాదే. అతడిని తరచూ విమర్శించే వారు బాగా ఆడినప్పుడు ఎందుకు ప్రశంసించడం లేదు. అనవసరంగా ట్రోల్ చేయడానికి మాత్రం సిద్ధంగా ఉంటారు’’ అని ఆకాశ్ చోప్రా ట్రోలర్స్‌కు చురకలు అంటించాడు. కాగా ఇంగ్లండ్‌తో మూడో టీ20లో టీమిండియా 125 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. ఈ మ్యాచ్‌లో హర్షిత్ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి 40 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. చదవండి: అందుకే వైభవ్‌ను ఆడిస్తున్నాం: గంభీర్ -
సంజూతో పోల్చుకుంటే 'ఆ ముగ్గురు' మరీ దారుణం..!
భారత టీ20 జట్టులో సంజూ శాంసన్‌కు చోటు దక్కకపోవడంపై మరోసారి సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. బీసీసీఐ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ సంజూ శాంసన్‌ను నిలకడలేని ప్రదర్శన కారణంగానే పక్కన పెట్టారని అభిమానులు పేర్కొంటూ, అందుకు విరుద్ధంగా గణాంకాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.అభిమానులు షేర్ చేస్తున్న వివరాల ప్రకారం..సంజూ శాంసన్ చివరి పది ఇన్నింగ్స్‌లో 107, 109, 22, 24, 97, 89, 89, 5, 0, 1 పరుగులు చేయగా..ఇషాన్ కిషన్ 10, 36, 11, 8, 3, 13, 12, 0, 49, 13 పరుగులు.. తిలక్ వర్మ 1, 44, 27, 21, 8, 19, 55, 13, 24, 3 పరుగులు..అభిషేక్ శర్మ 68, 0, 10, 9, 52, 49, 0, 59, 43, 10 పరుగులు.. వైభవ్ సూర్యవంశీ రెండు ఇన్నింగ్స్‌లో 14, 13 పరుగులే చేశాడు.ఈ గణాంకాలను ఉదహరిస్తూ, "అసలు నిలకడ లేని బ్యాటర్ ఎవరు..?" అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. సంజూ శాంసన్‌కు పెద్ద ఇన్నింగ్స్ ఆడే సామర్థ్యం ఉందని, ఒకసారి క్రీజులో నిలదొక్కుకుని 30 పరుగుల మార్క్ దాటితే అతడు భారీ స్కోరు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వారు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా, సంజూ పెద్ద స్కోర్లు చేసిన మ్యాచ్‌ల్లో భారత జట్టు విజయాలు కూడా ఎక్కువగా వచ్చాయని పోస్టుల్లో పేర్కొంటున్నారు.ఇతర బ్యాటర్లు ఒక మ్యాచ్‌లో రాణించి, తర్వాత వరుసగా విఫలమవుతున్నారని వాదిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో సంజూ శాంసన్‌ను మాత్రమే 'నిలకడలేని ఆటగాడి'గా పరిగణించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.ప్రస్తుత ఇంగ్లండ్ పర్యటనలో భారత బ్యాటింగ్ వైఫల్యాల నేపథ్యంలో ఈ చర్చ మరింత ఊపందుకుంది. గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని జట్టు యాజమాన్యం సంజూ శాంసన్ విషయంలో మరోసారి పునరాలోచించాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు.కాగా, తాజగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20లో భారత్ ఘోర ఓటమిని చవిచూసింది. ఈ ఓటమితో భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 0-2తో వెనుకపడిపోయింది. సిరీస్‌లో నిలవాలంటే బ్రిస్టల్‌లో జరగనున్న నాలుగో టీ20లో భారత్ తప్పనిసరిగా విజయం సాధించాలి. -
తిలక్ వర్మపై అనిల్ కుంబ్లే కీలక వ్యాఖ్యలు
ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియాకు మరో పరాజయం ఎదురైంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన మూడో టీ20లో శ్రేయస్ అయ్యర్ సేన 125 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. ఫలితంగా సిరీస్‌లో 0–2తో వెనుకబడింది. నాటింగ్‌హామ్ వేదికగా టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది.ఓపెనర్ ఫిల్ సాల్ట్ (44 బంతుల్లో 70; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధశతకంతో అదరగొట్టగా... జోస్ బట్లర్ (21 బంతుల్లో 36; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), సామ్ కరన్ (24 బంతుల్లో 41 నాటౌట్; 4 ఫోర్లు) వేగంగా ఆడారు. టీమిండియా బౌలర్లలో హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. బ్యాట్లెత్తేశారుఅనంతరం భారీ లక్ష్యఛేదనలో టీమిండియా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. మరీ దారుణంగా 11.4 ఓవర్లలో 76 పరుగులకే ఆలౌటైంది. టాపార్డర్‌లో పదిహేనేళ్ల వైభవ్ సూర్యవంశీ (5 బంతుల్లో 13; 2 సిక్స్‌లు), అభిషేక్ శర్మ (10; 1 సిక్స్), ఇషాన్ కిషన్ (13; 1 ఫోర్, 1 సిక్స్) పూర్తిగా విఫలమయ్యారు. ఇక సారథి శ్రేయస్ అయ్యర్ (5), అక్షర్ పటేల్ (10), తిలక్ వర్మ (3), హర్షిత్ రాణా (9), శివమ్ దూబే (2) కూడా బ్యాట్లెత్తేశారు. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి మనవాళ్లు పెవలియన్‌కు వరుస కట్టారు.దారుణ వైఫల్యంకనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా క్రీజులో నిలిచే ప్రయత్నం చేయకుండా... షాట్లు ఆడేందుకు ప్రయత్నించి వికెట్లు సమర్పించుకున్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ 4 వికెట్లు పడగొట్టగా... జోఫ్రా ఆర్చర్‌కు మూడు వికెట్లు పడగొట్టాడు. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లతో పాటు యాజమాన్యంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతటి చెత్త ప్రదర్శన మునుపెన్నడూ చూడలేదని.. తుదిజట్టులో తరచూ మార్పులే ఇందుకు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ నేపథ్యంలో భారత స్పిన్ దిగ్గజం, మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే తన అభిప్రాయాలు పంచుకున్నాడు. జియోహాట్‌స్టార్ షోలో మాట్లాడుతూ.. నాలుగో టీ20లో మాత్రం టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎలాంటి మార్పులు చేయవద్దని సూచించాడు. ముఖ్యంగా మూడు మ్యాచ్‌లలో విఫలమైనప్పటికీ తిలక్ వర్మను కొనసాగించాలని కుంబ్లే అభిప్రాయపడ్డాడు.తుదిజట్టులో మార్పులు వద్దు‘‘తుదిజట్టులో ఎలాంటి మార్పులు అవసరం లేదని నేను భావిస్తున్నాను. అలా చేస్తేనే జట్టులో ఆత్మవిశ్వాసం పెంపొందించగలరు. ఇక తిలక్ వర్మ.. అతడు ఇప్పుడు వైస్ కెప్టెన్. అతడికి ఓ బాధ్యత అప్పగించారు. కాబట్టి అతడికి మరొక్క అవకాశం ఇవ్వాల్సిందేనని నా భావన.బౌలర్లు మారాలిమన బౌలర్లు కూడా తమ ఆట తీరును మార్చుకోవాల్సి ఉంది. మనోళ్లు ధారాళంగా పరుగులు ఇచ్చుకున్న చోట.. ప్రత్యర్థి జట్టు మాత్రం 76 పరుగులకే మనోళ్లను ఆలౌట్ చేసింది. ఇక్కడే తేడా స్పష్టంగా తెలుస్తోంది. మన ప్రణాళికలు, వ్యూహాలు పరిస్థితులకు తగ్గట్లుగా మార్చుకోవాలి’’ అని అనిల్ కుంబ్లే హితవు పలికాడు.కాగా ఇంగ్లండ్‌తో తొలి టీ20లో 13 పరుగులు చేసిన తిలక్ వర్మ.. రెండో టీ20లో 24 (నాటౌట్) పరుగులతో ఫర్వాలేదనిపించాడు. అయితే, మంగళవారం నాటి మూడో మ్యాచ్‌లో మాత్రం 11 బంతులు ఎదుర్కొని మూడు పరుగులకే నిష్క్రమించాడు.ఇదిలా ఉంటే.. తొలి టీ20లో ఆడిన సంజూ శాంసన్‌పై వేటు వేసిన యాజమాన్యం.. అతడి స్థానంలో వైభవ్ సూర్యవంశీని కొనసాగిస్తోంది. ఇక రెండో టీ20లో దారుణంగా విఫలమైన రవి బిష్ణోయిని తప్పించి.. అతడి స్థానంలో మూడో టీ20లో ప్రిన్స్ యాదవ్‌ను ఆడించారు. ఇరుజట్ల మధ్య గురువారం జరిగే నాలుగో టీ20కి బ్రిస్టల్ వేదిక.ఇంగ్లండ్‌తో మూడో టీ20 ఆడిన భారత తుదిజట్టుఅభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అక్షర్ పటేల్, తిలక్ వర్మ, హర్షిత్ రాణా, శివం దూబే, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్. చదవండి: అందుకే వైభవ్‌ను ఆడిస్తున్నాం: కుండబద్దలు కొట్టిన గంభీర్ -
గంభీర్‌పై జనాగ్రహం
ఇంగ్లండ్‌తో మూడో టీ20లో టీమిండియా ఘోర పరాజయం అనంతరం ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌పై అభిమానుల ఆగ్రహం వ్యక్తమైంది. నాటింగ్హమ్లోని ట్రెంట్ బ్రిడ్జ్ స్టేడియం వెలుపల భారత జట్టు బయలుదేరుతున్న సమయంలో అభిమానులు "వీ వాంట్ సంజూ" అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. సంజూ శాంసన్‌ను జట్టులోకి తిరిగి తీసుకోవాలంటూ గంభీర్‌ను లక్ష్యంగా చేసుకుని తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.‘We want Sanju’ chants outside the stadium when team India leaves. pic.twitter.com/bzqljBakTG— Mufaddal Vohra (@mufaddal_vohra) July 8, 2026ఐర్లాండ్ సిరీస్‌లో రెండు మ్యాచ్‌ల్లో కేవలం ఐదు పరుగులు మాత్రమే చేసిన సంజూ శాంసన్, ఇంగ్లండ్‌తో తొలి టీ20లో కూడా ఒక్క పరుగు మాత్రమే చేయడంతో జట్టు యాజమాన్యం అతడిని తప్పించింది. అతని స్థానంలో యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీకి అవకాశం కల్పించింది.అయితే ఐపీఎల్ 2025, 2026 సీజన్లలో సంచలన ప్రదర్శనలతో భారీ అంచనాలు పెంచుకున్న వైభవ్ సూర్యవంశీ కూడా ఇంగ్లండ్ పర్యటనలో ఇప్పటివరకు ఆ స్థాయిలో రాణించలేకపోయాడు. మూడో టీ20లో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో కేవలం 13 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. దీంతో సంజూను తప్పించి వైభవ్‌కు అవకాశం ఇవ్వడంపై అభిమానులు ప్రశ్నలు లేవనెత్తారు.మ్యాచ్ ముగిసిన తర్వాత భారత జట్టు బస్సు వైపు వెళ్తున్న సమయంలో గౌతమ్ గంభీర్, తిలక్ వర్మతో పాటు ఆటగాళ్లు స్టేడియం వెలుపల అభిమానుల నినాదాల మధ్య బయటకు వెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.ఇదిలా ఉంటే, సంజూ శాంసన్‌కు జట్టు తలుపులు పూర్తిగా మూసేయలేదని గౌతమ్ గంభీర్ స్పష్టం చేశాడు. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ, "సంజూ శాంసన్ మళ్లీ జట్టులోకి రాకూడదనే ఎలాంటి నిబంధన లేదు. ప్రతి ఆటగాడు తన స్థానాన్ని తన ప్రదర్శనతో సంపాదించుకోవాలి" అని వ్యాఖ్యానించాడు. -
చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ
టీమిండియా ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో 2-0తో క్లీన్‌స్వీప్ అయిన భారత జట్టు.. ఇంగ్లండ్‌తో సిరీస్‌లోనూ చెత్త ప్రదర్శన కొనసాగిస్తోంది. నాటింగ్‌హామ్ వేదికగా మంగళవారం రాత్రి జరిగిన మూడో టీ20లో శ్రేయస్ సేన ఇంగ్లండ్ చేతిలో మట్టికరిచింది.ఇంగ్లండ్ భారీ స్కోరుఆతిథ్య ఇంగ్లండ్ టీమిండియాను ఏకంగా 125 పరుగుల తేడాతో చిత్తు చేసి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. కాగా ట్రెంట్‌బ్రిడ్జ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 201 పరుగుల భారీ స్కోరు సాధించింది.చతికిల పడ్డ టీమిండియాఅనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 11.4 ఓవర్లలో కేవలం 76 పరుగులు చేసి ఆలౌట్ అయింది. టాపార్డర్ రెండంకెల స్కోరు చేయగా.. లోయర్ ఆర్డర్ సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (13), వన్‌డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (13) పరుగులతో టాప్ రన్ స్కోరర్లుగా నిలిచారు.ఇక ఈ మ్యాచ్‌లో మరో ఓపెనర్ అభిషేక్ శర్మ ఏడు బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్ సాయంతో 10 పరుగులు చేసి నిష్క్రమించాడు. జోష్ టంగ్ బౌలింగ్‌లో ఫిల్ సాల్ట్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.అయితే, ఇంతటి ఫ్లాప్ షోలోనూ అభిషేక్ శర్మ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్ జట్టుపై టీ20 ఫార్మాట్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత క్రికెటర్‌గా ఈ లెఫ్టాండర్ బ్యాటర్ చరిత్రకెక్కాడు.ఇంగ్లండ్‌పై టీ20లలో అత్యధిక సిక్సర్లు బాదిన భారత క్రికెటర్లు🏏అభిషేక్ శర్మ- 28🏏హార్దిక్ పాండ్యా- 27🏏విరాట్ కోహ్లి- 19🏏రోహిత్ శర్మ- 18🏏సూర్యకుమార్ యాదవ్ -18.మూడో టీ20 సందర్భంగా టీమిండియా నమోదు చేసిన చెత్త రికార్డులు ఇవే👉అంతర్జాతీయ టీ20లలో పరుగుల పరంగా టీమిండియాకు ఇదే అతిపెద్ద ఓటమి. (125 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చేతిలో చిత్తు)👉ఇంగ్లండ్‌లో టీ20 మ్యాచ్‌లో అతి తక్కువ స్కోరుకే ఆలౌట్ అయిన జట్టుగా టీమిండియా (76/10).👉ఐదు టీ20 మ్యాచ్‌లలో విజయమన్నదే లేకుండా టీమిండియా పరాజయాల పరంపర కొనసాగించడం ఇదే తొలిసారి. ఐర్లాండ్ చేతిలో రెండు, ఇంగ్లండ్ చేతిలో రెండు మ్యాచ్‌లు ఓడిన టీమిండియా. ఇక వర్షం వల్ల ఇంగ్లండ్‌తో తొలి టీ20 రద్దు కాగా.. మొత్తంగా వరుసగా ఐదు మ్యాచ్‌లలో టీమిండియాకు గెలుపున్నదే లేకుండా పోయింది.👉టీ20 మ్యాచ్‌లో 11.4 (అతి తక్కువ) ఓవర్లలో టీమిండియా ఆలౌట్ కావడం ఇదే మొదటిసారి. చదవండి: అందుకే వైభవ్‌ను ఆడిస్తున్నాం: కుండబద్దలు కొట్టిన గంభీర్ -
గంభీర్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన కార్తీక్
ఇంగ్లండ్‌తో మూడో టీ20లో టీమిండియా 125 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడిన నేపథ్యంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నిర్ణయాలపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఛేదనలో శివమ్ దూబే కంటే ముందు పేసర్ హర్షిత్ రాణాను బ్యాటింగ్‌కు పంపడంపై మాజీ భారత వికెట్‌కీపర్, వ్యాఖ్యాత దినేశ్ కార్తీక్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. కామెంట్రీ సమయంలోనే ఆయన ఈ నిర్ణయాన్ని బహిరంగంగా తప్పుబట్టాడు."శివమ్ దూబే కంటే ముందు హర్షిత్ రాణా బ్యాటింగ్‌కు రావడమా..? నిజంగానేనా..? దేశవాళీ క్రికెట్లో కూడా హర్షిత్ రాణా పవర్‌ప్లేలో బ్యాటింగ్ చేసిన సందర్భం నాకు గుర్తులేదు. ఎడమ-కుడి చేతి బ్యాటర్ల కాంబినేషన్ కోసం కొన్ని మార్పులు చేయొచ్చు. కానీ అందుకే శివమ్ దూబే కంటే ముందు హర్షిత్ రాణాను పంపడం సమంజసం కాదు" అని వ్యాఖ్యానించాడు.గంభీర్ తీసుకున్న ఈ నిర్ణయం ఎలాంటి ఫలితాన్నీ ఇవ్వకపోగా.. భారత్ వరుసగా వికెట్లు కోల్పోతూ కేవలం 76 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఇది టీ20 అంతర్జాతీయ క్రికెట్లో భారత జట్టుకు రెండో అత్యల్ప స్కోరు కాగా, 125 పరుగుల తేడాతో ఓడిపోవడం టీమిండియా చరిత్రలోనే అత్యంత భారీ పరాజయంగా నమోదైంది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 201 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్ 44 బంతుల్లో 70 పరుగులతో రాణించగా, భారత బౌలర్లు పరుగులను నియంత్రించలేకపోయారు.202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆరంభం నుంచే కుప్పకూలింది. జోఫ్రా ఆర్చర్ కొత్త బంతితో చెలరేగగా, జోష్ టంగ్ మధ్య, చివరి వరుస బ్యాటర్లను కట్టడి చేశాడు. పవర్‌ప్లే ముగిసేలోపే అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ వికెట్లు కోల్పోవడంతో భారత్ కోలుకోలేకపోయింది.ఈ దశలో అందరూ శివమ్ దూబే బ్యాటింగ్‌కు వస్తాడని భావించినా, జట్టు యాజమాన్యం అనూహ్యంగా హర్షిత్ రాణాను పంపింది. ఈ నిర్ణయంపైనే దినేశ్ కార్తీక్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.ఈ ఓటమితో భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 0-2తో వెనుకపడిపోయింది. సిరీస్‌లో నిలవాలంటే బ్రిస్టల్‌లో జరగనున్న నాలుగో టీ20లో భారత్ తప్పనిసరిగా విజయం సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
అందుకే వైభవ్‌ను ఆడిస్తున్నాం: కుండబద్దలు కొట్టిన గంభీర్
విదేశీ గడ్డ మీద భారత టీ20 జట్టు వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. తొలుత ఐర్లాండ్ చేతిలో 2-0తో వైట్‌వాష్ అయిన టీమిండియా.. ఇంగ్లండ్ పర్యటనలోనూ పేలవ ప్రదర్శన కొనసాగిస్తోంది. తాజాగా మూడో టీ20లో మరీ ఘోరంగా ఆతిథ్య జట్టు చేతిలో ఏకంగా 125 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది.ఫలితంగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ 2-0తో ముందంజ వేయగా.. మిగిలిన రెండు మ్యాచ్‌లలో తప్పక గెలవాల్సిన స్థితిలో టీమిండియా నిలిచింది. ఈ నేపథ్యంలో యాజమాన్యం తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.సంజూ గురించి నాకు క్లారిటీ ఉందిముఖ్యంగా సంజూ శాంసన్‌ను తప్పించి.. అతడి స్థానంలో వైభవ్ సూర్యవంశీని ఓపెనర్‌గా ఆడించడాన్ని పలువురు మాజీ క్రికెటర్లు విమర్శిస్తున్నారు. వరల్డ్‌కప్ హీరోనే పక్కనపెట్టడానికి గల కారణం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.ఈ విషయంపై హెడ్‌కోచ్ గౌతం గంభీర్ తాజాగా స్పందించాడు. మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ముందుగా సంజూ గురించి స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా. హెడ్‌కోచ్, ఆటగాడి మధ్య జరిగిన సంభాషణ గురించి బయటకు చెప్పాల్సిన అవసరం లేదు. అది ఎప్పటికీ బయటకు రాదు.సంజూ విషయంలో మాకు పూర్తి స్పష్టత ఉంది. అతడు టీమిండియా కోసం ఏం చేశాడో మాకు తెలుసు. అయితే, కొన్నిసార్లు ఫామ్ విషయంలో ఏ ఆటగాడికైనా ఇబ్బందులు తప్పవు. దానర్థం అతడు ఇక జట్టులోకి తిరిగి రాడని కాదు’’ అని గంభీర్ పేర్కొన్నాడు.కుండబద్దలు కొట్టిన గంభీర్ఇక వైభవ్ సూర్యవంశీ గురించి ప్రస్తావన రాగా.. ‘‘అంతర్జాతీయ క్రికెట్లో ఫలితాలు అత్యంత ముఖ్యమైనవి. అనుకున్న ఫలితం రాబట్టడం కోసమే అత్యుత్తమ తుదిజట్టును ఎంపిక చేసుకుంటాము. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలని నేను భావిస్తాను’’ అని గంభీర్ సమర్థించుకున్నాడు. కొత్త కాంబినేషన్లు ప్రయత్నిస్తున్నామని.. అందుకే వైభవ్ సూర్యవంశీ వంటి ఆటగాళ్లకు అవకాశం ఇస్తు న్నామంటూ కుండబద్దలు కొట్టాడు.అందుకే ఓడిపోతున్నాంఇక విదేశీ గడ్డ మీద పిచ్‌లకు తాము ఇంకా పూర్తిగా అలవాటు పడలేదని.. అందుకే వరుసగా మ్యాచ్‌లు ఓడిపోతున్నామని గంభీర్ జట్టు ఆట తీరును తప్పుబట్టాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్‌లలో కలిపి వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడిపోవడాన్ని బట్టే తమ ఆట తీరు ఎలా ఉందో తెలుస్తోందన్నాడు. కాగా ఇంగ్లండ్- భారత్ మధ్య తొలి టీ20 వర్షం వల్ల రద్దైంది. ప్రస్తుతం ఇంగ్లండ్ 2-0తో ఆధిక్యంలో ఉండగా.. ఇరుజట్ల మధ్య గురువారం నాలుగో టీ20 జరుగనుంది. ఇందుకు బ్రిస్టల్ వేదిక. చదవండి: టీమిండియా ఆట తీరుపై శ్రేయస్ అయ్యర్ ఆగ్రహం -
విదేశాల్లో మరోసారి బయటపడ్డ టీమిండియా బలహీనతలు
ఇంగ్లండ్‌తో మూడో టీ20లో భారత్ ఎదుర్కొన్న 125 పరుగుల భారీ ఓటమి కేవలం ఒక్కరోజు పేలవ ప్రదర్శన మాత్రమే కాదు. విదేశీ పర్యటనల్లో భారత బ్యాటింగ్‌లో పదేపదే కనిపిస్తున్న సాంకేతిక లోపాన్ని మరోసారి స్పష్టంగా బయటపెట్టింది. ముఖ్యంగా పేసర్లు గుడ్ లెంగ్త్, బ్యాక్ ఆఫ్ లెంగ్త్ (6 నుంచి 10 మీటర్ల మధ్య) ప్రాంతంలో సంధించే బంతులను ఎదుర్కోవడంలో భారత బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.మ్యాచ్ అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జట్టు ప్రదర్శనను "అత్యంత దారుణం"గా అభివర్ణించాడు. భారత్ కేవలం 76 పరుగులకే ఆలౌటవడం నిజంగానే చాలా దారుణం. ప్రపంచ ఛాంపియన్ అయిన జట్టు ఏకంగా 125 పరుగుల తేడాతో ఓడిపోవడం మరీ దారుణం.ఈ సమస్య ఒక్క మ్యాచ్‌కే పరిమితం కాలేదు. 2025 ఆసియా కప్, 2026 ఐర్లాండ్ పర్యటన, ప్రస్తుతం ఇంగ్లండ్ సిరీస్‌లలో హార్డ్ లెంగ్త్ బంతులపై భారత బ్యాటర్ల సగటు వరుసగా 18.42, 17.17, 14.29 మాత్రమే ఉంది. అదే సమయంలో స్వదేశంలో జరిగిన ప్రపంచకప్‌లో ఇదే తరహా బంతులపై భారత బ్యాటర్లు 47.70 సగటుతో, 165.63 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేశారు. ఈ గణాంకాలు స్వదేశం, విదేశాల్లో భారత బ్యాటింగ్ మధ్య ఉన్న స్పష్టమైన తేడాను చూపిస్తున్నాయి.వ్యక్తిగత ప్రదర్శనలను పరిశీలిస్తే తిలక్ వర్మ మాత్రమే హార్డ్ లెంగ్త్ బంతులను సమర్థంగా ఎదుర్కొన్నాడు. అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ కొంత మేర పర్వాలేదనిపించినా, సంజూ శాంసన్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా వంటి బ్యాటర్లు వరుసగా విఫలమయ్యారు. ముఖ్యంగా సంజూ శాంసన్ ఐదు సార్లు ఔటై కేవలం 20 పరుగులే చేయడం ఆందోళన కలిగించే అంశం.విశేషమేమిటంటే, ఇదే పిచ్‌పై భారత పేసర్లు తొలుత హార్డ్ లెంగ్త్ బంతులతో ఇంగ్లండ్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలిగారు. ఆరంభంలో స్వింగ్, ఆ తర్వాత గుడ్ లెంగ్త్ బంతులతో పరుగులను నియంత్రించారు. అయితే ఆ వ్యూహాన్ని ఇంగ్లండ్ బౌలర్లు మరింత సమర్థంగా అమలు చేశారు.జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్ గంటకు 140 కిలోమీటర్లకు పైగా వేగంతో వరుసగా హార్డ్ లెంగ్త్ బంతులు సంధించారు. ఆర్చర్ మొదట వైభవ్ సూర్యవంశీకి వైడ్‌గా బంతి వేసి సిక్సర్ ఇచ్చినా, వెంటనే లైన్ మార్చి బౌన్సర్‌తో అతడిని ఔట్ చేశాడు.టంగ్ కూడా పూర్తి లెంగ్త్‌తో ప్రారంభించి వెంటనే హార్డ్ లెంగ్త్‌కు మారి అభిషేక్ శర్మ వికెట్ తీశాడు. అనంతరం ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, శివమ్ దూబే కూడా ఈ లెంగ్త్‌కు ఇబ్బంది పడ్డారు. ఆర్చర్, టంగ్ కలిసి 6 నుంచి 10 మీటర్ల లెంగ్త్‌లో వేసిన 26 బంతుల్లో ఐదు వికెట్లు తీసి కేవలం 24 పరుగులే ఇచ్చారు.ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ కూడా మ్యాచ్ అనంతరం ఇదే విషయాన్ని ప్రస్తావించాడు. "ఈ పిచ్‌పై గుడ్ లెంగ్త్‌లో బంతులు వేస్తే షాట్లు ఆడటం చాలా కష్టమని మేం ముందే గుర్తించాం. అందుకే అదే వ్యూహాన్ని అమలు చేశాం" అని వెల్లడించాడు.ట్రెంట్ బ్రిడ్జ్ ఓటమిని ఒక్క మ్యాచ్ ఫలితంగా మాత్రమే చూడలేం. గత కొంతకాలంగా విదేశాల్లో హార్డ్ లెంగ్త్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో భారత్ ఎదుర్కొంటున్న సమస్యకు ఇది మరో ఉదాహరణ. ఈ బలహీనతను సరిదిద్దుకోకపోతే, రానున్న విదేశీ పర్యటనల్లో ప్రత్యర్థి జట్లు ఇదే వ్యూహాన్ని మరింత దూకుడుగా అమలు చేసి టీమిండియాను ఘోరంగా దెబ్బతీసే అవకాశం ఉంది. -
టీమిండియా ఆటతీరుపై శ్రేయస్ ఆగ్రహం
నాటింగ్హమ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20లో భారత్ 125 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఈ ఓటమి అనంతరం భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. జట్టు ప్రదర్శనను "అత్యంత దారుణం"గా అభివర్ణించాడు. ఇలాంటి ఓటమిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించలేమని స్పష్టం చేశాడు.అతడి మాటల్లో.. "ఈ ప్రదర్శనను వర్ణించడానికి 'అత్యంత దారుణం' అనే పదం తప్ప మరోటి కనిపించడం లేదు. ఇంత పెద్ద తేడాతో ఓడిపోవడం అసలు అంగీకారయోగ్యం కాదు. ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని మళ్లీ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ఇది 200 పరుగులు చేసే పిచ్ కాదని నా అభిప్రాయం. పవర్‌ప్లేలోనే నాలుగు వికెట్లు కోల్పోవడం మాకు భారీ ఎదురుదెబ్బగా మారింది.బౌలింగ్‌లో కూడా జట్టు ప్రణాళికను సరిగా అమలు చేయలేకపోయింంది. జట్టు సమావేశాల్లో ఎంత ప్రణాళిక రూపొందించినా, మైదానంలో పరిస్థితులకు అనుగుణంగా బౌలింగ్ చేయాలి. ఈ వికెట్‌పై హార్డ్ లెంగ్త్ బంతులు ప్రభావవంతంగా ఉన్నాయి. కానీ మేము వాటిని తగినంతగా వేయలేదు.అలాగే 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే సమయంలో బ్యాటర్లు ప్రణాళికాబద్ధంగా ఆడాలి. మొత్తంగా మా అమలు చాలా పేలవంగా సాగింది" అని అన్నాడు.అయితే మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో బలంగా పుంజుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశాడు. "గతాన్ని తలచుకుంటూ కూర్చోవడం వల్ల ప్రయోజనం లేదు. మేం చాలా పేలవమైన క్రికెట్ ఆడాం. అయినా ఈ ఓటమి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. మళ్లీ జట్టుకు ఊపు తీసుకొచ్చేందుకు ప్రతి ఆటగాడు తన వంతు బాధ్యత ఎలా నిర్వర్తించాలనే దానిపై ఆలోచించాలి" అని తెలిపాడు.కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ 44 బంతుల్లో 70 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, జోస్ బట్లర్ 36, సామ్ కరన్ 24 బంతుల్లో అజేయంగా 41 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్ తలో రెండు వికెట్లు తీశారు.202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం 11.4 ఓవర్లలో 76 పరుగులకే ఆలౌటైంది. ఇది టీ20 అంతర్జాతీయ క్రికెట్లో భారత్‌కు రెండో అత్యల్ప స్కోరు కాగా, 125 పరుగుల తేడాతో ఓడిపోవడం భారత జట్టు చరిత్రలోనే అత్యంత భారీ పరాజయంగా నిలిచింది. ఇప్పుడు సిరీస్‌లో నిలవాలంటే జూలై 9న బ్రిస్టల్‌లో జరిగే నాలుగో టీ20లో భారత్ తప్పక విజయం సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది.కొత్తగా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన అయ్యర్ నాయకత్వంలో భారత్‌కు ఇది వరుసగా నాలుగో ఓటమి. అంతకుముందు ఐర్లాండ్‌తో జరిగిన రెండు టీ20ల్లోనూ భారత్ పరాజయం పాలైంది. -
టీమిండియాపై ఇంగ్లండ్ భారీ విజయం
నేడు ఇంగ్లండ్‌కు భారత్‌కు మధ్య జరిగిన మూడో టి20లో టీమిండియాపై 125 పరుగుల తేడాతో ఇంగ్లండ్ భారీ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ (44 బంతుల్లో 70; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) భారీ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. మరో ఓపెనర్ జోస్ బట్లర్ (21 బంతుల్లో 36) పర్వాలేదనిపించాడు. ఈ ఇద్దరు తొలి వికెట్‌కు 43 పరుగులో జోడించారు. ఆ తర్వాత భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో ఇంగ్లండ్ స్కోరు మందగించింది. ఒక దశలో 160 నుంచి 170 పరుగులకు పరిమితమవుతుందనుకున్న ఇంగ్లండ్.. చివర్లో సామ్ కరన్ (24 బంతుల్లో 41 నాటౌట్), విల్ జాక్స్ (7 బంతుల్లో 14) మెరుపులతో 200 పరుగుల మార్క్‌ను దాటింది. భారత బౌలర్లలో హర్షిత్ రానా, ప్రిన్స్ యాదవ్ చెరో 2 వికెట్లు తీయగా, అక్షర్ పటేల్ ఒక వికెట్ పడగొట్టాడు.అనంతరం 202 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా వరుస వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్ బౌలర్ల దాటికి భారత భ్యాట్స్మెన్స్ వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. జోష్ టంగ్ నాలుగు వికెట్లు, జోఫ్రా ఆర్చర్ మూడు వికెట్లు తీయగా, ఆదిల్ రషీద్ రెండు, విల్ జాక్స్ ఒక వికెట్టు తీశారు. కేవలం 11.4 ఓవర్లలో 76 పరుగులకే టీమిండియా ఆలౌటైంది. భారత భ్యాట్స్‌మెన్స్‌లో వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్ ఇద్దరూ చెరో 13 పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. -
చెలరేగిన సాల్ట్, సామ్ కరన్.. టీమిండియా టార్గెట్ 202 రన్స్
ట్రెంట్‌బ్రిడ్జి వేదికగా టీమిండియాతో జరుగుతున్న మూడో టీ20లో ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ (44 బంతుల్లో 70; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) భారీ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. మరో ఓపెనర్ జోస్ బట్లర్ (21 బంతుల్లో 36) పర్వాలేదనిపించాడు. ఈ ఇద్దరు తొలి వికెట్‌కు 43 పరుగులో జోడించారు. ఆ తర్వాత భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో ఇంగ్లండ్ స్కోరు మందగించింది. ఒక దశలో 160 నుంచి 170 పరుగులకు పరిమితమవుతుందనుకున్న ఇంగ్లండ్.. చివర్లో సామ్ కరన్ (24 బంతుల్లో 41 నాటౌట్), విల్ జాక్స్ (7 బంతుల్లో 14) మెరుపులతో 200 పరుగుల మార్క్‌ను దాటింది. భారత బౌలర్లలో హర్షిత్ రానా, ప్రిన్స్ యాదవ్ చెరో 2 వికెట్లు తీయగా, అక్షర్ పటేల్ ఒక వికెట్ పడగొట్టాడు. -
అతడికి ముందుగా ఏం చెప్పలేదు.. వరల్డ్‌కప్ ప్లాన్‌లో భాగమే!
విదేశీ పర్యటనలో టీమిండియాకు వరుస పరాజయాలు ఎదురవుతున్నాయి. తొలుత ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో 2-0తో క్లీన్‌స్వీప్‌నకు గురైన భారత జట్టు.. ఇంగ్లండ్‌తో సిరీస్‌ను కూడా ఓటమితో మొదలుపెట్టింది. తొలి టీ20 వర్షం వల్ల రద్దు కాగా.. మాంచెస్టర్ వేదికగా రెండో టీ20లో శ్రేయస్ సేన ఓటమి పాలైంది.ఇక ఇరుజట్ల మధ్య మంగళవారం నాటింగ్‌హామ్ వేదికగా మూడో టీ20 జరుగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ మీడియాతో మాట్లాడాడు. ‘‘మేము బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో బాగా మెరుగుపడాల్సి ఉంది.వరల్డ్‌కప్ ప్లాన్‌లో భాగమే!టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత.. మరో వరల్డ్‌కప్ గెలవడమే లక్ష్యంగా రెండేళ్ల కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాము. మేము మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలనే ఆలోచనలో ఉన్నాము. ఇందుకోసం అన్ని విభాగాలూ కలిసి కట్టుగా కృషి చేస్తున్నాయి.గత రెండేళ్లలో మేము ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేదు. అయితే, ఇప్పుడు మూడు మ్యాచ్‌లు ఓడిపోగానే అందరూ మా వైఫల్యాల గురించే మాట్లాడుతున్నారు. ఆటలో గెలుపోటములు సహజం. జట్టులో మార్పులు జరుగుతున్నాయి. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తున్నాం’’ అని సితాన్షు కొటక్ పేర్కొన్నాడు.ముందుగా ఏం చెప్పలేదుఇక వైభవ్ సూర్యవంశీ గురించి మాట్లాడుతూ.. ‘‘టీమిండియాకు ఎంపికైన నాటి నుంచే అతడు అరంగేట్రం కోసం సిద్ధంగా ఉన్నాడు. అంతేగానీ రెండో టీ20కి ముందే అతడిని సిద్ధంగా ఉండమని మాత్రం చెప్పలేదు.అతడి ఆట ఎలా ఉంటుందో మాకు తెలుసు. అతడి ఆలోచనా విధానం, దూకుడు గురించి మాకు అవగాహన ఉంది. అయితే, ఇలా ఆడాలి.. అలా ఆడాలి అని మాత్రం అతడికి మేము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు’’ అని సితాన్షు కొటక్ తెలిపాడు.కాగా ఇంగ్లండ్‌తో రెండో టీ20 సందర్భంగా వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. సంజూ శాంసన్ స్థానంలో అభిషేక్ శర్మకు ఓపెనింగ్ జోడీగా బరిలోకి దిగాడు. కానీ.. కేవలం 14 పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు. మరోవైపు.. వైభవ్‌ను ఆడించేందుకు సంజూను తప్పించడం అన్యాయం అంటూ యాజమాన్యంపై విమర్శలు వచ్చాయి. -
టీమిండియాతో మూడో టీ20: ఇంగ్లండ్ తుదిజట్టు ప్రకటన
టీమిండియాతో మూడో టీ20 మ్యాచ్‌కు ఇంగ్లండ్ తమ తుదిజట్టును ప్రకటించింది. రెండో మ్యాచ్‌లో ఆడిన ప్లేయింగ్ ఎలెవన్‌నే కొనసాగిస్తామని తెలిపింది. కాగా సొంతగడ్డపై భారత్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇంగ్లండ్ శుభారంభం అందుకున్న సంగతి తెలిసిందే.ఇరుజట్ల మధ్య చెస్టర్ లీ వేదికగా జరిగిన మ్యాచ్ ఫలితం తేలకుండానే వర్షం వల్ల రద్దైపోయింది. ఈ క్రమంలో మాంచెస్టర్ వేదికగా శనివారం జరిగిన రెండో టీ20లో మాత్రం ఆతిథ్య ఇంగ్లండ్ అదరగొట్టింది. టీమిండియాను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి 1-0తో ముందంజ వేసింది.టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన ఇంగ్లండ్ భారత్‌ను 190 పరుగులకు కట్టడి చేయగలిగింది. సామ్ కర్రాన్ మూడు వికెట్లతో సత్తా చాటగా.. జోఫ్రా ఆర్చర్, లియామ్ డాసన్, విల్ జాక్స్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్ 19 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి పనిపూర్తి చేసింది.ఓపెనర్లు ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ డకౌట్ అయినా.. హ్యారీ బ్రూక్ మెరుపు ఇన్నింగ్స్ (15 బంతుల్లో 39) ఆడి జట్టును ఆదుకున్నాడు. జేకబ్ బెతెల్ ధనాధన్ దంచికొట్టి (46 బంతుల్లో 76 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చాడు. టామ్ బాంటన్ (39) కూడా రాణించాడు. ఈ క్రమంలో రెండో మ్యాచ్‌లో గెలిపించిన తుదిజట్టునే ఇంగ్లండ్ మూడో మ్యాచ్‌కూ కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది.టీమిండియాతో మూడో టీ20కి భారత తుదిజట్టుఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జేకబ్ బెతెల్, టామ్ బాంటన్, సామ్ కర్రాన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, జోష్ టంగ్.బెంచ్: రెహాన్ అహ్మద్, సాకిబ్ మహమూద్, సోనీ బేకర్, జేమ్స్ కోల్స్, జోర్డాన్ కాక్స్, ల్యూక్ వుడ్. -
గాయమా?.. వేటు వేశారా?.. అదే నిజమైతే: మాజీ క్రికెటర్ ఫైర్
టీమిండియా యాజమాన్యంపై భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఒకవేళ సంజూ శాంసన్‌ను గనుక కావాలని తప్పించి ఉంటే.. అంతకంటే దారుణం మరొకటి ఉండదని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో భారత్ విజేతగా నిలవడంలో సంజూ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.ఈవెంట్ ఆరంభంలో తుదిజట్టులో చోటు సంపాదించుకోలేకపోయిన సంజూ.. ఆ తర్వాత వచ్చి నాకౌట్ మ్యాచ్‌లో దుమ్ములేపాడు. 97*, 89, 89 పరుగులతో రాణించి... ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’గా నిలిచాడు. ఐపీఎల్-2026లోనూ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున సత్తా చాటాడు.అయితే, ఆ తర్వాత ఐర్లాండ్ పర్యటనలో మాత్రం సంజూ దారుణంగా విఫలమయ్యాడు. రెండు మ్యాచ్‌లలో వరుసగా 5, 0 పరుగులు చేశాడు. ఇంగ్లండ్‌తో తొలి టీ20లోనూ ఒక్క పరుగే చేసి అవుటయ్యాడు. అదే సమయంలో వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం గురించి డిమాండ్లు వెల్లువెత్తాయి.ఓవైపు గత మూడు మ్యాచ్‌లలో సంజూ వైఫల్యాలు.. మరోవైపు వైభవ్ విషయంలో ఒత్తిడి.. ఇలాంటి తరుణంలో ఇంగ్లండ్‌తో రెండో టీ20 నుంచి సంజూను తప్పించి.. వైభవ్‌ను అరంగేట్రం చేయించింది యాజమాన్యం. అయితే, సంజూ మాదిరే విఫలమైన వన్‌డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను మాత్రం కొనసాగించింది.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఘాటుగా స్పందించాడు. ‘‘వైభవ్‌ను టీమిండియా జెర్సీలో చూడటం సంతోషంగా అనిపించింది. కానీ సంజూ శాంసన్ సంగతేంటి? అతడిపై వేటు వేశారా? మీరు నాతో జోక్ చేయడం లేదు కదా!నేనైతే ఇది జోక్ కాదనే అనుకుంటున్నా. బహుశా సంజూ గాయపడి ఉంటాడని నా సందేహం. ఇదే నిజమవ్వాలని కోరుకుంటున్నా. అలా కాకుండా అతడిని తప్పించారంటే మాత్రం ఇంతకంటే విచిత్రమైన, దారుణమైన సెలక్షన్ మరొకటి ఉండదు.ఎందుకంటే వైభవ్ సూర్యవంశీని తప్పకుండా తుదిజట్టులో ఆడించాలంటే.. సంజూ మూడో స్థానంలోనైనా సులువుగా బ్యాటింగ్ చేసేవాడు’’ అని సంజయ్ మంజ్రేకర్ ‘ఎక్స్’ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. -
వైభవ్ ‘అరంగేట్రం’పై విమర్శలు.. స్పందించిన బీసీసీఐ
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఎట్టకేలకు అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇంగ్లండ్‌తో రెండో టీ20 సందర్భంగా ఈ బిహారీ పిల్లాడు టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. తద్వారా భారత క్రికెట్ చరిత్రలో అత్యంత పిన్న వయసులో అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు.సంజూ స్థానంలో...కేవలం పదిహేనేళ్ల 99 రోజుల వయసులో వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) ఈ ఘనత సాధించాడు. గత మూడు మ్యాచ్‌లలో విఫలమైన ఓపెనింగ్ బ్యాటర్ సంజూ శాంసన్ స్థానంలో వైభవ్ తుదిజట్టులోకి వచ్చాడు. అభిషేక్ శర్మతో కలిసి భారత ఇన్నింగ్స్ ఆరంభించిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్ పది బంతులు ఎదుర్కొని రెండు సిక్సర్ల సాయంతో 14 పరుగులు చేసి నిష్క్రమించాడు.అయితే, వైభవ్‌ను ఐర్లాండ్ పర్యటనలోనే అరంగేట్రం చేయాల్సిందంటూ విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. యాజమాన్యం కావాలనే అతడిని వేచి చూసేలా చేస్తోందంటూ పలువురు మాజీ క్రికెటర్లు సైతం విమర్శించారు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించాడు.విమర్శలపై బీసీసీఐ స్పందనవైభవ్ సూర్యవంశీ అరంగేట్రం నేపథ్యంలో ANIతో మాట్లాడుతూ.. ‘‘అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన వైభవ్ సూర్యవంశీకి శుభాభినందనలు. గొప్ప అవకాశం అందుకున్నావు. బీసీసీఐ ఎవరి విషయంలోనూ అన్యాయంగా ప్రవర్తించదు. వివక్ష చూపించదు.అర్హత ఉన్న వాళ్లకు కచ్చితంగా అవకాశం ఇస్తుంది. అయితే, వైభవ్ అరంగేట్రానికి ముందు సోషల్ మీడియాలో ఎంత రచ్చ జరిగిందో తెలిసిందే. అతడికి అవకాశాలు ఇవ్వడం లేదంటూ కొంతమంది గగ్గోలు పెట్టారు. కోచ్, కెప్టెన్‌ను నిందించారు. కానీ అందులో అర్థం లేదు.సరైన సమయం వచ్చినపుడు వైభవ్ తప్పకుండా అరంగేట్రం చేస్తాడని నేను ముందు నుంచే చెప్తున్నాను. అందుకు తగ్గట్లుగా శనివారం అతడు తన తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. గొప్పగా ఆడుతూ భవిష్యత్తును బంగారం చేసుకుంటాడని నమ్ముతున్నాను. వైభవ్ విషయంలో యాజమాన్యం అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. అందుకు వారిని తప్పక ప్రశంసించాల్సిందే’’ అని రాజీవ్ శుక్లా పేర్కొన్నాడు.ఇదిలా ఉంటే.. మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో రెండో టీ20లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది. ఇక ఇరుజట్ల మధ్య తొలి టీ20 వర్షం వల్ల రద్దైన సంగతి తెలిసిందే.చదవండి: వైభవ్ తప్పు చేశాడు: గావస్కర్An incredibly special moment in the #TeamIndia camp today 🥹💙🎥 Presenting T20I cap no. 122, Vaibhav Sooryavanshi 🧢#ENGvIND pic.twitter.com/hvOZdSN3Ow— BCCI (@BCCI) July 4, 2026 -
చరిత్ర సృష్టించిన అక్షర్ పటేల్
టీమిండియా స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో 100 వికెట్లు తీసిన తొలి భారత స్నిన్నర్‌గా (ఓవరాల్‌గా నాలుగో భారత బౌలర్‌గా) రికార్డుల్లోకెక్కాడు. మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడినా అక్షర్ బంతితో రాణించాడు. 4 ఓవర్లలో కేవలం 20 పరుగులిచ్చి కీలకమైన హ్యారీ బ్రూక్ వికెట్ తీశాడు.బ్రూక్ వికెట్ అక్షర్‌కు టీ20ల్లో 100వ వికెట్. పొట్టి ఫార్మాట్లో ఇప్పటివరకు 98 మ్యాచ్‌లు ఆడిన అతడు.. ఓ హాఫ్ సెంచరీ సాయంతో 736 పరుగులు కూడా చేశాడు. భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అర్ష్‌దీప్ సింగ్ 134 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా, జస్ప్రీత్ బుమ్రా 121 వికెట్లు, హార్దిక్ పాండ్యా 114 వికెట్లు, అక్షర్ పటేల్ 100 వికెట్లతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. ఇంగ్లండ్ చేతిలో భారత్ 4 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ మరో ఓవర్ మిగిలుండగానే 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో టీ20 నాటింగ్హమ్ వేదికగా జులై 7న జరుగనుంది. తొలి టీ20 వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే.టీమిండియా కొంపముంచిన బిష్ణోయ్191 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ 16 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యానికి 49 పరుగుల దూరంలో ఉండింది. ఈ దశలో బౌలింగ్‌కు వచ్చిన రవి బిష్ణోయ్ వరుసగా రెండు నోబాల్స్ వేయగా, ఫ్రీ హిట్లను జేకబ్ బేతెల్ రెండు భారీ సిక్సర్లుగా మలిచాడు. అదే ఓవర్లో మరో సిక్స్, ఒక ఫోర్‌తో కలిపి మొత్తం 29 పరుగులు రావడంతో మ్యాచ్ పూర్తిగా ఇంగ్లండ్ ఆధీనంలోకి వెళ్లింది. చివరకు ఆతిథ్య జట్టు మరో ఓవర్ మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. -
బిష్ణోయ్‌ను నిందించని శ్రేయస్
ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో కీలక సమయంలో ఖరీదైన ఓవర్ వేసి టీమిండియా ఓటమికి ప్రధాన కారకుడైన లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ను కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వెనుకేసుకొచ్చాడు. జట్టు ఓటమికి ఒక్కడినే బాధ్యుడిని చేయడం సరికాదని అభిప్రాయపడ్డాడు.మ్యాచ్ అనంతరం శ్రేయస్ మాట్లాడుతూ.. మ్యాచ్ ఎక్కడ మా చేతుల్లో నుంచి జారిపోయిందో నాకు తెలుసు. కానీ ఒకే ఆటగాడిని చూపించి అతనినే నిందించాలనుకోవడం లేదు. 16వ ఓవర్ తర్వాత మ్యాచ్ మొమెంటం పూర్తిగా మారిపోయిందని అన్నాడు.బిష్ణోయ్ వేసిన వరుస నోబాల్స్ గురించి ప్రశ్నించగా.. ఒక నోబాల్ వేసినా అతను మరింత బలంగా తిరిగి వస్తాడని నమ్ముతున్నాను. 17వ ఓవర్లో మ్యాచ్ మా చేతుల్లో నుంచి వెళ్లిపోయింది. అతను ఈ అనుభవం నుంచి నేర్చుకోవాల్సి ఉంటుంది.ఈ పిచ్‌పై 190 పరుగులు చాలామంచి స్కోరు. ముఖ్యంగా చివరి ఓవర్లో తిలక్ వర్మ ఆడిన అజేయ 24 పరుగుల ఇన్నింగ్స్ అసాధారణం. అదే సమయంలో జేకబ్ బేతెల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అతనికి కూడా తగిన గుర్తింపు ఇవ్వాలని పేర్కొన్నాడు.టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై కూడా శ్రేయస్ ప్రశంసలు కురిపించాడు. "అతనిలో ఏమాత్రం భయం కనిపించలేదు. గత కొన్ని నెలలుగా అద్భుతమైన క్రికెట్ ఆడుతున్నాడు. అరంగేట్రం ఒత్తిడిని ఏమాత్రం పట్టించుకోకుండా అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నాడు. అతని ఆత్మవిశ్వాసం చూడటానికి చాలా ఆనందంగా ఉంది" అని అన్నాడు.కాగా, 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 16 ఓవర్లు ముగిసే సమయానికి ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యానికి 49 పరుగుల దూరంలో ఉండింది. ఈ దశలో బౌలింగ్‌కు వచ్చిన రవి బిష్ణోయ్ వరుసగా రెండు నోబాల్స్ వేయగా, ఫ్రీ హిట్లను జేకబ్ బేతెల్ రెండు భారీ సిక్సర్లుగా మలిచాడు. అదే ఓవర్లో మరో సిక్స్, ఒక ఫోర్‌తో కలిపి మొత్తం 29 పరుగులు రావడంతో మ్యాచ్ పూర్తిగా ఇంగ్లండ్ ఆధీనంలోకి వెళ్లింది. చివరకు ఆతిథ్య జట్టు మరో ఓవర్ మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి టీ20 వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే. -
టీమిండియా కొంపముంచిన బిష్ణోయ్
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా నిన్న (జులై 4) జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్‌లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ మరో ఓవర్ మిగిలుండగానే 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో టీ20 నాటింగ్హమ్ వేదికగా జులై 7న జరుగనుంది.కాగా, రెండో టీ20లో స్పిన్నర్ రవి బిష్ణోయ్ టీమిండియా కొంపముంచాడు. ఇంగ్లండ్ గెలుపుపై ఆశలు వదులుకున్న దశలో ఇన్నింగ్స్ 17వ ఓవర్లో ఏకంగా 29 పరుగులిచ్చి మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేశాడు. ఆ ఓవర్‌కు ముందు ఇంగ్లండ్ గెలవాలంటే 4 ఓవర్లలో 49 పరుగులు చేయాల్సి ఉండింది. చేతిలో 5 వికెట్లు మాత్రమే ఉన్నాయి. పైగా అప్పటికి క్రీజ్‌లో ఉన్న జేకబ్ బేతెల్ కూడా పరుగులు చేసుందుకు ఇబ్బంది పడుతున్నాడు. అతడికి జతగా ఉన్న సామ్ కర్రన్ అప్పుడే క్రీజ్‌లోకి వచ్చాడు.ఈ దశలో బంతినందుకున్న బిష్ణోయ్ నో బాల్‌తో ఓవర్ ప్రారంభించి వరుసగా 6, మరో నో బాల్, 6, 2, 4, 6, 2 పరుగులిచ్చాడు. దీంతో ఒక్కసారిగా మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. సమీకరణలు 3 ఓవర్లలో 20 పరుగులకు మారిపోయాయి. దీంతో మరింత ఫ్రీగా ఆడిన బేతెల్ (76 నాటౌట్).. జోఫ్రా ఆర్చర్ (10 నాటౌట్) సహకారంతో మ్యాచ్‌ను సునాయాసంగా ముగించాడు.ఈ ఓటమి తర్వాత బిష్ణోయ్‌పై భారత క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. టీమిండియా ఓటమికి కారకుడంటూ సోషల్‌మీడియా వేదికగా దుర్భాషలాడుతున్నారు. ఈ చెత్త స్పెల్ కారణంగా బిష్ణోయ్ వ్యక్తిగతంగానూ ఓ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. భారత టీ20 క్రికెట్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఓవర్ (29) వేసిన స్పెషలిస్ట్ బౌలర్‌గా అపఖ్యాతి పాలయ్యాడు.అంతేకాకుండా, 2020లో న్యూజిలాండ్‌పై శివమ్ దూబే ఇచ్చిన 34 పరుగులు, 2016లో వెస్టిండీస్‌పై స్టువర్ట్ బిన్నీ ఇచ్చిన 32 పరుగుల తర్వాత మూడో అత్యంత ఖరీదైన ఓవర్‌గా వేసిన భారత బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. -
శ్రేయస్ అయ్యర్‌కు ఘోర అపఖ్యాతి
భారత టీ20 జట్టు కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. తొలి నాలుగు మ్యాచ్‌ల్లో ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయిన తొలి భారత కెప్టెన్‌గా అపఖ్యాతి పాలయ్యాడు. కొద్ది రోజుల కిందట ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన శ్రేయస్.. ఆ సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు, ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఒక్క విజయం కూడా నమోదు చేయలేదు. ఇంగ్లండ్‌తో తొలి టీ20 వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే. ఇలా చూస్తే శ్రేయస్ భారత టీ20 కెప్టెన్‌గా తన కెరీర్‌ను హ్యాట్రిక్ ఓటములతో మొదలుపెట్టాడు.ఈ అవాంఛనీయ రికార్డులతో పాటు శ్రేయస్ మరో అపఖ్యాతిని కూడా మూటగట్టుకున్నాడు. కెప్టెన్‌గా చివరి 11 మ్యాచ్‌ల్లో ఏకంగా 9 మ్యాచ్‌ల్లో తన జట్టును గెలిపించలేకపోయాడు. భారత టీ20 కెప్టెన్‌గా కెరీర్ ప్రారంభించడానికి ముందు అతడు ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ ఎడిషన్‌లో శ్రేయస్ తన చివరి 7 మ్యాచ్‌ల్లో ఏకంగా ఆరింట తన జట్టును పరాజయాలబాట పట్టించాడు. ఆ ఒక్క గెలుపు చివరి లీగ్ మ్యాచ్‌లో వచ్చింది.ఈ లెక్కన శ్రేయస్ తన చివరి 11 ఐపీఎల్, అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో కేవలం ఒకే ఒక విజయం సాధించాడు. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. కెప్టెన్‌గా ఘనమైన ట్రాక్ రికార్డు ఉందన్న కారణంగా టీమిండియా కెప్టెన్సీ దక్కించుకున్న శ్రేయస్ ఇలాంటి చెత్త ప్రదర్శనలు చేస్తుండటం అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తుంది. భారత కెప్టెన్‌గా ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన శ్రేయస్ ఖాతా కూడా తెరవలేకపోవడం ఫ్యాన్స్‌ను విస్మయానికి గురి చేస్తుంది.శ్రేయస్ తాజా ఓటమి విషయానికొస్తే.. ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో భారత్ 4 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. అభిషేక్ శర్మ (43), ఇషాన్ కిషన్ (49), శ్రేయస్ అయ్యర్ (37), తిలక్ వర్మ (24 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌తో టీమిండియా అరంగేట్రం చేసిన చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ రెండు సిక్సర్లు బాదినా, 14 పరుగులకే పరిమితమై నిరాశపరిచాడు.అనంతరం 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ.. జేకబ్ బేతెల్ (78 నాటౌట్) చెలరేగి ఆడి అద్భుత విజయాన్నందించాడు. అతడికి కెప్టెన్ హ్యారీ బ్రూక్ (39), టామ్ బాంటన్ (39) సహకరించారు. ఓ దశలో ఇంగ్లండ్ గెలుపుపై ఆశలు వదులుకున్నప్పటికీ.. రవి బిష్ణోయ్ వేసిన ఓ ఓవర్ ఆ జట్టును గెలుపు ట్రాక్ ఎక్కించింది. ఇన్నింగ్స్ 17వ ఓవర్లో బిష్ణోయ్ ఏకంగా 29 పరుగులు సమర్పించుకొని టీమిండియా కొంపముంచాడు. ఆతర్వాత ఒత్తిడి తగ్గడంతో ఇంగ్లండ్ మరో ఓవర్ మిగిలుండగానే 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో టీ20 నాటింగ్హమ్ వేదికగా జులై 7న జరుగనుంది. -
టాస్ గెలిచిన టీమిండియా: అతడిపై వేటు.. వైభవ్ అరంగేట్రం
ఇంగ్లండ్‌తో రెండో టీ20లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌తో భారత చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఓపెనర్‌గా సంజూ శాంసన్ స్థానాన్ని పదిహేనేళ్ల వైభవ్ భర్తీ చేశాడు.టాస్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. ‘‘మేము ఈసారి కూడా తొలుత బ్యాటింగ్ చేస్తాం. మా తుదిజట్టులో ఒక మార్పు. సంజూ స్థానంలో వైభవ్ ఆడతాడు. గత రెండు నెలలుగా అతడు అద్భుతంగా ఆడుతున్నాడు.అత్యుత్తమ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. అతడు ఒత్తిడికి లోనుకాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిలకడగా ఆడగలడు’’ అని వైభవ్ సూర్యవంశీపై ప్రశంసలు కురిపించాడు. కాగా 15 ఏళ్ల 99 రోజుల వయసులో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన వైభవ్.. అత్యంత పిన్న వయసులో అరంగేట్రం చేసిన భారత క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. మరోవైపు.. గత మూడు మ్యాచ్‌లలో విఫలమైన సంజూ (5, 0, 1)పై యాజమాన్యం వేటు వేసింది.తుదిజట్లుటీమిండియావైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివం దూబే, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, రవి బిష్ణోయి, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.ఇంగ్లండ్ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జేకబ్ బెతెల్, టామ్ బాంటన్, సామ్ కర్రాన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, ఆదిల్ రషీద్, జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్.చదవండి: శ్రీలంకతో వన్డే.. భారత్ ఘన విజయం -
టీం ఇండియా ఊపిరి పీల్చుకో.. బుడ్డాడు వస్తున్నాడు
-
‘నిన్ను ఆడించడం కుదరదని అతడికి చెప్పేయండి’
భారత క్రికెట్ వర్గాల్లో ఎక్కడ చూసినా వైభవ్ సూర్యవంశీ గురించే చర్చ. ఈ చిచ్చరపిడుగును వీలైనంత త్వరగా టీమిండియాకు ఆడించాలని మాజీ క్రికెటర్లు, అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. అయితే, యాజమాన్యం మాత్రం వైభవ్‌ను బెంచ్‌కే పరిమితం చేస్తూ వస్తోంది.వాళ్లు విఫలమవుతున్నా..ఐర్లాండ్ పర్యటనలోనే వైభవ్ (Vaibhav Suryavanshi) అరంగేట్రం చేస్తాడని అంతా భావించారు. కానీ రెండు మ్యాచ్‌లలోనూ ఈ లెఫ్టాండర్ బ్యాటర్‌కు మొండిచేయే ఎదురైంది. ఇక ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా తొలి టీ20లోనూ పదిహేనేళ్ల ఈ పిల్లాడిని పక్కనపెట్టేశారు. మరోవైపు.. టాపార్డర్‌లో ఓపెనర్ సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ వరుసగా విఫలమవుతున్నారు.ఇలాంటి తరుణంలో వైభవ్ సూర్యవంశీని ఆడిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అతడిని కావాలనే పక్కనపెడుతున్నారనే విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ పార్థివ్ పటేల్ కీలక వ్యాఖ్యలు చేశాడు.అతడితో జాగ్రత్తగా వ్యవహరించాలిస్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ‘‘ఇంగ్లండ్ సిరీస్‌లో ఏదో ఒక మ్యాచ్‌లో వైభవ్‌కు కచ్చితంగా ఆడే అవకాశం వస్తుందని నేను నమ్ముతున్నాను. అయితే, ప్రస్తుతానికి కోచింగ్ సిబ్బంది అతడికి సరైన రీతిలో కమ్యూనికేట్ చేయాలి. నిరాశ చెందిన బ్యాటర్‌కు.. ‘నువ్వు రేసులోనే ఉన్నావు’ అనే విషయాన్ని తెలియజేయాలి.ఇలా చేయడం ద్వారా అతడిలో సానుకూల దృక్పథం పెరుగుతుంది. ఒకవేళ అతడిని ఆడించడం కుదురలేదంటే.. ఆ నిజాన్ని కూడా నేరుగా అతడితోనే చెప్పాలి. వైభవ్ పదిహేనేళ్ల పిల్లాడు. అతడితో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.తను నిరాశ చెందకుండా చూసుకోవాలి. తుదిజట్టులో స్థానం కోసం ఓపికతో ఎదురుచూడాల్సి ఉంటుందని సానుకూలంగా తెలియజెప్పాలి. అప్పుడే అతడి మనసు కాస్త స్థిమితంగా ఉంటుంది’’ అని పార్థివ్ పటేల్ పేర్కొన్నాడు.ఇప్పుడు వైభవ్‌ను ఆడించడం కుదరదుఅదే విధంగా.. ‘‘సంజూ శాంసన్ ప్రపంచకప్ టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. ఇషాన్ కిషన్ ప్రస్తుతం టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా ఉన్నాడు. అభిషేక్ శర్మ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇలాంటి తరుణంలో కచ్చితంగా వైభవ్‌కు టాపార్డర్‌లో చోటు ఉండదు. ఇదే విషయాన్ని అతడికి అర్థమయ్యేలా చెప్పాలి’’ అని హెడ్‌కోచ్ గౌతం గంభీర్ నేతృత్వంలోని కోచింగ్ సిబ్బందికి పార్థివ్ పటేల్ విజ్ఞప్తి చేశాడు. కాగా భారత్- ఇంగ్లండ్ మధ్య తొలి టీ20 వర్షం వల్ల రద్దు కాగా.. ఇరుజట్ల మధ్య శనివారం రెండో మ్యాచ్ జరుగనుంది. ఇందుకు మాంచెస్టర్ వేదిక.చదవండి: తుదిజట్టులో దక్కని చోటు.. వైభవ్ పోస్ట్ వైరల్! -
అరంగేట్రంపై హింట్ ఇచ్చిన వైభవ్ సూర్యవంశీ
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రానికి ఎట్టకేలకు సమయం ఆసన్నమైనట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్‌తో శనివారం (జులై 4) జరగనున్న రెండో టీ20లో వైభవ్‌కు తుది జట్టులో అవకాశం దక్కడం ఖాయంగా కనిపిస్తుంది.వైభవ్ తన అంతర్జాతీయ అరంగేట్రం విషయాన్ని సోషల్‌మీడియా వేదికగా పరోక్షంగా వెల్లడించాడు. రెండో టీ20కి ముందు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో "New Chapter" అంటూ పోస్ట్ చేసి అరంగేట్రంపై పరోక్ష సంకేతాన్నిచ్చాడు. ఈ పోస్ట్ సోషల్‌మీడియాలో వైరలవుతోంది. వాస్తవానికి వైభవ్ టీమిండియా అరంగేట్రం కోసం అభిమానులు గత కొద్ది రోజులుగా వేచి చూస్తున్నారు. ఐర్లాండ్‌తో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో వైభవ్ అరంగేట్రం ఖాయమని అంతా అనుకున్నారు. తీరా చూస్తే రెండో మ్యాచ్‌లోనూ అతడికి తుది జట్టులో అవకాశం దక్కలేదు. ఆతర్వాత ఇంగ్లండ్ సిరీస్ తొలి మ్యాచ్‌లోనూ వైభవ్ ఎంట్రీ కోసం భారత క్రికెట్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూశారు. ఆ మ్యాచ్‌లోనూ అతడిని అవకాశం దక్కలేదు. తాజాగా వైభవ్ స్వయంగా తన అరంగేట్రంపై హింట్ ఇవ్వడంతో అభిమానులంతా ఈ రోజు మ్యాచ్‌లో అతడి మెరుపుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇదిలా ఉంటే, వైభవ్ అరంగేట్రంపై భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. యువ ఆటగాడిని తొందరపడి జట్టులోకి తీసుకురావడంపై జాగ్రత్తగా వ్యవహరించాలని అభిప్రాయపడ్డాడు. ప్రపంచ టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్-2 బ్యాటర్‌గా ఉన్న అభిషేక్ శర్మ, టీ20 ప్రపంచకప్‌లో 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలిచిన సంజూ శాంసన్ వంటి ఆటగాళ్లను పక్కనపెట్టి వైభవ్‌కు వెంటనే అవకాశం ఇవ్వడం సరైన నిర్ణయం కాదని పేర్కొన్నాడు.వైభవ్‌పై కూడా ఎంతో నమ్మకం ఉందని.. అవకాశం వచ్చినప్పుడు అతడు తప్పకుండా సిద్ధంగా ఉంటాడని అన్నాడు.మరోవైపు సంజూ శాంసన్ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. యూకే పర్యటనలో అతని చివరి మూడు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 5, 0, 1 పరుగులే చేశాడు. ఈ నేపథ్యంలోనే రెండో టీ20లో సంజూకు విశ్రాంతి ఇచ్చి, వైభవ్ సూర్యవంశీకి తొలి అవకాశం ఇవ్వాలని చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. -
భారత్‌తో రెండో టీ20.. ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన! యువ ప్లేయర్‌కు చోటు
మాంచెస్టర్ వేదికగా శనివారం భారత్‌తో జరగనున్న రెండో టీ20 కోసం ఇంగ్లండ్ తమ తుది జట్టును ప్రకటించింది. తొలి టీ20కు విశ్రాంతి తీసుకున్న స్టార్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ తిరిగి ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చాడు. పేసర్లు ల్యూక్ వుడ్, సాకిబ్ మహమూద్ స్థానాల్లో జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్‌లకు తుది జట్టులో చోటు దక్కింది.ఈ మ్యాచ్‌తో జోష్ టంగ్ ఇంగ్లండ్ తరపున టీ20 అరంగేట్రం చేయనున్నాడు. టంగ్ ఇప్పటికే టెస్ట్ జట్టులో రెగ్యులర్ బౌలర్‌గా కొనసాగుతున్నాడు. ఈ రైట్ ఆర్మ్ పేసర్ ఇప్పటివరకు ఇంగ్లండ్ తరపున 12 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. టీ20ల్లో మాత్రం అతడికి పెద్దగా అనుభవం లేదు. ఇప్పటివరకు కేవలం 21 టీ20లు మాత్రమే ఆడాడు. అతడి పేరిట 29 టీ20 వికెట్లు ఉన్నాయి.సాకిబ్పై వేటుకాగా తొలి మ్యాచ్‌లో సాకిబ్ మహమూద్ 33 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టినప్పటికి.. ఆర్చర్ కోసం అతన్ని పక్కన పెట్టడం గమనార్హం. 2026 టీ20 ప్రపంచకప్ తర్వాత ఆర్చర్‌కు ఇదే మొదటి అంతర్జాతీయ టీ20 మ్యాచ్. కచ్చితంగా పవర్‌ప్లేలో అతడి నుంచి భారత బ్యాటర్లకు కఠిన సవాల్ ఎదురు కానుంది.ఇంగ్లండ్ తుది జట్టుఫిల్ సాల్ట్, జోస్ బట్లర్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కరన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, జోష్ టంగ్. -
IND vs ENG: ఇంగ్లండ్ కెప్టెన్‌పై మాజీ క్రికెటర్ ఫైర్!
ఇంగ్లండ్‌తో తొలి టీ20లో టీమిండియా ఆదిలో తడబడినా మెరుగైన స్కోరు సాధించింది. చెస్టర్ లీ స్ట్రీట్ వేదికగా బుధవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఓపెనర్లలో సంజూ శాంసన్ (1) మరోసారి విఫలం కాగా.. అభిషేక్ శర్మ మెరుపు హాఫ్ సెంచరీ (24 బంతుల్లో 59) సాధించాడు.21 బంతుల్లో 42వన్‌డౌన్‌లో వచ్చిన ఇషాన్ కిషన్ డకౌట్ కాగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అర్ధ శతకం (47 బంతుల్లో 68)తో రాణించి.. అభిషేక్‌తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. మిగిలిన వారిలో ఆల్‌రౌండర్ శివం దూబే దూకుడుగా ఆడాడు. కేవలం 21 బంతుల్లోనే రెండు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 42 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఫలితంగా భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేయగలిగింది. ఈ నేపథ్యంలో భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ పార్థివ్ పటేల్ శివం దూబేపై ప్రశంసలు కురిపించాడు. టీమిండియా ఫినిషర్‌గా దూబే నిలకడగా రాణిస్తున్నాడని కొనియాడాడు.SHIVAM DUBE HAS 69 FOURS & 68 SIXES IN JUST 51 INNINGS 🥶🔥- A T20 machine for India, Dube.pic.twitter.com/XOop15dsiS— Johns. (@CricCrazyJohns) July 2, 2026అదే సమయంలో దూబే విషయంలో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ అనుసరించిన వ్యూహాలను పార్థివ్ పటేల్ విమర్శించాడు. స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ‘‘మ్యాచ్ స్వరూపాన్ని మార్చడానికి ఒక్క ఆటగాడు చాలు. టీమిండియా ఫినిషర్‌గా దూబే గత కొన్నాళ్లుగా ఇదే పని చేస్తున్నాడు. అతడు తన పాత్రను చక్కగా పోషించాడు.ఇంగ్లండ్ వ్యూహం చెత్తగా ఉందికానీ ఇంగ్లండ్ వ్యూహమే చెత్తగా ఉంది. శివం దూబే బ్యాటింగ్‌కు వచ్చాడని తెలిసీ.. వాళ్లు స్పిన్నర్ లియామ్ డాసన్‌కు బంతిని ఇచ్చారు. ఇక 19వ ఓవర్లో కూడా స్పిన్నర్‌తోనే బౌలింగ్ వేయించారు. ఇదేమన్నా రాకెట్ సైన్సా?శివం దూబే స్పిన్నర్ల బౌలింగ్‌లో చితక్కొడతాడన్న విషయం కూడా తెలియదా? ఐపీఎల్ చూస్తేనైనా ఈ విషయం అర్థం కావాలి. లేదంటే అంతర్జాతీయ మ్యాచ్‌లను పరిశీలించినా ఈ విషయం ఇట్టే తెలిసిపోతుంది.స్పిన్ బౌలింగ్‌లో అతడికి ఉన్న రికార్డు గురించి ఆ మాత్రం తెలియదా?.. ఇంగ్లండ్ బౌలర్లకు అతడు చుక్కలు చూపించాడు. చక్కటి (200) స్ట్రైక్‌రేటుతో పరుగులు పిండుకున్నాడు’’ అని పార్థివ్ పటేల్ పేర్కొన్నాడు. కాగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్- ఇంగ్లండ్ మధ్య బుధవారం రాత్రి జరిగిన తొలి టీ20 భారీ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. మొదట టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్లకు 189 పరుగులు చేయగా... ఇంగ్లండ్ బ్యాటింగ్‌కు దిగే అవకాశం ఇవ్వకుండా వర్షం దంచికొట్టింది. దీంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. ఇరు జట్ల మధ్య శనివారం రెండో టీ20 జరగనుంది. ఇందుకు మాంచెస్టర్ వేదిక.చదవండి: IND vs SL: టెస్టు సిరీస్ నుంచి కీలక ప్లేయర్ అవుట్! -
పిచ్ మధ్యలోనే తిట్టుకున్నా SRH ప్లేయర్లు స్టంప్ మైక్ ఆడియో వైరల్
-
నా సేవల్ని సరిగ్గా వాడుకోలేదు.. అందుకే: టీమిండియా స్టార్
టీమిండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్ పర్యటనలో యాజమాన్యం తన సేవలను సరిగ్గా వాడుకోలేదని ఆరోపించాడు. కాగా గతేడాది టీమిండియా ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆడిన సంగతి తెలిసిందే.ఈ సిరీస్‌తోనే భారత జట్టు కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ తన ప్రయాణం ఆరంభించాడు. గౌతం గంభీర్ మార్గదర్శనంలో ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీని టీమిండియా 2-2తో సమం చేసింది. ఇక ఈ సిరీస్‌లో భాగంగా ముంబైకర్ శార్దూల్ ఠాకూర్ రెండు టెస్టులు ఆడాడు. మొత్తంగా 27 ఓవర్లు బౌలింగ్ చేసి 144 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. లీడ్స్ వేదికగా తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో ఆరు ఓవర్లు వేసిన శార్దూల్.. 38 పరుగులు ఇచ్చి వికెట్ తీయలేకపోయాడు. రెండో ఇన్నింగ్స్‌లో 10 ఓవర్లలో 51 పరుగులు ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది.అదే విధంగా మాంచెస్టర్‌లో నాలుగో టెస్టులో పదకొండు ఓవర్లు వేసిన శార్దూల్ ఠాకూర్ 55 పరుగులు ఇచ్చి వికెట్లు తీయలేకపోయాడు. ఈ మ్యాచ్ డ్రా అయింది. అయితే, ఈ మూడు ఇన్నింగ్స్‌లోనూ శార్దూల్ కంటే మిగతా బౌలర్లు ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేశారు.ఈ విషయాన్ని శార్దూల్ ఠాకూర్ తాజాగా గుర్తుచేసుకున్నాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్ 2026-27 సీజన్ లాంచ్‌లో భాగంగా మాట్లాడుతూ.. ‘‘2024-25 సీజన్లో నేను అద్భుతంగా ఆడాను (తొమ్మిది మ్యాచ్‌లలో కలిపి 35 వికెట్లు). కానీ తగినన్ని మ్యాచ్‌లు ఆడే అవకాశాలు మాత్రం రాలేదు. ఇంగ్లండ్ పర్యటనలో ఉన్నపుడు నా సేవల్ని యాజమాన్యం సరిగ్గా ఉపయోగించుకోలేదు.ఇందులో నా తప్పు కూడా ఉంది. లీడ్స్ టెస్టులో నేను సరిగ్గా బ్యాటింగ్ చేయలేదు. ఒక్క పరుగుకే అవుటయ్యాను. మాంచెస్టర్‌లో మాత్రం నేను అద్భుతంగా బ్యాటింగ్ చేశాను. తొలి ఇన్నింగ్స్‌లో 41 పరుగులు చేశాను. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 358 పరుగులు చేయగలిగింది. అందులో నా పాత్ర కూడా ఉంది. అయితే, నేను రెండో ఇన్నింగ్స్‌లో సరిగ్గా ఆడలేదు. ఒకవేళ బాగా ఆడి ఉంటే ఫలితం వేరుగా ఉండేదేమో’’ అని శార్దూల్ ఠాకూర్ చెప్పుకొచ్చాడు. -
‘వైభవ్ సూర్యవంశీ ఇప్పుడే వద్దు.. అతడికే నా మద్దతు’
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో సత్తా చాటిన టీమిండియా స్టార్ సంజూ శాంసన్.. ఈ మెగా ఈవెంట్ తర్వాత మాత్రం వరుసగా విఫలమవుతున్నాడు. ఐర్లాండ్ పర్యటనలో రెండు మ్యాచ్‌లలో 5, 0 పరుగులతో పూర్తిగా నిరాశపరిచాడు ఈ ఓపెనింగ్ బ్యాటర్.తాజాగా ఇంగ్లండ్ పర్యటనను కూడా సంజూ (Sanju Samson) పేలవ ప్రదర్శనతో ఆరంభించాడు. చెస్టర్ లీ స్ట్రీట్ వేదికగా బుధవారం నాటి మ్యాచ్‌లో ఏడు బంతులు ఎదుర్కొని కేవలం ఒకే ఒక్క పరుగు చేసి నిష్క్రమించాడు.అతడిని తప్పించండిఇలా వరుసగా గత మూడు మ్యాచ్‌లలో సంజూ శాంసన్ విఫలమైన నేపథ్యంలో అతడిని తుదిజట్టు నుంచి తొలగించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. సంజూకు బదులు చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi)ని అభిషేక్ శర్మకు ఓపెనింగ్ జోడీగా పంపాలని పలువురు మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ మాత్రం భిన్నంగా స్పందించాడు. వైభవ్ సూర్యవంశీ విషయంలో తొందరపాటు తగదని.. సంజూ- అభిషేక్‌నే ఓపెనింగ్ జోడీగా కొనసాగించాలని అభిప్రాయపడ్డాడు.సంజూకే నా మద్దతు.. క్రిక్‌బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘సంజూ శాంసన్ మరోసారి విఫలమైన మాట వాస్తవమే. గత మూడు ఇన్నింగ్స్‌లో అతడు దారుణ ప్రదర్శన కనబరిచాడు. దీంతో వైభవ్ సూర్యవంశీకి మద్దతు మరింతగా పెరుగుతోంది. అయితే, నా అభిప్రాయం ప్రకారం.. సంజూ శాంసన్ ఓపెనర్‌గా సరైనోడే.ప్రపంచకప్ టోర్నీలో తీవ్రమైన ఒత్తిడిలోనూ అతడు రాణించి.. జట్టును గెలిపించాడు. చాలా మంది వైభవ్ ఇంకెప్పుడు ఆడతాడంటూ చర్చోపర్చలు చేస్తున్నారు. వారి ఆవేదన, ఆలోచనలను నేను అర్థం చేసుకోగలను. వైభవ్ ఆ హక్కు సంపాదించుకోవాలికానీ నేను ఇప్పటికీ సంజూ శాంసన్‌కే మద్దతు ప్రకటిస్తాను. ప్రపంచకప్ టోర్నీలో అతడు రాణించిన తీరు అద్భుతం. అలా అని నేనేమీ వైభవ్‌కు వ్యతిరేకం కాదు. అయితే, వైభవ్ తుదిజట్టులో చోటు దక్కించుకునే హక్కును సంపాదించుకోవాలి. అంతర్జాతీయ క్రికెట్లోనూ ఈ పిల్లాడు అద్భుతంగా రాణిస్తాడు’’ అని దినేశ్ కార్తిక్ పేర్కొన్నాడు. కాగా ప్రపంచకప్-2026 నాకౌట్ మ్యాచ్‌లలో సంజూ 97*, 89, 89 పరుగులతో దుమ్ములేపాడు. తద్వారా భారత్ చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు అందుకున్నాడు. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్- భారత్ మధ్య తొలి టీ20 వర్షం వల్ల రద్దైపోయింది.చదవండి: IND vs ENG: ఇషాన్ రనౌట్.. తప్పు నీదే! -
IND vs ENG: నువ్వసలు ఏం చేస్తున్నావు?.. తప్పు నీదే!
ఇంగ్లండ్‌తో తొలి టీ20లో టీమిండియా స్టార్ ఇషాన్ కిషన్ పూర్తిగా విఫలమయ్యాడు. తన తొందరపాటు చర్యతో మూల్యం చెల్లించుకున్నాడు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ ఇషాన్ కిషన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.అసలేం జరిగిందంటే.. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా టీమిండియా బుధవారం తొలి టీ20 ఆడింది. చెస్టర్ లీ స్ట్రీట్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లలో సంజూ శాంసన్ (1) వైఫల్యాల పరంపర కొనసాగించగా.. అభిషేక్ శర్మ మెరుపు అర్ధ శతకం (24 బంతుల్లో 59) సాధించాడు.నువ్వసలు ఏం చేస్తున్నావు?ఇక వన్‌డౌన్‌లో వచ్చిన ఇషాన్ కిషన్ రెండు బంతులు ఎదుర్కొని డకౌట్‌గా వెనుదిరిగాడు. భారత ఇన్నింగ్స్ రెండో ఓవర్లో సకీబ్ మహ్మూద్ బౌలింగ్‌లో షాట్ ఆడేందుకు ప్రయత్నించి విఫలమైన ఇషాన్.. అక్కడ పరుగుకు ఆస్కారం లేకున్నా సింగిల్ కోసం పరిగెత్తాడు.మరో ఎండ్‌లో ఉన్న అభిషేక్ శర్మ బంతిని గమనించి సింగిల్‌కు అవకాశం లేదని అక్కడే ఉండిపోయాడు. ‘‘నువ్వసలు ఏం చేస్తున్నావు?’’ అంటూ ఒకింత అసహనంతో ఇషాన్‌ను హెచ్చరించాడు కూడా!.. దీంతో ఇషాన్ క్రీజులోకి చేరుకునేందుకు డైవ్ కూడా చేశాడు.A costly mix-up in the middle. 🫣Moments after the run-out: Abhishek Sharma and Ishan Kishan share a brief conversation.#ENGvIND 1st T20I 👉 Streaming LIVE on JioHotstar! pic.twitter.com/1kagvrBjV9— Star Sports (@StarSportsIndia) July 1, 2026కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఫీల్డర్ నుంచి బంతిని అందుకున్న ఇంగ్లండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ వికెట్లను గిరాటేయడంతో ఇషాన్ కిషన్ పరుగుల ఖాతా తెరవకుండానే రనౌట్‌గా వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలో ఇషాన్- అభిషేక్‌లలో తప్పెవరిది అన్న చర్చ జరుగుతుండగా.. సునిల్ గావస్కర్ అభిషేక్‌కు మద్దతుగా నిలిచాడు.ఇందుకు పూర్తి బాధ్యుడు అతడే‘‘వీలైనంత త్వరగా క్రీజులోకి చేరుకోవాల్సింది. ముఖ్యంగా ఈ ఫార్మాట్లో అన్నీ క్షణాల్లో జరిగిపోతాయి. ఇందులో అభిషేక్ శర్మ తప్పేమీ లేదు. ఇది ఇషాన్ కిషన్ స్వీయ తప్పిదం. ఇందుకు పూర్తి బాధ్యుడు అతడే’’ అని గావస్కర్ తీవ్ర స్థాయిలో ఇషాన్‌ను విమర్శించాడు.కాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఇషాన్ కిషన్ బుధవారమే నంబర్‌వన్ స్థానానికి చేరుకున్నాడు. ఇప్పటి వరకు రెండో ర్యాంక్‌లో ఉన్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. ఒక స్థానం మెరుగుపర్చుకొని 876 పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను అందుకున్నాడు. ఈ క్రమంలో ఇప్పటి వరకు నంబర్‌వన్‌గా ఉన్న ఇషాన్ సహచరుడు అభిషేక్ శర్మ (869) రెండో స్థానానికి పడిపోయాడు.గంటల్లోనే హీరో నుంచి జీరోగా..అయితే, నంబర్ వన్‌గా ఎదిగిన కొన్ని గంటల్లోనే ఇషాన్ కిషన్ ఇలా ‘జీరో’ స్కోరుతో పెవిలియన్ చేరడం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్- టీమిండియా మధ్య తొలి టీ20 వర్షం వల్ల రద్దైపోయింది. ఈ మ్యాచ్‌లో అభిషేక్‌తో పాటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (47 బంతుల్లో 68), శివం దూబే (21 బంతుల్లో 42 నాటౌట్) రాణించారు.చదవండి: కోహ్లి రికార్డు బద్దలు కొట్టిన శ్రేయస్Another Disappointing start for Team India.Sanju Samson again fails to score.Followed by a run out of in-form Ishan Kishan.Not the Start we imagined.#ENGvINDpic.twitter.com/y9H3qfFIh7— TheFakeFakeer (@TheFakeFakeer) July 1, 2026 -
కోహ్లి రికార్డు బద్దలు కొట్టిన శ్రేయస్ అయ్యర్
భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి టీ20 మ్యాచ్ వర్షార్పణమైనప్పటికీ టీమిండియా ఆటగాళ్లు మాత్రం పలు రికార్డులు తమ పేరిట లిఖించుకున్నారు. ఇప్పటికే అభిషేక్ శర్మ ఫాస్టెస్ట్ ఫిఫ్టీతో అరుదైన ఫీట్ సాధించగా, తాజాగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఏకంగా చేజింగ్ మాస్టర్ విరాట్ కోహ్లి రికార్డును బద్దలుకొట్టాడు. విషయంలోకి వెళితే.. ఇంగ్లండ్‌తో తొలి టీ20లో అయ్యర్ 47 బంతుల్లో 68 పరుగులతో రాణించాడు. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో విఫలమైన శ్రేయస్ ఇంగ్లండ్ గడ్డపై మాత్రం బ్యాట్ ఝలిపించాడు. ఈ క్రమంలో 37 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లు కలిపి 5వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. టీమిండియా తరఫున 5వేల పరుగులు పూర్తి చేసుకున్న 29వ బ్యాటర్‌గా అయ్యర్ నిలిచాడు. 147 ఇన్నింగ్స్‌ల్లో (అన్ని ఫార్మాట్లు) అయ్యర్ ఈ ఫీట్ అందుకున్నాడు. ఇందులో ఆరు సెంచరీలు, 37 అర్ధసెంచరీలున్నాయి. ఇక తొలి టీ20లో హాఫ్ సెంచరీ సాధించిన అయ్యర్ ఇంగ్లండ్ గడ్డపై కెప్టెన్‌గా ఫిఫ్టీ సాధించిన తొలి ఆటగాడిగా అయ్యర్ నిలిచాడు. గతంలో టీ20 కెప్టెన్‌గా కోహ్లి చేసిన 47 పరుగులే అత్యుత్తమంగా ఉండేది. 8 ఏళ్ల తర్వాత కోహ్లి రికార్డును అయ్యర్ బద్దలు కొట్టాడు. అంతేకాదు టీ20 కెరీర్లో శ్రేయస్ అయ్యర్‌కు ఇది మూడో అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ అభిషేక్ శర్మ (59), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (47 బంతుల్లో 68) అర్ధసెంచరీలతో రాణించారు. ఆఖర్లో శివమ్ దూబే (21 బంతుల్లో 42 నాటౌట్) పవర్‌హిట్టింగ్‌తో టీమిండియా భారీ స్కోరు చేయగలిగింది. ఇంగ్లండ్ బౌలర్లలో సాకిబ్ మహ్మూద్ 3 వికెట్లు తీయగా, ఆదిల్ రషీద్, సామ్ కరన్‌లు చెరో వికెట్ పడగొట్టారు. -
వర్షం కారణంగా తొలి టీ20 రద్దు.. భారత్‌కు అచ్చిరాని వేదిక
చెస్టర్-లీ-స్ట్రీట్ వేదికగా ఇంగ్లండ్, భారత్ మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్‌ను వర్షం కారణంగా రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. టీమిండియా ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం జోరందుకున్న వర్షం ఎంతకీ తెరిపినివ్వకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు తెలిపారు. అయితే చెస్టర్-లీ-స్ట్రీట్ వేదికగా భారత్ ఆడిన మూడు మ్యాచ్‌లు కూడా వర్షం కారణంగా రద్దవ్వడం ఇక్కడ చెప్పుకోదగ్గ అంశం. ఈ వేదిక టీమిండియాకు అంతగా కలసిరాలేదు. 2002లో తొలిసారి ఈ వేదికలో భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన వన్డే మ్యాచ్ వర్షార్ప ణమైంది. ఆ తర్వాత 2011లో మరోసారి ఇరుజట్ల మధ్య జరిగిన వన్డే మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయ్యింది. తాజాగా మూడోసారి అదే ఫలితం పునరావృతం కావడం గమనార్హం. ఇక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ అభిషేక్ శర్మ (59), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (47 బంతుల్లో 68) అర్ధసెంచరీలతో రాణించారు. ఆఖర్లో శివమ్ దూబే (21 బంతుల్లో 42 నాటౌట్) పవర్‌హిట్టింగ్‌తో టీమిండియా భారీ స్కోరు చేయగలిగింది. ఇంగ్లండ్ బౌలర్లలో సాకిబ్ మహ్మూద్ 3 వికెట్లు తీయగా, ఆదిల్ రషీద్, సామ్ కరన్‌లు చెరో వికెట్ పడగొట్టారు. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఇరుజట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ మాంచెస్టర్ వేదికగా జరగనుంది.తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ సంజూ శాంసన్ ఒక్క పరుగు చేసి ఔటయ్యాడు. ఆ వెంటనే ఇషాన్ కిషన్ దురదృష్టవశాత్తూ రనౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో భారత్ 6 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో అభిషేక్, శ్రేయస్‌లు కలిసి భారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఈ ఇద్దరు మూడో వికెట్‌కు 82 పరుగులు జోడించిన తర్వాత అభిషేక్ శర్మ వెనుదిరిగాడు. అప్పటివరకు స్లోగా ఆడిన అయ్యర్ వేగం పెంచాడు. ఈ దశలో 38 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. అయితే స్కోరును పెంచే క్రమంలో అయ్యర్ ఔటైనప్పటికీ ఫినిషర్ రోల్‌కు న్యాయం చేస్తూ శివమ్ దూబే సిక్సర్లతో విరుచుకుపడడంతో టీమిండియా 180 పరుగుల మార్క్‌ను దాటింది.The 1st #ENGvIND T20I in Durham has been called off due to rains.Scorecard ▶️ https://t.co/occSMon7Q9#TeamIndia pic.twitter.com/cjIdYQcHUR— BCCI (@BCCI) July 1, 2026 -
ఇంగ్లండ్ గడ్డపై అభిషేక్ అరుదైన రికార్డు
టీమిండియా విధ్వంసక ఓపెనర్ అభిషేక్ శర్మ ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లోనూ తన ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ అభిషేక్ మాత్రం తన బ్యాటింగ్‌లో దూకుడు కొనసాగించాడు. తద్వారా 20 బంతుల్లోనే అర్ధశతకం మార్క్ అందుకున్న అభిషేక్ శర్మ ఇంగ్లండ్ గడ్డపై అరుదైన ఫీట్ సాధించాడు. ఇంగ్లండ్ గడ్డపై టీ20ల్లో టీమిండియా తరఫున తక్కువ బంతుల్లో ఫిఫ్టీ సాధించిన ఆటగాడిగా అభిషేక్ నిలిచాడు. గతంలో కేఎల్ రాహుల్ 2018లో మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టీ20లో 27 బంతుల్లో ఫిఫ్టీ సాధించడమే ఇప్పటివరకు రికార్డుగా ఉంది. తాజాగా అభిషేక్ కేఎల్ రాహుల్ రికార్డును బద్దలు కొట్టాడు. దీంతో పాటు అభిషేక్ ఖాతాలో మరో అరుదైన రికార్డు కూడా వచ్చి చేరింది. టీ20 క్రికెట్లో అభిషేక్ శర్మ వంద సిక్సర్లు పూర్తి చేసుకున్నాడు. అభిషేక్ కంటే ముందు టీమిండియా తరఫున రోహిత్ శర్మ (205 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (179 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (126 సిక్సర్లు), విరాట్ కోహ్లీ (124 సిక్సర్లు) ఉన్నారు. అయితే టీమిండియా తరఫున టీ20ల్లో వంద సిక్సర్లు కొట్టిన తొలి లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్‌గా అభిషేక్ శర్మ నిలిచాడు. 49 మ్యాచ్‌ల్లోనే అభిషేక్ వంద సిక్సర్లు పూర్తి చేసుకోవడం మరో విశేషం. ఇక అభిషేక్ శర్మకు టీ20ల్లో 48 ఇన్నింగ్స్‌ల్లో ఇది పదకొండో ఫిఫ్టీ కావడం గమనార్హం. Milestone unlocked 🔓1️⃣0️⃣0️⃣ T20I sixes and counting for the power-packed Abhishek Sharma 👏Updates ▶️ https://t.co/occSMon7Q9#TeamIndia | #ENGvIND | @OfficialAbhi04 pic.twitter.com/lAohcmYvOG— BCCI (@BCCI) July 1, 2026 -
నాకు సూర్య అవన్నీ చెప్పాడు: శ్రేయస్ అయ్యర్
టీమిండియా టీ20 కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్‌కు తొలి ప్రయత్నంలోనే చేదు అనుభవం ఎదురైంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారత జట్టు పసికూన ఐర్లాండ్ చేతిలో 2-0తో వైట్‌వాష్ అయింది. దీంతో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌తో పాటు.. హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌పైనా విమర్శల వర్షం కురుస్తోంది.ఇక ఐర్లాండ్ పర్యటన ముగించుకున్న టీమిండియా ఇంగ్లండ్‌లో అడుగుపెట్టింది. ఇరుజట్ల మధ్య బుధవారం నుంచి టీ20 సిరీస్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన శ్రేయస్ అయ్యర్‌కు.. మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గురించి ప్రశ్న ఎదురైంది.సూర్య నాతో మాట్లాడాడుఇందుకు బదులిస్తూ.. ‘‘సూర్యకుమార్ యాదవ్, నేనూ దాదాపుగా ఒకేలా ఆలోచిస్తాము. దేశవాళీ క్రికెట్లో అతడితో కలిసి చాలా ఏళ్లు ఆడాను. ఇక్కడికి వచ్చేముందు కూడా సూర్య నాతో మాట్లాడాడు.యాజమాన్యం ఎలా పనిచేస్తుంది.. వివిధ సందర్భాల్లో ఆటగాళ్లు ఎలా స్పందిస్తారు.. వారి ఆలోచనలు ఏవిధంగా ఉంటాయన్న అంశాలపై నాకు ఇన్పుట్స్ ఇచ్చాడు. మా మధ్య సంభాషణ అర్థవంతంగా సాగింది. అతడి నుంచి నేర్చుకోవాల్సి చాలానే ఉంది’’ అని శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నాడు.అనూహ్య రీతిలో వేటు కాగా ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ టోర్నీలో భారత్‌ను చాంపియన్‌గా నిలిపిన సూర్యకుమార్ యాదవ్‌పై యాజమాన్యం అనూహ్య రీతిలో వేటు వేసింది. కెప్టెన్‌గా రాణించినా బ్యాటర్‌గా విఫలం కావడమే ఇందుకు ప్రధాన కారణం. అయితే, సూర్యకు ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా మరొక్క అవకాశం ఇస్తారని భావించినా.. యాజమాన్యం మాత్రం అతడిని సారథ్య బాధ్యతల నుంచే కాకుండా.. జట్టు నుంచీ తొలగిస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది.చదవండి: IND vs ENG: షెడ్యూల్, జట్లు.. టైమింగ్స్.. పూర్తి వివరాలు -
బౌలర్లను ఉతికారేసిన వైభవ్ సూర్యవంశీ.. వీడియో వైరల్
భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సమయం అసన్నమైంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టీ20 బుధవారం డర్హమ్ వేదికగా జరనగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు మరోసారి యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ గురుంచి క్రికెట్ వర్గాల్లో చర్చనడుస్తోంది. ఈ 15 ఏళ్ల చిచ్చరపిడుగు సీనియర్ జట్టు తరపున అరంగేట్రం చేస్తాడా లేదా అన్నదే ఇప్పుడు అతి పెద్ద ప్రశ్నగా మారింది. ఐర్లాండ్‌తో సిరీస్‌కు ఎంపికైనప్పటికి వైభవ్‌కు మాత్రం డెబ్యూ చేసే అవకాశం లభించలేదు. సంజూ శాంసన్, అభిషేక్ వంటి సీనియర్ ప్లేయర్లు ఉండడంతో వైభవ్‌ను మేనెజ్మెంట్ బెంచ్‌కే పరిమితం చేసింది.ఈ క్రమంలో హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌లపై చాలా మంది మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు. ఐపీఎల్లో దుమ్ములేపిన వైభవ్‌కు ఓ అవకాశం ఇవ్వాలని మేనెజ్మెంట్ను సూచించారు. కానీ ఇంగ్లండ్ టూర్లో కూడా వైభవ్ అరంగేట్రం చేసే అవకాశాలు కనిపించడం లేదు.Vaibhav Suryavanshi is taking out his frustration from the Ireland T20 series loss in the nets at Durham.😭🔥 pic.twitter.com/80T3ovtnRY— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) June 30, 2026సీనియర్లకు తమ మద్దతు ఉంటుందని కెప్టెన్ అయ్యర్ మరోసారి స్పష్టం చేశాడు. ఏదేమైనప్పటికి వైభవ్ మాత్రం తన ప్రాక్టీస్‌ను ఆపడం లేదు. తొలి టీ20కు ముందు జరిగిన నెట్ ప్రాక్టీస్ సెషన్లో భారత బౌలర్లపై వైభవ్ విరుచుకుపడ్డాడు. ప్రసిద్ద్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, అర్ష్‌దీప్ సింగ్ వంటి సీనియర్ పేసర్లను సూర్యవంశీ సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.తుది జట్లుభారత్(అంచనా): అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, వరుణ్ చక్రవర్తిఇంగ్లండ్: ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కర్రన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, ఆదిల్ రషీద్, ల్యూక్ వుడ్, సాకిబ్ మహమూద్చదవండి: మ్యాచ్ రద్దయినా రూ.8 లక్షలు ఫిక్స్! అంపైర్ల సంపాదన ఎంతంటే? -
భారత్‌తో తొలి టీ20.. ఇంగ్లండ్ తుది జట్టు ఇదే
ఐర్లాండ్ చేతిలో దారుణ సిరీస్ ఓటమి అనంతరం టీమిండియా ఇంగ్లండ్ గడ్డపై ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో బుధవారం ఇంగ్లండ్, టీమిండియా మధ్య తొలి టీ20 జరగనుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సోమవారం రాత్రి తొలి టీ20 మ్యాచ్‌లో ఆడే ప్లేయింగ్ ఎలెవెన్ జట్టును ప్రకటించింది.అయితే టీమిండియాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ఇంగ్లండ్ బోర్డు 17 మందితో కూడిన సభ్యుల బృందాన్ని ప్రకటించింది. హ్యారీ బ్రూక్ జట్టును నడిపించనుండగా, జాస్ బట్లర్ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. బట్లర్‌తో పాటు సీనియర్లు సామ్ కరన్, ఆదిల్ రషీద్‌తో పాటు టీ20 సంచలన ఆటగాళ్లు జాకనబ్ బెథెల్, టామ్ బాంటన్, లియామ్ డాసన్‌లకు అవకాశం కల్పించింది. అయితే స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌కు తొలి టీ20 మ్యాచ్‌కు విశ్రాంతి ఇచ్చినట్లు బోర్డు తెలిపింది. అయితే ఆర్చర్‌కు ఎందుకు రెస్ట్ ఇచ్చారనే దానిపై మాత్రం ఈసీబీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఇటీవలే న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆర్చర్ నాలుగు ఇన్నింగ్స్‌లు కలిపి 11 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 2026 సీజన్లోనూ రాజస్తాన్ రాయల్స్ తరఫున ఆడిన ఆర్చర్ 25 వికెట్లు తీశాడు. అయితే ఐర్లాండ్‌తో సిరీస్‌ను కోల్పోయిన టీమిండియా ఇంగ్లండ్‌తో సిరీస్‌లో దానిని పునరావృతం చేయకూడదనే సంకల్పంతో ఉంది. మరోవైపు ఇంగ్లండ్ మాత్రం ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌లో సెమీస్‌లో టీమిండియా చేతిలో ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయింది. అందుకే సొంతగడ్డపై జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత్‌ను ఓడించి ప్రతీకారం తీర్చుకునేందుకు ఎదురుచూస్తోంది. ఇక భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి టీ20కి చెస్టర్ లె స్ట్రీట్‌లోని రివర్సైడ్ గ్రౌండ్ వేదిక కానుంది.తొలి టీ20కి ఇంగ్లండ్ తుది జట్టు:ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కర్రన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, సాకిబ్ మహమూద్, ఆదిల్ రషీద్, ల్యూక్ వుడ్.Our XI is IN! 🦁Click below to see our team for our series opener with India...— England Cricket (@englandcricket) June 30, 2026 -
డ్రెస్సింగ్ రూమ్‌లోకి వైభవ్‌కు నో ఎంట్రీ
వండర్‌కిడ్ వైభవ్ సూర్యవంశీ టీమిండియాకు ఎంపికైనా, అతడికి జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లోకి మాత్రం ప్రవేశం లేదు. ఎందుకంటే, ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ), అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అమలు చేస్తున్న బాలల భద్రతా నిబంధనల ప్రకారం, 16 ఏళ్ల లోపు ఆటగాళ్లు పూర్తిస్థాయి పెద్దల డ్రెస్సింగ్ రూమ్‌లను ఉపయోగించకూడదు. ఈ నిబంధనల నేపథ్యంలో 15 ఏళ్ల వైభవ్ కోసం ఈసీబీ ప్రత్యేక డ్రెస్సింగ్ రూమ్ కేటాయించింది.మ్యాచ్‌ల సమయంలో మాత్రం వైభవ్ జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లవచ్చు. సహచర ఆటగాళ్లతో మాట్లాడడం, జట్టు సమావేశాల్లో పాల్గొనడం వంటి విషయాలపై ఎలాంటి ఆంక్షలు లేవు. కానీ మ్యాచ్‌కు ముందు, తర్వాత దుస్తులు మార్చుకోవడం వంటి కార్యక్రమాల కోసం తప్పనిసరిగా ప్రత్యేక గదినే ఉపయోగించాల్సి ఉంటుంది. ఈసీబీ ఇందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తి చేసినట్లు సమాచారం.ప్రస్తుతం వైభవ్ ఎదుర్కొంటున్న పరిస్థితినే 15 ఏళ్ల మ్యాక్స్ డౌమన్ అనే స్టార్ ఫుట్‌బాలర్ ఎదుర్కొంటున్నాడు. ఆర్సెనల్ క్లబ్‌కు ఆడే డౌమన్‌కు కూడా వైభవ్‌లాగే ప్రత్యేక నిబంధనలు వర్తిస్తున్నాయి. అతనికి కూడా క్లబ్లో ప్రత్యేక మార్పిడి గది ఏర్పాటు చేశారు.ఇదిలా ఉంటే, ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20 సిరీస్‌ల కోసం వైభవ్ భారత జట్టుతో కలిసి యూకేకు చేరుకున్నాడు. ఈ సిరీస్‌లలో అతడు ఏ మ్యాచ్‌లో బరిలోకి దిగినా, దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన అతి పిన్న వయస్కుడైన భారత అంతర్జాతీయ క్రికెటర్ రికార్డును బద్దలు కొడతాడు.వైభవ్ ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శనలు చేసి టీమిండియాలో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. తాజాగా అతడు శ్రీలంకలో జరిగిన ఏ-జట్ల ట్రై సిరీస్‌లోనూ చెలరేగి ఆడాడు. లంకతో జరిగిన ఫైనల్లో 29 బంతుల్లో 94 పరుగుల తుఫాన్ ఇన్నింగ్స్‌తో భారత జట్టుకు టైటిల్ అందించాడు.ఈ ప్రదర్శన తర్వాత అభిమానులంతా వైభవ్ భారత సీనియర్ జట్టు అరంగేట్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐర్లాండ్‌తో 2 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జూన్ 26, 28 తేదీల్లో జరుగనుంది. అనంతరం జులై 1, 4, 7, 9, 11 తేదీల్లో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ షెడ్యూలైంది.బీసీసీఐ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసిందివైభవ్ యూకే పర్యటన నేపథ్యంలో బీసీసీఐ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వైభవ్ సంరక్షణ, మానసిక సౌకర్యం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని అతడి తల్లిదండ్రులను కూడా యూకే పర్యటనకు అనుమతిచ్చింది. టీమిండియాలో అందరూ పెద్దవారే ఉండటంతో, వైభవ్ కొత్త వాతావరణానికి అలవాటు పడేందుకు కుటుంబ సభ్యుల సాన్నిహిత్యం ఉపయోగపడుతుందని బీసీసీఐ భావించింది. -
ఇంగ్లండ్‌తో వన్డేలకు భారత తుదిజట్టు.. సెంచరీ వీరుడికి నో చాన్స్!
అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి జోష్ మీదున్న టీమిండియా ఇంగ్లండ్ గడ్డపై టీ20లతో పాటు మూడు వన్డేలు కూడా ఆడనుంది. ఇంగ్లండ్ టూర్‌కు ముందు శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టు ఐర్లాండ్‌తో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ విషయం పక్కనబెడితే, ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు కోహ్లి ఆడుతాడా లేదా అనే సందేహం ఉండేది. అయితే ఇటీవలే గాయం నుంచి కోలుకున్న కోహ్లి ఫిట్నెస్ టెస్టులో పాసయ్యాడని తెలిపిన బీసీసీఐ ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో ఆడబోయే టీమిండియా స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ ఎలెవెన్ జట్టుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ తుదిజట్టులో ఇషాన్ కిషన్ చోటు దక్కించుకోలేకపోయాడు. ఆఫ్గన్‌తో జరిగిన రెండో వన్డేలో ఇషాన్ శతకం బాదిన సంగతి తెలిసిందే. అంతకముందు ఐపీఎల్‌లోనూ ఇషాన్ ఎస్ఆర్హెచ్ తరఫున తన బ్యాటింగ్‌తో అలరించిన సంగతి తెలిసిందే.ఇక జట్టు విషయానికొస్తే.. టాపార్డర్‌లో ఓపెనర్లుగా కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌తో పాటు రోహిత్ శర్మ, వన్‌డౌన్‌లో కోహ్లి రానున్నారు. ఆఫ్గన్‌తో వన్డే సిరీస్‌లో కెప్టెన్ గిల్ అదరగొట్టాడు. మూడు వన్డేలు కలిపి 238 పరుగులు చేసిన గిల్ ఖాతాలో ఒక సెంచరీ, హాఫ్ సెంచరీ ఉన్నాయి. మరో బ్యాటర్ రోహిత్ శర్మ తొలి రెండు వన్డేల్లో పెద్దగా రాణించనప్పటికీ మూడో వన్డేలో తనదైన ఇన్నింగ్స్‌తో అలరించాడు. ఆఫ్గన్‌తో సిరీస్‌లో 143 పరుగులు సాధించాడు. ఇక కోహ్లి గాయం కారణంగా ఆఫ్గన్‌తో వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. ఇక మిడిలార్డర్లో వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌తో పాటు ఆల్‌రౌండర్లు నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్‌లను ఎంపిక చేశారు. ఇక వన్డేల్లో ఇప్పటికే తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన అయ్యర్ తనకు అచ్చొచ్చిన నాలుగో స్థానంలోనే బ్యాటింగ్‌కు రానుండగా, కేఎల్ రాహుల్ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు రానున్నాడు. నితీశ్‌కుమార్ రెడ్డి ప్రస్తుతానికి జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ, గాయంతో అతడు ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ ఆడడం అనుమానంగానే ఉంది. ఆల్‌రౌండర్ కోటాలో అక్షర్‌పటేల్ ఏడో స్థానంలో ఆడడం గ్యారంటీ, బౌలింగ్ కోటాలో బుమ్రా, హర్షిత్ రానా, కుల్దీప్ యాదవ్, ప్రసిధ్ క్రిష్ణలకు చోటు కల్పించింది. ఇంగ్లండ్ వన్డేలకు భారత ప్లేయింగ్ ఎలెవన్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్, నితీశ్‌కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ.భారత్ వర్సెస్ ఇంగ్లండ్ వన్డే షెడ్యూల్1వ వన్డే జూలై 14, 2026 (మంగళవారం) ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్ మధ్యాహ్నం 3:302వ వన్డే జూలై 16, 2026 (గురువారం) సోఫియా గార్డెన్స్, కార్డిఫ్ సాయంత్రం 5:303వ వన్డే జూలై 19, 2026 (ఆదివారం) లార్డ్స్, లండన్ మధ్యాహ్నం 3:30Read: నితీశ్‌రెడ్డికి గాయం.. ఇంగ్లండ్ టూర్‌కు దూరం! -
బుమ్రా పునరాగమనం
న్యూఢిల్లీ: పనిభారం నేపథ్యంలో గత కొంతకాలంగా వన్డే క్రికెట్‌కు దూరంగా ఉంటున్న భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు ఎంపికయ్యాడు. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ తర్వాత ఈ ఫార్మాట్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని అతడిని... వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో తిరిగి జట్టుకు ఎంపిక చేశారు. ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా గాయపడి అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు అందుబాటులో లేకపోయిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని కూడా ఇంగ్లండ్ సిరీస్‌కు ఎంపిక చేశారు. అయితే దానికి ముందు అతడు ఫిట్నెస్ నిరూపించుకోవాల్సిన అవసరముంది. వచ్చే నెలలో ఇంగ్లండ్‌తో టీమిండియా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. దాని కోసం బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఆదివారం శుబ్‌మన్ గిల్ సారథ్యంలో... 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. అఫ్గాన్‌తో చివరి వన్డేలో సెంచరీతో చెలరేగినప్పటికీ యశస్వి జైస్వాల్‌కు అవకాశం దక్కలేదు. గాయం నేపథ్యంలో హార్దిక్ పాండ్యా పేరును పరిశీలించలేదు. ఈ పర్యటనలో భాగంగా భారత జట్టు జూలై 14న తొలి వన్డే (ఎడ్జ్‌బాస్టన్), 16న రెండో వన్డే (సోఫీ గార్డెన్స్), 19న మూడో వన్డే (లార్డ్స్) ఆడనుంది. భారత వన్డే జట్టు: గిల్ (కెప్టెన్), రోహిత్, కోహ్లి, శ్రేయస్, రాహుల్, ఇషాన్ కిషన్, సుందర్, అక్షర్, నితీశ్ కుమార్ రెడ్డి, కుల్దీప్, బుమ్రా, ప్రసిధ్, హర్షిత్ రాణా, అర్‡్షదీప్, గుర్నూర్ బ్రార్. -
భారత జట్టు ప్రకటన.. సెంచరీ హీరోకు నో ఛాన్స్
ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. అఫ్గాన్‌తో వన్డేలకు గాయం కారణంగా దూరమైన స్టార్ విరాట్ కోహ్లి తిరిగి జట్టులోకి వచ్చాడు. అతడితో పాటు స్టార్ సేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా పునరాగమనం చేశాడు. విరాట్‌ను ఎంపిక చేసినప్పటికి సిరీస్ ఆరంభానికి ముందు తన ఫిట్నెస్ను నిరూపించుకోవాల్సి ఉంది.ఇక అఫ్గాన్‌తో ఆఖరి వన్డేలో సెంచరీతో సత్తాచాటిన యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్‌కు మాత్రం చోటు దక్కలేదు. తన చివరి మూడు వన్డేలలో రెండు శతకాలు సాధించినప్పటికీ జైస్వాల్‌ను సెలక్టర్లు పక్కన పెట్టారు. జూలై 14 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది.ఇంగ్లండ్‌తో వన్డేల కోసం భారత జట్టుశుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్భారత్ వర్సెస్ ఇంగ్లండ్ వన్డే షెడ్యూల్1వ వన్డే జూలై 14, 2026 (మంగళవారం) ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్ మధ్యాహ్నం 3:302వ వన్డే జూలై 16, 2026 (గురువారం) సోఫియా గార్డెన్స్, కార్డిఫ్ సాయంత్రం 5:303వ వన్డే జూలై 19, 2026 (ఆదివారం) లార్డ్స్, లండన్ మధ్యాహ్నం 3:30చదవండి: వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డు -
ఇంగ్లండ్ సిరీస్‌కు పాండ్యా దూరం.. కోహ్లీ ఆడడంపై ఆరోజే క్లారిటీ!
టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు దూరమైనట్లు తెలుస్తోంది. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న హార్దిక్ పాండ్యా కోలుకోవడానికి మరికొంత సమయం పట్టే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ) శిబిరంలో ఉన్న పాండ్యా అఫ్గానిస్తాన్‌తో సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. అయితే ఇంగ్లండ్ సిరీస్‌కు ఇంకా సమయం ఉండడంతో అప్పటివరకు పాండ్యా కోలుకుంటాడని వార్తలు వచ్చినప్పటికీ, బీసీసీఐ మెడికల్ బృందం మాత్రం పాండ్యా ఇంగ్లండ్ వెళ్లేందుకు సిద్ధంగా లేడని తెలిపింది. ఎందుకంటే రీహాబిలిటేషన్ సెంటర్లో ఉన్న పాండ్యా ఫిట్నెస్ టెస్టులో విఫలమయ్యాడని, అతడు కోలుకునేందుకు మరో నెల రోజులు పట్టే అవకాశముందని సమాచారం. అయితే ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా జూలై 14 నుంచి 19 మధ్య మూడు వన్డేలు ఆడనుంది. ఈ లెక్కన హార్దిక్ టీమిండియాతో జాయిన్ కావడం కష్టమే. ఇక గాయంతో బాధపడుతున్న కోహ్లీ కూడా ఇంగ్లండ్ సిరీస్‌లో ఆడుతాడా లేదా అనేది జూన్ 22న (సోమవారం) తేలనుంది. ఆరోజు కోహ్లికి ఫిట్నెస్ టెస్టు జరగనుంది.అయితే అఫ్గానిస్తాన్, ఇంగ్లండ్ టూర్లకు హార్దిక్ పాండ్యాను ఎంపిక చేస్తూ బీసీసీఐ సెలెక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. వన్డే వరల్డ్‌కప్ రోడ్‌మ్యాప్ ప్రక్రియలో భాగంగా పాండ్యా కీలకం కానున్నాడని అజిత్ అగార్కర్ వెల్లడించాడు. కానీ ఐపీఎల్ 2026 సీజన్ చివర్లో వెన్ను గాయంతో బాధపడ్డ పాండ్యా సీవోఈకి చేరుకున్నాడు. వెన్ను నొప్పి నుంచి తేరుకునే లోపే తొడ కండరాల గాయం కావడంతో ఆఫ్గన్‌తో వన్డే సిరీస్ ప్రారంభానికి ఒక్కరోజు ముందే పాండ్యా ఆడడం లేదని బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది.2027 వన్డే వరల్డ్‌కప్ ఆడేనా?వరుస గాయాలతో సతమతమవుతున్న పాండ్యా వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్‌లో ఆడుతాడా లేదా అన్నది మిస్టరీగా మారింది. టీమిండియా కూడా ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ అనంతరం మళ్లీ సెప్టెంబర్‌లో వెస్టిండీస్ టూర్లో వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. అప్పటికి కోలుకొని పాండ్యా జట్టులోకి వస్తే మంచిదే, కానీ మళ్లీ ఏదైనా గాయం బారిన పడితే మాత్రం వన్డే ప్రపంచకప్‌కు పాండ్యా అందుబాటులో ఉండేది అనుమానమే.Read: నోరు మూసుకున్నందుకు రెడ్‌కార్డ్.. ఫిఫా చరిత్రలోనే తొలిసారి! -
ఉత్కంఠ పోరులో టీమిండియా ఓటమి
మహిళల టీ20 ప్రపంచకప్ 2026 వార్మప్ మ్యాచ్‌ల్లో భాగంగా ఇవాళ (జూన్ 10) జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌పై ఇంగ్లండ్ 5 పరుగుల తేడాతో గెలుపొందింది. చివరివరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా పోరాడి ఓడింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేయగా.. భారత్ 19.5 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటై, లక్ష్యానికి 6 పరుగుల దూరంలో నిలిచిపోయింది.భారత్‌ను గెలిపించేందుకు రిచా ఘోష్ (36 బంతుల్లో 68; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) వీరోచితంగా పోరాడినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. చివరి ఓవర్లో 17 పరుగులు అవసరం కాగా.. శ్రీచరణి తొలి బంతికి సింగిల్ తీసి రిచాకు స్ట్రయిక్ ఇచ్చింది. అప్పటికే జోష్‌లో ఉన్న రిచా.. రెండో బంతిని బౌండరీకి, మూడో బంతిని సిక్సర్‌కు తరలించి భారత్‌ను గెలుపు వాకిటి వరకు చేర్చింది.అయితే తొందరగా మ్యాచ్‌ను ముగిద్దామనే క్రమంలో నాలుగో బంతికి లిండ్సే స్మిత్ బౌలింగ్‌లో స్టంపౌటయ్యింది. అప్పటికీ భారత్‌కు గెలిచే అవకాశం ఉండింది. మిగిలిన రెండు బంతుల్లో ఆరు పరుగులు సాధిస్తే టీమిండియాదే గెలుపు. చేతిలో ఓ వికెట్ ఉండింది. అయితే ఐదో బంతికి రేణుకా సింగ్ కూడా ఔట్ కావడంతో భారత్ ఆలౌటై, మ్యాచ్‌ను చేజార్చుకుంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో యామీ జోన్స్ (64), కెప్టెన నాట్ సీవర్ బ్రంట్ (57) అర్ద సెంచరీలతో రాణించగా.. ఆఖర్లో డేనియెలా గిబ్సన్ (30 నాటౌట్) బ్యాట్‌ను ఝులిపించింది. మిగతా ప్లేయర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో శ్రేయాంక పాటిల్ 2, షఫాలీ, రేణుకా, శ్రీ చరణి, రాధా యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.భారత ఇన్నింగ్స్ విషయానికొస్తే.. రిచా మినహా జట్టులో ఎవరూ కనీసం 20 పరుగుల మార్కును కూడా తాకలేదు. షఫాలీ (13), యస్తికా (15), హర్మన్ (17), భారతి (18), రాధా యాదవ్ (16) రెండంకెల స్కోర్లు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో లిన్సే స్మిత్ 3, డీన్, కోల్మన్, గిబ్సన్ తలో 2, వాంగ్ ఓ వికెట్ పడగొట్టారు.కాగా, ఈ ప్రపంచకప్ రెగ్యులర్ మ్యాచ్‌లు జూర్ 12 నుంచి మొదలవుతాయి. తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్-శ్రీలంక తలపడనున్నాయి. భారత్ జూన్ 14న జరిగే తమ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో తలపడనుంది. -
BCCI: సిరాజ్‌ను తప్పించిన బీసీసీఐ
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు వెళ్లే భారత టీ20 జట్టు నుంచి స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌ను తప్పించింది. ఇందుకు సంబంధించి మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోకాగా టీ20 ప్రపంచకప్-2026లో టీమిండియాను చాంపియన్‌గా నిలిపిన సూర్యకుమార్ యాదవ్‌పై బీసీసీఐ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఫామ్‌లేమితో బాధపడుతున్న సూర్యను తప్పించి.. అతడి స్థానంలో శ్రేయస్ అయ్యర్‌కు పగ్గాలు అప్పగించింది. దాదాపు మూడేళ్ల తర్వాత అతడిని జట్టును ఎంపిక చేయడమే కాకుండా.. కెప్టెన్‌గా నియమించింది.ఇక శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో టీమిండియా జూన్ 26 నుంచి ఐర్లాండ్‌లో పర్యటించనుంది. తొలుత ఐర్లాండ్‌తో రెండు టీ20లు ఆడి.. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. వైభవ్ సూర్యవంశీకి చోటుఇందుకోసం ప్రకటించిన జట్టులో తొలిసారిగా పదిహేనేళ్ల వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కగా.. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చారు. అతడి స్థానంలో మహ్మద్ సిరాజ్ పేస్ దళాన్ని ముందుకు నడిపిస్తాడని యాజమాన్యం తొలుత ప్రకటించింది.అందుకే సిరాజ్‌ను తప్పిస్తు న్నాంతాజాగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు బీసీసీఐ తెలిపింది. ‘‘మా వైద్య బృందంతో చర్చల అనంతరం.. సిరాజ్‌కు విశ్రాంతి కావాలని భావించాము. పనిభారాన్ని తగ్గించే క్రమంలో అతడిని ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటన నుంచి తప్పిస్తున్నాము. సుదీర్ఘమైన అంతర్జాతీయ క్రికెట్ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నాము.సిరాజ్ స్థానంలో ప్రసిద్ కృష్ణను సీనియర్ మెన్స్ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. సిరాజ్‌కు బదులు ఐర్లాండ్, ఇంగ్లండ్‌లలో అతడు టీ20 సిరీస్‌లలో పాల్గొంటాడు’’ అని బీసీసీఐ తన ప్రకటనలో తెలిపింది. ఐర్లాండ్, ఇంగ్లండ్‌లతో టీ20 సిరీస్‌కు టీమిండియా (అప్డేటెడ్)శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, ప్రసిద్ కృష్ణ.చదవండి: టీమిండియాలో చోటివ్వరా? సెంచరీతో కదంతొక్కాడు! -
మేము కాదు.. తనంతట తానే సెలక్ట్ చేసుకున్నాడు: అగార్కర్
రాజస్తాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ ఎట్టకేలకు టీమిండియాకు ఎంపికయ్యాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్‌లలో పర్యటించే భారత టీ20 జట్టుకు ఈ లెఫ్టాండర్ బ్యాటర్ సెలక్టర్లు ఎంపిక చేశారు. అదే విధంగా టీ20 ఫార్మాట్లో జరిగే ఆసియా క్రీడలు-2026 జట్టులోనూ అతడికి చోటు ఇచ్చారు.తండ్రిగా నేను సాధించే గొప్ప రికార్డు అదేఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) తండ్రి సంజీవ్ సూర్యవంశీ భావోద్వేగానికి లోనయ్యారు. ఆజ్‌తక్ చానెల్‌తో మాట్లాడుతూ.. ‘‘రికార్డుల గురించి వైభవ్ అస్సలు పట్టించుకోడు. ఇప్పుడిక టీమిండియా తరఫున మ్యాచ్‌లు గెలవడంపైనే అతడి దృష్టి ఉంటుంది.వైభవ్ టీమిండియా గెలుపులో భాగమైతే తండ్రిగా నేను సాధించే అత్యంత గొప్ప రికార్డు అదే అవుతుంది’’ అని సంజీవ్ సూర్యవంశీ పేర్కొన్నారు. కాగా గతేడాది నుంచి ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ అదరగొడుతున్న సంగతి తెలిసిందే.పరుగుల వరదరాజస్తాన్ రాయల్స్ తరఫున 2025లో 35 బంతుల్లోనే శతక్కొట్టిన వైభవ్.. ఐపీఎల్-2026లోనూ 36 బంతుల్లో సెంచరీతో మెరిశాడు. మొత్తంగా ఈ సీజన్లో పదహారు మ్యాచ్‌లలో కలిపి 776 పరుగులు సాధించి.. అత్యధిక పరుగుల వీరుడిగా ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. అంతకు ముందు భారత్ అండర్-19 వరల్డ్‌కప్ గెలవడంలోనూ వైభవ్ కీలక పాత్ర పోషించాడు.ఇదిలా ఉంటే.. వైభవ్ సూర్యవంశీని టీమిండియాకు ఎంపిక చేయడానికి గల కారణాన్ని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ వెల్లడించాడు. ‘‘తనను కచ్చితంగా ఎంపిక చేయాల్సిందే అనేలా వైభవ్ తన ఆటతో ఒక రకంగా మమ్మల్ని బలవంతపెట్టాడు. పదిహేనేళ్ల పిల్లాడని మాకూ తెలుసు.మేము కాదు.. తనంతట తానే సెలక్ట్ చేసుకున్నాడుఅయితే, చిన్న వయసులోనే రెండు ఐపీఎల్ సీజన్లలో వరుసగా సత్తా చాటడం మామూలు విషయం కాదు. కేవలం ఐపీఎల్ ఒక్కటనే కాదు.. భారత్ అండర్-19 జట్టు తరఫునా అతడు అద్భుత ప్రదర్శన కనబరిచాడు. అతడి ప్రతిభను మాత్రమే మేము పరిగణనలోకి తీసుకున్నాము.టీమిండియా తరఫున ఆడే అవకాశం వస్తే అతడు తప్పక తన ఫామ్ కొనసాగిస్తాడని ఆశిస్తున్నాం. మున్ముందు కఠిన సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే, వాటిని ఎదుర్కోగల సత్తా, టెంపర్మెంట్ వైభవ్‌కు ఉన్నాయి. ఒకరకంగా వైభవ్ తన ప్రదర్శనలతో తనకు తానే టీమిండియాకు ఎంపిక చేసుకున్నాడు’’ అని అగార్కర్ పేర్కొన్నాడు. కాగా పన్నెండేళ్లకే రంజీల్లో అరంగేట్రం చేసిన వైభవ్.. పద్నాలుగేళ్ల వయసులోనే ఐపీఎల్‌లోనూ అడుగుపెట్టాడు. సూపర్ ఫామ్ కొనసాగిస్తూ పదిహేనేళ్ల వయసుకే ఇప్పుడిలా టీమిండియాకు ఎంపికయ్యాడు.చదవండి: అందుకే సూర్యను తప్పించాము: అగార్కర్ -
BCCI: వైభవ్ సూర్యవంశీ వచ్చేశాడు.. ఇక దబిడిదిబిడే!
ఊహించిందే జరిగింది.. రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి సువర్ణావకాశం వచ్చింది. ఐపీఎల్-2026లో సత్తా చాటిన ఈ చిచ్చరపిడుగుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బంపర్ ఆఫర్ ఇచ్చింది. అతడిని ఏకంగా టీమిండియాకు ఎంపిక చేసింది.సచిన్ రికార్డు బద్దలుజూన్లో ఐర్లాండ్, ఇంగ్లండ్‌లలో పర్యటించే భారత టీ20 జట్టుకు వైభవ్‌కు ఎంపిక చేసిన సెలక్టర్లు.. ఆసియా క్రీడలు-2026లో పాల్గొనే జట్టులోనూ అతడికి అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలో టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును వైభవ్ సూర్యవంశీ బద్దలు కొట్టాడు.అత్యంత పిన్న వయస్సులోనే జాతీయ జట్టుకు ఎంపికైన భారత ఆటగాడిగా వైభవ్ నిలిచాడు. కాగా సచిన్ 1989లో పదహారేళ్ల 205 రోజుల వయసులో పాకిస్తాన్ మీద అరంగేట్రం చేశాడు. ఇక వైభవ్ కేవలం పదిహేనేళ్ల 71 రోజుల వయసులోనే టీమిండియాకు ఎంపికయ్యాడు. ఐర్లాండ్‌పై అతడు అరంగేట్రం చేయడం దాదాపుగా ఖాయమైపోయింది.నిలకడైన ఆట.. విధ్వంసకర బ్యాటింగ్గతేడాది రాజస్తాన్ తరఫున ఐపీఎల్లో అడుగుపెట్టిన వైభవ్ సూర్యవంశీ.. 35 బంతుల్లోనే శతక్కొట్టి సత్తా చాటాడు. ఆ తర్వాత భారత్ అండర్-19 జట్టు తరఫునా దుమ్ములేపాడు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా గడ్డపై ఫార్మాట్లకు అతీతంగా విధ్వంసకర బ్యాటింగ్‌తో శతకాల మోత మోగించాడు.అండర్-19 వరల్డ్‌కప్ ఫైనల్లో కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులతో రాణించి.. భారత్ విజేతగా నిలవడంలో వైభవ్ కీలక పాత్ర పోషించాడు. ఈ మెగా ఈవెంట్లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు కూడా గెలుచుకున్నాడు.అత్యధిక పరుగుల వీరుడిగా ఘనతఇదే జోరు కొనసాగిస్తూ ఐపీఎల్-2026లో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. రాజస్తాన్ రాయల్స్ తరఫున పూర్తి స్థాయి ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. 36 బంతుల్లో శతక్కొట్టాడు. ఓవరాల్‌గా పదహారు మ్యాచ్‌లలో కలిపి 776 పరుగులు సాధించాడు.తద్వారా ఈ సీజన్లో అత్యధిక పరుగుల వీరుడిగా ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు వైభవ్. ఇప్పటికే అత్యంత పిన్న వయస్సులోనే ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన ఈ బిహారీ పిల్లాడు.. ఇప్పుడు ఆరెంజ్ క్యాప్‌ను కూడా గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించాడు.పైసా వసూల్ ప్రదర్శన.. టీమిండియాకు ఎంపికఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీని వీలైనంత త్వరగా టీమిండియాకు ఎంపిక చేయాలనే డిమాండ్లు వచ్చాయి. ఇందుకు సానుకూలంగా స్పందించిన బీసీసీఐ.. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పదిహేనేళ్ల వయస్సులోనే అతడిని ఎంపిక చేయడం విశేషం. ఓవరాల్‌గా రాజస్తాన్ ప్లే ఆఫ్స్‌ను చేర్చి పైసా వసూల్ ప్రదర్శన ఇచ్చిన వైభవ్.. ఇప్పుడు టీమిండియా తరఫున దుమ్ములేపేందుకు సిద్ధమయ్యాడు. చిన్న వయస్సులోనే భారత జట్టుకు ఎంపికైన వైభశ్ సూర్యవంశీకి శుభాభినందనలు.. అతడి బంగారు భవిష్యత్తుకు ఆల్ ది బెస్ట్!! చదవండి: టీమిండియా టీ20 కొత్త కెప్టెన్ ప్రకటన.. ఐర్లాండ్, ఇంగ్లండ్, ఆసియా క్రీడలకు జట్లు ఇవే -
టీమిండియాకు షాక్.. ఆరు నెలలు ఆటకు దూరమైన కోహ్లీ!
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గాయం కారణంగా ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే కాలి పిక్క కండరాల గాయంతో అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు దూరమైన కోహ్లీ తాజాగా గాయం తీవ్రత ఎక్కువగా ఉందని తేలింది. దీంతో కోహ్లీ కోలుకోవడానికి ఆరు నెలల సమయం పట్టే అవకాశముందని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక పేర్కొంది. దీంతో జూలైలో ఇంగ్లండ్‌తో ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌కు కోహ్లీ దూరమైనట్లే. అయితే దీనిపై బీసీసీఐ అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది. 'కోహ్లీ తొడ కండరంలో చీలిక వచ్చింది. ఈ గాయానికి శస్త్రచికిత్స అవసరం లేదు. అయితే ఇది నయం కావడానికి మాత్రం సుమారు ఆరు వారాల సమయం పట్టనుంది. దీనిలో భాగంగా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో కోహ్లీ పునరావాసం పొందే అవకాశముంది. కాగా కోహ్లీ తన గాయంపై ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలోని ప్రఖ్యాత ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ దిన్షా పర్దివాలాను టెలి-కన్సల్ట్ అయ్యాడు. ఎంఆర్ఐ స్కాన్‌లో కండరాల్లో చీలిక వచ్చినట్లు రిపోర్ట్‌లో తేలింది.' అని పేర్కొంది.ఇదిలా ఉండగా, ఆఫ్ఘనిస్తాన్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు ముందు ఫిట్నెస్ మదింపు కోసం రోహిత్ శర్మ జూన్ 8న బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)కి హాజరుకానున్నట్లు కూడా ఆ నివేదిక పేర్కొంది . ఈ సిరీస్ కోసం రోహిత్‌ను జట్టులోకి తీసుకున్నప్పటికీ, అతని లభ్యత పూర్తిగా ఫిట్నెస్ పరీక్షల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. చదవండి: కుప్పకూలిన కివీస్.. భారీ ఆధిక్యం దిశగా ఇంగ్లండ్ -
చరిత్ర సృష్టించిన టీమిండియా కెప్టెన్
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ మహిళా క్రికెట్లో ఇంత వరకు ఏ ప్లేయర్‌కూ సాధ్యం కాని అరుదైన ఘనత సాధించింది. టీమిండియా తరఫున 2009లో అరంగేట్రం చేసింది హర్మన్.అంచెలంచెలుగా ఎదిగి కెప్టెన్ స్థాయికి చేరుకున్న హర్మన్.. మహిళా క్రికెట్లో భారత్‌కు మొట్టమొదటి వన్డే వరల్డ్‌కప్ అందించింది. స్వదేశంలో గతేడాది జరిగిన మెగా టోర్నీలో జట్టును చాంపియన్‌గా నిలిపి.. దిగ్గజ కెప్టెన్ల సరసన చేరింది.ఇంగ్లండ్ పర్యటనలో..ఇటీవలే పద్మశ్రీ అవార్డు అందుకున్న 37 ఏళ్ల హర్మన్ ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. ఆతిథ్య జట్టు తొలి టీ20కి దూరమైన ఆమె.. రెండో మ్యాచ్ నుంచి జట్టుతో చేరింది. అయితే, హర్మన్ సారథ్యంలో రెండో టీ20తో పాటు.. తాజాగా మూడో టీ20లోనూ ఓటమిపాలైంది.సిరీస్ ఇంగ్లండ్దేటాంటన్ వేదికగా మంగళవారం నాటి మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. అయితే, ఇంగ్లండ్ కేవలం 18.3 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో హర్మన్ 40 బంతులు ఎదుర్కొని 56 పరుగులతో అజేయంగా నిలిచింది. ఇక ఈ విజయంతో ఇంగ్లండ్ టీ20 సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది.చరిత్ర సృష్టించిన టీమిండియా కెప్టెన్‌కాగా హర్మన్ అంతర్జాతీయ కెరీర్లో ఇది 368వ మ్యాచ్. తద్వారా మహిళల క్రికెట్లో అత్యధిక ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా హర్మన్ ప్రపంచ రికార్డు సాధించింది. కాగా గతంలో ఈ రికార్డు న్యూజిలాండ్ స్టార్ సుజీ బేట్స్ పేరిట ఉండేది. ఆమె తన కెరీర్లో 367 మ్యాచ్‌లు ఆడింది.ఇక టీ20 ప్రపంచకప్-2026 తర్వాత సుజీ బేట్స్ రిటైర్ కానుండగా.. హర్మన్‌ప్రీత్ కౌర్ రిటైర్మెంట్ గురించి ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. తద్వారా మరికొన్ని మ్యాచ్‌లలో పాల్గొని.. అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా హర్మన్ తన పేరును సుస్థిరం చేసుకునే అవకాశం లేకపోలేదు.మహిళల క్రికెట్లో అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్లు🏏హర్మన్‌ప్రీత్ కౌర్ (భారత్)- 368🏏సుజీ బేట్స్ (న్యూజిలాండ్)- 367🏏ఎలిస్ పెర్రీ (ఆస్ట్రేలియా)- 357🏏మిథాలీ రాజ్ (భారత్)- 333🏏సోఫీ డివైన్ (న్యూజిలాండ్)- 313.చదవండి: కెప్టెన్‌గా శ్రేయస్.. భువీ రీఎంట్రీ! -
‘ఇంగ్లండ్ టూర్‌కు వైభవ్‌ను ఎంపిక చేయాల్సిందే’
క్రికెట్ వర్గాల్లో వైభవ్ సూర్యవంశీ పేరు మారుమోగిపోతోంది. పదిహేనేళ్ల వయసులోనే విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్న ఈ చిచ్చరపిడుగును చూసి దిగ్గజాలు సైతం ఆశ్చర్యపోతున్నారు. గతేడాది కాలంగా ఫార్మాట్లకు అతీతంగా రాణిస్తున్న వైభవ్.. ఐపీఎల్-2026లోనూ దుమ్ములేపుతున్న సంగతి తెలిసిందే.ఆకాశమే హద్దుగారాజస్తాన్ రాయల్స్ ఓపెనర్‌గా ఈసారి పూర్తిస్థాయిలో బరిలోకి దిగిన వైభవ్ (Vaibhav Suryavanshi).. ఎలిమినేటర్ మ్యాచ్ ముగిసే సరికి 680 పరుగులతో అత్యధిక పరుగుల వీరుడిగా ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్లో గ్రూప్ దశలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై శతక్కొట్టిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్ (103).. ఎలిమినేటర్ మ్యాచ్‌లోనూ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.దిగ్గజాలు ఫిదాకేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు సాధించిన వైభవ్.. సెంచరీకి మూడు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. ఏదేమైనా ఈ సీజన్లో ఈ బిహారీ పిల్లాడి ఆట చూసి టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్, వెస్టిండీస్ లెజెండ్ క్రిస్ గేల్, సౌతాఫ్రికా దిగ్గజ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ ఫిదా అయ్యారు.ఈ క్రమంలోనే భారత దిగ్గజ కెప్టెన్ సునిల్ గావస్కర్ సైతం వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురిపించాడు. వయసుతో పనిలేదని.. అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రానికి అతడు ప్రస్తుతం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాడని పేర్కొన్నాడు. వీలైనంత త్వరగా టీమిండియాకు అతడికి ఎంపిక చేయాలని సెలక్టర్లకు సూచించాడు.ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు?స్పోర్ట్స్ టాక్‌తో మాట్లాడుతూ.. ‘‘టీ20 క్రికెట్ ఆడేందుకు అతడు సిద్ధంగా ఉన్నాడు. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే టీమిండియాలో అతడికి చోటు దక్కుతుందని భావిస్తున్నా. ఇంతటి అత్యద్భుతమైన ప్రదర్శన తర్వాత సెలక్టర్లు అతడికి తప్పక చోటివ్వాలి కూడా!..అతడి వయసుతో పనిలేదు. 15 ఏళ్ల కంటే పెద్ద వారి కంటే కూడా అతడు శక్తిమంతంగా సిక్సర్లు బాదుతున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన బౌలర్ల బౌలింగ్‌లోనూ బంతిని బౌండరీ అవతలకు పంపిస్తున్నాడు.దేవుడిని ప్రార్థిస్తున్నాప్రత్యర్థి ఎవరైనా అతడికి అసలు భయమే లేదు. గల్లీల్లో పిల్లలు ఎలా ఆడతారో ఐపీఎల్లో ఈ పిల్లాడు అలాగే ఆడుతున్నాడు. మనం కూడా చిన్నపుడు డిఫెన్సివ్‌గా కాకుండా దూకుడుగా ఆడేవాళ్లము. ఇప్పుడు వైభవ్ అదే పని చేస్తున్నాడు.అయితే, అతడు మెగా వేదికపై ఇలా ఆడటం ఆశ్చర్యకరం. అతడి బ్యాటింగ్ శైలి, ఆట తీరు ఇలాగే కొనసాగాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నా’’ అని సునిల్ గావస్కర్ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2026 ముగిసిన తర్వాత స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో సిరీస్‌లు ఆడిన తర్వాత.. టీమిండియా ఐర్లాండ్, ఇంగ్లండ్, పర్యటనలకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ ఎంపిక గురించి చర్చ నడుస్తోంది. చదవండి: ‘జైస్వాల్ రాయల్స్‌ను వదిలేయాలి’Universe Boss 🤝 Universe Boss Baby#VaibhavSooryavanshi smashes another fifty in #TATAIPL 2026 and breaks Chris Gayle’s record for most sixes in a season (59)🔥👊🏻#TATAIPL Playoffs Eliminator 👉 #SRHvRR | LIVE NOW 👉https://t.co/AsF9BnOMCE pic.twitter.com/dF7JsFwXro— Star Sports (@StarSportsIndia) May 27, 2026 -
ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు శుభారంభం చేసింది. చెమ్స్‌ఫోర్డ్ వేదికగా తొలి టీ20లో 38 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ సన్నాహకాల్లో భాగంగా భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది.ఇందులో భాగంగా తొలుత ఈసీబీ డెవలప్మెంట్ వుమెన్స్ ఎలెవన్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడిన భారత్.. ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. ఇక అసలు పోటీలో భాగంగా గురువారం రాత్రి మ్యాచ్‌లో.. టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఆహ్వానం మేరకు భారత జట్టు తొలుత బ్యాటింగ్‌కు దిగింది.రాణించిన యస్తికా, జెమీమాఓపెనర్లు స్మృతి మంధాన (0), షఫాలీ వర్మ (2) తీవ్రంగా నిరాశపరచగా.. వన్‌డౌన్ బ్యాటర్ యస్తికా భాటియా అర్ధ శతకం (40 బంతుల్లో 54)తో రాణించింది. ఇక నాలుగో స్థానంలో బరిలోకి దిగిన జెమీమా రోడ్రిగ్స్ మెరుపు ఇన్నింగ్స్ (40 బంతుల్లో 69)తో ఆకట్టుకుంది.మిగిలిన వారిలో ఆల్‌రౌండర్ దీప్తి శర్మ (13 బంతుల్లో 22) చెప్పుకోదగ్గ స్కోరు చేసింది. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో భారత మహిళా జట్టు ఏడు వికెట్ల నష్టానికి 188 పరుగులు సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్‌కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు.చెలరేగిన బౌలర్లుఓపెనర్లు అలిస్ క్యాప్సీ (6), సోఫియా డంక్లీ (16)లను క్రాంతి గౌడ్ వెనక్కి పంపగా.. అర్ధ శతకం (67)తో జోరు మీదున్న అమీ జోన్స్ (67)ను నందిని శర్మ అవుట్ చేసింది. మిగిలిన ఇంగ్లండ్ బ్యాటర్లలో హీదర్ నైట్ (21) మాత్రమే ఇరవై పరుగుల మార్కు దాటింది. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి ఇంగ్లండ్ 150 పరుగుల వద్ద నిలిచిపోయింది.భారత బౌలర్లలో క్రాంతి గౌడ్ రెండు వికెట్లు దక్కించుకోగా.. నందిని శర్మ మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకుంది. శ్రీచరణి, దీప్తి శర్మ తలా ఒక వికెట్ పడగొట్టారు. ఇక తొలి టీ20లో ఇంగ్లండ్‌పై 38 పరుగుల తేడాతో గెలిచిన మంధాన సేన.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.చదవండి: ‘అతడు ప్లే ఆఫ్స్‌లో విఫలమవుతూనే ఉన్నాడు’ -
ఏడు వికెట్ల తేడాతో భారత్ జయభేరి
చెమ్స్‌ఫోర్డ్: ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు ముందు జరిగిన ఏకైక ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 7 వికెట్ల తేడాతో ఈసీబీ డెవలప్మెంట్ ఉమెన్ ఎలెవన్‌పై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఈసీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఫ్లోరెన్స్ మిల్లర్ (48; 7 ఫోర్లు), జోన్ గార్డ్నర్ (36; 3 ఫోర్లు, 1 సిక్స్), సోఫియా స్మేల్ (27; 3 ఫోర్లు) రాణించారు. భారత బౌలర్లలో హైదరాబాదీ అరుంధతి రెడ్డి 3 ఓవర్లలో 29 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టింది. అనంతరం భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 200 పరుగులు సాధించింది. 17వ ఓవర్ రెండో బంతికి భారత్ 155 పరుగుల విజయలక్ష్యాన్ని అందుకున్నా...మరింత ప్రాక్టీస్ కోసం ఇన్నింగ్స్‌ను 20 ఓవర్ల వరకు కొనసాగించారు. షఫాలీ వర్మ (25 బంతుల్లో 50 రిటైర్డ్ అవుట్; 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేయగా... భారతి ఫుల్మలి (29 బంతుల్లో 48; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), యస్తిక భాటియా (35 బంతుల్లో 47; 6 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. భారత్, ఇంగ్లండ్ మహిళా జట్ల మధ్య ఈ నెల 28, 30 తేదీల్లో చెమ్స్‌ఫోర్డ్, బ్రిస్టల్లలో తొలి రెండు టీ20లు జరగనుండగా... జూన్ 2న టాంటన్‌లో చివరి టి20 నిర్వహిస్తారు. ఆ తర్వాత జూన్ 12 నుంచి జరిగే టీ20 వరల్డ్ కప్‌లో భారత బృందం బరిలోకి దిగుతుంది. చదవండి: నకిలీ నవ్వులు.. వాళ్లిద్దరు చెత్త కెప్టెన్లు: సౌతాఫ్రికా దిగ్గజం -
చీఫ్ సెలెక్టర్ పదవి రేసులో కోహ్లితో గొడవపడిన వ్యక్తి
టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి యుక్త వయసులో ఉన్నప్పుడు అతనితో కయ్యానికి కాలు దువ్విన ఓ ఇంగ్లీష్ క్రికెటర్ ఇప్పుడు అతని దేశ క్రికెట్ బోర్డు (ECB) చీఫ్ సెలెక్టర్ పదవి రేసులో ముందున్నాడు. ఇంగ్లండ్‌కు చెందిన 37 ఫాస్ట్ బౌలర్ స్టీవెన్ ఫిన్ 2012లో భారత్-ఇంగ్లండ్ టెస్టు సిరీస్ సందర్భంగా కోహ్లీతో తీవ్రస్థాయిలో గొడవ పడ్డాడు. ఆ సందర్భంగా కోహ్లి-ఫిన్ మధ్య వాగ్వాదం తారాస్థాయికి వెళ్లింది. తనను రెచ్చగొట్టిన ఫిన్‌కు కోహ్లీ బ్యాట్‌తో సమాధానం చెప్పాడు. ఫిన్ సైతం తనకు అవకాశం వచ్చినప్పుడు కోహ్లిని ఔట్ చేశాడు. వీరిద్దరి మధ్య వైరం అప్పట్లో కొంతకాలం సాగింది.అయితే ఫిన్ 2023లో మోకాలి గాయం కారణంగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి కామెంటేటర్ అవతరామెత్తాడు. ఇంగ్లండ్ తరఫున 36 టెస్టులు, 21 టీ20లు ఆడిన ఫిన్, కామెంటేటర్‌గానూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.తాజాగా ఫిన్ ఇంగ్లండ్ క్రికెట్లో అత్యంత కీలకమైన చీఫ్ సెలెక్టర్ పదవికి ప్రధాన పోటీదారుడిగా మారాడు. ఈ పదవి రేసులో ఫిన్ పేరు ప్రధానంగా వినినిస్తుంది. మాజీ చీఫ్ సెలెక్టర్ లూక్ రైట్ తన పదవికి రాజీనామా చేయడంతో ఈ స్థానం ఖాళీ అయింది. ఇటీవల జరిగిన యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ నిరాశాజనక ప్రదర్శన తర్వాత రైట్ తన పదవికి రాజీనామా చేశాడు.ఈ క్రమంలో చీఫ్ సెలెక్టర్ పదవికి ఎన్నిక అనివార్యం కాగా.. ఫిన్‌తో పాటు ఇంగ్లండ్ మాజీ ఆటగాళ్లు డారెన్ గాఫ్, నిక్ నైట్ కూడా పోటీపడుతున్నారు. వీరిలో ఫిన్‌కు ఇంగ్లండ్ హెడ్ కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. జూన్ 4న ఇంగ్లండ్-న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందే కొత్త సెలెక్టర్‌ను నియమించే అవకాశం ఉంది. తుది నిర్ణయం ఇంగ్లండ్ క్రికెట్ డైరెక్టర్ రాబర్ట్ కీ తీసుకోనున్నారు. ఇంగ్లండ్ చీఫ్ సెలెక్టర్ పదవికి సంవత్సరానికి సుమారు 150,000 పౌండ్ల వేతనం లభించనుంది. -
BCCI: టీమిండియా ప్లేయర్లను ‘చంపేస్తారా’?
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తీరుపై ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోదీ మండిపడ్డాడు. ‘డబ్బు కోసం కక్కుర్తి పడి.. ఆటగాళ్లను చంపకండి’ అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. బోర్డు మెదడుతో కాకుండా మనసుతో స్పందించి తమ ఆటగాళ్లను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నాడు.బిజీ షెడ్యూల్కాగా గత కొన్నేళ్లుగా టీమిండియా బిజీ షెడ్యూల్‌తో తలమునకలై ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఐపీఎల్-2026 ముగిసిన వెంటనే స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో టెస్టు మ్యాచ్ తర్వాత ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఆ తర్వాత ఐర్లాండ్, జింబాబ్వే తదితర టూర్లు.ఇక ఐపీఎల్ తాజా ఎడిషన్ మే 31న ముగియనుండగా.. జూన్ 6న అఫ్గన్‌తో టెస్టు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) బిజీ షెడ్యూల్‌పై గుర్రుగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ‘‘జట్టులోని చాలా మంది ఆటగాళ్లు మే 31 వరకు ఐపీఎల్‌తోనే బిజీగా గడపుతారు.స్వల్ప వ్యవధిలోనే జాతీయ జట్టు తరఫున విధుల్లో చేరడం ఒత్తిడిని పెంచుతుంది’’ అని గంభీర్ బోర్డు వద్ద తన వాదనను వినిపించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వార్తను ఓ యూజర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. లలిత్ మోదీ తీవ్రంగా స్పందించాడు.టీమిండియా ప్లేయర్లను ‘చంపేస్తారా’?‘‘గంభీర్ వాదనతో నేను ఏకీభవిస్తాను. విరామం లేని షెడ్యూల్‌తో బీసీసీఐ తమ ఆటగాళ్లను చంపినంత పని చేస్తోంది. ఇలాంటి భయంకరమైన విధానాన్ని ఆపేయండి. ఆటగాళ్లను కాస్త ఊపిరి తీసుకోనివ్వండి. వాళ్లకు కూడా కుటుంబాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కాస్త ఆనందంగా గడపనివ్వండి.భారీ ఆదాయానికి బీజం వేశానుఅయినా మీకు ఇప్పుడు అంతగా డబ్బు అవసరం ఏముంది? నేను ఇప్పటికే ఐపీఎల్ ద్వారా ఏడాదికి కావాల్సినంత ఆదాయం వచ్చేలా బీజం వేశాను కదా! ప్రపంచంలో అందరి కంటే బీసీసీఐ సంపన్న బోర్డు కావడానికి ఇదో కారణం. కాబట్టి మీరు డబ్బు గురించి బెంగ పడకండి.ఆటగాళ్ల క్షేమం గురించి కూడా ఆలోచించండి. ప్రొఫెషనల్ సీఈఓను నియమించండి. భారీగా జీతం ఇచ్చి HRను పెట్టుకోండి. ఆటగాళ్ల సెల్ఫ్ డెవలప్మెంట్పై కూడా కొంచెం ఖర్చు చేయండి. స్టేడియాలను మరింత గొప్పగా తీర్చిదిద్దండి. ప్రేక్షకులకు వరల్డ్‌క్లాస్ ఎక్స్పీరియన్స్ అందించండి.మనసుతో ఆలోచించండిఆటగాళ్లేమీ యంత్రాలు కాదు. మీరు మెదడుతో కాకుండా మనసుతో కూడా ఆలోచించండి’’ అని ఎక్స్ వేదికగా లలిత్ మోదీ బీసీసీఐ తీరును తూర్పారబట్టాడు. కాగా లలిత్ మోదీ ఆలోచనతో 2008లో ఐపీఎల్ రూపుదిద్దుకోగా.. లీగ్ తొలి చైర్మన్‌గా అతడే వ్యవహరించాడు. కానీ కొన్నేళ్లకే మనీ లాండరింగ్ ఆరోపణలతో వివాదంలో చిక్కుకున్నాడు. ఆర్థిక నేరగాడిగా ముద్రపడి.. లండన్‌కు పారిపోయి దశాబ్దకాలానికిపైగా అక్కడే నివాసం ఉంటున్నాడు. చదవండి: ఇప్పటికీ బాధపడుతున్నా: రోహిత్‌కు మాజీ కెప్టెన్ క్షమాపణలు -
IND vs ENG: ఇంగ్లండ్ టూర్‌కు వైభవ్ సూర్యవంశీ!
భారత యువ సంచలనం, రాజస్తాన్ రాయల్స్ స్టార్ వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్-2026 టోర్నీని ఘనంగా ఆరంభించాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో సోమవారం నాటి మ్యాచ్‌లో ఈ ఓపెనింగ్ బ్యాటర్ దుమ్మురేపాడు. మెరుపు అర్ధ శతకం బాది శెభాష్ అనిపించుకున్నాడు.ప్రశంసల వర్షంగువాహటి వేదికగా కేవలం 17 బంతుల్లోనే 52 పరుగులు సాధించాడు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi). అతడి విధ్వంసకర ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. ఇక వైభవ్ ధనాధన్ ఇన్నింగ్స్ కారణంగా రాజస్తాన్ చెన్నైపై అలవోక విజయం సాధించింది. 128 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని కేవలం 12.1 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ అయితే ఓ అడుగు ముందుకేసి.. వైభవ్‌ను వెంటనే టీమిండియాకు ఎంపిక చేయాలనే ప్రతిపాదన తెచ్చాడు. క్రిక్‌బజ్ షోలో మాట్లాడుతూ..నేనే గనుక సెలక్టర్ అయి ఉంటే‘‘అతడు ఎప్పుడు టీమిండియా తరఫున అరంగేట్రం చేస్తాడు? అని నేనెంతో ఆతురతగా ఎదురుచూస్తున్నాను. ఇది కాస్త తొందరపాటే అని అనిపించవచ్చు. ఐపీఎల్ తాజా ఎడిషన్‌లో అతడికి ఇదే తొలి ఇన్నింగ్స్. ఏదేమైనా కొన్ని నెలల తర్వాత టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది.ఒకవేళ నేనే గనుక సెలక్టర్ అయి ఉంటే వైభవ్‌ను ఈ టూర్‌కు కచ్చితంగా ఎంపిక చేస్తా. ప్రస్తుతానికి అతడికి జట్టులో చేరాల్సిన అవసరం లేకపోవచ్చు. కానీ జట్టుకు అతడి అవసరం ఉంటుందేమో!.. పదిహేనేళ్ల పిల్లాడిని టూర్‌కు అనుమతిస్తారా? అంటే నేనేమీ చెప్పలేను.కానీ అతడు ఇప్పటికే ఆటగాడిగా పరిణతి సాధించాడు. టీమిండియా తరఫున కూడా కచ్చితంగా సత్తా చాటగలడు’’ అని మైకేల్ వాన్ పేర్కొన్నాడు. వీలైనంత త్వరగా వైభవ్‌ను జాతీయ జట్టుకు ఎంపిక చేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి సూచించాడు.చదవండి: Ravindra Jadeja: రంగుమారిన మరుక్షణం మాట మార్చాడు! -
T20 WC Semis: నరాలు తెగే ఉత్కంఠ.. నాకు వాళ్ల మద్దతు
ఇంగ్లండ్ యువ క్రికెటర్ జేకబ్ బెతెల్ ఆసక్తికర విషయం పంచుకున్నాడు. టీ20 ప్రపంచకప్-2026 సెమీ ఫైనల్లో నరాలు తెగే ఉత్కంఠ నడుమ తనకు ఊహించని విధంగా మద్దతు లభించిందన్నాడు. భారత్ వేదికగా జరిగిన ఈ ఐసీసీ టోర్నీ రెండో సెమీస్ మ్యాచ్‌లో టీమిండియా- ఇంగ్లండ్ (IND vs ENG) తలపడిన విషయం తెలిసిందే.253 పరుగుల భారీ స్కోరుముంబైలోని వాంఖడే మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 253 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి.టాపార్డర్‌లో ఫిల్ సాల్ట్ (5), కెప్టెన్ హ్యారీ బ్రూక్ (Harry Brook- 7) పూర్తిగా విఫలం కాగా.. జోస్ బట్లర్ 25 పరుగులు చేయగలిగాడు. ఇలాంటి తరుణంలో నాలుగో నంబర్ బ్యాటర్ జేకబ్ బెతెల్ ఆకాశమే హద్దుగా చెలరేగి ఇంగ్లండ్ శిబిరంలో ఆశలు రేపాడు.బెతెల్ విధ్వంసకర సెంచరీకేవలం 48 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్సర్లు బాది 105 పరుగలతో బెతెల్ సత్తా చాటాడు. అయితే, అతడు రనౌట్ కావడంతో ఇంగ్లండ్ ఆశలు అడియాసలయ్యాయి. ఆఖర్లో జోఫ్రా ఆర్చర్ నాలుగు బంతుల్లో 19 పరుగులతో అజేయంగా నిలిచినా.. విజయానికి ఇంగ్లండ్ ఏడు పరుగుల దూరంలో నిలిచింది. ఫలితంగా గెలుపు జెండా ఎగురవేసిన భారత్.. ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి చాంపియన్‌గా నిలిచింది.ఇదిలా ఉంటే.. వాంఖడేలో తాను విధ్వంసకర రీతిలో విరుచుకుపడుతున్న వేళ ఎదురైన అనుభవాన్ని జేకబ్ బెతెల్ తాజాగా పంచుకున్నాడు. అతడు మ్యాచ్‌ను ఇంగ్లండ్‌ను తిప్పేస్తాడనే భయంతో మైదానం నిశ్శబ్దంగా మారిన వేళ.. కొంతమంది మాత్రం ఆర్సీబీ నామస్మరణ చేశారట.వాళ్లు నాకు మద్దతుగా నిలిచారుఈ విషయం గురించి బెతెల్ మాట్లాడుతూ.. ‘‘వాంఖడే మైదానం మొత్తం నిశ్శబ్దం ఆవరించిన తరుణంలో కొంతమంది ఆర్సీబీ అని అరవడం నా చెవిన పడింది. అలా వాళ్లు నాకు మద్దతుగా నిలిచారు’’ అంటూ ఆర్సీబీ ఫ్యాన్స్ తనపై ప్రేమ చూపించారంటూ పొంగిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆర్సీబీ సోషల్ మీడియాలో షేర్ చేసింది.కాగా 22 ఏళ్ల బెతెల్ గతేడాది ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించాడు. రెండు మ్యాచ్‌లలో కలిపి 67 పరుగులు చేశాడు. మినీ వేలానికి ముందు ఆర్సీబీ బెతెల్‌ను అట్టిపెట్టుకోగా ఈసారి మెరుపులు మెరిపించేందుకు సిద్ధమయ్యాడు.చదవండి: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా ప్లేయర్.. ప్రపంచ రికార్డు -
టీమిండియా అభిమానులకు పండుగే పండుగ!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీని విజయవంతంగా ముగించుకున్న భారత ఆటగాళ్లు తదుపరి ఐపీఎల్ పందొమ్మిదో ఎడిషన్‌తో బిజీ కానున్నారు. మార్చి 28న ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది. ఇక ఐపీఎల్-2026 ముగిసిన తర్వాత జూన్ 6-20 మధ్య టీమిండియా- అఫ్గనిస్తాన్ మధ్య సిరీస్ జరుగుతుంది.ముందుగా ఐర్లాండ్ టూర్‌కు!ఇందులో భాగంగా భారత్- అఫ్గన్ జట్లు ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడతాయి. అనంతరం టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అయితే, అంతకంటే ముందు భారత జట్టు ఐర్లాండ్ టూర్‌కు వెళ్లనున్నట్లు సమాచారం.ఐర్లాండ్ హై పర్ఫామెన్స్ డైరెక్టర్ గ్రాహమ్ వెస్ట్ ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. ఇరుజట్ల మధ్య టీ20 సిరీస్ జరుగనుందని సంకేతాలు ఇచ్చాడు. కాగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో ఐర్లాండ్ కనీసం సూపర్-8 దశకు కూడా చేరుకుండానే నిష్క్రమించింది.మంచి బూస్ట్ఇందుకు బాధ్యత వహిస్తూ పాల్ స్టెర్లింగ్ కెప్టెన్ పదవికి రాజీనామా చేశాడు. ఈ నేపథ్యంలో.. ‘‘టీ20 ప్రపంచకప్-2028 సన్నాహకాల్లో భాగంగా పాల్ స్టెర్లింగ్ రాజీనామా చేయగా.. అతడి స్థానంలో వచ్చే కొత్త కెప్టెన్‌కు జూన్‌లో టీమిండియాతో జరిగే సిరీస్‌తో మంచి బూస్ట్ లభిస్తుంది’’ అని గ్రాహమ్ వెస్ట్ ప్రకటన విడుదల చేశాడు. తద్వారా భారత్- ఐర్లాండ్ సిరీస్ విషయాన్ని ఖరారు చేశాడు.కాగా గత ఏడేళ్లలో ఇప్పటి వరకు టీమిండియా ఐర్లాండ్‌లో మూడుసార్లు (2018, 2022, 2023)లో పర్యటించింది. ఇదిలా ఉంటే.. స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో సిరీస్ ముగించుకున్న తర్వాత టీమిండియా జూలైలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లేలా ముందుగా షెడ్యూల్ ఖరారైంది. జూలై 1- 19 వరకు ఇరుజట్ల మధ్య ఐదు టీ20, మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లు నిర్వహించాలని నిర్ణయించారు.మరింత బిజీగాఅయితే, తాజాగా ఐర్లాండ్ టూర్‌తో భారత జట్టు షెడ్యూల్ మరింత బిజీగా మారింది. దీంతో తమకు ఈ ఏడాదంతా పండుగేనని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా టీ20 ప్రపంచకప్ టోర్నీలో భారత్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. తద్వారా స్వదేశంలో మొట్టమొదటిసారి, వరుసగా రెండోసారి, ఓవరాల్‌గా మూడోసారి టీ20 వరల్డ్‌కప్ ట్రోఫీ గెలిచిన ఏకైక జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది.చదవండి: ODI WC: ఇప్పటికే ఇరవై మందిని షార్ట్‌లిస్ట్ చేసిన బీసీసీఐ? -
WC: ఫీల్డింగ్‌లో ‘వరస్ట్’!.. భారత మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు
సొంతగడ్డపై టీమిండియా టీ20 ప్రపంచకప్ గెలిచింది. గతంలో ఏ జట్టుకూ సాధ్యం కాని విధంగా వరుసగా రెండోసారి, మొత్తంగా మూడోసారి.. స్వదేశంలో తొలిసారి టీ20 వరల్డ్‌కప్ గెలిచిన ఏకైక జట్టుగా సరికొత్త చరిత్ర సృష్టించింది.కానీ.. లీగ్ దశలో అజేయంగా నిలిచినా టీమిండియా ప్రదర్శన సగటు అభిమానితో పాటు హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌కు కూడా సంతృప్తినివ్వలేదు. ఇక సూపర్-8 దశలో తొలి మ్యాచ్‌లోనే సౌతాఫ్రికా చేతిలో ఏకంగా 76 పరుగుల తేడాతో భారత జట్టు చిత్తుగా ఓడింది.చాంపియన్గాఆ తర్వాత వరుస విజయాలతో టైటిల్ దిశగా అడుగులు వేసి చాంపియన్‌గా అవతరించింది టీమిండియా. అయితే, ఫీల్డింగ్ మాత్రం చెత్తగా ఉందనే విమర్శలు మూటగట్టుకుంది. సెమీస్, ఫైనల్లో భారత ఫీల్డర్లు కాస్త ఫర్వాలేదనిపించగా.. అంతకు ముందు మాత్రం దారుణంగా విఫలమయ్యారు.ఫీల్డింగ్‌లో ‘వరస్ట్’!ముఖ్యంగా సూపర్-8 చేరిన జట్లలో Catching Efficiencyలో ఇంగ్లండ్ అత్యుత్తమంగా 87.2 శాతం నమోదు చేయగా.. టీమిండియా 72.7 శాతంతో అత్యంత చెత్త రికార్డుతో అట్టడుగున నిలిచింది. ఈ నేపథ్యంలో భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అంజుమ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.భారత మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలుఇన్సైడ్ స్పోర్ట్‌తో మాట్లాడుతూ.. ‘‘టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో టీమిండియా ఇంకాస్త మెరుగ్గా ఫీల్డింగ్ చేయాల్సింది. క్యాచ్‌లు పట్టడంలో సఫలమైన విషయంలో మిగతా జట్లతో పోలిస్తే మరీ వెనుకబడి ఉందన్నది బహిరంగ రహస్యమే.ఒత్తిడిలో ఒక్కోసారి ఇలాంటివి జరగవచ్చు. అలాంటపుడు కూర్చుని చర్చించుకుని లోపాలు సరిచేసుకోవాలి. అలా కాకుండా పదే పదే అవే తప్పులు పునరావృతం చేస్తే ముందుకు సాగడం కష్టమవుతుంది. కొన్నిసార్లు అద్భుతమైన క్యాచ్‌లు అందుకున్నారు. కొన్నిసార్లు అత్యంత సులువైన క్యాచ్‌లు వదిలేశారు.ఫీల్డింగ్ విషయంలో మనం కాస్త వెనుబడి ఉన్నామనే చెప్పవచ్చు. ఏదేమైనా పగటి పూట ఫీల్డింగ్ చేయడానికి.. రాత్రి లైట్ల వెలుగులో ఫీల్డింగ్ చేయడానికి తేడా ఉంటుంది. అయితే, ఇప్పటికే ప్రొఫెషనల్ అనిపించుకున్న ఆటగాళ్లు ఇలాంటి కారణాలతో తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోలేరు’’ అని అంజుమ్ చోప్రా చెప్పుకొచ్చింది.టీ20 ప్రపంచకప్-2026లో సూపర్-8 జట్ల క్యాచింగ్ సామర్థ్యంఇంగ్లండ్- 87.2%జింబాబ్వే- 85.4%వెస్టిండీస్- 84.6%న్యూజిలాండ్- 83.9%పాకిస్తాన్- 83.3%సౌతాఫ్రికా- 81.1%శ్రీలంక- 77.8%ఇండియా- 72.7%.చదవండి: T20 WC: రాస్కెల్స్.. నిప్పుతో చెలగాటం: ఆసీస్ మాజీ క్రికెటర్ ప్రశంసలు -
‘తుదిజట్టులో చోటు ఇవ్వనపుడు.. అతడికి చెప్పిందిదే’
జట్టులో చోటే లేని దుస్థితి నుంచి టీ20 ప్రపంచకప్-2026 హీరోగా నీరాజనాలు అందుకునే స్థాయికి ఎదిగాడు సంజూ శాంసన్. ఈ ఐసీసీ టోర్నీకి ముందు ఓపెనర్‌గా తుదిజట్టులో సంజూ స్థానం గల్లంతైంది. వరుస వైఫల్యాలే ఇందుకు కారణం. అదే సమయంలో టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన ఇషాన్ కిషన్ (Ishan Kishan).. ఓపెనర్, వికెట్ కీపర్‌గా సంజూను రీప్లేస్ చేశాడు. వరుస మ్యాచ్‌లలో అదరగొడుతూ తుదిజట్టులో స్థానం పదిలం చేసుకున్నాడు.అలా వచ్చిఇక సంజూ ఈసారి కూడా వరల్డ్‌కప్ ఆడే పరిస్థితి ఉండకపోవచ్చు అని అభిమానులు నిరాశచెందిన వేళ.. అభిషేక్ శర్మ (Abhishek Sharma) కడుపునొప్పితో లీగ్ దశలో నమీబియాతో మ్యాచ్‌కు దూరం అయ్యాడు. ఆ మ్యాచ్‌లో ఇషాన్‌తో పాటు సంజూ ఓపెనర్‌గా బరిలో దిగాడు. నాకౌట్ మ్యాచ్‌లలో ఆకాశమే హద్దుగాఅనంతరం సూపర్-8లో భాగంగా జింబాబ్వేతో మ్యాచ్‌లోనూ ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్‌కు చోటు దక్కింది. ఈ రెండు మ్యాచ్‌లలో వేగంగా ఆడే క్రమంలో సంజూ అవుటైనా.. నాకౌట్ మ్యాచ్‌లలో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు.సూపర్-8లో వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో 97 పరుగులతో అజేయంగా నిలిచిన సంజూ శాంసన్.. జట్టును సెమీస్ చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లో 89 పరుగులు చేసిన ఈ కుడిచేతివాటం బ్యాటర్.. న్యూజిలాండ్‌తో ఫైనల్లోనూ 89 పరుగులతో దుమ్ములేపాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు గెలుచుకున్నాడు. మొత్తంగా ఈ టోర్నీలో కేవలం ఐదు మ్యాచ్‌లే ఆడి ఏకంగా 321 పరుగులతో సంజూ సత్తా చాటాడు.అతడు తలచుకుంటే మూడూ సెంచరీలు అయ్యేవిఈ నేపథ్యంలో సంజూ శాంసన్‌పై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తాజాగా ప్రశంసలు కురిపించాడు. ‘‘తుది జట్టులో శాంసన్‌కు చోటు ఇవ్వలేనప్పుడు సర్ది చెప్పాల్సి వచ్చింది. ఇది కఠిన సమయం కావచ్చు కానీ దేవుడు దయతలిస్తే నీకూ అవకాశం వస్తుంది. అప్పుడు నువ్వేంటో చూపించాలి అన్నాను.దాని కోసం మాత్రం అతడు ఎప్పుడూ సిద్ధమవుతూనే వచ్చాడు. చివరి వరుస మూడు మ్యాచ్‌లలో శాంసన్ ప్రతాపం ఏమిటో చూశాం. అతడు అనుకుంటే ఈ మూడు ఇన్నింగ్స్‌లు కూడా సెంచరీలుగా మారేవి. కానీ అతను మాత్రం జట్టు కోసమే ఆడాడు’’ అని ‘చెట్టా (మలయాళంలో పెద్దన్న అనే అర్థం)’ సంజూను సూర్య కొనియాడాడు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా జట్టు గెలుపే లక్ష్యంగా నిస్వార్థంగా ఆడాడని ప్రశంసించాడు.చదవండి: రోహిత్-కోహ్లి అభిమానులకు శుభవార్త -
T20 WC 2026: ఆరోపణలపై స్పందించిన ఐసీసీ
ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఆదివారం ముగిసింది. శ్రీలంకతో కలిసి ఈ ఈవెంట్‌కు ఆతిథ్యం ఇచ్చిన భారత్.. ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి జగజ్జేతగా అవతరించింది. ఇదిలా ఉంటే.. సూపర్–8 దశలోనే నిష్క్రమించిన వెస్టిండీస్ మ్యాచ్‌లు అయిపోయి పది రోజులు దాటిపోయింది. సెమీస్‌లో వెనుదిరిగిన దక్షిణాఫ్రికా ఆట ముగిసి వారం రోజులకు పైనే.పశ్చిమాసియాలో సంక్షోభ పరిస్థితులుకానీ ఇన్ని రోజులైనా ఈ రెండు జట్లు భారత్‌లోనే గడపాల్సి వచ్చింది. ఇరాన్‌పై యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియా వ్యాప్తంగా సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. గల్ఫ్ గగన తలం మూసివేయగా, వందల సంఖ్యలో భారత్ నుంచి రోజువారీ విమాన సర్వీసులు రద్దయ్యాయి. చార్టర్ విమానాల్ని ఏర్పాటు చేయాలనుకున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ప్రయత్నాలు కూడా విఫలమవడంతో గల్ఫ్ మీదుగా వెళ్లాల్సిన కరీబియన్, సఫారీ జట్లు ఇక్కడే చిక్కుకుపోయాయి.చివరకు మంగళవారం కూడా ప్రత్యామ్నాయ ఆకాశ మార్గాల్లో ప్రత్యేక విమానాల్లో ఆటగాళ్లను స్వదేశాలకు చేర్చాలనుకున్నా... వీలుపడలేదు. ఎట్టకేలకు రెగ్యులర్ కమర్షియల్ ఫ్లయిట్లలో పంపించడంతో క్రికెటర్లు ఊపిరి పీల్చుకున్నారు. ఇంగ్లండ్‌కు ప్రాధాన్యం ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ సెమీస్‌లోనే వెనుదిరగగా.. మరుసటి రోజే స్వదేశానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో తాము భారత్‌లోనే చిక్కుకుపోవడం పట్ల విండీస్ హెడ్‌కోచ్ డారెన్ సామీ, ప్లేయర్ ఆకీల్ హొసేన్ తదితరులు ఐసీసీ తీరును విమర్శించారు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ సైతం ఇంగ్లండ్‌కు ఇచ్చిన ప్రాధాన్యత.. విండీస్, సౌతాఫ్రికా జట్లకు ఇవ్వలేదని.. ఇది వివక్షే అంటూ ఐసీసీపై ఆరోపణలు చేశాడు.మేము అర్థం చేసుకోగలంఈ నేపథ్యంలో ఐసీసీ తాజాగా ప్రకటన విడుదల చేసింది. ‘‘ఆటగాళ్లు, కోచ్‌లు, సహాయక సిబ్బంది, వారి కుటుంబాలు వరల్డ్‌కప్‌లో ఆయా జట్ల ప్రయాణం ముగిసిన తర్వాత కూడా స్వదేశానికి చేరుకోకపోవడం పట్ల అసంతృప్తి చెందిన తీరును మేము అర్థం చేసుకోగలం.వారి కోపంలో అర్థం ఉంది. గల్ఫ్ ప్రాంతంలో యుద్ధం వల్లే ఈ పరిస్థితి. అంతర్జాతీయ గగనతల ప్రయాణాలకు ఇబ్బంది కలిగింది. క్షిపణుల ప్రయోగాలు, ప్రతీకార చర్యల వల్ల పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. అందుకే చార్టర్ ఫ్లైట్లు ఏర్పాటు చేయడంలోనూ ఆలస్యం జరిగింది.మా ఆధీనంలో లేవుఈ పరిస్థితులన్నీ ఐసీసీ ఆధీనంలో లేనివి. యుద్ధం వల్లే పరిస్థితులు సంక్లిష్టంగా మారాయి. అయినప్పటికీ ఎప్పటికప్పుడు చార్టర్ ఆపరేటర్లు, ఎయిర్‌పోర్టు అధికారులు, ప్రభుత్వాలతో మేము సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాము. ఆటగాళ్లను సురక్షితంగా స్వదేశాలకు చేర్చడమే లక్ష్యంగా పనిచేశాము. సౌతాఫ్రికా జట్టు ఇప్పటికే బయల్దేరగా.. వెస్టిండీస్ బృందంలోని చాలా మంది సభ్యులు ఇంటికి చేరుకున్నారు’’ అని ఐసీసీ పేర్కొంది.ఇక ఐసీసీ వర్గాలు మైకేల్ వాన్ (Michael Vaughan) విమర్శలపై స్పందిస్తూ.. గగనతలంలో ఉన్న పరిస్థితులను బట్టే ఇంగ్లండ్ జట్టును ముందుగా స్వదేశానికి పంపించామని పేర్కొన్నాయి. మిగతా జట్ల ప్రయాణం గల్ఫ్ ప్రాంతం గుండా సాగాల్సినందునే ఆలస్యం అయిందని స్పష్టం చేశాయి.వారు మాత్రం ఇక్కడేఇదిలా ఉంటే.. ఐపీఎల్ సీజన్ కోసం పలువురు వెస్టిండీస్ క్రికెటర్లు భారత్‌లోనే ఉండిపోయారు. రావ్మన్ పావెల్ (కోల్‌కతా నైట్‌రైడర్స్), రూథర్‌ఫర్డ్ (ముంబై ఇండియన్స్), హెట్‌మైర్ (రాజస్తాన్ రాయల్స్), రొమారియో షెఫర్డ్ (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు)లు మాత్రం జట్టు వెంట బయలుదేరలేదు. ఐపీఎల్ ఫ్రాంచైజీలు త్వరలోనే తమ శిబిరాలను ప్రారంభించేందుకు సిద్ధమవడంతో ఆటగాళ్లు ఆయా జట్లతో చేరనున్నారు.చదవండి: T20 WC 2026: 'భారత్ ఒక ఛాంపియన్ జట్టు.. తప్పులు వెతకడం ఆపండి' -
ఇంగ్లండ్ యువ కెరటానికి జాక్‌పాట్
టీ20 ప్రపంచకప్-2026 సెమీఫైనల్లో భారత్‌పై మెరుపు శతకం సాధించిన ఇంగ్లండ్ యువ కెరటం జేకబ్ బేతెల్‌కు తగిన నజరానా లభించింది. హండ్రెడ్ లీగ్‌లో బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ ఫ్రాంచైజీ 2026 ఎడిషన్ కోసం అతన్ని కెప్టెన్‌గా నియమించింది. లియామ్ లివింగ్‌స్టోన్ స్థానంలో బేతెల్‌కు కెప్టెన్‌గా ఎంపిక చేసినట్లు ఫీనిక్స్ యాజమాన్యం ప్రకటించింది. 22 ఏళ్ల బేతెల్‌కు గతంలో ఇంగ్లండ్ కెప్టెన్‌గా పని చేసిన అనుభవం కూడా ఉంది. గతేడాది అతను ఐర్లాండ్ పర్యటనలో సారధిగా వ్యవహరించాడు. ఆ పర్యటనలో బేతెల్ నేతృత్వంలో ఇంగ్లండ్ జట్టు 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఆ సిరీస్ తర్వాత అతి పిన్న వయసులో ఇంగ్లండ్ కెప్టెన్‌గా పని చేసిన రికార్డు బేతెల్ వశమైంది.ఫీనిక్స్ కెప్టెన్‌గా ఎంపిక కావడంపై బేతెల్ స్పందించాడు. ఇది నాకు దక్కిన గౌరవమని పేర్కొన్నాడు. ఇంగ్లండ్ జట్టును నడిపిన అనుభవం నాకు చాలా నేర్పింది. ఇప్పుడు కొత్త బాధ్యతను స్వీకరించాడని సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. బేతెల్ తాజాగా భారత్‌తో జరిగిన పొట్టి ప్రపంచకప్ రెండో సెమీఫైనల్లో పేట్రేగిపోయాడు. కేవలం 48 బంతుల్లో 105 పరుగులు చేసి తన జట్టును గెలుపుకు దగ్గరగా తీసుకెళ్లాడు. భారీ లక్ష్య ఛేదనలో ఓ పక్క వికెట్లు పడుతున్నా, ఒంటరిపోరాటం చేసి తన జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను ఓడించిన భారత్.. ఆతర్వాత ఫైనల్లో న్యూజిలాండ్‌ను కూడా చిత్తు చేసి వరుసగా రెండో ఎడిషన్‌లో జగజ్జేతగా అవతరించిన విషయం తెలిసిందే. ఈ ప్రపంచకప్‌లో బేతెల్ 8 ఇన్నింగ్స్‌ల్లో 35 సగటున 280 పరుగులు చేశాడు.ఐపీఎల్లో సవాలుహండ్రెడ్ లీగ్‌లో బేతెల్‌కు కెప్టెన్సీ దక్కినా ఐపీఎల్ మాత్రం తుది జట్టు స్థానం దక్కడమే గగనంగా మారింది. గత ఎడిషన్‌లో బేతెల్‌ను ఆర్సీబీ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆర్సీబీలో అప్పటికే ఫిల్ సాల్ట్, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, జోష్ హేజిల్‌వుడ్ వంటి విదేశీ ఆటగాళ్లు ఉండటంతో బేతెల్‌కు తుది జట్టులో స్థానం దక్కలేదు. మరి ఈ సీజన్లో అయినా అవకాశాలు లభిస్తాయో లేదో చూడాలి. -
మా జట్టుకే ప్రాధాన్యం!.. ఐసీసీపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఫైర్
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తీరును తప్పుబట్టాడు. ఐసీసీ ఒక్కొక్క జట్టును ఒక్కోలా చూస్తుందని.. తాజాగా ఇంగ్లండ్‌కు పెద్ద పీట వేసిన తీరే ఇందుకు నిదర్శనమని విమర్శించాడు. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి భారత్- శ్రీలంక ఆతిథ్యం దేశాలుగా ఉన్న విషయం తెలిసిందే.టైటిల్ పోరుతో తెరఫిబ్రవరి 7న మొదలైన ఈ ఐసీసీ టోర్నీ నేటి (మార్చి 8) ఫైనల్‌తో ముగియనుంది. భారత్- న్యూజిలాండ్ (IND vs NZ) మధ్య జరిగే టైటిల్ పోరుకు అహ్మదాబాద్ వేదిక. ఇదిలా ఉంటే.. వరల్డ్‌కప్ టోర్నీ మధ్యలోనే మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు.. అందుకు ఇరాన్ స్పందిస్తున్న తీరుతో యుద్ధం తీవ్ర రూపం దాల్చింది.వెస్టిండీస్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు ఇక్కడే!ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశాల గగనతలం మూసివేయడంతో వెస్టిండీస్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు భారత్‌లోనే చిక్కుకుపోయాయి. నిజానికి విండీస్ మార్చి 1 టీమిండియా చేతిలో ఓటమి తర్వాత టోర్నీ నుంచి నిష్క్రమించింది. పరిస్థితులు సాధారణంగా ఉండి ఉంటే.. ఆ మరుసటి రోజే స్వదేశానికి చేరుకోవాల్సింది.కానీ పశ్చియాసియాలో యుద్ధం కారణంగా విండీస్ జట్టు వారం రోజులుగా ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. మరోవైపు.. సౌతాఫ్రికా సెమీ ఫైనల్లో న్యూజిలాండ్‌తో జరిగిన మార్చి 4 నాటి మ్యాచ్‌లో ఓడి ఎలిమినేట్ అయింది. యుద్ధ పరిస్థితుల వల్ల జట్టు కూడా ఇక్కడే ఉంది. మరోవైపు.. సెమీ ఫైనల్లో మార్చి 5న టీమిండియా చేతిలో ఓడిన ఇంగ్లండ్ కూడా ఇక్కడే ఉండాల్సి రాగా.. ఐసీసీ జోక్యంతో శనివారం స్వదేశానికి ప్రత్యేక విమానంలో బయల్దేరింది. ఇక వెస్టిండీస్, సౌతాఫ్రికా జట్లకు కూడా ఐసీసీ ప్రత్యేక విమానం ఏర్పాటు చేసినా.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి అనుమతి రాలేదని సమాచారం.దీంతో ఆ రెండు జట్లు ఇంకా భారత్‌లోనే ఉండాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో విండీస్ హెడ్‌కోచ్ డారెన్ సామీ.. ‘‘మమ్మల్ని త్వరగా పంపిచేయండి’’ మహాప్రభో అంటూ మొరపెట్టుకున్న తీరు చర్చనీయాంశమైంది.ఇంగ్లండ్‌కి మాత్రం చార్టర్ ఫ్లైట్ దొరికిందిఈ పరిణామాలపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ఐసీసీ తీరును విమర్శించాడు. ‘‘ఇంగ్లండ్ గురువారమే నాకౌట్ అయింది. వాళ్లకి మాత్రం చార్టర్ ఫ్లైట్ దొరికింది. వెస్టిండీస్ గత ఆదివారం నుంచి కోల్‌కతాలోనే చిక్కుకుపోయింది.సౌతాఫ్రికా పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఇక్కడే అధికార దుర్వినియోగం ఎలా జరుగుతుందో మనం తెలుసుకోవచ్చు. జట్లన్నీ ఒకే పరిస్థితిలో ఉన్నపుడు.. వాటన్నింటీ ఒకే విధంగా ట్రీట్ చేయాలి కదా!.. ఓ దేశ బోర్డు శక్తిమంతమైనది అయినంత మాత్రాన ఐసీసీ వాళ్లకు ప్రాధాన్యం ఇవ్వకూడదు’’ అని మైకేల్ వాన్ ట్వీట్ చేశాడు.ఓవరాక్షన్ వద్దుఅయితే, వాన్ పోస్టుకు నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇండియా- యూరోప్ మధ్య గగనతలంలో ఎలాంటి అడ్డంకులు లేవని.. అదే వెస్టిండీస్ వంటి జట్టు స్వదేశం చేరాలంటే గల్ఫ్ దేశాలు దాటాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు.ఒకవేళ యూరోప్ గుండా విండీస్ జట్టును పంపించాలన్నా ఇప్పటికిప్పుడు వీసా, ఒకే చోట 40- 50 మందికి సీట్లు అరేంజ్ చేయడం కుదరదని అంటున్నారు. భౌగోళిక పరిస్థితులను బట్టే ఓ జట్టు ముందు.. ఓ జట్టు వెనక వెళ్లడం జరుగుతుందని.. అంతే తప్ప ఇందులో అధికార దుర్వినియోగం ఏమీ లేదని వాన్‌కు చురకలు అంటిస్తున్నారు. కాగా ఆదివారం నాటికి వెస్టిండీస్, సౌతాఫ్రికా జట్లు స్వదేశానికి చేరుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.చదవండి: T20 WC Final: సాంట్నర్‌కు ఇచ్చిపడేసిన సూర్యకుమార్ -
నీకంత దూకుడు ఎందుకు?: అభిషేక్ శర్మపై అశ్విన్ ఆగ్రహం
అభిషేక్ శర్మ.. తొలిసారి ప్రపంచకప్ టోర్నీ ఆడుతున్న ఈ ఓపెనింగ్ బ్యాటర్ దారుణంగా విఫలమవుతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్‌లలో అతడు చేసిన స్కోర్లు వరుసగా.. 0 (1), 0 (4), 0 (3), 15 (12), 55 (30), 10 (11), 9 (7).విఫలమైనా..లీగ్ దశలో మూడు మ్యాచ్‌లు ఆడి డకౌట్ అయినా యాజమాన్యం అభిషేక్ శర్మ (Abhishek Sharma)ను ఓపెనర్‌గా కొనసాగించిది. అయితే, అతడి ఆట తీరు మాత్రం మారలేదు. ముఖ్యంగా ఇంగ్లండ్‌తో కీలక సెమీ ఫైనల్లోనూ ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ తేలిపోయాడు. తొందరపడి వికెట్ పారేసుకుని తొమ్మిది పరుగులకే నిష్క్రమించాడు.సంజూ మెరుపు ఇన్నింగ్స్మరో ఓపెనర్ సంజూ శాంసన్ (Sanju Samson) మెరుపు ఇన్నింగ్స్ (42 బంతుల్లో 89) తో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో అభిషేక్ ఆట తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది. టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సైతం ఈ ఓపెనింగ్ బ్యాటర్ వైఖరిని తప్పుబట్టాడు.తలతిక్క బ్యాటింగ్‘‘ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లో అతడు తలతిక్కగా బ్యాటింగ్ చేశాడు. నిజానికి అభిషేక్ గేమ్‌ప్లాన్‌కు నేను వీరాభిమానిని. విల్ జాక్స్ బౌలింగ్‌లో అతడు ఎనిమిది పరుగులు రాబట్టాడు. కానీ ఈ తర్వాత అతడి ఓవర్లోనే 30 పరుగులు తీయాలి అన్నట్లు తొందరపడ్డాడు.నీకంత దూకుడు ఎందుకు?కొన్నిసార్లు బాల్‌ను వదిలేయాల్సి ఉంటుంది. ఓవైపు సంజూ శాంసన్ కుదురుగా ఆడుతున్నాడు కదా!.. నీకు కష్టంగా అనిపిస్తే ఒక సింగిల్ తీసి మరో ఎండ్‌కు వెళ్లిపోవాల్సింది. ఆ తర్వాత మళ్లీ అవకాశం వస్తుంది కదా!.. ఏదేమైనా అంత దూకుడు పనికిరాదు’’ అని అశ్విన్ అభిషేక్‌పై మండిపడ్డాడు.అదే విధంగా.. న్యూజిలాండ్‌తో ఫైనల్ నేపథ్యంలో.. ‘‘అభిషేక్ మంచి బ్యాటర్. న్యూజిలాండ్‌తో ఇటీవలి సిరీస్‌లో సూపర్ ఫామ్ కనబరిచాడు. మిచెల్ సాంట్నర్, మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో గతంలో అదరగొట్టాడు.ఒత్తిడిలో ఉన్నాడుఅయితే, ఇప్పుడు అతడు ఒత్తిడిలో ఉన్నాడు. కెప్టెన్, హెడ్‌కోచ్ అతడితో మాట్లాడాలి. తనకు వ్యతిరేకంగా ప్రత్యర్థి జట్టు వద్ద ఉన్న ప్రణాళికలను వివరించాలి. అతడిలో గొప్ప ప్రతిభ ఉంది. కానీ ఎందుకో తడబడుతున్నాడు.ఇలాంటి తరుణంలో అతడిపై మరింత ఒత్తిడి చేసే విధంగా మేనేజ్మెంట్ ఉండకూడదు. మానసికంగా దృఢంగా తయారయ్యేలా తీర్చిదిద్దాలి’’ అని టీమిండియా యాజమాన్యానికి అశూ సూచనలు ఇచ్చాడు. కాగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఆ జట్టు కెప్టెన్ హ్యారీ బ్రూక్.. అభిషేక్ కోసం లెగ్‌సైడ్‌లో ఒకే ఒక్క ఫీల్డర్‌ను ఉంచాడు. అతడికి క్యాచ్ ఇచ్చి అభిషేక్ పెవిలియన్ చేరాడు. ఇదిలా ఉంటే.. మార్చి 8న భారత్- న్యూజిలాండ్ మధ్య టీ20 ప్రంచకప్-2026 ఫైనల్‌కు షెడ్యూల్ ఖరారైంది.చదవండి: T20 WC: అతడి వల్లే ఇదంతా.. మా కొంప మునిగింది అక్కడే: మెకల్లమ్ -
సంజూ కాదు!.. అతడే అందుకు అర్హుడు: మాజీ క్రికెటర్
టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసలు కురిపించాడు. బుమ్రా లాంటి బౌలర్ దొరకడం భారత జట్టు చేసుకున్న అదృష్టం అని కొనియాడాడు. టీమిండియాలో ఇంత వరకు ఇలాంటి బౌలర్‌ను ఎన్నడూ చూడలేదంటూ ఆకాశానికెత్తాడు.టైటిల్ పోరుకు అర్హతటీ20 ప్రపంచకప్-2026లో భారత్ ఫైనల్‌కు దూసుకువెళ్లిన విషయం తెలిసిందే. ముంబై వేదికగా వాంఖడేలో జరిగిన సెమీ ఫైనల్లో ఇంగ్లండ్‌పై ఏడు పరుగుల తేడాతో గెలిచిన సూర్య సేన.. టైటిల్ పోరుకు అర్హత సాధించింది.ఈ మ్యాచ్‌లో ఓపెనర్ సంజూ శాంసన్ (42 బంతుల్లో 89) బ్యాట్‌తో రాణిస్తే.. బుమ్రా తన అద్భుత స్పెల్‌తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఇంగ్లండ్ చిచ్చర పిడుగు జేకబ్ బెతెల్ (48 బంతుల్లో 105) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను లాగేసుకునే ప్రయత్నం చేస్తున్న వేళ.. బుమ్రా తన మ్యాజిక్ చూపించాడు.కీలక సమయంలో రాణించిపద్దెనిమిదవ ఓవర్లో 0,1,1,2,1,1 మాత్రమే ఇచ్చిన బుమ్రా.. టీమిండియా వైపు మ్యాచ్ తిప్పేశాడు. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ బుమ్రాను ప్రశంసలతో ముంచెత్తాడు. ‘‘బుమ్రా గురించి ఇప్పటికే చాలాసార్లు మాట్లాడుకున్నాం. అతడు తరానికొక్క బౌలర్. టీమిండియాలో ఇలాంటి బౌలర్‌ను చూడటం అరుదు.సంజూ కాదు!.. అతడే అందుకు అర్హుడుయార్కర్లు, స్లో బాల్స్ వేస్తాడు.. అవుట్ స్వింగ్, ఇన్‌స్వింగ్ రాబడతాడు. బౌన్సర్లు సంధిస్తాడు. ముఖ్యంగా ఒత్తిడిలోనూ ఎలా బౌలింగ్ చేయాలో అతడికి బాగా తెలుసు. నా దృష్టిలో ఈ మ్యాచ్‌కు సంబంధించి బుమ్రాకే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇవ్వాల్సింది.ఈ పిచ్‌పై బౌలర్లందరి ఎకానమీ దాదాపుగా 10 దాటి పోయింది. రెండు జట్లు కలిపి 500కు పైగా పరుగులు చేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో అలా బౌలింగ్ చేయడం అందరికీ సాధ్యం కాదు. ఇంతటి కఠినమైన ఓవర్‌ను బుమ్రా మాత్రమే వేయగలడు’’ అని ఇర్ఫాన్ పఠాన్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా పేర్కొన్నాడు.అక్షర్ పటేల్ సైతంకాగా ఈ మ్యాచ్‌లో సంజూకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. సంజూ సైతం బుమ్రానే ఈ అవార్డుకు అర్హుడు అని పేర్కొనడం గమనార్హం. ఇదిలా ఉంటే.. బుమ్రా ఓవరాల్‌గా నాలుగు ఓవర్లలో 33 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. మరోవైపు.. అక్షర్ పటేల్ అద్భుతమైన క్యాచ్‌లతో టీమిండియా విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. Next stop: FINAL! 😍A high-scoring thriller, but #TeamIndia hold their nerve and book a spot in the final! 🔥ICC Men’s #T20WorldCup | FINAL | #INDvNZ | SUN, 8th MAR, 5:30 PM pic.twitter.com/PQfdlxUEv7— Star Sports (@StarSportsIndia) March 5, 2026చదవండి: T20 WC: అతడి వల్లే ఇదంతా.. మా కొంప మునిగింది అక్కడే: మెకల్లమ్ -
ఇది వరల్డ్‌కప్.. గుర్తుందా?: గావస్కర్ ఫైర్
ఐసీసీ టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో భారత్ ఫైనల్‌కు చేరుకుంది. ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లో ఆఖరి ఓవర్ వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో.. ఏడు పరుగుల తేడాతో గట్టెక్కింది. ముంబైలోని ప్రసిద్ధ వాంఖడే మైదానంలో భారత్- ఇంగ్లండ్ మధ్య రెండో సెమీస్ మ్యాచ్ గురువారం జరిగిన విషయం తెలిసిందే.సంజూ భారీ అర్ధ శతకంటాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగి.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 253 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. ఓపెనింగ్ బ్యాటర్ సంజూ శాంసన్ భారీ అర్ధ శతకం (42 బంతుల్లో 89) తో ఆకట్టుకున్నాడు.ఇక లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో టీమిండియాకు శుభారంభం లభించింది. హార్దిక్ పాండ్యా ఫిల్ సాల్ట్ (5) రూపంలో తొలి వికెట్ దక్కించుకోగా.. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా హ్యారీ బ్రూక్ (7)ను అవుట్ చేసి కీలక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.బెతెల్ విధ్వంసకర శతకంఅయితే, జేకబ్ బెతెల్ విధ్వంసకర శతకం (48 బంతుల్లో 105)తో విరుచుకుపడి.. భారత శిబిరంలో గుబులు రేపాడు. అయితే, పద్దెనిమిదో ఓవర్లో బుమ్రా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పాడు. దీంతో ఏడు పరుగుల స్వల్ప తేడాతో గెలిచి టీమిండియా ఊపిరి పీల్చుకుంది.ఇక ఈ మ్యాచ్‌లో బుమ్రా నాలుగు ఓవర్ల కోటాలో 33 పరుగులు ఇచ్చి ఒక వికెట్ కూల్చాడు. ఇదిలా ఉంటే.. బుమ్రా బౌలింగ్ వేసేందుకు సిద్ధమవుతున్న క్రమంలో వాంఖడే డీజే బృందం.. ‘‘బూమ్ బూమ్ బుమ్రా’’ అంటూ బుమ్రా నామస్మరణ చేయాలని ప్రేక్షకులకు పిలుపు ఇచ్చారు. దీంతో అందరూ బుమ్రా పేరును గట్టిగా పలుకుతూ స్టేడియం దద్దరిల్లేలా చేశారు.Every Team India fan after watching Jasprit Bumrah’s masterclass! 🇮🇳🔥ICC Men’s #T20WorldCup 👉🏻 FINAL | #INDvNZ | SUN, 8th MAR, 5:30 PM pic.twitter.com/My9xx2WPyt— Star Sports (@StarSportsIndia) March 6, 2026బుమ్రా ఏంటి బుమ్రా?ఈ విషయంపై స్పందిస్తూ భారత మాజీ కెప్టెన్, కామెంటేటర్ సునిల్ గావస్కర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘‘బుమ్రా బౌలింగ్ చేసేందుకు సిద్ధపడినపుడు.. ‘బూమ్ బూమ్ బుమ్రా’ అని అరవాలని చెప్పడం సరికాదు.బుమ్రా నామస్మరణ చేయాలనుకుంటే అతడు ఫ్రీగా ఉన్నపుడు చేయాలి. ఇది వరల్డ్‌కప్ అన్న విషయం గుర్తుంచుకోవాలి’’ అని గావస్కర్ ఫైర్ అయ్యాడు. కాగా కీలక సెమీ ఫైనల్లో బుమ్రా బౌలింగ్ చేస్తున్నపుడు.. అతడి ఏకాగ్రత దెబ్బతినేలా ప్రవర్తించడం సరికాదన్నది గావస్కర్ అభిప్రాయం.ఇదిలా ఉంటే.. వెస్టిండీస్‌తో సూపర్-8లో టీమిండియా తప్పక గెలవాల్సిన మ్యాచ్ సందర్భంగా.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) చేసిన ఏర్పాట్లపై కూడా గావస్కర్ ఇదే విధంగా స్పందించాడు. మ్యాచ్ మధ్యలో లేజర్ షో ఏర్పాటు చేయడం ఏమిటని ప్రశ్నించాడు. రవిశాస్త్రి కూడా అతడికి మద్దతు పలికాడు.చదవండి: T20 WC: అతడి వల్లే ఇదంతా.. మా కొంప మునిగింది అక్కడే: మెకల్లమ్ -
చూసుకోవా?.. హార్దిక్ కుమారుడి రియాక్షన్.. మహీక షాక్!
ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లో టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఆకట్టుకున్నాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఈ కుడిచేతి వాటం ఆటగాడు.. 12 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 27 పరుగులు సాధించాడు. తద్వారా తన మెరుపు ఇన్నింగ్స్‌తో టీమిండియా 250 పరుగులు మార్కు దాటడంలో సహాయపడ్డాడు.రెండు వికెట్లుఇక బంతితోనూ హార్దిక్ పాండ్యా రాణించాడు. ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ (5)తో పాటు ప్రమాదకర ఆటగాడు సామ్ కర్రాన్ (18) వికెట్‌ను కూడా హార్దిక్ పాండ్యా తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తంగా నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి 38 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.ఇదిలా ఉంటే.. ముంబై వేదికగా వాంఖడే మైదానంలో టీమిండియా- ఇంగ్లండ్ మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు సెలబ్రిటీలు తరలివచ్చిన విషయం తెలిసిందే. అంబానీ కుటుంబంతో పాటు దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని దంపతులు సహా బాలీవుడ్ ప్రముఖులు ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా తిలకించారు.నీతా అంబానీతో కలిసిఇక హార్దిక్ పాండ్యా ప్రేయసి మహీక శర్మ కూడా మరోసారి స్టాండ్స్‌లో సందడి చేసింది. నీతా అంబానీతో కలిసి మహీక ఒకే వరుసలో కూర్చుంది. అయితే, ఆమెతో పాటు హార్దిక్ కుమారుడు అగస్త్య ఉండటం విశేషం. తండ్రి బ్యాటింగ్‌ను ఆస్వాదించిన అగస్త్య.. అతడు అవుటైన తీరును మాత్రం తట్టుకోలేకపోయాడు.ఆ మాత్రం చూసుకోవా?భారత ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ ఐదో బంతికి.. విల్‌జాక్స్ బౌలింగ్‌లో హార్దిక్ పాండ్యా పరుగు పూర్తి చేసి రనౌట్ అయ్యాడు. మరో పరుగుకు యత్నిస్తున్న క్రమంలో జేకబ్ బెతెల్ బంతిని అందుకుని వికెట్ల వైపు త్రో చేయగా.. వికెట్ కీపర్ బట్లర్ పని పూర్తిచేశాడు. దీంతో హార్దిక్ అవుటయ్యాడు. ఈ క్రమంలో ఐదేళ్ల అగస్త్య కోపంతో ఊగిపోయాడు. ‘‘ఛ.. అంత బాగా ఆడి.. ఇంత చెత్తగా అవుటయ్యావేంటి నాన్నా.. ఆ మాత్రం చూసుకోవా?’’ అన్నట్లుగా గట్టిగా అరిచినట్లు కనిపించింది.ఆమె చేయి పట్టుకుని ఆ సమయంలో మహీక అగస్త్య భుజాలు పట్టుకుని కూల్ చేసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక మ్యాచ్ ముగిసిన అనంతరం మహీక తనతో పాటు అగస్త్యను తీసుకువెళ్లింది. అగస్త్య ఆమె చేయి పట్టుకుని కారు ఎక్కుతున్న వీడియోలు కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.Hardik’s Girl Friend Mahieka with His Son Agasthya pic.twitter.com/oJwx1mxUU6— Ajit Samachar (@SamacharAj10350) March 6, 2026 Hardik Pandya's son Agastya pandya with his dad's girlfriend Mahieka Sharma 😭♥️#INDvsENG pic.twitter.com/5U5DejxvKj— Chota Don (@choga_don) March 5, 2026కాగా సెర్బియా మోడల్ నటాషా స్టాంకోవిక్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న హార్దిక్ పాండ్యాకు.. ఆమె ద్వారా కుమారుడు అగస్త్య కలిగాడు. అయితే, నటషాకు విడాకులు ఇచ్చిన పాండ్యా ప్రస్తుతం మహీకతో ప్రేమలో ఉన్నాడు. ఇక సెమీ ఫైనల్లో ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో ఏడు పరుగుల తేడాతో గెలిచి భారత్ ఫైనల్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే.చదవండి: T20 WC 2026: ఇంగ్లండ్ ఆటగాళ్లను ఆకాశానికెత్తిన సూర్యకుమార్ -
T20 WC: మా ఓటమికి కారణం అతడే: మెకల్లమ్
ఇంగ్లండ్ కల చెదిరింది. టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్లో అడుగుపెట్టాలనుకున్న బ్రూక్ బృందాన్ని టీమిండియా గట్టి షాకిచ్చింది. ముంబై వేదికగా గురువారం నాటి సెమీ ఫైనల్లో ఏడు పరుగుల స్వల్ప తేడాతో గెలిచి భారత్ ఫైనల్‌కు దూసుకువెళ్లింది.ఆఖరి వరకు పోరాడినా ఇంగ్లండ్‌కు చేదు అనుభవమే మిగిలింది. ఇక టీమిండియా గెలుపులో అక్షర్ పటేల్ (Axar Patel)దీ కీలక పాత్రే. సంజూ శాంసన్ బ్యాట్‌తో రాణించగా.. జస్ప్రీత్ బుమ్రా బంతితో అదరగొట్టాడు. వీరిద్దరికి తోడు అక్షర్ అందుకున్న క్యాచ్‌లే గెలుపును టీమిండియా వైపు తిప్పాయి.ఇంగ్లండ్ హెడ్‌కోచ్ బ్రెండన్ మెకల్లమ్ (Brendon McCullum) కూడా ఇదే మాట అంటున్నాడు. తమ ఓటమికి గల కారణాలు విశ్లేషిస్తూ.. అక్షర్ అందుకున్న అద్భుత క్యాచ్‌లే మ్యాచ్‌ను తమ నుంచి లాగేసుకున్నాయని పేర్కొన్నాడు. స్కై స్పోర్ట్స్ క్రికెట్‌తో మాట్లాడుతూ..అద్భుత రీతిలో క్యాచ్‌లు అందుకుని‘‘నిజం చెప్పాలంటే ఈ మ్యాచ్‌లో అక్షర్ అందుకున్న ఆ రెండు క్యాచ్‌ల గురించి మాట్లాడాలి. వాంఖడే మైదానంలో ఇలాంటి క్యాచ్‌లు అంత సులువేమీ కాదు. ఈ మ్యాచ్‌లో టీమిండియా తమ ప్రణాళికలను పక్కాగా అమలు చేసింది.ముఖ్యంగా అక్షర్ అద్భుత రీతిలో క్యాచ్‌లు అందుకుని మ్యాచ్‌ను టీమిండియా వైపు తిప్పేశాడు. కీలక సమయంలో అతడు రాణించాడు. నిజానికి చాన్నాళ్లుగా వాళ్ల ఫీల్డింగ్ అంత గొప్పగా ఏమీ లేదు.. ఈ రోజు మా వాళ్లే ఇంకాస్త మెరుగ్గా ఆడి ఉండే బాగుండేది. ఏదేమైనా వాళ్లకి (టీమిండియా) క్రెడిట్ ఇవ్వాల్సిందే’’ అని మెకల్లమ్ చెప్పుకొచ్చాడు.𝗕𝗮𝗽𝘂 𝗯𝗮𝘁𝘁𝗲𝗿𝘀 𝗸𝗲 𝗹𝗶𝘆𝗲 𝗵𝗮𝗻𝗶𝗸𝗮𝗿𝗮𝗸 𝗵𝗮𝗶. 🥵ICC Men’s #T20WorldCup | FINAL | #INDvNZ | SUN, 8th MAR, 5:30 PM pic.twitter.com/4e06e0SYAv— Star Sports (@StarSportsIndia) March 5, 2026అక్షర్ ఫీల్డింగ్.. భారత్ విజయానికి బాటలుకాగా ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లో అక్షర్ పటేల్ రెండు క్యాచ్‌లు అందుకున్నాడు. తొలుత హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఫిల్ సాల్ట్ (5) ఇచ్చిన సులువైన క్యాచ్‌ను అందుకున్నాడు. అయితే, కెప్టెన్, డేంజరస్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ బుమ్రా బౌలింగ్‌లో బంతిని గాల్లోకి తరలించగా.. పాయింట్ నుంచి చాలా దూరం పరిగెత్తి అక్షర్ బంతిని అందుకున్నాడు.అయితే, అన్నింటికంటే విల్ జాక్స్ (35) ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ వద్ద అద్భుత రీతిలో అందుకున్నా పట్టు కోల్పోయినట్లు అనిపించగా.. అక్కడే ఉన్న దూబే వైపు విసరగా అతడు బంతిని క్యాచ్ పట్టాడు. ఇలా మ్యాచ్‌ను మలుపుతిప్పిన కీలక క్యాచ్‌లోనూ అక్షర్ భాగమయ్యాడు.చదవండి: టీమిండియా గెలుపునకు ప్రధాన కారణాలు ఇవే -
T20 WC 2026: వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా నిన్న (మార్చి 5) జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించి వరుసగా రెండో ఎడిషన్‌లో (2024, 2026), ఓవరాల్‌గా నాలుగోసారి (2007, 2014, 2024, 2026) ఫైనల్‌కు చేరింది.ఈ క్రమంలో టీమిండియా ఓ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టింది. ఐసీసీ టోర్నీల్లో అత్యధిక సార్లు ఫైనల్‌కు చేరిన జట్టుగా చరిత్ర సృష్టించింది. తాజా ఫైనల్స్‌తో భారత్ ఐసీసీ టోర్నీల ఫైనల్స్ సంఖ్య 15కు చేరింది. గతంలో ఈ వరల్డ్ రికార్డు భారత్, ఆస్ట్రేలియా పేరిట సంయుక్తంగా ఉండేది. తాజాగా భారత్ ఆసీస్ ఆధిపత్యానికి తెరదించి, హోల్ అండ్ సోల్‌గా ప్రపంచ రికార్డు సొంతం చేసుకుంది.టీమిండియా ఫైనల్స్‌కు చేరిన ఐసీసీ టోర్నీలు.. భారత్ ఇప్పటివరకు 14 ఫైనల్స్‌లో 6 గెలిచింది, 7 ఓడింది. 2002 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ వర్షం కారణంగా రద్దవగా, భారత్..శ్రీలంకతో పాటు సంయుక్తంగా ట్రోఫీని పంచుకుంది. - వన్డే వరల్డ్ కప్: 1983, 2011 విజయాలు, 2003, 2023 (రన్నరప్) - టీ20 వరల్డ్ కప్: 2007, 2024 విజయాలు, 2026 (లోడింగ్) - ఛాంపియన్స్ ట్రోఫీ: 2002 (సంయుక్త విజేత), 2013, 2025 విజయాలు, 2002, 2017 (రన్నరప్) - వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్: 2021, 2023 (రన్నరప్) ఐసీసీ టోర్నీల్లోఅత్యధిక సార్లు ఫైనల్స్‌కు చేరిన జట్లు 1. భారత్ – 15 2. ఆస్ట్రేలియా – 14 3. ఇంగ్లాండ్ – 9 4. న్యూజిలాండ్ – 8 5. వెస్టిండీస్ – 8 6. శ్రీలంక – 8 7. పాకిస్తాన్ – 7 8. దక్షిణాఫ్రికా – 3ఫైనల్లో న్యూజిలాండ్‌తో ఢీ2026 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో భారత్ న్యూజిలాండ్‌ను ఢీ కొట్టనుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మార్చి 8న జరుగనుంది. న్యూజిలాండ్ సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించి ఫైనల్‌కు చేరింది. ఫిన్ అలెన్ 33 బంతుల్లో విధ్వంసకర సెంచరీ చేసి కివీస్‌ను ఒంటిచేత్తో ఫైనల్‌కు చేర్చాడు.చరిత్రాత్మక అవకాశం టీ20 వరల్డ్ కప్‌లో ఇప్పటివరకు ఏ జట్టు టైటిల్‌ను రక్షించుకోలేదు. భారత్‌కు ఈసారి ఆ అవకాశం వచ్చింది. గత ఎడిషన్‌లో ఛాంపియన్‌గా నిలిచిన భారత్.. చరిత్ర తిరగరాయాలని పట్టుదలగా ఉంది. మరోవైపు, న్యూజిలాండ్ తమ తొలి టైటిల్ కోసం ఉవ్విళ్లూరుతుంది. -
ఫైనల్లోకి ఏంట్రీ ఇంగ్లాండ్ కు భారత్ ఊచకోత..
-
టీమిండియా గెలుపుకు 3 కారణాలు ఇవే
-
వాంఖడేను సైలెంట్ చేస్తామన్నారు... కానీ మనవాళ్లు మోత మోగించారు!
-
వరల్డ్‌కప్ సెమీఫైనల్లో ఆసక్తికర సంఘటన
టీ20 ప్రపంచకప్ 2026 రెండో సెమీఫైనల్లో భారత్ ఇంగ్లండ్‌పై 7 పరుగుల తేడాతో గెలుపొంది, వరుసగా రెండో ఎడిషన్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. ముంబైలోని వాంఖడే స్టేడియం జరిగిన ఈ కీలక సమరాన్ని వీక్షించేందుకు అతిరథ మహారథులంతా తరలివచ్చారు. వీరిలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని జంట హైలైటైంది. వీరికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది. ఇందులో సాక్షి (ధోని సతీమణి) ఆనందంతో ఎగిరి గంతులేస్తుండగా.. ధోని వారిస్తాడు. Sakshi Thought It Was Out And Jumped Outta Seat, MS Dhoni Had To Calm Her Down 🤌😭Moment hai ! 🥹💛pic.twitter.com/E3ZLz9xuLv https://t.co/2LJZGzyYzV— Abhinav MSDian™ (@Abhinav_hariom) March 5, 2026అసలేం జరిగిందంటే.. భారత్ నిర్దేశించిన 254 పరుగుల అతి భారీ లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఛేదించే దిశగా సాగుతోంది. ఇన్నింగ్స్ 18వ ఓవర్లో జస్ప్రీత్ బుమ్రా సామ్ కర్రన్‌కు బౌలింగ్ చేస్తుండగా, బంతి బ్యాట్ దిగువ భాగాన్ని తాకి నేలపై పడి పైకి ఎగిరింది. బుమ్రా చురుకుగా వ్యవహరించి ఆ బంతిని క్యాచ్ పట్టాడు. ఇది ఔట్ కాదని అందరికీ తెలుసు. అయితే ఈ విషయాన్ని తప్పుగా అర్థం చేసుకున్న సాక్షి ధోని, కర్రన్ ఔటయ్యాడన్న ఆనందంతో లేచి చప్పట్లు కొడుతూ, ఎగురుతూ గంతులేసింది.ఆ సమయంలో ఆమె వెనుకే ఉన్న ధోని అది ఔట్ కాదంటూ సాక్షిని శాంతపరిచాడు. ఈ సన్నివేశం చుట్టూ ఉన్న వారిలో నవ్వులు పూయించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఈ వీడియోను చూసిన వారంతా మిస్టర్ కూల్ ఇంకా కూల్‌గానే ఉన్నాడంటూ సరదా కామెంట్లు చేస్తున్నారు. భారత్ ఇంగ్లండ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరడం ఒక ఎత్తైతే ఈ సన్నివేశం మరో ఎత్తుగా నిలిచింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్,.. సంజూ శాంసన్ (42 బంతుల్లో 8 ఫోర్లు, 7 భారీ సిక్సర్ల సాయంతో 89 పరుగులు) ఇరగదీయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత ఇన్నింగ్స్‌లో ఇషాన్ కిషన్ (39), శివమ్ దూబే (43), హార్దిక్ పాండ్యా (27), తిలక్ వర్మ (21) సైతం మెరుపు ఇన్నింగ్స్‌లతో అలరించారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ యువ బ్యాటర్ జేకబ్ బేతెల్ భారత బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. తొలి బంతి నుంచే బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి, కేవలం 45 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి ఇంగ్లండ్‌ను గెలుపు వాకిటి వరకు తీసుకెళ్లాడు.అయితే బేతెల్ సెంచరీ పూర్తి చేయడానికి ఒక్క ఓవర్ ముందు భారత్‌కు బ్రేక్ దొరికింది. 18 బంతుల్లో 45 పరుగులు చేయాల్సిన తరుణంలో ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన బుమ్రా కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి ఇంగ్లండ్ లక్ష్యాన్ని మరింత దూరం చేశాడు.19వ ఓవర్ బంతిని అందుకున్న హార్దిక్ ప్రమాదకరంగా కనినిస్తున్న సామ్ కర్రన్‌ను ఔట్ చేయడంతో పాటు ఆ ఓవర్లో 9 పరుగులు మాత్రమే ఇవ్వడంతో భారత్‌కు గెలుపుపై ధీమా వచ్చింది.చివరి ఓవర్ వేసిన దూబే తొలి బంతికే బేతెల్‌ను (48 బంతుల్లో 105; 8 ఫోర్లు, 7 సిక్సర్లు) ఔట్ చేయడంతో భారత శిబిరం ఊపిరి పీల్చుకుంది. ఆతర్వాత రెండు బంతులకు సింగిల్స్ మాత్రమే ఇచ్చిన దూబే... చివరి మూడు బంతులకు సిక్సర్లు ఇచ్చినా (ఆర్చర్) అప్పటికే ఇంగ్లండ్ ఓటమి ఖరారైపోయింది.కాగా, భారత్ మార్చి 8న జరిగే ఫైనల్లో న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. -
T20 WC 2026: ఇంగ్లండ్ ఆటగాళ్లను ఆకాశానికెత్తిన సూర్యకుమార్
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా నిన్న (మార్చి 5) జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించి, వరుసగా రెండో ఎడిషన్‌లో, ఓవరాల్‌గా నాలుగోసారి ఫైనల్‌కు చేరింది.నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓడినా, భారత శిబిరంలో గుబులు రేపింది. ముఖ్యంగా యువ బ్యాటర్ జేకబ్ బేతెల్ భారత బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. 254 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో తొలి బంతి నుంచే బౌండరీలు, సిక్సర్ల విరుచుకుపడిన బేతెల్.. కేవలం 45 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి ఇంగ్లండ్‌ను గెలుపు వాకిటి వరకు తీసుకెళ్లాడు.బేతెల్ సెంచరీ పూర్తి చేయడానికి ఒక్క ఓవర్ ముందు భారత్‌కు బ్రేక్ దొరికింది. 18 బంతుల్లో 45 పరుగులు చేయాల్సిన తరుణంలో ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన బుమ్రా కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి ఇంగ్లండ్ లక్ష్యాన్ని మరింత దూరం చేశాడు.19వ ఓవర్ బంతిని అందుకున్న హార్దిక్ ప్రమాదకరంగా కనినిస్తున్న సామ్ కర్రన్‌ను ఔట్ చేయడంతో పాటు ఆ ఓవర్లో 9 పరుగులు మాత్రమే ఇవ్వడంతో భారత్‌కు గెలుపుపై ధీమా వచ్చింది.చివరి ఓవర్ వేసిన దూబే తొలి బంతికే బేతెల్‌ను (48 బంతుల్లో 105; 8 ఫోర్లు, 7 సిక్సర్లు) ఔట్ చేయడంతో భారత శిబిరం ఊపిరి పీల్చుకుంది. ఆతర్వాత రెండు బంతులకు సింగిల్స్ మాత్రమే ఇచ్చిన దూబే... చివరి మూడు బంతులకు సిక్సర్లు ఇచ్చినా (ఆర్చర్) అప్పటికే ఇంగ్లండ్ ఓటమి ఖరారైపోయింది.అంతకుముందు సంజూ శాంసన్ (42 బంతుల్లో 8 ఫోర్లు, 7 భారీ సిక్సర్ల సాయంతో 89 పరుగులు) ఇరగదీయడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత ఇన్నింగ్స్‌లో ఇషాన్ కిషన్ (39), శివమ్ దూబే (43), హార్దిక్ పాండ్యా (27), తిలక్ వర్మ (21) సైతం మెరుపు ఇన్నింగ్స్‌లతో అలరించారు.మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సహచరులతో పాటు ఇంగ్లండ్ ఆటగాళ్లపై కూడా ప్రశంసల వర్షం కురిపించాడు. స్కై మాటల్లో..స్వదేశంలో వరల్డ్ కప్ జరుగుతుండగా, ఇంతటి అద్భుతమైన జట్టును నడిపించడం, ఈ జట్టుతో ఫైనల్‌కు చేరడం ప్రత్యేక అనుభూతి. సంజూ శాంసన్ ఇన్నింగ్స్‌పై అతను క్రీజులోకి వచ్చిన వెంటనే ఏం చేయాలో తెలుసుకున్నాడు. వికెట్ బాగుందని గుర్తించి ఆత్మవిశ్వాసంతో ఆడాడు. గతేడాది నుంచి పడిన కష్టానికి ఫలితం ఇది. జట్టుకు అవసరమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లండ్ లక్ష్య ఛేదనపైవారి లక్ష్య ఛేదన ప్రయత్నం అద్భుతం. హ్యారీ బ్రూక్‌ను చూసి, ఇంకెంత స్కోర్ చేయాలయ్యా అని అడిగాను. వారు చివరి వరకు ఆటలో ఉన్నారు. కానీ బుమ్రా, అర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యా మ్యాచ్‌ను మలుపు తిప్పారు. బుమ్రా మరోసారి తన ప్రతిభను చూపాడు.ఫీల్డింగ్‌పై ఫీల్డింగ్ కోచ్ దిలీప్ కృషిని గుర్తించాలి. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు ఫీల్డ్‌లో పదారసంలా కదిలారు. అద్బుతమైన క్యాచ్‌లు పట్టడంతో పాటు పరుగులను నియంత్రించగలిగారు. ప్రాక్టీస్ సెషన్లలో దిలీప్ చేసిన కృషి ఫలించింది.బ్యాటింగ్ కాంబినేషన్‌పై మూడో స్థానం వరకు అన్ని స్థిరంగా ఉన్నాయి. రషీద్ బౌలింగ్ చేస్తున్నప్పుడు శివమ్ దూబేను పంపడం సరైన నిర్ణయం. జట్టు అవసరమైతే నా స్థానాన్ని మార్చడం కూడా సరైనదే. ఫైనల్‌పై ఆలోచనలు ఫైనల్ ఒత్తిడి సహజంగానే ఉంటుంది. కానీ ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ అందరూ ఉత్సాహంగా ఉన్నారు. టైటిల్ కోసం పోరాడటానికి సిద్ధంగా ఉన్నామని ముగించాడు. కాగా, భారత్ మార్చి 8న జరిగే ఫైనల్లో న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. -
T20 WC 2026: ఇంగ్లండ్‌పై కీలక ప్రదర్శన.. చరిత్ర సృష్టించిన బుమ్రా
భారత ప్రీమియం ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా ఓ చరిత్రాత్మక మైలురాయిని తాకాడు. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌తో నిన్న (మార్చి 5) జరిగిన రెండో సెమీఫైనల్లో హ్యారీ బ్రూక్ వికెట్ తీయడంతో అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత అరుదైన 500 వికెట్ల క్లబ్లో చేరాడు. ఈ మ్యాచ్‌లో తన స్పెల్ తొలి బంతికే ఈ ఘనత సాధించాడు. 32 ఏళ్ల బుమ్రా ఇప్పటివరకు 52 టెస్ట్‌ల్లో 234 వికెట్లు.. వన్డేల్లో 89 మ్యాచ్‌ల్లో 149.. టీ20ల్లో 94 మ్యాచ్‌ల్లో 117 వికెట్లు తీశాడు.2016 జనవరి 23న అంతర్జాతీయ అరంగేట్రం చేసిన బుమ్రా.. అతి తక్కువ వ్యవధిలోనే 500 వికెట్ల మైలురాయిని తాకాడు. ఈ ఘనత సాధించిన ఎనిమిదవ భారత బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. బుమ్రాకు ముందు అనిల్ కుంబ్లే, అశ్విన్, హర్భజన్, కపిల్ దేవ్, రవీంద్ర జడేజా, జహీర్ ఖాన్, జవగల్ శ్రీనాథ్ ఈ ఘనత సాధించారు.ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో సామర్థ్యం మేరకు సత్తా చాటుతున్న బుమ్రా.. నిన్న ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో అత్యంత కీలకపాత్ర పోషించాడు. 254 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ గెలుపు దిశగా పయనిస్తున్న వేల ఓ పొదుపైన ఓవర్‌తో మ్యాచ్‌ను భారత్‌వైపు మల్లించాడు.18 బంతుల్లో 45 పరుగులు చేయాల్సిన తరుణంలో ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన బుమ్రా కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి ఇంగ్లండ్ లక్ష్యాన్ని మరింత దూరం చేశాడు. 19వ ఓవర్ బంతిని అందుకున్న హార్దిక్ ప్రమాదకరంగా కనినిస్తున్న సామ్ కర్రన్‌ను ఔట్ చేయడంతో పాటు ఆ ఓవర్లో 9 పరుగులు మాత్రమే ఇవ్వడంతో భారత్‌కు గెలుపుపై ధీమా వచ్చింది.చివరి ఓవర్ వేసిన దూబే తొలి బంతికే విధ్వంసకర సెంచరీతో (48 బంతుల్లో 105; 8 ఫోర్లు, 7 సిక్సర్లు) వీరంగం సృష్టించిన బేతెల్‌ను ఔట్ చేయడంతో భారత శిబిరం ఊపిరి పీల్చుకుంది. ఆతర్వాత రెండు బంతులకు సింగిల్స్ మాత్రమే ఇచ్చిన దూబే... చివరి మూడు బంతులకు సిక్సర్లు ఇచ్చినప్పటికీ (ఆర్చర్) అప్పటికే ఇంగ్లండ్ ఓటమి ఖరారైపోయింది. ఈ మ్యాచ్‌లో బుమ్రా అత్యంత పొదుపైన బౌలర్‌గా నిలవడంతో పాటు మ్యాచ్ మలుపు తిప్పే ఓవర్ వేసి అత్యంత కీలకమైన హ్యారీ బ్రూక్ వికెట్ తీశాడు.ప్రస్తుత ప్రపంచకప్‌లో ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన బుమ్రా.. గ్రూప్ దశలో పాకిస్తాన్, సూపర్-8లో విండీస్.. సెమీస్‌లో ఇంగ్లండ్‌పై కీలక ప్రదర్శనలు చేసి మొత్తం 10 వికెట్లు తీశాడు.వరుసగా రెండో మ్యాచ్‌లో సంజూ హిట్ఇంగ్లండ్తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. సంజూ శాంసన్ వరుసగా రెండో మ్యాచ్‌లో ఇరగదీయడంతో (89) నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత ఇన్నింగ్స్‌లో ఇషాన్ కిషన్ (39), శివమ్ దూబే (43), హార్దిక్ పాండ్యా (27), తిలక్ వర్మ (21) సైతం మెరుపు ఇన్నింగ్స్‌లతో అలరించారు. కాగా, భారత్ మార్చి 8న జరిగే ఫైనల్లో న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. -
T20 WC 2026: అదే మా కొంపముంచింది.. బ్రూక్ ఆవేదన
క్యాచెస్ విన్ మ్యాచెస్ అన్న నమ్మకాన్ని నిన్నటి భారత్-ఇంగ్లండ్ టీ20 వరల్డ్‌కప్ సెమీఫైనల్ మ్యాచ్ మరోసారి రుజువు చేసింది. ఈ మ్యాచ్ కీలక దశలో శివమ్ దూబే (అక్షర్ పటేల్ సాయంతో), తిలక్ వర్మ పట్టిన రెండు అద్భుతమైన క్యాచ్‌లు మ్యాచ్ గతినే మార్చేశాయి. అప్పటివరకు ఇంగ్లండ్‌కు అనుకూలంగా ఉన్న సమీకరణలు.. ఆ రెండు క్యాచ్‌ల తర్వాత భారత్‌పైపు మళ్లాయి.254 పరుగుల ఛేదనలో ఇంగ్లండ్ లక్ష్యం వైపు దూసుకెళ్తున్న వేల, అక్షర్ పటేల్-శివమ్, తిలక్ వర్మ చాకచక్యంగా వ్యవహరించి ప్రమాదకరంగా ఉన్న విల్ జాక్స్, సామ్ కర్రన్‌ను అద్భుతమైన క్యాచ్‌లతో పెవిలియన్‌కు పంపారు. ఈ మ్యాచ్‌లో భారత్ గెలుపుకు ఈ రెండు క్యాచ్‌లు ఓ కారణంగా చెప్పుకోవచ్చు.లక్ష్య ఛేదనలో జేకబ్ బేతెల్ (48 బంతుల్లో 105; 8 ఫోర్లు, 7 సిక్సర్లు) వీరోచిత శతకంతో పోరాడినప్పటికీ ఇంగ్లండ్ గెలుపు వాకిటి వరకు వచ్చి ఓటమిపాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓటమికి మరో క్యాచ్ కూడా కారణమైంది. అదేంటంటే.. భారత ఇన్నింగ్స్ మూడో ఓవర్ (జోఫ్రా ఆర్చర్) రెండో బంతికి సంజూ శాంసన్ ఇచ్చిన సునాయాసమైన క్యాచ్‌ను ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ నేలపాలు చేశాడు. ఇక్కడే ఇంగ్లండ్ ఓటమికి మొదటి బీజం పడింది. లైఫ్ లభించడంతో చెలరేగిపోయిన సంజూ బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి భారత్ భారీ స్కోర్ చేయడంలో కీలకపాత్ర పోషించాడు. సంజూకు లైఫ్ లభించే సమయానికి అతని స్కోర్ కేవలం 15 పరుగులే. లైఫ్ లభించాక పేట్రేగిపోయిన సంజూ మొత్తంగా 42 బంతుల్లో 8 ఫోర్లు, 7 భారీ సిక్సర్ల సాయంతో 89 పరుగులు చేసి ఔటయ్యాడు.ఒకవేళ సంజూ క్యాచ్‌ను బ్రూక్ ఆదిలోనే పట్టి ఉంటే, టీమిండియా ఈ స్థాయి స్కోర్ చేసుండకపోయేదేమో. ఏదిఏమైనా సంజూ క్యాచ్ వదలి బ్రూక్ సహా యావత్ ఇంగ్లండ్ టీమ్ మూల్యం చెల్లించుకుంది.ఈ మ్యాచ్‌లో మరో టర్నింగ్ పాయింట్ ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 18, 19వ ఓవర్లు. అప్పటివరకు గెలుపుపై ఆశలు పెట్టుకున్న ఇంగ్లండ్‌ను భారత పేసర్లు బుమ్రా, హార్దిక్ పాండ్యా దారుణంగా దెబ్బకొట్టారు. 18 బంతుల్లో 45 పరుగులు చేయాల్సిన తరుణంలో 18వ ఓవర్ వేసిన బుమ్రా కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి ఇంగ్లండ్ లక్ష్యాన్ని మరింత దూరం చేశాడు. 19వ ఓవర్ బంతిని అందుకున్న హార్దిక్ ప్రమాదకరంగా కనినిస్తున్న సామ్ కర్రన్‌ను ఔట్ చేయడంతో పాటు ఆ ఓవర్లో 9 పరుగులు మాత్రమే ఇవ్వడంతో భారత్‌కు గెలుపుపై ధీమా వచ్చింది.చివరి ఓవర్ వేసిన దూబే తొలి బంతికే బేతెల్‌ను ఔట్ చేయడంతో భారత శిబిరం ఊపిరి పీల్చుకుంది. ఆతర్వాత రెండు బంతులకు సింగిల్స్ మాత్రమే ఇచ్చిన దూబే... చివరి మూడు బంతులకు సిక్సర్లు ఇచ్చినప్పటికీ (ఆర్చర్) అప్పటికే ఇంగ్లండ్ ఓటమి ఖరారైపోయింది.మొత్తంగా సంజూ శాంసన్ డ్రాప్ క్యాచ్, శివమ్ దూబే (అక్షర్ పటేల్ సాయంతో), తిలక్ వర్మ క్యాచ్‌లు, బుమ్రా, హార్దిక్ పొదుపైన ఓవర్లు, చివరి ఓవర్ తొలి బంతికి రనౌట్ కావడం వంటి అంశాలు భారత్ గెలుపుకు కీలక కారణాలుగా నిలిచాయి.అయితే వీటిలో సంజూ డ్రాప్ క్యాచే ఇంగ్లండ్ కొంపముంచిందని హ్యారీ బ్రూక్ అభిప్రాయపడ్డాడు. సంజూ క్యాచ్ వదలి చాలా పెద్ద తప్పు చేశానని మ్యాచ్ అనంతరం ఆవేదన వ్యక్తం చేశాడు. -
T20 WC 2026: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ చిచ్చరపిడుగు
నిన్న (మార్చి 5) జరిగిన టీ20 వరల్డ్‌కప్ 2026 రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై భారత్ 7 పరుగుల తేడాతో గెలుపొంది, వరుసగా రెండో ఎడిషన్‌లో, ఓవరాల్‌గా నాలుగోసారి ఫైనల్‌కు చేరింది. నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓడినా, భారత శిబిరంలో గుబులు రేపింది. ముఖ్యంగా యువ బ్యాటర్ జేకబ్ బేతెల్ భారత బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. 254 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో తొలి బంతి నుంచే బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడిన బేతెల్.. కేవలం 45 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి ఇంగ్లండ్‌ను గెలుపు వాకిటి వరకు తీసుకెళ్లాడు. బేతెల్ సెంచరీ పూర్తి చేయడానికి ఒక్క ఓవర్ ముందే భారత్‌కు బ్రేక్ దొరకింది. 18 బంతుల్లో 45 పరుగులు చేయాల్సిన తరుణంలో ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన బుమ్రా కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి ఇంగ్లండ్ లక్ష్యాన్ని మరింత దూరం చేశాడు. 19వ ఓవర్ బంతిని అందుకున్న హార్దిక్ ప్రమాదకరంగా కనినిస్తున్న సామ్ కర్రన్‌ను ఔట్ చేయడంతో పాటు ఆ ఓవర్లో 9 పరుగులు మాత్రమే ఇవ్వడంతో భారత్‌కు గెలుపుపై ధీమా వచ్చింది. చివరి ఓవర్ వేసిన దూబే తొలి బంతికే బేతెల్‌ను ఔట్ చేయడంతో భారత శిబిరం ఊపిరి పీల్చుకుంది. ఆతర్వాత రెండు బంతులకు సింగిల్స్ మాత్రమే ఇచ్చిన దూబే... చివరి మూడు బంతులకు సిక్సర్లు ఇచ్చినప్పటికీ (ఆర్చర్) అప్పటికే ఇంగ్లండ్ ఓటమి ఖరారైపోయింది.ఇంత భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ బ్యాటర్లు, ముఖ్యంగా జేకబ్ బేతెల్ ఎక్కడా వెనకడుగు వేయలేదు. 95 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును అతను.. విల్ జాక్స్, సామ్ కర్రన్ సహకారాలతో గెలుపు తీరాల వరకు తీసుకెళ్లాడు. 18,19 ఓవర్లు బుమ్రా, హార్దిక్ కంట్రోల్ చేయకపోయుంటే పరిస్థితి వేరే ఉండేది. ఈ వీరోచిత శతకంతో బేతెల్ పలు భారీ రికార్డులను సొంతం చేసుకున్నాడు.టీ20 ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌ల్లో అత్యధిక స్కోర్ (105) చేసిన ఆటగాడిగా, నిన్ననే ఫిన్ అలెన్ (100) నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టాడు. బేతెల్‌కు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇదే తొలి సెంచరీ. ప్రపంచంలో ఏ క్రికెటర్ తన తొలి ఫస్ట్‌క్లాస్, లిస్ట్-ఏ, టీ20 ఫార్మాట్ సెంచరీని అంతర్జాతీయ స్థాయిలో సాధించలేదు. చరిత్రలో జేకబ్ మొదటివాడు. ఇంగ్లండ్ తరఫున ప్రపంచకప్ టోర్నీల్లో సెంచరీలు చేసిన వారిలో జేకబ్ నాలుగో వాడు. వీరిలో రెండో అత్యధిక స్కోర్ జేకబ్‌దే. ఇంగ్లండ్ తరఫున టీ20 ప్రపంచకప్‌ల్లో అత్యధిక స్కోర్ రికార్డు అలెక్స్ హేల్స్ (116 నాటౌట్) పేరిట ఉంది.అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. సంజూ శాంసన్ వరుసగా రెండో మ్యాచ్‌లో ఇరగదీయడంతో (89) నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత ఇన్నింగ్స్‌లో ఇషాన్ కిషన్ (39), శివమ్ దూబే (43), హార్దిక్ పాండ్యా (27), తిలక్ వర్మ (21) సైతం మెరుపు ఇన్నింగ్స్‌లతో అలరించారు. కాగా, భారత్ మార్చి 8న జరిగే ఫైనల్లో న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. -
టి20 ప్రపంచకప్‌లో తుది పోరుకు భారత్ (ఫొటోలు)
-
IND Vs ENG: నరాలు తెగే ఉత్కంఠ: టీమిండియా ధనాధన్ షో.. .. దర్జాగా ఫైనల్‌కు
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో టీమిండియా ఫైనల్‌కు దూసుకువెళ్లింది. సెమీ ఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించి.. టైటిల్ పోరుకు అర్హత సాధించింది. గత ఎడిషన్‌లో విజేతగా నిలిచిన భారత్.. ఈసారి కూడా ఫైనల్‌కు చేరి సత్తా చాటింది.253 పరుగులుముంబైలోని వాంఖడేలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 253 పరుగులు సాధించింది. ఓపెనర్ సంజూ శాంసన్ మరోసారి ధనాధన్ దంచికొట్టాడు. 42 బంతుల్లో 89 పరుగులతో ఈ వికెట్ కీపర్బ్యాటర్ అదరగొట్టాడు.వన్‌డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (18 బంతుల్లో 39) కూడా వేగంగా ఆడగా.. ఆల్‌రౌండర్లు శివం దూబే (25 బంతుల్లో 43), హార్దిక్ పాండ్యా (12 బంతుల్లో 27) మెరుపులు మెరిపించారు. తిలక్ వర్మ (7 బంతుల్లో 21) సైతం రాణించాడు.ఇంగ్లండ్ బౌలర్లలో విల్ జాక్స్, ఆదిల్ రషీద్ చెరో రెండు వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్‌కు ఒక వికెట్ దక్కింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ ఆదిలోనే ఓపెనర్ ఫిల్ సాల్ట్ (5), వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ హ్యారీ బ్రూక్ (7) వికెట్లు కోల్పోయింది.పట్టువదలని విక్రమార్కుడిలాఇక టామ్ బాంటన్ (17) కాసేపు నిలబడగా.. జోస్ బట్లర్ 25 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. అయితే, ఓవైపు వికెట్లు పడుతున్నా జేకబ్ బెతెల్ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా క్రీజులో పాతుకుపోయాడు. కేవలం 19 బంతుల్లోనే అర్ధ శతకం బాది.. టీ20 ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌లలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా ఫిన్ అలెన్ (న్యూజిలాండ్) రికార్డు సమం చేశాడు.నరాలు తెగే ఉత్కంఠఅదే జోరు కొనసాగిస్తూ బెతెల్ భారత శిబిరంలో ఆందోళన పెంచాడు. అయితే, పద్దెనిమిదో ఓవర్లో బుమ్రా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి.. కేవలం ఆరు పరుగులే ఇచ్చాడు. ఈ క్రమంలో రెండు ఓవర్లలో ఇంగ్లండ్ విజయ సమీకరణం 39 పరుగులుగా మారింది.అయితే, హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో పందొమ్మిదో ఓవర్లో సిక్స్ బాది బెతెల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 45 బంతుల్లోనే 102 పరుగులు సాధించాడు. దీంతో ఉత్కంఠ పెరిగింది. అయితే, పాండ్యా మూడో బంతికి సామ్ కర్రాన్ (18)ను అవుట్ చేశాడు. పాండ్యా బౌలింగ్‌లో కర్రాన్ బంతిని గాల్లోకి లేపగా బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న తిలక్ అద్భుతంగా క్యాచ్‌పట్టాడు.ఏడు పరుగుల తేడాతో గెలిచి ఫైనల్లోతన ఓవర్లో పాండ్యా 9 పరుగులే ఇవ్వగా.. ఆఖరి ఓవర్లో ఇంగ్లండ్ గెలుపునకు 30 పరుగులు అవసరమయ్యాయి. చివరి ఓవర్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బంతిని శివం దూబేకు ఇచ్చాడు. అతడి ఓవర్లో తొలి బంతికే బెతెల్ (105) రనౌట్ అయ్యాడు. దీంతో ఐదు బంతుల్లో 29 పరుగులు అవసరం కాగా.. ఆర్చర్ ఆఖరి మూడు బంతుల్లో సిక్సర్లు కొట్టినా లాభం లేకుండా పోయింది. ఇంగ్లండ్ 22 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా టీమిండియా ఏడు పరుగుల తేడాతో గెలిచి ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక అహ్మదాబాద్ వేదికగా ఆదివారం న్యూజిలాండ్‌తో ట్రోఫీ కోసం సూర్యకుమార్ సేన తలపడుతుంది. Next stop: FINAL! 😍A high-scoring thriller, but #TeamIndia hold their nerve and book a spot in the final! 🔥ICC Men’s #T20WorldCup | FINAL | #INDvNZ | SUN, 8th MAR, 5:30 PM pic.twitter.com/PQfdlxUEv7— Star Sports (@StarSportsIndia) March 5, 2026 స్కోర్లు: భారత్ - 253/7(20)ఇంగ్లండ్ - 246/7(20)ఫలితం: ఏడు పరుగుల తేడాతో భారత్ గెలుపు. -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. వరల్డ్ రికార్డు
టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. టీ20 క్రికెట్లో ఇంత వరకు ఏ జట్టుకూ సాధ్యం కాని ఘనత సాధించింది. పురుషుల పొట్టి ఫార్మాట్లో అత్యంత అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.జింబాబ్వేపై 256 పరుగులుభారత జట్టు సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్-2026 టోర్నీతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సూపర్-8 దశలో జింబాబ్వేపై 256 పరుగులు సాధించిన భారత జట్టు.. తాజాగా గురువారం నాటి మ్యాచ్‌లోనూ 250కి పైగా స్కోరు నమోదు చేసింది.పొట్టి క్రికెట్లో తొలి జట్టుగాముంబైలోని ప్రసిద్ధ వాంఖడే మైదానంలో ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లో.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 253 పరుగులు సాధించింది. ఓపెనర్ సంజూ శాంసన్ (42 బంతుల్లో 82) అదరగొట్టగా.. ఇషాన్ కిషన్ (18 బంతుల్లో 39), శివం దూబే (25 బంతుల్లో 43), హార్దిక్ పాండ్యా (12 బంతుల్లో 27), తిలక్ వర్మ (7 బంతుల్లో 21) మెరుపులు మెరిపించారు.Another must-win game, another Sanju Samson masterclass! 🔥His maiden T20I fifty against England and what an occasion to bring it up! 👏ICC Men’s #T20WorldCup | Semi-final 2 | #INDvENG | LIVE NOW 👉 https://t.co/L2OuYBUDbL pic.twitter.com/1csgOPterB— Star Sports (@StarSportsIndia) March 5, 2026ఫలితంగా టీమిండియాకు ఈ మేర 253 పరుగుల స్కోరు సాధ్యమైంది. ఈ క్రమంలోనే పొట్టి క్రికెట్లో అత్యధిక సార్లు 250 ప్లస్ స్కోరు సాధించిన జట్టుగా నిలిచింది. తద్వారా ఐపీఎల్ ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది.పురుషుల టీ20 క్రికెట్లో అత్యధిక సార్లు 250కి పైగా పరుగులు సాధించిన జట్లు👉టీమిండియా- ఆరు సార్లు👉సన్‌రైజర్స్ హైదరాబాద్- ఐదు సార్లు👉వెస్టిండీస్- మూడు సార్లు👉జింబాబ్వే- మూడు సార్లు👉సర్రే- మూడు సార్లు.చదవండి: IND vs ENG: సెమీస్‌లోనూ ఫెయిల్.. జట్టు నుంచి తీసేయండి! -
T20 WC 2026: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్
టీ20 ప్రపంచకప్-2026 సెమీ ఫైనల్లో టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్ అదరగొట్టాడు. ఇంగ్లండ్ బౌలింగ్‌ను చితక్కొడుతూ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. మూడో ఓవర్లో తనకు లభించిన లైఫ్‌ను సద్వినియోగం చేసుకున్న ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు.Ohhhhh, Harry Brook! 😳Sanju Samson makes the most of the lifeline and sends it into the stands! 🚀ICC Men’s #T20WorldCup | Semi-final 2 | #INDvENG | LIVE NOW 👉 https://t.co/L2OuYBUDbL pic.twitter.com/zOWfIEAdUv— Star Sports (@StarSportsIndia) March 5, 2026మరోసారి సెంచరీ మిస్‌అయితే, దురదృష్టవశాత్తూ మరోసారి సెంచరీ మిస్సయ్యాడు. ప్రపంచకప్ టోర్నీ ఆరంభానికి ముందు ఫామ్‌లేమితో సతమతమైన సంజూ ఓపెనర్‌గా జట్టులో స్థానం కోల్పోయిన సంగతి తెలిసిందే. టీ20 ఓపెనర్, వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్ అతడి స్థానాన్ని భర్తీ చేసి అదరగొట్టాడు.అయితే, మరో ఓపెనర్ అభిషేక్ శర్మ కడుపు నొప్పి కారణంగా నమీబియాతో మ్యాచ్‌కు దూరం కాగా.. తొలిసారి సంజూకు వరల్డ్‌కప్ మ్యాచ్ ఆడే అవకాశం వచ్చింది. అయితే, ఈ మ్యాచ్‌లో వేగంగా ఆడిన సంజూ 8 బంతుల్లో 22 పరుగులు చేసి అవుటయ్యాడు.అనంతరం సూపర్-8 జింబాబ్వేతో మ్యాచ్ సందర్భంగా తిరిగి తుదిజట్టులోకి వచ్చిన సంజూ.. 15 బంతుల్లో 24 రన్స్ చేయగలిగాడు. అయినప్పటికీ మేనేజ్మెంట్ ఈసారి సంజూపై నమ్మకం ఉంచింది. ఈ క్రమంలో వెస్టిండీస్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సంజూ 97 పరుగులతో అజేయంగా నిలిచాడు. భారత్‌ను గెలిపించి సెమీ ఫైనల్‌కు చేర్చాడు. అయితే, మూడు పరుగులతో అక్కడ సెంచరీ మిస్సయ్యాడు.8 ఫోర్లు, 7 సిక్స్‌లు కొట్టితాజాగా ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లోనూ సంజూ శతకం చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. భారత్ ఇన్నింగ్స్‌లో పద్నాలుగో ఓవర్లో విల్ జాక్స్ బౌలింగ్‌కు దిగాడు. అతడి బౌలింగ్‌లో తొందరపడి షాట్‌కు యత్నించిన సంజూ.. ఫిల్ సాల్ట్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 42 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లు కొట్టి 89 పరుగులు సాధించి.. సెంచరీకి పదకొండు పరుగుల దూరంలో నిలిచిపోయాడు.Just Hardik Pandya things at the Wankhede Stadium! 🔥🚨 RECORD ALERT: 19 sixes by #TeamIndia - the most in an innings in ICC Men's T20 World Cup history!ICC Men’s #T20WorldCup | Semi-final 2 | #INDvENG | LIVE NOW 👉 https://t.co/L2OuYBUDbL pic.twitter.com/JdGVdpz1B4— Star Sports (@StarSportsIndia) March 5, 2026ఇక ఓపెనర్ అభిషేక్ శర్మ (9)తో కలిసి తొలి వికెట్‌కు 20 పరుగులు జోడించిన సంజూ.. వన్‌డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (39)తో కలిసి రెండో వికెట్‌కు 45 బంతుల్లో 97 పరుగులు, శివం దూబేతో కలిసి మూడో వికెట్‌కు 43 పరుగులు జోడించాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 253 పరుగులు సాధించింది.చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్‌టీ20 ప్రపంచకప్ ఎడిషన్‌లో టీమిండియా తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాటర్‌గా సంజూ శాంసన్ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్ సందర్భంగా ఈ ఘనత సాధించాడు.టీ20 ప్రపంచకప్ ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాటర్లు👉సంజూ శాంసన్- 16 సిక్స్‌లు- 2026లో👉రోహిత్ శర్మ- 15 సిక్స్‌లు- 2024లో👉శివం దూబే- 15 సిక్స్‌లు- 2026లో👉ఇషాన్ కిషన్- 14 సిక్స్‌లు- 2026లో👉హార్దిక్ పాండ్యా- 14 సిక్స్‌లు- 2026లో👉యువరాజ్ సింగ్- 12 సిక్స్‌లు- 2007లో.చదవండి: IND vs ENG: సెమీస్‌లోనూ ఫెయిల్.. జట్టు నుంచి తీసేయండి! -
IND vs ENG: సెమీస్‌లోనూ ఫెయిల్.. జట్టు నుంచి తీసేయండి!
టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి దారుణంగా విఫలమయ్యాడు. ఇంగ్లండ్‌తో కీలక సెమీ ఫైనల్లోనూ పేలవ ఆట తీరుతో తేలిపోయాడు. వైఫల్యాల పరంపర కొనసాగిస్తూ స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరాడు. దీంతో టీమిండియా అభిమానులు సైతం అభిషేక్ శర్మపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.టీ20 ప్రపంచకప్-2026 ఆరంభం నుంచి అభిషేక్ శర్మ విఫలమవుతున్న విషయం తెలిసిందే. గ్రూప్ దశలో మూడు మ్యాచ్‌లు ఆడిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్ డకౌట్లతో తీవ్రంగా నిరాశపరిచాడు. సూపర్-8 దశలో భాగంగా సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో పదిహేను పరుగులకే పెవిలియన్ చేరిన అభిషేక్.. పసికూన జింబాబ్వేతో మ్యాచ్‌లో మాత్రం అర్ధ శతకంతో రాణించాడు.పాత కథే పునరావృతంఅయితే, సూపర్-8లో కీలకమైన వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో మరోసారి తేలిపోయాడు అభిషేక్ శర్మ. పట్టుమని పది పరుగులు చేసి నిష్క్రమించాడు. దీంతో సెమీ ఫైనల్లో అతడిని ఆడించే విషయంలో పునరాలోచన చేయాలని మాజీ క్రికెటర్లు సూచించారు. అయితే, యాజమాన్యం మాత్రం అభిషేక్‌పై నమ్మకం ఉంచగా.. అతడు పాత కథనే పునరావృతం చేశాడు.తొమ్మిది పరుగులే చేసిముంబై వేదికగా గురువారం ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్ అభిషేక్ శర్మ ఏడు బంతుల్లో రెండు ఫోర్లు బాది కేవలం తొమ్మిది పరుగులే చేసి నిష్క్రమించాడు. రెండో ఓవర్లో విల్ జాక్స్ బంతితో రంగంలోకి దిగి ఆఖర్లో స్లోబాల్ వేశాడు. ఈ క్రమంలో భారీ షాట్‌కు యత్నించిన అభిషేక్.. బంతిని గాల్లోకి లేపగా డీప్ మిడ్ వికెట్ నుంచి పరిగెత్తుకు వచ్చిన ఫిల్ సాల్ట్ బంతిని ఒడిసిపట్టాడు. దీంతో అభిషేక్ శర్మ పెవిలియన్ చేరాడు. మరోసారి ఆఫ్ స్పిన్నర్ చేతికి చిక్కి నిరాశగా వెనుదిరిగాడు. ఇప్పటి వరకు అభిషేక్ శర్మ ఈ టోర్నీలో చేసిన పరుగులు 89. వరుస వైఫల్యాల నేపథ్యంలో టీమిండియా అభిమానులు అభిషేక్‌పై భగ్గుమంటున్నారు. ‘‘ నువ్విక మారవా?.. అతడిని జట్టు నుంచి తీసేయండి’’ అని యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నారు.చదవండి: T20 WC 2026: జింబాబ్వే జట్టుకు భారీ ఊరట -
T20 WC 2nd Semis: ఇంగ్లండ్‌పై భారత్ గెలుపు
ఐసీసీ టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో కీలక పోరు... రెండో సెమీ ఫైనల్లో భారత్- ఇంగ్లండ్ అమీతుమీ... ముంబైలోని వాంఖడే వేదికగా టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్... ఫలితంగా బ్యాటింగ్‌కు దిగిన భారత్.భారత్ భారీ స్కోరునిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా ఏడు వికెట్ల నష్టానికి 253 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ సంజూ శాంసన్ భారీ హాఫ్ సెంచరీ (42 బంతుల్లో 89) బాదగా.. ఇషాన్ కిషన్ (18 బంతుల్లో 39), శివం దూబే (25 బంతుల్లో 43), తిలక్ వర్మ (7 బంతుల్లో 21),హార్దిక్ పాండ్యా (12 బంతుల్లో 27) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించారు.UPDATES: ఇంగ్లండ్‌పై భారత్ గెలుపులక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ పై టీమిండియా 7 పరుగుల తేడాతో గెలుపొందింది. సెమీ ఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించి.. టైటిల్ పోరుకు అర్హత సాధించింది. గత ఎడిషన్‌లో విజేతగా నిలిచిన భారత్.. ఈసారి కూడా ఫైనల్‌కు చేరి సత్తా చాటింది.ఏడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్దూబే బౌలింగ్‌లో బెతల్ రన్ ఔట్ (105) అయ్యాడు.పదిహేడు ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 209-515 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 185-5కర్రాన్ 5, బెతెల్ 81 పరుగులతో ఉన్నారు.13.6: ఐదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్అర్ష్దీప్ బౌలింగ్‌లో జాక్స్ (35) ఇచ్చిన క్యాచ్‌ను అద్భుతంగా పట్టిన శివం దూబే.పదమూడు ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 160-4విజయానికి 42 బంతుల్లో 94 పరుగులు కావాలి. బెతెల్ 65, విల్ జాక్స్ 35 పరుగులతో ఉన్నారు.పది ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 119-4నాలుగో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్7.3: అక్షర్ పటేల్ బౌలింగ్‌లో టామ్ బాంటన్ (5 బంతుల్లో 17) బౌల్డ్. క్రీజులోకి విల్ జాక్స్. స్కోరు: 95-4(7.3).బెతెల్ 39 పరుగులతో ఉన్నాడు. విజయానికి 75 బంతుల్లో 159 పరుగులు కావాలి.మూడో వికెట్ డౌన్5.5: వరుణ్ చక్రవర్తి అద్భుత రీతిలో బట్లర్ (25)ను బౌల్డ్ చేశాడు. స్కోరు: 64-3(5.5). బెతెల్ 26 పరుగులతో ఉన్నాడు.రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్4.1: బుమ్రా బౌలింగ్‌లో హ్యారీ బ్రూక్ (7) ఇచ్చిన క్యాచ్‌ను అక్షర్‌పటేల్ అద్భుత రీతిలో అందుకున్నాడు. ఫలింగా ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోయింది. జేకబ్ బెతెల్ క్రీజులోకి రాగా.. బట్లర్ 25 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 38-2(4.2).తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్1.1: హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఫిల్ సాల్ట్ (5) అక్షర్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్. క్రీజులోకి బ్రూక్. బట్లర్ ఎనిమిది పరుగులతో ఉన్నాడు. స్కోరు: 14-1(1.2)భారత్ స్కోరు: 253-7ఏడో వికెట్ డౌన్19.5: ఆఖరి ఓవర్‌ఐదో బంతికి పాండ్యా రనౌట్ (12 బంతుల్లో 27). వరుణ్ చక్రవర్తి క్రీజులోకి రాగా.. అక్షర్ పటేల్ 2 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఆరో వికెట్ కోల్పోయిన భారత్18.5: తిలక్ వర్మ రూపంలో ఆరో వికెట్ కోల్పోయిన భారత్. ఆర్చర్ బౌలింగ్‌లో తిలక్ బౌల్డ్ (7 బంతుల్లో 21). అక్షర్ క్రీజులోకి రాగా.. పాండ్యా 14 రన్స్‌తో ఉన్నాడు. స్కోరు: 237-6(19)ఐదో వికెట్ కోల్పోయిన భారత్17.3: సామ్ కర్రాన్ బౌలింగ్‌లో సింగిల్‌కు యత్నించి.. హార్దిక్ పాండ్యాతో సమన్వయ లోపం కారణంగా దూబే (25 బంతుల్లో 43) రనౌట్. తిలక్ వర్మ క్రీజులోకి వచ్చాడు.నాలుగో వికెట్ డౌన్15.4: ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ స్టంపౌట్. స్కోరు: 190-4 (16). హార్దిక్ పాండ్యా క్రీజులోకి వచ్చాడు. దూబే35 పరుగులతో ఉన్నాడు.15 ఓవర్లలో టీమిండియా స్కోరు: 177-3సూర్య 5, దూబే 28 పరుగులతో ఉన్నారు.సంజూ శాంసన్ అవుట్13.1: సంజూ శాంసన్ మరోసారి సెంచరీ మిస్సయ్యాడు. వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో 97 పరుగులతో అజేయంగా నిలిచిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. ఇంగ్లండ్‌తో సెమీస్‌లో 89 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. విల్ జాక్స్‌బౌలింగ్‌లో తొందరపడి షాట్‌కు యత్నించి.. ఫిల్ సాల్ట్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మొత్తంగా 42 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లు కొట్టి 89 పరుగులు రాబట్టాడు. సూర్యకుమార్ యాదవ్ క్రీజులోకి వచ్చాడు. దూబే 18 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 160-3(13.1)రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా9.3: మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించిన ఇషాన్ కిషన్.. ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో విల్ జాక్స్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. 18 బంతుల్లో 39 పరుగులు చేసి నిష్క్రమించాడు. శివం దూబే క్రీజులో వచ్చాడు. సంజూ 66 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 117-2(9.3). 8.3: వంద పరుగులు పూర్తి చేసుకున్న టీమిండియాAnother must-win game, another Sanju Samson masterclass! 🔥His maiden T20I fifty against England and what an occasion to bring it up! 👏ICC Men’s #T20WorldCup | Semi-final 2 | #INDvENG | LIVE NOW 👉 https://t.co/L2OuYBUDbL pic.twitter.com/1csgOPterB— Star Sports (@StarSportsIndia) March 5, 2026సంజూ హాఫ్ సెంచరీవెస్టిండీస్తో మ్యాచ్‌లో భారీ హాఫ్ సెంచరీ బాదిన సంజూ.. తాజా మ్యాచ్‌లోనూ ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. 26 బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకున్నాడు. డాసన్ బౌలింగ్‌లో సిక్స్ బాది మరీ ఈ మైలురాయి చేరుకున్నాడు.పవర్ ప్లేలో భారత్ స్కోరు: 67-1(6)సంజూ 20 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు బాది 41 పరుగులతో ఉండగా.. ఇషాన్ కిషన్ 9 బంతుల్లో 16 పరుగులతో క్రీజులో ఉన్నాడు.తొలి వికెట్ డౌన్1.6: విల్ జాక్స్ బౌలింగ్‌లో ఫిల్ సాల్ట్‌కు క్యాచ్ ఇచ్చి అభిషేక్ శర్మ (7 బంతుల్లో 9) అవుట్. సంజూ 11 పరుగులతో ఉండగా.. ఇషాన్ కిషన్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 20-1(2)సైలెంట్ చేసేస్తాంటాస్ సందర్భంగా ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ మాట్లాడుతూ.. ‘‘పిచ్ బాగుంది. వికెట్ పాతబడే కొద్దీ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందని అనుకుంటున్నాం. అందుకే మేము ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాము.ఒక మార్పుతో బరిలోకిటీమిండియాకు ఈ పిచ్‌పై ఆడిన అనుభవం మాకంటే ఎక్కువే. అయితే, టీ20 క్రికెట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేము. టీమిండియా మద్దతుదారులు నిశ్శబ్దంగా ఉండేలా చేస్తాం. రెహాన్ అహ్మద్ స్థానంలో ఓవర్టన్ జట్టులోకి వచ్చాడు’’ అని తెలిపాడు.అదే జట్టు..ఇక టీమిండియా సారథి సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ‘‘సెమీ ఫైనల్. బిగ్ గేమ్. మేము ముందుగా బ్యాటింగ్ చేయాలనే అనుకున్నాం. ఇక్కడ అంతగా డ్యూ ఉంటుందని అనుకోవడం లేదు. పిచ్ బాగుంది. క్యూరేటర్లు, గ్రౌండ్స్‌మెన్‌కు ధన్యవాదాలు. గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే కొనసాగిస్తున్నాం’’ అని పేర్కొన్నాడు.Harry Brook calls it right, and England will bowl first in the semi-final! ✌️What do you make of the decision? 👀ICC Men’s #T20WorldCup | Semi-final 2 | #INDvENG | LIVE NOW 👉 https://t.co/L2OuYBUDbL pic.twitter.com/Zabmv2MsVT— Star Sports (@StarSportsIndia) March 5, 2026భారత్ వర్సెస్ ఇంగ్లండ్ తుదిజట్లుభారత్‌అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.ఇంగ్లండ్ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్(కెప్టెన్), జేకబ్ బెతెల్, టామ్ బాంటన్, సామ్ కర్రాన్, విల్ జాక్స్, జామీ ఓవర్టన్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్.చదవండి: T20 WC 2026: జింబాబ్వే జట్టుకు భారీ ఊరట -
తప్పుడు ఫీల్డర్.. సూర్య ఇలా చేస్తాడా?: భారత మాజీ కోచ్ ఫైర్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో కీలక పోరుకు టీమిండియా సిద్ధమైంది. సెమీ ఫైనల్లో ఇంగ్లండ్‌తో గురువారం అమీతుమీ తేల్చుకోనుంది. ముంబైలోని ప్రసిద్ధ వాంఖడే మైదానం ఇందుకు వేదిక.అజేయంగా సూపర్-8కుఇక టోర్నీ ఆరంభం నుంచి టీమిండియా మెరుగ్గానే ఆడింది. ముఖ్యంగా గ్రూప్ దశలో నాలుగింటికి నాలుగు మ్యాచ్‌లూ గెలిచి అజేయంగా సూపర్-8కు చేరింది. అయితే, ఆ తర్వాత భారత జట్టు సౌతాఫ్రికా చేతిలో డెబ్బై ఆరు పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. టీ20 ప్రపంచకప్ టోర్నీలో తమ అతి పెద్ద పరాజయాన్ని నమోదు చేసింది.ఫీల్డింగ్‌పై విమర్శలు అనంతరం జింబాబ్వే, వెస్టిండీస్‌లపై గెలిచిన సూర్యకుమార్ సేన సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే, విండీస్‌తో మ్యాచ్‌లో భారత్ ఫీల్డింగ్ చేసిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సెమీస్‌లోనూ ఇలాంటి తప్పులు పునరావృతం చేస్తే భారీ మూల్యం చెల్లించకతప్పదని మాజీ క్రికెటర్లు హెచ్చరిస్తున్నారు.కాగా విండీస్‌తో మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి రనౌట్ చాన్స్ మిస్ చేయగా.. అభిషేక్ శర్మ రెండు, తిలక్ వర్మ ఒక క్యాచ్ జారవిడిచారు. ఈ నేపథ్యంలో టీమిండియా ఫీల్డింగ్ మాజీ కోచ్ ఆర్. శ్రీధర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.తప్పుడు ఫీల్డర్.. సూర్య ఇలాంటి తప్పు చేస్తాడా?‘‘బయటి నుంచి చూసి వరుణ్ ఫీల్డింగ్ పొజిషన్ గురించి నేను ఏదైనా మాట్లాడవచ్చు. అయితే, ఆ బంతిని వేసిన అర్ష్‌దీప్ సింగ్ కోణం నుంచి చూస్తే.. డీప్ స్క్వేర్ లెగ్, డీప్ మిడ్ వికెట్, షార్ట్ ఫైన్ లెగ్ కంటే వరుణ్ షార్ట్ కవర్ రీజియన్‌లో ఉండటమే మంచిదని అనుకున్నారేమో!అయినా సూర్యలాంటి తెలివైన కెప్టెన్లు ఇలాంటి ఎలిమెంటరీ స్కూల్ తరహా తప్పులు చేయకూడదు. తప్పుడు ఫీల్డర్‌ను తప్పుడు ఏరియాలో పెట్టినట్లు అనిపించింది. గతంతో పోలిస్తే వరుణ్ ఫీల్డింగ్ పరంగా మెరుగయ్యాడు. అయితే, ఈసారి మరోమారు తప్పు చేశాడు. అతడు సరైన స్థానంలో ఉన్నాడు. కానీ ఫీల్డింగ్ మాత్రం సరిగ్గా చేయలేకపోయాడు.ఇక అభిషేక్ శర్మ తీవ్రమైన ఒత్తిడిలో కూరుకుపోయి క్యాచ్‌లు జారవిడిచినట్లు అనిపించింది’’ అని ఆర్. శ్రీధర్ విమర్శించాడు. కాగా విండీస్ స్కోరు 13/0గా ఉన్న వేళ అర్ష్‌దీప్ బౌలింగ్‌లో రోస్టన్ ఛేజ్ కవర్ షాట్ ఆడి పరుగుకు ఉపక్రమించాడు. అయితే, షాయీ హోప్ మాత్రం బాల్ పొజిషన్ చూసి తిరిగి నాన్ స్ట్రైకర్ ఎండ్‌కు వచ్చేశాడు.వరుణ్ వల్లే మిస్మరోవైపు.. ఛేజ్ పిచ్ మధ్య వరకు రాగా.. వరుణ్ వికెట్ కీపర్ వైపు కాకుండా.. బౌలర్ పొజిషన్ వైపు బంతిని విసిరాడు. దీంతో ఛేజ్ రనౌట్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో వరుణ్ షాయీ హోప్ (32) రూపంలో ఒక వికెట్ దక్కించుకున్నాడు. కాగా సంజూ శాంసన్ అద్భుత ఇన్నింగ్స్ (50 బంతుల్లో 97 నాటౌట్)తో మెరిసి విండీస్‌పై భారత్‌ను గెలిపించాడు.చదవండి: T20 WC 2026: బాబర్ ఎందుకు?.. పాక్ బోర్డులో తొలి రాజీనామా -
భారత్-ఇంగ్లండ్ మ్యాచ్‌లో బద్దలయ్యే అవకాశమున్న 3 రికార్డులు ఇవే..!
టీ20 ప్రపంచకప్ 2026లో ఇవాళ (మార్చి 5) అత్యంత కీలకమైన సమరం జరుగనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగే రెండో సెమీఫైనల్లో భారత్-ఇంగ్లండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇరు జట్లు సమవుజ్జీలు కావడంతో హోరీహోరీ తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టీమిండియాకు హోం అడ్వాంటేజ్ ఉన్నా, ఇంగ్లండ్‌ను తక్కువ అంచనా వేయకూడదని హెచ్చరిస్తున్నారు. ఇరు జట్లు సెమీస్‌లో ఎదురెదురుపడటం ఇది వరుసగా మూడోసారి. 2022 ఎడిషన్‌లో ఇంగ్లండ్ భారత్‌పై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ఆతర్వాత టైటిల్‌ను కూడా ఎగరేసుకుపోగా.. 2024 ఎడిషన్‌లో భారత్ ఇంగ్లండ్‌ను 68 పరుగుల తేడాతో చిత్తు చేసి, ఆతర్వాత టైటిల్‌ను కూడా సొంతం చేసుకుంది. గత రెండు ఎడిషన్లలో ఇరు జట్ల మధ్య జరిగిన సెమీఫైనల్స్‌లో గెలిచిన జట్లు ఆతర్వాత టైటిల్‌ను కూడా ఎగరేసుకుపోవడంతో ఇవాల్టి మ్యాచ్‌కు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్స్‌కు చేరడమే కాకుండా, ఆతర్వాత టైటిల్ కూడా ఎగరేసుకుపోతుందని సెంటిమెంట్లను ఫాలో అయ్యే వారు నమ్ముతున్నారు.గెలుపోటముల విషయం పక్కన పెడితే, నేటి మ్యాచ్‌లో మూడు భారీ రికార్డులు బద్దలయ్యే అవకాశం ఉంది.అత్యధిక టీమ్ టోటల్నేటి మ్యాచ్‌లో భారత్ టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్స్‌లో అత్యధిక టీమ్ టోటల్‌ను నమోదు చేసే అవకాశం ఉంది. 2016 ఎడిషన్‌లో వాంఖడే మైదానంలోనే విండీస్‌పై చేసిన 192 పరుగులే ఇప్పటివరకు అత్యధికంగా ఉంది. ప్రస్తుత భారత జట్టు బ్యాటింగ్ విభాగం గతంలో ఎన్నడూ లేనంత పటిష్టంగా ఉండటంతో నేటి మ్యాచ్‌లో ఈ రికార్డు బద్దలవడం ఖాయంగా కనిపిస్తుంది. వాంఖడే వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉండటంతో తొలుత బ్యాటింగ్ చేస్తే టీమిండియా 200 పైచిలుకు పరుగులు సాధిస్తుందనే అంచనా ఉంది.డేంజర్లో విరాట్ రికార్డునేటి మ్యాచ్‌లో బద్దలయ్యే అవకాశమున్న మరో రికార్డు టీ20 వరల్డ్‌కప్ నాకౌట్స్‌లో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డు. ప్రస్తుతం ఈ రికార్డు విరాట్ కోహ్లి పేరిట ఉంది. 2016 ఎడిషన్ సెమీఫైనల్లో విండీస్‌పై విరాట్ చేసిన 89 పరుగులకే (47 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్, నాటౌట్) నేటి వరకు టీ20 ప్రపంచకప్ నాకౌట్స్‌లో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్‌గా ఉంది. నేటి మ్యాచ్‌లో ఈ రికార్డు కూడా బద్దలయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. భారత బ్యాటింగ్ ఆర్డర్లో అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ నుంచి ఈ రికార్డుకు ముప్పు పొంచి ఉంది.ఎవరు గెలిచినా రికార్డేనేటి మ్యాచ్‌లో బద్దలయ్యే అవకాశమున్న మరో రికార్డు టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో అత్యధిక సార్లు ఫైనల్స్‌కు చేరిన రికార్డు. ప్రస్తుతం ఈ రికార్డు భారత్, ఇంగ్లండ్, పాకిస్తాన్, శ్రీలంక పేరిట సంయుక్తంగా ఉంది. ఈ నాలుగు జట్లు తలో మూడు సార్లు ఫైనల్స్‌కు చేరాయి. నేటి మ్యాచ్‌లో ఏ జట్టు గెలిచినా చరిత్ర అవుతుంది. భారత్ 2007, 2014, 2024 ఎడిషన్లలో ఫైనల్స్‌కు చేరగా.. ఇంగ్లండ్ 2010, 2016, 2022 ఎడిషన్లలో తుది పోరుకు అర్హత సాధించింది. -
పర్ఫెక్ట్ గేమ్ ఆడలేదు: టీమిండియాకు హ్యారీ బ్రూక్ వార్నింగ్
టీమిండియాతో సెమీ ఫైనల్ నేపథ్యంలో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో తాము ఇంత వరకు పరిపూర్ణమైన మ్యాచ్ ఆడలేదని.. అయినప్పటికీ సమిష్టిగా రాణించి విజయం సాధించామని పేర్కొన్నాడు. కాబట్టి టీమిండియాతో మ్యాచ్ గురించి తాము ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నాడు.టీ20 ప్రపంచకప్-2026 లీగ్ దశలో నేపాల్ వంటి పసికూన చేతిలో తృటిలో ఓటమి నుంచి తప్పించుకున్న ఇంగ్లండ్.. ఆ తర్వాత సూపర్-8లో మాత్రం అదరగొట్టింది. శ్రీలంక, పాకిస్తాన్, న్యూజిలాండ్ మీద విజయాలు సాధించి సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే, ఈ మూడు మ్యాచ్‌లలో కూడా ఆఖరి వరకు పోరాడి ఇంగ్లండ్ గెలిచింది.కల నిజమైన తరుణం ఇదిఈ నేపథ్యంలో హ్యారీ బ్రూక్ (Harry Brook) మాట్లాడుతూ.. ‘‘ఆతిథ్య జట్టు (టీమిండియా)తో సెమీ ఫైనల్ ఆడటం విశేషం. మా జట్టులోని చాలా మంది కల నిజమైన తరుణం ఇది. ఈ మ్యాచ్ కోసం మేము ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం.పర్ఫెక్ట్ గేమ్ ఆడలేదు.. అయినాపూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతున్నాం. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్‌లలో పరిపూర్ణంగా ఆడలేదు. ఒక్కో మ్యాచ్‌లో ఒక్కొక్కరు కీలకంగా వ్యవహరించారు. టీమిండియాతో మ్యాచ్‌లో సైతం పూర్తి స్వేచ్ఛగా.. ధైర్యంగా ఆడతాం.ఈ టోర్నీలో కొన్ని ఉత్కంఠ మ్యాచ్‌లలో మేము గెలిచాము. మా బ్యాటర్లు స్పిన్‌ను ఎదర్కోవడంలో ఇబ్బంది పడతారని అంతా అనుకుంటున్నారు. కానీ మేము చక్కగా స్పిన్ ఆడగలము.వరుణ్ చక్రవర్తి బౌలింగ్లోప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లలో ఒకడైన భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) బౌలింగ్‌లో ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. అతడి బౌలింగ్‌లో అత్యుత్తమంగా ఆడి వీలైనన్ని ఎక్కువ పరుగులు రాబట్టేందుకు ప్రయత్నిస్తా’’ అని హ్యారీ బ్రూక్ చెప్పుకొచ్చాడు. ఏదేమైనా టీమిండియాకు కఠిన సవాలు తప్పదని సంకేతాలు ఇచ్చాడు. తాము ఇప్పటివరకు పర్ఫెక్ట్గా ఆడకపోయినా ఎవరో ఒకరు జట్టును ఆదుకుంటారని.. గతంలో మాదిరే ఈసారి అదే పునరావృతం కావొచ్చని బ్రూక్ వార్నింగ్ ఇచ్చాడు. కాగా ముంబై వేదికగా భారత్- ఇంగ్లండ్ మధ్య గురువారం సెమీ ఫైనల్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.చదవండి: T20 WC 2026: బాబర్ ఎందుకు?.. పాక్ బోర్డులో తొలి రాజీనామా -
టీమిండియాపై చంద్ర గ్రహణం ఎఫెక్ట్
టీమిండియా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీతో బిజీగా ఉంది. గ్రూప్ దశలో అమెరికా, నమీబియా, పాకిస్తాన్, నెదర్లాండ్స్ జట్లను ఓడించి అజేయంగా సూపర్-8కు చేరుకుంది.ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్అయితే, సూపర్-8లో తొలి మ్యాచ్‌లోనే సౌతాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడిన సూర్యకుమార్ సేన.. ఆ తర్వాత జింబాబ్వే, వెస్టిండీస్‌లను ఓడించి సెమీస్‌కు అర్హత సాధించింది. ఈ క్రమంలో రెండో సెమీ ఫైనల్లో భాగంగా ఇంగ్లండ్ (IND vs ENG)తో గురువారం తలపడనుంది టీమిండియా. ఇందుకు ముంబైలోని వాంఖడే మైదానం వేదిక.ఇందుకోసం ఇప్పటికే ముంబై చేరుకున్న భారత జట్టు ప్రాక్టీస్ మొదలుపెట్టేసింది. అయితే, మంగళవారం నాటి చంద్ర గ్రహణం ప్రభావం టీమిండియాపై కూడా పడింది. గ్రహణం కారణంగా సూర్యకుమార్ సేన తమ ప్రాక్టీస్ సెషన్‌ను గంటపాటు వాయిదా వేసుకుంది.టీమిండియాపై చంద్ర గ్రహణం ఎఫెక్ట్కాగా గ్రహణం మధ్యాహ్నం 3.20 నుంచి సాయంత్రం 6.47 నిమిషాల వరకు కొనసాగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సాయంత్రం 6- 9 గంటల వరకు టీమిండియా ప్రాక్టీస్ చేయాల్సి ఉండగా.. గంట ఆలస్యంగా అంటే ఏడు గంటలకు నెట్ సెషన్‌ను ఆరంభించింది. గ్రహణం సమయంలో ఏ పని చేయకూడదని.. అలా చేస్తే దురదృష్టం వెంటాడుతుందేమోనన్న భయంతో భారత జట్టు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి.అవును.. మా వాళ్లు చెప్పారుఈ విషయం గురించి టీమిండియా కోచ్ మోర్నీ మోర్కెల్ స్పందించాడు. ‘‘అవును.. చంద్ర గ్రహణం గురించి నాకు మా వాళ్లు చెప్పారు. అందుకే సెషన్‌ను వాయిదా వేసుకున్నాం. అయితే, గ్రహణం ఒక్కటే మా రాతను మారుస్తుందనే భయం లేదు. గెలుపు కోసం అత్యుత్తమంగా ప్రయత్నించడమే ముఖ్యమైనది’’ అని మోర్కెల్ పేర్కొన్నాడు.కాగా ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్‌కు ఆఖరిగా బుధవారం కూడా టీమిండియా ప్రాక్టీస్ చేయాల్సి ఉంది. అయితే ఇది ఆప్షనల్ కావడంతో వరుణ్ చక్రవర్తి, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, తిలక్ వర్మ మాత్రమే నెట్స్‌లో శ్రమించారు. మిగతా వారు విశ్రాంతి తీసుకున్నట్లు సమాచారం. చదవండి: IND vs ENG: అభిషేక్ శర్మను తప్పించండి.. కానీ: రవిశాస్త్రి -
IND vs ENG: అభిషేక్ శర్మను తప్పించండి.. కానీ: రవిశాస్త్రి
టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ గత కొంతకాలంగా విమర్శలు మూటగట్టుకుంటున్నాడు. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో అతడి వైఫల్యాలే ఇందుకు కారణం. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ టీ20 బ్యాటర్‌గా కొనసాగుతున్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. కెరీర్లో తొలిసారి వరల్డ్‌కప్ ఆడుతున్నాడు.మూడు డకౌట్లువిధ్వంసకర ఓపెనర్‌గా పేరొందిన అభిషేక్ శర్మ (Abhishek Sharma).. సొంతగడ్డపై భారీ అంచనాల నడుమ బరిలోకి దిగాడు. అయితే, ఆడిన తొలి మూడు మ్యాచ్‌లలో డకౌట్ అయి తీవ్రంగా నిరాశపరిచాడు. మొత్తంగా ఆరు మ్యాచ్‌లలో కలిపి అతడు చేసిన పరుగులు కేవలం 80.ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో కీలక సెమీ ఫైనల్‌కు ముందు భారత జట్టు మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri) అభిషేక్ శర్మను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. వరుస వైఫల్యాల కారణంగా అతడు మానసికంగా కాస్త కుంగిపోయి ఉండవచ్చని అభిప్రాయపడ్డాడు. అలాంటపుడు తుదిజట్టు నుంచి అభిషేక్ శర్మను తప్పించడమే సరైన నిర్ణయమని పేర్కొన్నాడు.అదొక్క మార్పు సరిపోతుందిఐసీసీ రివ్యూ షోలో మాట్లాడుతూ.. ‘‘నెట్స్‌లో బ్యాటింగ్ తీరును చూసి అంచనాకు రాకూడదు. అతడితో ప్రత్యేకంగా మాట్లాడాలి. మానసికంగా అతడు ఎంత దృఢంగా ఉన్నాడో తెలుసుకోవాలి.ఒకవేళ అభిషేక్ శర్మను కొనసాగించకూడదని అనుకుంటే.. ఇషాన్ కిషన్‌ను ఓపెనర్‌గా ఆడించాలి. లోయర్ ఆర్డర్లో రింకూ సింగ్‌ను తీసుకువస్తే సరి. సెమీ ఫైనల్లో తుదజట్టులో అదొక్క మార్పు సరిపోతుంది.అయితే, అభిషేక్ శర్మ గత సిరీస్‌లో ఇంగ్లండ్ మీద అదరగొట్టిన తీరును మర్చిపోకూడదు. వాంఖడేలో గతంలో అతడి ప్రదర్శన అద్భుతం. అక్కడ అతడు భారీ, వేగవంతమైన శతకాలు బాదాడు. కాబట్టి అభిషేక్ శర్మను కొనసాగిస్తే బాగుంటుందనీ అనుకుంటున్నాను ఒకవేళ రింకూను తీసుకురావాలని అనుకుంటే మాత్రం ఓపెనింగ్ జోడీ మారక తప్పదు’’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. గతేడాది ఇంగ్లండ్‌పై ఇరగదీసిన అభిషేక్కాగా గతేడాది వాంఖడే వేదికగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో అభిషేక్ శర్మ 54 బంతుల్లోనే 135 పరుగులు సాధించాడు. తద్వారా అంతర్జాతీయ పొట్టి క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన భారత బ్యాటర్‌గా అతడు చరిత్రకెక్కాడు. ఇదిలా ఉంటే.. ముంబైలోని ప్రసిద్ధ వాంఖడే మైదానం వేదికగా భారత్- ఇంగ్లండ్ సెమీ ఫైనల్లో తలపడేందుకు రంగం సిద్ధమైంది.చదవండి: అతడిని సెలక్ట్ చేసింది ఎవరు?.. BCCI గ్రీన్ సిగ్నల్! -
చెత్త ఫీల్డింగ్.. టీమిండియా గెలవలేదు: పాక్ మాజీ బౌలర్ ఓవరాక్షన్
పాకిస్తాన్ మాజీ బౌలర్ మహ్మద్ ఆమిర్ మరోసారి టీమిండియాపై విమర్శలు గుప్పించాడు. భారత జట్టుకు ఫైనల్ చేరే సత్తా లేదంటూ అవాకులు చెవాకులు పేలాడు. కాగా టీ20 ప్రపంచకప్-2026 గ్రూప్ దశలో సూర్యకుమార్ సేన అజేయంగా నిలిచిన విషయం తెలిసిందే.అజేయంగా సూపర్-8గ్రూప్-‘ఎ’లో అమెరికా, నమీబియా, పాకిస్తాన్, నెదర్లాండ్స్ జట్లను ఓడించి.. సూపర్-8లో అడుగుపెట్టింది. అయితే, స్థాయికి తగ్గట్లు రాణించడంలో మాత్రం విఫలమైందనే చెప్పవచ్చు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఆమిర్ స్థానిక మీడియాలో మాట్లాడుతూ.. గ్రూప్-1 నుంచి సౌతాఫ్రికా, వెస్టిండీస్ సెమీస్ చేరతాయని.. టీమిండియా ఎట్టి పరిస్థితుల్లోనూ సెమీ ఫైనల్లో అడుగుపెట్టలేదంటూ ఓవరాక్షన్ చేశాడు.అయితే, అతడి అంచనాలు తలకిందులు చేస్తూ భారత జట్టు సెమీ ఫైనల్‌కు దూసుకువెళ్లింది. వెస్టిండీస్‌తో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో గెలిచి సగర్వంగా టాప్-4లో అడుగుపెట్టింది. దీంతో మహ్మద్ ఆమిర్‌ను చివాట్లు పెడుతూ టీమిండియా అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు.ఆ జట్టు ఫీల్డింగ్ చూడండిఅయినప్పటికీ ఆమిర్ తీరు మారలేదు. మరోసారి టీమిండియాను ఉద్దేశించి అతడు చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ‘‘క్రికెట్ కోణంలోనే నేను మాట్లాడుతున్నాను. నిజానికి టీమిండియా అంత గొప్పగా ఏమీ ఆడటం లేదు. ముఖ్యంగా ఆ జట్టు ఫీల్డింగ్ చూడండి.గత మ్యాచ్‌లో వాళ్లు 3-4 క్యాచ్‌లు వదిలేశారు. జస్ప్రీత్ బుమ్రా తప్ప ఇతర బౌలర్లు పెద్దగా రాణించడం లేదు. హార్దిక్ పాండ్యా పెద్ద జట్లపై ఆడలేడని నేను చెప్పాను. అందుకు తగ్గట్లేఅతడు నాలుగు ఓవర్లలో అతడు 40 పరుగులు ఇచ్చుకున్నాడు.టీమిండియా టైటిల్ ఫేవరెట్ కాదుఇక వెస్టిండీస్ బ్యాటర్లు వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లోనూ చితక్కొట్టారు. సెమీ ఫైనల్లో భారత్‌తో ఆడే జట్టు స్పిన్నర్ల బౌలింగ్‌లో రాణించగల సత్తా కలిగి ఉంది. కాబట్టి నా దృష్టిలో టీమిండియా టైటిల్ ఫేవరెట్ కాదు. వాళ్లు ఫైనల్ చేరతారని నేను ఇప్పటికీ నమ్మడం లేదు’’ అని మహ్మద్ ఆమిర్ అతి చేశాడు. ఈ నేపథ్యంలో మరోసారి భారత నెటిజన్లు ఆమిర్‌కు చురకలు అంటిస్తున్నారు. ముందు పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందో చూసుకోవాలని హితవు పలుకుతున్నారు. కాగా పాక్ సూపర్-8 దశలోనే ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. సెమీ ఫైనల్లో టీమిండియా ఇంగ్లండ్‌ను ఎదుర్కోనుంది. ముంబైలో గురువారం జరిగే ఈ మ్యాచ్‌కు వాంఖడే స్టేడియం వేదిక. చదవండి: అతడిని సెలక్ట్ చేసింది ఎవరు?.. BCCI గ్రీన్ సిగ్నల్! -
T20 WC: సంజూకు పొంచి ఉన్న ప్రమాదం.. వేటు తప్పదా?
ఐసీసీ టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ నాకౌట్ దశకు చేరుకుంది. ఇప్పటికే నాలుగు సెమీస్ బెర్తులు ఖరారయ్యాయి. తొలి సెమీ ఫైనల్లో సౌతాఫ్రికా- న్యూజిలాండ్.. రెండో సెమీస్ మ్యాచ్‌లో ఇంగ్లండ్- టీమిండియా తలపడేందుకు సిద్ధంగా ఉన్నాయి.సఫారీ- కివీస్ జట్లు బుధవారం కోల్‌కతా వేదికగా అమీతుమీ తేల్చుకోనుండగా.. భారత్- ఇంగ్లండ్ (IND vs ENG) ముంబై గురువారం సెమీ ఫైనల్లో పోటీపడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఇక సూపర్-8లో హ్యాట్రిక్ విజయాలతో ఇంగ్లండ్ జోరు మీద ఉండగా.. టీమిండియా మాత్రం సెమీస్ చేరేందుకు కష్టపడాల్సి వచ్చింది.వీరోచిత ఇన్నింగ్స్అయితే, వెస్టిండీస్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సంజూ శాంసన్ వీరోచిత ఇన్నింగ్స్ (50 బంతుల్లో 97 నాటౌట్)తో రాణించడంతో భారత్ గట్టెక్కి.. సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే, ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్ తప్పిదాలు.. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా తప్ప వేరే బౌలర్ ఎవరూ పెద్దగా రాణించకపోవడం.. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ విఫలం కావడం సెమీస్‌కు ముందు ఆందోళన కలిగిస్తున్నాయి.సంజూకు పొంచి ఉన్న ప్రమాదంఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో సెమీస్‌లో తుదిజట్టు కూర్పు ఎలా ఉండబోతుందా అన్న చర్చ నడుస్తోంది. గత మ్యాచ్‌లో అదరగొట్టిన సంజూకు ఈ మ్యాచ్‌లో మాత్రం జోఫ్రా ఆర్చర్ రూపంలో ప్రమాదం పొంచి ఉంది. గతేడాది అంతర్జాతీయ టీ20లలో ఈ ఇంగ్లండ్ పేసర్ సంజూను బాగా ఇబ్బంది పెట్టాడు.సంజూకు ఆర్చర్ 23 డెలివరీలు సంధించగా.. అతడు కేవలం 25 పరుగులే రాబట్టగలిగాడు. ఇందులో ఒక ఫోర్, రెండు సిక్స్‌లు మాత్రమే ఉన్నాయి. అంతేకాదు.. మూడుసార్లు ఆర్చర్ బౌలింగ్‌లో అవుటయ్యాడు.ఆర్చర్‌తో పాటు అతడూఒకవేళ ఇంగ్లండ్ ఈసారి కూడా ఆర్చర్‌తోనే బౌలింగ్ ఎటాక్ ఆరంభిస్తే.. ఓపెనర్ సంజూ మరింత జాగ్రత్త పడాల్సి ఉంటుంది. లేదంటే భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుంది. ఇక సామ్ కర్రాన్ కూడా సంజూకు సవాలు విసిరే అవకాశం ఉంది. పొట్టి క్రికెట్లో నాలుగేళ్లలో సామ్ సంజూకు 16 డెలివరీలు సంధించగా.. అతడు 21 పరుగులు చేయగలిగాడు. రెండుసార్లు అవుటయ్యాడు. ఈ ప్రమాదాల్ని అధిగమిస్తేనే సంజూ టీమిండియాకు మంచి ఆరంభం ఇవ్వగలడు. గత గణాంకాలను బట్టి సంజూను తుదిజట్టులో ఆడిస్తారా?.. ఒకవేళ ఆడించినా ఓపెనర్‌గా పంపుతారా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి.వేటు పడుతుందా?అయితే, సంజూపై నమ్మకం ఉంచిన మేనేజ్మెంట్ విండీస్‌తో ఆడిన జట్టుతోనే ముందుకు వెళ్లనున్నట్లు సమాచారం. తుదిజట్టులో ఎలాంటి మార్పులు లేకుండానే భారత్ ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్ ఆడనున్నట్లు తెలుస్తోంది.కాగా గత కొంతకాలంగా ఫామ్‌లేమితో సతమతమైన సంజూ ఓపెనర్‌గా, వికెట్ కీపర్‌గా జట్టులో స్థానం కోల్పోయాడు. టీ20 ప్రపంచకప్‌లో నమీబియాతో ఆడిన అతడు.. ఆ తర్వాత మళ్లీ సూపర్-8లో జింబాబ్వే, వెస్టిండీస్‌లతో ఆడాడు. మొత్తంగా మూడు మ్యాచ్‌లలో కలిపి 143 పరుగులు సాధించాడు.వెస్టిండీస్‌తో ఆడిన భారత తుదిజట్టుసంజూ శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.చదవండి: అతడిని సెలక్ట్ చేసింది ఎవరు?.. BCCI గ్రీన్ సిగ్నల్! -
అతడి రెండు ఫోర్లు కీలకం.. లేదంటే సంజూ ఇన్నింగ్స్ వేస్ట్!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో కీలక ముందడుగు వేసింది టీమిండియా. సూపర్-8లో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఓడించి సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో ముంబై వేదికగా వాంఖడే మైదానంలో గురువారం ఇంగ్లండ్‌ను ఢీకొట్టనుంది. ముంబైకి చేరుకున్న టీమిండియాఇందుకోసం ఇప్పటికే భారత జట్టు ముంబైకి చేరుకుంది. కాగా ఈ ఎడిషన్ ఆరంభంలో నేపాల్ వంటి పసికూన జట్టుతో సవాలు ఎదుర్కొన్నప్పటికీ.. ఆ తర్వాత ఇంగ్లండ్ పుంజుకున్న తీరు అమోఘం.Touchdown, Mumbai! 📍#TeamIndia are in and gearing up for the semi-final in just three days! 👏ICC Men’s #T20WorldCup Semi-Final 2 👉 #INDvENG | THU, 5 MAR, 5:30 PM pic.twitter.com/gfOBk4T29X— Star Sports (@StarSportsIndia) March 2, 2026అందరూ మేటి ఆటగాళ్లేముఖ్యంగా సూపర్-8లో శ్రీలంక, పాకిస్తాన్, న్యూజిలాండ్‌లను ఓడించి.. హ్యాట్రిక్ విజయాలతో సెమీస్ చేరిన తొలి జట్టుగా నిలిచింది. ఈ నేపథ్యంలో హెడ్‌కోచ్ గౌతం గంభీర్.. ఇంగ్లండ్ గట్టి ప్రత్యర్థి అని.. ఆ జట్టుతో జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. ఆ జట్టులో ఫిల్ సాల్ట్, హ్యారీ బ్రూక్, సామ్ కరన్, విల్ జాక్స్ సహా అందరు మేటి ఆటగాళ్లేనని అన్నాడు.వాంఖడే పిచ్ పరిస్థితులు వేరుగా ఉంటాయని... అటువంటి చోట ఇంగ్లండ్ లాంటి జట్టును ఎదుర్కోవడం సవాలుతో కూడుకున్నదే అని గౌతీ పేర్కొన్నాడు. ఇంగ్లండ్ వంటి జట్టును ఓడించేందుకు తాము ఇంకాస్త ఎక్కువగానే శ్రమించాల్సి ఉంటుందని అన్నాడు.సంజూ సత్తా ఏంటో నాకు బాగా తెలుసుఅదే విధంగా.. వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో భారత్ గెలిచిన తీరుపై కూడా గౌతీ స్పందించాడు. ఈ మ్యాచ్‌లో 97 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలిపించిన సంజూ శాంసన్‌ను ప్రశంసించాడు. అయితే, క్రికెట్ జట్టు క్రీడ అని అందరూ కలసి కట్టుగా ఆడాల్సిందే... జట్టుగా గెలవాల్సిందేనని పేర్కొన్నాడు.‘‘సంజూ సత్తా ఏంటో నాకు బాగా తెలుసు. మెగా ఈవెంట్‌కు ముందు న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్ అతనికి క్లిష్టంగా గడిచింది. అందుకే కాస్త విశ్రాంతి ఇచ్చాము. ఇప్పుడు వెస్టిండీస్‌తో కీలకమైన ‘సూపర్–8’ మ్యాచ్‌లో శాంసన్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు’’ అని గంభీర్ కితాబిచ్చాడు.🚨 BIG STATEMENT BY GAUTAM GAMBHIR 🚨 "For so many year, we only glorified individual success. But this Indian Team is different, we play as a team. Shivam Dube's 2 boundaries is as important as Sanju Samson 97*."What's your take 🤔pic.twitter.com/zdecRc7PVJ— Fan Account Richard Kettlebourogh (@RichKettle07) March 3, 2026అదే విధంగా తిలక్ వర్మ, శివమ్ దూబే తదితర సహచరులు కూడా బాగా ఆడారని గౌతీ అన్నాడు. తాను కోచ్‌గా ఉన్నంతకాలం జట్టు విజయంలో భాగమైన ప్రతి ఆటగాడి సహకారానికి తగిన గుర్తింపు లభిస్తుందన్నాడు. అతడి రెండు ఫోర్లు కీలకం.. లేదంటే సంజూ ఇన్నింగ్స్ వేస్ట్!‘క్రికెట్ ఎప్పటికైనా టీమ్ గేమ్. ఓ జట్టుగా ఆడాలి. జట్టుగానే గెలవాలి. కొన్నేళ్లుగా మనం ఒకరిద్దరి సేవలగురించే ప్రత్యేకంగా మాట్లాడుకునేవాళ్లం. ఇప్పుడు అందరి సహకారం గురించి ప్రస్తావించడం నాకూ ఆనందంగానే ఉంది’ అని గంభీర్ ఫలానా ఆటగాడి పేరుచెప్పకుండా తన శైలిలో సమాధాన మిచ్చాడు.‘జట్టు విజయంలో ఎవరైనా పెద్ద స్కోరు చేస్తే పతాక శీర్షికలకెక్కుతారు. కానీ నా దృష్టిలో మాత్రం ఆ పెద్ద స్కోరుకు విలువపెంచే భాగస్వామ్యంలో తక్కువ పరుగులు చేసినా విజయంలో ఈ రెండూ విలువైనవే! ఒకటి ఎక్కువ ఇంకోటి తక్కువ కాదు. ఎందుకంటే కీలకమైన సమయంలో శివమ్ దూబే కొట్టిన రెండు విలువైన బౌండరీలు లక్ష్యఛేదనకెంతో ఉపయోగపడ్డాయి. అవే లేకపోయినా... ఫలితం ప్రతికూలంగా ఉన్నా... సామ్సన్ (97 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్ మరుగున పడేది’ అని గౌతీ వివరించాడు.చదవండి: స్వార్థపరుడు.. అతడు జట్టులో దండగ: భారత మాజీ కెప్టెన్ ఫైర్ -
T20 WC 2026: సెమీస్‌కు అంపైర్లు వీరే..!
టీ20 ప్రపంచకప్ 2026 తుది దశకు చేరింది. నాలుగు సెమీఫైనల్ బెర్త్‌లు ఖరారయ్యాయి. తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్.. రెండో సెమీఫైనల్లో భారత్-ఇంగ్లండ్ అమీతుమీ తేల్చుకుంటాయి. తొలి సెమీస్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా మార్చి 4వ తేదీ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. రెండో సెమీఫైనల్ ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకే మొదలవుతుంది.ఈ మ్యాచ్‌లకు అఫీషియల్స్ జాబితాను (అంపైర్లు, రిఫరీలు) ఐసీసీ ఇవాళ ప్రకటించింది. ఎనిమిది మంది అంపైర్లు, ఇద్దరు మ్యాచ్ రిఫరీల పేర్లను వెల్లడించింది. ఎప్పటిలాగే తటస్థ అధికారులను నియమించింది. సౌతాఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ తొలి సెమీఫైనల్ - ఆన్ ఫీల్డ్ అంపైర్లు: రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, అలెక్స్ వార్ఫ్ - థర్డ్ అంపైర్: నితిన్ మెనన్ - నాలుగో అంపైర్లు: రాడ్ టక్కర్ - మ్యాచ్ రిఫరీ: జవగల్ శ్రీనాథ్ భారత్ వర్సెస్ ఇంగ్లండ్ రెండో సెమీఫైనల్ - ఆన్ ఫీల్డ్ అంపైర్లు: క్రిస్ గాఫనీ, అల్లాహుద్దీన్ పాలేకర్ - థర్డ్ అంపైర్లు: ఎడ్రియన్ హోల్డ్‌స్టాక్ - నాలుగో అంపైరు: పాల్ రైఫెల్ - మ్యాచ్ రిఫరీ: ఆండీ పైక్రాఫ్ట్ -
IND VS ENG Semis: చరిత్ర పునరావృతమవుతుందా.. లేక..!
టీ20 ప్రపంచకప్ 2026 రెండో సెమీఫైనల్లో భారత్-ఇంగ్లండ్ అమీతుమీకి సిద్దంగా ఉన్నాయి. మార్చి 5న ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఈ హోరాహోరీ సమరం జరుగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటకు ప్రారంభమవుతుంది.ఈ మ్యాచ్‌కు ముందు ఓ ఆసక్తికర అంశం సోషల్‌మీడియాలో హైలైట్ అవుతుంది. గత మూడు టీ20 ప్రపంచకప్ ఎడిషన్లలో భారత్-ఇంగ్లండ్ సెమీఫైనల్లోనే ఎదురెదురుపడ్డాయి. 2022 ఎడిషన్‌లో ఇంగ్లండ్ భారత్‌ను ఓడించి ఫైనల్‌కు చేరడమే కాకుండా, రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది.2024 ఎడిషన్‌లో భారత్ ఇంగ్లండ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరడమే కాకుండా రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. 2026 ఎడిషన్‌లోనూ ఇరు జట్లు సెమీస్‌లో ఎదురెదురుపడటంతో, సెంటిమెంట్ ప్రకారం ఈ మ్యాచ్ విజేత టైటిల్ కూడా ఎగరేసుకుపోతుందని చర్చ నడుస్తుంది. అయితే ఈ సెంటిమెంట్ రిపీటైతే భారత్‌కు ప్రతికూల ఫలితం వచ్చే ప్రమాదం కూడా ఉంది.ఎందుకుంటే, గత రెండు ఎడిషన్లలో గెలుపు చేతులు మారింది. 2022 ఎడిషన్‌లో ఇంగ్లండ్ భారత్‌ను ఓడిస్తే.. 2024 ఎడిషన్‌లో భారత్ ఇంగ్లండ్‌ను ఓడించింది. ఈ లెక్కన రొటేషన్ పద్దతిలో ఈసారి ఇంగ్లండ్ గెలుస్తుందని సెంటిమెంట్లు ఫాలో అయ్యే వారు విశ్వసిస్తున్నారు.అయితే క్రికెట్ లాంటి క్రీడల్లో సెంటిమెంట్లకు విశ్వసనీయత లేదని గతంలో చాలా సందర్భాల్లో రుజువైంది. కాబట్టి ఆ రోజు ఏ జట్టు అత్యుత్తమంగా రాణిస్తుందో ఆ జట్టుకే విజయం దక్కే అవకాశాలు అధికంగా ఉంటాయి. అలాగనీ సెంటిమెంట్లను తీసి వేయడానికి కూడా వీల్లేదు. కొన్ని సందర్భాల్లో అవి కూడా వర్కౌటవుతాయి.సెంటిమెంట్ల విషయాన్ని పక్కన పెడితే.. ప్రస్తుత ఎడిషన్‌లో భారత్, ఇంగ్లండ్ జట్లు పటిష్టంగా ఉన్నాయి. లోతుగా పరిశీలిస్తే..ఇంగ్లండ్ కంటే టీమిండియానే క్తాస మెరుగ్గా ఉంది. ఈసారి హాట్ ఫేవరెట్ కూడా ఇండియానే. అలాగనీ ఇంగ్లండ్‌ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. వారిదైన రోజున వారు అద్భుతాలు చేస్తారు. ప్రస్తుతం వారి జట్టు బ్యాటింగ్ టాపార్డర్ కాస్త బలహీనంగా ఉంది. ఓపెనర్లు సాల్ట్, బట్లర్ సహా జేకబ్ బేతెల్ తరుచూ విఫలమవుతున్నారు. కెప్టెన్ హ్యారీ బ్రూక్, మిడిలార్డర్ బ్యాటర్ల సాయంతోనే ఆ జట్టు ఈ ఎడిషన్‌లో విజయాలు సాధించింది. బ్యాటింగ్‌తో పోలిస్తే.. ఆ జట్టు బౌలింగ్ విభాగంలో కాస్త మెరుగ్గా ఉంది. అయితే ఈ రెండు విభాగాల్లో ఇంగ్లండ్ కంటే భారత్ ఇంకాస్త మెరుగ్గా ఉంది. ఫీల్డింగ్ మినహా భారత్ అన్ని విషయాల్లో ఇంగ్లండ్‌పై పైచేయి సాధించే అవకాశం ఉంది. సెమీస్‌కు ముందు టీమిండియాను ఫీల్డింగ్ విషయం చాలా కలవరపెడుతుంది. తాజాగా విండీస్‌తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లో భారత ఫీల్డర్లు ఏకంగా 3 క్యాచ్‌లు నేలపాలు చేశారు. సూపర్-8కి చేరిన జట్లలో అత్యంత చెత్త ఫీల్డింగ్ ప్రదర్శన టీమిండియాదే. ఫీల్డింగ్ మినహా మిగతా అన్ని విభాగాల్లో భారత్‌దే పైచేయిగా ఉంది. మ్యాచ్‌కు ముందు ప్రదర్శనలు ఎలా ఉన్నా, ఆ రోజు మ్యాచ్‌లో ఎవరు రాణిస్తే వారికే అంతిమ విజయం దక్కుతుంది. -
టీమిండియాలో ఆందోళన.. తప్పు జరిగిందా, చరిత్ర హీనులవుతారు..!
టీ20 ప్రపంచకప్ 2026 తుది దశకు చేరింది. నాలుగు సెమీఫైనల్ బెర్త్‌లు ఖరారయ్యాయి. తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్.. రెండో సెమీఫైనల్లో భారత్-ఇంగ్లండ్ అమీతుమీ తేల్చుకుంటాయి. తొలి సెమీస్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా మార్చి 4వ తేదీ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. రెండో సెమీఫైనల్ ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకే మొదలవుతుంది.కాగా, ఇంగ్లండ్‌తో సెమీస్‌కు ముందు టీమిండియాను ఓ విషయం తెగ కలవరపెడుతుంది. భారత ఫీల్డింగ్ ప్రతి భారత క్రికెట్ అభిమానిని ఆందోళనకు గురి చేస్తోంది. విండీస్‌తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లో భారత ఫీల్డర్లు ఏకంగా 3 మ్యాచ్‌లు నేలపాలు చేశారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ కీలక దశలో రెండు క్యాచ్‌లు జారవిడిచాడు. ఓ క్యాచ్‌ను తిలక్ వర్మ వదిలేశాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియాకు ప్రతికూల ఫలితం వచ్చుంటే, అభిషేక్, తిలక్‌పై ముప్పేట దాడి జరిగుండేది. టీమిండియా గెలవడంతో ఈ ఇద్దరు భారీ ట్రోలింగ్‌ను తప్పించుకున్నారు.విండీస్‌తో మ్యాచ్ ఒక్కటే కాదు, మెగా టోర్నీ ప్రారంభం నుంచి టీమిండియా ఫీల్డింగ్ అత్యంత చెత్తగా ఉంది. సూపర్-8కి చేరిన జట్లలో అత్యంత చెత్త క్యాచింగ్ ప్రదర్శనలు మనవే. భారత ఫీల్డర్లు 100లో కేవలం 71 శాతం క్యాచ్‌లను మాత్రమే పట్టారు. మొత్తంగా సూపర్-8కు చేరిన జట్లలో ఏ జట్టు వదలని విధంగా ఏకంగా 13 క్యాచ్‌లు నేలపాలు చేశాడు. అదనంగా భారత ఫీల్డర్లు మిస్ ఫీల్డింగ్ కూడా చేసి ప్రత్యర్దిని అదనపు పరుగులు సమకూర్చారు.సెమీస్‌లో ఇదే పరిస్థితి కొనసాగితే టీమిండియా తప్పక మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. క్యాచ్‌లు మ్యాచ్‌లు గెలిపిస్తాయన్న విషయాన్ని భారత ఆటగాళ్లు గుర్తు పెట్టుకోవాలని హెచ్చరిస్తున్నారు. గత ప్రపంచకప్ ఫైనల్లో సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచే భారత్‌ను జగజ్జేతగా నిలిపిన విషయాన్ని ప్రస్తుత టీమిండియా సభ్యులు గుర్తు పెట్టుకోవాలి. క్యాచ్‌లు నేలపాలు చేసినా, మిస్ ఫీల్డింగ్ చేసి అదనపు పరుగులు సమర్పించుకున్నా, సరిదిద్దుకోవడానికి జరగబోయేది సామాన్యమైన మ్యాచ్ కాదు. ఒక్కసారి తప్పు జరిగిపోతే, ఎంతటి స్టార్ ఆటగాడైనా చరిత్ర హీనుడవ్వాల్సిందే. కాబట్టి, సెమీఫైనల్లో ప్రతి భారత ఆటగాడు ఫీల్డ్‌లో జాగ్రత్తగా ఉండాలని ఫ్యాన్స్ హెచ్చరిస్తున్నారు. -
T20 WC 2026: అదే జరిగితే భారత్‌కు చుక్కెదురే..!
టీ20 ప్రపంచకప్ 2026 తుది దశకు చేరింది. తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్.. రెండో సెమీఫైనల్లో భారత్-ఇంగ్లండ్ అమీతుమీ తేల్చుకుంటాయి. తొలి సెమీస్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా మార్చి 4వ తేదీ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. రెండో సెమీఫైనల్ ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకే మొదలవుతుంది.ఈ మ్యాచ్‌లకు వరుణుడు నుంచి ఎలాంటి ముప్పు లేనప్పటికీ.. ఏదైనా కారణం చేత రద్దైతే పరిస్థితి ఏంటని అభిమానులు చర్చించుకుంటున్నారు. వాస్తవానికి ఈ నాకౌట్ మ్యాచ్‌లకు ఐసీసీ రిజర్వ్ డే కేటాయించింది. షెడ్యూలైన రోజు మ్యాచ్ జరుగకపోయినా లేక పాక్షికంగా జరిగి ఆగిపోయినా, ఆగిన చోటి నుంచి మరుసటి రోజు మ్యాచ్‌ను కొనసాగిస్తారు. ఒకవేళ రిజర్వ్ డేలో కూడా మ్యాచ్ సాధ్యపడకపోతే మాత్రం సూపర్-8 దశలో మెరుగైన ఫలితాలు సాధించిన జట్టు ఫైనల్స్‌కు చేరుకుంటుంది.ఈ లెక్కన తొలి సెమీఫైనల్ ఏ కారణంగా అయినా రద్దైతే, సూపర్-8లో గ్రూప్-1 టాపర్‌గా ఉన్న సౌతాఫ్రికా ఫైనల్‌కు వెళ్తుంది. న్యూజిలాండ్ ఇంటిముఖం పడుతుంది. రెండో సెమీఫైనల్ ఏ కారణంగా అయినా రద్దైతే, సూపర్-8లో గ్రూప్-2 టాపర్‌గా ఉన్న ఇంగ్లండ్ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. టీమిండియా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. కాబట్టి, ఏ కారణంగా కూడా సెమీస్ రద్దు కాకూడదని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడు. -
T20 WC 2026: బీసీసీఐ కీలక ప్రకటన
టీమిండియా జూన్ షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తాజాగా విడుదల చేసింది. భారత క్రికెట్ జట్టు స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో సిరీస్‌లు ఆడనుందని వెల్లడించింది. ఇందుకు సంబంధించి సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.సెమీ ఫైనల్లో భారత్‌కాగా టీమిండియా ప్రస్తుతం టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్‌తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. గ్రూప్ దశలో అజేయంగా నిలిచిన భారత్.. సూపర్-8లో జింబాబ్వే, వెస్టిండీస్‌లను ఓడించి సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో ఇంగ్లండ్‌తో గురువారం (మార్చి 5) సెమీస్ మ్యాచ్‌లో తలపడేందుకు షెడ్యూల్ ఖరారైంది.మళ్లీ జూన్లోనేఈ మ్యాచ్‌లో గెలిచి ఫైనల్‌కు చేరితే మార్చి 8న టైటిల్ పోరులో టీమిండియా తలపడుతుంది. అనంతరం భారత జట్టులోని ఆటగాళ్లంతా ఐపీఎల్-2026 (IPL)తో బిజీ అవుతారు. ఈ క్రమంలో మళ్లీ జూన్‌లోనే అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా తరఫున విధుల్లో పాల్గొంటారు.అఫ్గనిస్తాన్‌తో సిరీస్‌ఈ నేపథ్యంలో బీసీసీఐ టీమిండియా తదుపరి షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడేందుకు అఫ్గనిస్తాన్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటిస్తుందని పేర్కొంది. జూన్ 6-10 మధ్య టెస్టు జరుగనుండగా.. ఇరుజట్ల మధ్య జూన్ 14, 17, 20 తేదీల్లో వన్డే సిరీస్ జరుగనుంది. భారత్- అఫ్గన్ టెస్టుకు న్యూ చండీగఢ్ వేదిక కాగా.. వన్డే సిరీస్‌కు ధర్మశాల, లక్నో, చెన్నై ఆతిథ్యం ఇవ్వనున్నాయి.రో-కో రీఎంట్రీ డేట్ ఫిక్స్.. అభిమానులు ఖుష్అంతర్జాతీయ టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన భారత బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వన్డేలలో మాత్రం కొనసాగుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరు చివరగా ఈ ఏడాది జనవరిలో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ బరిలో దిగారు.రోహిత్ శర్మ ఫర్వాలేదనిపించగా.. కోహ్లి వరుస సెంచరీలతో ఆకట్టుకున్నాడు. అయితే ఈ సిరీస్‌లో భారత్ కివీస్ చేతిలో ఓడిపోయింది. ఇక తదుపరి అఫ్గనిస్తాన్‌తో సిరీస్ సందర్భంగా జూన్ 14న రో-కో టీమిండియా తరఫున రీఎంట్రీ ఇవ్వనున్నారు. అంతకంటే ముందు ఐపీఎల్లో బెంగళూరు తరఫున కోహ్లి.. ముంబైకి ఆడుతూ రోహిత్ అభిమానులను అలరించనున్నారు.భారత్ వర్సెస్ అఫ్గనిస్తాన్ షెడ్యూల్👉జూన్ 6- 10 టెస్టు మ్యాచ్, న్యూ చంఢీగఢ్ (ఉదయం 9. 30 నిమిషాలకు ఆరంభం)👉జూన్ 14- తొలి వన్డే, ధర్మశాల👉జూన్ 17- రెండో వన్డే, లక్నో👉జూన్ 20- మూడో వన్డే, చెన్నై.👉వన్డే మ్యాచ్‌లన్నీ మధ్యాహ్నం 1.30 నిమిషాలకు ఆరంభం. చదవండి: T20 WC: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం.. ఆటగాళ్లకు భారీ షాక్! -
IND vs WI: విండీస్‌ను ఓడిస్తే సెమీ ఫైనల్లో.. ప్రత్యర్థి ఎవరంటే?
ఐసీసీ టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో టీమిండియా తాడోపేడో తేల్చుకోవాల్సిన స్థితిలో నిలిచింది. వెస్టిండీస్‌తో ఆదివారం జరిగే మ్యాచ్‌లో గెలిస్తేనే భారత జట్టు సెమీ ఫైనల్‌కు చేరుకుంటుంది. లేదంటే ఈ డిఫెండింగ్ చాంపియన్‌కు చేదు అనుభవం తప్పదు.ఇంగ్లండ్, సౌతాఫ్రికా రైట్రైట్నాలుగు గ్రూపుల టాపర్లుగా టీమిండియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వే సూపర్-8 దశకు అర్హత సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందుగా నిర్ణయించిన ప్రకారం టాపర్లన్నింటినీ గ్రూప్-1లో చేర్చింది అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC).ఇక లీగ్ దశలో ఆయా గ్రూపులలో రెండో స్థానంలో నిలిచిన ఇంగ్లండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక జట్లను గ్రూప్-2లో చేర్చింది. ఈ క్రమంలో గ్రూప్-2 నుంచి ఇంగ్లండ్ హ్యాట్రిక్ విజయాలతో ఇప్పటికే సెమీస్ బెర్తు ఖరారు చేసుకోగా.. గ్రూప్-1 నుంచి సౌతాఫ్రికా సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది.మిగిలిన రెండు స్థానాల కోసంమరోవైపు.. మిగిలిన రెండు స్థానాల కోసం టీమిండియా- వెస్టిండీస్... పాకిస్తాన్- న్యూజిలాండ్ రేసులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో శనివారం నాటి పాక్- శ్రీలంక మ్యాచ్ గ్రూప్-2 నుంచి మరో సెమీ ఫైనలిస్టును తేల్చనుండగా.. ఆదివారం జరిగే భారత్- విండీస్ మ్యాచ్‌తో నాలుగో సెమీ ఫైనలిస్టు ఎవరో తేలుతుంది.వెస్టిండీస్‌పై తప్పక గెలవాలికోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్‌పై తప్పక గెలిస్తేనే టీమిండియా సెమీస్ చేరుకుంటుంది. బ్యాటింగ్‌కు అనుకూలంగా మలిచిన ఈ పిచ్‌పై ఫామ్ పరంగా ఇరుజట్లు సమానంగా కనిపిస్తుండటంతో పరుగుల వరద ఖాయం. పైచేయి సాధించిన వారిదే సెమీస్ బెర్తు.సెమీ ఫైనల్లో.. ప్రత్యర్థి ఎవరంటే?అయితే, పటిష్ట టీమిండియా విండీస్‌ను ఓడించి సెమీ ఫైనల్‌కు చేరితే.. ఇంగ్లండ్‌తో తలపడాల్సి ఉంటుంది. ముంబైలోని వాంఖడే మైదానంలో గురువారం (మార్చి 5)న జరిగే రెండో సెమీస్ మ్యాచ్‌లో హ్యారీ బ్రూక్ బృందంతో అమీతుమీ తేల్చుకోవాల్సి ఉంటుంది. అంతా సజావుగా సాగి విండీస్‌పై గెలిచి.. ఇంగ్లండ్‌తో భారత్ సెమీస్ ఆడితే ముఖాముఖి రికార్డు ప్రకారం టీమిండియాదే పైచేయిగా ఉండటం సానుకూలాంశం.టీ20 ప్రపంచకప్ టోర్నీలో భారత్- ఇంగ్లండ్ ఇప్పటికి ఐదుసార్లు తలపడగా.. భారత్ మూడు సార్లు, ఇంగ్లండ్ రెండుసార్లు గెలిచాయి. అయితే, ప్రస్తుత పరిస్థితి భిన్నంగా ఉంది. ఇంగ్లండ్ సూపర్-8లో హ్యాట్రిక్ విజయాలతో ఆత్మవిశ్వాసంతో ఉండగా.. భారత్ ఇంకా బెర్తు ఖరారు చేసుకోలేక ఒత్తిడిలో ఉంది. UPDATE: సామ్సన్ ఆట... సెమీస్ బాట...చదవండి: IND vs ZIM: అభిషేక్ డిఫెన్స్ ఆశ్చర్యపరిచింది -
సిరాజ్ మియాకు అరుదైన గౌరవం
లండన్: భారత పేస్ బౌలర్, హైదరాబాదీ మొహమ్మద్ సిరాజ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ప్రఖ్యాత క్రికెట్ మేగజీన్ ‘విజ్డన్ క్రికెటర్స్ అల్మనాక్’ 2026 సంచిక కవర్ పేజీపై పబ్లిషర్లు సిరాజ్ చిత్రాన్ని ముద్రించారు. సిరాజ్‌తోపాటు ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్ ఫొటో కూడా దీనిపై ఉంది. ఓవల్ టెస్టులో చేతితో గాయంతో జట్టును కాపాడేందుకు కట్టుతోనే మైదానానికి వచ్చిన వోక్స్ ఫొటోనే ఇక్కడ వాడారు. ఇరు జట్ల మధ్య జరిగిన టెస్టు సిరీస్ 2–2తో ‘డ్రా’గా ముగియగా... చివరి టెస్టులో సిరాజ్ ప్రదర్శనతోనే భారత్ 6 పరుగుల తేడాతో నెగ్గింది. రెండో ఇన్నింగ్స్‌లో చివరి రోజు 4 వికెట్లతో ఇంగ్లండ్ 35 పరుగులు చేయాల్సి ఉండగా, సిరాజ్ 3 వికెట్లు తీసి ఇంగ్లండ్ ఆట ముగించాడు. మొత్తంగా ఈ సిరీస్‌లో సిరాజ్ 32.43 సగటుతో అత్యధికంగా 23 వికెట్లు పడగొట్టడం విశేషం. కొత్త విజ్డన్ క్రికెటర్స్ అల్మనాక్ సంచిక ఏప్రిల్ 16న మార్కెట్లోకి రానుంది. -
చితక్కొట్టాడు.. యువీ దెబ్బకు అల్లాడినా..
ఇంగ్లండ్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా పేరొందాడు స్టువర్ట్ బ్రాడ్. టెస్టుల్లో ఏకంగా 604 వికెట్లు కూల్చి.. సంప్రదాయ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్‌గా కొనసాగుతున్నాడు. అతడి ఖాతాలో 178 వన్డే, 65 అంతర్జాతీయ టీ20 వికెట్లు కూడా ఉన్నాయి.ఇంతటి గొప్ప రికార్డు కలిగి ఉన్న స్టువర్ట్ బ్రాడ్‌కు కెరీర్ ఆరంభంలోనే ఓ చేదు అనుభవం ఎదురైంది. మొట్టమొదటి టీ20 ప్రపంచకప్-2007లో టీమిండియా లెజెండరీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) బ్రాడ్‌కు పీడకల మిగిల్చాడు. అతడి బౌలింగ్‌లో ఒకే ఓవర్లో వరుసగా ఆరు సిక్సర్లు బాది.. అంతర్జాతీయ టీ20లలో ఈ ఘనత సాధించిన మొదటి క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు.21 ఏళ్ల వయసులో..మరోవైపు.. ఇలా ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా బ్రాడ్ ఖాతాలో ఓ చెత్త రికార్డు చేరింది. టీ20 క్రికెట్లో యువీ ఐకానిక్ ఫీట్ నమోదు చేసిన ఆ సమయంలో.. ఈ రైటార్మ్ పేసర్ వయసు 21 ఏళ్లే. అయితే, ఆ చేదు అనుభవం నుంచి బ్రాడ్ త్వరగానే కోలుకున్నాడు. అంచెలంచెలుగా ఎదిగి మేటి బౌలర్‌గా పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు.యువీ దెబ్బకు అల్లాడినా..తాజాగా... గత జ్ఞాపకాలు గుర్తుచేసుకున్న స్టువర్ట్ బ్రాడ్.. యువీ దెబ్బకు అల్లాడినా.. ఆ తర్వాత ఎలా నిలదొక్కుకున్నాడో చెప్పుకొచ్చాడు. ‘‘అప్పటికి నేను ఏడు నుంచి ఎనిమిది వన్డేలు మాత్రమే ఆడి ఉంటాను. ఇంకా టెస్టు క్రికెట్లో అరంగేట్రమే చేయలేదు. అప్పుడు నా జట్టు పొడవుగా.. బంగారు వర్ణంలో ఉండేది.ఐదేళ్ల కెరీర్ సేవ్ అయింది20-21 ఏళ్ల మధ్య వయసు. ఉరకలెత్తే ఉత్సాహం. అలాంటపుడు ఊహించని విధంగా.. నా ముఖం మీద కొట్టినట్లుగా బ్యాటర్ బాదుతూ ఉంటే నేను ఏమైపోవాలి?.. అయితే, ఆట ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఆరంభంలోనే అంతా సజావుగా సాగిపోతే 26-27 ఏళ్లకే అంతా సాధించేశాము అన్న భావన వచ్చేస్తుంది. అంకితభావం కొరవడినా ఆశ్చర్యపోనక్కర్లేదు.వారియర్ మోడ్ఫామ్లో లేకుంటే జట్టు నుంచి తప్పించనూ వచ్చు. 31 ఏళ్లు వచ్చే సరికి అంతా ముగిసిపోతుంది. కానీ నాకు 21 ఏళ్ల వయసులో తగిలిన ‘దెబ్బ’ నాలో కసిని రగిల్చింది. మరుసటి ఐదేళ్లు ఎలా ఆడాలో.. ఆటను ఎలా అభివృద్ధి చేసుకోవాలో తెలిసేలా చేసింది. నన్ను ‘వారియర్ మోడ్’లోకి తీసుకువెళ్లింది.ప్రతి మ్యాచ్‌కు ముందు పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యేలా చేసింది. అలా 25-26 ఏళ్ల వయసు వచ్చే సరికి ఎలైట్ పర్ఫార్మర్ కావాలనే కోరిక పెరిగింది. అందకు తగినట్లుగా కృషి చేశా. కానీ ఒక్కోసారి నా శరీరం ఇందుకు సహకరించలేదు. కాబట్టి అనుకున్నది అనుకున్న సమయంలో సాధించకలేకపోయాను.అందుకే ఒక్కోసారి వెనక్కి తిరిగి చూసుకుంటే.. నేనింకా మెరుగ్గా ఆడాల్సింది అని అనిపిస్తుంది’’ అని మాథ్యూ హెడెన్ పాడ్‌కాస్ట్‌లో స్టువర్ట్ బ్రాడ్ తన మనసులోని భావాలు పంచుకున్నాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్లో ఓవరాల్‌గా 344 మ్యాచ్‌లలో కలిపి 847 వికెట్లు కూల్చిన 39 ఏళ్ల బ్రాడ్.. 2023లో ఆటకు గుడ్‌బై చెప్పాడు.చదవండి: బంగ్లాదేశ్‌కు భారీ షాక్ -
ఆడమని బతిమిలాడినా పట్టించుకోలేదు!
టీమిండియా సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ (Mohammed Shami) పేరు గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా వన్డే జట్టును ప్రకటించే సమయంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) చేసిన వ్యాఖ్యలు.. బదులుగా షమీ కౌంటర్ ఇవ్వడం ఇందుకు కారణం.షమీ ఫిట్నెస్ గురించి అప్డేట్ లేదని అగార్కర్ తెలపగా.. రంజీలు ఆడే తాను వన్డేలు ఆడలేనా? అంటూ షమీ గట్టిగానే బదులిచ్చాడు. తాను పూర్తి ఫిట్‌గా ఉన్నానని.. అయితే, జట్టు ఎంపిక సమయంలో తనను సెలక్టర్లు ఎవరూ సంప్రదించలేదని బాంబు పేల్చాడు.మరో‘సారీ’ఇందుకు బదులిస్తూ.. షమీ ఫిట్‌గా లేనందువల్లే అతడిని ఆసీస్ టూర్‌కు ఎంపిక చేయలేదని అగార్కర్ పునరుద్ఘాటించాడు. ఈ క్రమంలో బెంగాల్ తరఫున రంజీ ట్రోఫీ (Ranji Trophy) తాజా సీజన్లో ఒకే మ్యాచ్‌లో ఎనిమిది వికెట్లు కూల్చి ఆటతోనే బదులిచ్చాడు షమీ.ఈ పరిణామాల నేపథ్యంలో సౌతాఫ్రికాతో నవంబరులో సొంతగడ్డపై టెస్టు సిరీస్‌కు షమీని ఎంపిక చేస్తారనే విశ్లేషణలు రాగా.. మరోసారి సెలక్టర్లు అతడికి మొండిచేయి చూపారు. ఫలితంగా భారత జట్టు యాజమాన్యంపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఆడమని బతిమిలాడినా పట్టించుకోలేదు... ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సీనియర్ అధికారి ఒకరు షమీ గురించి సంచలన విషయాలు వెల్లడించారు. ఇంగ్లండ్ పర్యటనకు రావాల్సిందిగా షమీని సెలక్టర్లు కోరినా.. అతడు మాత్రం రాలేనని చెప్పాడంటూ ఆరోపించారు.ఈ మేరకు PTIతో మాట్లాడుతూ.. ‘‘జాతీయ జట్టు సెలక్టర్లు.. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు చెందిన సహాయక సిబ్బంది చాలాసార్లు షమీ ఫిట్నెస్ చెక్ చేయాలని కాల్ చేశారు. ఇంగ్లండ్‌లో జస్ప్రీత్ బుమ్రా వర్క్‌లోడ్ మేనేజ్మెంట్ నేపథ్యంలో షమీ సేవలను ఉపయోగించుకోవాలని ఎంతగానో తపించిపోయారు.ఇంగ్లండ్ పిచ్ పరిస్థితులకు తగ్గట్లుగా బౌలింగ్ చేయగల సత్తా ఉన్న షమీ వంటి బౌలర్‌ను ఎవరు మాత్రం ఎందుకు కాదనుకుంటారు?.. తనను సెలక్టర్లు ఎవరూ సంప్రదించలేదంటూ షమీ గురించి వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం.సెలక్టర్లు అడిగినా రాలేదుఅంతర్జాతీయ క్రికెట్లో వరుసగా మ్యాచ్‌లు ఆడేందుకు షమీ ఫిట్‌గా ఉన్నాడా? లేడా? అన్న అంశంపై స్పోర్ట్స్ సైన్స్ టీమ్ ఎప్పటికప్పుడు అతడి మెడికల్ రిపోర్టులు పరిశీలిస్తూనే ఉంది’’ అని సదరు అధికారి పేర్కొన్నారు. సెలక్టర్లు అడిగినా రాలేదని పరోక్షంగా వెల్లడించాడు. కాగా ఇప్పటికే టెస్టు, టీ20 జట్లలో చోటు కోల్పోయిన షమీ.. వన్డేల్లో మాత్రం సత్తా చాటుతున్నాడు.చివరగా ఈ ఏడాది మార్చిలో జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నీలో ఈ రైటార్మ్ పేసర్ భాగమయ్యాడు. ఈ మెగా ఈవెంట్లో షమీ తొమ్మిది వికెట్లు కూల్చాడు. ఆ తర్వాత ఇంత వరకు మళ్లీ జాతీయ జట్టుకు ఆడలేదు. కెరీర్‌కు ఎండ్కార్డ్ఇక వన్డే వరల్డ్‌కప్-2027ను దృష్టిలో పెట్టుకుని రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించిన యాజమాన్యం.. విరాట్ కోహ్లి అందుబాటుపై కూడా క్లారిటీ లేదని చెప్పింది. ఇలాంటి తరుణంలో 35 ఏళ్ల షమీకి ఇకపై వన్డేలలోనైనా అవకాశం ఇవ్వడం దాదాపు అసాధ్యమని ప్రస్తుత పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఫలితంగా షమీ అంతర్జాతీయ కెరీర్‌కు పూర్తిస్థాయిలో ఎండ్‌కార్డ్ పడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చదవండి: ఆ ఓవరాక్షనే వద్దనేది.. అదేమైనా వరల్డ్ కప్ ట్రోఫీనా? -
WTC: ఒక్క మ్యాచ్‌తో మారిన పాక్ రాత.. టీమిండియాకు బూస్ట్!
సౌతాఫ్రికాతో రెండో టెస్టులో పాకిస్తాన్ (PAK vs SA 2nd Test) ఓటమి పాలైంది. రావల్పిండి వేదికగా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన దక్షిణాఫ్రికా జట్టు... ఆతిథ్య పాక్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 (WTC) సీజన్లో భాగంగా డిఫెండింగ్ చాంపియన్ రెండు టెస్టులు ఆడేందుకు పాకిస్తాన్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో లాహోర్‌లో జరిగిన తొలి టెస్టులో పాక్ గెలిచి.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకువచ్చింది. అయితే, గురువారం ముగిసిన రెండో టెస్టులో సఫారీల చేతిలో ఓడటంతో పాక్ ర్యాంకు పడిపోయింది.బాబర్ ఆజమ్ అర్ధ శతకంకాగా 2025–27 డబ్ల్యూటీసీ సైకిల్లో పాకిస్తాన్- సౌతాఫ్రికా ఇదే తొలి సిరీస్ కాగా.. ఇరు జట్లు చెరో విజయం ఖాతాలో వేసుకున్నాయి. ఇక గురువారం ఓవర్‌నైట్ స్కోరు 94/4తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన పాకిస్తాన్ చివరకు 49.3 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌటైంది. మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ (87 బంతుల్లో 50; 7 ఫోర్లు) అర్ధశతకం పూర్తిచేసుకున్న వెంటనే వెనుదిరగ్గా... మిగిలిన వాళ్లు విఫలమయ్యారు. మొహమ్మద్ రిజ్వాన్ (18), సల్మాన్ ఆగా (28), నోమాన్ అలీ (0), షాహీన్ షా అఫ్రిది (0), సాజిద్ ఖాన్ (13) ఒకరి వెంట ఒకరు పెవిలియన్‌కు వరుస కట్టారు.దక్షిణాఫ్రికా బౌలర్లలో సిమన్ హర్మెర్ 6 వికెట్లతో అదరగొట్టగా... కేశవ్ మహరాజ్ 2 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో వీరిద్దరే కలిసి 17 వికెట్లు తీశారు. ఈ క్రమంలో హర్మెర్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో వెయ్యి వికెట్లు పూర్తి చేసుకున్నాడు. దక్షిణాఫ్రికా తరఫున ఈ ఘనత సాధించిన నాలుగో బౌలర్‌గా నిలిచాడు. రెండే వికెట్లు కోల్పోయి..అనంతరం 68 పరుగులు లక్ష్యఛేదనకు రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 12.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 73 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు రికెల్టన్ (25 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్), మార్క్రమ్ (42; 8 ఫోర్లు) రాణించారు.లక్ష్యం మరీ చిన్నది కావడంతో సఫారీ జట్టు ఎలాంటి తడబాటు లేకుండా రెండే వికెట్లు కోల్పోయి గమ్యాన్ని చేరుకుంది. పాక్ బౌలర్లలో నోమాన్ అలీ 2 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 333 పరుగులు చేయగా... దక్షిణాఫ్రికా 404 పరుగులు చేసింది. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 9 వికెట్లు పడగొట్టడంతో పాటు బ్యాట్‌తోనూ ఆకట్టుకున్న దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, సెనురన్ ముత్తుస్వామికి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’అవార్డులు దక్కాయి.ఒక్క మ్యాచ్‌తో మారిన పాక్ రాత.. టీమిండియాకు బూస్ట్!ఇక ఈ విజయంతో సౌతాఫ్రికా డబ్ల్యూటీసీ పట్టికలో నాలుగో స్థానానికి చేరుకోగా.. పాకిస్తాన్ రెండు నుంచి ఐదో స్థానానికి పడిపోయింది. అదే విధంగా ఆస్ట్రేలియా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా.. శ్రీలంక మూడు నుంచి రెండుకు, టీమిండియా నాలుగు నుంచి మూడో స్థానానికి చేరుకున్నాయి. డబ్ల్యూటీసీ నిబంధనల ప్రకారం.. టెస్టు మ్యాచ్ గెలిచిన జట్టుకు పన్నెండు పాయింట్లు కేటాయిస్తారు. ఒకవేళ మ్యాచ్ డ్రా అయితే.. ఇరుజట్లకు నాలుగు పాయింట్లు.. టై అయితే ఆరు పాయింట్లు జమచేస్తారు.అత్యధిక మ్యాచ్‌లు ఆడింది ఎవరంటే?డబ్ల్యూటీసీ 2025-27లో ఆసీస్ జట్టు తొలుత వెస్టిండీస్ టెస్టు సిరీస్‌ను 3-0తో వైట్‌వాష్ చేసింది. అదే విధంగా.. శ్రీలంక.. సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో ఒకటి డ్రా చేసుకుని.. రెండో మ్యాచ్ గెలిచింది.మరోవైపు.. ఇప్పటికే ఏడు మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది టీమిండియా. తొలుత ఇంగ్లండ్ పర్యటన రూపంలో కఠిన సవాలు ఎదుర్కొన్న భారత్.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండు గెలిచి.. ఒకటి డ్రా చేసుకుంది. మరో రెండింటిలో ఓటమిపాలైంది.ఇటీవల సొంతగడ్డపై వెస్టిండీస్‌తో రెండు టెస్టులు ఆడిన టీమిండియా.. 2-0తో వైట్‌వాష్ చేసింది. తద్వారా ఇప్పటి వరకు నాలుగు విజయాలు, రెండు ఓటములు, ఒక డ్రా ద్వారా 52 పాయింట్లు సంపాదించింది. ఇక టీమిండియాపై రెండు టెస్టులు గెలిచిన ఇంగ్లండ్.. ఒకటి డ్రా చేసుకోవడం ద్వారా మొత్తంగా 26 పాయింట్లు సాధించింది. అయితే, సౌతాఫ్రికా తాజాగా టాప్-5లోకి దూసుకురాగా.. ఇంగ్లండ్ ఆరో స్థానానికి పడిపోయింది.చదవండి: IND vs AUS: అతడే ఉంటే కథ వేరేలా ఉండేది.. గంభీర్ ఇకనైనా మారవా? -
‘నా వల్లే జట్టు ఓడింది.. నేను కాస్త తెలివిగా ఆడాల్సింది’
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 (ODI World Cup 2025)లో భారత జట్టు మరో పరాజయం చవిచూసింది. స్వీయ తప్పిదాల కారణంగా ఇంగ్లండ్ మహిళా జట్టు (IND W vs ENG W)తో గెలవాల్సిన మ్యాచ్‌లో.. నాలుగు పరుగుల స్వల్ప తేడాతో ఓడిపోయింది. తద్వారా సెమీ ఫైనల్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.ఈ నేపథ్యంలో ఇండోర్ వేదికగా ఇంగ్లండ్ చేతిలో ఓటమిపై భారత జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (Smriti Mandhana) స్పందించింది. తాను కాస్త తెలివిగా ఆడి ఉంటే మ్యాచ్ తప్పక గెలిచేవాళ్లమని పేర్కొంది. గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడటానికి తాను ప్రధాన కారణమంటూ ఓటమికి బాధ్యత వహించింది. 88 పరుగులు చేసి..నిజానికి ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో స్మృతి అదరగొట్టింది. ఈ ఓపెనింగ్ బ్యాటర్ 94 బంతులు ఎదుర్కొని 88 పరుగులు చేసి.. జట్టును విజయం దిశగా నడిపించింది. చేతిలో ఏడు వికెట్లు.. గెలుపునకు 53 బంతుల్లో 55 పరుగులు అవసరమైన వేళ అనూహ్య రీతిలో స్మృతి అవుటైంది.లిన్సే స్మిత్ బౌలింగ్‌లో లాంగాఫ్ మీదుగా షాట్ బాది అలిస్ కాప్సేకి క్యాచ్ ఇచ్చిన స్మృతి మంధాన.. పెవిలియన్‌కు చేరింది. ఇక కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా అద్బుత అర్ధ శతకం (70)తో రాణించింది. మరోవైపు.. దీప్తి శర్మ 50 పరుగులతో అదరగొట్టింది. కానీ స్మృతి అవుటైన తర్వాత భారత బ్యాటింగ్ ఆర్డర్ వేగంగా పతనమైంది.The skipper’s looking solid and locked on to the chase! 🤜🏻🤛🏻Will Harmanpreet Kaur turn this start into a big one and guide #TeamIndia through in this do-or-die clash? 😮💨Catch the LIVE action ➡https://t.co/WF0rXIHjl8#CWC25 👉 #INDvENG | LIVE NOW on Star Sports & JioHotstar pic.twitter.com/vTs7nP01Tb— Star Sports (@StarSportsIndia) October 19, 2025 ఇంగ్లండ్ విధించిన 289 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో.. నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి టీమిండియా 284 పరుగుల వద్ద నిలిచింది. దీంతో ఓటమి ఖరారైంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం స్మృతి మంధాన తీవ్ర భావోద్వేగానికి లోనైంది.నా వల్లే జట్టు ఓడింది.. నేను కాస్త తెలివిగా ఆడాల్సింది‘‘అవును.. మా బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. ప్రతి ఒక్కరు ఇది చూసే ఉంటారు. మా షాట్ సెలక్షన్లు మరింత మెరుగ్గా ఉండాల్సింది. ముఖ్యంగా నేను.. ఇంకాస్త తెలివిగా ప్రవర్తించాల్సింది. మా బ్యాటింగ్ ఆర్డర్ పతనం నాతోనే మొదలైంది. ఇందుకు నేను నైతిక బాధ్యత వహిస్తాను.నాదే బాధ్యతమేము ఓవర్‌కు కేవలం ఆరు పరుగులు చేసి ఉంటే గెలిచేవాళ్లం. కానీ పరిస్థితి మరోలా మారిపోయింది. ఏదేమైనా ఈ మ్యాచ్‌లో మా బ్యాటింగ్ ఆర్డర్ పతనానికి నాదే బాధ్యత’’ అని స్మృతి మంధాన పేర్కొంది. కాగా తాజా వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో భారత్‌కు ఇది హ్యాట్రిక్ ఓటమి.ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మహిళా జట్లు సెమీ ఫైనల్ చేరగా.. భారత్‌పై గెలుపుతో ఇంగ్లండ్ కూడా సెమీస్‌కు అర్హత సాధించింది. నాలుగో స్థానం కోసం న్యూజిలాండ్‌తో భారత్ పోటీ పడుతోంది.చదవండి: నితీశ్ రెడ్డిని అందుకే తీసుకున్నారు.. కానీ ఇదేం పద్ధతి?: అశూ ఫైర్ -
ఆశలు రేపి... ఆఖర్లో కూల్చారు!
లక్ష్యఛేదనలో 253/4 స్కోరు వద్ద భారత్ 30 బంతుల్లో 36 పరుగుల సమీకరణమపుడు గెలుపే... భారత్‌వైపు తొంగిచూస్తోంది. కానీ తర్వాతి వరుస ఓవర్లలో హిట్టర్ రిచా ఘోష్, ఫిఫ్టీ చేసిన దీప్తిశర్మ అవుటవడంతోనే మహిళల జట్టు గెలుపునకు దూరమైంది. క్రీజులో ఉన్న అమన్‌జోత్, స్నేహ్రాణా సింగిల్స్‌కే పరిమితం కావడం... భారీ షాట్లు ఆడలేకపోవడంతో గెలుపు దారితప్పి ఓటమిబాట పట్టింది.ఇండోర్: ఇక గెలుపు ఖాయమేలే... విజయానికి చేరువయ్యామని అనుకుంటుండగా ఊహించని ఫలితం భారత శిబిరాన్ని ముంచేసింది. విజయం ఆశలు రేపిన మహిళలు ఆఖరికొచ్చేసరికి తమవల్ల కాదంటూ చేతులెత్తేశారు. దీంతో గెలుపుదాకా వచ్చిన భారత్ 4 పరుగుల దూరంలో ఆగిపోయింది. ఇంగ్లండ్ అమ్మాయిల చేతిలో ఓడిపోయింది. ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు వరుసగా మూడో మ్యాచ్‌లోనూ పరాజయం పాలైంది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హీథర్‌నైట్ (91 బంతుల్లో 109; 15 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ సాధించింది. అమీ జోన్స్ (68 బంతుల్లో 56; 8 ఫోర్లు) అర్ధశతకం చేసింది. దీప్తిశర్మ (4/51) ప్రత్యర్థి బ్యాటింగ్‌కు దెబ్బతీయగా, శ్రీచరణి 2 వికెట్లు పడగొట్టింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన భారత మహిళల జట్టు 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసి ఓడింది. స్మృతి మంధానా (94 బంతుల్లో 88; 8 ఫోర్లు), కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (70 బంతుల్లో 70; 10 ఫోర్లు), దీప్తిశర్మ (57 బంతుల్లో 50; 5 ఫోర్లు)ల అర్ధశతకాల మోత బూడిదలో పోసిన పన్నీరైంది. ప్రత్యర్థి బౌలర్లలో నాట్ సీవర్ బ్రంట్ 2 వికెట్లు తీసింది. కదంతొక్కిన హీథర్‌నైట్ ఓపెనర్ బ్యూమోంట్ (22) తక్కువ స్కోరుకే అవుటైనా... మరో ఓపెనర్ అమీ జోన్స్ ఫిఫ్టీతో, టాపార్డర్ బ్యాటర్ హీథర్‌నైట్ శతకంతో ఇంగ్లండ్ భారీ స్కోరుకు బాటలు వేశారు. కెపె్టన్ నాట్ సీవర్ బ్రంట్ (38; 4 ఫోర్లు), హీథర్‌నైట్ మూడో వికెట్‌కు 113 పరుగులు జోడించారు. దీప్తి శర్మ వరుస విరామాల్లో వికెట్లు తీసి ప్రత్యర్థి స్కోరు మరింత పెరగకుండా చేసింది. 289 పరుగుల లక్ష్యఛేదనలో ప్రతీక (6) వికెట్‌ను కోల్పోయినప్పటికీ స్మృతి, హర్లీన్ (24), కెపె్టన్ హర్మన్, దీప్తిల రాణింపుతో విజయంవైపు అడుగులు వేసింది. అయితే 234 స్కోరు వద్ద మంధాన అవుటవడం మ్యాచ్ ఫలితాన్నే మార్చింది. రిచా, దీప్తిలు అవుటవడంతో పరాజయం ఖాయమైంది.స్కోరు వివరాలు ఇంగ్లండ్ మహిళల ఇన్నింగ్స్: బ్యూమోంట్ (బి) దీప్తి 22; అమీ జోన్స్ (సి) మంధాన (బి) దీప్తి 56; హీథర్‌నైట్ (రనౌట్) 109; నాట్ సీవర్ (సి) హర్మన్‌ప్రీత్ (బి) శ్రీచరణి 38; సోఫియా (సి) దీప్తి (బి) శ్రీచరణి 15; ఎమా లంబ్ (సి) మంధాన (బి) దీప్తి 11; అలైస్ క్యాప్సీ (సి) హర్లీన్ (బి) దీప్తి 2; చార్లీ (నాటౌట్) 19; సోఫీ ఎకిల్‌స్టోన్ రనౌట్ 3; లిన్సే స్మిత్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 288. వికెట్ల పతనం: 1–73, 2–98, 3–211, 4–249, 5–254, 6–257, 7–276, 8–280. బౌలింగ్: రేణుక 8–0–37–0, క్రాంతి 8–0–46–0, స్నేహ్ రాణా 10–0–56–0, శ్రీచరణి 10–0–68–2, దీప్తిశర్మ 10–0–51–4, అమన్‌జోత్ 4–0–26–0. భారత మహిళల ఇన్నింగ్స్: ప్రతీక (సి) అమీజోన్స్ (బి) లారెన్ బెల్ 6; స్మృతి (సి) క్యాప్సీ (బి) లిన్సే స్మిత్ 88; హర్లీన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) చార్లీ 24; హర్మన్‌ప్రీత్ (సి) ఎమా లంబ్ (బి) నాట్ సీవర్ 70; దీప్తి (సి) సోఫియా (బి) ఎకిల్‌స్టోన్ 50; రిచా (సి) హీథర్‌నైట్ (బి) నాట్ సీవర్ 8; అమన్‌జోత్ (నాటౌట్) 18; స్నేహ్ రాణా (నాటౌట్) 10; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (50 ఓవర్లలో 6 వికెట్లకు) 284. వికెట్ల పతనం: 1–13, 2–42, 3–167, 4–234, 5–256, 6–262. బౌలింగ్: లారెన్ బెల్ 9–0–52–1, లిన్సే స్మిత్ 10–0–40–1, నాట్ సీవర్ 8–0–47–2, చార్లీ డీన్ 10–0–67–1, సోఫీ ఎకిల్‌స్టోన్ 10–0–58–1, అలైస్ క్యాప్సీ 3–0–20–0. -
శతక్కొట్టిన హీథర్ నైట్.. టీమిండియా ముందు భారీ లక్ష్యం
మహిళల వన్డే ప్రపంచకప్‌లో (Women's CWC 2025) ఇవాళ (అక్టోబర్ 19) భారత్, ఇంగ్లండ్ జట్లు (india vs England) తలపడుతున్నాయి. ఇండోర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేసింది. వన్ డౌన్ బ్యాటర్ హీథర్ నైట్ (Heather Knight) (91 బంతుల్లో 109; 15 ఫోర్లు, సిక్స్) మెరుపు సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. నైట్‌తో పాటు ఓపెనర్ యామీ జోన్స్ (56) రాణించింది. కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ (38) పర్వాలేదనిపించింది. మరో ఓపెనర్ ట్యామీ బేమౌంట్ 22, సోఫీ డంక్లీ 11, అలైస్ క్యాప్సీ 2, సోఫీ ఎక్లెస్టోన్ 3 పరుగులు చేశారు. ఛార్లోట్ డీన్ (19), లిన్సే స్మిత్ (0) నాటౌట్‌గా నిలిచారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ 4 వికెట్లు పడగొట్టగా.. శ్రీ చరణి 2 వికెట్లు తీసింది.ప్రస్తుత ప్రపంచకప్‌లో హీథర్ నైట్ చేసిన సెంచరీ ఎనిదవది. ఆమె తన 300వ అంతర్జాతీయ మ్యాచ్‌లో మూడంకెల మార్కును చేరుకుంది. హీథర్‌కు ముందు ప్రస్తుత ప్రపంచకప్‌లో అలైస్సా హీలీ 2 సెంచరీలు, సోఫీ డివైన్, నాట్ సీవర్ బ్రంట్, ఆష్లే గార్డ్నర్, తజ్మిన్ బ్రిట్స్, బెత్ మూనీ తలో సెంచరీలు చేశాడు.కాగా, ప్రస్తుత ఎడిషన్‌లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా ఇదివరకే సెమీస్‌కు అర్హత సాధించాయి. భారత్‌తో మ్యాచ్‌లో గెలిస్తే ఇంగ్లండ్ కూడా సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది. ప్రస్తుతం ఆ జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. మరోవైపు సెమీస్ బెర్త్ ఖరారు చేసుకునే విషయంలో భారత్‌కు కూడా ఈ మ్యాచ్ చాలా కీలకం. భారత్ ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో రెండింట ఓడి నాలుగో స్థానంలో ఉంది. చదవండి: బ్యాటర్ల వైఫల్యం.. ఆసీస్ చేతిలో చిత్తైన టీమిండియా -
కెప్టెన్ అంటే ఇలాగే ఉండాలి.. అందరూ అతడిని గౌరవిస్తారు: గంభీర్
టీమిండియా టెస్టు సారథి శుబ్‌మన్ గిల్ (Shubman Gill)పై హెడ్‌కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) ప్రశంసలు కురిపించాడు. టెస్టు కెప్టెన్‌గా అతడు తొలి ప్రయత్నంలోనే ఉత్తీర్ణుడయ్యాడని.. అతడికి వంక పెట్టేందుకు ఏమీ లేదని కొనియాడాడు. తనకు ఉన్న నైపుణ్యాలతోనే గిల్ టెస్టు సారథి అయ్యాడని.. అలాగే వన్డే కెప్టెన్సీ బాధ్యతలు కూడా దక్కించుకున్నాడని పేర్కొన్నాడు.సారథిగా తొలి ప్రయత్నంలోనేకాగా ఇంగ్లండ్ పర్యటనకు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించగా.. గిల్ అతడి స్థానాన్ని భర్తీ చేసిన విషయం తెలిసిందే. సారథిగా తొలి ప్రయత్నంలోనే ఇంగ్లండ్ వంటి పటిష్టమైన జట్టుతో తలపడ్డాడు. బ్యాటర్‌గా, కెప్టెన్‌గా రాణించి ఇంగ్లండ్ గడ్డ మీద ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో సమం చేశాడు.విండీస్‌ను వైట్‌వాష్ చేసి తొలి విజయంఇక తాజాగా వెస్టిండీస్‌తో స్వదేశంలో జరిగిన రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో వైట్‌వాష్ చేసి.. కెప్టెన్‌గా గిల్ తొలి సిరీస్ విజయాన్ని రుచిచూశాడు. ఇదిలా ఉంటే.. ఇటీవలే వన్డే కెప్టెన్సీ నుంచి దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మను తప్పించిన భారత క్రికెట్ యాజమాన్యం.. గిల్‌కు పగ్గాలు అప్పగించింది.ఫేవటెరిజం లేదుఈ నేపథ్యంలో విమర్శలు రాగా.. విండీస్‌పై విజయానంతరం గంభీర్ స్పందించాడు. ‘‘అతడిని అచ్చంగా అతడిలా ఉండనివ్వడమే మేము చేసిన మంచిపని. టెస్టు లేదంటే వన్డే కెప్టెన్‌గా అతడిని ఎంపిక చేయడంలో ఎలాంటి ఫేవటెరిజం లేదు. ఇందుకు వందశాతం గిల్ అర్హుడు.ఎన్నో ఏళ్లుగా అతడు కఠినంగా శ్రమిస్తున్నాడు. ఇంగ్లండ్ గడ్డ మీద టెస్టు కెప్టెన్ ఇప్పటికే కఠిన సవాలు ఎదుర్కొని.. అతడు సారథిగా పాసయ్యాడు. నాణ్యమైన జట్టుపై బ్యాటర్‌గా, కెప్టెన్‌గా రాణించాడు. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ 2027 గురించి ఇప్పటి నుంచే ఆలోచించడం సరికాదు.అందరూ అతడిని గౌరవిస్తారుప్రతి మ్యాచ్‌లోనూ గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లడం ముఖ్యం. సొంతగడ్డపై మాకిది కీలకమైన సిరీస్. ఇదే స్ఫూర్తితో మేము ముందుకు వెళ్తాం. నిజానికి ఇంగ్లండ్‌లో టెస్టులు ఇంతకంటే కష్టంగా ఉండేవి. ఇదే విషయాన్ని గిల్‌తో నేను చాలాసార్లు చెప్పాను.రెండున్నర నెలల పాటు అక్కడ గిల్ అత్యంత కఠినమైన సవాలును ఎదుర్కొన్నాడు. ఇంతకంటే అతడు ఇంకేం చేయాలి? డ్రెసింగ్‌రూమ్‌లో అందరూ అతడిని గౌరవిస్తారు. సరైన పనులు చేసినందుకు అతడికి ఇవన్నీ దక్కాయి. మాటల కంటే చేతలు ముఖ్యం’’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు.నాకు ఆ అవసరం ఉందిఇక ఒత్తిడిని తట్టుకునేందుకు గిల్ కోసం మెంటల్ కండిషనింగ్ కోచ్‌ను నియమిస్తారా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘ముందైతే నాకు అతడి అవసరం ఉంది’’ అంటూ నవ్వులు చిందించాడు. గెలిచినప్పుడు జట్టుకు ప్రశంసలు దక్కుతాయన్న గౌతీ.. ఓడినప్పుడు మాత్రం ఆటగాళ్లు కుంగిపోకుండా చూసుకోవడం తన బాధ్యత అని చెప్పుకొచ్చాడు.చదవండి: చరిత్ర సృష్టించిన ధ్రువ్ జురెల్.. భారత తొలి క్రికెటర్‌గా ఫీట్ -
నేను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్ అతడే: శుబ్‌మన్ గిల్
టీమిండియా టీ20 వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అభిషేక్ శర్మ (Abhishek Sharma)తో కలిసి జీవితాంతం బ్యాటింగ్ చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. దాదాపు ఏడాది విరామం తర్వాత గిల్ భారత టీ20 జట్టులో పునరాగమనం చేసిన విషయం తెలిసిందే.ఆసియా కప్-2025 (Asia Cup 2025) టోర్నీలో భాగంగా యూఏఈతో మ్యాచ్‌లో గిల్ ఆడాడు. తన చిన్ననాటి స్నేహితుడు అభిషేక్ శర్మతో కలిసి భారత ఇన్నింగ్స్ ఆరంభించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. తొమ్మిది బంతుల్లోనే 20 పరుగులతో అదరగొట్టాడు. తద్వారా యూఏఈ విధించిన 57 పరుగుల లక్ష్యాన్ని.. టీమిండియా 4.3 ఓవర్లలోనే ఛేదించడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక గిల్ టీమిండియాతో కలిసి తదుపరి దాయాది పాకిస్తాన్ (సెప్టెంబరు 14)తో మ్యాచ్‌కు సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో ఆసియా కప్ బ్రాడ్‌కాస్టర్ సోనీ స్పోర్ట్స్ గిల్ ర్యాపిడ్ ఫైర్ సెషన్లో పాల్గొన్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో పలు ప్రశ్నలకు అతడు జవాబు ఇచ్చాడు.👉ఈ టోర్నమెంట్ కోసం మీరు ఎన్ని బ్యాట్లు తీసుకువచ్చారు?😊గిల్: తొమ్మిది బ్యాట్లు👉ఏ బ్యాటర్‌తో కలిసి జీవితాంతం బ్యాటింగ్ చేయాలని అనుకుంటున్నారు?😊గిల్: ప్రస్తుతానికైతే అభిషేక్ శర్మతో కలిసి👉మీరు ఏ ఆటగాడి నుంచైనా దొంగతనం చేయాలని అనుకునే నైపుణ్యం ఏమిటి?😊గిల్: ఏబీ డివిలియర్స్ స్కూప్ షాట్👉మీరు ఎదుర్కొన్న కఠినమైన బౌలర్?😊గిల్: జేమ్స్ ఆండర్సన్ (ఇంగ్లండ్)👉మీ క్రికెట్ కెరీర్లో ఇప్పటి వరకు అత్యంత మధురమైన జ్ఞాపకం?😊గిల్: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 గెలవడం.👉మీ చీట్ మీల్లో ఉండే ఫుడ్?😊గిల్: ప్యాన్‌కేక్స్, బటర్ చికెన్, దాల్ మఖ్నీ.మూడు ఫార్మాట్ల భవిష్య కెప్టెన్‌గా..ఇరవై ఆరేళ్ల శుబ్‌మన్ గిల్ ఇటీవలే భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టాడు. రోహిత్ శర్మ రిటైర్మెంట్ నేపథ్యంలో ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా టీమిండియా సారథిగా సరికొత్త బాధ్యతలు తీసుకున్నాడు. ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీలో 754 పరుగులతో టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు.ఇక కెప్టెన్‌గా ఎడ్జ్‌బాస్టన్‌లో టీమిండియాకు తొలి విజయం అందించిన సారథిగా గిల్ చరిత్రకెక్కాడు. ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత 2-2తో సమం చేసుకోవడంలో బ్యాటర్‌గానూ తన వంతు పాత్ర పోషించాడు. కాగా ప్రస్తుతం టీమిండియాకు మూడు ఫార్మాట్లలో ముగ్గురు కెప్టెన్లు ఉన్న విషయం తెలిసిందే. వన్డేలకు రోహిత్ శర్మ, టీ20లకు సూర్యకుమార్ యాదవ్, టెస్టులకు గిల్ సారథ్యం వహిస్తున్నారు.అయితే, భవిష్యత్తులో మూడు ఫార్మాట్లకు కలిపి గిల్‌ను నియమించేలా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే అతడిని టీ20 జట్టులోకి వైస్ కెప్టెన్‌గా తీసుకువచ్చింది. త్వరలోనే గిల్ భారత వన్డే, టీ20 జట్లకు కూడా కెప్టెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.చదవండి: సూర్యకుమార్ యాదవ్ ప్రపంచ రికార్డు బద్దలు.. తొలి ప్లేయర్‌గా సాల్ట్ చరిత్రThe Prince took on the rapid-fire challenge. Here’s how it went… Watch cricket's 𝑼𝑳𝑻𝑰𝑴𝑨𝑻𝑬 𝑹𝑰𝑽𝑨𝑳𝑹𝒀 come alive on Sept 14, 7 PM onwards, LIVE on the Sony Sports Network TV channels & Sony LIV 📺#SonySportsNetwork #DPWorldAsiaCup2025 #INDvPAK pic.twitter.com/d2Rz0TUVGa— Sony Sports Network (@SonySportsNetwk) September 12, 2025 -
శ్రేయస్ భయ్యా అలా చేయగానే సంబరం.. నేను మాత్రం..: హర్షిత్ రాణా
ఐపీఎల్లో ప్రతిభను నిరూపించుకుని ఇటీవల టీమిండియాలోకి దూసుకువచ్చిన ఆటగాళ్లలో హర్షిత్ రాణా (Harshit Rana) ఒకడు. గతేడాది శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) కెప్టెన్సీలోని కోల్‌కతా నైట్ రైడర్స్ టైటిల్ గెలవడంలో ఈ ఢిల్లీ ఎక్స్‌ప్రెస్‌ది కీలక పాత్ర. 13 మ్యాచ్‌లలో కలిపి ఈ పేస్‌బౌలర్ పందొమ్మిది వికెట్లు కూల్చాడు.గంభీర్ దృష్టిలో పడికేకేఆర్ తరఫున ప్రదర్శన ద్వారా అప్పటి మెంటార్ గౌతం గంభీర్ (Gautam Gambhir) దృష్టిలో పడిన హర్షిత్ రాణా.. గౌతీ టీమిండియా హెడ్‌కోచ్‌గా రావడంతో త్వరగానే జాతీయ జట్టులోకి వచ్చేశాడు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఈ రైటార్మ్ పేసర్ ఈ ఏడాది టీ20, వన్డేల్లోనూ అరంగేట్రం చేశాడు.ఒకే ఓవర్లో 26 పరుగులుఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి ముందు స్వదేశంలో టీమిండియా ఇంగ్లండ్‌తో ఆడిన సిరీస్ సందర్భంగా వన్డేలోకి వచ్చిన హర్షిత్‌కు తొలి ప్రయత్నంలోనే చేదు అనుభవం ఎదురైంది. అతడి బౌలింగ్‌లో ఇంగ్లిష్ జట్టు ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఒకే ఓవర్లో 26 పరుగులు పిండుకున్నాడు.అయితే, సాల్ట్‌ను శ్రేయస్ అయ్యర్, వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ కలిసి సాల్ట్ (43)ను రనౌట్ చేయడంతో హర్షిత్‌కు కాస్త ఊరట దక్కింది. ఆ తర్వాత 23 ఏళ్ల ఈ బౌలర్.. మూడు వికెట్లతో సత్తా చాటాడు. పరుగులు కాస్త ఎక్కువగానే ఇచ్చుకున్నా.. బెన్ డకెట్ (32), హ్యారీ బ్రూక్ (0), లియామ్ లివింగ్‌స్టోన్ (5) వంటి ప్రమాదకర బ్యాటర్లును అవుట్ చేశాడు. తద్వారా టీమిండియా గెలుపులో తన వంతు పాత్ర పోషించాడు.శ్రేయస్ భయ్యా సాల్ట్‌ను రనౌట్ చేయగానేఇక హర్షిత్ రాణా ప్రస్తుతం ఆసియా కప్-2025 ఆడేందుకు టీమిండియాతో కలిసి యూఏఈలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇటీవల ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో అతడు పంచుకున్న విషయాలు వైరల్ అవుతున్నాయి. వన్డే అరంగేట్రం గురించి గుర్తుచేసుకుంటూ.. ‘‘ఒక్క ఓవర్లోనే సాల్ట్ నా నుంచి 26 పరుగులు రాబట్టుకున్నాడు.అయితే, ఆ తర్వాత పరిస్థితి మారింది. తొలి మూడు ఓవర్లలో నేను 37 పరుగుల వరకే ఇచ్చాను. అయితే, శ్రేయస్ భయ్యా సాల్ట్‌ను అద్బుత రీతిలో రనౌట్ చేయగానే అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. నేనేమో సైలెంట్‌గా అక్కడ నిల్చున్నా.రోహిత్ భయ్యా వచ్చి.. ‘వేరే ఎండ్ నుంచి బౌల్ చెయ్’ అని చెప్పాడు. వెంటనే నా బౌలింగ్‌లో డకెట్ ఇచ్చిన క్యాచ్‌ను జైస్వాల్ పట్టాడు. తర్వాత హ్యారీ బ్రూక్ క్రీజులోకి వచ్చాడు. వచ్చీ రాగానే అతడిని పెవిలియన్‌కు పంపాలని అనుకున్నా.సర్ పే మారూఅందుకోసం తల మీదుగా బౌన్సర్ ఎందుకు సంధించకూడదు అని ఆలోచించా. వెంటనే.. ‘రోహిత్ భయ్యా.. సర్ పే మారూ (head-high bouncer) ’ అని అడిగాను. అందుకు భయ్యా సరేనంటూ అంగీకరించాడు. షార్ట్ పిచ్డ్ డెలివరీ సంధించగా,, బ్రూక్ దానిని షాట్ ఆడబోయి రాహుల్ భయ్యాకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు’’ అని హర్షిత్ రాణా వన్డే అరంగేట్ర జ్ఞాపకాలు పంచుకున్నాడు.కాగా ఇంగ్లండ్‌తో సిరీస్ తర్వాత ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లోనూ హర్షిత్ ఆడే అవకాశం దక్కించుకున్నాడు. చాంపియన్‌గా నిలిచిన టీమిండియాలో తానూ ఒకడిగా ఉండి.. ట్రోఫీని ముద్దాడాడు. ఇక ఇప్పటి వరకు టీమిండియా తరఫున రెండు టెస్టులు, ఐదు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడిన ఈ కుడిచేతి వాటం పేసర్.. ఆయా ఫార్మాట్లలో 4, 10, 3 వికెట్లు కూల్చాడు. చదవండి: ‘యువీ, సెహ్వాగ్ వంటి వారే లేరు.. బుమ్రాను తీర్చిదిద్దండి’ -
ఒకే ఒక్క మ్యాచ్.. ప్రతిష్టాత్మక అవార్డు రేసులో సిరాజ్
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) ప్రతిష్టాత్మక అవార్డు రేసులో నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఇచ్చే ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ పురస్కారానికి అతడు నామినేట్ అయ్యాడు. కాగా ఐసీసీ ఓటింగ్ అకాడమీతో పాటు.. ఆన్లైన్లో అభిమానులు వేసిన ఓట్ల ఆధారంగా ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు విజేతను నిర్ణయిస్తారు.ఇక ఆగష్టు 2025 నెలకు గానూ నామినేట్ అయిన పురుష క్రికెటర్ల పేర్లను ఐసీసీ సోమవారం వెల్లడించింది. ఇందులో ఈసారి ముగ్గురూ బౌలర్లే ఉండటం విశేషం. టీమిండియా నుంచి సిరాజ్, న్యూజిలాండ్ జట్టుకు చెందిన మ్యాట్ హెన్రీ (Matt Henry), వెస్టిండీస్ పేసర్ జేడన్ సీల్స్ (Jayden Seals) ఈ అవార్డుకు నామినేట్ అయ్యారు.ఆగష్టు నెలలో ఒకే ఒక్క మ్యాచ్‌కాగా ఈ ఏడాది ఆగష్టు నెలలో సిరాజ్ ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీలో భాగంగా.. ఇంగ్లండ్‌తో జూలై 31- ఆగష్టు 4 వరకు ఓవల్ మైదానంలో జరిగిన ఐదో టెస్టులో... ఈ హైదరాబాదీ పేసర్ చివరగా టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. ఐదు టెస్టుల సిరీస్‌ను సమం చేయాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు.ఆఖరి రోజు.. చివరి సెషన్ వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో సిరాజ్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఇంగ్లండ్ చేతిలో ఆరు వికెట్లు ఉండి విజయానికి కేవలం 73 పరుగుల దూరంలో ఉన్న వేళ ఈ రైటార్మ్ పేసర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలీ (14), ఓలీ పోప్ (27), జేమీ స్మిత్ (2), జేమీ ఓవర్టన్ (9) రూపంలో కీలక వికెట్లు కూల్చి సిరాజ్ మియా.. ఆఖరి వికెట్‌గా గస్ అట్కిన్సన్ (17)ను వెనక్కి పంపాడు.సిరీస్‌ను 2-2తో సమం చేయడంలో కీలక పాత్రఇలా వికెట్లతో చెలరేగి ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించి.. విజయానికి కేవలం ఆరు పరుగుల దూరంలో నిలిచేలా చేశాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో తొమ్మిది వికెట్లు కూల్చి.. టీమిండియా సిరీస్‌ను 2-2తో సమం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలోనే ఆగష్టు నెలకుగానూ ఈ అవార్డుకు నామినేట్ అయ్యాడు.అదరగొట్టిన హెన్రీ, జేడన్ సీల్స్మరోవైపు.. జింబాబ్వేతో టెస్టు సిరీస్‌లో కివీస్ పేసర్ మ్యాట్ హెన్రీ గొప్పగా రాణించాడు. రెండు మ్యాచ్‌లలో కలిపి 16 వికెట్లు కూల్చి.. న్యూజిలాండ్ సిరీస్‌ను 2-0తో వైట్‌వాష్ చేయడంలో ముఖ్య భూమిక పోషించాడు.ఇక పాకిస్తాన్‌పై 34 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వెస్టిండీస్ వన్డే సిరీస్ గెలవడంలో జేడన్ సీల్స్ పాత్ర కీలకం. ఆఖరి వన్డేలో ఏకంగా ఆరు వికెట్లు కూల్చి.. పాక్‌పై విండీస్ 202 పరుగుల భారీ తేడాతో గెలవడంలో కీలకంగా వ్యవహరించాడు. మొత్తంగా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో కేవలం 4.10 ఎకానమీ రేటుతో సీల్స్ పది వికెట్లు కూల్చడం గమనార్హం.చదవండి: ఆసియా కప్-2025: పూర్తి షెడ్యూల్, అన్ని జట్లు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు -
ఇంగ్లండ్ స్టార్ కీలక నిర్ణయం.. ఇకపై..
లండన్: ఇంగ్లండ్ పేసర్ జేమీ ఓవర్టన్ (Jamie Overton) సంప్రదాయ క్రికెట్‌కు విరామం ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లకు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోతున్నానని... అందుకే టెస్టులకు నిరవధిక విరామం ప్రకటిస్తున్నట్లు చెప్పాడు. అయితే ఐదు రోజుల ఆటకు ఇది రిటైర్మెంట్ కాదు. 31 ఏళ్ల ఇంగ్లండ్ క్రికెటర్ ఇటీవల భారత్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో పాల్గొన్నాడు. 2–2తో సమమైన ఆ సిరీస్‌లో అతను రెండు టెస్టులు ఆడాడు.నాకిది ఇబ్బందికరం‘కెరీర్ జోరుగా సాగిపోతున్న ఈ దశలో ఏడాదిలో 12 నెలలు అన్ని ఫార్మాట్లకు అందుబాటులో ఉండాలంటే కుదరదు. అలా ప్రతీ ఫార్మాట్‌కు న్యాయం చేయలేను. శారీరకంగా, మానసికంగానూ నాకిది ఇబ్బందికరం. అందుకే బాగా ఆలోచించాకే టెస్టులకు విరామం ప్రకటిస్తున్నాను. అప్పుడు నేను పూర్తిగా పరిమిత ఓవర్ల క్రికెట్‌పై ఎక్కువ దృష్టిపెట్టొచ్చు. సుదీర్ఘకాలం పాటు వన్డేలు, టీ20లు ఆడేందుకు ఈ నిర్ణయం ఎంతగానో దోహదం చేస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నా’ అని ఓవర్టన్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యంకాగా 2022లో పరిమిత ఓవర్ల క్రికెట్లోప ప్రయాణం మొదలుపెట్టిన ఓవర్టన్.. ఇప్పటివరకు ఓవర్టన్ కేవలం 6 వన్డేలు, 12 టీ20లే ఆడాడు. ఐపీఎల్లో అతడు చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇక లండన్‌లో ఇటీవల జరిగిన ‘ది హండ్రెడ్’ టోర్నీలో లండన్ స్పిరిట్‌కు ఆడాడు. ఓవర్టన్ అంతర్జాతీయంగా వివిధ దేశాల్లో జరిగే టీ20 లీగ్‌లకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేలా ప్రణాళిక చేసుకుంటున్నాడు. చదవండి: ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన రషీద్ ఖాన్.. సరికొత్త చరిత్ర


