
సాక్షి,హైదరాబాద్: చివరి వరకు ఉత్కంఠగా సాగిన అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భారత్ ఘన విజయం సాధించింది. ఓవల్ వేదికగా జరిగిన ఐదో టెస్టులో ఆరుపరుగుల తేడాతో ప్రత్యర్ధి జట్టు ఇంగ్లండ్‌ను భారత్ మట్టి కరిపించింది.ఈ మ్యాచ్ విజయంతో సిరీస్2-2 సమమైంది.
మమ్మద్ సిరాజ్ ఈ సిరీస్‌లో మొత్తం 23 వికెట్లు తీసి మెరుపులు మెరిపించాడు.చివరి మ్యాచ్‌లో అతడు తీసిన ఫైవ్ వికెట్ హల్‌తో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.
అయితే నరాలు తెగే ఉత్కంఠ పోరులో అద్భుతమైన ప్రదర్శనతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన మహ్మద్ సిరాజ్‌పై హైదరాబాద్ ఎంపీ అహ్మద్ ఓవైసీ ప్రశంసలు కురిపించారు. ఎక్స్ వేదికగా సిరాజ్‌ను హైదరాబాద్ స్టైల్లో పొగడ్తలతో ముంచెత్తాడు. సిరాజ్ ‘ఎప్పుడూ విజేతే @mdsirajofficial! మన హైదరాబాదీలో మాట్లాడతే.. పూరా ఖోల్ దియే పాషా!’అంటూ అభినందించాడు.
Always a winner @mdsirajofficial! As we say in Hyderabadi, poora khol diye Pasha! pic.twitter.com/BJFqkBzIl7
— Asaduddin Owaisi (@asadowaisi) August 4, 2025