
ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత జట్టు తమ ఆశలను సజీవంగా ఉంచుకుంది. మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్ జరిగిన నాలుగో టెస్టును టీమిండియా డ్రా ముగించింది. ఓటమి తప్పదనుకున్న మ్యాచ్‌లో భారత బ్యాటర్లు అద్బుతం చేశారు.
రవీంద్ర జడేజా (107 నాటౌట్), వాషింగ్టన్ సుందర్ (101 నాటౌట్), కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (103), కేఎల్ రాహుల్(90) తమ విరోచిత పోరాటాలతో భారత్‌ను ఓటమి నుంచి గటెక్కించారు. 174/2 ఓవర్‌నైట్ స్కోరుతో చివరి రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా.. 4 వికెట్ల నష్టానికి 425 పరుగులు చేసింది. తొలుత రాహుల్, గిల్ అడ్డుగోడగా నిలవగా.. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్, జడేజా ఇంగ్లండ్ బౌలర్ల సహనాన్ని పరీక్షించారు.

వీరిద్దరిని ఔట్ చేయడం ఇంగ్లీష్ బౌలర్ల తరం కాలేదు. ఆఖరికి ఇంగ్లండ్ ప్లేయర్లు దిగొచ్చి డ్రాకు అంగీకరించాలని భారత ప్లేయర్లను కోరారు. కానీ జడేజా, సుందర్‌లు తమ సెంచరీలు పూర్తియ్యాక డ్రా అంగీకరించారు. ఇక ఈ మ్యాచ్‌ను డ్రా ముగించిన భారత జట్టు ఓ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకుంది.
👉ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక సార్లు 350కు పైగా పరుగులు చేసిన జట్టుగా టీమిండియా వరల్డ్ రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో భారత్ 7 సార్లు 350+ స్కోర్లు సాధించింది. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది.
ఆస్ట్రేలియా మూడు టెస్టు సిరీస్‌లలో 6 సార్లు 350కు పైగా పరుగులు చేసింది. ఆసీస్ చివరగా 1980లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో 6 సార్లు 350+ స్కోర్లు చేసింది. తాజా మ్యాచ్‌తో ఆసీస్ ఆల్‌టైమ్ రికార్డును భారత్ బ్రేక్ చేసింది.
👉ఒక టెస్ట్ సిరీస్‌లో నలుగురు భారత బ్యాటర్లు 400 కంటే ఎక్కువ పరుగులు చేయడం ఇదే తొలిసారి. ఈ సిరీస్‌లో శుబ్‌మన్ గిల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా 400కు పైగా పరుగులు చేశారు.
చదవండి: చాలా సంతోషంగా ఉంది.. అందుకే వారు షేక్ హ్యాండ్స్ ఇవ్వలేదు: గిల్