బీసీసీఐ వార్షిక అవార్డుల ప్రదాన కార్యక్రమం
వరల్డ్ కప్ విజేతలకు సత్కారం
వ్యక్తిగత అవార్డులు అందుకున్న క్రికెటర్లు
న్యూఢిల్లీ: సీనియర్, జూనియర్, పురుషులు, మహిళలు, మాజీలు... భారత క్రికెటర్లంతా ఒక్క చోట చేరే బీసీసీఐ వార్షిక అవార్డుల కార్యక్రమం ‘నమన్ –2026’ ఘనంగా జరిగింది. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఐదు ఐసీసీ టైటిల్స్ గెలిచిన వేర్వేరు జట్లను బోర్డు సత్కరించగా... గత ఏడాది వ్యక్తిగత ప్రదర్శనలకుగాను క్రికెటర్లు అవార్డులు అందుకున్నారు. భారత క్రికెట్‌కు సేవలు అందించిన మాజీ ఆటగాళ్లు రోజర్ బిన్నీ, రాహల్ ద్రవిడ్, మిథాలీ రాజ్‌లకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ పురస్కారం (కల్నల్ సీకే నాయుడు ట్రోఫీ) లభించింది.
పురుషుల విభాగంలో భారత అత్యుత్తమ క్రికెటర్ అవార్డు టెస్టు, వన్డే కెపె్టన్ శుబ్‌మన్ గిల్‌కు దక్కింది. ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో 754 పరుగులు చేసి అటు బ్యాటర్‌గా, ఇటు కెపె్టన్‌గా గిల్ అత్యుత్తమ ఆటతీరు కనబర్చాడు. తనకు ఈ అవార్డు లభించడంలో సహచర ఆటగాళ్ల పాత్ర ఎంతో ఉందన్న గిల్ వారికి కృతజ్ఞతలు తెలిపాడు. మహిళల విభాగంలో స్మృతి మంధానకు ఉత్తమ క్రికెటర్ అవార్డు దక్కింది. స్మృతి దీనిని గెలుచుకోవడం ఐదోసారి కావడం విశేషం.
2025 వన్డే వరల్డ్ కప్ టోర్నీ టైటిల్‌ను భారత జట్టు సాధించడంలో స్మృతి (434 పరుగులు) కీలక పాత్ర పోషించింది. 2025లో ఆమె 1703 అంతర్జాతీయ పరుగులు చేసింది. 2026 టి20 వరల్డ్ కప్, 2025 చాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్న సీనియర్ పురుషుల జట్టు, 2025లో వన్డే వరల్డ్ కప్ సాధించిన సీనియర్ మహిళల జట్టుతో పాటు అండర్–19 వరల్డ్ కప్ గెలిచిన పురుషుల, మహిళల టీమ్‌లను బీసీసీఐ ప్రత్యేకంగా సత్కరించింది.
ఇతర ప్రధాన అవార్డుల వివరాలు
అరంగేట్రంలో ఉత్తమ ప్రదర్శన: హర్షిత్ రాణా (పురుషులు–ఢిల్లీ), శ్రీచరణి (మహిళలు–ఆంధ్రప్రదేశ్)
దేశవాళీ సీనియర్ మహిళల్లో ఉత్తమ క్రికెటర్: షఫాలీ వర్మ (హరియాణా)
దేశవాళీ జూనియర్ మహిళల్లో ఉత్తమ క్రికెటర్: ఇరా జాదవ్ (ముంబై)
రంజీ ట్రోఫీలో ఉత్తమ ఆల్‌రౌండర్ (పురుషులు): హర్‌్ష దూబే (విదర్భ)
దేశవాళీ వన్డే, టి20ల్లో ఉత్తమ ఆల్‌రౌండర్ (పురుషులు): ఆయుశ్ మాత్రే (ముంబై)


