breaking news
NAMAN Awards
-
గేల్ రికార్డు బద్దలు కొట్టడమే లక్ష్యం: వైభవ్ సూర్యవంశీ
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వార్షిక అవార్డుల కార్యక్రమం ‘నమన్ –2026’ ఆదివారం ఘనంగా జరిగింది. ఢిల్లీ వేదికగా జరిగిన ఈ వేడుకలో భారత సీనియర్, జూనియర్, పురుషులు, మహిళలు, మాజీలు అంతా ఒక్క చోట చేరడంతో సందడి నెలకొంది.ఫైనల్లో 175 పరుగులుఈ అవార్డుల కార్యక్రమంలో చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) హైలైట్ అయ్యాడు. పద్నాలుగేళ్ల వయసులోనే క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ బిహారీ పిల్లాడు.. అండర్-19 వరల్డ్‌కప్-2026 ఫైనల్లో ఇంగ్లండ్‌పై 175 పరుగులు సాధించాడు. తద్వారా భారత్ విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.ఇక నమన్ అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా ఆయుశ్ మాత్రే సారథ్యంలోని అండర్-19 వరల్డ్‌కప్ విజేత జట్టు పురస్కారాలు అందుకుంది. ఈ సందర్భంగా వైభవ్ సూర్యవంశీ మాట్లాడుతూ.. ‘‘ఈ అనుభూతి గొప్పగా ఉంది. వరల్డ్‌కప్‌లో గెలిచి దేశానికి ట్రోఫీ అందించడం ఆనందకరం’’ అని పేర్కొన్నాడు.ఈ మూడింటిలో ఏది ఇష్టం? ఈ క్రమంలో కామెంటేటర్ హర్షా భోగ్లే.. టీమిండియా టీ20 వరల్డ్‌కప్ విన్నింగ్ స్టార్లు సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, అభిషేక్ శర్మలతో కలిసి వైభవ్ సూర్యవంశీని ప్రశ్నలు అడిగాడు. ‘ఐపీఎల్లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదడం, ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేయడం.. లేదంటే అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించడం.. ఈ మూడింటిలో నువ్వు ఏ రికార్డు సాధించాలని అనుకుంటున్నావు’’ అని వైభవ్‌ను అడిగాడు.గేల్ రికార్డు బద్దలు కొట్టడమే లక్ష్యంఇందుకు బదులిస్తూ.. ఐపీఎల్లో అత్యధిక స్కోరు సాధించిన ఆటగాడిగా నిలవడమే తన లక్ష్యమని వైభవ్ సూర్యవంశీ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2013లో వెస్టిండీస్ వీరుడు, యూనివర్సల్ బాస్ క్రిస్‌గేల్ 175 పరుగుల వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. ఇప్పటికీ ఈ రికార్డు ఈ లెఫ్టాండర్ పేరిటే ఉండగా.. మరో లెఫ్టాండర్ వైభవ్ సూర్యవంశీ ఈ రికార్డును బద్దలు కొట్టాడమే తన లక్ష్యమని చెప్పడం విశేషం.కాగా గతేడాది ఐపీఎల్లో అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ.. రాజస్తాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగి అత్యంత పిన్న వయసు (14) లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో 35 బంతుల్లోనే శతకం బాదాడు. ఇదిలా ఉంటే.. ఇటీవలే 15వ వసంతంలో అడుగుపెట్టిన వైభవ్.. ఐపీఎల్-2026కు సన్నద్ధమవుతున్నాడు.చదవండి: అతడి ఆట అసాధారణం.. గంభీర్‌పై ద్రవిడ్ ప్రశంసలుVaibhav Suryavanshi wants to break Chris Gayle’s 175 record in the IPL. pic.twitter.com/X4UhulmHBT— Mufaddal Vohra (@mufaddal_vohra) March 15, 2026 -
అతడి ఆట అసాధారణం.. గంభీర్‌పై ద్రవిడ్ ప్రశంసలు
వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకున్న భారత జట్టును మాజీ కెప్టెన్, మాజీ హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రత్యేకంగా అభినందించాడు. గత మూడు దశాబ్దాల్లో మన క్రికెట్ జట్టు ఎంతో పురోగతి సాధించి అత్యుత్తమ స్థాయికి చేరిందని అతను అభిప్రాయపడ్డాడు. మన దేశంలో ప్రతిభకు ఏనాడూ కొదవ లేదని, ఇప్పుడు అలాంటి ప్రతిభ ఫలితాలను అందించడం సంతోషంగా ఉందని ద్రవిడ్ అన్నాడు. భారత్ ఇటీవల వరుసగా సీనియర్, అండర్–19 విభాగాల్లో కలిసి ఐదు ఐసీసీ టోర్నీల్లో గెలుచుకున్న విషయాన్ని ‘ది వాల్’ గుర్తు చేశాడు. సూర్యకుమార్, గంభీర్ బృందంపై ప్రశంసలు‘మన దేశంలో ప్రతిభావంతులైన క్రికెటర్లను ఎప్పుడూ కొరత లేదు. మైదానం బయట వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలనూ బోర్డు అందించింది. అత్యుత్తమ మౌలిక సౌకర్యాలతో పాటు మంచి కోచ్‌లు, సరైన పరిపాలకులు ఉన్నారు. జూనియర్ స్థాయిలో, దేశవాళీ క్రికెట్లో మెరుగైన వ్యవస్థ ఉంది. కానీ కొన్నిసార్లు మైదానంలో ఆశించిన ఫలితాలు రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం అంతా అద్భుతంగా సాగుతోంది. ప్రతిభకు తగిన విధంగా ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. ఇటీవల టీ20 వరల్డ్ కప్‌ను చూస్తే మన జట్టు ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. ఈ ఒత్తిడి, సవాళ్లను అధిగమించి విజేతగా నిలవడం అంత సులువు కాదు. కానీ సూర్యకుమార్, గంభీర్ బృందం దానిని చేసి చూపించింది’ అని ద్రవిడ్ విశ్లేషించాడు. అతడి ఆట అసాధారణంసామ్సన్ గురించి బాగా తెలిసిన వ్యక్తిగా ద్రవిడ్ అతడిపై ప్రశంసలు కురిపించాడు. ‘సామ్సన్ వరల్డ్ కప్ చివరి మూడు మ్యాచ్‌లలో ఆడిన తీరు అసాధారణం. సుదీర్ఘ కాలంగా అతను టీమ్‌లో ఉన్నాడు. కొన్నిసార్లు బాగా ఆడినా మరికొన్ని సార్లు కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నాడు. అలాంటి ఆటగాడు భారత్‌కు ఎంతో అవసరమైన కీలక సమయంలో సత్తా చాటి విజయంలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది’ అని ద్రవిడ్ అన్నాడు. బీసీసీఐ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు లభించడం పట్ల ద్రవిడ్ సంతోషం వ్యక్తం చేశాడు. ఎంతో మంది గొప్ప ఆటగాళ్లతో కలిసి ఆడే అవకాశం రావడం, దేశానికి ప్రాతినిధ్యం వహించడం తనకు లభించిన గొప్ప గౌరవమని అతను స్పందించాడు. చదవండి: ‘ఇది ఆరంభం మాత్రమే’ -
'అతడికి 6 ఓవర్లు చాలు.. మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తాడు'
ఢిల్లీలో బీసీసీఐ వార్షిక అవార్డుల వేడుక( ‘నమన్ అవార్డ్స్-2026’) ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గతేడాది నుంచి ఇప్పటివరకు ఐసీసీ టైటిల్స్ గెలిచిన భారత సీనియర్, జూనియర్ జట్లను బీసీసీఐ సత్కరించింది. ఇందులో వన్డే వరల్డ్‌కప్-2026 గెలిచిన మహిళల జట్టు, 2026 టీ20 వరల్డ్ కప్, 2025 చాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్న సీనియర్ పురుషుల జట్టు, అండర్-19 ప్రపంచకప్-2026, ఉమెన్స్ అండర్-19 వరల్డ్‌కప్ గెలిచిన జట్లు ఉన్నాయి.అదేవిధంగా భారత క్రికెట్ దిగ్గజాలు రాహుల్ ద్రవిడ్, రోజర్ బిన్నీ, మిథాలీ రాజ్‌కు అత్యున్నత పురస్కారం ‘కల్నల్ సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ప్రాధానం చేశారు. ఈ కార్యక్రమంలో భారత పురుషల జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో పాటు వరల్డ్‌కప్ హీరోలు సందడి చేశారు. ఈ సందర్భంగా టీ20 వరల్డ్‌కప్‌లో ప్లేయర్ ఆఫ్‌ది టోర్నీగా నిలిచిన సంజూ శాంసన్‌పై గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు.సంజు సామ్సన్ ఒక్కసారి చెలరేగడం మొదలు పెడితే ఆరు ఓవర్లలోనే మ్యాచ్‌ను గెలిపించగలడని భారత హెడ్ కోచ్ గౌతం గంభీర్ అన్నాడు. ప్రత్యర్థి ఆఫ్ స్పిన్నర్లను నిలువరించే వ్యూహంలో భాగంగా కాకుండా... విధ్వంసకర రీతిలో ఆడే మరో బ్యాటర్ కావాలనే శాంసన్‌కు మళ్లీ అవకాశం ఇచ్చినట్లు అతను వెల్లడించాడు. "సంజు మెరుపు బ్యాటింగ్ శైలిపై మాకు ఎలాంటి సందేహాలు లేవు. అతను ఏం చేయగలడో మాకు బాగా తెలుసు.ఒక్కసారి జోరు మొదలైతే ఆరు ఓవర్లలో మ్యాచ్ గెలిపించగలడు. జిమ్‌లో కలిసి వర్కౌట్ చేస్తున్నప్పుడే జింబాబ్వేతో మ్యాచ్‌లో నువ్వు ఆడుతున్నావని చెప్పాను. టాప్–3 ఎడంచేతి బ్యాటర్లు ఉన్నారు కాబట్టి మార్పు కోసం శాంసన్‌ను మళ్లీ ఆడించామని కొందరు చేస్తున్న విశ్లేషణలు తప్పు. టాపార్డర్‌లో చెలరేగిపోయే మరో బ్యాటర్ ఉంటే బాగుంటుందని భావించే శాంసన్‌ను తీసుకొచ్చాం" అని గంభీర్ స్పష్టం చేశాడు.చదవండి: బంగ్లాదేశ్‌దే వన్డే సిరీస్ -
‘ఇది ఆరంభం మాత్రమే’
న్యూఢిల్లీ: భారత జట్టు వచ్చే కొన్నేళ్లలో అన్ని విధాలుగా ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తుందని బ్యాటర్ సంజు సామ్సన్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం మన జట్టు చూపిస్తున్న ప్రదర్శన అన్ని చోట్లా పునరావృతమవుతుందని అతను అన్నాడు. 321 పరుగులతో ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచిన సామ్సన్... భారత జట్టు టి20 వరల్డ్ కప్ గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. ‘మన దేశంలో పెద్ద సంఖ్యలో అత్యుత్తమ స్థాయి ఆటగాళ్లు ఉన్నారు. వీరిని చూస్తే మన విజయపరంపర కొనసాగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. రాబోయే రోజుల్లో మరింత గొప్ప ఆటను మన క్రికెటర్ల నుంచి చూడవచ్చు. ఇటీవల వరల్డ్ కప్ విజయం ఆరంభం మాత్రమే. మున్ముందు మరిన్ని విజయాలు దక్కడం ఖాయం’ అని ఆదివారం జరిగిన బీసీసీఐ వార్షిక పురస్కారాల సందర్భంగా సామ్సన్ వ్యాఖ్యానించాడు. భారత్ తరఫున ప్రపంచకప్ సాధించాలనే తన కల నెరవేరిందని అతను ఉద్వేగంగా చెప్పాడు. ‘ఎవరికైనా పెద్ద కలలు ఉంటాయి. అయితే అవి అంత సులువుగా నిజం కావు. రెండేళ్ల క్రితమే దేశానికి ప్రపంచ కప్‌ను అందించాలని అనుకున్నా.నేను బలంగా కోరుకున్న సమయంలో ఒక్కసారిగా కెరీర్లో ఇబ్బందులు వచ్చాయి. మానసికంగా సమస్యల్లో ఉన్నా. కానీ జట్టుకు నేను అవసరమై పిలుపు వచ్చినట్లుగా మళ్లీ అవకాశం దక్కింది. టీమ్‌లో ప్రతీ ఒక్కరి నేను బాగా ఆడాలని, జట్టుకు ఉపయోగపడాలని కోరుకున్నారు. దాంతో నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలిగా. ఇదంతా ఒక సినిమా స్క్రిప్ట్ తరహాలో సాగి నిజంగా మారింది’ అని సామ్సన్ వివరించాడు. -
ఉల్లాసంగా... ఉత్సాహంగా...
న్యూఢిల్లీ: సీనియర్, జూనియర్, పురుషులు, మహిళలు, మాజీలు... భారత క్రికెటర్లంతా ఒక్క చోట చేరే బీసీసీఐ వార్షిక అవార్డుల కార్యక్రమం ‘నమన్ –2026’ ఘనంగా జరిగింది. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఐదు ఐసీసీ టైటిల్స్ గెలిచిన వేర్వేరు జట్లను బోర్డు సత్కరించగా... గత ఏడాది వ్యక్తిగత ప్రదర్శనలకుగాను క్రికెటర్లు అవార్డులు అందుకున్నారు. భారత క్రికెట్‌కు సేవలు అందించిన మాజీ ఆటగాళ్లు రోజర్ బిన్నీ, రాహల్ ద్రవిడ్, మిథాలీ రాజ్‌లకు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ పురస్కారం (కల్నల్ సీకే నాయుడు ట్రోఫీ) లభించింది. పురుషుల విభాగంలో భారత అత్యుత్తమ క్రికెటర్ అవార్డు టెస్టు, వన్డే కెపె్టన్ శుబ్‌మన్ గిల్‌కు దక్కింది. ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో 754 పరుగులు చేసి అటు బ్యాటర్‌గా, ఇటు కెపె్టన్‌గా గిల్ అత్యుత్తమ ఆటతీరు కనబర్చాడు. తనకు ఈ అవార్డు లభించడంలో సహచర ఆటగాళ్ల పాత్ర ఎంతో ఉందన్న గిల్ వారికి కృతజ్ఞతలు తెలిపాడు. మహిళల విభాగంలో స్మృతి మంధానకు ఉత్తమ క్రికెటర్ అవార్డు దక్కింది. స్మృతి దీనిని గెలుచుకోవడం ఐదోసారి కావడం విశేషం. 2025 వన్డే వరల్డ్ కప్ టోర్నీ టైటిల్‌ను భారత జట్టు సాధించడంలో స్మృతి (434 పరుగులు) కీలక పాత్ర పోషించింది. 2025లో ఆమె 1703 అంతర్జాతీయ పరుగులు చేసింది. 2026 టి20 వరల్డ్ కప్, 2025 చాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్న సీనియర్ పురుషుల జట్టు, 2025లో వన్డే వరల్డ్ కప్ సాధించిన సీనియర్ మహిళల జట్టుతో పాటు అండర్–19 వరల్డ్ కప్ గెలిచిన పురుషుల, మహిళల టీమ్‌లను బీసీసీఐ ప్రత్యేకంగా సత్కరించింది.ఇతర ప్రధాన అవార్డుల వివరాలుఅరంగేట్రంలో ఉత్తమ ప్రదర్శన: హర్షిత్ రాణా (పురుషులు–ఢిల్లీ), శ్రీచరణి (మహిళలు–ఆంధ్రప్రదేశ్) దేశవాళీ సీనియర్ మహిళల్లో ఉత్తమ క్రికెటర్: షఫాలీ వర్మ (హరియాణా) దేశవాళీ జూనియర్ మహిళల్లో ఉత్తమ క్రికెటర్: ఇరా జాదవ్ (ముంబై) రంజీ ట్రోఫీలో ఉత్తమ ఆల్‌రౌండర్ (పురుషులు): హర్‌్ష దూబే (విదర్భ) దేశవాళీ వన్డే, టి20ల్లో ఉత్తమ ఆల్‌రౌండర్ (పురుషులు): ఆయుశ్ మాత్రే (ముంబై) -
గురుశిష్యులకు అరుదైన గౌరవం!
టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ అరుదైన గౌరవం అందుకోనున్నాడు. క్రికెట్లో అత్యంత ప్రతిష్ఠాత్మక అవార్డుగా పేరున్న సీకే నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డును రాహుల్ ద్రవిడ్ సొంతం చేసుకోనున్నాడు. మార్చి 15న ఢిల్లీ వేదికగా బీసీసీఐ వార్షిక అవార్డుల వేడుక జరగనుంది.ఈ వేడుకలోనే రాహుల్ అత్యున్నత పురస్కారాన్ని స్వీకరించనున్నాడు. కాగా ఇదే వేడుకలో భారత టెస్టు, వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ‘క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు అందుకోనున్నాడు. ఇక దేశవాలీ క్రికెట్లో వన్డే ఫార్మాట్లో ఆల్‌రౌండర్‌గా గతేడాది అద్భుత ప్రదర్శన కనబరిచిన ఆయుశ్ మాత్రే ‘లాలా అమర్నాథ్’ అవార్డు అందుకోనున్నాడు. ఇక భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్ మిథాలీరాజ్ కూడా లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకోనుంది.భారత క్రికెట్లో రాహుల్ ద్రవిడ్ స్థానం ప్రత్యేకమైనది. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్‌తో సంయుక్తంగా స్థానం సంపాదించిన ద్రవిడ్ ‘ది వాల్’గా గుర్తింపు పొందాడు. టెస్టు క్రికెట్లో అత్యుత్తమ బ్యాటర్‌గా పేరు పొందిన ద్రవిడ్ ఆల్‌టైమ్ గ్రేట్ బ్యాటర్‌గా నిలిచాడు. భారత క్రికెట్లో ఎన్నో మరుపురాని ఇన్నింగ్స్‌లు ఆడిన ద్రవిడ్.. 2001లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో లక్ష్మణ్‌తో కలిసి 376 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పడంతో పాటు ఆ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు.క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత కోచ్ అవతారమెత్తిన ద్రవిడ్.. 2018 అండర్-19 ప్రపంచకప్ టీమిండియా గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. కప్ గెలిచిన జట్టులో శుబ్‌మన్ గిల్, పృథ్వీ షాలు సభ్యులుగా ఉన్నారు. ఒకప్పుడు గురువు శిక్షణలో అండర్-19 ప్రపంచకప్ సాధించిన గిల్ ఇప్పుడు గురువుతో కలిసి ఒకే వేదికపై అవార్డు అందుకోబోతుండడం విశేషం.ఇక 2021లో టీమిండియా ప్రధాన కోచ్‌గా ఎంపికైన రాహుల్ ద్రవిడ్ కోచింగ్‌లోనూ తనదైన మార్క్ చూపించాడు. ద్రవిడ్ హయాంలోనే టీమిండియా 2023 వన్డే వరల్డ్‌కప్‌లో రన్నరప్‌గా నిలిచింది. 2024లో అమెరికా, వెస్టిండీస్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భారత్ విజేతగా నిలిచి 17 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది.ఇక శుబ్‌మన్ గిల్ చివరిగా న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ ఆడాడు. కెప్టెన్ అయిన తర్వాత ఒత్తిడిలో పడిపోయిన గిల్ సరైన ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఫామ్ లేమితో సతమతమవుతున్న నేపథ్యంలో టీ20 జట్టులో చోటు కోల్పోవాల్సి వచ్చింది.చదవండి: సచిన్ రిటైర్మెంట్ వెనుక అసలు కథ


