'అతడికి 6 ఓవర్లు చాలు.. మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేస్తాడు' | Gautam Gambhir Reveals T20 World Cup Tactic Behind Sanju Samsons Return, Read Story For More Details | Sakshi
Sakshi News home page

Gautam Gambhir: అతడికి 6 ఓవర్లు చాలు.. మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేస్తాడు

Mar 16 2026 8:20 AM | Updated on Mar 16 2026 9:10 AM

Gautam Gambhir reveals T20 World Cup tactic behind Sanju Samsons return

ఢిల్లీలో బీసీసీఐ వార్షిక అవార్డుల వేడుక( ‘నమన్ అవార్డ్స్-2026’) ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గతేడాది నుంచి ఇప్పటివరకు ఐసీసీ టైటిల్స్ గెలిచిన భారత సీనియర్, జూనియర్ జట్లను బీసీసీఐ సత్కరించింది. ఇందులో వన్డే వరల్డ్‌కప్-2026 గెలిచిన మహిళల జట్టు, 2026 టీ20 వరల్డ్‌ కప్, 2025 చాంపియన్స్‌ ట్రోఫీ గెలుచుకున్న సీనియర్‌ పురుషుల జట్టు, అండర్‌-19 ప్రపంచకప్‌-2026, ఉమెన్స్ అండర్‌-19 వరల్డ్‌కప్ గెలిచిన జట్లు ఉన్నాయి.

అదేవిధంగా భారత క్రికెట్ దిగ్గజాలు రాహుల్ ద్రవిడ్‌, రోజర్ బిన్నీ, మిథాలీ రాజ్‌కు అత్యున్నత పురస్కారం ‘కల్నల్‌‌‌‌ సీకే నాయుడు లైఫ్‌‌‌‌ టైమ్‌‌‌‌ అచీవ్‌‌‌‌మెంట్‌‌‌‌ అవార్డును ప్రాధానం చేశారు. ఈ కార్యక్రమంలో భారత పురుషల జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గం‍భీర్‌తో పాటు వరల్డ్‌కప్ హీరోలు సందడి చేశారు. ఈ సందర్భంగా టీ20 వరల్డ్‌కప్‌లో ప్లేయర్ ఆఫ్‌ది టోర్నీగా నిలిచిన సంజూ శాంసన్‌పై గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు.

సంజు సామ్సన్‌ ఒక్కసారి చెలరేగడం మొదలు పెడితే ఆరు ఓవర్లలోనే మ్యాచ్‌ను గెలిపించగలడని భారత హెడ్‌ కోచ్‌ గౌతం గంభీర్‌ అన్నాడు. ప్రత్యర్థి ఆఫ్‌ స్పిన్నర్లను నిలువరించే వ్యూహంలో భాగంగా కాకుండా... విధ్వంసకర రీతిలో ఆడే మరో బ్యాటర్‌ కావాలనే శాంసన్‌కు మళ్లీ అవకాశం ఇచ్చినట్లు అతను వెల్లడించాడు. "సంజు మెరుపు బ్యాటింగ్‌ శైలిపై మాకు ఎలాంటి సందేహాలు లేవు. అతను ఏం చేయగలడో మాకు బాగా తెలుసు.

ఒక్కసారి జోరు మొదలైతే ఆరు ఓవర్లలో మ్యాచ్‌ గెలిపించగలడు. జిమ్‌లో కలిసి వర్కౌట్‌ చేస్తున్నప్పుడే జింబాబ్వేతో మ్యాచ్‌లో నువ్వు ఆడుతున్నావని చెప్పాను. టాప్‌–3 ఎడంచేతి బ్యాటర్లు ఉన్నారు కాబట్టి మార్పు కోసం శాంసన్‌ను మళ్లీ ఆడించామని కొందరు చేస్తున్న విశ్లేషణలు తప్పు. టాపార్డర్‌లో చెలరేగిపోయే మరో బ్యాటర్‌ ఉంటే బాగుంటుందని భావించే శాంసన్‌ను తీసుకొచ్చాం" అని గంభీర్‌ స్పష్టం చేశాడు.
చదవండి: బంగ్లాదేశ్‌దే వన్డే సిరీస్‌

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement