breaking news
Sanju Samson
-
'అతడిని పక్కన పెట్టాల్సిన టైమ్ వచ్చేసింది'
జింబాబ్వేతో మూడు టీ20ల సిరీస్‌ను 3-0 తేడాతో టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. ఈ సిరీస్‌లో యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించినప్పటికీ... స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ పేలవ ఫామ్ మాత్రం మేనెజ్మెంట్ను తీవ్ర కలవరపెడుతోంది. ఇంగ్లండ్ టూర్లో ఆశించిన స్థాయిలో రాణించలేపోయిన అభిషేక్.. జింబాబ్వే గడ్డపై అంతకంటే దారుణమైన ప్రదర్శన కనబరిచాడు. మూడు మ్యాచ్‌లలోనూ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యాడు. ఈ ఎస్ఆర్హెచ్ స్టార్ ఓపెనర్ మూడు మ్యాచ్‌ల్లో కలిపి కేవలం 11 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ చీఫ్ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అభిషేక్ శర్మ బదులుగా సంజూ శాంసన్‌కు అవకాశమివ్వాలని శ్రీకాంత్ సూచించాడు.కాగా టీ20 వరల్డ్‌కప్-2026 హీరో శాంసన్‌ను జింబాబ్వే పర్యటన నుంచి సెలక్టర్లు తప్పించారు. యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి అతడి స్ధానంలో అవకాశమిచ్చారు. అంతకుముందు ఇంగ్లండ్ టూర్లోనూ మూడు మ్యాచ్‌లకు సంజూను తుది జట్టు నుంచి పక్కన పెట్టారు. అయితే ఆసియా గేమ్స్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో మాత్రం ఈ కేరళ ఆటగాడు ఉన్నాడు. అయితే వైభవ్ సూర్యవంశీ మెరుగ్గా రాణించడంతో ఆసియా గేమ్స్ నుంచి కూడా శాంసన్‌ను తప్పించే అవకాశముంది."అభిషేక్ శర్మ బలహీనతను ప్రత్యర్ధి జట్లు పసిగట్టేశాయి. వన్డే వరల్డ్‌కప్ నుంచి అతడి ప్రదర్శనలు అంతంతమాత్రమే గానే ఉన్నాయి. అతడి విషయంలో సెలక్టర్లు కఠిన నిర్ణయం తీసుకోక తప్పుదు. అభిషేక్ శర్మ స్ధానంలో సంజూ శాంసన్‌కు అవకాశమివ్వాలి. అతడికి కచ్చితంగా సెలక్టర్ల నుంచి పిలుపు వస్తుందని నమ్ముతున్నాను. అదేవిధంగా జింబాబ్వే పర్యటనలో లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచిన యువ పేసర్ మయాంక్ యాదవ్‌పై శ్రీకాంత్ ప్రశంసల వర్షం కురిపించాడు. మయాంక్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 6.5 ఏకానమీ రేటుతో 5 వికెట్లు పడగొట్టాడు. -
‘అదొక పెద్ద రిస్క్.. అయినా ఆ జట్టును వీడాను’
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రాజస్తాన్ రాయల్స్‌ను వీడటం అతి పెద్ద రిస్క్ అని తెలిసినప్పటికీ.. తన నిర్ణయానికే కట్టుబడి ఉన్నానన్నాడు. తన భార్య, కుటుంబంతో ఈ విషయం గురించి సుదీర్ఘంగా చర్చించానని.. అయితే, జట్టును వీడటమే సరైందని అనిపించిందన్నాడు.ట్రేడింగ్ ద్వారా కాగా ఐపీఎల్-2026 ఆరంభానికి ముందు సంజూ రాజస్తాన్‌ను వీడిన సంగతి తెలిసిందే. కెప్టెన్‌గా రాయల్స్‌ను 2022లో ఫైనల్‌కు చేర్చిన సంజూ.. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో జట్టును వీడేందుకు సిద్ధమయ్యాడని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ సంజూను పొందేందుకు రాజస్తాన్‌కు రవీంద్ర జడేజా, సామ్ కరన్‌ను రాజస్తాన్‌కు ట్రేడ్ చేసింది.సంజూ ధర రూ. 18 కోట్లకు సమానంగా చెల్లించి అతడిని సీఎస్కే ట్రేడ్ చేసుకుంది. అయితే, టీ20 ప్రపంచకప్-2026 హీరోగా నిలిచిన సంజూ.. చెన్నై జట్టు తరఫున ఐపీఎల్-2026 ఆరంభంలో మాత్రం తేలిపోయాడు. ఆ తర్వాత సెంచరీలతో సత్తా చాటి ఫామ్‌లోకి వచ్చాడు.అతి పెద్ద రిస్క్ అని తెలుసుతాజాగా ఈ విషయాల గురించి సంజూ శాంసన్ జియోస్టార్‌తో మాట్లాడాడు. ‘‘రాజస్తాన్ రాయల్స్‌ను వీడటం అతి పెద్ద రిస్క్ అని తెలుసు. అయితే, ఒక్కసారి మన మనసులోని మాటను ఫ్రాంఛైజీకి చెప్పిన తర్వాత మళ్లీ వెనక్కి తీసుకోవడం కుదరదు. నేను ఆ జట్టును వీడటానికి రెండు కారణాలు ఉన్నాయి.ముందుగా.. అంటే 2025లోనే నేను రాజస్తాన్‌ను వీడాలని నిర్ణయించుకున్నాను. ఈ విషయం గురించి నా భార్య, కుటుంబంతో దాదాపు మూడు వారాల పాటు చర్చించాను. వాళ్లు కూడా రిస్క్ ఎందుకు అన్నారు.నాకు ఆత్మవిశ్వాసం ఎక్కువఅయితే, నేను మాత్రం ఆఖరికి ఇదే సరైన నిర్ణయం అని భావించాను. ఇక రెండో కారణం.. నాకు ఆత్మవిశ్వాసం ఎక్కువ. మళ్లీ సున్నా నుంచి మొదలుపెట్టడానికి కూడా నేను సిద్ధంగానే ఉంటాను. చాలా మంది నా బ్యాటింగ్ స్టైల్.. చెన్నైలోని స్లో చెపాక్ వికెట్‌కు సరిపోదని చెప్పారు. అయినా సరే నేను ఆ జట్టులో చేరేందుకు మొగ్గుచూపాను. ‘ఇప్పుడు నీకు 30 ఏళ్లు.. ఏదైతే అది అయింది’ అని నా మనసుకు సర్దిచెప్పుకొన్నాను. నాకు అక్కడ కొత్త శక్తి లభించినట్లయింది. అయితే, ఆరంభంలో నేను తడబడ్డా. మూడు మ్యాచ్‌లలో విఫలమయ్యాను. జట్టు కూడా ఓడిపోయింది. వరల్డ్‌కప్‌లో సత్తా చాటిన తర్వాత ఇలా జరగడం పూర్తిగా నిరాశపరిచింది. మేనేజ్మెంట్తో పాటు మహీ భాయ్ కూడా!అయితే, ఆ పరిస్థితుల్లో మేనేజ్మెంట్ నాకు మద్దతుగా నిలిచింది. సహచర ఆటగాళ్లు కూడా ముందులానే నన్ను గౌరవించారు. నాపై నమ్మకం ఉంచారు. మహి భాయ్ (మహేంద్ర సింగ్ ధోని) కూడా నాకు అండగా నిలిచాడు. నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాడు’’ అని సంజూ శాంసన్ భావోద్వేగానికి లోనయ్యాడు.చదవండి: నేనింకా పిల్లాడినే.. ఆ అర్హత లేదు: వైభవ్ -
అప్పుడు ఇషాన్ అసలు జట్టులోనే లేడు.. కానీ: సంజూ శాంసన్
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఒక్కసారి ఇషాన్ కిషన్ జట్టులో పాతుకుపోతే.. తనకు తుదిజట్టులో చోటు ఉండదన్న సంగతి ముందే తెలుసన్నాడు. ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లకే యాజమాన్యం పెద్దపీట వేస్తుందని సంజూ పేర్కొన్నాడు.సంజూ పూర్తిగా విఫలంకాగా టీ20 ప్రపంచకప్-2026 కంటే టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ ఆడిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌తోనే జార్ఖండ్ డైనమో ఇషాన్ కిషన్ అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేశాడు. ఇక ఓపెనర్‌గా ఉన్న సంజూ కివీస్‌తో మ్యాచ్‌లలో 10, 6, 0, 24,6 పరుగులు చేసి పూర్తిగా విఫలమయ్యాడు.దుమ్ములేపిన ఇషాన్అదే సమయంలో ఇషాన్ 8, 76, 28, 103 పరుగులతో దుమ్ములేపాడు. ఫలితంగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ ఆరంభ మ్యాచ్‌లలో అభిషేక్ శర్మకు ఓపెనింగ్ జోడీగా ఇషాన్ కిషన్ సంజూ స్థానాన్ని భర్తీ చేశాడు. దీంతో సంజూకు తుదిజట్టులో చోటు దక్కలేదు.అయితే, అనూహ్య రీతిలో నాకౌట్ దశలో తిరిగి ఓపెనర్‌గా వచ్చిన సంజూ 97*, 89, 89 పరుగులు సాధించి.. జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచి సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో తాజాగా నాటి సంగతులను ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ గుర్తుచేసుకున్నాడు.అతడు ముందుగా అసలు జట్టులోనే లేడుజియోస్టార్తో మాట్లాడుతూ.. ‘‘ఇషాన్ కిషన్ వచ్చిన తర్వాత కథ పూర్తిగా మారిపోయింది. నిజానికి అతడు ముందుగా అసలు జట్టులోనే లేడు. అయితే, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్‌ను ఒంటిచేత్తో గెలిచి.. తిరిగి టీమిండియాలో అడుగుపెట్టాడు.అతడి బ్యాటింగ్ కూడా వేరే లెవల్లో ఉంది. అప్పుడే నాకంటే ఇషాన్‌కు ప్రాధాన్యం పెరుగుతుందని అనిపించింది. ఐదు మ్యాచ్‌లలో ఆడే అవకాశం ఇచ్చినపుడు.. నేను 24, 6, 6, 10, 0 పరుగులు స్కోరు చేసి నిరాశపరిచాను. అదే సమయంలో.. మరొక ఆటగాడు ఏకంగా 70, 100 పరుగులు చేస్తూ శతక్కొట్టినప్పుడు.. నన్ను కాదని అతడిని నేరుగా ప్రపంచకప్ టోర్నీలో ఆడిస్తారని తెలుసు.డగౌట్లో కూర్చుని చప్పట్లు కొట్టడమే నా పనిఎవరైనా ఫామ్‌లో ఉన్న ఆటగాడే తుదిజట్టులో ఉండాలని కోరుకుంటారు. వారికే ప్రాధాన్యం ఇస్తారు. వరల్డ్‌కప్ సమయంలో నా విషయంలో ఇదే జరిగింది. జరిగిందేదో జరిగిపోయింది.. నేనేమీ చేయలేను.. డగౌట్లో కూర్చుని చప్పట్లు కొట్టడమే నా పని అర్థమైంది.భారత క్రికెటర్ల పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఒక్కరోజులో అంతా తలకిందులు కావొచ్చు. నాకు ఏడు మ్యాచ్‌లు ఆడే అవకాశం ఇస్తే.. నేను కనీసం మూడు సెంచరీలు అయినా కొడతానని అనిపించింది. కానీ అలా జరుగలేదు. టీ20 ఫార్మాట్ చాలా చిత్రమైనది. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో నేను పూర్తిగా విఫలమయ్యాను.నా హయ్యస్ట్ స్కోరు 24 మాత్రమేఆ తర్వాత పిచ్చివాడిలా ప్రాక్టీస్ చేశాను. వరల్డ్‌కప్ తుదిజట్టులో చోటు దక్కాలంటే తీవ్రంగా కష్టపడాలని నిర్ణయించుకున్నా. అయితే, ఆ ఐదు మ్యాచ్‌లలో నా హయ్యస్ట్ స్కోరు 24 మాత్రమే. దీంతో నేను మరింతగా కుంగిపోయాను.అయితే, అప్పుడు నా భార్య చెప్పిన మాటలు నాకు ఊరటనిచ్చాయి. గంటలు గంటలు ప్రాక్టీస్ చేసే బదులు సంతోషంగా, మానసికంగా దేనికైనా సన్నద్ధంగా ఉంటే.. ఇలాంటి తప్పిదాలు జరగవని చెప్పింది. న్యూజిలాండ్‌తో సిరీస్ నాకు చాలా విషయాలు నేర్పింది’’ అని సంజూ శాంసన్ చేదు జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు.చదవండి: ఐపీఎల్ టు ఇంగ్లండ్.. ఢిల్లీ ఆటగాడికి లక్కీ ఛాన్స్! -
‘అందుకే వైభవ్‌ను తప్పించి.. సంజూను ఆడించాము’
టీమిండియాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐర్లాండ్, ఇంగ్లండ్‌లతో టీ20 సిరీస్‌లలో క్లీన్‌స్వీప్ కావడమే ఇందుకు కారణం. తొలుత ఐర్లాండ్ చేతిలో 2-0తో వైట్‌వాష్ గురైన శ్రేయస్ అయ్యర్ సేన.. ఆ తర్వాత ఇంగ్లండ్ సిరీస్‌నూ విజయమన్నదే లేకుండా ముగించింది. ఇంగ్లిష్ జట్టు చేతిలో 4-0తో క్లీన్‌స్వీప్ అయింది.ఈ నేపథ్యంలో టీమిండియా యాజమాన్యంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ కోసం వరల్డ్‌కప్ హీరో సంజూ శాంసన్‌ను పక్కనపెట్టడాన్ని పలువురు మాజీ క్రికెటర్లు ప్రశ్నిస్తున్నారు. కాగా సంజూ ఐర్లాండ్‌తో రెండు టీ20లు (5, 0).. అదే విధంగా ఇంగ్లండ్‌తో తొలి టీ20 (1)లో విఫలమయ్యాడు.ఈ క్రమంలోనే సంజూను తప్పించి.. అతడి స్థానంలో ఓపెనర్‌గా వైభవ్ సూర్యవంశీ రెండో టీ20తో అరంగేట్రం చేశాడు. అయితే, వరుసగా మూడు మ్యాచ్‌లు ఆడిన వైభవ్.. 13, 14, 15 పరుగులు చేశాడు. అంతేగాక వైభవ్ రాకతో టాపార్డర్‌లో ముగ్గురూ (ఓపెనర్లు అభిషేక్ శర్మ, వైభవ్.. వన్‌డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్) లెఫ్టాండర్లే అయ్యారు.ఈ నేపథ్యంలో నామమాత్రపు ఐదో టీ20లో మాత్రం వైభవ్ సూర్యవంశీని తప్పించి.. సంజూ శాంసన్‌ను తిరిగి తీసుకువచ్చారు. ఈ విషయంపై ఓటమి అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వివరణ ఇచ్చాడు. మీడియాతో మాట్లాడుతూ..‘‘సౌతాంప్టన్ పిచ్ పరిస్థితికి తగ్గట్లు మేము అత్యుత్తమ ఓపెనింగ్ కాంబినేషన్‌తో ముందుకు వెళ్లాలని అనుకున్నాము. అభిషేక్ శర్మతో కలిసి కుడిచేతి వాటం బ్యాటర్‌తో ఓపెనింగ్ చేయించాలని ఫిక్స్ అయ్యాము. అందుకే వైభవ్‌ను తప్పించాము. ఈ మ్యాచ్‌కు ఇలా చేయడమే సరైన నిర్ణయం. సంజూ గన్ బ్యాటర్. గతంలో ఒంటిచేత్తో ఎన్నో సిరీస్‌లు గెలిపించాడు’’ అని శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నాడు. కాగా ఐదో టీ20లో సంజూ 27 పరుగులు చేయగా.. అభిషేక్ 3 రన్స్ చేసి వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ మూడు వికెట్ల నష్టానికి 257 పరుగులు చేయగా.. టీమిండియా 201 పరుగులకే కుప్పకూలింది. -
ఇంగ్లాండ్ తో ఓటమికి వైభవే కారణం
-
‘వైభవ్ కోసం అతడిని బలిపశువును చేశారు’
టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ వైభవ్ సూర్యవంశీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అతడికి వచ్చిన హైప్‌ను దృష్టిలో పెట్టుకొని సీనియర్ జట్టుకు ఎంపిక చేయడాన్ని తప్పుబట్టాడు. వైభవ్ చేత అంత త్వరగా అంతర్జాతీయ అరంగేట్రం చేయించాల్సింది కాదని అభిప్రాయపడ్డాడు. కేవలం మీడియా సృష్టించిన హైప్, ప్రజల్లోని ఎమోషన్స్ చూసి సెలెక్టర్లు తొందరపడ్డారని పేర్కొన్నాడు.ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు అవకాశం లభించని వైభవ్‌కు ఇంగ్లండ్ పర్యటనలో రెండో టీ20లో అవకాశం దక్కింది. మొదటి మ్యాచ్ ఆడిన సంజు శాంసన్‌ను రెండో మ్యాచ్‌లో పక్కన పెట్టి అతడి స్థానంలో వైభవ్‌కు అవకాశం ఇచ్చారు. అయితే వరుసగా మూడు మ్యాచ్‌ల్లో వైభవ్ కేవలం 14, 13, 15 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. దీంతో ఐదో టీ20 మ్యాచ్‌లో అతన్ని పక్కన పెట్టి మళ్లీ శాంసన్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఈ ప్రయోగాలపై స్పందించిన వసీం జాఫర్.. అసలు శాంసన్ ఫామ్‌లో లేడనే బలమైన నమ్మకం ఉంటే తప్ప ఇలాంటి మార్పులు చేయకూడదని హితవు పలికాడు. సంజు శాంసన్ లాంటి మ్యాచ్ విన్నర్‌కు జట్టులో క్రమబద్ధమైన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. వైభవ్ సూర్యవంశీ ఇంకా చాలా చిన్న వయస్కుడని, అతనికి ఇంకా చాలా సమయం ఉందని జాఫర్ గుర్తుచేశాడు. అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడే ముందే కేవలం టీమ్‌తో ప్రయాణిస్తూ, వెలుపల నుండి ఆటను గమనిస్తూ అతను ఎంతో నేర్చుకోవచ్చని సూచించాడు. 2026 టీ20 ప్రపంచకప్‌ను టీమిండియా గెలవడంలో కీలకపాత్ర పోషించిన శాంసన్‌ను కేవలం వైభవ్ కోసం పక్కనబెట్టి అతడిని బలిపశువును చేయడం సరైన చర్య కాదన్నాడు.కేవలం మీడియాలో వస్తున్న వార్తల ప్రభావంతో కంగారుగా జట్టులోకి తెచ్చి ఒత్తిడి పెంచడం పద్ధతి కాదన్నాడు. తదుపరి జింబాబ్వే టూర్ కోసం వైభవ్‌ను ఎంపిక చేసి, కేవలం ఒకే ఫార్మాట్ ఆడే సంజు శాంసన్‌ను పక్కన పెట్టడం తనను ఎంతగానో ఆశ్చర్యపరిచిందని వసీం జాఫర్ తెలిపాడు.చదవండి: సెమీస్ సమరం.. ఎవరి బలమెంత? -
వాళ్లిద్దరినీ తొలగించారు.. గంభీర్‌పైనా వేటు వేయండి!
టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత రాహుల్ ద్రవిడ్ హెడ్‌కోచ్ బాధ్యతల నుంచి వైదొలిగాడు. ఈ క్రమంలో బీసీసీఐ అతడి స్థానాన్ని గౌతం గంభీర్‌తో భర్తీ చేసింది. అయితే, గంభీర్ మార్గదర్శనంలో తొలుత శ్రీలంక పర్యటనలో టీ20 సిరీస్‌ను గెలిచిన భారత్.. రెండున్నర దశాబ్దాల తర్వాత తొలిసారి వన్డే సిరీస్‌ను లంకకు కోల్పోయింది.ఇక ఆ తర్వాత కూడా గంభీర్ మార్గదర్శనంలో మిశ్రమ ఫలితాలే వచ్చాయి. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ చాంపియన్‌గా నిలిచినప్పటికీ.. అందుకు ద్రవిడ్‌కే క్రెడిట్ ఇవ్వాల్సి ఉంటుందని.. నాటి కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు.ఆ రెండూ మినహా...ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2026లోనూ టీమిండియా విజేతగా నిలిచినప్పటికీ.. స్వదేశంలో సిరీస్ జరగడం సానకూలంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ రెండు మెగా టోర్నీలు గెలిచినప్పటికీ.. గంభీర్ మార్గదర్శనంలో టీమిండియా అత్యంత ఘోర పరాభవాలు చవిచూసింది.సొంతగడ్డపై న్యూజిలాండ్, సౌతాఫ్రికా చేతుల్లో టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్ కావడం.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరకపోవడం ఇందులో ప్రధానమైనవి. అంతేకాదు స్వదేశంలో తొలిసారి న్యూజిలాండ్‌కు వన్డే సిరీస్‌ను కూడా భారత్ కోల్పోయింది.వ్యంగ్యాస్త్రాలు తాజాగా టీ20 ప్రపంచకప్-2026 చాంపియన్ హోదాలో ఐర్లాండ్‌లో అడుగుపెట్టి.. పసికూన చేతిలో ఏకంగా 2-0తో వైట్‌వాష్ అయింది. అనంతరం ఇంగ్లండ్‌కు కూడా 0-3తో టీ20 సిరీస్‌ను కోల్పోయింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ గంభీర్, జట్టు యాజమాన్యంపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.‘‘అయినా అతడి (గంభీర్)ని ప్రశ్నించేందుకు ఎవరైనా ఉన్నారా?.. అతడిని తప్పుకోమని చెప్పగల ధైర్యం ఉందా?.. ఈరోజు ఇంతజరిగినా ఎవరూ ఏమీ అనరు. ఎందుకంటే కొన్ని నెలల క్రితమే అతడు ప్రపంచకప్ గెలిచాడని చెబుతారు.వాళ్లిద్దరినీ తొలగించారు.. అతడిపైనా వేటు వేయండి!మరి సూర్యకుమార్ యాదవ్ కూడా కెప్టెన్‌గా కప్పు గెలిచాడు. అయినా సరే అతడిపై నిర్దాక్షిణ్యంగా వేటు వేశారు. జట్టు చాంపియన్‌గా నిలవడంలో సంజూ శాంసన్‌ది కీలక పాత్ర. అయినా కూడా అతడిని తుదిజట్టు నుంచి తప్పించారు.మరి వాళ్లిద్దరిలాగే గంభీర్‌పై వేటు వేయలేరా?.. మీ ఆలోచనా విధానం ఒక్కొక్కరి విషయంలో ఒక్కోలా ఉంటుందా?’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ యాజమాన్యం తీరును తూర్పారబట్టాడు. అదే విధంగా.. ఇంగ్లండ్ చేతిలో సిరీస్ ఓడిపోయినప్పటికీ గంభీర్ ముఖంలో కాస్తైనా బాధ కనిపించలేదని చిక్కా మండిపడ్డాడు.కొంచెం కూడా బాధ లేదు‘‘తననూ ఎవరు టచ్ చేయలేరని అతడికి తెలుసు. అందుకే డగౌట్లో కూర్చుని నవ్వులు చిందిస్తున్నాడు. అసలు జట్టు ఓడిపోతోందన్న బాధ అతడిలో కొంచెం కూడా కనిపించలేదు. ఎన్నో సిరీస్‌లలో వైట్‌వాష్‌లు, ఘోర పరాభవాలు.అయినా సరే అతడిని కదిలించేవారే లేరు. తనను ఎవరూ ఏమీ చేయలేరన్న నమ్మకంతోనే అతడు ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. వాటి గురించి నిర్భయంగా మాట్లాడుతున్నాడు’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.చదవండి: IND vs ENG 5th T20I: భారత తుదిజట్టు ఇదే! -
IND vs ENG: భారత తుదిజట్టు ఇదే!.. వైభవ్‌పై వేటు!
టీ20 ప్రపంచకప్ చాంపియన్ టీమిండియాకు ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పసికూన ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో 2-0తో క్లీన్‌స్వీప్‌నకు గురైన భారత జట్టు.. ఇంగ్లండ్‌కూ సిరీస్‌ను 0-3తో కోల్పోయింది. ఇక సౌతాంప్టన్ వేదికగా శనివారం నాటి ఆఖరిదైన ఐదో టీ20లో గెలిస్తేనే మరో వైట్‌వాష్ నుంచి టీమిండియా బయటపడుతుంది.పరువు దక్కాలంటేఈ నేపథ్యంలో కనీస పరువు దక్కాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత తుదిజట్టు కూర్పు ఎలా ఉండబోతుందన్న చర్చ మొదలైంది. ఈ క్రమంలో వరుసగా మూడు మ్యాచ్‌లలో విఫలమైన యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీపై వేటు తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కాగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ నాకౌట్ మ్యాచ్‌లలో వరుసగా 97*, 89, 89 పరుగులతో రాణించి.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు సంజూ శాంసన్. అయితే, ఐర్లాండ్‌తో రెండు టీ20లలో 5, 0 పరుగులు చేసిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. ఇంగ్లండ్‌తో తొలి టీ20లో కేవలం ఒకే ఒక్క పరుగు చేసి నిష్క్రమించాడు.సంజూ శాంసన్‌పై వేటు వేసిఈ నేపథ్యంలో సంజూ శాంసన్‌పై వేటు వేసిన యాజమాన్యం.. అతడి స్థానంలో వైభవ్ సూర్యవంశీతో అరంగేట్రం చేయించింది. అయితే, పదిహేనేళ్ల ఈ లెఫ్టాండర్ బ్యాటర్ ఇంగ్లండ్‌తో వరుసగా మూడు మ్యాచ్‌లలో 13, 14, 15 పరుగులు చేసి నిరాశపరిచాడు. ఇందుకు తోడు జట్టు సైతం వరుస పరాజయాలతో సిరీస్ కోల్పోయింది.తిరిగి తుదిజట్టులోకి ఇక వైభవ్‌తో పాటు వైస్ కెప్టెన్ తిలక్ వర్మ, వన్‌డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ సైతం విఫలమవుతున్నారు. ఇలాంటి తరుణంలో హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో ఐదో టీ20 సందర్భంగా సంజూ శాంసన్‌ను తిరిగి తుదిజట్టులోకి తీసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.టాపార్డర్‌లో ముగ్గురూ లెఫ్టాండర్లే (అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్) ఉండటం కూడా సమస్యగా మారిందని.. ఈసారి సంజూను చేర్చి లెఫ్ట్- రైట్ కాంబినేషన్‌తో ముందుకు వెళ్లనున్నట్లు సమాచారం. లేదంటే వైభవ్‌ను కొనసాగించి.. తిలక్ వర్మ లేదంటే ఇషాన్ కిషన్‌ను తప్పిస్తే ఎలా ఉంటుందన్న చర్చ జరుగుతోంది.అయితే, తిలక్ ప్రస్తుతం వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. కాబట్టి అతడిని తుదిజట్టు నుంచి తీసేయడం కష్టం. మరోవైపు.. ఇషాన్ వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్‌గా ఉన్నప్పటికీ.. వన్‌డౌన్‌లో సంజూ ఆడగలడు కాబట్టి అతడు ఇషాన్‌ను రీప్లేస్ చేసే అవకాశం ఉంది. ఇక అక్షర్ పటేల్, ప్రసిద్ కృష్ణ స్థానంలో రవి బిష్ణోయి, సూర్యాంశ్ షెడ్గే రానున్నట్లు సమాచారం.ఇంగ్లండ్‌తో ఐదో టీ20కి భారత తుదిజట్టు (అంచనా)అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్, శివం దూబే, సూర్యాంశ్ షెడ్గే, ప్రిన్స్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయి. -
వీళ్ల కోసమా వరల్డ్ కప్ హీరోను తీసేసింది.. సోషల్ మీడియాలో రగులుతున్న చర్చ
-
భారత జట్టులో కీలక మార్పులు!.. తిలక్‌కు నో ఛాన్స్?
ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా ఓటముల పరంపర కొనసాగుతోంది. గురువారం బ్రిస్టల్ వేదికగా జరిగిన నాలుగో టీ20లో భారత జట్టు 9 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0 తేడాతో శ్రేయస్ సేన కోల్పోయింది. ఇది భారత్‌కు వరుసగా రెండో సిరీస్ ఓటమి. అంతకుముందు ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో మెన్ ఇన్ బ్లూ క్లీన్ స్వీప్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆఖరి టీ20 సౌతాంప్టన్ వేదికగా శనివారం జరగనుంది. కనీసం చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో భారత్ పలు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.సంజూ ఇన్.. వైభవ్‌కు మరో ఛాన్స్?గత మూడు మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితమైన స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌ను తిరిగి తుది జట్టులోకి తీసుకోవాలని మేనెజ్మెంట్ భావిస్తోంది. అయితే సంజూ స్ధానంలో ఎంట్రీ ఇచ్చిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని కూడా ప్లేయింగ్ ఎలెవన్‌లో కొనసాగించాలని గంభీర్ అండ్ కో భావిస్తుందంట.వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విఫలమైనప్పటికి, వైభవ్‌కు మేనేజ్మెంట్ మరో ఛాన్స్ ఇవ్వాలని చూస్తోంది. అయితే సంజూ మిడిలార్డర్లో బ్యాటింగ్ చేసే అవకాశముంది. వరుసగా విఫలమవుతున్న వైస్ కెప్టెన్ తిలక్ వర్మను తుది జట్టు నుంచి తప్పించనున్నట్లు సమాచారం. అదేవిధంగా వాషింగ్టన్ సుందర్‌ను కూడా పక్కన పెట్టనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. చివరి మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ సూర్యన్ష్ షెడ్గేకు ఛాన్స్ ఇవ్వనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.ఐదో టీ20కు భారత తుది జట్టు(అంచనా)వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, సంజు శాంసన్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, అక్షర్ పటేల్, ప్రిన్స్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ -
వరల్డ్ కప్ హీరోని పక్కన పెడతారా? బుడ్జోడా వెళ్లి IPL ఆడుకో
-
వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాప్
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ వరుసగా మూడో మ్యాచ్‌లోనూ నిరాశపరిచాడు. బ్రిస్టల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టీ20లో వైభవ్ మరోసారి నామమాత్రపు స్కోర్‌కే పరిమితమయ్యాడు. రెండో టీ20 మాదిరే షార్ట్ పిచ్ డెలివరీకి వైభవ్ దొరికిపోయాడు.తొలి ఓవర్లో జోఫ్రా ఆర్చర్‌ను ఆచితూచి ఆడిన వైభవ్.. రెండో ఓవర్ వేసిన జోష్ టంగ్ బౌలింగ్‌లో వరుసగా ఫోర్, సిక్స్ బాది తన రిథమ్‌ను అందుకున్నాడు. కానీ తర్వాత ఓవర్లో ఆర్చర్ వేసిన షార్ట్ లెంగ్త్ బంతికి భారీ షాట్ ఆడబోయి వైభవ్ ఔటయ్యాడు.షార్ట్ లెంగ్త్ బంతిని 'పుల్' షాట్ ఆడేందుకు సూర్యవంశీ ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్ టాప్ ఎడ్జ్ తీసుకుని గాల్లోకి లేచింది. మిడ్-ఆన్ వద్ద ఉన్న సామ్ కుర్రాన్ సునాయస క్యాచ్‌ను అందుకున్నాడు. దీంతో 10 బంతుల్లో ఒక ఫోర్, సిక్స్‌తో కేవలం 15 పరుగులు చేసి వైభవ్ ఔటయ్యాడు.వైభవ్ గత రెండు మ్యాచ్‌లలో 14, 13 స్కోర్లను నమోదు చేశాడు. మొత్తంగా తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో మొదటి మూడు మ్యాచ్‌లలో 42 పరుగులు చేశాడు. కాగా వైభవ్‌కు ఛాన్స్ ఇవ్వడం కోసం స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్‌ను సైతం పక్కన పెట్టారు. కానీ వైభవ్ మాత్రం తన లభించిన అవకాశాలను అందిపుచ్చుకోలేకపోతున్నాడు.Similar type of dismissals ☠️Weakness of Vaibhav Sooryavanshi which the bowlers have started exploiting....Need to work on this in the coming days else it will be difficult...#ENGvsIND pic.twitter.com/uDkthonNnB— Wanderer (@vkyash18oz) July 9, 2026 -
ఇంగ్లండ్‌తో నాలుగో టీ20.. బ్యాటింగ్ భారత్‌దే
బ్రిస్టల్ వేదికగా నాలుగో టీ20లో ఇంగ్లండ్-భారత్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌కు భారత ప్లేయర్లు హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి దూరమయ్యారు. వారిద్దరి స్ధానంలో వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ద్ కృష్ణ తుది జట్టులోకి వచ్చారు. కాగా మరోసారి సంజూ శాంసన్‌కు నిరాశే ఎదురైంది. వైభవ్ సూర్యవంశీని తుది జట్టులో కొనసాగించారు. ఇక ఇంగ్లండ్ కూడా ఓ మార్పుతో బరిలోకి దిగింది. లియామ్ డాసన్ స్ధానంలో రెహాన్ అహ్మద్ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చాడు.తుది జట్లుఇంగ్లండ్: ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్(కెప్టెన్), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కర్రాన్, విల్ జాక్స్, రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, జోష్ టంగ్భారత్: అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, ప్రిన్స్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ -
సంజూ శాంసన్ ఊహించని నిర్ణయం
టీమిండియా స్టార్ వికెట్ కీపర్ సంజూ శాంసన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 20 నుంచి ప్రారంభం కానున్న కేరళ క్రికెట్ లీగ్ (KCL 2026) మూడో సీజన్ నుంచి శాంసన్ వైదొలిగాడు. జూలై 11న జరగబోయే ప్లేయర్స్ వేలం కోసం కూడా అతడు తన కూఐడా పేరును నమోదు చేసుకోలేదు. ఈ విషయాన్ని కేసీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ నాజర్ మచాన్ ధ్రువీకరించారు. వ్యక్తిగత కారణాల వల్ల సంజూ ఈ ఏడాది సీజన్‌కు అందుబాటులో ఉండటం లేదని మచాన్ స్పష్టం చేశారు. గత సీజన్లో శాంసన్ 'కొచ్చి బ్లూ టైగర్స్' ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించాడు. కేవలం మూడు మ్యాచ్‌లలోనే ఓ అద్భుత సెంచరీతో సహా మొత్తం 221 పరుగులు చేశాడు. అయితే ఈ ఏడాది సీజన్ వేలానికి ముందు అతడిని కొచ్చి విడుదల చేసింది.దీంతో శాంసన్ వేలంలోకి వస్తాడని అంతా భావించారు. కానీ అతడు ఇప్పుడు పూర్తిగా తప్పుకొని షాకిచ్చాడు. కాగా సంజూ ప్రస్తుతం పేలవ ఫామ్‌తో సతమవుతున్నాడు. యూకే పర్యటనలో ఉన్న శాంసన్ వరుసగా మూడు మ్యాచ్‌లలో తీవ్ర నిరాశపరిచాడు. ఐర్లాండ్ సిరీస్‌లో రెండు మ్యాచ్‌లలో సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమైన సంజూ.. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో తొలి టీ20లో కూడా కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. దీంతో తర్వాత రెండు మ్యాచ్‌లకు అతడిని తుది జట్టు నుంచి తప్పించారు. అంతేకాకుండా జింబాబ్వేతో సిరీస్‌కు సంజూను సెలక్టర్లు ఎంపిక చేయలేదు. అతడి స్ధానంలో యువ వికెట్ కీపర్ బ్యాటర్ ప్రభ్సిమ్రాన్ సింగ్‌కు అవకాశమిచ్చారు. అయితే మిగితా సీనియర్ బ్యాటర్లంతా ఉన్నప్పటికి ఒక్క శాంసన్‌నే జట్ట నుంచి తప్పించడం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అతడిని కావాలనే పక్కన పెట్టారాని బీసీసీఐ సెలక్టర్లపై కొంతమంది విమర్శలు గుప్పించారు. కానీ గత 6 నెలలగా అవిరామంగా క్రికెట్ ఆడుతున్నందునే సంజూకు విశ్రాంతి ఇచ్చినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. జపాన్‌లో జరగనున్న ఆసియా క్రీడల (Asian Games 2026)కు ఎంపిక చేసిన భారత జట్టులో మాత్రం సంజూకు చోటు దక్కింది. -
'సంజూకు అందుకే ఛాన్స్ ఇవ్వలేదు'.. మాజీ చీఫ్ సెలక్టర్ కీలక వ్యాఖ్యలు
జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది.అయితే ఈ జట్టులో స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ పేరు లేకపోవడం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. కేవలం మూడు మ్యాచ్‌లలో విఫలమైనంత మాత్రాన అతడిని జట్టు నుంచి చాలా మంది మాజీలు తప్పుపడుతున్నారు. సంజూ ప్రస్తుతం భారత జట్టుతో పాటు ఇంగ్లండ్‌లో ఉన్నాడు. తొలుత ఐర్లాండ్ సిరీస్‌లో రెండు మ్యాచ్‌లలోనూ శాంసన్ సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమయ్యాడు. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లోనూ ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. దీంతో తర్వాతి రెండు మ్యాచ్‌లకు అతడిని పక్కన పెట్టారు. ఇప్పుడు జింబాబ్వే టూర్‌కు పూర్తిగా జట్టు నుంచే పక్కన పెట్టారు. సీనియర్ బ్యాటర్లందరని ఎంపిక చేసినప్పటికి, ఒక్క సంజూనే జట్టు నుంచి తప్పించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో భారత మాజీ చీఫ్ సెలక్టర్ ఎంఎస్కే ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సంజూ శాంసన్‌ను జట్టు నుంచి తొలగించలేదని, కేవలం యువ ఆటగాళ్లను పరీక్షించేందుకే అతడికి విశ్రాంతి ఇచ్చారని ఎంఎస్కే అభిప్రాయపడ్డాడు."శాంసన్ విషయంలో అనవసర చర్చలు వద్దు. భారత్ టీ20 ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించి, 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలిచిన ఆటగాడిని జట్టు ఇంత సులువుగా తప్పిస్తారా? ఫామ్ కారణంగా అతడిని పక్కన పెట్టారని నేను అనుకోవడం లేదు. వైభవ్ సూర్యవంశీ వంటి యువ ఆటగాళ్లను పరీక్షించేందుకు సెలెక్టర్లు సంజూకు విశ్రాంతి ఇచ్చారని అనుకుంటున్నాను. జింబాబ్వే పర్యటనను ప్రధానంగా భారత బెంచ్ బలాన్ని అంచనా వేయడానికి ఉపయోగపడుతోంది. అందుకే జట్టులో ఎక్కువగా యువ ఆటగాళ్లకు అవకాశమిచ్చారు. ప్రపంచకప్ ముగిసిన మొదటి ఆరు నెలల కాలాన్ని సెలక్టర్లు కొత్త ప్రయోగాల కోసమే కేటాయిస్తారు. తదుపరి ప్రపంచకప్ కోసం కేవలం నుంచి 18 నెలల ముందు మాత్రమే సెలెక్టర్లు తమ కోర్ గ్రూప్ ఆటగాళ్లపై దృష్టి పెడతారు. కాబట్టి ప్రస్తుతం జరుగుతున్న మార్పులను ప్రయోగాల్లో భాగంగానే చూడాలి. కేవలం మూడు మ్యాచ్‌లలో విఫలమైనందున సంజూను జట్టు తప్పించారంటే నేను నమ్మను. ఆసియాగేమ్స్‌కు ఎంపిక చేసిన జట్టులో సంజూ ఉన్నాడన్న విషయం మర్చిపోవద్దు. అయితే తదుపరి టీ20 ప్రపంచకప్(2028) ఆడాలంటే సంజూ కచ్చితంగా తన ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలని" ఎంఎస్కే పేర్కొన్నాడు.చదవండి: జట్టులో దండగ.. అతడినే టీమిండియా కెప్టెన్‌ని చేస్తారేమో! -
జట్టులో దండగ.. అతడినే టీమిండియా కెప్టెన్‌ని చేస్తారేమో!
విదేశీ పర్యటనలో టీమిండియా టీ20 వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. తొలుత ఐర్లాండ్ చేతిలో 2-0తో క్లీన్‌స్వీప్ అయిన భారత జట్టు.. ఇంగ్లండ్‌తో తొలి టీ20 వర్షం వల్ల రద్దు కావడంతో ఊపిరి పీల్చుకుంది. ఇక రెండు, మూడు మ్యాచ్‌లలో ఆతిథ్య ఇంగ్లండ్ గెలిచి 2-0తో ఆధిక్యంలో నిలిచింది.వైస్ కెప్టెన్‌గా తిలక్ వర్మఈ నేపథ్యంలో బ్రిస్టల్ వేదికగా గురువారం జరిగే నాలుగో టీ20లో టీమిండియా చావోరేవో తేల్చుకోవాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. ఐర్లాండ్ టూర్‌తో భారత టీ20 జట్టు కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ పగ్గాలు చేపట్టగా.. తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు.అయితే, ఈ ఇద్దరూ తమ పాత్రలకు న్యాయం చేయడం లేదు. శ్రేయస్ బ్యాటర్‌గా ఫర్వాలేదనిపిస్తున్నా.. సారథిగా వరుస పరాజయాలతో చెత్త రికార్డులు మూటగట్టుకుంటున్నాడు. మరోవైపు.. తిలక్ వర్మ ఆటగాడిగా ఫెయిల్ అవుతూ ఒక రకంగా జట్టుకు భారమయ్యాడని పలువురు టీమిండియా మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.ముఖ్యంగా ఇంగ్లండ్‌తో మూడో టీ20లో తిలక్ రెగ్యులర్‌గా వచ్చే ఐదో స్థానంలో కాకుండా.. ఆరో నంబర్లో బ్యాటింగ్‌కు చేయడం ఇందుకు ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ తిలక్ వర్మపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాడు. సంజూ శాంసన్ పేరును ప్రస్తావిస్తూ తిలక్ వర్మ స్థానాన్ని ప్రశ్నించాడు.అతడిని కెప్టెన్‌ను కూడా చేస్తారేమోఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘తిలక్ ఇప్పటికే వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. పరిస్థితి చూస్తుంటే త్వరలోనే అతడిని కెప్టెన్‌ను కూడా చేస్తారేమో అనిపిస్తోంది. కాబట్టి జట్టులో తన స్థానానికి వచ్చిన ఢోకా ఏమీ లేదని అతడు భావిస్తున్నాడేమో!..ఏదేమైనా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో అతడు పేస్, బౌన్స్‌ను ఎదుర్కొనే ధైర్యం లేక కాస్త ఆలస్యంగా బ్యాటింగ్‌కు వెళ్లినట్లు అనిపిస్తోంది. క్రీజులోకి వెళ్లాక కూడా.. దూకుడుగా ఆడలేక అతడు బిక్కమొఖం వేశాడు.బలహీనత మీకు తెలుసుతిలక్ వర్మ ప్రధాన బ్యాటర్‌గా భావించే అతడిని వైస్ కెప్టెన్‌ని చేశారు కదా!.. అయినా సరే ఫాస్ట్ బౌలింగ్‌ను ఎదుర్కోకుండా మీరే (యాజమాన్యం) అతడిని కాపాడుతున్నారు. అతడి బలహీనత మీకు తెలుసు కాబట్టే ఇలా చేస్తున్నారు.అందుకే తిలక్‌కు బదులు అక్షర్‌ను ముందుగా పంపి బలిచేశారు. షార్ట్ పిచ్ బంతులను తిలక్ ఎదుర్కోలేడని మీకు ముందుగానే తెలుసు. అందుకే అతడి బలహీనతను కప్పిపుచ్చేందుకు అక్షర్‌ను ముందుకు తోశారు. ఆడలేక ఇబ్బంది పడుతున్నపుడు అతడిని జట్టు నుంచి తప్పించాలి. నేను పదే పదే ఈ మాట చెబుతున్నాను. తిలక్ వర్మకు బదులు సంజూ శాంసన్‌ను ఆడిస్తే బాగుంటుంది. కానీ యాజమాన్యం మాత్రం తిలక్‌ను తప్పించడం లేదు’’ అని క్రిస్ శ్రీకాంత్ చురకలు అంటించాడు. కాగా ఇంగ్లండ్‌తో తొలి టీ20లో 13 పరుగులు చేసిన తిలక్ వర్మ.. రెండో మ్యాచ్‌లో 24*, మూడో టీ20లో 3 పరుగులు చేసి నిష్క్రమించాడు.చదవండి: తుదిజట్టులోకి సంజూ.. కానీ ఓ కండిషన్! -
తిలక్, బుడోడు OUT.. సంజూ ఈజ్ బ్యాక్.. టీమిండియా PLAYING 11 ఇదే
-
సంజూను తప్పించలేదు.. వైభవ్ కోసం తప్పుకున్నాడు.. సెలక్షన్ వెనుక అసలు కథ
-
IND vs ENG: తుదిజట్టులోకి సంజూ.. కానీ ఓ కండిషన్!
ఇంగ్లండ్‌తో నాలుగో టీ20 రూపంలో టీమిండియా కఠిన సవాలు ముంగిట నిలిచింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే శ్రేయస్ అయ్యర్ సేన పోటీలో ఉంటుంది. ఒకవేళ ఓడిపోతే మాత్రం.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆతిథ్య ఇంగ్లండ్ 3-0తో సొంతం చేసుకుంటుంది.లెఫ్టాండర్లు ఎక్కువయ్యారుఈ నేపథ్యంలో భారత తుదిజట్టు కూర్పు గురించి మరోసారి చర్చ మొదలైంది. సంజూ శాంసన్ తిరిగి ఆడించాలని పలువురు మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. జట్టులో ఎడమచేతి వాటం బ్యాటర్ల సంఖ్య ఎక్కువైందని.. ఇది కూడా ఓ సమస్యగా పరిణమించిందని అభిప్రాయపడుతున్నారు.సంజూను కాదని వైభవ్‌కు అవకాశంకాగా ఐర్లాండ్‌తో రెండు టీ20లు, ఇంగ్లండ్‌తో తొలి మ్యాచ్‌లో సంజూ విఫలమైన సంగతి తెలిసిందే. ఈ మూడు మ్యాచ్‌లలో అతడు చేసిన పరుగులు వరుసగా 5, 0, 1. ఈ నేపథ్యంలో సంజూను తప్పించి.. అతడి స్థానంలో చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీని ఓపెనర్‌గా బరిలోకి దించింది యాజమాన్యం.రెండు మ్యాచ్‌లలోనూ విఫలంఇంగ్లండ్తో రెండో టీ20 సందర్భంగా అరంగేట్రం చేసిన వైభవ్.. ఇప్పటికి రెండు మ్యాచ్‌లలో వరుసగా 14, 13 పరుగులు చేశాడు. ఇక వైభవ్ రాకతో టాపార్డర్ మొత్తం లెఫ్లాండర్లతో నిండిపోయింది. ఈ పదిహేనేళ్ల పిల్లాడితో పాటు అభిషేక్ శర్మ, వన్‌డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కూడా లెఫ్లాండరే.అదే విధంగా.. తిలక్ వర్మ, అక్షర్ పటేల్, శివం దూబే, అర్ష్‌దీప్ సింగ్ కూడా ఎడమచేతి వాటం గల ఆటగాళ్లే. ఈ నేపథ్యంలో కుడిచేతి వాటం గల సంజూ అవసరం ఎంతగానో ఉందంటూ పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.సంజూను ఆడించాల్సిందేఓపెనర్గా కాకపోయినా.. మిడిల్ ఆర్డర్‌లోనైనా సంజూను ఆడించాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కోచ్ అభిషేక్ నాయర్ మాత్రం భిన్నంగా స్పందించాడు. టాపార్డర్‌లో ఆడిస్తే మాత్రమే సంజూకు తిరిగి తుదిజట్టులో చోటు ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు.అలా అయితేనే తుదిజట్టులోకి తీసుకోండి‘‘ఒకవేళ నిజంగా సంజూను తిరిగి తుదిజట్టులోకి తీసుకోవాలనే ఆలోచన ఉంటే.. అతడు ఏ స్థానంలోనైతే సక్సెస్ అయ్యాడో ఆ స్థానంలోనే ఆడించాలి. అంతేగానీ సంజూను మళ్లీ తీసుకువచ్చి.. నాలుగు, ఐదు లేదంటే ఆరో స్థానంలో ఆడిస్తామంటే ఫలితం ఉండదు.లేదంటే ఆడించకపోవడమే మంచిదిఅతడు మళ్లీ ఇబ్బంది పడతాడు. నిజానికి సంజూ టాప్-3లో మాత్రమే విజయవంతంగా బ్యాటింగ్ చేయగలడు. ఒకవేళ అతడి పట్ల నిజంగానే మీకు నమ్మకం ఉంటే.. టాపార్డర్‌లో ఆడించండి. లేదంటే అసలు ఆడించకపోవడమే మంచిది’’ అని అభిషేక్ నాయర్ కుండబద్దలు కొట్టినట్లుగా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.ఓపెనర్‌గా ఇలా..కాగా సంజూ ఇప్పటికి టీమిండియా టాప్-3 బ్యాటర్‌గా 36 ఇన్నింగ్స్ ఆడి ఏకంగా 1023 పరుగులు సాధించాడు. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో ఓపెనర్‌గా నాకౌట్ మ్యాచ్‌లలో ఏకంగా 97*, 89, 89 పరుగులు సాధించి.. జట్టు చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక మొత్తంగా టాప్-3లో 36 ఇన్నింగ్స్‌లో ఆడి ఏకంగా 171కి పైగా స్ట్రైక్‌రేటుతో సంజూ పరుగులు రాబట్టడం విశేషం.మిడిలార్డర్లో అలామరోవైపు.. టాప్-3 బ్యాటర్‌గా కాకుండా మిడిలార్డర్లో వచ్చి సంజూ 21 ఇన్నింగ్స్‌లో కేవలం 382 పరుగులే చేశాడు. స్ట్రైక్‌రేటు 124. ఈ నేపథ్యంలోనే అభిషేక్ నాయర్ సంజూను ఓపెనర్‌గా మాత్రమే పంపాలని నొక్కివక్కాణించడం గమనార్హం. కాగా టీ20 సిరీస్‌లో ఐర్లాండ్ చేతిలో 2-0 వైట్‌వాష్ అయింది టీమిండియా. అనంతరం ఇంగ్లండ్‌తో తొలి టీ20 వర్షం వల్ల రద్దు కాగా.. రెండు, మూడు మ్యాచ్‌లలో ఆతిథ్య జట్టు గెలిచింది. తద్వారా 2-0తో ఇంగ్లండ్ ఆధిక్యంలో ఉండగా.. బ్రిస్టల్ వేదికగా నాలుగో టీ20లో తప్పక గెలవాల్సిన స్థితిలో టీమిండియా నిలిచింది. చదవండి: అందుకే వైభవ్‌ను ఆడిస్తున్నాం: గంభీర్ -
కోహ్లి బాటలో సంజూ శాంసన్..!
భారత వికెట్‌కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కీలక సూచనలు చేశాడు. జింబాబ్వేతో జరగనున్న టీ20 సిరీస్‌కు ఎంపిక కాకపోవడంతో చర్చనీయాంశంగా మారిన సంజూ, విరాట్ కోహ్లీని ఆదర్శంగా తీసుకుని ఫిట్నెస్ను మెరుగుపర్చుకోవాలని మంజ్రేకర్ పిలుపునిచ్చాడు.2026 టీ20 ప్రపంచకప్‌లో 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలిచిన శాంసన్, అనంతరం యూకే పర్యటనలో తీవ్రంగా నిరాశపరిచాడు. మూడు మ్యాచ్‌ల్లో కలిపి కేవలం ఆరు పరుగులు మాత్రమే చేయడంతో అతడి స్థానంలో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి అవకాశం లభించింది. ఆ తర్వాత జింబాబ్వే సిరీస్‌కు ప్రకటించిన భారత జట్టులోనూ సంజూకు చోటు దక్కలేదు.ఈ నిర్ణయంపై స్పందించిన మంజ్రేకర్, "సంజూ శాంసన్‌ను తప్పించడానికి సరైన కారణం ఏదైనా ఉంటే అది ఫిట్నెస్ మాత్రమే. అదే కారణమైతే ఆ నిర్ణయం సమంజసమే. ప్రస్తుతం అతను అత్యుత్తమ శారీరక దృఢత్వంలో లేడు. ఈ దశలో విరాట్ కోహ్లీని ఆదర్శంగా తీసుకుని ఫిట్‌నెస్‌పై పూర్తిగా దృష్టి సారించాలి" అని సూచించాడు.జట్టులో చోటు కోల్పోయిన తర్వాత సంజూ తన ఫిట్‌నెస్‌పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల జిమ్‌లో తీవ్రంగా శ్రమిస్తున్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. ఒక శిక్షణా సెషన్‌కు దూరంగా ఉండి జిమ్‌లోనే ప్రత్యేకంగా వ్యాయామం చేస్తున్నట్లు సమాచారం. గతంలోనూ ఫిట్నెస్ విషయంలో సంజూపై విమర్శలు రావడంతో, ఇప్పుడు అతడికి ఇది కీలక దశగా భావిస్తున్నారు.ఇదిలా ఉండగా, ఇంగ్లండ్‌తో మూడో టీ20 అనంతరం ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కూడా సంజూ శాంసన్ భవిష్యత్తుపై స్పందించాడు. "2026 ప్రపంచకప్‌లో సంజూ చేసిన ప్రదర్శన అసాధారణం. అయితే కొన్నిసార్లు ఆటగాళ్ల ప్రస్తుత ఫామ్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.సంజూ ఇక జట్టులోకి రాలేడనే నిబంధన ఏమీ లేదు. ప్రతి ఆటగాడు తన స్థానాన్ని తన ప్రదర్శనతో సంపాదించుకోవాలి" అని గంభీర్ స్పష్టం చేశాడు.ఇంగ్లండ్‌తో మిగిలిన మ్యాచ్‌ల్లో సంజూ శాంసన్‌కు అవకాశం లభిస్తుందా లేదా అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఫిట్నెస్, ఫామ్ రెండింటినీ మెరుగుపర్చుకుని భారత జట్టులో తిరిగి స్థానం సంపాదించాలని సంజూ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. -
‘సామ్సన్‌కు పూర్తిగా స్పష్టతనిచ్చాం’
నాటింగ్‌హామ్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో రెండో టి20 నుంచి సంజు సామ్సన్ను తప్పించడం తీవ్ర చర్చకు దారి తీసింది. టి20 ప్రపంచకప్‌లో వరుసగా 97, 89, 89 స్కోర్లతో భారత్‌ను గెలిపించడంతో పాటు సామ్సన్ ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచాడు. అయితే ఐర్లాండ్‌తో తొలి రెండు మ్యాచ్‌లు, ఆ తర్వాత ఇంగ్లండ్‌తో తొలి టి20లో అతను వరుసగా 5, 0, 1 స్కోర్లు మాత్రమే నమోదు చేశాడు. అయితే కేవలం మూడు మ్యాచ్‌లలో విఫలం కావడంతోనే ఒక అగ్రశ్రేణి బ్యాటర్‌ను పక్కన పెట్టడంతో మేనేజ్మెంట్పై విమర్శలు వచ్చాయి. దీనిపై మొదటిసారి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించాడు. ఈ విషయంలో తాను స్వయంగా సామ్సన్‌కు అన్ని అంశాలు వివరించానని అతను వెల్లడించాడు. ‘సంజు సామ్సన్‌కు ఈ విషయంలో ఎలాంటి స్పష్టతనివ్వాలో అదంతా చెప్పాం. ఇది ఒక ఆటగాడికి, హెడ్ కోచ్‌కు మధ్య జరిగిన సంభాషణ. కాబట్టి వాటి వివరాలు సహజంగానే మేం బయటకు చెప్పం. ఇంకా వివరంగా చెప్పాలంటే ప్రపంచ కప్‌లో సామ్సన్ ఎంత అద్భుతంగా ఆడాడో మాకూ బాగా తెలుసు. అయితే కొన్ని సందర్భాల్లో ఆటగాళ్ల తాజా ఫామ్‌ను కూడా దృష్టిలో పెట్టుకోవాలి.అయినా ఈ సిరీస్‌లో అతను మళ్లీ ఆడలేడనే నిబంధన ఏమీ లేదు కదా. అంతర్జాతీయ క్రికెట్లో అన్నింటికంటే ఫలితాలు ముఖ్యం. ఏ 11 మంది అత్యుత్తమ ఆటగాళ్ల బృందం మాకు ఫలితాలు అందిస్తుందనే నమ్ముతామో వారినే ఆడిస్తాం. భారత్ తరఫున ఆడగల హక్కును జట్టులోని ప్రతీ ఒక్కరు తమంతట తామే సంపాదించుకోవాలనే విషయాన్ని నేను గట్టిగా నమ్ముతాను’ అని గంభీర్ వివరించాడు. ఇంగ్లండ్‌తో మూడో టి20లో చిత్తుగా ఓడిన తర్వాత తమ పరాజయానికి కారణాలను కోచ్ విశ్లేషించాడు. టి20ల్లో భారత జట్టు సుదీర్ఘ కాలంగా ఆధిపత్యం ప్రదర్శించిన తర్వాత ఇప్పుడు జట్టు మారిందని, కుదురుకోవడానికి కొంత సమయం పడుతుందని హెడ్ కోచ్ అభిప్రాయ పడ్డాడు. ‘ఇంగ్లండ్‌లో పరిస్థితులను బట్టి ఆటను మార్చుకోవాల్సి అవసరం కచ్చితంగా ఉంది. అయితే ఇటీవల టీమ్‌లో పలు మార్పుచేర్పులు జరిగాయి. వరల్డ్ కప్ ఫైనల్ ఆడిన టీమ్ నుంచి కొందరు మాత్రమే ఇక్కడున్నారు. కెప్టెన్ మారాడు, ఓపెనర్ మారాడు. పాండ్యా, బుమ్రా ఆడటం లేదు. కాబట్టి ఇంకా టీమ్ పూర్తిగా కుదురుకోలేదు. జట్టులోకి పలువురు ఆటగాళ్లు ఇంకా పూర్తి స్థాయిలో ఎదిగేందుకు సమయం పడుతుంది. మా ఆటగాళ్లంతా రిస్‌్కతో కూడిన క్రికెట్ ఆడుతున్నారు కాబట్టి ఇలాంటి ఫలితాలూ వస్తాయి. ప్రపంచకప్‌లోనూ మా టాపార్డర్ ఇదే తరహా దూకుడు ప్రదర్శించింది. అయితే అప్పుడు మిడిలార్డర్ నిలకడగా ఆడి ఆదుకుంది. ఈసారి అది కనిపించలేదు’ అని భారత మాజీ ప్లేయర్ వ్యాఖ్యానించాడు. నాలుగు మ్యాచ్‌లు ఓడినంత మాత్రం భారత్ చెత్త టీమ్‌గా మారిపోదని కూడా అతను అన్నాడు. -
టీమిండియాలో తీవ్ర కలకలం గంభీర్ తో సంజూ గొడవ..
-
'కెరీర్ నాశనం చేసుకుంటున్నావు.. అతడిని చూసి నేర్చుకో'
టీమిండియా స్టార్ వికెట్ కీపర్ సంజూ శాంసన్ తన టీ20 కెరీర్లో అత్యంత క్లిష్టమైన దశను ఎదుర్కొంటున్నాడు. టీ20 ప్రపంచకప్-2026లో ప్లేయర్ ఆఫ్‌ది టోర్నమెంట్‌గా నిలిచిన సంజూ.. ఇప్పుడు నెలల వ్యవధిలోనే జట్టులో చోటు కోల్పోవడం తీవ్ర చర్చానీయంశమైంది. కేవలం మూడు మ్యాచ్‌లలో విఫలమైనందున అతడిని జట్టు నుంచి తప్పించారు. ఐపీఎల్-2026లో దుమ్ములేపి ఐర్లాండ్ పర్యటనకు వచ్చిన సంజా.. అక్కడ మాత్రం తన జోరును కొనసాగించలేకపోయాడు. ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌లలోనూ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యాడు. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో తొలి టీ20లో కూడా కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. దీంతో ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్‌ను పక్కన పెట్టి.. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని తుది జట్టులోకి తీసుకొచ్చారు. రెండు, మూడు టీ20ల్లో సంజూ బెంచ్‌కే పరిమితమయ్యాడు. అంతేకాకుండా జింబాబ్వేతో సిరీస్‌కు ఏకంగా ప్రధాన జట్టు నుంచే సంజూను తప్పించారు. సీనియర్ బ్యాటర్లంతా జట్టులో ఉన్నప్పటికి సంజూ ఒక్కడే పేరే లేకపోవడం అందరిని ఆశ్యర్యపరిచింది. కావాలనే సంజూను పక్కన పెట్టారని అభిమానులు సెలక్టర్లపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఫిట్నెస్ సమస్యల పరంగా సంజూను జట్టు నుంచి తప్పించిండొచ్చు అని అతడు అభిప్రాయపడ్డాడు."ఫిట్నెస్ లోపం వల్లే సంజూ శాంసన్‌ను జట్టు నుంచి తప్పించారని అనుకుంటున్నాను. ఒకవేళ అదే కారణమైతే, సెలక్టర్లు, టీమ్ మేనెజ్మెంట్ తీసుకున్నది సరైన నిర్ణయమే అని చెప్పాలి. అద్భుతమైన టాలెంట్ ఉన్నప్పటికీ, శారీరక దృఢత్వం లోపం వల్ల శాంసన్ తన కెరీర్‌ను నాశనం చేసుకుంటున్నాడు. ఈ దశలో అతను విరాట్ కోహ్లిని రోల్ మోడల్‌గా తీసుకుని ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలని" ఎక్స్ వేదికగా మంజ్రేకర్ రాసుకొచ్చాడు. కాగా సంజూకు అయితే ఎలాంటి ఫిట్నెస్ సమస్యలు లేవు. కేవలం ఫామ్ కారణంగా పక్కన పెట్టామని హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ మూడో టీ20 అనంతరం స్పష్టం చేశాడు. అయితే జింబాబ్వే టూర్‌కు ఎంపిక కానప్పటికి ఆసియా క్రీడలకు వెళ్లే భారత జట్టులో మాత్రం శాంసన్ చోటు దక్కించుకున్నాడు. -
సంజూతో పోల్చుకుంటే 'ఆ ముగ్గురు' మరీ దారుణం..!
భారత టీ20 జట్టులో సంజూ శాంసన్‌కు చోటు దక్కకపోవడంపై మరోసారి సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. బీసీసీఐ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ సంజూ శాంసన్‌ను నిలకడలేని ప్రదర్శన కారణంగానే పక్కన పెట్టారని అభిమానులు పేర్కొంటూ, అందుకు విరుద్ధంగా గణాంకాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.అభిమానులు షేర్ చేస్తున్న వివరాల ప్రకారం..సంజూ శాంసన్ చివరి పది ఇన్నింగ్స్‌లో 107, 109, 22, 24, 97, 89, 89, 5, 0, 1 పరుగులు చేయగా..ఇషాన్ కిషన్ 10, 36, 11, 8, 3, 13, 12, 0, 49, 13 పరుగులు.. తిలక్ వర్మ 1, 44, 27, 21, 8, 19, 55, 13, 24, 3 పరుగులు..అభిషేక్ శర్మ 68, 0, 10, 9, 52, 49, 0, 59, 43, 10 పరుగులు.. వైభవ్ సూర్యవంశీ రెండు ఇన్నింగ్స్‌లో 14, 13 పరుగులే చేశాడు.ఈ గణాంకాలను ఉదహరిస్తూ, "అసలు నిలకడ లేని బ్యాటర్ ఎవరు..?" అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. సంజూ శాంసన్‌కు పెద్ద ఇన్నింగ్స్ ఆడే సామర్థ్యం ఉందని, ఒకసారి క్రీజులో నిలదొక్కుకుని 30 పరుగుల మార్క్ దాటితే అతడు భారీ స్కోరు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వారు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా, సంజూ పెద్ద స్కోర్లు చేసిన మ్యాచ్‌ల్లో భారత జట్టు విజయాలు కూడా ఎక్కువగా వచ్చాయని పోస్టుల్లో పేర్కొంటున్నారు.ఇతర బ్యాటర్లు ఒక మ్యాచ్‌లో రాణించి, తర్వాత వరుసగా విఫలమవుతున్నారని వాదిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో సంజూ శాంసన్‌ను మాత్రమే 'నిలకడలేని ఆటగాడి'గా పరిగణించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.ప్రస్తుత ఇంగ్లండ్ పర్యటనలో భారత బ్యాటింగ్ వైఫల్యాల నేపథ్యంలో ఈ చర్చ మరింత ఊపందుకుంది. గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని జట్టు యాజమాన్యం సంజూ శాంసన్ విషయంలో మరోసారి పునరాలోచించాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు.కాగా, తాజగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20లో భారత్ ఘోర ఓటమిని చవిచూసింది. ఈ ఓటమితో భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 0-2తో వెనుకపడిపోయింది. సిరీస్‌లో నిలవాలంటే బ్రిస్టల్‌లో జరగనున్న నాలుగో టీ20లో భారత్ తప్పనిసరిగా విజయం సాధించాలి. -
గంభీర్‌పై జనాగ్రహం
ఇంగ్లండ్‌తో మూడో టీ20లో టీమిండియా ఘోర పరాజయం అనంతరం ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌పై అభిమానుల ఆగ్రహం వ్యక్తమైంది. నాటింగ్హమ్లోని ట్రెంట్ బ్రిడ్జ్ స్టేడియం వెలుపల భారత జట్టు బయలుదేరుతున్న సమయంలో అభిమానులు "వీ వాంట్ సంజూ" అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. సంజూ శాంసన్‌ను జట్టులోకి తిరిగి తీసుకోవాలంటూ గంభీర్‌ను లక్ష్యంగా చేసుకుని తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.‘We want Sanju’ chants outside the stadium when team India leaves. pic.twitter.com/bzqljBakTG— Mufaddal Vohra (@mufaddal_vohra) July 8, 2026ఐర్లాండ్ సిరీస్‌లో రెండు మ్యాచ్‌ల్లో కేవలం ఐదు పరుగులు మాత్రమే చేసిన సంజూ శాంసన్, ఇంగ్లండ్‌తో తొలి టీ20లో కూడా ఒక్క పరుగు మాత్రమే చేయడంతో జట్టు యాజమాన్యం అతడిని తప్పించింది. అతని స్థానంలో యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీకి అవకాశం కల్పించింది.అయితే ఐపీఎల్ 2025, 2026 సీజన్లలో సంచలన ప్రదర్శనలతో భారీ అంచనాలు పెంచుకున్న వైభవ్ సూర్యవంశీ కూడా ఇంగ్లండ్ పర్యటనలో ఇప్పటివరకు ఆ స్థాయిలో రాణించలేకపోయాడు. మూడో టీ20లో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో కేవలం 13 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. దీంతో సంజూను తప్పించి వైభవ్‌కు అవకాశం ఇవ్వడంపై అభిమానులు ప్రశ్నలు లేవనెత్తారు.మ్యాచ్ ముగిసిన తర్వాత భారత జట్టు బస్సు వైపు వెళ్తున్న సమయంలో గౌతమ్ గంభీర్, తిలక్ వర్మతో పాటు ఆటగాళ్లు స్టేడియం వెలుపల అభిమానుల నినాదాల మధ్య బయటకు వెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.ఇదిలా ఉంటే, సంజూ శాంసన్‌కు జట్టు తలుపులు పూర్తిగా మూసేయలేదని గౌతమ్ గంభీర్ స్పష్టం చేశాడు. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ, "సంజూ శాంసన్ మళ్లీ జట్టులోకి రాకూడదనే ఎలాంటి నిబంధన లేదు. ప్రతి ఆటగాడు తన స్థానాన్ని తన ప్రదర్శనతో సంపాదించుకోవాలి" అని వ్యాఖ్యానించాడు. -
అందుకే వైభవ్‌ను ఆడిస్తున్నాం: కుండబద్దలు కొట్టిన గంభీర్
విదేశీ గడ్డ మీద భారత టీ20 జట్టు వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. తొలుత ఐర్లాండ్ చేతిలో 2-0తో వైట్‌వాష్ అయిన టీమిండియా.. ఇంగ్లండ్ పర్యటనలోనూ పేలవ ప్రదర్శన కొనసాగిస్తోంది. తాజాగా మూడో టీ20లో మరీ ఘోరంగా ఆతిథ్య జట్టు చేతిలో ఏకంగా 125 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది.ఫలితంగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ 2-0తో ముందంజ వేయగా.. మిగిలిన రెండు మ్యాచ్‌లలో తప్పక గెలవాల్సిన స్థితిలో టీమిండియా నిలిచింది. ఈ నేపథ్యంలో యాజమాన్యం తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.సంజూ గురించి నాకు క్లారిటీ ఉందిముఖ్యంగా సంజూ శాంసన్‌ను తప్పించి.. అతడి స్థానంలో వైభవ్ సూర్యవంశీని ఓపెనర్‌గా ఆడించడాన్ని పలువురు మాజీ క్రికెటర్లు విమర్శిస్తున్నారు. వరల్డ్‌కప్ హీరోనే పక్కనపెట్టడానికి గల కారణం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.ఈ విషయంపై హెడ్‌కోచ్ గౌతం గంభీర్ తాజాగా స్పందించాడు. మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ముందుగా సంజూ గురించి స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా. హెడ్‌కోచ్, ఆటగాడి మధ్య జరిగిన సంభాషణ గురించి బయటకు చెప్పాల్సిన అవసరం లేదు. అది ఎప్పటికీ బయటకు రాదు.సంజూ విషయంలో మాకు పూర్తి స్పష్టత ఉంది. అతడు టీమిండియా కోసం ఏం చేశాడో మాకు తెలుసు. అయితే, కొన్నిసార్లు ఫామ్ విషయంలో ఏ ఆటగాడికైనా ఇబ్బందులు తప్పవు. దానర్థం అతడు ఇక జట్టులోకి తిరిగి రాడని కాదు’’ అని గంభీర్ పేర్కొన్నాడు.కుండబద్దలు కొట్టిన గంభీర్ఇక వైభవ్ సూర్యవంశీ గురించి ప్రస్తావన రాగా.. ‘‘అంతర్జాతీయ క్రికెట్లో ఫలితాలు అత్యంత ముఖ్యమైనవి. అనుకున్న ఫలితం రాబట్టడం కోసమే అత్యుత్తమ తుదిజట్టును ఎంపిక చేసుకుంటాము. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలని నేను భావిస్తాను’’ అని గంభీర్ సమర్థించుకున్నాడు. కొత్త కాంబినేషన్లు ప్రయత్నిస్తున్నామని.. అందుకే వైభవ్ సూర్యవంశీ వంటి ఆటగాళ్లకు అవకాశం ఇస్తు న్నామంటూ కుండబద్దలు కొట్టాడు.అందుకే ఓడిపోతున్నాంఇక విదేశీ గడ్డ మీద పిచ్‌లకు తాము ఇంకా పూర్తిగా అలవాటు పడలేదని.. అందుకే వరుసగా మ్యాచ్‌లు ఓడిపోతున్నామని గంభీర్ జట్టు ఆట తీరును తప్పుబట్టాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్‌లలో కలిపి వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడిపోవడాన్ని బట్టే తమ ఆట తీరు ఎలా ఉందో తెలుస్తోందన్నాడు. కాగా ఇంగ్లండ్- భారత్ మధ్య తొలి టీ20 వర్షం వల్ల రద్దైంది. ప్రస్తుతం ఇంగ్లండ్ 2-0తో ఆధిక్యంలో ఉండగా.. ఇరుజట్ల మధ్య గురువారం నాలుగో టీ20 జరుగనుంది. ఇందుకు బ్రిస్టల్ వేదిక. చదవండి: టీమిండియా ఆట తీరుపై శ్రేయస్ అయ్యర్ ఆగ్రహం -
అతడికి ముందుగా ఏం చెప్పలేదు.. వరల్డ్‌కప్ ప్లాన్‌లో భాగమే!
విదేశీ పర్యటనలో టీమిండియాకు వరుస పరాజయాలు ఎదురవుతున్నాయి. తొలుత ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో 2-0తో క్లీన్‌స్వీప్‌నకు గురైన భారత జట్టు.. ఇంగ్లండ్‌తో సిరీస్‌ను కూడా ఓటమితో మొదలుపెట్టింది. తొలి టీ20 వర్షం వల్ల రద్దు కాగా.. మాంచెస్టర్ వేదికగా రెండో టీ20లో శ్రేయస్ సేన ఓటమి పాలైంది.ఇక ఇరుజట్ల మధ్య మంగళవారం నాటింగ్‌హామ్ వేదికగా మూడో టీ20 జరుగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ మీడియాతో మాట్లాడాడు. ‘‘మేము బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో బాగా మెరుగుపడాల్సి ఉంది.వరల్డ్‌కప్ ప్లాన్‌లో భాగమే!టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత.. మరో వరల్డ్‌కప్ గెలవడమే లక్ష్యంగా రెండేళ్ల కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాము. మేము మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలనే ఆలోచనలో ఉన్నాము. ఇందుకోసం అన్ని విభాగాలూ కలిసి కట్టుగా కృషి చేస్తున్నాయి.గత రెండేళ్లలో మేము ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేదు. అయితే, ఇప్పుడు మూడు మ్యాచ్‌లు ఓడిపోగానే అందరూ మా వైఫల్యాల గురించే మాట్లాడుతున్నారు. ఆటలో గెలుపోటములు సహజం. జట్టులో మార్పులు జరుగుతున్నాయి. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తున్నాం’’ అని సితాన్షు కొటక్ పేర్కొన్నాడు.ముందుగా ఏం చెప్పలేదుఇక వైభవ్ సూర్యవంశీ గురించి మాట్లాడుతూ.. ‘‘టీమిండియాకు ఎంపికైన నాటి నుంచే అతడు అరంగేట్రం కోసం సిద్ధంగా ఉన్నాడు. అంతేగానీ రెండో టీ20కి ముందే అతడిని సిద్ధంగా ఉండమని మాత్రం చెప్పలేదు.అతడి ఆట ఎలా ఉంటుందో మాకు తెలుసు. అతడి ఆలోచనా విధానం, దూకుడు గురించి మాకు అవగాహన ఉంది. అయితే, ఇలా ఆడాలి.. అలా ఆడాలి అని మాత్రం అతడికి మేము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు’’ అని సితాన్షు కొటక్ తెలిపాడు.కాగా ఇంగ్లండ్‌తో రెండో టీ20 సందర్భంగా వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. సంజూ శాంసన్ స్థానంలో అభిషేక్ శర్మకు ఓపెనింగ్ జోడీగా బరిలోకి దిగాడు. కానీ.. కేవలం 14 పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు. మరోవైపు.. వైభవ్‌ను ఆడించేందుకు సంజూను తప్పించడం అన్యాయం అంటూ యాజమాన్యంపై విమర్శలు వచ్చాయి. -
సంజూ శాంసన్‌కు మరో షాక్..?
టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్‌కు మరో షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జింబాబ్వే టూర్‌కు దూరమైన అతను.. ఏషియన్ గేమ్స్ జట్టులోనూ స్థానంలో కోల్పోనున్నట్లు క్రీడా వర్గాలు అంటున్నాయి. గత నెలలో భారత సెలెక్టర్లు 15 మంది సభ్యుల ఏషియన్ గేమ్స్ జట్టును ప్రకటించారు. ఈ జట్టులో సంజూ శాంసన్ కూడా ఉన్నాడు. ప్రస్తుతం ఈ జట్టు నుంచి కూడా సంజూను తప్పించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు సమాచారం.యువ ఆటగాళ్లకు అవకాశాల పేరుతో సంజూ టీ20 కెరీర్‌కు ఫుల్స్టాప్ పెట్టాలని కొందరు బీసీసీఐ పెద్దలు యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ విషయంలో బీసీసీఐపై భారీ ఒత్తిడి ఉందని, అతడికి అవకాశాలు ఇవ్వడం కోసమే సంజూను శాశ్వతంగా తప్పించే ప్లాన్ జరుగుతుందని అతని అభిమానులు అనుకుంటున్నారు.కాగా, ఐర్లాండ్ సిరీస్, ఆతర్వాత ఇంగ్లండ్‌తో జరిగిన తొలి రెండు టీ20ల్లో దారుణంగా విఫలమైన సంజూ శాంసన్‌ను జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేయని విషయం తెలిసిందే. విశ్రాంతి పేరుతో సెలెక్టర్లు అతన్ని తప్పించారన్న ప్రచారం జరుగుతుంది. ఈ సిరీస్‌కు సంజూ స్థానంలో యువ వికెట్‌కీపర్ బ్యాటర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్‌కు అవకాశం కల్పించారు. ప్రస్తుత ఇంగ్లండ్ పర్యటన తర్వాత భారత జట్టు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఏషియన్ గేమ్స్ విషయానికొస్తే.. ఈ ఖండాంతరం క్రీడలు సెప్టెంబర్ 19- అక్టోబర్ 4 మధ్యలో జరుగనున్నాయి.జింబాబ్వే పర్యటనకు భారత జట్టు: శ్రేయస్ అయ్యర్ (సి), వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ (విసి), ఇషాన్ కిషన్ (డబ్ల్యుకె), శివమ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, రింకూ సింగ్, హర్ష్ దూబే, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్, ప్రభ్‌సిమ్రన్ సింగ్ (విసి)ఏషియన్ గేమ్స్‌కు భారత జట్టు: శ్రేయస్ అయ్యర్ (సి), తిలక్ వర్మ, రవి బిష్ణోయ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, జస్ప్రీత్ బుమ్రా, సంజు శాంసన్, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, శివం దూబే, వరుణ్ చక్రవర్తి, వైభవ్ సూర్యవంశీ -
సంజూకు మళ్లీ అన్యాయం..? బీసీసీఐపై ఫ్యాన్స్ ఫైర్!
టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ అంతర్జాతీయ టీ20 కెరీర్ మరోసారి సందిగ్ధంలో పడింది. మొన్న ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20కి తుది జట్టులో కోల్పోయిన సంజాకు ఇప్పుడు మరో భారీ షాక్ తగిలింది. ఈ నెలఖారులో జింబాబ్వేతో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. అయితే ఈ జట్టులో జట్టులో శాంసన్‌కు చోటు దక్కలేదు. అతడి స్ధానంలో పంజాబ్ వికెట్ కీపర్ బ్యాటర్ ప్రభ్సిమ్రాన్ సింగ్‌ను తొలిసారి నేషనల్ టీమ్‌కు ఎంపిక చేశారు. అదేవిధంగా యధావిధిగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని జట్టులో కొనసాగించారు. జింబాబ్వే పర్యటనలో అభిషేక్ శర్మతో కలిసి భారత ఇన్నింగ్స్‌ను వైభవ్ ఆరంభించనున్నాడు.వేటునా? విశ్రాంతా?సాధారణంగా జింబాబ్వే లాంటి పర్యటనలను సీనియర్లకు విశ్రాంతినిచ్చి, యువ ఆటగాళ్లను పరీక్షించేందుకు అవకాశమిస్తారు. కానీ ఈసారి సీనియర్ బ్యాటర్లలో కేవలం సంజూ శాంసన్‌ను మాత్రమే పక్కన పెట్టడం పలు అనుమానాలకు తావనిస్తోంది. అతడిని కావాలనే తప్పించారా? లేదా రెస్ట్ ఇచ్చారా? అన్నది ఇంకా స్పష్టతలేదు.అయితే సంజూ ప్రస్తుతం కేవలం టీ20 ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్, జింబాబ్వే టూర్ల తర్వాత భారత్‌కు పెద్దగా టీ20 సిరీస్‌లు లేవు. మళ్లీ సెప్టెంబర్‌లో ఆసియాకప్ గేమ్స్‌లో టీమిండియా తలపడనుంది. అంటే దాదాపు రెండు నెలల విరామం లభిస్తోంది. అలాంటిప్పుడు కేవలం ఒక్క ఫార్మాట్ ఆడే సంజూకు ‘విశ్రాంతి’ ఇవ్వాల్సిన అవసరం ఏముందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయిసంజూకు రెస్ట్ కాదని, కావాలనే పక్కన పెట్టారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. టీ20 ప్రపంచకప్ హీరో అయిన సంజూకు మరోసారి అన్యాయం జరిగిందని అభిమానులు పోస్ట్‌లు పెడుతున్నారు. కాగా పొట్టి ప్రపంచకప్‌తో పాటు ఐపీఎల్లో దుమ్ములేపిన సంజూ.. యూకే టూర్లో మాత్రం విఫలమయ్యాడు. ఐర్లాండ్ సిరీస్‌లో రెండు మ్యాచ్‌లలోనూ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యాడు. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. దీంతో రెండో టీ20కు అతడిని తప్పించి చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ అవకాశమిచ్చారు. ఇప్పుడు ఏకంగా ప్రధాన జట్టులోనే అతడికి చోటు దక్కకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. కాగా ఆసియా క్రీడలకు ఎంపిక చేసిన జట్టులో మాత్రం సంజూ సభ్యునిగా ఉన్నాడు. -
సంజూపై వేటు.. జట్టులోకి విధ్వంసకర ఓపెనర్
జింబాబ్వేతో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం బీసీసీఐ సోమవారం టీమిండియా జట్టును ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో 15 మందితో కూడిన జట్టులో ఓపెనర్ సంజూ శాంసన్‌కు చోటు దక్కలేదు. అతడి స్థానంలో వైభవ్ సూర్యవంశీకి అవకాశం కల్పించారు. ఇక ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ తరఫున సంచలన ప్రదర్శన కనబరిచిన ఓపెనర్ ప్రబ్‌సిమ్రన్ సింగ్ జట్టులో తొలిసారి చోటు దక్కించుకున్నాడు.ఇక 2026 టీ20 ప్రపంచకప్‌ను టీమిండియా గెలవడంలో సంజూ శాంసన్‌ది కీలకపాత్ర. టోర్నీలో టాప్ స్కోరర్‌గా నిలిచిన సంజూ శాంసన్ ఐర్లాండ్‌తో జరిగిన రెండు టీ20లతో పాటు ఇంగ్లండ్‌తో తొలి టీ20 మ్యాచ్‌లో ఆడినప్పటికీ విఫలమయ్యాడు. దీంతో రెండో టీ20కి శాంసన్‌ను తప్పించి వైభవ్‌కు అవకాశమిచ్చారు. ఇక జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు సంజూ శాంసన్‌ను పూర్తిగా పక్కనబెట్టారు. చిన్న జట్టుతో సిరీస్ కావడంతో శాంసన్‌కు రెస్ట్ ఇచ్చి ఉంటారని కొంతమంది అభిమానులు భావిస్తున్నారు. ఇక జాతీయ జట్టుకు తొలిసారి ఎంపికైన ప్రబ్‌సిమ్రన్ ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ తరఫున 168.87 స్ట్రైక్‌రేట్‌తో 510 పరుగులు సాధించాడు. ఇతర మార్పుల విషయానికొస్తే రింకూ సింగ్, మయాంక్ యాదవ్ తిరిగి రీఎంట్రీ ఇవ్వగా.. హర్ష్‌దూబే, యష్ ఠాకూర్, గుజరాత్ టైటాన్స్ స్టార్ అశోక్ శర్మకు పిలుపొచ్చింది.జింబాబ్వే పర్యటనకు భారత జట్టుశ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, రింకూ సింగ్, హర్ష్ దూబే, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్, ప్రబ్‌సిమ్రన్ (వికెట్ కీపర్).జింబాబ్వే పర్యటనలో టీమిండియా షెడ్యూల్:తొలి టీ20: జూలై 23, హరారే (సమయం: సాయంత్రం 4.30 గంటల నుంచి)రెండో టీ20: జూలై 25, హరారే (సమయం: సాయంత్రం 4.30 గంటల నుంచి)మూడో టీ20: జూలై 26, హరారే (సమయం: సాయంత్రం 4.30 గంటల నుంచి)Read: టీమిండియాతో మూడో టీ20: ఇంగ్లండ్ తుదిజట్టు ప్రకటన -
గాయమా?.. వేటు వేశారా?.. అదే నిజమైతే: మాజీ క్రికెటర్ ఫైర్
టీమిండియా యాజమాన్యంపై భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఒకవేళ సంజూ శాంసన్‌ను గనుక కావాలని తప్పించి ఉంటే.. అంతకంటే దారుణం మరొకటి ఉండదని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో భారత్ విజేతగా నిలవడంలో సంజూ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.ఈవెంట్ ఆరంభంలో తుదిజట్టులో చోటు సంపాదించుకోలేకపోయిన సంజూ.. ఆ తర్వాత వచ్చి నాకౌట్ మ్యాచ్‌లో దుమ్ములేపాడు. 97*, 89, 89 పరుగులతో రాణించి... ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’గా నిలిచాడు. ఐపీఎల్-2026లోనూ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున సత్తా చాటాడు.అయితే, ఆ తర్వాత ఐర్లాండ్ పర్యటనలో మాత్రం సంజూ దారుణంగా విఫలమయ్యాడు. రెండు మ్యాచ్‌లలో వరుసగా 5, 0 పరుగులు చేశాడు. ఇంగ్లండ్‌తో తొలి టీ20లోనూ ఒక్క పరుగే చేసి అవుటయ్యాడు. అదే సమయంలో వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం గురించి డిమాండ్లు వెల్లువెత్తాయి.ఓవైపు గత మూడు మ్యాచ్‌లలో సంజూ వైఫల్యాలు.. మరోవైపు వైభవ్ విషయంలో ఒత్తిడి.. ఇలాంటి తరుణంలో ఇంగ్లండ్‌తో రెండో టీ20 నుంచి సంజూను తప్పించి.. వైభవ్‌ను అరంగేట్రం చేయించింది యాజమాన్యం. అయితే, సంజూ మాదిరే విఫలమైన వన్‌డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను మాత్రం కొనసాగించింది.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఘాటుగా స్పందించాడు. ‘‘వైభవ్‌ను టీమిండియా జెర్సీలో చూడటం సంతోషంగా అనిపించింది. కానీ సంజూ శాంసన్ సంగతేంటి? అతడిపై వేటు వేశారా? మీరు నాతో జోక్ చేయడం లేదు కదా!నేనైతే ఇది జోక్ కాదనే అనుకుంటున్నా. బహుశా సంజూ గాయపడి ఉంటాడని నా సందేహం. ఇదే నిజమవ్వాలని కోరుకుంటున్నా. అలా కాకుండా అతడిని తప్పించారంటే మాత్రం ఇంతకంటే విచిత్రమైన, దారుణమైన సెలక్షన్ మరొకటి ఉండదు.ఎందుకంటే వైభవ్ సూర్యవంశీని తప్పకుండా తుదిజట్టులో ఆడించాలంటే.. సంజూ మూడో స్థానంలోనైనా సులువుగా బ్యాటింగ్ చేసేవాడు’’ అని సంజయ్ మంజ్రేకర్ ‘ఎక్స్’ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. -
వైభవ్ ‘అరంగేట్రం’పై విమర్శలు.. స్పందించిన బీసీసీఐ
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఎట్టకేలకు అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇంగ్లండ్‌తో రెండో టీ20 సందర్భంగా ఈ బిహారీ పిల్లాడు టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. తద్వారా భారత క్రికెట్ చరిత్రలో అత్యంత పిన్న వయసులో అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు.సంజూ స్థానంలో...కేవలం పదిహేనేళ్ల 99 రోజుల వయసులో వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) ఈ ఘనత సాధించాడు. గత మూడు మ్యాచ్‌లలో విఫలమైన ఓపెనింగ్ బ్యాటర్ సంజూ శాంసన్ స్థానంలో వైభవ్ తుదిజట్టులోకి వచ్చాడు. అభిషేక్ శర్మతో కలిసి భారత ఇన్నింగ్స్ ఆరంభించిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్ పది బంతులు ఎదుర్కొని రెండు సిక్సర్ల సాయంతో 14 పరుగులు చేసి నిష్క్రమించాడు.అయితే, వైభవ్‌ను ఐర్లాండ్ పర్యటనలోనే అరంగేట్రం చేయాల్సిందంటూ విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. యాజమాన్యం కావాలనే అతడిని వేచి చూసేలా చేస్తోందంటూ పలువురు మాజీ క్రికెటర్లు సైతం విమర్శించారు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించాడు.విమర్శలపై బీసీసీఐ స్పందనవైభవ్ సూర్యవంశీ అరంగేట్రం నేపథ్యంలో ANIతో మాట్లాడుతూ.. ‘‘అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన వైభవ్ సూర్యవంశీకి శుభాభినందనలు. గొప్ప అవకాశం అందుకున్నావు. బీసీసీఐ ఎవరి విషయంలోనూ అన్యాయంగా ప్రవర్తించదు. వివక్ష చూపించదు.అర్హత ఉన్న వాళ్లకు కచ్చితంగా అవకాశం ఇస్తుంది. అయితే, వైభవ్ అరంగేట్రానికి ముందు సోషల్ మీడియాలో ఎంత రచ్చ జరిగిందో తెలిసిందే. అతడికి అవకాశాలు ఇవ్వడం లేదంటూ కొంతమంది గగ్గోలు పెట్టారు. కోచ్, కెప్టెన్‌ను నిందించారు. కానీ అందులో అర్థం లేదు.సరైన సమయం వచ్చినపుడు వైభవ్ తప్పకుండా అరంగేట్రం చేస్తాడని నేను ముందు నుంచే చెప్తున్నాను. అందుకు తగ్గట్లుగా శనివారం అతడు తన తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. గొప్పగా ఆడుతూ భవిష్యత్తును బంగారం చేసుకుంటాడని నమ్ముతున్నాను. వైభవ్ విషయంలో యాజమాన్యం అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. అందుకు వారిని తప్పక ప్రశంసించాల్సిందే’’ అని రాజీవ్ శుక్లా పేర్కొన్నాడు.ఇదిలా ఉంటే.. మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో రెండో టీ20లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది. ఇక ఇరుజట్ల మధ్య తొలి టీ20 వర్షం వల్ల రద్దైన సంగతి తెలిసిందే.చదవండి: వైభవ్ తప్పు చేశాడు: గావస్కర్An incredibly special moment in the #TeamIndia camp today 🥹💙🎥 Presenting T20I cap no. 122, Vaibhav Sooryavanshi 🧢#ENGvIND pic.twitter.com/hvOZdSN3Ow— BCCI (@BCCI) July 4, 2026 -
వైభవ్ కోసం శాంసన్‌పై వేటు.. మైదానంలోనే ఓదార్చిన గంభీర్!
జెంటిల్ మ్యాన్ గేమ్ క్రికెట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. ఎన్ని సెంచరీలు చేసినా.. సిక్సర్లు కొట్టినా.. రికార్డులు తిరగరాసినా.. ఒక్క రెండు మ్యాచ్‌లలో విఫలమైతే జట్టులో చోటు కోల్పవాల్సిందే. ఇప్పుడు టీమిండియా స్టార్ వికెట్ కీపర్ సంజూ శాంసన్ విషయంలో అదే జరిగింది.టీ20 ప్రపంచకప్ 2026 టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించి 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలిచిన ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్.. ఇప్పుడు తుది జట్టులో తన స్ధానాన్ని కోల్పోయాడు. ఇటీవల ఐర్లాండ్ సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌లలో నిరాశపరిచిన సంజూ.. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో తొలి టీ20లో కూడా అదే తీరును కనబరిచాడు.దీంతో మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో రెండో టీ20కు సంజూను టీమ్ మేనెజెమెంట్ తుది జట్టు నుంచి తప్పించింది. అతడి స్ధానంలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకు అవకాశమిచ్చారు. సూర్యవంశీ కూడా తనకు లభించిన ఛాన్స్‌ను సద్వినియోగపరుచుకోలేకపోయాడు. 10 బంతుల్లో 14 పరుగులు చేసి వైభవ్ ఔటయ్యాడు.శాంసన్‌ను ఓదార్చిన గంభీర్కాగా ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కకపోవడంతో సంజూ శాంసన్‌ను హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఓదార్చాడు. టాస్ తర్వాత కోచ్ గంభీర్, శాంసన్‌తో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సీఎస్కే వికెట్ కీపర్ బ్యాటర్ భుజంపై గంభీర్ చేయి వేసి ధైర్యం చెబుతూ కనిపించారు.శాంసన్ ఐపీఎల్-2026లోనూ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 14 ఇన్నింగ్స్‌ల్లో రెండు సెంచరీలతో 477 పరుగులు చేశాడు. అయినప్పటికి వరుసగా మూడు మ్యాచ్‌లలో ఫెయిల్ కావడంతో సంజూ బెంచ్‌కే పరిమితమయ్యాడు.Good to see Gautam Gambhir having a chat with Sanju Samson. That's always one thing you need from the management. pic.twitter.com/woihQi2l82— Pitch Perfect (@_pitch__perfect) July 4, 2026 -
‘నిన్ను ఆడించడం కుదరదని అతడికి చెప్పేయండి’
భారత క్రికెట్ వర్గాల్లో ఎక్కడ చూసినా వైభవ్ సూర్యవంశీ గురించే చర్చ. ఈ చిచ్చరపిడుగును వీలైనంత త్వరగా టీమిండియాకు ఆడించాలని మాజీ క్రికెటర్లు, అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. అయితే, యాజమాన్యం మాత్రం వైభవ్‌ను బెంచ్‌కే పరిమితం చేస్తూ వస్తోంది.వాళ్లు విఫలమవుతున్నా..ఐర్లాండ్ పర్యటనలోనే వైభవ్ (Vaibhav Suryavanshi) అరంగేట్రం చేస్తాడని అంతా భావించారు. కానీ రెండు మ్యాచ్‌లలోనూ ఈ లెఫ్టాండర్ బ్యాటర్‌కు మొండిచేయే ఎదురైంది. ఇక ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా తొలి టీ20లోనూ పదిహేనేళ్ల ఈ పిల్లాడిని పక్కనపెట్టేశారు. మరోవైపు.. టాపార్డర్‌లో ఓపెనర్ సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ వరుసగా విఫలమవుతున్నారు.ఇలాంటి తరుణంలో వైభవ్ సూర్యవంశీని ఆడిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అతడిని కావాలనే పక్కనపెడుతున్నారనే విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ పార్థివ్ పటేల్ కీలక వ్యాఖ్యలు చేశాడు.అతడితో జాగ్రత్తగా వ్యవహరించాలిస్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ‘‘ఇంగ్లండ్ సిరీస్‌లో ఏదో ఒక మ్యాచ్‌లో వైభవ్‌కు కచ్చితంగా ఆడే అవకాశం వస్తుందని నేను నమ్ముతున్నాను. అయితే, ప్రస్తుతానికి కోచింగ్ సిబ్బంది అతడికి సరైన రీతిలో కమ్యూనికేట్ చేయాలి. నిరాశ చెందిన బ్యాటర్‌కు.. ‘నువ్వు రేసులోనే ఉన్నావు’ అనే విషయాన్ని తెలియజేయాలి.ఇలా చేయడం ద్వారా అతడిలో సానుకూల దృక్పథం పెరుగుతుంది. ఒకవేళ అతడిని ఆడించడం కుదురలేదంటే.. ఆ నిజాన్ని కూడా నేరుగా అతడితోనే చెప్పాలి. వైభవ్ పదిహేనేళ్ల పిల్లాడు. అతడితో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.తను నిరాశ చెందకుండా చూసుకోవాలి. తుదిజట్టులో స్థానం కోసం ఓపికతో ఎదురుచూడాల్సి ఉంటుందని సానుకూలంగా తెలియజెప్పాలి. అప్పుడే అతడి మనసు కాస్త స్థిమితంగా ఉంటుంది’’ అని పార్థివ్ పటేల్ పేర్కొన్నాడు.ఇప్పుడు వైభవ్‌ను ఆడించడం కుదరదుఅదే విధంగా.. ‘‘సంజూ శాంసన్ ప్రపంచకప్ టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. ఇషాన్ కిషన్ ప్రస్తుతం టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా ఉన్నాడు. అభిషేక్ శర్మ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇలాంటి తరుణంలో కచ్చితంగా వైభవ్‌కు టాపార్డర్‌లో చోటు ఉండదు. ఇదే విషయాన్ని అతడికి అర్థమయ్యేలా చెప్పాలి’’ అని హెడ్‌కోచ్ గౌతం గంభీర్ నేతృత్వంలోని కోచింగ్ సిబ్బందికి పార్థివ్ పటేల్ విజ్ఞప్తి చేశాడు. కాగా భారత్- ఇంగ్లండ్ మధ్య తొలి టీ20 వర్షం వల్ల రద్దు కాగా.. ఇరుజట్ల మధ్య శనివారం రెండో మ్యాచ్ జరుగనుంది. ఇందుకు మాంచెస్టర్ వేదిక.చదవండి: తుదిజట్టులో దక్కని చోటు.. వైభవ్ పోస్ట్ వైరల్! -
సంజు, ఇషాన్ అవుట్.. వైభవ్ ఎంట్రీ
-
'వైభవ్ సూర్యవంశీ వద్దు.. అతడినే జట్టులో కొనసాగించాలి'
యూకే పర్యటనలో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ పేలవ ఫామ్ కొనసాగుతోంది. ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమైన సంజూ.. ఇప్పుడు ఇంగ్లండ్‌లో అదే తీరును కనబరుస్తున్నాడు. వర్షం కారణంగా రద్దు అయిన తొలి టీ20లో శాంసన్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేశాడు.దీంతో అతడిని పక్కన పెట్టి బెంచ్‌పై ఉన్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అవకాశమివ్వాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సంజూకు మద్దతుగా భారత మాజీ క్రికెటర్ సబా కరీం నిలిచాడు. ఫామ్ కోల్పోయినప్పటికీ శాంసన్‌నే టాప్ ఆర్డర్లో కొనసాగించాలని కరీం అభిప్రాయపడ్డాడు.టీ20 ప్రపంచకప్-2026తో పాటు ఐపీఎల్లో దుమ్ములేపిన ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్.. యూకే గడ్డపై తన మార్క్ చూపించలేకపోతున్నాడు. సంజూ తన చివరి 10 విదేశీ టీ20లలో ఐదుసార్లు డకౌట్, రెండుసార్లు వందకు పైగా స్కోర్లు సాధించాడు. మరో మూడుసార్లుసింగిల్ డిజిట్ స్కోర్లు నమోదు చేశాడు. ఏదేమైనప్పటికి శాంసన్ తన టీ20 కెరీర్లో మాత్రం నిలకడగా రాణించలేకపోతున్నాడనే చెప్పాలి.సంజూ శాంసన్‌ను ప్రస్తుతానికి జట్టు నుంచి తప్పించే సాహసం మేనెజ్మెంట్ చేయకపోవచ్చు. ఎందుకంటే అతడొక అద్భుతమైన ప్లేయర్. సంజూకి ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించే సత్తా ఉంది. అతడు ఐపీఎల్లో కూడా అదరగొట్టాడు. అంతకుముందు టీ20 ప్రపంచకప్‌లో ప్లేయర్ ఆఫ్‌ది టోర్నీగా నిలిచాడు.ఒకట్రెండు మ్యాచ్‌లలో విఫలమైనంత మాత్రాన అతడి విమర్శించడం సరికాదు. సంజూ కూడా ఇదే ఆలోచిస్తూ ఉంటాడు. వైభవ్ ఆడకపోయినప్పటికి సీనియర్ ప్లేయర్లతో డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకోని చాలా విషయాలు నేర్చుకుంటున్నాడు. అతడికి టాలెంట్ ఉన్నప్పటికి ప్రస్తుత పోటీలో అవకాశం ఎదురు చూడక తప్పదు అని సబా కరీం స్టార్ స్పోర్ట్స్ డిబేట్లో పేర్కొన్నాడు. -
సంజూ శాంసన్‌కు భారీ షాక్..! జట్టు నుంచి రిలీజ్?
కేరళ క్రికెట్ లీగ్ (KCL)-2026 సీజన్ ముందు మొత్తం ఆరు ఫ్రాంచైజీలు తాము రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయి. అయితే టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌ను 'కొచ్చి బ్లూ టైగర్స్' ఫ్రాంచైజీ వేలంలోకి విడిచిపెట్టి అందరిని షాక్‌కు గురిచేసింది. గత సీజన్లో కొచ్చి తరపున 6 మ్యాచ్‌లు ఆడిన 186.80 స్ట్రైక్ రేటుతో 368 పరుగులు చేశాడు.అయినప్పటికి అతడిని రిటైన్ చేసుకోలేదు. అతడి అందుబాటుపై స్పష్టత లేకపోవడంతో కొచ్చి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేసీఎల్ మూడో సీజన్ ఆగస్టు 20 నుండి సెప్టెంబర్ 5 వరకు జరగనుంది. ఈ సమయంలో భారత జట్టుకు ఎలాంటి టీ20 మ్యాచ్‌లు లేవు. సంజూ ప్రస్తుతం కేవలం టీ20 ఫార్మాట్ మాత్రమే ఆడుతున్నందున, అతడు కేసీఎల్ వేలంలో పాల్గొనే అవకాశాలు మెండుగా ఉన్నాయి.అంతేకాకుండా గత సీజన్లో శాంసన్‌ను రూ. 26.80 లక్షలకు కొచ్చి కొనుగోలు చేసింది. కొచ్చి తమ వేలం బడ్జెట్ (రూ. 50 లక్షలు)లో సగానికిపైగా సంజూ కోసమే ఖర్చు చేసింది. దీంతో కొచ్చి జట్టు తమ బడ్జెట్లో 50 శాతానికి పైగా మొత్తాన్ని ఆదా చేసినట్లైంది. అతడిని రిలీజ్ చేయడానికి ఇదొక కారణం కూడా కావచ్చు. సంజూతో పాటు కేరళ మాజీ కెప్టెన్ సచిన్ బేబీని కూడా ఫ్రాంచైజీ విడుదల చేసింది.మరో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఢిల్లీ ప్రీమియర్ లీగ్-2026 నుంచి తప్పుకొన్నాడు. శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కారణంగా పంత్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.చదవండి: IND vs SL: విఫలమైన భారత బౌలర్లు.. భారీ స్కోర్ దిశగా శ్రీలంక -
వీళ్ళ కోసమారా! సింహం లాంటి బుద్దోడిని పక్కన పెట్టారు
-
‘వైభవ్ సూర్యవంశీ ఇప్పుడే వద్దు.. అతడికే నా మద్దతు’
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో సత్తా చాటిన టీమిండియా స్టార్ సంజూ శాంసన్.. ఈ మెగా ఈవెంట్ తర్వాత మాత్రం వరుసగా విఫలమవుతున్నాడు. ఐర్లాండ్ పర్యటనలో రెండు మ్యాచ్‌లలో 5, 0 పరుగులతో పూర్తిగా నిరాశపరిచాడు ఈ ఓపెనింగ్ బ్యాటర్.తాజాగా ఇంగ్లండ్ పర్యటనను కూడా సంజూ (Sanju Samson) పేలవ ప్రదర్శనతో ఆరంభించాడు. చెస్టర్ లీ స్ట్రీట్ వేదికగా బుధవారం నాటి మ్యాచ్‌లో ఏడు బంతులు ఎదుర్కొని కేవలం ఒకే ఒక్క పరుగు చేసి నిష్క్రమించాడు.అతడిని తప్పించండిఇలా వరుసగా గత మూడు మ్యాచ్‌లలో సంజూ శాంసన్ విఫలమైన నేపథ్యంలో అతడిని తుదిజట్టు నుంచి తొలగించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. సంజూకు బదులు చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi)ని అభిషేక్ శర్మకు ఓపెనింగ్ జోడీగా పంపాలని పలువురు మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ మాత్రం భిన్నంగా స్పందించాడు. వైభవ్ సూర్యవంశీ విషయంలో తొందరపాటు తగదని.. సంజూ- అభిషేక్‌నే ఓపెనింగ్ జోడీగా కొనసాగించాలని అభిప్రాయపడ్డాడు.సంజూకే నా మద్దతు.. క్రిక్‌బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘సంజూ శాంసన్ మరోసారి విఫలమైన మాట వాస్తవమే. గత మూడు ఇన్నింగ్స్‌లో అతడు దారుణ ప్రదర్శన కనబరిచాడు. దీంతో వైభవ్ సూర్యవంశీకి మద్దతు మరింతగా పెరుగుతోంది. అయితే, నా అభిప్రాయం ప్రకారం.. సంజూ శాంసన్ ఓపెనర్‌గా సరైనోడే.ప్రపంచకప్ టోర్నీలో తీవ్రమైన ఒత్తిడిలోనూ అతడు రాణించి.. జట్టును గెలిపించాడు. చాలా మంది వైభవ్ ఇంకెప్పుడు ఆడతాడంటూ చర్చోపర్చలు చేస్తున్నారు. వారి ఆవేదన, ఆలోచనలను నేను అర్థం చేసుకోగలను. వైభవ్ ఆ హక్కు సంపాదించుకోవాలికానీ నేను ఇప్పటికీ సంజూ శాంసన్‌కే మద్దతు ప్రకటిస్తాను. ప్రపంచకప్ టోర్నీలో అతడు రాణించిన తీరు అద్భుతం. అలా అని నేనేమీ వైభవ్‌కు వ్యతిరేకం కాదు. అయితే, వైభవ్ తుదిజట్టులో చోటు దక్కించుకునే హక్కును సంపాదించుకోవాలి. అంతర్జాతీయ క్రికెట్లోనూ ఈ పిల్లాడు అద్భుతంగా రాణిస్తాడు’’ అని దినేశ్ కార్తిక్ పేర్కొన్నాడు. కాగా ప్రపంచకప్-2026 నాకౌట్ మ్యాచ్‌లలో సంజూ 97*, 89, 89 పరుగులతో దుమ్ములేపాడు. తద్వారా భారత్ చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు అందుకున్నాడు. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్- భారత్ మధ్య తొలి టీ20 వర్షం వల్ల రద్దైపోయింది.చదవండి: IND vs ENG: ఇషాన్ రనౌట్.. తప్పు నీదే! -
భారీ రికార్డులపై కన్నేసిన అభిషేక్ శర్మ
భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ నేటి నుంచి (జులై 1) మొదలుకానుంది. తొలి మ్యాచ్ చెస్టర్ లీ స్ట్రీట్ వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతంది.ఐర్లాండ్ చేతిలో అనూహ్య పరాభవం (0-2తో టీ20 సిరీస్ కోల్పోవడం) తర్వాత భారత్ ఆడుతున్న మొదటి మ్యాచ్ ఇది. ఈ నేపథ్యంలో జట్టు ప్రదర్శన ఎలా ఉండబోతుందోనని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శ్రేయస్ సేన పుంజుకుంటుందా లేక చెత్త ప్రదర్శన కొనసాగిస్తుందా అన్న అంశం భారత క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.ఇదిలా ఉంటే, ఈ సిరీస్‌కు ముందు భారత ఆటగాళ్ల ముందున్న పలు వ్యక్తిగత రికార్డులు సైతం అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. అవేంటో చూద్దాం.రోహిత్ రికార్డుపై కన్నేసిన అభిషేక్ఇంగ్లండ్పై టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఓపెనర్‌గా రోహిత్ శర్మ (12 ఇన్నింగ్స్‌లో 387 పరుగులు) చలామణి అవుతున్నాడు. అయితే ఈ రికార్డుపై ప్రస్తుత టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ కన్నేశాడు. ఈ సిరీస్‌లో అభిషేక్ మరో 100 పరుగులు చేస్తే రోహిత్ రికార్డును బద్దలు కొడతాడు. ప్రస్తుతం అభిషేక్ ఇంగ్లండ్‌పై టీ20ల్లో ఆరు ఇన్నింగ్స్‌ల్లోనే 288 పరుగులు చేశాడు.హార్దిక్ రికార్డుకు ఎసరుఇంగ్లండ్పై టీ20ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాళ్లలో హార్దిక్ పాండ్యా (27 సిక్సర్లు) ముందున్నాడు. ఈ రికార్డుపై కూడా అభిషేక్ కన్నేశాడు. ఇప్పటికే ఆరు ఇన్నింగ్స్‌ల్లో 22 సిక్సర్లు బాదిన అతడు.. ఈ సిరీస్‌లో మరో ఆరు సిక్సర్లు కొడితే హార్దిక్ రికార్డు బద్దలు కొడతాడు.సంజూను ఊరిస్తున్న ధోని రికార్డుఇంగ్లండ్పై టీ20ల్లో ఇప్పటివరకు హాఫ్ సెంచరీలు నమోదు చేసింది ఇద్దరే ఇద్దరు భారత వికెట్కీపర్లు. ధోని, సంజూ ఇంగ్లీష్ టీమ్‌పై తలో హాఫ్ సెంచరీ చేశారు. ప్రస్తుత ఇంగ్లండ్ సిరీస్‌లో శాంసన్ మరో హాఫ్ సెంచరీ చేస్తే ధోనిని వెనక్కునెట్టి ఈ రికార్డు సోలోగా సాధించవచ్చు.వరుణ్‌కు సువర్ణావకాశంఇంగ్లండ్పై టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా హార్దిక్ పాండ్యా (21) చలామణి అవుతున్నాడు. ప్రస్తుత ఇంగ్లండ్ సిరీస్‌లో ఈ రికార్డును సాధించేందుకు వరుణ్ చక్రవర్తికి మంచి అవకాశం ఉంది. వరుణ్ ఇప్పటివరకు ఇంగ్లండ్‌పై 6 ఇన్నింగ్స్‌ల్లో 15 వికెట్లు తీశాడు. ఈ సిరీస్‌లో అతడు మరో 7 వికెట్లు తీస్తే ఇంగ్లండ్‌పై టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా అవతరిస్తాడు. -
IND vs ENG: అతడికే మా మద్దతు.. వైభవ్ ఎదురుచూడాల్సిందే!
ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో 2-0తో క్లీన్‌స్వీప్‌నకు గురైన టీమిండియాపై మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. ప్రత్యర్థిని తక్కువగా అంచనా వేసి.. చెత్త ప్రదర్శనతో మూల్యం చెల్లించారని విమర్శిస్తున్నారు. ప్రపంచ చాంపియన్‌గా ఐరిష్ గడ్డపై అడుగుపెట్టి అతి విశ్వాసంతో కొంపముంచారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.బెంచ్‌కే పరిమితంఇక మరికొందరు.. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని అరంగేట్రం చేయించకపోవడాన్ని కూడా తప్పుబడుతున్నారు. ఈ పిల్లాడిని ఆడిస్తేనైనా ఫలితం వేరేలా ఉండేదేమోనని అభిప్రాయపడుతున్నారు. అయితే, యాజమాన్యం మాత్రం వైభవ్‌ను రెండు మ్యాచ్‌లలోనే బెంచ్‌కే పరిమితం చేసింది.ఐర్లాండ్ చేతిలో వైట్‌వాష్ నేపథ్యంలో ఇంగ్లండ్ పర్యటనలోనైనా వైభవ్ సూర్యవంశీని ఆడిస్తారేమోనన్న చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కాటే ఆ అవకాశం లేదని సంకేతాలు ఇచ్చాడు.సంజూకు మా మద్దతు ఉంటుంది‘‘అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు వైభవ్ సూర్యవంశీ పూర్తి స్థాయిలో సిద్ధంగానే ఉన్నాడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే, సంజూ శాంసన్‌ను తుదిజట్టు నుంచి తప్పించడం కూడా సాధ్యం కాదు.మూడు నెలల క్రితం జట్టు ప్రపంచకప్ గెలవడంలో అతడు కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్‌లోనూ 2026లో సత్తా చాటాడు. ఈ సిరీస్‌లో అతడు విఫలం కావొచ్చు. అయినప్పటికీ మా ఆటగాళ్లకు మేము మద్దతుగానే నిలబడతాము.అతడిలో ఆత్మవిశ్వాసం పెంచేలానే మా చర్యలు ఉంటాయి. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మేము ముందుకు సాగుతాము. అరంగేట్రం చేసేందుకు వైభవ్ ఎంత ఆసక్తిగా ఉన్నాడో.. అతడి ఆటను చూడాలని మేమూ అంతే ఆతురతతో ఎదురుచూస్తున్నాం.వైభవ్ వేచిచూడక తప్పదు!అయితే, అందుకు ఇంకాస్త సమయం ఉంది. మిగతా ఆటగాళ్ల గురించి కూడా మేము ఆలోచించాల్సి ఉంటుంది. అంతమాత్రాన వైభవ్ అంతర్జాతీయ క్రికెట్లో సత్తా చాటలేడని మేము భావిస్తున్నట్లు కానేకాదు’’ అని డష్కాటే పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ పర్యటనలోనూ వైభవ్ అరంగేట్రం చేయకపోవచ్చనే అనుమానాలు బలపడుతున్నాయి.ఇదిలా ఉంటే.. ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో టీమిండియా టాపార్డర్ పూర్తిగా విఫలమైంది. తొలి మ్యాచ్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మ (49) రాణించగా.. మరో ఓపెనర్ సంజూ శాంసన్ (5), వన్‌డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (1) నిరాశపరిచారు.ఇక రెండో టీ20లో సంజూ, అభిషేక్.. ఇద్దరూ గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగి జట్టు కొంపముంచారు. ఇషాన్ కిషన్ (12) అనవసరంగా పరుగుకు వెళ్లి రనౌట్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. తద్వారా సిరీస్‌ను పసికూన ఐర్లాండ్‌కు కోల్పోయింది. భారత క్రికెట్ చరిత్రలోనే ఇదొక మాయని మచ్చగా మిగిలిపోనుంది.చదవండి: IND vs IRE 2nd T20: టీమిండియా తరఫున ఆ ఇద్దరి అరంగేట్రం🔴 NO PLACE FOR VAIBHAV YET! TEAM INDIA BACKS SANJU SAMSON🤯Q🎙️: Coach, How far Vaibhav Suryavanshi from debut?Ryan ten doeschate🎙️: Vaibhav is absolutely ready for international cricket, but we won't rush him. Sanju played a big role in India's T20 World Cup win and had a… pic.twitter.com/4FrYEXD9O2— Sam (@cricsam02) June 29, 2026 -
అభిషేక్, సంజూ వల్ల టీమిండియాకు అప్రతిష్ట
ఐర్లాండ్‌తో జరిగిన నిన్న జరిగిన రెండో టీ20లో భారత జట్టు అత్యంత అవమానకరమైన రికార్డును మూటగట్టుకుంది. ఓపెనర్లు ఇద్దరూ (సంజూ శాంసన్, అభిషేక్ శర్మ) గోల్డెన్ డకౌటై టీమిండియాను అప్రతిష్టపాలు చేశారు. భారత టీ20 చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. గతంలో ఎప్పుడూ ఓపెనర్లిద్దరూ గోల్డెన్ డకౌట్ కాలేదు. మొత్తంగా అంతర్జాతీయ చరిత్రలో ఇలా జరగడం కేవలం నాలుగోసారి మాత్రమే. తొలిసారి ఈ అవాంఛనీయ రికార్డును బంగ్లాదేశ్ మూటగట్టుకుంది. ఆతర్వాత మలేసియా, కామెరూన్ ఈ చెత్త రికార్డును తమ ఖాతాలో వేసుకున్నాయి.మ్యాచ్ విషయానికొస్తే.. టీమిండియాకు పసికూన్ ఐర్లాండ్ చేతిలో ఘోర అవమానం ఎదురైంది. వరుసగా రెండో టీ20లోనూ ఓడిన భారత్.. సిరీస్‌ను సైతం కోల్పోయింది. ఐర్లాండ్‌కు ఏ ఫార్మాట్లో అయినా భారత్‌పై గెలవడం ఇదే మొదటిసారి.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేయగా.. భారత్ లక్ష్యానికి 2 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఓపెనర్లు సంజూ, అభిషేక్ చెత్త ప్రారంభం తర్వాత ఓ మోస్తరుగా నిలదొక్కుకున్న భారత్.. 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ఆఖర్లో హర్షిత్ రాణా బ్యాట్ ఝులిపించడం చూసి భారత్ గట్టెక్కుతుందని అంతా భావించారు. అయితే చివరి ఓవర్ ఐదో బంతికి అతడు ఔట్ కావడంతో భారత్ ఓటమి ఖరారైపోయింది. చివరి బంతికి ప్రిన్స్ యాదవ్ సిక్సర్ బాదినా ఉపయోగం లేకుండా పోయింది. ఈ ఓటమితో భారత్ వరుస సిరీస్ విజయాల యాత్రకు బ్రేక్ పడింది. 16 సిరీస్‌ల తర్వాత భారత్‌కు ఇదే తొలి సిరీస్ ఓటమి. ఈ సిరీస్ విశేషంగా రాణించిన (5 వికెట్లు) ఐర్లాండ్ పేసర్ జై మూండ్రకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, టోర్నీ అవార్డులు లభించాయి. రెండో మ్యాచ్‌లో మూండ్ర 3 వికెట్లు తీసి టీమిండియా ఓటమికి ప్రధాన కారకుడయ్యాడు. ఈ ఓటమితో టీమిండియా కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌పై విమర్శలు వెత్తుతున్నాయి. -
రెండో టీ20 ఆడనున్న వైభవ్.. వేటు పడేది ఎవరిపైనో!
ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా అనూహ్య ఓటమిని చవిచూసింది. బెల్ఫాస్ట్ వేదికగా జరిగిన టీ20 మ్యాచ్‌లో ఐర్లాండ్ 34 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. అయితే టీమిండియా సంచలనం వైభవ్ సూర్యవంశీకి జట్టులో చోటు లభించకపోవడంపై విమర్శలు వచ్చాయి. వైభవ్ నిన్నటి మ్యాచ్‌లో ఉండుంటే పరిస్థితి వేరుగా ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆరంభంలోనే ఫోర్లు, సిక్సర్లు బాది ప్రత్యర్థిపై ఒత్తడి పెట్టే ప్రయత్నం చేసేవాడని కొంతమంది పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం జరగనున్న రెండో టీ20 మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వాలనే డిమాండ్లు కూడా పెరిగిపోతున్నాయి. అయితే వైభవ్‌కు తుదిజట్టులో చోటు దక్కాలంటే ఎవరిని తప్పించాలనేది ఇప్పుడు ప్రశ్నార్థకం. ఒకవేళ వైభవ్ జట్టులోకి వస్తే ఓపెనర్‌గానే ఆడే అవకాశం ఉంటుంది. ఈ లెక్కన వైభవ్ కోసం సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మల్లో ఒకరు తమ స్థానాన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది. ఇక ఈ ఏడాది భారత్ టీ20 ప్రపంచకప్ గెలవడంలో సంజూ శాంసన్‌ది కీలకపాత్ర. టీ20 ప్రపంచకప్‌లో శాంసన్ 321 పరుగులు సాధించి జట్టులో తన స్థానాన్ని పటిష్టం చేసుకున్నాడు. అయితే ఐర్లాండ్‌తో తొలి టీ20లో మాత్రం శాంసన్ విఫలమయ్యాడు. నాలుగు బంతులెదుర్కొన్న శాంసన్ కేవలం ఐదు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అదే సమయంలో మరో ఓపెనర్ అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీతో ఆకట్టుకోవడమే గాక తన స్థానాన్ని మరింత పదిలపరుచుకున్నాడు. మరోవైపు ఇషాన్ కిషన్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నప్పటికీ ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో విఫలమయ్యాడు. ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో ఐదు బంతుల్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. అయితే వైభవ్ సూర్యవంశీ జట్టులోకి రావాలంటే మాత్రం ఇషాన్ కిషన్‌ను తప్పించడమే తొలి మార్గం. ఎందుకంటే అభిషేక్‌తో కలిసి వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్ వస్తే, సంజూ శాంసన్ వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు రానున్నాడు. అంతేకాదు శాంసన్ మూడో స్థానంలో మంచి బ్యాటింగ్ రికార్డు ఉంది. ఐపీఎల్లో మూడో స్థానంలో 94 మ్యాచ్‌ల్లో 143 స్ట్రైక్‌రేట్‌తో 3,096 పరుగులు సాధించాడు. శాంసన్‌తో పాటు ఇషాన్ కిషన్‌ను జట్టులో ఉంచాలనుకుంటే ఆఖరి ఆప్షన్ మాత్రం తిలక్ వర్మే. అయితే తిలక్ వర్మ ఎక్కువగా మిడిలార్డర్లో బ్యాటింగ్‌కు వస్తున్నాడు. నాలుగు లేదా ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తూ ఫినిషర్‌గా రాణిస్తున్నాడు. ఆసియా కప్ 2025 ఫైనల్లో 69 పరుగుల కీలక ఇన్నింగ్స్‌తో మెరిశాడు. అయితే టీ20 ప్రపంచకప్‌లో 9 ఇన్నింగ్స్‌ల్లో తిలక్ వర్మ 209 పరుగులు సాధించిన తిలక్ వర్మ స్ట్రైక్ రొటేట్ చేయడంలో ఇబ్బంది పడ్డాడు. అయితే ఇన్ని బేరీజులు వేసుకున్నప్పటికీ వైభవ్ సూర్యవంశీ ఐర్లాండ్‌తో రెండో టీ20లో మాత్రం ఆడే అవకాశాలు తక్కువే అని చెప్పొచ్చు.Read: టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డు -
సంజుకు షాక్ ఇచ్చిన BCCI.. ఇంగ్లాండ్ పర్యటనకు భారత జట్టు ప్రకటన
-
ODI WC: టీమిండియాకు 3 ఆప్షన్లు.. అతడే బెస్ట్!
సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియాలో పునరాగమనం చేసిన ఇషాన్ కిషన్ అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నాడు. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో ఓపెనర్‌గా, వన్‌డౌన్ బ్యాటర్‌గా సత్తా చాటిన ఈ జార్ఖండ్ డైనమైట్.. ఐపీఎల్-2026లోనూ పరుగుల వరద పారించాడు.వన్డేలలోనూ రీఎంట్రీసన్రైజర్స్ హైదరాబాద్ తరఫున పదిహేను మ్యాచ్‌లలో కలిపి 602 పరుగులు సాధించాడు. ఈ మేరకు టీ20లలో సత్తా చాటిన ఇషాన్ కిషన్ (Ishan Kishan) వన్డేలలోనూ రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత జట్టుకు దూరమైన ఇషాన్.. అఫ్గనిస్తాన్ స్వదేశంలో జూన్ 13 నుంచి మొదలుకానున్న సిరీస్‌కు ఎంపికయ్యాడు.సీనియర్ కేఎల్ రాహుల్‌తో కలిసి వికెట్ కీపర్ కోటాలో ఇషాన్ కిషన్‌కు చోటు దక్కింది. వన్డే వరల్డ్‌కప్-2027 టోర్నీకి జట్టును సన్నద్ధం చేసే క్రమంలో ఇషాన్‌కు యాజమాన్యం ఈ మేరకు ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం.మూడో వికెట్ కీపర్‌గా..ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాహుల్, ఇషాన్‌లతో పాటు భారత్ మూడో వికెట్ కీపర్‌ను కూడా ఇప్పటి నుంచే సన్నద్ధం చేయాలని సూచించాడు. సంజూ శాంసన్‌ను బ్యాకప్ కీపర్‌గా ఎంపిక చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.ఈ మేరకు స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘వరల్డ్‌కప్ టోర్నీ నేపథ్యంలో నంబర్ వన్ వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్‌కు ప్రాధాన్యం ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అతడు మిడిలార్డర్లో బ్యాటింగ్ చేయగలడు. విలక్షణమైన ఆటగాడు.అతడి వన్డే రికార్డు గొప్పగా ఉందిఇక ఇషాన్ కిషన్ సైతం ఓపెనర్‌గా రాణించగలడు. వన్‌డౌన్‌లోనూ ఆడగలడు. అందుకే వారిద్దరికి సెలక్టర్లు ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే, సంజూ శాంసన్ వన్డే రికార్డు కూడా గొప్పగా ఉంది. అవకాశం వచ్చినప్పుడల్లా అతడు రాణించాడు.ఒత్తిడిలోనూ రాణించగల పరిణతి సాధించాడు. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. కాబట్టి సంజూను కూడా సెలక్టర్లు దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది’’ అని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు. కాగా సంజూ ఇప్పటి వరకు 14 వన్డేలు ఆడి 510 పరుగులు సాధించాడు. చివరగా 2023 డిసెంబరులో టీమిండియా తరఫున వన్డే ఆడాడు.చదవండి: అతడికి అన్యాయం.. ఎక్కువ అవకాశాలు ఇవ్వలేదు: గంభీర్ -
టీ20 కొత్త కెప్టెన్‌గా అతడికే ఓటేసిన అగార్కర్!
టీమిండియా టీ20 కెప్టెన్ మార్పు అంశంపై భారత క్రికెట్ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. భారత్‌కు ఈ ఏడాది ప్రపంచకప్ టైటిల్ అందించినప్పటికీ సూర్యకుమార్ యాదవ్‌పై వేటు వేసేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సిద్ధమైనట్లు తెలుస్తోంది.ఆ రెండు కారణాల వల్ల..ఒకప్పుడు ప్రపంచ నంబర్‌వన్ బ్యాటర్‌గా ఉన్న సూర్య.. సారథిగా పగ్గాలు చేపట్టిన తర్వాత ఆటగాడిగా తేలిపోవడమే ఇందుకు కారణం. అంతేగాక టీ20 ప్రపంచకప్-2028 టోర్నీకి జట్టును సన్నద్ధం చేసే క్రమంలో 35 ఏళ్ల సూర్య వయసు కూడా ఓ అడ్డంకిగా మారిందనే అభిప్రాయాలు ఉన్నాయి.పరిశీలనలో మూడు పేర్లుఈ పరిణామాల నేపథ్యంలో బీసీసీఐ కొత్త కెప్టెన్ విషయంలో తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లు బోర్డు సన్నిహిత వర్గాలు తెలిపాయి. వరల్డ్‌కప్ వీరుడు సంజూ శాంసన్, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్‌ల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ఇటీవల వెల్లడించాయి.అయితే, తాజా సమాచారం ప్రకారం.. సంజూ, అక్షర్‌లను కాదని శ్రేయస్ అయ్యర్‌కే సెలక్షన్ కమిటీ ఓటేసినట్లు సమాచారం. ఇందులో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌దే ప్రధాన పాత్ర అని తెలుస్తోంది. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’తో మాట్లాడుతూ..అతడికే ఓటేసిన అగార్కర్‘‘అజిత్ దృఢచిత్తం గల చీఫ్ సెలక్టర్. స్ట్రాంగెస్ట్ చీఫ్ సెలక్టర్లలో అతడు ముందు వరుసలో ఉంటాడు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే అతడు ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకున్నాడు.తన ప్యానెల్‌తో కలిసి కొత్త టీ20 కెప్టెన్ కోసం అగార్కర్ తీవ్రంగా కసరత్తు చేస్తున్నాడు. ఇందులో భాగంగానే శ్రేయస్ అయ్యర్‌ను తొలుత వన్డేలకు వైస్ కెప్టెన్‌గా నియమించారు. టీ20 ప్రపంచకప్-2026 ఆరంభానికి ముందే శ్రేయస్ విషయంలో ఒక నిర్ణయమైతే జరిగిపోయింది’’ అని పేర్కొన్నాయి.గంభీర్ విముఖత!అయితే, హెడ్‌కోచ్ గౌతం గంభీర్ మాత్రం శ్రేయస్ అయ్యర్ విషయంలో అగార్కర్‌తో ఏకీభవించడం లేదని సమాచారం. ‘‘గంభీర్ మనసులో ఒకరు ఉండొచ్చు. సెలక్టర్లు వేరొకరి గురించి ఆలోచించవచ్చు. అయితే, అక్షర్ పటేల్ వరల్డ్‌కప్ టోర్నీలో వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన విషయాన్ని మర్చిపోవద్దు.రేసులో ఇషాన్ కూడా!ఇక ఇషాన్ కిషన్.. అతడి వయసు చిన్నదే. ఫామ్‌లో ఉన్నాడు. సారథిగానూ నిరూపించుకుంటున్నాడు. ఇదిలా ఉంటే.. సంజూ శాంసన్ విషయంలో మాత్రం సెలక్టర్లు సంతృప్తిగా లేరు. అతడి నిలకడలేని ఆట తీరే ఇందుకు కారణం.కాబట్టి శ్రేయస్ అయ్యర్‌తో పాటు ఇషాన్, అక్షర్ కూడా రేసులో ఉన్నారని చెప్పవచ్చు. కానీ సంజూకు మాత్రం అవకాశం ఉండకపోవచ్చు’’ అని బీసీసీఐ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఏదేమైనా ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటన తర్వాత కొత్త టీ20 కెప్టెన్ గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.చదవండి: వైభవ్‌తో కోహ్లి చెప్పిన మాటలు ఇవే! -
Asian Games: వైభవ్‌కు చోటు.. భారత జట్టు ఇదే!
ఆసియా క్రీడల అరంగేట్రంలోనే చాంపియన్‌గా నిలిచిన టీమిండియా.. ఈసారీ అదే ఫలితం పునరావృతం చేయాలని పట్టుదలగా ఉంది. ఇప్పటికే ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ రూపంలో ఐసీసీ టైటిల్ గెలిచిన భారత్.. ఆసియా క్రీడలు-2026 ఎడిషన్‌లో ఫేవరెట్‌గా బరిలో దిగనుంది.ఈ నేపథ్యంలో ఇప్పటికే ముప్పై మందితో కూడిన ప్రాబబుల్స్ జాబితాను బీసీసీఐ భారత ఒలింపిక్ సంఘానికి అందజేసింది. ఇందులో రాజస్తాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీకి కూడా చోటు దక్కింది.ఓపెనర్ల విభాగంలో పోటీఓపెనర్ల విభాగంలో సీనియర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్ల నుంచి వైభవ్ సూర్యవంశీకి గట్టి పోటీ ఉంది. అయితే, రాయల్స్‌లో తన సహచర ఆటగాడు జైసూ కంటే వైభవ్ ఈసారి గొప్పగా ఆడిన సంగతి తెలిసిందే.ఐపీఎల్-2026లో వైభవ్ 776 పరుగులతో సత్తా చాటగా.. జైస్వాల్ 427 పరుగులకే పరిమితమయ్యాడు. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్, టీ20 ప్రపంచకప్ విజేత అభిషేక్ శర్మ 563 పరుగులతో రాణించగా.. భారత్ వరల్డ్‌కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన సంజూ శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 477 పరుగులు సాధించాడు.ఇషాన్‌కు చోటు లేదు!ఇక ఇషాన్ కూడా సన్‌రైజర్స్ తరఫున 602 పరుగులతో దుమ్ములేపాడు. ఓవరాల్‌గా ఓపెనర్ల విభాగంలో అభిషేక్, ఇషాన్ సత్తా చాటగా.. అందరికంటే వైభవ్ అత్యధిక పరుగులతో ముందు వరుసలో ఉన్నాడు. అభిషేక్‌కు జోడీగా వైభవ్‌ను ఆడిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఆల్‌రౌండర్లు, బౌలర్లు వీరేఇక సంజూను వన్‌డౌన్‌లో పంపినా.. మరో వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్, తిలక్ వర్మ, రింకూ సింగ్ బ్యాటర్ల విభాగంలో సెట్ అయిపోతారు. ఇక ఆల్‌రౌండర్ల జాబితాలో నితీశ్ కుమార్ రెడ్డి, శివం దూబే, హర్ష్ దూబేలను ఎంపిక చేసే అవకాశం ఉంది.బౌలర్ల విషయానికొస్తే.. పేస్ దళంలో అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, యశ్ ఠాకూర్.. స్పిన్ విభాగంలో వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయిలకు అవకాశం ఉండొచ్చు. కాగా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు ఈసారి కూడా విశ్రాంతినివ్వడం ఖాయంగానే కనిపిస్తోంది.పసిడి పతకాలతో సత్తా చాటిన భారత జట్లుకాగా 2022లో తొలిసారిగా బీసీసీఐ సీనియర్ పురుషుల, మహిళల క్రికెట్ జట్టును ఆసియా క్రీడలకు పంపింది. టీ20 ఫార్మాట్లో రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో ద్వితీయ శ్రేణి జట్టు పసిడి పతకం సాధించగా.. హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో మహిళా జట్టు స్వర్ణం గెలుచుకుంది.అయితే, ఈసారి ప్రధాన టీ20 జట్టులోని సభ్యులను కూడా ఎంపిక చేయాలని బీసీసీఐ భావిస్తోంది. కాగా జపాన్‌లోని ఐచీ- నగోయాలో సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు 3 వరకు ఆసియా క్రీడలు-2026 ఎడిషన్ నిర్వహించనున్నారు. ఇక గత పర్యాయం చైనా ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే.ఆసియా క్రీడలు-2026: భారత అత్యుత్తమ టీ20 జట్టు ఇదేఅభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్, ధ్రువ్ జురెల్, తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, శివం దూబే, రింకూ సింగ్, హర్ష్ దూబే, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయి, ప్రసిద్ కృష్ణ, యశ్ ఠాకూర్, వరుణ్ చక్రవర్తి.ప్రాబబుల్స్ జాబితాయశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, తిలక్ వర్మ, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, ప్రసిధ్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి, అనుకూల్ రాయ్, ఆయుశ్ బదోని, హర్ష్ దూబే, ధ్రువ్ జురేల్, ఖలీల్ అహ్మద్, రుతురాజ్ గైక్వాడ్, రవి బిష్ణోయ్, షహబాజ్, శివమ్ దూబే, విప్రాజ్ నిగమ్, హర్షిత్ రాణా, యశ్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్. చదవండి: ‘అతడు 3 ఓవర్లు వేస్తే ఆర్సీబీ ఖేల్ ఖతం’ -
కెప్టెన్ రేసు.. ఆ ముగ్గురిని సెలక్ట్ చేసిన బీసీసీఐ?!
సారథిగా టీమిండియాకు ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ అందించిన సూర్యకుమార్ యాదవ్ అంతర్జాతీయ కెరీర్ దాదాపుగా ముగిసినట్లే కనిపిస్తోంది. బ్యాటర్‌గా పేలవ ఫామ్, వయసురీత్యా అతడిని మున్ముందు టీ20 ఫార్మాట్లో పరిశీలించే అవకాశం లేదని సెలక్టర్లు పరోక్షంగా చెప్పేశారు. ఈ ఏడాది జరిగే ఆసియా క్రీడల కోసం 30 మందితో కూడిన ప్రాబబుల్స్ జాబితాను భారత ఒలింపిక్ సంఘానికి (IOA)కు.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అందజేసింది. ఇందులో 35 ఏళ్ల సూర్యకుమార్ పేరు లేకపోవడమే ఇందుకు నిదర్శనం.ఆ సమావేశంలోనే నిర్ణయం!ఈ నేపథ్యంలో టీమిండియా టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) వారసుడు ఎవరన్న అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. అఫ్గనిస్తాన్‌తో సిరీస్ ఆరంభానికి ముందు బీసీసీఐ సెలక్టర్లు సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.ఆ మీటింగ్‌లోనే ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు పంపే జట్ల గురించి చర్చించనున్నట్లు.. అదే విధంగా టీ20 కొత్త కెప్టెన్ గురించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు మాట్లాడుతూ..ఆ ముగ్గురిలో ఒకరికి అవకాశం!‘‘సూర్యను సారథిగా తొలగించే ముందే కొత్త కెప్టెన్ ఎవరన్న అంశంపై సెలక్టర్లు సుదీర్ఘంగా చర్చించనున్నారు. శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్ ఈ రేసులో ముందున్నారు. వరల్డ్‌కప్ టోర్నీలో వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన అక్షర్ పటేల్ పేరును కూడా సెలక్టర్లు పరిశీలిస్తున్నారు.అయితే, ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల రూపంలో సూర్యకు మరో అవకాశం ఇచ్చేందుకు సెలక్టర్లు సిద్ధంగానే ఉన్నారు. అతడు బ్యాటర్‌గా ఫామ్‌లోకి వస్తే అంతా బాగానే ఉంటుంది. లేదంటే మున్ముందు జట్టులో చోటు కష్టమే.నిజానికి మేనేజ్మెంట్ ప్రస్తుతం వన్డే వరల్డ్‌కప్-2027 సన్నాహకాల్లో ఉంది. అందుకే టీ20 ఫార్మాట్లో జరిగే ఆసియా క్రీడలకు ఎంపిక చేసే జట్టులో కొత్త ఆటగాళ్లకు చోటు ఇవ్వాలని భావించింది.సెప్టెంబరు 19 నుంచిఅయితే, ఒకవేళ భారత ప్రభుత్వం పూర్తిస్థాయి జట్టును ఆసియా క్రీడలకు పంపాలని ఆదేశిస్తే బీసీసీఐ అందుకు తగినట్లుగానే నిర్ణయం తీసుకుంటుంది’’ అని పేర్కొన్నాయి. కాగా ఈ ఏడాది సెప్టెంబరు 19 నుంచి అక్టోబర్ 4 వరకు ఆసియా క్రీడల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.అదే సమయంలో స్వదేశంలో వెస్టిండీస్‌తో టీమిండియా వన్డే సిరీస్ ఆడుతుంది. ఈ నేపథ్యంలో వీటి కోసం రెండు వేర్వేరు జట్లను ఎంచుకునేందుకు వీలుగా 30 మందితో పెద్ద జాబితాను బోర్డు ప్రకటించింది. వన్డే కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ జట్టును నడిపిస్తాడు కాబట్టి ఆసియా క్రీడల కోసం అతడి పేరును పరిశీలించలేదు.ఇక ప్రాబబుల్స్‌లోనే అయినా తొలిసారి భారత సీనియర్ టీమ్ బృందంలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం విశేషం. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2026 ముగిసిన తర్వాత జూన్ 6 నుంచి టీమిండియా స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడనుంది. ఆసియా క్రీడల ప్రాబబుల్స్ జాబితా: యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, తిలక్ వర్మ, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, ప్రసిధ్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి, అనుకూల్ రాయ్, ఆయుశ్ బదోని, హర్ష్ దూబే, ధ్రువ్ జురేల్, ఖలీల్ అహ్మద్, రుతురాజ్ గైక్వాడ్, రవి బిష్ణోయ్, షహబాజ్, శివమ్ దూబే, విప్రాజ్ నిగమ్, హర్షిత్ రాణా, యశ్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్. చదవండి: అది సెలక్టర్ల పని: సచిన్ -
IPL 2027: సీఎస్కేలోకి ఊహించని ఆటగాడు!
ఐపీఎల్లో గత రెండేళ్లుగా చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) చెత్త ప్రదర్శన కొనసాగుతోంది. ఈ మాజీ చాంపియన్ 2025లో అత్యంత దారుణ ప్రదర్శనతో కేవలం నాలుగు మ్యాచ్‌లు గెలిచి.. పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది.ఈ నేపథ్యంలో 2026 వేలానికి ముందు సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను రాజస్తాన్ రాయల్స్‌కు ట్రేడ్ చేసిన చెన్నై.. అతడికి బదులు రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌ను తీసుకుంది. టీ20 ప్రపంచకప్-2026 ట్రోఫీని భారత్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన సంజూ.. చెన్నై తరఫున ఆరంభంలో విఫలమయ్యాడు.సంజూ ధనాధన్అయితే, అనూహ్య రీతిలో పుంజుకుని రెండు శతకాల సాయంతో 14 మ్యాచ్‌లలో కలిపి 477 పరుగులు సాధించాడు సంజూ. తద్వారా సీఎస్కే తరఫున టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. కానీ.. జట్టు మాత్రం పేలవ ప్రదర్శనతో పద్నాలుగింట ఆరు మాత్రమే గెలిచి ఎనిమిదో స్థానంతో ముగించింది.భారీ మార్పులకు ఆస్కారంఈ నేపథ్యంలో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీపై విమర్శలు వస్తున్నాయి. ఆటగాడిగానూ అతడు విఫలం కావడంతో వేటు వేస్తారా అనే సందేహాలు నెలకొన్నాయి. అదే విధంగా జట్టులో భారీ మార్పులకు ఆస్కారం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఇలాంటి తరుణంలో సీఎస్కే మాజీ ఆటగాడు, భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సీఎస్కేలోకి వస్తాడనే అర్థంలో పోస్టు పెట్టాడు.కాగా హార్దిక్ కెప్టెన్సీలో ముంబై ఈ ఏడాది చెత్త ప్రదర్శన కనబరిచింది. పద్నాలుగింట నాలుగే గెలిచి తొమ్మిదో స్థానంలో ముగించింది. ఇక నాలుగు మ్యాచ్‌లకు హార్దిక్ దూరం కాగా.. యాజమాన్యంతో విభేదాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నాడనే వార్తలు వచ్చాయి.07:07 కథేంటి?ఈ నేపథ్యంలో ఇటీవల హార్దిక్ ఇన్‌స్టాలో ఓ స్టోరీ షేర్ చేశాడు. ఇందులో.. ‘07:07’ అని తన ఫోన్లో టైమ్ చూపిస్తున్న ఫొటో పంచుకున్నాడు. దీంతో చెన్నై లెజెండ్ ధోని (జెర్సీ నంబర్)ని ఉద్దేశించే ఈ పోస్టు పెట్టాడని నెట్టింట చర్చ జరిగింది.అశూ ఏమన్నాడు?ఈ క్రమంలో ఓ నెటిజన్.. వచ్చే సీజన్లో చెన్నై జట్టులో మార్పుల గురించి అశూని అడుగగా.. ‘‘పతిరణ, 07:07, స్టోక్స్, దూబే, 07:07 మిడిలార్డర్/ఫినిషింగ్, ఓవర్టన్, స్టోక్స్ బ్యాలెన్స్’’ అని సమాధానం ఇచ్చాడు. దీంతో హార్దిక్ గురించే అశూ చెప్పాడనే చర్చ నడుస్తోంది. కాగా పతిరణను గతేడాది సీఎస్కే రిలీజ్ చేయగా.. కోల్‌కతా కొనుక్కుంది. కానీ గాయం వల్ల అతడు ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు. దీంతో కోల్‌కతా అతడిని రిలీజ్ చేయనుందనే వార్తలు రాగా.. పతిరణ తిరిగి మళ్లీ సీఎస్కేలోకే వస్తాడనే ప్రచారం ఊపందుకుంది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్లో చెరో ఐదుసార్లు ముంబై, చెన్నై చాంపియన్లుగా నిలిచాయి. ఈ రెండు జట్లను అభిమానులు చిరకాల ప్రత్యర్థులుగా పరిగణిస్తారు. అలాంటిది ఊహించని రీతిలో హార్దిక్ ముంబైని వీడి ఐపీఎల్-2027 సందర్భంగా చెన్నైలో చేరతాడనే ప్రచారం ఆసక్తికరంగా మారింది.Pathirana, 07:07 & Stokes !Opening✅Dube & 07:07 MiddleOrder/Finishing✅Overton & Stokes Balance✅ https://t.co/kSALlKQDCp— Ashwin 🇮🇳 (@ashwinravi99) May 26, 2026 -
సూర్యపై వేటు తగదు.. కెప్టెన్లుగా ఆ నలుగురు సరైనోళ్లు!
భారత టీ20 జట్టుకు త్వరలోనే కొత్త కెప్టెన్ రానున్నాడని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇంగ్లండ్ పర్యటన తర్వాత యాజమాన్యం ఈ విషయమై నిర్ణయం తీసుకుంటుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వర్గాలు ఇటీవల వెల్లడించడం ఇందుకు కారణం.వేటు తప్పదనే సంకేతాలుటీమిండియాకు 2026లో కెప్టెన్‌గా టీ20 ప్రపంచకప్ అందించినప్పటికీ.. ఆటగాడిగా మాత్రం తేలిపోయాడు సూర్యకుమార్ యాదవ్. సారథిగా పగ్గాలు చేపట్టిన తర్వాత అతడి బ్యాటింగ్‌లో పస లేకుండా పోయింది. ఇక ఐపీఎల్-2026లోనూ ఈ ముంబై ఇండియన్స్ బ్యాటర్ 13 ఇన్నింగ్స్‌లో కలిపి 270 పరుగులే చేయగలిగాడు.ఈ నేపథ్యంలో సూర్యపై వేటు పడటం దాదాపుగా ఖాయమవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి తరుణంలో టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్ఎస్కే ప్రసాద్ మాత్రం భిన్నంగా స్పందించాడు. క్రిక్‌బజ్‌కు రాసిన కాలమ్‌లో..అత్యంత విలువైన ఆటగాడు‘‘ఆధునిక టీ20 క్రికెట్లో కేవలం టెక్నిక్ ద్వారానే మ్యాచ్‌లు గెలవలేము. భయం లేకుండా వినూత్న షాట్లు కొట్టడం, కొన్ని ఓవర్లలోనే మ్యాచ్‌ను మలుపు తిప్పగల సత్తా ఉండటం అత్యంత ముఖ్యం. ఆ లక్షణాలన్నీ సూర్యకుమార్లో ఉన్నాయి.అందుకే భారత టీ20 క్రికెట్లో ఇప్పటికీ అతడు అత్యంత విలువైన ఆటగాడే. అతడి ఫామ్ గురించి ఆందోళనలు ఉన్న మాట వాస్తవమే. అయితే, భారత టీ20 జట్టు నుంచి సూర్యను తొలగిస్తే మాత్రం అంతకంటే పెద్ద తప్పు మరొకటి ఉండదు.భవిష్య కెప్టెన్లుగా ఆ నలుగురు సరైనోళ్లు!ఇప్పటికీ టీమిండియాలో విభిన్న, అత్యంత ప్రత్యేకమైన బ్యాటర్ సూర్యనే. 360 డిగ్రీస్‌లో షాట్లు ఆడగల అతి కొద్దిమంది బ్యాటర్లలో అతడు ఒకడు. ఒక్కసారి క్రీజులో కుదురుకుంటే అతడిని ఆపడం కష్టం’’ అని ఎమ్ఎస్కే ప్రసాద్ పేర్కొన్నాడు.ఇక సూర్యను ఆటగాడిగా కొనసాగించాలన్న ఎమ్ఎస్కే ప్రసాద్.. శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్‌లలో ఒకరిని తదుపరి కెప్టెన్‌గా తీర్చిదిద్దవచ్చని అభిప్రాయపడ్డాడు. కాగా వరల్డ్‌కప్-2026 తర్వాత 2028 ప్రపంచకప్ ఆడటమే తన లక్ష్యమని 35 ఏళ్ల సూర్య తెలిపిన సంగతి తెలిసిందే.చదవండి: కోహ్లికి షాక్.. వైభవ్‌కు చోటు! -
సంజూతో గొడవపడ్డ క్లాసెన్!.. చర్యలు తప్పవా?
మాజీ చాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్-2026 ‘ప్లే ఆఫ్స్’లో అడుగుపెట్టింది. చెపాక్ వేదికగా సోమవారం జరిగిన పోరులో 5 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి.. టాప్-4 బెర్తును ఖరారు చేసుకుంది. అంతేకాదు తమతో పాటు గుజరాత్ టైటాన్స్‌ను కూడా ‘ప్లే ఆఫ్స్’కు చేర్చింది.ఇక ఈ సీజన్లో ముందుగా డిఫెండింగ్ చాంపియన్ ఆర్సీబీ ముందుగా బెర్తు ఖాయం చేసుకోగా.. ఇప్పుడు మిగిలిన మరో స్థానం కోసం పంజాబ్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్, చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ జట్లు రేసులో ఉన్నాయి. సహనం కోల్పోయిన క్లాసెన్ఇదిలా ఉంటే.. చెన్నైతో మ్యాచ్ సందర్భంగా సన్‌రైజర్స్ పవర్ హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్ సహనం కోల్పోయాడు. మెరుపు వేగంతో తనను స్టంపౌట్ చేసిన చెన్నై వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌ను అసభ్యంగా దూషించాడు.Sanju Samson ಕಡೆಯಿಂದ Dhoni-level stumping! 🔥🤯ವೀಕ್ಷಿಸಿ | Race to Playoffs 👉 #CSKvsSRH | LIVE NOW | ನಿಮ್ಮ Star Sports ಕನ್ನಡ & JioHotstar ನಲ್ಲಿ. #TATAIPL pic.twitter.com/v9uADWD2YG— Star Sports Kannada (@StarSportsKan) May 18, 2026180 పరుగులుసొంతమైదానంలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. డెవాల్డ్ బ్రెవిస్ (27 బంతుల్లో 44; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), కార్తీక్ శర్మ (19 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. సన్‌రైజర్స్ కెప్టెన్ కమిన్స్ అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టాడు.అనంతరం హైదరాబాద్ 19 ఓవర్లలో 5 వికెట్లకు 181 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ఇషాన్ కిషన్ (47 బంతుల్లో 70; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేయగా, హెన్రిచ్ క్లాసెన్ (26 బంతుల్లో 47; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక పరుగులు సాధించాడు.మెరుపు వేగంతోఅయితే, జోరు మీదున్న క్లాసెన్‌ను చెన్నై బౌలర్ నూర్ అహ్మద్.. తన స్పిన్ మాయాజాలంతో ట్రాప్ చేశాడు. పదిహేనో ఓవర్లో అతడు సంధించిన మూడో బంతిని ఆడటంలో క్లాసెన్ విఫలమయ్యాడు. ఇంతలో బంతిని అందుకున్న వికెట్ కీపర్ సంజూ.. ధోనిని గుర్తుచేస్తూ మెరుపు వేగంతో స్టంప్స్ గిరాటేశాడు.Heated argument between sanju and klaseen #cskvssrh#sanjusamson#HeinrichKlaasen pic.twitter.com/A2noDYjGk9— NOTHING (@Nothing_il9zO) May 18, 2026సంజూను దూషించిన క్లాసెన్!ఈ క్రమంలో రీప్లేలో క్లాసెన్ కాలు గాల్లో ఉన్నట్లుగా తేలడంతో అతడు అవుటయ్యాడు. దీంతో సంజూ, నూర్ సంబరాలు చేసుకోగా.. క్లాసెన్ కోపంగా సంజూను దూషించినట్లు కనపడింది. సంజూ కూడా బదులిచ్చేందుకు రాగా.. నూర్ సైతం క్లాసెన్ పైకి వెళ్లాడు. ఇంతలో శివం దూబే, ఫీల్డ్ అంపైర్లు వచ్చి ఇరు వర్గాలను విడదీయడంతో పరిస్థితి సద్దుమణిగింది.ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ కాగా.. క్లాసెన్ ప్రవర్తన పట్ల విమర్శలు వస్తున్నాయి. సీనియర్ ప్లేయర్ నుంచి ఇలాంటి ప్రవర్తన ఊహించలేదంటూ నెటిజన్లు చురకలు అంటిస్తున్నారు. కాగా ఈ ఘటన నేపథ్యంలో క్లాసెన్‌ను బీసీసీఐ మందలించే అవకాశం ఉంది. చదవండి: నా శరీరం బలహీనంగా ఉంది: ధోని అభిమానుల హృదయం ముక్కలు -
గురువుకు తగ్గ శిష్యుడు... సంజు కళ్ళు చెదిరే స్టంపింగ్
-
సంజూ సరికొత్త చరిత్ర
స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ సీఎస్కే తరఫున తొలి సీజన్లోనే అదిరిపోయే రికార్డు సాధించాడు. ఈ సీజన్లో 13 మ్యాచ్‌ల్లో 477 పరుగులు చేసిన అతడు.. సీఎస్కే తరఫున ఓ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన వికెట్‌కీపర్‌గా కొత్త రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు ఎంఎస్ ధోని పేరిట ఉండేది.అతడు 2013 సీజన్లో 16 ఇన్నింగ్స్‌ల్లో 461 పరుగులు చేశాడు. తాజాగా సంజూ ఈ రికార్డును బద్దలు కొట్టాడు. లీగ్ దశలో మరో మ్యాచ్ ఆడాల్సి ఉండటంతో సంజూ 500 పరుగుల అరుదైన మైలురాయిని కూడా తాకే ఛాన్స్ ఉంది. ఇదే జరిగితే సీఎస్కే తరఫున ఒక సీజన్లో 500 పరుగులు చేసిన తొలి వికెట్‌కీపర్‌గా నిలుస్తాడు.రికార్డు సాధించినా, మ్యాచ్ చేజారింది..!నిన్న ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్‌లో సంజూ పై రికార్డును సాధించాడు. ఈ మ్యాచ్‌లో సంజూ మెరుపు ఇన్నింగ్స్‌తో (13 బంతుల్లో 27; 5 ఫోర్లు, సిక్స్) అలరించాడు. సిక్స్‌తో ఖాతా తెరిచిన అతడు.. వరుస బౌండరీలతో ఎస్ఆర్హెచ్ బౌలర్లపై దాడి చేశాడు. అయితే పాట్ కమిన్స్ బౌలింగ్‌లో ఔటై ఇన్నింగ్స్‌ను భారీ స్కోర్‌గా మలచ లేకలేకపోయాడు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే 20 ఓవర్లలో 180/7 స్కోర్ చేసింది. బ్రెవిస్ (44), కార్తీక్ శర్మ (32), సంజూ శాంసన్ (27), శివమ్ దూబే (26) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో పాట్ కమిన్స్ 3 వికెట్లతో ఆకట్టుకున్నాడు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో ఎస్ఆర్హెచ్ సైతం తడబడినా చివరికి గెలిచింది. ఇషాన్ కిషన్ (70), క్లాసెన్ (47) రాణించడంతో 19 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకోగా.. సీఎస్కే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. -
సామ్సన్ భారత కెప్టెన్ అవుతాడు!
దుబాయ్: వచ్చే రెండు, మూడేళ్లలో సంజూ సామ్సన్ భారత టి20 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం ఖాయమని మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత రవిశాస్త్రి అన్నాడు. 2026 టి20 వరల్డ్ కప్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన సామ్సన్‌కు కెప్టెన్ అయ్యే స్థాయి, అర్హత ఉన్నాయని శాస్త్రి అభిప్రాయపడ్డాడు. ‘2028 టి20 వరల్డ్ కప్ సమయానికి సూర్యకుమార్ గురించి ఆలోచించే అవకాశం ఉండకపోవచ్చు. వచ్చే రెండేళ్లలో సూర్య ఎలా ఆడినా సరే... జట్టుకు మాత్రం కచ్చితంగా కొత్త కెప్టెన్ అవసరమే. సామ్సన్ అందుకు సరైనవాడు. ప్రాధాన్యతాక్రమంలో కూడా అతను అందరికంటే ముందున్నాడనేది నా అభిప్రాయం. ఐపీఎల్లో అతను రాజస్తాన్ రాయల్స్‌కు సుదీర్ఘ కాలం సారథిగా వ్యవహరించాడు. టాపార్డర్‌లో విధ్వంసక బ్యాటర్‌గా జట్టులో అతని స్థానం తిరుగులేనిది. కాబట్టి ఇది ఆరంభం మాత్రమే. మున్ముందు సామ్సన్‌పై పెద్ద బాధ్యత ఉంది. టి20 వరల్డ్ కప్‌లో చెలరేగిన తర్వాత ఇప్పుడు ఐపీఎల్లో అతను మరింత పరిణతి చెందినట్లుగా కనిపిస్తోంది. తనపై వచ్చిన అన్ని సందేహాలను సామ్సన్ జవాబిచ్చేశాడు. భవిష్యత్తులో అతడిని నాయకుడిగా గుర్తించేందుకు ఇది సరిపోతుంది’ అని రవిశాస్త్రి విశ్లేషించాడు. -
టీమిండియా టీ20 కెప్టెన్‌గా అతడే!
టీమిండియా టీ20 కెప్టెన్సీ త్వరలోనే చేతులు మారనుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. భారత్‌కు ఇటీవలే టీ20 ప్రపంచకప్ అందించినప్పటికీ సూర్యకుమార్ యాదవ్‌పై వేటు తప్పదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్‌గా పేరొందిన ఈ ముంబైకర్.. ఇటీవల ఫామ్‌లేమితో ఇబ్బంది పడటం ఇందుకు కారణం.కొత్త సారథి రావడం పక్కా!అంతేకాదు 35 ఏళ్ల సూర్యకు వయసు కూడా అడ్డంకిగా మారింది. ఇంగ్లండ్ పర్యటన తర్వాత అతడిని తొలగించి.. కొత్త సారథిని నియమించేందుకు యాజమాన్యం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ పేరు ప్రముఖంగా తెరమీదకు వచ్చింది.ప్రస్తుతం భారత టీ20 జట్టులో అయ్యర్‌కు చోటు లేకపోయినా.. త్వరలోనే అతడు రీఎంట్రీ ఇచ్చి పగ్గాలు చేపడతాడనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అతడితో పాటు ఇషాన్ కిషన్, టెస్టు, వన్డే జట్ల కెప్టెన్ శుబ్‌మన్ గిల్ కూడా రేసులో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.సంజూకే ఆ అర్హతఈ నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్‌కోచ్, భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘టీ20 ప్రపంచకప్-2028 టోర్నీకి సన్నద్ధమయ్యే క్రమంలో టీమిండియా కొత్త కెప్టెన్ కోసం ఎదురుచూస్తోంది. ఈ రెండేళ్లలో సూర్య ఏం చేస్తాడో చూడాలి.అయితే, సూర్య స్థానంలో కొత్త నాయకుడిగా సంజూ శాంసన్ ముందు వరుసలో ఉంటాడు. ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్‌గా అతడు అదరగొట్టాడు. టాపార్డర్‌లో విధ్వంసకర బ్యాటర్‌గా అతడు పేరొందాడు. వచ్చే రెండు, మూడేళ్లలో సంజూ నుంచి మనం మరిన్ని గొప్ప ఇన్నింగ్స్ చూడబోతున్నామని అనిపిస్తోంది.నిజానికి సంజూ గొప్ప ప్రతిభ ఉన్న ఆటగాడు. అయితే, తనకున్న టాలెంట్‌ను సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నాడనే విమర్శలు వచ్చేవి. టీ20 ప్రపంచకప్ సందర్భంగా వాటన్నింటికీ అతడు ఆటతోనే సమాధానం చెప్పాడు.ఒంటిచేత్తో టీమిండియాను గెలిపించాడుకీలక నాకౌట్ మ్యాచ్‌లలో అద్భుతంగా ఆడి ఒంటిచేత్తో టీమిండియాను గెలిపించాడు. భారత్ మరోసారి టీ20 వరల్డ్‌కప్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. క్వార్టర్స్, సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లలో సంజూ గొప్ప పరిణతితో కూడిన ఇన్నింగ్స్ ఆడాడు.తాజా సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫునా రాణిస్తున్నాడు. టీమిండియా భవిష్య నాయకుడిగా సంజూ తనను తాను ముందు వరుసలో నిలుపుకొన్నాడు’’ అని రవిశాస్త్రి ‘ది ఐసీసీ రివ్యూ’లో పేర్కొన్నాడు.దుమ్ములేపిన సంజూకాగా టీ20 ప్రపంచకప్-2026లో నాకౌట్ మ్యాచ్‌లలో సంజూ 97*, 89, 89 పరుగులు సాధించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’ అవార్డు గెలుచుకున్నాడు.ఇక ఐపీఎల్-2026 ఆరంభానికి ముందు రాజస్తాన్ నుంచి చెన్నైకి ట్రేడ్ అయిన సంజూ.. ఆరంభంలో తడబడ్డాడు. ఆ తర్వాత సెంచరీతో అదరగొట్టి ఫామ్‌లోకి వచ్చాడు. ఇప్పటికి 11 మ్యాచ్‌లలో కలిపి 430 పరుగులు సాధించాడు. ఇందులో రెండు శతకాలు ఉన్నాయి.చదవండి: Hardik Pandya: మౌనం వీడిన ముంబై ఇండియన్స్ -
అయ్యర్ కు చెక్.. టీ20 కెప్టెన్ గా సంజు శాంసన్
-
సీఎస్కే కెప్టెన్సీపై సంజూ అధికారిక ప్రకటన
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీపై వస్తున్న ఊహాగానాలకు స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ ఎట్టకేలకు తెరదించాడు. ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్ నుంచి సీఎస్కేలో చేరిన తర్వాత, అతడే జట్టు కొత్త కెప్టెన్ అవుతాడనే వార్తలు బలంగా వినిపించాయి. అయితే తాజాగా ఈ అంశంపై సంజూ స్పష్టమైన ప్రకటన చేశాడు. తాను ఎప్పుడూ కెప్టెన్సీ గురించి ఆలోచించలేదని తెలిపాడు. కొత్త జట్టులోకి వెళ్లేటప్పుడు డిమాండ్లతో వెళ్లకూడదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.“నేను ఇప్పటికే ఒక జట్టులో కెప్టెన్‌గా ఉన్నాను. అక్కడి నుంచి కొత్త జట్టుకు వచ్చాను. అలాంటి సమయంలో కెప్టెన్సీ గురించి ఆలోచించడం సరైంది కాదు. కొత్త ఇంట్లోకి వెళ్తే ముందుగా ఆ ఇంటి మనిషిలా కలిసిపోవాలి” అని అన్నాడు.అదే సమయంలో ప్రస్తుత సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌పై ప్రశంసలు కురిపించాడు. రుతురాజ్ చాలా నిశ్శబ్దంగా కనిపించినా, అతడిలో అపారమైన ఆత్మవిశ్వాసం ఉందని పేర్కొన్నాడు. సీఎస్కేలో చేరేందుకు తనను స్వయంగా రుతురాజ్ సంప్రదించాడని, అది తనకు ఎంతో నచ్చిందని తెలిపాడు.“రుతు భారత క్రికెట్లో చాలా భిన్నమైన స్టార్. అతను పెద్ద ఫ్రాంచైజీకి నాయకత్వం వహిస్తున్నా, ఎలాంటి అహంకారం ఉండదు. మాటలకంటే చర్యలతో చూపించే వ్యక్తి” అంటూ సంజూ కొనియాడాడు.కాగా, 2024లో సీఎస్కే కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన రుతురాజ్‌కు ఇప్పటివరకు కఠిన ప్రయాణమే ఎదురైంది. 2024లో జట్టు ప్లేఆఫ్స్‌కు తృటిలో దూరమవగా, 2025లో గాయం కారణంగా సీజన్ మధ్యలోనే తప్పుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ సీఎస్కే యాజమాన్యం అతడిపైనే నమ్మకం ఉంచింది.ప్రస్తుత సీజన్ విషయానికొస్తే.. సీజన్ ప్రారంభంలో సీఎస్కే ఘోరంగా విఫలమైనా, ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుంది. ప్లే ఆఫ్స్ బెర్త్‌కు ప్రధాన పోటీదారుగా మారింది. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. తదుపరి ఆడబోయే 4 మ్యాచ్‌ల్లో మూడు గెలిచినా, సీఎస్కే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారైనట్లే. ఈ జట్టు పరివర్తనలో సంజూ శాంసన్ కీలకపాత్ర పోషించాడు. రెండు శతకాలు, ఓ అర్ద శతకం సాధించి సీఎస్కే విజయాలకు ప్రధాన కారకుడయ్యాడు. -
అయ్యర్‌కు షాక్.. శాంసన్‌కు డబుల్ ప్రమోషన్!
టీమిండియా టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్‌పై త్వరలో వేటు పడనుంది. ఈ మేరకు బీసీసీఐ కొత్త టీ20 కెప్టెన్‌ను ఎంపిక చేసేందుకు ఇప్పటికే కసరత్తులు ప్రారంభించింది. అయితే శ్రేయస్ అయ్యర్ తదుపరి భారత టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకుంటాడంటూ వార్తలు వస్తున్న వేళ.. తాజాగా కెప్టెన్సీ రేసులోకి అనూహ్యంగా సంజూ శాంసన్ పేరు తెరమీదకు రావడంతో పోటీ ఆసక్తిగా మారింది. ఎందుకంటే అయ్యర్ కెప్టెన్ అయితే సంజూ శాంసన్ కెరీర్ ప్రమాదంలో పడుతుందని ఊహాగానాలు వ్యక్తమయిన వేళ శాంసన్ ఏకంగా కెప్టెన్ కుర్చీపై కర్చీఫ్ వేసి అయ్యర్‌కే ఎసరు పెట్టినట్లు తెలుస్తోంది. టీ20 కెప్టెన్సీ విషయంలో బీసీసీఐ అయ్యర్‌కే అధిక ప్రాధన్యమిచ్చే అవకాశమున్నప్పటికీ శాంసన్ రేసులోకి వస్తే అతడిని పరిగణలోకి తీసుకునే అవకాశం లేకపోలేదు. దీంతో కెప్టెన్ కావాలనుకున్న అయ్యర్‌కు ఇప్పుడు శాంసన్ రూపంలో పెద్ద గండం వచ్చి పడింది. ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు రాజస్తాన్ రాయల్స్ నుంచి సీఎస్కేకు ట్రేడింగ్ అయిన సంజూ శాంసన్ సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం సీఎస్కేకు అతడు కెప్టెన్ కాకపోయినప్పటికీ గతంలో రాజస్తాన్ రాయల్స్‌కు నాయకత్వం వహించిన అనుభవం శాంసన్‌కు ఉపయోగపడనుంది. అనుభవానికి తోడు కెప్టెన్‌గా రాజస్తాన్‌ను విజయవంతంగా నడిపించడమే శాంసన్‌ను కెప్టెన్సీ రేసులో నిలబెట్టినట్లు కనిపిస్తోంది. ఇక టీమిండియా వచ్చే జూన్, జూలై నెలల్లో ఇంగ్లండ్, ఐర్లాండ్‌లో వైట్‌బాల్ సిరీస్ ఆడనుంది. ఈ పర్యటనకు సంబంధించి ఆటగాళ్ల ఎంపిక ఐపీఎల్ ప్రదర్శనపైనే ఆధారపడి ఉంటుంది. ముంబై బ్యాటర్‌గా సూర్యకుమార్ దారుణ ప్రదర్శన కనబరుస్తుండడంతో అతడు చోటు కోల్పోయే అవకాశముంది. ఇప్పటికే పరుగుల పరంగా శాంసన్, శ్రేయస్ అయ్యర్ టాప్ ప్లేస్ కోసం పోటీ పడుతున్నారు.శాంసన్ ఎందుకంటే?భారత తదుపరి టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్ స్థానాన్ని భర్తీ చేసే రేసులో శాంసన్‌కు అనుకూలంగా ఉన్న అంశం ఏంటంటే.. అతను భారత టీ20 జట్టులో నిలకడగా ఉండటమే. 2024 టీ20 ప్రపంచ కప్ నుంచి జట్టుతో పాటు కొనసాగుతున్న శాంసన్ ఇప్పటికే తానేంటో నిరూపించుకున్నాడు. 62 మ్యాచ్‌లాడి మూడు సెంచరీలు, ఆరు హాఫ్ సెంచరీలతో 1,399 పరుగులు సాధించాడు. ఈ ఏడాది ప్రారంభంలో భారత్ టీ20 ప్రపంచ కప్ విజయంలో కూడా అతను కీలక పాత్ర పోషించాడు. శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్లో కెప్టెన్‌గా రాణిస్తున్నప్పటికీ అంతర్జాతీయంగా టీమిండియా ఆడే టీ20 జట్టులో ఇప్పటివరకు చోటు లేకపోవడం మైనస్‌గా మారింది. అయ్యర్ భారత్ తరఫున తన చివరి టీ20 మ్యాచ్‌ను 2023 డిసెంబర్ 3న ఆడాడు. ఒకవేళ అయ్యర్ పొట్టి ఫార్మాట్లోకి రీఎంట్రీ ఇస్తే మాత్రం అతడికి బూస్టప్ అని చెప్పొచ్చు. దీనికి తోడు అతను టీ20 కెప్టెన్ అయితే అతని కెరీర్ గ్రాఫ్ కూడా పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20ల కోసం బీసీసీఐ సెలక్షన్ కమిటీ భారత టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్‌నే కొనసాగించే అవకాశం ఉందని, అయితే మరోసారి పేలవ ఫామ్ కనబరిస్తే మాత్రం సూర్య స్థానంలో బీసీసీఐ కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేయనుంది.చదవండి: చిక్కుల్లో జైస్వాల్, షఫాలీ.. నిషేధం పడే అవకాశం! -
శ్రేయస్ కెప్టెన్ అయితే వీళ్ల కెరీర్ ఖతం!
టీమిండియా ఇటీవలే 2026 టీ20 ప్రపంచకప్ గెలిచిన సంగతి తెలిసిందే. సూర్యకుమార్ సారథ్యంలో భారత్ మూడోసారి పొట్టి కప్పును అందుకుంది. అయితే బీసీసీఐ మాత్రం అప్పుడే 2028 టీ20 ప్రపంచకప్ కోసం సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో మెన్ ఇన్ బ్లూను సరికొత్తగా తయారు చేసేందుకు కసరత్తులు నిర్వహిస్తోంది. ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ తర్వాత టీ20 ప్రపంచకప్ అందుకున్న మూడో కెప్టెన్‌గా సూర్యకుమార్ నిలిచాడు. అయితే బీసీసీఐ మాత్రం వచ్చే 2028 టీ20 ప్రపంచకప్ నాటికి సూర్యకుమార్ స్థానంలో కొత్త టీ20 కెప్టెన్‌ను ఎంపిక చేయాలనే యోచనలో ఉంది. ఇప్పటికే ఐపీఎల్లో తన కెప్టెన్సీతో అదరగొడుతున్న శ్రేయస్ అయ్యర్‌తో పాటు గిల్ కూడా రేసులో ఉన్నాడు. కానీ బీసీసీఐ మాత్రం శ్రేయస్ అయ్యర్‌వైపే మొగ్గుచూపే అవకాశముంది. ఐపీఎల్లో విజయవంతమైన కెప్టెన్లలో శ్రేయస్ ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. బ్యాటింగ్‌లో మంచి స్ట్రైక్‌రేట్‌తో పరుగులు సాధించడంతో పాటు ఐపీఎల్ 2024 సీజన్లో కేకేఆర్‌ను విజేతగా నిలిపాడు. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్‌ను 2025లో ఫైనల్ చేర్చాడు. ఈ సీజన్లోనూ శ్రేయస్ కెప్టెన్‌గా సత్తా చాటుతూ పంజాబ్‌ను టైటిల్ దిశగా నడిపిస్తున్నాడు. ఒకవేళ శ్రేయస్ అయ్యర్ టీమిండియా టీ20 కెప్టెన్ అయితే మాత్రం ముగ్గురు ఆటగాళ్ల కెరీర్‌కు ముగింపు పడినట్లేనని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ ముగ్గురే ప్రస్తుత టీ20 కెప్టెన్ సూర్యకుమార్, సంజూ శాంసన్, వెటరన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్.సూర్యకుమార్ యాదవ్శ్రేయస్ అయ్యర్ టీమిండియా టీ20 కెప్టెన్ అయితే మాత్రం మొదట జట్టు నుంచి దూరమయ్యేది సూర్యకుమార్. టీ20 క్రికెట్లో సూర్యకుమార్‌కు ఘనమైన రికార్డు ఉంది. మిస్టర్ 360 డిగ్రీస్ పేరుతో అతడిని అందరూ ముద్దుగా పిలుచుకుంటారు. అయితే గత రెండేళ్లలో సూర్యకుమార్ ఆటతీరు దారుణంగా ఉంది. ముఖ్యంగా కెప్టెన్ అయిన తర్వాత అతడిలో మునుపటి ఆట కనిపించడం లేదు. ఇందుకు గణాంకాలే సాక్ష్యం. 2025 సీజన్లో టీమిండియా తరఫున 19 టీ20 మ్యాచ్‌లాడిన సూర్యకుమార్ 218 పరుగులు సాధించాడు. ఇక ఈ ఏడాది 14 మ్యాచ్‌లాడిన సూర్య 484 పరుగులు సాధించాడు. గతంలో ఒకే ఏడాదిలో వెయ్యి పరుగులు అవలీలగా సాధించిన సూర్య క్రమంగా తన ఫామ్‌ను కోల్పోతూ వచ్చాడు. 2026 టీ20 ప్రపంచకప్‌లోనూ సూర్యకుమార్ 136 స్ట్రైక్‌రేట్‌తో 242 పరుగులు మాత్రమే చేశాడు. కీలకమైన మ్యాచ్‌ల్లో పూర్తిగా విఫలమయ్యాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 19వ సీజన్లోనూ సూర్యకుమార్ బ్యాటర్‌గా పూర్తిగా విఫలమయ్యాడు. 10 మ్యాచ్‌ల్లో కేవలం 195 పరుగులు మాత్రమే చేశాడు. మరో విషయం ఏంటంటే.. అయ్యర్ టీమిండియాలోకి వస్తే నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడు. సూర్య కూడా అదే స్థానంలో బరిలోకి దిగుతుంటాడు. వయసు పరంగా చూసుకున్నా శ్రేయస్ (31 ఏళ్లు) కంటే సూర్యకుమార్(35 ఏళ్లు) నాలుగేండ్లు పెద్ద. ఏ లెక్కన చూసుకున్నా శ్రేయస్ టీమిండియా టీ20 జట్టులోకి ఎంట్రీ ఇస్తే మొదటి వికెట్ సూర్యకుమార్‌దే.సంజూ శాంసన్ఈ లిస్టులో సంజూ శాంసన్ పేరు ఉండడం కాస్త ఆశ్చర్యంగా అనిపించినా నమ్మక తప్పదు. ప్రస్తుతం టీమిండియా జట్టులో అభిషేక్‌తో కలిసి శాంసన్ ఓపెనింగ్ వస్తున్నాడు. 2026 టీ20 ప్రపంచకప్‌లోనూ సూపర్-8 దశ నుంచి ఫామ్ అందుకున్న శాంసన్ టీమిండియాకు టైటిల్ అందించడంతో పాటు ఏకంగా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును ఎగరేసుకుపోయాడు. అయితే శ్రేయస్ కెప్టెన్ అయితే అతడి మదిలో కొందరు యువ ఆటగాళ్లు పేర్లు మెదలడం ఖాయం. ముఖ్యంగా పంజాబ్ కింగ్స్‌కు ఆడుతున్న ప్రియాన్ష్ ఆర్య సహా రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ పేర్లను బయటపెట్టే అవకాశముంది. ఈ లెక్కన వీరిద్దరిలో ఎవరు జట్టులోకి వచ్చినా సంజూ శాంసన్ డగౌట్‌కు పరిమితం అవ్వాల్సిందే. ఇప్పటికే గిల్, జైస్వాల్ రూపంలో ఓపెనింగ్ స్థానానికి పోటీ తీవ్రంగా ఉంది. దీంతో శాంసన్ ఫామ్ కోల్పోయి సరిగ్గా ఆడకుంటే మాత్రం కెరీర్ కూడా ప్రమాదంలో పడినట్లే.కుల్దీప్ యాదవ్కుల్దీప్ యాదవ్ టీమిండియాలో సీనియర్ బౌలర్‌గా ఉన్నాడు. మూడు ఫార్మాట్లు ఆడుతున్న క్రికెటర్లలో కుల్దీప్ కూడా ఒకడు. అయినప్పటికీ శ్రేయస్ కెప్టెన్ అయితే కుల్దీప్ జట్టులో స్థానంలో కోల్పోవచ్చు. తనకంటూ స్ట్రాంగ్ బౌలర్లు కావాలని అయ్యర్ అనుకుంటే మాత్రం కుల్దీప్ స్థానంలో పంజాబ్ కింగ్స్ స్పిన్నర్, యజ్వేంద్ర చాహల్ జట్టులోకి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. 2026 టీ20 ప్రపంచకప్‌లోనూ వరుణ్ చక్రవర్తి స్థానంలో కుల్దీప్ ఆడాడు. ఇక ఐపీఎల్ 2026 సీజన్లోనూ కుల్దీప్ ఏ మాత్రం ఆకట్టుకోలేకపోతున్నాడు. ఇప్పటివరకు 10 మ్యాచ్‌లాడిన కుల్దీప్ కేవలం ఏడు వికెట్లు మాత్రమే తీశాడు. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ అయినంత మాత్రానా వీళ్ల కెరీర్‌కు ఇప్పటికిప్పుడు ముప్పు లేకపోయినా భవిష్యత్తులో జరిగే అవకాశముంది. అయితే ఇదంతా కేవలం ఊహాగానాలు మాత్రమే అన్న విషయం గుర్తుంచుకోవాలి.చదవండి: దిగ్గజ క్రికెటర్ ఇంట్లో మాజీ అధికారి ఆత్మహత్య! -
19 ఏళ్లలో ఒకే ఒక్కడు చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్..
-
'అతని గురించి ఎంత చెప్పినా తక్కువే.. అది మా అదృష్టం'
ఐపీఎల్-2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ మరో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. మంగళవారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో సీఎస్కే గెలుపొంది. ఈ మ్యాచ్‌లో చెన్నై జట్టు ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. తొలుత హోం టీమ్ ఢిల్లీని 155 పరుగులకే కట్టడి చేసిన సీఎస్కే.. అనంతరం లక్ష్యాన్ని కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 17.3 ఓవర్లలో చేధించింది. సీఎస్కే విజయంలో సంజూ శాంసన్(87 నాటౌట్), కార్తీక్ శర్మ(41) మరోసారి కీలక పాత్ర పోషించారు. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ స్పందించాడు."గత ఏడాది కంటే ఈసారి మా జట్టు బలంగా ఉందని మేము ఆదిలోనే భావించాం. ముఖ్యంగా సంజూ శాంసన్ వంటి కీలక ఆటగాడు రావడంతో మా అన్ని విభాగాలు పటిష్టమయ్యాయి. మా మిడిలార్డర్ బ్యాటింగ్ కూడా బలంగా ఉంది. కార్తీక్ శర్మ యువ ఆటగాళ్లు రాణిస్తుండడం చాలా సంతోషంగా ఉంది. మరోవైపు మా బౌలింగ్ విభాగం నిలకడగా రాణిస్తోంది. అన్షుల్ కాంబోజ్, అకిల్, నూర్, ఓవర్టన్ వంటి బౌలర్లు చక్కగా బౌలింగ్ చేస్తున్నారు. ఈ ఒక్క మ్యాచ్‌లోనే అన్షుల్ విఫలమయ్యాడు. అందుకు అతడు బాధపడ్డాడు. అతడు బలంగా తిరిగి వస్తాడన్న నమ్మకం మాకు ఉంది. ఇక టోర్నీ ఆరంభంలో కాస్త తడబడ్డాం. మా ఊపును అందుకోవడానికి ఒక్క విజయం అవసరమైంది. మూడు మ్యాచ్‌ల తర్వాత మాకు మూమెంటమ్ లభించింది. ఆ తర్వాత నుంచి జట్టు మొత్తం సమిష్టిగా రాణించడం మొదలుపెట్టాము. సంజూ గురుంచి ప్రత్యేక చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచకప్‌లో అద్భుత ఫామ్‌ను కనబరిచిన సంజూ, ఇప్పుడు మా జట్టుకు వెన్నెముకలా మారాడు. అతను జట్టులో ఉండటం మా అదృష్టం. యంగ్ ప్లేయర్ కార్తీక్ శర్మలో కూడా అద్భుతమైన స్కిల్స్ ఉన్నాయి. ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిందంటూ ఏమి లేదు. అతడికి భారీ షాట్లతో పాటు స్ట్రైక్‌ను రొటేట్ చేస్తూ ఆడే సత్తా కూడా ఉంది" అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో గైక్వాడ్ పేర్కొన్నాడు.చదవండి: IPL 2026: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్.. 19 ఏళ్లలో ఒకే ఒక్కడు -
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్.. 19 ఏళ్లలో ఒకే ఒక్కడు
ఐపీఎల్-2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ మరోసారి అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఈ ధనాధన్ లీగ్‌లో భాగంగా మంగళవారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.156 పరుగుల లక్ష్య చేధనలో ఢిల్లీ బౌలర్లను సంజూ ఉతికారేశాడు. కేవలం 52 బంతుల్లోనే 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 87 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్‌కు గాను అతనికి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. ఈ సీజన్లో ఢిల్లీపై శాంసన్‌కు ఇది రెండో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు కావడం విశేషం.ఇక ఈ మ్యాచ్‌లో తుపాన్ ఇన్నింగ్స్ ఆడిన శాంసన్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. సంజూ సాధించిన రికార్డులు ఇవే👉19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఒకే సీజన్లో 200 కంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి ఆటగాడిగా శాంసన్ రికార్డు సృష్టించాడు. ఈ సీజన్లో ఢిల్లీపై ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ కలిపి అతడు 202 పరుగులు చేశాడు. ఈ రెండు మ్యాచ్‌లలోనూ సంజూ అజేయంగా నిలవడం గమానార్హం.👉అదేవిధంగా ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్లో ఒకే జట్టుపై రెండుసార్లు 100 లేదా అంతకంటే ఎక్కువ భాగస్వామ్యాలు నెలకొల్పిన తొలి బ్యాటర్‌గా సంజూ నిలిచాడు. ఈ ఏడాది ఐసీజన్ ఫస్ట్ హాఫ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శాంసన్,ఆయుశ్ మాత్రేతో కలిసి 113 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.👉ఇప్పుడు నిన్న జరిగిన మ్యాచ్‌లో కార్తీక్ శర్మ (31 బంతుల్లో 41 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు)తో కలిసి 3వ వికెట్‌కు 66 బంతుల్లో 114 పరుగులు అజేయ భాగస్వామ్యాన్ని జోడించాడు. రుతురాజ్ గైక్వాడ్ కూడా ఢిల్లీపై రెండుసార్లు 100 లేదా అంతకంటే ఎక్కువ భాగస్వామ్యాలు నెలకొల్పాడు. కానీ అతడు రెండు సీజన్లలో ఈ ఫీట్ సాధించాడు.👉ఒకే సీజన్లో ఒకే ప్రత్యర్థిపై 200 కంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి వికెట్ కీపర్ సంజూనే కావడం విశేషం.చదవండి: హెచ్‌సీఏ ‘క్రికెట్ ఆపరేషన్స్ హెడ్’గా రాయుడు -
సంజూ విధ్వంసం.. సీఎస్కే ఘన విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్‌కింగ్స్ మరో విజయాన్ని అందుకుంది. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 156 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన సీఎస్కే 17.3 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. సంజూ శాంసన్ (87 నాటౌట్) విధ్వంసం సృష్టించగా.. కార్తిక్ శర్మ (41 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో అక్షర్ పటేల్, ఎన్గిడి చెరొక వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. స్టబ్స్ (38), సమీర్ రిజ్వీ (40 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. సీఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్ రెండు వికెట్లు తీయగా, అకిల్ హొసేన్, ముకేశ్ చౌదరీ, గుర్జప్నీత్ సింగ్, జేమీ ఓవర్టన్‌లు తలా ఒక వికెట్ తీశారు. కాగా టాపార్డర్ వైఫల్యం ఢిల్లీ కొంపముంచింది. సీఎస్కే బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఢిల్లీ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఈ దశలో స్టబ్స్, సమీర్ రిజ్వీ ఆరో వికెట్‌కు 65 పరుగులు జోడించడంతో ఢిల్లీ గౌరవప్రదమైన స్కోరు సాధించింది.సీఎస్కే ఆడుతూ పాడుతూ..156 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన సీఎస్కే ఆడుతూ పాడుతూ లక్ష్యం దిశగా సాగింది. కెప్టెన్ రుతురాజ్, వన్‌డౌన్‌లో వచ్చిన ఉర్విల్ పటేల్ తక్కువ పరుగులకే వెనుదిరిగారు. కానీ మరో ఎండ్‌లో ఓపెనర్ సంజూ శాంసన్ తన విధ్వంసాన్ని కొనసాగించాడు. అగ్నికి వాయువు తోడైనట్లు శాంసన్‌కు జత కలిసిన కార్తిక్ శర్మ తోడయ్యాడు. ఈ ఇద్దరు కలిసి ఫోర్లు, సిక్సర్లు బాది సీఎస్కేకు విజయాన్ని కట్టబెట్టారు. శాంసన్ సునామీ ఇన్నింగ్స్‌తో అలరిస్తే.. కార్తిక్ తన హిట్టింగ్‌ను ఢిల్లీ బౌలర్లకు రుచి చూపించాడు. ఈ సీజన్లో సీఎస్కేకు ఇది ఐదో విజయం కాగా పట్టికలో ఆరో స్థానంలో నిలిచి ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం 10 మ్యాచ్‌ల్లో 4 విజయాలు, ఆరు ఓటములతో పట్టికలో ఏడో స్థానానికి పడిపోయింది. -
శ్రేయస్ కాదు!.. భారత టీ20 కెప్టెన్‌గా ఊహించని పేరు!
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ భవితవ్యం త్వరలోనే తేలనుంది. ఇంగ్లండ్ పర్యటనలో అతడి ప్రదర్శన ఆధారంగానే అతడిని కొనసాగించాలా? లేదా? అన్న అంశంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.కాగా సూర్య ఇటీవలే భారత్‌కు టీ20 ప్రపంచకప్ టైటిల్ అందించాడు. కెప్టెన్‌గా సూపర్ హిట్ అయినా.. బ్యాటర్‌గా మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. మరోవైపు.. టీమిండియా 2028లో టీ20 ప్రపంచకప్‌తో పాటు లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ ఆడాల్సి ఉంది.యువ నాయకుడి సారథ్యంలోఇలాంటి తరుణంలో 35 ఏళ్ల సూర్యకు స్వస్తి పలికి.. యువ నాయకుడి సారథ్యంలో జట్టును తీర్చిదిద్దాలని మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ ప్రత్యామ్నాయంగా శుబ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా, సంజూ శాంసన్, అక్షర్ పటేల్, శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) పేర్లు తెరమీదకు వచ్చాయి.అయితే, గిల్ అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో గత కొంతకాలంగా పేలవంగా ఆడి వరల్డ్‌కప్ జట్టులో చోటు కోల్పోయిన సంగతి తెలిసిందే. వన్డే, టెస్టు జట్ల కెప్టెన్ అయినప్పటికీ సెలక్టర్లు అతడిపై వేటు వేసేందుకు ఏమాత్రం వెనకాడలేదు. కాబట్టి ఇప్పట్లో అతడికి టీ20 జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించకపోవచ్చు.రేసులో ఈ ఐదుగురుమరోవైపు.. రోహిత్ శర్మ (Rohit Sharma) తర్వాత హార్దిక్ పాండ్యానే టీ20 జట్టు కెప్టెన్ కావాల్సి ఉండగా.. బీసీసీఐ అనూహ్యంగా సూర్యకు పగ్గాలు అప్పగించింది. అరుదైన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నైపుణ్యాలున్న హార్దిక్‌పై అధిక భారం పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.ఇక సంజూ శాంసన్, అక్షర్ పటేల్‌లకు మేనేజ్మెంట్ అవకాశం ఇవ్వడం దాదాపు అసాధ్యమే. మరోవైపు.. శ్రేయస్ అయ్యర్ 2023, డిసెంబరు తర్వాత ఇంత వరకు టీ20 జట్టులో పునరాగమనమే చేయలేదు. అయితే, దేశవాళీ, ఐపీఎల్లో టీ20 కెప్టెన్‌గా, బ్యాటర్‌గా సత్తా చాటడం శ్రేయస్‌కు సానుకూలాంశం.ఈ నేపథ్యంలో సూర్య స్థానాన్ని శ్రేయస్ అయ్యర్‌తోనే భర్తీ చేస్తారని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా క్రిక్‌బ్లాగర్ మాత్రం ఇందుకు భిన్నమైన కథనం అందించింది. ‘‘మెజారిటీ మంది మాజీ క్రికెటర్లు శ్రేయస్ అయ్యర్‌ను కెప్టెన్‌ను చేయాలని సూచిస్తున్నారు.తెరమీదకు ఊహించని పేరుకానీ సెలక్టర్లు మాత్రం ఇందుకు సుముఖంగా లేరు. జాతీయ టీ20 జట్టు, వరల్డ్‌కప్ జట్టులో స్థానమే లేని ఆటగాడిని ఏకంగా కెప్టెన్‌ను చేసేందుకు వారు సిద్ధంగా లేరు. ఏదేమైనా శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, సంజూ శాంసన్ కంటే.. టీ20 కెప్టెన్సీ రేసులో ఇషాన్ కిషన్ ముందు వరుసలో ఉన్నాడు’’ అని బీసీసీఐ సన్నిహిత వర్గాలు చెప్పినట్లు సదరు కథనం పేర్కొంది.కాగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ2025-26 సీజన్లో జార్ఖండ్ కెప్టెన్, బ్యాటర్‌గా రాణించి ఇషాన్ జట్టుకు తొలి టైటిల్ అందించాడు. ఈ క్రమంలోనే భారత టీ20 జట్టులో పునరాగమనం చేసి.. వరల్డ్‌కప్-2026లో అదరగొట్టాడు. అదేవిధంగా.. ఐపీఎల్-2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆరంభ మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించి మంచి మార్కులు కొట్టేశాడు. దీంతో ఇషాన్ చుట్టూ యువ జట్టును తీర్చిదిద్దాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.చదవండి: రియాన్ పరాగ్‌పై బీసీసీఐ చర్యలు -
పంత్‌పై వేటు.. సంజూకు చోటు!.. రేసులో అతడు కూడా!
ఐపీఎల్లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా టీమిండియా స్టార్ రిషభ్ పంత్ కొనసాగుతున్నాడు. గతేడాది మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ అతడిని ఏకంగా రూ. 27 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. అయితే, పంత్ మాత్రం ఈ ధరకు ఏమాత్రం న్యాయం చేయడం లేదు.వైఫల్యాల పరంపరగతేడాది 13 ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 269 పరుగులు చేశాడు పంత్ (Rishabh Pant). సారథిగా జట్టును ఏడో స్థానంలో నిలిపాడు. ఇక ఈ ఏడాది అతడి ప్రదర్శన మరింత ఘోరంగా ఉంది. ఇప్పటికి ఎనిమిది ఇన్నింగ్స్‌లో కలిపి 189 పరుగులే చేశాడు పంత్. ఇక లక్నో ఎనిమిదింట కేవలం రెండు గెలిచి అట్టడుగున పదో స్థానంలో కొనసాగుతోంది.భవిష్యత్ ప్రశ్నార్థకంఈ నేపథ్యంలో పరిమిత ఓవర్ల క్రికెట్లో పంత్ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. టీ20 ప్రపంచకప్-2024లో ట్రోఫీ గెలిచిన జట్టులో సభ్యుడైన పంత్‌కు.. 2026 వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కలేదు. టీమిండియా తరఫున 2024లో చివరి టీ20 ఆడిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. అదే ఏడాది ఆఖరిగా వన్డే ఆడాడు.పంత్‌పై వేటు.. సంజూకు చోటు!తాజాగా ఐపీఎల్‌లోనూ వైఫల్యాల నేపథ్యంలో వన్డే వరల్డ్‌కప్-2027 జట్టు ఎంపికలో పంత్ పేరును కూడా కనీసం పరిగణనలోకి తీసుకునే అవకాశం లేకుండా పోయినట్లయింది. దైనిక్ జాగరణ్ కథనం ప్రకారం.. వన్డేల్లో కేఎల్ రాహుల్‌కు బ్యాకప్ వికెట్ కీపర్ బ్యాటర్‌గా సంజూ శాంసన్‌ను ఎంపిక చేయాలని సెలక్షన్ కమిటీ ఫిక్సైంది.ధ్రువ్ జురెల్ కూడా..ఇక ఈ రేసులో ధ్రువ్ జురెల్ కూడా మరో పోటీదారుడిగా ఉన్నాడు. కాగా సంజూ టీ20 ప్రపంచకప్-2026లో అదరగొట్టిన సంగతి తెలిసిందే. నాకౌట్ మ్యాచ్‌లలో సత్తా చాటి టీమిండియా ట్రోఫీ గెలవడంలో కీలకంగా వ్యవహరించి.. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు గెలిచాడు. ఐపీఎల్-2026లో ఇప్పటికే రెండు సెంచరీలు బాది సత్తా చాటాడు.ఈ నేపథ్యంలో సంజూకు వన్డేల్లోనూ పెద్దపీట వేయాలని అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. హెడ్‌కోచ్ గౌతం గంభీర్ కూడా సంజూ విషయంలో సానుకూలంగానే ఉన్నట్లు సమాచారం. కాగా 2027 వరల్డ్‌కప్ టోర్నీకి ముందు టీమిండియా 20 వన్డేలు ఆడాల్సి ఉంది. ప్రస్తుతం ఐపీఎల్-2026తో బిజీగా ఉన్న భారత ఆటగాళ్లు జూన్ 14 నుంచి అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్ మొతలుపెట్టనున్నారు. ఇక పరిమిత ఓవర్ల జట్టులో స్థానం గల్లంతైనప్పటికీ.. టెస్టుల్లో మాత్రం పంత్ చోటుకు ఢోకా ఏమీలేదు.చదవండి: రియాన్ పరాగ్‌పై బీసీసీఐ చర్యలు -
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్.. ఫాస్టెస్ట్ ఇండియన్‌గా
ఐపీఎల్-2026లో చెపాక్ మైదానం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ నిరాశపరిచాడు. గత మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన శాంసన్.. గుజరాత్‌పై మాత్రం తన మార్క్‌ను చూపించలేకపోయాడు. 15 బంతుల్లో 11 పరుగులు చేసి సంజూ ఔటయ్యాడు.అయితే ఈ మ్యాచ్‌లో శాంసన్ విఫలమైనప్పటికి ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్లో బంతుల పరంగా అత్యంత వేగంగా 5000 పరుగులు మైలు రాయిని అందుకున్న భారత ఆటగాడి శాంసన్ రికార్డు సృష్టించాడు. సంజూ కేవలం 3555 బంతుల్లో ఈ ఫీట్‌ను అందుకున్నాడు.ఇంతకుముందు ఈ రికార్డు సీఎస్కే లెజెండ్ సురేష్ రైనా పేరిట ఉండేది. రైనా 3620 బంతుల్లో ఈ ఘనత అందుకున్నాడు. ఓవరాల్‌గా ఈ జాబితాలో దిగ్గజాలు ఏబీ డివిలియర్స్ (3288 బంతులు), డేవిడ్ వార్నర్ (3554 బంతులు) తొలి రెండు స్ధానాల్లో ఉన్నారు.ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. సీఎస్కేపై 6 వికెట్ల తేడాతో గుజరాత్ ఘన విజయం సాధించింది. 159 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ 16.4 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. ఓపెనర్ సాయిసుదర్శన్(46 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లతో 87) మరోసారి అదరగొట్టాడు.అత్యంత తక్కువ బంతుల్లో 5000 పరుగులు చేసిన భారత ఆటగాళ్లు:సంజూ శాంసన్ – 3555 బంతులుసురేష్ రైనా – 3620 బంతులుకేఎల్ రాహుల్ – 3688 బంతులుఎంఎస్ ధోని – 3691 బంతులురోహిత్ శర్మ – 3817 బంతులువిరాట్ కోహ్లీ – 3827 బంతులుచదవండి: IPL 2026: 'నీ సీక్రెట్స్ మొత్తం నాకు తెలుసు.. మా టీమ్‌పై నెమ్మదిగా ఆడు' -
అతడు ఫెయిలైతే చెన్నైది మళ్లీ పాత కథే: సెహ్వాగ్
ఐపీఎల్-2026లో ఇప్పటికి ఏడు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ మూడింట గెలిచింది. ముంబై ఇండియన్స్‌తో గురువారం నాటి మ్యాచ్‌లో ఏకపక్ష విజయం సాధించి పాయింట్ల సంఖ్యను ఆరుకు పెంచుకుంది. సొంతమైదానం వాంఖడేలో ముంబైని చెన్నై చిత్తు చేయడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.మూడు మ్యాచ్‌లలో రెండు శతకాలుఅయితే, టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ వీరేందర్ సెహ్వాగ్ (Virender Sehwag) మాత్రం చెన్నై విషయంలో భిన్నంగా స్పందించాడు. ఒక్కరిపై ఆధారపడితే చెన్నై ఈసారి కూడా గట్టెక్కలేదని అభిప్రాయపడ్డాడు. కాగా చెన్నై ఇప్పటికి మూడు విజయాలు సాధించగా.. ఈ మూడింటిలో సంజూ శాంసన్ రెండు అజేయ సెంచరీలతో జట్టును గెలిపించాడు.ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో 115 పరుగులు చేసిన సంజూ.. తాజాగా ముంబైపై 101 పరుగులు సాధించాడు. ఈ రెండు మ్యాచ్‌లలో మిగతా బ్యాటర్ల నుంచి అతడికి పెద్దగా సహకారం అందలేదు. ఇక కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లోనూ సంజూ 48 పరుగులతో టాప్‌రన్‌స్కోరర్‌గా నిలిచి జట్టుకు విజయం అందించాడు.అతడు ఫెయిలైతే చెన్నైది మళ్లీ పాత కథేఈ నేపథ్యంలో వీరేందర్ సెహ్వాగ్ మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం చెన్నై జట్టును అందరూ ప్రశంసిస్తున్నారు. కానీ ఆ జట్టు గెలిచిన ప్రతి సందర్భంలోనే ఒకే ఒక్క బ్యాటర్ పరుగులు రాబట్టాడు. అతడు పరుగులు చేయడంలో విఫలమైన రోజు కథ వేరుగా ఉంటోంది.ఒకవేళ అతడు మళ్లీ గనుక ఫెయిలైతే పాత కథే పునరావృతం అవుతుంది. కాబట్టి ఒకే ఒక్క బ్యాటర్‌పై ఆధారపడటం సరికాదు. సంజూతో పాటు పరుగులు రాబట్టే ఆయుశ్ మాత్రే దురదృష్టవశాత్తూ గాయం వల్ల జట్టుకు దూరమయ్యాడు.కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, శివం దూబే, డెవాల్డ్ బ్రెవిస్ మీద చెన్నై ఆశలు పెట్టుకుంది. సంజూతో కలిసి వాళ్లు కూడా రాణిస్తేనే సీఎస్కే ప్రయాణం ముందుకు సాగుతుంది’’ అని క్రిక్‌బజ్ షోలో పేర్కొన్నాడు. ఏదేమైనా సంజూ శాంసన్ సంచలన ఇన్నింగ్స్‌తో ముంబైపై చెన్నైకి విజయం అందించాడని సెహ్వాగ్ ప్రశంసించాడు.కాగా రికార్డు స్థాయిలో ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన చెన్నై.. కొన్నేళ్లుగా పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. గతేడాది పద్నాలుగింట కేవలం నాలుగు గెలిచి పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది.చదవండి: ఆకాశ్ అంబానీ ఆగ్రహం.. ఇంకేం చూస్తారు?What composure. What striking 💛𝐒𝐚𝐧𝐣𝐮 𝐒𝐦𝐚𝐬𝐡𝐢𝐧𝐠 𝐒𝐚𝐦𝐬𝐨𝐧 🔥Scorecard ▶️ https://t.co/gGt34dqUoq#TATAIPL | #KhelBindaas | #MIvCSK | @ChennaiIPL | @IamSanjuSamson pic.twitter.com/2Hr9Ui0UEn— IndianPremierLeague (@IPL) April 23, 2026 -
ఆకాశ్ అంబానీ ఆగ్రహం.. ఇంకేం చూస్తారు?
ఐపీఎల్-2026లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన కొనసాగిస్తోంది. గత మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై 99 పరుగుల తేడాతో గెలిచిన హార్దిక్ సేన.. అదే జోరు కొనసాగించలేకపోయింది. సొంత మైదానం వాంఖడే వేదికగా గురువారం చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో 103 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. తద్వారా సీజన్లో ఏడింట ఐదో పరాజయాన్ని నమోదు చేసింది.సంజూ సెంచరీతో గెలిపించాడుటాస్ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్ ఎంచుకోగా బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. అడపాదడపా వికెట్లు తీసినా.. ఓపెనర్ సంజూ శాంసన్ దూకుడును మాత్రం అడ్డుకోలేకపోయారు. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఆచితూచి ఆడుతూనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 54 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లు బాది 101 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఫలితంగా చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. అనంతరం ముంబై 19 ఓవర్లలో 104 పరుగులకే ఆలౌటైంది. తిలక్ వర్మ (29 బంతుల్లో 37; 5 ఫోర్లు), సూర్యకుమార్ (30 బంతుల్లో 35; 5 ఫోర్లు) రాణించారు. అకీల్ హొసీన్‌కు 4 వికెట్లు దక్కాయి.ముంబై బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూఇక లక్ష్య ఛేదనలో ముంబై ఆది నుంచే తడబడటం తీవ్ర ప్రభావం చూపింది. ఓపెనర్లు డానిష్ మలేవార్ (0), క్వింటన్ డికాక్ (7).. వన్‌డౌన్ బ్యాటర్ నమన్ ధిర్ (0) ఇలా వచ్చి అలా వెళ్లారు. సూర్య, తిలక్ కాసేపు పోరాడిన ఫలితం లేకుండా పోయింది. మిగిలిన వారిలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా 1, రూథర్‌ఫర్డ్ 0, శార్దూల్ ఠాకూర్ 6, క్రిష్ భగత్ 7, జస్ప్రీత్ బుమ్రా 2 పరుగులు చేశారు.ఆకాశ్ అంబానీ ఆగ్రహంఈ క్రమంలో వరుసగా వికెట్లు పడుతూ.. ఓటమి దిశగా ముంబై వెళ్తున్న వేళ.. ఆ జట్టు యజమాని ఆకాశ్ అంబానీ తీవ్రంగా స్పందించారు. బ్లూ సోఫాలో నుంచి లేచి నిలబడి.. ‘‘అంతా అయిపోయింది. ఇంకేం చూస్తారు.. పదండి పదండి’’ అన్నట్లుగా ప్రేక్షకులకు సైగ చేస్తూ స్టేడియాన్ని వీడారు. There is absolutely nothing going right for Mumbai Indians right now. Just look at Akash Ambani walking off mid-game and he walked right in front of the dugout and didn’t even look at the players. He literally asked the fans to leave the stadium as well. The lack of unity is… pic.twitter.com/8nplMjRYLN— OldMonkOfCricket (@OldMonkOfCric) April 24, 2026ఆ సమయంలో మైదానంలోని ఆటగాళ్ల వైపు ఆకాశ్ అంబానీ కోపంగా చూసినట్లు కనిపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ఐపీఎల్ చరిత్రలో పరుగుల పరంగా ముంబైకి ఇదే అతిపెద్ద ఓటమి. అందుకే ఆకాశ్ అంబానీ ఎన్నడూ లేని విధంగా అసంతృప్తికి లోనైనట్లు తెలుస్తోంది.చదవండి: PSL: పీసీబీకి దిమ్మతిరిగే షాకిచ్చిన బంగ్లాదేశ్ -
చేటా దెబ్బకి చేతులెత్తిసిన ముంబై.. IPL చరిత్రలోనే MIకి ఘోర ఓటమి
-
‘ధోని కావాలనే CSKకు దూరంగా ఉంటున్నాడు’
చెన్నై సూపర్ కింగ్స్.. మహేంద్ర సింగ్ ధోని.. ఈ రెండూ పర్యాయ పదాల లాంటివి అనడంలో అతిశయోక్తి లేదు. ఐపీఎల్ ఆరంభం నుంచి అంతా తానై చెన్నైని ముందుకు నడిపించాడు ధోని. తన సారథ్యంలో రికార్డు స్థాయిలో జట్టును ఏకంగా ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపాడు.సరైన వారసుడు ఎవరు?అయితే, ధోని (MS Dhoni) కెప్టెన్‌గా తప్పుకొన్న తర్వాత ఇప్పటి వరకు అతడి వారసుడిగా ఎవరూ నిలదొక్కుకోవడం లేదు. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja)కు 2022లో పగ్గాలు ఇవ్వగా అతడు ఒత్తిడి భరించలేక మధ్యలోనే కెప్టెన్సీ వదిలేశాడు. ఆ తర్వాత రుతురాజ్ గైక్వాడ్‌ను ధోని స్థానంలో కెప్టెన్‌ను చేశారు.అయితే, గతేడాది ఐదు మ్యాచ్‌ల తర్వాత గాయం కారణంగా అతడు మధ్యలోనే టోర్నీకి దూరమయ్యాడు. దీంతో ధోని మరోసారి సారథిగా పగ్గాలు చేపట్టగా.. అప్పటికే నష్టం జరిగిపోయింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఐపీఎల్-2025లో సీఎస్కే పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది.44 ఏళ్ల వయసులోనూఇక 44 ఏళ్ల వయసులోనూ ధోని చెన్నై తరఫున బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు. అయితే, ఐపీఎల్-2026లో సీఎస్కే ఇప్పటికే ఏడు మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. అయినా ఇంత వరకు ధోని ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. పిక్కల్లో గాయం కారణంగా అతడు జట్టుకు దూరంగా ఉంటున్నట్లు యాజమాన్యం ప్రకటించింది.ధోని కావాలనే దూరంగా ఉంటున్నాడా?అయితే, ముంబై ఇండియన్స్‌తో గురువారం నాటి మ్యాచ్‌కు ముందు ధోని బాగానే ప్రాక్టీస్ చేసినట్లు కనిపించింది. అయినప్పటికీ అతడు బరిలోకి దిగలేదు. కనీసం స్టేడియానికి కూడా రాలేదు. ఈ నేపథ్యంలో ధోని కావాలనే జట్టుకు దూరంగా ఉంటున్నాడా? అనే సందేహాలు తలెత్తగా.. న్యూజిలాండ్ మాజీ పేసర్ సైమన్ డౌల్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు.అందుకే ఇలా చేస్తున్నాడు!క్రిక్‌బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘ఎంఎస్ ధోని ఫిట్‌గానే కనిపిస్తున్నాడు. అయినా సరే జట్టుకు దూరంగా ఉంటున్నాడు. కనీసం జట్టుతో కలిసి మైదానానికి రావడం లేదు. డగౌట్‌లోనూ కనిపించడం లేదు.వీలైనంతగా లైమ్‌లైట్‌కు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తున్నాడు. అతడొక దిగ్గజ ఆటగాడు, కెప్టెన్. అయినా సరే ఇలా ఎందుకు చేస్తున్నాడు? కావాలనే అతడు జట్టుకు దూరంగా ఉంటున్నట్లు అనిపిస్తోంది. తాను లేకున్నా జట్టు ముందుకు సాగేలా ఇప్పటి నుంచే అలవాటు చేస్తున్నట్లున్నాడు’’ అని సైమన్ డౌల్ పేర్కొన్నాడు.Respect ++ 💛💙#MIvCSK #WhistlePodupic.twitter.com/xphQe6IpPj— Chennai Super Kings (@ChennaiIPL) April 24, 2026రుతు, సంజూ మీదే ఫోకస్ ఉండేలా..‘తలా’ తనకు తానే తన క్రేజ్ తగ్గించుకుని.. కొత్త నాయకత్వ బృందంపై దృష్టి పడేలా చేస్తున్నాడని.. జట్టును వారు తమ చేతుల్లోకి తీసుకునేలా చేస్తున్నాడని డౌల్ అభిప్రాయపడ్డాడు. కాగా గతంలోనూ రుతు కెప్టెన్‌గా ఉన్నా.. మైదానంలో అతడికి సలహాలు, సూచనలు ఇస్తూ ధోని అంతా తానై వ్యవహరించేవాడు.అయితే, ఈసారి సంజూ శాంసన్ రాకతో ధోని తనపై భారం తగ్గించుకుని.. నాయకత్వ బృందంలో రుతుతో పాటు సంజూ భాగమయ్యేలా చేయడమే ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. కాగా ధోని స్థానంలో సంజూ వికెట్ కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ముంబైతో మ్యాచ్‌లో సంజూ అజేయ సెంచరీ (54 బంతుల్లో 101)తో చెలరేగి.. సీఎస్కేకు సీజన్లో మూడో విజయం అందించాడు.చదవండి: IPL 2026: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్.. 19 ఏళ్లలో ఒకే ఒక్కడు -
సీఎస్కే చేతిలో చిత్తు.. హార్దిక్ పాండ్యా స్పందన ఇదే
చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఘోర పరాజయంపై ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. పవర్ ప్లేలో వరుసగా వికెట్లు కోల్పోవడం తీవ్ర ప్రభావం చూపిందన్నాడు. చెన్నై జట్టు అద్భుతంగా బ్యాటింగ్ చేసిందని.. అందుకు వారికి క్రెడిట్ ఇవ్వాల్సిందేనని పేర్కొన్నాడు.సంజూ శాంసన్ అజేయ సెంచరీకాగా ఐపీఎల్-2026లో భాగంగా ముంబై ఇండియన్స్ గురువారం సీఎస్కేతో తలపడింది. సొంత మైదానం వాంఖడేలో టాస్ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. చెన్నై బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్ సంజూ శాంసన్ అజేయ సెంచరీ (54 బంతుల్లో 101)తో చెలరేగి చెన్నైకి మంచి స్కోరు అందించాడు. సంజూ విధ్వంసం కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి చెన్నై 207 పరుగులు చేసింది.పవర్‌ప్లే ముగిసేసరికి లక్ష్య ఛేదనకు దిగిన ముంబైకి శుభారంభం దక్కలేదు. తొలి 15 బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేసిన జట్టు వరుస విరామాల్లో ఓపెనర్లు డానిష్ (0), డికాక్ (7).. వన్‌డౌన్ బ్యాటర్ నమన్ (0) వికెట్లు కోల్పోయింది. పవర్‌ప్లే ముగిసేసరికి జట్టు స్కోరు 29 పరుగులు మాత్రమే.104 పరుగులకే ఆలౌట్‌ఈ దశలో సూర్య కుమార్ (36), తిలక్ వర్మ (37) కలిసి నాలుగో వికెట్‌కు 56 బంతుల్లో 73 పరుగులు జోడించారు. అయితే కేవలం 3 పరుగుల వ్యవధిలో వీరిద్దరితో సహా కెప్టెన్ హార్దిక్ పాండ్యా (1), రూథర్‌ఫర్డ్ (0) అవుటవ్వడంతో ముంబై ఓటమి ఖరారైంది. Akeal Hosein 🤜🤛 Noor Ahmad 🎥 #CSK’s spin twins breaking the game in style 💥Updates ▶️ https://t.co/gGt34dqUoq#TATAIPL | #KhelBindaas | #MIvCSK | @AHosein21 | @noor_ahmad_15 | @ChennaiIPL pic.twitter.com/HkDLnt759X— IndianPremierLeague (@IPL) April 23, 2026సీఎస్కే బౌలర్ల విజృంభణ కారణంగా 19 ఓవర్లలో ముంబై ఇండియన్స్ 104 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా పరుగుల తేడా పరంగా ఐపీఎల్ చరిత్రలో తమ అతిపెద్ద ఓటమి నమోదు చేసింది.మా ఓటమికి ప్రధాన కారణం అదేఈ నేపథ్యంలో ఓటమిపై హార్దిక్ పాండ్యా స్పందిస్తూ.. ‘‘పవర్ ప్లేలో వరుసగా వికెట్లు కోల్పోయిన తర్వాత కోలుకోవడం చాలా కష్టం. ముఖ్యంగా ఛేదనలో ఇలా జరగడం బ్యాటర్లపై ఒత్తిడిని పెంచుతుంది. నేను.. పిచ్‌ను సాకుగా చూపి తప్పించుకునే రకం కాదు.చెన్నై ఆటగాళ్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఇదే వికెట్ మీద వాళ్లు 207 పరుగులు సాధించారు. మేమే మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సింది. మా స్పిన్నర్లు మెరుగ్గానే బౌలింగ్ చేశారనుకుంటున్నా. చెన్నై ఓపెనర్ సంజూ అత్యద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.వాళ్ల బ్యాటర్లంతా తలా ఓ చెయ్యి వేసి స్కోరును 200 దాటించారు. పవర్ ప్లేలో మేము రాణించి ఉంటే ఫలితం వేరుగా ఉండేదేమో. కానీ అది జరగలేదు. జట్టులో మార్పు గురించి ఇప్పుడే చెప్పలేను. నాయకత్వ బృందంతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటాం’’ అని తెలిపాడు. చదవండి: IPL 2026: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్.. 19 ఏళ్లలో ఒకే ఒక్కడుWankhede painted in Yellow 💛Gurjapneet Singh with the final wicket for #CSK ✌️A commanding win by 1⃣0⃣3⃣ runs 👏Scorecard ▶️ https://t.co/gGt34dqUoq#TATAIPL | #KhelBindaas | #MIvCSK | @ChennaiIPL pic.twitter.com/meXDihvgGy— IndianPremierLeague (@IPL) April 23, 2026 -
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్.. 19 ఏళ్లలో ఒకే ఒక్కడు
ఐపీఎల్-2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఓపెనర్ సంజూ శాంసన్ మరోసారి శతక్కొట్టాడు. ఈ ధనాధన్ లీగ్‌లో భాగంగా వాఖండే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో శాంసన్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ ముంబై బౌలర్లను తనదైన శైలిలో ఉతికారేశాడు.కేవలం 54 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్‌లతో 101 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. సంజూకు ఇది 5వ ఐపీఎల్ సెంచరీ కావడం గమనార్హం. ఓవరాల్‌గా టీ20 క్రికెట్లో ఇది అతడికి ఎనిమిదివ సెంచరీ. ఈ క్రమంలో శాంసన్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.సంజూ సాధించిన రికార్డులు ఇవేముంబై ఇండియన్స్‌పై సెంచరీ చేసిన మొట్టమొదటి సీఎస్కే బ్యాటర్‌గా శాంసన్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో సంజూ కంటే ముందు ఈ సీఎస్కే బ్యాటర్ కూడా ముంబైపై మూడంకెల స్కోరును అందుకోలేదు.అదేవిధంగా చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఒకే సీజన్లో రెండు సెంచరీలు చేసిన మొదటి భారత బ్యాటర్‌గా సంజూ రికార్డు నెలకొల్పాడు.ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో కెఎల్ రాహుల్‌తో కలిసి నాలుగో స్థానంలో శాంసన్ నిలిచాడు.టీ20 క్రికెట్లో భారత తరపున అత్యధిక సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా రోహిత్ శర్మ సరసన శాంసన్ నిలిచాడు. వీరిద్దరూ ఇప్పటివరకు 8 టీ20 సెంచరీలు సాధించారు. ఈ జాబితాలో విరాట్ కోహ్లి(9), అభిషేక్ శర్మ(9) సంయుక్తంగా అగ్రస్ధానంలో ఉన్నారు.చదవండి: IPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి విధ్వంసకర ప్లేయర్ What composure. What striking 💛𝐒𝐚𝐧𝐣𝐮 𝐒𝐦𝐚𝐬𝐡𝐢𝐧𝐠 𝐒𝐚𝐦𝐬𝐨𝐧 🔥Scorecard ▶️ https://t.co/gGt34dqUoq#TATAIPL | #KhelBindaas | #MIvCSK | @ChennaiIPL | @IamSanjuSamson pic.twitter.com/2Hr9Ui0UEn— IndianPremierLeague (@IPL) April 23, 2026 -
సీఎస్కే కొత్త కెప్టెన్ సంజూ శాంసన్!
ఐపీఎల్ 2026 సీజన్లో ఆరంభంలో వరుస పరాజయాలతో ఇబ్బంది పడినప్పటికీ వరుసగా రెండు విజయాలు సాధించి సీఎస్కే గాడిన పడింది. కానీ కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ మాత్రం పూర్తిగా విఫలమవుతున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ సీఎస్కే కెప్టెన్సీ విషయమై సంచలన వ్యాఖ్యలు చేశాడు. సంజూ శాంసన్ సీఎస్కేకు కొత్త కెప్టెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నాడు. అది ఈ సీజన్ మధ్యలోనే జరిగే అవకాశముందని కూడా అభిప్రాయపడ్డాడు. ఒకవేళ ఈ సీజన్లో కాకపోయినా భవిష్యత్తులో మాత్రం శాంసన్ సీఎస్కేను శాసిస్తాడని జోస్యం చెప్పాడు. ప్రస్తుతం వరుస పరాజయాలతో సతమతమవుతున్న సీఎస్కేకు కెప్టెన్సీ అనుభవం ఉన్న ఆటగాడు అవసరమని, ఈ విషయంలో సీఎస్కేకు మొదటి చాయిస్ సంజూనే అని తెలిపాడు. ఇప్పటికే సంజూ శాంసన్ రాజస్తాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించడంతో పాటు ఫైనల్ చేర్చినట్లు గుర్తుచేశాడు. దీంతో సీఎస్కే యాజమాన్యం ఈ సీజన్ మధ్యలోనే రుతురాజ్‌ను తప్పించి శాంసన్‌కు బాధ్యతలు అప్పగించినా ఆశ్చర్చపోనవసరం లేదని తెలిపాడు. ఫామ్‌లేమితో సతమతమవుతున్న రుతురాజ్ ఈ సీజన్లోనే కెప్టెన్సీ వదిలేసే అవకాశాలు కూడా ఉన్నాయని జోస్యం చెప్పడం గమనార్హం.ప్రస్తుతం అశ్విన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఎంఎస్ ధోని సారధ్యంలో చెన్నై సూపర్‌కింగ్స్ ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాక సీఎస్కే ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. ధోని తర్వాత కెప్టెన్లు ఎందరు మారినా సీఎస్కే మరో టైటిల్ కొట్టడంలో మాత్రం విఫలమయ్యింది. 2022 సీజన్లో ధోని స్థానంలో రవీంద్ర జడేజాను కెప్టెన్‌గా నియమించింది. కానీ కెప్టెన్‌గా ఒత్తిడిని తట్టుకోలేక జడేజా దానిని మధ్యలోనే వదిలేశాడు. దీంతో గత్యంతరం లేక మళ్లీ ధోనికే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. అలా 2023 సీజన్లోనూ సీఎస్కేను నడిపించిన ధోని ఐదోసారి చాంపియన్‌గా నిలిపాడు. ఆ తర్వాత 2024 సీజన్లో రుతురాజ్ గైక్వాడ్‌ను కెప్టెన్‌గా నియమించింది. కానీ ఆ సీజన్లో ప్లేఆఫ్స్ చేరడంలో విఫలమైంది. ఇక 2025 సీజన్లో రుతురాజ్ సారథ్యంలోని సీఎస్కే దారుణ ఆటతీరుతో అట్టడుగు స్థానంలో నిలిచి టోర్నీ నుంచి నిష్క్రమించింది.చదవండి: పరిస్థితి విషమం.. ఐసీయూలో మాజీ స్టార్ క్రికెటర్! -
సూర్యకు షాక్..! టీమిండియా కెప్టెన్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్?
ఐపీఎల్-2026 సీజన్ తర్వాత భారత క్రికెట్ జట్టు వరుస ద్వైపాక్షిక సిరీస్‌లతో బిజీబీజీగా గడపనుంది. తొలుత జూన్‌లో స్వదేశంలో మూడు వన్డేలు, ఏకైక టెస్టు సిరీస్‌లో అఫ్గానిస్తాన్‌తో టీమిండియా తలపడనుంది. అనంతరం మెన్ ఇన్ బ్లూ రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది.అయితే జూలైలో ఇంగ్లండ్‌తో జరిగే ప్రధాన సిరీస్ దృష్ట్యా ఐరీష్ టూర్‌కు సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చి యువ జట్టును పంపాలని బీసీసీఐ భావిస్తుందంట. రెగ్యులర్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో పాటు హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, ఇషాన్ కిషన్‌కు విశ్రాంతి ఇచ్చే అవకాశముంది. ఐపీఎల్లో దుమ్ములేపుతున్న వైభవ్ సూర్యవంశీ ఆయూశ్ మాత్రే, ప్రిన్స్ యాదవ్ వంటి యువ ఆటగాళ్ల పేర్లను సెలెక్టర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, రాజస్తాన్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ కూడా ఐర్లాండ్ టూర్ కోసం సెలెక్టర్లు పిలుపునిచ్చే ఛాన్స్ ఉంది.కెప్టెన్‌గా సంజూ!అయితే ఈ టూర్‌కు రెగ్యులర్ సారధి సూర్యకుమార్ యాదవ్ దూరం కావడం దాదాపు ఖాయమైంది. ఈ క్రమంలో ఐర్లాండ్ పర్యటనలో భారత జట్టు పగ్గాలను సంజూ శాంసన్‌కు అప్పగించాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సంజూ ఇప్పటివరకు జాతీయ జట్టుకు నాయకత్వం వహించికపోయినప్పటికి.. కేరళ జట్టుతో పాటు రాజస్తాన్ రాయల్స్‌ను లీడ్ చేసిన అనుభవం అతడికి ఉంది.సూర్యకుమార్ యాదవ్ తిరిగి ఇంగ్లండ్ సిరీస్‌లో జట్టు బాధ్యతలు చేపట్టనున్నాడు. భారత్‌కు టీ20 వరల్డ్‌కప్ అందించిన సూర్య.. వ్యక్తిగత ప్రదర్శనల పరంగా మాత్రం విఫలమవుతున్నాడు. అయినప్పటికి అతడిని కెప్టెన్‌గా కొనసాగించేందుకు బీసీసీఐ సముఖత చూపుతోంది. ఇంగ్లండ్ టూర్లో సూర్య మెరుగైన ప్రదర్శన చేస్తే.. 2028 ఒలింపిక్స్ వరకు భారత కెప్టెన్‌గా కొనసాగించే అవకాశముంది.చదవండి: నా భర్త గురించి తప్పుడు ప్రచారం: వినోద్ కాంబ్లీ భార్య -
15ఏళ్లుగా ధోనీకి సాధ్యం కాని రికార్డును మూడు మ్యాచుల్లో లేపేసాడు
-
బుమ్రాను కాదని.. సంజూకు ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు
టీమిండియా స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్‌కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అందించే ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. ఈ ఏడాది మార్చి నెలకు గానూ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’గా ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ ఎంపికయ్యాడు. సహచర ఆటగాడు, ప్రపంచస్థాయి పేసర్ జస్ప్రీత్ బుమ్రాను కాదని ఈ అవార్డు సంజూను వరించడం విశేషం.ఆరంభంలో జట్టులో చోటే కరువుటీ20 ప్రపంచకప్-2026 టోర్నీ ఆరంభంలో సంజూకు భారత తుదిజట్టులో చోటు దక్కలేదన్న సంగతి తెలిసిందే. అయితే, సూపర్-8 మ్యాచ్‌లలో అనూహ్య రీతిలో మేనేజ్మెంట్ అతడికి అవకాశం ఇవ్వగా.. సద్వినియోగం చేసుకున్నాడు సంజూ. ముఖ్యంగా నాకౌట్ మ్యాచ్‌లలో వెస్టిండీస్‌పై 97*, ఇంగ్లండ్‌పై 89 పరుగులతో దుమ్ములేపాడు.ఫైనల్లోనూ ఇరగదీసిన సంజూఇక ఫైనల్లో న్యూజిలాండ్ మీద కూడా 89 పరుగులతో రాణించిన ఈ ఓపెనింగ్ బ్యాటర్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. మొత్తంగా మార్చిలో మూడు మ్యాచ్‌లలో కలిపి సంజూ 275 పరుగులు సాధించాడు. స్ట్రైక్‌రేటు 199.38. మరోవైపు.. బుమ్రా సైతం ఎనిమిది మ్యాచ్‌లలో కలిపి 14 వికెట్లు కూల్చి టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.సంజూకే దక్కిన అవార్డుఈ క్రమంలో సంజూ, బుమ్రాలతో పాటు సౌతాఫ్రికాకు చెందిన నయా ఆటగాడు కన్నార్ ఎస్తెరుజియెన్ కూడా మార్చి నెలకు గానూ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. అయితే, వీరిద్దరిని ఓడించి సంజూ శాంసన్ ఈ పురస్కారం గెలుచుకున్నాడు. ఇక మహిళల విభాగంలో న్యూజిలాండ్‌కు చెందిన అమేలియా కెర్ వుమెన్ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపికైంది. చదవండి: రాయల్స్ వైఖరిపై అసంతృప్తిలో వైభవ్ -
రోహిత్, విరాట్ సరసన సంజూ
ఐపీఎల్ 2026లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో నిన్న (ఏప్రిల్ 11) రాత్రి జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే సింగం సంజూ శాంసన్ చెలరేగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో సంజూ జూలు విదిల్చి సూపర్ సెంచరీ చేశాడు. కేవలం 56 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 115 పరుగులు చేశాడు. సంజూతో పాటు బౌలింగ్‌లో జేమీ ఓవర్టన్ (4-0-18-4), అన్షుల్ కంబోజ్ (4-0-35-3) సత్తా చాటడంతో ఢిల్లీపై సీఎస్కే 23 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా సీజన్ తొలి విజయాన్ని నమోదు చేసింది.ఈ మ్యాచ్‌లో అద్భుత శతకంతో చెలరేగిన సంజూ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకోవడంతో పాటు పలు రికార్డులు సాధించాడు. ఇందులో ఓ భారీ సిక్సర్ల రికార్డు సైతం ఉంది. అదేంటంటే.. ఈ మ్యాచ్‌లో 4 సిక్సర్లు బాదిన అనంతరం టీ20ల్లో సంజూ సిక్సర్ల సంఖ్య క్వాడ్రపుల్ సెంచరీకి (400) చేరింది.పొట్టి క్రికెట్ చరిత్రలో ఇది అత్యంత అరుదైన మైలురాయి. ఇప్పటివరకు ఈ మైలురాయిని కేవలం 29 మంది మాత్రమే (సంజూతో కలుపుకొని) తాకారు. భారత్ తరఫున సంజూకు ముందు కేవలం ముగ్గురు మాత్రమే ఈ మైలురాయిని అధిగమించారు. వీరిలో రోహిత్ శర్మ (554), విరాట్ కోహ్లి (440), సూర్యకుమార్ యాదవ్ (421) వంటి సిక్స్ హిట్టింగ్ మిషన్లు ఉన్నారు. ఇప్పుడు సంజూ బాబా వీరి సరసన చేరాడు. ఓవరాల్‌గా పొట్టి క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా క్రిస్ గేల్ (1056) చలామణి అవుతున్నాడు. అతనికి చాలా దూరంలో కీరన్ పోలార్డ్ (982), ఆండ్రీ రసెల్ (784) తదితర విండీస్ యోధులు ఉన్నారు. ఈ జాబితాలో రోహిత్ శర్మ 9, విరాట్ కోహ్లి 21, సూర్యకుమార్ యాదవ్ 23, సంజూ శాంసన్ 29 స్థానాల్లో ఉన్నారు. -
ఎక్కడ ఆపాడో అక్కడ్నుంచే మొదలెట్టాడు.. చెన్నైలో చితకొట్టిన చెట్టా...
-
ఎవరికీ సాధ్యంకాని ఘనతను సాధించిన సంజూ
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 11) రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై సీఎస్కే 23 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్ (115 నాటౌట్) సూపర్ సెంచరీ సాధించి సీఎస్కేకు తొలి విజయాన్ని అందించాడు. సంజూ రాజస్థాన్ నుంచి సీఎస్కేకు మారిన తర్వాత ఇది తొలి సెంచరీ. ఈ సెంచరీతో అతను చాలా రికార్డులు సాధించాడు.ఇందులో ముఖ్యమైనది..సంజూ తన ఐపీఎల్ కెరీర్లో ఇప్పటివరకు నాలుగు సెంచరీలు (ప్రస్తుత సెంచరీతో కలుపుకొని) చేయగా.. అందులో ప్రతి సెంచరీ సీజన్లో మొట్టమొదటిదిగా నిలిచింది. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఏ ఆటగాడు ఈ ఘనత సాధించలేదు. తాను చేసిన నాలుగు సెంచరీలు సీజన్లో మొదటివి కావడం సంజూకు మాత్రమే సాధ్యమైంది. 2017, 2019, 2021, 2026 సీజన్లలో మొదటి సెంచరీలను సంజూనే చేశాడు. తద్వారా సీజన్లో తొలి సెంచరీలను ఎక్కువ సార్లు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ రికార్డుకు సంబంధించి సంజూ తర్వాతి స్థానంలో న్యూజిలాండ్ ఆటగాడు బ్రెండన్ మెక్కల్లమ్ ఉన్నాడు. మెక్కల్లమ్ 2008, 2015 సీజన్లలో తొలి సెంచరీలు చేసి, సీజన్లో తొలి సెంచరీలు అత్యధిక సార్లు చేసిన ఆటగాళ్ల జాబితాలో సంజూ తర్వాతి స్థానంలో ఉన్నాడు. వీరి తర్వాత చాలామంది ఆటగాళ్లు సీజన్లో తొలి సెంచరీలు చేశారు.ప్రతి ఐపీఎల్ సీజన్లో తొలి సెంచరీ చేసిన ఆటగాళ్లు.. 2008- బ్రెండన్ మెక్కల్లమ్2009- ఏబీ డివిలియర్స్2010- యూసఫ్ పఠాన్2011- పాల్ వాల్తాటి2012- అజింక్య రహానే2013- షేన్ వాట్సన్2014- లెండిల్ సిమన్స్2015- బ్రెండన్ మెక్కల్లమ్2016- క్వింటన్ డికాక్2017- సంజూ శాంసన్2018- క్రిస్ గేల్2019- సంజూ శాంసన్2020- కేఎల్ రాహుల్2021- సంజూ శాంసన్2022- జోస్ బట్లర్2023- హ్యారీ బ్రూక్2024- విరాట్ కోహ్లి2025- ఇషాన్ కిషన్2026- సంజూ శాంసన్‌పై రికార్డు కాకుండా ఈ సెంచరీతో సంజూ మరో భారీ రికార్డు కూడా సాధించాడు. ఐపీఎల్లో మూడు వేర్వేరు జట్ల తరఫున సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. సంజూ ఢిల్లీ డేర్ డెవిల్స్, రాజస్థాన్ రాయల్స్ (2), సీఎస్కే ఫ్రాంచైజీల తరఫున సెంచరీలు చేశాడు. సంజూకు ముందు కేఎల్ రాహుల్ ఈ ఘనతను సాధించాడు. రాహుల్ పంజాబ్, లక్నో, ఢిల్లీ ఫ్రాంచైజీల తరఫున సెంచరీలు చేశాడు. -
‘విజయానికి వాళ్లే కారణం.. సంజూ కాదు’
ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్‌కింగ్స్ హ్యాట్రిక్ ఓటముల తర్వాత తొలి విజయాన్ని నమోదు చేసింది. మ్యాచ్ విజయంలో సంజూ శాంసన్, ఆయుశ్ మాత్రేలు కీలకపాత్ర పోషించారు. అయితే సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాత్రం బౌలర్ల వల్లే తమ జట్టు విజయం సాధించిదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం రుతురాజ్ మాట్లాడుతూ.. ‘ఎట్టకేలకు సీజన్లో తొలి విజయం సాధించడం, సంతోషంతో మాట్లాడేందుకు మీ ముందుకు రావడం జరిగింది. ఇవాళ మేము ఆడిన తీరు చాలా గొప్పగా అనిపించింది. చెపాక్ స్టేడియంలో మేము ఎప్పుడు మొదట బ్యాటింగ్ చేసినా 200 నుంచి 210 స్కోరు చేయాలని అనుకునేవాళ్లం. కానీ స్లో పిచ్ కారణంగా ఆ స్కోరు చేయడం కాస్త కష్టంగా అనిపించేంది. గత మ్యాచ్‌లతో పోలిస్తే అన్ని విషయాల్లో మెరుగయ్యాం. ఈరోజు సంజూ శాంసన్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ప్రత్యర్థిపై విరుచుకుపడ్డాడు. ఆయుష్ కూడా అద్భుతంగా రాణించాడు. కానీ ఇవాళ బౌలింగ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. కచ్చితంగా ఈరోజు మ్యాచ్ గెలుపులో బౌలింగ్ పాత్రే కీలకం. మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయడం, ప్రణాళికలకు తగ్గట్లు బౌలింగ్ చేయడం మా విజయానికి కలిసొచ్చింది. మా బౌలర్ల కృషిని చూసి గర్వపడుతున్నా. నిజానికి మా బౌలింగ్ లైనప్‌లో 'ఎక్స్-ఫ్యాక్టర్' బౌలర్ లేకపోయి ఉండవచ్చు. కానీ ప్రతి మ్యాచ్‌లోనూ ఎంత ప్రభావవంతంగా ఉండాలి, ముందస్తుగా ఎలా ఆలోచించాలి, అదనపు బౌండరీలను ఎలా ఆపాలి అనే విషయాలపై మేం చర్చించుకుంటూనే ఉన్నాం. తొలి మూడు మ్యాచ్‌ల్లో మేము విజయానికి చేరువగా వచ్చినప్పటికీ ఒకటి రెండు ఓవర్లలో 20-25 పరుగులు సమర్పించుకోవడం గెలుపును దూరం చేశాయి. పవర్‌ప్లేలో మేం కొంచెం వెనకంజలో నిలిచినప్పటికీ ఆ తర్వాత అద్భుతంగా పుంజుకున్నాం. చెన్నై ఫ్యాన్స్ ఎప్పుడూ మాకు అండగా ఉంటారు. మేం ఎక్కడికి వెళ్లినా వారి మద్దతు, సందేశాలు మమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. దేశంలో ఈ ప్రాంతం ప్రత్యేకం. ఇక్కడి ప్రజలు క్రికెట్‌ను ఆస్వాదిస్తూనే ఫ్రాంచైజీని అమితంగా ప్రేమిస్తుంటారు.’ అని చెప్పుకొచ్చాడు. మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్‌కింగ్స్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. శాంసన్ సెంచరీ, శివమ్ దూబే అజేయ అర్థసెంచరీతో రాణించారు. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది.చదవండి: ‘నా సెంచరీ వెనుక ఆ 50 సెకన్లు.. అతడికే అంకితం’ -
‘నా సెంచరీ వెనుక ఆ 50 సెకన్లు.. అతడికే అంకితం’
ఐపీఎల్ 2026 సీజన్లో ఐదుసార్లు చాంపియన్ అయిన చెన్నై సూపర్‌కింగ్స్ ఎట్టకేలకు బోణీ చేసింది. హ్యాట్రిక్ పరాజయాల తర్వాత గెలుపు రుచి చూసింది. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 23 పరుగుల తేడాతో గెలుపొందింది. సెంచరీతో చెలరేగిన సంజూ శాంసన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. మూడు వరుస ఓటముల తర్వాత సెంచరీతో జట్టును గెలిపించడం సంతోషంగా ఉందన్నాడు. వరుసగా విఫలమైనప్పటికీ జట్టు మేనేజ్మెంట్ తనపై నమ్మకం ఉంచడం గొప్ప విషయమన్నాడు. తన సెంచరీని సీఎస్కే కోచ్ స్టీఫెన్ ప్లెమింగ్‌కు అంకితమిస్తున్నట్లు శాంసన్ తెలిపాడు. శాంసన్ మాట్లాడుతూ.. ‘ఈసెంచరీ నాకు ఎంతో ముఖ్యం. నిజాయితీగా చెప్పాలంటే నాపై నమ్మకంతో చెన్నై ఫ్రాంచైజీ ట్రేడింగ్‌లో నన్ను దక్కించుకుంది. తొలి మూడు మ్యాచ్‌ల్లో విఫలమైనప్పుడు వారి నమ్మకాన్ని కోల్పోతున్నానేమోననిపించింది. కానీ ఇవాళ బాధ్యతా యుతంగా ఆడి సెంచరీ చేయడంతో పాటు వారు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేశాను. ఇంతకాలం ఒక ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించి ఇప్పుడు మరో కొత్త ఫ్రాంచైజీకి ఆడడం కొంత కష్టమే. కానీ నాకు చెన్నై విషయంలో అది ఏనాడు కనిపించలేదు. చెన్నైకి ఆడుతుంటే నేను మరో సొంత ఇంటికి వచ్చానన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇక్కడి ప్రజలు చాలా మంచివారు. అందరూ ప్రశాంతంగా కనిపిస్తున్నారు. అయితే వరుసగా మూడు ఓటములు చవిచూసినప్పటికీ ఇవాళ మ్యాచ్‌కు ముందు మేమంతా కేవలం 50 సెకన్లు మాత్రమేమీటింగ్ పెట్టుకున్నాం. ఆ యాబై సెకన్లు నేను ఒక టీమ్‌తో ఎంత కనెక్ట్ అయ్యాననేది చూపించింది. నేను గతంలో చాలాసార్లు విఫలమయ్యాను. అలాంటప్పుడు మనసు ఇటు అటు తిరుగుతూ ఉంటుంది. కానీ నా బేసిక్స్ ఏంటో తెలుసుకొని వాటిని పాటించడమే ముఖ్యం. అందుకోసం మా సపోర్ట్ స్టాఫ్‌తో కలిసి కొన్ని మంచి ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొన్నాను. మ్యాచ్‌లో మంచి భాగస్వామ్యాలు నెలకొల్పడం చాలా అవసరం. ఆయుష్ చాలా పరిణతితో ఆడాడు. మా కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ కోసమే నా సెంచరీని సెలెబ్రేట్ చేసుకున్నాను. పరిస్థితులు ఎంత సవాలుగా ఉంటాయో నాకు తెలుసు. అందుకే ఈ ఇన్నింగ్స్‌ను ఆయనకు అంకితం చేయాలనుకున్నాను.’ అని తెలిపాడు.🗣️🗣️ 𝙄𝙩 𝙛𝙚𝙚𝙡𝙨 𝙡𝙞𝙠𝙚 𝙘𝙤𝙢𝙞𝙣𝙜 𝙩𝙤 𝙖𝙣𝙤𝙩𝙝𝙚𝙧 𝙝𝙤𝙢𝙚 🏠Sanju Samson reflects on his match-winning knock and the love from the Chennai crowd 💛 Updates ▶️ https://t.co/BzGc6O65jX #TATAIPL | #KhelBindaas | #CSKvDC | @IamSanjuSamson | @ChennaiIPL pic.twitter.com/H4X2sug3sB— IndianPremierLeague (@IPL) April 11, 2026#CSK fans, bring out the whistles 💛A first win of the season for the 5⃣-time #TATAIPL champions 👏Scorecard ▶️ https://t.co/BzGc6O65jX #KhelBindaas | #CSKvDC | @ChennaiIPL pic.twitter.com/tS2xyOWgdj— IndianPremierLeague (@IPL) April 11, 2026చదవండి: చరిత్ర సృష్టించిన శాంసన్.. ధోని కూడా సాధ్యం కాలేదు -
చరిత్ర సృష్టించిన శాంసన్.. ధోని కూడా సాధ్యం కాలేదు
ఐపీఎల్-2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఎట్టకేలకు తన రిథమ్‌ను అందుకున్నాడు. శనివారం చెపాక్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సంజూ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు.తొలి మూడు మ్యాచ్‌లలో విఫలమైన సంజూ.. ఢిల్లీపై మాత్రం తన విశ్వరూపాన్ని చూపించాడు. శాంసన్ కేవలం 56 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 115 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో సంజూ శాంసన్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ తరపున సెంచరీ బాదిన మొట్టమొదటి వికెట్ కీపర్-బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు.2008 నుండి సీఎస్కే పూర్తిస్థాయి కీపర్‌గా ఉన్న ఎంఎస్ ధోనికి కూడా ఈ రికార్డు సాధ్యం కాలేదు. ధోనీ అత్యధిక స్కోరు 84 పరుగులుగా ఉంది. అయితే ధోని దాదాపుగా లోయార్డర్‌లోనే బ్యాటింగ్‌కు రావడంతో ఒక్కసారి మూడంకెల స్కోర్‌ను అందుకోలేకపోయాడు. కానీ సంజూ మాత్రం సీఎస్కే తరపున తొలి ఎడిషన్‌లో సెంచరీ బాది చరిత్ర సృష్టించాడు.చదవండి: ఆ తప్పే మా కొంపముంచింది: సన్‌రైజర్స్ కెప్టెన్🚨 SANJU SAMSON SCORED THE FIRST HUNDRED IN IPL 2026 🚨Chetta at Chepauk. 🔥 pic.twitter.com/XXWiX1P3nP— Johns. (@CricCrazyJohns) April 11, 2026 -
శతక్కొట్టిన సంజూ.. బోణీ కొట్టిన సీఎస్కే
ఐపీఎల్-2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. శనివారం చెపాక్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో సీఎస్కే విజయం సాధించింది. 213 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది.ఢిల్లీ బ్యాటర్లలో ట్రిస్టన్ స్టబ్స్(60) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఫాథుమ్ నిస్సాంక(41), అశుతోష్ శర్మ(19) రాణించారు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. సీఎస్కే బౌలర్లలో జేమీ ఓవర్టన్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. కాంబోజ్ మూడు, నూర్ అహ్మద్, ఖలీల్ తలా వికెట్ సాధించారు.సంజూ సూపర్ సెంచరీఅంతకుముందు బ్యాటింగ్ చేసిన సీఎస్కే 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. చెన్నై ఓపెనర్ సంజూ శాంసన్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. సంజూ కేవలం 52 బంతుల్లోనే తన నాలుగో ఐపీఎల్ సెంచరీ మార్కును అందుకున్నాడు. మొత్తంగా సంజూ 56 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్స్‌లతో 115 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు ఆయూశ్ మాత్రే(59) హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ ఒక్కడే ఓ వికెట్ సాధించాడు.చదవండి: IPL 2026: చెలరేగిన శాంసన్.. చెపాక్‌లో సూపర్ సెంచరీ -
చెలరేగిన శాంసన్.. చెపాక్‌లో సూపర్ సెంచరీ
ఐపీఎల్-2026లో తొలి సెంచరీ నమోదైంది. చెపాక్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ అద్బుతమైన సెంచరీతో మెరిశాడు. తొలి మూడు మ్యాచ్‌లలో సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమైన సంజూ.. ఢిల్లీ క్యాపిటల్స్‌పై మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఢిల్లీ బౌలర్లను తన ట్రేడ్ మార్క్ షాట్లతో సంజూ ఉతికారేశాడు.కేవలం 52 బంతుల్లోనే నాలుగో ఐపీఎల్ సెంచరీ మార్కును సంజూ అందుకున్నాడు. సీఎస్కే జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ త్వరగా కోల్పోయినప్పటికి.. సంజూ మాత్రం యువ ఆటగాడు ఆయూశ్ మాత్రేతో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. వారిద్దరూ రెండో వికెట్‌కు 100కు పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆ తర్వాత మాత్రే రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగినప్పటికి, సంజూ మాత్రం తన జోరును కొనసాగించాడు.మొత్తంగా 56 బంతుల్లో 115 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లు మొత్తం దారుణంగా విఫలమయ్యారు. అక్షర్ పటేల్ ఒక్కడే ఓ వికెట్ సాధించాడు.అయూశ్ మాత్రే రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగాడు. కాగా ఐపీఎల్-2026 వేలానికి ముందు సంజూ శాంసన్‌ను రూ. 18 కోట్ల భారీ ధరకు రాజస్తాన్ నుంచి సీఎస్కే ట్రేడ్‌చేసుకుంది. అయితే తొలి మూడు మ్యాచ్‌ల్లో తక్కువ స్కోర్లకే (6, 7, 9 పరుగులు) అవుట్ అయ్యి విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ ఇప్పుడు తన సూపర్ సెంచరీతోనే విమర్శలకు సమాధనమిచ్చాడు.చదవండి: ఆ తప్పే మా కొంపముంచింది: సన్‌రైజర్స్ కెప్టెన్ -
శాంసన్ మంచి మనసు.. సెల్ఫీ అడిగిన అభిమానికి ఊహించని సర్ప్రైజ్
టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ తన మంచి మనసు చాటుకున్నాడు. సంజూ తన అభిమానికి మర్చిపోలేని బహుమతిని అందించాడు. ఐపీఎల్-2026లో చెన్నై సూపర్ కింగ్స్‌కు సంజూ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. సీఎస్కే తమ చివరి మ్యాచ్‌లో ఏప్రిల్ 5న ఆర్సీబీతో తలపడంది. అయితే చెన్నై ఆడబోయే తదుపరి మ్యాచ్‌కు వారం రోజుల గ్యాప్ లభించడంతో సంజూ తిరువనంతపురంకు వెళ్లాడు. ఈ క్రమంలో సంజూ మంగళవారం ముండూరు-తూత రోడ్డులో ఫోన్ కాల్ మాట్లాడటం కోసం రోడ్డు పక్కన తాను కారు ఆపాడు. అయితే అదే సమయంలో కేబుల్ టెక్నీషియన్‌గా పనిచేసే శబరీష్, తన స్నేహితుడు మణికంఠన్‌తో కలిసి బైక్‌పై క్రికెట్ ఆడటానికి వెళ్తున్నాడు. కార్లో సంజూ ఉండడంతో చూసి తన బైక్‌ను అతడు ఆపాడు. శాంసన్ తన ఫోన్ కాల్ ముగించిన తర్వాత శబరీష్‌తో ఎంతో ఆప్యాయంగా మాట్లాడు. ఫొటో దిగుదామా అని సంజూనే స్వయంగా అడిగాడు. శబరీష్ తన ఫోన్ తీసి సెల్ఫీ తీసుకున్నాడు. అయితే ఆ ఫోన్ డిస్ప్లే పూర్తిగా పగిలిపోయి ఉండటాన్ని సంజూ గమనించాడు. దీంతో వెంటనే సంజూ తన వద్ద ఉన్న రూ. 40,000 విలువైన స్మార్ట్‌ఫోన్‌ను శబరీష్‌కు బహుమతిగా ఇచ్చాడు. సదరు అభిమాని సంతోషంలో మునిగితేలిపోయాడు. కాగా టీ20 ప్రపంచకప్‌లో దుమ్ములేపిన సంజూ శాంసన్.. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో మాత్రం తన మార్క్‌ను చూపించలేకపోతున్నాడు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యాడు.చదవండి: IPL 2026: జోస్ బట్లర్ విధ్వంసం.. ఒకే ఓవర్లో 23 పరుగులు! వీడియో -
‘ఇష్టం లేకపోతే తప్పుకో'.. సంజుపై CSK ఫ్యాన్స్ ఆగ్రహం
-
అన్నింటా విఫలం.. ‘తలా’ లేక సీఎస్కే ఆగమాగం!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు (సీఎస్కే) అత్యంత విజయవంతమైన జట్టుగా పేరుంది. ఐదుసార్లు ఐపీఎల్ చాంపియన్‌గా నిలవడంతో పాటు 12 సార్లు ప్లేఆఫ్స్ చేరిన జట్టుగా చెన్నై రికార్డు సొంతం. ధోని నేతృత్వంలో అద్భుత ఆటను ప్రదర్శించిన సీఎస్కే 2023లో చివరిసారి ఐపీఎల్ టైటిల్ అందుకుంది. ఆ తర్వాతి సీజన్ నుంచి సీఎస్కే ఆటతీరు దారుణంగా పడిపోతు వస్తోంది. గత నాలుగేళ్లుగా ధోనీ జట్టులో ఉన్నా అతడి పాత్ర అంతంతమాత్రమే. ఇక ఈ సీజన్లో సీఎస్కే ఆటతీరు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త ఆటతీరుతో హ్యాట్రిక్ ఓటములు చవిచూసింది.దారుణమైన నెట్ రన్‌రేట్‌తో పట్టికలో సీఎస్కే ఆఖరి స్థానంలో కొనసాగుతుంది. అయితే గతంలో ఇలా వరుస ఓటములు చవిచూసినప్పటికీ తిరిగి బౌన్స్ బ్యాక్ అయిన సీఎస్కేకు ఈసారి మాత్రం ఆ చాన్స్ లేదనిపిస్తోంది.గతంలో సీఎస్కే అంటే వయసు మీరిన ఆటగాళ్లే ఎక్కువగా కనిపిస్తుండేవారు. దీంతో ఆ జట్టుకు వృద్ధాప్య జట్టుగా పేరుండేది. కానీ అదే వెటరన్ టీంతోనే ధోని ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ సాధించిపెట్టాడు. కానీ ఈసారి సీఎస్కే కూడా గేర్ మార్చింది. జట్టును మొత్తం యువ ఆటగాళ్లతో నింపే ప్రయత్నం చేసింది. అందుకు జడేజా, సామ్ కరన్ వంటి సీనియర్లను విడుదల చేసిన సీఎస్కే ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మ లాంటి కుర్రాళ్ల కోసం అధిక మొత్తంలో ఖర్చు చేసి జట్టులోకి తీసుకొచ్చింది. కానీ ఇక్కడే సీన్ రివర్స్ అయింది. యువ రక్తంతో నిండిన జట్టు ఈసారి అద్భుతాలు చేస్తుందని ఆశించారు చెన్నై అభిమానులు. కానీ ఆ జట్టు తొలి మూడు మ్యాచ్‌లో పేలవ ప్రదర్శనతో చతికిలపడింది. రాజస్తాన్‌తో తొలి మ్యాచ్‌లో 127 పరుగులకే కుప్పకూలిన సీఎస్కే.. రెండో మ్యాచ్‌లో ఆయుష్ మాత్రే, సర్ఫరాజ్ లాంటి కుర్రాళ్ల ప్రదర్శనతో 209 పరుగులు చేసి కూడా పంజాబ్ బ్యాటర్లను నిలువరించలేక ఓటమి చవిచూసింది. ఇక మూడో మ్యాచ్‌లో సీఎస్కే బౌలర్లను ఆర్సీబీ బ్యాటర్లు ఒక ఆట ఆడుకున్నారు. 251 పరుగుల కొండంత లక్ష్యం ఛేదించే క్రమంలో చతికిలపడి హ్యాట్రిక్ ఓటమిని మూటగట్టుకుంది.కెప్టెన్‌గా రుతురాజ్ విఫలం..2024 సీజన్లో సీఎస్కే కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన రుతురాజ్ గైక్వాడ్ వైఫల్యం కూడా సీఎస్కేను ఇబ్బందుల్లో పడేసింది. 2024 సీజన్లో 583 పరుగులు సాధించి రెండో టాప్ స్కోరర్‌గా నిలిచిన రుతురాజ్ 2026 సీజన్లో మాత్రం అటు బ్యాటర్‌గా.. ఇటు కెప్టెన్‌గా దారుణంగా విఫలమవుతున్నాడు. వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో ఫెయిలువున్న రుతురాజ్ ఆర్సీబీతో మ్యాచ్‌లో ఓటమికి తానే బాధ్యత తీసుకుంటున్నట్లు చెప్పడం ఆసక్తి కలిగించింది. గత సీజన్లలో కెప్టెన్సీ ఎలా ఉన్నా బ్యాటర్ రాణించేవాడు రుతురాజ్. కానీ ఈసారి అదీ లేదు. 6, 28, 7.. ఇవీ మూడు ఇన్నింగ్స్ ల్లో అతడి స్కోర్లు. వేగంగా ఆడలేని బలహీనతను అతను అధిగమించలేకపోతున్నాడు. కెప్టెన్‌గా జట్టును సమష్టిగా నడిపించడంలోనూ రుతురాజ్ విఫలమవుతున్నాడు. బౌలింగ్, ఫీల్డింగ్ పకడ్బందీగా సాగలేదు. ధోనిలా అందుబాటులో ఉన్న బౌలింగ్ వనరులను రుతురాజ్ సమర్థంగా ఉపయోగించుకోలేకపోతున్నాడనే వాదన గట్టిగా వినిపిస్తోంది.సంజూకు ఏమైంది?రాజస్తాన్ రాయల్స్ నుంచి చెన్నై సూపర్‌కింగ్స్‌కు ట్రేడ్ అయిన సంజూ శాంసన్ ఈసారి సీఎస్కే తలరాతను మారుస్తాడని అంతా ఊహించారు. కానీ టీ20 ప్రపంచకప్‌లో సంచలన ఇన్నింగ్స్‌లతో హీరో మారిన శాంసన్ ఐపీఎల్‌కు వచ్చేసరికి మాత్రం జీరో అయిపోయాడు. శాంసన్ బ్యాటింగ్‌లో నిలకడలేమి స్పష్టంగా కనిపిస్తోంది. ఒక ఓపెనింగ్ భాగస్వామ్యం ఏ జట్టుకైనా అత్యంత కీలకం. కానీ శాంసన్, రుతురాజ్‌లు ఏకకాలంలో విఫలం కావడం కూడా సీఎస్కేను దెబ్బతీస్తోంది. సంజూ శాంసన్ వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ 6,7,9.. సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాడు. ఓపెనర్లిద్దరూ ఆరంభంలోనే ఔటవ్వడంతో తర్వాత వచ్చేవారిపై ఒత్తిడి పెరిగి సరిగ్గా ఆడలేకపోతున్నారు. మిడిలార్డర్లో ఆయుశ్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్ ఆదుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ పెద్దగా ప్రయోజనం ఉండడం లేదు. కోట్లు ఖర్చు చేసిన ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మలు దారుణంగా విఫలమవుతున్నారు. ఆల్‌రౌండర్ శివమ్ దూబే ఎప్పుడు ఎలా ఆడతాడో అర్థం కాని స్థితి నెలకొంది.పసలేని బౌలింగ్..బ్యాటింగ్‌లో సమస్యలు ఇలా ఉంటే బౌలింగ్‌లో పరిస్థితి మరోలా ఉంది. అన్షుల్ కాంబోజ్ మినహా చెన్నైకి చెప్పుకోదగ్గ బౌలర్లు పెద్దగా కనిపించడం లేదు. జేమీ ఓవర్టర్, నూర్ అహ్మద్‌లు ఉన్నా వారు పెద్దగా ప్రభావం చూపడం లేదు. శివమ్ దూబే బౌలింగ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఒకప్పుడు సీఎస్కే బౌలింగ్, బ్యాటింగ్ ఇలా అన్ని విభాగాల్లో సమానత్వం కనిపించేది. కానీ ఇప్పటి జట్టులో అది కరువైంది.అదంతా గతం..ఇక కెప్టెన్‌గా సీఎస్కేకు ఐదు ఐపీఎల్ ట్రోఫీలు అందించిన ధోని జట్టుకు దూరమవ్వడం కూడా సీఎస్కేను డీలా పడేలా చేసింది. ధోని ఆడకున్నా సరే అతడు జట్టుతో పాటు ఉంటే అదే కొండంత బలం. బ్యాటింగ్‌లో ఊపు తగ్గినప్పటకీ వికెట్ల వెనుక ఉండి అతడిచ్చే సలహాలు జట్టుకు ఎన్నోసార్లు ఉపయోగపడ్డాయి. కానీ ఇప్పుడు అదంతా గతం. ధోని ఇప్పటికిప్పుడు జట్టులోకి వచ్చినా సీఎస్కేకు పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. ఎందుకంటే గత రెండు సీజన్లలో ధోని పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నప్పటికీ సీఎస్కే లీగ్ దశకే పరిమితమైంది. మరి ఇప్పుడు ధోని వచ్చినా జట్టును ఏం మార్చగలడు అనే అభిప్రాయయాలు బలంగా వినిపిస్తున్నాయి.చదవండి: ‘తప్పు చేశావ్.. కెప్టెన్‌గా అదొక చెత్త నిర్ణయం’ -
ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ రేసులో సామ్సన్, బుమ్రా
దుబాయ్: టీమిండియా ఓపెనర్ సంజూ సామ్సన్, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ అవార్డుకు నామినేట్ అయ్యారు. గత నెలలో జరిగిన టి20 ప్రపంచకప్‌లో ప్రదర్శనకుగానూ ఐసీసీ వీరిద్దరి పేర్లను నామినేట్ చేసింది. వరల్డ్‌కప్ చివరి మూడు మ్యాచ్‌ల్లో అర్ధశతకాలతో భారత్ వరుసగా రెండోసారి చాంపియన్‌గా నిలవడంలో సామ్సన్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. వెస్టిండీస్‌తో కీలక మ్యాచ్‌లో 97 పరుగులు చేసిన సంజూ... సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై, ఫైనల్లో న్యూజిలాండ్‌పై 87 పరుగుల చొప్పున చేసి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు సైతం గెలుచుకున్నాడు. ఇక ఈ టోర్నీలో 7 ఎకానమీతో 7 వికెట్లు పడగొట్టిన బుమ్రా జట్టుకు అవసరమైనప్పుడల్లా ‘బ్రేక్ త్రూ’ అందించాడు. ఈ ఇద్దరితో పాటు దక్షిణాఫ్రికా ప్లేయర్ కానర్ ఎస్టెర్హుజెయిన్ సైతం రేసులో ఉన్నాడు. 2021 జనవరిలో ఐసీసీ ప్రవేశపెట్టిన ఈ అవార్డును ఇప్పటి వరకు పది మంది భారత క్రికెటర్లు (పంత్, అశ్విన్, భువనేశ్వర్, కోహ్లి, యశస్వి జైస్వాల్, సిరాజ్, అభిషేక్ శర్మ–ఒక్కోసారి... శ్రేయస్ అయ్యర్–2 సార్లు, బుమ్రా–2 సార్లు, శుబ్‌మన్ గిల్–4 సార్లు) గెల్చుకున్నారు. -
కష్టాల్లో టీమిండియాను గెలిపించాడు.. ప్రచారంలో సంజూ ని ఆకాశానికి ఎత్తేసిన మోడీ
-
‘ఇష్టం లేకపోతే తప్పుకో’.. సీఎస్కే ఫ్యాన్స్ ఆగ్రహం
టీమిండియా టీ20 ప్రపంచకప్ గెలవడంలో ఓపెనర్ సంజూ శాంసన్‌ది కీలకపాత్ర అని చెప్పొచ్చు. సూపర్-8లో వెస్టిండీస్‌తో మ్యాచ్ ద్వారా ఫామ్‌లోకి వచ్చిన సంజూ ఆ తర్వాత సెమీస్, ఫైనల్స్‌లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. అదే సూపర్‌ఫామ్‌ను ఐపీఎల్ 19వ సీజన్లోనూ కొనసాగిస్తాడని అంతా భావించిన వేళ సీన్ మొత్తం రివర్స్ అయింది.రాజస్తాన్ రాయల్స్ నుంచి ఏ ముహూర్తంలో చెన్నై సూపర్‌కింగ్స్‌కు ట్రేడ్ అయ్యాడో కానీ దారుణంగా విఫలమవుతూ వస్తున్నాడు. తొలి మూడు మ్యాచ్‌ల్లో సీఎస్కే ఓటమి చవిచూస్తే.. శాంసన్ ఆడకపోవడం కూడా జట్టును బాగా దెబ్బతీస్తోంది. శాంసన్ ఈ సీజన్లో సీఎస్కేకు బలమవుతాడనుకుంటే దారుణ ఆటతీరుతో బలహీనంగా మారిపోయాడు. శాంసన్ వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ 6,7 9 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో సీఎస్కే అభిమానులు సంజూ శాంసన్ ఆటతీరుపై గుస్సా అవుతున్నారు. టీ20 ప్రపంచకప్‌లో హీరోగా నిలిచిన శాంసన్ ఐపీఎల్లో జీరో అయిపోయాడంటూ ట్రోల్స్‌కు గురి చేస్తున్నారు. రాజస్తాన్ కెప్టెన్‌గా అదరగొట్టిన శాంసన్ సీఎస్కేకు వచ్చేసరికి మాత్రం పూర్తిగా విఫలమవుతున్నాడు. ముఖ్యంగా ఆడాలనే పట్టుదల శాంసన్‌లో ఏమాత్రం కనిపించడం లేదని సీఎస్కే అభిమానులు పేర్కొంటున్నారు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అవసరమైన పరుగులు చేయాల్సిన చోట విఫలమవుతుండడం చూసి ఆసక్తి లేకపోతే జట్టు నుంచి తప్పుకుంటే బాగుంటుందేమోనని సోషల్ మీడియా వేదికగా శాంసన్‌కు సలహాలు ఇస్తున్నారు. మానసికంగా సిద్ధంగా లేకపోతే మాత్రం కొన్ని మ్యాచ్‌లకు జట్టు నుంచి తప్పుకోవడమే మేలని పేర్కొన్నారు. కెమెరాలన్నీ శాంసన్వైపు తిరిగిన ప్రతీసారి ఏదో కోల్పోయినట్లుగా శాంసన్ ఫీలవుతున్నాడని, సీఎస్కేలోకి వచ్చాకా ఇప్పటివరకు అతడు నవ్వడం తాము చూడలేదని అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. టీ20 ప్రపంచకప్‌లో కనిపించిన శాంసన్ మాకు కావాలని, ఆ కసి ఎక్కడా కనిపించడం లేదని, ఇప్పటినుంచైనా కాస్త శ్రద్ద పెడితే బాగుంటుందని వాపోయారు. ఐదుసార్లు ఐపీఎల్లో చాంపియన్‌గా నిలిచిన సీఎస్కే ఈ సీజన్లో హ్యాట్రిక్ ఓటములు నమోదు చేసి విజయం కోసం చకోర పక్షిలా ఎదురుచూడాల్సి వస్తోంది.మ్యాచ్ విషయానికొస్తే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 43 పరుగుల తేడాతో చెన్నై సూపర్‌కింగ్స్‌పై విజయం సాధించింది. రజత్ పటిదార్, టిమ్ డేవిడ్, పడిక్కల్‌లు రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 3 వికెట్లష్టానికి 250 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన సీఎస్కే 19.4 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది.Dear @IamSanjuSamson,If you’re not mentally in it, then step aside for a few games. This isn’t just about runs anymore. Your body language is screaming disinterest. Every time the camera’s on you, you look frustrated and disconnected. Honestly, I’ve never seen you smiling even… pic.twitter.com/L7bFl0uJbf— Madras Man (@newbatsman) April 5, 2026చదవండి: ఇరగదీస్తున్న ఇద్దరు మొనగాళ్లు.. రీఎంట్రీ ఇవ్వాల్సిందే! -
IPL 2026: నిరాశలో సీఎస్కే ఫ్యాన్స్
టీ20 ప్రపంచకప్ 2026లో భీకర ఫామ్ ప్రదర్శించి, టీమిండియా టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించిన సంజూ శాంసన్.. మెగా టోర్నీ పూర్తైన కొద్ది రోజులకే ఫామ్ కోల్పోయాడు. ప్రస్తుతం జరుగుతున్న క్యాష్ రిచ్ లీగ్‌లో అతను ఫామ్ కోల్పోయి నానా తంటాలు పడుతున్నాడు. ఈ సీజన్‌కు ముందే రాజస్థాన్ రాయల్స్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌కు ట్రేడ్ అయిన చెటా.. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమై ఫ్యాన్స్‌ను నిరాశపరిచాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో 6 పరుగులకే ఔటైన సంజూ.. ఇవాళ (ఏప్రిల్ 3) పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఓ పరుగు అదనంగా చేసి 7 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరాడు.అప్పటివరకు భీకర ఫామ్‌లో ఉండిన సంజూ తమ ఫ్రాంచైజీకి వచ్చే సరికి వరుసగా విఫలం కావడాన్ని సీఎస్కే అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంద చెటా ఇది అంటూ బాధపడుతున్నారు. ప్రపంచకప్‌లో సూపర్ ఫామ్‌లో ఉండిన సంజూపై సీఎస్కే భారీ అంచనాలు పెట్టుకొని ఉంది. అయితే అతను వరుసగా రెండు మ్యాచ్‌ల్లో తేలిపోవడంతో ఫ్రాంచైజీ యాజమాన్యం సైతం తలలు పట్టుకుంది.అసలే ఆ జట్టుకు ధోని అందుబాటులో లేడు. యువ చిచ్చరపిడుగు డెవాల్డ్ బ్రెవిస్ గాయం కారణంగా రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. యువకులతో నిండిన ప్రస్తుత జట్టులో సంజూనే అనుభవజ్ఞుడు. ఇలాంటి పరిస్థితుల్లో సంజూ నుంచి ఆశించడం తప్పేమీ కాదు. నేటి మ్యాచ్‌లో సంజూ బార్ట్లెట్ బౌలింగ్‌లో బౌండరీ బాది, ఆ మరుసటి బంతికే వికెట్ కీపర్ ప్రభ్‌సిమ్రన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.ఈ మ్యాచ్‌లో సీఎస్కే టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది. 7 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 71-1గా ఉంది. సంజూ త్వరగా ఔటైనా, ఆయుశ్ మాత్రే ధాటిగా ఆడుతున్నాడు. 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 43 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. అతనికి కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (14) అండగా ఉన్నాడు. కాగా, ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో సీఎస్కే రాజస్థాన్ రాయల్స్ చేతిలో దారుణ పరాభవాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో సీఎస్కే కనీసం 130 పరుగులు కూడా చేయలేకపోయింది. వారు నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని రాయల్స్ బ్యాటర్లు ఆడుతూపాడుతూ ఛేదించారు. ఛేదనలో యువ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి, ఆదిలోనే తన జట్టు గెలుపును ఖరారు చేశాడు. -
సంజూ శాంసన్‌ను రెచ్చగొట్టిన రియాన్ పరాగ్
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (మార్చి 30) జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే ఓపెనర్, మాజీ రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌ను ప్రస్తుత రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. ఈ మ్యాచ్‌లో నూర్ అహ్మద్ బౌలింగ్‌లో సిక్సర్ బాదిన తర్వాత వికెట్‌కీపింగ్ చేస్తున్న సంజూను కవ్విస్తూ ఓవరాక్షన్ చేశాడు. సంజూ తరహాలోనే కండలు చూపిస్తూ, ఇది నా పవర్ అన్నట్లు సెలబ్రేషన్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలైంది.pic.twitter.com/jV9dCFiTJn— crictalk (@crictalk7) March 31, 2026ఇది చూసి సంజూ అభిమానులు హర్ట్ అయ్యారు. హనుమంతుని ముందా కుప్పిగంతులు అంటూ పంచ్‌లు వేశారు. మాజీ కెప్టెన్ అన్న గౌరవం కూడా లేదా అంటూ మండిపడ్డారు. కెప్టెన్ కాగానే కళ్లు నెత్తికెక్కాయా అంటూ వార్నింగ్‌లు ఇచ్చారు. వాస్తవానికి రియాన్‌ను ఇలాంటి అతి ప్రవర్తన కొత్తేమీ కాదు. అతనికి ఓవరాక్షన్ స్టార్ అన్న బిరుదు కూడా ఉంది. అయితే, తాజా మాజీ కెప్టెన్ విషయంలోనూ ఇలా ప్రవర్తిస్తాడని ఎవరూ ఊహించి ఉండరు. రియాన్ ఏ ఉద్దేశంతో కండలు చూపించినా, అది సంజూ అభిమానులను మాత్రం హర్ట్ చేసింది.ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో రియాన్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ సీఎస్కేపై ఏకపక్ష విజయం సాధించింది. తొలుత బౌలింగ్‌లో సీఎస్కేను 127 పరుగులకే కుప్పకూల్చి, ఆతర్వాత మెరుపు వేగంతో లక్ష్యాన్ని ఛేదించింది. తొలిసారి సీఎస్కేకు ఆడుతున్న సంజూ శాంసన్ (6) ఈ మ్యాచ్‌లో దారుణంగా విఫలం కాగా.. ఫుల్‌టైమ్ కెప్టెన్‌గా రియాన్ తొలి మ్యాచ్‌లోనే బోణీ కొట్టాడు.బౌలింగ్‌లో కలిసికట్టుగా సీఎస్కే పతనాన్ని శాశించిన రాయల్స్.. బ్యాటింగ్‌లో వైభవ్ సూర్యవంశీ (17 బంతుల్లో 52; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసకర అర్ద సెంచరీతో విరుచుకుపడటంతో 12.1 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఊదేసింది. ఫలితంగా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, సీజన్లో ఘనంగా బోణీ కొట్టింది. -
వరల్డ్‌కప్ హీరో సంజూ అట్టర్ ఫ్లాఫ్.. తొలి మ్యాచ్‌లో ఫెయిల్
టీ20 ప్రపంచకప్-2026 హీరో సంజూ శాంసన్ ఐపీఎల్ తాజా ఎడిషన్ తొలి మ్యాచ్‌లోనే నిరాశపరిచాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున భారీ అంచనాలతో బరిలోకి దిగాడు ఈ కేరళ స్టార్. ఐపీఎల్-2026లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో సోమవారం నాటి మ్యాచ్ సందర్భంగా.. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి సీఎస్కే ఇన్నింగ్స్ ఆరంభించాడు సంజూ.క్లీన్‌బౌల్డ్ జోఫ్రా ఆర్చర్ (Jofra Archer) రాయల్స్ బౌలింగ్ ఎటాక్ ఆరంభించగా.. సంజూ ఐదో బంతికి ఫోర్ బాది ఖాతా తెరిచాడు. అయితే, ఆ తర్వాత బ్యాట్ ఝులిపించలేకపోయిన ఈ కుడిచేతి వాటం ఆటగాడు.. రెండో ఓవర్ ఆఖరి బంతికే పెవిలియన్ చేరాడు.రాయల్స్ పేసర్ నండ్రీ బర్గర్ బౌలింగ్‌లో సంజూ శాంసన్ (Sanju Samson) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో మొత్తంగా ఏడు బంతులు ఎదుర్కొన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. ఆరు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. సీఎస్కే తరఫున అరంగేట్ర మ్యాచ్‌లోనే సంజూ విఫలం కావడంతో అభిమానులు ఉసూరుమంటున్నారు.𝐒𝐨𝐮𝐧𝐝𝐬 𝐨𝐟 𝐓𝐢𝐦𝐛𝐞𝐫 🎶Nandre Burger 🤝 Jofra Archer #RR fans, how was that for a start? 😉 Updates ▶️ https://t.co/UzbuFk5G26#TATAIPL | #KhelBindaas | #RRvCSK | @rajasthanroyals pic.twitter.com/iqLU8yIgcX— IndianPremierLeague (@IPL) March 30, 2026వరల్డ్‌కప్ హీరో సంజూకాగా స్వదేశంలో టీ20 ప్రపంచకప్ టోర్నీకి ముందు ఫామ్ కోల్పోయిన సంజూ శాంసన్‌కు.. అదృష్టవశాత్తూ సూపర్-8 మ్యాచ్‌ల సందర్భంగా తిరిగి తుది జట్టులోకి వచ్చే అవకాశం దక్కింది. ఈ క్రమంలో సూపర్-8 నాకౌట్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై 97 పరుగులతో రాణించిన సంజూ.. ఆ తర్వాత కూడా భీకర ఫామ్ కొనసాగించాడు.ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లో, న్యూజిలాండ్‌తో ఫైనల్లో వరుసగా 89, 89 పరుగులు చేసిన సంజూ.. భారత్ చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. ఇదే జోరులో చెన్నై తరఫునా చెలరేగుతాడని అభిమానులు కొండంత ఆశతో ఎదురుచూడగా.. తొలి మ్యాచ్‌లోనే సంజూ తడబడ్డాడు.కకావికలంకాగా తాజా సీజన్లో తమ తొలి మ్యాచ్‌లో చెన్నై రాజస్తాన్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు మైదానంలో దిగింది. గౌహతి వేదికగా టాస్ ఓడిన చెన్నై తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఇక గాయం కారణంగా దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని దూరంకాగా.. అతడి స్థానంలో సంజూ వికెట్ కీపర్‌గా సేవలు అందించనున్నాడు.కాగా రాయల్స్ పేసర్ల విజృంభణతో చెన్నై టాపార్డర్ కుప్పకూలింది. ఓపెనర్లు సంజూ (6), రుతు (6) విఫలం కాగా.. ఆయుశ్ మాత్రే డకౌట్ అయ్యాడు. మాథ్యూ షార్ట్ రెండు పరుగులకే పెవిలియన్ చేరాడు. ఫలితంగా పవర్ ప్లే (6 ఓవర్లు)లో చెన్నై నాలుగు వికెట్ల నష్టానికి కేవలం 41 పరుగులే చేసింది.చదవండి: బంగ్లాదేశ్‌కు బ్యాడ్‌న్యూస్!.. షాకిచ్చిన జియోస్టార్! -
IPL 2026: సీఎస్కేలో కీలక మార్పు
గతేడాది చేదు అనుభవాన్ని మూటగట్టుకుంది చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే). చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఐపీఎల్లో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా ఐదు మ్యాచ్‌ల తర్వాత జట్టుకు దూరం కాగా.. దిగ్గజ సారథి మహేంద్ర సింగ్ ధోని జట్టును ముందుకు నడిపాడు.ఊహించని నిర్ణయంఅయితే, పద్నాలుగింట కేవలం నాలుగు మ్యాచ్‌లే గెలిచింది సీఎస్కే. దీంతో జట్టు ఆట తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2026 మినీ వేలానికి ముందు సీఎస్కే ఊహించని నిర్ణయం తీసుకుంది. టీమిండియా స్టార్, సీఎస్కే మాజీ కెప్టెన్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja)ను ట్రేడ్ చేసింది.సంజూ శాంసన్ చేరికజడ్డూను రాజస్తాన్ రాయల్స్‌కు ఇచ్చేసి.. అతడికి బదులుగా ఆ జట్టు కెప్టెన్, టీమిండియా టీ20 స్టార్ సంజూ శాంసన్ (Sanju Samson)ను జట్టులో చేర్చుకుంది. దీంతో వికెట్ కీపింగ్‌లో ధోని వారసుడిగా సంజూ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి. అంతేకాదు రుతురాజ్ గైక్వాడ్‌ను కాదని సంజూను కెప్టెన్ చేస్తారనే ప్రచారం సాగింది. అయితే, సీఎస్కే మాత్రం రుతుకే మరోసారి పగ్గాలు అప్పగించింది.నాతో పాటు ఓపెనర్గాఈ నేపథ్యంలో సంజూ శాంసన్ పాత్ర ఏమిటన్న అంశంపై రుతురాజ్ గైక్వాడ్ తాజాగా స్పందించాడు. ముంబైలో బుధవారం జరిగిన కెప్టెన్ల సమావేశానికి రుతు హాజరయ్యాడు. ఈ సందర్భంగా తాను, సంజూ ఈసారి ఓపెనర్లుగా బరిలోకి దిగుతామని స్పష్టం చేశాడు. తద్వారా ఈసారి సీఎస్కే ఓపెనింగ్ జోడీ ఎవరన్న ప్రశ్నకు తెరదించాడు.కాగా ఓపెనర్‌గా రుతుకు గొప్ప రికార్డు ఉంది. ఇప్పటి 60 ఇన్నింగ్స్‌లో అతడు 2289 పరుగులు చేశాడు. అయితే, గతేడాది రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి సీఎస్కే ఓపెనర్లుగా బరిలోకి దిగగా.. మూడో స్థానంలో రుతురాజ్ వచ్చాడు.ఓపెనర్‌గానే బెస్ట్ఇక ఇప్పటికి ఓవరాల్‌గా వన్‌డౌన్‌లో ఎనిమిది ఇన్నింగ్స్ ఆడిన రుతు కేవలం 208 పరుగులే చేశాడు. దీంతో మరోసారి తానే ఓపెనింగ్ చేసేందుకు సిద్ధమయ్యాడు. మరోవైపు.. టీమిండియా, రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్‌గా సంజూకు ఉన్న రికార్డు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల టీ20 ప్రపంచకప్-2026లో భారత్ చాంపియన్‌గా నిలవడంలో అతడిదే కీలక పాత్ర. నాకౌట్ మ్యాచ్‌లలో సంజూ 97*, 89, 89 పరుగులతో దుమ్ములేపాడు.చదవండి: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా ప్లేయర్.. ప్రపంచ రికార్డు -
చెన్నై చెలరేగేనా!
ఏ సీజన్లోనైనా ఐపీఎల్ టైటిల్ ఫేవరెట్స్ ప్రస్తావన వస్తే కచ్చితంగా అందులో ఉండే జట్టు చెన్నై సూపర్‌కింగ్స్. నిషేధం కారణంగా మధ్యలో రెండేళ్లు మినహాయిస్తే 16 సీజన్లలో 12 సార్లు టాప్–4లో నిలిచిన ఏకైక జట్టు చెన్నై సూపర్ కింగ్స్. 12 పర్యాయాల్లో ఐదుసార్లు విజేతగా... ఐదుసార్లు రన్నరప్‌గా నిలిచి చెన్నై తమ సత్తా చాటుకుంది. అయితే గత రెండేళ్లలో చెన్నై జట్టు పరిస్థితి మారింది. ‘కెప్టెన్ కూల్’ ధోని సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవడం... రుతురాజ్ గైక్వాడ్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించడం జరిగింది. 2023లో ధోని సారథ్యంలోనే ఐదోసారి ఐపీఎల్ చాంపియన్‌గా నిలిచిన చెన్నై ఆ తర్వాత తడబడింది. రుతురాజ్ సారథ్యంలో 2024లో ఐదో స్థానంలో నిలిచిన ఆ జట్టు 2025లో అనూహ్యంగా చివరిదైన పదో స్థానంతో సరిపెట్టుకొని తమ లీగ్ చరిత్రలోనే పేలవమైన ప్రదర్శన నమోదు చేసింది.సూపర్ కింగ్స్‌లో నాణ్యమైన ఆటగాళ్లే కాదు... పొట్టి ఫార్మాట్‌కు అవసరమైన స్పెషలిస్ట్ ప్లేయర్లు కూడా ఉన్నారు. ఒకప్పటిలానే ఇప్పుడు కూడా ఈ జట్టు విదేశీ మెరుపుల కంటే భారత ఆటగాళ్లు, వారి బలాబలాలనే నమ్ముకుంది. అయితే దీనికి విదేశీ ఆటగాళ్లు మెరుపులు జోడిస్తే అది అదనపు బలమే అవుతుంది. ఫ్రాంచైజీల మధ్య జరిగిన అంతర్గత ట్రేడింగ్‌లో రవీంద్ర జడేజాను వదిలేసి అతని స్థానంలో సంజూ సామ్సన్ను కొనుగోలు చేసింది. పలువురు దేశవాళీ కుర్రాళ్లను తీసుకోవడం ద్వారా జట్టులోకి యువ రక్తాన్ని ఎక్కించినట్లయ్యింది. కెపె్టన్ రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే చెన్నై కీలక ఆటగాళ్లు కాగా... క్రికెట్ దిగ్గజం ధోని తుది జట్టుకు ఆడుతున్నప్పటికీ అతని పాత్ర మాత్రం ఆటకంటే కూడా మార్గదర్శనంతోనే పరిమితమనే మాట జగమెరిగిన సత్యం. వయసు పైబడిన అతను ఇప్పటికీ ఫ్రాంచైజీ ఆశాకిరణంగా ఉన్నాడు. అప్పుడప్పుడు ఫినిషర్‌గా బ్యాటింగ్‌కు దిగే అవకాశమైతే ఉంది! కానీ అన్ని మ్యాచ్‌ల్లో మాత్రం కాదు. మరోసారి ధోనికిది ఫేర్వెల్ ఐపీఎల్ కాగలదని క్రికెట్ విశ్లేషకులంతా భావిస్తున్నారు. దీంతో చెన్నై సహచరులంతా తమ అభిమాన భారత దిగ్గజానికి ఘనంగా వీడ్కోలు పలికేందుకు టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు. బ్రెవిస్, హెన్రీలు సత్తా చాటితే చెన్నైకి భారత ఆటగాళ్లే కొండంత బలమైనప్పటికీ విదేశీ ఆటగాళ్లలో బ్రెవిస్, నూర్ అహ్మద్, హెన్రీలను కూడా నమ్ముకుంది. గత సీజన్లో సత్తా చాటుకున్న బ్రెవిస్, నూర్ అహ్మద్ రాణిస్తే చెన్నై మెరుగైన ఫలితాలు సాధిస్తుంది. అలాగే పవర్‌ప్లేలో ప్రత్యర్థి బ్యాటింగ్ వెన్ను విరిచే సత్తా ఉన్న మ్యాట్ హెన్రీ కూడా చెలరేగితే చెన్నై జోరుకు ఎదురుండదు. వేలంలో ఎవరి ఊహకి అందని విధంగా భారీ మొత్తం వెచ్చించి మరీ కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్‌లను చెన్నై తీసుకుంది. ఈ ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్లపై ఎవరికి ఎలాంటి అంచనాలున్నా... లేకున్నా... ఫ్రాంచైజీ యాజమాన్యం మాత్రం పెద్ద నమ్మకాన్నే పెట్టుకుంది. లేకుంటే కేవలం ఇద్దరిపైనే రూ. 28.40 కోట్లనయితే ఖర్చు చేయదుగా! సర్ఫరాజ్ ఖాన్ కూడా సూపర్‌కింగ్స్ జట్టు ద్వారా అందరికంటా పడాలని తెగ ఆరాటపడుతున్నాడు. అందివచ్చే అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవాలనే లక్ష్యంతో ఉన్నాడు. సామ్సన్ ‘కింగ్స్’ రాత మార్చేనా... సంజూ సామ్సన్ అంటే ఒకప్పుడు ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ జట్టే గుర్తొస్తుంది. ఇప్పుడు అలా కాదు. 2026 టి20 ప్రపంచకప్ కూడా గుర్తుంటుంది. నిజానికి ఈ మెగా ఈవెంట్ మొత్తం మ్యాచ్‌లు కూడా ఆడని ప్లేయర్... మొత్తం ప్రపంచకప్ కథనే మార్చిన ఆటగాడయ్యాడు. వెస్టిండీస్‌తో క్వార్టర్ ఫైనల్స్‌ను తలపించిన సూపర్–8 చివరి మ్యాచ్‌లో సామ్సన్ (97 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. తర్వాత సెమీఫైనల్లో 89, ఫైనల్లో 89 స్కోర్లు భారత్‌ను ప్రపంచకప్‌ను నిలబెట్టుకునేలా చేశాయి. అలా ఇప్పుడు ఐపీఎల్ ప్లేయర్ కాస్తా టీమిండియా స్టార్ అయ్యాడు. గెలిచిన కప్, ఆడబోయే లీగ్ రెండూ టి20 ఫార్మాటే కావడంతో ఈ ఫార్మాట్లో సూపర్ ఫామ్‌లో ఉన్న సామ్సన్ ఇప్పుడు ధోని జట్టుకు బంగారు కొండలా కనిపిస్తున్నాడు. రుతురాజ్, శివమ్ దూబేలాంటి హిట్టర్లున్న కింగ్స్‌కు పూర్వవైభవం తేవాలన్నా... జట్టు రాత మారాలన్నా అది సామ్సన్ ఒక్కడి మెరుపులపైనే ఆధారపడి ఉంది. ధోని తుది జట్టుకు ఆడుతున్నాడనే ధైర్యం కూడా చెన్నైకి అదనపు బలం కాగాలదు. ఈ నేపథ్యంలో అన్ని అనుకున్నట్లు జరిగితే చెన్నై ఖాతాలో ఆరో టైటిల్ చేరడం సాధ్యమే. ఇదే జరిగితే ఫ్యాన్స్ ‘విజిల్ పొడు’తో సందడి చేసుకుంటారు. చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు: రుతురాజ్ గైక్వాడ్ (కెపె్టన్), ధోని, సంజూ సామ్సన్, ఆయుశ్ మాత్రే, బ్రెవిస్, రామకృష్ణ ఘోష్, శివమ్ దూబే, ఉరి్వల్ పటేల్, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్, ముకేశ్ చౌధరీ, నూర్ అహ్మద్, శ్రేయస్ గోపాల్, గుర్జప్నీత్ సింగ్, ఓవర్టన్, అకీల్ హోసీన్, ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ, మాథ్యూ షార్ట్, అమన్ ఖాన్, సర్ఫరాజ్, హెన్రీ, రాహుల్ చహర్, జాక్ ఫౌక్స్. -
సంజూ శాంసన్ స్థానాన్ని భర్తీ చేసేటోడు ఇంకా పుట్టలే..! రాజస్థాన్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.
-
‘సంజూకు మామయ్యలాంటి వాడిని’
భారత జట్టు స్టార్ వికెట్‌కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌ను తర్వాతి ధోనీగా పోల్చాల్సిన అవసరం లేదని టీమిండియా హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ స్పష్టం చేసినట్లు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ పేర్కొన్నారు. ఇటీవల తమ మధ్య జరిగిన ఒక సంభాషణలో గంభీర్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు శశిథరూర్ వెల్లడించారు. అయితే సంజూ శాంసన్‌తో బంధం ఈనాటిది కాదని, అతడికి తాను మామయ్యలాంటి వాడినని తెలిపారు. ఇటీవలే టీ20 ప్రపంచకప్ 2026లో సంజూ అద్భుత ప్రదర్శనతో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచిన సంగతి తెలిసిందే. టోర్నీలో 321 పరుగులు చేసిన శాంసన్ ముఖ్యంగా సెమీఫైనల్, ఫైనల్లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో శశిథరూర్ సంజూ శాంసన్‌తో తనకున్న అనుబంధాన్ని, సంజూ విషయంలో గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేసుకున్నాడు. ‘సంజూని మొదటిసారి 14 ఏళ్ల వయసులో చూశాను. ఆ సమయంలో అతడికి నేను ఎందుకో అంకుల్‌గా ఫీలయ్యాను. ఆ సమయంలోనే శాంసన్ టాలెంట్ స్పష్టంగా కనిపించింది. వికెట్ కీపింగ్, బ్యాటింగ్ రెండింట్లోనూ అసాధారణ ప్రతిభ ఉంది. అప్పుడు నేను నువ్వు తర్వాతి ధోనీ అవుతావని శాంసన్‌కు చెప్పాను. కానీ తర్వాత గంభీర్‌తో ఈ విషయమై చర్చకు వచ్చినప్పుడు, ఆయన ‘లేదండీ శాంసన్ తర్వాతి ధోనీ కాదు..వన్ అండ్ ఓన్లీ సంజూ శాంసన్’ అని చెప్పినట్లు గుర్తుంది. ఇవాళ గంభీర్ మాటలు నిజమయ్యాయి.సంజూ మరెవరికీ ప్రతిరూపం కావాల్సిన అవసరం లేదు. అతడిని అతడిలానే ఉండనిద్దాం. సంజూ శాంసన్ ఎంతో వినయంగా ఉంటాడు.మంచి నాయకుడు. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్‌ను సమర్థంగా నడిపించాడు. ఇప్పుడు చెన్నై జట్టులోనూ తనకంటే ప్రత్యేకతను సాధించుకుంటాడు. జట్టుకు అవసరమైనప్పుడు స్వార్థం లేకుండా ఆడతాడు. శతకం కోసం ఆడకుండా టీమ్ కోసం పెద్ద షాట్లు ఆడాడు. అదే అతని గొప్పతనం. శాంసన్‌ను అన్యాయంగా జట్టు నుంచి తప్పించిన సందర్భాలున్నాయి. కానీ ఇప్పుడు వరుసగా మూడు మ్యాచుల్లో అద్భుతంగా రాణించడం అతని స్థిరత్వానికి నిదర్శనం. సంజూ శాంసన్‌కు మున్ముందు మరిన్ని అవకాశాలివ్వాలి. వన్డేల్లోనూ రెగ్యులర్‌గా ఆడించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది’ అని శశిథరూర్ వెల్లడించారు. ఇంతకాలం ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన సంజూ శాంసన్ ఈ సీజన్ నుంచి చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఆడనున్నాడు. తన ఫెవరెట్ క్రికెటర్ అయిన ఎంఎస్ ధోనితో కలిసి ఆడనుండడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని శాంసన్ ఇటీవలే సీఎస్కే ప్రాక్టీస్‌లో జాయిన్ అయిన సందర్భంగా వెల్లడించాడు.చదవండి: 24 ఏళ్ల తర్వాత మ్యాచ్.. సంచలనం రిపీటయ్యేనా? -
CSK డెన్ లోకి చెట్టా గ్రాండ్ ఎంట్రీ
-
సీఎస్కే వైస్ కెప్టెన్‌గా అతడే సరైనోడు: అనిల్ కుంబ్లే
టీ20 ప్రపంచకప్ ప్లేయర్ ఆఫ్‌ది టోర్నీగా నిలిచిన భారత వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్.. ఇప్పుడు ఐపీఎల్-2026లో సత్తాచాటేందుకు సన్నద్దమవుతున్నాడు. ఈ ఏడాది సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు సంజూ ప్రాతినిథ్యం వహించనున్నాడు. ఐపీఎల్-19వ సీజన్ వేలానికి ముందు రాజస్తాన్ రాయల్స్ నుంచి సీఎస్కే శాంసన్ ట్రేడ్ అయ్యాడు.అందుకోసం చెన్నై ఫ్రాంచైజీ రవీంద్ర జడేజా, సామ్ కుర్రాన్ వంటి స్టార్ ఆల్రౌండర్లను వదులుకోవాల్సి వచ్చింది. 11 సీజన్ల పాటు రాజస్తాన్‌కు ప్రాతినిధ్యం వహించిన శాంసన్.. ఇప్పుడు ఎల్లో జెర్సీలో మెరవనున్నాడు.ఈ నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్ కుంబ్లే కీలక వ్యాఖ్యలు చేశారు. శాంసన్‌ను ట్రేడ్ డీల్‌ను కుంబ్లే సమర్ధించాడు. ఎంఎస్ ధోనీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి సంజూకు అన్ని రకాల అర్హతలు ఉన్నాయని కుంబ్లే అభిప్రాయపడ్డాడు."భారత క్రికెట్లో సునీల్ గవాస్కర్ నుంచి సచిన్ టెండూల్కర్, ఆపై ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లి వరకు వారసత్వం ఎలా కొనసాగిందో.. ఇప్పుడు ధోని నుంచి ఆ బాధ్యతను శాంసన్ అందుకోబోతున్నాడు. సంజూను జట్టులోకి తీసుకోవడం సీఎస్కే వ్యూహత్మక నిర్ణయంగా చెప్పుకోవాలి. సంజూ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.బ్యాటింగ్‌తో పాటు వికెట్ల వెనక కూడా బాధ్యతలు నిర్వర్తించగలడు. టీ20 ప్రపంచకప్‌లో వరుసగా మూడు సంచలన ఇన్నింగ్స్‌లు ఆడి భారత్‌కు విజయాన్ని అందించాడు. ఇప్పుడు అదే జోరును సీఎస్కే తరపున కొనసాగిస్తాడని ఆశిస్తున్నా. అతడి రాకతో సీఎస్కే ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరగనుంది. సీఎస్కే వైస్ కెప్టెన్సీ రోల్‌కు సంజూ సరిగ్గా సరిపోతాడు. అతడికి కెప్టెన్‌గా పనిచేసిన అనుభవం ఉంది. గతంలో జడేజా కెప్టెన్సీ తప్పుకున్నప్పుడు, రుతురాజ్ గైక్వాడ్ గాయపడినప్పుడు మళ్ళీ ధోనీ బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు సంజూ రాకతో రుతురాజ్ అందుబాటులో లేని సమయంలో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే లీడర్ జట్టుకు దొరికినట్లయింది" అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కుంబ్లే పేర్కొన్నాడు.చదవండి: ఆ విషయంలో స్వార్థపరుడినే: సంజూ శాంసన్ -
ఆ విషయంలో స్వార్థపరుడినే: సంజూ శాంసన్
టీ20 ప్రపంచకప్-2026 హీరో, టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇతరుల మెప్పు కోసం తాను ఎప్పుడూ ఏ పనీ చేయలేదని తెలిపాడు. ఎల్లప్పుడూ తన మనసు చెప్పినట్లే నడుచుకున్నానని.. ఈ విషయంలో తాను స్వార్థపరుడినే అన్నాడు.దాగుడుమూతల మాదిరి..భారత టీ20 జట్టు ఓపెనర్‌గా 2024 నుంచి రాణిస్తున్న సంజూ శాంసన్.. శుబ్‌మన్ గిల్ (Shubman Gill) పునరాగమనంతో కొన్నాళ్లు తుదిజట్టులో చోటు కోల్పోయాడు. ఆ తర్వాత గిల్ స్థానంలో తిరిగి జట్టులోకి వచ్చినా.. సరిగ్గా వరల్డ్‌కప్ టోర్నీ ఆరంభానికి ముందే ఫామ్ కోల్పోయాడు. దీంతో ఓపెనర్, వికెట్ కీపర్‌గా సంజూ స్థానాన్ని ఇషాన్ కిషన్ (Ishan Kishan) భర్తీ చేశాడు.నాకౌట్ దశలో వరుసగా హాఫ్ సెంచరీలుఅయితే, కీలక నాకౌట్ మ్యాచ్‌లలో యాజమాన్యం సంజూకు తిరిగి ఓపెనర్‌గా అవకాశం ఇవ్వగా దుమ్ములేపాడు. ముఖ్యంగా సెమీస్ చేరాలంటే వెస్టిండీస్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో 97 పరుగులతో అజేయంగా నిలిచాడు ఈ వికెట్ కీపర్ బ్యాటర్.ఆ తర్వాత ఇంగ్లండ్‌తో సెమీస్‌లో 89, న్యూజిలాండ్‌తో ఫైనల్లో 89 పరుగులతో సంజూ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఈ మూడు సందర్భాల్లోనూ అతడి సెంచరీ చేసే అవకాశం కోల్పోవడం గమనార్హం. ఏదేమైనా భారత్ టీ20 వరల్డ్‌కప్-2026 గెలవడంలో కీలక పాత్ర పోషించిన సంజూ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో మాట్లాడిన సంజూ తనకు జట్టు ప్రయోజనాలే అత్యంత ముఖ్యమని పేర్కొన్నాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హెడ్‌కోచ్ గౌతం గంభీర్ డ్రెసింగ్ రూమ్‌లో ఎప్పుడూ దీని గురించే మాట్లాడేవారన్నాడు. ప్రతి ఒక్క ఆటగాడు జట్టు విజయం కోసమే శ్రమించాలని దిశా నిర్దేశం చేసేవారని పేర్కొన్నాడు.ఆ విషయంలో నేను స్వార్థపరుడినే‘‘మా కోచ్ , కెప్టెన్ డ్రెసింగ్‌రూమ్‌లో కొత్త విధానాన్ని తీసుకువచ్చారు. వ్యక్తిగత రికార్డుల కంటే కూడా జట్టు ప్రయోజనాలే ముఖ్యమని.. అందుకు తగ్గట్లే ఆడాలని పదే పదే మాకు చెప్పేవారు. మా నాయకత్వ బృందం నిర్ణయానుసారమే మేమంతా నడుచుకున్నాము.నిజం చెప్పాలంటే ప్రతి ఒక్క ఆటగాడు అలాగే ఆలోచించాలి. నేనైతే నా మనసు చెప్పినట్లే జట్టు ప్రయోజనాల కోసం మాత్రమే ఆడేవాడిని. ఈ విషయంలో నేను స్వార్థపరుడినే. నా పట్ల నేను నిజాయితీగా ఉండటం ద్వారా నాలోని బలహీనతలు అధిగమించడం సులువైంది’’ అని సంజూ శాంసన్ చెప్పుకొచ్చాడు.కాగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సైతం ఇటీవలే ఇదే విషయాన్ని నొక్కి వక్కాణించిన విషయం తెలిసిందే. రోహిత్ శర్మ సారథ్యంలో 2024లో టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో అనుభవం ఉందని.. అయితే, తమ జట్టులో యువకులు ఉన్నా జట్టు ప్రయోజనాలకే పెద్దపీట వేశారని అన్నాడు. తద్వారా టీమిండియా మరోసారి వరల్డ్‌కప్ ట్రోఫీ గెలిచిందని పేర్కొన్నాడు.చదవండి: ’నేను, కోహ్లి, రోహిత్ రిటైర్ అవ్వాలని గంభీర్ కోరుకున్నా పర్లేదు’ -
సంజూ ఎంట్రీ వెనుక గేమ్ ప్లాన్..అసలు విషయం రివీల్ చేసిన గంభీర్
-
డీఎస్పీగా సంజూ శాంసన్!?
టీ20 వరల్డ్‌కప్-2026ను గెలిచి టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. మూడు టీ20 ప్రపంచకప్ టైటిల్స్ గెలుచుకున్న ఏకైక జట్టుగా భారత్ రికార్డులకెక్కింది. ఈ విజయంలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌ది కీలక పాత్ర. కీలకమైన సూపర్-8 మ్యాచ్‌తో పాటు సెమీస్, ఫైనల్లోనూ సంజూ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.సంజూ కేవలం ఐదు మ్యాచ్‌లలోనే 80.25 సగటు 321 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్‌ది టోర్నీగా నిలిచాడు. ఈ క్రమంలో కేరళ ప్రభుత్వం సంజూను డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఉద్యోగంతో సత్కరించిందని సోషల్ మీడియాలో కొంతమంది పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ విషయంపై కేరళ ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పందించింది. ఇవన్ని అసత్య ప్రచారాలని, కేరళ ప్రభుత్వం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదని ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. వైరల్ అవుతున్న ఫోటోలు కేవలం ఏఐ ద్వారా సృష్టించినవి మాత్రమే. కాగా వరల్డ్‌కప్ గెలిచిన అనంతరం తిరువనంతపురంలో శాంసన్‌ను కేరళ సర్కార్ ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో కేరళ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్, ముఖ్యమంత్రి పినరయి విజయన్ పాల్గోన్నారు. అంతేతప్ప అతడికి నగదు బహుమతి కానీ, ఉద్యోగం కానీ ప్రకటించలేదు. చదవండి: T20 WC Final: ’అర్ష్‌దీప్ చేసిన పనికి అతడికి క్షమాపణలు చెప్పాను’ -
అలా చేస్తే ధోనితో ప్రయోజనముండదు!
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని బ్రాండ్‌ను కేవలం జట్టుకు ఉపయోగిస్తే సరిపోదని, అతన్ని బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ ఇచ్చి ముందుకు పంపితేనే ప్రయోజనం ఉంటుందని సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. అంతేకాదు సంజూ శాంసన్ లాంటి క్రికెటర్ సీఎస్కేలో చేరడం ఆ జట్టుకు అదనపు బలాన్ని చేకూర్చనుందని, ధోని స్థానంలో ఆ బాధ్యతలను సమర్థంగా నిర్వహించగల సత్తా శాంసన్‌కు ఉందని తెలిపాడు. ‘సీఎస్కేకు ధోని పేరు అదనపు బ్రాండ్ అని చెప్పొచ్చు. సీఎస్‌ేపేరు చెప్పగానే అందరి నోటి నుంచి వచ్చే మొదటి పేరు ధోనిదే. అయితే గత కొన్నేళ్లుగా ధోని తూతూమంత్రంగానే జట్టులో కొనసాగుతున్నాడు. బ్యాటింగ్ ఆర్డర్లో లోయర్ ఆర్డర్ లోరావడంతో ఎక్కువగా బ్యాటింగ్ చేయలేకపోతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ ధోని బ్యాట్‌తో ఇప్పటికీ ప్రభావం చూపగలడు. కానీ బ్యాటింగ్ ఆర్డర్లో 8,9వ స్థానంలో ధోని బ్యాటింగ్‌కు దిగితే జట్టుకు పెద్దగా ప్రయోజనం ఉండదు. ఈ నేపథ్యంలో ధోని బ్యాటింగ్ ఆర్డర్లో కచ్చితంగా ముందుగానే క్రీజులోకి రావాలి. కనీసం ఆరో స్థానంలో అయినా బ్యాటింగ్‌కు వస్తే బాగుంటుంది.నేనైతే మాత్రం ధోని నాలుగు, ఐదు స్థానాల్లో బ్యాటింగ్ చేయాలని కోరుకుంటున్నా. గత సీజన్ల మాదిరి ఈసారి అలా జరగకూడదని భావిస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక మార్చి 28న ప్రారంభం కానున్న ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్‌కింగ్స్ తన తొలి మ్యాచ్‌ను రాజస్థాన్ రాయల్స్‌తో ఆడనుంది. ఆ తర్వాత ఏప్రిల్ 3న ఆర్సీబీతో, ఏప్రిల్ 5న ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడనుంది.చదవండి: పెషావర్‌కు వెళ్లొద్దు.. ఆసీస్ ఆటగాళ్లకు హెచ్చరిక! -
అక్కడ ముగింపు.. ఇక్కడ ప్రారంభం!
టీ20 ప్రపంచకప్ హీరో సంజూ శాంసన్ ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించనున్న సంగతి తెలిసిందే. 2018 నుంచి రాజస్థాన్ రాయల్స్‌కు ఆడుతున్న సంజూ శాంసన్ 2025 నవంబర్‌లో ట్రేడింగ్‌లో భాగంగా జడేజా, సామ్ కరన్‌లను రిలీజ్ చేసిన చెన్నై శాంసన్‌ను దక్కించుకుంది. మరో 10 రోజుల్లో ఐపీఎల్ 18వ సీజన్ ఆరంభమవుతున్న నేపథ్యంలో సంజూ శాంసన్ రాజస్థాన్ రాయల్స్‌తో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నాడు. ఈ సందర్భంగా రాజస్థాన్‌తో బంధం ముగిసిందని, ఈ సీజన్ ద్వారా చెన్నై సూపర్‌కింగ్స్‌తో ప్రయాణం ప్రారంభమైందని పేర్కొ న్నాడు. శాంసన్ మాట్లాడుతూ..‘నేను ఆ జట్టులో సమయం ముగిసిందని భావించా.. అందుకే రాజస్థాన్ రాయల్స్ నుంచి బయటకు వచ్చా. నేను రాజస్థాన్ రాయల్స్‌కు ప్రత్యర్థిగా ఆడడం ఇదే తొలిసారి అనుకుంటా. ఇప్పటివరకు ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదు. కానీ ఒకసారి మైదానంలోకి వచ్చాక మ్యాచ్ గురించే తప్ప వేరే దాని గురించి ఆలోచించను. రాజస్థాన్ జట్టులో చాలా మంది ఆటగాళ్లతో కలిసి నేను ఆడాను. మేనేజ్మెంట్, సపోర్ట్ స్టాఫ్ అంతా తెలిసినవాళ్లే. వారు ప్రేమ, గౌరవభావాలు కలిగి ఉన్నారు. కానీ ప్రతీ ఒక్కరికీ ఒక సమయం అనేది ఉంటుంది. రాజస్థాన్ రాయల్స్‌తో నా సమయం ముగిసింది. నేను ముందుకు సాగాను. ఇది నాకు కొత్త ప్రయాణం. ప్రస్తుతం నేను రాజస్థాన్‌పై కూడా చాలా ఆనందంగా ఆడాలనుకుంటున్నా.’ అని చెప్పుకొచ్చాడు. ఇక సంజూ శాంసన్ తన ఐపీఎల్ కెరీర్ ప్రారంభం నాటి నుంచి ఎక్కువగా రాజస్థాన్ రాయల్స్‌కే ఆడాడు. మధ్యలో వేర్వేరు ఫ్రాంచైజీలకు ఆడినప్పటికీ రాజస్థాన్‌తోనే శాంసన్‌కు అనుబంధమెక్కువ అని చెప్పొచ్చు. 2022లో రాజస్థాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా ప్రమోషన్ పొందిన శాంసన్ ఆ సీజన్లో రాజస్థాన్ ఫైనల్ చేరడంలో కీలకపాత్ర పోషించాడు. 2023 సీజన్లో రాజస్థాన్ ప్లేఆఫ్‌కు చేరడంలో విఫలమైనప్పటికీ బ్యాటర్‌గా మాత్రం శాంసన్ విజయవంతమయ్యాడు. ఆ తర్వాత 2024లో శాంసన్ నేతృత్వంలో రాజస్థాన్ జట్టు మరోసారి రెచ్చిపోయింది. తొలి 9 మ్యాచ్‌ల్లో ఎనిమిదింట గెలిచిన రాజస్థాన్ ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. అయితే క్వాలిఫయర్-2లో సన్‌రైజర్స్‌చేతిలో ఓటమిపాలైంది. ఈ సీజన్ సంజూ శాంసన్ బెస్ట్ అని చెప్పొచ్చు. మొత్తం 16 మ్యాచ్‌ల్లో 5 హాఫ్‌సెంచరీల సాయంతో 531 పరుగులు సాధించి కెరీర్ బెస్ట్ ప్రదర్శన చేశాడు. 2025 సీజన్లో గాయాల సమస్యలతో ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. శాంసన్ స్థానంలో రియాన్ పరాగ్ జట్టును నడిపించాడు.Sanju Samson just casually dropped a reality check for the professional language warriors.Knowing Hindi and Tamil along with Malayalam didn't make him less of a South Indian, it made him a better teammate. While the keyboard activists are busy gatekeeping, Sanju is busy winning… pic.twitter.com/AsggCsz7fP— Smita Deshmukh🇮🇳 (@smitadeshmukh) March 17, 2026చదవండి: సౌతాఫ్రికా అమ్మాయిలదే పైచేయి -
కేఎల్ రాహుల్-సంజూ.. నామన్ అవార్డ్స్‌లో హార్ట్ టచింగ్ మూమెంట్
-
ఘనంగా నమన్ అవార్డుల ప్రదానోత్సవం.. మెరిసిన భారత క్రికెటర్లు (ఫోటోలు)
-
అతడి ఆట అసాధారణం.. గంభీర్‌పై ద్రవిడ్ ప్రశంసలు
వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకున్న భారత జట్టును మాజీ కెప్టెన్, మాజీ హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రత్యేకంగా అభినందించాడు. గత మూడు దశాబ్దాల్లో మన క్రికెట్ జట్టు ఎంతో పురోగతి సాధించి అత్యుత్తమ స్థాయికి చేరిందని అతను అభిప్రాయపడ్డాడు. మన దేశంలో ప్రతిభకు ఏనాడూ కొదవ లేదని, ఇప్పుడు అలాంటి ప్రతిభ ఫలితాలను అందించడం సంతోషంగా ఉందని ద్రవిడ్ అన్నాడు. భారత్ ఇటీవల వరుసగా సీనియర్, అండర్–19 విభాగాల్లో కలిసి ఐదు ఐసీసీ టోర్నీల్లో గెలుచుకున్న విషయాన్ని ‘ది వాల్’ గుర్తు చేశాడు. సూర్యకుమార్, గంభీర్ బృందంపై ప్రశంసలు‘మన దేశంలో ప్రతిభావంతులైన క్రికెటర్లను ఎప్పుడూ కొరత లేదు. మైదానం బయట వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలనూ బోర్డు అందించింది. అత్యుత్తమ మౌలిక సౌకర్యాలతో పాటు మంచి కోచ్‌లు, సరైన పరిపాలకులు ఉన్నారు. జూనియర్ స్థాయిలో, దేశవాళీ క్రికెట్లో మెరుగైన వ్యవస్థ ఉంది. కానీ కొన్నిసార్లు మైదానంలో ఆశించిన ఫలితాలు రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం అంతా అద్భుతంగా సాగుతోంది. ప్రతిభకు తగిన విధంగా ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. ఇటీవల టీ20 వరల్డ్ కప్‌ను చూస్తే మన జట్టు ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. ఈ ఒత్తిడి, సవాళ్లను అధిగమించి విజేతగా నిలవడం అంత సులువు కాదు. కానీ సూర్యకుమార్, గంభీర్ బృందం దానిని చేసి చూపించింది’ అని ద్రవిడ్ విశ్లేషించాడు. అతడి ఆట అసాధారణంసామ్సన్ గురించి బాగా తెలిసిన వ్యక్తిగా ద్రవిడ్ అతడిపై ప్రశంసలు కురిపించాడు. ‘సామ్సన్ వరల్డ్ కప్ చివరి మూడు మ్యాచ్‌లలో ఆడిన తీరు అసాధారణం. సుదీర్ఘ కాలంగా అతను టీమ్‌లో ఉన్నాడు. కొన్నిసార్లు బాగా ఆడినా మరికొన్ని సార్లు కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నాడు. అలాంటి ఆటగాడు భారత్‌కు ఎంతో అవసరమైన కీలక సమయంలో సత్తా చాటి విజయంలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది’ అని ద్రవిడ్ అన్నాడు. బీసీసీఐ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు లభించడం పట్ల ద్రవిడ్ సంతోషం వ్యక్తం చేశాడు. ఎంతో మంది గొప్ప ఆటగాళ్లతో కలిసి ఆడే అవకాశం రావడం, దేశానికి ప్రాతినిధ్యం వహించడం తనకు లభించిన గొప్ప గౌరవమని అతను స్పందించాడు. చదవండి: ‘ఇది ఆరంభం మాత్రమే’ -
'అతడికి 6 ఓవర్లు చాలు.. మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తాడు'
ఢిల్లీలో బీసీసీఐ వార్షిక అవార్డుల వేడుక( ‘నమన్ అవార్డ్స్-2026’) ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గతేడాది నుంచి ఇప్పటివరకు ఐసీసీ టైటిల్స్ గెలిచిన భారత సీనియర్, జూనియర్ జట్లను బీసీసీఐ సత్కరించింది. ఇందులో వన్డే వరల్డ్‌కప్-2026 గెలిచిన మహిళల జట్టు, 2026 టీ20 వరల్డ్ కప్, 2025 చాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్న సీనియర్ పురుషుల జట్టు, అండర్-19 ప్రపంచకప్-2026, ఉమెన్స్ అండర్-19 వరల్డ్‌కప్ గెలిచిన జట్లు ఉన్నాయి.అదేవిధంగా భారత క్రికెట్ దిగ్గజాలు రాహుల్ ద్రవిడ్, రోజర్ బిన్నీ, మిథాలీ రాజ్‌కు అత్యున్నత పురస్కారం ‘కల్నల్ సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ప్రాధానం చేశారు. ఈ కార్యక్రమంలో భారత పురుషల జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో పాటు వరల్డ్‌కప్ హీరోలు సందడి చేశారు. ఈ సందర్భంగా టీ20 వరల్డ్‌కప్‌లో ప్లేయర్ ఆఫ్‌ది టోర్నీగా నిలిచిన సంజూ శాంసన్‌పై గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు.సంజు సామ్సన్ ఒక్కసారి చెలరేగడం మొదలు పెడితే ఆరు ఓవర్లలోనే మ్యాచ్‌ను గెలిపించగలడని భారత హెడ్ కోచ్ గౌతం గంభీర్ అన్నాడు. ప్రత్యర్థి ఆఫ్ స్పిన్నర్లను నిలువరించే వ్యూహంలో భాగంగా కాకుండా... విధ్వంసకర రీతిలో ఆడే మరో బ్యాటర్ కావాలనే శాంసన్‌కు మళ్లీ అవకాశం ఇచ్చినట్లు అతను వెల్లడించాడు. "సంజు మెరుపు బ్యాటింగ్ శైలిపై మాకు ఎలాంటి సందేహాలు లేవు. అతను ఏం చేయగలడో మాకు బాగా తెలుసు.ఒక్కసారి జోరు మొదలైతే ఆరు ఓవర్లలో మ్యాచ్ గెలిపించగలడు. జిమ్‌లో కలిసి వర్కౌట్ చేస్తున్నప్పుడే జింబాబ్వేతో మ్యాచ్‌లో నువ్వు ఆడుతున్నావని చెప్పాను. టాప్–3 ఎడంచేతి బ్యాటర్లు ఉన్నారు కాబట్టి మార్పు కోసం శాంసన్‌ను మళ్లీ ఆడించామని కొందరు చేస్తున్న విశ్లేషణలు తప్పు. టాపార్డర్‌లో చెలరేగిపోయే మరో బ్యాటర్ ఉంటే బాగుంటుందని భావించే శాంసన్‌ను తీసుకొచ్చాం" అని గంభీర్ స్పష్టం చేశాడు.చదవండి: బంగ్లాదేశ్‌దే వన్డే సిరీస్ -
‘ఇది ఆరంభం మాత్రమే’
న్యూఢిల్లీ: భారత జట్టు వచ్చే కొన్నేళ్లలో అన్ని విధాలుగా ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తుందని బ్యాటర్ సంజు సామ్సన్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం మన జట్టు చూపిస్తున్న ప్రదర్శన అన్ని చోట్లా పునరావృతమవుతుందని అతను అన్నాడు. 321 పరుగులతో ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచిన సామ్సన్... భారత జట్టు టి20 వరల్డ్ కప్ గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. ‘మన దేశంలో పెద్ద సంఖ్యలో అత్యుత్తమ స్థాయి ఆటగాళ్లు ఉన్నారు. వీరిని చూస్తే మన విజయపరంపర కొనసాగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. రాబోయే రోజుల్లో మరింత గొప్ప ఆటను మన క్రికెటర్ల నుంచి చూడవచ్చు. ఇటీవల వరల్డ్ కప్ విజయం ఆరంభం మాత్రమే. మున్ముందు మరిన్ని విజయాలు దక్కడం ఖాయం’ అని ఆదివారం జరిగిన బీసీసీఐ వార్షిక పురస్కారాల సందర్భంగా సామ్సన్ వ్యాఖ్యానించాడు. భారత్ తరఫున ప్రపంచకప్ సాధించాలనే తన కల నెరవేరిందని అతను ఉద్వేగంగా చెప్పాడు. ‘ఎవరికైనా పెద్ద కలలు ఉంటాయి. అయితే అవి అంత సులువుగా నిజం కావు. రెండేళ్ల క్రితమే దేశానికి ప్రపంచ కప్‌ను అందించాలని అనుకున్నా.నేను బలంగా కోరుకున్న సమయంలో ఒక్కసారిగా కెరీర్లో ఇబ్బందులు వచ్చాయి. మానసికంగా సమస్యల్లో ఉన్నా. కానీ జట్టుకు నేను అవసరమై పిలుపు వచ్చినట్లుగా మళ్లీ అవకాశం దక్కింది. టీమ్‌లో ప్రతీ ఒక్కరి నేను బాగా ఆడాలని, జట్టుకు ఉపయోగపడాలని కోరుకున్నారు. దాంతో నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలిగా. ఇదంతా ఒక సినిమా స్క్రిప్ట్ తరహాలో సాగి నిజంగా మారింది’ అని సామ్సన్ వివరించాడు. -
అభిషేక్‌ను చూసి అసూయపడేవారు!
టీమిండియా స్టార్ ఆటగాడు సంజూ శాంసన్ ఆల్‌రౌండర్ అభిషేక్ శర్మతో ఉన్న స్నేహ బంధాన్ని బయటపెట్టాడు. ఇండియా టుడే కాన్క్లేవ్ వేదికగా శాంసన్ అభిషేక్‌తో ఉన్న కెమిస్ట్రీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తమది నిప్పు-నీరు కాంబినేషన్ కాదని, ఇద్దరం నిప్పుకణికలమేణని శాంసన్ పేర్కొన్నాడు.అభిషేక్ పట్ల భారత ఆటగాళ్లు అసూయ పడేవారని తెలిపాడు.‘మేమిద్దరం ఐస్ అండ్ ఫైర్ కాదు.. ఫైర్ అండ్ ఫైర్. ఒకసారి అభిషేక్ మెరిస్తే, మరోసారి నేను మెరుస్తాను. 2024 నుంచే మా కాంబినేషన్ అలా కొనసాగుతూ వస్తోంది. దీనికి తోడు కేరళ-పంజాబ్ ఫ్రెండ్షిప్ కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. మా మధ్య బంధం అంతా సహజంగా సాగిపోతుంది. దానిని కాంప్లికేట్ చేయదలచుకోలేదు. ఇక మైదానంలో మేమిద్దరం కలిసి బరిలోకి దిగినప్పుడు అభిషేక్ బంతి ఎలా వస్తుంది అని అడుగుతాడు. దానికి నేను సాధారణంగా వస్తుంది అని చెప్పడం, ఆ మరుసటి బంతిని అభిషేక్ సిక్స్ కొట్టడం జరిగిపోతాయి. పెళ్లి చేసుకో భాయ్..అభిషేక్ శర్మ చాలా ధైర్యవంతుడు, సమర్థుడు. మైదానం లోపల, వెలుపల అభిషేక్‌తో మంచి అనుబంధముంది. అయితే అభిషేక్ శర్మీ టీమిండియాకు ఎంట్రీ ఇచ్చిన తొలినాళ్లలో భారత ఆటగాళ్లే అతన్ని చూసి అసూయ పడేవారు. ఎందుకంటే అప్పట్లో ఎక్కడ చూసినా అభిషేక్.. అభిషేక్ అని వినిపిస్తుండేది. ఒకప్పుడు అభిషేక్ సాధారణ ఆటగాడు కావొచ్చు.. కానీ ఇప్పుడు అతనొక సూపర్‌స్టార్. అందుకే త్వరగా పెళ్లి చేసుకో బాయ్ అని సలహా ఇచ్చాను.’ అని పేర్కొన్నాడు. ఇక టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో శాంసన్, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా వచ్చి విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. తొలి వికెట్‌కు 98 పరుగులు జోడించడంతో భారత్ 255 పరుగుల భారీ స్కోరు చేయడం, ఆపై న్యూజిలాండ్ 159 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా 96 పరుగుల తేడాతో భారీ విజయం సాధించి ముచ్చటగా మూడోసారి టీ20 ప్రపంచకప్‌ను అందుకుంది.ఇద్దరి కథ ఒకటే..అయితే టీ20 ప్రపంచకప్ ఆరంభంలో ఇద్దరి కథ దాదాపు ఒకటే అని చెప్పొచ్చు. ఫామ్ కోల్పోయి అభిషేక్ శర్మ సతమతమవ్వగా, శాంసన్ కూడా అభిషేక్ స్థానంలో తొలుత వచ్చిన అవకాశాలను వృథా చేసుకోవడం జరిగింది. ఈ ఇద్దరు విఫలమైతున్నా కూడా జట్టులో ఎందుకు కొనసాగిస్తున్నారన్న విమర్శలు పెరిగిపోయాయి. అయితే సూపర్-8లో వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో ఫామ్‌ను అందుకున్న శాంసన్ దానిని ఫైనల్ వరకు అలాగే కొనసాగించి విమర్శకుల నోళ్లు మూయించాడు. మరోవైపు అభిషేక్‌పై నమ్మకంతో జట్టు మేనేజ్మెంట్ వరుసగా అవకాశాలు ఇస్తూనే వచ్చింది. చివరకు ఫైనల్లో అభిషేక్ శర్మ తన మార్క్ ఆటతో అలరించడమే గాక టీమిండియా టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. -
'ధోని, రుతురాజ్ కాదు.. అతడే సీఎస్కే బ్యాక్ బోన్'
టీ20 వరల్డ్‌కప్-2026లో సంచలన ప్రదర్శన కనబరిచిన టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్.. ఇప్పుడు ఐపీఎల్లో సత్తాచాటేందుకు సిద్దమవుతున్నాడు. తన అరంగేట్రం నుంచి గత సీజన్ వరకు రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన సంజూ, ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడనున్నాడు. ఐపీఎల్-2026 సీజన్‌కు ముందు సీఎస్కే ఫ్రాంచైజీ సంజూను రాజస్తాన్ నుంచి ట్రేడ్ చేసుకుంది. అందుకోసం చెన్నై ఏకంగా స్టార్ ప్లేయర్లు రవీంద్ర జడేజా, సామ్ కుర్రాన్‌లను వదులుకుంది. ఈ నేపథ్యంలో శాంసన్‌పై భారత మాజీ క్రికెటర్ సుబ్రహ్మణ్యం బద్రీనాథ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. శాంసన్ రాకతో సీఎస్కేలో మరో కొత్త శకం మొదలవుతుందని అతడు అభిప్రాయపడ్డాడు."సీఎస్కే ఒక పెద్ద ఫ్రాంచైజీ. ఇప్పటికే ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. ఇప్పుడు రాజస్తాన్ నుంచి ట్రేడ్ చేసుకున్న సంజూ శాంసన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సీఎస్కేలో ఇక శాంసన్ శకం మొదలు కానుంది. అతడు ఆ జట్టుకు వెన్నెముకలా మారబోతున్నాడు. దీర్ఘకాలిక ప్రణాళికలలో భాగంగా సంజూను సీఎస్కే జట్టులోకి తీసుకుంది.అతడు భవిష్యత్తులో కెప్టెన్ అయ్యే అవకాశముంది. అయితే అందుకు ఇంకా చాలా సమయం ఉందని" బద్రీనాథ్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. కాగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. సీఎస్కే తమ తొలి మ్యాచ్‌లో మార్చి 29న గౌహతి వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో తలపడనుంది. చెన్నై కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ వ్యవహరించనున్నాడు.చదవండి: సన్‌రైజర్స్‌లోకి పాక్ ఆటగాడు.. బీసీసీఐ స్పందన ఇదే -
సంజూ శాంసన్ రేంజే వేరు భయ్యో.. ఆస్తులు చూస్తే పరేషానే..!
-
‘తుదిజట్టులో చోటు ఇవ్వనపుడు.. అతడికి చెప్పిందిదే’
జట్టులో చోటే లేని దుస్థితి నుంచి టీ20 ప్రపంచకప్-2026 హీరోగా నీరాజనాలు అందుకునే స్థాయికి ఎదిగాడు సంజూ శాంసన్. ఈ ఐసీసీ టోర్నీకి ముందు ఓపెనర్‌గా తుదిజట్టులో సంజూ స్థానం గల్లంతైంది. వరుస వైఫల్యాలే ఇందుకు కారణం. అదే సమయంలో టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన ఇషాన్ కిషన్ (Ishan Kishan).. ఓపెనర్, వికెట్ కీపర్‌గా సంజూను రీప్లేస్ చేశాడు. వరుస మ్యాచ్‌లలో అదరగొడుతూ తుదిజట్టులో స్థానం పదిలం చేసుకున్నాడు.అలా వచ్చిఇక సంజూ ఈసారి కూడా వరల్డ్‌కప్ ఆడే పరిస్థితి ఉండకపోవచ్చు అని అభిమానులు నిరాశచెందిన వేళ.. అభిషేక్ శర్మ (Abhishek Sharma) కడుపునొప్పితో లీగ్ దశలో నమీబియాతో మ్యాచ్‌కు దూరం అయ్యాడు. ఆ మ్యాచ్‌లో ఇషాన్‌తో పాటు సంజూ ఓపెనర్‌గా బరిలో దిగాడు. నాకౌట్ మ్యాచ్‌లలో ఆకాశమే హద్దుగాఅనంతరం సూపర్-8లో భాగంగా జింబాబ్వేతో మ్యాచ్‌లోనూ ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్‌కు చోటు దక్కింది. ఈ రెండు మ్యాచ్‌లలో వేగంగా ఆడే క్రమంలో సంజూ అవుటైనా.. నాకౌట్ మ్యాచ్‌లలో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు.సూపర్-8లో వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో 97 పరుగులతో అజేయంగా నిలిచిన సంజూ శాంసన్.. జట్టును సెమీస్ చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లో 89 పరుగులు చేసిన ఈ కుడిచేతివాటం బ్యాటర్.. న్యూజిలాండ్‌తో ఫైనల్లోనూ 89 పరుగులతో దుమ్ములేపాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు గెలుచుకున్నాడు. మొత్తంగా ఈ టోర్నీలో కేవలం ఐదు మ్యాచ్‌లే ఆడి ఏకంగా 321 పరుగులతో సంజూ సత్తా చాటాడు.అతడు తలచుకుంటే మూడూ సెంచరీలు అయ్యేవిఈ నేపథ్యంలో సంజూ శాంసన్‌పై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తాజాగా ప్రశంసలు కురిపించాడు. ‘‘తుది జట్టులో శాంసన్‌కు చోటు ఇవ్వలేనప్పుడు సర్ది చెప్పాల్సి వచ్చింది. ఇది కఠిన సమయం కావచ్చు కానీ దేవుడు దయతలిస్తే నీకూ అవకాశం వస్తుంది. అప్పుడు నువ్వేంటో చూపించాలి అన్నాను.దాని కోసం మాత్రం అతడు ఎప్పుడూ సిద్ధమవుతూనే వచ్చాడు. చివరి వరుస మూడు మ్యాచ్‌లలో శాంసన్ ప్రతాపం ఏమిటో చూశాం. అతడు అనుకుంటే ఈ మూడు ఇన్నింగ్స్‌లు కూడా సెంచరీలుగా మారేవి. కానీ అతను మాత్రం జట్టు కోసమే ఆడాడు’’ అని ‘చెట్టా (మలయాళంలో పెద్దన్న అనే అర్థం)’ సంజూను సూర్య కొనియాడాడు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా జట్టు గెలుపే లక్ష్యంగా నిస్వార్థంగా ఆడాడని ప్రశంసించాడు.చదవండి: రోహిత్-కోహ్లి అభిమానులకు శుభవార్త -
శాంసన్ కాదు.. అతడే అందుకు అర్హుడు: డివిలియర్స్
సొంతగడ్డపై జరిగిన టీ20 ప్రపంచకప్‌ను భారత జట్టు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి టీమిండియా వరుసగా రెండోసారి పొట్టి ప్రపంచకప్ టైటిల్‌ను ముద్దాడింది. ఈ చారిత్రత్మక విజయంలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌ది కీలక పాత్ర.వెస్టిండీస్‌తో జరిగిన సూపర్-8 మ్యాచ్‌తో పాటు సెమీస్, ఫైనల్లోనూ సంజూ అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. టోర్నీ ఆరంభంలో తుది జట్టులోనే లేకపోయిన శాంసన్.. ఆ తర్వాత వరుస మ్యాచ్‌లలో సంచలన ప్రదర్శనలతో జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు. ఈ కేరళ వికెట్ కీపర్ కేవలం ఐదు మ్యాచ్‌లలోనే 321 పరుగులు చేశాడు.ఈ అసాధారణ ప్రదర్శనకు గాను ఐసీసీ శాంసన్‌ను 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్లేయర్ ఆఫ్‌ది టోర్నీ అవార్డుకు సంజూ కంటే జస్ప్రీత్ బుమ్రా మరింత అర్హుడని డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు.ఈ మెగా ఈవెంట్లో బుమ్రా కూడా సంచలన ప్రదర్శన కనబరిచాడు. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో బుమ్రా తన అద్భుత బౌలింగ్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. కివీస్‌తో జరిగిన ఫైనల్లోనూ బుమ్రా బంతితో మ్యాజిక్ చేశాడు. నాలుగు వికెట్లు పడగొట్టి భారత్ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ టోర్నీలో 8 ఇన్నింగ్స్‌ల్లో 14 వికెట్లు పడగొట్టి వరుణ్ చక్రవర్తితో కలిసి సంయుక్తంగా టాప్ వికెట్ టేకర్‌గా బుమ్రా నిలిచాడు. ఈ నేపథ్యంలోనే బుమ్రా ప్లేయర్ ఆఫ్‌ది టోర్నీగా ఎంపిక చేసి ఉంటే బాగుండేదని ఏబీడీ అన్నాడు."సంజూ శాంసన్, బుమ్రాలో ఎవరు ప్లేయర్ ఆఫ్‌ది టోర్నీ అన్నది నిర్ణయించడం చాలా కష్టం. ఈ టోర్నీలో బుమ్రా అత్యధిక వికెట్లు తీశాడు. కాబట్టి అతడు కూడా ఈ అవార్డు రేసులో ఉన్నాడు. కానీ నా వరకు అయితే బుమ్రాకే ఆ అవార్డు ఇవ్వాల్సింది. ఎందుకంటే అతడు వేసిన కొన్ని కీలకమైన స్పెల్‌లు భారత్‌ను ఛాంపియన్‌గా నిలిపాయి.సెమీఫైనల్, ఫైనల్లో బుమ్రా బౌలింగ్ నిజంగా అద్భుతం. అతడొక్కడే వేరే గ్రహంలో ఉన్నట్లు బౌలింగ్ చేశాడు. అతడు భారత క్రికెట్‌కు అతడొక విలువైన ఆస్తి" అని డివిలియర్స్ యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.చదవండి: సచిన్ రిటైర్మెంట్ వెనుక అసలు కథ.. -
T20 WC 2026: కెప్టెన్‌గా సాంట్నర్.. అక్షర్‌కు దక్కని చోటు!
జగజ్జేత టీమిండియాపై ప్రశంసల వర్షం కొనసాగుతోంది. టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన సూర్య సేన విజయాన్ని అభిమానులు ఇంకా సెలబ్రేట్ చేసుకుంటూనే ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా తమ అభిమాన ఆటగాళ్ల ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు.ముఖ్యంగా వరల్డ్‌కప్ హీరోలుగా పేరొందిన సంజూ శాంసన్ (Sanju Samson), జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)లతో పాటు.. అక్షర్ పటేల్ (Axar Patel), శివం దూబే వంటి సైలెంట్ హీరోలను కూడా ఫ్యాన్స్ హైలైట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ చీఫ్ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌ను ఎంపిక చేశాడు. ఇందులో అనూహ్యంగా అక్షర్‌కు మాత్రం చోటు ఇవ్వలేదు.ఓపెనింగ్ జోడీ ఇదేఓపెనర్లుగా టీమిండియా స్టార్ సంజూ శాంసన్, న్యూజిలాండ్ పవర్ హిట్టర్ టిమ్ సీఫర్ట్‌ను ఎంచుకున్న చిక్కా.. వన్‌డౌన్‌లో భారత యువ ఆటగాడు ఇషాన్ కిషన్‌కు చోటు ఇచ్చాడు. ఇక ఆ తర్వాతి స్థానాల్లో విండీస్ వీరుడు షిమ్రన్ హెట్‌మైర్, భారత ఆల్‌రౌండర్ శివం దూబేను ఎంపిక చేసుకున్న శ్రీకాంత్.. టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా, ఇంగ్లండ్ డేంజరస్ ప్లేయర్ విల్ జాక్స్‌కు స్థానం ఇచ్చాడు.పన్నెండో ఆటగాడిగాఇక ఈ జట్టుకు కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్‌ను కాదని.. న్యూజిలాండ్ సారథి మిచెల్ సాంట్నర్‌ను ఎంచుకున్నాడు చిక్కా. బౌలింగ్ విభాగంలో ఆదిల్ రషీద్, లుంగి ఎంగిడి, జస్ప్రీత్ బుమ్రాలకు చోటు ఇచ్చాడు. పన్నెండో ఆటగాడిగా విండీస్ వీరుడు జేసన్ హోల్డర్‌ను చిక్కా ఎంపిక చేసుకున్నాడు.కాగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో మొత్తంగా పద్నాలుగు వికెట్లు తీసిన బుమ్రా.. వరుణ్ చక్రవర్తితో కలిసి లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. మరోవైపు.. ఆరు మ్యాచ్‌లలో కలిపి 383 పరుగులతో పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలవగా.. కేవలం ఐదు మ్యాచ్‌లలోనే సంజూ 321 పరుగులతో మూడో స్థానం ఆక్రమించాడు. రెండోస్థానంలో ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన టిమ్ సీఫర్ట్ (326 పరుగులు) ఉన్నాడు.టీ20 ప్రపంచకప్-2026 చిక్కా టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్సంజూ శాంసన్, టిమ్ సీఫర్ట్, ఇషాన్ కిషన్, షిమ్రన్ హెట్‌మైర్, శివం దూబే, హార్దిక్ పాండ్యా, విల్ జాక్స్, మిచెల్ సాంట్నర్, ఆదిల్ రషీద్, లుంగి ఎంగిడి, జస్ప్రీత్ బుమ్రా.చదవండి: T20 WC 2026: ఆరోపణలపై స్పందించిన ఐసీసీ.. ప్రకటన విడుదల -
ఇషాన్ కెరీర్ బెస్ట్.. శాంసన్ అదరహో
భారత ఆటగాళ్ల సమిష్టి కృషితో టీ20 ప్రపంచకప్ నెగ్గిన టీమిండియా తాజాగా ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ అదరగొట్టింది. బుధవారం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో భారత బ్యాటర్లు సత్తా చాటారు. భారత విధ్వంసక ఆల్‌రౌండర్ అభిషేక్ శర్మ (875 పాయింట్లు) తొలి స్థానాన్ని కాపాడుకున్నాడు. ఇక టీ20 ప్రపంచకప్‌లో 9 మ్యాచ్‌ల్లో 317 పరుగులతో భారత్ తరఫున రెండో టాప్ స్కోరర్‌గా నిలిచిన ఇషాన్ కిషన్ రెండు స్థానాలు మెరుగుపరుచుకొని 871 పాయింట్లతో రెండో ర్యాంకులో నిలిచి కెరీర్ బెస్ట్ సాధించాడు. మిగతా బ్యాటర్లలో తిలక్ వర్మ ఒక స్థానం దిగజారి 742 పాయింట్లతో ఏడో స్థానంలో నిలవగా.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రెండు స్థానాలు దిగజారి 722 పాయింట్లతో 9వ స్థానంలో ఉన్నాడు. ఇక టీ20 ప్రపంచకప్ హీరో సంజూ శాంసన్ ఏకంగా 18 స్థానాలు ఎగబాకి 637 పాయింట్లతో 22వ స్థానంలో నిలిచి తన కెరీర్లో బెస్ట్ ర్యాంకును అందుకున్నాడు. ఓవరాల్‌గా టాప్-10లో నలుగురు భారత బ్యాటర్లు చోటు దక్కించుకోవడం విశేషం. బౌలింగ్ విభాగంలో అఫ్గానిస్థాన్ బౌలర్ రషీద్ ఖాన్ ఒక స్థానం ఎగబాకి 753 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఇక టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఒక స్థానం దిగజారి 740 పాయింట్లతో రెండో స్థానంలో నిలవగా, పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఒక స్థానం ఎగబాకి 702 పాయింట్లతో ఆరో స్థానం దక్కించుకున్నాడు. మిగతా టీమిండియా బౌలర్లలో అర్షదీప్ సింగ్ మూడు స్థానాలు దిగజారి 16వ స్థానంలో, అక్షర్ పటేల్ ఏకంగా ఆరు స్థానాలు ఎగబాకి 17వ స్థానానికి చేరుకున్నాడు. ఆల్‌రౌండర్ల విభాగానికి వస్తే జింబాబ్వే ఆల్‌రౌండర్ సికందర్ రజా, భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలవగా, శివమ్ దూబే మాత్రం రెండు స్థానాలు దిగజారి 11వ స్థానానికి పడిపోయాడు.చదవండి: టీమిండియా సిగ్గుపడు!.. మాజీ క్రికెటర్‌కు ఇచ్చిపడేసిన గంభీర్ -
గంభీర్‌కు వ్యతిరేకంగా అగార్కర్ నిర్ణయాలు!.. ఫలితం?
టీమిండియా హెడ్‌కోచ్‌గా టెస్టు ఫార్మాట్లో విమర్శలు మూటగట్టుకున్న గౌతం గంభీర్.. వైట్ బాల్ క్రికెట్లో మాత్రం తిరుగులేని కోచ్ అనిపించుకుంటున్నాడు. అతడి మార్గదర్శనంలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిల్ గెలిచిన భారత్.. ఆ తర్వాత పొట్టి ఫార్మాట్ ఆసియాకప్‌ను కైవసం చేసుకుంది.తాజాగా టీ20 ప్రపంచకప్-2026లోనూ చాంపియన్‌గా నిలిచిన టీమిండియా.. ఇంత వరకు ఏ జట్టుకు సాధ్యం కాని విధంగా సొంతగడ్డపై కప్ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో గంభీర్ విజయవంతమైన కోచ్ అంటూ ప్రశంసల వర్షం కురుస్తోంది.క్రెడిట్ గంభీర్ ఒక్కడిదే కాదు!అయితే, భారత జట్టు వరుస విజయాల్లో.. ముఖ్యంగా టీ20 వరల్డ్‌కప్ గెలవడంలో క్రెడిట్ గంభీర్ ఒక్కడికే కాకుండా.. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌కూ దక్కాలనేది విశ్లేషకుల మాట. 2023లో టీమిండియా సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టాడు ఈ మాజీ క్రికెటర్.అప్పటి నుంచి తనదైన మార్కు చూపించడంలో అగార్కర్ ఎప్పుడూ విఫలం కాలేదు. ముఖ్యంగా టీ20 ప్రపంచకప్-2024లో భారత్ చాంపియన్‌గా నిలిచిన తర్వాత.. రోహిత్ శర్మ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అతడి వారసుడిగా హార్దిక్ పాండ్యా ఎంపిక లాంఛనమేనని అంతా భావించారు.హార్దిక్ స్థానంలో సూర్యను ఎంపిక చేసిఅయితే, అనూహ్య రీతిలో అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సూర్యకుమార్ యాదవ్‌కు టీ20 జట్టు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. ఈ సందర్భంగా విమర్శలు వెల్లువెత్తగా.. అరుదైన పేస్ ఆల్‌రౌండర్ అయిన హార్దిక్ పాండ్యాను కాపాడుకోవాల్సిన బాధ్యత తమకు ఉందని అగార్కర్ తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు. అదనపు బాధ్యతను పాండ్యా నెత్తిన వేయలేమని పేర్కొన్నాడు.అందుకు తగ్గట్లే విజయవంతమైన కెప్టెన్‌గా సూర్య రాణించగా.. టీ20 ప్రపంచకప్-2026 గెలవడంలో ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషించాడు. ఇదిలా ఉంటే.. 2024 తర్వాత టీమిండియా టీ20 ఓపెనింగ్ జోడీగా సంజూ శాంసన్- అభిషేక్ శర్మ అద్భుతంగా రాణించారు.సంజూ అయితే ఏకంగా సౌతాఫ్రికా గడ్డ మీద సెంచరీలు బాది సత్తా చాటాడు. అయితే, ఆసియా కప్-2025 సందర్భంగా అప్పటికే టెస్టు, వన్డే జట్ల కెప్టెన్‌గా ఉన్న శుబ్‌మన్ గిల్ తిరిగి రావడంతో.. ఓపెనర్‌గా సంజూ స్థానం గల్లంతైది. కానీ సెలక్టర్ల నమ్మకాన్ని గిల్ వమ్ము చేశాడు. వరుస వైఫల్యాలతో అతడు సతమతం కాగా.. మేనేజ్మెంట్ తీరుపై విమర్శల వర్షం కురిసింది.గిల్‌పై వేటు వేస్తూ సంచలన నిర్ణయంగిల్ కోసం సంజూ లాంటి ప్రతిభావంతుడైన ఆటగాడిని బలిచేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మెగా టోర్నీ ఆరంభానికి ముందు సెలక్షన్ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఊహించని రీతిలో గిల్‌పై వేటు వేసింది. ప్రపంచకప్ జట్టుకు అతడిని ఎంపిక చేయకుండా పక్కన పెట్టింది.ఈ విషయంలో గంభీర్- అగార్కర్ (Gautam Gambhir- Ajit Agarkar) మధ్య విభేదాలు తలెత్తినట్లు సమాచారం. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం.. గంభీర్ గిల్‌ను ఎంపిక చేయాలని పట్టుబట్టగా.. ‘‘మీ అభిప్రాయంతో నేను ఏకీభవించకపోవచ్చు. అతడు నాణ్యమైన ఆటగాడు.కానీ జట్టులో ఇప్పుడు ఎవరో ఒకరికే స్థానం. ఒకరిని తప్పించక తప్పదు. ఆ ఒక్కడు గిల్. దీనర్థం అతడు ఇందుకు అనర్హుడని కాదు. అదృష్టవశాత్తూ భారత క్రికెట్లో ఎన్నో ఆప్షన్లు ఉండటమే ఇందుకు కారణం’’ అని అగార్కర్ వాదించినట్లు తెలుస్తోంది.ఇషాన్ విషయంలోనూ..అదే విధంగా... దేశీ క్రికెట్లో సత్తా చాటిన ఇషాన్ కిషన్.. దాదాపు మూడేళ్ల తర్వాత ఏకంగా ప్రపంచకప్ జట్టులో స్థానం దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంలోనూ అగార్కర్‌దే తుది నిర్ణయం అని సమాచారం. ‘‘వైట్ బాల్ క్రికెట్లో అతడు టాపార్డర్‌లో ఆడతాడు.మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇంతకు ముందు కూడా టీమిండియాకు ఆడాడు. రిషభ్ పంత్. ధ్రువ్ జురెల్ కారణంగా ఈ వికెట్ కీపర్ బ్యాటర్ చాన్నాళ్లుగా జట్టుకు దూరంగా ఉన్నాడు. అంతేగానీ ప్రతిభ లేక కాదు’’ అని అగార్కర్ కన్విన్స్ చేసినట్లు తెలుస్తోంది. రింకూ సింగ్‌ను ఎంపిక చేయడంలోనూ చీఫ్ సెలక్టర్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.ఇటు ఇషాన్.. అటు సంజూఇక సెలక్టర్ల నమ్మకానికి తగ్గట్లు ఇషాన్ కిషన్ వరల్డ్‌కప్ టోర్నీలో దుమ్ములేపాడు. అయితే, గంభీర్ నిర్ణయానికి అనుగుణంగా నాకౌట్ దశలో తుదిజట్టులోకి వచ్చిన సంజూ ఆకాశమే హద్దుగా చెలరేగి.. వరుసగా మూడు హాఫ్ సెంచరీలు బాది టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచి సత్తా చాటాడు.ఇదిలా ఉంటే.. భారత్ వరల్డ్‌కప్ గెలిచిన తర్వాత గంభీర్ మాట్లాడుతూ.. అగార్కర్‌కు క్రెడిట్ ఇవ్వడం విశేషం. ‘‘ఈ ట్రోఫీని నేను అగార్కర్‌కు అంకితం చేయాలి. అతడు చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. అయినా సరే వెనక్కి తగ్గలేదు. నిజాయితీ గల ఇలాంటి వ్యక్తితో పనిచేయడం పట్ల ఎల్లప్పుడూ కృతజ్ఞుడినై ఉంటాను’’ అని గంభీర్ పేర్కొన్నాడు.చదవండి: T20 WC 2026: 'భారత్ ఒక ఛాంపియన్ జట్టు.. తప్పులు వెతకడం ఆపండి'⭐ 2007 ⭐ 2024 ⭐ 2026History repeated. History defeated. 🇮🇳💙#T20WorldCup pic.twitter.com/dRrraSdOoi— Star Sports (@StarSportsIndia) March 8, 2026 -
'గంభీర్ చాలా పెద్ద తప్పు చేశాడు'
టీ20 ప్రపంచకప్-2026లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. తొలుత తుది జట్టులోనే లేని శాంసన్ ఏకంగా ప్లేయర్ ఆఫ్‌ది టోర్నీగా నిలిచి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. కీలకమైన చివరి మూడు మ్యాచ్‌లో సంజూ (97, 89, 89) సంచలన ఇన్నింగ్స్‌లు ఆడాడు.ఓవరాల్‌గా ఈ టోర్నమెంట్లో కేవలం 5 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన శాంసన్.. స్ట్రైక్ రేట్ 199.37 321 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పొట్టి ప్రపంచకప్‌ను భారత్ సొంతం చేసుకున్నప్పటికి.. సంజూను సరిగ్గా ఉపయోగించుకోవడంలో గంభీర్ ఆధ్వర్యంలోని టీమ్ మేనేజ్మెంట్ "తీవ్రమైన తప్పిదాలు" చేసిందని మంజ్రేకర్ విమర్శించాడు. టోర్నీ గ్రూపు స్టేజి మ్యాచ్‌లలో శాంసన్‌ను తుది జట్టు నుంచి తప్పించడాన్ని అతడు తప్పుబట్టాడు."సంజూ శాంసన్ విషయంలో టీమ్ మేనేజ్మెంట్ తీవ్రమైన తప్పిదాలు చేసింది. దక్షిణాఫ్రికా వంటి పటిష్టమైన జట్టుపై ఓపెనర్‌గా వచ్చి సంజూ వరుస సెంచరీలతో సత్తాచాటాడు. ఆ తర్వాత శుభ్‌మన్ గిల్ కేవలం టెస్టుల్లో బాగా ఆడాడని అతడిని మళ్ళీ టీ20ల్లోకి తీసుకొచ్చి సంజూను లోయార్డర్కు డిమోట్ చేశారు.దీంతో శాంసన్ తన రిథమ్‌ను కోల్పోయాడు. ఈ కారణంతో అతడిని తుది జట్టు నుంచి సైతం తప్పించారు. అయితే ఒక మ్యాచ్‌కు రింకూ సింగ్ దూరం కావడంతో సంజూ మళ్లీ అవకాశం దక్కింది. మూడో స్ధానంలో ఇబ్బంది పడుతున్న తిలక్ వర్మను బ్యాటింగ్ ఆర్డర్లో వెనక్కి నెట్టి ఆ స్ధానంలో కిషన్‌ను బ్యాటింగ్‌కు పంపారు. కిషన్ స్దానంలో సంజూ మళ్లీ ఓపెనర్‌గా వచ్చాడు. ఈసారి అతడు దుమ్ములేపాడు. ఏకంగా తన అద్భుత ప్రదర్శనలతో జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు. అనుకోకుండా జట్టులోకి వచ్చిన సంజూ చరిత్రను తిరగరాశాడు. అతడికి ఓపెనింగ్ స్ధానమే సరైనది" అని మంజ్రేకర్ తన యూట్యూబ్ ఛానల్లలో పేర్కొన్నాడు.చదవండి: T20 WC 2026: 'భారత్ ఒక ఛాంపియన్ జట్టు.. తప్పులు వెతకడం ఆపండి' -
Samson: నిరాశలోకి వెళ్లిపోయా..ఫైనల్ మ్యాచ్ కి ముందు సచిన్ నాకు కాల్ చేసి ..
-
అందరూ మ్యాచ్ విన్నర్లే!
ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ ముగిసింది. టీమిండియా ముచ్చటగా మూడోసారి పొట్టి ప్రపంచకప్‌ను కైవసం చేసుకొని ఆ ఘనత సాధించిన తొలి జట్టుగా రికార్డులకెక్కింది. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్లు భారత క్రికెట్ జట్టుపై ప్రశంసలు కురిపిస్తూనే ఉన్నారు. తాజాగా పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది కూడా టీమిండియాను పొగడ్తలతో ముంచెత్తాడు. జట్టులో అందరూ మ్యాచ్ విన్నర్లు కావడమే భారత్ టైటిల్ గెలిచేందుకు కారణమైందని అఫ్రిది తెలిపాడు. ఇదే విషయమై ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘ప్రపంచకప్ ముగిసింది. టైటిల్ గెలవడంలో టీమిండియాకు అర్హత ఉంది. జట్టు కాంబినేషన్ అద్భుతం. అంతేకాదు తుది జట్టులోని 11 మంది ఆటగాళ్లే కాదు బెంచ్ మీద ఉన్న ఆటగాళ్లు కూడా మ్యాచ్ విన్నర్లే. ఒకవేళ ఫైనల్‌కు ముందు తుది జట్టులో మార్పులు చేసి బెంచ్ నుంచి ఆడించినా భారత్ కప్ కొట్టేందుకు సిద్ధంగా ఉండేది. నిజానికి టోర్నీమొత్తం చాంపియన్ ఆటతీరును ప్రదర్శించారు.సంజూ శాంసన్ ఒక అద్భుతం. తనదైన హిట్టింగ్తో ఇన్నింగ్స్‌లను నిర్మించడంలో కీలకపాత్ర పోషించేవాడు. అభిషేక్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టోర్నీ ఆసాంతం విఫలమైనా కెప్టెన్ సూర్యకుమార్‌కు అభిషేక్‌పై ఉన్న నమ్మకం అతన్ని ఫైనల్ వరకు ఆడించింది. కీలకమైన ఫైనల్లో అభిషేక్ తనలోని అసలైన ఆటతీరును పరిచయం చేశాడు. ఇషాన్ కిషన్ కూడా తనదైన శైలిలో చెలరేగడం, ఆఖర్లో హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే హిట్టింగ్ జట్టుకు అదనపు ఆకర్షణ. ఇక బౌలింగ్ లో బుమ్రా అద్భుత ప్రదర్శనతో టోర్నీ ఆసాంతం బౌలింగ్ టీమ్‌ను తన భుజస్కందాలపై నడిపించాడు. కొత్త బంతి, పాత బంతి అనే తేడా లేకుండా, పదునైన యార్కర్లు సంధించి అతని బౌలింగ్ విలువను చాటిచెప్పాడు’ అని తెలిపాడు. ఇక ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టు చచ్చీచెడీ సూపర్-8కు చేరినప్పటికీ మూడు మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క విజయం మాత్రమే నమోదు చేసి టోర్నీ నుంచి నిష్క్రమించింది.చదవండి: పాక్ క్రికెటర్ సంచలన నిర్ణయం.. 24 ఏళ్లకే రిటైర్మెంట్ -
ఓ తండ్రి త్యాగం.. ఎన్నో అవమానాలు.. కట్ చేస్తే..
-
టీ20 ప్రపంచకప్ బెస్ట్ టీమ్ ఇదే.. పాక్ నుంచి ఒక్కరు కూడా!
టీ20 ప్రపంచ కప్ 2026 టైటిల్‌ను భారత్ కైవసం చేసుకుంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని టీమిండియా.. ఫైనల్లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో టైటిల్‌ను ముద్దాడింది. ఇది భారత్‌కు మూడో టీ20 వరల్డ్‌కప్ విజయం కావడం గమనార్హం. మూడు టీ20 వరల్డ్‌కప్ ట్రోఫీలను సొంతం చేసుకున్న ఏకైక జట్టుగా మెన్ బ్లూ చరిత్ర సృష్టించింది. అయితే తాజాగా ఈ టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లతో కూడిన బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్‌ను భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ప్రకటించాడు. ఆకాశ్ చోప్రా తన జట్టులో ఓపెనర్లుగా సంజూ శాంసన్, ఫిన్ అలెన్‌లను ఎంపిక చేశాడు. ప్లేయర్ ఆఫ్‌ది టోర్నీగా నిలిచిన సంజూ శాంసన్‌పై చోప్రా ప్రశంసల వర్షం కురిపించాడు."శాంసన్ నాలుగు మ్యాచ్‌లు ఆడకపోయినా భారత్ తరపున లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు. క్వార్టర్ ఫైనల్, సెమీ ఫైనల్, ఫైనల్లో వరుసగా హాఫ్ సెంచరీలు బాదడం నిజంగా అద్భుతం. అందుకే అతడికి ఓపెనర్‌గా అవకాశమిచ్చా" అని చోప్రా పేర్కొన్నాడు.అదేవిధంగా సాహిబ్జాదా ఫర్హాన్, టిమ్ సీఫెర్ట్, పాతుమ్ నిస్సంక బ్రియన్ బెన్నెట్, ఐడెన్ మార్క్రమ్లు ఓపెనర్లగా రాణించినప్పటికి ఫిన్ అలెన్ వైపే తను మొగ్గు చూపుతున్నట్లు చోప్రా తెలిపాడు. సౌతాఫ్రికాతో జరిగిన సెమీస్‌లో అలెన్ కేవలం 33 బంతుల్లోనే సెంచరీ బాది అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇక వరుసగా రెండు మూడు స్ధానంలో ఇషాన్ కిషన్, జాకబ్ బెథెల్‌కు చోప్ర అవకాశమిచ్చాడు. ఆల్‌రౌండర్ కోటాలో హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, విల్ జాక్స్, అక్షర్ పటేల్‌కు చోటు దక్కింది. ఫాస్ట్ బౌలర్లగా అమెరికా పేసర్ షాడ్లీ షాల్క్విక్, జస్ప్రీత్ బుమ్రా, లుంగి ఎంగిడీలకు ఛాన్స్ లభించింది. భారత్ నుంచి ఆరుగురు ఈ జట్టులో చోటు దక్కింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను మాత్రం చోప్రా పరిగణలోకి తీసుకోలేదు.ఆకాశ్ చోప్రా ఎంచుకున్న టీ20 ప్రపంచకప్ బెస్ట్ ఎలెవన్ ఇదేసంజు శాంసన్, ఫిన్ అలెన్, ఇషాన్ కిషన్, జాకబ్ బెథెల్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, విల్ జాక్స్, అక్షర్ పటేల్, షాడ్లీ షాల్క్విక్, జస్ప్రీత్ బుమ్రా, లుంగి ఎంగిడీచదవండి: ఇండియా క్రికెట్‌ను నాశనం చేసింది: షోయబ్ అక్తర్ -
ఐసీసీ ప్రపంచకప్ టీమ్‌లో సామ్సన్, బుమ్రా, పాండ్యా, ఇషాన్... కెప్టెన్‌గా మార్క్రమ్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రకటించిన టి20 ప్రపంచకప్ జట్టులో టైటిల్ నిలబెట్టుకున్న టీమిండియా నుంచి నలుగురు ఆటగాళ్లకు చోటు దక్కింది. ఈ జట్టుకు మార్క్రమ్ (దక్షిణాఫ్రికా) కెపె్టన్ కాగా, ఓపెనింగ్‌లో సంజూ సామ్సన్, టాపార్డర్‌లో ఇషాన్ కిషన్, మిడిలార్డర్లో హార్దిక్ పాండ్యా, బౌలింగ్‌లో పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు చోటు లభించింది. పాకిస్తాన్ నుంచి టాప్ స్కోరర్‌గా నిలిచిన సాహిబ్జాదా ఫర్హాన్ ఈ ఐసీసీ టీమ్‌లో ఓపెనర్‌గా ఉన్నాడు.చిత్రంగా రన్నరప్ న్యూజిలాండ్ జట్టులో నుంచి కనీసం 12వ ఆటగాడిగా కూడా ఎవరికీ చాన్స్ దక్కలేదు. ఐసీసీ టి20 ప్రపంచకప్ జట్టు: మార్క్రమ్ (కెపె్టన్), ఫర్హాన్ (పాకిస్తాన్), సామ్సన్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, బుమ్రా (భారత్), విల్ జాక్స్, ఆదిల్ రషీద్ (ఇంగ్లండ్), జేసన్ హోల్డర్ (వెస్టిండీస్), ఎన్గిడి (దక్షిణాఫ్రికా), ముజరబాని (జింబాబ్వే), షాడ్లీ వాన్ షాలి్వక్ (అమెరికా; 12వ ప్లేయర్). -
సంజూ శాంసన్ సక్సెస్ వెనుక భారత క్రికెట్ దిగ్గజం
భారత క్రికెట్ చరిత్రలో సంజూ శాంసన్ తనకంటూ ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించుకున్నాడు. తన అద్భుత ప్రదర్శనలతో భారత జట్టుకు మూడో టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను అందించాడు. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 వరల్డ్‌కప్-2026లో 96 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా.. తిరిగి టైటిల్‌ను రిటైన్ చేసుకుంది.అయితే ఈ మెగా టోర్నీలో ఎవరూ ఊహించని విధంగా శాంసన్ మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్' గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. టోర్నీ ఆరంభంలో తుది జట్టులో చోటు దక్కకపోయిన అతడు ఎక్కడ నిరాశ చెందలేదు. తిరిగి జట్టులోకి వచ్చి సింహంలా గర్జించాడు. వెస్టిండీస్‌తో జరిగిన వర్చువల్ క్వార్టర్ ఫైనల్ నుంచి తుది పోరు వరకు సంజూ దుమ్ములేపాడు. వరుసగా మూడు మ్యాచ్‌లలో 80కి పైగా పరుగులు చేసి సత్తాచాటాడు. వెస్టిండీస్‌పై 97 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయిన సంజూ.. ఆ తర్వాత వరుసగా సెమీస్, ఫైనల్లో 89 పరుగులు చేశాడు. సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై 89 పరుగులు చేసిన.. ఫైనల్లో కివీస్‌పై కూడా అదే తరహా బ్యాటింగ్ చేశాడు. 46 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 89 పరుగులు చేశాడు. సంజూ మొత్తంగా ఐదు మ్యాచ్‌ల్లో 321 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్‌ది టోర్నీగా నిలిచాడు. అయితే సంజూ శాంసన్ సక్సెస్ వెనక భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. సచిన్ ఇచ్చిన సలహాలు తనకు ఎంతో ఉపయోగపడ్డాయని సంజూ వెల్లడించాడు."అంతా కలలా ఉంది. ఆనందాన్ని వర్ణించేందుకు మాటలు రావడం లేదు. కివీస్‌తో సిరీస్‌లో వైఫల్యం తర్వాత నా కలలు చెదిరిపోయాయి. నేనేం చేయలేనా అని చాలా బాధపడ్డాను. కానీ దేవుడు అండగా నిలిచాడు. చాలా మంది మాజీ క్రికెటర్లు కూడా సహకరించారు.గత రెండు నెలలుగా సచిన్ సర్‌తో టచ్‌లో ఉన్నాను. ఆస్ట్రేలియాలో జట్టులో చోటు దక్కక బయట కూర్చున్నప్పుడు ఆయనతో మాట్లాడాను. సచిన్ చాలా సలహాలు ఇచ్చారు. ఆయనతో మాట్లాడటంతో మార్గనిర్దేశనం లభించింది. ఇది చాలా పెద్ద ఘనత. నాకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు" సంజూ పేర్కొన్నాడు. -
భయమేసింది పూర్తిగా నిరాశలోకి వెళ్లిపోయా..ఫైనల్ మ్యాచ్ కి ముందు సచిన్ నాకు కాల్ చేసి ..
-
వారు లేకుండా భారత్ ప్రపంచకప్ ఎప్పుడూ గెలవలేదు..!
2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఎదురైన నిరాశను భారత జట్టు 2026 పొట్టి ప్రపంచకప్‌లో తుడిచిపెట్టేసింది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో భారత జట్టు మెన్స్ టీ20 వరల్డ్ కప్‌ను కైవసం చేసుకుంది. ఇది భారత్‌కు మూడో టీ20 టైటిల్. మొత్తంగా ఐదో ప్రపంచకప్ (రెండు వన్డే, మూడు టీ20). అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నిన్న (మార్చి 8) జరిగిన ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో జయభేరి మోగించి వరుసగా రెండో ఎడిషన్‌లో జగజ్జేతగా అవతరించింది.కాగా, టీమిండియా వరల్డ్ కప్ విజయాల వెనుక ఓ ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. 1983 వన్డే వరల్డ్‌కప్ విజయం నుంచి తాజాగా సాధించిన 2026 టీ20 ప్రపంచకప్ వరకు భారత్ గెలిచిన ప్రతి వరల్డ్ కప్‌లో ఒక సర్దార్ (పంజాబీ), ఒక కేరళ ఆటగాడు జట్టులో భాగమయ్యారు. 1983లో బల్విందర్ సంధూ (సర్దార్), సునీల్ వాల్సన్ (కేరళ)తో ఈ సంప్రదాయం మొదలైంది. 2007 (టీ20), 2011 (వన్డే) ప్రపంచకప్‌లలో శ్రీశాంత్ (కేరళ), హర్భజన్ సింగ్ (సర్దార్) కీలక పాత్ర పోషించారు. 2024, 2026 టీ20 వరల్డ్ కప్‌లలో సంజూ శాంసన్ (కేరళ), అర్ష్‌దీప్ సింగ్ (సర్దార్) ఈ ప్యాటర్న్‌ను కొనసాగించారు. రాకింగ్ సంజూ 2026 టీ20 వరల్డ్ కప్‌లో సంజూ శాంసన్ అద్భుత ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు గెలుచుకున్నాడు. సెమీస్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన సూపర్-8 మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై అజేయమైన 97 పరుగులు (50 బంతుల్లో) చేసిన సంజూ.. సెమీస్‌లో ఇంగ్లండ్‌పై, ఫైనల్లో న్యూజిలాండ్‌పై తలో 89 పరుగులు చేసి జట్టును విజయపథంలో నడిపించాడు. ఈ టోర్నీలో సంజూ మొత్తం 5 ఇన్నింగ్స్‌ల్లో 321 పరుగులు సాధించాడు. 2024 ఎడిషన్‌లో సంజూ పూర్తిగా బెంచ్‌పైనే గడిపాడు. ఇది 1983లో వాల్సన్ పరిస్థితిని గుర్తు చేసింది. షేకింగ్ సర్దార్2024 ప్రపంచకప్‌లో టాప్ వికెట్ టేకర్‌గా (17 వికెట్లు) నిలిచి భారత్ టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించిన అర్షదీప్ సింగ్.. తాజా ఎడిషన్‌లోనూ (2026) ఇంచుమించు అదే తరహా ప్రదర్శనలతో (9 వికెట్లు) షేకింగ్ సర్దార్ అనిపించుకున్నాడు. అర్షదీప్ తన నిలకడ ప్రదర్శనలతో భారత్‌కు వరుసగా రెండు టీ20 టైటిళ్లు అందించడంలో ప్రధాన పాత్ర పోషించాడు. -
‘తుదిజట్టులో అతడు లేకుంటే టీమిండియాకు ఓటమే’
టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్లో టీమిండియా సత్తా చాటింది. సమిష్టి ప్రదర్శనతో రాణించి న్యూజిలాండ్‌ను మట్టికరిపించింది. అహ్మదాబాద్‌లో కివీస్‌ను 96 పరుగుల తేడాతో చిత్తు చేసి.. ముచ్చటగా మూడోసారి పొట్టి క్రికెట్ వరల్డ్‌కప్ ట్రోఫీని ముద్దాడింది.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్పాన్ పఠాన్ (Irfan Pathan) కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత తుదిజట్టులో సంజూ శాంసన్ లేకపోయి ఉంటే.. సూర్య సేన ప్రయాణం ఇక్కడిదాకా సాగేది కాదన్నాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ..తుదిజట్టులో లేకపోయి ఉంటే..‘‘ఈ ప్రపంచకప్ టోర్నీలో.. ఒకవేళ సంజూ శాంసన్ గనుక భారత తుదిజట్టులో లేకపోయి ఉంటే.. టీమిండియా ట్రోఫీ గెలిచేది కాదు. వెస్టిండీస్‌తో సూపర్-8లో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అతడు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.ఇక ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లోనూ అత్యద్భుత రీతిలో బ్యాటింగ్ చేశాడు. ఫైనల్లోనూ ఇదే పునరావృతం చేసి ముచ్చటగా, వరుసగా మూడో భారీ హాఫ్ సెంచరీ సాధించాడు. నిజానికి తన కెరీర్లో ఎన్నో ఎత్తుపళ్లాలు ఉన్నాయి.అయినా సరే అతడు కఠినంగా శ్రమిస్తూ ధైర్యంగా ముందుకు సాగాడు. అందుకే ఆ దేవుడు అతడి కష్టానికి తగిన గుర్తింపు వచ్చేలా చేశాడు. సంజూ హార్డ్వర్క్కు లభించిన స్వీటెస్ట్ రివార్డు ఇది’’ అని ఇర్ఫాన్ పఠాన్ ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్‌పై ప్రశంసలు కురిపించాడు.నాకౌట్ మ్యాచ్‌లలో సంజూ విశ్వరూపంకాగా టీ20 ప్రపంచకప్ ఆరంభానికి ముందే తుదిజట్టులో సంజూ చోటు కోల్పోయాడు. అయితే, నమీబియాతో మ్యాచ్‌కు అభిషేక్ శర్మ కడుపు నొప్పి వల్ల దూరం కాగా మళ్లీ తుదిజట్టులోకి వచ్చాడు. అనంతరం జింబాబ్వేతో మ్యాచ్‌లోనూ ఆడాడు.అయితే, నాకౌట్ మ్యాచ్‌లలో సంజూ విశ్వరూపం చూపించాడు. వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో 97 పరుగులతో అజేయంగా నిలిచిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఇంగ్లండ్‌తో సెమీస్‌లో 89, న్యూజిలాండ్‌తో ఫైనల్లో 89 పరుగులతో దుమ్ములేపాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. చదవండి: సంజూ, ఇషాన్ ఎవరు?.. ఉగాండా, కెన్యాలను ఓడిస్తాం: పాక్ మాజీ క్రికెటర్All yours, Sanju! You’ve earned every bit of it! ❤️#T20WorldCup #INDvNZ pic.twitter.com/Ya4aJeeyyL— Star Sports (@StarSportsIndia) March 8, 2026 -
సంజూ ఎవరు?.. ఉగాండా, కెన్యాలను ఓడిస్తాం: పాక్ క్రికెటర్
టీమిండియా వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్ గెలవడంపై పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ స్పందించాడు. భారత్‌లో ప్రతిభ గల క్రికెటర్లకు కొదవలేదని.. అక్కడి గొప్ప వ్యవస్థ కూడా ఈ అరుదైన ఘనతకు కారణం అన్నాడు. మరోవైపు.. పాకిస్తాన్లో కూడా ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉన్నారని.. అయితే, పాక్ బోర్డు తీరు మాత్రం సరిగ్గా లేదని విమర్శించాడు.టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్లో భారత్ న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో ఏకపక్ష విజయం సాధించిన విషయం తెలిసిందే. తద్వారా సొంతగడ్డపై పొట్టి క్రికెట్ వరల్డ్‌కప్ గెలిచిన జట్టుగా.. ఓవరాల్‌గా మూడుసార్లు టీ20 ప్రపంచకప్ అందుకున్న టీమ్‌గా చరిత్ర సృష్టించింది.ప్రశంసల వర్షం ఈ నేపథ్యంలో పాక్ మాజీ బ్యాటర్ అహ్మద్ షెహజాద్ టీమిండియాపై ప్రశంసల వర్షం కురిపించాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తీరును కొనియాడుతూ.. పాక్ క్రికెట్ బోర్డు (PCB)కు గట్టిగానే చురకలు అంటించాడు.‘‘పాకిస్తాన్లో క్రికెట్ టాలెంట్‌కు కొదవలేదు. ఇక్కడ చాలా మంది ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉన్నారు. అయితే, లోపమంతా ఇక్కడి వ్యవస్థలోనే ఉంది. మరి ఇండియాలో.. అక్కడ ప్రతిభ, సరైన వ్యవస్థ.. రెండూ ఉన్నాయి. వారు సాధిస్తున్న విజయాలే ఇందుకు నిదర్శనం.అసలు ఈ సంజూ శాంసన్ ఎవరు?అసలు ఈ సంజూ శాంసన్ ఎవరు? అతడికి అసలు గతంలో అవకాశాలు వచ్చేవా?.. మరి ఇప్పుడో.. అతడు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. ఇక ఈ ఇషాన్ కిషన్.. అతడు ఎప్పుడో ఒకసారి మాత్రమే జట్టుకు ఆడతాడు.క్రమశిక్షణరాహిత్యానికి పాల్పడ్డాడని బోర్డు అతడిని శిక్షించింది. ఆ కసితో దేశవాళీ క్రికెట్లో అతడు రాణిస్తే.. తిరిగి నేరుగా ప్రపంచకప్ జట్టుకు ఎంపిక చేసింది. అదే విధంగా అభిషేక్ శర్మ.. టోర్నీ ఆరంభం నుంచి ఒత్తిడిలో కూరుకుపోయి విఫలమయ్యాడు.అయినా యాజమాన్యం అతడిపై నమ్మకం ఉంచింది. అందుకు ప్రతిగా ఫైనల్లో 21 బంతుల్లోనే 52 పరుగులతో సత్తా చాటాడు. టీమిండియా పెద్ద పెద్ద మ్యాచ్‌లలో పెద్ద జట్లను ఓడిస్తుంది. ఉగాండా, కెన్యాలను ఓడిస్తాంకానీ మన పాకిస్తాన్ జింబాబ్వే, ఉగాండా, కెన్యా వంటి పసికూన జట్లపై విజయాలను పండుగ చేసుకుంటుంది. వాళ్లను ఇక్కడికి పిలిపించి వారిపై గెలుపును ఆస్వాదిస్తుంది. ఇదే తేడా’’ అని అహ్మద్ షెహజాద్ పాక్ క్రికెట్‌ను ఘాటుగా విమర్శిస్తూ.. టీమిండియాను ప్రశంసించాడు. చదవండి: T20 WC 2026: సలాం సంజూ శాంసన్Pressure? WHAT PRESSURE!? 💪Third consecutive fifty for Sanju Samson, all on the biggest stage! 😍🚨 Only Indians with fifties in semi-final & final of an ICC Men's T20 WC:👉 Virat Kohli | 2014👉 Sanju Samson | 2026ICC Men’s #T20WorldCup | FINAL | #INDvNZ | LIVE NOW 👉… pic.twitter.com/dHtwpFQet2— Star Sports (@StarSportsIndia) March 8, 2026 -
వాళ్లు అద్భుతం.. తదుపరి లక్ష్యం గోల్డ్ మెడల్: సూర్యకుమార్
టీమిండియా అద్భుతం చేసింది. వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్ సాధించింది. తమ ఖాతాలో మూడో పొట్టి వరల్డ్‌కప్ ట్రోఫీని జమచేసుకుంది. అహ్మదాబాద్ వేదికగా ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో భారత్ ఏకంగా 96 పరుగుల తేడాతో జయభేరి మోగించి.. ఈ ఘనత సాధించింది.చరిత్ర పుటల్లోకి ఈ అద్వితీయ గెలుపుతో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) దిగ్గజాల సరసన నిలిచాడు. భారత్‌కు టీ20 ప్రపంచకప్ అందించిన కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni), రోహిత్ శర్మ (Rohit Sharma)లతో పాటు సూర్య పేరు కూడా చరిత్ర పుటల్లోకి ఎక్కింది. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2026 తర్వాత సూర్య రిటైర్ అవుతాడనే ఊహాగానాలు వచ్చాయి.ఈ నేపథ్యంలో విజయానంతరం సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమ తదుపరి లక్ష్యం ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం గెలవడమేనని పేర్కొన్నాడు. తద్వారా ఇప్పుడే తాను రిటైర్ కాబోనని 35 ఏళ్ల సూర్య సంకేతాలు ఇచ్చాడు.గోల్డ్ మెడల్ లక్ష్యంకాగా 2028లో లాస్ ఏంజెలెస్ వేదికగా విశ్వ క్రీడలు జరుగనున్న సంగతి తెలిసిందే. అదే ఏడాది టీ20 ప్రపంచకప్ తదుపరి ఎడిషన్ కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో సూర్య మాట్లాడుతూ.. ‘‘తదుపరి ఒకే ఏడాదిలో టీ20 వరల్డ్‌కప్‌తో పాటు ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించడమే లక్ష్యం’’ అని పేర్కొన్నాడు. ఇక ప్రపంచకప్ గెలిచిన ఆనందంలో.. ‘‘ఈ సంతోషం నుంచి తేరుకునేందుకు ఇంకాస్త సమయం పడుతుంది.వాళ్లు అద్భుతంసంజూ శాంసన్, అభిషేక్ శర్మ ప్రత్యేక ఆటగాళ్లు. వారు ఏదైనా అద్భుతం చేయగలరని అనుకున్నాం. ఫైనల్లో ఆ పని చేసి చూపించారు. ఇక మా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు. తరానికొక్క అరుదైన బౌలర్. అతడిని జాతీయ సొత్తు అని పిలవవచ్చు. జట్టును గెలిపించేందుకు ఏం చేయాలో అతడికి బాగా తెలుసు. అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా.. జట్టులోని ఇలా ప్రతి ఒక్కరు తమ వంతు పాత్రను చక్కగా నెరవేర్చారు’’ అని సూర్య ప్రశంసలు కురిపించాడు.చదవండి: లక్కీ కెప్టెన్!From World Cup glory to the next challenge, #SuryakumarYadav opens up about what lies ahead for #TeamIndia.🇮🇳❤️#T20WorldCup #INDVNZ pic.twitter.com/5NPw2aNK5X— Star Sports (@StarSportsIndia) March 8, 2026 -
సామ్సన్ తుఫాన్ ఇన్నింగ్స్.. ఫైనల్లో పవర్ హిట్టింగ్
-
'త్రి'వర్ణ విజయం
సామ్సన్ కొట్టిన సిక్స్‌లను కరిగే క్షణాలు కూడా కాసేపాగి వీక్షించినట్లు.. అభిషేక్ బాదిన బౌండరీల్ని పదిలంగా దాచుకోవాలని మైదానం తలచినట్లు.. ఇషాన్ ధనాధన్ అర్ధశతకానికి బంతి పెద్ద ఫ్యాన్ అయినట్లు... అహ్మదాబాద్‌లో పరుచుకున్న ‘పరుగుల’ వెన్నెల యావత్ భారతాన్ని మురిపించింది. ఎందుకంటే ఈ ప్రపంచకప్ విజయం...దీని తాలూకు వచ్చే ఆనందం... ఓ పూటకే సరిపోదు.ఒక్క చోటికే పరిమితం కాదు. మొత్తం దేశాన్నే తమ క్రికెట్ అభిమాన ప్రవాహంలో ఉప్పొంగేలా చేసింది.ముచ్చటగా మూడోసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది.2019 వన్డే ప్రపంచకప్‌లో మనల్ని ఫైనల్ చేరకుండా సెమీస్‌లోనే వెళ్లగొట్టిన న్యూజిలాండ్ జట్టుకు... 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో మనగడ్డపై మనల్ని ముంచిన అహ్మదాబాద్ వేదికకు.. టీమిండియా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. 2026 టి20 ప్రపంచకప్‌లో భారత్ విజేతగానిలిచింది. డిఫెండింగ్ చాంపియన్గాకరీబియన్లో పట్టుకొచ్చిన టి20 ప్రపంచకప్‌ను సొంతగడ్డపైనా నిలబెట్టుకుంది. సెమీస్లోఇంగ్లండ్పై, ఇప్పుడు ఫైనల్లో న్యూజిలాండ్‌పై భారత బ్యాటింగ్ దళం గర్జించింది.వందేమాతరం... వందేమాతరం... లక్ష మంది అభిమానులతో అహ్మదాబాద్ స్టేడియం హోరెత్తిపోయింది... ఇందులో రెండున్నరేళ్ల క్రితం ఇదే మైదానంలో గుండెకోతను అనుభవించిన వారు ఎంతో మంది ఉన్నారు. కానీ ఇప్పుడు అది గతం.. నాటి గాయానికి మందు రాసేలా సొంతగడ్డపై, ఫ్యాన్స్ సమక్షంలో భారత జట్టు టి20 ప్రపంచ కప్‌ను సగర్వంగా అందుకుంది. వరల్డ్ కప్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో మూడో టైటిల్‌ను సొంతం చేసుకోవడంతో పాటు వరుసగా రెండోసారి ట్రోఫీని గెలుచుకున్న తొలి జట్టుగా ఘనత సాధించింది. రెండేళ్ల క్రితం విశ్వ విజేతగా నిలిచిన నాటి నుంచి ఏ రోజూ స్థాయి తగ్గకుండా అదే దూకుడు, జోరుతో ఆడిన టీమిండియా అదే తీవ్రతను కొనసాగిస్తూ టైటిల్ నిలబెట్టుకోవడం విశేషం.ఫైనల్లో న్యూజిలాండ్‌తో సమరం అంటే ముందుగా మనదే కొంత పైచేయిగా కనిపించింది... దానికి తగినట్లుగా ఆరంభం నుంచే టాప్–3 బ్యాటర్లు విరుచుకుపడ్డారు. సామ్సన్ తన ధాటిని కొనసాగించగా అభిషేక్ అసలు పోరులో తన సత్తాను ప్రదర్శించాడు. తోడుగా ఇషాన్ కిషన్ కూడా చెలరేగడంతో బౌండరీల విధ్వంసం సాగింది. ప్రతీ బంతీ బౌండరీ దాటుతుండగా భారత్ ఆట చూస్తే 300 స్కోరు ఖాయమనిపించింది. అక్కడి వరకు చేరకపోయినా 255 పరుగులతో మ్యాచ్‌ను శాసించే స్థితిలో టీమిండియా నిలిచింది. వరల్డ్ కప్ ఫైనల్లో ప్రత్యర్థి జట్టు వేదికపై ఛేదన ఎంత కష్టమో కివీస్‌కు తెలిసే సరికి మ్యాచ్ ముగిసిపోయింది... బుమ్రా, అక్షర్ బౌలింగ్‌తో ఆ జట్టు కునారిల్లింది. సంపూర్ణ ఆధిపత్యంతో టీమిండియా విశ్వ విజేతగా నిలిచింది.అభిషేక్ బౌలింగ్‌లో డఫీ కొట్టిన షాట్‌ను బౌండరీ వద్ద హైదరాబాదీ తిలక్ వర్మ అందుకోవడంతో అన్ని వైపుల నుంచి వేడుకలు మొదలయ్యాయి. గత టోర్నీ గెలుపు అనుభవాన్ని కొందరు మళ్లీ రుచి చూస్తే... తొలిసారి వరల్డ్ కప్ నెగ్గిన కుర్రాళ్ల ఆనందానికి అవధుల్లేవు... వరల్డ్ కప్ గెలిపించిన కెప్టెన్‌గా సూర్యకుమార్ చరిత్రకెక్కగా... గత వరల్డ్ కప్ విజేతలు కపిల్, ధోని, రోహిత్ శర్మ గ్యాలరీ నుంచి అభినందిస్తుండగా టీమిండియా ఆటగాళ్లంతా మైదానంలో మువ్వన్నెల జెండాతో సంబరాలు చేసుకున్నారు. అహ్మదాబాద్: సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు టి20 వరల్డ్ కప్‌లో విజేతగా నిలిచింది. గతంలో 2007, 2024లో టైటిల్ సాధించిన టీమిండియా ఇప్పుడు మూడోసారి ట్రోఫీని అందుకోవడం విశేషం. ఆదివారం నరేంద్ర మోదీ స్టేడియంలో ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో భారత్ 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది. టాస్ గెలిచిన కివీస్ ఫీల్డింగ్ ఎంచుకోగా... ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. సంజు సామ్సన్ (46 బంతుల్లో 89; 5 ఫోర్లు, 8 సిక్స్‌లు), ఇషాన్ కిషన్ (25 బంతుల్లో 54; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), అభిషేక్ శర్మ (21 బంతుల్లో 52; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీలతో రాణించారు. అనంతరం న్యూజిలాండ్ 19 ఓవర్లలో 159 పరుగులకే కుప్పకూలింది. టిమ్ సీఫెర్ట్ (26 బంతుల్లో 52; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు), సాంట్నర్ (35 బంతుల్లో 43; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మినహా అంతా విఫలమయ్యారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జస్ప్రీత్ బుమ్రా (4/15), అక్షర్ పటేల్ (3/27) న్యూజిలాండ్‌ను దెబ్బ తీశారు. విజేతగా నిలిచిన భారత జట్టుకు రూ. 27 కోట్ల 48 లక్షల ప్రైజ్‌మనీ దక్కింది. ధనాధన్ దూకుడు... తొలి ఓవర్లో 7 పరుగులు, రెండో ఓవర్లో 5 పరుగులు... ఇంత వరకు భారత్ కాస్త జాగ్రత్త పడింది. డఫీ వేసిన మూడో ఓవర్‌తో మొదలైన బ్యాటింగ్ విధ్వంసం చివరి ఓవర్ వరకు సాగింది. టాప్–3 బ్యాటర్లంతా ఒకరితో మరొకరు పోటీ పడి కివీస్ పనిపట్టారు. ఫెర్గూసన్ ఓవర్లో అభిషేక్, సామ్సన్ కలిసి 2 ఫోర్లు, 2 సిక్స్‌లు కొట్టడంతో 24 పరుగులు వచ్చాయి. హెన్రీ ఓవర్లో ఇద్దరూ చెరో సిక్సర్ బాదగా, డఫీ ఓవర్లో అభిషేక్ 3 ఫోర్లు, సిక్స్ కొట్టడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 92 పరుగులకు చేరింది. 18 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే అభిషేక్ వెనుదిరిగినా, కిషన్ వచ్చి అదే జోరును కొనసాగించాడు. 33 బంతుల్లో సామ్సన్ హాఫ్ సెంచరీని అందుకున్నాడు. ఆ తర్వాత ఫెర్గూసన్ ఓవర్లో సామ్సన్ వరుసగా 2 సిక్స్‌లు బాదగా, కిషన్ మరో సిక్స్ కొట్టాడు. రచిన్ వేసిన 14వ ఓవర్లోనైతే సామ్సన్ వరుసగా 6, 6, 6తో చెలరేగిపోగా, కిషన్ కూడా 23 బంతుల్లోనే అర్ధ సెంచరీని చేరుకున్నాడు. అయితే ఎట్టకేలకు తర్వాతి 16–19 వరకు నాలుగు ఓవర్ల పాటు భారత్‌ను కట్టడి చేయడంలో కివీస్ సఫలమైంది. నీషమ్ వేసిన ఒకే ఓవర్లో సామ్సన్, కిషన్, సూర్యకుమార్ (0) అవుట్ కాగా... పాండ్యా (18)ను హెన్రీ అవుట్ చేశాడు. ఈ నాలుగు ఓవర్లలో కలిపి 28 పరుగులే వచ్చాయి. అయితే నీషమ్ వేసిన చివరి ఓవర్లో దూబే (8 బంతుల్లో 26 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగిపోయాడు. దాంతో స్కోరు 250 దాటింది. సీఫెర్ట్ మినహా... తమ జట్టుకు శుభారంభం అందించడంలో కివీస్ ఓపెనర్లు విఫలమయ్యారు. పాండ్యా ఓవర్లో 2 సిక్స్‌లు, 2 ఫోర్లు బాది సీఫెర్ట్ జోరు ప్రదర్శించినా... మరోవైపు జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. 4 బంతుల వ్యవధిలో అలెన్ (9), రచిన్(1) అవుట్ కాగా, ఫిలిప్స్‌ను (5) అక్షర్ బౌల్డ్ చేశాడు. పవర్‌ప్లేలో జట్టు 52 పరుగులు చేయగలిగింది. వరుణ్ ఓవర్లో 2 సిక్స్‌లతో 23 బంతుల్లో సీఫెర్ట్ హాఫ్ సెంచరీ పూర్తయింది. అయితే నాలుగు బంతుల వ్యవధిలో చాప్మన్ (3), సీఫెర్ట్‌లు వెనుదిరగడంతో సగం టీమ్ పెవిలియన్ చేరింది. మిచెల్ (17), సాంట్నర్ కొద్దిసేపు పోరాడగలిగారు.అయితే బుమ్రా అద్భుత బంతితో సాంట్నర్‌ను అవుట్ చేయడంతో కివీస్ ఓటమి లాంఛనమే అయింది.స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (సి) (సబ్) మెక్‌కోన్‌కీ (బి) నీషమ్ 89; అభిషేక్ (సి) సీఫెర్ట్ (బి) రచిన్ 52; ఇషాన్ కిషన్ (సి) చాప్మన్ (బి) నీషమ్ 54; పాండ్యా (సి) సాంట్నర్ (బి) హెన్రీ 18; సూర్యకుమార్ (సి) రచిన్ (బి) నీషమ్ 0; తిలక్ (నాటౌట్) 8; దూబే (నాటౌట్) 26; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 255. వికెట్ల పతనం: 1–98, 2–203, 3–204, 4–204, 5–226. బౌలింగ్: హెన్రీ 4–0–49–1, ఫిలిప్స్ 1–0–5–0, డఫీ 3–0–42–0, ఫెర్గూసన్ 2–0–48–0, సాంట్నర్ 4–0–33–0, రచిన్ రవీంద్ర 2–0–32–1, నీషమ్ 4–0–46–3. న్యూజిలాండ్ ఇన్నింగ్స్: సీఫెర్ట్ (సి) ఇషాన్ కిషన్ (బి) వరుణ్ 52; అలెన్ (సి) తిలక్ (బి) అక్షర్ 9; రచిన్ (సి) ఇషాన్ కిషన్ (బి) బుమ్రా 1; ఫిలిప్స్ (బి) అక్షర్ 5; చాప్మన్ (బి) పాండ్యా 3; మిచెల్ (సి) ఇషాన్ కిషన్ (బి) అక్షర్ 17; సాంట్నర్ (బి)బుమ్రా 43; నీషమ్ (బి) బుమ్రా 8; హెన్రీ (బి) బుమ్రా 0; ఫెర్గూసన్ (నాటౌట్) 6; డఫీ (సి) తిలక్ (బి) అభిషేక్ 3; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (19 ఓవర్లలో ఆలౌట్) 159. వికెట్ల పతనం: 1–31, 2–32, 3–47, 4–70, 5–72, 6–124, 7–141, 8–141, 9–152, 10–159. బౌలింగ్: అర్‡్షదీప్ 4–0–32–0, పాండ్యా 4–0–36–1, అక్షర్ 3–0–27–3, బుమ్రా 4–0–15–4, వరుణ్ 3–0–39–1, అభిషేక్ 1–0–5–1. -
లక్కీ కెప్టెన్!
‘సంజు సామ్సన్‌కు మరో అవకాశం ఇస్తారా’... దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌కు ముందు మీడియా ప్రతినిధి ఒకరు సూర్యకుమార్ యాదవ్‌కు ప్రశ్న వేశాడు. సాధారణంగా మరో కెప్టెన్ అయితే జట్టులోని 15 మందీ సమర్థులే. పరిస్థితులను బట్టి మార్పులు చేర్పులు ఉంటాయి. మ్యాచ్ సమయంలో ఏదైనా నిర్ణయం తీసుకుంటాం అని సమాధానం ఇస్తారు. కానీ సూర్యకుమార్ వ్యంగ్యంగా ఒకింత అహంకారంగా నవ్వుతూ... ‘అభిషేక్‌ను తీసి ఆడించమంటారా...తిలక్‌ను తీసి ఆడించమంటారా’ అంటూ ఎదురు ప్రశ్న వేశాడు.చివరకు తప్పనిసరి పరిస్థితుల్లో తర్వాతి మ్యాచ్ జింబాబ్వేపై సామ్సన్ను ఆడించాల్సి వచ్చింది. ఆపై వరుసగా సామ్సన్ అద్భుత ప్రదర్శనలే జట్టును చాంపియన్‌గా నిలిపాయి. ఫైనల్‌కు ముందు కూడా ఆఫ్ స్పిన్ బౌలింగ్‌లో బ్యాటర్ల వైఫల్యం గురించి మాట్లాడుతూ... ‘120 స్ట్రయిక్‌రేట్‌తో ఆడుతూ కూడా ఫైనల్‌కు వచ్చామంటే అలాగే ఆడతాం’ అంటూ అర్థం లేని సమాధానం ఒకటి ఇచ్చాడు. ఒక నాయకుడిగా అతని అపరిపక్వతకు ఇవి ఒక సూచన. కానీ ఇవన్నీ ఇప్పుడు పక్కకు వెళ్లిపోతాయి.వరల్డ్ కప్ అందించిన నాయకుడిగానే అతను గుర్తుండిపోతాడు. కెప్టెన్‌గా 52 మ్యాచ్‌లలో 40 విజయాలు చూస్తే రికార్డుపరంగా ఇది చాలా మంచి సారథ్య ప్రదర్శనే. వరల్డ్ కప్‌కు కొద్ది రోజుల ముందు పరిస్థితి చూస్తే వరుసగా 23 టి20 మ్యాచ్‌లలో ఒక్క అర్ధ సెంచరీ కూడా లేదు... సిరీస్‌పై సిరీస్ గెలుస్తూ వస్తున్నా కెప్టెన్‌గా తనకంటూ ప్రత్యేక ముద్ర లేదు. కోచ్ గంభీర్ పర్యవేక్షణలో కేవలం అతని సూచనలను మైదానంలో అమలు చేసేవాడిగానే కనిపిస్తున్నాడు. సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ కూడా అతనికి లేదు... సూర్యకుమార్ యాదవ్ సారథ్యంపై గత రెండేళ్లుగా వినిపించిన విమర్శలు.తాజాగా వరల్డ్ కప్‌లోనూ ‘ఇదీ కెప్టెన్ క్షణం’ అనిపించే వ్యూహాలు ఏమీ అతడి నుంచి రాలేదు. అంతా సానుకూలంగా సాగిపోయింది, జట్టులో అందరూ తమ బాధ్యతలు నెరవేరుస్తూ వెళుతున్నారు కాబట్టి మంచి ఫలితాలు వస్తూనే వచ్చాయి. అయితేనేమి భారత్‌కు ప్రపంచ కప్ అందించిన దిగ్గజాలు కపిల్ దేవ్, ధోని, రోహిత్ శర్మ సరసన ఇప్పుడు సూర్యకుమార్ కూడా నిలిచాడు. నిజానికి రోహిత్ రిటైర్మెంట్ తర్వాత టి20ల్లో సూర్య ఆటోమెటిక్ ప్రత్యామ్నాయం ఏమీ కాదు.బ్యాటర్‌గా మంచి గుర్తింపు ఉన్నా నాయకుడిగా అతనికి ఎలాంటి రికార్డు లేదు. 2024 వరల్డ్ కప్ విజయం తర్వాత అప్పటి ఫామ్, సారథిగా అనుభవాన్ని బట్టి చూస్తే హార్దిక్ పాండ్యాకే జట్టు పగ్గాలు దక్కుతాయని అనిపించింది. అయితే క్రికెటేతర కారణాలు కావచ్చు పాండ్యాను కెప్టెన్సీ నుంచి దూరంగా పెట్టారు. అయితే బాధ్యతలు చేపట్టాక వరుస విజయాలు సూర్య కెప్టెన్సీ స్థానాన్ని పటిష్టం చేశాయి.శ్రీలంక, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్... ఇలా ప్రతీ జట్టుపై సిరీస్ సాధించడంతో పాటు ఆసియా కప్ కూడా మన ఖాతాలో చేరింది. పేలవ ఫామ్ కారణంగా కెప్టెన్సీ నుంచి తప్పించాలని చర్చ వచ్చినా వరల్డ్ కప్‌కు మరీ తక్కువ సమయం ఉండటంతో బీసీసీఐ అలాంటి సాహసం చేయలేదు. వరల్డ్ కప్‌లోనూ టీమిండియా ప్రదర్శన ముందు అన్ని జట్లూ తేలిపోవడంతో ట్రోఫీని అందుకోవడంలో సూర్య సఫలమయ్యాడు. –సాక్షి క్రీడా విభాగం -
సలాం సామ్సన్...
‘ఏమాత్రం బాధపడవద్దు మిత్రమా. సుదీర్ఘ టోర్నీ ఇది. ఏదో ఒక సమయంలో అవకాశం కచ్చితంగా లభిస్తుంది’... వరల్డ్ కప్ తొలి రోజు అమెరికాతో మ్యాచ్‌కు ముందు సంజు సామ్సన్‌కు తుది జట్టులో స్థానం లభించని సమయంలో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అతడికి సాంత్వన కలిగిస్తూ చెప్పిన మాట ఇది. తర్వాతి మ్యాచ్‌లో నమీబియాతో అభిషేక్ అనారోగ్య కారణంగా సామ్సన్‌కు అవకాశం దక్కింది. కానీ చేసింది 22 పరుగులే. ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌లలో టీమ్‌లో మళ్లీ చోటు లేదు. జింబాబ్వేపై చాన్స్ లభించినా 24 పరుగులకే పరిమితం! దాంతో సామ్సన్ టీమ్‌కు భారం, అతని భవిష్యత్తుపై కూడా చర్చ మొదలైంది. కానీ సామ్సన్ ఓడిపోలేదు. ఇక తనకు చివరి అవకాశంగా వెస్టిండీస్‌తో మ్యాచ్ లభించింది. అంతే... అక్కడి నుంచి అసాధారణంగా చెలరేగిపోయాడు. వెస్టిండీస్‌తో కీలకపోరులో 50 బంతుల్లో 97 నాటౌట్... సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై 42 బంతుల్లో 89... ఫైనల్లో న్యూజిలాండ్‌పై 46 బంతుల్లో 89... వరుసగా మూడు ముఖ్యమైన మ్యాచ్‌లలో మూడు అర్ధసెంచరీలతో తిరుగులేని ప్రదర్శన. మూడుసార్లూ త్రుటిలో సెంచరీ చేజారింది.చివర్లో కాస్త ప్రయత్ని స్తే శతకాలు అతని ఖాతాలో చేరేవేమో. కానీ అతను వాటిని పట్టించుకోలేదు. ప్రతీ బంతిని జట్టు స్కోరు పెంచడానికే తప్ప ఒక్క బంతి కూడా తన వ్యక్తిగత ఘనతల కోసం ఆడేందుకు ప్రయత్ని ంచలేదు. కానీ ఈ మూడు మ్యాచ్‌లలో సామ్సన్ చూపించిన విధ్వంస ప్రదర్శన భారత జట్టులో అతని స్థాయిని అమాంతం పెంచేసింది. సామ్సన్‌కు అనవసరంగా మద్దతు ఇస్తున్నారని, అతనికి చోటు దండగ అంటూ వ్యాఖ్యానించిన వారే ఇప్పుడు అతని వల్లే వరల్డ్ కప్ గెలిచిందని ప్రశంసిస్తున్నారు. తన ఆటతోనే అందరికీ అతను ఇచ్చిన సమాధానం ఇది. సామ్సన్ 2024లో వరల్డ్ కప్ గెలిచిన జట్టులో కూడా సభ్యుడిగా ఉన్నాడు. కానీ నాడు ఒక్క మ్యాచ్ కూడా ఆడే చాన్స్ రాకుండా ‘నామ్‌కే వాస్తే’గానే జట్టులో భాగంగా ఉన్నాడు. కానీ ఈసారి అతను విజయాన్ని శాసించాడు. కేవలం 5 ఇన్నింగ్స్‌లలో 321 పరుగులు సాధించి ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డు కూడా గెల్చుకొని జట్టులో ఎవరికీ అందనంత ఎత్తులో అతను నిలిచాడు. –సాక్షి క్రీడా విభాగం వెల్డన్... టీమిండియా న్యూఢిల్లీ: మూడోసారి టి20 ప్రపంచకప్ టైటిల్ గెలిచిన భారత పురుషుల క్రికెట్ జట్టుకు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. అసాధారణ నైపుణ్యం, పట్టుదల, సమష్టి కృషికి భారత జట్టు విజయం నిదర్శనమని ‘ఎక్స్’ వేదికగా మోదీ ప్రశంసించారు. ‘టోర్నీ ఆద్యంతం అత్యద్భుత ఆటతీరుతో అలరించారు. దేశం మొత్తం గర్వపడేలా చేశారు. వెల్డన్... టీమిండియా’ అంటూ మోదీ కొనియాడారు. 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను నిలబెడుతూ సూర్యకుమార్ బృందం సాధించిన టి20 ప్రపంచకప్ విజయం చరిత్రలో నిలిచిపోతుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి టీమిండియాను అభినందించారు. భవిష్యత్‌లో భారత్ మరిన్ని విజయాలు సాధించాలని కిషన్ రెడ్డి ఆకాంక్షించారు. -
ఫైనల్లో ఊచకోత.. సంజూ శాంసన్ వరల్డ్ రికార్డు
టీ20 వరల్డ్‌కప్-2026ను టీమిండియా స్టార్ ఓపెనర్‌గా సంజూ శాంసన్ ఘనంగా ముగించాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఫైనల్లో శాంసన్ విధ్వంసం సృష్టించాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ నుంచే కివీస్ బౌలర్లను ఉతికారేశాడు.మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్ వంటి వరల్డ్‌క్లాస్ బౌలర్లను సైతం సంజూ విడిచిపెట్టలేదు. అతడి మెరుపు బ్యాటింగ్‌కు బౌండరీలు చిన్నబోయాయి. శాంసన్ కేవలం 46 బంతుల్లోనే 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 89 పరుగులు చేశాడు. మొత్తంగా ఈ టోర్నీలో 5 మ్యాచ్‌లు ఆడిన శాంసన్.. 80.25 సగటుతో 321 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడిన సంజూ శాంసన్ పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.సంజూ సాధించిన రికార్డులు ఇవే👉టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా సంజూ రికార్డులెక్కాడు. సంజూ తొలి ఓవర్లో ఇప్పటివరకు 4 సిక్స్‌లు బాదాడు. ఇంతకుముందు ఈ రికార్డు మహ్మద్ రిజ్వాన్, క్వింటన్ డికాక్, గుర్బాన్, సాల్ట్ పేరిట ఉండేది. వీరిందరూ తొలి ఓవర్లో మూడు సిక్స్‌లు బాదారు.👉ఒక టీ20 ప్రపంచకప్ ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా సంజు శాంసన్ చరిత్ర సృష్టించాడు. ఈ ఏడాది ప్రపంచకప్‌లో సంజూ 21 సిక్సర్లు కొట్టాడు. ఈ క్రమంలో ఫిన్ అలెన్(21)ను సంజూ అధిగమించాడు.👉ఒకే టీ20 ప్రపంచకప్ ఎడిషన్‌లో సెమీఫైనల్, ఫైనల్ రెండింటిలోనూ హాఫ్ సెంచరీలు సాధించిన మూడో ప్లేయర్‌గా శాంసన్ నిలిచాడు. శాంసన్ కంటే ముందు షాహిద్ అఫ్రిది, విరాట్ కోహ్లి ఈ ఫీట్ సాధించారు.Pressure? WHAT PRESSURE!? 💪Third consecutive fifty for Sanju Samson, all on the biggest stage! 😍🚨 Only Indians with fifties in semi-final & final of an ICC Men's T20 WC:👉 Virat Kohli | 2014👉 Sanju Samson | 2026ICC Men’s #T20WorldCup | FINAL | #INDvNZ | LIVE NOW 👉… pic.twitter.com/dHtwpFQet2— Star Sports (@StarSportsIndia) March 8, 2026 -
Final: ఊచకోత.. టీమిండియా ఓపెనర్ల ప్రపంచ రికార్డు
భారత టీ20 ఓపెనింగ్ జోడీ సంజూ శాంసన్- అభిషేక్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించారు. టీ20 ప్రపంచకప్ టోర్నీ ఫైనల్లో యాభైకి పైగా స్కోరు సాధించిన ఓపెనింగ్ జంటగా ప్రపంచ రికార్డు సాధించారు. వీరిద్దరి విధ్వంసం కారణంగా.. టీ20 ప్రపంచకప్ సెమీస్ లేదంటే ఫైనల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన తొలి జట్టుగా టీమిండియా నిలిచింది.టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో న్యూజిలాండ్‌తో ఫైనల్లో టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగింది. అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోదీ స్టేడియంలో భారత ఓపెనర్లు సంజూ- అభిషేక్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. నాలుగో ఓవర్ ముగిసేసరికి సంజూ 14 బంతుల్లోనే 24, అభిషేక్ శర్మ 10 బంతుల్లోనే 23 పరుగులు సాధించారు.CHETTA POWER! 💪Outrageous six from Sanju Samson as 21 runs came off Matt Henry's over! 🥶ICC Men’s #T20WorldCup | FINAL | #INDvNZ | LIVE NOW 👉 https://t.co/Tz1DBSb4nT pic.twitter.com/LGg4snOIuP— Star Sports (@StarSportsIndia) March 8, 2026దీంతో టీ20 ప్రపంచకప్ చరిత్రలో 50కి పైగా స్కోరు సాధించిన ఓపెనింగ్ జోడీగా భారత స్టార్లు నిలిచారు. ఇక ఆ తర్వాత కూడా సంజూ- అభిషేక్ జోరు కొనసాగించారు. అభిషేక్ కేవలం 18 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.Cometh the hour, cometh the man! 😍Abhishek Sharma brings up his fifty in just 18 balls, fastest of the tournament! 💪ICC Men’s #T20WorldCup | FINAL | #INDvNZ | LIVE NOW 👉 https://t.co/Tz1DBSb4nT pic.twitter.com/mcmGhlxJxe— Star Sports (@StarSportsIndia) March 8, 2026మొత్తంగా 21 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 52 పరుగులతో దుమ్ములేపిన అభిషేక్.. రచిన్ రవీంద్ర బౌలింగ్‌లో టిమ్ సీఫర్ట్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. సంజూతో కలిసి అభిషేక్ తొలి వికెట్‌కు 43 బంతుల్లో 98 పరుగులు జోడించాడు.కాగా టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఫైనల్లో అత్యధిక స్కోరు సాధించిన ఓపెనింగ్ జోడీగా పాకిస్తాన్ స్టార్లు కమ్రాన్ అక్మల్- షాజైబ్ హసన్ రికార్డు సాధించాడు. వీరు 2009లో లార్డ్స్ వేదికగా శ్రీలంక మీద 48 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తాజాగా వీరి రికార్డును బద్దలు కొడుతూ సంజూ- అభిషేక్ శర్మ కలిసి కేవలం నాలుగు ఓవర్లలోనే 51 పరుగులు సాధించారు. ఇదిలా ఉంటే.. సంజూ శాంసన్ 33 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. -
సంజూ మాట!.. కోహ్లి మాదిరే విశ్వరూపం చూపిస్తాడా!
టీ20 ప్రపంచకప్-2026 సెమీ ఫైనల్లో భారీ స్కోర్ చేసినా దాన్ని కాపాడుకోలేక కిందామీదా పడింది టీమ్ ఇండియా. ముంబై వేదికగా గురువారం జరిగిన రెండో సెమీస్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను 7 పరుగుల తేడాతో ఓడించి భారత్ విజయం సాధించింది. దీంతో టీమిండియా ఓవరాల్‌గా నాలుగోసారి, వరుసగా రెండోసారి ఫైనల్ టికెట్ దక్కించుకుంది. అయితే, జట్టు విజయపథంలో ఉన్నప్పటికీ అభిషేక్ శర్మ పేలవ ఫామ్ ఇప్పుడు టీమ్ మేనేజ్మెంట్కు పెద్ద తలనొప్పిగా మారింది.వాస్తవానికి అభిషేక్ శర్మకు ఈ టీ20 వరల్డ్ కప్ ఓ పీడకలలా మారింది. ఇప్పటివరకు ఆడిన ఏడు ఇన్నింగ్స్‌ల్లో అతడు కేవలం 89 పరుగులు మాత్రమే చేశాడు. గ్రూప్ స్టేజ్‌లో ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ అభిషేక్.. కనీసం ఖాతా తెరవకుండానే డకౌటయ్యి వెనుదిరగడం గమనార్హం. జింబాబ్వేపై 55 పరుగులు చేసి ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపించినా.. ఆ తర్వాత వెస్టిండీస్, సెమీస్‌లో ఇంగ్లండ్‌పై మళ్ళీ విఫలమయ్యాడు. దీంతో ఫైనల్లో అభిషేక్ ప్లేస్‌లో ఫినిషర్ రింకూ సింగ్‌నైనా టీమ్‌లోకి తీసుకుంటే బ్యాటింగ్ లైనప్ మరింత బలోపేతమవుతుందన్న వాదన వినిపిస్తోంది.అయితే.. అభిషేక్ ఫామ్ లేమిపై సంజూ శాంసన్ మాట్లాడుతూ.. ఫైనల్లో అభిషేక్ దుమ్మురేపుతాడేమోనని అన్నాడు. కాగా.. గత టీ20 వరల్డ్‌కప్‌లోనూ ఇలాంటి సంఘటనే జరిగింది. రన్ మెషిన్ విరాట్ కోహ్లీ గత వరల్డ్‌కప్‌లో ఇలానే వరుస ఫెయిల్యూర్లతో ఆందోళన రేకెత్తించాడు. చివరికి సెమీస్‌లోనూ రాణించలేకపోయాడు.ఆ సమయంలో అప్పటి కెప్టెన్‌గా ఉన్న రోహిత్ సరిగ్గా ఇలాంటి కామెంట్లే చేశాడు. కోహ్లీ ఫైనల్లో ఖచ్చితంగా రాణిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. రోహిత్ అన్నట్టే కోహ్లీ ఫైనల్లో సౌతాఫ్రికాపై విజృంభించాడు. ఆసక్తికరంగా ఫైనల్లో అంతా విఫలమవగా కోహ్లీ ఒక్కడే ఆదుకున్నాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024 ఫైనల్లో ఓపెనింగ్ బ్యాటర్ కోహ్లి 59 బంతుల్లో 76 పరుగులు సాధించాడు.దీంతో ఇప్పుడు సంజూ అన్నట్టు.. ఈసారి అభిషేక్ కూడా ఫైనల్లో విశ్వరూపం చూపిస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అదే జరిగితే అంతకంటే సంతోషం ఉండదు. చూడాలి మరి అభిషేక్ శర్మ అభిమానులతో పాటు యాజమాన్యం నమ్మకం నిలబెట్టుకుంటాడో లేదో!! -
IND vs NZ: అభిషేక్ శర్మ వద్దు.. అతడిని ఆడించండి!
న్యూజిలాండ్‌తో ఫైనల్లో భారత తుదిజట్టు కూర్పు గురించి చర్చ నడుస్తోంది. వరుస వైఫల్యాల తర్వాత కూడా అభిషేక్ శర్మను కొనసాగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. కీలక మ్యాచ్‌కు ముందు తుదిజట్టులో మార్పులు చేసి రిస్క్ తీసుకోవద్దని యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం.అయితే, టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ (Mohammad Kaif) మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించాడు. వైఫల్యాలు అభిషేక్ శర్మ మానసిక స్థితిపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని.. కాబట్టి అతడికి విశ్రాంతినివ్వడమే ఉత్తమమని పేర్కొన్నాడు. ఇందుకు వెస్టిండీస్ ఆటగాళ్లను ఉదాహరిస్తూ పోలిక తెచ్చాడు.విశ్రాంతినివ్వాలి‘‘అభిషేక్ శర్మకు మేనేజ్మెంట్ విశ్రాంతినివ్వాలి. ఇప్పటికే అతడు చాలా మ్యాచ్‌లు ఆడేశాడు. అన్నింటిలోనూ విఫలం అయ్యాడు. ఫైనల్లో తుదిజట్టులో మార్పులు చేయడం ఏమంత హానికరం కాదు. పొట్టి ఫార్మాట్లో ఎప్పటికప్పుడు ఇలాంటి మార్పులు సహజమే.టీమిండియాతో సూపర్-8 మ్యాచ్‌లో వెస్టిండీస్.. ఫామ్‌లో లేని బ్రాండన్ కింగ్‌కు బదులు.. రోస్టన్ ఛేజ్‌ను ఓపెనర్‌గా ఆడించింది. బ్రాండన్‌రు ఐదు- ఆరు మ్యాచ్‌లు ఆడించినా ఫలితం లేకుండా పోయింది. అందుకే కీలక మ్యాచ్ అయినా సరే అతడికి బ్రేక్ ఇచ్చారు.టీమిండియా కూడా ఆదిలో సంజూను పక్కన పెట్టింది. కీలక మ్యాచ్‌లలో ఆడించి అనుకున్న ఫలితం రాబట్టింది. అతడు గొప్ప ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. జట్టుకు ప్రయోజనం చేకూర్చాడు. భారత జట్టులో ఇప్పటికే ఎంతో మంది ఆటగాళ్లు తమ ప్రతిభను నిరూపించుకున్నారు.రింకూను ఆడించండిటెస్టులు, రంజీ ట్రోఫీ, ఐపీఎల్.. ఇలా టోర్నీ ఏదైనా రింకూ సింగ్ పరుగులు రాబట్టగలడు. కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్ కీలక సమయాల్లో వికెట్లు కూల్చి జట్టును గెలిపించిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి ప్లేయర్లు డగౌట్లో కూర్చుని ఉండటం చూస్తే.. అభిషేక్ శర్మకు బదులు వీరిలో ఒకరిని ఆడించవచ్చు కదా అనిపిస్తుంది.అవును.. ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న అభిషేక్ శర్మకు బదులు డగౌట్లో కూర్చోబెడుతున్న రింకూ సింగ్‌ను తుదిజట్టులోకి తీసుకోండి. బాగా ఆడని ఆటగాడికి చోటు ఇస్తూ.. అద్భుతంగా ఆడే ప్లేయర్‌ను బెంచ్‌కే పరిమితం చేయడం సరికాదు. అభిషేక్ శర్మ గొప్ప నైపుణ్యాలు ఉన్న ఆటగాడే. కానీ ఐసీసీ టోర్నీలు అతడికి కొత్త. ఏదేమైనా సంజూతో అతడిని పోల్చవద్దు. సంజూతో పోలిక వద్దుఇప్పటికే సంజూ అంతర్జాతీయ స్థాయిలో, ఐపీఎల్లో తానేంటో నిరూపించుకున్నాడు. టాప్-10 బ్యాటర్లలో అతడూ ఉంటాడు’’ అని మహ్మద్ కైఫ్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు. ఫైనల్లో అభిషేక్ శర్మను తప్పించి రింకూను ఫైనల్లో ఆడించాలని కైఫ్ సూచించాడు. కాగా టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్లో భారత్- న్యూజిలాండ్ ఆదివారం తలపడనున్నాయి. ఇందుకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక.చదవండి: T20 WC Final: విజేత ఆ జట్టే: సౌతాఫ్రికా దిగ్గజాలు -
నీకంత దూకుడు ఎందుకు?: అభిషేక్ శర్మపై అశ్విన్ ఆగ్రహం
అభిషేక్ శర్మ.. తొలిసారి ప్రపంచకప్ టోర్నీ ఆడుతున్న ఈ ఓపెనింగ్ బ్యాటర్ దారుణంగా విఫలమవుతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్‌లలో అతడు చేసిన స్కోర్లు వరుసగా.. 0 (1), 0 (4), 0 (3), 15 (12), 55 (30), 10 (11), 9 (7).విఫలమైనా..లీగ్ దశలో మూడు మ్యాచ్‌లు ఆడి డకౌట్ అయినా యాజమాన్యం అభిషేక్ శర్మ (Abhishek Sharma)ను ఓపెనర్‌గా కొనసాగించిది. అయితే, అతడి ఆట తీరు మాత్రం మారలేదు. ముఖ్యంగా ఇంగ్లండ్‌తో కీలక సెమీ ఫైనల్లోనూ ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ తేలిపోయాడు. తొందరపడి వికెట్ పారేసుకుని తొమ్మిది పరుగులకే నిష్క్రమించాడు.సంజూ మెరుపు ఇన్నింగ్స్మరో ఓపెనర్ సంజూ శాంసన్ (Sanju Samson) మెరుపు ఇన్నింగ్స్ (42 బంతుల్లో 89) తో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో అభిషేక్ ఆట తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది. టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సైతం ఈ ఓపెనింగ్ బ్యాటర్ వైఖరిని తప్పుబట్టాడు.తలతిక్క బ్యాటింగ్‘‘ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లో అతడు తలతిక్కగా బ్యాటింగ్ చేశాడు. నిజానికి అభిషేక్ గేమ్‌ప్లాన్‌కు నేను వీరాభిమానిని. విల్ జాక్స్ బౌలింగ్‌లో అతడు ఎనిమిది పరుగులు రాబట్టాడు. కానీ ఈ తర్వాత అతడి ఓవర్లోనే 30 పరుగులు తీయాలి అన్నట్లు తొందరపడ్డాడు.నీకంత దూకుడు ఎందుకు?కొన్నిసార్లు బాల్‌ను వదిలేయాల్సి ఉంటుంది. ఓవైపు సంజూ శాంసన్ కుదురుగా ఆడుతున్నాడు కదా!.. నీకు కష్టంగా అనిపిస్తే ఒక సింగిల్ తీసి మరో ఎండ్‌కు వెళ్లిపోవాల్సింది. ఆ తర్వాత మళ్లీ అవకాశం వస్తుంది కదా!.. ఏదేమైనా అంత దూకుడు పనికిరాదు’’ అని అశ్విన్ అభిషేక్‌పై మండిపడ్డాడు.అదే విధంగా.. న్యూజిలాండ్‌తో ఫైనల్ నేపథ్యంలో.. ‘‘అభిషేక్ మంచి బ్యాటర్. న్యూజిలాండ్‌తో ఇటీవలి సిరీస్‌లో సూపర్ ఫామ్ కనబరిచాడు. మిచెల్ సాంట్నర్, మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో గతంలో అదరగొట్టాడు.ఒత్తిడిలో ఉన్నాడుఅయితే, ఇప్పుడు అతడు ఒత్తిడిలో ఉన్నాడు. కెప్టెన్, హెడ్‌కోచ్ అతడితో మాట్లాడాలి. తనకు వ్యతిరేకంగా ప్రత్యర్థి జట్టు వద్ద ఉన్న ప్రణాళికలను వివరించాలి. అతడిలో గొప్ప ప్రతిభ ఉంది. కానీ ఎందుకో తడబడుతున్నాడు.ఇలాంటి తరుణంలో అతడిపై మరింత ఒత్తిడి చేసే విధంగా మేనేజ్మెంట్ ఉండకూడదు. మానసికంగా దృఢంగా తయారయ్యేలా తీర్చిదిద్దాలి’’ అని టీమిండియా యాజమాన్యానికి అశూ సూచనలు ఇచ్చాడు. కాగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఆ జట్టు కెప్టెన్ హ్యారీ బ్రూక్.. అభిషేక్ కోసం లెగ్‌సైడ్‌లో ఒకే ఒక్క ఫీల్డర్‌ను ఉంచాడు. అతడికి క్యాచ్ ఇచ్చి అభిషేక్ పెవిలియన్ చేరాడు. ఇదిలా ఉంటే.. మార్చి 8న భారత్- న్యూజిలాండ్ మధ్య టీ20 ప్రంచకప్-2026 ఫైనల్‌కు షెడ్యూల్ ఖరారైంది.చదవండి: T20 WC: అతడి వల్లే ఇదంతా.. మా కొంప మునిగింది అక్కడే: మెకల్లమ్ -
సంజూ కాదు!.. అతడే అందుకు అర్హుడు: మాజీ క్రికెటర్
టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసలు కురిపించాడు. బుమ్రా లాంటి బౌలర్ దొరకడం భారత జట్టు చేసుకున్న అదృష్టం అని కొనియాడాడు. టీమిండియాలో ఇంత వరకు ఇలాంటి బౌలర్‌ను ఎన్నడూ చూడలేదంటూ ఆకాశానికెత్తాడు.టైటిల్ పోరుకు అర్హతటీ20 ప్రపంచకప్-2026లో భారత్ ఫైనల్‌కు దూసుకువెళ్లిన విషయం తెలిసిందే. ముంబై వేదికగా వాంఖడేలో జరిగిన సెమీ ఫైనల్లో ఇంగ్లండ్‌పై ఏడు పరుగుల తేడాతో గెలిచిన సూర్య సేన.. టైటిల్ పోరుకు అర్హత సాధించింది.ఈ మ్యాచ్‌లో ఓపెనర్ సంజూ శాంసన్ (42 బంతుల్లో 89) బ్యాట్‌తో రాణిస్తే.. బుమ్రా తన అద్భుత స్పెల్‌తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఇంగ్లండ్ చిచ్చర పిడుగు జేకబ్ బెతెల్ (48 బంతుల్లో 105) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను లాగేసుకునే ప్రయత్నం చేస్తున్న వేళ.. బుమ్రా తన మ్యాజిక్ చూపించాడు.కీలక సమయంలో రాణించిపద్దెనిమిదవ ఓవర్లో 0,1,1,2,1,1 మాత్రమే ఇచ్చిన బుమ్రా.. టీమిండియా వైపు మ్యాచ్ తిప్పేశాడు. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ బుమ్రాను ప్రశంసలతో ముంచెత్తాడు. ‘‘బుమ్రా గురించి ఇప్పటికే చాలాసార్లు మాట్లాడుకున్నాం. అతడు తరానికొక్క బౌలర్. టీమిండియాలో ఇలాంటి బౌలర్‌ను చూడటం అరుదు.సంజూ కాదు!.. అతడే అందుకు అర్హుడుయార్కర్లు, స్లో బాల్స్ వేస్తాడు.. అవుట్ స్వింగ్, ఇన్‌స్వింగ్ రాబడతాడు. బౌన్సర్లు సంధిస్తాడు. ముఖ్యంగా ఒత్తిడిలోనూ ఎలా బౌలింగ్ చేయాలో అతడికి బాగా తెలుసు. నా దృష్టిలో ఈ మ్యాచ్‌కు సంబంధించి బుమ్రాకే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇవ్వాల్సింది.ఈ పిచ్‌పై బౌలర్లందరి ఎకానమీ దాదాపుగా 10 దాటి పోయింది. రెండు జట్లు కలిపి 500కు పైగా పరుగులు చేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో అలా బౌలింగ్ చేయడం అందరికీ సాధ్యం కాదు. ఇంతటి కఠినమైన ఓవర్‌ను బుమ్రా మాత్రమే వేయగలడు’’ అని ఇర్ఫాన్ పఠాన్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా పేర్కొన్నాడు.అక్షర్ పటేల్ సైతంకాగా ఈ మ్యాచ్‌లో సంజూకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. సంజూ సైతం బుమ్రానే ఈ అవార్డుకు అర్హుడు అని పేర్కొనడం గమనార్హం. ఇదిలా ఉంటే.. బుమ్రా ఓవరాల్‌గా నాలుగు ఓవర్లలో 33 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. మరోవైపు.. అక్షర్ పటేల్ అద్భుతమైన క్యాచ్‌లతో టీమిండియా విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. Next stop: FINAL! 😍A high-scoring thriller, but #TeamIndia hold their nerve and book a spot in the final! 🔥ICC Men’s #T20WorldCup | FINAL | #INDvNZ | SUN, 8th MAR, 5:30 PM pic.twitter.com/PQfdlxUEv7— Star Sports (@StarSportsIndia) March 5, 2026చదవండి: T20 WC: అతడి వల్లే ఇదంతా.. మా కొంప మునిగింది అక్కడే: మెకల్లమ్ -
T20 WC 2026: ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ నామినీల పేర్లు ప్రకటన
2026 టీ20 ప్రపంచకప్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ నామినీల పేర్లను ఐసీసీ ఇవాళ (మార్చి 6) ప్రకటించింది. ఈ జాబితాలో మొత్తం ఎనిమిది మంది ఆటగాళ్లు ఉన్నారు. వీరిలో ఒక టీమిండియా ప్లేయర్, ఓ పాకిస్తానీ ప్లేయర్ ఉన్నారు.భారత్ తరఫున ఈ అవార్డుకు నామినేట్ అయిన ఆ ఒకే ఒక్కడు సంజూ శాంసన్. సంజూ ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 232 పరుగులు చేశాడు. అతని సగటు 77.33, స్ట్రైక్ రేట్ 201.73గా ఉంది. ఈ టోర్నీలో భారత్ ఫైనల్‌కు చేరడంలో సంజూది కీలకపాత్ర. సెమీస్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై ఉగ్రరూపం (50 బంతుల్లో 97 నాటౌట్) దాల్చాడు. ఆపై సెమీస్‌లో ఇంగ్లండ్‌పై మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ 89 (42 బంతులు) ఆడి భారత్‌ను ఫైనల్‌కు చేర్చాడు.పాకిస్తాన్ తరఫున ఈ అవార్డుకు నామినేట్ అయిన ప్లేయర్ సాహిబ్జాదా ఫర్హాన్. ఫర్హాన్ తన జట్టు సూపర్-8 దశ దాటలేకపోయినా, అద్బుత ప్రదర్శనలతో అలరించాడు. శ్రీలంక, నమీబియాపై శతకాలు సాధించి, ఒకే వరల్డ్ కప్‌లో రెండు సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ టోర్నీలో 7 మ్యాచ్‌లు ఆడిన ఫర్హాన్.. 76.63 సగటున, 160.25 స్ట్రైక్ రేట్‌తో 383 పరుగులు చేశాడు.ఇతర నామినీలువిల్ జాక్స్ (ఇంగ్లండ్) – 226 పరుగులు, 9 వికెట్లు.రచిన్ రవీంద్ర (న్యూజిలాండ్) – 128 పరుగులు, 11 వికెట్లు.ఏయిడెన్ మార్క్రమ్ (దక్షిణాఫ్రికా కెప్టెన్) – 286 పరుగులు, కీలక వికెట్లు.టిమ్ సీఫర్ట్ (న్యూజిలాండ్) – 274 పరుగులు, సెమీఫైనల్లో 58.లుంగి ఎంగిడి (దక్షిణాఫ్రికా) – 12 వికెట్లు, ఎకానమీ 7.19.షాడ్లీ వాన్ స్కాల్క్విక్ (అమెరికా) – 13 వికెట్లు, టోర్నమెంట్లో అత్యధిక వికెట్లు.కాగా, టీ20 ప్రపంచకప్ 2026 తుది అంకానికి చేరింది. భారత్, న్యూజిలాండ్ ఫైనల్స్‌కు చేరాయి. న్యూజిలాండ్ సౌతాఫ్రికాను.. భారత్ ఇంగ్లండ్‌ను మట్టికరిపించి తుది పోరులో అమీతుమీకి సిద్దమయ్యాయి. అంతిమ సమరం మార్చి 8న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగనుంది. -
ఫైనల్లోకి ఏంట్రీ ఇంగ్లాండ్ కు భారత్ ఊచకోత..
-
టీమిండియా గెలుపుకు 3 కారణాలు ఇవే
-
వాంఖడేను సైలెంట్ చేస్తామన్నారు... కానీ మనవాళ్లు మోత మోగించారు!
-
T20 WC 2026: అదే మా కొంపముంచింది.. బ్రూక్ ఆవేదన
క్యాచెస్ విన్ మ్యాచెస్ అన్న నమ్మకాన్ని నిన్నటి భారత్-ఇంగ్లండ్ టీ20 వరల్డ్‌కప్ సెమీఫైనల్ మ్యాచ్ మరోసారి రుజువు చేసింది. ఈ మ్యాచ్ కీలక దశలో శివమ్ దూబే (అక్షర్ పటేల్ సాయంతో), తిలక్ వర్మ పట్టిన రెండు అద్భుతమైన క్యాచ్‌లు మ్యాచ్ గతినే మార్చేశాయి. అప్పటివరకు ఇంగ్లండ్‌కు అనుకూలంగా ఉన్న సమీకరణలు.. ఆ రెండు క్యాచ్‌ల తర్వాత భారత్‌పైపు మళ్లాయి.254 పరుగుల ఛేదనలో ఇంగ్లండ్ లక్ష్యం వైపు దూసుకెళ్తున్న వేల, అక్షర్ పటేల్-శివమ్, తిలక్ వర్మ చాకచక్యంగా వ్యవహరించి ప్రమాదకరంగా ఉన్న విల్ జాక్స్, సామ్ కర్రన్‌ను అద్భుతమైన క్యాచ్‌లతో పెవిలియన్‌కు పంపారు. ఈ మ్యాచ్‌లో భారత్ గెలుపుకు ఈ రెండు క్యాచ్‌లు ఓ కారణంగా చెప్పుకోవచ్చు.లక్ష్య ఛేదనలో జేకబ్ బేతెల్ (48 బంతుల్లో 105; 8 ఫోర్లు, 7 సిక్సర్లు) వీరోచిత శతకంతో పోరాడినప్పటికీ ఇంగ్లండ్ గెలుపు వాకిటి వరకు వచ్చి ఓటమిపాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓటమికి మరో క్యాచ్ కూడా కారణమైంది. అదేంటంటే.. భారత ఇన్నింగ్స్ మూడో ఓవర్ (జోఫ్రా ఆర్చర్) రెండో బంతికి సంజూ శాంసన్ ఇచ్చిన సునాయాసమైన క్యాచ్‌ను ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ నేలపాలు చేశాడు. ఇక్కడే ఇంగ్లండ్ ఓటమికి మొదటి బీజం పడింది. లైఫ్ లభించడంతో చెలరేగిపోయిన సంజూ బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి భారత్ భారీ స్కోర్ చేయడంలో కీలకపాత్ర పోషించాడు. సంజూకు లైఫ్ లభించే సమయానికి అతని స్కోర్ కేవలం 15 పరుగులే. లైఫ్ లభించాక పేట్రేగిపోయిన సంజూ మొత్తంగా 42 బంతుల్లో 8 ఫోర్లు, 7 భారీ సిక్సర్ల సాయంతో 89 పరుగులు చేసి ఔటయ్యాడు.ఒకవేళ సంజూ క్యాచ్‌ను బ్రూక్ ఆదిలోనే పట్టి ఉంటే, టీమిండియా ఈ స్థాయి స్కోర్ చేసుండకపోయేదేమో. ఏదిఏమైనా సంజూ క్యాచ్ వదలి బ్రూక్ సహా యావత్ ఇంగ్లండ్ టీమ్ మూల్యం చెల్లించుకుంది.ఈ మ్యాచ్‌లో మరో టర్నింగ్ పాయింట్ ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 18, 19వ ఓవర్లు. అప్పటివరకు గెలుపుపై ఆశలు పెట్టుకున్న ఇంగ్లండ్‌ను భారత పేసర్లు బుమ్రా, హార్దిక్ పాండ్యా దారుణంగా దెబ్బకొట్టారు. 18 బంతుల్లో 45 పరుగులు చేయాల్సిన తరుణంలో 18వ ఓవర్ వేసిన బుమ్రా కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి ఇంగ్లండ్ లక్ష్యాన్ని మరింత దూరం చేశాడు. 19వ ఓవర్ బంతిని అందుకున్న హార్దిక్ ప్రమాదకరంగా కనినిస్తున్న సామ్ కర్రన్‌ను ఔట్ చేయడంతో పాటు ఆ ఓవర్లో 9 పరుగులు మాత్రమే ఇవ్వడంతో భారత్‌కు గెలుపుపై ధీమా వచ్చింది.చివరి ఓవర్ వేసిన దూబే తొలి బంతికే బేతెల్‌ను ఔట్ చేయడంతో భారత శిబిరం ఊపిరి పీల్చుకుంది. ఆతర్వాత రెండు బంతులకు సింగిల్స్ మాత్రమే ఇచ్చిన దూబే... చివరి మూడు బంతులకు సిక్సర్లు ఇచ్చినప్పటికీ (ఆర్చర్) అప్పటికే ఇంగ్లండ్ ఓటమి ఖరారైపోయింది.మొత్తంగా సంజూ శాంసన్ డ్రాప్ క్యాచ్, శివమ్ దూబే (అక్షర్ పటేల్ సాయంతో), తిలక్ వర్మ క్యాచ్‌లు, బుమ్రా, హార్దిక్ పొదుపైన ఓవర్లు, చివరి ఓవర్ తొలి బంతికి రనౌట్ కావడం వంటి అంశాలు భారత్ గెలుపుకు కీలక కారణాలుగా నిలిచాయి.అయితే వీటిలో సంజూ డ్రాప్ క్యాచే ఇంగ్లండ్ కొంపముంచిందని హ్యారీ బ్రూక్ అభిప్రాయపడ్డాడు. సంజూ క్యాచ్ వదలి చాలా పెద్ద తప్పు చేశానని మ్యాచ్ అనంతరం ఆవేదన వ్యక్తం చేశాడు. -
టి20 ప్రపంచకప్‌లో తుది పోరుకు భారత్ (ఫొటోలు)
-
IND Vs ENG: పరుగుల వరదతో ఫైనల్లోకి
భారత జట్టు స్కోరు 253 పరుగులు... ఇందులో 18 ఫోర్లు, 19 సిక్స్‌లు.. వరల్డ్ కప్ చరిత్రలో ఏ జట్టూ కూడా ఇంత లక్ష్యాన్ని ఛేదించలేదు. ఇక గెలుపు లాంఛనమే, ఫైనల్ చేరడం ఖాయమనే అనిపించింది. కానీ ఇంగ్లండ్ కూడా ఏమాత్రం తగ్గలేదు. భారీ స్కోరును చూసి బెదిరిపోకుండా ఆ జట్టు కూడా 21 ఫోర్లు, 15 సిక్స్‌లతో ఆఖరి వరకూ పోరాడింది... కానీ అదృష్టవశాత్తూ టీమిండియా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్‌లో చివరకు 7 పరుగులతో సూర్యకుమార్ బృందం గట్టెక్కింది. గత మ్యాచ్ తరహాలోనే సంజు సామ్సన్ మరో అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును నడిపించగా... ఇంగ్లండ్ తరఫున జాకబ్ బెతెల్ శతకం జట్టును గెలిపించేందుకు సరిపోలేదు. చివర్లో కట్టుదిట్టమైన మన బౌలింగ్ భారత్‌ను ఫైనల్‌కు చేర్చింది. టి20 వరల్డ్ కప్‌ను నిలబెట్టుకున్న తొలి జట్టుగా నిలిచేందుకు ఇక ఒకే ఒక్క విజయం భారత్‌కు కావాలి. ఆదివారం ఆఖరి సమరంలో న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకోవడమే టీమిండియాకు మిగిలింది. ముంబై: టి20 వరల్డ్ కప్‌ను నిలబెట్టుకునే ప్రయత్నంలో భారత జట్టు ఒకే ఒక్క అడుగు దూరంలో నిలిచింది. వరుసగా రెండోసారి మన టీమ్ తుది పోరుకు అర్హత సాధించింది. గురువారం వాంఖెడే మైదానంలో హోరాహోరీగా సాగిన రెండో సెమీఫైనల్ సమరంలో 7 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించి భారత్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకోగా, ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది.‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సంజు సామ్సన్ (42 బంతుల్లో 89; 8 ఫోర్లు, 7 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగగా... శివమ్ దూబే (25 బంతుల్లో 43; 1 ఫోర్, 4 సిక్స్‌లు), ఇషాన్ కిషన్ (18 బంతుల్లో 39; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక పరుగులు సాధించారు. అనంతరం ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 246 పరుగులు చేసి ఓడిపోయింది. జాకబ్ బెతెల్ (48 బంతుల్లో 105; 8 ఫోర్లు, 7 సిక్స్‌లు) సెంచరీతో పోరాడినా జట్టుకు ఓటమి తప్పలేదు. ఆదివారం అహ్మదాబాద్‌లో జరిగే ఫైనల్లో న్యూజిలాండ్‌తో భారత్ తలపడుతుంది. భారత్, కివీస్ మధ్య టి20 వరల్డ్ కప్ ఫైనల్ జరగడం ఇదే తొలిసారి. పోటీ పడి సిక్సర్లు బాది... ఓపెనర్ అభిషేక్ శర్మ (9) మరోసారి విఫలమైనా... సామ్సన్, ఇషాన్ భాగస్వామ్యంతో భారత్ దూసుకుపోయింది. ఆర్చర్ తొలి ఓవర్లో వరుసగా 4, 6 కొట్టిన సామ్సన్ అతని రెండో ఓవర్లో కూడా 2 ఫోర్లు, సిక్స్ బాదాడు. మరోవైపు ఇషాన్ కూడా మూడు ఫోర్లు కొట్టడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 67 పరుగులకు చేరింది. డాసన్ ఓవర్లో భారీ సిక్స్‌తో 26 బంతుల్లో సామ్సన్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా, స్యామ్ కరన్ ఓవర్లో ఇద్దరూ కలిసి 20 పరుగులు రాబట్టారు. రెండో వికెట్‌కు 45 బంతుల్లో 97 పరుగులు జోడించిన తర్వాత ఎట్టకేలకు ఇషాన్‌ను రషీద్ అవుట్ చేశాడు. అయితే స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కొనే వ్యూహంతో బ్యాటింగ్‌లో ముందుగా దూబేను పంపిన భారత్ ఫలితం రాబట్టింది. రషీద్ ఓవర్లో 2 భారీ సిక్స్‌లతో అతను చెలరేగాడు. ఆ తర్వాత ఆర్చర్ ఓవర్లో మరో రెండు సిక్స్‌లు బాదిన సామ్సన్ మరింత దూకుడుగా ఆడే ప్రయత్నంలో వెనుదిరిగాడు. సూర్యకుమార్ (11) ఎక్కువసేపు నిలవలేకపోగా, ఒవర్టన్ ఓవర్లో హార్దిక్ పాండ్యా (12 బంతుల్లో 27; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మూడు ఫోర్లు కొట్టాడు. ఆర్చర్ వేసిన 19వ ఓవర్లో తిలక్ వర్మ (7 బంతుల్లో 21; 3 సిక్స్‌లు) ఏకంగా మూడు భారీ సిక్సర్లతో రెచ్చిపోయాడు. 20వ ఓవర్లో పాండ్యా మరో 2 సిక్స్‌లు కొట్టడంతో స్కోరు 250 దాటింది. ఆఖరి 5 ఓవర్లలో భారత్ 76 పరుగులు సాధించడం విశేషం. టాపార్డర్ విఫలం... భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ ఆరంభంలోనే ఫిల్ సాల్ట్ (5) వికెట్ కోల్పోయింది. జోస్ బట్లర్ (17 బంతుల్లో 25; 4 ఫోర్లు, 1 సిక్స్), హ్యారీ బ్రూక్ (7), టామ్ బాంటన్ (17) కూడా ఎక్కువసేపు నిలవలేకపోయారు. అయితే బెతెల్ మాత్రం పోరాటపటిమ కనబర్చాడు. బుమ్రా బౌలింగ్‌లో సిక్స్ కొట్టిన అతను వరుణ్ చక్రవర్తి ఓవర్లో వరుసగా 6, 6, 6 బాదడం విశేషం. పాండ్యా ఓవర్లోనూ అతను వరుసగా సిక్స్, ఫోర్ కొట్టాడు. మరోవైపు విల్ జాక్స్ (20 బంతుల్లో 35; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా బెతెల్‌కు సహకరించాడు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 39 బంతుల్లో 77 పరుగులు జోడించారు. జాక్స్ అవుటైన తర్వాత స్యామ్ కరన్ (18)తో కలిసి గెలిపించేందుకు బెతెల్ తీవ్రంగా ప్రయత్నించాడు. అయితే ఆఖరి 5 ఓవర్లలో 69 పరుగులు చేయాల్సిన దశలో రెండు ఓవర్లు వేసిన బుమ్రా 14 పరుగులు మాత్రమే ఇవ్వడంతో మ్యాచ్ భారత్ వైపు మళ్లింది. 45 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న బెతెల్... శివమ్ దూబే వేసిన చివరి ఓవర్ తొలి బంతికి రనౌట్ కావడంతో ఇంగ్లండ్ ఆశలు కోల్పోయింది. తర్వాతి ఐదు బంతుల్లో ఆర్చర్ (19 నాటౌట్) మూడు సిక్స్‌లు బాదినా లాభం లేకపోయింది. 17 ఓవర్ల వరకు ఇంగ్లండ్‌దే పైచేయి... దాదాపు అసాధ్యమైన లక్ష్యమే అయినా ఇంగ్లండ్ పూర్తిగా తడబడలేదు. వికెట్లు పడుతున్నా పరుగుల వేగం మాత్రం తగ్గించలేదు. ఇరు జట్ల ఇన్నింగ్స్‌లను పోలిస్తే 17 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్‌దే పైచేయిగా ఉంది. 10 ఓవర్లలో స్కోర్లు 119, 119తో సమంగా ఉండగా 15 ఓవర్లలో 177, 185తో ఇంగ్లండ్ ముందంజలో ఉంది. 17 ఓవర్లలో 205/4, 209/5తో వారిదే పైచేయి. అయితే చివరి 3 ఓవర్లు తేడా చూపించాయి. ఆర్చర్ వేసిన 19వ ఓవర్లో తిలక్ కొట్టిన 3 సిక్స్‌లు కీలకంగా మారాయి. దూబే వేసిన ఆఖరి ఓవర్లో 30 పరుగులు కాపాడుకోవాల్సి వచ్చింది కాబట్టి భారత్ బతికిపోయింది. మరికొన్ని పరుగులు తక్కువగా ఉన్నా కష్టమయ్యేది. సామ్సన్ క్యాచ్ వదిలేసి... గత మ్యాచ్ తరహాలో ఈసారి కూడా సామ్సన్ దూకుడైన బ్యాటింగ్‌తో చెలరేగిపోయాడు. అయితే అతనికి ఈసారి అదృష్టం కూడా కలిసి వచ్చింది. సామ్సన్ 15 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఆర్చర్ బౌలింగ్‌లో మిడాన్ వద్ద కెప్టెన్ బ్రూక్ అతి సునాయాస క్యాచ్ వదిలేశాడు. దానికి ఇంగ్లండ్ ఫలితం అనుభవించింది. క్యాచ్ చేజారడమే కాదు, ఈ క్షణం బౌలింగ్, ఫీల్డింగ్‌లో ఇంగ్లండ్ లయను బాగా దెబ్బ తీసింది. అప్పటి వరకు పరిస్థితి నియంత్రణలోనే ఉన్నా ఆ తర్వాత భారత్ పరుగుల వరద మొదలైంది. ఈ క్యాచ్‌ను బ్రూక్ పట్టి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేదేమో. లైఫ్ లభించిన తర్వాత సామ్సన్ 36 బంతుల్లో 74 పరుగులు బాదాడు. ఆ ఒక్క ఓవర్లోనే... భారత్ ఇన్నింగ్స్‌లో ఆటగాళ్లంతా ఏ బౌలర్‌ను వదలకుండా ప్రతీ ఓవర్లో బౌండరీలతో చెలరేగారు. అయితే జాక్స్ వేసిన ఒక్క 14వ ఓవర్ మాత్రమే దీనికి మినహాయింపు. ఈ ఓవర్లో ఒక్క బౌండరీ కూడా ఇవ్వకుండా 7 పరుగులే ఇచ్చిన జాక్స్ తొలి బంతికే సామ్సన్ వికెట్ తీశాడు. అక్షర్ అదరహో... మైదానంలో అక్షర్ పటేల్ ఫీల్డింగ్ భారత్ విజయంలో కీలకపాత్ర పోషించింది. ముందుగా సులువైన క్యాచ్ అందుకొని సాల్ట్ వెనుదిరిగేందుకు కారణమైన అక్షర్ ఆ తర్వాత అసాధారణ క్యాచ్‌తో బ్రూక్‌ను వెనక్కి పంపాడు. బుమ్రా వేసిన తొలి బంతికే బ్రూక్ షాట్ ఆడగా బంతి ఫీల్డర్లపై నుంచి వెళ్లిపోయినట్లుగా అనిపించింది. కానీ పాయింట్ నుంచి అక్షర్ వెనుదిరిగి చాలా దూరం పరుగెత్తాడు. బంతి కిందకు పడిపోతున్న దశలో చేతులూ పూర్తిగా చాపి అందుకున్న అతను నేలపై పడినా పట్టు కోల్పోలేదు. అనంతరం కీలక దశలో బౌండరీ వద్ద పరుగెడుతూ వచ్చి జాక్స్ క్యాచ్‌ను అందుకున్న అతను పట్టు కోల్పోయి బౌండరీ దాటుతున్నట్లు అనిపించిన సమయంలో దూబే వైపు విసిరాడు. ఈ క్యాచ్‌తో మ్యాచ్ పూర్తిగా భారత్ వైపు మొగ్గింది.5 టి20 ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌ల్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు గెల్చుకున్న ఐదో భారత క్రికెటర్ సంజు సామ్సన్. గతంలో యువరాజ్ సింగ్ (2007లో ఆ్రస్టేలియాపై సెమీఫైనల్లో), ఇర్ఫాన్ పఠాన్ (2007లో పాకిస్తాన్‌పై ఫైనల్లో), విరాట్ కోహ్లి (2014లో దక్షిణాఫ్రికాపై సెమీఫైనల్లో; 2024లో దక్షిణాఫ్రికాపై ఫైనల్లో), అక్షర్ పటేల్ (2024లో ఇంగ్లండ్‌పై సెమీఫైనల్లో) ఈ ఘనత సాధించారు.4 ఐసీసీ టోర్నీల్లో అత్యధికంగా నాలుగోసారి భారత్–న్యూజిలాండ్ జట్లు ఫైనల్లో తలపడనున్నాయి.4 టి20 ప్రపంచకప్‌లో భారత్ నాలుగోసారి ఫైనల్‌కు చేరింది. 2007లో, 2024లో విజేతగా నిలిచిన భారత్ 2014లో శ్రీలంక చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది.105 టి20 వరల్డ్‌కప్ నాకౌట్ మ్యాచ్‌ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ప్లేయర్‌గా బెతెల్ నిలిచాడు. దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్లో ఫిన్ అలెన్ (100 నాటౌట్) స్కోరును బెతెల్ రెండో సెమీఫైనల్లో అధిగమించాడు.స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (సి) సాల్ట్ (బి) జాక్స్ 89; అభిషేక్ (సి) సాల్ట్ (బి) జాక్స్ 9; ఇషాన్ కిషన్ (సి) జాక్స్ (బి) రషీద్ 39; దూబే (రనౌట్) 43; సూర్యకుమార్ (స్టంప్డ్) బట్లర్ (బి) రషీద్ 11; పాండ్యా (రనౌట్) 27; తిలక్ (బి) ఆర్చర్ 21; అక్షర్ (నాటౌట్) 2; వరుణ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 253. వికెట్ల పతనం: 1–20, 2–117, 3–160, 4–190, 5–212, 6–236, 7–251. బౌలింగ్: ఆర్చర్ 4–0–61–1, జాక్స్ 4–0–40–2, ఒవర్టన్ 3–0–36–0, స్యామ్ కరన్ 4–0–53–0, ఆదిల్ రషీద్ 4–0–41–2, లియామ్ డాసన్ 1–0–19–0. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: సాల్ట్ (సి) అక్షర్ (బి) పాండ్యా 5; బట్లర్ (బి) వరుణ్ 25; హ్యారీ బ్రూక్ (సి) అక్షర్ పటేల్ (బి) బుమ్రా 7; బెతెల్ (రనౌట్) 105; బాంటన్ (బి) అక్షర్ 17; జాక్స్ (సి) శివమ్ దూబే (బి) అర్ష్ దీప్ 35; స్యామ్ కరన్ (సి) తిలక్ వర్మ (బి) హార్దిక్ పాండ్యా 18; ఒవర్టన్ (నాటౌట్) 2; ఆర్చర్ (నాటౌట్) 19; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 246. వికెట్ల పతనం: 1–13, 2–38, 3–64, 4–95, 5–172, 6–222, 7–225. బౌలింగ్: అర్ష్ దీప్ సింగ్ 4–0–51–1, హార్దిక్ పాండ్యా 4–0–38–2, జస్ప్రీత్ బుమ్రా 4–0–33–1, వరుణ్ 4–0–64–1, అక్షర్ పటేల్ 3–0–35–1, శివమ్ దూబే 1–0–22–0. -
IND Vs ENG: నరాలు తెగే ఉత్కంఠ: టీమిండియా ధనాధన్ షో.. .. దర్జాగా ఫైనల్‌కు
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో టీమిండియా ఫైనల్‌కు దూసుకువెళ్లింది. సెమీ ఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించి.. టైటిల్ పోరుకు అర్హత సాధించింది. గత ఎడిషన్‌లో విజేతగా నిలిచిన భారత్.. ఈసారి కూడా ఫైనల్‌కు చేరి సత్తా చాటింది.253 పరుగులుముంబైలోని వాంఖడేలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 253 పరుగులు సాధించింది. ఓపెనర్ సంజూ శాంసన్ మరోసారి ధనాధన్ దంచికొట్టాడు. 42 బంతుల్లో 89 పరుగులతో ఈ వికెట్ కీపర్బ్యాటర్ అదరగొట్టాడు.వన్‌డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (18 బంతుల్లో 39) కూడా వేగంగా ఆడగా.. ఆల్‌రౌండర్లు శివం దూబే (25 బంతుల్లో 43), హార్దిక్ పాండ్యా (12 బంతుల్లో 27) మెరుపులు మెరిపించారు. తిలక్ వర్మ (7 బంతుల్లో 21) సైతం రాణించాడు.ఇంగ్లండ్ బౌలర్లలో విల్ జాక్స్, ఆదిల్ రషీద్ చెరో రెండు వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్‌కు ఒక వికెట్ దక్కింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ ఆదిలోనే ఓపెనర్ ఫిల్ సాల్ట్ (5), వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ హ్యారీ బ్రూక్ (7) వికెట్లు కోల్పోయింది.పట్టువదలని విక్రమార్కుడిలాఇక టామ్ బాంటన్ (17) కాసేపు నిలబడగా.. జోస్ బట్లర్ 25 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. అయితే, ఓవైపు వికెట్లు పడుతున్నా జేకబ్ బెతెల్ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా క్రీజులో పాతుకుపోయాడు. కేవలం 19 బంతుల్లోనే అర్ధ శతకం బాది.. టీ20 ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌లలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా ఫిన్ అలెన్ (న్యూజిలాండ్) రికార్డు సమం చేశాడు.నరాలు తెగే ఉత్కంఠఅదే జోరు కొనసాగిస్తూ బెతెల్ భారత శిబిరంలో ఆందోళన పెంచాడు. అయితే, పద్దెనిమిదో ఓవర్లో బుమ్రా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి.. కేవలం ఆరు పరుగులే ఇచ్చాడు. ఈ క్రమంలో రెండు ఓవర్లలో ఇంగ్లండ్ విజయ సమీకరణం 39 పరుగులుగా మారింది.అయితే, హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో పందొమ్మిదో ఓవర్లో సిక్స్ బాది బెతెల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 45 బంతుల్లోనే 102 పరుగులు సాధించాడు. దీంతో ఉత్కంఠ పెరిగింది. అయితే, పాండ్యా మూడో బంతికి సామ్ కర్రాన్ (18)ను అవుట్ చేశాడు. పాండ్యా బౌలింగ్‌లో కర్రాన్ బంతిని గాల్లోకి లేపగా బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న తిలక్ అద్భుతంగా క్యాచ్‌పట్టాడు.ఏడు పరుగుల తేడాతో గెలిచి ఫైనల్లోతన ఓవర్లో పాండ్యా 9 పరుగులే ఇవ్వగా.. ఆఖరి ఓవర్లో ఇంగ్లండ్ గెలుపునకు 30 పరుగులు అవసరమయ్యాయి. చివరి ఓవర్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బంతిని శివం దూబేకు ఇచ్చాడు. అతడి ఓవర్లో తొలి బంతికే బెతెల్ (105) రనౌట్ అయ్యాడు. దీంతో ఐదు బంతుల్లో 29 పరుగులు అవసరం కాగా.. ఆర్చర్ ఆఖరి మూడు బంతుల్లో సిక్సర్లు కొట్టినా లాభం లేకుండా పోయింది. ఇంగ్లండ్ 22 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా టీమిండియా ఏడు పరుగుల తేడాతో గెలిచి ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక అహ్మదాబాద్ వేదికగా ఆదివారం న్యూజిలాండ్‌తో ట్రోఫీ కోసం సూర్యకుమార్ సేన తలపడుతుంది. Next stop: FINAL! 😍A high-scoring thriller, but #TeamIndia hold their nerve and book a spot in the final! 🔥ICC Men’s #T20WorldCup | FINAL | #INDvNZ | SUN, 8th MAR, 5:30 PM pic.twitter.com/PQfdlxUEv7— Star Sports (@StarSportsIndia) March 5, 2026 స్కోర్లు: భారత్ - 253/7(20)ఇంగ్లండ్ - 246/7(20)ఫలితం: ఏడు పరుగుల తేడాతో భారత్ గెలుపు. -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. వరల్డ్ రికార్డు
టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. టీ20 క్రికెట్లో ఇంత వరకు ఏ జట్టుకూ సాధ్యం కాని ఘనత సాధించింది. పురుషుల పొట్టి ఫార్మాట్లో అత్యంత అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.జింబాబ్వేపై 256 పరుగులుభారత జట్టు సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్-2026 టోర్నీతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సూపర్-8 దశలో జింబాబ్వేపై 256 పరుగులు సాధించిన భారత జట్టు.. తాజాగా గురువారం నాటి మ్యాచ్‌లోనూ 250కి పైగా స్కోరు నమోదు చేసింది.పొట్టి క్రికెట్లో తొలి జట్టుగాముంబైలోని ప్రసిద్ధ వాంఖడే మైదానంలో ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లో.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 253 పరుగులు సాధించింది. ఓపెనర్ సంజూ శాంసన్ (42 బంతుల్లో 82) అదరగొట్టగా.. ఇషాన్ కిషన్ (18 బంతుల్లో 39), శివం దూబే (25 బంతుల్లో 43), హార్దిక్ పాండ్యా (12 బంతుల్లో 27), తిలక్ వర్మ (7 బంతుల్లో 21) మెరుపులు మెరిపించారు.Another must-win game, another Sanju Samson masterclass! 🔥His maiden T20I fifty against England and what an occasion to bring it up! 👏ICC Men’s #T20WorldCup | Semi-final 2 | #INDvENG | LIVE NOW 👉 https://t.co/L2OuYBUDbL pic.twitter.com/1csgOPterB— Star Sports (@StarSportsIndia) March 5, 2026ఫలితంగా టీమిండియాకు ఈ మేర 253 పరుగుల స్కోరు సాధ్యమైంది. ఈ క్రమంలోనే పొట్టి క్రికెట్లో అత్యధిక సార్లు 250 ప్లస్ స్కోరు సాధించిన జట్టుగా నిలిచింది. తద్వారా ఐపీఎల్ ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది.పురుషుల టీ20 క్రికెట్లో అత్యధిక సార్లు 250కి పైగా పరుగులు సాధించిన జట్లు👉టీమిండియా- ఆరు సార్లు👉సన్‌రైజర్స్ హైదరాబాద్- ఐదు సార్లు👉వెస్టిండీస్- మూడు సార్లు👉జింబాబ్వే- మూడు సార్లు👉సర్రే- మూడు సార్లు.చదవండి: IND vs ENG: సెమీస్‌లోనూ ఫెయిల్.. జట్టు నుంచి తీసేయండి! -
T20 WC 2026: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్
టీ20 ప్రపంచకప్-2026 సెమీ ఫైనల్లో టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్ అదరగొట్టాడు. ఇంగ్లండ్ బౌలింగ్‌ను చితక్కొడుతూ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. మూడో ఓవర్లో తనకు లభించిన లైఫ్‌ను సద్వినియోగం చేసుకున్న ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు.Ohhhhh, Harry Brook! 😳Sanju Samson makes the most of the lifeline and sends it into the stands! 🚀ICC Men’s #T20WorldCup | Semi-final 2 | #INDvENG | LIVE NOW 👉 https://t.co/L2OuYBUDbL pic.twitter.com/zOWfIEAdUv— Star Sports (@StarSportsIndia) March 5, 2026మరోసారి సెంచరీ మిస్‌అయితే, దురదృష్టవశాత్తూ మరోసారి సెంచరీ మిస్సయ్యాడు. ప్రపంచకప్ టోర్నీ ఆరంభానికి ముందు ఫామ్‌లేమితో సతమతమైన సంజూ ఓపెనర్‌గా జట్టులో స్థానం కోల్పోయిన సంగతి తెలిసిందే. టీ20 ఓపెనర్, వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్ అతడి స్థానాన్ని భర్తీ చేసి అదరగొట్టాడు.అయితే, మరో ఓపెనర్ అభిషేక్ శర్మ కడుపు నొప్పి కారణంగా నమీబియాతో మ్యాచ్‌కు దూరం కాగా.. తొలిసారి సంజూకు వరల్డ్‌కప్ మ్యాచ్ ఆడే అవకాశం వచ్చింది. అయితే, ఈ మ్యాచ్‌లో వేగంగా ఆడిన సంజూ 8 బంతుల్లో 22 పరుగులు చేసి అవుటయ్యాడు.అనంతరం సూపర్-8 జింబాబ్వేతో మ్యాచ్ సందర్భంగా తిరిగి తుదిజట్టులోకి వచ్చిన సంజూ.. 15 బంతుల్లో 24 రన్స్ చేయగలిగాడు. అయినప్పటికీ మేనేజ్మెంట్ ఈసారి సంజూపై నమ్మకం ఉంచింది. ఈ క్రమంలో వెస్టిండీస్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సంజూ 97 పరుగులతో అజేయంగా నిలిచాడు. భారత్‌ను గెలిపించి సెమీ ఫైనల్‌కు చేర్చాడు. అయితే, మూడు పరుగులతో అక్కడ సెంచరీ మిస్సయ్యాడు.8 ఫోర్లు, 7 సిక్స్‌లు కొట్టితాజాగా ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లోనూ సంజూ శతకం చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. భారత్ ఇన్నింగ్స్‌లో పద్నాలుగో ఓవర్లో విల్ జాక్స్ బౌలింగ్‌కు దిగాడు. అతడి బౌలింగ్‌లో తొందరపడి షాట్‌కు యత్నించిన సంజూ.. ఫిల్ సాల్ట్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 42 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లు కొట్టి 89 పరుగులు సాధించి.. సెంచరీకి పదకొండు పరుగుల దూరంలో నిలిచిపోయాడు.Just Hardik Pandya things at the Wankhede Stadium! 🔥🚨 RECORD ALERT: 19 sixes by #TeamIndia - the most in an innings in ICC Men's T20 World Cup history!ICC Men’s #T20WorldCup | Semi-final 2 | #INDvENG | LIVE NOW 👉 https://t.co/L2OuYBUDbL pic.twitter.com/JdGVdpz1B4— Star Sports (@StarSportsIndia) March 5, 2026ఇక ఓపెనర్ అభిషేక్ శర్మ (9)తో కలిసి తొలి వికెట్‌కు 20 పరుగులు జోడించిన సంజూ.. వన్‌డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (39)తో కలిసి రెండో వికెట్‌కు 45 బంతుల్లో 97 పరుగులు, శివం దూబేతో కలిసి మూడో వికెట్‌కు 43 పరుగులు జోడించాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 253 పరుగులు సాధించింది.చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్‌టీ20 ప్రపంచకప్ ఎడిషన్‌లో టీమిండియా తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాటర్‌గా సంజూ శాంసన్ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్ సందర్భంగా ఈ ఘనత సాధించాడు.టీ20 ప్రపంచకప్ ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాటర్లు👉సంజూ శాంసన్- 16 సిక్స్‌లు- 2026లో👉రోహిత్ శర్మ- 15 సిక్స్‌లు- 2024లో👉శివం దూబే- 15 సిక్స్‌లు- 2026లో👉ఇషాన్ కిషన్- 14 సిక్స్‌లు- 2026లో👉హార్దిక్ పాండ్యా- 14 సిక్స్‌లు- 2026లో👉యువరాజ్ సింగ్- 12 సిక్స్‌లు- 2007లో.చదవండి: IND vs ENG: సెమీస్‌లోనూ ఫెయిల్.. జట్టు నుంచి తీసేయండి! -
సెమీస్‌కు ముందే టీమిండియాకు 5 గుడ్ న్యూస్ లు


