భారత జెర్సీలో సంజూ శాంసన్(పాత ఫోటో)
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT) 2025-26 కోసం కేరళ క్రికెట్ అసోసియేషన్ (KCA) తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఎంపికయ్యాడు. టీ20 ప్రపంచకప్-2026 సన్నాహకంగా ఈ దేశవాళీ టోర్నీని ఉపయోగించుకోవాలని సంజూ భావిస్తున్నాడు.
అయితే ఈ టోర్నీ మొత్తానికి శాంసన్ అందుబాటులో ఉండకపోవచ్చు. సంజూ కేవలం గ్రూపు స్టేజిలో మాత్రమే ఆడనున్నాడు. నవంబర్ 26 నుంచి ప్రారంభం కానున్న ఈ దేశవాళీ టోర్నీ లీగ్ గ్రూపు దశ మ్యాచ్‌లు డిసెంబర్ 8తో ముగుస్తాయి. అనంతరం డిసెంబర్ 9 నుంచి భారత్-దక్షిణాఫ్రికా మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.
ఈ సిరీస్‌లో సంజూ ఆడనున్నాడు. సంజూ గైర్హజరీలో కేరళ జట్టు కెప్టెన్‌గా మహ్మద్ ఇమ్రాన్ వ్యవహరించనున్నాడు. కేరళ తమ తొలి మ్యాచ్‌లో నవంబర్ 26న లక్నో వేదికగా తలపడనుంది. కేరళ జట్టులో రోహన్ ఎస్ కున్నుమ్మల్, మహ్మద్ అజరుద్దీన్ వంటి విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నారు.
ఇక ఇది ఇలా ఉండగా.. ఐపీఎల్-2026 సంజూ శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. మినీ వేలానికి ముందు రాజస్తాన్ నుంచి శాంసన్(రూ.18 కోట్లు)ను సీఎస్‌కే ట్రేడ్ చేసుకుంది. అందుకు బదులుగా రవీంద్ర జడేజా, సామ్ కుర్రాన్‌లను సీఎస్‌కే వదులుకుంది.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీకి కేరళ జట్టు
సంజూ శాంసన్ (కెప్టెన్), రోహన్ ఎస్ కున్నుమ్మల్, మహ్మద్ అజరుద్దీన్, అహమ్మద్ ఇమ్రాన్ (వైస్ కెప్టెన్), విష్ణు వినోద్, నిధీష్ ఎమ్ డి, ఆసిఫ్ కెఎమ్, అఖిల్ స్కారియా, బిజు నారాయణన్ ఎన్, అంకిత్ శర్మ, కృష్ణ దేవన్ ఆర్ జె, అబ్దుల్ బాజిత్ పిఎ, షరఫుద్దీన్ ఎన్‌ఎమ్, సిబిన్ వి, ప్రసాద్, సల్మాన్ నిజార్
చదవండి: PAK vs SL: తీరు మారని శ్రీలంక.. పాకిస్తాన్ గ్రాండ్ విక్టరీ


