డ‌బ్ల్యూపీఎల్‌-2026కు స‌ర్వం సిద్దం.. షెడ్యూల్ ఇదే! | WPL 2026 schedule: Check full list of matches with timings | Sakshi
Sakshi News home page

డ‌బ్ల్యూపీఎల్‌-2026కు స‌ర్వం సిద్దం.. షెడ్యూల్ ఇదే!

Jan 8 2026 9:25 PM | Updated on Jan 9 2026 10:54 AM

WPL 2026 schedule: Check full list of matches with timings

క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్-2026 సీజన్‌కు మరి కొన్ని గంటల్లో తెరలేవనుంది. తొలి మ్యాచ్‌లో శుక్రవారం నవీ ముంబై వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ టోర్నీని నవీ ముంబైతో పాటు వ‌డోద‌ర వేదిక‌గా నిర్వ‌హించ‌నున్నారు.

జనవరి 9 నుంచి 17 వరకు తొలి 11 మ్యాచ్‌లు నవీ ముంబైలో జ‌ర‌గ‌నుండ‌గా. ఆ త‌ర్వాత టోర్నీలో మిగిలిన మ్యాచ్‌ల‌కు వ‌డోద‌రలోని బీసీఎ స్టేడియం ఆతిథ్య‌మివ్వ‌నుంది. కీల‌క‌మైన ఎలిమినేట‌ర్ మ్యాచ్‌తో ఫైన‌ల్ కూడా ఇదే వేదిక‌గా జ‌ర‌గ‌నుంది. ఫిబ్రవరి 3న ఎలిమినేటర్ మ్యాచ్, ఫిబ్రవరి 5న ఫైనల్‌

సాధార‌ణంగా డ‌బ్ల్యూపీఎల్ ఫిబ్ర‌వ‌రిలో జ‌రుగుతుంది. కానీ పురుషుల టీ20 వరల్డ్ కప్‌-2026 కార‌ణంగా ఈ టోర్నీని గ‌తంలో కంటే ఒక నెల ముందుగానే నిర్వహిస్తున్నారు. ముంబై ఇండియన్స్‌, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్,యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్ మొత్తం ఐదు జట్లు టైటిల్ కోసం పోటీపడనున్నాయి. 

అయితే ఢిల్లీ క్యాపిటల్స్‌కు, యూపీ వారియర్స్‌కు కొత్త కెప్టెన్‌లు వచ్చారు. ఢిల్లీ జట్టుకు భారత స్టార్ ప్లేయర్ రోడ్రిగ్స్ సారథ్యం వహించనుండగా.. యూపీ వారియర్స్‌ను ఆసీస్ లెజెండ్ మెగ్ లానింగ్ ముందుండి నడిపించనుంది.

డబ్ల్యూపీఎల్‌ 2026 పూర్తి షెడ్యూల్ ఇదే..
జనవరి 9 – ముంబై ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (నవీ ముంబై)
జనవరి 10 – యుపి వారియర్జ్ vs గుజరాత్ జెయింట్స్ (న‌వీ ముంబై)
జనవరి 10 – ముంబై ఇండియన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ ( నవీ ముంబై)
జనవరి 11 – ఢిల్లీ క్యాపిటల్స్ vs గుజరాత్ జెయింట్స్ (న‌వీ ముంబై)
జనవరి 12 – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs యుపి వారియర్జ్, (నవీ ముంబై)
జనవరి 13 – ముంబై ఇండియన్స్ vs గుజరాత్ జెయింట్స్ ( నవీ ముంబై)
జనవరి 14 – యుపి వారియర్జ్ vs ఢిల్లీ క్యాపిటల్స్ ( నవీ ముంబై)
జనవరి 15 – ముంబై ఇండియన్స్ vs యుపి వారియర్జ్ ( నవీ ముంబై)
జనవరి 16 – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs గుజరాత్ జెయింట్స్ ( నవీ ముంబై)
జనవరి 17 – యుపి వారియర్జ్ vs ముంబై ఇండియన్స్ ( నవీ ముంబై)
జనవరి 17 – ఢిల్లీ క్యాపిటల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ( నవీ ముంబై)
జనవరి 19 – గుజరాత్ జెయింట్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ( వడోదర)
జనవరి 20 – ఢిల్లీ క్యాపిటల్స్ vs ముంబై ఇండియన్స్ ( వడోదర)
జనవరి 22 – గుజరాత్ జెయింట్స్ vs యుపి వారియర్జ్ ( వడోదర)
జనవరి 24 – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ఢిల్లీ క్యాపిటల్స్ ( వడోదర)
జనవరి 26 – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ముంబై ఇండియన్స్ ( వడోదర)
జనవరి 27 – గుజరాత్ జెయింట్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ ( వడోదర)
జనవరి 29 – యుపి వారియర్జ్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ( వడోదర)
జనవరి 30 – గుజరాత్ జెయింట్స్ vs ముంబై ఇండియన్స్ (వడోదర)
ఫిబ్రవరి 1 – ఢిల్లీ క్యాపిటల్స్ vs యుపి వారియర్జ్ (వడోదర)
ఫిబ్రవరి 3 – ఎలిమినేటర్ (వ‌డోదర)
ఫిబ్రవరి 5 – ఫైనల్ ( వడోదర)

మ్యాచ్‌లు ఎక్కడ చూడాలంటే?
ఈ మ్యాచ్‌లను అభిమానులు  స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో వీక్షించవచ్చు. అదేవిధంగా జియో హాట్‌స్టార్ యాప్, వెబ్‌సైట్‌ల‌లో మ్యాచ్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. కాగా నవీ ముంబైలో జరగనున్న ప్రారంభ వేడుకల్లో యోయో హనీ సింగ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వంటి స్టార్లు పాల్గోనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement