breaking news
WPL 2026
-
సోఫీ డివైన్ విధ్వంసం.. ఢిల్లీ ముందు భారీ టార్గెట్
డబ్ల్యూపీఎల్ 2026లో భాగంగా నవీ ముంబై వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ బ్యాటర్లు జూలు విధిల్చారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. గుజరాత్ బ్యాటర్లలో ఓపెనర్ సోఫీ డివైన్ విధ్వంసం సృష్టించింది. తొలి ఓవర్ నుంచే ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడింది. ఆమెను ఆపడం ఢిల్లీ బౌలర్ల తరం కాలేదు. 6 ఓవర్ వేసిన స్నేహ రాణా బౌలింగ్‌లో అయితే సోఫీ 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో ఏకంగా 32 పరుగులు పిండుకుంది. ఓవరాల్‌గా కేవలం 42 బంతులు మాత్రమే ఎదుర్కొన్న డివైన్..7 ఫోర్లు, 8 సిక్స్‌లతో 95 పరుగులు చేశాడు. ఆమెతో పాటు కెప్టెన్ గార్డనర్ 49 పరుగులతో రాణించింది.నందినీ శర్మ హ్యాట్రిక్..ఇక ఈ మ్యాచ్‌లో ఢిల్లీ పేసర్ నందిని శర్మ హ్యాట్రిక్ వికెట్లతో మెరిశాడు. గుజరాత్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన నందిని బౌలింగ్‌లో రెండో బంతికి కశ్వి గౌతమ్ పెవిలియన్‌కు చేరింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన తనుజా సింగిల్ తీసి స్ట్రైక్ కనిక అహుజకు ఇచ్చింది. అయితే నాలుగో బంతికి కనిక స్టంపౌట్ కాగా.. ఐదో బంతికి గైక్వాడ్, ఆరో బంతికి రేణుకా సింగ్ క్లీన్ బౌల్డయ్యారు. దీంతో తొలి హ్యాట్రిక్ నందిని ఖాతాలో చేరింది. ఓవరాల్‌గా నందిని తన నాలుగు ఓవర్ల కోటాలో 33 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టింది. ఆమెతో పాటు శ్రీచరణి రెండు వికెట్లు సాధించింది.చదవండి: T20 World Cup 2026: టీమిండియాకు భారీ షాక్.. -
డబ్ల్యూపీఎల్‌లో బోణి కొట్టిన ముంబయి.. ఢిల్లీపై ఘన విజయం
ఇవాళ జరిగిన డబ్ల్యూపీఎల్ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ బోణి కొట్టింది. తొలి మ్యాచ్‌లో ఓటమిపాలైన ముంబయి ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోరు సాధించింది.ముంబయి నిర్దేశించిన భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 19 ఓవర్లలో 145 పరుగులకు ఆలౌటైంది. దీంతో ముంబయి ఇండియన్స్ 50 పరుగుల తేడాతో నెగ్గింది. ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌లో చినెల్లీ హెన్రీ(33 బంతుల్లో 56) పరుగులతో మాత్రమే రాణించింది. మిగిలిన బ్యాటర్లు అంతా విఫలం కావడంతో లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది.కాగా.. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, నాట్ సీవర్ బ్రంట్ అద్భుతమైన హాఫ్ సెంచరీలతో చెలరేగారు. 42 బంతులు ఎదుర్కొన్న హర్మన్ 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 74 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా.. స్కీవర్ 46 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో 70 పరుగులు చేసింది. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు వంద పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.ఇక ఢిల్లీ బౌలర్లలో అరంగేట్ర పేసర్ నందిని శర్మ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఆమె 3 ఓవర్లలో 26 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టింది. శ్రీచరణి ఒక వికెట్ తీసినప్పటికి తన 4 ఓవర్ల కోటాలో 45 పరుగులు సమర్పించుకుంది. -
అరంగేట్రంలోనే అదరగొట్టిన అనుష్క శర్మ
మహిళల ప్రీమియర్ లీగ్ నుంచి మరో యువ సంచలనం క్రికెట్ ప్రపంచానికి పరిచయమైంది. డబ్ల్యూపీఎల్-2026 సీజన్లో శనివారం యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ తరపున బరిలోకి దిగిన అనుష్క శర్మ.. తన అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టింది.బెత్ మూనీ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన 22 ఏళ్ల అనుష్క తన సంచలన బ్యాటింగ్‌తో అందరిని ఆశ్చర్యపరిచింది. శిఖా పాండే, డాటిన్ వంటి అంతర్జాతీయ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ ఆమె ఔరా అన్పించింది. అస్సలు తొలి మ్యాచ్ ఆడుతున్నాన్న ఒత్తడి కొంచెం కూడా ఆమెలో కన్పించలేదు. కెప్టెన్ యాష్లీ గార్డరన్తో కలిసి 103 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని అనుష్క నెలకొల్పింది. గుజరాత్ 207 పరుగుల భారీ స్కోర్ సాధించడంలో ఈ భాగస్వామ్యం కీలకంగా మారింది. అనుష్క 30 బంతులు ఎదుర్కొని 7 ఫోర్ల సాయంతో 44 పరుగులు చేసింది. ఈ అద్భుత ఇన్నింగ్స్ ఆడిన అనుష్క గురుంచి నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.ఎవరీ అనుష్క శర్మ..?ఆమె అసలు పేరు అనుష్క బ్రిజ్మోహన్ శర్మ. అనుష్క దేశవాళీ క్రికెట్లో మధ్యప్రదేశ్‌కు ప్రాతినిథ్యం వహించింది. ఆమెకు చిన్నతనం నుంచి క్రికెట్‌పై మక్కువ ఎక్కువ. అనుష్క తన అన్నయ్య ఆయుష్ శర్మను చూసి క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకుంది. ఆయుష్ కూడా ప్రొఫెషనల్ క్రికెటర్ కావడం గమనార్హం.అతడు తన బ్యాటింగ్ ప్రాక్టీస్ కోసం తన సోదరితో బౌలింగ్ చేయించేవాడంట. అనుష్క కుడిచేతి వాటం బ్యాటర్ మాత్రమే కాదు, రైట్ ఆర్మ్ మీడియం పేస్ బౌలింగ్ కూడా చేయగలదు. దేశవాళీ క్రికెట్లో ఆమె ఇప్పటివరకు 620 పరుగులతో పాటు 22 వికెట్లు పడగొట్టింది. అనుష్క మధ్యప్రదేశ్ జట్టుతో పాటు ఇండియా-బి, ఇండియా-సి, సెంట్రల్ జోన్ వంటి జట్లకు కూడా ప్రాతినిథ్యం వహించింది. అనుష్క సీనియర్ ఉమెన్స్ టీ20 ట్రోఫీ-2025లో 207 పరుగులు చేయడంతో పాటు 9 వికెట్లు తీసి సత్తాచాటింది.వేలంలో రికార్డు ధర..ఈ క్రమంలోనే గతేడాది నవంబర్‌లో జరిగిన మెగా వేలంలో అనుష్కపై కాసుల వర్షం కురిసింది. ఆమెను గుజరాత్ జెయింట్స్ రూ. 45 లక్షల భారీ ధరకు కొనుగోలు చేసింది. తద్వారా ఈ ఏడాది సీజన్ వేలంలో అత్యధిక పలికిన అన్క్యాప్డ్ ప్లేయర్‌గా ఆమె నిలిచింది. ఇదే తరహా ప్రదర్శలు చేస్తే అనుష్క త్వరలోనే భారత సీనియర్ జట్టులోకి వచ్చే అవకాశముంది.చదవండి: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. 9 ఫోర్లు, 7 సిక్స్‌లతో -
గుజరాత్ జెయింట్స్ బోణీ.. పోరాడి ఓడిన యూపీ
మహిళల ప్రీమియర్ లీగ్-2026లో గుజరాత్ జెయింట్స్ శుభారంభం చేసింది. శనివారం డివై పాటిల్ స్టేడియం వేదికగా యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 పరుగుల తేడాతో గుజరాత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోరు సాధించింది.గుజరాత్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ యాష్లీ గార్డనర్ విధ్వంసం సృష్టించింది. కేవలం 41 బంతుల్లో 65 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఆమె ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఆమెతో పాటు అరంగేట్ర ప్లేయర్ అనుష్క శర్మ (44), సీనియర్ సోఫీ డివైన్(38) రాణించారు. యూపీ బౌలర్లలో సోఫీ ఎకిల్‌స్టోన్ 2 వికెట్లు తీయగా, శిఖా పాండే, డియాండ్రా డాటిన్ తలో వికెట్ పడగొట్టారు.దుమ్ములేపిన ఫీబీ..అనంతరం భారీ లక్ష్య చేధనలో యూపీ వారియర్స్ ఆఖరి వరకు పోరాడింది. ఓ దశలో గెలిచేలా కన్పించిన యూపీ జట్టు.. వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేసింది. యూపీ యువ బ్యాటర్ ఫీబీ లిచ్‌ఫీల్డ్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడింది.లిచ్‌ఫీల్డ్ 40 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 78 పరుగులు చేసింది. దూకుడుగా ఆడుతున్న లిఛ్‌ఫీల్డ్.. సోఫీ డివైన్ బౌలింగ్‌లో ఔట్ కావడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. కెప్టెన్ మెగ్ లానింగ్(30), ఆశా శోభన(27) పర్వాలేదన్పించారు. భారత స్టార్ ప్లేయర్లు హర్లీన్ డియోల్(0), దీప్తీ శర్మ(1) మాత్రం తీవ్ర నిరాశపరిచారు. గుజరాత్ బౌలర్లలో రేణుకా సింగ్, సోఫీ డివైన్, జార్జియా తలా రెండు వికెట్లు పడగొట్టగా.. గైక్వాడ్, గార్డనర్ తలా వికెట్ సాధించారు.చదవండి: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. 9 ఫోర్లు, 7 సిక్స్‌లతో -
ఈ ఐదుగురిపైనే కళ్లన్నీ.. త్రిషకు మంచి రోజులు వచ్చినట్లేనా?
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)-2026 టోర్నమెంట్‌కు శుక్రవారం తెరలేచింది. సీజన్ ఆరంభ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. ముంబై ఇండియన్స్‌పై గెలుపొంది శుభారంభం అందుకుంది.ఆర్సీబీ తరఫున అరంగేట్రంనవీ ముంబైలో జరిగిన ఈ మ్యాచ్ ద్వారా ఆర్సీబీ తరఫున ఇంగ్లండ్ మహిళా క్రికెటర్లు లారెన్ బెల్, లిన్సీ స్మిత్ అరంగేట్రం చేశారు. ఫాస్ట్ బౌలర్ బెల్ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 14 పరుగులే ఇచ్చి ఒక వికెట్ తీసింది. తద్వారా డబ్ల్యూపీఎల్‌లో తన ఆగమనాన్ని ఘనంగా చాటింది.మరోవైపు.. లెఫ్టార్మ్ పేసర్ లిన్సీ స్మిత్ మాత్రం రెండు ఓవర్లలో ఏకంగా 23 పరుగులు ఇచ్చి నిరాశపరిచింది. అయితే, అంతర్జాతీయ టీ20లలో సత్తా చాటిన ఈ ఇద్దరు ఎవరికి ఎవరూ తక్కువకారు. తొలి మ్యాచ్‌లో విఫలమైనా లిన్సీ తిరిగి పుంజుకోగలదు. ఇందుకు గణాంకాలే కారణం.ఎన్ని వికెట్లు తీశారంటేబెల్ ఇప్పటికి 36 అంతర్జాతీయత టీ20లలో 50 వికెట్లు కూల్చగా.. లిన్సీ 22 మ్యాచ్‌లు ఆడి 6.6 ఎకానమీతో 22 వికెట్లు తీసింది. వుమెన్స్ 100లో బెల్ ఖాతాలో 60 (41 మ్యాచ్‌లలో), లిన్సీ ఖాతాలో 42 (37 మ్యాచ్‌లలో) వికెట్లు ఉన్నాయిఇక బెల్, లిన్సీలతో పాటు మరో ముగ్గురు ప్లేయర్లు కూడా ఈసారి అరంగేట్రం చేసే అవకాశం ఉంది. వారు మరెవరో కాదు లిజెలి లీ, గొంగడి త్రిష, దీయా యాదవ్.లిజెలి లీసౌతాఫ్రికా ఓపెనింగ్ బ్యాటర్ లిజెలి లీ అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటికి 82 మ్యాచ్‌లు ఆడింది. 33 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఖాతాలో 1896 పరుగులు ఉన్నాయి.ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి వైదొలిగినా.. తన విధ్వంసకర బ్యాటింగ్ కారణంగా గత దశాబ్దకాలంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. గతేడాది వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ లిజెలిని రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది. మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో ఇప్పటికి 104 మ్యాచ్‌లు ఆడి ఐదు సెంచరీలు బాది.. 2770 పరుగులు చేసిన లిజెలి డబ్ల్యూపీఎల్‌నూ వాచౌట్ ప్లేయర్.గొంగడి త్రిషతెలంగాణ ఆల్‌రౌండర్, టీమిండియా అండర్-19 స్టార్ గొంగడి త్రిష. అండర్-19 ప్రపంచకప్ టోర్నీలో మొట్టమొదటి సెంచరీ చేసిన మహిళా క్రికెటర్‌గా ఆమె చరిత్రకెక్కింది.టాపార్డర్‌లో బ్యాటింగ్ చేయడంతో పాటు.. పార్ట్‌టైమ్ లెగ్ స్పిన్నర్‌గా రాణించడం ఆమెకు ఉన్న అదనపు బలం. అయితే, గత రెండు సీజన్లలో వేలంలో పేరు నమోదు చేసుకున్నా ఫ్రాంఛైజీలు ఆమెను పట్టించుకోలేదు.ఈసారి యూపీ వారియర్స్ మాత్రం రూ. 10 లక్షల కనీస ధరకు 20 ఏళ్ల త్రిషను కొనుగోలు చేసింది. కీలక మ్యాచ్‌లలో ఫియర్లెస్ క్రికెట్ ఆడగల సత్తా ఉన్న త్రిషకు ఒక్క అవకాశం వచ్చినా తనను తాను నిరూపించుకోగలదు. ఇప్పటి వరకు 33 టీ20 మ్యాచ్‌లు ఆడిన త్రిష 583 పరుగులు సాధించింది.దీయా యాదవ్పదహారేళ్ల దీయా యాదవ్‌ను రూ. 10 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. తద్వారా అత్యంత పిన్న వయసులో డబ్ల్యూపీఎల్ కాంట్రాక్టు పొందిన ప్లేయర్‌గా ఆమె చరిత్ర సృష్టించింది. అండర్ 15 వన్డే కప్‌లో డబుల్ సెంచరీ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించిన దీయా.. దేశీ టీ20 క్రికెట్లోనూ నిలకడైన ఆటతో ఆకట్టుకుంటోంది. ఈమె కూడా ఈసారి అరంగేట్రం చేసే అవకాశం ఉంది.చదవండి: T20 WC: వేటు వేసిన సెలక్టర్లు.. తొలిసారి స్పందించిన శుబ్‌మన్ గిల్ -
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న యూపీ.. అనుష్క అరంగేట్రం
డబ్ల్యూపీఎల్-2026లో భాగంగా నవీ ముంబై వేదికగా జరగుతున్న రెండో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన యూపీ కెప్టెన్ మెగ్ లానింగ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. లానింగ్ యూపీ తరపున ఇదే తొలి మ్యాచ్ కావడం గమనార్హం. ఇంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్‌కు లానింగ్ సారథ్యం వహించింది.కానీ డబ్ల్యూపీఎల్-2026 వేలానికి ముందు ఢిల్లీ ఆమెను విడిచిపెట్టింది. దీంతో వేలంలోకి వచ్చిన లానింగ్‌ను యూపీ వారియర్స్ సొంతం చేసుకుని తమ జట్టు బాధ్యతలు అప్పగించింది. ఇక ఈ మ్యాచ్‌లో స్టార్ ప్లేయర్లు సోఫీ డివైన్, జార్జియా వేర్హామ్ గుజరాత్ జెయింట్స్ తరపున అరంగేట్రం చేశారు. వీరిద్దరూ గత సీజన్ వరకు ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహించారు. వీరితో పాటు అనుష్క శర్మ కూడా గుజరాత్ తరపున డెబ్యూ చేసింది.తుది జట్లుగుజరాత్ జెయింట్స్: బెత్ మూనీ (వికెట్ కీపర్), సోఫీ డివైన్, ఆష్లీ గార్డనర్ (కెప్టెన్), జార్జియా వేర్హామ్, అనుష్క శర్మ, కనికా అహుజా, భారతీ ఫుల్మాలి, కష్వీ గౌతమ్, తనూజా కన్వర్, రాజేశ్వరి గయక్వాడ్, రేణుకా సింగ్ ఠాకూర్యుపీ వారియర్జ్: మెగ్ లానింగ్ (కెప్టెన్), ఫోబ్ లిచ్‌ఫీల్డ్, హర్లీన్ డియోల్, డియాండ్రా డాటిన్, కిరణ్ ప్రభు నవ్‌గిరే, దీప్తి శర్మ, శ్వేతా సెహ్రావత్ (వికెట్ కీపర్), సోఫీ ఎక్లెస్టోన్, ఆశా శోబన, క్రాంతి గౌడ్, శిఖా పాండే -
ఆర్సీబీకి భారీ షాక్!
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మహిళా జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా స్టార్, పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్ మరో రెండు వారాల పాటు ఆటకు దూరం కానుంది. ఈ విషయాన్ని ఆర్సీబీ వుమెన్ హెడ్‌కోచ్ మలోలన్ రంగరాజన్ ధ్రువీకరించాడు.తొలుత భుజం నొప్పి.. ఇపుడు‘‘బెంగళూరులో ఉన్న బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)నుంచి పూజా వస్త్రాకర్ (Pooja Vastrakar) విడుదల కావడానికి మరో రెండు వారాలు పట్టవచ్చు. తొలుత ఆమె భుజం నొప్పితో CoEలో చేరింది.అయితే, దురదృష్టవశాత్తూ తొడకండరాలు పట్టేయంతో మరికొన్నాళ్ల పాటు ఆమెకు విశ్రాంతి అవసరమైంది. కోలుకోవడానికి పదిహేనుల రోజుల దాకా పట్టవచ్చు. ఆమె ఎప్పుడు తిరిగి వస్తుందో వేచి చూడాల్సిందే’’ అని మలోలన్ రంగరాజన్ తెలిపాడు.‘భారీ’ ధరకు కొనుగోలుకాగా 26 ఏళ్ల పూజా వస్త్రాకర్ టీ20 ప్రపంచకప్-2024లో భాగంగా చివరగా కాంపిటేటివ్ క్రికెట్ ఆడింది. అయితే, ఆమెకు ఉన్న అరుదైన నైపుణ్యాల కారణంగా మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)-2025 వేలంలో ఆర్సీబీ ఏకంగా రూ. 85 లక్షలు వచ్చించి పూజాను కొనుగోలు చేసింది. డబ్ల్యూపీఎల్‌తో ఆమె తిరిగి కాంపిటేటివ్ క్రికెట్లో రీఎంట్రీ ఇవ్వాల్సింది.అయితే, తొడ కండరాల గాయం కారణంగా పూజా వస్త్రాకర్ ఆటకు దూరం కాగా.. ఆర్సీబీ రెండు వారాల పాటు ఆమె సేవలు కోల్పోనుంది. ఇదిలా ఉంటే.. డబ్ల్యూపీఎల్-2026 ఆరంభ మ్యాచ్‌లో ఆర్సీబీ.. ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసింది.నదినె డి క్లెర్క్ అద్భుత ప్రదర్శనచివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో డిఫెండింగ్ చాంపియన్‌ను మూడు వికెట్ల తేడాతో ఓడించిన ఆర్సీబీ.. ఈ సీజన్లో శుభారంభం అందుకుంది. సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ నదినె డి క్లెర్క్ అద్భుత ప్రదర్శనతో జట్టును గెలిపించింది. చివరి బంతికి ఫోర్ బాది ఆర్సీబీని విజయతీరాలకు చేర్చింది.నవీ ముంబై వేదికగా శుక్రవారం టాస్ గెలిచిన ఆర్సీబీ.. ముంబైని తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో హర్మన్ సేన.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. సజీవన్ సజన 25 బంతుల్లో 45 పరుగులు చేసి ముంబై టాప్ రన్ స్కోరర్‌గా నిలిచింది.63 పరుగులతో అజేయంగాఇక లక్ష్య ఛేదనలో ఆర్సీబీ ఆదిలో తడబడింది. అయితే, ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన డి క్లెర్క్ 44 బంతుల్లో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 63 పరుగులతో అజేయంగా నిలిచింది. ఆమెకు తోడుగా ప్రేమా రావత్ నాలుగు బంతుల్లో రెండు ఫోర్లు బాది జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించింది. కాగా అంతకు ముందు డి క్లెర్క్ నాలుగు వికెట్లతో సత్తా చాటింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచింది.చదవండి: మేము నటిస్తున్నామని మాకూ తెలుసు: బీసీబీపై బంగ్లా కెప్టెన్ విమర్శలు -
ఇక్కడ కూడా వదలరా?.. స్మృతి రియాక్షన్ వైరల్
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)-2026ను విజయంతో ఆరంభించింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ). డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌తో శుక్రవారం నాటి మ్యాచ్‌లో మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠ రేపిన WPL ఓపెనర్‌లో ఆర్సీబీ జయకేతనం ఎగురవేసింది.సౌతాఫ్రికాకు చెందిన నదినె డి క్లెర్క్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆర్సీబీకి సంచలన విజయం అందించింది. దీంతో ఆర్సీబీ ఖాతాలో తొలి గెలుపు నమోదైంది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా స్మృతి మంధాన (13 బంతుల్లో 18) విఫలమైనా.. కెప్టెన్‌గా మాత్రం హిట్టయ్యింది.ఇక ఆటకు తోడు అందంతో మెరిసే స్మృతి మంధానకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విరాట్ కోహ్లి మాదిరే స్మృతి పట్ల కూడా ఆర్సీబీ ఫ్యాన్స్ వీరాభిమానం చూపిస్తారు. అందుకే కెమెరామెన్ సైతం మైదానంలోపలా, వెలుపలా ఆమెపైనే ఎక్కువగా దృష్టి పెడతాడు.ఇక్కడ కూడా వదలరా?ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు ముందు మైదానంలో బ్యాట్‌తో స్మృతి ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఓ కెమెరామెన్ ఆమెకు దగ్గరగా వచ్చి ఫొటోలు తీసే ప్రయత్నం చేశాడు. దీంతో కాస్త చిరాకుపడిన స్మృతి.. ‘‘ఇక్కడ కూడా వదలరా? ఏంటి భయ్యా ఇది?’’ అన్నట్లుగా రియాక్షన్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆర్సీబీ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారింది.మాకు అలవాటేఇక తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధించడం పట్ల స్మృతి హర్షం వ్యక్తం చేసింది. ఉత్కంఠ పోరులో గెలవడం తమకు అలవాటేనని.. నదినె వల్లే ఈ గెలుపు సాధ్యమైందని ప్రశంసించింది. జట్టులోని ప్రతి ఒక్కరు సానుకూల దృక్పథంతో ముందుకు సాగారని కొనియాడింది.కాగా స్మృతి వ్యక్తిగత జీవితంలో ఇటీవల ఓ చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. ఆరేళ్లుగా ప్రేమలో ఉన్న పలాష్ ముచ్చల్‌తో పెళ్లి పీటలు ఎక్కే కొన్ని గంటలకు ముందు.. హఠాత్తుగా వివాహం ఆగిపోయింది. పలాష్ ఆమెను మోసం చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.డబ్ల్యూపీఎల్-2026: ముంబై వర్సెస్ ఆర్సీబీ స్కోర్లు👉ముంబై: 154/6(20)👉ఆర్సీబీ: 157/7(20)👉ఫలితం: మూడు వికెట్ల తేడాతో ఆర్సీబీ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: నదినె డి క్లెర్క్ (4/26, 44 బంతుల్లో 63 నాటౌట్).చదవండి: మేము నటిస్తున్నామని మాకూ తెలుసు: బీసీబీపై బంగ్లా కెప్టెన్ విమర్శలుCameraman not leaving Smrithi alone to practice and see Smrithi’s reaction 😂 pic.twitter.com/QVF8q4WTzw— RCB (@RCBtweetzz) January 9, 2026 -
WPL 2026: డిక్లెర్క్ ధమాకా
ముంబై: నదైన్ డిక్లెర్క్... ఇటీవల వన్డే వరల్డ్ కప్‌లో చెలరేగిన ఈ దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ ఉమెన్ ప్రీమియర్ లీగ్‌లో తన తొలి మ్యాచ్‌లోనే సత్తా చాటింది. బౌలింగ్‌లో నాలుగు వికెట్లతో ప్రత్యరి్థని కట్టడి చేసిన ఈ బెంగళూరు ప్లేయర్ ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ చెలరేగింది. తమ జట్టుకు ఓటమి ఖాయమైన దశలో దూకుడైన బ్యాటింగ్‌తో గెలిపించింది. చివరి ఓవర్లో 18 పరుగులు అవసరం కాగా... డిక్లెర్క్ వరుసగా 6, 4, 6, 4 బాది ముగించింది. శుక్రవారం జరిగిన నాలుగో సీజన్ మొదటి మ్యాచ్‌లో బెంగళూరు 3 వికెట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ ముంబైని ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. సజన (25 బంతుల్లో 45; 7 ఫోర్లు, 1 సిక్స్), నికోలా కేరీ (29 బంతుల్లో 40; 4 ఫోర్లు) రాణించారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 49 బంతుల్లోనే 82 పరుగులు జోడించారు. డిక్లెర్క్ (4/26)కు నాలుగు వికెట్లు దక్కాయి. అనంతరం ఆర్సీబీ 20 ఓవర్లలో 7 వికెట్లకు 157 పరుగులు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డిక్లెర్క్ (44 బంతుల్లో 63 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీతో చెలరేగింది. నేడు జరిగే రెండు మ్యాచ్‌ల్లో గుజరాత్ జెయింట్స్‌తో యూపీ వారియర్స్ (మధ్యాహ్నం గం. 3:30 నుంచి)... ముంబై ఇండియన్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ (రాత్రి గం. 7:30 నుంచి) తలపడతాయి. స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. సజన దూకుడు... డబ్ల్యూపీఎల్ నాలుగో సీజన్ మ్యాచ్ ‘మెయిడిన్ ఓవర్’తో మొదలు కావడం విశేషం. లారెన్ బెల్ వేసిన ఈ ఓవర్లో అమేలియా కెర్ (4) ఒక్క పరుగు కూడా తీయలేకపోయింది. అయితే లిన్సే స్మిత్ వేసిన తర్వాతి ఓవర్లో రెండు ఫోర్లతో కమలిని ధాటిని ప్రదర్శించింది. స్మిత్ తర్వాతి ఓవర్లో కూడా కమలిని 2 ఫోర్లు కొట్టగా, నాట్ సివర్ (4) మరో ఫోర్ కొట్టడంతో మొత్తం 13 పరుగులు వచ్చాయి. ఆరు ఓవర్లు ముగిసేసరికి ముంబై 34 పరుగులు చేసింది. పవర్‌ప్లే తర్వాత కమలిని, హర్మన్‌ప్రీత్ కౌర్ (17 బంతుల్లో 20; 1 ఫోర్, 1 సిక్స్) కలిసి మూడో వికెట్‌కు 28 పరుగులు జోడించారు. వీరిద్దరిని నాలుగు పరుగుల వ్యవధిలో అవుట్ చేసి బెంగళూరు పైచేయి సాధించింది. ఈ దశలో కేరీ, సజన కలిసి జట్టును ఆదుకున్నారు. 2, 4 పరుగుల వ్యక్తిగత స్కోర్ల వద్ద సజన ఇచి్చన సులువైన క్యాచ్‌లను హేమలత, సయాలీ వదిలేయడం కూడా ముంబైకి కలిసొచి్చంది. రాధ యాదవ్ వేసిన ఓవర్లో కేరీ ఫోర్ కొట్టగా, ఆ తర్వాత సజన 6, 4 బాదడంతో 15 పరుగులు లభించాయి. ఆ తర్వాత సజన మరింత చెలరేగిపోయింది. అరుంధతి, డిక్లెర్క్ వేసిన వరుస ఓవర్లలో కలిపి 9 బంతుల వ్యవధిలో ఆమె 5 ఫోర్లు బాదడం విశేషం. ఎట్టకేలకు చివరి ఓవర్లో వీరిద్దరిని ఆర్సీబీ నిలువరించగలిగింది. తొలి బంతికి సజన, ఐదో బంతికి కేరీని డిక్లెర్క్ అవుట్ చేయగా... ఈ ఓవర్లో 5 పరుగులే వచ్చాయి. కీలక భాగస్వామ్యం... ఛేదనలో బెంగళూరుకు గ్రేస్ హారిస్ (12 బంతుల్లో 25; 4 ఫోర్లు, 1 సిక్స్), స్మృతి మంధాన (13 బంతుల్లో 18; 4 ఫోర్లు) చక్కటి బౌండరీలతో మెరుగైన ఆరంభాన్నే అందించారు. కేరీ వేసిన మూడో ఓవర్లో వీరిద్దరు మరింత ధాటిగా ఆడారు. స్మృతి 2 ఫోర్లు కొట్టగా, హారిస్ సిక్స్, ఫోర్ బాదింది. ఫలితంగా ఈ ఓవర్లో 20 పరుగులు లభించాయి. అయితే తొలి వికెట్‌కు 23 బంతుల్లో 40 పరుగులు జోడించిన అనంతరం ఏడు పరుగుల వ్యవధిలో ఓపెనర్లు ఇద్దరూ పెవిలియన్ చేరారు. ఆ తర్వాత కూడా బెంగళూరు బౌలర్లు పట్టు చేజారనీయలేదు. కేవలం మూడు పరుగుల వ్యవధిలో హేమలత (7)ను అమన్‌జోత్ అవుట్ చేయగా...అమేలియా తన మొదటి ఓవర్లోనే రాధ యాదవ్ (1), రిచా ఘోష్ (6)లను వెనక్కి పంపించింది. ఆ తర్వాత డిక్లెర్క్, అరుంధతి రెడ్డి (25 బంతుల్లో 20; 2 ఫోర్లు) ఆరో వికెట్‌కు 52 పరుగులు జోడించారు. ఒకే ఓవర్లో అరుంధతి, శ్రేయాంక (1) అవుటైనా... డిక్లెర్క్ ఒంటి చేత్తో గెలిపించింది. 4, 36, 40 పరుగుల వద్ద అవుటయ్యే ప్రమాదంనుంచి తప్పించుకున్న ఆమె దీనిని పూర్తిగా వాడుకుంది.స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: అమేలియా (సి) అరుంధతి (బి) బెల్ 4; కమలిని (బి) శ్రేయాంక 32; నాట్ సివర్ (స్టంప్డ్) రిచా (బి) డిక్లెర్క్ 4; హర్మన్‌ప్రీత్ (సి) రిచా (బి) డిక్లెర్క్ 20; నికోలా కేరీ (సి) హేమలత (బి) డిక్లెర్క్ 40; సజన (సి) స్మతి (బి) డిక్లెర్క్ 45; అమన్‌జోత్ (నాటౌట్) 0; పూనమ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 154. వికెట్ల పతనం: 1–21, 2–35, 3–63, 4–67, 5–149, 6–154. బౌలింగ్: బెల్ 4–1–14–1, లిన్సే 2–0–23–0, అరుంధతి 4–0–37–0, డిక్లెర్క్ 4–0–26–4, శ్రేయాంక 4–0–32–1, రాధ 2–0–21–0. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: హారిస్ (సి) షబ్నిమ్ (బి) నాట్ సివర్ 25; స్మృతి (సి) పూనమ్ (బి) షబి్నమ్ 18; హేమలత (ఎల్బీ) (బి) అమన్‌జోత్ 7; రిచా (సి) కేరీ (బి) అమేలియా 6; రాధ (బి) అమేలియా 1; డిక్లెర్క్ (నాటౌట్) 63; అరుంధతి (సి) అమేలియా (బి) కేరీ 20; శ్రేయాంక (బి) కేరీ 1; ప్రేమ (నాటౌట్) 8; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 157. వికెట్ల పతనం: 1–40, 2–47, 3–62, 4–63, 5–65, 6–117, 7–121. బౌలింగ్: నాట్ సివర్ 4–0–47–1, షబి్నమ్ 4–0–26–1, కేరీ 4–0–35–2, అమన్‌జోత్ 3–0–18–1, అమేలియా కెర్4–0–13–2, సైకా 1–0–13–0. -
తొలి మ్యాచ్‌లో ఛాంపియన్‌కు షాక్.. ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్-2026 తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సూపర్ విక్టరీ కొట్టింది. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్‌కు తొలి మ్యాచ్‌లో గట్టి ఝలక్ ఇచ్చింది. ముంబయి నిర్దేశించిన 155 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ ఛేదనలో నదినే డి క్లార్క్ అద్భుతమైన బ్యాటింగ్‌తో అదరగొట్టింది. కేవలం 44 బంతుల్లో 63 పరుగులతో అజేయంగా నిలిచింది. కాగా.. ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ మంధాన బౌలింగ్ ఎంచుకుంది. ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో నాడిన్ డి క్లెర్క్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. లారెన్ బెల్, శ్రేయంకా పాటిల్ తలా వికెట్ సాధించారు. ఈ మ్యాచ్‌లో ముంబయి క్రికెటర్ సజీవన్ సజన విధ్వంసం సృష్టించింది. 25 బంతులు ఎదుర్కొన్న సజన.. 7 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 45 పరుగులు చేసింది. ఆమెతో పాటు నికోలా కారీ(40) కీలక ఇన్నింగ్స్‌తో రాణించింది. -
చెలరేగిన సజన.. ఆర్సీబీ టార్గెట్ ఎంతంటే?
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్-2026లో భాగంగా తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ మంధాన ముంబైని బ్యాటింగ్‌కు అహ్హనించింది. అయితే తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌కు శుభారంభం లభించలేదు.ముంబై జట్టు 11 ఓవర్లలో 67 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన సజీవన్ సజన విధ్వంసం సృష్టించింది. ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడింది. మొత్తంగా 25 బంతులు ఎదుర్కొన్న సజన.. 7 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 45 పరుగులు చేసింది.ఆమెతో పాటు నికోలా కారీ(40) కీలక ఇన్నింగ్స్ ఆడింది. ఫలితంగా ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో నాడిన్ డి క్లెర్క్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. లారెన్ బెల్, శ్రేయంకా పాటిల్ తలా వికెట్ సాధించారు.అయితే ముంబై ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన సజన రెండు సార్లు ఔటయ్యే ప్రమాదం నుంచే తప్పించుకుంది. రెండు సునాయస క్యాచ్‌లను ఆర్సీబీ ఫీల్డర్లు జారవిడిచారు. అందుకు ఆర్సీబీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.చదవండి: T20 WC 2026: భారత్‌లో ఆడబోము..! బంగ్లా డిమాండ్‌పై స్పందించిన బీసీసీఐ -
WPL 2026: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ
మహిళల ప్రీమియర్ లీగ్-2026 సీజన్‌కు తెరలేచింది. తొలి మ్యాచ్‌లో నవీ ముంబై వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన తొలుత బౌలింగ్ ఎంచుకుంది.అయితే తొలి మ్యాచ్‌కు ముంబై స్టార్ ప్లేయర్ హీలీ మాథ్యూస్ దూరమైంది. అదేవిధంగా ఆసీస్ ప్లేయర్ నికోలా కారీ ముంబై తరపున డబ్ల్యూపీఎల్ అరంగేట్రం చేసింది. ఆర్సీబీ తరపున అయితే ఏకంగా ఆరుగురు అరంగేట్రం చేశాఉరు. గ్రేస్ హారిస్,లిన్సే స్మిత్, లారెన్ బెల్, అరుంధతి రెడ్డి వంటి స్టార్ ప్లేయర్లకు ఆర్సీబీ తరపున ఇదే తొలి డబ్ల్యూపీఎల్ మ్యాచ్ కావడం గమనార్హం.తుది జట్లుముంబై ఇండియన్స్: నాట్ స్కివర్-బ్రంట్, జి కమలిని(వికెట్ కీపర్), అమేలియా కెర్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), అమంజోత్ కౌర్, నికోలా కారీ, పూనమ్ ఖేమ్నార్, షబ్నిమ్ ఇస్మాయిల్, సంస్కృతి గుప్తా, సజీవన్ సజన, సైకా ఇషాక్రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: స్మృతి మంధాన(కెప్టెన్), గ్రేస్ హారిస్, దయాళన్ హేమలత, రిచా ఘోష్(వికెట్ కీపర్), రాధా యాదవ్, నాడిన్ డి క్లర్క్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, ప్రేమ రావత్, లిన్సే స్మిత్, లారెన్ బెల్ఓపెనింగ్ సెర్మనీ అదుర్స్..ఇక డబ్ల్యూపీఎల్ నాలుగో సీజన్ ఆరంభ వేడుకను బీసీసీఐ ఘనంగా నిర్వహించింది. తొలుత మాజీ మిస్ యూనివర్స్ హర్నాజ్ సంధు మహిళా సాధికారతపై ప్రత్యేక సందేశాన్ని ఇచ్చారు. అదేవిధంగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తన డ్యాన్స్‌తో, యో యో హనీ సింగ్ తన పాటలతో ప్రేక్షకులను అలరించారు.చదవండి: IND vs NZ: న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. భారత తుది జట్టు ఇదే! ఆంధ్ర ప్లేయర్‌కు ఛాన్స్? -
జెమీమాపై ప్రతీకారం తీర్చుకున్న ఆసీస్ ప్లేయర్
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) నాలుగో ఎడిషన్ ప్రారంభానికి ముందు ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. నిన్న జరిగిన లీగ్ ప్రీ షోలో యూపీ వారియర్స్ కెప్టెన్ మెగ్ లాన్నింగ్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్‌ను సరదాగా స్లెడ్జింగ్ చేసింది. ఈ సన్నివేశం అక్కడున్న వారందరినీ నవ్వుల్లో ముంచెత్తింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇవాల్టి నుంచి (జనవరి 9) డబ్ల్యూపీఎల్ 2026 ప్రారంభం కానుంది. లీగ్ ప్రారంభానికి ముందు నిర్వహకులు ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో ఐదు ఫ్రాంచైజీల కెప్టెన్లు పాల్గొన్నారు. సరదాగా సాగిన ఈ ఈవెంట్లో ట్రూత్ ఆర్ డేర్ అనే ఓ పోటీ జరిగింది.ఇందులో హోస్ట్ ఇచ్చిన డేర్ ప్రకారం డీసీ కెప్టెన్ లాన్నింగ్, తన మాజీ డీసీ సహచరురాలు, ప్రస్తుత డీసీ కెప్టెన్ జెమీమాను స్లెడ్జ్ చేయాల్సి వచ్చింది. ఇందులో భాగంగా లాన్నింగ్ జెమీను ఇలా అంది.“ఫీల్డర్లు కెప్టెన్ మాట వినకుండా, మైదానంలో డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు నీకు తెలుస్తుంది” అంటూ సరదాగా వ్యాఖ్యానించింది. లాన్నింగ్ ఈ వ్యాఖ్యలు చేసిన అనంతరం అక్కడున్న వారంతా ఒక్కసారిగా పగలబడి నవ్యారు.ముంబై ఇండియన్స్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ , ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధన లాన్నింగ్ వ్యాఖ్యలకు నవ్వు ఆపుకోలేక టేబుల్‌పై చేతులు కొడుతూ ఆనందం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరవలవుతుంది. ఈ వీడియోను చూసి అభిమానులు.. లాన్నింగ్ జెమీ డ్యాన్స్‌లతో విసిగిపోయినట్టుందంటూ సరదా కామెంట్లు చేస్తున్నారు. కాగా, ఈ సీజన్‌కు ముందు జెమీ లాన్నింగ్ కెప్టెన్సీలో మూడు సీజన్ల పాటు డీసీకి ఆడింది. ఆ సమయంలో జెమీ లాన్నింగ్ మాటలు వినకుండా డ్యాన్స్‌ల్లో మునిగిపోయేది. ఇదే విషయాన్ని లాన్నింగ్ ట్రూత్ ఆర్ డేర్ ప్రొగ్రాం సందర్భంగా ప్రస్తావించింది.అందుకు ప్రతీకారంలాన్నింగ్ మూడు సీజన్ల పాటు డీసీని ఫైనల్స్‌కు చేర్చినా ఇటీవల ఆ ఫ్రాంచైజీ యాజమాన్యం ఆమెను వేలానికి వదిలేసింది. వేలంలో లాన్నింగ్‌ను దక్కించుకున్న యూపీ వారియర్జ్ ఆమెను తమ ఫ్రాంచైజీకి కెప్టెన్‌గా చేసింది. లాన్నింగ్‌ను తప్పించిన డీసీ యాజమాన్యం జెమీమాను కెప్టెన్ చేసింది. ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నెటిజన్లు లాన్నింగ్‌ను సరదాగా ఆట పట్టిస్తున్నారు. తన కెప్టెన్సీని (డీసీ) లాక్కుందని లాన్నింగ్ జెమీపై ప్రతీకారం తీర్చుకుందంటూ సరదా కామెంట్లు చేస్తున్నారు.ఇదిలా ఉంటే, ఇవాళ జరుగబోయే డబ్ల్యూపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్, 2024 ఎడిషన్ విన్నర్స్ ఆర్సీబీ తలపడనున్నాయి. నవీ ముంబైలోని డీవై పాటిల్ మైదానం వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. -
ధనాధన్‌కు వేళాయె...
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ను ఇప్పటి వరకు మూడుసార్లు నిర్వహించారు. ముంబై రెండుసార్లు, బెంగళూరు ఒకసారి విజేతగా నిలిచాయి. అయితే గతానికి, 2026 సీజన్‌కు ప్రధాన తేడా ప్లేయర్ల ‘గుర్తింపు’. టీమిండియా వన్డే వరల్డ్ కప్ విజేతగా నిలిచిన తర్వాత జరుగుతున్న తొలి డబ్ల్యూపీఎల్ ఇదే కావడంతో అన్ని వైపుల నుంచి సహజంగానే అదనపు ఆసక్తి పెరిగింది. టోర్నీ మొదలైనప్పుడు మహిళా క్రికెటర్ల గురించి ఒక పరిచయ కార్యక్రమంలాగా ప్రచారం సాగింది. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు! నాడు ఉచితంగా అభిమానులను అనుమతించగా, తక్కువే అయినా ఇప్పుడు డబ్ల్యూపీఎల్ మ్యాచ్‌లకు టికెట్ ఉండటం లీగ్ స్థాయి పెరిగిందనేందుకు సంకేతం. ఐపీఎల్ తరహాలోనే వేలం, ప్రతిభాన్వేషణ, ప్రత్యేకంగా టీమ్ స్పాన్సర్లతో లీగ్ ఇప్పుడు స్వతంత్రంగా నిలబడింది. ఈ నేపథ్యంలో లీగ్ నాలుగో సీజన్ వచ్చేసింది. ఐదు జట్ల మధ్య జరిగే సమరంలో తుది విజేత ఎవరో 22 మ్యాచ్‌ల తర్వాత తేలనుంది. ముంబై: హర్మన్‌ప్రీత్ బృందం ముచ్చటగా మూడోసారి టైటిల్ సాధిస్తుందా? భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన తన టీమ్‌ను రెండోసారి విజేతగా నిలుపుతుందా? లేక కెపె్టన్‌గా కొత్త పాత్రలో మరో టాప్ ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్ తన జట్టుకు తొలిసారి టైటిల్ అందిస్తుందా? ఈ నేపథ్యంలో మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో మరోసారి ప్రపంచ మహిళా క్రికెటర్ల ప్రదర్శన చూసేందుకు సమయం ఆసన్నమైంది. నేడు ప్రారంభం కానున్న నాలుగో సీజన్ ఫిబ్రవరి 5న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. టోర్నమెంట్‌ను ఈసారి రెండు మైదానాలకే పరిమితం చేశారు. ఫ్రాంచైజీలు ఐపీఎల్ తరహాలో సొంత, ప్రత్యర్థి వేదికలపై మ్యాచ్‌లు ఆడాలని ఆశించినా... ప్రధాన వేదికలన్నీ టి20 వరల్డ్ కప్, రంజీ ట్రోఫీల కోసం కేటాయించడంతో బీసీసీఐ దానికి అనుమతించలేదు. రెండు తొలి 11 మ్యాచ్‌లకు నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదిక కాగా, తర్వాతి 11 మ్యాచ్‌లు వడోదరలోని కొటాంబి స్టేడియంలో జరుగుతాయి. శుక్రవారం జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడుతుంది. తొలి మూడు సీజన్ల పాటు డబ్ల్యూపీఎల్ ఫిబ్రవరి–మార్చిలలో జరిగినా ... కొత్త ఎఫ్టీపీలో డబ్ల్యూపీఎల్, ఉమెన్ బిగ్‌బా‹Ù, హండ్రెడ్ టోరీ్నలకు ప్రత్యేకంగా తేదీలను కేటాయించారు. ఇకపై జనవరి–ఫిబ్రవరిలోనే ఈ లీగ్ జరుగుతుంది. డబ్ల్యూపీఎల్‌లో తొలిసారి ‘డబుల్ హెడర్’లు ఉండబోతున్నాయి. జనవరి 10, 17 తేదీల్లో ఒకే రోజు రెండు మ్యాచ్‌లు ఉన్నాయి. కొత్త కోచ్‌లతో... లీగ్‌లో ఎప్పటిలాగే ఐదు జట్లు బరిలోకి దిగుతుండగా... హర్మన్, స్మృతి, జెమీమాతో పాటు మెగ్ లానింగ్, యాష్లీ గార్డ్నర్ మరో రెండు జట్లకు సారథులుగా వ్యవహరిస్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్‌కు జెమీమా రూపంలో కొత్త కెప్టెన్ వచ్చింది. గత సీజన్ వరకు ఢిల్లీకి సారథిగా ఉన్న మెగ్ లానింగ్ ఈ ఏడాది యూపీ వారియర్స్ కెపె్టన్‌గా బరిలోకి దిగుతోంది. లానింగ్ నాయకత్వంలోనే ఢిల్లీ క్యాపిటల్స్ మూడు సీజన్లలో కూడా ఫైనల్‌కు చేరింది. దురదృష్టవశాత్తూ మూడుసార్లు ఆ జట్టు రన్నరప్‌గానే నిలిచింది. ఈ సీజన్ కోసం మూడు జట్లు కొత్త కోచ్‌లను ఎంచుకున్నాయి. ముంబై కోచ్‌గా చార్లెట్ ఎడ్వర్డ్స్ స్థానంలో లిసా కీట్లీ, ఆర్సీబీ కోచ్‌గా ల్యూక్ విలియమ్స్ స్థానంలో మలోలన్ రంగరాజన్, యూపీ కోచ్‌గా జాన్ లూయిస్ స్థానంలో అభిషేక్ నాయర్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. వ్యక్తిగత కారణాలతో ఎలీస్ పెరీ, అనాబెల్ టోర్నీ నుంచి తప్పుకోగా... గుర్తింపు ఉన్న ప్లేయర్లలో అలీసా హీలీ, చమరి అటపట్టు, హీతర్ నైట్లను వేలంలో ఎవరూ ఎంచుకోలేదు. ఎవరి సత్తా ఎంత? లీగ్‌లో ఐదు జట్ల బలాబలాలను చూస్తే ముంబై ఇండియన్స్ ఎప్పటిలాగే పటిష్టంగా కనిపిస్తోంది. మూడో సారి టైటిల్ గెలవకుండా జట్టును నిలువరించడం అంత సులువు కాదు. హర్మన్‌ప్రీత్, హేలీ మాథ్యూస్, నాట్ సివర్, బ్రంట్, అమన్‌జోత్ కౌర్, అమేలియా కెర్‌లతో బలంగా ఉంది. తాజా సంచలనం కమలినిని కూడా టీమ్ ఎంచుకుంది. స్మృతి నాయకత్వంలో బెంగళూరు రెండో ట్రోఫీపై గురి పెట్టింది. అయితే టీమ్‌లో బెస్ట్ ప్లేయర్ ఎలీస్ పెరీ ఈ సీజన్‌కు దూరం కావడం జట్టుకు పెద్ద దెబ్బ. ఆమె లేని లోటును ఆర్సీబీ పూరించాల్సి ఉంది. స్మృతి ఎప్పటిలాగే ముందుండి నడిపించనుండగా... రిచా ఘోష్, పూజ వస్త్రకర్, రాధ యాదవ్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్ మ్యాచ్‌ను మలుపు తిప్పగల సమర్థులు. ఇటీవల వరల్డ్ కప్‌లో చెలరేగిన దక్షిణాఫ్రికా బ్యాటర్ డి క్లెర్క్ ఇదే టీమ్‌లో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధానంగా టాపార్డర్‌పై ఆధారపడుతోంది. వరల్డ్ కప్‌లో దక్షిణాఫ్రికా కెపె్టన్ లారా వోల్వార్ట్, షఫాలీ వర్మ, జెమీమా, మరిజాన్ కాప్ టాప్–4లో కీలకం. బౌలింగ్‌లో నల్లపురెడ్డి శ్రీచరణి, స్నేహ్ రాణావంటి స్పిన్నర్లు ఉన్నా జట్టు పేస్ బౌలింగ్ బలహీనంగా కనిపిస్తోంది. గత రెండు సీజన్లలో కలిపి 16 మ్యాచ్‌లలో 6 మ్యాచ్‌లో గెలిచి 2025లో చివరి స్థానంలో నిలిచిన యూపీ వారియర్స్ ఈసారి తమ అదృష్టం మారుతుందని భావిస్తోంది. వరల్డ్ కప్ స్టార్ దీప్తి శర్మపై మరోసారి పెద్ద భారం ఉండగా... మెగ్ లానింగ్ కెపె్టన్సీ, నాయర్ కోచింగ్‌ను జట్టు నమ్ముకుంది. ధాటిగా ఆడే కిరణ్ నవ్‌గిరే, వరల్డ్ కప్ సభ్యురాలు హర్లీన్ డియోల్, లిచ్‌ఫోల్డ్ ఇతర కీలక ప్లేయర్లు. పేసర్లు క్రాంతి గౌడ్, శిఖా పాండేలతో స్పిన్నర్ ఎకెల్స్టోన్లపై బౌలింగ్ భారం ఉంది. వేలంలో సోఫీ డివైన్, రేణుకా సింగ్, డానీ వ్యాట్‌లను తీసుకొని గుజరాత్ జెయింట్స్ తమ జట్టును కాస్త పటిష్టంగా మార్చుకుంది. గార్డ్నర్, బెత్ మూనీ, వేర్హామ్ టీమ్ ప్రధాన బలం. యువ ఆటగాళ్ళలో టిటాస్ సాధు, కాశ్వీ గౌతమ్, తనూజ కన్వర్ రాణించడం ముఖ్యం.ఈసారి డబ్ల్యూపీఎల్‌లో తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు క్రికెటర్లు బరిలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి నల్లపురెడ్డి శ్రీచరణి (ఢిల్లీ), తెలంగాణ నుంచి అరుంధతి రెడ్డి (బెంగళూరు), గొంగడి త్రిష (యూపీ), మమత మదివాలా (ఢిల్లీ), నల్లా క్రాంతి రెడ్డి (ముంబై) పోటీపడనున్నారు. -
డబ్ల్యూపీఎల్-2026కు సర్వం సిద్దం.. షెడ్యూల్ ఇదే!
క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్-2026 సీజన్‌కు మరి కొన్ని గంటల్లో తెరలేవనుంది. తొలి మ్యాచ్‌లో శుక్రవారం నవీ ముంబై వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ టోర్నీని నవీ ముంబైతో పాటు వడోదర వేదికగా నిర్వహించనున్నారు.జనవరి 9 నుంచి 17 వరకు తొలి 11 మ్యాచ్‌లు నవీ ముంబైలో జరగనుండగా. ఆ తర్వాత టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు వడోదరలోని బీసీఎ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌తో ఫైనల్ కూడా ఇదే వేదికగా జరగనుంది. ఫిబ్రవరి 3న ఎలిమినేటర్ మ్యాచ్, ఫిబ్రవరి 5న ఫైనల్సాధారణంగా డబ్ల్యూపీఎల్ ఫిబ్రవరిలో జరుగుతుంది. కానీ పురుషుల టీ20 వరల్డ్ కప్-2026 కారణంగా ఈ టోర్నీని గతంలో కంటే ఒక నెల ముందుగానే నిర్వహిస్తున్నారు. ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్,యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్ మొత్తం ఐదు జట్లు టైటిల్ కోసం పోటీపడనున్నాయి. అయితే ఢిల్లీ క్యాపిటల్స్‌కు, యూపీ వారియర్స్‌కు కొత్త కెప్టెన్లు వచ్చారు. ఢిల్లీ జట్టుకు భారత స్టార్ ప్లేయర్ రోడ్రిగ్స్ సారథ్యం వహించనుండగా.. యూపీ వారియర్స్‌ను ఆసీస్ లెజెండ్ మెగ్ లానింగ్ ముందుండి నడిపించనుంది.డబ్ల్యూపీఎల్ 2026 పూర్తి షెడ్యూల్ ఇదే..జనవరి 9 – ముంబై ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (నవీ ముంబై)జనవరి 10 – యుపి వారియర్జ్ vs గుజరాత్ జెయింట్స్ (నవీ ముంబై)జనవరి 10 – ముంబై ఇండియన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ ( నవీ ముంబై)జనవరి 11 – ఢిల్లీ క్యాపిటల్స్ vs గుజరాత్ జెయింట్స్ (నవీ ముంబై)జనవరి 12 – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs యుపి వారియర్జ్, (నవీ ముంబై)జనవరి 13 – ముంబై ఇండియన్స్ vs గుజరాత్ జెయింట్స్ ( నవీ ముంబై)జనవరి 14 – యుపి వారియర్జ్ vs ఢిల్లీ క్యాపిటల్స్ ( నవీ ముంబై)జనవరి 15 – ముంబై ఇండియన్స్ vs యుపి వారియర్జ్ ( నవీ ముంబై)జనవరి 16 – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs గుజరాత్ జెయింట్స్ ( నవీ ముంబై)జనవరి 17 – యుపి వారియర్జ్ vs ముంబై ఇండియన్స్ ( నవీ ముంబై)జనవరి 17 – ఢిల్లీ క్యాపిటల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ( నవీ ముంబై)జనవరి 19 – గుజరాత్ జెయింట్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ( వడోదర)జనవరి 20 – ఢిల్లీ క్యాపిటల్స్ vs ముంబై ఇండియన్స్ ( వడోదర)జనవరి 22 – గుజరాత్ జెయింట్స్ vs యుపి వారియర్జ్ ( వడోదర)జనవరి 24 – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ఢిల్లీ క్యాపిటల్స్ ( వడోదర)జనవరి 26 – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ముంబై ఇండియన్స్ ( వడోదర)జనవరి 27 – గుజరాత్ జెయింట్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ ( వడోదర)జనవరి 29 – యుపి వారియర్జ్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ( వడోదర)జనవరి 30 – గుజరాత్ జెయింట్స్ vs ముంబై ఇండియన్స్ (వడోదర)ఫిబ్రవరి 1 – ఢిల్లీ క్యాపిటల్స్ vs యుపి వారియర్జ్ (వడోదర)ఫిబ్రవరి 3 – ఎలిమినేటర్ (వడోదర)ఫిబ్రవరి 5 – ఫైనల్ ( వడోదర)మ్యాచ్‌లు ఎక్కడ చూడాలంటే?ఈ మ్యాచ్‌లను అభిమానులు స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో వీక్షించవచ్చు. అదేవిధంగా జియో హాట్‌స్టార్ యాప్, వెబ్సైట్లలో మ్యాచ్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. కాగా నవీ ముంబైలో జరగనున్న ప్రారంభ వేడుకల్లో యోయో హనీ సింగ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వంటి స్టార్లు పాల్గోనున్నారు. -
యూపీ వారియర్జ్‌కు కొత్త కెప్టెన్.. దీప్తి శర్మపై వేటు
మహిళల ఐపీఎల్ 2026 (WPL) ప్రారంభానికి ముందు యూపీ వారియర్జ్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ ఫ్రాంచైజీ నూతన కెప్టెన్‌గా ఆసీస్ దిగ్గజం మెగ్ లాన్నింగ్‌ను నియమించింది. ఈ విషయాన్ని వారియర్జ్ యాజమాన్యం సోషల్‌మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది.33 ఏళ్ల లాన్నింగ్‌ను వారియర్జ్ ఈ సీజన్ వేలంలో రూ. 1.9 కోట్లకు కొనుగోలు చేసింది. లాన్నింగ్ నియామకంతో గత సీజన్ వరకు కెప్టెన్‌గా వ్యవహంచిన దీప్తి శర్మపై వేటు పడింది. రానున్న సీజన్లో దీప్తి సాధారణ ప్లేయర్‌గా కొనసాగుతుంది. దీప్తిని ఈ సీజన్ వేలంలో వారియర్జ్ యాజమాన్యం రూ. 3.2 కోట్లు వెచ్చించి, తిరిగి సొంతం చేసుకుంది.లాన్నింగ్‌కు కెప్టెన్‌గా ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. ఆమె సారథ్యంలో ఆసీస్ ఓ వన్డే ప్రపంచకప్, 4 టీ20 ప్రపంచకప్‌లు గెలిచింది. డబ్ల్యూపీఎల్ కెప్టెన్‌గానూ లాన్నింగ్‌కు మంచి ట్రాక్ రికార్డే ఉంది. ఈమె నేతృత్వంలో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా మూడు ఎడిషన్లలో ఫైనల్‌కు చేరింది. లాన్నింగ్‌ను డీసీ యాజమాన్యం ఇటీవలే విడుదల చేసింది.లాన్నింగ్ సారథ్యంలో వారియర్జ్ పరిస్థితిలో మార్పు వస్తుందేమో చూడాలి. ఈ ఫ్రాంచైజీ డబ్ల్యూపీఎల్ చరిత్రలో అత్యంత పేలవమైన ట్రాక్ రికార్డు ఉన్న జట్టుగా ఉంది. తొలి ఎడిషన్‌లో (2023) ఐదింటి మూడో స్థానంలో నిలిచిన ఈ జట్టు.. సీజన్ సీజన్‌కు మరింత దిగజారుతూ నాలుగు (2024), ఐదు (2025) స్థానాలకు పడిపోయింది. కాగా, డబ్ల్యూపీఎల్ 2026 జనవరి 9 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. సీజన్ ఓపెనర్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, ఆర్సీబీ తలపడనున్నాయి. వారియర్జ్ తమ తొలి మ్యాచ్‌ను జనవరి 10న (గుజరాత్ జెయింట్స్‌తో) ఆడనుంది. -
‘ఆర్సీబీ’కి దెబ్బే.. ఆ ప్లేయర్‌కు ఎవరూ సాటిరారు!
వుమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)-2026లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కి చిక్కులు తప్పవని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ఎలిస్ పెర్రీ లేనిలోటును ఎవరూ భర్తీ చేయలేరని పేర్కొన్నాడు. కాగా డబ్ల్యూపీఎల్ తాజా సీజన్ ఆరంభానికి ముందే ఆర్సీబీ కీలక ప్లేయర్ సేవలు కోల్పోయింది. వ్యక్తిగత కారణాలతో ఈ ఎడిషన్ నుంచి పూర్తిగా తప్పుకొంటున్న ఆస్ట్రేలియా స్టార్ పెర్రీ ప్రకటించింది.అత్యధిక పరుగులుగత మూడు సీజన్లుగా తమతోనే కొనసాగుతున్న పెర్రీని ఆర్సీబీ.. ఈ ఏడాది రూ.2 కోట్లతో జట్టు అట్టి పెట్టుకుంది. గతేడాది (2024) జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన ఆమె (972)...లీగ్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో రెండో స్థానంలో ఉంది. అయితే, తాజా ఎడిషన్‌కు ఆమె దూరం కావడంతో.. భారత యువ క్రీడాకారిణి సయాలీ సత్గరేను ఆర్సీబీ జట్టులోకి తీసుకుంది.ఇక గతంలో గుజరాత్ జెయింట్స్ తరఫున రెండు సీజన్లలో కలిపి 4 మ్యాచ్‌లు ఆడిన సయాలీ.. 20 పరుగులు చేయగలిగింది. తాజాగా పెర్రీ స్థానంలో.. కనీస ధర రూ.30 లక్షలకు సయాలీని ఈసారి ఆర్సీబీ ఎంచుకుంది. సదర్లాండ్ కూడామరోవైపు.. ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్, ఆస్ట్రేలియాకే చెందిన అనాబెల్ సదర్లాండ్ కూడా వ్యక్తిగత కారణాలతోనే లీగ్‌కు దూరమైంది. ఒక ఏడాది గుజరాత్ జట్టు తరఫున ఆడిన సదర్లాండ్ గత రెండు సీజన్లుగా ఢిల్లీతోనే ఉంది.ఈ ఏడాది రూ.2.20 కోట్లకు ఆమెను ఢిల్లీ కొనసాగించింది. సదర్లాండ్ స్థానంలో ఆసీస్ లెగ్‌స్పిన్నర్ అలానా కింగ్‌ను క్యాపిటల్స్ తీసుకుంది. కింగ్ గత ఏడాది యూపీ వారియర్స్ తరఫున ఒకే ఒక డబ్ల్యూపీఎల్ మ్యాచ్ ఆడింది. ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.ఆ ప్లేయర్‌కు ఎవరూ సాటిరారు!‘‘ఈసారి ఎలిస్ పెర్రీ రావడం లేదు. అనాబెల్ సదర్లాండ్ కూడా ఈ సీజన్ ఆడటం లేదు. దీంతో ఆర్సీబీ, ఢిల్లీలకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆర్సీబీ ఈసారి ఫేవరెట్‌గా ఉంది.కానీ ఎలిస్ పెర్రీ లేకపోవడం వారి గెలుపు అవకాశాలపై కచ్చితంగా ప్రభావం చూపుతుంది. పెర్రీ స్థానంలో ఆర్సీబీ సయాలీ సత్గరేను తీసుకువచ్చింది. వీరి స్కిల్ సెట్ ఒకటే కావొచ్చు.. కానీ సయాలీ.. పెర్రీ స్థానాన్ని భర్తీ చేయలేదు. నైపుణ్యాల పరంగా ఎలిస్ పెర్రీకి సయాలీ దరిదాపుల్లోకి కూడా రాలేదు’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.అదే విధంగా.. అనాబెల్ స్థానంలో అలనా సరైన ప్లేయర్ కాదని ఈ మాజీ క్రికెటర్ అభిప్రాయపడ్డాడు. అనాబెల్ మీడియం పేస్ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ చేయగలదన్న ఆకాశ్ చోప్రా.. అలనా మంచి స్పిన్నర్ మాత్రమే అని.. బ్యాటింగ్ పరంగా ఆమె పెద్దగా ఆకట్టుకోలేదని పేర్కొన్నాడు.తారా నోరిస్ దూరంఇదిలా ఉంటే.. యూపీ వారియర్స్ జట్టు సభ్యురాలు తారా నోరిస్ కూడా లీగ్‌కు దూరమైంది. టీ20 వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో తన జట్టు అమెరికా తరఫున బరిలోకి దిగేందుకు నోరిస్ ఈ నిర్ణయం తీసుకుంది. నోరిస్ స్థానంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ చార్లీ నాట్‌ను వారియర్స్ జట్టులోకి ఎంచుకుంది. నాట్ గతంలో ఎప్పుడూ డబ్ల్యూపీఎల్ ఆడలేదు. చదవండి: బీసీసీఐ యూటర్న్!.. షమీకి గోల్డెన్ ఛాన్స్! -
ఆర్సీబీకి భారీ షాకిచ్చిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్
వచ్చే ఏడాది (2026) జనవరి 9 నుంచి ప్రారంభం కాబోయే మహిళల ఐపీఎల్ 2026కు ముందు 2024 ఎడిషన్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్, ఆస్ట్రేలియా ప్లేయర్ ఎల్లిస్ పెర్రీ వ్యక్తిగత కారణాల చేత సీజన్ మొత్తానికి దూరం కానుంది. పెర్రీ స్థానాన్ని ఆర్సీబీ యాజమాన్యం దేశీయ ఆల్‌రౌండర్ సయాలీ సత్ఘరేతో భర్తీ చేసింది.సత్ఘరే గతంలో గుజరాత్ జెయింట్స్ తరఫున ఆడింది. ఈ సీజన్ వేలంలో సత్ఘరేను (30 లక్షలు) ఏ ఫ్రాంచైజీ తీసుకోలేదు. తాజాగా ఎల్లిస్ లీగ్ నుంచి తప్పుకోవడంతో సత్ఘరేను అదృష్టం వరించింది. ఎల్లిస్ వైదొలిగిన తర్వాత ఆర్సీబీలో నడినే డి క్లెర్క్ మాత్రమే నాణ్యమైన విదేశీ ఆల్‌రౌండర్‌గా ఉంది.ఎల్లిస్ ఆర్సీబీ 2024లో టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించింది. ఎల్లిస్‌కు డబ్ల్యూపీఎల్ మొత్తంలోనూ మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఈ లీగ్‌లో 6 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన తొలి బౌలర్ ఎల్లిసే. ఈ లీగ్‌లో ఇప్పటివరకు 25 మ్యాచ్‌లు ఆడిన ఈ వెటరన్ ఆల్‌రౌండర్.. 8 హాఫ్ సెంచరీల సాయంతో 972 పరుగులు చేసి, 8.25 ఎకానమీతో 14 వికెట్లు తీసింది.ఢిల్లీ క్యాపిటల్స్‌కు కూడా..!డబ్ల్యూపీఎల్ 2026 ప్రారంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌కు కూడా భారీ షాక్ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్, ఆసీస్ ప్లేయరే అయిన అన్నాబెల్ సదర్‌ల్యాండ్ కూడా వ్యక్తిగత కారణాల చేత సీజన్ మొత్తానికే దూరం కానుంది. సదర్‌ల్యాండ్ స్థానాన్ని డీసీ యాజమాన్యం అలానా కింగ్‌తో భర్తీ చేసింది. -
ఢిల్లీ క్యాపిటల్స్‌కు కొత్త కెప్టెన్లు..?
ఐపీఎల్, డబ్ల్యూపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ కెప్టెన్లను మార్చనుందని సోషల్‌మీడియా కోడై కూస్తుంది. ఐపీఎల్లో అక్షర్ పటేల్ స్థానంలో కేఎల్ రాహుల్.. డబ్ల్యూపీఎల్‌లో మెగ్ లాన్నింగ్ స్థానంలో జెమీమా రోడ్రిగ్స్ డీసీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నారని సమాచారం. 2026 సీజన్ ప్రారంభం నుంచి ఈ మార్పులు అమల్లోకి రానున్నట్లు తెలుస్తుంది. కెప్టెన్ల మార్పు విషయాన్ని డీసీ యాజమాన్యం అధికారికంగా ప్రకటించనప్పటికీ.. ఐపీఎల్ వర్గాల్లో సైతం జోరుగా ప్రచారం జరుగుతుంది.గత ఐపీఎల్ సీజన్లో డీసీ అక్షర్ పటేల్ నేతృత్వంలో ఆశించిన స్థాయి ప్రదర్శనలు చేయలేకపోయింది. వాస్తవానికి గత సీజన్లోనే కేఎల్ రాహుల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసినప్పటికీ.. అతను సుముఖత వ్యక్తం చేయలేదని ప్రచారం జరిగింది. ఈసారి ఎలాగైనా కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోవాలని మేనేజ్మెంట్ రాహుల్‌పై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. అక్షర్ పటేల్ నేతృత్వంలో డీసీ గత సీజన్లో 14 మ్యాచ్‌ల్లో సగం గెలిచినా ప్లే ఆఫ్స్ అవకాశాలను తృటిలో (ఐదో స్థానం) కోల్పోయింది. రానున్న సీజన్లో ఎలాగైనా ప్లే ఆఫ్స్‌కు చేరాలనే ఉద్దేశంలో భాగంగా కెప్టెన్ మార్పు జరిగినట్లు సమాచారం.డబ్ల్యూపీఎల్ విషయానికొస్తే.. గత సీజన్లో డీసీ అద్బుతమైన ప్రదర్శనలు కనబర్చి ఫైనల్‌కు చేరినా, తుది పోరులో ముంబై ఇండియన్స్ చేతిలో స్వల్ప తేడాతో ఓడి, మరోసారి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. డబ్ల్యూపీఎల్‌లో కెప్టెన్ మార్పు అవసరం లేకపోయినా.. స్వదేశీ ప్లేయర్ కెప్టెన్‌గా ఉండాలనే ఉద్దేశంతో డీసీ మేనేజ్మెంట్ జెమీమా రోడ్రిగ్స్‌కు కెప్టెన్సీ అప్పజెప్పాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో ప్రస్తుత కెప్టెన్ మెగ్ లాన్నింగ్‌ను తప్పిస్తారని సమాచారం. జెమీమా ఎంపికకు ఆమె ప్రపంచకప్ ప్రదర్శనలను కూడా కొలమానంగా తీసుకున్నట్లు తెలుస్తుంది. జెమీమా తాజాగా ముగిసిన వన్డే ప్రపంచకప్‌లో అద్భుతమైన ప్రదర్శనలు చేసి టీమిండియా టైటిల్ గెలవడంలో ప్రధానపాత్ర పోషించింది. ముఖ్యంగా ఆసీస్‌తో జరిగిన సెమీస్‌లో జెమీమా చేసిన సూపర్ సెంచరీ చరిత్రలో నిలిచిపోయేదిగా ఉంది. -
WPL 2026: షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ.. ఈసారి రెండే!
మహిళల ప్రీమియర్ లీగ్-2026 సీజన్ పూర్తి షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శనివారం విడుదల చేసింది. డబ్ల్యూపీఎల్ తాజా సీజన్‌ను జనవరి 9 నుంచి ఫిబ్రవరి 5 మధ్య నిర్వహించనున్నట్లు తెలిపింది. ఇందులో రెండు డబుల్ హెడర్ మ్యాచ్‌లు కూడా ఉండటం విశేషం.ఇక ఈసారి నవీ ముంబై, వడోదర ఈసారి మ్యాచ్‌లన్నింటికి ఆతిథ్యం ఇవ్వనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. తొలి దశ మ్యాచ్‌లకు డీవై పాటిల్ స్టేడియం.. రెండో దశ మ్యాచ్‌లు, ప్లే ఆఫ్స్‌నకు కొటాంబి స్టేడియం వేదికలు అని తెలిపింది. కాగా గతేడాది ముంబై, వడోదర బెంగళూరు, లక్నోలు డబ్ల్యూపీఎల్ వేదికలుగా ఉన్న విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే.. ఈసారి 28 రోజుల పాటు సాగనున్న డబ్ల్యూపీఎల్-2026 (WPL 2026) టోర్నీకి ముంబై ఇండియన్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) మ్యాచ్‌తో తెర లేవనుంది. కాగా ముంబై ఇండియన్స్, ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్ ఈ టోర్నీలో భాగమైన విషయం తెలిసిందే. జట్ల ఖరారుకు సంబంధించి మెగా వేలం కూడా గురువారమే ముగిసింది. డబ్ల్యూపీఎల్-2026 పూర్తి షెడ్యూల్ ఇదే👉జనవరి 9: ముంబై వర్సెస్ ఆర్సీబీ- నవీ ముంబై👉జనవరి 10: యూపీ వర్సెస్ గుజరాత్- నవీ ముంబై👉జనవరి 11: ముంబై వర్సెస్ ఢిల్లీ-నవీ ముంబై👉జనవరి 12: ఆర్సీబీ వర్సెస్ యూపీ- నవీ ముంబై👉జనవరి 13: ముంబై వర్సెస్ గుజరాత్- నవీ ముంబై👉జనవరి 14: యూపీ వర్సెస్ ఢిల్లీ- నవీ ముంబై👉జనవరి 15: ముంబై వర్సెస్ యూపీ- నవీ ముంబై👉జనవరి 16: ఆర్సీబీ వర్సెస్ గుజరాత్- నవీ ముంబై👉జనవరి 17: యూపీ వర్సెస్ ముంబై- నవీ ముంబై👉జనవరి 17: ఢిల్లీ వర్సెస్ ఆర్సీబీ- నవీ ముంబై👉జనవరి 19: గుజరాత్ వర్సెస్ ఆర్సీబీ- వడోదర👉జనవరి 20: ఢిల్లీ వర్సెస్ ముంబై- వడోదర👉జనవరి 22: గుజరాత్ వర్సెస్ యూపీ- వడోదర👉జనవరి 24: ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ- వడోదర👉జనవరి 26: ఆర్సీబీ వర్సెస్ ముంబై- వడోదర👉జనవరి 27: గుజరాత్ వర్సెస్ ఢిల్లీ- వడోదర👉జనవరి 29: యూపీ వర్సెస్ ఆర్సీబీ- వడోదర👉జనవరి 30: గుజరాత్ వర్సెస్ ముంబై- వడోదర👉ఫిబ్రవరి 1: ఢిల్లీ వర్సెస్ యూపీ- వడోదర👉ఫిబ్రవరి 3: ఎలిమినేటర్- వడోదర👉ఫిబ్రవరి 5: ఫైనల్- వడోదర. PC: BCCI -
డబ్ల్యూపీఎల్‌లో మరో రెండు జట్లు!.. బీసీసీఐ ప్లాన్ ఏంటి?
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆధ్వర్యంలో 2023లో మొదలైన మహిళా ప్రీమియర్ లీగ్ విజయవంతంగా మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. అరంగేట్ర సీజన్లో ముంబై ఇండియన్స్ విజేతగా నిలవగా.. గతేడాది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ట్రోఫీని ముద్దాడింది.ఇక ఈ ఏడాది మరోసారి ముంబై చాంపియన్‌గా అవతరించగా.. 2026లోనైనా టైటిల్ గెలవాలని యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పట్టుదలగా ఉన్నాయి. ఇందుకు అనుగుణంగానే వేలానికి ముందు తమకు కావాల్సిన ప్లేయర్లను అట్టిపెట్టుకున్న ఫ్రాంఛైజీలు.. వద్దనుకున్న క్రికెటర్లను వదిలించుకున్నాయి.బీసీసీఐ సుముఖంగా ఉందిఈ నేపథ్యంలో న్యూఢిల్లీ వేదికగా గురువారం జరిగిన మెగా వేలంలో తమ వ్యూహాలకు అనుగుణంగా ఐదు ఫ్రాంఛైజీలు ప్లేయర్లను కొనుగోలు చేశాయి. ఇక వేలం సందర్భంగా ఢిల్లీ ఫ్రాంఛైజీ సహ యజమాని పార్థ్ జిందాల్ (Parth Jindal) చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. భారత మహిళా క్రికెట్ రాత మారనుందని.. డబ్ల్యూపీఎల్‌ను విస్తరించేందుకు బీసీసీఐ సుముఖంగా ఉందని ఆయన పేర్కొన్నారు.ఆదరణకు ఇదే నిదర్శనంఈ మేరకు.. ‘‘1983లో ప్రపంచకప్ గెలిచిన తర్వాత భారత పురుషుల క్రికెట్ పరిస్థితి ఎంతలా మెరుగుపడిందో మనం చూశాం. వన్డే వరల్డ్‌కప్-2025లో చాంపియన్‌గా నిలిచిన తర్వాత భారత మహిళా క్రికెట్ జట్టు రాత కూడా మారనుంది. 446 మిలియన్ల మంది భారతీయులు మనోళ్లు ఆడిన ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించారు.పురుషుల టీ20 ప్రపంచకప్ ఫైనల్ కంటే కూడా ఈ మ్యాచ్‌కే అత్యధిక వీక్షణలు వచ్చాయి. నిజానికి ఇంతకు ముందు మహిళా వేలం గురించి ఎవరూ మాట్లాడేవారే కాదు. అయితే, ‘నవంబరు 27న వేలంలో మీరు ఏం చేయబోతున్నారు?మెగ్ లానింగ్‌ను తీసుకుంటారా? మీరెందుకు ఆమెను వదిలిపెట్టారు? వంటి ప్రశ్నలు ఎదురయ్యాయి. మూడేళ్లుగా లీగ్ జరుగుతున్నా ఎవరూ మరీ ఇంతగా ఆసక్తి చూపించలేదు. వరల్డ్‌కప్ తర్వాత మన మహిళల లీగ్‌కు ఆదరణ పెరిగిందనడానికి ఇదే నిదర్శనం.ఒకటి లేదంటే రెండు జట్లు..డబ్ల్యూపీఎల్ విస్తరించబోతోంది. బీసీసీఐ ఇందుకు సంబంధించి ప్రణాళికలు రచిస్తోందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఈ లీగ్‌లో మరొకటి.. లేదంటే మరో రెండు ఫ్రాంఛైజీలు చేరే అవకాశం ఉంది’’ అని పార్థ్ జిందాల్ చెప్పుకొచ్చారు. ఆయన వ్యాఖ్యల్ని బట్టి వచ్చే డబ్ల్యూపీఎల్ సీజన్లో మరో రెండు కొత్త జట్లను చూసే అవకాశం లేకపోలేదంటూ మహిళా క్రికెట్‌ను ఆదరించే అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.చదవండి: WPL 2026: వేలంలో అత్యధిక ధర పలికిన ప్లేయర్లు వీరే -
WPL 2026: వేలంలో సత్తా చాటిన మన అమ్మాయిలు
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)- 2026 వేలంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పలువురు అమ్మాయిలు అవకాశం దక్కించుకున్నారు. ఇటీవల ఐసీసీ వన్డే వరల్డ్ కప్-2025లో విజయంలో భాగమైన శ్రీచరణి, అరుంధతి రెడ్డి (హైదరాబాద్) మరో సందేహం లేకుండా ఎంపికయ్యారు. అరుంధతి రెడ్డిని రూ. 75 లక్షలకు ఆర్సీబీ జట్టు ఎంచుకుంది.గొంగడి త్రిషకు తొలిసారి చాన్స్అండర్–19 వరల్డ్ కప్ విజయంలో భాగమైన హైదరాబాద్ అమ్మాయి గొంగడి త్రిషకు తొలిసారి డబ్ల్యూపీఎల్‌లో చాన్స్ లభించడం విశేషం. మమత మాదివాల, నల్లా క్రాంతి రెడ్డి కూడా ఎంపికయ్యారు. గొంగడి త్రిషను రూ. 10 లక్షలకు యూపీ వారియర్స్... మమతను రూ. 10 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్... క్రాంతి రెడ్డిని రూ. 10 లక్షలకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకున్నాయి. శ్రీచరణి స్థాయి పెరిగింది... వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన నల్లపు రెడ్డి శ్రీచరణి 2025 డబ్ల్యూపీఎల్‌లో రూ.55 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడింది. ఇటీవలి వన్డే వరల్డ్ కప్ విజయంలో ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ ప్రధాన పాత్ర పోషించడంతో సహజంగానే ఆమె స్థాయి పెరిగింది. వేలానికి ముందు ఆమెను విడుదల చేసిన ఢిల్లీ ఇక్కడ మళ్లీ పోటీ పడింది. కనీస విలువ రూ.30 లక్షలతో మొదలై ఢిల్లీ, యూపీ మధ్య పోరు సాగింది. చివరకు రూ.1.30 కోట్ల వద్ద వేలం ముగిసింది. ఈ మేరకు.. ఢిల్లీ భారీ మొత్తంతో తమ ప్లేయర్‌ను తిరిగి సొంతం చేసుకుంది.చదవండి: WPL 2026: వేలంలో అత్యధిక ధర పలికిన ప్లేయర్లు వీరే -
మహిళల ప్రీమియర్ లీగ్‌లో కొత్త స్పాన్సర్లు
భారత్ ఇటీవల ఐసీసీ ఉమెన్ ప్రపంచ కప్ టోర్నీలో విజయం సాధించిన తర్వాత మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2026 వేలం అంచనాలను మించిపోయింది. ఆటగాళ్లకు కోట్ల రూపాయాలు ఇచ్చేందుకు ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. దాంతోపాటు చాట్‌జీపీటీ, కింగ్‌ఫిషర్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్, బిస్లెరీ వంటి ప్రముఖ సంస్థలు లీగ్‌లో కొత్త స్పాన్సర్లుగా చేరడం గమనార్హం. జనవరి 9 నుంచి ఫిబ్రవరి 5, 2026 వరకు షెడ్యూల్ చేసిన నాలుగో ఎడిషన్ డబ్ల్యూపీఎల్ టోర్నమెంట్‌కు పెరుగుతున్న కార్పొరేట్ కంపెనీల ఆసక్తిని ఇది హైలైట్ చేస్తుంది.ఐసీసీ ప్రపంచకప్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ను గెలుచుకున్న టీమ్ ఇండియా స్టార్ ఆల్ రౌండర్ దీప్తి శర్మ రూ.3.2 కోట్లతో ఈ వేలంలో అత్యధిక ధర సాధించారు. వేలం పూల్‌లో 73 స్లాట్ల కోసం 277 మంది ఆటగాళ్లు పోటీ పడ్డారు. అగ్రశ్రేణి క్రికెటర్ల కోసం ఫ్రాంచైజీలు గట్టిగానే ప్రయత్నించాయి. వేలంలో అధిక ధర సాధించిన కొందరు ఆటగాళ్ల వివరాలు కింది విధంగా ఉంది.అమెలియా కెర్ (న్యూజిలాండ్): ముంబై ఇండియన్స్‌కు రూ.3 కోట్లుశిఖా పాండే (భారత్): యూపీ వారియర్జ్ రూ.2.4 కోట్లుసోఫీ డివైన్ (న్యూజిలాండ్): గుజరాత్ జెయింట్స్ రూ. 2 కోట్లుమెగ్ లానింగ్ (ఆస్ట్రేలియా): యూపీ వారియర్జ్ రూ.1.9 కోట్లుశ్రీచరణి (భారత్): ఢిల్లీ క్యాపిటల్స్ రూ.1.3 కోట్లుచినెల్లె హెన్రీ (వెస్టిండీస్): ఢిల్లీ క్యాపిటల్స్ రూ.1.3 కోట్లుఆశా శోభన (భారత్): యూపీ వారియర్జ్ రూ.1.1 కోట్లుస్పాన్సర్షిప్లు..కొత్తగా చేరిన చాట్‌జీపీటీ, కింగ్‌ఫిషర్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్, బిస్లెరీ లీగ్‌కు మరింత బలాన్ని ఇచ్చాయి. బీసీసీఐ ప్రకటన ప్రకారం ఈ మూడు సంస్థల ఒప్పందాల విలువ రూ.48 కోట్లు. ఇది 2026, 2027 సీజన్లలో కొనసాగుతుంది. ఇప్పటికే ఉన్న అగ్రశ్రేణి భాగస్వాముల వివరాలు ఇలా ఉన్నాయి.టాటా గ్రూప్ (టైటిల్ పార్టనర్)సింటెక్స్, హెర్బాలైఫ్ (ప్రీమియర్ భాగస్వాములు)సియట్ (స్ట్రాటజిక్ టైమ్ అవుట్ పార్టనర్)ఇదీ చదవండి: ‘కేంద్రం లేబర్ కోడ్స్ మాకొద్దు’.. అందులో ఏముంది? -
డబ్ల్యూపీఎల్ 2026 వేలం.. కెప్టెన్‌తో కలిసి నీతా ఎంట్రీ
ఉమెన్ ప్రీమియర్ లీగ్-2026 వేలం సందర్భంగా ముంబయి ఇండియన్స్ అధినేత, రిలయన్స్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ భార్య నీతా అంబానీ న్యూఢిల్లీకి చేరుకున్నారు. డబ్ల్యూపీఎల్ ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌తో కలిసి ఆమె వేలంపాటలో పాల్గొనేందుకు వచ్చారు. తొలి రెండు సీజన్లలో విజయం సాధించి డిఫెండింగ్ ఛాంపియన్‌గా నిలిచిన ముంబయి ఇండియన్స్ (MI) టీమ్‌లోకి వచ్చే ఆటగాళ్లు ఎవరనేదానిపై ఉత్కంఠ నెలకొంది.ఫ్రాంచైజీకి ఆదాయం ఎలాగంటే..సెంట్రల్ రెవెన్యూ పూల్ అన్ని ఫ్రాంచైజీలకు ప్రధాన ఆదాయ వనరు. ఇందులో టోర్నమెంట్‌ను ప్రసారం చేసే హక్కుల (టీవీ, డిజిటల్) ద్వారా వచ్చే ఆదాయంలో ఒక భాగాన్ని అన్ని ఫ్రాంచైజీలకు పంచుతారు. Viacom18/JioStar వంటి సంస్థలు భారీ మొత్తంలో మీడియా హక్కుల కోసం డబ్బు చెల్లిస్తాయి. ఇందులో ముంబై ఇండియన్స్ కూడా వాటాను పొందుతుంది.లీగ్‌కు సంబంధించిన టైటిల్ స్పాన్సర్, ప్రీమియర్ భాగస్వాముల నుంచి వచ్చే ఆదాయం ఫ్రాంచైజీల మధ్య పంపిణీ చేస్తారు. ఛాంపియన్‌గా ముంబై ఇండియన్స్ విజయాలు ఈ రెవెన్యూ పూల్ విలువను పెంచడానికి దోహదపడతాయి. View this post on Instagram A post shared by GLAMSHAM.COM (@glamsham)ఫ్రాంచైజీ స్పాన్సర్‌షిప్‌లు, బ్రాండ్ ఎండార్స్మెంట్లు జట్టుకు నేరుగా వచ్చే ఆదాయ వనరులు. ఇప్పటికే రెండు టైటిల్స్‌ను గెలుచుకున్న ముంబయి ఇండియన్స్ బ్రాండ్లను ఆకర్షించడంలో ముందుంటుంది.జెర్సీపై (ముందు, వెనుక, భుజాలు) ప్రధాన స్పాన్సర్ల లోగోలను ఉంచడం ద్వారా ఆదాయం వస్తుంది.ఎక్విప్మెంట్, కిట్ పార్టనర్షిప్ల ద్వారా (బ్యాట్లు, ప్యాడ్లు) ఒప్పందాలుంటాయి. ఇది కూడా జట్టు ఆదాయానికి దోహదం చేస్తుంది.అసోసియేట్ స్పాన్సర్లు డిజిటల్ రైట్స్, ఫ్యాన్ ఎంగేజ్మెంట్, ఇతర ప్రమోషనల్ కార్యకలాపాల కోసం స్పాన్సర్ చేస్తారు.జట్టు జెర్సీలు, టోపీలు, టీ-షర్టులు, ఇతర వస్తువుల అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం అదనం.డబ్ల్యూపీఎల్ ప్రాచుర్యం పెరుగుతున్న కొద్దీ టికెట్ ఆదాయం కూడా పెరుగుతుంది. ఇందులోనూ జట్లకు ఆదాయం ఉంటుంది.ఇదీ చదవండి: ‘కేంద్రం లేబర్ కోడ్స్ మాకొద్దు’.. అందులో ఏముంది?


