ఢిల్లీ క్యాపిటల్స్ మహిళా జట్టు కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్‌కు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)-2026లో సారథిగా ప్రమోషన్ పొందిన ఈ టీమిండియా స్టార్.. కెప్టెన్‌గా ఆకట్టుకోలేకపోతోంది. ఇప్పటికే జెమీమా సారథ్యంలో ఈ సీజన్‌లో వరుస పరాజయాలు చవిచూసిన ఢిల్లీ.. తాజాగా మంగళవారం నాటి మ్యాచ్‌లోనూ ఓటమిపాలైంది.
వడోదర వేదికగా గుజరాత్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో.. మూడు పరుగుల స్వల్ప తేడాతో ఓడిపోయింది. ఫలితంగా ఇప్పటికి ఏడు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఢిల్లీ ఖాతాలో నాలుగో పరాజయం నమోదైంది.
మరో ఎదురుదెబ్బ
ఇక గుజరాత్ చేతిలో ఓటమితో డీలా పడిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్‌కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. గుజరాత్‌తో మ్యాచ్‌లో నిర్ణీత సమయంలో ఓవర్ల కోటా పూర్తి చేయనందున ఆమెకు రూ. 12 లక్షల జరిమానా పడింది. ఇందుకు సంబంధించి WPL అధికారిక ప్రకటన విడుదల చేసింది.
భారీ జరిమానా
‘‘వడోదరలోని బీసీఏ స్టేడియంలో మంగళవారం గుజరాత్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసినందుకు గానూ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ జెమీ రోడ్రిగ్స్‌కు జరిమానా విధించడమైనది.
ఈ సీజన్‌లో ఇదే ఆమె మొదటి తప్పిదం కావున.. డబ్ల్యూపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం రూ. 12 లక్షల ఫైన్‌తో సరిపెట్టాము’’ అని WPL యాజమాన్యం పేర్కొంది. కాగా మంగళవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు సాధించింది.
బ్యాటర్‌గా ఫెయిల్
లక్ష్య ఛేదనలో ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 171 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా మూడు పరుగుల తేడాతో ఓడి ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో జెమీమా (16) నిరాశపరచగా.. నికీ ప్రసాద్ (24 బంతుల్లో 47) ఢిల్లీ టాప్ రన్ స్కోరర్‌గా నిలిచింది.
చదవండి: శుబ్‌మన్ గిల్‌కు బాగానే అర్థమైంది: రాహుల్ ద్రవిడ్


