నలుగురి అరంగేట్రం | Indian womens team all out for 198 in first innings in first Test | Sakshi
Sakshi News home page

నలుగురి అరంగేట్రం

Mar 7 2026 3:54 AM | Updated on Mar 7 2026 11:36 AM

Indian womens team all out for 198 in first innings in first Test

జెమీమా రోడ్రిగ్స్‌ అర్ధ సెంచరీ 

ఆస్ట్రేలియా 96/3

పెర్త్‌: భారత్, ఆ్రస్టేలియా మహిళల మధ్య శుక్రవారం మొదలైన ఏకైక టెస్టు మ్యాచ్‌ (డే అండ్‌ నైట్‌)లో తొలి రోజు బౌలర్ల హవా సాగింది. పింక్‌ బంతితో జరుగుతున్న ఈ టెస్టులో ఇరు జట్లు కలిపి మొదటి రోజు 13 వికెట్లు చేజార్చుకున్నాయి. టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళల జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 62.4 ఓవర్లలో 198 పరుగులకే ఆలౌటైంది. దాదాపు 20 నెలల తర్వాత టెస్టు మ్యాచ్‌ ఆడుతున్న భారత జట్టు గులాబీ బంతిని సమర్థంగా ఎదుర్కోలేక తడబడింది. 

జెమీమా రోడ్రిగ్స్‌ (84 బంతుల్లో 52; 7 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా... షఫాలీ వర్మ (48 బంతుల్లో 35; 6 ఫోర్లు), కాశ్వీ గౌతమ్‌ (54 బంతుల్లో 34 నాటౌట్‌; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. ఆసీస్‌ ఫీల్డర్లు నాలుగు క్యాచ్‌లు వదిలేసి భారత్‌కు కొంత మేలు చేశారు. అనాబెల్‌ సదర్లాండ్‌ 4 వికెట్లు పడగొట్టగా, తొలి టెస్టు ఆడుతున్న లూసీ హామిల్టన్‌కు 3 వికెట్లు దక్కాయి. 

అనంతరం ఆ్రస్టేలియా మహిళల జట్టు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 27 ఓవర్లలో 3 వికెట్లకు 96 పరుగులు చేసింది. ఎలైస్‌ పెరీ (62 బంతుల్లో 43 బ్యాటింగ్‌; 7 ఫోర్లు), అనాబెల్‌ సదర్లాండ్‌ (20 బ్యాటింగ్‌) ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్నారు. కెరీర్‌లో చివరి మ్యాచ్‌ ఆడుతున్న అలీసా హీలీ (13) విఫలమైంది. సయాలీ సత్గరేకు 2 వికెట్లు లభించాయి. ప్రస్తుతం ఆ్రస్టేలియా మరో 102 పరుగులు వెనుకబడి ఉంది.  

నలుగురి అరంగేట్రం... 
భారత జట్టు తరఫున ఒకేసారి నలుగురు ప్లేయర్లు టెస్టు క్రికెట్‌లోకి అడుగు పెట్టడం విశేషం. ఈ మ్యాచ్‌ ద్వారా వరుసగా కాశ్వీ గౌతమ్, క్రాంతి గౌడ్, ప్రతీక రావల్, సయాలీ సత్గరే టెస్టుల్లో అరంగేట్రం చేశారు. భారత్‌ తరఫున టెస్టు ఆడిన 95, 96, 97, 98వ ప్లేయర్లుగా వీరు నిలిచారు. 

స్కోరు వివరాలు  
భారత మహిళల తొలి ఇన్నింగ్స్‌: స్మృతి (బి) హామిల్టన్‌ 4; షఫాలీ (సి) మూనీ (బి) సదర్లాండ్‌ 35; ప్రతీక (సి) హామిల్టన్‌ (బి) సదర్లాండ్‌ 18; జెమీమా (సి) గార్డ్‌నర్‌ (బి) హామిల్టన్‌ 52; హర్మన్‌ప్రీత్‌ (బి) బ్రౌన్‌ 19; దీప్తి (సి) మూనీ (బి) సదర్లాండ్‌ 7; రిచా (సి) అలానా కింగ్‌ (బి) గార్డ్‌నర్‌ 11; స్నేహ్‌ రాణా (సి) తాలియా (బి) హామిల్టన్‌ 5; కాశ్వీ (నాటౌట్‌) 34; సయాలీ (సి) మూనీ (బి) సదర్లాండ్‌ 7; క్రాంతి (సి) సదర్లాండ్‌ (బి) బ్రౌన్‌ 1; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (62.4 ఓవర్లలో ఆలౌట్‌) 198. వికెట్ల పతనం: 1–18, 2–54, 3–61, 4–84, 5–107, 6–150, 7–150, 8–157, 9–195, 10–198. బౌలింగ్‌: డార్సీ బ్రౌన్‌ 12.4–0–41–2, హామిల్టన్‌ 11–3–31–3, అనాబెల్‌ సదర్లాండ్‌ 17–5–46–4, తాలియా 4–2–15–0, యాష్లీ గార్డ్‌నర్‌ 15–3–39–1, అలానా కింగ్‌ 3–0–23–0.  

ఆ్రస్టేలియా మహిళల తొలి ఇన్నింగ్స్‌: జార్జియా వోల్‌ (బి) సయాలీ 2; ఫోబీ లిచ్‌ఫీల్డ్‌ (సి) జెమీమా (బి) క్రాంతి 9; పెరీ (బ్యాటింగ్‌) 43; అలీసా హీలీ (సి) జెమీమా (బి) సయాలీ 13; అనాబెల్‌ సదర్లాండ్‌ (బ్యాటింగ్‌) 20; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (27 ఓవర్లలో 3 వికెట్లకు) 96. వికెట్ల పతనం: 1–2, 2–31, 3–58. బౌలింగ్‌: సయాలీ 8–1–24–2, క్రాంతి 11–2–28–1, కాశ్వీ 7–1–29–0, స్నేహ్‌ రాణా 1–0–9–0. 

Advertisement
 
Advertisement
Advertisement