T20 WC 2026 Final: ఐసీసీ ప్రకటన.. ఆందోళనలో ఫ్యాన్స్‌! | ICC names umpires match officials IND vs NZ T20 WC final Fans Reacts | Sakshi
Sakshi News home page

T20 WC 2026 Final: ఐసీసీ ప్రకటన.. ఆందోళనలో ఫ్యాన్స్‌!

Mar 6 2026 7:06 PM | Updated on Mar 6 2026 7:52 PM

ICC names umpires match officials IND vs NZ T20 WC final Fans Reacts

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌ తుది అంకానికి చేరుకుంది. తొలి సెమీ ఫైనల్లో సౌతాఫ్రికాను న్యూజిలాండ్‌.. రెండో సెమీస్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను భారత్‌ ఓడించి టైటిల్‌ పోరుకు అర్హత సాధించాయి.

ఈ క్రమంలో భారత్‌- న్యూజిలాండ్‌ మధ్య మార్చి 8 (ఆదివారం) ఫైనల్‌ నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైంది. ఇందుకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక. ఇక ఈ మెగా ఫైనల్‌కు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) తాజాగా కీలక ప్రకటన విడుదల చేసింది.

అంపైర్లు వీరే..
టీమిండియా- కివీస్‌ (IND vs NZ Final) మధ్య టైటిల్‌ పోరుకు అంపైర్లను శుక్రవారం ప్రకటించింది. ఫీల్డ్‌ అంపైర్లుగా రిచర్డ్‌ ఇల్లింగ్‌వర్త్‌, అలెక్స్‌ వార్ఫ్‌లకు చోటు ఇచ్చినట్లు తెలిపింది. వీరిద్దరు ఇటీవల సౌతాఫ్రికా- న్యూజిలాండ్‌ సెమీ ఫైనల్‌కు కూడా అంపైర్లుగా వ్యవహరించారు.

ఆ రెండుసార్లూ గెలిచినా..
ఇదిలా ఉంటే.. ఐసీసీ టోర్నీల్లో ఇప్పటికే ప్రతిష్టాత్మక ఫైనల్‌లలో అంపైర్‌గా పని చేసిన అనుభవం ఇల్లింగ్‌వర్త్‌కు ఉంది. వన్డే వరల్డ్‌కప్‌-2023, టీ20 ప్రపంచకప్‌-2024, ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 ఫైనల్స్‌లో ఆయనే అంపైర్‌.

అయితే, 2023లో తప్ప 2024, 2025 టైటిల్‌ పోరులో టీమిండియానే విజయం వరించింది. అన్నట్లు 2023లో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలోనే టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో ఓడి టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచిపోయింది.

ఆందోళనలో అభిమానులు.. కారణం ఇదే
అయితే, 2024లో వెస్టిండీస్‌ వేదికగా సౌతాఫ్రికాను.. 2025లో దుబాయ్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి ట్రోఫీ విజేతగా నిలిచింది. అయితే, 2023 మాదిరే ఈసారి కూడా అదే అంపైర్‌ (ఇల్లింగ్‌వర్త్‌), అదే వేదిక (అహ్మదాబాద్‌)పై ఫైనల్‌ కావడంతో అభిమానులు కాస్త సెంటిమెంట్‌ ఫీలవుతున్నారు. దురదృష్టం వెంటాడకూడదని ప్రార్థిస్తున్నారు.

టీ20 ప్రపంచకప్‌-2026లో భారత్‌- న్యూజిలాండ్‌ ఫైనల్‌కు అంపైర్లు వీరే
👉ఆన్‌ ఫీల్డ్‌ అంపైర్లు- రిచర్డ్‌ ఇల్లింగ్‌వర్త్‌, అలెక్స్‌ వార్ఫ్‌
👉థర్డ్‌ అంపైర్‌- అల్లాఉద్దీన్‌ పలేకర్‌
👉ఫోర్త్‌ అంపైర్‌- అడ్రియాన్‌ హోల్డ్‌స్టక్‌
👉మ్యాచ్‌ రిఫరీ- ఆండీ పైక్రాఫ్ట్‌.

చదవండి: T20 WC: అతడి వల్లే ఇదంతా.. మా కొంప మునిగింది అక్కడే: మెకల్లమ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement