T20 WC 2026: వరల్డ్‌ రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా | T20 WC 2026: India Break Australia World Record | Sakshi
Sakshi News home page

T20 WC 2026: ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా

Mar 6 2026 12:51 PM | Updated on Mar 6 2026 1:45 PM

T20 WC 2026: India Break Australia World Record

ముంబైలోని వాంఖడే స్టేడియం​ వేదికగా నిన్న (మార్చి 5) జరిగిన టీ20 ప్రపంచకప్‌ 2026 రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై భారత్‌ 7 పరుగుల తేడాతో విజయం​ సాధించి వరుసగా రెండో ఎడిషన్‌లో (2024, 2026), ఓవరాల్‌గా నాలుగోసారి (2007, 2014, 2024, 2026) ఫైనల్‌కు చేరింది.

ఈ క్రమంలో టీమిండియా ఓ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టింది. ఐసీసీ టోర్నీల్లో అత్యధిక సార్లు ఫైనల్‌కు చేరిన జట్టుగా చరిత్ర సృష్టించింది. తాజా ఫైనల్స్‌తో భారత్‌ ఐసీసీ టోర్నీల ఫైనల్స్‌ సంఖ్య 15కు చేరింది. గతంలో ఈ వరల్డ్‌ రికార్డు భారత్‌, ఆస్ట్రేలియా పేరిట సంయుక్తంగా ఉండేది. తాజాగా భారత్‌ ఆసీస్‌ ఆధిపత్యానికి తెరదించి, హోల్‌ అండ్‌ సోల్‌గా ప్రపంచ రికార్డు సొంతం చేసుకుంది.

టీమిండియా ఫైనల్స్‌కు చేరిన ఐసీసీ టోర్నీలు..   
భారత్ ఇప్పటివరకు 14 ఫైనల్స్‌లో 6 గెలిచింది, 7 ఓడింది. 2002 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ వర్షం కారణంగా రద్దవగా, భారత్‌..శ్రీలంకతో పాటు సంయుక్తంగా ట్రోఫీని పంచుకుంది.  
- వన్డే వరల్డ్ కప్: 1983, 2011 విజయాలు, 2003, 2023 (రన్నరప్‌)  
- టీ20 వరల్డ్ కప్: 2007, 2024 విజయాలు, 2026 (లోడింగ్‌)  
- ఛాంపియన్స్ ట్రోఫీ: 2002 (సంయుక్త విజేత), 2013, 2025 విజయాలు, 2002, 2017 (రన్నరప్‌) 
- వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్: 2021, 2023 (రన్నరప్‌)  

ఐసీసీ టోర్నీల్లోఅత్యధిక సార్లు ఫైనల్స్‌కు చేరిన జట్లు  
1. భారత్ – 15  
2. ఆస్ట్రేలియా – 14  
3. ఇంగ్లాండ్ – 9  
4. న్యూజిలాండ్ – 8  
5. వెస్టిండీస్ – 8  
6. శ్రీలంక – 8  
7. పాకిస్తాన్ – 7  
8. దక్షిణాఫ్రికా – 3

ఫైనల్లో న్యూజిలాండ్‌తో ఢీ
2026 టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్లో భారత్‌ న్యూజిలాండ్‌ను ఢీ కొట్టనుంది. ఈ మ్యాచ్‌ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మార్చి 8న జరుగనుంది. న్యూజిలాండ్ సెమీఫైనల్‌లో దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించి ఫైనల్‌కు చేరింది. ఫిన్ అలెన్ 33 బంతుల్లో విధ్వంసకర సెంచరీ చేసి కివీస్‌ను ఒంటిచేత్తో ఫైనల్‌కు చేర్చాడు.

ఫైనల్లోకి ఏంట్రీ ఇంగ్లాండ్ కు భారత్ ఊచకోత..

చరిత్రాత్మక అవకాశం  
టీ20 వరల్డ్ కప్‌లో ఇప్పటివరకు ఏ జట్టు టైటిల్‌ను రక్షించుకోలేదు. భారత్‌కు ఈసారి ఆ అవకాశం వచ్చింది. గత ఎడిషన్‌లో ఛాంపియన్‌గా నిలిచిన భారత్‌.. చరిత్ర తిరగరాయాలని పట్టుదలగా ఉంది. మరోవైపు, న్యూజిలాండ్ తమ తొలి టైటిల్ కోసం ఉవ్విళ్లూరుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement