సోఫీ
వడోదర: అప్పుడు ముంబైలో... ఇప్పుడు వడోదరలో... ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్‌ల మధ్య ఆఖరి బంతిదాకా ఉత్కంఠ రేపిన పోరులో గుజరాతే పైచేయి సాధించింది. ఈ రెండు సందర్భాల్లోనూ సోఫీ డివైన్ చివరి ఓవరే గెలవాల్సిన ఢిల్లీని ఓడించింది. మహిళల ప్రీమియర్ లీగ్‌లో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో జెయింట్స్ 3 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై గెలిచింది. ముందుగా గుజరాత్ జెయింట్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఓపెనర్ బెత్ మూనీ (58; 7 ఫోర్లు) రాణించింది. ఆంధ్రప్రదేశ్ స్పిన్నర్ నల్లపురెడ్డి శ్రీచరణి (4/31) తిప్పేసింది.
అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసి ఓడింది. ఢిల్లీ విజయానికి ఆఖరి 24 బంతుల్లో 60 పరుగులు కావాల్సిన దశలో నికీ ప్రసాద్ (24 బంతుల్లో 47; 9 ఫోర్లు), స్నేహ్ రాణా (15 బంతుల్లో 29; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) దంచేశారు. డివైన్ 17వ ఓవర్లో 23 పరుగులు, గార్డ్‌నర్ 19వ ఓవర్లో 20 పరుగులు వచ్చాయి. దాంతో ఢిల్లీ గెలవాలంటే ఆఖరి ఓవర్లో 9 పరుగులు చేయాలి. కానీ సోఫీ డివైన్ ఆఖరి ఓవర్లో 5 పరుగులే ఇచ్చి నికీ, స్నేహ్‌లను అవుట్ చేయడంతో గుజరాత్ ఓటమి కోరల్లోంచి బయటపడి గెలిచింది. నేడు విశ్రాంతి దినం. గురువారం జరిగే మ్యాచ్‌లో బెంగళూరు జట్టుతో యూపీ వారియర్స్ ఆడుతుంది.
స్కోరు వివరాలు
గుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్: మూనీ (సి) జెమీమా (బి) నందిని 58; సోఫీ డివైన్ (బి) కాప్ 13; అనుష్క (సి) మిన్నుమణి (బి) శ్రీచరణి 39; గార్డ్‌నర్ (సి) స్నేహ్ రాణా (బి) మిన్నుమణి 2; వేర్‌హమ్ (బి) శ్రీచరణి 11; భారతి (బి) చినెల్లి హెన్రీ 3; కనిక (ఎల్బీడబ్ల్యూ) (బి) శ్రీచరణి 4; కాశ్వీ (బి) శ్రీచరణి 2; తనూజ (సి) శ్రీచరణి (బి) చినెల్లి హెన్రీ 21; రేణుక (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 174. వికెట్ల పతనం: 1–19, 2–73, 3–96, 4–128, 5–131, 6–135, 7–139, 8–151, 9–174. బౌలింగ్: కాప్ 4–0–34–1, చినెల్లి 4–0–38–2, నందిని 4–0– 26–1, శ్రీచరణి 4–0–31–4, స్నేహ్ రాణా 1–0– 11–0, మిన్ను మణి 3–0–23–1.
ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: షఫాలీ (సి) గార్డ్‌నర్ (బి) రాజేశ్వరి 14; లిజెల్లీ (సి) గార్డ్‌నర్ (బి) సోఫీ 11; వోల్వార్డ్ (బి) రాజేశ్వరి 24; జెమీమా (బి) సోఫీ 16; కాప్ (బి) గార్డ్‌నర్ 0; చినెల్లి (సి) గార్డ్‌నర్ (బి) రాజేశ్వరి 9; నికీ ప్రసాద్ (సి) గార్డ్‌నర్ (బి) డివైన్ 47; స్నేహ్ రాణా (సి) వేర్‌హమ్ (బి) సోఫీ 29; మిన్ను మణి (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 171. వికెట్ల పతనం: 1–26, 2–51, 3–82, 4–83, 5–85, 6–100, 7–170, 8–171. బౌలింగ్: రేణుక 1–0–16–0, కాశ్వీ గౌతమ్ 2–0–18–0, రాజేశ్వరి 4–0–20–3, సోఫీ డివైన్ 4–0–37–4, తనూజ 4–0–26–0, ఆష్లే గార్డ్‌నర్ 4–0–37–1, వేర్‌హమ్ 1–0–12–0.


