అమ్మాయిల ఆసక్తి క్రికెట్‌ వైపు | Report Says Women Cricket Participation Doubles in India Since 2020 | Sakshi
Sakshi News home page

అమ్మాయిల ఆసక్తి క్రికెట్‌ వైపు

Mar 14 2026 10:36 AM | Updated on Mar 14 2026 10:50 AM

Report Says Women Cricket Participation Doubles in India Since 2020

న్యూఢిల్లీ: భారతదేశంలో గత ఆరేళ్లలో అమ్మాయిలు క్రికెట్‌ ఆట వైపు ఎక్కువగా ఆకర్షితులయ్యారు. 2020తో పోలిస్తే ఇది ఈ సంఖ్య దాదాపు రెట్టింపుగా ఉంది. ‘బీబీసీ–కలెక్టివ్‌ న్యూస్‌రూమ్‌’ సంయుక్తంగా జరిపిన సర్వేలో ఇది తేలింది. దాదాపు 10 వేల మంది మహిళలతో మాట్లాడి ఈ సర్వే ఫలితాలు వెల్లడించారు.

గతంలో క్రికెట్‌లో చేరే అమ్మాయిల సంఖ్య ఐదు శాతం మాత్రమే ఉండగా ఇప్పుడు ఇది పది శాతానికి పెరిగింది. ముఖ్యంగా 15–24 మధ్య వయసు అమ్మాయిలు 2020లో ఆరు శాతం మాత్రమే ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 16 శాతానికి పెరగడం విశేషం. 

ఈ వయో విభాగంలో ప్రతీ నలుగురిలో ఒక అమ్మాయి క్రికెట్‌ను పూర్తి స్థాయిలో కెరీర్‌కు మలచుకోవడం కోసం శ్రమిస్తున్నారని సర్వే చెబుతోంది. గత ఏడాది భారత జట్టు తొలిసారి వన్డే క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ను గెలుచుకోవడం ఒక్కసారిగా అందరి దృష్టీ మహిళా క్రికెట్‌పై నిలిచింది. 

మరోవైపు బ్యాడ్మింటన్‌ క్రీడపై పంజాబ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అమ్మాయిల ఆసక్తి పెరిగిందని తేల్చిన సర్వే... వేర్వేరు కారణాలతో 13 శాతం అమ్మాయిలు అసలు ఏ క్రీడను ఆడటం లేదని వెల్లడించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement