breaking news
ICC Womens World Cup 2025
-
భారత క్రికెటర్‌కు ‘గిఫ్ట్’.. తిరిగొచ్చిన తండ్రి ఉద్యోగం!
భారత స్టార్ పేసర్ క్రాంతి గౌడ్ కుటుంబంలో సంతోషాలు వెల్లివిరిశాయి. దాదాపు పదమూడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వారి కలలు ఫలించాయి. ఆమె తండ్రి మున్నా సింగ్ తిరిగి ఉద్యోగంలో చేరేందుకు మార్గం సుగమమైంది. ఇందుకు సంబంధించి మధ్య ప్రదేశ్ ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వచ్చింది.గతేడాది భారత్ తరఫున మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసింది క్రాంతి గౌడ్. ఇప్పటికి మొత్తంగా 15 వన్డేలు, 4 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఈ రైటార్మ్ మీడియం పేసర్.. వన్డేల్లో 23, టీ20లలో రెండు వికెట్లు తీసింది.తొమ్మిది వికెట్లు కూల్చి.. అయితే, గతేడాది సొంతగడ్డపై జరిగిన ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025లో క్రాంతి గౌడ్ అద్భుత ప్రదర్శనతో ప్రశంసలు అందుకుంది. ఈ మెగా టోర్నీలో మొత్తంగా తొమ్మిది వికెట్లు కూల్చి.. భారత్ తొలిసారిగా చాంపియన్‌గా నిలవడంలో తన వంతు పాత్ర పోషించింది. జట్టులోకి వచ్చిన అనతికాలంలోనే వరల్డ్‌కప్ ట్రోఫీని ముద్దాడింది.కూతురి ప్రతిభ.. తిరిగొచ్చిన తండ్రి ఉద్యోగం!ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం క్రాంతి గౌడ్ సముచిత రీతిలో గౌరవించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్.. క్రాంతి తండ్రి మున్నా సింగ్‌ను తిరిగి ఉద్యోగంలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. భారత్‌కు గర్వకారణమైన తమ ముద్దుబిడ్డ పట్ల ప్రేమను చాటుకుంటూ నిబంధనలకు అనుగుణంగానే ముందుకు వెళ్తామని ప్రభుత్వం ప్రకటించింది.ఈ క్రమంలోనే మున్నా సింగ్ తిరిగి పోలీస్ కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరవచ్చని సోమవారం ఉత్వర్వులు జారీ అయ్యాయి. ఈ విషయాన్ని మధ్యప్రదేశ్ క్రీడా శాఖా మంత్రి విశ్వాస్ సారంగ్ వెల్లడించారు. ‘‘అథ్లెట్ల పట్ల గౌరవం, వారి బాగోగుల గురించి మా ప్రభుత్వం పట్టించుకుంటుందనేందుకు ఇదే నిదర్శనం.మా నిర్ణయం వల్ల గౌడ్ కుటుంబానికి ఆర్థికంగా, సామాజికంగా ఎలాంటి లాభం చేకూరకపోవచ్చు. అయితే, తన తండ్రి గౌరవప్రదంగా.. పోలీస్ యూనిఫామ్‌లో రిటైర్ అవ్వాలన్న క్రాంతి కల మాత్రం నెరవేరుతుంది’’ అని పేర్కొన్నారు. కాగా మధ్యప్రదేశ్ పోలీస్ శాఖలో పనిచేసిన మున్నా సింగ్ 2012లో సర్వీస్ నుంచి తొలగించబడ్డారు.మున్నా సింగ్‌పై అందుకే వేటుఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలతో మున్నా సింగ్‌పై వేటు పడింది. ఈ క్రమంలో మున్నా సింగ్ ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడింది. నిలకడైన ఆదాయంలేక చాలీచాలని డబ్బులతో.. ఒక్క పూట భోజనం కూడా దొరకడం కష్టమైన సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ క్రాంతి గౌడ్ క్రికెటర్ కావాలన్న తన కలను వదల్లేదు.ట్విస్టు ఏంటంటే?కష్టాల కడలిని దాటి భారత జట్టుకు ఆడే స్థాయికి చేరుకుంది. అంతేకాదు వరల్డ్‌కప్ విజయంలోనూ కీలకంగా వ్యవహరించి కీర్తిప్రతిష్టలు సంపాదించింది. ఈ క్రమంలోనే ఆమె తండ్రికి ఉద్యోగం తిరిగి వచ్చింది. అయితే, ఇక్కడే ఓ ట్విస్టు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.ఎన్డీటీవీ వివరాల ప్రకారం.. జూన్ 8, 2012 నుంచి జనవరి 5, 2026 వరకు మున్నా సింగ్ విధుల్లో లేడు. కాబట్టి ఈ మధ్యకాలంలో ఆయనకు ప్రభుత్వం ‘నో వర్క్, నో పే’ నిబంధనను వర్తింపజేసినట్లు సమాచారం. అంటే.. 2012- 2026 వరకు సర్వీసు కోల్పోయిన మున్నా సింగ్‌కు ఎలాంటి జీతభత్యాలు ప్రభుత్వం చెల్లించదు. చదవండి: ఆ ముగ్గురిని చూస్తుంటే..: కోహ్లిపై భారత మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు -
ఉన్నదంతా కోల్పోయామంటే..: స్మృతి మంధాన పోస్ట్ వైరల్
భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధానకు గతేడాది గొప్ప అనుభూతితో పాటు.. చేదు అనుభవాన్ని మిగిల్చింది. ముఖ్యంగా 2025 సంవత్సరాంతం ఆమె జీవితంలో మరుపురానిదిగా మిగిలిపోనుంది. ఇప్పటికే మహిళల క్రికెట్లో ఎన్నో రికార్డులు కొల్లగొట్టిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్‌కు వరల్డ్‌కప్‌ను ముద్దాడాలన్న చిరకాల కోరిక నవంబరులో తీరింది.ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన వన్డే ప్రపంచకప్-2025 ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి.. భారత మహిళా జట్టు తొలిసారి జగజ్జేతగా నిలిచింది. ఈ విజయంలో ఓపెనర్‌గా స్మృతి మంధాన తన వంతు పాత్ర పోషించింది. కెరీర్‌లోని అత్యుత్తమ గెలుపు తర్వాత.. అదే నెలలో వ్యక్తిగత జీవితంలోనూ స్మృతి మంధాన (Smriti Mandhana) కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది.అనూహ్య రీతిలో వాయిదా.. ఆపై రద్దుదాదాపు ఆరేళ్లుగా తనతో ప్రేమ బంధం కొనసాగించిన బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్చల్ (Palash Mucchal)తో ఏడడుగులు వేసేందుకు స్మృతి సిద్ధమైంది. అందుకు అనుగుణంగా ఇరు కుటుంబాల సమక్షంలో హల్దీ, మెహందీ, సంగీత్ వేడుకలు ఘనంగా జరిగాయి. మరికొన్ని గంటల్లో (నవంబరు 23) పెళ్లి తంతు మొదలుకానుండగా అనూహ్య ఘటనలు చోటు చేసుకున్నాయి.స్మృతి తండ్రికి తొలుత గుండెపోటు రాగా.. పలాష్ సైతం ఆస్పత్రి పాలయ్యాడు. దీంతో పెళ్లి వాయిదా పడింది. అయితే, ఆ తర్వాత సోషల్ మీడియాలో పలాష్ గురించి పెద్ద ఎత్తు చర్చ మొదలైంది. స్మృతితో తన బంధాన్ని కించపరిచేలా.. తనతో అతడు చాట్ చేశాడంటూ ‘ప్రైవేటు’ సంభాషణను ఓ అమ్మాయి షేర్ చేసింది. పలాష్ స్త్రీలోలుడు అనేలా ఆ మెసేజ్‌లు ఉన్నాయి.అధికారికంగా ప్రకటించి..ఈ నేపథ్యంలో చాన్నాళ్ల వరకు ఈ విషయంపై ఇరు కుటుంబాలు మౌనం వహించగా.. పలాష్‌పై ట్రోలింగ్ ఎక్కువైంది. ఈ క్రమంలో తాము పెళ్లిని రద్దు చేసుకున్నామంటూ స్మృతి- పలాష్ అధికారికంగా వెల్లడించారు. ఈ సందర్భంగా తనకు ఆటే ముఖ్యమని.. ఇకపై క్రికెట్ మీద మాత్రమే దృష్టి పెడతానంటూ స్మృతి పేర్కొంది.అందుకు అనుగుణంగానే ఇటీవల శ్రీలంకతో టీ20 సిరీస్‌లో అదరగొట్టి అంతర్జాతీయ క్రికెట్లో పది వేల పరుగుల క్లబ్లో చేరింది. ఇక 2025లో ఓవరాల్‌గా 1703 పరుగులు సాధించి.. క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్‌గా నిలిచింది. వ్యక్తిగత జీవితంలోని చేదు అనుభవాన్ని దిగమింగి.. టీ20 ప్రపంచకప్-2026లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.2025కు గుడ్‌బై.. ఉన్నదంతా కోల్పోయామంటే..ఈ నేపథ్యంలో 2025కు సంబంధించిన జ్ఞాపకాలతో కూడిన వీడియోను షేర్ చేసిన స్మృతి మంధాన.. గీతలో కృష్ణుడు చెప్పిన మాటలను పంచుకుంది. ‘‘ఏదైనా గొప్ప విషయం, మంచి జరిగే ముందు.. అప్పటి వరకు ఉన్నదంతా కోల్పోతాము. కాబట్టి ఓపికగా ఎదురుచూడటమే ఉత్తమం’’ అని స్మృతి పేర్కొంది. ఇక ఈ వీడియోలో తన స్నేహితులు, సహచర ఆటగాళ్లు.. అమ్మానాన్న, అన్నయ్య, మేనల్లుడితో ఉన్న ఫొటోలను కూడా ఆమె జత చేసింది. ఈ మేరకు 2025కు గుడ్‌బై చెబుతూ స్మృతి పెట్టిన పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది.చదవండి: 2026: ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న కోహ్లి పోస్ట్ View this post on Instagram A post shared by Smriti Mandhana (@smriti_mandhana) -
వన్డే వరల్డ్‌కప్ ‘స్టార్’కు ప్రతిష్టాత్మక అవార్డు
దుబాయ్: మహిళల వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చిన భారత క్రికెటర్ షఫాలీ వర్మకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) పురస్కారం లభించింది. మహిళల విభాగంలో నవంబర్ నెలకుగాను షఫాలీ వర్మ ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’గా ఎంపికైంది. ముంబైలో దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో షఫాలీ 78 బంతుల్లో 87 పరుగులు చేయడంతోపాటు 2 వికెట్లు పడగొట్టింది.ఓపెనర్ స్మృతి మంధానతో కలిసి తొలి వికెట్‌కు 104 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఇక ఐసీసీ అవార్డు గెలుచుకున్న సందర్భంగా హరియాణాకు చెందిన షఫాలీ వర్మ మాట్లాడుతూ.. ‘నా తొలి ప్రపంచకప్ నేను ఊహించిన విధంగా గొప్ప అనుభవమైతే ఇవ్వలేదు. అయితే ముగింపు మాత్రం నేను అనుకున్నదానికంటే బాగా జరిగింది.వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో భారత విజయంలో నా వంతు పాత్ర పోషించినందుకు గర్వంగా ఉంది. నవంబర్ నెలకుగాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్‌గా ఎంపికైనందుకు ఆనందంగా ఉంది’ అని వ్యాఖ్యానించింది.నంబర్ 4ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ అవార్డు గెల్చుకున్న నాలుగో భారతీయ మహిళా క్రికెటర్‌గా షఫాలీ గుర్తింపు పొందింది. గతంలో హర్మన్‌ప్రీత్ కౌర్ (2022 సెపె్టంబర్), దీప్తి శర్మ (2023 డిసెంబర్), స్మృతి మంధాన (2024 జూన్; 2025 సెప్టెంబర్) ఈ అవార్డు సొంతం చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. పురుషుల విభాగంలో దక్షిణాఫ్రికా స్పిన్నర్ సైమన్ హార్మర్ ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ అవార్డు గెల్చుకున్నాడు. భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో హర్మర్ 17 వికెట్లు పడగొట్టి తమ జట్టు 2–0తో టీమిండియాను వైట్‌వాష్ చేయడంలో కీలకపాత్ర పోషించాడు. చదవండి: మాక్ వేలంలో రూ. 30.50 కోట్లకు అమ్ముడుపోయిన గ్రీన్.. ఎవరు కొన్నారంటే? -
‘మా అన్నయ్య వల్లే ఇదంతా.. నా జీవితమే మారిపోయింది’
భారత మహిళా క్రికెట్ జట్టు తొలి వన్డే వరల్డ్‌కప్ ట్రోఫీ గెలవడంలో దీప్తి శర్మది కీలక పాత్ర. ఈ మెగా ఈవెంట్ ఆసాంతం అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకున్న ఈ ఆల్‌రౌండర్.. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు గెలుచుకుంది. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 టోర్నీలో దీప్తి మొత్తంగా 215 పరుగులు చేయడంతో పాటు.. 22 వికెట్ల కూల్చింది.ముఖ్యంగా సౌతాఫ్రికాతో ఫైనల్లో దీప్తి శర్మ.. అర్ధ శతకం బాదడంతో పాటు.. ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టి జట్టు గెలవడంలో కీలకంగా వ్యవహరించింది. ఈ నేపథ్యంలో మహిళల ప్రీమియర్ లీగ్ -2026 మెగా వేలంలోనూ దీప్తికి భారీ ధర దక్కింది.వేలానికి ముందు ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌ను వదిలేసిన యూపీ వారియర్స్.. ఏకంగా రూ. 3.2 కోట్లు వెచ్చించి తిరిగి ఆమెను సొంతం చేసుకుంది. తద్వారా డబ్ల్యూపీఎల్ వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన రెండో ప్లేయర్‌గా దీప్తి నిలిచింది.ఇదిలా ఉంటే.. వరల్డ్‌కప్ విన్నింగ్ జట్టుతో కలిసి దీప్తి శర్మ.. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నిర్వహించే ప్రముఖ షో.. ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’కి హాజరైంది. ఈ సందర్భంగా తాను క్రికెటర్‌గా మారడానికి తన అన్నయ్యే కారణమని వెల్లడించింది.‘‘నేను క్రికెట్ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచే వచ్చాను. మా అన్నయ్య ప్రొఫెషనల్ క్రికెటర్. ఆయన వల్లే నేనూ క్రికెట్ ఆడటం మొదలుపెట్టాను. నేను వేసిన ఒక్క త్రో నా జీవిత ప్రయాణాన్నే మార్చివేసింది.ఓరోజు మా అన్నయ్య ఆడుతున్న చోటికి వెళ్లాను. అక్కడే మెట్ల మీద కూర్చుని మ్యాచ్ చూస్తున్నా. ఇంతలో బంతి నా వైపు దూసుకువచ్చింది. వేగంగా స్పందించిన నేను.. దాదాపు 40- 50 మీటర్ల దూరం నుంచి దానిని నేరుగా స్టంప్స్‌నకు గిరాటేశాను. మా అన్నయ్య చాలా సంతోషించాడు.చుట్టూ ఉన్న వాళ్లు కూడా.. ‘ఈ అమ్మాయి క్రికెట్ ఆడితే బాగుంటుంది’ అని ఉత్సాహపరిచారు. ఆరోజు నుంచి క్రికెటర్‌గా ప్రయాణం మొదలుపెట్టిన నేను ఇంత వరకు వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు’’ అని దీప్తి శర్మ హర్షం వ్యక్తం చేసింది. కాగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే దీప్తి సేవలకు గానూ ఆమెను పోలీస్ శాఖలో డీఎస్పీగా నియమించింది. -
అయ్యో పాపం!.. దీప్తి శర్మకే ఎందుకిలా?
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)-2026 మెగా వేలంలో భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మకు భారీ ధర దక్కింది. న్యూఢిల్లీ వేదికగా గురువారం నాటి వేలంపాటలో యూపీ వారియర్స్ ఆమెను ఏకంగా రూ. 3.2 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, ఆదిలో దీప్తి కోసం ఒక్క ఫ్రాంఛైజీ కూడా ఆసక్తి చూపకపోవడం గమనార్హం.కాగా డబ్ల్యూపీఎల్ ఆరంభ సీజన్ (2023) నుంచి దీప్తి శర్మ యూపీ వారియర్స్‌కే ప్రాతినిథ్యం వహిస్తోంది. అలిసా హేలీ గాయం వల్ల దూరం కావడంతో 2025లో యూపీ కెప్టెన్‌గానూ దీప్తి వ్యవహరించింది. అయితే, ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఆమె సారథ్యంలో యూపీ కనీసం ప్లే ఆఫ్స్ కూడా చేరలేదు.ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ఇదిలా ఉంటే.. ఇటీవల ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025లో భారత్ విజేతగా నిలవడంలో దీప్తి శర్మదే ముఖ్య పాత్ర. ఈ ఆల్‌రౌండర్ మూడు అర్ధ శతకాల సాయంతో 215 పరుగులు చేయడంతో పాటు.. మొత్తంగా 22 వికెట్లు కూల్చి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు అందుకుంది. ముఖ్యంగా సౌతాఫ్రికాతో ఫైనల్లో హాఫ్ సెంచరీ చేయడంతో పాటు ఐదు వికెట్లు కూల్చడం హైలైట్‌గా నిలిచింది.ఢిల్లీ క్యాపిటల్స్ తప్పఈ నేపథ్యంలో యూపీ దీప్తిని రిటైన్ చేసుకుంటుందని భావించగా.. అనూహ్యంగా ఆమెను వేలంలోకి వదిలింది. వేలంలో దీప్తి కోసం ఫ్రాంఛైజీలు ఎగబడతాయని భావించగా.. ఢిల్లీ క్యాపిటల్స్ తప్ప ఎవరూ కనీసం ఆమె వైపు చూడలేదు.ఈ క్రమంలో కనీస ధర రూ. 50 లక్షలకు దీప్తి వేలంలోకి రాగా ఢిల్లీ అదే ధరకు దీప్తిని కొనుగోలు చేయాలనుకుంది. ఇంతలో రంగంలోకి దిగిన యూపీ.. రైట్ టు మ్యాచ్ (RTM) కార్డు ద్వారా అదే ధర చెల్లించి దీప్తిని సొంతం చేసుకోవాలని భావించింది. అయితే, ఢిల్లీ ఒక్కసారిగా దీప్తి ధరను రూ. 3.2 కోట్లకు పెంచింది.ఢిల్లీ వదిలేలా లేదని భావించిన యూపీ రూ. 3.2 కోట్ల వద్ద తమ RTM కార్డును ఉపయోగించి దీప్తిని తిరిగి సొంతం చేసుకుంది. ఫలితంగా డబ్ల్యూపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన రెండో ప్లేయర్‌గా.. ఆష్లే గార్డ్నర్ (గుజరాత్- 2023- రూ. 3.2 కోట్లు) రికార్డు సమం చేసింది. కాగా ఆర్సీబీ 2023లో స్మృతి మంధానను రూ. 3.4 కోట్లకు కొనుగోలు చేయగా.. ఆమె లీగ్‌లో అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా కొనసాగుతోంది. చదవండి: WPL 2026: వేలంలో శ్రీచరణికి భారీ ధర -
స్మృతి మంధానకు కాబోయే భర్త సర్ప్రైజ్.. వీడియో వైరల్
భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమైంది. చిరకాల స్నేహితుడు, సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ (Palash Muchhal)తో ఏడడుగులు వేయనుంది. చాన్నాళ్ల క్రితమే తమ బంధాన్ని బయటి ప్రపంచానికి తెలిపిన స్మృతి- పలాష్ జంట.. తమ ప్రేమను వైవాహిక బంధంతో నవంబరు 23న పదిలం చేసుకోనున్నారు.జగజ్జేతగా భారత్ఈ నేపథ్యంలో ఇప్పటికే ముందస్తు పెళ్లి వేడుకలు మొదలుకాగా.. పలాష్ తన రొమాంటిక్ ప్రపోజల్‌తో స్మృతిని సర్ప్రైజ్ చేశాడు. కాగా భారత మహిళా క్రికెట్ జట్టు ఇటీవలే ఐసీసీ వన్డే వరల్డ్‌కప్-2025 టైటిల్‌ను గెలుచుకున్న విషయం తెలిసిందే. భారత్ ప్రపంచకప్ గెలవాలన్న మిథాలీ రాజ్, ఝులన్ గోస్వామి వంటి దిగ్గజ ఆటగాళ్ల కలను హర్మన్ సేన సొంతగడ్డపై నెరవేర్చింది.ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి.. మహిళల వన్డే క్రికెట్లో తొలిసారి భారత్ జగజ్జేతగా నిలిచింది. నాలుగున్నర దశాబ్దాల కలను నెరవేరుస్తూ ట్రోఫీని ముద్దాడింది. ఈ విజయంలో ఓపెనర్‌గా, వైస్ కెప్టెన్‌గా స్మృతి మంధాన తన వంతు పాత్ర పోషించింది. ఇంతటి ప్రత్యేకమైన ఈ మైదానంలోనే స్మృతికి పలాష్ అదిరిపోయే బహుమతి ఇచ్చాడు.నన్ను పెళ్లి చేసుకుంటావా?కళ్లకు గంతలు కట్టి మరీ స్మృతిని డీవై పాటిల్ స్టేడియానికి తీసుకువెళ్లిన పలాష్.. మోకాళ్లపై కూర్చుని.. ‘‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’’ అంటూ ప్రతిపాదన తెచ్చాడు. ఇందుకు ఆమె నవ్వుతూ అంగీకరించింది. పలాష్ తన వేలికి ఉంగరం తొడగడంతో సిగ్గులమొగ్గయిన స్మృతి.. ఆ తర్వాత తాను కూడా పలాష్ వేలికి ఉంగరం తొడిగింది.ఇందుకు సంబంధించిన వీడియోను పలాష్ ముచ్చల్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘‘ఆమె సరేనంది’’ అంటూ తమ జీవితంలోని మధుర క్షణాలను అభిమానులతో పంచుకున్నాడు. కాగా తమ్ముడు పలాష్‌తో పాటు బాలీవుడ్ సింగర్ పాలక్ ముచ్చల్ కూడా స్టేడియానికి వచ్చి మరదల్ని సర్ప్రైజ్ చేసింది. ఆ తర్వాత అంతా కలిసి నవ్వులు చిందిస్తూ స్టెప్పులు వేశారు. కాగా మహారాష్ట్రకు చెందిన 29 ఏళ్ల స్మృతి మంధాన క్రికెటర్‌గా సత్తా చాటుతుండగా.. ఇండోర్‌కు చెందిన 30 ఏళ్ల పలాష్ ముచ్చల్ బాలీవుడ్లో సంగీత దర్శకుడిగా అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. ఇరుకుటుంబాల సమ్మతితో స్మృతి- పలాష్ ఆదివారం (నవంబరు 23) పెళ్లి బంధంలో అడుగుపెట్టనున్నారు.చదవండి: ఐపీఎల్ ఆడటం మానెయ్: గిల్‌కు గంభీర్ సలహా ఇదే View this post on Instagram A post shared by Palaash Muchhal (@palash_muchhal) -
నేనేమీ హర్మన్‌ప్రీత్ కౌర్‌ని కాదు.. అలా ఎందుకు చేస్తా?: బంగ్లా కెప్టెన్ ఓవరాక్షన్
బంగ్లాదేశ్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ నిగర్ సుల్తానా జోటీ (Nigar Sultana)పై టీమిండియా అభిమానులు మండిపడుతున్నారు. ఆరోపణలపై స్పందించే విధానం ఇది కాదని.. అనవసరంగా మా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) పేరు వివాదంలోకి లాగితే సహించేదిలేదని హెచ్చరిస్తున్నారు. అసలేం జరిగిందంటే.. భారత్- శ్రీలంక వేదికగా జరిగిన ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 టోర్నమెంట్లో బంగ్లాదేశ్ చెత్త ప్రదర్శన కనబరిచిన విషయం తెలిసిందే. మొత్తంగా గ్రూప్ దశలో పదకొండు మ్యాచ్‌లకు గానూ బంగ్లా జట్టు కేవలం రెండే గెలిచి.. టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ కెప్టెన్ నిగర్ సుల్తానాపై విమర్శల వర్షం కురిసింది. జూనియర్లపై భౌతిక దాడిఅదే సమయంలో బంగ్లా పేసర్ జహనారా ఆలమ్.. నిగర్ సుల్తానాపై సంచలన ఆరోపణలు చేసింది. జట్టు సభ్యులపై నిగర్ భౌతిక దాడికి పాల్పడేదని.. జూనియర్లను ఎన్నోసార్లు గాయపరిచిందని ఆరోపించింది. ఇష్టారీతిన కొట్టేదని వాపోయింది.బంగ్లాదేశ్ డైలీతో మాట్లాడుతూ ఆలం ఈ మేరకు నిగర్పై ఆరోపణలు చేసింది. ‘‘ఇందులో కొత్తేమీ లేదు. జోటీ జూనియర్లను దారుణంగా కొట్టేది’’ అని పేర్కొంది. అయితే, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆలం ఆరోపణలను కొట్టిపారేసింది. నిగర్ సుల్తానాపై తమకు పూర్తి నమ్మకం ఉందంటూ ఆమెను సమర్థించింది.నేనేమైనా హర్మన్‌ప్రీత్‌నా?ఈ నేపథ్యంలో తాజాగా.. నిగర్ సుల్తానా స్వయంగా స్పందించింది. తనపై వచ్చిన ఆరోపణల గురించి కాకుండా.. భారత మహిళా జట్టు కెప్టెన్, వరల్డ్‌కప్ విజేత హర్మన్‌ప్రీత్ కౌర్ పేరును కూడా ఇందులోకి లాగింది. ‘‘నేను ఎవరినైనా ఎందుకు కొడతాను? అంటే.. నా బ్యాట్‌తో స్టంప్స్‌ను ఎందుకు కొడతాను?నేనేమైనా హర్మన్‌ప్రీత్‌నా? ఆమె మాదిరి స్టంప్స్‌ను బ్యాట్ కొట్టేదానిలా కనబడుతున్నానా? నేనెందుకు అలా చేస్తాను? నా వ్యక్తిగత విషయంలో ఏదైనా తప్పుగా అనిపిస్తే... అప్పుడు నా బ్యాట్‌ను తిప్పుతూ కోపం ప్రదర్శిస్తానేమో.. లేదంటే నా హెల్మెట్‌ను కొట్టుకుంటానేమో? అది నా ఇష్టం.వేరే వాళ్లను నేనెందుకు కొడతాను?కానీ వేరే వాళ్లను నేనెందుకు కొడతాను? భౌతికంగా ఎందుకు దాడి చేస్తాను? ఎవరో ఏదో అన్నారని అందరూ ఈ విషయం గురించి నన్ను అడగటం ఏమీ బాలేదు. నిజంగా నేను ఎవరినైనా కొట్టానేమో అడగండి. వాళ్లు చెప్పింది రాసుకోండి’’ అంటూ నిగర్ సుల్తానా డైలీ క్రికెట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.కాగా 2023లో బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా వన్డే మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ తీవ్ర అసంతృప్తికి లోనైన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ బౌలర్ నహీదా అక్తర్ బౌలింగ్‌లో హర్మన్ స్వీప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించగా.. బంతి బ్యాట్‌కు కాకుండా ప్యాడ్‌కు తాకింది. ఈ క్రమంలో బంగ్లా ఆటగాళ్లు అప్పీలు చేయగా.. అంపైర్ హర్మన్‌ను అవుట్‌గా ప్రకటించాడు.నాడు హర్మన్ అలాకానీ.. బంతి లెగ్స్టంప్నకు ఆవల పిచ్ అయిందని భావించిన హర్మన్.. తనను తప్పుడు నిర్ణయంతో బలిచేశారనే ఆవేదన, కోపంతో బ్యాట్‌తో వికెట్లను కొట్టింది. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ బోర్డును కూడా హర్మన్ తప్పుబట్టింది. ఈ పరిణామాల నేపథ్యంలో హర్మన్‌పై ఐసీసీ చర్యలు తీసుకుంది. ఆమె మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత వేయడంతో పాటు రెండు డిమెరిట్ పాయింట్లు కూడా ఆమె ఖాతాలో జమచేసింది. రెండు అంతర్జాతీయ మ్యాచ్‌ల నిషేధం కూడా విధించింది.అయితే, ఎప్పుడో రెండేళ్ల క్రితం నాటి విషయాన్ని తాజాగా ప్రస్తావిస్తూ.. బంగ్లా కెప్టెన్ నిగర్ సుల్తానా హర్మన్‌ప్రీత్ పేరును తీయడంపై భారత జట్టు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళల క్రికెట్లో భారత్‌కు మొట్టమొదటి వన్డే ప్రపంచకప్ అందించిన తమ సారథిని కించపరిచేలా మాట్లాడితే ఊరుకునేది లేదంటూ సోషల్ మీడియా వేదికగా హెచ్చరిస్తున్నారు. చదవండి: IND vs SA: టీమిండియాకు భారీ షాక్..! స్టార్ ప్లేయర్‌కు మళ్లీ పిలుపు -
సిగ్గులేని వాళ్లుంటారు: వరల్డ్‌కప్ విజేతలకు గావస్కర్ వార్నింగ్
నాలుగున్నర దశాబ్దాల కలను నెరవేరుస్తూ భారత మహిళా క్రికెట్ జట్టు ఇటీవలే వన్డే ప్రపంచకప్ (ICC Women's ODI World Cup) విజేతగా నిలిచింది. సొంతగడ్డపై ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి సగర్వంగా ట్రోఫీని ముద్దాడింది. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్లు మొదలు అభిమానుల దాకా.. యావత్ భారతావని ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంది.భారీ నజరానాఢిల్లీ నుంచి గల్లీ దాకా హర్మన్ సేన గెలుపును ప్రస్తావిస్తూ మన ఆడబిడ్డలను ఆకాశానికెత్తింది. ఇక వరల్డ్‌కప్ గెలిచిన జట్టులోని సభ్యులైన క్రికెటర్లకు ఐసీసీ అందించే రూ. 40 కోట్ల ప్రైజ్‌మనీతో పాటు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రకటించిన రూ. 51 కోట్ల నజరానా దక్కనుంది.క్యాష్ రివార్డులు అంతేకాదు.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సైతం భారీ ఎత్తున రివార్డులు ప్రకటించాయి. మహారాష్ట్రకు చెందిన ముగ్గురు ప్లేయర్లు స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, రాధ యాదవ్‌లకు ఇప్పటికే ప్రభుత్వం తలా రూ.2.25 కోట్ల మేర చెక్కులు అందించింది. భారత జట్టులోని ఇతర సభ్యులు క్రాంతి గౌడ్ (మధ్యప్రదేశ్), అమన్‌జోత్ కౌర్, హర్లీన్ డియోల్ (పంజాబ్), రిచా ఘోష్ (బెంగాల్), అరుంధతి రెడ్డి (తెలంగాణ)లకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఘన స్వాగతం పలికాయి.ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీచరణికి గ్రూప్-1 ఉద్యోగంతో పాటు.. రూ. 2.5 కోట్ల నగదు బహుమతి ప్రకటించింది. సొంత ఊరిలో ఇంటి స్థలం కూడా కేటాయించింది. ఈ నేపథ్యంలో వన్డే ప్రపంచకప్ విజేతలను ఉద్దేశించి టీమిండియా దిగ్గజ0, 1983 వరల్డ్‌కప్ విన్నర్ సునిల్ గావస్కర్ (Sunil Gavaskar) చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.అమ్మాయిలు జాగ్రత్తమిడ్-డేకు రాసిన కాలమ్‌లో.. ‘‘అమ్మాయిలు కాస్త జాగ్రత్త. మీకోసమే ఈ మాటలు.. అందరూ మాట ఇచ్చినట్లుగా మీకు అవార్డులు, రివార్డులు దక్కకపోతే అస్సలు బాధపడొద్దు. మన దేశంలో అడ్వర్టైజర్లు, బ్రాండ్లు, కొంతమంది వ్యక్తులు ఉచిత ప్రచారం కోసం విజేతలను తమ భుజాలపై మోస్తారు.జట్టుకు శుభాకాంక్షలు తెలుపుతూ ఫుల్‌పేజీ యాడ్లు, హోర్డింగ్‌లు పెట్టిస్తారు. జట్టు యాజమాన్యం, స్పాన్సర్లు తప్ప మిగతా వారంతా ఫ్రీ పబ్లిసిటీ కోసమే ఇదంతా చేస్తారు. నిజానికి వారి ద్వారా భారత క్రికెట్‌కు ఒరిగేది ఏమీ ఉండదు.1983లో భారత్‌కు తొట్టతొలి వరల్డ్‌కప్ అందించిన విజేతలకు కూడా చాలా ప్రామిస్‌లు చేశారు. వీటి గురించి మీడియలో ప్రముఖంగా వార్తలు వచ్చాయి. కానీ అవేవీ కార్యరూపం దాల్చలేదు. ఈ విషయంలో మీడియాను తప్పుబట్టాల్సిన పనిలేదు.సిగ్గులేని వాళ్లుంటారువిజేతలకు వచ్చిన నజరానాల గురించి వారు పెద్ద పెద్ద హెడింగ్‌లు పెడతారంతే!.. అయితే, విజేతలతో పాటు మీడియాను కూడా కొంత మంది సిగ్గులేని వాళ్లు ఉపయోగించుకుంటారని వారికీ తెలిసి ఉండదు. కాబట్టి.. అమ్మాయిలూ.. ఇలాంటి సిగ్గులేని వ్యక్తులను ఉపేక్షించవద్దు.తమ ప్రచారం కోసం మీ పేరును వాడుకుంటారు. 1983 విజేతల తరఫు నుంచి మీకో మాట చెప్పదలచుకున్నా.. భారత క్రికెట్ అభిమానుల ప్రేమే అన్నింటికంటే గొప్ప సంపద. మీకూ ఇది వర్తిస్తుంది. మరోసారి విజేతలకు హృదయపూర్వక శుభాకాంక్షలు. దేశాన్ని గర్వపడేలా చేశారు. జై హింద్’’ అని గావస్కర్ రాసుకొచ్చాడు.కాగా వరల్డ్‌కప్‌లో భారత్ గెలవగానే గుజరాత్‌కు చెందిన ఓ వజ్రాల వ్యాపారి.. మహిళా జట్టుకు డైమండ్ నెక్లెస్‌లు ఇస్తానని ప్రకటించాడు. మరో కార్ల కంపెనీ ఇంకా లాంచ్ చేయని వర్షన్‌ను విజేతలకు కానుకగా ఇస్తామని చెప్పింది. ఈ నేపథ్యంలో గావస్కర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.చదవండి: ‘ఆడమని బతిమిలాడినా పట్టించుకోలేదు... సెలక్టర్లు అడిగినా రాలేదు’ -
ఐసీసీ కీలక నిర్ణయం
దుబాయ్: మహిళా క్రికెట్ విషయంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) కీలక నిర్ణయం తీసుకుంది. తదుపరి మహిళల వన్డే వరల్డ్ కప్‌లో జట్ల సంఖ్యను ఎనిమిది నుంచి పదికి పెంచాలని నిర్ణయించింది. దుబాయ్‌లో జరుగుతున్న ఐసీసీ సమావేశంలో ఈ మేరకు పలు నిర్ణయాలు బోర్డు తీసుకుంది.ఇకపై ఐసీసీలోని అసోసియేట్ దేశాలకు ఇచ్చే నిధులను 10 శాతం పెంచనున్నారు. అమెరికా క్రికెట్ బోర్డుపై నిషేధం ఉన్నా... దాని ప్రభావం ఆటగాళ్లపై పడరాదని భావిస్తూ మ్యాచ్‌ల నిర్వహణకు తగిన చర్యలు తీసుకునేందుకు కూడా ఐసీసీ సిద్ధమైంది. క్రికెట్ భాగంగా ఉన్న 2028 ఒలింపిక్స్ అమెరికాలో జరగనుండటం కూడా దీనికి కారణం.మరోవైపు.. ఐసీసీ మహిళల క్రికెట్ కమిటీలో భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్(Mithali Raj)కు చోటు కల్పించారు. యాష్లీ డిసిల్వా, అమోల్ మజుందార్, చార్లెట్ ఎడ్వర్డ్స్, స్టెల్లా సియాలె ఈ కమిటీలో ఇతర సభ్యులుగా ఉన్నారు. రికార్డు రేటింగ్స్... ముంబై: మహిళల వన్డే వరల్డ్ కప్ టోర్నీ వీక్షణపరంగా డిజిటల్ వేదికపై సరికొత్త రికార్డు సృష్టించింది. ఏకంగా 446 మిలియన్ల మంది వీక్షకులు ఈ టోర్నీని జియో హాట్‌స్టార్‌లో చూసినట్లు ప్రసారకర్తలు వెల్లడించారు. ఇది మహిళల క్రికెట్లో అత్యధికమని పేర్కొంది.మరోవైపు భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన ఫైనల్ (IND vs SA) మ్యాచ్ కూడా కొత్త రికార్డు నమోదు చేసింది. ఫైనల్‌ను 185 మిలియన్ల మంది డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై వీక్షించారని... 2024 టీ20 పురుషుల వరల్డ్ కప్‌లో భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన ఫైనల్‌తో ఇది సమానమని నిర్వాహకులు ప్రకటించడం విశేషం. -
జై షా జోక్యం.. నాకూ వరల్డ్‌కప్ మెడల్: ప్రతికా రావల్
భారత్ ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 ట్రోఫీ గెలవడంలో ప్రతికా రావల్ (Pratika Rawal)ది కూడా కీలక పాత్ర. టీమిండియా ఓపెనర్‌గా వచ్చిన నాటి నుంచి సత్తా చాటుతున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ప్రపంచకప్ టోర్నీలోనూ అదరగొట్టింది.ఆరు ఇన్నింగ్స్‌లో కలిపి 308 పరుగులు రాబట్టిన ప్రతికా ఖాతాలో ఓ శతకం.. ఓ హాఫ్ సెంచరీ ఉన్నాయి. అయితే, దురదృష్టవశాత్తూ ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్‌కు ముందు ప్రతికా గాయపడింది. లీగ్ దశలో చివరగా బంగ్లాదేశ్‌తో నామమాత్రపు మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఆమె చీలమండకు గాయమైంది.ప్రతికా స్థానంలో ‘లేడీ సెహ్వాగ్’ ఈ క్రమంలో నొప్పితో విలవిల్లాడుతూ మైదానం వీడిన ప్రతికా రావల్.. ఆ తర్వాతి మ్యాచ్‌లకు దూరమైంది. ఆమె స్థానంలో ‘లేడీ సెహ్వాగ్’ షఫాలీ వర్మ (Shafali Verma) జట్టులోకి వచ్చింది. ఆసీస్‌తో సెమీస్‌లో తేలిపోయినా.. సౌతాఫ్రికాతో ఫైనల్లో (IND vs SA) షఫాలీ సత్తా చాటింది. ఈ ఓపెనింగ్ బ్యాటర్ ఏకంగా 87 పరుగులు రాబట్టడంతో పాటు రెండు వికెట్లు తీసి సత్తా చాటింది.ప్రతికా స్థానంలో తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న షఫాలీ.. భారత్ విజయంలో కీలక పాత్ర పోషించి మెడల్ గెలుచుకుంది. మరోవైపు.. గాయం వల్ల జట్టుకు దూరమైన ప్రతికాకు నిబంధనల కారణంగా వరల్డ్‌కప్ మెడల్ దక్కలేదు.వీల్‌చైర్‌లోనే మైదానానికి వచ్చి..అయితే, భారత్ సౌతాఫ్రికాను ఓడించి విజేతగా నిలిచిన తర్వాత ప్రతికా వీల్‌చైర్‌లోనే మైదానానికి వచ్చి.. సహచరులతో కలిసి సంబరాలు జరుపుకొంది. అయితే, అప్పుడు ఆమెకు మెడల్ దక్కలేదు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో వన్డే వరల్డ్‌కప్ విజేత జట్టు సమావేశమైన సందర్భంగా ప్రతికా మెడలో పతకం కనిపించింది.అదే సమయంలో అమన్‌జోత్ కౌర్ మెడల్ లేకుండా కనిపించగా.. ఆమే ప్రతికాకు తన మెడల్ ఇచ్చిందని అంతా భావించారు. ఈ విషయంపై ప్రతికా తాజాగా స్పందించింది. జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది.జై షా జోక్యం.. నాకూ వరల్డ్‌కప్ మెడల్‘‘ఆరోజు అమన్‌జోత్ మెడల్ ఎందుకు వేసుకోలేదు నాకు తెలియదు. బహుశా తను మర్చిపోయి ఉంటుంది. అయితే, సహాయక సిబ్బంది ఒకరు తన మెడల్‌ను నాకు ఇచ్చారు. ఇంకో విషయం ఏమిటంటే.. త్వరలోనే నా మెడల్ నా దగ్గరకు చేరనుంది.ఈ విషయం గురించి జై షా (ఐసీసీ చైర్మన్) మా మేనేజర్‌కు సందేశం అందించారు. ప్రతికాకు పతకం వచ్చేలా తాను ఏర్పాట్లు చేస్తున్నానని మెసేజ్ చేశారు. కాబట్టి నాకు త్వరలోనే మెడల్ లభిస్తుంది. ఏదేమైనా సపోర్టు స్టాఫ్ నాకు మెడల్ ఇవ్వగానే.. ఏడ్చేశా.సాధారణంగా నేను ఎమోషనల్ అవ్వను. కానీ ఈసారి భావోద్వేగాన్ని నియంత్రించుకోలేకపోయాను. ఐసీసీ నాకు మెడల్ పంపగలదా? అని జై షా అక్కడి వారిని అడిగారు. అయితే, పతకం నా చేతికి రావడానికి ఇంకాస్త సమయం పడుతుంది. కానీ ప్రధాని దగ్గరకు వెళ్లినపుడు పతకం లేదనే బెంగ లేకుండా సహాయక సిబ్బంది తన మెడల్‌ను నాకు ఇచ్చారు’’ అని ప్రతికా రావల్ చెప్పుకొచ్చింది.ఐసీసీ నిబంధనల ప్రకారంకాగా ఐసీసీ నిబంధనల ప్రకారం ఫైనల్‌కు ఎంపికైన జట్టులోని పదిహేను మంది ఆటగాళ్లకు మాత్రమే (గెలిచిన జట్టు) మెడల్స్ ఇస్తారు. గాయం వల్ల ప్రతికా జట్టులో స్థానం కోల్పోయినందున ముందుగా ఆమెకు మెడల్ దక్కలేదు. అయితే, ఐసీసీ చైర్మన్ జై షా నేరుగా జోక్యం చేసుకుని పతకం వచ్చేలా చేయడం చర్చకు దారితీసింది. చదవండి: అందుకే వరల్డ్‌కప్ విన్నర్‌ని వదిలేశాం: అభిషేక్ నాయర్ -
వరల్డ్‌కప్ విజేత అరుంధతి రెడ్డికి మంత్రి వాకిటి శ్రీహరి సన్మానం
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 గెలిచిన భారత జట్టులో సభ్యురాలైన అరుంధతి రెడ్డి (Arundhati Reddy) గురువారం.. స్వస్థలం హైదరాబాద్‌కు చేరుకుంది. ఈ క్రమంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆమెకు ఘన స్వాగతం లభించింది. తాజాగా.. అరుంధతి రెడ్డి తెలంగాణ క్రీడా శాఖా మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari)ని మర్యాద పూర్వకంగా కలిసింది.ఈ సందర్భంగా మంత్రి శ్రీహరి.. వరల్డ్‌కప్ విజేత అరుంధతి రెడ్డిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఎండి డాక్టర్ సోనీ బాలాదేవి, కోచ్ ఆకాశ్, అరుంధతి తల్లి భాగ్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా సొంతగడ్డపై జరిగిన వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో భారత జట్టు సౌతాఫ్రికాను ఓడించి జగజ్జేతగా నిలిచిన విషయం తెలిసిందే.నలభై ఏడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మొట్టమొదటిసారి భారత మహిళా జట్టు ప్రపంచకప్‌ను ముద్దాడింది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా దశాబ్దాల కలను నెరవేరుస్తూ నవీ ముంబై వేదికగా ట్రోఫీని అందుకుంది. ఇక ఈ జట్టులో హైదరాబాదీ అరుంధతి రెడ్డితో పాటు.. కడప బిడ్డ శ్రీ చరణి కూడా భాగస్వాములుగా ఉన్నారు. -
Hanuman Tattoo: ప్రధాని మోదీ ప్రశ్నకు దీప్తి శర్మ జవాబు ఇదే
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పట్ల భారత స్టార్ క్రికెటర్, వన్డే వరల్డ్‌కప్ విజేత దీప్తి శర్మ (Deepti Sharma) అభిమానం చాటుకుంది. ఆయనను నేరుగా కలవాలని ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్నానని.. ఇప్పటికి తన కల నెరవేరిందని హర్షం వ్యక్తం చేసింది. కాగా ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్-2025 (ICC Women's ODI World Cup)లో విజేతగా నిలిచిన భారత జట్టు బుధవారం ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిసింది.సరదాగా ముచ్చటించిన మోదీఈ సందర్భంగా.. విజయవంతమైన ఈ ప్రపంచకప్ ప్రయాణంలో ఎదురైన సవాళ్లను అధిగమించి తొలిసారి విశ్వవిజేతగా నిలిచిన హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలో జట్టును మోదీ అభినందించారు. ప్రధాని కేవలం ఓ ఫొటో, రెండు ముక్కల ప్రశంసకే పరిమితం కాకుండా ప్లేయర్లందరితో కలిసి కూర్చుని సరదాగా ముచ్చటించారు.ఈ క్రమంలో 2017లో ఫైనల్లో ఓడినపుడు ఉత్త చేతులతో మోదీని కలిసిన తాము ఇప్పుడు ప్రపంచకప్ ట్రోఫీతో కలవడం చాలా సంతోషాన్నిచ్చిందని కెప్టెన్ హర్మన్‌ప్రీత్ చెప్పుకొచ్చింది. మోదీ అప్పుడు చెప్పిన మాటలు ఈ సారి కప్ గెలిచేందుకు ఎంతగానో దోహదపడ్డాయని వైస్ కెప్టెన్ స్మృతి మంధాన చెప్పింది.ఇక ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచిన దీప్తి శర్మ మాట్లాడుతూ మరోసారి ప్రధానిని కలిసే అవకాశం కోసం ఎంతగానో ఎదురు చూశామని తాజా కప్‌తో కలుసుకోవడం మరింత తృప్తినిచ్చిందని పేర్కొంది. ఈ సందర్భంగా దీప్తి ఇన్‌స్ట్రాగామ్ బయోలో ఉన్న ‘జై శ్రీరామ్’, ఆమె భుజంపై ఉన్న హనుమాన్ టాటూ విశేషాలను మోదీ అడిగితెలుసుకున్నారు. తన మానసిక, శారీరక బలానికి హనుమాన్ టాటూ ఉత్ప్రేరకమని దీప్తి చెప్పింది.‘‘మిమ్మల్ని కలవాలని ఎన్నాళ్లుగానో వేచి చూస్తున్నా. ఈరోజు నేను సంతోషంగా ఉన్నాను. 2017లో మీరు మాతో ఓ మాట చెప్పారు. అవరోధాలను అధిగమించి సవాళ్లను సమర్థవంతంగా పూర్తి చేసినవాళ్లే అసలైన ఆటగాళ్లు అని మీరన్నారు.లార్డ్ హనుమాన్ టాటూ మీకెలా ఉపయోగపడుతుంది?కఠినంగా శ్రమిస్తే తప్పక ఫలితం వస్తుందని చెప్పారు. మీ మాటలు, సలహాలు మాలో స్పూర్తిని నింపాయి’’ అని దీప్తి శర్మ ప్రధాని మోదీతో పేర్కొంది. ఈ క్రమంలో ఆయన.. లార్డ్ హనుమాన్ టాటూ మీకెలా ఉపయోగపడుతుంది? అని దీప్తిని అడుగగా.. ‘‘నా కంటే నేను ఆయన (హనుమాన్)నే ఎక్కువగా నమ్ముతాను. నా ఆట మెరుగుపడటానికి ఆయన మీదున్న నా నమ్మకం, సానుకూల దృక్పథమే కారణం’’ అని దీప్తి శర్మ బదులిచ్చింది.కాగా వరల్డ్‌కప్-2025లో భాగంగా సౌతాఫ్రికాతో ఫైనల్లో దీప్తి శర్మ 58 పరుగులు చేయడంతో పాటు.. ఐదు వికెట్లు తీసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించింది. టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబరిచి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచింది.‘ఫిట్ ఇండియా’ కార్యక్రమంలోఇదిలా ఉంటే.. సౌతాఫ్రికాతో ఫైనల్లో అమన్‌జోత్ క్యాచ్, క్రాంతి గౌడ్ బౌలింగ్ ప్రదర్శనను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ‘ఫిట్ ఇండియా’ కార్యక్రమంలో విశ్వవిజేతలు భాగం కావాలని మోదీ క్రికెటర్లను ఉద్దేశించి అన్నారు. శారీరక ఫిట్నెస్ ఆవశ్యకతను తెలియజేసే కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. వీలైనపుడు విద్యార్థులను స్ఫూర్తిదాయక ప్రసంగాలతో ఉత్సాహపరచాలని మోదీ సూచించారు. చదవండి: ‘సాకులు చెబుతారు... కానీ ఏదో ఒకరోజు సెలక్ట్ చేయక తప్పదు’Player of the Tournament, Deepti Sharma, recalled that in 2017, Prime Minister @narendramodi had advised her to learn from failure and keep working hard. She shared that she had been eagerly looking forward to this meeting. Deepti also explained the significance of the ‘Hanuman’… pic.twitter.com/aUXki9yZz6— DD News (@DDNewslive) November 6, 2025 -
ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు (ఫొటోలు)
-
అమ్మాయిల విజయాన్ని మాతో పోల్చకండి: టీమిండియా దిగ్గజం
విశ్వ విజేతగా అవతరించిన భారత మహిళా క్రికెట్ జట్టుపై ప్రశంసల వర్షం కొనసాగుతోంది. నాలుగున్నర దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించి ట్రోఫీని ముద్దాడిన హర్మన్ సేన విజయాన్ని భారతావని ఉత్సవంగా జరుపుకొంది. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్ (ICC Women's World Cup) టోర్నమెంట్లో.. 2005, 2017లో రన్నరప్‌తోనే సరిపెట్టుకున్న భారత్.. ఈసారి మాత్రం ఆఖరి గండాన్ని అధిగమించింది.గావస్కర్ వ్యాఖ్యలు వైరల్నవీ ముంబై వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో సౌతాఫ్రికా (Ind Beat SA)ను 52 పరుగుల తేడాతో ఓడించి.. జగజ్జేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో భారత మహిళా జట్టుపై ప్రశంసలు కురిపిస్తూనే.. టీమిండియా దిగ్గజం, 1983 వరల్డ్‌కప్ విజేత సునిల్ గావస్కర్ (Sunil Gavaskar) చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.తొలిసారి గ్రూప్ దశ దాటడమే కాకుండాస్పోర్ట్స్స్టార్కి రాసిన కాలమ్‌లో.. ‘‘కొంతమంది భారత పురుషుల క్రికెట్ జట్టు వన్డే వరల్డ్‌కప్- 1983 విజయాన్ని.. తాజాగా అమ్మాయిలు చాంపియన్‌గా నిలవడంతో పోలుస్తున్నారు. అయితే, 1983 ఎడిషన్ కంటే ముందు మెన్స్ టీమ్ ఒక్కసారి కూడా గ్రూప్ దశను దాటలేదు.నాకౌట్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో మాకు అప్పుడు అస్సలు తెలియవు. అలాంటిది మేము తొలిసారి గ్రూప్ దశ దాటడమే కాకుండా విజేతలుగా నిలిచాము.అందుకే అమ్మాయిల విజయాన్ని మాతో పోల్చకండిఅయితే మన మహిళా జట్టు ఇప్పటికే రెండుసార్లు ఫైనల్ ఆడింది. తర్వాత ఇలా అద్భుతమైన విజయంతో విజేతగా నిలిచింది’’ అని గావస్కర్.. తమ విజయాన్ని అమ్మాయిలతో పోల్చవద్దని స్పష్టం చేశాడు.అదే విధంగా.. ‘‘83లో టీమిండియా సాధించిన విజయం భారత క్రికెట్ రూపురేఖలు మార్చింది. తల్లిదండ్రులు తమ పిల్లల్ని క్రికెట్ వైపు నడిపించేలా చేసింది. ఇక ఐపీఎల్ వచ్చిన తర్వాత భారత క్రికెట్ మరో స్థాయికి చేరుకుంది.ఇప్పుడు భారత జట్టులో కేవలం మెట్రో నగరాల నుంచి వచ్చినవారే కాకుండా.. దేశవ్యాప్తంగా మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారు’’ అని గావస్కర్ రాసుకొచ్చాడు. కాగా నవీ ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా సౌతాఫ్రికాతో ఫైనల్లో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది.సమిష్టి కృషితోఓపెనర్లు స్మృతి మంధాన (45), షఫాలి వర్మ (87) గట్టి పునాది వేయగా.. ఆల్‌రౌండర్ దీప్తి శర్మ (58), వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ (34) ఇన్నింగ్స్ నిర్మించారు. జెమీమా రోడ్రిగ్స్ (24), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (20) స్థాయికి తగ్గట్లు ఆడలేకపోయారు. అయితే, మంధాన, షఫాలి దీప్తి, రిచా రాణించడంతో భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 298 పరుగులు స్కోరు చేసింది.అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికాకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. దీప్తి శర్మ ఐదు వికెట్లతో చెలరేగి ప్రొటిస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించగా.. షఫాలి వర్మ రెండు, నల్లపురెడ్డి శ్రీ చరణి ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. సఫారీ జట్టులో ఓపెనర్, కెప్టెన్ లారా వొల్వర్ట్ (101) శతకంతో పోరాడగా.. మిగతా వారి నుంచి ఆమెకు సహకారం అందలేదు.మరో ఓపెనర్ తజ్మిన్ బ్రిట్స్ (23), సూనే లూస్ (25) అనిరె డెర్క్సెన (35) ఓ మోస్తరుగా రాణించారు. అయితే, భారత బౌలర్ల విజృంభణ ముందు నిలవలేకపోయిన సౌతాఫ్రికా 45.3 ఓవర్లలో కేవలం 246 పరుగులే చేసి ఆలౌట్ అయింది. ఫలితంగా 52 పరుగుల తేడాతో గెలిచిన భారత్.. సరికొత్త చాంపియన్‌గా అవతరించింది.చదవండి: అందుకే అర్ష్‌దీప్‌ను తప్పించాం.. అతడికి అన్నీ తెలుసు: టీమిండియా కోచ్ -
కడప నుంచి వరల్డ్ కప్ దాకా.. శ్రీ చరణి కీలక పాత్ర (ఫొటోలు)
-
మహిళల వరల్డ్‌కప్-2025 విజేతగా భారత్
-
WC 2025: కళ్లు చెదిరే ప్రైజ్‌మనీ!.. బీసీసీఐ బంపరాఫర్
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్-2025 టోర్నమెంట్ తుది అంకానికి చేరుకుంది. నవీ ముంబై వేదికగా భారత్- సౌతాఫ్రికా (IND W vs SA W) మధ్య ఆదివారం నాటి ఫైనల్‌తో ఈ టోర్నీలో కొత్త చాంపియన్ అవతరించనుంది.ఈ ఈవెంట్లో ఇప్పటికే రెండుసార్లు రన్నరప్‌గా నిలిచిన టీమిండియా.. తొలిసారి ఫైనలిస్టు అయిన సౌతాఫ్రికా... ప్రస్తుత బలాబలాల దృష్ట్యా టైటిల్ పోరు రసవత్తరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. కొత్త చాంపియన్ రాకతో పాటు.. ఈసారి వన్డే వరల్డ్‌కప్ టోర్నీకి మరో ప్రత్యేకత కూడా ఉంది.కళ్లు చెదిరే ప్రైజ్మనీవిజేతగా నిలిచిన జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) కళ్లు చెదిరే ప్రైజ్‌మనీ ప్రకటించింది. పురుషుల, మహిళల క్రికెట్లో రికార్డు స్థాయిలో చాంపియన్‌కు ఏకంగా 4.48 మిలియన్ యూఎస్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 39.78 కోట్లు) ఇవ్వనుంది.123 కోట్ల రూపాయలుఅదే విధంగా.. రన్నరప్ జట్టుకు.. విజేతకు అందించిన నగదులో సగం అంటే 2.24 మిలియన్ యూఎస్ డాలర్లు (దాదాపు రూ. 19 కోట్లకు పైగా) ప్రైజ్‌మనీగా ప్రకటించింది. భారత్- శ్రీలంక సంయుక్త ఆతిథ్య దేశాలుగా ఉన్న ఈ టోర్నీ ప్రైజ్‌మనీల మొత్తానికి ఐసీసీ ఏకంగా 13.88 మిలియన్ యూఎస్ డాలర్లు అంటే... దాదాపు 123 కోట్ల రూపాయలు కేటాయించింది.239 శాతం పెంచారువరల్డ్కప్ టోర్నీ చరిత్రలోనే ఇది అత్యధికం. వన్డే వరల్డ్‌కప్-2022 ఎడిషన్‌తో పోలిస్తే ఇది ఏకంగా 297 శాతం ఎక్కువ కావడం విశేషం. అంతేకాదు.. నాటి విజేత ఆస్ట్రేలియాకు ఇచ్చిన ప్రైజ్‌మనీ కంటే తాజా సీజన్ విన్నర్‌కు ఇచ్చే ప్రైజ్‌మనీని ఏకంగా 239 శాతం పెంచడం గమనార్హం.రూ. 42 కోట్లకుఇక ఈ టోర్నీలో భారత్ ఇప్పటికే దాదాపు 3,50,000 యూఎస్ డాలర్ల ప్రైజ్‌మనీ (సుమారుగా 3.1 కోట్ల రూపాయలు) సొంతం చేసుకుంది. టోర్నీలో పాల్గొన్నందుకు, గ్రూప్ దశలో మూడు విజయాలకు గానూ ఈ మొత్తం టీమిండియాకు లభించింది. అన్నీ సజావుగా సాగి భారత్ చాంపియన్‌గా అవతరిస్తే మొత్తం ప్రైజ్‌మనీ రూ. 42 కోట్లకు చేరుకుంటుంది.మరోవైపు.. సౌతాఫ్రికా ఇప్పటికే నాలుగు లక్షల యూఎస్ డాలర్లకుపైగా గెలుచుకుంది. గ్రూప్ దశలో ఐదు విజయాలు సాధించి ఈ మొత్తం సొంతం చేసుకుంది. ఏదేమైనా క్రికెట్ ప్రపంచంలో పురుష జట్ల ఆధిపత్యం కొనసాగుతున్న వేళ.. మహిళా టోర్నీలో రికార్డు స్థాయి ప్రైజ్‌మనీ అందించడం హర్షించదగ్గ పరిణామం. మహిళా క్రికెట్‌కు ఆదరణ పెంచడంతో పాటు.. యువ ఆటగాళ్లను ఆకర్షించడానికి ఇలాంటి చర్యలు తోడ్పడతాయి.బీసీసీఐ బంపరాఫర్!ఇదిలా ఉంటే.. ఒకవేళ హర్మన్ సేన గనుక వన్డే వరల్డ్‌కప్ గెలిస్తే.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మహిళా క్రికెటర్లుకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోందని సమాచారం. పురుష క్రికెటర్లతో పాటు మహిళా ప్లేయర్లకు కూడా సమవేతనం చెల్లించాలనే యోచనలో ఉన్నట్లు బీసీసీఐ వర్గాలు పీటీఐతో పేర్కొన్నాయి. మరోవైపు.. హర్మన్‌సేన ట్రోఫీ గెలిస్తే బీసీసీఐ రూ. 125 కోట్ల నజరానా ఇవ్వనుందనే ప్రచారం జరుగుతోంది. కాగా నవీ ముంబై వేదికగా ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు భారత్- సౌతాఫ్రికా మధ్య ఫైనల్‌కు తెరలేస్తుంది.చదవండి: IND vs AUS 3rd T20: సమం చేసేందుకు సమరం -
ఫైనల్లో ఓడిపోతే.. ఎలా ఉంటుందో తెలుసు: భారత కెప్టెన్
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్ టోర్నమెంట్లో ఇప్పటికే రెండుసార్లు ఫైనల్ చేరింది భారత్. 2005, 2017 ఎడిషన్లలో టైటిల్ పోరుకు అర్హత సాధించినా రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది. ఈసారి సొంతగడ్డపై ఈ మెగా ఈవెంట్లో ముచ్చటగా మూడోసారి ఫైనల్‌కు చేరుకున్న భారత జట్టు.. కలల ‘కప్పు’ను ముద్దాడాలని పట్టుదలగా ఉంది.నవీ ముంబై వేదికగా ఆదివారం సౌతాఫ్రికా (ICC World Cup 2025 Ind W vs SA W)ను చిత్తు చేసి విశ్వవిజేతగా అవతరించాలని హర్మన్ సేన కంకణం కట్టుకుంది. భారత్‌కు ఇప్పటికే రెండుసార్లు ఫైనల్ ఆడిన అనుభవం ఉండగా.. సౌతాఫ్రికా టైటిల్ పోరుకు అర్హత సాధించడం ఇదే తొలిసారి. అయితే, ప్రొటిస్ జట్టులో మరిజానే కాప్, కెప్టెన్ లారా వొల్వర్ట్లను నిలువరించగలిగితే భారత్‌కు తిరుగు ఉండదు.ఫైనల్లో ఓడిపోతే.. ఎలా ఉంటుందో తెలుసుఈ నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్‌కు ముందు భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘వరల్డ్‌కప్ ఫైనల్లో ఓడిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో మాకు బాగా తెలుసు. ఈసారి ఆ భావనను సంతోషకరంగా మార్చుకోవాలని పట్టుదలగా ఉన్నాము.అన్నింటికంటే అదే ముఖ్యంటైటిల్ గెలిచి సత్తా చాటాలని భావిస్తున్నాం. ఇది మాకెంతో ప్రత్యేకమైన రోజు. కష్టపడి, కఠిన సవాళ్లు అధిగమించి ఇక్కడిదాకా చేరుకున్నాం. ఒత్తిడిని దరిచేరనీయకుండా ఆడటం అన్నింటికంటే ముఖ్యం’’ అని హర్మన్‌ప్రీత్ కౌర్ పేర్కొంది.ఇక పటిష్ట ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్ గెలిచిన నేపథ్యంలో టీమిండియాతో పాటు దేశమంతా సంబరాలు అంబరాన్నంటిన విషయం తెలిసిందే. ఆటగాళ్లతో పాటు అభిమానులు కూడా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ విషయంపై హర్మన్‌ప్రీత్ స్పందిస్తూ..గెలిచినా.. ఓడినా ఏడ్చేస్తా‘‘నేను భావోద్వేగాలను నియంత్రించుకోలేను. చాలా ఎమోషనల్‌గా ఉంటా. మ్యాచ్ గెలవగానే ఏడ్చేశా. ఎంతసేపు ఏడ్చానో గుర్తులేదు. ఓడిన తర్వాత కాదు.. గెలిచిన తర్వాత కూడా ఏడుపు వస్తుంది.టీవీల్లో మీరంతా చూసే ఉంటారు. అయితే, మా వాళ్లకు ఇది అలవాటే. డ్రెసింగ్‌రూమ్‌లో నేను ఏడ్వటం వాళ్లు చాలాసార్లు చూశారు. చిన్న చిన్న విషయాలకు కూడా నేను ఉద్వేగానికి లోనవుతా. ముఖ్యంగా జట్టు అనుకున్న ఫలితాన్ని రాబట్టినపుడు అందరికంటే ముందే నా కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి’’ అని హర్మన్‌ప్రీత్ చెప్పుకొచ్చింది. కాగా ఆదివారం నాటి పోరులో భారత్- సౌతాఫ్రికాల జట్లలో గెలుపు ఎవరిదైనా.. ఈసారి కొత్త చాంపియన్ అవతరిస్తుంది.చదవండి: WC 2025 Final IND vs SA: ఇరుజట్ల బలాలు ఇవే -
IND vs SA: ఫైనల్ మ్యాచ్ అంపైర్లు వీరే
మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 ఫైనల్ సందర్భంగా కొత్త చాంపియన్ అవతరించనుంది. నవీ ముంబై వేదికగా జరిగే టైటిల్ పోరులో గెలవాలని భారత్ పట్టుదలగా ఉండగా.. తమకు వచ్చిన సువర్ణావకాశాన్ని చేజారనీయొద్దని సౌతాఫ్రికా భావిస్తోంది.కాగా సెప్టెంబరు 30న మొదలైన మహిళల వన్డే వరల్డ్‌కప్ టోర్నీ తుది అంకానికి చేరుకుంది. తొలి సెమీ ఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించి సౌతాఫ్రికా.. రెండో సెమీస్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను మట్టికరిపించి ఆతిథ్య భారత్ ఫైనల్‌కు చేరాయి.ఎవరు గెలిచినా చరిత్రేనవీ ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా ఆదివారం (నవంబరు 2) నాటి టైటిల్ పోరులో భారత్- సౌతాఫ్రికా అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ నేపథ్యంలో టైటిల్ సమరంలో న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించే అధికారుల పేర్లను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఖరారు చేసింది.ఫైనల్ మ్యాచ్ అంపైర్లు వీరేఈ మెగా ఈవెంట్ ఫైనల్ మ్యాచ్‌కు ఎలోసీ షేరిడాన్, జాక్వెలిన్ విలియమ్స్ ఆన్ ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరిస్తారని ఐసీసీ తెలిపింది. అదే విధంగా.. సూ రెడ్‌ఫెర్న్ థర్డ్ అంపైర్‌గా.. నిమాలి పెరీరా ఫోర్త్ అంపైర్‌గా పనిచేయనుండగా.. మిచెల్లి పెరీరా మ్యాచ్ రిఫరీగా ఉంటారని ఐసీసీ తెలిపింది.వర్షం పడే అవకాశంకాగా ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు భారత్- సౌతాఫ్రికా మధ్య ఫైనల్‌కు తెరలేస్తుంది. అయితే, ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. మ్యాచ్ జరిగే సమయంలో వర్షం కురిసేందుకు 30- 60 శాతం అవకాశం ఉన్నట్లు ఆక్యూవెదర్ రిపోర్టు తెలిపింది.ఒకవేళ వర్షం కారణంగా ఆదివారం కనీసం 20 ఓవర్ల ఆట సాగకపోతే.. రిజర్వ్ డేన మ్యాచ్ కొనసాగిస్తారు. అంటే.. ఆదివారం ఎక్కడైతే మ్యాచ్ ఆగిపోయిందో అక్కడి నుంచి ఆటను కొనసాగిస్తారు. ఇక రిజర్వ్ డే కూడా వర్షం వల్ల ఆట సాగకపోతే ఇరుజట్లను ఉమ్మడి విజేతగా ప్రకటిస్తారు.వన్డే వరల్డ్‌కప్-2025 ఫైనల్: భారత్- సౌతాఫ్రికా జట్లుభారత్హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, రేణుకా సింగ్ ఠాకూర్, దీప్తి శర్మ, స్నేహ్ రాణా, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రాధా యాదవ్, అమన్‌జోత్ కౌర్, అరుంధతి రెడ్డి, ఉమా ఛెత్రి, షఫాలీ వర్మ.సౌతాఫ్రికాలారా వొల్వర్ట్ (కెప్టెన్), అయబొంగా ఖాకా, క్లోయీ ట్రైయాన్, నదినె డి క్లెర్క్, మరిజానే కాప్, తజ్మిన్ బ్రిట్స్, సినాలో జఫ్టా, నొన్‌కులులెకో మలాబా, అనెరి డెర్క్సెన్, అనెకె బాష్, మసబట క్లాస్, సునే లూస్, కరాబో మెసో, టుమి సెఖుహునే, నొండమిసో షాంగేస్. చదవండి: PKL 12: విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే?.. అవార్డుల జాబితా ఇదే -
ఆమె ఒక అద్భుతం.. జెమీమా మాటలు ఆశ్చర్యపరిచాయి: భారత కెప్టెన్
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025లో భారత్ ఫైనల్లో అడుగుపెట్టింది. నవీ ముంబైలో జరిగిన రెండో సెమీ ఫైనల్లో పటిష్ట ఆస్ట్రేలియా (IND vs AUS)పై చారిత్రాత్మక విజయంతో టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఈ నేపథ్యంలో భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) స్పందిస్తూ.. జట్టు ప్రదర్శన పట్ల హర్షం వ్యక్తం చేసింది.ఇదొక అద్బుతమైన భావనఆసీస్పై విజయానంతరం మాట్లాడుతూ.. ‘‘చాలా చాలా గర్వంగా ఉంది. ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేకపోతున్నా. చాలా ఏళ్లుగా మేము ఎంతో కష్టపడి ఇక్కడి దాకా చేరుకున్నాం. ఇదొక అద్బుతమైన భావన.ఈ టోర్నమెంట్ ఆరంభంలోనే మేము కొన్ని తప్పులు చేశాం. వాటిని సరిదిద్దుకుని ఈరోజు గెలిచి నిలిచాం. ఆఖరి వరకు మ్యాచ్ తీసుకురాకుండా.. ఇంకాస్త ముందుగానే మ్యాచ్ ముగిస్తే బాగుండనిపించింది. కానీ అలా తొందరపాటు చర్యలకు పాల్పడితే భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చేది. ప్రణాళికలను పక్కాగా అమలు చేసి ఫలితాన్ని మాకు అనుకూలంగా మార్చుకున్నాం’’ అని హర్మన్‌ప్రీత్ కౌర్ సంతృప్తి వ్యక్తం చేసింది.జెమీమా మాటలు ఆశ్చర్యపరిచాయిఇక సెంచరీ హీరో జెమీమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues) గురించి ప్రస్తావన రాగా.. ‘‘జట్టు కోసం తాపత్రయపడే ప్లేయర్లలో జెమీమా ముందుంటుంది. బాధ్యత తీసుకోవడానికి ఏమాత్రం వెనుకాడదు. ఈరోజు తను అత్యంత ప్రత్యేకమైన నాక్ ఆడింది.పిచ్‌పై మేమిద్దరం ఆటను ఆస్వాదించాము. కలిసి బ్యాటింగ్ చేస్తున్నపుడల్లా ఒకరికొకరం మద్దతుగా ఉంటూ.. సమీకరణల గురించి మాట్లాడుకుంటూ ఉంటాము. ఈరోజు కూడా జెమీమా అన్నీ లెక్కలు వేసుకుంటూ నన్ను అప్రమత్తం చేస్తూనే ఉంది.‘ఐదు పరుగులు వచ్చాయి.. ఇంకో రెండే బంతులు మిగిలి ఉన్నాయి’ అంటూ ఇలా ప్రతీది కచ్చితంగా గుర్తుపెట్టుకుని నాతో చెబుతూ ఉంది. ఆట, జట్టు పట్ల తనకు ఉన్న అంకిత భావానికి ఇది నిదర్శనం.తనతో కలిసి బ్యాటింగ్ చేయడాన్ని ఆస్వాదిస్తా. జెమీమా ఆలోచనా తీరు, అద్భుత ఆట తీరును చూసి నేను ఆశ్చర్యపోయా. నన్ను కూడా ముందుకు నడిపించాలనే సంకల్పంతో తను ఇన్పుట్స్ ఇచ్చిన తీరు అద్భుతం. ఈ విజయంలో క్రెడిట్ తనకే ఇచ్చి తీరాలి’’ అని హర్మన్‌ప్రీత్ కౌర్ ప్రశంసల జల్లు కురిపించింది.కీలక పోరులో గెలిచి ఫైనల్కుకాగా నవీ ముంబైలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. 49.5 ఓవర్లలో 338 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారీ లక్ష్య ఛేదనలో ఆరంభంలో తడబడినా... భారత్ 48.3 ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు కోల్పోయి పని పూర్తి చేసింది. వన్‌డౌన్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ అజేయ శతకం (127)తో సత్తా చాటగా.. హర్మన్ కెప్టెన్ ఇన్నింగ్స్ (88 బంతుల్లో 89) ఆడింది. వీరి ద్దరు కలిసి 167 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఫైనల్లో టీమిండియా నవీ ముంబై వేదికగా ఆదివారం దక్షిణాఫ్రికాను ఢీకొట్టనుంది.చదవండి: రోజూ ఏడుస్తూనే ఉన్నా.. నా సెంచరీకి ప్రాధాన్యం లేదు: జెమీమాOh, captain, our captain! 🥹🫡🇮🇳#HarmanpreetKaur's heartfelt speech post the semi-finals triumph against Australia! 👏🏻WATCH CWC 25 FINAL 👉 #SAvIND | SUN, NOV 2, 2 PM on Star Sports Network & JioHotstar pic.twitter.com/TDgCwiYmk8— Star Sports (@StarSportsIndia) October 30, 2025 -
ఏడ్చేసిన హర్మన్‌ప్రీత్.. అంబరాన్నంటిన సంబరాలు.. వీడియో
ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్.. అమన్‌జోత్ కౌర్ (Amanjot Kaur) ఫోర్ బాది భారత్ విజయాన్ని ఖరారు చేయగానే సంబరాలు అంబరాన్నంటాయి.. పటిష్ట ఆస్ట్రేలియాను ఓడించి భారత్ వన్డే వరల్డ్‌కప్-2025 (WC 2025) ఫైనల్‌కు చేరగానే.. నవీ ముంబై జయహో భారత్ నినాదాలతో హోరెత్తిపోయింది.. జెమీమా రోడ్రిగ్స్ భావోద్వేగంఅమన్జోత్ సంతోషంలో మునిగిపోతే.. సెంచరీ హీరో జెమీమా రోడ్రిగ్స్ భావోద్వేగంతో నేలతల్లిని ముద్దాడింది.. ప్రేక్షకులకు అభివాదం చేస్తూ చేతులు జోడించి ధన్యవాదాలు తెలిపింది.. భారత ప్లేయర్లంతా మైదానంలోకి దూసుకువచ్చి జెమీమాతో కలిసి విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు.చిన్నపిల్లలా ఏడుస్తూఇక కీలక మ్యాచ్‌లో కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిసిన హర్మన్‌ప్రీత్ కౌర్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. డగౌట్లో కోచ్‌లు, ఆటగాళ్లను హత్తుకుంటూ హర్మన్ కన్నీటి పర్యంతమైంది.. భావోద్వేగాలను నియంత్రించుకోలేక చిన్నపిల్లలా ఏడుస్తూ సొంతగడ్డపై సాధించిన చారిత్రాత్మక విజయ గర్వంతో ఉప్పొంగిపోయింది.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ దృశ్యాలు చూసిన యావత్ భారతావని ఉద్వేగానికి లోనవుతూనే జయజయధ్వానాలు చేస్తోంది.. ‘న భూతో న భవిష్యతి’ అన్న చందంగా చాంపియన్ జట్టు ఆస్ట్రేలియాను ఓడించిన భారత మహిళా జట్టును అభినందనలతో ముంచెత్తుతోంది.📽️ Raw reactions after an ecstatic win 🥹The #WomenInBlue celebrate a monumental victory and a record-breaking chase in Navi Mumbai 🥳Get your #CWC25 tickets 🎟️ now: https://t.co/vGzkkgwXt4 #TeamIndia | #INDvAUS pic.twitter.com/MSV9AMX4K1— BCCI Women (@BCCIWomen) October 31, 2025ఆసీస్‌ను ఓడించిఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్‌లో భారత్ మూడోసారి ఫైనల్‌కు చేరింది. నవీ ముంబై వేదికగా తాజా ఎడిషన్ రెండో సెమీ ఫైనల్లో ఆసీస్‌ను ఓడించి ఈ ఘనత సాధించింది. డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో గురువారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.ఈ క్రమంలో కెప్టెన్, డేంజరస్ ఓపెనర్ అలీసా హేలీ (5)ను క్రాంతి గౌడ్ శుభారంభం అందించినా.. ఫోబీ లిచ్‌ఫీల్డ్, ఎలిస్ పెర్రీ భారత శిబిరానికి ఆ ఆనందాన్ని ఎక్కువ సేపు మిగల్చలేదు. లిచ్‌ఫీల్డ్ శతక్కొట్టగా (119), పెర్రీ 77 పరుగులతో రాణించింది.ఆరో నంబర్ బ్యాటర్ ఆష్లే గార్డ్నర్ (45 బంతుల్లో 63) కూడా అర్ధ శతకంతో రాణించింది. ఈ క్రమంలో 49.5 ఓవర్లలో ఆసీస్ 338 పరుగులు చేసి ఆలౌట్ అయింది. లక్ష్య ఛేదనలో టీమిండియాకు ఆదిలోనే షాకులు తగిలాయి. ఓపెనర్లు షఫాలీ వర్మ (10), స్మృతి మంధాన (24) నిరాశపరిచారు.ఈ క్రమంలో వన్‌డౌన్‌లో వచ్చిన జెమీమా అజేయ శతకం (127)తో ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడింది. ఆమెకు తోడుగా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (89) దంచికొట్టగా.. దీప్తి శర్మ (17 బంతుల్లో 24), రిచా ఘోష్ (16 బంతుల్లో 26) వేగంగా ఆడి విజయ సమీకరణాన్ని సులువు చేశారు.ఆఖర్లో అమన్‌జోత్ (8 బంతుల్లో 15) కూడా మెరుపులు మెరిపించింది. ఫలితంగా 48.3 ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు నష్టపోయి 341 పరుగులు చేసిన భారత్.. ఆసీస్‌పై ఐదు వికెట్ల తేడాతో విజయఢంకా మోగించింది. ఈ విజయంతో ఫైనల్‌కు దూసుకువెళ్లింది. దక్షిణాఫ్రికాతో ఆదివారం నాటి ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటుంది. ఇందుకు నవీ ముంబై వేదిక.చదవండి: Jemimah Rodrigues Emotional Video: రోజూ ఏడుస్తూనే ఉన్నా.. నా సెంచరీకి ప్రాధాన్యం లేదుTHIS IS WHAT IT MEANS! 💙🥹👉 3rd CWC final for India👉 Highest-ever run chase in WODIs👉 Ended Australia's 15-match winning streak in CWC#CWC25 Final 👉 #INDvSA | SUN, 2nd Nov, 2 PM! pic.twitter.com/8laT3Mq25P— Star Sports (@StarSportsIndia) October 30, 2025 -
World Cup 2025: ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టిన భారత్
సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు అద్భుతం చేసింది. తీవ్ర ఒత్తిడిలోనూ అసాధారణ ఆట తీరుతో రాణించి ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 (ICC Womens ODI World Cup 2025) ఫైనల్లో అడుగుపెట్టింది. డిఫెండింగ్ చాంపియన్, దిగ్గజ జట్టు ఆస్ట్రేలియా (Ind Beat Aus In Semis)ను ఓడించి.. ట్రోఫీని ముద్దాడేందుకు అడుగు దూరంలో నిలిచింది.జెమీమా అజేయ శతకం.. హర్మన్ అదరహోఆసీస్ విధించిన 339 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత వన్‌డౌన్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ (134 బంతుల్లో 127) అజేయ సెంచరీతో విజయంలో కీలక పాత్ర పోషించగా.. హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్ ఇన్నింగ్స్ (88 బంతుల్లో 89)తో మెరిసింది. ఆసీస్‌పై గెలుపుతో ఫైనల్ బెర్తును ఖరారు చేసుకోవడంతో పాటు భారత జట్టు పలు ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టింది.ప్రతీకారం తీర్చుకుని1. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో ఏ జట్టుకైనా ఇదే అత్యధిక లక్ష్య ఛేదన.ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది. వన్డే వరల్డ్‌కప్-2025 లీగ్ దశలో భాగంగా ఆస్ట్రేలియా భారత్ విధించిన 331 పరుగుల లక్ష్యాన్ని ఛేదించగా.. ఇపుడు అదే జట్టుపై టీమిండియా 339 పరుగుల టార్గెట్ పూర్తి చేసి బదులు తీర్చుకుంది.ప్రపంచంలోనే తొలి జట్టుగా2. వన్డే వరల్డ్‌కప్ నాకౌట్ మ్యాచ్‌లలో పురుషులు, మహిళల క్రికెట్లో 300కు పైగా స్కోరును ఛేదించడం ఇదే తొలిసారి.అత్యధిక అగ్రిగేట్3. ఈ మ్యాచ్‌లో భారత్- ఆస్ట్రేలియా సంయుక్తంగా 679 పరుగులు సాధించాయి. తద్వారా ఈ టోర్నీ చరిత్రలో అత్యధిక అగ్రిగేట్ సాధించిన జట్లుగా నిలిచాయి. గతంలో ఈ రికార్డు ఇంగ్లండ్- సౌతాఫ్రికా పేరిట ఉండేది. బ్రిస్టల్‌లో 2017లో జరిగిన వరల్డ్‌కప్‌లో ఈ జట్లు 678 పరుగులు స్కోరు చేశాయి.పిన్న వయసులోనేఇక ఈ మ్యాచ్ సందర్భంగా ఆస్ట్రేలియా ఓపెనర్ ఫోబీ లిచ్‌ఫీల్డ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల వన్డే వరల్డ్‌కప్ నాకౌట్ మ్యాచ్‌లో శతకం బాదిన అత్యంత పిన్న వయస్కురాలిగా నిలిచింది. 22 ఏళ్ల వయసులో లిచ్‌ఫీల్డ్ ఈ ఘనత సాధించింది.చదవండి: ఆసీస్‌ను భారత్ చిత్తు చేసిందిలా.. దక్షిణాఫ్రికాతో ఫైనల్THIS IS WHAT IT MEANS! 💙🥹👉 3rd CWC final for India👉 Highest-ever run chase in WODIs👉 Ended Australia's 15-match winning streak in CWC#CWC25 Final 👉 #INDvSA | SUN, 2nd Nov, 2 PM! pic.twitter.com/8laT3Mq25P— Star Sports (@StarSportsIndia) October 30, 2025 -
IND W Vs AUS W: రికార్డ్ చేజింగ్.. వరల్డ్ కప్ ఫైనల్లోకి భారత్ (చిత్రాలు)
-
భారత మహిళా జట్టుకు పలువురు ప్రముఖుల ప్రశంస
ఐసిసి మహిళల ప్రపంచ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్‌కి చేరిన భారత మహిళా జట్టుకు పలువురు ప్రముఖులు ప్రశంసించారు. భారత మహిళా జట్టు 2025 ప్రపంచకప్ సెమీఫైనల్లో అద్భుత ప్రదర్శనకు పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. జట్టు పోరాటం, ఆత్మవిశ్వాసం, కీలక విజయాలపై సెలబ్రిటీల నుంచి ప్రశంసల వర్షం కురిసింది. Fabulous victory! 🇮🇳Well done @JemiRodrigues and @ImHarmanpreet for leading from the front. Shree Charani and @Deepti_Sharma06, you kept the game alive with the ball.Keep the tricolour flying high. 💙 🇮🇳 pic.twitter.com/cUfEPwcQXn— Sachin Tendulkar (@sachin_rt) October 30, 2025There are wins that go beyond numbers on a scoreboard. This was one of them.Under pressure, with the world watching @ImHarmanpreet played with the calm and conviction of a true leader while @JemiRodrigues brought pure focus and intent to play an innings of a lifetime! This… pic.twitter.com/CdAwK07sCT— Yuvraj Singh (@YUVSTRONG12) October 30, 2025Australia soch rahi thi ek aur semi-final hai, aaram se jeeto aur pahuncho Final- hamari ladkiyon ne socha yeh to mauka hai asli dhamaka karne ka! Saare criticism ko dho daala. Kya khel dikhaya. Proud of our women in blue. pic.twitter.com/oX5BfWK3PM— Virrender Sehwag (@virendersehwag) October 30, 2025 अद्भुत जीतऐतिहासिक प्रदर्शनभारत की बेटियों ने दिखाया हम नहीं किसी से कम। #WomensWorldCup2025 के सेमीफाइनल मुकाबले में भारतीय महिला क्रिकेट टीम ने ऑस्ट्रेलिया को 5 विकेट से धूल चटाई।जेमिमा रोड्रिगेज और हरमनप्रीत कौर के जज़्बे को सलाम। पूरी टीम को बधाई,बहुत-बहुत शुभकामनाएं!… pic.twitter.com/szNYRJnirP— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) October 30, 2025Emotions run high 🥹🥹Historic win for India 🇮🇳 as they overpower an unbeaten Australian side to storm into the World Cup Final #CWC25 #WomensWorldCup2025 #INDWvsAUSW #JemimahRodrigues pic.twitter.com/EXghDmHFnu— Cricbuzz (@cricbuzz) October 30, 2025𝙏𝙚𝙖𝙧𝙨 𝙊𝙛 𝙅𝙤𝙮 💙Absolute scenes from Navi Mumbai 🇮🇳#TeamIndia | #WomenInBlue | #CWC25 | #INDvAUS | @JemiRodrigues | @mandhana_smriti | @ImHarmanpreet pic.twitter.com/Mw6DahFmz2— BCCI Women (@BCCIWomen) October 30, 2025 Take a bow, Team India! 🇮🇳🏏Brilliant performance by our women's cricket team, @BCCIWomen, in the semifinal of the ICC #WomensWorldCup2025 beating the formidable Australia.An exceptional display of perseverance and teamwork to secure a well-deserved spot in the finals. A… pic.twitter.com/hytIOUcsod— Piyush Goyal (@PiyushGoyal) October 30, 2025 -
భారత్ మహిళా క్రికెట్ జట్టుకు అభినందనలు
తాడేపల్లి: ఐసిసి మహిళల ప్రపంచ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్‌కి చేరిన భారత మహిళా జట్టుకు మాజీ సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడాన్ని ఆయన అభినందించారు. ఈ సెమీస్ లో అద్భుతమైన ప్రతిభ కనబరిచిన మహిళా జట్టు ఫైనల్ లో కూడా అలాగే రాణించాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. మహిళా జట్టు చారిత్రాత్మక విజయాన్ని కైవసం చేసుకుందని కితాబునిస్తూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ఫైనల్‌కు వెళ్లిన టీమ్‌కు ఆయన ఆల్‌ది బెస్ట్ చెప్పారు.What a historic win! A fantastic record-breaking chase by the Indian women's team to beat Australia in the World Cup semi-final! On to the final! All the best, team India!#WomensWorldCup2025 pic.twitter.com/7Qyqc6gIaJ— YS Jagan Mohan Reddy (@ysjagan) October 31, 2025 -
స్మృతి మంధాన పెళ్లి డేట్ ఫిక్స్!.. వరుడు ఎవరంటే?
భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana Wedding) త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోందా? అంటే అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది. వచ్చే నెలలోనే ఈ స్టైలిష్ ఓపెనర్ వివాహ బంధంలో అడుగుపెట్టేందుకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. మహిళా క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్మృతి.. ఇప్పటికే ఎన్నో రికార్డులు సాధించింది.భారత జట్టు ఓపెనర్‌గా భారత జట్టు ఓపెనర్‌గా ఇప్పటికే వన్డేల్లో 115 మ్యాచ్‌లు ఆడి.. 14 శతకాల సాయంతో 5253 పరుగులు సాధించిన స్మృతి.. ఏడు టెస్టుల్లో 629 పరుగులు చేసింది. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో 153 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. 3982 పరుగులు సాధించింది. అంతేకాదు.. మహిళల ప్రీమియర్ లీగ్ (WCL)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) కెప్టెన్‌గా ఫ్రాంఛైజీకి తొలి టైటిల్ అందించిన ఘనత ఆమెది.ఆరేళ్లుగా ప్రేమప్రస్తుతం వన్డే వరల్డ్‌కప్-2025తో బిజీగా ఉన్న స్మృతి మంధాన.. ఈ టోర్నీ ముగిసిన వెంటనే ఆమె పెళ్లి పనుల్లో తలమునకలు కానున్నట్లు సమాచారం. కాగా స్మృతి చాన్నాళ్లుగా.. మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్చల్ (Palash Muchhal)తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. 2019 నుంచి డేటింగ్ చేస్తున్న ఈ జంట గతేడాది తమ ఐదో వార్షికోత్సవం అంటూ రిలేషన్షిప్ గురించి అభిమానులతో పంచుకున్నారు.ఇండోర్ కోడలు కాబోతోందిఆ తర్వాత ప్రతి వేడుకలోనూ కలిసి కనిపించారు స్మృతి- పలాష్. స్మృతితో పాటు టీమిండియా టూర్లకు కూడా వెళ్తుంటాడు పలాష్. ఇటీవల.. ‘‘స్మృతి త్వరలోనే ఇండోర్ కోడలు కాబోతోంది’’ అంటూ పలాష్ తమ పెళ్లి గురించి సంకేతాలు ఇచ్చాడు.కాగా 1996లో ముంబైలో జన్మించిన స్మృతి మంధాన.. తనకు రెండేళ్ల వయసు ఉన్నపుడు సాంగ్లీకి వెళ్లింది. మాధవ్‌నగర్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసింది. మరోవైపు.. పలాష్ 1995లో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ మరాఠీ కుటుంబంలో జన్మించాడు. శాస్త్రీయ సంగీతంలో శిక్షణ తీసుకున్న అతడు.. బాలీవుడ్లో కంపోజర్‌గా సిర్థపడ్డాడు. పలాష్ సోదరి పాలక్ ముచ్చల్ కూడా బాలీవుడ్ సింగర్. తనకు కూడా స్మృతితో మంచి అనుబంధం ఉందని పాలక్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.పెళ్లి డేట్ ఫిక్స్!ఇక స్మృతి స్వస్థలం సాంగ్లీలోనే పెళ్లి జరుగనున్నట్లు తెలుస్తోంది. టైమ్స్ ఎంటర్టైన్మెంట్ తెలిపిన వివరాల ప్రకారం.. నవంబరు 20న స్మృతి- పలాష్ పెళ్లి తంతు జరుగనున్నట్లు తెలుస్తోంది.చదవండి: ‘అమ్మానాన్నల్ని విడాకులు తీసుకోమని నేనే చెప్పాను’ -
WC 2025 Ind vs Aus: టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. టీమిండియా చెత్త రికార్డు
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 రెండో సెమీ ఫైనల్లో భారత్- ఆస్ట్రేలియా (WC Ind vs Aus) తలపడుతున్నాయి. నవీ ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా టాస్ గెలిచిన ఆసీస్ మహిళా జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుని.. హర్మన్ సేనను బౌలింగ్‌కు ఆహ్వానించింది.టాస్ సందర్భంగా ఆసీస్ కెప్టెన్ అలిసా హేలీ మాట్లాడుతూ.. తాము పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతున్నట్లు తెలిపింది. కీలక మ్యాచ్‌లో తాము ఒక మార్పు చేశామని.. జార్జియా వారేహమ్ స్థానంలో సోఫీ మోలినెక్స్ జట్టులోకి వచ్చినట్లు వెల్లడించింది.మరోవైపు.. భారత జట్టు సారథి హర్మన్‌ప్రీత్ కౌర్ మాట్లాడుతూ.. తమపై ఎలాంటి ఒత్తిడి లేదని.. ఫియర్‌లెస్‌గా ఆడతామని తెలిపింది. గాయం వల్ల దురదృష్టవశాత్తూ ప్రతికా రావల్ దూరమైందన్న హర్మన్.. హర్లిన్ డియోల్, ఉమా ఛెత్రిలకు విశ్రాంతినిచ్చామని.. రిచా ఘోష్, షఫాలీ వర్మ తుదిజట్టులోకి వచ్చారని పేర్కొంది.టీమిండియా చెత్త రికార్డుమహిళల వరల్డ్‌కప్ టోర్నీలో అత్యధిక సార్లు టాస్ ఓడిన జట్టుగా భారత్ నిలిచింది. గత పది వన్డేల్లో హర్మన్ ఒకే ఒక్కసారి టాస్ గెలవడం గమనార్హం.మహిళల వరల్డ్‌కప్ టోర్నీ సింగిల్ ఎడిషన్‌లో అత్యధికసార్లు టాస్ ఓడిన జట్లు👉ఇంగ్లండ్- 1982లో 13 మ్యాచ్‌లలో 9 సార్లు ఓటమి👉భారత్- 1982లో 12 మ్యాచ్‌లలో 8 సార్లు ఓటమి👉శ్రీలంక- 2000లో ఏడింట ఏడుసార్లు ఓటమి👉సౌతాఫ్రికా- 2025లో ఎనిమిదింట ఏడుసార్లు ఓటమి👉భారత్- 2025లో ఎనిమిదింట ఏడుసార్లు ఓటమి.తుదిజట్లు భారత్షఫాలీ వర్మ, స్మృతి మంధాన, అమన్‌జోత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), దీప్తి శర్మ, రిచా ఘోష్(వికెట్ కీపర్), రాధా యాదవ్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రేణుకా సింగ్ ఠాకూర్.ఆస్ట్రేలియాఫోబ్ లిచ్‌ఫీల్డ్, అలిసా హేలీ (కెప్టెన్, వికెట్ కీపర్), ఎలీస్ పెర్రీ, బెత్ మూనీ, అన్నాబెల్ సదర్లాండ్, ఆష్లే గార్డ్నర్, తహ్లియా మెక్‌గ్రాత్, సోఫీ మోలినెక్స్, అలనా కింగ్, కిమ్ గార్త్, మేగన్ షట్.చదవండి: IND vs AUS: అతడి కోసం అర్ష్‌దీప్‌ను బలిచేస్తారా?.. గంభీర్‌పై ఫైర్ -
World Cup 2025: ఆసీస్‌తో సెమీ ఫైనల్.. భారత జట్టులో కీలక మార్పు
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 (ICC Women's ODI WC)లో సెమీ ఫైనల్ చేరిన టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. సూపర్ ఫామ్‌లో ఉన్న ఓపెనింగ్ బ్యాటర్ ప్రతికా రావల్ (Pratika Rawal) గాయం వల్ల జట్టుకు దూరమైంది. ఈ నేపథ్యంలో భారత జట్టులో కీలక మార్పు చోటుచేసుకుంది.ప్రతికా రావల్ స్థానంలో అండర్-19 వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్ జట్టులోకి వచ్చింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఈ విషయాన్ని సోమవారం ప్రకటించింది. ఇంతకీ ఎవరా ప్లేయర్ అంటే?!...కుడికాలి చీలమండకు గాయంసొంతగడ్డపై న్యూజిలాండ్‌తో కీలక మ్యాచ్‌లో గెలిచి భారత్ సెమీస్ బెర్తు ఖరారు చేసుకుంది. లీగ్ దశలో చివరగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లోనూ సత్తా చాటి గెలుపొందాలని భావించింది. అయితే, నవీ ముంబై వేదికగా జరగాల్సిన ఈ మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండానే ముగిసి పోయింది.వాన వల్ల 27 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ మహిళా జట్టు తొమ్మిది వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. అయితే, ఆదివారం నాటి ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ప్రతికా రావల్ కుడికాలి చీలమండకు గాయమైంది. నొప్పితో విలవిల్లాడుతూ ఆమె మైదానం వీడింది. ఆ తర్వాత కూడా బ్యాటింగ్‌కు రాలేదు.మంధానకు జోడీగా అమన్‌జోత్ కౌర్ ప్రతికా రావల్ స్థానంలో స్మృతి మంధాన (34 నాటౌట్)కు ఓపెనింగ్ జోడీగా అమన్‌జోత్ కౌర్ (15 నాటౌట్) వచ్చింది. అయితే, వర్షం ఎక్కువ కావడంతో 8.4 ఓవర్ల వద్ద ఆట నిలిచిపోయింది. అప్పటికి హర్మన్ సేన వికెట్ నష్టపోకుండా 57 పరుగులు చేసింది.కాగా ఐసీసీ మహిళల వరల్డ్‌కప్ తుది అంకానికి చేరుకుంది. గువాహటిలో అక్టోబరు 29న తొలి సెమీస్ మ్యాచ్ జరుగనుండగా.. ఇందులో ఇంగ్లండ్- సౌతాఫ్రికా పోటీపడనున్నాయి. మరోవైపు.. భారత్- ఆస్ట్రేలియా మధ్య రెండో సెమీ ఫైనల్ (అక్టోబరు 30) జరుగనుండగా.. ఇందుకు నవీ ముంబై వేదిక.లేడీ సెహ్వాగ్ వచ్చేసిందిఅయితే, పటిష్ట ఆస్ట్రేలియా జట్టుతో కీలక సెమీస్‌కు ముందు ఇన్ఫామ్ బ్యాటర్ ప్రతికా సేవలను భారత్ కోల్పోవడం ఆందోళన కలిగించే అంశం. ఆమె స్థానంలో ‘లేడీ సెహ్వాగ్’గా పేరొందిన షఫాలీ వర్మ జట్టులోకి వచ్చింది.కాగా సెమీస్ మ్యాచ్‌లో జట్టు మార్పు నేపథ్యంలో నిబంధనల ప్రకారం ఈవెంట్ టెక్నికల్ కమిటీ నుంచి బీసీసీఐ అనుమతి తీసుకుంది. ఇక భారత జట్టు ఓపెనర్‌గా కొంతకాలం వెలుగొందిన షఫాలీ వర్మ.. తర్వాత ఫామ్‌లేమితో సతమతమైంది.527 పరుగులు సాధించి..అదే సమయంలో ప్రతికా రావల్ రావడం.. నిలకడగా ఆడటంతో జట్టులో షఫాలీ స్థానం గల్లంతైంది. ఈ క్రమంలోనే వన్డే వరల్డ్‌కప్ టోర్నీలోనూ ఆమె చోటు దక్కించుకోలేకపోయింది. కాగా షఫాలీ చివరగా 2024, అక్టోబరులో భారత్ తరఫున వన్డే ఆడింది.ఇక గతేడాది హర్యానా తరఫున దేశీ వన్డే క్రికెట్లో షఫాలీ మెరుగ్గా రాణించింది. 75.28 సగటుతో 527 పరుగులు సాధించింది. ఇదిలా ఉంటే.. 2024 డిసెంబరులో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ప్రతికా రావల్.. 23 ఇన్నింగ్స్‌లోనే వన్డేల్లో వెయ్యి పరుగుల మార్కు అందుకుంది.తద్వారా మహిళల వన్డేల్లో ఫాస్టెస్ట్ 1000 రన్స్ చేసిన క్రికెటర్‌గా నిలిచింది. మంధానతో కలిసి 23 ఇన్నింగ్స్‌లో ఓపెనింగ్ వికెట్‌కు ప్రతికా ఏకంగా 1799 పరుగులు జతచేసి రికార్డు సృష్టించడం గమనార్హం. ఏదేమైనా చాంపియన్ జట్టు ఆసీస్‌తో పోరులో ప్రతికా లేని లోటు స్పష్టంగా తెలుస్తుందనడంలో సందేహం లేదు. కాగా సారథిగా షఫాలీ భారత్‌కు అండర్-19 ప్రపంచకప్-2023 అందించిన విషయం తెలిసిందే.చదవండి: అతడు అద్భుతం.. అహంకారం వద్దు.. రోహిత్- గిల్ సూపర్: గంభీర్ -
ఆసీస్ మహిళా క్రికెటర్లకు వేధింపులు
ఇండోర్: అంతర్జాతీయ మహిళా ప్రపంచకప్‌లో భాగంగా మ్యాచ్ ఆడేందుకు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చేరుకున్న ఆ్రస్టేలియా మహిళా జట్టులోని ఇద్దరు సభ్యులతో ఓ దుండగుడు అసభ్యంగా ప్రవర్తించారు. గురువారం ఉదయం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. అనుచితంగా ప్రవర్తించిన ఆ వ్యక్తిని మధ్యప్రదేశ్ పోలీసులు వెంటనే అరెస్ట్‌చేశారు. తక్షణం స్పందించి చర్యలు తీసుకున్నందుకు పోలీసులకు బీసీసీఐ ధన్యవాదాలు తెలిపింది. అసలేం జరిగింది? మ్యాచ్‌లు ఆడేందుకు ఆస్ట్రేలియా మహిళా జట్టు ఇండోర్ సిటీకి చేరుకుని అక్కడి ర్యాడిసన్ బ్లూ హోటల్లో బసచేస్తోంది. గురువారం ఉదయం అక్కడి ఖజ్రానా రోడ్‌లోని ఒక కెఫెకు వెళ్లేందుకు ఇద్దరు ఆ్రస్టేలియా క్రీడాకారిణులు నడుచుకుంటూ వెళ్తుండగా అటుగా వచి్చన అకీల్ ఖాన్ వీరిద్దరినీ తన బైక్ మీద అనుసరించాడు. తర్వాత హఠాత్తుగా దగ్గరకు వచ్చి ఒక క్రీడాకారిణితో అసభ్యంగా ప్రవర్తించి బైక్ మీద పారిపోయాడు. వెంటనే ఈ ఘటనను క్రీడాకారులు తమ టీమ్ సెక్యూరిటీ ఆఫీసర్ అయిన డ్యానీ సిమన్స్కు ఫిర్యాదుచేశారు. ఘటన జరిగిన చోటు లైవ్ లొకేషన్‌ను షేర్చేశారు. ఈ ఘటనను స్థానిక సెక్యూరిటీ అధికారికి సైతం చెప్పారు. అతిథి దేవోభవ అని నినదించే భారత్‌లో అంతర్జాతీయ క్రీడాకారులకు జరిగిన అవమానం విషయం తెల్సి పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ హిమీనా మిశ్రా వెంటనే రంగంలోకి దిగారు. ఆ ఇద్దరు క్రీడాకారిణులతో స్వయంగా మాట్లాడి ఘటన జరిగిన తీరును అడిగి తెల్సుకున్నారు. వారి వాంగ్మూలాలను నమోదుచేశారు. భారత న్యాయసంహితలోని సెక్షన్ 74(మహిళ గౌరవాన్ని భంగపరచడం), 78( వెంటబడి వేధించడం) సెక్షన్లకింద ఎంఐజీ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదుచేశారు. ఉన్నతాధికారి ఆదేశాల మేరకు సబ్–ఇన్స్పెక్టర్ నిధి రఘువంశీ కేసు దర్యాప్తు మొదలెట్టారు. ఘటన జరిగినప్పుడు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న ఒక వ్యక్తి ఆ నిందితుడి బైక్ నంబర్ గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈ వివరాలతో నిందితుడు అకీల్ ఖాన్‌ను గుర్తించి అరెస్ట్‌చేశారు. ఖాన్‌కు గతంలోనూ నేరచరిత్ర ఉందని దర్యాప్తులో తేలింది. ఘటనపై మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్(ఎంపీసీఏ) సైతం తీవ్ర విచారం వ్యక్తంచేసింది. అంతర్జాతీయ క్రీడాకారులకు జరిగిన అవమానం పట్ల క్షమాపణలు తెలిపారు. ఇకపై క్రీడాకారులకు బయటివైపు తగు రక్షణ ఉండేలా చర్యలు తీసుకుంటామని ఎంపీసీఏ హామీ ఇచి్చంది. ఘటనను క్రికెట్ ఆ్రస్టేలియా సంఘం సైతం ధ్రువీకరించింది. ఘటనపై బీజేపీ నేత, రాష్ట్ర మంత్రి కైలాశ్ విజయ్‌వర్గీయ స్పందించారు. ‘‘ఇది నిజంగా సిగ్గుచేటు. ఇలాంటి అంశాల్లో కఠిన చర్యలు తీసుకోవాలి. ఇది దేశ పరువు, ప్రతిష్ట, ఆతిథ్యాలకు సంబంధించిన విషయం’’అని ఆయన అన్నారు. ఘటనకు ముందు రోజు ఇదే ఆస్ట్రేలియా టీమ్ ఇంగ్లండ్ జట్టుతో తలపడటం తెల్సిందే. చదవండి: భారత బౌలర్ల విజృంభణ... ఆసీస్ ఆలౌట్.. స్కోరెంతంటే? -
‘నాకు కాదు!.. తనకే ఇవ్వాల్సింది.. సెమీస్ చేరడం బిగ్ రిలీఫ్’
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 (ICC ODI WC 2025) టోర్నమెంట్లో భారత్ సెమీ ఫైనల్ చేరింది. న్యూజిలాండ్‌తో గురువారం నాటి మ్యాచ్‌లో 53 పరుగుల తేడాతో విజయం సాధించి సెమీస్ బెర్తు ఖరారు చేసుకుంది. హ్యాట్రిక్ పరాజయాల తర్వాత ఈ మేరకు అద్భుత గెలుపుతో టైటిల్ దిశగా ప్రయాణం మొదలుపెట్టింది.శతకాలతో చెలరేగిన ఓపెనర్లుకాగా కివీస్ జట్టు (IND W vs NZ W)పై భారత్ విజయంలో భారత ఓపెనర్లు ప్రతికా రావల్ (134 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లు- 122), స్మృతి మంధాన (95 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లు- 109)లది కీలక పాత్ర. ఇద్దరూ శతకాలతో చెలరేగి జట్టుకు భారీ స్కోరు అందించారు. వీరికి తోడుగా వన్‌డౌన్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ (55 బంతుల్లో 76 నాటౌట్) కూడా అద్భుత రీతిలో రాణించింది.ఇక ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించిన కారణంగా.. ఇన్నింగ్స్‌ను 49 ఓవర్లకు కుదించారు. ఈ క్రమంలో భారత్ మూడు వికెట్ల నష్టానికి 340 పరుగులు స్కోరు చేయగా.. డక్‌వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం కివీస్ లక్ష్యాన్ని 44 ఓవర్లలో 325 పరుగులుగా నిర్దేశించారు.271 పరుగులే చేసి.. కివీస్ అవుట్అయితే, భారత బౌలర్ల ధాటికి తాళలేక నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయిన న్యూజిలాండ్ 271 పరుగుల వద్దే నిలిచిపోయింది. ఫలితంగా నవీ ముంబైలో హర్మన్‌సేన జయభేరి మోగించి సెమీస్‌లో అడుగుపెట్టింది.సెమీస్ చేరడం బిగ్ రిలీఫ్ఇక ఈ మ్యాచ్‌లో భారత మహిళా జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (Smriti Mandhana)ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. ఈ నేపథ్యంలో విజయానంతరం స్మృతి స్పందిస్తూ.. ‘‘నాకౌట్స్‌కు అర్హత సాధించడం ఉపశమనం కలిగించింది. గత మూడు మ్యాచ్‌లలో మేము ఓడిపోయాం. అది గడ్డు దశ. మంచిగానే ఆడినా.. ఆ మ్యాచ్‌లలో మేము పరాజయం పాలయ్యాము.‘నాకు కాదు!.. తనకే ఇవ్వాల్సిందిఅయితే, ఈరోజు మాత్రం అనుకూలా ఫలితాన్ని రాబట్టగలిగాము. అయితే, ఈ అవార్డు నాకు ఇచ్చే కంటే ప్రతికాకు ఇస్తే బాగుండేది. నాతో పాటు ప్రతికా ఇందుకు అర్హురాలు. నిజంగా నేనైతే ఈ విషయంలో ఆశ్చర్యపోయాను. ఆమెకే అవార్డు ఇస్తారనుకున్నా’’ అని తెలిపింది.కాగా స్మృతి- ప్రతికా జోడీ ఈ ఏడాదిలో ఇప్పటికే 1557 పరుగులు సాధించింది. భారత పురుషుల క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండుల్కర్- సునిల్ గావస్కర్ జంట 1998లో 1635 పరుగులు చేయగా.. వారి రికార్డుకు స్మృతి- ప్రతికా ఇప్పుడు చేరువయ్యారు.ఇక భారత్- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో నాలుగు సెమీస్ బెర్తులు ఖరారయ్యాయి. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, భారత్ టాప్-4లో అడుగుపెట్టగా.. న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఎలిమినేట్ అయ్యాయి. చదవండి: IND vs AUS: భారత్‌తో టీ20 సిరీస్.. ఆసీస్ జట్టు ప్రకటన! విధ్వంసకర వీరుడు వచ్చేశాడుSemi-Final Bound! 😍🤩Deepti Sharma wraps it up as #TeamIndia storm into their 5th Women’s Cricket World Cup semi-final! 👍🏻Watch them next #CWC25 👉 #INDvBAN | SUN, 26th OCT, 2 PM pic.twitter.com/F9sKcNx8Lt— Star Sports (@StarSportsIndia) October 23, 2025 -
IND vs NZ: సెమీస్ రేసు.. టాస్ ఓడిన భారత్.. తుదిజట్లు ఇవే
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 (ICC Women's ODI World Cup) టోర్నమెంట్లో ఆఖరి సెమీ ఫైనల్ బెర్తు కోసం భారత్- న్యూజిలాండ్ (IND vs NZ) ముఖాముఖి తలపడుతున్నాయి. నవీ ముంబై వేదికగా గురువారం నాటి మ్యాచ్‌లో గెలిస్తే హర్మన్ సేన ఎలాంటి సమీకరణలతో పని లేకుండా నేరుగా సెమీ ఫైనల్ చేరుతుంది.టాస్ ఓడిన భారత్మరోవైపు.. న్యూజిలాండ్‌కు ఇది చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌గా మారింది. ఇందులో గెలిస్తేనే వైట్‌ఫెర్న్స్ సెమీస్ బెర్తు దక్కించుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుని.. భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.టాస్ సందర్భంగా న్యూజిలాండ్ కెప్టెన్ సోఫీ డివైన్ మాట్లాడుతూ.. ‘‘ఈరోజు ముందుగా మేము బౌలింగ్ చేస్తాం. వికెట్ పాతబడే కొద్దీ మొత్తంగా మారిపోయే సూచనలు కనిపించడం లేదు. ఈ మ్యాచ్ కోసం పూర్తి స్థాయిలో మేము సన్నద్ధమయ్యాము. రెండు అదనపు సెషన్లు ఏర్పాటు చేసుకుని ప్రాక్టీస్ చేశాం.ఈ టోర్నీలో మాకు పూర్తి స్థాయిలో బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు. అయితే, ఈరోజు ఎలాంటి ఆటంకం (వర్షం) ఉండదనే భావిస్తున్నాం. 100 ఓవర్ల పాటు మ్యాచ్ సాగాలి. ఇలాంటి తీవ్రమైన ఒత్తిడి ఉన్న పరిస్థితుల నేపథ్యంలోనే క్రికెటర్లు తమలోని అత్యుత్తమ ప్రతిభను వెలికితీయాలి.ఇండియాలో ఇలాంటి పరిస్థితుల్లో గెలిచి సెమీస్ చేరితే అంతకంటే గొప్ప విషయం మాకు మరొకటి ఉండదు. భారత్‌తో మ్యాచ్ సవాలుతో కూడుకున్నదే. గత మ్యాచ్‌లో ఆడిన తుదిజట్టుతోనే ఇక్కడా బరిలోకి దిగుతున్నాం’’ అని పేర్కొంది.మూడు మార్పులుమరోవైపు.. తమ జట్టులో మూడు మార్పులు చేసినట్లు భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తెలిపింది. అదనంగా ముగ్గురు బ్యాటర్లను తుదిజట్టులోకి తీసుకున్నట్లు వెల్లడించింది. కాగా ఈ మ్యాచ్‌లో దురదృష్టవశాత్తూ భారత జట్టు ఓడినప్పటికీ బంగ్లాదేశ్‌తో మ్యాచ్ రూపంలో మరో అవకాశం ఉంటుంది. ఒకవేళ బంగ్లాను ఓడిస్తే సులువుగానే సెమీస్ చేరుతుంది. అదే సమయంలో న్యూజిలాండ్ తమ తదుపరి మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓడాల్సి ఉంటుంది. ఒకవేళ ఫలితం వేరుగా ఉంటే మాత్రం అప్పుడు నెట్ రన్‌రేటు కూడా కీలకం అవుతుంది. కాగా ఇప్పటికే ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ మహిళా జట్లు సెమీ ఫైనల్ చేరుకున్న విషయం తెలిసిందే.భారత్ వర్సెస్ న్యూజిలాండ్ తుదిజట్లుభారత్ప్రతీకా రావల్, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్(వికెట్ కీపర్), స్నేహ రాణా, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రేణుకా సింగ్ ఠాకూర్.న్యూజిలాండ్సుజీ బేట్స్, జార్జియా ప్లిమ్మర్, అమేలియా కెర్, సోఫీ డివైన్(కెప్టెన్), బ్రూక్ హాలిడే, మాడీ గ్రీన్, ఇసాబెల్లా గాజ్(వికెట్ కీపర్), జెస్ కెర్, రోజ్మేరీ మెయిర్, లీ తహుహు, ఈడెన్ కార్సన్.చదవండి: WC 2025 Ind vs NZ: సెమీస్ సమీకరణం ఇదీ... -
‘నా వల్లే జట్టు ఓడింది.. నేను కాస్త తెలివిగా ఆడాల్సింది’
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 (ODI World Cup 2025)లో భారత జట్టు మరో పరాజయం చవిచూసింది. స్వీయ తప్పిదాల కారణంగా ఇంగ్లండ్ మహిళా జట్టు (IND W vs ENG W)తో గెలవాల్సిన మ్యాచ్‌లో.. నాలుగు పరుగుల స్వల్ప తేడాతో ఓడిపోయింది. తద్వారా సెమీ ఫైనల్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.ఈ నేపథ్యంలో ఇండోర్ వేదికగా ఇంగ్లండ్ చేతిలో ఓటమిపై భారత జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (Smriti Mandhana) స్పందించింది. తాను కాస్త తెలివిగా ఆడి ఉంటే మ్యాచ్ తప్పక గెలిచేవాళ్లమని పేర్కొంది. గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడటానికి తాను ప్రధాన కారణమంటూ ఓటమికి బాధ్యత వహించింది. 88 పరుగులు చేసి..నిజానికి ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో స్మృతి అదరగొట్టింది. ఈ ఓపెనింగ్ బ్యాటర్ 94 బంతులు ఎదుర్కొని 88 పరుగులు చేసి.. జట్టును విజయం దిశగా నడిపించింది. చేతిలో ఏడు వికెట్లు.. గెలుపునకు 53 బంతుల్లో 55 పరుగులు అవసరమైన వేళ అనూహ్య రీతిలో స్మృతి అవుటైంది.లిన్సే స్మిత్ బౌలింగ్‌లో లాంగాఫ్ మీదుగా షాట్ బాది అలిస్ కాప్సేకి క్యాచ్ ఇచ్చిన స్మృతి మంధాన.. పెవిలియన్‌కు చేరింది. ఇక కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా అద్బుత అర్ధ శతకం (70)తో రాణించింది. మరోవైపు.. దీప్తి శర్మ 50 పరుగులతో అదరగొట్టింది. కానీ స్మృతి అవుటైన తర్వాత భారత బ్యాటింగ్ ఆర్డర్ వేగంగా పతనమైంది.The skipper’s looking solid and locked on to the chase! 🤜🏻🤛🏻Will Harmanpreet Kaur turn this start into a big one and guide #TeamIndia through in this do-or-die clash? 😮💨Catch the LIVE action ➡https://t.co/WF0rXIHjl8#CWC25 👉 #INDvENG | LIVE NOW on Star Sports & JioHotstar pic.twitter.com/vTs7nP01Tb— Star Sports (@StarSportsIndia) October 19, 2025 ఇంగ్లండ్ విధించిన 289 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో.. నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి టీమిండియా 284 పరుగుల వద్ద నిలిచింది. దీంతో ఓటమి ఖరారైంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం స్మృతి మంధాన తీవ్ర భావోద్వేగానికి లోనైంది.నా వల్లే జట్టు ఓడింది.. నేను కాస్త తెలివిగా ఆడాల్సింది‘‘అవును.. మా బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. ప్రతి ఒక్కరు ఇది చూసే ఉంటారు. మా షాట్ సెలక్షన్లు మరింత మెరుగ్గా ఉండాల్సింది. ముఖ్యంగా నేను.. ఇంకాస్త తెలివిగా ప్రవర్తించాల్సింది. మా బ్యాటింగ్ ఆర్డర్ పతనం నాతోనే మొదలైంది. ఇందుకు నేను నైతిక బాధ్యత వహిస్తాను.నాదే బాధ్యతమేము ఓవర్‌కు కేవలం ఆరు పరుగులు చేసి ఉంటే గెలిచేవాళ్లం. కానీ పరిస్థితి మరోలా మారిపోయింది. ఏదేమైనా ఈ మ్యాచ్‌లో మా బ్యాటింగ్ ఆర్డర్ పతనానికి నాదే బాధ్యత’’ అని స్మృతి మంధాన పేర్కొంది. కాగా తాజా వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో భారత్‌కు ఇది హ్యాట్రిక్ ఓటమి.ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మహిళా జట్లు సెమీ ఫైనల్ చేరగా.. భారత్‌పై గెలుపుతో ఇంగ్లండ్ కూడా సెమీస్‌కు అర్హత సాధించింది. నాలుగో స్థానం కోసం న్యూజిలాండ్‌తో భారత్ పోటీ పడుతోంది.చదవండి: నితీశ్ రెడ్డిని అందుకే తీసుకున్నారు.. కానీ ఇదేం పద్ధతి?: అశూ ఫైర్ -
ఇంగ్లండ్ చేతిలో ఓటమి.. అయినా భారత్‌కు సెమీస్ ఛాన్స్! ఇలా జరగాల్సిందే?
మహిళల ప్రపంచకప్-2025లో భారత జట్టు హ్యాట్రిక్ ఓటములు చవిచూసింది. ఆదివారం ఇండోర్ వేదికగా ఇంగ్లండ్ మహిళల జట్టుతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా అనుహ్యంగా 4 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఓ దశలో సునయాసంగా గెలిచేలా కన్పించిన హర్మన్ సేన.. ఆఖరిలో వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి మ్యాచ్‌ను చేజార్చుకుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన ఇంగ్లండ్ జట్టు సెమీస్‌కు ఆర్హత సాధించింది. ఇప్పటికే ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సెమీస్‌లో అడుగు పెట్టగా.. మూడో జట్టుగా ఇంగ్లండ్ తమ సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. మిగిలిన ఒక్క స్ధానం కోసం భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య పోటీ నెలకొంది.భారత్ సెమీస్ చేరాలంటే?ఇక ఈ ఓటమితో భారత్ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానం 4లో కొనసాగుతున్నప్పటికి.. సెమీస్ చేరాలంటే తీవ్రంగా శ్రమించాల్సి ఉంది. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన భారత్ కేవలం రెండింట మాత్రమే విజయం సాధించింది.మన అమ్మాయిల జట్టు ఖాతాలో ప్రస్తుతం నాలుగు పాయింట్లు ఉన్నాయి. అదేవిధంగా న్యూజిలాండ్ వద్ద కూడా నాలుగు పాయింట్లు ఉన్నాయి. అయితే కివీస్(-0.245) కంటే భారత్(+0.526) రన్ రేటు మెరుగ్గా ఉండడంతో మూడో స్ధానంలో నిలిచింది. కాగా వరుసగా కివీస్ ఆడాల్సిన రెండు మ్యాచ్‌లు రద్దు అయ్యాయి.శ్రీలంక, పాకిస్తాన్‌లపై న్యూజిలాండ్ గెలవడం అంత కష్టమేమి కాదు. ఒకవేళ అదే జరిగింటే భారత్ సెమీస్ ఆశలు గల్లంతు అయ్యి ఉండేవి. భారత్‌కు, న్యూజిలాండ్‌కు ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. అక్టోబర్ 23న ముంబై వేదికగా కివీస్‌తో హర్మన్ సారథ్యంలోని భారత్ తలపడనుంది.ఈ మ్యాచ్ ఫలితంతో టీమిండియా సెమీస్ భవితవ్యం దాదాపు తేలిపోతుంది. కివీస్‌పై భారత్ విజయం సాధిస్తే 6 పాయింట్లతో మెరుగైన స్థితికి చేరుకుంటుంది. అప్పుడు టీమిండియా తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. బంగ్లాపై భారత్‌కే గెలిచే ఛాన్స్‌లు ఎక్కువ. కాబట్టి ఎటువంటి సమీకరణాలు లేకుండా మన జట్టు సెమీస్ చేరుతుంది. ఇక న్యూజిలాండ్ జట్టుకు కూడా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఒకవేళ కివీస్ చేతిలో భారత్ ఓటమి పాలైనప్పటికి నకౌట్కు అర్హత సాధించే అవకాశముంది. ఎలా అంటే న్యూజిలాండ్ తమ ఆఖరి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో తలపడనుంది. ప్రస్తత పరిస్థితుల్లో ఇంగ్లండ్‌ను న్యూజిలాండ్ ఓడించడం అంత సులువు కాదు. అదే సమయంలో భారత్ తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించాలి. అప్పుడు ఇంగ్లండ్ చేతిలో న్యూజిలాండ్ ఓడిపోయి.. బంగ్లాపై మనం ఘన విజయం సాధిస్తే పాయింట్ల పరంగా ఇరు జట్లు సమంగా నిలుస్తాయి. అప్పుడు మెరుగైన రన్‌రేట్ కలిగిన జట్టు సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ కివీస్ రెండు మ్యాచ్‌లు గెలిచిందంటే భారత్ టోర్నీ నుంచి నిష్క్రమించిక తప్పదు.చదవండి: టీమిండియా జైత్రయాత్రకు బ్రేక్.. కోహ్లి సరసన గిల్ -
గట్టెక్కిన దక్షిణాఫ్రికా
సాక్షి, విశాఖపట్నం: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌పై దక్షిణాఫ్రికా కష్టపడి గెలిచింది. లక్ష్యఛేదనలో 78 పరుగులకే 5 వికెట్లను కోల్పోయి ఓటమి కోరల్లో చిక్కుకున్న సఫారీ జట్టును మరిజన్ కాప్ (71 బంతుల్లో 56; 4 ఫోర్లు, 1 సిక్స్)... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ క్లో ట్రయాన్ (69 బంతుల్లో 62; 6 ఫోర్లు, 1 సిక్స్) వీరోచిత పోరాటంతో గట్టెక్కించారు. దీంతో దక్షిణాఫ్రికా ఆఖరి ఓవర్‌దాకా పోరాడి 3 బంతులు మిగిలి ఉండగా 3 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై నెగ్గింది. సఫారీకిది వరుసగా మూడో విజయం కాగా... బంగ్లాదేశ్‌కు మూడో పరాజయం. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. ఓపెనర్లు ఫర్జానా హక్ (30; 3 ఫోర్లు), రుబియా హైదర్ (25) తొలి వికెట్‌కు 53 పరుగులతో చక్కని ఆరంభాన్నిచ్చారు. వీళ్లిద్దరు అవుటయ్యాక... టాపార్డర్ బ్యాటర్ షర్మిన్ అక్తర్ (77 బంతుల్లో 50; 6 ఫోర్లు), కెపె్టన్ నిగార్ సుల్తానా (42 బంతుల్లో 32; 5 ఫోర్లు) కుదురుగా ఆడి మరో పెద్ద భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మూడో వికెట్‌కు 77 పరుగులు జోడించారు. షర్మిన్ అర్ధసెంచరీ పూర్తి చేసుకుంది. ఆఖర్లో షోర్న అక్తర్ (35 బంతుల్లో 51 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడింది. రీతూ మోనీ (8 బంతుల్లో 19 నాటౌట్; 3 ఫోర్లు)తో కలిసి వేగంగా పరుగులు జతచేసింది. సఫారీ బౌలర్లలో ఎంలాబా 2 వికెట్లు, డి క్లెర్క్, ట్రయాన్ చెరో వికెట్ తీశారు. అనంతరం 233 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 49.3 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసి గెలిచింది. ఆరంభంలోనే బ్రిట్స్ (0) వికెట్ కోల్పోగా... లారా వోల్వార్ట్ (56 బంతుల్లో 31; 5 ఫోర్లు), అనికె బాష్ (35 బంతుల్లో 28; 6 ఫోర్లు) జట్టు స్కోరును 50 పరుగులు దాటించారు. అయితే 20 పరుగుల వ్యవధిలో క్రీజులో పాతుకుపోయిన వీరిద్దరితో పాటు డెర్క్సెన్ (2), సినాలో జాఫ్టా (4) నిష్క్రమించారు. దీంతో 78/5 స్కోరు వద్ద సఫారీకి పరాజయం తప్పదనిపించింది. ఈ దశలో మరిజన్ కాప్, ట్రయాన్ ఆరో వికెట్‌కు 85 పరుగులు జోడించడంతో దక్షిణాఫ్రికా గెలుపు ట్రాక్‌లో పడింది. ఇద్దరు అర్ధసెంచరీలు పూర్తయ్యాక అవుటయ్యారు. అయితే డిక్లెర్క్ (29 బంతుల్లో 37 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) మరోసారి మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేసింది. భారత్ చేతుల్లోంచి మ్యాచ్‌ను లాగేసినట్లే కీలకమైన పరుగులతో బంగ్లాదేశ్‌తోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. ఇంకో 3 బంతులు మిగిలుండగానే జట్టును గెలిపించింది. బంగ్లాదేశ్ బౌలర్లలో నహిదా అక్తర్ 2, రబియా ఖాన్, ఫాహిమా, రీతు మోని తలా ఒక వికెట్ తీసి సఫారీని ఇబ్బంది పెట్టారు. కొలంబోలో నేడు జరిగే మ్యాచ్‌లో శ్రీలంకతో న్యూజిలాండ్ తలపడుతుంది. -
World Cup 2025: వరుస ఓటములు.. భారత్ సెమీస్ చేరాలంటే...
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 (ICC Women's ODI WC 2025)లో భారత జట్టుకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. విశాఖపట్నం వేదికగా తొలుత సౌతాఫ్రికా వుమెన్ చేతిలో మూడు వికెట్ల తేడాతో ఓడిన హర్మన్‌సేన.. తాజాగా ఆదివారం నాటి మ్యాచ్‌లోనూ ఓటమిని చవిచూసింది.ఓపెనర్లు సూపర్హిట్విశాఖలో ఆస్ట్రేలియా మహిళా జట్టు (IND W vs AUS W)తో మ్యాచ్‌లో 330 పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ.. ఈ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. ఫలితంగా మూడు వికెట్ల తేడాతో పరాభవం పాలైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌కు ఓపెనర్లు ప్రతికా రావల్ (75), స్మృతి మంధాన (Smriti Mandhana- 80) గొప్ప ఆరంభం అందించారు.మిగతావారిలో వన్‌డౌన్ బ్యాటర్ హర్లీన్ డియోల్ 38, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 22, జెమీమా రోడ్రిగెస్ 33, రిచా ఘోష్ 32 పరుగులతో ఓ మోస్తరుగా రాణించారు. అయితే, ఆసీస్ బౌలర్ల ధాటికి లోయర్ ఆర్డర్ వేగంగా పతనమైంది. అమన్‌జోత్ కౌర్ 16 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. దీప్తి శర్మ (1), స్నేహ్ రాణా (8), క్రాంతి గాడ్ (1), శ్రీ చరణి (0) ఇలా వచ్చి అలా వెళ్లారు. ఈ క్రమంలో 48.5 ఓవర్లలో 330 పరుగులు చేసి భారత్ ఆలౌట్ అయింది.అనాబెల్ సదర్లాండ్కు ఐదుఆసీస్ బౌలర్లలో అనాబెల్ సదర్లాండ్ ఐదు వికెట్లతో చెలరేగగా.. సోఫీ మొలినక్స్ మూడు వికెట్లు పడగొట్టింది. మిగిలిన వారిలో మేగన్ షట్, ఆష్ల గార్డ్నర్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇక లక్ష్య ఛేదనలో ఆసీస్ ఓపెనర్, కెప్టెన్ అలిసా హేలీ ఆకాశమే హద్దుగా చెలరేగింది.హేలీ విధ్వంసంకేవలం 107 బంతుల్లోనే 21 ఫోర్లు, 3 సిక్సర్లు బాది విధ్వంసం సృష్టించింది. 142 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద శ్రీచరణి బౌలింగ్‌లో స్నేహ్ రాణాకు క్యాచ్ ఇవ్వడంతో హేలీ సునామీ ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఆమెకు తోడుగా మరో ఓపెనర్ ఫోబే లిచ్‌ఫీల్డ్ 40, వన్‌డౌన్‌లో వచ్చిన ఎలిస్ పెర్రీ 47, ఆష్లే గార్డ్నర్ 45 పరుగులతో రాణించారు. ఆఖర్లో కిమ్ గార్త్ (14) సిక్సర్‌బాది ఆసీస్ విజయాన్ని ఖరారు చేసింది.It took another moment of brilliance to stop Alyssa Healy! 🙌Shree Charani ends her spell with 3 wickets, while Sneh Rana takes a stunner 🔥Will this wicket be the turning point of the match? 👀Catch the LIVE action ➡https://t.co/qAoZd44TEs#CWC25 👉 #INDvAUS | LIVE NOW… pic.twitter.com/NMKHPYlZ8q— Star Sports (@StarSportsIndia) October 12, 2025వరుసగా రెండు ఓటములు..కాగా వన్డే వరల్డ్‌కప్-2025లో భారత జట్టు ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. తొలుత శ్రీలంకను 59 పరుగుల తేడాతో ఓడించిన హర్మన్‌సేన.. ఆ తర్వాత దాయాది పాకిస్తాన్‌ను 88 పరుగుల తేడాతో చిత్తు చేసింది.అనంతరం సౌతాఫ్రికా, ఆసీస్ చేతుల్లో వరుస ఓటములు చవిచూసింది. ఈ నేపథ్యంలో భారత జట్టు సెమీ ఫైనల్ చేరాలంటే.. మిగిలిన మూడు మ్యాచ్‌లలో మెరుగైన ఫలితాలు రాబట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం రెండు విజయాలతో ఉన్న భారత్ ఖాతాలో నాలుగు పాయింట్లు ఉన్నాయి.సెమీస్ చేరాలంటే..ఆస్ట్రేలియా (7), ఇంగ్లండ్ (6) తర్వాత హర్మన్‌సేన పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఇక భారత్ తదుపరి ఇంగ్లండ్ (అక్టోబరు 19), న్యూజిలాండ్ (23), బంగ్లాదేశ్ (అక్టోబరు 26) జట్లతో ఆడాల్సి ఉంది. ఈ మూడు మ్యాచ్‌లలో గెలిస్తే నెట్‌రన్‌రేటుతో పనిలేకుండా టాప్-4లో నిలిచి.. నేరుగా సెమీస్‌లో అడుగుపెడుతుంది హర్మన్‌సేన.ఒకవేళ ఇంగ్లండ్ చేతిలో ఓడితే మాత్రం.. న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌లపై భారత జట్టు కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. తద్వారా మరో నాలుగు పాయింట్లు సాధించి.. మొత్తంగా ఎనిమిది పాయింట్లతో సెమీస్‌కు దూసుకువెళ్లే అవకాశాలు ఉంటాయి. అయితే, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ కంటే నెట్‌రన్‌రేటు పరంగా మెరుగ్గా ఉంటేనే ఇది సాధ్యమవుతుంది.చదవండి: ఇది అవుట్ అని మీకూ తెలుసు.. కానీ: నవ్వుతూనే ఇచ్చిపడేసిన బుమ్రా -
వైజాగ్‌లో టీమిండియా ఫ్యాన్స్ సందడి (ఫోటోలు)
-
IND VS AUS: టీమిండియాపై ఆస్ట్రేలియా విజయం
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో (Women's Cricket World Cup 2025) భాగంగా విశాఖ వేదికగా ఆస్ట్రేలియాతో ఇవాళ (అక్టోబర్ 12) జరిగిన మ్యాచ్‌లో (India vs Australia) భారత్‌పై ఆస్ట్రేలియా మహిళలు 3 వికెట్ల తేడాతో గెలిచారు. నిర్ణీత 49 ఓవర్లలో 331 పరుగులు చేసి టీమిండియాపై ఆస్ట్రేలియా విజయం సాధించింది. మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్‌కు వరుసగా ఇది రెండవ ఓటమి.తొలుత టాస్ ఓడి ఆస్ట్రేలియా ఆహ్వానం మేరకు బ్యాటింగ్ చేసి 330 పరుగులు (48.5 ఓవర్లలో ఆలౌట్) చేసింది. ఓపెనర్లు స్మృతి మంధన (Smriti Mandhana), ప్రతిక రావల్ (Pratika Rawal) అద్భుతంగా ఆడారు. ముఖ్యంగా మంధన తన సహజ శైలిలో చెలరేగిపోయింది. 66 బంతుల్లోనే 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేసింది. మంధనతో పోలిస్తే ప్రతిక రావల్ కాస్త నిదానంగా ఆడింది. 96 బంతుల్లో 10 ఫోర్లు, సిక్సర్ సాయంతో 75 పరుగులు చేసింది.ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో అలీస్సా హీలీ: 142 పరుగులు (107 బంతుల్లో) చేసి తన అద్భుత ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను గెలిపించింది దాంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది.ఈ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది, అయితే చివరి ఓవర్లలో ఆసీస్ విజయం సాధించింది. భారత్ మంచి స్కోరు చేసినా, హీలీ అద్భుత ప్రదర్శనతో మ్యాచ్‌ను ఆసీస్ చేతుల్లోకి తీసుకెళ్లింది. -
అందుకే గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయాం.. తనొక అద్భుతం: భారత కెప్టెన్
విశాఖపట్నం వేదికగా సౌతాఫ్రికాతో గెలవాల్సిన మ్యాచ్‌ను అనూహ్య రీతిలో భారత మహిళా క్రికెట్ జట్టు చేజార్చుకుంది. ఆఖరి వరకు పోరాడినా అనుకున్న ఫలితం రాబట్టలేకపోయింది. సౌతాఫ్రికా బ్యాటర్ నదినె డి క్లెర్క్ (Nadine de Klerk) అద్భుత ఆట తీరుతో టీమిండియా నుంచి మ్యాచ్‌ను లాగేసుకుని.. మరో ఏడు బంతులు మిగిలి ఉండగానే తమ జట్టును విజయతీరాలకు చేర్చింది.ఈ నేపథ్యంలో అనూహ్య ఓటమిపై భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) స్పందించింది. టాపార్డర్ వైఫల్యమే తమ ఓటమికి ప్రధాన కారణం అని పేర్కొంది. ఇకపై తమ వ్యూహాలు మార్చుకోవాల్సి ఉందని.. భారీ స్కోర్లు సాధించడంపై దృష్టి పెడతామని పేర్కొంది.251 పరుగులకు ఆలౌట్ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 (ICC Women's ODI World Cup) టోర్నీలో భాగంగా భారత్ విశాఖ వేదికగా గురువారం సౌతాఫ్రికాతో తలపడింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 49.5 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌట్ అయింది. స్మృతి ఫెయిల్ఓపెనర్లలో ప్రతికా రావల్ (37) ఫర్వాలేదనిపించగా.. స్మృతి మంధాన (23) మరోసారి నిరాశపరిచింది. ఇక వన్‌డౌన్ బ్యాటర్ హర్లీన్ డియెల్ (13)తో పాటు నాలుగో స్థానంలో వచ్చిన కెప్టెన్ హర్మన్ (9) కూడా విఫలమైంది. రిచా ఘోష్ విధ్వంసకర ఇన్నింగ్స్జెమీమా రోడ్రిగెస్ డకౌట్ కాగా.. ఆల్‌రౌండర్ దీప్తి శర్మ 13 పరుగులకే వెనుదిరిగింది. ఇలాంటి క్లిష్ట దశలో వికెట్ కీపర్ రిచా ఘోష్ విధ్వంసకర ఇన్నింగ్స్ (77 బంతుల్లో 94)తో జట్టును ఆదుకోగా.. స్నేహ్ రాణా (24 బంతుల్లో 33) ఆమెకు సహకరించింది.A game-changing fifty by Richa Ghosh, her 7th in ODIs & first in CWC! 🔥Will she & Sneh Rana steer Team India over the 250-run mark?Catch the LIVE action ➡ https://t.co/qUAtuPmsC2#CWC25 👉 #INDvSA | LIVE NOW on Star Sports & JioHotstar! pic.twitter.com/r1SyLR4ieB— Star Sports (@StarSportsIndia) October 9, 202584 పరుగులతో అజేయంగాఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికాకు ఆదిలోనే చుక్కెదురైంది. తజ్మిన్ బ్రిట్స్ డకౌట్ కాగా.. సునే లూస్ 5 పరుగులకే అవుటైంది. మరో ఓపెనర్, కెప్టెన్ వొల్వార్ట్ 70 పరుగులతో ఇన్నింగ్స్ చక్కదిద్దగా.. ఎనిమిదో నంబర్ బ్యాటర్ నదినే డి క్లెర్క్ 54 బంతుల్లోనే 84 పరుగులతో అజేయంగా నిలిచి.. హర్మన్‌సేన హార్ట్ బ్రేక్ చేసింది.టాపార్డర్‌లో మేము బాధ్యత తీసుకోలేకపోయాంఈ నేపథ్యంలో హర్మన్‌ప్రీత్ కౌర్ మాట్లాడుతూ.. ‘‘టాపార్డర్‌లో మేము బాధ్యత తీసుకోలేకపోయాం. వ్యూహాలు మార్చుకోవాలి. మెరుగైన భాగస్వామ్యాలు నెలకొల్పాలి. ఇదొక సుదీర్ఘ టోర్నమెంట్.ఏదేమైనా ఈ మ్యాచ్ మాకు కఠినంగా తోచింది. ఎన్నో పాఠాలు నేర్పింది. సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతాం. ఈ మ్యాచ్‌లో ఇరుజట్లు గొప్పగా ఆడాయి. మా టాపార్డర్ కుప్పకూలినా 250కి పైగా స్కోరు చేయడం శుభపరిణామమే.అయితే, ఆఖర్లో క్లెర్క్ అద్భుత బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను తమ జట్టు వైపు తిప్పేసింది. విశాఖ పిచ్ బాగుంది. సౌతాఫ్రికా విజయానికి అర్హమైన జట్టే’’ అని హర్మన్‌ప్రీత్ కౌర్ పేర్కొంది. ఇక రిచా ఇన్నింగ్స్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘అత్యద్భుతంగా ఆడింది. రిచా హిట్టింగ్ ఈ మ్యాచ్‌లో మాకు అతిపెద్ద సానుకూలాంశం. తనిలాగే ముందుకు సాగుతుందని ఆశిస్తున్నాం’’ అని హర్మన్ పేర్కొంది.చదవండి: టీమిండియాపై అనూహ్య విజయం.. దక్షిణాఫ్రికా ప్రపంచ రికార్డు -
'విజయం' చేజార్చుకున్నారు...
వన్డే వరల్డ్ కప్ వేటలో విశాఖ తీరాన భారత మహిళల బృందానికి అనూహ్య ఓటమి ఎదురైంది. గెలుపు ఖాయమనుకున్న దశలో దక్షిణాఫ్రికా బ్యాటర్ డి క్లెర్క్ చెలరేగి భారత్‌నుంచి మ్యాచ్‌ను లాక్కుంది. చివరి 5 ఓవర్లలో 52 పరుగులు చేయాల్సి ఉండగా 4 ఫోర్లు, 5 సిక్సర్లు బాదిన డి క్లెర్క్ 7 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను ముగించింది. అంతకు ముందు భారత్ మళ్లీ బ్యాటింగ్‌లో తడబడింది. అయితే రిచా ఘోష్ అద్భుత ఇన్నింగ్స్‌తో మెరుగైన స్కోరును అందించింది. ఆదివారం ఇదే వైజాగ్ మైదానంలో ఆస్ట్రేలియాతో హర్మన్ సేన తలపడుతుంది. సాక్షి క్రీడా ప్రతినిధి, విశాఖపట్నం: మహిళల ప్రపంచకప్‌లో భారత జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో గురువారం జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 3 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 49.5 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌటైంది.రిచా ఘోష్ (77 బంతుల్లో 94; 11 ఫోర్లు, 4 సిక్స్‌లు) త్రుటిలో సెంచరీ అవకాశం చేజార్చుకుంది. ఒక దశలో భారత్ స్కోరు 153/7 కాగా...రిచా, స్నేహ్ రాణా (24 బంతుల్లో 33; 6 ఫోర్లు) ఎనిమిదో వికెట్‌కు 53 బంతుల్లో 88 పరుగులు జోడించి మెరుగైన స్థితికి చేర్చారు. అనంతరం దక్షిణాఫ్రికా 48.5 ఓవర్లలో 7 వికెట్లకు 252 పరుగులు చేసింది. కెప్టెన్ లారా వోల్వర్ట్ (111 బంతుల్లో 70; 8 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడింది. అయితే చివర్లో నాడిన్ డి క్లెర్క్ (54 బంతుల్లో 84 నాటౌట్; 8 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్ దక్షిణాఫ్రికాను గెలిపించింది. వర్షం కారణంగా మ్యాచ్ గంట ఆలస్యంగా మొదలైంది. హర్మన్ మళ్లీ విఫలం...స్మృతి మంధాన (32 బంతుల్లో 23; 1 ఫోర్, 1 సిక్స్) కాస్త జాగ్రత్తగా బ్యాటింగ్ చేసింది. 21వ బంతికి గానీ ఆమె తొలి బౌండరీ కొట్టలేకపోయింది. మరో ఓపెనర్ ప్రతీక రావల్ (56 బంతుల్లో 37; 5 ఫోర్లు) చక్కటి ఆఫ్‌సైడ్ షాట్లతో ఆకట్టుకుంది. అయితే ఆ తర్వాత దక్షిణాఫ్రికా కట్టుదిట్టమైన బౌలింగ్‌తో భారత్ 47 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు చేజార్చుకుంది. ఓపెనర్లతో పాటు హర్లీన్ డియోల్ (13) కూడా వెనుదిరగ్గా... కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (9) తన వైఫల్యాన్ని కొనసాగించింది. జెమీమా రోడ్రిగ్స్ (0) టోర్నీలో రెండో డకౌట్‌ను తన ఖాతాలో వేసుకుంది. కొద్దిసేపటి తర్వాత దీప్తి (4) పెవిలియన్ చేరింది. ఈ దశలో అమన్‌జోత్ (13)తో రిచా జత కలిసింది. వీరిద్దరు కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. రిచా షో...40వ ఓవర్ చివరి బంతికి అమన్ అవుటైంది. ఆ సమయంలో 153/7 వద్ద స్కోరు 200 దాటడం కూడా కష్టమే అనిపించింది. ఈ స్థితిలో రిచా చెలరేగిపోయింది. క్లెర్క్ బౌలింగ్‌లో సిక్స్, ఫోర్ కొట్టిన ఆమె 53 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంది. ఆ తర్వాత ఖాకా వేసిన 47వ ఓవర్లో వరుసగా 4, 4, 6తో పండగ చేసుకుంది. ఇన్నింగ్స్ చివరి ఓవర్ ఆరంభానికి ముందు 84 పరుగుల వద్ద ఉన్న రిచా...వరుసగా 2, 4, 4తో 94కు చేరుకుంది. అయితే తర్వాతి బంతికి అవుటై శతకం కోల్పోయింది. ఆఖరి 10 ఓవర్లలో భారత్ 98 పరుగులు చేయడం విశేషం.టపటపా...ఛేదనలో దక్షిణాఫ్రికా ఆరంభంలో తేలిపోయింది. తక్కువ వ్యవధిలో వరుసగా వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ లారా మినహా ప్రధాన బ్యాటర్లంతా కనీస ప్రదర్శన కూడా ఇవ్వలేకపోవడంతో సఫారీలకు ఓటమి తప్పదనిపించింది. అయితే డి క్లెర్క్, క్లో ట్రయాన్ (66 బంతుల్లో 49; 5 ఫోర్లు) అసాధారణ పోరాటం ఆ జట్టును గెలిపించింది.982స్మృతి మంధాన 2025లో వన్డేల్లో చేసిన పరుగులు. ఒకే క్యాలెండర్ ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా బెలిండా క్లార్క్ (970 – 1997) రికార్డును ఆమె అధిగమించింది.స్కోరు వివరాలుభారత్ ఇన్నింగ్స్: ప్రతీక (సి) బ్రిట్స్ (బి) సెఖుఖునే 37; స్మృతి (సి) లూస్ (బి) ఎంలాబా 23; హర్లీన్ (బి) ఎంలాబా 13; హర్మన్‌ప్రీత్ (సి) కాప్ (బి) ట్రయాన్ 9; జెమీమా (ఎల్బీ) (బి) ట్రయాన్ 0; దీప్తి (సి) జాఫ్తా (బి) కాప్ 4; అమన్‌జోత్ (సి) లూస్ (బి) ట్రయాన్ 13; రిచా (సి) ట్రయాన్ (బి) డి క్లెర్క్ 94; రాణా (సి) వోల్వార్ట్ (బి) కాప్ 33; క్రాంతి (నాటౌట్) 0; శ్రీచరణి (సి) వోల్వార్ట్ (బి) డి క్లెర్క్ 0; ఎక్స్‌ట్రాలు 25; మొత్తం (49.5 ఓవర్లలో ఆలౌట్) 251. వికెట్ల పతనం: 1–55, 2–83, 3–91, 4–92, 5–100, 6–102, 7–153, 8–241, 9–251, 10–251. బౌలింగ్: మరిజాన్ కాప్ 9–0–45–2, ఖాకా 7–0–47–0, డి క్లెర్క్ 6.5–0–52–2, ఎంలాబా 10–0–46–2, సెఖుఖునే 7–0–29–1, ట్రయాన్ 10–0–32–3. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: వోల్వార్ట్ (బి) క్రాంతి 70; బ్రిట్స్ (సి) అండ్ (బి) క్రాంతి 0; లూస్ (సి) రిచా (బి) అమన్‌జోత్ 5; మరిజాన్ కాప్ (బి) స్నేహ్ 20; బాష్ (సి) అండ్ (బి) దీప్తి 1; జాఫ్తా (ఎల్బీ) (బి) శ్రీచరణి 14; ట్రయాన్ (ఎల్బీ) (బి) రాణా 49; డి క్లెర్క్ (నాటౌట్) 84; ఖాకా (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (48.5 ఓవర్లలో 7 వికెట్లకు) 252. వికెట్ల పతనం: 1–6, 2–18, 3–57, 4–58, 5–81, 6–142, 7–211. బౌలింగ్: క్రాంతి గౌడ్ 9–0–59–2, అమన్‌జోత్ 5.5–0–40–1, స్నేహ్ రాణా 10–0–47–2, శ్రీచరణి 10–1–37–1, దీప్తి 10–0–54–1, హర్మన్‌ప్రీత్ 4–0–15–0. -
చరిత్ర సృష్టించిన ఆసీస్ క్రికెటర్.. సరికొత్త వరల్డ్ రికార్డు
ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ అలనా కింగ్ (Alana King) సరికొత్త చరిత్ర లిఖించింది. మహిళల వన్డే క్రికెట్లో పదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అర్ధ శతకం సాధించిన తొలి ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు సాధించింది. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 (ICC World Cup)లో భాగంగా కొలంబోలో పాకిస్తాన్‌తో బుధవారం నాటి మ్యాచ్ సందర్భంగా అలనా కింగ్ ఈ ఫీట్ నమోదు చేసింది.చాంపియన్లకు తిరుగు ఉంటుందా?క్లిష్ట పరిస్థితులు ఎదురైనా ఏమాత్రం బెదరకుండా ఎలా నిలవాలో... ప్రత్యర్థులు పరీక్ష పెడుతున్నా నమ్మకం కోల్పోకుండా ఎలా పోరాడాలో... ఓటమి మేఘాలు కమ్ముకున్నప్పుడు వెలుగుల బాట ఎలా వేసుకోవాలో... ఆస్ట్రేలియా క్రికెట్ జట్లకు బాగా తెలుసని మరోసారి నిరూపితమైంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల వన్డే ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌తో పోరులో ప్రతికూల పరిస్థితులను తిప్పికొడుతూ ఆసీస్ ఘనవిజయం సాధించింది.మూనీ సూపర్ సెంచరీ.. అలనా మెరుపు అర్ధ శతకం‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బెత్ మూనీ (Beth Mooney- 114 బంతుల్లో 109; 11 ఫోర్లు) ఆణిముత్యం అనదగ్గ సెంచరీతో కదంతొక్కడంతో... బుధవారం జరిగిన ఈ పోరులో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా జట్టు 107 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. ఆసీస్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒకటి వర్షం కారణంగా రద్దుకాగా... మిగిలిన రెండిట్లో గెలిచి 5 పాయింట్లతో అగ్రస్థానానికి చేరింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది.బెత్ మూనీ అసాధారణ ఇన్నింగ్స్‌కు టెయిలెండర్ అలానా కింగ్ (49 బంతుల్లో 51 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు హాఫ్‌సెంచరీ తోడవడంతో ఆసీస్ మెరుగైన స్కోరు చేయగలిగింది. ఒకదశలో 76 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ ఆసీస్‌ను మూనీ ఆదుకుంది. కిమ్‌గార్త్ (11)తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 39 పరుగులు జోడించిన మూనీ... తొమ్మిదో వికెట్‌కు అలానాతో 106 పరుగులు జోడించి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. 77 పరుగులతో కిమ్ గార్త్– ఆష్లే గార్డ్నర్ జోడీ పేరిట ఉన్న రికార్డును మూనీ–కింగ్ జంట సవరించింది.చిత్తుగా ఓడిన పాక్పాకిస్తాన్ బౌలర్లు బంతిబంతికి పరీక్ష పెడుతున్నా... ఏమాత్రం వెరవకుండా పోరాటం కొనసాగించింది. క్రీజులో కుదురుకున్నాక కింగ్ భారీ షాట్లతో సహచరిపై ఒత్తిడి తగ్గించింది. కెప్టెన్ అలీసా హీలీ (20), లిచ్‌ఫీల్డ్ (10), ఎలీస్ పెర్రీ (5), అనాబెల్ (1), యాష్లే గార్డ్నర్ (1), తహిలా మెక్‌గ్రాత్ (5) విఫలమయ్యారు.ఇక వన్డేల్లో ఐదో సెంచరీ పూర్తి చేసుకున్న మూనీ ఇన్నింగ్స్ చివరి బంతికి అవుటైంది. పాక్ బౌలర్లలో నష్రా సంధు 37 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా... ఫాతిమా సనా, రమీన్ షమీమ్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో పాకిస్తాన్ 36.3 ఓవర్లలో 114 పరుగులకు ఆలౌటైంది. సిద్రా అమీన్ (52 బంతుల్లో 35; 5 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... కెప్టెన్ ఫాతిమా సనా (11), సదాఫ్ (5), మునీబా అలీ (3), సిద్రా నవాజ్ (5), నటాలియా పర్వేజ్ (1), ఐమన్ ఫాతిమా (0) విఫలమయ్యారు. ఆ్రస్టేలియా బౌలర్లలో కిమ్ గార్త్ 3... మేగన్ షుట్, అనాబెల్ సదర్లాండ్ చెరో 2 వికెట్లు తీశారు.అలనా కింగ్ అరుదైన ఘనతపాక్తో మ్యాచ్‌లో 49 బంతులు ఎదుర్కొన్న స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అలనా కింగ్ మూడు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 51 పరుగులతో అజేయంగా నిలిచింది. తద్వారా పదో స్థానంలో వచ్చి అత్యధిక పరుగులు చేసిన మహిళా ప్లేయర్‌గా రికార్డు సాధించింది. అంతకు ముందు ఈ రికార్డు సౌతాఫ్రికాకు చెందిన యులాండి వాన్ డెర్ మెర్వే పేరిట ఉండేది. 2000 సంవత్సరంలో భారత మహిళా జట్టుతో మ్యాచ్ సందర్భంగా యులాండి పదో స్థానంలో వచ్చి 42 పరుగులు చేసింది.చదవండి: టీమిండియాలో దక్కని చోటు.. మహ్మద్ షమీ కీలక నిర్ణయం -
World Cup 2025: పాక్‌ను చిత్తుగా ఓడించిన ఆస్ట్రేలియా
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 (ICC World Cup)లో మాజీ చాంపియన్ ఆస్ట్రేలియా రెండో విజయం సాధించింది. టోర్నీలో తొలుత న్యూజిలాండ్ వుమెన్‌ను 89 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించిన ఆసీస్ జట్టు.. తాజాగా పాకిస్తాన్ (Aus W vs Pak W)పై ఘన విజయం సాధించింది.కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో బుధవారం నాటి మ్యాచ్‌లో టాస్ ఓడిన ఆసీస్.. పాక్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు కెప్టెన్ అలిసా హేలీ (20), ఫోబే లిచ్‌ఫీల్డ్ (10).. వన్‌డౌన్ బ్యాటర్ ఎలిస్ పెర్రీ (5) విఫలం కావడంతో ఆసీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.మూనీ సెంచరీ.. అలనా హాఫ్ సెంచరీఆ తర్వాత కూడా పాక్ బౌలర్లు విజృంభించడంతో ఐదో నంబర్ ప్లేయర్ అనాబెల్ సదర్లాండ్ (1) సహా ఆ తర్వాత వచ్చిన ఆష్లే గార్డ్నర్ (1), తహీలా మెగ్రాత్ (5), జార్జియా వారేహామ్ (0), కిమ్ గార్త్ (11) పెవిలియన్‌కు క్యూ కట్టారు.ఈ నేపథ్యంలో కేవలం 76 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన ఆసీస్‌ను బెత్ మూనీ (Beth Mooney), అలనా కింగ్ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆదుకున్నారు. మూనీ 114 బంతుల్లో 109 పరుగులతో చెలరేగగా.. అలనా 49 బంతుల్లో 51 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచింది. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో ఆసీస్ తొమ్మిది వికెట్ల నష్టానికి 221 పరుగుల మెరుగైన స్కోరు సాధించింది.చెలరేగిన ఆసీస్ బౌలర్లుఅనంతరం లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్‌కు ఆసీస్ బౌలర్లు చుక్కలు చూపించారు. కిమ్ గార్త్ బౌలింగ్‌లో ఓపెనర్ సదాఫ్ షమాస్ 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించగా.. మునీబా అలీ (3)ని మేగన్ షట్ వెనక్కి పంపింది. అయితే, వన్‌డౌన్‌లో వచ్చిన సిద్రా ఆమిన్ (35) కాసేపు పోరాడగా.. ఆష్లే గార్డ్నర్ ఆమెను అవుట్ చేసింది.ఇక నాలుగో నంబర్ బ్యాటర్ సిద్రా నవాజ్ (5) వికెట్‌ను కిమ్ గార్త్ తన ఖాతాలో వేసుకోగా.. నటాలియా పర్వేజ్ (1)ను మేగన్ పెవిలియన్‌కు పంపింది. ఇక కెప్టెన్ ఫాతిమా సనా 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సదర్లాండ్ బౌలింగ్‌లో బౌల్డ్ కాగా.. డయానా బేగ్ (7)ను జార్జియా వారేహామ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకుంది.114 పరుగులకే కుప్పకూలిన పాక్ఈ క్రమంలో 86 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయిన పాక్‌ను లక్ష్యం దిశగా నడిపించేందుకు స్పిన్నర్లు రమీన్ షమీమ్ (15), నష్రా సంధు (11) విఫలయత్నం చేశారు. అయితే, అలనా బౌలింగ్‌లో నష్రా తొమ్మిదో వికెట్‌గా.. సదర్లాండ్ బౌలింగ్‌లో షమీమ్ పదో వికెట్‌గా వెనుదిరగడంతో పాక్ పోరాటం ముగిసిపోయింది.ఈ క్రమంలో 36.3 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌట్ అయిన పాక్.. ఆసీస్ చేతిలో 107 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఇదిలా ఉంటే.. ఆసీస్ తమ రెండో మ్యాచ్‌లో శ్రీలంకతో ఆడాల్సి ఉండగా.. వర్షం కారణంగా టాస్ పడకుండానే ఆ మ్యాచ్ రద్దైపోయింది.చదవండి: అగార్కర్‌కు అవమానకర ముగింపు తప్పదు: మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు -
చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా..
ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. వుమెన్ వన్డే క్రికెట్లో తొమ్మిదో వికెట్‌కు వందకు పైగా స్కోరు జతచేసిన తొలి జట్టుగా నిలిచింది. ప్రపంచంలో ఇంత వరకు ఏ మహిళా జట్టుకు సాధ్యం కాని ఘనత సాధించింది.ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 (ICC Womens World Cup 2025)లో భాగంగా పాకిస్తాన్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో ఆసీస్ జట్టు ఈ ఫీట్ నమోదు చేసింది. ప్రపంచకప్ టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తుండగా.. పాక్ శ్రీలంక వేదికగా తమ మ్యాచ్‌లు ఆడుతోంది. ఇందులో భాగంగా ఆర్.ప్రేమదాస స్టేడియంలో ఆసీస్ (Aus W vs Pak W)తో తాజా మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్.. తొలుత బౌలింగ్ చేసింది.టాపార్డర్ కుదేలైనా..అయితే, పాక్ బౌలర్ల ధాటికి ఆసీస్ టాపార్డర్ కుదేలైంది. ఓపెనర్లు కెప్టెన్ అలిసా హేలీ (20), ఫోబే లిచ్‌ఫీల్డ్ (10) నామమాత్రపు స్కోర్లకే పరిమితం కాగా.. వన్‌డౌన్‌లో వచ్చిన ఎలిస్ పెర్రీ 5 పరుగులకే నిష్క్రమించింది.మిగిలిన వాళ్లలో కిమ్ గార్త్ (11) తప్ప అంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం కాగా.. నాలుగో స్థానంలో వచ్చిన బెత్ మూనీ, పదో స్థానంలో వచ్చిన అలనా కింగ్ సంచలన ఇన్నింగ్స్‌తో మెరిశారు. మూనీ సెంచరీ (114 బంతుల్లో 109)తో చెలరేగగా.. అలనా 49 బంతుల్లో 51 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది.మూనీ- అలనా కలిసి తొమ్మిదో వికెట్‌కు 106 పరుగులు జోడించారు. తద్వారా మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో తొమ్మిదో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా ప్రపంచ రికార్డు సాధించారు.ప్రపంచంలోనే తొలి జట్టుగా..ఇక 76 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన వేళ.. మూనీ- అలనా రాణించడంతో ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి.. 222 పరుగులు స్కోరు చేయగలిగింది. కాగా మహిళల వన్డే చరిత్రలో ఏడు ఎక్కువ వికెట్లు పడిన తర్వాత అత్యధిక పరుగులు సాధించిన జట్టుగానూ ఆసీస్ నిలిచింది. ఏడో వికెట్ పడిన తర్వాత ఆసీస్ 145 పరుగులు సాధించి ఈ ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ఆ రికార్డూ ఆసీస్ పేరు మీదేఐసీసీ పురుషుల వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో ఆసీస్ 91 పరుగులకే ఏడు వికెట్ల నష్టపోయిన వేళ.. గ్లెన్ మాక్స్ వెల్, ప్యాట్ కమిన్స్ కలిసి అద్భుతం చేశారు. ఎనిమిదో వికెట్‌కు ఏకంగా 202 పరుగులు జోడించి ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా ఆసీస్‌ను నిలిపారు.చదవండి: అగార్కర్‌కు అవమానకర ముగింపు తప్పదు: మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు -
పాక్ బౌలర్ల విజృంభణ.. సంతోషాన్ని ఆవిరి చేసిన ఆసీస్ బ్యాటర్
పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్ బెత్ మూనీ (Beth Mooney) అద్భుత శతకంతో చెలరేగింది. ఓవైపు వికెట్లు పడుతున్నా.. మొక్కవోని దీక్షతో వంద పరుగుల మార్కును దాటి.. జట్టుకు మెరుగైన స్కోరు అందించింది. ‘న భూతో న భవిష్యతి’ అన్నట్లుగా కష్టాల్లో ఉన్న జట్టును గట్టెక్కించి పాక్ సంబరాలపై నీళ్లు చల్లింది.ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 (ICC Women's ODI World Cup)లో భాగంగా కొలంబో వేదికగా ఆసీస్- పాకిస్తాన్ (Aus W vs Pak W) జట్ల మధ్య మ్యాచ్‌కు బుధవారం షెడ్యూల్ ఖరారైంది. ఆర్.ప్రేమదాస స్టేడియంలో టాస్ గెలిచిన పాకిస్తాన్ మహిళా జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది.పాక్ బౌలర్ల విజృంభణకెప్టెన్ ఫాతిమా సనాతో పాటు సైదా ఇక్బాల్ ఆది నుంచే చెలరేగి ఆసీస్ ఓపెనింగ్ జంటను విడదీశారు. ఈ క్రమంలో ఓపెనర్లలో ఫొబు లిచ్‌ఫీల్డ్ 10, కెప్టెన్ అలిసా హేలీ 20 పరుగులకే పరిమితం కాగా.. వన్‌డౌన్‌లో వచ్చిన ఎలిస్ పెర్రీ (5) దారుణంగా విఫలమైంది. నష్రా సంధు బౌలింగ్‌లో స్టంపౌట్‌గా వెనుదిరిగింది.పాక్ బౌలర్ల ధాటికి ఐదో స్థానంలో వచ్చిన అనాబెల్ సదర్లాండ్ (1), ఆష్లే గార్డ్నర్ (1), తాహిలా మెగ్రాత్ (5) ఇలా వచ్చి అలా వెళ్లగా.. జార్జియా వారేహమ్ (0), కిమ్ గార్త్ (11) కూడా చేతులెత్తేశారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నాలుగో నంబర్ బ్యాటర్ బెత్ మూనీ.. ఆల్‌రౌండర్ అలనా కింగ్‌తో కలిసి అద్భుత పోరాటం చేసింది.బెత్ మూనీ సంచలన ఇన్నింగ్స్ఆసీస్ 76 పరుగులకే ఏకంగా ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయిన వేళ.. బెత్ మూనీ సంచలన ఇన్నింగ్స్‌తో మెరిసింది. సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ 114 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో 109 పరుగులు సాధించింది. అయితే, ఇన్నింగ్స్ ఆఖరి బంతికి ఫాతిమా సనా బౌలింగ్‌లో సదాఫ్ షమాస్కు క్యాచ్ ఇవ్వడంతో మూనీ అవుటైపోయింది.ఏకంగా 106 పరుగులు జోడించి.. పాక్ సంబరాలపై నీళ్లుమరో ఎండ్‌లో అలనా కింగ్ 49 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 51 పరుగులతో అజేయంగా నిలిచింది. వీరిద్దరు కలిసి తొమ్మిదో వికెట్‌కు ఏకంగా 106 పరుగులు జోడించి జట్టును గట్టెక్కించారు. మూనీ, అలనా అద్భుత ప్రదర్శన కారణంగా ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 221 పరుగుల మెరుగైన స్కోరు సాధించింది.దీంతో ఆదిలోనే వరుస వికెట్లు తీసిన పాక్ జట్టుకు ఆ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. ఇక పాక్ బౌలర్లలో నష్రా సంధు అత్యధికంగా మూడు వికెట్లు తీయగా.. రమీన్ షమీమ్, ఫాతిమా సనా చెరో రెండు.. డయానా బేగ్, సదియా ఇక్బాల్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇదిలా ఉంటే.. పాక్‌పై బ్యాట్‌తో విజృంభించిన బెత్ మూనీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలోనే ఇదొక అత్యుత్తమ ఇన్నింగ్స్ అంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆమెను కొనియాడుతున్నారు.చదవండి: అగార్కర్‌కు అవమానకర ముగింపు తప్పదు: మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు Alert 🚨 - You are watching one of the greatest comeback of all time as Australia 🇦🇺 were 76/7, but at the end scored 221/9 👏🏻- Beth Mooney and Alana King had a unbeaten partnership of 106 🔥 with Mooney's epic 💯 & King's 50 🥶- What's your take 🤔pic.twitter.com/nRkac6VuZy— Richard Kettleborough (@RichKettle07) October 8, 2025 -
World Cup 2025: వారి కోసం వరల్డ్‌కప్ గెలుస్తాం
కొలంబో: భారత్‌లో మహిళల క్రికెట్ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించిన పలువురి కోసం తాము వన్డే ప్రపంచ కప్ (ICC Womens ODI World Cup)ను గెలవాలని కోరుకుంటున్నట్లు భారత బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues)వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో బయట జరిగే చర్చ గురించి తాము పట్టించుకోమని, తమ దృష్టి మొత్తం విజయంపైనే ఉందని ఆమె వెల్లడించింది. ఆదివారం పాకిస్తాన్‌ను ఓడించిన తర్వాత జెమీమా తమ ప్రదర్శనపై మాట్లాడింది. సవాళ్ల గురించే చర్చ‘మేం ఒకసారి ఒక మ్యాచ్‌పైనే దృష్టి పెడుతూ ముందుకు వెళుతున్నాం. ప్రపంచ కప్ గురించి బయట ఎంతో చర్చ జరుగుతుందని మాకు తెలుసు. దాని ప్రభావం మాపై పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మా బృందం సమావేశాల్లో కూడా ఆటలో ఎదురయ్యే సవాళ్ల గురించే మాట్లాడుకుంటున్నాం. అప్పుడు మిథాలీ, జులన్.. ఇప్పుడు..ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగుతున్నాం. నేను జట్టులోకి వచ్చినప్పుడు మిథాలీ, జులన్‌లాంటి సీనియర్లు నడిపించారు. ఇప్పుడు హర్మన్, స్మృతి కలిసి జట్టును ముందుకు తీసుకెళుతున్నారు. అందరూ తమ అత్యుత్తమ ప్రదర్శన చూపించే విధంగా వారు తీర్చిదిద్దారు. భారత మహిళల క్రికెట్ స్థాయిని పెంచిన మిథాలీ, జులన్, నీతూ డేవిడ్వంటి ప్లేయర్ల కోసం వరల్డ్ కప్ గెలవాలని పట్టుదలగా ఉన్నాం’ అని జెమీమా పేర్కొంది. గువహటి, కొలంబో పిచ్‌లను బ్యాటర్లకు సవాల్‌గా నిలిచాయని, పరిస్థితులకు తగినట్లుగా తమ ఆటను మలచుకున్నామని ఆమె వివరించింది. చదవండి: ‘మీ నాన్నతో కలిసి ఆటో తోలుకో’;.. ధోని ఆరోజు చెప్పిన మాటతో ఇలా..: సిరాజ్ -
IND vs PAK: పాకిస్తాన్ క్రికెటర్‌కు భారీ షాకిచ్చిన ఐసీసీ
పాకిస్తాన్ మహిళా క్రికెటర్ సిద్రా ఆమిన్ (Sidra Amin)కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) భారీ షాకిచ్చింది. భారత్‌తో మ్యాచ్ సందర్భంగా ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గానూ ఆమెను మందలించింది. అదే విధంగా.. ఓ డీమెరిట్ (Demerit Point) పాయింట్‌ను కూడా సిద్రా ఖాతాలో జమ చేసింది.అసలేం జరిగిందంటే... ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తుండగా.. పాకిస్తాన్ ఆడే మ్యాచ్‌లు మాత్రం తటస్థ వేదికైన శ్రీలంకలో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దాయాదులు భారత్- పాక్ మధ్య ఆదివారం (అక్టోబరు 5) కొలంబో వేదికగా తలపడ్డాయి.భారత్ 247 పరుగులకు ఆలౌట్ఆర్.ప్రేమదాస స్టేడియంలో అనుకోని విధంగా టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 247 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్లు ప్రతికా రావల్ (31), స్మృతి మంధాన (23) ఫర్వాలేదనిపించగా.. వన్‌డౌన్ బ్యాటర్ హర్లీన్ డియోల్ 46 పరుగులతో రాణించింది.మిగతా వారిలో జెమీమా రోడ్రిగెస్ (32), దీప్తి శర్మ (25), రిచా ఘోష్ (35 నాటౌట్) చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో డయానా బేగ్ నాలుగు వికెట్లు దక్కించుకోగా.. కెప్టెన్ ఫాతిమా సనా షేక్, సైదా ఇక్బాల్ చెరో రెండు, రమీన్ షమీమ్, నష్రా సంధూ ఒక్కో వికెట్ వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.బౌలర్ల విజృంభణఇక లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్‌కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. ఓపెనర్లు మునీబా అలీ (2), సదాఫ్ షమాస్ (6) ఇలా వచ్చి అలా వెళ్లారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన వాళ్లు కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయారు.సిద్రా ఆమిన్ హాఫ్ సెంచరీఐదో నంబర్లో ఆడిన నటాలియా పర్వేజ్ 33 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. వన్‌డౌన్ బ్యాటర్ సిద్రా ఆమిన్ ఒంటరి పోరాటం చేసింది. 106 బంతులు ఎదుర్కొని తొమ్మిది ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 81 పరుగులు చేసింది. అయితే, పాక్ ఇన్నింగ్స్ 40వ ఓవర్ ఐదో బంతికి స్నేహ్ రాణా బౌలింగ్‌లో హర్మన్‌ప్రీత్‌కు క్యాచ్ ఇవ్వడంతో సిద్రా ఇన్నింగ్స్‌కు తెరపడింది.అప్పటికే పాక్ ఓటమి దాదాపు ఖరారు కాగా.. సిద్రా తన బ్యాట్‌ను నేలకేసి కొట్టి అసహనం వ్యక్తం చేసింది. ఈ చర్యను తీవ్రంగా పరిగణించిన ఐసీసీ.. ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గానూ ఆమెకు శిక్ష విధించింది.అందుకే సిద్రాకు పనిష్మెంట్ఈ మేరకు.. ‘‘ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.2 ప్రకారం.. అంతర్జాతీయ మ్యాచ్‌లో క్రికెట్ పరికరాలు, దుస్తులు లేదంటే గ్రౌండ్ ఎక్విప్మెంట్, ఫిట్టింగ్స్ వంటి వాటికి నష్టం కలిగించేలా వ్యవహరించడం నేరం. సిద్రా ఈ నిబంధనను ఉల్లంఘించింది.అందుకే ఆమెను మందలించడంతో పాటు.. తన క్రమశిక్షణా రికార్డులో ఓ డీమెరిట్ పాయింట్ జత చేస్తున్నాం. గత 24 నెలల కాలంలో ఆమె చేసిన మొదటి తప్పిదం కాబట్టి ఇంతటితో సరిపెడుతున్నాం’’ అని ఐసీసీ సోమవారం నాటి ప్రకటనలో పేర్కొంది. సద్రా తన తప్పును అంగీకరించింది కావున తదుపరి విచారణ అవసరం లేకుండా పోయిందని.. ఐసీసీ ఈ సందర్భంగా తెలియజేసింది.ఆధిపత్యం చాటుకున్న భారత్‌కాగా సిద్రా అర్ధ శతకం వృథాగా పోయింది. భారత బౌలర్ల ధాటికి 43 ఓవర్లలో 159 పరుగులు మాత్రమే చేసి పాక్ ఆలౌట్ అయింది. దీంతో భారత్ 88 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి.. వన్డేల్లో ముఖాముఖి పోరులో మరోసారి తమ ఆధిపత్యాన్ని (12-0) చాటుకుంది. పాక్‌తో తాజా మ్యాచ్‌లో భారత బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ క్రాంతి గౌడ్, దీప్తి శర్మ మూడేసి వికెట్లతో చెలరేగగా.. స్నేహ్ రాణా రెండు వికెట్లు తీసింది. దీప్తి, హర్మన్ రెండు రనౌట్లలో భాగమయ్యారు.స్ప్రే ప్రయోగిస్తూఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ సందర్భంగా మైదానంలో పురుగుల వల్ల భారత బ్యాటర్లు ఇబ్బంది పడుతున్న వేళ పాక్ కెప్టెన్ ఫాతిమా సనా స్ప్రే ప్రయోగిస్తూ.. పురుగులను వెళ్లగొట్టడం హైలైట్‌గా నిలిచింది. అంపైర్ల అనుమతితోనే ఆమె ఇలా చేయడం గమనార్హం.చదవండి: World Cup 2025: టీమిండియా చేతిలో ఓడినా చరిత్ర సృష్టించిన పాకిస్తాన్ -
న్యూజిలాండ్ క్రికెటర్ వరల్డ్ రికార్డు.. చరిత్రలోనే తొలి ‘ప్లేయర్’గా..
న్యూజిలాండ్ వెటరన్ క్రికెటర్ సుజీ బేట్స్ (Suzie Bates) సరికొత్త చరిత్ర లిఖించింది. మహిళల క్రికెట్లో 350 మ్యాచ్‌ల క్లబ్లో చేరిన తొలి ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు సాధించింది. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 (ICC Womens World Cup)లో భాగంగా సౌతాఫ్రికాతో మ్యాచ్ సందర్భంగా సుజీ బేట్స్ ఈ ఫీట్ నమోదు చేసింది.చేదు అనుభవంఅయితే, మహిళా క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘట్టానికి చేరువైన వేళ.. సుజీ బేట్స్‌కు ఓ చేదు అనుభవం మాత్రం తప్పలేదు. కాగా న్యూజిలాండ్ తరఫున 2006లో అరంగేట్రం చేసిన ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ ఇప్పటికీ జట్టులో ప్రధాన సభ్యురాలిగా కొనసాగుతుండటం విశేషం.గోల్డెన్ డకౌట్తన సుదీర్ఘ కెరీర్లో ఇప్పటి వరకు 172 వన్డేలు.. 177 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడింది సుజీ బేట్స్. సౌతాఫ్రికా మహిళలతో సోమవారం నాటి వరల్డ్‌కప్ మ్యాచ్ సందర్భంగా 173వ వన్డే ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఓవరాల్‌గా అంతర్జాతీయ స్థాయిలో 350 మ్యాచ్‌ల మైలురాయిని చేరుకుంది. అయితే, ఈ మ్యాచ్‌లో సుజీ బేట్స్ గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరగడం గమనార్హం.Dream start for South Africa! 🔥Marizanne Kapp makes an instant impact. Suzie Bates is gone!Catch the LIVE action ➡ https://t.co/UaXsqrDnrA#CWC25 👉 NZ 🆚 SA | LIVE NOW on Star Sports & JioHotstar! pic.twitter.com/6cWC1BwnKh— Star Sports (@StarSportsIndia) October 6, 2025 న్యూజిలాండ్ తరఫున ఇన్నింగ్స్ ఆరంభించిన సుజీ.. సౌతాఫ్రికా పేసర్ మరిజానే కాప్ బౌలింగ్‌లో లెగ్ బిఫోర్ వికెట్‌గా పెవిలియన్ చేరింది. కాగా సుజీ బేట్స్ ఇప్పటి వరకు వైట్‌ఫెర్న్స్ తరఫున వన్డేల్లో మొత్తంగా 5896, టీ20లలో 4716 పరుగులు సాధించింది.మరో విశేషం ఏమిటంటే..ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఇండోర్ వేదికగా సౌతాఫ్రికా వుమెన్ జట్టుతో మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ మహిళా టీమ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుని.. 25 ఓవర్ల ఆట ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 101 పరుగులు సాధించింది. ఇదిలా ఉంటే..న్యూజిలాండ్ కెప్టెన్ సోఫీ డివైన్‌కు ఇది 300వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం మరో విశేషం.మహిళల క్రికెట్లో అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన టాప్-5 ప్లేయర్లు వీరే👉సుజీ బేట్స్ (న్యూజిలాండ్)- 350👉హర్మన్‌ప్రీత్ కౌర్ (ఇండియా)- 342👉ఎలిస్ పెర్రీ (ఆస్ట్రేలియా)- 341👉మిథాలీ రాజ్ (ఇండియా)- 333👉చార్లెట్ ఎడ్వర్డ్స్ (ఇంగ్లండ్)- 309.చదవండి: ‘మీ నాన్నతో కలిసి ఆటో తోలుకో’;.. ధోని ఆరోజు చెప్పిన మాటతో ఇలా..: సిరాజ్ -
భారత జట్టుతో అనుబంధం.. హర్మన్ గొప్ప ప్లేయర్: పాక్ కెప్టెన్ ప్రశంసలు
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur)పై పాకిస్తాన్ సారథి ఫాతిమా సనా ప్రశంసలు కురిపించింది. హర్మన్ అనుభవజ్ఞురాలైన ప్లేయర్ అని.. ఆమె జట్టును నడిపించే తీరు అద్భుతమని కొనియాడింది. కాగా వరుసగా నాలుగో ఆదివారం భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైన విషయం తెలిసిందే.పాక్‌పై వరుస విజయాలతో ట్రోఫీ సొంతంఇటీవల పురుషుల క్రికెట్ ఆసియా టీ20 కప్-2025 (Asia Cup) సందర్భంగా దాయాదులు తలపడ్డాయి. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) అనంతరం ఈ ఖండాంతర టోర్నీలో తొలిసారి జరిగిన ముఖాముఖి పోరులో టీమిండియా.. లీగ్, సూపర్ దశలతో పాటు ఫైనల్లో పాక్‌ను చిత్తు చేసి ట్రోఫీ గెలిచింది.అయితే, ఈ మ్యాచ్‌ల సందర్భంగా పాక్ జట్టుతో కరచాలనానికి సూర్యకుమార్ సేన నిరాకరించగా.. పాక్ జట్టు హైడ్రామా నడిపించింది. అంతేకాదు.. హ్యారిస్ రవూఫ్‌తో పాటు ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ రెచ్చగొట్టే రీతిలో వ్యవహరించి ఐసీసీతో మొట్టికాయలు తిన్నారు.ట్రోఫీ, మెడల్స్ ఎత్తుకుపోయిన నక్వీఇక పీసీబీ చైర్మన్, పాక్ మంత్రి మొహ్సిన్ నక్వీనుంచి ట్రోఫీ తీసుకునేందుకు భారత జట్టు నిరాకరించగా.. అతడు ట్రోఫీ, మెడల్స్‌తో పారిపోయాడు. తన దగ్గరకు వస్తేనే వాటిని ఇస్తానంటూ ఓవరాక్షన్ చేయగా.. బీసీసీఐ ఐసీసీ వద్దనే ఈ పంచాయితీ తేల్చుకునేందుకు సిద్ధమైంది.ఈసారి కూడా నో షేక్హ్యాండ్ఇలాంటి పరిణామాల నడుమ ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 సందర్భంగా భారత్- పాక్ జట్ల మధ్య ఆదివారం (అక్టోబరు 5) జరిగే మ్యాచ్‌పై ఆసక్తి నెలకొంది. కొలంబో వేదికగా దాయాదితో జరిగే పోరులో హర్మన్‌సేన కూడా కరచాలనానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు మీడియాతో మాట్లాడిన పాక్ కెప్టెన్ ఫాతిమా సనా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘‘హర్మన్‌ప్రీత్ కౌర్ సీనియర్, అనుభవజ్ఞురాలైన ప్లేయర్. అద్బుత రీతిలో జట్టును ముందుకు నడిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది.తనొక ప్రతిభావంతమైన ప్లేయర్. పరిస్థితులకు తగ్గట్లు హిట్టింగ్ ఆడగలదు.. డిఫెండ్ కూడా చేసుకోగలదు. మైదానంలో తన వ్యూహాలను పక్కాగా అమలు చేస్తుంది’’ అని భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ను ప్రశంసించింది.అంతా ఒకే కుటుంబం అదే విధంగా.. ‘‘2022 వరల్డ్‌కప్‌లో భారత్- పాకిస్తాన్ మ్యాచ్ ముగిసిన తర్వాత.. భారత జట్టు మొత్తం మా దగ్గరికి వచ్చి.. మమ్మల్ని పలకరించింది. మాతో కలిసి వారు తమ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఆరోజు ఎంతో ప్రత్యేకం.ఆరోజే ఆ ఇరుజట్ల మధ్య గొప్ప అనుబంధం ఉందని నాకు అనిపించింది’’ అంటూ ఫాతిమా సనా గత జ్ఞాపకాలు గుర్తుచేసుకుంది. ప్రస్తుతం బయట పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసనని.. అయితే, మైదానంలో ఉండే 20- 22 ప్లేయర్లు అంతా ఒక కుటుంబం లాంటివారేనని పేర్కొంది. ఐసీసీ వరల్డ్‌కప్ ఆడటం ప్రతి ఒక్క ప్లేయర్ కల అని.. తామంతా కేవలం ఆట మీద మాత్రమే దృష్టి పెడతామని ఫాతిమా సనా తెలిపింది.ఈసారి ఏకపక్ష విజయమేఅయితే, సనా వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాక్ ఆటగాళ్ల మనస్తత్వం ఎలాంటిదో ఇటీవలే మరోసారి చూశామని.. ట్రోఫీ ఎత్తుకెళ్లే నక్వీ నడిపించే బోర్డుకు చెందిన ఆటగాళ్లు ఇలా మాట్లాడటం ఆశ్చర్యకరమని నెటిజన్లు పేర్కొంటున్నారు.కాగా భారత్- పాక్ మహిళా జట్లు గతంలో 11 వన్డేల్లో ముఖాముఖి తలపడగా.. అన్ని మ్యాచ్‌లలోనూ భారత్ విజయం సాధించింది. ఈసారి కూడా గెలుపు ఏకపక్షమయ్యే సూచనలే కనిపిస్తున్నాయి. అయితే, వర్షం రూపంలో దాయాదుల పోరుకు ప్రమాదం పొంచి ఉంది. ఇదిలా ఉంటే.. హర్మన్‌ప్రీత్ కౌర్‌కు బదులుగా భారత బౌలింగ్ కోచ్ ఆవిష్కార్ సాల్వీ మీడియా సమావేశానికి హాజరయ్యాడు. ఈ క్రమంలో భారత్- పాక్ మహిళా జట్ల మధ్య అనుబంధం గురించి పాక్ జర్నలిస్టు ప్రశ్నించగా.. టీమిండియా మేనేజర్ తదుపరి ప్రశ్నకు వెళ్దామని చెప్పారు.చదవండి: 50 ఓవర్ల క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ.. ఆసీస్ బ్యాటర్ విధ్వంసం


