 
													సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు అద్భుతం చేసింది. తీవ్ర ఒత్తిడిలోనూ అసాధారణ ఆట తీరుతో రాణించి ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 (ICC Womens ODI World Cup 2025) ఫైనల్లో అడుగుపెట్టింది. డిఫెండింగ్ చాంపియన్, దిగ్గజ జట్టు ఆస్ట్రేలియా (Ind Beat Aus In Semis)ను ఓడించి.. ట్రోఫీని ముద్దాడేందుకు అడుగు దూరంలో నిలిచింది.

జెమీమా అజేయ శతకం.. హర్మన్ అదరహో
ఆసీస్ విధించిన 339 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత వన్‌డౌన్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ (134 బంతుల్లో 127) అజేయ సెంచరీతో విజయంలో కీలక పాత్ర పోషించగా.. హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్ ఇన్నింగ్స్ (88 బంతుల్లో 89)తో మెరిసింది. ఆసీస్‌పై గెలుపుతో ఫైనల్ బెర్తును ఖరారు చేసుకోవడంతో పాటు భారత జట్టు పలు ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టింది.

ప్రతీకారం తీర్చుకుని
1. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో ఏ జట్టుకైనా ఇదే అత్యధిక లక్ష్య ఛేదన.ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది. వన్డే వరల్డ్‌కప్-2025 లీగ్ దశలో భాగంగా ఆస్ట్రేలియా భారత్ విధించిన 331 పరుగుల లక్ష్యాన్ని ఛేదించగా.. ఇపుడు అదే జట్టుపై టీమిండియా 339 పరుగుల టార్గెట్ పూర్తి చేసి బదులు తీర్చుకుంది.

ప్రపంచంలోనే తొలి జట్టుగా
2. వన్డే వరల్డ్‌కప్ నాకౌట్ మ్యాచ్‌లలో పురుషులు, మహిళల క్రికెట్‌లో 300కు పైగా స్కోరును ఛేదించడం ఇదే తొలిసారి.

అత్యధిక అగ్రిగేట్
3. ఈ మ్యాచ్‌లో భారత్- ఆస్ట్రేలియా సంయుక్తంగా 679 పరుగులు సాధించాయి. తద్వారా ఈ టోర్నీ చరిత్రలో అత్యధిక అగ్రిగేట్ సాధించిన జట్లుగా నిలిచాయి. గతంలో ఈ రికార్డు ఇంగ్లండ్- సౌతాఫ్రికా పేరిట ఉండేది. బ్రిస్టల్‌లో 2017లో జరిగిన వరల్డ్‌కప్‌లో ఈ జట్లు 678 పరుగులు స్కోరు చేశాయి.

పిన్న వయసులోనే
ఇక ఈ మ్యాచ్ సందర్భంగా ఆస్ట్రేలియా ఓపెనర్ ఫోబీ లిచ్‌ఫీల్డ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల వన్డే వరల్డ్‌కప్ నాకౌట్ మ్యాచ్‌లో శతకం బాదిన అత్యంత పిన్న వయస్కురాలిగా నిలిచింది. 22 ఏళ్ల వయసులో లిచ్‌ఫీల్డ్ ఈ ఘనత సాధించింది.
చదవండి: ఆసీస్‌ను భారత్ చిత్తు చేసిందిలా.. దక్షిణాఫ్రికాతో ఫైనల్
THIS IS WHAT IT MEANS! 💙🥹
👉 3rd CWC final for India
👉 Highest-ever run chase in WODIs
👉 Ended Australia's 15-match winning streak in CWC#CWC25 Final 👉 #INDvSA | SUN, 2nd Nov, 2 PM! pic.twitter.com/8laT3Mq25P— Star Sports (@StarSportsIndia) October 30, 2025

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
