న్యూ చండీగఢ్‌లో పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (పీసీఏ) నిర్మించిన ఈ మహరాజా యద్విoద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఇదే తొలి పురుషుల అంతర్జాతీయ మ్యాచ్. గతంలో ఐపీఎల్ మ్యాచ్‌లతో పాటు మూడు నెలల క్రితం భారత్, ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య రెండు వన్డేలు జరిగాయి. గురువారం టి20 సందర్భంగా రెండు కొత్త స్టాండ్‌లను ఆవిష్కరించారు.
వన్డే, టి20 వరల్డ్ కప్‌ల విజేత, మాజీ స్టార్ యువరాజ్ సింగ్‌తో పాటు ఇటీవల భారత్‌కు వరల్డ్ కప్‌ను అందించిన మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ పేర్లతో ఈ స్టాండ్‌లను ఏర్పాటు చేశారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ స్టేడియంలో ఇప్పటికే మరో మాజీ స్పిన్నర్ హర్భజన్ పేరిట పెవిలియన్ ఉంది.


