క్రికెట్ మైదానంలో తన దూకుడు బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న ‘సిక్సర్ కింగ్’ యువరాజ్ సింగ్ ఇప్పుడు వ్యాపార ప్రపంచంలో దూసుకుపోతున్నారు. తన అల్ట్రా-ప్రీమియం టెకిలా బ్రాండ్ ‘ఫినో(Fino)’ను భారతదేశంలో అధికారికంగా విడుదల చేయడం ద్వారా స్పిరిట్ విభాగంలోకి ప్రవేశించారు. ఈ లగ్జరీ స్పిరిట్ ఇప్పటికే అభిమానులు, విలాసవంతమైన పానీయాల ప్రియులను ఆకర్షించినట్లు కంపెనీ తెలిపింది.
యువరాజ్ సింగ్ భారతీయ-అమెరికన్ పారిశ్రామికవేత్తల భాగస్వామ్యంతో ఈ బ్రాండ్‌ను ప్రారంభించారు. ఫినో నాలుగు అల్ట్రా-ప్రీమియం టెకిలా వేరియంట్లను ప్రవేశపెట్టింది. అయితే ఈ ప్రతి బాటిల్ ధర రూ.10,000 కంటే ఎక్కువ ఉండడం గమనార్హం. భారతదేశంలో సగటు నెలవారీ జీతం రూ.25,000 నుంచి రూ.32,000 మధ్య ఉన్నందున చాలా మంది వినియోగదారులు కేవలం ఒక బాటిల్ టెకిలా కోసం దాదాపు ఒక నెల ఆదాయాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుందని కొందరు చెబుతున్నారు. ఈ అత్యధిక ధర ఈ బ్రాండ్‌ను కేవలం లగ్జరీ స్పిరిట్స్ మార్కెట్‌కే పరిమితం చేసింది. ఫినో స్పిరిట్‌లను 100% బ్లూ వెబర్ అగావే నుంచి రూపొందిస్తున్నట్లు కంపెనీ చెప్పింది.
ఇదీ చదవండి: అసంఘటిత కార్మికులకు అండగా ఏఐ


